న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో బిల్డర్ కాల్చివేత కలకలం రేపింది. ఢిల్లీలో అత్యంత విలాసవంతమైన గ్రేటర్ కైలాష్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ గ్యాంగ్ వార్ లో నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు హత్యకు గురయ్యాడు.
పోలీసుల సమాచారం ప్రకారం... బిల్డర్ రాజు మోటార్ బైక్పై వెళుతుండగా గుర్తుతెలియని దుండగులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. దీంతో రాజు అక్కడిక్కడే చనిపోయాడు. మృతుడు చిన్న చిన్న కాంట్రాక్టులు నిర్వహించే ఓ మోస్తరు బిల్డర్ అని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో తలెత్తిన విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గ్యాంగ్వార్ అని భావిస్తున్నారు.
బిల్డర్ కాల్చివేత
Published Sun, Aug 23 2015 9:45 AM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM
Advertisement
Advertisement