Gangwar
-
మిర్యాలగూడలో గ్యాంగ్‌వార్
మిర్యాలగూడ అర్బన్: సినిమాల ప్రభావంతో నేటి యువత విలనిజమే హీరోయిజంగా ఫీలవుతున్నారు. దీంతో బయట కూడా సినిమాల్లో లాగా అనుకరిస్తూ పెడదోవ పడుతున్నారు. చిన్నచిన్న గ్యాంగ్‌లు ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్లు చేసే స్థాయికి చేరుకుంటున్నారు. బర్త్‌డేలకు కూడా డీజేలు పెట్టి బాణాసంచా కాలుస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. యువత డ్రగ్స్‌కు అలవాటు పడుతూ తమ నిండు జీవితాలను పాడు చేసుకుంటున్నారు. మిర్యాలగూడ పట్టణంలో నిత్యం ఏదో ఒక వీధిలో గ్యాంగ్వార్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలుగా మారి దారి తప్పుతున్న యువతను గాడిలో పెట్టేదెవరు..? అని వారి చేష్టలను చూసిన వారు ప్రశ్నిస్తున్నారు.మత్తుకు బానిసలుగా మారుతున్నారిలా..గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండటంతో పిల్లల మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు గుర్తించే అవకాశం ఉండేది. దీంతో ఆ పిల్లాడికి పలు ఉదాహారణలతో మంచి విషయాలపై అవగాహన పెంచేవారు. ఈవిధంగా కుటుంబం నుంచే క్రమశిక్షణ నేర్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేవారు. కానీ మారిన పరిస్థితుల కారణంగా చిన్న కుటుంబాలు పెరగడం, భార్యాభర్తలు ఇద్దరూ కుటుంబ పోషణ కోసం ఉద్యోగాలు చేస్తుండడంతో పిల్లలను గమనించేవారు లేకుండా పోతున్నారు. దీంతో పిల్లలు ఏం చేస్తున్నారు..? అతడి మానసిక స్థితి ఏవిధంగా ఉంది..? అని పరిశీలించేవారు లేకపోవడంతో ముందుగా స్నేహితులతో సరదాగా సిగరెట్, గుట్కా వంటి వాటికి అలవాటు పడుతూ క్రమంగా గంజాయి తీసుకునే స్థాయికి చేరుకుంటున్నారు. మిర్యాలగూడలో గంజాయికి బానిసైన యువకులు సుమారు 2 వేలకు పైగానే ఉంటారని సమాచారం. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ పిల్లల మానసికస్థితిని అర్ధం చేసుకుని వారికి సరైన దిశానిర్ధేశం చేయడం వలన యువత మత్తుకు బానిసలు కాకుండా.. పెడదోవ పట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.మిర్యాలగూడలో ఇటీవల జరిగిన గ్యాంగ్వార్లు..👉 మిర్యాలగూడ పట్టణంలోని గాంధీ బొమ్మ సమీపంలో ఉన్న వైన్స్ వద్ద ఇటీవల రాత్రి సమయంలో కొందరు యువకులు కలిసి ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి గాయపర్చారు. దీంతో ఆ యువకుడికి తలకు తీవ్ర గాయమై అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నట్లు సమాచారం.👉రెడ్డి కాలనీకి వెళ్లేదారిలో రాత్రి సమయంలో తల్లీకుమార్తె నడుచుకుంటూ వెళ్తుండగా.. మత్తులో ఉన్న యువకులు వెకిలి చేష్టలు చేయడంతో వారు భయాందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలిసింది.👉 పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఓ వీధిలో గత నెల ఫుట్‌బాల్ ఆటలో తలెత్తిన వివాదంలో రెండు గ్యాంగ్‌ల మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. దీంతో ఇరువర్గాలకు చెందిన పది మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.👉 పట్టణంలోని తాళ్లగడ్డ, ప్రకాశ్‌నగర్, గాంధీనగర్, బాపూజీనగర్‌లో ప్రతి రోజు ఏదో గొడవ జరగుతుండగా.. గొడవలు పడిన వారు మత్తులో ఉన్నప్పుడే ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయా కాలనీల ప్రజలు పేర్కొంటున్నారు.పట్టించుకోని పోలీసులు ..రోజురోజుకు పెరుగుతున్న గ్యాంగ్వార్లను అరికట్టాల్సిన పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గొడవలకు దిగిన వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకురాగానే పలువురు రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని విడిపిస్తుండటంతో సదరు యువకులు మరింత పెట్రేగిపోతున్నారని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో ముందుకుపోతే నుయ్యి.. వెనుకకు పోతే గొయ్యి అన్న చందంగా మారిందని, పోలీసులు కూడా మాకెందుకులే అని పట్టించుకోకుండా ఉంటున్నారని పోలీస్ శాఖ సిబ్బందే చెబుతుండటం విశేషం.యువకుడిపై విచక్షణారహితంగా దాడిమిర్యాలగూడ పట్టణంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. వివరాలు.. రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో శుక్రవారం పుట్టినరోజు వేడుకల్లో ఘర్షణ చెలరేగి ఓ యువకుడిపై మరికొంతమంది యువకులు విచక్షణారహితంగా దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దాడికి గురైన యువకుడిని కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని దాడి చేస్తున్న వారిని చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. ఈ గొడవను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. గాయాలపాలైన యువకుడు శనివారం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దుయువత క్రమశిక్షణతో తమ చదువులు, కెరియర్‌పై దృష్టి సారిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వారి మానసికస్థితి, వారి ప్రవర్తనను గమనిస్తూ పెడదోవ పట్టినట్లు తెలిస్తే వెంటనే వారికి ఓపికగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అప్పుడే పిల్లలకు మంచి జీవితం ఇచ్చిన వారమవుతాం. యువత చెడుమార్గం పట్టి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దు.– రాజశేఖరరాజు, మిర్యాలగూడ డీఎస్పీ -
'ఇటు చెన్నై... అటు ముంబై' వార్‌కు దిగిన మన గ్యాంగ్‌స్టార్స్
బాక్సాఫీస్‌ను లూటీ చేయడానికి గ్యాంగ్‌స్టర్‌గా మారారు కొందరు స్టార్స్. వెండితెరపై ఈ హీరోలు గ్యాంగ్‌వార్ చేస్తున్నారు. గ్యాంగ్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రాల్లో గ్యాంగ్‌స్టర్స్‌గా మారిన ఆ కోలీవుడ్ గ్యాంగ్‌స్టార్స్ గురించి తెలుసుకుందాం. గ్యాంగ్‌స్టర్ రంగరాయ గ్యాంగ్‌స్టర్ రంగరాయ శక్తివేల్ నాయకర్‌గా మారారు కమల్‌హాసన్. ‘థగ్ లైఫ్’ సినిమాలో కమల్‌హాసన్ చేస్తున్న పాత్ర పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. 1987లో చేసిన ‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’) చిత్రం తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. 37 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో వస్తున్న ఈ సినిమాలో త్రిష, దుల్కర్ సల్మాన్, ‘జయం’ రవి, నాజర్, గౌతమ్ కార్తీక్, జోజూ జార్జ్, ఐశ్వర్యా లక్ష్మి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ‘నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. కాయల్ పట్టినమ్. నన్ను క్రిమినల్, గుండా, యాకుజా అని పిలుస్తారు. యాకుజా అంటే జపాన్ భాషలో గ్యాంగ్‌స్టర్ అని అర్థం’ అంటూ ‘థగ్ లైఫ్’లోని తన పాత్ర గురించి ఈ సినిమా టైటిల్ టీజర్ అనౌన్స్మెంట్ వీడియోలో చెప్పుకొచ్చారు కమల్. ఆర్. మహేంద్రన్, కమల్‌హాసన్, మణిరత్నం, ఎ. శివ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరకర్త. 2025లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. స్టూడెంట్ టు గ్యాంగ్‌స్టర్ ‘సూరరై పోట్రు’ (‘ఆకాశం నీ హద్దురా!’) వంటి సందేశాత్మక బయోపిక్ తీసిన తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర ఓ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ చేయనున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ మూవీలో సూర్యతో పాటు దుల్కర్ సల్మాన్, నజ్రియా ఫాహద్, విజయ్ వర్మ లీడ్ రోల్స్ చేస్తారు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం అవుతుంది. చెన్నై, తిరుచ్చి లొకేషన్స్‌తో పాటు హర్యానాలో కూడా కొంత షూటింగ్ ప్లాన్ చేశారట. ఇక కథ రీత్యా స్టూడెంట్ స్థాయి నుంచి గ్యాంగ్‌స్టర్ వరకు ఎదిగే వ్యక్తి పాత్రలో సూర్య కనిపిస్తారని కోలీవుడ్ సమాచారం. 2డీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌ను ఆరంభించారు సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్. ఇది జీవీ ప్రకాశ్‌కు నూరవ చిత్రం కావడం విశేషం. ఇటు చెన్నై... అటు ముంబై తమిళనాడులో ఒకటి, ముంబైలో మరొకటి... ఇలా రెండు గ్యాంగ్‌లు మెయిన్టైన్ చేస్తున్నట్లున్నారు హీరో ధనుష్. ముందు తమిళనాడుకు వెళితే... ధనుష్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాయన్’. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సందీప్ కిషన్, కాళిదాసు, సెల్వ రాఘవన్, ప్రకాశ్‌రాజ్, దుషారా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముగ్గురు అన్నదమ్ములు (ధనుష్, సందీప్ కిషన్, కాళిదాసు)ల మధ్య నార్త్ చెన్నై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా అట ‘రాయన్’. ధనుష్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రం, ఆయనకు కెరీర్లో యాభైవ చిత్రం కావడం విశేషం. ఓ గ్యాంగ్‌స్టర్ చెఫ్‌గా ఎందుకు కొత్త జీవితం ప్రారంభించాల్సి వచ్చింది? గ్యాంగ్‌స్టర్ గొడవలు అతని కుటుంబాన్ని, జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయనే అంశాలు ‘రాయన్’ చిత్రంలో ఉంటాయని టాక్. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు ముంబై గ్యాంగ్స్టర్స్ మాఫియా నేపథ్యంలో సాగే ‘డీఎన్ఎస్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నారని తెలిసింది. నాగార్జున ఓ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్. కథ రీత్యా ధనుష్, నాగార్జున ఈ సినిమాలో గ్యాంగ్స్టర్స్ రోల్స్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పుస్కూరు రామ్మోహన్, సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ధారావి’ అనే టైటిల్‌ను పరిశీ లిస్తున్నారట మేకర్స్. ఈ సినిమా 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలతో పాటు గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తమిళంలో మరికొన్ని చిత్రాలు రానున్నాయి. -
కెనడాలో గ్యాంగ్‌వార్: మరో ఖలిస్తానీ తీవ్రవాది హతం
ఒట్టావా: కెనడాలో మరో ఖలిస్తానీ తీవ్రవాది హత్యకు గురయ్యాడు. సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖ దునెకె అనే ఖలిస్థాన్ తీవ్రవాది ముఠా తగాదాల్లో హత్యకు గురైనట్లు ఎన్ఐఎ వర్గాలు తెలిపాయి. అసలే కెనడా భారత్ దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంపై కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య విబేధాలను తారాస్థాయికి తీసుకెళ్లాయి. ఆ వివాదం సద్దుమణుగక ముందే మరో ఖలిస్థానీ తీవ్రవాది హత్య కలకలం సృష్టిస్తోంది. సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖ దునెకె అనే ఖలిస్థాన్ తీవ్రవాది బుధవారం జరిగిన ముఠా తగాదాల్లో హత్యకు గురయ్యాడని విన్నిపెగ్‌లో ప్రత్యర్థి ముఠా జరిపిన దాడిలో సుఖా దుంకెన్ చనిపోయినట్లు ఎన్ఐఎ వర్గాలు తెలిపాయి. పంజాబ్‌లోని మోగాకు చెందిన సుఖ దునెకె 2017లో నకిలీ పాస్‌పోర్టు సాయంతో కెనడాలో ప్రవేశించి ప్రస్తుతం ఏ కేటగిరీ గ్యాంగ్‌స్టర్‌గా చెలామణి అవుతున్నాడు. కెనడాలోని ఉగ్రవాద సంస్థ ఎన్ఐఏ విడుదల చేసిన 43 మంది ఖలిస్థాన్ తీవ్రవాదుల జాబితాలో సుఖ దునెకె పేరు కూడా ఉంది. అంతేకాదు ఖలిస్తానీ తీవ్రవాది అర్షదీప్ డల్లాకు సుఖ్దూల్ అత్యంత సన్నిహితుడు. కెనడాలో భారతీయులపై పెరుగుతున్న వ్యతిరేక కార్యకలాపాలు, రాజకీయ దృష్ట్యా అక్కడి భారతీయులకు ప్రయాణాలు విషయమై పలు జాగ్రత్తలను సూచించింది భారత్ విదేశాంగ శాఖ. ప్రయాణాలు చేయదలచుకున్న అక్కడి భారతీయులకు పలు మార్గదర్శకాలను సూచించింది భారత ట్రావెల్ అడ్వైజరీ కమిటీ. Sukhdool Singh @ Sukha Duneke, a gangster who escaped to Canada from Punjab, India in 2017 on forged documents, was shot dead today in Winnipeg, Canada by unknown assailants. The Punjab Police Anti-Gangster Task Force (AGTF) believes he supported the DB gang and joined… pic.twitter.com/TFxOsVzsno — Megh Updates 🚨™ (@MeghUpdates) September 21, 2023 ఇది కూడా చదవండి: కెనడా బామ్మను ప్రేమించి, పెళ్లాడిన పాక్ కుర్రాడు -
Lucknow: జడ్జి ఎదుటే గ్యాంగ్‌స్టర్‌పై కాల్పులు
క్రైమ్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో న్యాయస్థానంలోనే గ్యాంగ్ వార్ కలకలం రేగింది. బుధవారం సిటీ సివిల్ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో.. లాయర్ దుస్తుల్లో వచ్చిన కొందరు దుండగులు ఓ గ్యాంగ్‌స్టర్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సంజీవ్ జీవా అనే గ్యాంగ్‌స్టర్ మరణించగా.. పలువురు పోలీసులకు గాయలైనట్లు సమాచారం. కాల్పులు జరిపింది ముక్తార్ అన్సారి అనుచరులుగా భావిస్తున్నారు పోలీసులు. మొత్తం ఐదు రౌండ్ల కాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలంలోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన పోలీస్ సిబ్బందిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన అదనపు సమాచాంర అందాల్సి ఉంది. Disclaimer: ఇందులోని ఫొటోలు, దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురిచేయొచ్చు #WATCH | Uttar Pradesh: Gangster Sanjeev Jeeva shot outside the Lucknow Civil Court. Further details awaited (Note: Abusive language) pic.twitter.com/rIWyxtLuC4 — ANI UP/Uttarakhand (@ANINewsUP) June 7, 2023 Gangster Sanjeev Jeeva shot dead by unknown assailants outside a Lucknow court. More details are awaited. pic.twitter.com/8xvaTNoQjw — Press Trust of India (@PTI_News) June 7, 2023 -
స్టార్ వార్.. ఇక బాక్సాఫీస్ బద్దలే..!
బాక్సాఫీస్ వసూళ్ల కోసం గ్యాంగ్‌వార్‌కు రంగం సిద్ధమవుతోంది. ఆల్రెడీ కొందరు స్టార్స్ వార్ డిక్లేర్ చేసి సెట్స్‌లో బిజీగా ఉన్నారు. మరికొందరు రెడీ అవుతున్నారు. ఈ బాక్సాఫీస్ గ్యాంగ్‌వార్ పై ఓ లుక్ వేద్దాం. పోలీసాఫీసర్‌గా ప్రభాస్ నటించనున్న సినిమా ‘స్పిరిట్’. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పనులు ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నాయి. ప్రభాస్ కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ ‘స్పిరిట్’ ముంబైలో జరిగే గ్యాంగ్‌వార్ బ్యాక్ డ్రాప్లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అలాగే సందీప్‌రెడ్డి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న హిందీ ‘యానిమల్’ కూడా ఇలాంటి తరహా చిత్రమే. రణ్‌బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న కంప్లీట్ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ఇది. తండ్రి కోసం ఓ యువకుడు గ్యాంగ్‌వార్‌లో ఎలా చిక్కుకున్నాడు? అనే కోణంలో ఈ సినిమా సాగుతుందని బాలీవుడ్ టాక్. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక దర్శకుడు సుజిత్ తెరకెక్కించనున్న సినిమాలో పవన్ కల్యాణ్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్మెంట్ టైమ్‌లో ‘దే కాల్ హిమ్ ఓజీ’ అనే ట్యాగ్‌లైన్ తెరపైకి వచ్చింది. ‘ఓజీ’ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని ప్రచారం జరిగింది. దీంతో పవన్–సుజిత్ కాంబినేషన్లోని మూవీ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమా ‘పుష్ప’. ఆల్రెడీ విడుదలైన ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో కొన్ని గ్యాంగ్‌వార్ సీన్స్ చూశాం. అలాగే ‘పుష్ప: ది రైజ్’కు కొనసాగింపుగా రానున్న ‘పుష్ప: ది రూల్’లోనూ కొన్ని గ్యాంగ్ వార్ సన్నివేశాలు ఉంటాయనుకోవచ్చు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా సీనియర్ యాక్టర్ రాజశేఖర్ సైతం ఈ వెండితెర గ్యాంగ్‌వార్‌లో భాగమయ్యారు. పవన్ సాధినేని దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న ‘మాన్స్టర్’ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అలాగే యువ హీరో సందీప్ కిషన్ టైటిల్ రోల్లో, విజయ్ సేతుపతి ఓ లీడ్ రోల్లో నటించిన ‘మైఖేల్’ కూడా గ్యాంగ్‌స్టర్ డ్రామానే. ఇంకోవైపు ‘మాస్టర్’ చిత్రం తర్వాత తమిళ ప్రముఖ హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తాజాగా మరో సినిమా రూపొందనుంది. ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌వార్‌గా ఈ సినిమా ఉంటుందనే టాక్ ఆల్రెడీ కోలీవుడ్‌లో మొదలైంది. ఈ సినిమాలో సంజయ్ దత్, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు చేయనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు లోకేష్ అండ్ కో. అదే విధంగా ఈ సినిమా తర్వాత కార్తీతో ‘ఖైదీ’కి సీక్వెల్‌గా ‘ఖైదీ 2’ తీయనున్నారు లోకేష్. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగిన ‘ఖైదీ’ సినిమాకు సీక్వెల్‌గా రానున్న ‘ఖైదీ 2’ గ్యాంగ్‌వార్ ఫిల్మ్ అట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అటు కన్నడంలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కబ్జా’. ఆర్. చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 1960–1984 బ్యాక్‌డ్రాప్‌లోని గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ అని తెలుస్తోంది. కాగా, ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన దుల్కర్ సల్మాన్ చేస్తున్న మలయాళ చిత్రం ‘కింగ్ ఆఫ్ కోతా’. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు అభిషేక్ జోషి దర్శకుడు. దుల్కర్ కెరీర్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాలు గ్యాంగ్‌వార్ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించనున్నాయి. -
విజయవాడలో మరోసారి రెచ్చిపోయిన రౌడీ షీటర్ పండు
-
‘గ్యాంగ్‌వార్’ వీడియోలు ఇప్పటివి కావు
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లాలో గ్యాంగ్‌వార్ పేరిట పలు టీవీ చానళ్లలో ప్రసారమైన వీడియోల్లోని ఘటనలు గత ఏడాది నవంబర్, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగినవిగా పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని డీజీపీ కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కథనాలపై స్పందించిన డీజీపీ గౌతమ్‌సవాంగ్ తక్షణ విచారణ జరపాలని గుంటూరు రేంజ్ డీఐజీ, నెల్లూరు జిల్లా ఎస్పీలకు ఆదేశాలిచ్చారని పేర్కొంది. ఆ ఘటనలు కేవలం మిత్రుల మధ్య జరిగిన ఘర్షణలని, అయినప్పటికీ కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారని వివరించింది. నిందితులపై రౌడీషీట్ కూడా తెరవనున్నట్టు తెలిపింది. నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీజీపీ పేర్కొంది. -
గ్యాంగ్‌వార్: ‘హత్యలన్నీ సీరియల్‌గా జరిగాయి’
సాక్షి, చిత్తూరు: తిరుపతి గ్యాంగ్‌వార్ ఘటనలో ఏడుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం దినేష్ అనే రౌడీ షీటర్‌ను కొందరు దుండగులు దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు చెప్తున్నారు. దినేష్ హత్యకు నిందితులు ఉపయోగించిన మూడు కత్తులను స్వాదీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసు వివరాలను తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డి మీడియాకు తెలిపారు. రెండేళ్ల క్రితం భార్గవ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడని తెలిపారు. భార్గవ్ హత్యకు బెల్ట్ మురళి కారణమని ప్రత్యర్థులు అతన్ని చంపేశారని వెల్లడించారు. ఇప్పుడు అతని వర్గీయులు దినేష్‌ను హతమార్చారని చెప్పారు. ఈ హత్యలన్నీ సీరియల్‌గా జరిగాయని ఎస్పీ వివరించారు. నగరంలోని ఐఎస్ మహల్ వద్ద రౌడీ షీటర్ దినేష్ (35) హత్యకు గురయ్యాడు. ట్యాక్సీ నడుపుతూ జీవన సాగిస్తున్న దినేష్ పనిముగించుకుని ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వెళుతుండగా ఐఎస్ మహల్ సమీపంలోని హారిక బార్ వద్ద కాపుగాసిన ప్రత్యర్థులు కత్తులతో పొడిచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన దినేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. (చదవండి: పాత కక్షలు: రౌడీ షీటర్ దారుణ హత్య) -
బంధుప్రీతి.. గ్యాంగ్‌వార్.. డ్రగ్స్...
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దగ్గర నుంచి బాలీవుడ్ ప్రశాంతంగా లేదు. ప్రతిభను తొక్కేస్తున్నారు... బాయ్‌కాట్ నెపోటిజమ్ అని మొన్న. బాలీవుడ్ స్టీరింగ్ ఓ గ్యాంగ్ చేతిలో ఉంది.. వాళ్లు ఎటు అంటేæఇండస్ట్రీ అటు తిరుగుతుందని నిన్న. బాలీవుడ్‌ను నడుపుతున్నది డ్రగ్స్ మత్తే అని ఈ మధ్య. ఇలా రకరకాల వివాదాలు. బాలీవుడ్ కాదు... వివాదాలవుడ్ అంటున్నారు చాలామంది. అయితే... ‘ఇండస్ట్రీలో కొందరు చేసిన తప్పుకు అందర్నీ తప్పుపట్టొద్దు’ అంటున్నారు జయాబచ్చన్. ఆమె మాటలతో ఇండస్ట్రీలో పలువురు ఏకీభవించారు. కంగనా రనౌత్ కాదన్నారు. ఆ వివరాలు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య దగ్గర మొదలైన వివాదాలు ఎప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్ వైపు మళ్లుతున్నాయి. మిస్టరీ నవలల్లోలా ఏదో ఒక కొత్త టాపిక్‌కి తెరలేస్తోంది. బంధుప్రీతిని ప్రోత్సహించడం వల్లే ప్రతిభకు చోటుండట్లేదు అని కొన్ని రోజులు చర్చ నడిచింది. ఆ తర్వాత డ్రగ్స్ మత్తులో ఇండస్ట్రీ మునిగి తేలుతోందని మరో కొత్త అంశం వెలుగులోకొచ్చింది. రియా చక్రవర్తి డ్రగ్స్ తీసుకున్నట్టు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ల పేర్ల జాబితాను పోలీసులకు అందించినట్టు వార్త. ఈ విషయం మీద నటుడు, యంపీ రవికిషన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది ఓ కొత్త వాదనలకు దారి తీసింది. రవికిషన్ వర్సెస్ జయా బచ్చన్ ‘బాలీవుడ్ ఇండస్ట్రీ మత్తు పదార్ధాలకు బానిస అవుతోంది. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తన అభిప్రాయాన్ని తెలిపారు రవికిషన్. ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టారు నటి, యంపీ జయా బచ్చన్. ‘‘కొందరు చేసిన తప్పుకి ఓ పరిశ్రమ మొత్తాన్నీ నిందించడం కరెక్ట్ కాదు’’ అని మాట్లాడారామె. ఇదంతా మంగళవారం జరిగింది. జయ మాటలకు బుధవారం స్పందించారు రవికిషన్. జయాజీ నాతో ఏకీభవించండి ‘నా ఉద్దేశం ఇండస్ట్రీలో అందరూ మత్తు పదార్థాలు తీసుకుంటున్నారని కాదు. కానీ తీసుకుంటున్న వాళ్ల ఉద్దేశమైతే పరిశ్రమను నాశనం చేయడమే. ఇండస్ట్రీ మీద ఉన్న బాధ్యతతో ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. జయాజీ కూడా నాతో ఏకీభవించాలి. ప్రస్తుతం డ్రగ్స్ ఓ ఫ్యాషన్ అయిపోయింది. 90వ దశకంలో ఇలాంటివి జరగలేదు. ఇండస్ట్రీలో మురికిని తొలగించాలన్నది మా ముఖ్యోద్దేశం’’ అన్నారు రవి కిషన్. జయా జీ... ఇది నా సొంత భోజనం: కంగనా ‘కొందరు సినీ ఇండస్ట్రీలో పెరిగి దాన్నే మురికి కాలువగా పిలుస్తున్నారని, ఇది భోజనం పెట్టిన చేతిని కరవడమే’ అని జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలకు మంగళవారం స్పందించిన కంగనా బుధవారం కూడా తన విమర్శలను కొనసాగించారు. ‘‘ఏ భోజనం గురించి మీరు మాట్లాడుతున్నారు జయా జీ! రెండు నిమిషాల వేషం, ఐటమ్ నంబర్లు, ఒక రొమాంటిక్ సీన్ ఉండే భోజనమే ఇక్కడ దొరుకుతుంది, అది కూడా హీరోతో గడిపితేనే! నేను వచ్చి ఇండస్ట్రీకి ఫెమినిజమ్ నేర్పాను. మీరనే భోజనాన్ని దేశభక్తి చిత్రాలతో నింపాను. ఇది నా సొంత భోజనం, మీది కాదు’’ అని కంగనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే జయా బచ్చన్‌కి పలువురు తారలు మద్దతు పలికారు. జయాజీ... యూ ఆర్ రైట్ ‘ఎన్నో సామాజిక విషయాలకు ఇండస్ట్రీకి చెందిన చాలామంది అండగా నిలబడ్డాం. ఇప్పుడు ప్రభుత్వం మాతో నిలబడాల్సిన సమయం ఇది. చెప్పాల్సిన విషయం సూటిగా, స్పష్టంగా చెప్పారు జయాజీ’ అన్నారు తాప్సీ. ‘బహుశా వెన్నెముక ఉండేవాళ్లు ఇలానే మాట్లాడతారేమో’ అని జయ మాటలను ప్రశంసించారు దర్శకుడు అనుభవ్ సిన్హా. ‘జయాజీ మాట్లాడింది అక్షర సత్యం. ఇండస్ట్రీ కోసం ఆమె మాట్లాడటం చాలా సంతోషం’ అన్నారు దియా మిర్జా. ‘పెద్దయ్యాక నేనూ జయాజీలా అవ్వాలనుకుంటున్నాను’ అన్నారు సోనమ్ కపూర్. ‘కంగనా.. పెద్దవాళ్లను గౌరవించాలన్న విషయం కూడా నీకు గుర్తులేదా? నువ్వు తిట్టాలనుకుంటే నన్ను తిట్టు.. వింటాను’ అన్నారు నటి స్వరా భాస్కర్. అలానే జయా బచ్చన్ వ్యాఖ్యలను నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్, దర్శకుడు సుధీర్ మిశ్రా సమర్థించారు. ఈ వివాదం ఇంకెంత దూరమెళ్తుందో? ఎవరెవర్ని వివాదాల్లోకి లాగుతుందో? ఇండస్ట్రీని ఇంకెన్ని ఇబ్బందుల్లో పడేస్తుందో చూడాలి. వివాదాలవుడ్గా మారిన బాలీవుడ్ ఇండస్ట్రీని ఏమైనా అంటే ఊరుకోను – హేమా మాలిని ‘నాకు పేరు, గౌరవం, మర్యాద అన్నీ ఇచ్చింది సినిమా ఇండస్ట్రీయే. అలాంటి ఇండస్ట్రీని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదు’ అన్నారు సీనియర్ నటి హేమా మాలిని. ప్రస్తుతం జరుగుతున్న చర్చ గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్ ఓ అందమైన ప్రదేశం. సృజనాత్మక ప్రపంచం. ఈ ఇండస్ట్రీ మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. డ్రగ్స్ ఉన్నాయి అంటున్నారు. డ్రగ్స్ లేనిదెక్కడ? ఒకవేళ మురికి ఉంటే కడిగితే పోతుంది. బట్టల మీద అంటుకున్న మురికి ఉతికితే పోతుంది. బాలీవుడ్ మీద పడ్డ మరక కూడా పోతుంది’’ అని అన్నారామె. కంగనాకు సెక్యూరిటీ ఎందుకు – ఊర్మిళ కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై (ముంబై పాకిస్తాన్‌ని తలపిస్తోంది. డ్రగ్స్ నిండిన బాలీవుడ్) మండిపడ్డారు నటిæఊర్మిళ. ‘డ్రగ్స్ సమస్య దేశమంతా ఉంది. కంగనాకు తెలుసు.. తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోనే డ్రగ్స్ మొదలయిందని. తన సొంత ప్రాంతం నుంచే ఆమె డ్రగ్స్ పై యుద్ధం మొదలుపెట్టాలి. అసలు ఈమెకు వై కేటగిరీ సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేశారు? ముంబై అందరిదీ. ఆ సిటీ గురించి తప్పుగా మాట్లాడితే ముంబై పుత్రికగా ఊరుకునేది లేదు. ఒక వ్యక్తి అదే పనిగా అరుస్తున్నాడంటే అతను నిజం చెబుతున్నాడని కాదు. కొంతమందికి ఊరికే అరవడం అలవాటు.. అంతే. ఒకవేళ బయటకు వచ్చి మాట్లాడితే తమ కేం అవుతుందో అని చాలా మంది బయటకు రావట్లేదంతే’ అన్నారు ఊర్మిళ. -
వేములవాడలో గ్యాంగ్‌వార్‌ను తలపించే ఘటన
రాజన్నసిరిసిల్ల: వేములవాడలో ఆదివారం సాయంత్రం గ్యాంగ్‌వార్‌ను తలపించే ఘటన చోటుచేసుకుంది. రెండు వర్గాలవారు దాదాపు 20 నిముషాలపాటు రణరంగాన్ని సృష్టించారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వివరాలు.. రాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ఓ యువకుడిని మరో యువకుడు ప్రశ్నించాడు. నెమ్మదిగా వెళ్లాలని మందలించాడు. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు యువకుల స్నేహితులు సైతం రంగంలోకి దిగడంతో వివాదం మరింత ముదిరింది. రెండు గ్రూపుల యువకుల పరస్పర దాడులతో స్థానియకులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. పది మందిపై కేసు నమోదు చేశారు. గొడవకు సంబంధించిన వీడియో బయటికొచ్చింది. (చదవండి: వెళ్లనీయరు.. ఉండనీయరు..) -
భూమి వివాదమే గ్యాంగ్‌వార్‌కు దారితీసింది
-
జిల్లాకో ఈఎస్ఐసీ డిస్పెన్సరీ, బ్రాంచి ఆఫీస్
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) డిస్పెన్సరీ కమ్ బ్రాంచి కార్యాలయాలను జిల్లాకొకటి చొప్పున దేశవ్యాప్తంగా ప్రారంభించాలని కార్మికశాఖ నిర్ణయించింది. ఆ శాఖ మంత్రి గంగ్వార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా ప్రారంభించే ఈఎస్ఐసీ డిస్పెన్సరీ కమ్ బ్రాంచి ఆఫీసు(డీసీబీవో)లు ప్రాథమిక వైద్యంతోపాటు రెఫరెల్ సేవలు, బిల్లుల పరిశీలన, మందుల పంపిణీ వంటి సేవలను అందిస్తాయి. డీసీబీవోల నిర్వహణ బాధ్యతను ఈఎస్ఐసీ చూస్తుంది. ఈఎస్ఐసీ ఆస్పత్రుల్లో నర్సింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంను ప్రారంభించాలని కూడా కార్మికశాఖ నిర్ణయించింది. ఇంటర్న్‌షిప్ కాలంలో నర్సులకు రూ.22వేల స్టైపెండ్‌ను కూడా అందించనుంది. కొన్ని ఈఎస్ఐసీ ఆస్పత్రుల సామర్థ్యాన్ని పెంచటంతోపాటు కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి కూడా ఈ సమావేశం ఆమోదం తెలిపింది. -
పోలీసులే హత్యలు చేయిస్తే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతలు అడుగంటాయి. పట్టపగలే మహిళలపై అత్యాచారయత్నాలు జరుగుతున్నాయి. నడిబజార్లో బహిరంగంగా హత్యలు చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై అధికారపక్షం నేతలే దాడులకు తెగబడుతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు కేవలం వీఐపీలకు బందోబస్తు కల్పించడానికి, ప్రజాందోళనలను అణచివేయడానికే పరిమితమయ్యారు. బిహార్‌ను తలపించేలా రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటనలు ప్రజలను బేజారెత్తిస్తున్నాయి. ప్రధానంగా రాజధాని ప్రాంతమైన గుంటూరు, విజయవాడలతోపాటు ఉత్తరాంధ్రలోని విశాఖ, రాయలసీమ ప్రాంత జిల్లాల్లో పెచ్చుమీరిన హత్యలు రౌడీరాజ్యంగా మారుస్తున్నాయి. టీడీపీ పెద్దల అండదండలే దన్నుగా రౌడీమూకలు విశృంఖలత్వానికి దిగుతున్నాయి. దశాబ్దం కిందట సద్దుమణిగిన రౌడీయిజానికి పాలకులే పాలుపోసి పెంచుతున్నారన్న విమర్శలున్నాయి. వ్యాపారుల నుంచి బలవంతపు వసూళ్లే పంథాగా.. భూ సెటిల్మెంట్లే దందాగా.. రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా రౌడీలు రెచ్చిపోతున్నారు. గ్యాంగ్‌వార్ రాష్ట్రంలో గ్యాంగ్‌వార్ వెర్రితలలేస్తోంది. గుంటూరు నగరంలో మాజీ రౌడీషీటర్ బసవల వాసు (38) ఇటీవల దారుణ హత్యకు గురైన తీరు సంచలనం సృష్టించింది. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే అన్వర్ రెస్టారెంట్లో భోజనం చేసి బయటకు వచ్చిన వాసును స్కార్పియోలో వచ్చిన ప్రత్యర్థి రౌడీషీటర్లు రెప్పపాటులోనే విచక్షణారహితంగా నరికేశారు. వాసు సోదరుడు వీరయ్య 2004లో హత్యకు గురయ్యాడు. సోదరుడిని చంపిన వారిని 2005లో హత్యచేసిన కేసులో వాసు నిందితుడిగా ఉన్నాడు. ఒక సెటిల్మెంట్లో వ్యక్తి మృతికి కారణమైన కేసులో ఇటీవల బెయిల్‌పై వాసు బయటకు వచ్చాడు. ఇతనిపై నగర బహిష్కరణ కూడా ఉందని చెబుతున్నారు. గుంటూరులో రౌడీషీటర్ల మధ్య ఆధిపత్యపోరు ఏడాది కాలంలో 8 మంది హత్యకు కారణమైంది. • విజయవాడ సింగ్‌నగర్‌లో ఒక బార్ వద్ద ఈ ఏడాది జూలై 27న సింగ్‌నగర్‌లో రౌడీషీటర్ కట్లా వేణుగోపాలరావు అలియాస్ ఖల్నాయక్... గంధసిరి వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని కత్తులతో పొడిచి హతమార్చాడు. రౌడీషీటర్ ఖల్నాయక్పై 20 ఏళ్లలో 16 కేసులు ఉండటంతో పోలీసులు నగర బహిష్కరణ విధించినప్పటికీ అతను నిర్భయంగా వచ్చి దారుణ హత్య చేయడం గమనార్హం. • గతేడాది డిసెంబర్ 31న నంద్యాల మెయిన్ సెంటర్ నడిరోడ్డుపై పట్టపగలే రౌడీషీటర్ రాఘవేంద్ర(రఘు)ను మరో రౌడీషీటర్ గుమ్మపాలెం బద్రి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. బిహార్ నుంచి తుపాకీ కొనుగోళ్లలో విజయవాడ రౌడీషీటర్.. తాజాగా హైదరాబాద్ పోలీసులు ఛేదించిన అక్రమ ఆయుధాల కొనుగోలు కేసులో విజయవాడ రౌడీషీటర్ సుబ్బు ప్రమేయం బయటపడింది. ఈ కేసులో ప్రకాశం జిల్లాకు చెందిన పొట్లూరి ఈశ్వర్, తెల్లగోర్ల సునీల్‌కుమార్‌ను హైదరాబాద్ పోలీసులు ఈ నెల 25న అరెస్టు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న వీరిద్దరూ సుబ్బుకు విక్రయించేందుకు బిహార్ నుంచి అక్రమంగా తుపాకులు తెప్పించారు. సుబ్బు పేరుమోసిన రౌడీషీటర్ కావడంతో గతంలో తెనాలిలో దాడులు, ప్రతిదాడుల్లో అతని పాత్ర ఉండేది. తెనాలి పోలీసులు సుబ్బుపై జిల్లా బహిష్కరణ విధించగా, అతను విజయవాడకు మకాం మార్చాడు. అప్పట్లో వంగవీటి శంతన్‌కుమార్‌పై కాల్పుల జరిపింది సుబ్బు అని పోలీసులు చెబుతున్నారు. అప్పటినుంచి టీడీపీ నేతలకు సన్నిహితుడిగా ఉంటున్నాడు. పోలీసులే హత్యలు చేయిస్తే.. శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులే ఏకంగా హత్యలకు పక్కాప్లాన్ వేసి ఆధారాలతో దొరికిపోవడంతో ప్రజలు విస్తుపోతున్నారు. విశాఖ డీఎస్పీ రవిబాబు ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు మరో హత్య చేయించి దొరికిపోవడంతో పోలీస్ శాఖను జనంలో పలుచన చేసింది. అక్టోబర్ 6న రౌడీషీటర్ గేదెల రాజును మరికొందరు రౌడీషీటర్లు దారుణంగా హత్య చేసి గోనె సంచిలో కట్టి తీసుకుపోయి పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనతో విశాఖ నగరంలో జూలు విదిల్చిన రౌడీయిజం మరోసారి చర్చకు దారితీసింది. ♦ ఏప్రిల్7న మద్దిలపాలెం సింగర్ బార్ వద్ద రౌడీ షీటర్ వెంకట రమణను మరో రౌడీషీటర్ హతమార్చాడు. ♦ జూలై 1న రాత్రి గాజువాక మార్కెట్ రోడ్డులో 7మెట్ల మర్రిపాలెంకు చెందిన గండేపల్లి ముత్యాలు అలియాస్ శ్రీనును మాంసం కొట్టు నిర్వాహకుడు హత్య చేశాడు. ♦ ఆగస్టు 19వ తేదీ రాత్రి ఆరిలోవ పాండురంగాపురం వద్ద రౌడీషీటర్ సాది వినయ్ సంపత్‌ను అతని ప్రత్యర్థులు పాత కక్షలతో దారుణంగా హతమార్చారు. ♦ అక్టోబర్ 1న రాత్రి కేఆర్ఎం కాలనీలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో కైలాసపురానికి చెందిన సంతోష్ ఆధిపత్యాన్ని తట్టుకోలేని నట్టి శేఖర్, బిల్డర్ శ్రీను, బందా రెడ్డి అలియాస్ బండోడు, అశోక్‌రెడ్డి, కనకలు అతడిని దారుణంగా హతమార్చారు. -
వారి మొండిబకాయిలు రూ.3.89 లక్షల కోట్లా?
న్యూఢిల్లీ : పారిశ్రామిక వేత్తలు రుణ బకాయిలకు సంబంధించిన వివరాలను కేంద్రం నేడు పార్లమెంట్‌కు నివేదించింది. మొత్తం 2,071 మంది పారిశ్రామికవేత్తలకు సంబంధించి రుణాలు రూ.3.89 లక్షల కోట్లు మొండిబకాయిలుగా(ఎన్పీఏలుగా) మారినట్టు కేంద్రం తెలిపింది. వారు రూ.50 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని రుణాన్ని బ్యాంకుల వద్దనుంచి తీసుకున్నట్టు పేర్కొంది. 2016 జూన్ 30 వరకు రూ.50 కోట్లకు పైబడిన ఎన్పీఏ అకౌంట్ల పారిశ్రామికవేత్తలు 2,071 మంది ఉన్నారని, వారి మొత్తం మొండిబకాయిలు రూ.3,88,919 కోట్లగా ఉన్నట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సూచనల మేరకు, ప్రతి బ్యాంకుకు రుణాన్ని రికవరీ చేసుకునే సొంత పాలసీ ఉంటుందని, దానిలోనే రైటాఫ్స్ ప్రక్రియ కూడా కలిసి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్బీఐ రైటాఫ్స్ ప్రక్రియకు అనుమతించినప్పటికీ, బ్రాంచు స్థాయిలో వారి రుణాల రికవరీ ఉంటుందని సంతోష్ కుమార్ గంగ్వార్ చెప్పారు. జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ జన్ ధన్ అకౌంట్లలో డిపాజిట్ చేస్తున్న ఒక్క రూపాయి సంబంధించి కూడా ఏ బ్యాంకుకు వ్యతిరేకంగా ప్రభుత్వం విచారణకు ఆదేశించలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. నవంబర్ 2 వరకు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్లు 25.45 కోట్లు తెరుచుకున్నాయని చెప్పారు. పేదలందరికీ బ్యాంకు అకౌంట్లను సమకూర్చడం ద్వారా ఫైనాన్సియల్ ఇక్లూజన్ సాధించడం కోసం ఈ పథకాన్ని 2014 ఆగస్టు 28న ప్రారంభించారు. -
బిల్డర్ కాల్చివేత
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో బిల్డర్ కాల్చివేత కలకలం రేపింది. ఢిల్లీలో అత్యంత విలాసవంతమైన గ్రేటర్ కైలాష్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ గ్యాంగ్ వార్ లో నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు హత్యకు గురయ్యాడు. పోలీసుల సమాచారం ప్రకారం... బిల్డర్ రాజు మోటార్ బైక్‌పై వెళుతుండగా గుర్తుతెలియని దుండగులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. దీంతో రాజు అక్కడిక్కడే చనిపోయాడు. మృతుడు చిన్న చిన్న కాంట్రాక్టులు నిర్వహించే ఓ మోస్తరు బిల్డర్ అని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో తలెత్తిన విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గ్యాంగ్‌వార్ అని భావిస్తున్నారు. -
గ్యాంగ్‌వార్!
పిడుగురాళ్ల : పిడుగురాళ్ల పట్టణంలో గ్యాంగ్‌లు తయారయ్యాయి. కొందరు యువకులు ప్రాంతానికి రెండు గ్రూపులుగా ఉంటున్నారు. ఈ గ్రూపులో వ్యక్తి మరో గ్రూపునకు దొరికి వెంటనే ప్రత్యేక ప్రదేశాలకు తీసుకెళ్లి చితకబాదేస్తున్నారు. తరచూ ఆడపిల్లల విషయంలో పోటీ పడుతూ పరస్పర దాడులకు పాల్పడుతున్నారు. రాత్రిళ్లు ఇళ్లల్లోకి చొరబడి దాడులు చేసుకుంటున్నారు. ఇటీవల ఒకటి, రెండు కేసులు స్టేషన్ వరకు వెళ్లడంతో పోలీసులు వార్నింగ్‌లు ఇచ్చి పంపారు. ప్రధాన కూడళ్లలో హడావుడి : పట్టణంలోని నలంద కళాశాల కూడలి, జిల్లా పరిషత్ హైస్కూల్ , గణపతి కాంప్లెక్స్ వెనుక, గంగమ్మ గుడి సెంటర్ , రైల్వేస్టేషన్ రోడ్డు, జమునా స్కూల్ సమీపంలో, బిలాల్ మసీద్ సెంటర్లో ఇలా ఆయా కూడళ్లలో గుంపులు గుంపులుగా ఏర్పడి అమ్మాయిలను ఏడిపించడం, ర్యాగింగ్ చేయడం వంటి విషయాలపై గ్రూపులు గొడవలు పడి కొట్టుకోవడం జరుగుతుంది. ఫైట్ ప్రదేశాలు ... రైల్వేస్టేషన్ ఫ్లాట్‌ఫామ్ చివర , మార్కెట్ యార్డు గోడౌన్ వెనుక , జమునా స్కూల్ వెనుక , పట్టణానికి చివర హైవేపై ఈ గ్రూపులు ఫైటింగ్‌కు దిగుతుంటారు. ఇటీవల పట్టణానికి చెందిన ఓ ఆర్టీసీ ఉద్యోగి కుమారుడిని కొట్టి గాయపరిచిన సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు ఎవరైనా గొడవలు ఎందుకని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తే వారిపై కూడా దాడులు చేసేం దుకు వెనుకాడటం లేదు. దీంతో ఇది తప్పని చెప్పాలంటే భయపడుతూ ఎవరికి వారు మిన్నకుంటున్నారు. నిఘా ఏర్పాటు చేస్తాం ... ఈ విషయాన్ని సత్తెనపల్లి డీఎస్పీ మధుసూదనరావు దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లగా పట్టణాల్లో పెడదారి పడుతున్న యువతపై పోలీసు నిఘాను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నామని, వారికి కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు. -
హిజ్రాల్లో వర్గపోరు, ఒక గ్రూప్ పై మరొకరు దాడులు!
వరంగల్: బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను, రైళ్లలో ప్రయాణీకులను బెంబేలెత్తిస్తున్న హిజ్రాల్లో వర్గపోరుకు తెరలేచింది. వర్గపోరులో భాగంగా హిజ్రాలకు చెందిన ఓ గ్రూప్ మరో గ్రూప్ పై దాడులు చేసుకున్నట్టు సమాచారం. ఈ ఘటన వరంగల్ చోటు చేసుకుంది. హిజ్రాల్లోని సౌజన్య వర్గంపై 30 మందితో లైలా వర్గం దాడి చేసినట్టు తెలిసింది. ఈ దాడుల్లో పలువురికి తీవ్రగాయాలవ్వడంతో చికిత్స కోసం వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కాలంలో హిజ్రాల ఆగడాలు ఎక్కువయ్యాయంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్న సంగతి తెలిసిందే.