న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ) డిస్పెన్సరీ కమ్ బ్రాంచి కార్యాలయాలను జిల్లాకొకటి చొప్పున దేశవ్యాప్తంగా ప్రారంభించాలని కార్మికశాఖ నిర్ణయించింది. ఆ శాఖ మంత్రి గంగ్వార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా ప్రారంభించే ఈఎస్‌ఐసీ డిస్పెన్సరీ కమ్ బ్రాంచి ఆఫీసు(డీసీబీవో)లు ప్రాథమిక వైద్యంతోపాటు రెఫరెల్ సేవలు, బిల్లుల పరిశీలన, మందుల పంపిణీ వంటి సేవలను అందిస్తాయి. డీసీబీవోల నిర్వహణ బాధ్యతను ఈఎస్‌ఐసీ చూస్తుంది. ఈఎస్‌ఐసీ ఆస్పత్రుల్లో నర్సింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంను ప్రారంభించాలని కూడా కార్మికశాఖ నిర్ణయించింది. ఇంటర్న్‌షిప్ కాలంలో నర్సులకు రూ.22వేల స్టైపెండ్‌ను కూడా అందించనుంది. కొన్ని ఈఎస్‌ఐసీ ఆస్పత్రుల సామర్థ్యాన్ని పెంచటంతోపాటు కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి కూడా ఈ సమావేశం ఆమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment