raju
-
జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ కు తొలి పసిడి పతకం
డెహ్రడూన్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పతకాల బోణీ కొట్టాయి. శుక్రవారం పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కొమెర నీలం రాజు పసిడి పతకాన్ని సాధించాడు. నీలం రాజు మొత్తం 289 కేజీలు (స్నాచ్ లో 128+క్లీన్ అండ్ జర్క్ లో 161) బరువెత్తి అగ్ర స్థానంలో నిలిచాడు. పురుషుల సైక్లింగ్ రోడ్ రేసు మాస్ స్టార్ట్ ఈవెంట్ లో తెలంగాణ ప్లేయర్ ఆశీర్వాద్ సక్సేనా (2గం:48ని:39.029 సెకన్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. మరోవైపు భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ బింద్యారాణి దేవి జాతీయ క్రీడల్లో పసిడి పతకంతో సత్తాచాటింది. మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి 201 కేజీల (88+113) బరువెత్తి స్వర్ణం కైవసం చేసుకుంది. బింద్యారాణి స్నాచ్‌లో 88 కేజీల బరువెత్తి జాతీయ రికార్డు నెలకొల్పింది. గతంలో మీరాబాయి చాను ఈ విభాగంలో 86 కేజీల బరువెత్తగా... ఇప్పుడు బింద్యారాణి దాన్ని బద్దలు కొట్టింది. -
దెబ్బకు రూట్ మార్చిన మెగా ప్రిన్స్
-
బాలుడి కిడ్నాప్ విషాదాంతం
కేటీదొడ్డి: చేతబడి చేసి తన అన్నను చంపారని కక్ష పెంచుకున్న ఓ తమ్ముడు.. అందుకు కారణమైన కుటుంబంలోని బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. ఆ తర్వాత తాను సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన వడ్డె మచ్చప్ప, వడ్డె నర్సింహులు సొంత అన్నదమ్ములు. వడ్డె మచ్చప్ప–లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు రాజు(28), గోవిందు. కాగా, రాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. వడ్డె నర్సింహులుకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. నర్సింహులు కుమారుడు పవన్‌కుమార్(7) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతు న్నాడు. గురువారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన పవన్ సాయంత్రం తిరిగి ఇంటికి రాకపోవడంతో నర్సింహులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోవింద్ బైక్‌పై పవన్‌ను చూసినట్టు గ్రామస్తులు చెప్పా రు. అదే సమయంలో గోవిందు సైతం కనిపించలేదు. దీంతో పోలీసులు మచ్చ ప్ప కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారించారు. శుక్రవారం కర్ణాటకలోని రాయిచూర్ జిల్లా యాపల్‌దిన్నె పోలీస్‌స్టేషన్ పరిధిలో గాలింపు చేపట్టారు. అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించగా.. సోలార్ పవర్ ప్రాజెక్ట్ వద్ద గోవిందు బైక్ పార్కు చేసి ఉండటం గుర్తించారు. పోలీసులు సెల్‌నంబర్ ట్రేస్ చేయగా, సిగ్నల్స్ ఆధారంగా ఓ పాడు పడిన బావి వద్ద చివరి లొకేషన్ చూపించింది. దీంతో అనుమానంతో పోలీసులు బావిలో వెతకగా గోవిందు మృతదేహం లభ్యమైంది. గజ ఈతగాళ్ల సాయంతో మళ్లీ వెతకగా బాలుడి మృతదేహం సైతం లభ్యమైంది.ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించారు. కాగా, తన అన్న రాజును నర్సింహులు కుటుంబ సభ్యులు చేతబడి(బాణామతి) చేసి చంపేశారనే కోపంతో గోవింద్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. -
కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్‌ను వాడా!.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ఎక్స్పైరీ మెడిసిన్.. ఆయన రాజకీయం ఏడాదిలో ముగుస్తుంది’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలు కేసీఆర్‌ను మరిచిపోయేలా కేటీఆర్‌ను టార్గెట్ చేశామన్న రేవంత్.. కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్‌ను వాడా. త్వరలో కేటీఆర్ ఉనికి లేకుండా హరీష్‌ను వాడతాను. బావను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు’’ అంటూ వ్యాఖ్యానించారు.మాకు దీపావళి పండుగ అంటే చిచ్చు బుడ్లు.. వాళ్లకు మాత్రం సారా బుడ్లు‘మాకు దీపావళి పండుగ అంటే చిచ్చు బుడ్లు.. వాళ్లకు మాత్రం సారా బుడ్లు’ అంటూ కేటీఆర్ బావమరిది రాజు పాకాల విందుపై రేవంత్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీపావళి దావత్ అలా చేస్తారని మాకు తెలియదు.. రాజ్ పాకాల ఏం చేయక పోతే ఎందుకు పారిపోయారు?. ముందస్తు బెయిల్ ఎందుకు అడిగారు?దావత్ చేస్తే క్యాసినో కాయిన్స్, విదేశీ మద్యం ఎందుకు దొరికాయి’’ అంటూ రేవంత్ ప్రశ్నలు గుప్పించారు.మూసీపై ముందడుగే.. వెనకడుగు లేదు..మూసీపై ముందడుగే.. వెనకడుగు లేదని.. ఎవరు అడ్డుకున్న మూసి పునరుజ్జీవం చేసి తీరుతామని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. మొదటి ఫేస్ 21 కిలో మీటర్ల వరకు అభివృద్ధి చేస్తాం. గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మొదటి ఫేస్ పనులు చేపడతాం. నెల రోజుల్లో డిజైన్లు పూర్తవుతాయి. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తెచ్చి గండిపేటలో పోస్తాం. దీనికి సంబంధించి ట్రంక్ లైన్ కోసం నవంబర్ మొదటి వారంలో టెండర్లు పిలుస్తాం.’’ అని రేవంత్ తెలిపారు.ఇదీ చదవండి: సమస్యలు కొని తెచ్చుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి!‘‘బాపు ఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎతైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. బాపుఘాట్ వద్ద బ్రిడ్జి కం బ్యారేజి నిర్మాణం చేపడతాం. అక్కడ అభివృద్ధి కోసం ఆర్మీ ల్యాండ్ కూడా ఆడిగాము.15 రోజుల్లో ఎస్టీపీలకు టెండర్లు పిలుస్తాం. మూసీని ఎకో ఫ్రెండ్లీ అండ్ వెజిటేరియన్ కాన్సెఫ్ట్‌తో అభివృద్ధి చేస్తాం. మూసి వెంటా అంతర్జాతీయ యూనివర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్, రీక్రియేషన్ సెంటర్, నేచర్ క్యూర్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం’’ అని సీఎం రేవంత్ వెల్లడించారు. -
జన్వాడ ఫామ్ హౌస్ కేసు: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో రాజ్ పాకాల పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజులు సమయం ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారమే విచారణలో ముందుకు వెళ్లాలని కోర్టు పోలీసులకు సూచించింది. మోకిలా పోలీసులు కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు నోటీసులు ఇచ్చారు. బీఎన్ఎస్ యాక్ట్ 35(3) సెక్షన్ ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజ్ పాకాల ఇంట్లో లేకపోవడంతో ఓరియన్ విల్లాస్లోని నెంబర్ 40 విల్లాకు ఈ నోటీసులను పోలీసులు అంటించిన విషయం తెలిసిందే. పోలీసులు తనని అక్రమంగా అరెస్టు చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో రాజ్ పాకాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్ పాకాల దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ విచారించింది. పిటిషన్ తరఫు న్యాయవాది మయూర్ రెడ్డి.. వాదనలు వినిపించారు. ‘‘రాజ్ పాకాల ఇంట్లో పార్టీ చేసుకుంటే అక్రమంగా పోలీసులు వచ్చి దాడి చేశారు. రాజ్ పాకాల ఉద్యోగికి డ్రగ్ పాజిటివ్ వస్తే.. రాజ్ పాకాలను నిందితుడిగా చేర్చారు. డ్రగ్స్ టెస్ట్‌కు సాంపుల్ ఇవ్వాలని మహిళలను ఇబ్బంది పెట్టారు. ప్రతిపక్ష నేత కేటీఆర్ బావమరిది కనుకనే ఆయన్ను టార్గెట్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారు’’ అని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘ మేము అరెస్ట్ చేస్తామని ఎక్కడ చెప్పలేదు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. అక్రమంగా మద్యం బాటిళ్లు లభించడంతో పాటు ఒక వ్యక్తికి డ్రగ్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చింది. ఇందులో రాజకీయ దురుద్దేశం లేదు. రాజ్ పాకాలకు నిబంధనల ప్రకారమే 41a నోటీసులు ఇచ్చాం’’ అని కోర్టుకు ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.తర్వత మళ్లీ.. రాజ్ పాకాల న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు నిపించారు. ‘‘ రాజ్ పాకాలకు ఈరోజు ఉదయం 9:30 గంటలకు నోటీసు ఇచ్చి ఉదయం 11.00 గంటలకు విచారణకు రమ్మన్నారని తెలిపారు. ‘‘ మాకు అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు. విచారణకు రాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. విచారణలో సమాచారం లేదా ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటాం’’ అని ఏఏజీ కోర్టుకు తెలిపారు.చదవండి: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో మరో ట్విస్ట్! -
జగన్ ఓటమిని జీర్ణించుకోలేక..
కొవ్వూరు : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలుకావడం ఆ వీరాభిమాని జీర్ణించుకోలేకపోయాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. మొన్నటి ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉంటారని.. తన ఆవేదనను రాష్ట్రపతి దృష్టికి వెళ్తే మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తూ మిత్రులకు పంపిన వీడియో సందేశంలో వివరించాడు. తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిపై ఉన్న గామన్ బ్రిడ్జిపై మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఏమిటంటే.. తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన తాళ్లూరి రాజు, తన భార్య నాగలక్ష్మి, కుమార్తె హర్షిత, కుమారుడు మోక్షిత్‌తో కలిసి మంగళవారం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య కోవాలని నిర్ణయించుకున్నాడు. కొవ్వూరు–కాతేరు మధ్య గోదావరిపై ఉన్న గామన్ బ్రిడ్జి పైకి వేకువజామునే చేరుకున్నాడు. తాను, తన కుటుంబమంతా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నామని మిత్రులకు వీడియో సందేశం పెట్టాడు. పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, రాజు కుటుంబ సభ్యులు, కొవ్వూరు పట్టణ పోలీసులు ఈ సమాచారం తెలుసుకుని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్రిడ్జిపై రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై ఉన్న రాజుకు, ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్సార్సీపీ కార్యకర్త చిన్నం హరిబాబు, కొవ్వూరు పట్టణ సీఐ వి. జగదీశ్వరరావు, ఇతర సిబ్బంది నచ్చజెప్పి బయటకు తీసుకుకొచ్చారు.ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉంటారు..అనంతరం.. రాజు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడిగినా వైఎస్సార్సీపీకే ఓటు వేశామంటున్నారని, కానీ, జగన్ ఎలా ఓటమి పాలయ్యారో తెలీడంలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. తన కుటుంబ చావుతోనైన ఎన్నికల్లో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ చేస్తారని ఆశిస్తున్నానన్నాడు. ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి ఉంటారని, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని రాజు చెప్పాడు. తన ఆవేదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకువెళ్తే రీపోలింగ్‌కు ఆదేశిస్తారన్న ఉద్దేశంతో వీడియో ద్వారా తన సందేశాన్ని తెలిపి కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానన్నాడు. తన కుటుంబం చావు ద్వారా జగనన్నకు మేలు చేకూరితే చాలని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇంత మంచి చేసిన జగన్ ఓడిపోతారనుకోలేదు..తనకు రెండుసార్లు యాక్సిడెంట్ అయితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం చేశారని.. కాలులో స్టీల్‌రాడ్లు వేసి, వైద్యం చేసి, ఇంటికి పంపించారని రాజు తనకు జరిగిన మేలును వివరించాడు. మంచంపై ఉన్న రెండునెలలూ తన కుటుంబ పోషణకు వైఎస్సార్ ఆసరా పేరిట ఆర్థిక సాయం చేశారని.. అలాగే, తనకు ఏళ్ల తరబడి సొంతిల్లు లేదని, జగనన్న దయతో ఇంటి స్థలం ఇచ్చారని, ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పాడు. ఈ ఏడాది తన కుమార్తె చదువుకు అమ్మఒడి సొమ్ము పడుతుందని ఆశపడ్డానని, తన తమ్ముడికీ అమ్మఒడి సాయం అందుతోందని తెలిపాడు. అలాగే, నాన్నమ్మకు రూ.3 వేల పింఛను అందిస్తున్నారని, అందరికీ ఇంత మంచి చేసిన జగన్ ఘోరంగా ఓటమి పాలవుతారని కలలో కూడా ఊహించలేదని కన్నీటితో చెప్పాడు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచీ తనకు కంటి మీద కునుకులేదని, జగనన్న ఓటమి నిరంతరం తనను కలచివేస్తోందని ఆవేదన చెందాడు. ఏదో మోసం జరిగిందనేదే తన బాధ అని, ఈ ఎన్నికలపై విచారణ చేయిస్తే వాస్తవాలు బయటపడతాయన్నాడు.ఇక బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తే ఎన్నికలపై విచారణకు అవకాశం ఉండదన్నారు. అందుకనే తెల్లవారుజామున 5.30 గంటలకు భార్యాపిల్లల్ని తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు బ్రిడ్జిపైకి వచ్చానని చెప్పాడు. రాజు, ఆయన భార్యకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఎమ్మెల్సీ రఘు రాజుపై అనర్హత వేటు
-
ఎగ్జిట్ పోల్స్ పై KK రాజు రియాక్షన్
-
KK రాజు ఎమ్మెల్యే అయితే మీ ఇంట్లో మనిషి అయినట్టే..
-
తొలి డిజిటల్ బెగ్గర్ కన్నుమూత!
రాజు భికారీ పేరెప్పుడైనా మీరు విన్నారా? బీహార్‌లోని బెట్టియా రైల్వే స్టేషన్లో బిచ్చమెత్తుకునేవాడు ఈయన. మామూలు బిచ్చగాడైతే ఎవరూ పట్టించుకోకపోదురు కానీ... ఈయన దేశంలోనే తొలి డిజిటల్ బెగ్గర్! పాపం.. గుండెపోటుతో కాలం చేయడంతో ఈయన గురించి ఇప్పుడు అందరికీ తెలిసింది. ఏమిటబ్బా ఈ డిజిటల్ బెగ్గర్ కథ అనుకుంటున్నారా? మరి చదివేయండి.బెట్టియా రైల్వే స్టేషన్లో చాలాకాలంగా రాజు భికారీ ఓ ప్రత్యేక ఆకర్షణగా ఉండేవాడు. ఎందుకంటే.. మెడలో గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం క్యూర్ కోడ్లతో కూడిన ట్యాగ్లు వేలాడుతూండేవి. వచ్చి పోయే వారిని డబ్బులు అడుక్కునేవాడు. అయితే పేమెంట్ మాత్రం డిజిటల్ పద్ధతిలోనే చేయాలి. అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బిచ్చం వేయాలన్నమాట. ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా స్ఫూర్తితో తానీ కొత్త తరహా భిక్షాటనకు పూనుకున్నానని బతికుండా రాజు భికారీ చెప్పుకునేవాడు.డిజిటల్ పద్ధతులు రాక ముందే.. అంటే దాదాపు 32 ఏళ్లుగా రాజు భికారీకి భిక్షాటనే జీవనోపాధి. మోడీ అంటే అభిమానం ఎక్కువ. ‘మన్ కి బాత్’ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వినేవాడట. అంతకు ముందు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను తన తండ్రిగా చెప్పుకునేవాడు రాజు. అప్పట్లో ఆయనకు బెట్టియా రైల్వే స్టేషన్ క్యాంటీన్ నుంచే రోజుకు రెండు పూటల ఆహారం దొరికేది కూడా.డిజిటల్ పద్ధతిలో అడుక్కోవడం మొదలుపెట్టిన తరువాత కూడా లాలూ అంటే అభిమానం పోలేదు కానీ.. మతిస్థిమితం సరిగ్గా లేకుండా పోయింది. ఆరోగ్యమూ అంతకంత క్షీణించడం మొదలైంది. చివరకు బెట్టియా రైల్వే స్టేషన్లో క్యూఆర్ కోడ్లు చూపిస్తూ అడుక్కుంటూండగానే... గుండెపోటు వచ్చింది.!! -
నేతన్న విషాదాంతం!
సిరిసిల్లటౌన్: కొందరి దీన పరిస్థితి చూస్తే.. పగవారికి కూడా అటువంటి కష్టాలు రాకూడదని అనిపిస్తుంది. ఇదే తరహాలో సిరిసిల్ల నేత కార్మికుడి విషయంలో జరిగిన ఘటన మానవతావాదులను కలచివేసింది. పోలీసుల కథనం ప్రకారం.. సిరిసిల్ల పట్టణం నెహ్రూనగర్‌కు చెందిన ఈగ రాజు (45) రోకడ (ఎక్కడ పని ఉంటే అక్కడ సాంచాలు నడిపే పని) నేత కార్మికుడు. అయితే చాలా రోజులుగా సిరిసిల్లలో పనుల్లేక ఖాళీగా ఉంటున్నాడు.నాలుగు రోజుల క్రితం పనిని వెతుక్కుంటూ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఎటు వెళ్లాడో తెలియని స్థితిలో కుటుంబ సభ్యులు దిక్కుతోచకుండా ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం కరీంనగర్ జిల్లా వెదిర గ్రామం నుంచి ఫోన్ వచ్చింది. తమ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి వడదెబ్బతో చనిపోయాడని, ఆధార్‌కార్డులో సిరిసిల్ల వాసిగా అడ్రస్ ఉందని తెలిపారు.వెంటనే భార్య రేఖతో పాటు బంధువులు వెదిరకు వెళ్లారు. రాజు వేసుకున్న దుస్తుల ఆనవాళ్లను బట్టి అతనే అనిపించినా.. ఎండకు, ఆకలికి తాళలేక బక్కచిక్కి.. మొఖం రంగు మారిన క్రమంలో భార్య రేఖ తన భర్తను గుర్తు పట్టలేక పోయింది. చనిపోయింది తన భర్తకాదని, పని దొరికాక ఇంటికి వస్తాడన్న నమ్మకంతో సిరిసిల్లకు తిరిగి వచ్చింది. ఎస్సై సురేందర్ విచారణతో.. వెదిర గ్రామ కార్యదర్శి గౌరి రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామడుగు ఎస్సై సురేందర్.. ఈగ రాజు మృతి కేసును దర్యాప్తు చేశారు. బుధవారం సిరిసిల్లలో రాజు ఇంటికి వచ్చి నేరుగా విచారణ చేపట్టారు. ఇంట్లో ఉన్న ఫొటోలు, మృతుడిపై ఉన్న దుస్తులను బట్టి ఆ శవం ఈగ రాజుదిగా నిర్ధారించారు. కరీంనగర్లో పోస్టుమార్టం జరిపించి బుధవారం రాత్రి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు ఎస్సై సురేందర్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులే కారణమా? ఈగ రాజు మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు తెలిపారు. కొంత కాలంగా రాజుకు పని లేకుండా ఖాళీగా ఉంటున్నాడని, కుటుంబ భారం మొత్తం భార్య రేఖ మోస్తోందని చెప్పారు. కొద్ది నెలల క్రితమే కూతురుకు వివాహం జరిగిందని, రాజుకు అనారోగ్యం.. తదితర కారణాలతో కుటుంబానికి అప్పులయ్యాయని తెలిపారు. ఈ క్రమంలోనే రాజు పని వెతుక్కుంటూ ఇంట్లోంచి వెళ్లిపోయాడని, చేతిలో డబ్బులేక మండుటెండల్లో సరైన ఆహారం లభించక, ఎండల ధాటికి మృతిచెందినట్లు స్థానికులు భావిస్తున్నారు. -
కుట్రలు, దాడులు బాబు నైజం..
-
రూ.25 లక్షలు ఇచ్చి రిసార్ట్‌కి త్రిషని.. వల్గర్ కామెంట్స్.. సారీ చెప్పిన EX ఎమ్మెల్యే
-
జమ్మికుంట కౌన్సిలర్ అరాచకం..
జమ్మికుంట: ప్రభుత్వ భూమి కబ్జా చేసి బోరు వేయడమే కాకుండా.. ఆక్రమణ సరికాదని అడ్డుచెప్పిన ముగ్గురు గ్రామస్తులపై కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. రామన్నపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మూడోవార్డులోని రామన్నపల్లి ప్రభుత్వ పాఠశాల, వాటర్ ట్యాంక్ సమీప సర్వే నంబర్ 422లో కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ ప్రభుత్వ భూమి కబ్జా చేశాడు. అక్రమంగా బోరు వేసేందుకు యత్నిస్తుండగా , గ్రామస్తులు మర్రి మల్లయ్య, కోలకాని రాజు, మేడిపల్లి రమేశ్ అడ్డుకున్నారు. ఆగ్రహించిన కౌన్సిలర్ రవీందర్.. బుధవారం ఇనుప రాడ్‌తో ముగ్గురిపై విచక్షణ రహితంగా దాడిచేశాడు. దాడిలో మల్లయ్య, రాజుకు తీవ్రగాయాలు కాగా రమేశ్‌కు గాయాలయ్యాయి. మల్లయ్యను జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, మిగిలిన ఇద్దరినీ స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, మల్లయ్య భార్య రజిత ఫిర్యాదు మేరకు రవీందర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వి.రవి తెలిపారు. -
ఏం జరుగుతుందో ఊహించలేరు
‘‘పాటలు, ఫైట్స్, కామెడీ... ఇవేం లేకుండా ఓ కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా ‘105 మినిట్స్’. స్క్రీన్‌ప్లేను బేస్ చేసుకుని తీసిన ఈ చిత్రం ఆడియన్స్‌ను మెప్పిస్తుంది’’ అన్నారు దర్శకుడు రాజు దుస్సా. హన్సిక లీడ్ రోల్లో రాజు దుస్సా దర్శకత్వంలో బొమ్మక్ శివ నిర్మించిన ప్రయోగాత్మక చిత్రం ‘105 మినిట్స్’. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం విలేకర్ల సమావేశంలో రాజు దుస్సా మాట్లాడుతూ– ‘‘ముందు బాలీవుడ్లో రైటర్‌గా చేశాను. సొంతంగా కథలు రాసుకుని, దర్శకత్వ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ‘105’ మినిట్స్ సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్ వచ్చింది. సింగిల్ క్యారెక్టర్ ఫిల్మ్ ఇది. ఓ నీడ మాత్రం కనిపిస్తుంది. కనిపించని మనిషి ఒకరు పంచభూతాలను కంట్రోల్ చేస్తూ, ఓ అమ్మాయిని ఏడిపించే ఆటే ఈ సినిమా థీమ్. సాధారణంగా కొన్ని సినిమాల్లో నెక్ట్స్ ఏం జరుగుతుంది? అని ప్రేక్షకులు ఊహిస్తుంటారు. చాలెంజ్ చేసి చెబుతున్నాను.. మా సినిమాలో నెక్ట్స్ ఏం జరుగుతుందో కూడా ఊహించలేరు’’ అని చెప్పుకొచ్చారు. -
‘ఈనాడు’ది ఉత్త ‘కథే’
సీతమ్మధార (విశాఖ ఉత్తర): అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుంది విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలపై ఈనాడు రాసిన ‘కథ’. టీడీపీ నేతగా వ్యవహరిస్తున్న విశాఖ ఉత్తర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఓటర్ల జాబితాపై అడ్డగోలు ఆరోపణలు చేయగా.. వాటి ఆధారంగా ఒకే చిరునామాలో పదుల సంఖ్యలో ఓట్లున్నాయంటూ ‘విశాఖ ఉత్తరంలో ఓట్ల మాయ’ పేరుతో ఈనాడులో శుక్రవారం కథనం అచ్చేసింది. ఈ ఆరోపణలు అవాస్తవాలని నెడ్‌క్యాప్ చైర్మన్, వైఎస్సార్సీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు క్షేత్రస్థాయిలో నిరూపించారు. కేకే రాజు ఓటర్ల జాబితా పట్టుకొని ఈనాడులో రాసిన బాలయ్యశాస్త్రి లేఅవుట్లోని 49–54–8 నంబర్ ఇంటికి వెళ్లారు. అక్కడ యజమానితో మాట్లాడగా 2 ఓట్లు మాత్రమే ఉన్నట్లు తేలింది. గతంలో ఈ ఇంట్లో రెండు ఓట్లు ఉండగా, జాబితాలో ఒకే ఓటు ఉందని, మరో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు రాజు చెప్పారు. అదేవిధంగా 49–54–8/1 ఒక అపార్ట్మెంట్, 8/2లో మరో అపార్ట్మెంట్ ఉన్నాయన్నారు. వాటిలో ఒకటి శిథిలమైపోవడంతో కూలగొట్టి మళ్లీ కడుతున్నారని, ఈ అపార్ట్‌మెంట్స్‌లో మొత్తం 27 ఓట్లే ఉన్నాయని తెలిపారు. ఇక్కడ లేని వారు చిరునామా మార్చుకోవాలని బీఎల్వోలు ఇప్పటికే నోటీసులిచ్చినట్లు చెప్పారు. వాస్తవాలిలా ఉంటే.. టీడీపీ, బీజేపీ నేతలు, విష పత్రిక ఈనాడు నిరాధార కథనాలు రాయడం సిగ్గు చేటని కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.2019 ఎన్నికల్లో టీడీపీ నేతలే ఇష్టం వచ్చినట్లుగా ఓట్లని చేర్పించేశారన్నారు. 2019లో ఉత్తర నియోజకవర్గంలో దాదాపు 2.80 లక్షల ఓట్లు ఉన్నాయని తెలిపారు. కొత్తగా 60 వేల ఓట్లు చేర్పించామంటూ విష్ణుకుమార్ రాజు, గంటా ఆరోపిస్తున్నారని, ఇన్ని చేర్పిస్తే 3 లక్షల పైచిలుకు ఓట్లు ఉంటాయన్నారు. కానీ.. ప్రస్తుత ముసాయిదాలో 2.70 లక్షల ఓట్లే ఉన్నాయని చెప్పారు. 2019లో 72 రోజుల్లోనే టీడీపీ ఇక్కడ వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్పించిందని తెలిపారు. ఇప్పుడు వాటన్నింటినీ తొలగిస్తుంటే ఓడిపోతారన్న భయంతో అడ్డగోలు ఫిర్యాదులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టాయని తెలిపారు. -
దాడికి కారణమేంటి?
మిరుదొడ్డి (దుబ్బాక)/ సాక్షి, సిద్దిపేట: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి దాడికి కారణాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. మిరుదొడ్డి మండలం చెప్యాల కు చెందిన నిందితుడు గటాని రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పలు యూట్యూబ్ చానళ్ల లో పనిచేసిన రాజు వైఖరి తొలి నుంచీ వివాదాస్పదమని.. విలేకరి ముసుగులో దందాలకు పాల్పడేవాడని స్థానికులు చెప్తున్నారు. కలప రవాణా వాహనాలను ఆపి వసూళ్లకు పాల్పడటం, కల్లు డిపో, దుకాణాల యజమానుల నుంచి చందాలు వసూలు చేయడం వంటివి చేసేవాడని.. ఈ ఆగడాలతో సహనం నశించిన వ్యాపారులు గతంలో రాజుపై దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయని అంటున్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజు.. జిల్లా ముఖ్య నాయకులతో తిరిగేవాడని చెప్తున్నారు. అయితే ఎంపీపై దాడి చేసేంత పగ ఏమిటన్నది అంతుపట్టడం లేదని అంటున్నారు. అయితే.. దళితబంధు రాకపోవడం, ఇంటి స్థలం ఇవ్వకపోవడంతో ఎంపీపై కక్షగట్టి దాడి చేసి ఉంటాడని ప్రచారం జరుగుతోంది. అధికారులు ఇటీవల మిరుదొడ్డి మండల విలేకరులకు ఇక్కడి చెప్యాల క్రాస్‌రోడ్డులో ఇళ్ల స్థలాలు కేటాయించారు. అందులో తనకూ స్థలం కేటాయించాలని రాజు కోరగా.. ఎంపీతో చెప్పించాలని అధికారులు సూచించినట్టు తెలిసింది. రాజు పలుమార్లు ఈ విషయాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఎన్నికల కోడ్ ఉన్నందున ఇప్పుడు సాధ్యం కాదని చెప్పినట్టు సమాచారం. దీనికితోడు దళితబంధుకు ఎంపికైనవారి జాబితాలో తన పేరు లేకపోవడంతోనూ రాజు ఆగ్రహించాడని, ఇవన్నీ మనసులో పెట్టుకుని, దాడి చేసి ఉంటాడని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. -
ఇద్దరి స్నేహితుల ప్రాణాలను తీసిన.. విద్యార్థుల రాష్ డ్రైవింగ్!
సాక్షి, రంగారెడ్డి: ఇద్దరు మిత్రుల ఐదేళ్ల ప్రయాణం విద్యార్థుల రాష్ డ్రైవింగ్‌తో ఆగిపోయింది. నిమిషాల వ్యవధిలోనే ఇరువురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన బుధవారం మోకిల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం మండల పరిధిలోని జనవాడకు చెందిన బ్యాగరి రాజు(40) శేరిలింగంపల్లిలోని ఓ కంపెనీలో సూపర్వైజర్, మోత్కుపల్లి శ్రీశైలం(31) ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. రోజు మాదిరిగానే వారు బైక్‌పై విధులకు బయలుదేరారు. గ్రామ శివారులోకి కొల్లూరు రోడ్డులో ఇక్ఫాయి కళాశాల విద్యార్థులు అతివేగంగా వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టారు. దీంతో రాజు ఘటనాస్థలిలోనే మృతి చెందగా.. శ్రీశైలంను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచాడు. రాజుకు భార్య మమత, ముగ్గురు సంతానం. శ్రీశైలంకు ఏడాదిన్నర క్రితం సంధ్యతో వివాహమైంది. మృతదేహాలను చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇద్దరు మిత్రుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కళాశాల ఎదుట ధర్నా.. మృతుల కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని.. ప్రమాదానికి కారణమైన విద్యార్థులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గతంలోనూ శంకర్పల్లి–హైదరాబాద్ ప్రధాన రహదారిపై కార్ రేసింగ్ నిర్వహించి ఓ మహిళ ప్రాణాలను బలిగొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థులు గంజాయి, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆరోపించారు. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోకిల సీఐ నరేశ్, శంకర్పల్లి సీఐ వినాయకరెడ్డి కళాశాల వద్దకు చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
పవన్, రఘురామ కృష్ణంరాజుకి KK రాజు మాస్ వార్నింగ్
-
సీఎం వైఎస్ జగన్ గారు మనకిచ్చిన గొప్ప అవకాశం..
-
మండలిలోనూ మితిమీరిన టీడీపీ
సాక్షి, అమరావతి: శాసన మండలిలోనూ తెలుగుదేశం పార్టీ సభ్యులు చైర్మన్ పోడియం పైకి ఎక్కి మితిమీరి వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, టీడీపీ ఎమ్మెల్సీలు ఉద్దేశపూర్వకంగా పోడియం పైకి వచ్చి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. గురువారం శాసన మండలిలో చంద్రబాబు అరెస్టు వ్యవహరంపై చర్చకు పట్టుపడుతూ టీడీపీ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. సీపీఎస్‌పై చర్చ కోరుతూ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మరో వాయిదా తీర్మానం ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే ఈ రెండు వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు మండలి చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు మొదలెట్టారు. పోడియంపైకి రావడం మంచిది కాదని, సభ్యులు తమ స్థానాల్లో కూర్చొవాలని చైర్మన్ చెప్పారు. అయినా పరిస్థితి సానుకూలంగా లేకపోవడంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా.. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమవుతుండగా, చైర్మన్ రాకముందే టీడీపీ ఎమ్మెల్సీలు పోడియం పైన చేరారు. చైర్మన్ లోపలికి వస్తూనే, పోడియంపైన టీడీపీ సభ్యులను చూసి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటీవలే కొత్తగా ఎన్నికై తొలిసారి సమావేశాలకు హాజరవుతున్న టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ కూడా పోడియంపైన ఉండడం చూసి.. ‘శ్రీకాంత్ గారూ మీరు కొత్తగా వచ్చారు. సభ మొదలు కాకమునుపే మీరు పోడియం పైకి రావడం సభా మర్యాద కాదు. కిందకు దిగండి’ అని సూచించారు. అయినా టీడీపీ ఎమ్మెల్సీలు పోడియంౖపెనే ఉన్నారు. దీంతో చైర్మన్ తన సీటులో కూర్చోకుండా.. టీడీపీ ఎమ్మెల్సీలను ఉద్దేశించి ‘సభ మొదలుకాక మునుపే పోడియంపైకి వచ్చి కూర్చుంటే ఎలా? లేకపోతే ఇక్కడ (తాను కూర్చునే సీటును చూపిస్తూ) కూర్చొండి వచ్చి’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు తమకు ఉండే ప్రివిలేజీ మేరకు వారు చెప్పదలుచుకున్నది సభలో చెప్పవచ్చు గానీ, ఇలా ప్రవర్తించడం మర్యాద అనిపించుకోదన్నారు. ఇది పెద్దల సభ అని, మర్యాద పాటించి సభ గౌరవాన్ని నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇలానే ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు. అప్పటికీ టీడీపీ ఎమ్మెల్సీలు వెళ్లకపోవడంతో ‘మీకు కావాల్సింది కూడా∙అదేనా..’ అని చైర్మన్ అన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ సాబ్జీ స్పెషల్ మెన్షన్ వినిపించే సమయంలోనూ టీడీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేస్తుండడంతో మంత్రి జోగి రమేష్ జోక్యం చేసుకుని చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే, టీడీపీ ఎమ్మెల్సీలే మండలి ప్రతిష్టను, చైర్మన్ స్థానాన్ని అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. టీడీపీ వర్సెస్ వైఎస్సార్సీపీ చైర్మన్ ఎంత చెప్పినా వినకుండా టీడీపీ ఎమ్మెల్సీలు పోడియంపైనే ఉండి నినాదాలు చేశారు. ఇందుకు ప్రతిగా అధికార వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పలువురు తమ స్థానాల వద్ద నిల్చొని ‘అవినీతి పరుడు చంద్రబాబు డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో మండలి చైర్మన్ మోషేన్‌రాజు రెండోసారి సభను వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరోసారి వాయిదా వేశారు. నాలుగో విడత సభ ప్రారంభమయ్యాక కూడ టీడీపీ ఎమ్మెల్సీల తీరులో మార్పు లేకపోవడంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు మండలి చైర్మన్ ప్రకటించారు. -
Andhra Pradesh: నేటి నుంచి ‘అసెంబ్లీ’
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. శాసనసభ సమావేశాలు ఉదయం 9 గంటలకు, మండలి సమావేశాలు 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. అనంతరం శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశం కానుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి.. ఏ అంశాలపై చర్చించాలనే దానిపై ఈ సమావేశంలో అజెండా ఖరారు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించనుంది. సమావేశాలు సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. అసెంబ్లీ, మండలి సమావేశాల నేపథ్యంలో బుధవారం శాసనసభ కమిటీ హాల్లో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉన్నతాధికారులతో సమావేశమై బందోబస్తు, ఇతర ఏర్పాట్లుపై సమీక్ష నిర్వహించారు. పటిష్టమైన పోలీస్, మార్షల్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధికారులను ఆదేశించారు. మార్షల్స్ అప్రమత్తంగా ఉండాలి మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్.. పోలీస్ అధికారులతో శాంతి భద్రతల అంశాన్ని సమీక్షిస్తూ.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోలీస్, మార్షల్స్ ఎంతో అప్రమత్తంగా ఉండాలని, పాస్ లేకుండా ఏ ఒక్కరినీ అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించ వద్దని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి వారు సూచించారు. ఈ సారి పాస్‌ల జారీని కూడా సాధ్యమైనంత నియంత్రించాలని.. ప్రముఖులు, అధికారులు, సిబ్బంది మినహా ఇతరులకు ఎటువంటి విజిటింగ్ పాస్‌లు జారీ చేయవద్దని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులను ఆదేశించారు. సభ్యులు సమావేశాలకు సకాలంలో హాజరయ్యేలా వారి రాకపోకలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వారు బసచేసే ప్రాంతాల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కోరారు. సచివాలయం నాలుగు వైపులా పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో పాటు అధునాతన సమాచార, సాంకేతిక వ్యవస్థతో పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎటువంటి ఏమరపాటు లేకుండా ఎంతో అప్రమత్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తు విధులను నిర్వహించాలని సూచించారు. సభ్యులకు సంతృప్తికర సమాధానాలు అంతకు ముందు పలు శాఖల కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సమావేశాలను సజావుగా నిర్వహించడంలో పలు శాఖల కార్యదర్శులు, అధికారులు ఎంతగానో సహకరించారని, అదే సహకారాన్ని ఇకపైనా కొనసాగించాలని కోరారు. ఎన్నికలు జరిగే సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో గౌరవ సభ్యులు పలు ప్రజా సమస్యలపై ప్రశ్నలు అడుగుతుంటారని, వాటన్నింటికీ సమావేశాల నిర్వహణ సమయంలోనే సంతృప్తికర స్థాయిలో సమాధానాలు ఇవ్వాలని సూచించారు. గౌరవ సభ్యులు వారి నియోజకవర్గాల సమస్యలను సభలో చెప్పుకునేందుకు జీరో అవర్ ఎంతో ప్రాముఖ్యమైనదని, ఆ సమయంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను అధికారులు వెంటనే అందజేయాలన్నారు. పలు శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న స్టార్డు, అన్ స్టార్డు, షార్టు నోట్ ప్రశ్నలను వివరిస్తూ వాటన్నింటికీ వెంటనే సరైన సమాధానాలను అందజేసి జీరో స్థాయికి తీసుకురావాలన్నారు. ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు ఇచ్చేందుకు, వారి పిటిషన్లను సత్వరమే పరిష్కరించేందుకు ఆన్లైన్ ప్లాట్‌ఫాంను సత్వరమే రూపొందించాలని ఐటీ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను సచివాలయం నాలుగవ బ్లాకు పబ్లిసిటీ సెల్ నుండి మీడియాకు అందజేసేలా సమాచార శాఖ ఏర్పాట్లు చేసింది. -
న్యూజెర్సీలో తెలంగాణ ఉద్యమ నేత కడియం రాజుకు ఘనంగా నివాళులు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో ఏబీవీపీ పూర్వ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ డాక్టర్ కడియం రాజు గారి శ్రద్ధాంజలి సభ అమెరికాలో న్యూజెర్సీ రాష్ట్రంలో ఏబీవీపీ పూర్వ కార్యకర్తల మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ శ్రద్ధాంజలి కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు, ఏబీవీపీ పూర్వ విద్యార్థులు విలాస్ జంబుల, అమర్ జునూతుల, సంతోష్ మైకా, రాజేష్ రెడ్డి, సమరసింహా రెడ్డి బొక్క, కిరణ్, మధుసుధన్ రెడ్డి, ప్రదీప్ కట్ట, సుధీర్ గుత్తికొండ , సురేష్ సోమిశెట్టి, ప్రీతం , ప్రేమ్ కాట్రగడ్డ, పూర్వ కార్యకర్తలు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, స్వర్గీయ డా కడియం రాజన్న ఆత్మీయ మిత్రులు పెద్ద ఎత్తున హాజరై కడియం రాజన్న గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. బండి సంజయ్ కూడా గతంలో అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్‌లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పని చేశారు. ఉస్మానియా పూర్వ విద్యార్థి, అఖిల భారతీయ విద్యార్థి ఫెడరేషన్ నాయకుడు ,తన ఉద్యమాల ద్వారా ఎందరికో ఆదర్శంగా నిలిచిన జాతీయ స్థాయి లీడర్, కడియం రాజు మాకు (విలాస్ రెడ్డి జంబుల, శ్రీకాంత్ తుమ్మల ) సహచరుడు కావడం మా పూర్వ జన్మ సుకృతం. విలాస్ రెడ్డి జంబుల అనే వ్యక్తి ఈ రోజు అమెరికాలో ఉన్నత స్థాయిలో ఉన్నాడు అంటే దానికి కారణం మనం అందరం ముద్దుగా పిలుచుకునే ఉస్మానియా దిక్సూచి కడియం రాజు అని సగర్వంగా చెబుతాను. ఒక సిద్ధాంతం కోసం , తనని నమ్ముకున్న వారి కోసం కుటుంబాన్ని సైతం పక్కన పెట్టైనా పోరాడే యోధుడితో కలిసి చదివే అవకాశం వచ్చినందుకు, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఎప్పుడూ గర్వంగా ఉంటుంది. దేశ భక్తి , సేవాభావం ,ఉద్యమస్ఫూర్తి ,నాయకత్వ లక్షణాలు, పోరాడేతత్వం ఇవన్నీ కలగలిపిన ఆదర్శ వ్యక్తి కడియం రాజు. అసలు ఎవరు ఈ "రారాజు", అయన గురించి, ప్రజలను చైతన్య పరిచిన అయన విధానాలు గురించి, ఒక్క మాటలో చెప్పాలంటే అయన ప్రయాణం గురించి మా మాటల్లో.....,కాదు కాదు ,మాలాగా అభిమానించే ఎంతోమంది కోసం ఆయన ప్రయాణం గురించి వారి మాటల్లో దేశాన్ని ప్రేమించే జాతీయ భావాలు కలిగిన విద్యార్థి.. ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన ఉద్యమ నేత.. సమాజాన్ని ప్రేమించే నవతరం నాయకుడు.. ఎంతో భవిష్యత్ ఉన్న ఆ డైనమిక్ లీడర్‌ను విధి కాటేసింది.. సమాజం చిన్నబోయేలా ఒక నాయకుడిని కోల్పోయింది.. ప్రజల కోసం ఆయన చేసిన ఉద్యమాలను ఆయన ఆదర్శ వ్యక్తిత్వం గుర్తు తెచ్చుకుని తల్లడిల్లుతున్నారు ఎంతో మంది.. ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ చరిత్రలో 108 రోజుల జైలు జీవితం గడిపి, అన్న, బాబాయ్, మామగా విద్యార్థులచే ముద్దుగా పిలుచుకునే ఉస్మానియా యూనివర్సిటీ దిక్సూచి డాక్టర్ కడియం రాజు ఇటీవల మార్చి 20న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన నల్లగొండ జిల్లాలోని కొత్తగూడెం గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. తన పాఠశాల విద్య కొండ్రపోల్ గ్రామంలో, ఇంటర్ నాగార్జున జూనియర్ కళాశాల, మిర్యాలగూడ కేఎన్ఎం డిగ్రీ కళాశాలలో బీఏ డిగ్రీ పూర్తిచేశారు. పేదరికం వెక్కిరిస్తున్నా ఆ తర్వాత ఎంఏ హిస్టరీ విభాగంలో ఎంఫిల్, పీహెచ్డీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేశారు. ఆయనకు ఇంటర్ నుంచే దేశభక్తి, జాతీయ భావాలు కలిగిన విద్యార్థిగా ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ డిగ్రీలో కళాశాల ఎబీవీపీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 2002 సంవత్సరం నుండి ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ సైద్ధాంతిక పోరులో ముందుండి క్రియాశీలకంగా పనిచేశారు. ఏబీవీపీ చేపట్టిన ఎన్నో విద్యారంగ సమస్యలపై ముందుండి పోరాడి, ఎన్నో లాఠీ దెబ్బలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి 108 రోజులు జైలు పాలయ్యారు. కుట్రలను, అవినీతిని సహించని వ్యక్తిత్వం ఆయనది. ఏబీవీపీ చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ భూముల పరిరక్షణ ఉద్యమంలో ముందుండి, అనేక ఆక్రమణ భూముల విషయంలో కోర్టులలో కేసులు వేశారు, నిరుద్యోగం, విద్యారంగ సమస్యలు మెస్ బిల్లులు, స్కాలర్షిప్పులు, మౌలిక వసతులు, నూతన హాస్టళ్ల నిర్మాణం కోసం పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఏబీవీపీలో డాక్టర్ కడియం రాజు తన సుదీర్ఘ ప్రయాణంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంచార్జ్‌గా, సిటీ సెక్రెటరీగా, స్టేట్ సెక్రెటరీగా, నేషనల్ సెక్రెటరీగా, సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా అనేక విద్యార్థి ఉద్యమాలకు నేతృత్వం వహించారు. అలాగే జాతీయ ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల విద్యా నియంత్రణ కమిటీ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో సైతం ఏబీవీపీ చేపట్టిన అనేక ఉద్యమాలను ముందుండి నడిపించారు. ఏబీవీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన లక్ష మందితో ‘తెలంగాణ రణభేరి’లో సుష్మాస్వరాజ్ ఆహ్వానించిన సభకు సభాధ్యక్షత వహించారు. అలాగే ఏబీవీపీ తెలంగాణ సాధనకై మహా పాదయాత్రలో కోదాడ నుండి హైదరాబాద్ వరకు నేతృత్వం వహించారు. నా రక్తం- నా తెలంగాణ, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరాహార దీక్షలు... ఇలా తెలంగాణ సాధనలో అనేక ఉద్యమాలలో క్రియాశీలకంగా పోరాడారు. జాతీయ భావాలు కలిగిన దేశభక్తుడిగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన డాక్టర్ కడియం రాజు మరణం విద్యార్థి లోకానికి, దేశానికి తీరని లోటు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల కోసం ఆయన చేసిన ఉద్యమాలను ఆయన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శం, మరెంతో మందికి స్పూర్తి. (చదవండి: అమెరికాలో తెలుగు భాషకున్న స్థానం అంత ఇంత కాదు!: డా ప్రసాద్ తోటకూర) -
ఫారెస్ట్ అధికారిపై చర్యలకు ఓకే చెప్పిన హైకోర్టు
సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్థానిక సంస్థలపైనా ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. మానవ మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమని, అడవులు, సరస్సులు, నదులు, అన్ని జీవరాశులను కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులు, ప్రభుత్వాలపై ఉందని పేర్కొంది. రంపపు కోత మిల్లులను అటవీ ప్రాంత పరిధి నుంచి తరలించే విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నేపథ్యంలో కర్నూలు ఫారెస్ట్ రేంజ్ అధికారిగా పనిచేసిన చాణిక్యరాజు అనే అధికారిపై చట్ట ప్రకారం చర్యలు ప్రారంభించేందుకు ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. చాణిక్యరాజుకు ఊరటనిస్తూ ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ) 2017లో ఇచి్చన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారానికి ఆరు నెలల్లో తార్కిక ముగింపు తీసుకురావాలని సూచించింది. -
ప్రేమ విఫలమైందని.. యువకుడు తీవ్ర నిర్ణయం!
మెదక్: ప్రేమ విఫలమై ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల కేంద్రమైన అల్లాదుర్గం వడ్డేర కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్డేర రాజు(22), పాపన్నపేటకు చెందిన యువతి ఏడాదిగా ప్రేమలో ఉన్నారు. ఇటీవల సంగారెడ్డిలో ఇద్దరూ కలిసి ఉంటున్నారు. ఎందుకో రాజుతో ప్రేమ వద్దనుకుని ఆమె వెళ్లిపోయింది. ప్రేమ విఫలమైందని మనస్తాపానికి గురై అతడు ఆదివారం రాత్రి అల్లాదుర్గంలో ఉన్న ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. -
కోడి కూర కోసం దాడి..
నిజామాబాద్: చికెన్ వేయలేదని మేనమామను కట్టెతో కొట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వివరాలు.. నగరంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన చింతల రాజు ఇంట్లో మంగళవారం చికెన్ వండారు. రాజు అక్క కుమారుడు సుమన్ మద్యం మత్తులో చికెన్ వేయాలని కోరగా ఇద్దరి మధ్య మాటలు లేనందున చికెన్ వేయలేమని చెప్పారు. దీంతో కోపోద్రిక్తుడైన సుమన్ పక్కనే ఉన్న కట్టెతో రాజు తలపై బాదాడు. బాధితుడిని జీజీహెచ్‌కు తరలించారు. రాజు భార్య గౌరవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
విశాఖ ఏఎస్ఆర్ నగర్లో 134 టిడ్కో ఇళ్ల పంపిణీ
తాటిచెట్లపాలెం: మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) 45వ వార్డు తాటిచెట్లపాలెం దరి ఏఎస్ఆర్ నగర్లో 134 టిడ్కో ఇళ్లను శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారుల్లో ఎక్కువమంది గిరిజనులున్నారు. వైఎస్సార్సీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, నెడ్‌క్యాప్ చైర్మన్ కె.కె.రాజు, వార్డు కార్పొరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనోకు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వారితో కలిసి టిడ్కో బ్లాకులను ప్రారంభించారు. ఇక్కడ నిర్మించిన మొత్తం 288 ఇళ్లలో మొదటి విడతగా 134 ఇళ్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారులకు పట్టాలు, ఇంటి తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు డబ్బు కట్టించుకుని ఇళ్లు ఇవ్వడంలో విఫలమయ్యాయని చెప్పారు. వారి నగదును వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాపసు ఇచ్చి, లబ్ధిదారులకు ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తోందని తెలిపారు. ఈ కాలనీలో చిన్నచిన్న పనులున్నా.. వర్షాకాలం సమీపించడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడకూడదని త్వరితగతిన ప్రారంభించినట్లు చెప్పారు. వచ్చే దసరాకు వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి సమక్షంలో లబ్ధిదారులందరికీ పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికి మిగిలిన పనులన్నీ పూర్తిచేయాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భారీ ఫ్లెక్సీకి కాలనీవాసులతో కలిసి కె.కె.రాజు, హనోకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీశ్, ఫ్లోర్‌లీడర్ బాణాల శ్రీనివాసరావు, జీవీఎంసీ జోన్–5 జోనల్ కమిషనర్ ఆర్.జి.వి.కృష్ణ, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పాపునాయుడు, టిడ్కో ఎస్ఈ డి.ఎన్.మూర్తి, కార్పొరేటర్లు కంటిపాము కామేశ్వరి, బి.గంగారాం, వార్డు అధ్యక్షుడు పైడి రమణ తదితరులు పాల్గొన్నారు. -
8 మంది నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి: శాసన మండలికి స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన 8 మంది కొత్త సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు నూతన సభ్యులతో ప్రమాణం చేయించారు. పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి (వైఎస్సార్ జిల్లా), మేరిగ మురళీధర్ (నెల్లూరు జిల్లా), కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాధ్ (పశ్చిమ గోదావరి జిల్లా), కుడిపూడి సూర్యనారాయణరావు (తూర్పు గోదావరి జిల్లా), నర్తు రామారావు (శ్రీకాకుళం జిల్లా), సిపాయి సుబ్రహ్మణ్యం (చిత్తూరు జిల్లా), డాక్టర్ ఎ.మధుసూదన్ (కర్నూలు జిల్లా) ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు, శాసనమండలి చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్సీలు, శాసనసభ సెక్రటరీ జనరల్ రామాచార్యులు, శాసనమండలి ఓఎస్డీ సత్యనారాయణరావు, ఉప కార్యదర్శి విజయరాజు పాల్గొన్నారు. తోడేళ్ల మందలా దాడి సీఎం జగన్ రాజకీయ నిర్ణయాలు చంద్రబాబుకు రాజకీయంగా ఉరితాడు లాంటివని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అందుకే తోడేళ్ల మందలా ఏకమై కుట్రపూరితంగా ప్రజా ప్రభుత్వంపై దాడి మొదలుపెట్టారని మండిపడ్డారు. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ మేనిఫెస్టోలో 98 శాతానికిపైగా హామీలు అమలు చేసి చూపించారన్నారు. నిజాయతీ, విశ్వసనీయతకు నిదర్శనమైన సీఎం జగన్‌కు, అబద్ధానికి, మోసానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబుకు, తోడేళ్ల మందకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. చంద్రబాబు ఏజెంట్లా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పెత్తందార్ల పక్షాన నిలిచిన చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియాతో ప్రజల పక్షాన నిలిచిన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. టీడీపీ హయాంలో అమరావతి భూముల్లో కుంభకోణం జరిగిందన్నారు. చంద్రబాబు బరితెగింపు, అక్రమాలకు ఆయన కరకట్ట నివాసం నిదర్శనమని దుయ్యబట్టారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ద్వారా చంద్రబాబు గొడవ చేయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్‌ల కుట్ర రాజకీయాలను సీఎం జగన్ సమాధి చేస్తున్నారు కాబట్టే ఈ కుట్రదారులు వైఎస్సార్సీపీ విముక్త రాష్ట్రం అని మాట్లాడుతున్నారని చెప్పారు. -
ఆరు గంటలు.. ఇంట్లోనే మకాం వేసి.. 10 లక్షలు దోచేసి.. క్యాబ్‌లో చెక్కేసి..
బంజారాహిల్స్ (హైదరాబాద్): తల్లి, కూతురును కత్తితో బెదిరించి ఓ ఆగంతకుడు రూ.10 లక్షలతో ఉడాయించాడు. నిందితుడి కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం. 52లో ప్రముఖ వ్యాపారి ఎన్.ఎస్.ఎన్.రాజు నివాసం ఉంటున్నారు. కుటుంబం అంతా గురువారం రాత్రి ఓ శుభకార్యానికి వెళ్లి శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి వరకు ఇంటి పరిసరాల్లో కాపుకాసిన ముసుగు ధరించిన ఓ యువకుడు.. గోడ మీదుగా నిచ్చెన వేసుకొని ఇంటి ఆవరణలో దిగాడు. రాజు కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్తున్న సమయంలోనే వారి కళ్లుగప్పి లోనికి ప్రవేశించాడు. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో రాజు కూతురు నడింపల్లి నవ్య (30) ఉంటున్న గదిలోకి వెళ్లి కత్తి చూపించి బెదిరించాడు. ఈ హఠాత్ పరిణామంతో ఎనిమిదిన్నర నెలల నిండు గర్భిణి అయిన నవ్య.. ఆ ఆగంతకుడిని చూసి వణికిపోయింది. అరిచేందుకు యత్నించగా.. ఆమెను కత్తితో పొడుస్తానని హెచ్చరించాడు. రూ.10 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. తన ఒంటి మీద, బీరువాలో ఉన్న నగలు ఇస్తానని తన దగ్గర నగదు లేదని ఆమె వేడుకుంది. అయినాసరే ఆ దొంగ వినిపించుకోలేదు. ఈ క్రమంలో నవ్య పెట్టిన కేకలతో అప్రమత్తమైన ఆమె తల్లి లీల(54) ఆ గదిలోకి పరిగెత్తుకురాగా.. ఆ ఆగంతకుడు ఆమెను కూడా కత్తితో బెదిరించి ఓ మూలన కూర్చోబెట్టాడు. ఎవరికైనా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బులు తెప్పించాల్సిందిగా బెదిరించాడు. దీంతో నవ్య డబ్బులు కావాలని తన భర్తకు ఫోన్ చేసింది. ఆయన రూ. 8 లక్షలు ఆమె బావతో పంపించాడు. దీంతో లీల గేటు వద్దకు వచ్చి అతడి నుంచి నగదు తీసుకొని లోనికి వెళ్లింది. ఈ విషయం ఎవరికైనా చెప్తే కూతురును హత్య చేస్తానని బెదిరించడంతో ఆమె రూ. 8 లక్షలు తీసుకొచ్చిన అల్లుడికి ఈ విషయం చెప్పలేదు. ఈ విషయాలు ఏమీ తెలియని ఎన్.ఎస్.ఎన్.రాజు తన గదిలో నిద్రిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉదయం 10 గంటల సమయానికి తల్లీ, కూతురు ఇంట్లో ఉన్న రూ. 2 లక్షల నగదు కలిపి మొత్తం రూ.10 లక్షలను నిందితుడి చేతిలో పెట్టారు. అనంతరం నవ్య మొబైల్ ఫోన్ నుంచి ఓలా క్యాబ్ బుక్ చేయగా ఆగంతకుడు అందులో పరారయ్యాడు. షాక్ నుంచి తేరుకున్న బాధితులు ఉదయం 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓలా క్యాబ్‌లో నిందితుడు షాద్‌నగర్ బస్టాప్‌లో దిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆరుగంటల పాటు తల్లీ, కూతురును గదిలో బంధించి రూ. 10 లక్షలతో ఉడాయించిన ఆగంతకుడిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. క్లూస్‌టీమ్, డాగ్‌స్కా్వడ్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. క్యాబ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు తెలుగు, ఇంగ్లిష్‌లో మాట్లాడినట్లు క్యాబ్ డ్రైవర్ వెల్లడించడంతో పోలీసులు పాత నేరస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు. -
జాలిచూపులు, హేళనలు.. అన్నీ దాటి రాజస్తాన్ రాయల్స్‌కు ఎంపికైన కడప కుర్రాడు
పుట్టుకతో మూగ, చెవుడు.. చుట్టూ ఉన్నవారి హేళనలు.. జాలిచూపులు.. వీటన్నింటినీ దాటుకుని తనకంటూ ప్రత్యేకతను చాటిచెబుతూ ఓ వైపు క్రికెట్లో మరోవైపు వాలీబాల్ పోటీల్లో కడప నగరానికి చెందిన బిల్లా రాజు రాణిస్తున్నాడు. ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐడీసీఏ 4వ టీ–20 డెఫ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో పాల్గొనే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎంపికయ్యాడు. దీంతో ఈయన ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు కోల్‌కతాలో నిర్వహించే టీ–20 టోర్నమెంట్లో పాల్గొననున్న నేపథ్యంలో రాజు క్రీడాప్రస్థానంపై ప్రత్యేక కథనం. - కడప స్పోర్ట్స్ కడప నగరం మరియాపురంనకు చెందిన కుమారి (గృహిణి), సుబ్బరాయుడు (మున్సిపల్ వాటర్ విభాగంలో పంప్ ఆపరేటర్) దంపతుల కుమారుడైన బిల్లా రాజుకు పుట్టుకతోనే మూగ, చెవుడు. దీంతో వారి తల్లిదండ్రులకు కొద్దిరోజుల పాటు ఇబ్బందులు తప్పలేదు. తొమ్మిదో తరగతిలో చుట్టూ ఉన్నవారి జాలిచూపులు, హేళనలు బాధించినా రాజును ఉన్నతంగా చూడాలన్న తల్లిదండ్రులు.. కడప నగరంలోని హెలెన్కెల్లెర్స్ బధిరుల పాఠశాలలో చేర్పించారు. రాజు సోదరుడు రవి క్రికెట్ ఆడుతున్న సమయంలో అతనితో పాటు వెళ్తూ మెల్లగా క్రికెట్ సాధన చేయడం ప్రారంభించాడు రాజు. తమ్మునిలోని క్రికెట్ నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాడు. దీంతో 9వ తరగతికి వచ్చేనాటికి క్రికెట్, వాలీబాల్ క్రీడలపై అభిమానం పెంచుకున్నాడు. దీంతో కడప నగరంలోని డీఎస్ఏ క్రికెట్ స్టేడియంలో క్రికెట్‌కు, వాలీబాల్ క్రీడల్లో శిక్షణకు వచ్చేవాడు. వాలీబాల్ పోటీల్లో పలుమార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. తొలుత హైదరాబాద్ కెప్టెన్.. ఇప్పుడు రాజస్తాన్‌కు క్రికెట్ కోచ్ ప్రసాద్, ఇలియాస్‌లు ప్రోత్సహించడంతో ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారాలని భావించాడు. పదోతరగతి అనంతరం ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని స్వీకార్ ఉపకార్ కళాశాలలో చేరాడు. అక్కడే ఆయన క్రికెట్ జీవితం మలుపుతిరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ అకాడమీలో శిక్షణ పొందుతూ డెఫ్ క్రికెట్లో పాల్గొనడం ప్రారంభించాడు. అనతి కాలంలోనే హైదరాబాద్ డెఫ్ జట్టుకు కెప్టెన్‌గా రాణించాడు. ఎడమచేతి వాటం గల రాజు బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా హైదరాబాద్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. గత సీజన్లో హైదరాబాద్ డెఫ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఈయన తాజాగా రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ఎంపికయ్యాడు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడమే లక్ష్యంగా ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు కోల్‌కతాలో నిర్వహించనున్న ఐడీసీఏ 4వ డెఫ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో పాల్గొనే రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ఈయన ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఇప్పటి వరకు సౌత్‌జోన్ టీ–20, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణిస్తూ వస్తున్న ఈయన అంతర్జాతీయ పోటీల్లో భారత డెఫ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. యువతకు ఆదర్శం రాజు ఓవైపు క్రికెట్లో రాణిస్తూ కుటుంబపోషణ కోసం కడప నగరంలోని ఓ ప్రైవేట్ ఫొటోస్టూడియోలో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. జిల్లాకు చెందిన రాజు రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ఎంపికవడం పట్ల జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు అభినందనలు తెలిపారు. చదవండి: IPL 2023: నీ తప్పిదం వల్ల భారీ మూల్యం! అమ్మో ఈ ‘మహానుభావుడు’ ఉంటేనా.. చెన్నై సూపర్ కింగ్స్‌కు దెబ్బ మీద దెబ్బ.. మరో స్టార్ ప్లేయర్ ఔట్ -
గోడకూలి ఒకరు.. అది చూసి మరొకరు
నవీపేట: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నెపల్లిలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావుకు చెందిన గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం ఇద్దరు కూలీలు ప్రమాదవశాత్తు మృతి చెందారు. హన్మంత్‌రావు తన అత్తగారి ఊరైన జన్నెపల్లిలో 22 ఏళ్ల క్రితం వ్యవసాయభూమిని కొనుగోలు చేసి, అందులో రెండంతస్తుల గెస్ట్‌హౌస్ నిర్మించారు. ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలప్పుడు ఎమ్మెల్యే తొమ్మిది రోజులు ఇక్కడే ఉండి దుర్గామాత ఆలయంలో పూజలు చేస్తుంటారు. అప్పుడప్పుడూ వచ్ఛివెళ్తుంటారు. కాగా, తాజాగా చేపట్టిన గెస్ట్‌హౌస్ ఆధునీకరణ పనుల కోసం శుక్రవారం కాంట్రాక్టర్‌తోపాటు నిజామాబాద్ నుంచి ఐదుగురు కూలీలు వచ్చారు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ముగ్గురు కూలీలు భోజనానికి వెళ్లగా, కొండపల్లి రాజు(28), అతడి మిత్రుడు రెండో అంతస్తులోని గోడను తొలగించి, కిందపడేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గోడతోపాటు కొండపల్లి రాజు కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాన్ని కళ్లారా చూసిన మరో కూలీ ఒక్కసారిగా రెండో అంతస్తులోనే వాంతులు చేసుకుని కుప్పకూలాడు. పెద్దశబ్దం దరావడంతో మిగతా కూలీలు పైకి వచ్చి అతడి ఛాతీపై నొక్కి రక్షించేందుకు విఫలయత్నం చేశారు. సమాచారం అందిన వెంటనే ఎస్ఐ రాజారెడ్డి గెస్ట్‌హౌస్‌కు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజు తండ్రి శంకర్ రిటైర్డ్ సీఆర్పీఎఫ్ ఉద్యోగి. నవీపేట మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన వీరి కుటుంబం కొన్నేళ్ల కిందట నిజామాబాద్‌లోని వినాయక్‌నగర్‌లో స్థిరపడింది. రాజుకు పెళ్లయిన సోదరి ఉంది.గుండెపోటుతో మృతి చెందిన మరోకూలీ పేరు చంపాల్వాడి సాయిలు(29). భార్యతో విడిపోయిన సాయిలు నిజామాబాద్‌లో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన వీరి కుటుంబం ఏళ్లక్రితం వలస వచ్ఛింది. -
పార్టీ ఇచ్చిన పనిని అందరూ చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఇచ్చిన పనిని అందరూ చేయాల్సిందేనని, ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదని ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు స్పష్టం చేశారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన నేతలు తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ పనులు చేసుకుంటూనే తమకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చాల్సిందేనని వెల్లడించారు. మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులతో భేటీ అయిన బోసురాజు.. రాష్ట్రంలో జరుగుతున్న హాథ్ సే హాథ్ జోడో అభియాన్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ హాథ్ సే హాథ్ జోడోయాత్ర తమ నియోజకవర్గాల్లో కూడా నిర్వహిస్తున్నందున తమ కు కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లడం కష్టంగా ఉందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దీంతో పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఎంపికైన నేతలు పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు చక్కబెట్టాల్సిందేనని, తమ నియోజకవర్గాలతో పాటు బాధ్యతలిచ్చిన 2, 3 నియోజకవర్గాల్లో కూడా హాథ్ సే హాథ్ జోడో యాత్రలపై అక్కడకు వెళ్లి నివేదికలు తయారు చేయాలని స్పష్టంచేశారు. ఈనెల 6 లోపు తమకు కేటాయించిన స్థానాల్లో వెళ్లి రిపోర్టు చేయాలని, అక్కడ హాథ్ సే హాథ్ జోడో యాత్రలు జరుగుతున్న తీరుపై పార్టీకి సమా చారం ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, ముఖ్య నేతలు సంభాని చంద్రశేఖర్, గడ్డం వినోద్, చెరుకు సుధాకర్, సంగిశెట్టి జగదీశ్వరరావులతో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వజ్రేశ్‌యాదవ్, విజయారెడ్డి, చరణ్‌కౌశిక్ యాదవ్, చల్లా నర్సింహారెడ్డి, భూపతిరెడ్డి నర్సారెడ్డి, బాలలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సతీ భూదేవి
యముడితో పో రాడి భర్తప్రా ణాలు తిరిగి తెచ్చుకున్న సతీ సావిత్రి కథ మనకు తెలుసు. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న భర్తను పరాయి దేశం నుంచి విడిపించుకుని రావడానికి పద్నాలుగేళ్లు పోరాటం చేసింది ఈ భూదేవి. నేడు వేలంటైన్స్ డే. ప్రేమకు పట్టం కట్టే రోజు. భర్త పట్ల భార్యకు ఎంత ప్రేమ ఉంటుందో... అతని శ్రేయస్సు కోసం ఆమె ఎంత తపన పడుతుందో ఈ రోజున ఈ ఘటన ద్వారా కాకుండా మరెలా తెలుసుకుంటాం? భార్య ప్రేమకు శక్తి ఉంటే అది ఇంత బలంగా ఉంటుంది. ఇంత అచ్చెరువొందేలా కూడా ఉంటుంది. తీవ్రవాదుల చెరలో బందీగా ఉన్న తన భర్తను విడిపించుకోవడానికి ‘రోజా’ సినిమాలో హీరోయిన్ తెగువను ఆస్వాదించాం. అచ్చం అలాంటి కథను పో లిన నిజజీవిత ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో చోటు చేసుకుంది. విద్యాగంధం ఏమంతగా అంటని మాకూరి భూదేవి మరణశిక్ష ఖరారైన తన భర్తకు క్షమాభిక్ష ప్రసాదించాలని సుదీర్ఘ న్యాయపో రాటం చేసి విజేతగానే కాదు, వార్తలలో కూడా నిలిచింది. భూదేవి 14 ఏళ్లుగా చేసిన న్యాయపో రాటానికి ఇటీవల ఫలితం దక్కింది. ఇప్పుడు భూదేవి, ఆమె కుమారుడు రాజు, భర్త శంకర్ ఆనందోత్సాహంలో మునిగి తేలుతున్నారు. అసలేం జరిగిందంటే... మెండోరాకు చెందిన మాకూరి శంకర్‌కు సెంటు కూడా వ్యవసాయ భూమి లేదు. ఇక్కడ కూలి పని చేస్తే పెద్దగా సంపా దించుకోవడం కష్టం అనుకున్నాడు. తన భార్య గర్భవతిగా ఉన్న సమయంలో 2004లో దుబాయ్‌కు వెళ్లిపో యాడు. అక్కడ ఒక నిర్మాణ సంస్థలో ఫోర్‌మెన్ (సూపర్వైజర్)గా చేరాడు. అతనికింద పని చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన రామావతార్ కుమావత్ ప్రమాదవశాత్తు భవనం ఆరో అంతస్థుపై నుంచి పడి చనిపో యాడు. ఫోర్‌మెన్‌గా ఉన్న శంకర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే రాజస్థాన్ వాసి మరణించాడని దుబాయ్ పో లీసులు నిర్ధారించారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనను హత్య కేసుగా నమోదు చేసిన అక్కడి పో లీసులు శంకర్‌ను ప్రధాన నిందితునిగా గుర్తించి అరెస్టు చేసి పుజీరా జైలులో పెట్టారు. కోర్టు విచారణలో రామావతార్ కుమావత్ మృతికి తను బాధ్యుణ్ణి కాదని, అతను ప్రమాదవశాత్తు మరణించాడని శంకర్ ఎంత మొరపెట్టుకున్నా దుబాయ్ కోర్టులో చెల్లలేదు. పో లీసుల విచారణ నివేదిక ప్రకారం శంకర్‌ను దోషిగా తేల్చిన కోర్టు 2013లో మరణశిక్షను ఖరారు చేసింది. చదువులేకపో యినా... ఈ ఘటన 2009లో చోటు చేసుకుంది. మాకూరి శంకర్‌కే కాదు అతని భార్యకు కూడా చదువు రాదు. ఎవరిని సంప్రదించాలో, తమకేవిధంగా న్యాయం జరుగుతుందో తెలియదు. పుజీరా జైలులో ఉన్న శంకర్‌కు తన భార్య భూదేవితో నెల రోజులకు ఒకసారి ఫోన్లో మాట్లాడేందుకు జైలు పో లీసులు అవకాశం కల్పించారు. ‘‘అప్పుడు ఆయన నా గురించి, మా అబ్బాయి గురించి అడిగి ఏడ్చేవాడు. తాను బతికి బట్టకట్టాలంటే రాజస్థాన్ వాసి రామావతార్ కుమావత్ కుటుంబ సభ్యులు క్షమాభిక్షకు అంగీకరించాలని చెప్పాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ కుటుంబం అడ్రస్ తెలియదు. మా ఊళ్లో పెద్దలందరికీ ఈ విషయం చెప్పాను. కనపడినవారికల్లా మా కష్టం చెప్పాను. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదని ఏడ్వనిరోజు లేదు. రోజూ దిగులుగా ఉండేది. అలాగే నెలలు, ఏళ్లు గడిచిపో తున్నాయి. కానీ, దిగులుగా కూర్చుంటే అయ్యే పనులు కావు. నేనూ, నా బిడ్డ బతకాలి. కూలి పనులు చేసుకుంటూ బిడ్డను పో షించుకుంటూ వచ్చాను. గతంలో ఆర్మూర్ మండలం దేగాం వాసులు ముగ్గురు దుబాయ్‌లో మరణశిక్ష నుంచి బయటపడి ఇంటికి చేరుకున్నారని తెలిసింది. ఇందుకు అదే గ్రామానికి చెందిన యాదాగౌడ్ కృషి చేశారని తెలిసింది. గంపెడాశతో వెళ్లి యాదాగౌడ్‌ను సంప్రదించి ఎలాగైనా నా భర్తను మరణశిక్ష నుంచి తప్పించాలని వేడుకున్నాను..’ అని ఇన్నేళ్ల తన కష్టాన్ని వివరించింది భూదేవి. మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించి... ‘మా ఆయనకు ఫోన్ చేసినప్పుడల్లా ఊళ్లో విషయాలు, నేను చేస్తున్న పనుల గురించి, మా అబ్బాయి క్షేమం గురించి చెబుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దని చెబుతూ మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునేదాన్ని. బాధిత కుటుంబాన్ని ఎలాగైనా ఒప్పించాలని కానీ, వాళ్లు ఎక్కడ ఉంటారో నాకు తెలియదని యాదాగౌడ్‌ను కలిసినప్పుడు చెప్పాను. అతను అన్ని వివరాలు కనుక్కొని, రాజస్థాన్ కుటుంబం గురించి తెలుసుకున్నాడు. వాళ్లకు ఆర్థికసాయం రూ.5 లక్షలు అందించాలంటే అందరినీ బతిమాలుకున్నాను. కూలీ చేసుకొని బతికేదాన్ని, నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంటుంది. మా ఊరి వాళ్లు, ఇంకొంతమంది దయగలవాళ్లు తమకు తోచినంత ఇచ్చారు. అలా వచ్చిన డబ్బును రాజస్థాన్‌లోని మృతుని కుటుంబ సభ్యులకు అందజేశాం. మృతుని కుటుంబ సభ్యులు క్షమాభిక్షకు అంగీకరించారు’ అని తెలిపింది భూదేవి. అలా వారు సంతకాలు చేసిన పత్రాలను యాదాగౌడ్ ద్వారా న్యాయవాది అనురాధ సహకారంతో భూదేవి దుబాయ్‌లోని కోర్టుకు పంపించింది. దుబాయ్ కోర్టు ఈ పత్రాలను పరిశీలించి మరణశిక్షను రద్దు చేయడమేకాకుండా అతన్ని విడుదల చేస్తూ ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో మరణశిక్షను తప్పించుకున్న శంకర్ ఇంటికి చేరుకున్నాడు. కథ సుఖాంతమైంది. మా వాళ్లను చూస్తానని అనుకోలేదు నేను దుబాయ్‌కు వెళ్లే సమయంలో నా భార్య గర్భవతి. కొన్ని నెలలకే కొడుకు పుట్టాడు. ఈ సంతోష వార్త వినే సమయంలో నా భార్యకు చెప్పాను ‘త్వరలోనే వస్తాను’ అని. కానీ, అది సాధ్యం కాదని తర్వాత తెలిసింది. రాజస్థాన్ వ్యక్తి మరణించడంతో నేను ఈ ఘటనలో అరెస్టు అయ్యి జైలుపా లు కావడం, ఆ తరువాత మరణశిక్ష పడటం వరుసగా జరిగాయి. ఇక నా వాళ్లను చూస్తానని కలలో కూడా అనుకోలేదు. నా భార్యతో ఫోన్లో మాట్లాడిన ప్రతిసారీ నాకు ఎంతో ధైర్యం చెప్పేది. జైల్లో ఎంతో మనోవేదనతో ఉన్నా నా భార్య మాటలు నాకు జీవితంపై ఆశలు చిగురించేలా చేశాయి. నా విడుదల కోసం కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు. – మాకూరి శంకర్ – ఎన్.చంద్రశేఖర్, సాక్షి, మోర్తాడ్, నిజామాబాద్ -
ఏలూరులో లారీడ్రైవర్పై మోటార్ వెహికల్ ఇన్సెపెక్టర్ దాష్టీకం
సాక్షి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తెలంగాణ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్‌పై రవాణా అధికారులు దాష్టీకానికి పాల్పడిన ఘటన సోమవారం ఏలూరులో జరిగింది. మహబూబ్ నగర్, మక్తల్ ప్రాంతానికి చెందిన బీ.రాజు లారీలో పత్తి లోడును తణుకుకు తీసుకెళ్తున్నాడు. లారీ ఏలూరు చేరుకోగా ఆశ్రం ఆసుపత్రికి సమీపంలో మోటార్ వెహికల్ ఇన్సెపెక్టర్ ఈ.మృత్యుంజయ రాజు లారీని ఆపి పత్రాలు చూపాలని కోరారు. తన వద్ద ఉన్న అన్ని అనుమతుల పత్రాలను చూపించారు. పత్రాలు సక్రమంగా ఉన్నా రూ.15 వేలు లంచం ఇవ్వాలని ఇన్సెపెక్టర్ ఒత్తిడి తెచ్చారు. లంచం ఇచ్చేది లేదని రాజు తెగేసి చెప్పాడు. ఆగ్రహించిన ఇన్సెపెక్టర్, అతని కారు డ్రైవర్, హోమ్ గార్డులు లారీ డ్రైవర్‌పై దాడి చేసి కొట్టారు. తనను ఎందుకు కొడుతున్నారని అడగడంతో మరింత రెచ్చిపోయి కొట్టారు. రూ. 15 వేలు లంచం ఇవ్వడానికి ఇష్టపడలేదు.. నీకు రూ. 20 వేలు జరిమానా విధిస్తున్నామని బెదిరించారు. ఈ తతంగాన్నంతా లారీ డ్రైవర్ తన మొబైల్ ఫోన్లో వీడియో తీస్తుండగా దానిని రవాణా అధికారులు లాక్కుని పగుల కొట్టారు. నిబంధనల మేరకు సరుకు రవాణా చేస్తున్న తన వద్ద లంచం డిమాండ్ చేయడమే కాక ఇవ్వడానికి నిరాకరించడంతో దాడి చేసి కొట్టి, తన ఫోన్‌ను ధ్వంసం చేయడంపై డ్రైవర్ రాజు సోమవారం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై రవాణ శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీనిపై తక్షణమే స్పందించిన కలెక్టర్, రవాణా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తనపై దౌర్జన్యం చేసిన రవాణా అధికారులకు శిక్ష పడేవరకూ తాను పోరాటం కొనసాగిస్తానని డ్రైవర్ జు ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా లేకపోయినా ఇన్సెపెక్టర్ విధించిన జరిమానా కట్టేస్తానని చెప్పి రవాణా శాఖకు రూ. 20 వేలు మొత్తాన్ని చెల్లించాడు. చదవండి: (Vizag: ఇన్ఫోసిస్ కోసం చకచకా.. విశాఖలో పూర్తి స్థాయి కార్యకలాపాలు) షోకాజ్ నోటీసులు జారీ ఈ సంఘటనపై విచారణ చేపట్టిన రవాణా శాఖ ఉన్నతాధికారులు మోటార్ వెహికల్ అధికారి మృత్యుంజయ రాజు లారీ డ్రైవర్‌పై దౌర్జన్యం చేయడంతోపాటు అతని నుంచి లంచం డిమాండ్ చేసినట్టుగా గుర్తించారు. దీనిపై ఇన్సెపెక్టర్కు షోకాజ్ నోటీసులు జారీ చేశామని జిల్లా ఇన్ఛార్జ్ ఉప రవాణా కమీషనర్ పురేంద్ర తెలిపారు. ఇన్సెపెక్టర్ కారును, అతని ఎన్ఫోర్స్మెంట్ ఐడీని స్వాధీనం చేసుకున్నామని, రెండు రోజుల్లో షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. ఈ సంఘటనలో ఇన్సెపెక్టర్ కారు డ్రైవర్‌తో పాటు హోం గార్డుపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
భార్యను పుట్టింటికి పంపించి.. అక్క కూతురితో పెళ్లికోసం.. బావపై..
సాక్షి, దేవరపల్లి: తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలు రోడ్డులో ఇటీవల జరిగిన హత్య కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దేవరపల్లిలోని సర్కిల్ కార్యాలయం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అడిషనల్ ఎస్పీ (క్రైం) గోగుల వెంకటేశ్వరరావు ఈ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గత నెల 27న పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ఆకుతీగపాడుకు (ప్రస్తుతం తాడేపల్లిగూడెం) చెందిన మల్లోజు రాజు హత్యకు గురయ్యాడు. గోపాలపురం – భీమోలు రోడ్డులో పోలవరం కుడి కాలువ గట్టుపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తగులబెట్టి ఉందని వీఆర్ఓ గోతం తాతారావు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దేవరపల్లి సీఐ ఎ.శ్రీనివాసరావు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తిగా తగులబెట్టడంతో హతుడి వివరాలు తెలియరాలేదు. సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేసును అన్ని కోణాల్లోనూ సమగ్రంగా దర్యాప్తు చేశారు. హతుని వివరాలు తెలుసుకుని నిందితులను బుట్టాయగూడెం శివాలయం వద్ద మంగళవారం అరెస్టు చేశారు. భార్యను పుట్టింటికి పంపించి.. అక్క కూతురిని పెళ్లి చేసుకోవాలని.. బుట్టాయగూడెం మండలం బుసురాజుపల్లికి చెందిన ఆదిమూలపు ఏసుపాదం ఈ కేసులో ప్రధాన నిందితుడు. అతడికి ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె. సొంత అక్క కూతురును రెండో పెళ్లి చేసుకోవాలనే దురుద్దేశంతో ఏసుపాదం భార్యను పుట్టింటికి పంపాడు. మేడకోడలిని రెండో పెళ్లి చేసుకుంటానంటూ బావ మల్లోజు రాజుపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి రాజు నిరాకరించాడు. ఈ నేపథ్యంలో అతడిని చంపేయాలని ఏసుపాదం నిర్ణయించుకున్నాడు. ఇందుకు స్నేహితులు బుట్టాగూడేనికి చెందిన దార రామచంద్రరావు, బేతాళ శేఖర్, కొల్లి పవన్ కల్యాణ్ కుమార్‌లతో కలిసి పథకం రూపొందించాడు. దీని నిమిత్తం రూ.2 లక్షలకు సుపారీ మాట్లాడారు. చదవండి: (బీకాం విద్యార్థిని ఆత్మహత్య.. తల్లిదండ్రుల మాటలే..) పథకంలో భాగంగా బావ రాజును ఏసుపాదం తన ఇంటికి పిలిచాడు. అందరూ కలిసి మద్యం తాగారు. ఇంకా మద్యం తాగుదామని చెప్పి వారిని కొల్లి పవన్ కల్యాణ్ తన కారులో పోగొండ ప్రాజెక్టు వద్దకు తీసుకువెళ్లాడు. వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో రాజు మెడ వెనుక భాగంలో నిందితుల బలంగా కొట్టి హతమార్చారు. సాక్ష్యాలను రూపుమాపడానికి పథ కం ప్రకారం మృతదేహాన్ని కారులో తీసుకుని బయలుదేరారు. కొయ్యలగూడెం వద్ద బంకులో పెట్రోలు కొన్నారు. గోపాలపురం – భీమోలు రోడ్డులో పోలవరం కుడి కాలువ గట్టు వద్దకు తీసుకువచ్చి రాజు మృతదేహంపై పెట్రోలు పోసి తగులబెట్టి వెళ్లిపోయారు. ఈ కేసును జిల్లా ఇన్చార్జి ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు, కొవ్వూరు డీఎస్పీ బి.శ్రీనాథ్ పర్యవేక్షణలో కేసు మిస్టరీని దర్యాప్తు బృందం ఛేదించింది. నిందితులు ఏసుపాదం, రామచంద్రరావు, బేతాళ శేఖర్, పవన్ కల్యాణ్ కుమార్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి కారు, ఇనుప రాడ్డు, రూ.7,500 నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రామచంద్రరావు గతంలో హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. బేతాళ శేఖర్ కూడా గతంలో హత్యాయత్నం, పోక్సో కేసులలో రెండుసార్లు జైలుకు వెళ్లాడు. విలేకర్ల సమావేశంలో డీఎస్పీ శ్రీనాథ్, దేవరపల్లి సీఐ ఎ.శ్రీనివాసరావు, దేవరపల్లి, గోపాలపురం ఎస్సైలు కె.శ్రీహరిరావు, కె.రామకృష్ణ, సీసీఎస్ ఎస్సై రవీంద్రబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఇంతకీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు?.. టీడీపీనా.. బీజేపీనా..’
సాక్షి, విశాఖపట్నం: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీచేయబోతున్నారు..? ఇంతకీ మీది టీడీపీనా..? బీజేపీనా..? ప్రజలకు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుపై వైఎస్సార్ సీపీ ఉత్తర సమన్వయర్త, నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడే మైక్ బీజేపీది.. మాట టీడీపీదని... అలాగే మాట్లాడే ఆఫీస్ బీజేపీది.. అజెండా టీడీపీదని ఎద్దేవా చేశారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం మీడియాతో కేకే రాజు మాట్లాడారు. చదవండి: సబ్బం హరి ఆస్తులు సీజ్! నా జెండా.. అజెండా వైఎస్సార్ సీపీనే అని... ఊపిరున్నంత వరకు సీఎం వైఎస్ జగనన్న వెంటేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సీటుపై, రాజకీయ భవిష్యత్‌పై బెంగలేదన్నారు. విష్ణుకుమార్ రాజుకు మాత్రం రాజకీయ భవిష్యత్‌పై బెంగ ఉంటే వైఎస్సార్ సీపీలో కార్యకర్తలా చేర్చుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉంటూ చంద్రబాబు, లోకేష్‌పై ప్రేమ ఒలకపోస్తూ జ్యోతిష్యుడి అవతారం ఎత్తుతున్నారని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే సీటు కోసం రాజకీయాల్లోకి రాలేదని, సీఎం వైఎస్ జగన్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఊపిరున్నంత వరకూ జగనన్న వెంటే నిలుస్తానని సంపత్ వినాయక ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. 2024 ఎన్నికల్లో మీరు ఏ పార్టీ నుంచి పోటీచేస్తారో సంపత్ వినాయక ఆలయంలో ప్రమాణం చేస్తారా...? అని విష్ణుకుమార్ రాజుకు సవాల్ విసిరారు. అసలు నోట్ల రద్దు, కరెన్సీ ముద్రణ అంశాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా అని ప్రశ్నించారు. 22 ఏ భూములపై నిర్లక్ష్యం వహిస్తున్నామంటున్నారని... అయితే గతంలో టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడే చట్టం తీసుకొచ్చారని గుర్తు చేశారు. రాజకీయంగా ఎదుర్కొలేకనే దుష్ప్ర చారం రాజకీయంగా ఎదుర్కోలేకనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణిపై టీడీపీ, బీజేపీ నాయకులు దు్రష్పచారం చేస్తున్నారని కేకే రాజు అన్నారు. ఎక్కడో ఢిల్లీలో లిక్కర్ స్కాం జరిగితే భారతమ్మపై దు్రష్పచారం చేయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకుంటే తగిన మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ కె.సతీ‹Ù, వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి రవిరెడ్డి, జీవీఎంసీ ఫ్లోర్‌లీడర్ బాణాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు భార్యలను కాదని మరో పెళ్లి.. రూ.10 లక్షల సుపారీ ఇచ్చి
యశవంతపుర (బెంగళూరు): బెళగావి భవాని నగర గణపతి దేవస్థానం వద్ద ఈనెల 15న చోటు చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు దొడ్డబొమ్మన్నవర్(46) హత్యోదంతాన్ని గ్రామాంతర పోలీసులు ఛేదించారు. వ్యాపార భాగస్వాములతో కలిసి రెండో భార్య కిరణ సుపారి ఇచ్చి హత్య చేయించినట్లు నిర్ధారించి, ఆమెతో పాటు ధర్మేంద్ర, శశికాంత్ అనే నిందితులను అరెస్ట్ చేశారు. రాజు దొడ్డబొమ్మన్నవర్ మొదటి భార్య లాతూరులో ఉంది. ఇద్దరు భార్యలను కాదని రాజు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆస్తిని తన పిల్లల పేరున పెట్టాలని కిరణ భర్తతో గొడవ పడేది. చదవండి: (విజయ్ సేతుపతి సహకారంతోనే.. లక్షకు పైగా ఉద్యోగాలు) ఈక్రమంలో భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది. వ్యాపారంలో రాజుతో విభేదాల వల్ల ఆయనకు దూరంగా ఉన్న ధర్మేంద్ర, శశికాంత్‌తో కిరణ చేతులు కలిపింది. సంజయ్ రాజపుత్ అనే వ్యక్తికి రూ.10 లక్షల సుపారీ ఇచ్చి కారులో వెళ్తున్న రాజును కత్తులతో పొడిచి హత్య చేయించారు. పోలీసులు అనుమానంతో రాజు రెండో భార్య కిరణ కాల్‌డేటాను పరిశీలించి విచారించగా ఈ విషయం బట్టబయలైంది. సంజయ్ రాజపుత్, అతనికి సహకరించిన మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. చదవండి: (మూడు పెళ్లిళ్లు.. మరికొందరితో చాటింగ్.. ఎలా భయటపడిందంటే..) -
ఎంతటి విషాదం.. స్కూటీపై వెళ్తుండగానే గుండెపోటు.. వీడియో వైరల్
సాక్షి, మహబూబ్ నగర్: జడ్చర్ల పట్టణానికి చెందిన రాజు అనే ఓ యువకుడు వాహనంపై వెళుతుండగానే గుండెపోటు రావడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. పట్టణంలోని పాత బజార్‌కు చెందిన ఇరవై ఆరేళ్ల రాజు ప్రైవేట్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ సాయంత్రం తనకు గుండెల్లో నొప్పిగా ఉందని మిత్రులతో చెప్పగా.. ఓ మిత్రుడు తన స్కూటీపై రాజును తీసుకొని ఆసుపత్రికి బయలుదేరాడు. కాగా మార్గమధ్యంలోనే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం.. వాటిని సోషల్ మీడియా ద్వారా చూసిన ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. చదవండి: (ExtraMarital Affair: మామా నీ కూతుర్ని చంపేశా..) -
జ్యుడీషియల్ విచారణ
సాక్షి, హైదరాబాద్: ఆరేళ్ల బాలికను చిదిమేసిన పల్లకొండ రాజు రైలు కిందపడి చనిపోయిన ఘటన పై హైకోర్టు జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా వరంగల్ మూడో మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్‌ను నియమించింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నాలుగు వారాల్లో సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని సదరు మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్ రావు, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మా సనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాజు పోస్టుమార్టం వీడియోను వరంగల్ జిల్లా చీఫ్ జడ్జికి శనివారం సాయంత్రం లోగా పెన్‌డ్రైవ్‌లోగానీ, సీడీలోగానీ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లా చీఫ్ జడ్జి వీలై నంత త్వరగా ఆ వీడియోలను హైకోర్టు జ్యుడీషి యల్ రిజిస్ట్రార్‌కు అందజేయాలని సూచించింది. అత్యవసర విచారణలో.. పల్లకొండ రాజు మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, దీనిపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ పౌరహక్కుల సంఘం నేత గడ్డం లక్ష్మణ్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయగా.. హైకోర్టు ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. రాజు ఆత్మహత్య ఘటనపై అనుమా నాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. వాస్తవాలు తేల్చడం కోసం న్యాయ విచారణ చేపట్టాల్సిన అవ సరం ఉందని పేర్కొంది. ప్రభుత్వం రాజుది ఆత్మ హత్య అని పేర్కొంటుండగా, పిటిషనర్లు హత్య అంటున్నారని.. ఈ నేపథ్యంలో సీఆర్పీసీలో నిర్దేశించిన మేరకు విచారణ జరపడం తప్పనిసరని తెలిపింది. రాజు మరణానికి సంబంధించి సమా చారం తెలిసినవారు.. విచారణ అధికారి ఎదుట హాజరై వివరాలు తెలపవచ్చని సూచించింది. అరెస్టు చేశామని కేటీఆరే ప్రకటించారు పిటిషనర్ తరఫున న్యాయవాది వెంకన్న వాదనలు వినిపించారు. రాజును అరెస్టు చేశామని మంత్రి కె.తారకరామారావు స్వయంగా ప్రకటించారని ధర్మాసనానికి విన్నవించారు. ‘‘రాజును ఎన్కౌంటర్ చేస్తామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. అతడిని వదిలిపెట్టబోమని బాహాటంగానే చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే కూడా రెండు రోజుల్లో ఫలితం వస్తుందని వ్యాఖ్యానించారు. ఈనెల 9న బాలిక హత్యాచారానికి గురికాగా.. 10వ తేదీన రాజు భార్య, తల్లిని సైదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని, 15వ తేదీ వరకు నిర్బంధించారు. రాజు ఆచూకీ చెప్పాలంటూ వేధింపులకు గురిచేశారు. 15న రాజు ఆచూకీ దొరికిన తర్వాత వారిని విడిచిపెట్టారు. రాజును ఎన్కౌంటర్ చేస్తామని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు. ఆ మరునాడే రైలు పట్టాల వద్ద రాజు మృతదేహం దొరికింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే.. పోలీసులు రాజును అదుపులోకి తీసుకొని హత్య చేశారని.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంపై సీఆర్పీసీ 176(1)(ఎ) సెక్షన్ ప్రకారం న్యాయ విచారణకు ఆదేశించండి. బాలిక హత్యాచార ఘటనలో రాజు నిందితుడిగా ఉన్నా.. అతడిని చట్టప్రకారం కోర్టులో హాజరుపర్చి, నేరం రుజువైతే శిక్షించి ఉండాల్సింది..’’ అని న్యాయవాది పేర్కొన్నారు. రాజు కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇప్పించాలని ధర్మాసనానికి విన్నవించారు. అది ముమ్మాటికీ ఆత్మహత్యే.. రాజును పోలీసులు కస్టడీలోకి తీసుకోలేదని.. అది ముమ్మాటికీ ఆత్మహత్యేనని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ‘‘ఈ విషయంలో ఎటువంటి అనుమానాలు, సందేహాలకు ఆస్కారం లేదు. రాజు కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడిన వెంటనే.. రైలు డ్రైవర్లు ఇద్దరు అది గుర్తించి, స్థానిక రైల్వే అధికారులకు వాకీటాకీలో సమాచారం అందించారు. మరో ఐదుగురు ఇండిపెండెంట్ సాక్షులు కూడా రాజు ఆత్మహత్య చేసుకున్నాడని వాంగ్మూలాలు ఇచ్చారు. ఆ వాంగ్మూలాలను రైల్వే పోలీసులు కూడా రికార్డు చేశారు. పోస్టుమార్టం ప్రక్రియను పూర్తిగా వీడియో తీశాం. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాం. వారు అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించడం అంటే కోర్టుల విలువైన సమయాన్ని వృధా చేయడమే’’ అని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘పోస్టుమార్టం, అంత్యక్రియలు అయిపోయాయా?.. చాలా వేగంగా పూర్తి చేశారు..’ అని వ్యాఖ్యానించింది. ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తూ.. విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. -
రాజు ఆత్మహత్యపై విచారణ: 4 వారాలు గడువిచ్చిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ ఘటన నిందితుడు రాజు మృతిపై తెలంగాణ హైకోర్టు జ్యుడీషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపి నాలుగు వారాల్లో సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని తెలిపింది. ఈ మేరకు వరంగల్ మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌కు న్యాయస్థానం ఆదేశించింది. రాజు మృతిపై పౌర హక్కుల సంఘం నేత పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజును పోలీసులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్ వాదనలు వినిపించారు. చదవండి: విద్యార్థినికి ఘోర అవమానం.. పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమా? అయితే ఆ వాదనలకు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ ప్రతివాదనలు చేశారు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టం చేసింది. రాజు ఆత్మహత్యపై ఏడుగురి సాక్ష్యాల నమోదు ప్రక్రియ, పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ చేసినట్లు ఏజీ నివేదిక ఇచ్చారు. ఆ వీడియోలను రేపు రాత్రి 8 గంటల్లోగా వరంగల్ జిల్లా జడ్జికి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్టేషన్ ఘన్పూర్ సమీపంలో రైల్వే పట్టాలపై గురువారం ఉదయం రాజు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే పోలీస్ వర్గాలు మాత్రం రాజుది ఆత్మహత్య అని స్పష్టంగా చెబుతున్నారు. కానీ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌర హక్కుల నాయకుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. చదవండి: నిర్మల్ సభలో ‘ఈటల’ స్పెషల్ అట్రాక్షన్: చప్పట్లు మోగించిన అమిత్ షా -
సైదాబాద్ నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణ
-
రాజును పోలీసులే చంపారు! నాకు, నా బిడ్డకు దిక్కెవరు?: మౌనిక
సాక్షి, అడ్డగూడూరు: రాజును పోలీసులే చంపారని, ఆత్మహత్య అని కట్టుకథ అల్లి ప్రచారం చేస్తున్నారని అతడి భార్య మౌనిక, తల్లి ఈరమ్మ ఆరోపించారు. రాజును పట్టుకున్న పోలీసులు.. కోర్టుకు అప్పజెప్పి ఉండాల్సిందని పేర్కొన్నారు. ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగిందని అంటున్నారని.. మరి తమ కుటుంబం పరిస్థితి ఏమిటని నిలదీశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చంపేసి పట్టాలపై వేశారు: ఈరమ్మ తన కొడుకు రాజును పోలీసులు పథకం ప్రకారమే చంపేశారని అతడి తల్లి ఈరమ్మ ఆరోపించింది. ‘‘నేను హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నప్పుడే.. నా కొడుకు రాజును పట్టుకున్నారని పోలీసులు అనుకుంటుంటే విన్నాను. కానీ చంపేసి రైలు పట్టాలపై వేశారు. ఆత్మహత్య చేసుకున్నాడని కట్టుకథ అల్లారు. హైదరాబాద్‌లోని మా కొడుకు ఇంటిని చిన్నారి బంధువులు కూలగొట్టారు. మాకు తలదాచుకోవడానికి ఏ దిక్కూ లేకుండా పోయింది.’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. నా బిడ్డకు న్యాయం చేయాలె.. తిరుమలగిరి (తుంగతుర్తి): రాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్తున్నారని, తన బిడ్డ బతుకు మాత్రం ఆగమైపోయిందని మౌనిక తల్లి యాదమ్మ వాపోయింది. సూర్యాపేట జిల్లా తిరు మలగిరి మండలం జలాల్పురం గ్రామానికి చెందిన ఆమె గురువారం మీడియాతో మాట్లాడింది. ‘‘రాజు నా బిడ్డను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పోయిన శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి పోలీసులు వచ్చి నా భర్తను, ఇద్దరు కొడుకులను, బిడ్డను తీసుకొనిపోయారు. ఈ బుధవారం రాత్రి పంపించారు. తెల్లారే సరికి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు. నా బిడ్డ బతుకు ఆగమైపోయింది. ఆమెకు ఓ ఆడపిల్ల ఉంది. వారి భవిష్యత్తు ఏమైపోవాలి. ప్రభుత్వమే న్యాయం చేయాలి..’’ అని విజ్ఞప్తి చేసింది. నాకు, నా బిడ్డకు దిక్కెవరు?: మౌనిక కొద్దిరోజులుగా తాను తల్లిగారి ఇంట్లో ఉంటున్నానని రాజు భార్య మౌనిక తెలిపింది. ‘‘గత శుక్రవారం హైదరాబాద్ నుంచి పోలీసులు వచ్చి.. నన్ను, మా అత్తమ్మ, ఆమె బిడ్డ, బిడ్డ భర్తను తీసుకెళ్లారు. రాజు గురించి అడిగారు. వెతకడానికి మమ్మల్ని వెంట తీసుకెళ్లారు. మాతో తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని.. బుధవారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌లోని ఉప్పల్ చౌరస్తాలో వదిలివెళ్లారు. అక్కడి నుంచి మేం భువనగిరికి బస్సులో వచ్చి.. ఓ బండి మాట్లాడుకుని గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అడ్డగూడూరుకు చేరుకున్నాం. కొద్దిగంటల్లోనే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. నా భర్తను పోలీసులే పొట్టన పెట్టుకున్నారు. కోర్టుకు అప్పగిస్తే శిక్ష అనుభవించేవాడు. ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగితే.. మరి మా కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. నాకు 11 నెలల కూతురు ఉంది. ఇప్పుడు మా ఇద్దరికి దిక్కెవరు?’’ అంటూ రోదించింది. -
సైదాబాద్ చిన్నారి కేసు: ఉన్మాది కథ ముగిసింది!
జనగామ/ స్టేషన్‌ఘన్‌పూర్/ హైదరాబాద్: గురువారం ఉదయం 8 గంటల సమయం.. రైలుపట్టాల దగ్గర ఓ యువకుడు కూర్చుని ఉన్నాడు.. ఆ పక్కనే ఉన్న పొలాలకు వెళ్తున్న రైతులు అతడిని చూశారు.. అనుమానంతో దగ్గరికి వెళ్లారు. వారిని చూసిన యువకుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. దొరికిపోతాననే భయంతో అటుగా వస్తున్న రైలు కిందపడి చనిపోయాడు. వారం రోజుల కింద.. హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై దారుణంగా హత్యాచారానికి పాల్పడ్డ పల్లకొండ రాజు (28) కథ ఇలా ముగిసింది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం చిల్పూరు మండలం నష్కల్ స్టేజీ సమీపంలో ఈ ఘటన జరిగింది. కాజీపేట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న భువనేశ్వర్–ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టడంతో రాజు శరీరభాగాలు ఛిద్రమయ్యాయి. మృతదేహం చేతిపై ఉన్న ‘మౌనిక’అనే పచ్చబొట్టు, ఇతర గుర్తుల ఆధారంగా అతడిని రాజుగా నిర్ధారించారు. మృతదేహానికి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారం రోజుల కింద.. ఈ నెల 9న సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిని అదే ప్రాంతానికి చెందిన రాజు అత్యాచారం చేసి చంపేసిన విష యం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. అతడి ఫొటోలను విడుదల చేశారు. పట్టించిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని కూడా ప్రకటించారు. అయితే రాజు ఎవరి కంట పడకుండా నిర్మానుష్య ప్రాంతాల్లో తిరుగుతూ వచ్చాడు. ఈ క్రమం లో రైల్వేట్రాక్ వెంబడి వెళ్తూ.. గురువారం జనగామ జిల్లా నష్కల్ స్టేజీ సమీపంలోని రాజారాం బ్రిడ్జి 309/1–3 కిలోమీటరు రాయి వద్దకు చేరుకున్నాడు. ఉదయం 8 గంటల సమయంలో రైల్వే కీమెన్లు కుతాటి సారంగపాణి, తాటి కుమార్‌లు ట్రాక్‌ను తనిఖీ చేస్తుండగా.. గడ్డం, పొడవాటి జుట్టుతో ఒక యువకుడు అనుమానాస్పదంగా కనిపించాడు. పట్టాల దగ్గర ఏం చేస్తున్నావని కీమెన్లు అతడిని నిలదీయగా.. ‘మీకెందుకంటూ’ఎదురు వాదనకు దిగాడు. దీంతో వారు రాజు దగ్గరికి వెళ్లగా పట్టాల పక్కన ఉన్న పొదల్లోకి వెళ్లిపోయాడు. కాసేపు వేచి చూసిన కీమెన్లు.. పట్టాలను తనిఖీ చేసుకుంటూ వెళ్లిపోయారు. రైతుల కంట పడటంతో.. కీమెన్లు వెళ్లిపోయాక రాజు మళ్లీ పట్టాల దగ్గరికి వచ్చాడు. ఆ పక్కన ఉన్న పొలాల్లోని రైతులు భూక్యా రామ్‌సింగ్, గౌతమ్‌సింగ్ పట్టాలపై రాజును చూశారు. హైదరాబాద్ చిన్నారి హత్యాచార ఘటన నిందితుడిలా ఉన్నాడని గుర్తించారు. పక్కనే పొలంలో ఉన్న సోదరుడు సురేశ్‌కు ఫోన్ చేసి పిలిచారు. ముగ్గురు కలిసి దూరం నుంచే.. ‘‘ఎవరు నువ్వు.. ఇక్కడేం చేస్తున్నావు’’అని ప్రశ్నించారు. రాజు ఆహార్యం, అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్పడం చూసి.. కాస్త దూరంలోనే నిలబడ్డారు. ఆ సమయంలో కాజీపేట వైపు వెళుతున్న గూడ్స్ రైలు కింద దూకేందుకు రాజు ప్రయత్నించి, ఆగిపోయాడు. అది చూసిన రైతులు.. ‘‘ఏమైంది? ఎందుకు చనిపోదామనుకుంటున్నావు?’’అని ప్రశ్నిస్తూ దగ్గరికి వెళ్లారు. సుమారు 8.45 గంటల సమయంలో కాజీపేట నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు రావడంతో.. దాని కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతులు వెంటనే కీమెన్లకు ఫోన్ చేయగా.. వారు పోలీసులకు, నష్కల్ రైల్వేస్టేషన్ మాస్టర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రాజు కుడిచేయి మణికట్టు వరకు తెగిపోయింది. ముఖం, శరీరభాగాలు ఛిద్రమయ్యాయి. సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం: సీపీ తరుణ్ జోషి చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న రాజు.. నష్కల్ రైల్వే ట్రాక్ వరకు ఎలా వచ్చాడనే దానిపై ఆరాతీస్తున్నట్టు వరంగల్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. రాజును పట్టుకోవడం కోసం తమ పరిధిలోని ప్రజలను అప్రమత్తం చేశామని, పోలీసు బలగాలతో నిఘా పెట్టామని చెప్పారు. ఈ క్రమంలోనే నష్కల్ సమీపంలో పట్టాలపై రాజు మృతదేహం ఉన్నట్టు సమాచారం వచ్చిందని తెలిపారు. ఈ అంశంలో సమగ్ర విచారణ జరిపిస్తున్నామన్నారు. రైల్వే పోలీసుల విచారణ రైల్వే జీఆర్పీ సీఐ రామ్మూర్తి నేతృత్వంలోని పోలీసు బృం దం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించామని రైల్వే ఎస్సై అశోక్‌కుమార్ తెలిపారు. గురు వారం రాత్రి పొద్దుపోయాక సికింద్రాబాద్ ఎస్సీ అనూ రాధ సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఘటన స్థలంలో సిమ్‌కార్డులు లేని రెండు సెల్ఫోన్లు లభించినట్టు ప్రకటిం చారు. కాగా, రాజు ఉదంతంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఆమె చెప్పారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో..! భువనేశ్వర్–ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. గురువారం ఉదయం 8.30 గంటలకు కాజీపేటకు చేరుకున్న ఆ రైలు.. 8.33 నిమిషాలకు సికింద్రాబాద్ వైపు బయలుదేరింది. ఈ మధ్యలో రైలు ఎక్కడా ఆగదు. వీలైనంత వరకు వేగంగా ప్రయాణిస్తుంది. రాజు రైలు కింద పడిన సమయంలో రైలు గరిష్ట వేగంతో ఉన్నట్టు భావిస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యులకు చెక్కు ఇస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్. చిత్రంలో మంత్రి మహమూద్ అలీ బాలిక కుటుంబానికి రూ.20 లక్షల చెక్కు సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం ఉదయం పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల ఆర్ధిక సాయం చెక్కును వారికి అందజేశారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తప్పనిసరిగా తగిన చర్యలు తీసుకుంటుందని వారు హామీ ఇచ్చారు. మేం చూస్తుండగానే.. ఉదయం 6.30 గంటలకు ఇద్దరు తమ్ముళ్లతో కలిసి వ్యవసాయ బావి వద్దకు వచ్చిన. ఆ సమయంలో ఓ వ్యక్తి ట్రాక్‌పై కూర్చొని కనిపించాడు. పంటపై కోతులు దాడి చేయడంతో.. తమ్ముడు రాంసింగ్, నేను వాటిని తరమడానికి వెళ్లాం. 8.40 గంటల సమయంలో మరో తమ్ముడు గౌతమ్‌సింగ్ నా వద్దకు వచ్చాడు. పట్టాల వద్ద గడ్డం, పొడవాటి జుట్టుతో ఓ వ్యక్తి ఉన్నాడని చెప్పడంతో దగ్గరికి వెళ్లాం. అతన్ని చూసి రాజులా ఉన్నాడని అనుకున్నాం. కానీ అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ మేం ముగ్గురం ఉండడంతో.. దొరికిపోతాననే భయంతో అటువైపు వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు వెళ్లిపోయాక దగ్గరికి వెళ్లి చూశాం. చేతిపై మౌనిక అనే పచ్చబొట్టు కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. – రైతు సురేశ్, ప్రత్యక్ష సాక్షి పారిపోవడంతో రాళ్లు విసిరినం పట్టాలపై ఒక వ్యక్తి కనిపించడంతో పట్టుకునేందుకు ప్రయత్నించాం. కానీ పొదల్లోకి పారి పోయాడు. బయటికి రప్పించేం దుకు రాళ్లు విసిరాం. ఎంతకూ రాకపోవడంతో పిచ్చోడేమో అనుకుని యథావిధిగా ట్రాక్ తనిఖీ కోసం వెళ్లాం. కాసేపటికే కొందరు రైతు లు ఓ వ్యక్తి రైలు కిందపడి చనిపోయాడని సమా చారం ఇచ్చారు. వెంటనే స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించాం. – తాటి కుమార్, రైల్వే కీమెన్ పిచ్చోడేమో అనుకున్నాం ఉదయం 8 గంటలకు విధుల్లోకి వచ్చాం. ఆ సమయంలో ట్రాక్ పక్కన ఉన్న వ్యక్తిని మందలించాను. గడ్డం, జుట్టును చూసి అనుమానం వచ్చింది. కాగితా లు ఏరుకునేవాడో, పిచ్చివాడో అనుకున్నం. ఎవరది అని అరుస్తూ దగ్గరికి వెళ్లినం. కోపంగా చూసుకుంటూ పొదల్లోకి వెళ్లిపోయాడు. – కుతటి సారంగపాణి, రైల్వే కీమెన్ ఎంజీఎం: రైలు పట్టాలపై లభించిన రాజు మృతదేహానికి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో డాక్టర్ రజామ్ ఆలీఖాన్ ఆధ్వర్యంలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. రాజు ఒంటిపై అనుమానాస్పద గాయాలేమీ లేవని వారు తెలిపారు. రైలు ఢీకొనడంతో తల నుజ్జునుజ్జు అయిందని, రెండు చేతులకు తీవ్రగాయాలయ్యాయని వెల్లడించారు. పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీశామని.. రాజు శరీర అవయవాల శాంపిల్స్‌ను హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కు పంపామని తెలిపారు. కాగా.. రాజు మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో స్థానికులు ఆగ్రహంతో అంబులెన్స్‌పై చెప్పులు విసిరారు. రాజు బావమరదులు కేదిరి సురేశ్, కేదిరి మహేశ్‌లకు మృతదేహాన్ని, ఆనవాళ్లను చూపించగా.. రాజుదేనని వారు గుర్తించారు. తర్వాత రాజు తల్లి వీరమ్మ, భార్య మౌనిక, ఇతర బంధువులకు మృతదేహాన్ని చూపించారు. లాంఛనాలు పూర్తయ్యాక రాజు మృతదేహాన్ని బంధువులకు అప్పగించగా.. వరంగల్ పోతన శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. సింగరేణిలో నిందితుడు రాజు ఇంటిని కూల్చేస్తున్న స్థానికులు మృతదేహాన్ని చూస్తేగానీ నమ్మం హత్యాచార నిందితుడు రాజు చనిపోయాడని చెప్తే నమ్మబోమని.. మృతదేహాన్ని తాము కళ్లారా చూస్తేనే నమ్ముతామని బాలిక తల్లిదండ్రులు సభావత్ రాజు, జ్యోతి అన్నారు. గురువారం సింగరేణికాలనీలోని నివాసంలో వారు మాట్లాడారు. ముఖం గుర్తుపట్టకుండా ఉన్న మృతదేహం రాజు అని ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు. మృతదేహాన్ని సింగరేణికాలనీకి తేవాలని, తాము చూసి నిర్ధారించుకుంటామని డిమాండ్ చేశారు. కాగా.. రైలు పట్టాలపై రాజు మృతదేహం కనిపించిందన్న వార్తలు తెలిశాక.. సింగరేణికాలనీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హత్యాచార ఘటన జరిగినప్పుడు నిందితుడు రాజు ఇంటిని కొంతమేర కూల్చిన స్థానికులు.. గురువారం మరోసారి ఇంటిపై దాడిచేసి కూల్చారు. రాజు మృతదేహాన్ని సింగరేణికాలనీకి తేవాలని డిమాండ్ చేశారు. -
Saidabad incident: ఇంకా దొరకని కామాంధుడు..
-
సైదాబాద్ అత్యాచార కేసు: ఆచూకీ చెప్తే రూ. 10 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ఆరేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు రాజు ఆచూకీ చెబితే రూ.10 లక్షల రివార్డు ఇస్తామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం ప్రకటించారు. నిందితుడి ఫొటో, ఆనవాళ్లను విడుదల చేశారు. అతని ఆచూకీ తెలియజేయాలనుకొనేవారు ఈస్ట్‌జోన్ డీసీపీకి 9490616366 లేదా టాస్క్‌ఫోర్స్ డీసీపీకి 9490616627 ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కేసు దర్యాప్తు తీరుతెన్నులపై అంజనీకుమార్ మంగళవారం సమీక్షించారు. నిందితుడిపై రివార్డు ప్రకటన నేపథ్యంలో సైబరాబాద్, రాచకొండ పోలీసులూ రంగంలోకి దిగారు. మొత్తం పది బృందాలు క్షేత్రస్థాయిలో గాలిస్తుండగా మూడు కమిషనరేట్లకు చెందిన ఐటీ సెల్స్ సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. రాజు సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉండటంతో ఆచూకీ కనిపెట్టడం జటిలంగా మారిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు అతడి ఫొటోతోపాటు వివరాలనూ పంపినట్లు ఆయన తెలిపారు. రాజు మద్యం మత్తులో వైన్ షాపులు, ఫుట్‌పాత్‌లు, నిర్మానుష్య ప్రాంతాల్లోనే తలదాచుకుంటూ ఉండేవాడని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ దారుణం అనంతరం రాజు పారిపోవడానికి అతని స్నేహితుడు సహకరించినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించిన పోలీసులు సోమవారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నిందితుడి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరుగా పోలీసులు చెబుతున్నారు. వ్యసనాలు, చిల్లర దొంగతనాలకు అలవాటుపడి జులాయిగా తిరుగుతున్న రాజుకు అతని కుటుంబం దూరంగా ఉంటోంది. భార్య కూడా అతన్ని వదిలేసింది. అందుకే అతని కుటుంబీకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇవీ రాజు ఆనవాళ్లు... ►30 ఏళ్ల వయస్సు, ముఖానికి గడ్డం ►దాదాపు 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు ►రబ్బర్ బ్యాండ్‌తో బిగించి ఉండే పొడువాటి జుట్టు ►తలపై టోపీ, మెడలో ఎర్రటి స్కార్ఫ్ ►రెండు చేతుల మీదా మౌనిక అనే పేరు పచ్చబొట్టు -
‘చిట్‌ఫండ్’ దాడి కేసులో గాయపడిన వ్యక్తి మృతి
వరంగల్ క్రైం: హనుమకొండలో పెట్రోల్ దాడికి గురైన సెల్‌ఫోన్ షాపు నిర్వాహకుడు పిట్టల రాజు (28) చికిత్స పొందు తూ బుధవారం సాయంత్రం మృతిచెందాడు. నగరంలోని అచల చిట్‌ఫండ్‌లో ఏజెంట్‌గా పనిచేస్తున్న గొడుగు గణేష్ అతని భార్య కావ్యలు క్షణికావేశంతో ఈనెల 3న రాజుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. తీవ్రగాయాలతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రాజు ఆరు రోజులుగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. టేకుమట్ల మండలం పంగిడిపల్లికి చెందిన పిట్టల రాజు, చిట్యాల మండలం నైన్‌పాకకు చెందిన గొడుగు గణేష్ స్నేహితులు. రాజు సెల్‌ఫోన్ బిజినెస్‌లో ఎదుగుతున్న క్రమంలో, గణేశ్ అచల చిట్‌ఫండ్‌లో ఏజెంట్‌గా చేరి రాజు చేత రూ.5 లక్షల చీటీ వేయించాడు. చీటీ ఎత్తుకున్న తరువాత సకాలంలో డబ్బులు కట్టకపోవడంతో రాజు, గణేష్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ఈ గొడవ ముదిరి గణేశ్ అతని భార్య కావ్య రాజుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. -
NED క్యాప్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కేకే రాజు
-
వండ్రంగి పని చేస్తూ.. హిందీ కంటెంట్ కింగ్ అయ్యాడు
డాక్టర్‌ను కాబోయి యాక్టర్నయా అంటుంటారు కొందరు నటులు. అలాగే 22 ఏళ్ల రాజు జంగిడ్ కార్పెంటర్‌గా కెరీర్ మొదలుపెట్టి వికీపీడియా కంటెంట్ సమీక్షకుడుగా ఎదిగాడు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా థడియా అనే కుగ్రామంలో పేదరికంలో జన్మించిన రాజు చదువుకుంటూనే వండ్రంగి (కార్పెంటర్) పనిచేసేవాడు. ఇటుపని అటు చదువుతోపాటు రాజుకు వికీపీడియాలో ఆర్టికల్స్ చదవడం ఒక అలవాటుగా ఉండేది. దీంతో తనకు దేనిగురించైనా సమాచారం కావాలంటే వెంటనే వికీమీద పడిపోయేవాడు. అయితే తన మాతృభాష హిందీ కావడంతో హిందీలోనే కంటెంట్‌ను వెతికేవాడు. ఈ క్రమంలోనే ఒకసారి తన గ్రామం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల గురించి వికీలో వెతకగా ఎక్కడా సమాచారం దొరకలేదు. రాజ్యభాష అయిన హిందీలో సమాచారం ఎక్కువగా లేకపోవడం ఏంటీ అనుకుని.. వికీలో హిందీ భాషలో మరింత సమాచారం అందుబాటులో ఉండాలని భావించి వికిపీడియా వలంటీర్‌గా చేరి హిందీలో ఆర్టికల్స్ రాయడం మొదలుపెట్టాడు. అలా తాను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే కంటెంట్ రైటర్‌గా మారాడు. అలా రాసే క్రమంలో తన ఊరి చుట్టుపక్కల సమాచారాన్ని అక్కడి అధికారులతో మాట్లాడి వికీపీడియాలో పోస్ట్ చేసేవాడు. రాజు పదో తరగతి పూర్తయినా తన ఆర్థిక పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు రాలేదు. దీంతో చదువు మానేసి వడ్రంగి పనిలో చేరాడు. పనిచేస్తూనే వీలు దొరికినప్పుడల్లా వికీ ఆర్టికల్స్‌ను రాస్తూ, పేజీలను ఎడిట్ చేసేవాడు. రాజు పనితనం నచ్చడంతో తన పరిస్థితి తెలుసుకున్న వికీపీడియా నిర్వాహకులు అతడికి ల్యాప్‌టాప్‌ను గిఫ్ట్‌గా ఇస్తూ ఫ్రీ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అందించారు. ఇక అప్పటినుంచి రాజు హైక్వాలిటీ కంటెంట్ ఇవ్వడంతోపాటు వికీపీడియా ఎడిటర్‌గా ఎన్నో సైబర్ కాన్ఫరెన్స్‌లకు హాజరయ్యాడు. ఇప్పటిదాక రాజు 57 వేల వికీపీడియా పేజీలను ఎడిట్ చేయడంతోపాటు 1,880 ఆర్టికల్స్‌ను రాశాడు. మనలో ఎన్ని నైపుణ్యాలున్నా పరిస్థితులతో పోరాడకపోతే గెలవలేమని చెబుతున్నాడు రాజు. ‘2013, 2014 సంవత్సరాలలో వికీలో ఆర్టికల్స్‌ను అప్లోడ్ చేసేవాడిని. కానీ వికీ అడ్మిన్లు నా ఆర్టికల్స్‌ను బ్లాక్ చేసేవాళ్లు. అలా ఎన్నోసార్లు జరిగిన తరువాత.. అసలు వికీవాళ్లు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని అవి మాత్రమే అప్లోడ్ చేసేవాడిని. ప్రారంభంలో స్మార్ట్‌ఫోన్ ద్వారా 150 నుంచి 200 పదాల ఆర్టికల్స్‌ను రాసేవాడిని. అయితే కీబోర్డు చాలా కష్టంగా అనిపించేది. ఆ తరువాత ల్యాప్‌టాప్ రావడంతో 400 పదాలకు పైగా ఆర్టికల్స్‌ను రాయగలిగాన’ని రాజు చెప్పాడు. 2017లో కార్పెంటర్ ఉద్యోగం మానేసిన రాజు మధ్యలో ఆగిపోయిన తన చదువును కొనసాగించి బిఏ డిగ్రీ పట్టాపుచ్చుకున్నాడు. సైబర్ ఎడిటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం వికీ స్పెషల్ ప్రాజెక్ట్ ‘వికీ స్వస్థ’కు పనిచేస్తున్నాడు. ఇందులో హెల్త్ రిలేటెడ్ ఆర్టికల్స్ రాస్తూనే ఇతర రంగాలకు చెందిన ఆర్టికల్స్ ను అందిస్తున్నాడు. హిందీలో వికీ క్రికెట్ ప్రాజెక్ట్ ప్రారంభించి 700 ఆర్టికల్స్‌ను కంట్రిబ్యూట్ చేశాడు. హిందీలో క్రికెట్‌కు సంబంధించిన ఆర్టికల్స్ తక్కువగా ఉండటంతో మంచి సమాచారం అందిస్తున్న ఈ ప్రాజెక్టు సక్సెస్ అయింది. కాగా ఇండియాలో హిందీ వికీలో మొత్తం 11 మంది మాత్రమే యాక్టివ్ కంట్రిబ్యూటర్లుగా ఉన్నారు. వీరిలో రాజు ఒకడు కావడం విశేషం. -
బాగున్నావా కేకే.. సీఎం జగన్ ఆత్మీయ పలకరింపు
సాక్షి, విశాఖపట్నం : ‘కేకే.. హౌ ఆర్ యూ.. అంతా ఓకే కదా...’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజుని ఆప్యాయంగా పలకరించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పునాదిపాడులో గురువారం నిర్వహించిన ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం కేకే రాజు ముఖ్యమంత్రి వెంటే ఉన్నారు. ఈ సందర్భంగా కేకే రాజుని సీఎం ఆత్మీయంగా పలకరించారు. ఎలా ఉన్నారంటూ కుశల ప్రశ్నలు వేశారు. కుటుంబసభ్యుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. (ఇది మీ మేనమామ ప్రభుత్వం) -
టిక్‌టాక్ సింగర్ రాజు ఆత్మహత్య
-
టిక్‌టాక్ సింగర్ రాజు ఆత్మహత్య
సాక్షి, సిద్దిపేట : టిక్‌టాక్ పాటలతో మంచి గుర్తింపు పొందిన సిద్దిపేటకు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని కోడూరు మండలం గంగాపూర్ గ్రామానికి గడ్డం రాజు వ్యవసాయం పొలం వద్ద ఆదివారం ఉదయం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘అక్క రాఖీతో ఇంటికి వస్తే ఇక లేడని ఇక రాడాని చెప్పుమ్మ’ అనే పాటతో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సాధించాడు. అలాంటి వ్యక్తి రాఖీ పండగ ముందు రోజు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజు మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అతని మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరకుని వివరాలను సేకరిస్తున్నారు. కాగా సింగర్ రాజు గతంలో పాడిన పాటు టిక్‌టాక్‌లో పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి. అతని ఆత్మహత్య విషయం తెలిసిన ఫాలోవర్స్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ జన్యువే కాపాడుతుందేమో?
యువత ఎక్కువగా ఉండటం, దేశంలోని శీతోష్ణ పరిస్థితులే కాకుండా జన్యుపరంగా మనకున్న బలమే దేశాన్ని కరోనా వైరస్ నుంచి కాపాడుతోందని అంటున్నారు ప్రముఖ శ్వాసకోశ వ్యాధి నిపుణుడు డాక్టర్ సీహెచ్ రాజు. ఈ జన్యువే కరోనా వైరస్‌ను భారతీయుల శరీరాల్లోకి చొరబడి విధ్వంసం చేయనీయకుండా అడ్డుకుంటోందనే వాదన వైద్య వర్గాల్లో ఉందని, అయితే ఇది శాస్త్రీయంగా నిరూపితం కావాల్సి ఉందని చెప్పారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే దేశంలో లాక్డౌన్ బాగా అమలవుతోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని అభిప్రాయపడ్డారు. ఇదే స్ఫూర్తిని ప్రజలు కొనసాగిస్తే దేశంలో జూన్ కల్లా కరోనా మహమ్మరి ఓ కొలిక్కి వస్తుందంటున్న డాక్టర్ రాజు గురువారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. ఈ అసోసియేట్ ప్రొఫెసర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ముందు ఊపిరితిత్తులపైనే.. కరోనా వైరస్ మనిషి శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుంది. ఇదే కాదు ఫ్లూ సంబంధిత వైరస్‌లన్నీ తొలుత ప్రభావం చూపేది ఊపిరితిత్తులపైనే. ఊపిరితిత్తుల్లో ఈ వైరస్ పొదిగి ఆ తర్వాత వ్యాప్తి చెందిన తర్వాత ద్రవంలాగా పేరుకుపోయి న్యుమోనియాకు దారి తీస్తుంది. ఆ తర్వాత ఇది అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుంది. దీనికి శాస్త్రీయత లేదు.. మానవ శరీరానికి ఫ్లూ సోకినప్పుడు తీవ్రమైన జ్వరం, దగ్గు రావడం సర్వసాధారణం. మనం డెంగీ, వైరల్ జ్వరాల విషయంలో కూడా ఇదే గమనించాం. 3, 4 రోజుల పాటు తీవ్ర జ్వరం వస్తుంది. ఇది సాధారణ లక్షణమే. ఈ వైరస్‌ను చంపేందుకు శరీరం జ్వరం బారిన పడుతుందన్నది వాస్తవం కాదు. శరీరం ప్రతిస్పందించే తీరు అలానే ఉంటుంది. కానీ జ్వరంతో వైరస్లు చనిపోవు. దీనికి ఎలాంటి శాస్త్రీయత లేదు. ప్రిస్క్రిప్షన్ లేదు.. ఈ వైరస్ నియంత్రణకు ఫిజికల్ డిస్టెన్స్ (భౌతిక దూరం) తప్ప ప్రిస్క్రిప్షన్ (మందులు) లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నది హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఒక్కటే. అది కూడా వైరల్ యాక్టివిటీని మాత్రమే కంట్రోల్ చేస్తుంది. స్వైన్‌ఫ్లూ లాగా దీనికి ఫలానా మందు అనేది ఇంకా రాలేదు. అయితే, కరోనా పాజిటివ్ వచ్చిన వారికి నెగెటివ్ ఎలా వస్తుంది.. వైరస్ చనిపోతేనే కదా నెగెటివ్ వచ్చేది.. అనే సందేహం వస్తుంది. 2 రకాల యాంటీబాడీలుంటాయి.. ఈ వైరస్ పొదిగే కాలం అయిపోయిన తర్వాత శరీరంలోని ఇమ్యూనోగ్లాబ్యూల్స్ పెరగటంద్వారా వైరల్ లోడ్ తగ్గిపోతుంది. అప్పుడు యాంటీ వైరల్ డ్రగ్స్ వాడటం వలన ఐజీ–జీ, ఐజీ–ఎం అనే రెండు రకాల యాంటీబాడీలు శరీరంలో వేగంగా, నెమ్మదిగా రెండు పద్ధతుల్లో రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేస్తాయి. అప్పుడు పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు నెగెటివ్ వస్తుంది. వైరల్ యాక్టివిటీ మాత్రమే కంట్రోల్ అవుతుంది. పొదిగే కాలం అయిపోతుంది కనుక మళ్లీ ఆ వైరస్ శరీరంలో వృద్ధి చెందే అవకాశం ఉండదు. మన జనాభాకు, కేసులకు పొంతన లేదు మన దేశంలో ఈ వైరస్ వ్యాప్తి, నియంత్రణను వివిధ కోణాల్లో చూడాల్సి వస్తుంది. వాస్తవానికి, మన దేశ జనాభాకు, నమోదవుతున్న కేసులకు పొంతన లేదు. అదే పాశ్చాత్య దేశాల్లో తక్కువ జనాభా ఉన్నా వైరస్ సోకడం, సంక్రమణ భారీగా ఉంటోంది. మరణాలు కూడా అంతే ఉన్నాయి. కానీ, పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన ప్రభుత్వాలు మంచి చర్యలు తీసుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ను మన ప్రజలు చాలా వినమ్రంగా పాటిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అమెరికా లాంటి దేశాల్లో లాక్డౌన్ విధించేందుకు భయపడుతున్నారు. సింగపూర్‌లో లాక్డౌన్ బాగా అమలైంది. చైనాలో ఇంకా పటిష్టంగా అమలు చేశారు. మన దగ్గర కూడా బాగా అమలవుతోంది. ఇదే స్ఫూర్తి కొనసాగితే జూన్ మాసం కల్లా కొలిక్కి రావచ్చు. వృద్ధులూ.. జర జాగ్రత్త! పరిస్థితి ఎలా ఉన్నా.. ఎప్పటికి అదుపులోకి వచ్చినా వయసు మీద పడిన వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు 50 దాటిన వాళ్లు బయటకు రాకపోవడమే మంచిది. కుటుంబసభ్యుల్లో ఎవరికైనా కొంచెం జలుబున్నా వారి దగ్గరకు కూడా వెళ్లొద్దు. వాస్తవానికి వైరస్ సోకిన వారే మాస్కులు పెట్టుకోవాలి కానీ, వృద్ధులు కచ్చితంగా మాస్కులు పెట్టుకుంటేనే మంచిది. మాస్క్ ఏదైనా ఫర్వాలేదు.. మంచి కర్చీఫ్ కట్టుకున్నా ఓకే. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో వైరల్ లోడ్ పెరుగుతోంది కాబట్టి ఇప్పుడే అందరూ జాగ్రత్తగా ఉండాలి. చేతులు కడుక్కోవడం, మనం తరచూ ముట్టుకునే ప్రదేశాల పట్ల అప్రమత్తంగా ఉండటం శ్రేయస్కరం. ఇక పాల ప్యాకెట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి నేరుగా మన ఇంట్లోకి వైరస్ తీసుకొచ్చే ప్రమాదముంది. పాల ప్యాకెట్లు తీసుకున్న తర్వాత మీ చేతులతో పాటు వాటిని కూడా శుభ్రంగా కడగండి. 2 గంటల తర్వాతే మళ్లీ వాటిని ముట్టుకోండి. గాలి ద్వారా ఈ వైరస్ సోకే అవకాశం లేదు. ఈ వాదనలో కూడా శాస్త్రీయత లేకపోయినా గాలి ద్వారా వ్యాపించే అవకాశం ఉంటే దేశం పరిస్థితి ఇలా ఉండేది కాదు. కేవలం తుంపర్ల ద్వారా ఇది సంక్రమిస్తుంది. వాటిని నియంత్రించగలిగితే చాలు. హోం రెమెడీస్ ఉన్నాయ్ ఈ వైరస్ సోకకుండా రోగనిరోధక శక్తి పెంచుకునే అవకాశం లేదు. కానీ, శరీరంలోని యాంటీబాడీస్ వృద్ధికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. విటమిన్ సీ ఉన్న పదార్థాలు తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం, జింక్ సప్లిమెంట్స్ తీసుకోవడం లాంటివి ఉన్నాయి. కానీ, ఈ వైరస్ సోకడంపై శారీరక ఉత్సుకత అవసరం లేదు. అలా యాంగ్జైటీకి గురైన వారు ఈ వైరస్ బారిన పడే అవకాశమూ లేకపోలేదు. తినకుండా, నిద్రపోకుండా వైరస్ గురించే ఆలోచించడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. తద్వారా ఏ చిన్న అవకాశం ఉన్నా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. భారతీయుల సంజీవని అదేనేమో? ఇప్పుడు మనదేశంలో దీనిపైనే పరిశోధనలు ప్రారంభించా రు. పాజిటివ్ వచ్చి చికిత్స తీసుకున్న అనంతరం నెగెటివ్ వచ్చిన వారి సీరమ్‌పై ఈ పరిశోధన లు బెంగళూరులో ప్రారంభమయ్యాయని వార్తలు వస్తున్నా యి. ఈ వ్యక్తుల సీరమ్‌ను ప్లాస్మా థెరపీ చేస్తే ప్రయోజనం ఉంటుందని నా అభిప్రాయం. దేశంలో యువత ఎక్కువగా ఉండటం, వెచ్చని వాతావరణం వల్ల కరోనా బాధితులు, మృతుల సంఖ్య తక్కువేననే వాదన ఉంది. దీన్ని కాదనలేం.. ఎందుకంటే ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాల్లో వృద్ధులు ఎక్కువగా ఉండటంతో పాటు చల్లని వాతావరణం కూడా తోడవ్వడంతో ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇక దేశంలో ఉన్న వేడి వాతావరణానికి వైరస్ వ్యాప్తి చెందొద్దు. కానీ, రోజు రోజుకూ పాజిటివ్ కేసు లు పెరుగుతున్నాయి. అలాగని వెచ్చని వాతావరణం నియంత్రించడం లేదని అనలేం. కానీ, మనలోని ఒక జన్యువు కరోనా వైరస్‌పై భీకర యుద్ధం చేస్తోందేమో అనిపిస్తోంది. భారతీయుల జన్యుశైలే మనల్ని కాపాడుతుందేమో. జిట్చఝజీఖ27ఆ అనే జన్యువు కారణంగానే కరోనా వైరస్ భారతీయుల శరీరాలను ఛిద్రం చేయలేకపోతోందనే వాదన వైద్య వర్గాల్లో ఉంది. ఇది శాస్త్రీయంగా నిరూపించాల్సి ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే మలేరియా ప్రబలిన దేశాలు, ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందట్లేదు. ప్రపంచ గణాంకాలూ ఇదే చెబుతున్నాయి. మలేరియా వచ్చినప్పుడు క్లోరోక్విన్ వాడటం వల్లే కరోనాను నియంత్రించగలిగిన శక్తి వచ్చిందని వైద్య వర్గాలంటున్నాయి. మన దేశంలోనూ ఇదే పరి స్థితి ఉంది. -
గ్యాంగ్ వార్
సుదీప్, సందీప్, రాజు, సుస్మిత ముఖ్య తారలుగా ఆర్.ఎస్. సురేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆగ్రహం’. ఎస్ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకంపై సందీప్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ముంబైలో ఆవిష్కరించారు. ఆర్.ఎస్. సురేశ్ మాట్లాడుతూ– ‘‘రాజకీయ నేపథ్యంలో రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే గ్యాంగ్‌స్టర్ కథాంశమిది. ఇందులోని 5 ఫైట్స్ చాలా బాగుంటాయి. ‘ఆఫీసర్, సర్కార్ 3’ చిత్రాల సంగీత దర్శకుడు రవిశంకర్ అందించిన ఆర్ఆర్ మా సినిమాకి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ‘‘పూర్తి యాక్షన్ అంశాలున్న చిత్రమిది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆడారి మూర్తి నేతృత్వంలో ఈ చిత్రాన్ని చాలా ఫాస్ట్‌గా నిర్మించాం. జూలైలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు సందీప్ చెరుకూరి. మూర్తి ఆడారి, సంగీత దర్శకుడు రవి శంకర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. రామకృష్ణ. -
భార్యపై అనుమానం..కూతురి హత్య
తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటుచేసుకుంది. కన్న తండ్రే కూతురిపాలిట యముడయ్యాడు. భార్యపై అనుమానం పెంచుకుని కన్న కూతురిని హత్య చేశాడు. కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతానికి చెందిన రాజు స్థానికంగా నివాసం ఉంటూ కోనాపూర్‌లోని శ్రీ లక్ష్మీ నరసింహ పాలిష్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఆయనకు ఐదేళ్ల కూతురు ఉంది. ఇటీవల తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. కూతురు తనకు పుట్టలేదని అనుమానంతో ఆ చిన్నారిని చంపి సుద్ధగని గుంతలో పడేశాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాజకీయ నేపథ్యంలో...
సుదీప్, సందీప్, రాజు, సుస్మిత ముఖ్య తారలుగా ఆర్.ఎస్. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆగ్రహం’. ఎస్ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకంపై సందీప్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ జరుపుకుంటోంది. ఆర్.ఎస్.సురేష్ మాట్లాడుతూ– ‘‘రాజకీయ నేపథ్యంలో రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే కథాంశమిది. ‘ఆఫీసర్, సర్కార్ 3’ చిత్రాలకు సంగీతం అందించిన రవిశంకర్ ఆర్.ఆర్ స్వరాలు మా సినిమాకి ప్రధాన ఆకర్షణ. యాక్షన్ సన్నివేశాలు మరో హైలైట్’’ అన్నారు. ‘‘పూర్తి స్థాయి యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అడారి మూర్తి నేతృత్వంలో ఈ చిత్రాన్ని చాలా ఫాస్ట్‌గా తెరకెక్కించాం. ఏప్రిల్ నెలాఖరులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు సందీప్ చెరుకూరి. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. రామకృష్ణ. -
కర్నూల్: భార్యను చిత్రహింసలకు గురిచేసిన భర్త
-
భార్యపై అనుమానంతో వికృత చేష్టలు
సాక్షి, కర్నూల్: కర్నూల్ జిల్లా కృష్ణగిరి మండలంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్నఓ ప్రబుద్ధుడు ఆమెపై వికృత చేష్టలకు దిగాడు. ఈ సంఘటన గురువారం స్థానికంగా కలకలం రేగింది. కృష్ణగిరిలో నివాసముంటున్న రాజు అనే వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఆమె శరీర భాగాలపై కత్తితో దాడి చేసి, గాయాలపై కారం చల్లి.. చెప్పలేని రీతిలో ఆమెను నరకమాతనకు గురిచేశాడు. దీంతో భర్త పెట్టె హింసలను తట్టుకోలేక అతను ఇంట్లో లేని సమయంలో పారిపోయి వచ్చిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. భర్త రాజు కోసం గాలింపు చేపట్టారు. -
ఎవరెస్టంత ఎదిగారు
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాసంస్థల్లో చదువుకుంటున్న ఐదుగురు విద్యార్థులు గురువారం ఉదయం 4 గంటల నుంచి 7 గంటల మధ్య ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. మొత్తం 22 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లగా వారిలో ఒకరు విరమించుకున్నారు. మిగిలిన 21 మందిలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్న జె.ప్రవీణ్, కొత్తూరు గురుకులంలో చదువుతున్న పి.భానుసూర్యప్రకాష్, విశాఖపట్నం జిల్లా వెలుగొండ గురుకులంలో జూనియర్ ఎంపీసీ చదువుతున్న జి.రాజు, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీలోని నెల్లూరు జిల్లా చిట్టేడు గురుకులంలో సీనియర్ ఇంటర్ చదువుతున్న వెంకటేష్, తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల గురుకులంలో సీనియర్ ఇంటర్ చదువుతున్న ప్రసన్నకుమార్‌లు ఎవరెస్ట్‌ను అధిరోహించిన వారిలో ఉన్నారు. గతేడాది 9 మంది విద్యార్థులు ఈ రెండు విద్యా సంస్థల నుంచి ఎవరెస్ట్‌ను అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వీరు లడక్‌లో మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో శిక్షణ పొందారు. మూడు బృందాలుగా బయల్దేరిన వీరిలో మొదటి బృందం విజయం సాధించింది. రెండో బృందం ఈ నెల 19వ తేదీ ఎవరెస్ట్‌ను అధిరోహించనుంది. ఎవరెస్ట్‌ను అధిరోహించిన విద్యార్థులకు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు గురువారం అభినందనలు తెలిపారు. ఆత్మ విశ్వాసం పెరగాలి: సీఎం విద్యార్థులు శిఖరమంతటి ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన విద్యార్థులను అభినందిస్తూ గురువారం సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అత్యంత కఠినమైన శిక్షణను తట్టుకొని అనుకున్న గమ్యం చేరుకున్న విద్యార్థుల మనోస్థైర్యాన్ని సీఎం చంద్రబాబు కొనియాడారు. శిఖరారోహణ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, పట్టుదల, కష్టాలను తట్టుకునే ధృడత్వం అలవడుతుందన్నారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన శేఖర్‌బాబును, ఆయా శాఖల అధికారులను సీఎం అభినందించారు. మరిన్ని అధిరోహణలు సాధించాలి: వైఎస్ జగన్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని అధిరోహణలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం వైఎస్ జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. -
ఓడి గెలిచిన రాజు
ఒకప్పుడు అతనో చెస్ క్రీడాకారుడు. ఎత్తుకు పైఎత్తులు వేసి, ప్రత్యర్థులనుచిత్తు చేసి బంగారు పతకాలు కొల్లగొట్టాడు. అయితే తల్లిదండ్రులమరణంతో ఆయన జీవితం గాడితప్పింది. దురలవాట్లతో ఉద్యోగం పోయింది. తినడానికి లేకపోవడంతో యాచకుడిగా మారాడు. మళ్లీ ఇప్పుడు మామూలు మనిషిగా మారిన అతడు... చదరంగంలో ఎత్తులు వేసేందుకు సై అంటున్నాడు. అతడే ఎంవై రాజు. తార్నాక: తార్నాకలోని వినాయక దేవాలయంలో భిక్షాటన చేస్తూ జీవితం వెళ్లదీస్తున్న రాజును ‘సాక్షి’ గమనించింది. ఆయన పరిస్థితిపై ‘జీవన చదరంగంలో ఓడిపోయాడు’ శీర్షికతో ఆరు నెలల క్రితం కథనం ప్రచురించింది. అప్పటికే అతడు స్కీజోఫినియా వ్యాధితో బాధపడుతున్నాడు. కథనానికి స్పందించిన రాజు చిన్ననాటి స్నేహితులు, సోదరుడు.. ఆయనకు మంచి వైద్యం అందించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ప్రయత్నిస్తున్న తరుణంలో శంషాబాద్‌లోని ‘ఆశాజ్యోతి రిహాబిలిటేషన్’ కేంద్రం వైద్యులు డాక్టర్ జగన్నాథం ఉచితంగా వైద్యం అందించేందుకు ముందుకొచ్చారు. దీంతో రాజును అక్కడ చేర్పించగా మూడు నెలలు చికిత్స అందించారు. ఉచితంగానే భోజన సదుపాయాలు, మందులు అందజేశారు. రాజు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని, చెస్‌లో పాల్గొనేందుకు సిద్ధమని డాక్టర్ జగన్నాథం తెలిపారు. స్కీజోనిఫియా వ్యాధి పూర్తిగా నయమైందని, ఇక మామూలుగా మందులు వాడితే సరిపోతుందని చెప్పారు. ఆవాసం కోసంమిత్రుల ప్రయత్నం.. ఇంతకముందు వరకు దేవాలయంలోనే గడిపిన రాజుకు షెల్టర్ లేదు. ఇప్పుడు ఆయన ఉండేందుకు గదిని అద్దెకు తీసుకోవాలని మిత్రులు నిర్ణయించారు. అందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గది కోసం వెతుకుతున్నామని, దొరికిన వెంటనే కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసి.. అన్ని రకాలు సదుపాయాలు సమకూరుస్తామని రాజు మిత్రుడు గుమ్మడి విజయ్‌కుమార్ తెలిపారు. అన్ని సెట్ అయ్యాక రాజును డిశ్చార్జీ చేసి తీసుకెళ్తామన్నారు. ఇదీ నేపథ్యం.. రాజు 1969లో ఒంగోలులో జన్మించాడు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. రాజుకు చిన్నతనం నుంచి చదరంగం అంటే ఎంతో ఆసక్తి. ఆయన క్రీడాసక్తికి తండ్రి ప్రోత్సాహం తోడవడంతో జాతీయ స్థాయి క్రీడాకారుణిగా రాణించాడు. ఆ ప్రతిభతోనే 1998లో దక్షిణమధ్య రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. అయితే తల్లిదండ్రుల మరణంతో రాజు జీవితం మారిపోయింది. దురలవాట్లకు బానిసవడంతో అటు ఆట.. ఇటు ఉద్యోగం రెండింటికీ దూరమయ్యాడు. మానసిక వ్యాధితో బాధపడుతూ యాచకుడిగా మారాడు. ఉద్యోగం.. చదరంగం మిత్రుల సహకారంతో నేను కోల్పోయిన ఉద్యోగాన్ని తిరిగి సంపాదిస్తాను. ఉపాధి కోసం ఉద్యోగమైతే... నా ఆసక్తిని కొనసాగించేందుకు చదరంగం. మళ్లీ చెస్‌ను ప్రారంభిస్తాను. మంచి క్రీడాకారుడిగా రాణిస్తూ.. జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవాలనేదే నా ఆశయం. ఔత్సాహిక క్రీడాకారులకు నావంతుగా శిక్షణనిస్తాను. – ఎంవై రాజు -
గ్యాంగ్ వార్
‘మంగళ’, ‘క్రిమినల్స్’ వంటి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతోన్న మరో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వెపన్’. అవినాష్, ప్రదీప్ రావత్, రాజారాయ్, రాజు, మధుబాబు ప్రధాన పాత్రల్లో ఆర్.ఎస్.సురేష్ దర్శకత్వంలో శర్మ చుక్కా నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ మార్చి 20న మొదలవుతుంది. శర్మ చుక్కా మాట్లాడుతూ– ‘‘రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే వార్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. టైటిల్‌కి పూర్తి జస్టిఫికేషన్ ఇచ్చే కథాంశంతో మా సినిమా ఉంటుంది. మా బ్యానర్లో వచ్చిన ‘మంగళ, క్రిమినల్స్’ చిత్రాల కంటే ‘వెపన్’ మంచి విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పగలను. 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సబ్బారపు ప్రకాష్. -
నా ప్రేమ నువ్వేనా
వాస్దేవ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘నాలో ప్రేమ నువ్వేనా’. జై చిరంజీవ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా లోగోని సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు ఆవిష్కరించి, బెస్ట్ విషెష్ చెప్పారు. వాసుదేవ్ మాట్లాడుతూ –‘‘న్యూ ఏజ్ అండ్ డిఫరెంట్ లవ్‌స్టోరీతో తెరకెక్కిన సినిమా ఇది. త్వరలోనే పాటలను విడుదల చేసి, సమ్మర్లో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు. రాశీ సైనా, సంజయ్ శివలింగమ్, రాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అర్జున్. -
అందరి మంచినీ కోరిన అక్షరం
సందర్భం మనిషి అంతరంగం, క్లిష్ట సమయాలలో చేసే పోరాటమే కాదు, అప్పుడు తోటివారి విషయంలో ఉండవలసిన మానవతా స్పర్శనే మునిపల్లె రాజు తన కథలకి వస్తువుగా ఎంచుకున్నారు. ఆయన అందరి మంచిని కోరే మానవతావాది. కల్మషం, మర్మం, లౌక్యం వంటివాటికి ఎంతో దూరంగా ఉండే ఆధునిక ముని మునిపల్లె రాజు. గతం, వర్తమానాలను సమంగా మేళవించుకోగలిగిన విశిష్ట వ్యక్తిత్వం ఆయనది. ఆయన రచనలు ఆ వ్యక్తిత్వాన్నే ప్రతిబింబించాయి. మృదు స్వభావం, విస్తృత పఠనంతో అబ్బిన అవగాహన, ఎదుటివారిని మెప్పించడానికి కాకుండా, జీవితాన్ని మెప్పించడానికి అనవరత తపన– వెరసి మునిపల్లె రాజు. కవిత్వం, సమీక్ష, నవల– ఇలా వివిధ ప్రక్రియలు చేపట్టినా, ఆయన ప్రధానంగా కథకుడు. మంచితనం వైపు, ఉత్తముల వైపు, ఆదర్శం వైపు మొగ్గు చూపే రచయితలు ఎక్కువే. బలహీనుల పట్ల సానుభూతి కలిగిన వారూ ఉంటారు. కానీ మునిపల్లె రాజు మాత్రం అందరి మంచిని కోరే మానవతావాది. ఒకరకంగా మనిషితనం పట్ల, మంచి జీవితం పట్ల ఆయనది అత్యాశ. కానీ అభిప్రాయాల దగ్గర మాత్రం నిర్మొహమాటి. మునిపల్లె రాజు (16.3.1925–24.2.2018) గుంటూరు జిల్లా గరికపాడులో పుట్టారు. తండ్రి హను మంతరావు, తల్లి శారదాంబ. 1943 నుంచి 1983 వరకు నాలుగు దశాబ్దాల పాటు ఆయన భారత రక్షణ శాఖలో వివిధ హోదాలలో పనిచేశారు. పదవీ విరమ ణానంతరం సికింద్రాబాద్‌లో స్థిరపడ్డారు. అయితే ఈ ప్రస్థానంలో చాలా ఎగుడుదిగుళ్లు ఉన్నాయి. అవి ఆయన మాటల్లోనే: ‘మా పూర్వీకులది గుంటూరు జిల్లా మునిపల్లె. కలకత్తా–మద్రాసు ట్రంక్ రోడ్ పక్కనే ఉండడం వల్ల కొంత నాగరికత సంత రించు కున్న గ్రామం. నా జననం రెండు ప్రపంచ సం గ్రామాల మధ్య నెలకొన్న ఆర్థిక మాంద్య దశ లో–హంగ్రీ థర్టీస్ అనబడే 1925లో. మా తరాన్ని ఊండెడ్ జనరేషన్ అని చరిత్ర పేర్కొంటున్నది. ఆ తర్వాత మా కుటుంబం దగ్గర్లోనే ఉన్న తెనాలి పట్టణానికి తరలిపోయింది. అదొక సాంస్కృతిక కేంద్రం. దానితోడు మా కుటుంబంలో రాజకీయ చైతన్యం, పుస్తక పఠనం, సామాజిక సంస్కరణల పట్ల గాఢా నురక్తి ఉండడంతో నేను ఆ దిశలోనే పయనించాను. అన్ని భావధారలకీ సంబంధించిన ఏదో ఒకరకం చర్చ నిత్యం మా ఇంట్లో జరుగుతూ ఉండేది. అది వినడం, విశ్లేషించి జీర్ణించుకోవడం నాకు అలవడ్డాయి. మా నాన్నగారి హఠాన్మరణం తదుపరి మా పేదరికం వల్ల చిన్న ఉద్యోగం చూసుకుని, ఆ ఉద్యోగ రీత్యానే దేశాటనం చేశాను. భారత దేశపు బహుళత్వంలోని ఏకత్వం అనుభవంలోకి రావడం ఈ దేశాటనం వల్లనే. మొదట్లో కవిత్వ ధోరణి ప్రబలంగా ఉన్నా, కాల్పనిక సాహిత్యంలో వచన ప్రక్రియలందే మనసు లగ్నమైంది. నా విద్యార్థి దశలో అబ్బిన రచనా వ్యాసంగం– ఇప్పటికీ నన్ను సమ్మోహితుడిని చేస్తుంది. కొత్తగా కలం పట్టిన యువకుల వ్యక్తీకరణను ప్రోత్సహించడం నాకెంతో ఆనందం. రష్యన్ మాస్టర్ల సాహిత్యం వల్ల అన్ని వాదాల కన్నా, మానవతావాదమే నన్ను ఆకర్షించింది. నా రచ నలన్నింటిలో అది ప్రతిఫలిస్తుందని నా విశ్వాసం.’ రాజుగారి కథలు జీవితంలోని దయనీయ కోణంతో పాటు, ఔదార్యాన్ని కూడా చూపించి సమాజం పట్ల సానుకూలతను పెంచుతాయి. మనిషి అంతరంగం, క్లిష్ట సమయాలలో చేసే పోరాటమే కాదు, అప్పుడు తోటివారి విషయంలో ఉండవలసిన మానవతా స్పర్శనే మునిపల్లె రాజు తన కథలకి వస్తువుగా ఎంచుకున్నారు. వారాలు చేసుకుని చదువు కోవడం కొంతమంది పేద పిల్లల జీవిత దృశ్యమే కాదు, మరికొందరి ఔదార్యానికీ అనురాగానికీ ప్రతి రూపం. ఇలాంటి వారాల పిల్లలు రాజుగారి కథలలో కనిపిస్తారు. ఆయన ‘వారాలబ్బాయి’ కథ ప్రత్యేకమై నది. ఊరు మంచినే తన మేలుగా భావించే ముదు సలి శేషమ్మ జీవితంలో అన్ని బాధలనీ భరిస్తూ తల్లిగా తన బాధ్యతకే అంకితమైన జానకమ్మ, జీవితపు విలు వని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని తెలిపే దొడ్డమ్మ.. ఇలా రాజుగారి కథలలో ఎన్నెన్నో పాత్రలు. రాజుగారు రాసిన ఒకే ఒక నవల ‘పూజారి’ (1952). బీఎన్ రెడ్డి నిర్మించిన ‘పూజాఫలం’ చిత్రా నికి ఇదే మాతృక. ఈ నవలారంభమే గాఢమైనది. రచయిత తాత్వికత, అంతర్దృష్టి ఎలాంటివో తెలి యచేసే ఆరంభమది. ఒక ఊరిలో ఒక పార్క్ దగ్గర నవల ఆరంభమవుతుంది. అది ఆలనా పాలనా లేనట్టే ఉన్నా, నిరుపయోగంగా లేదు. అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వినియోగించుకుంటున్నారు. నవలా నాయకుడు మధు పరిచయం ఈ అంశం ద్వారా చెప్పారు రచయిత. మధు పెద్ద జమీకి వార సుడు. తల్లీతండ్రీ మరణించడంతో తాతగారి సంరక్షణలో ఉన్నాడు. కానీ క్షయ వ్యాధి సోకి, మద నపల్లి శానెటోరియంలో ఉంటున్నాడు. అన్నీ ఉన్నా ఉత్సాహం లేదు. అందుకే ‘నిరాశా వేదాంతి’ అతడు. కానీ ఇలాంటి జీవితంలోనూ రెండు మంచి అలవాట్లు అతడికి ఉన్నాయి. ఒకటి సంగీతం పట్ల మక్కువ. రెండు క్రమం తప్పకుండా కళాశాలకు వెళ్లడం. తోడు గా ఉండేందుకు ఇంటి కింది భాగం అద్దెకు ఇచ్చారు. వీరి అమ్మాయే ప్రీతి. ఆమె రాక మధుకు అనూహ్య అనుభవం. కళాశాలలో పరిచయమైన శ్రీరాం కూడా మధుకు ఇష్టమే. వాళ్లిద్దరిలో మధుకి నచ్చిన అంశం ఆశ, ఆత్మబలం. కానీ ప్రీతి ఎలా వచ్చిందో అలాగే నిష్క్రమించింది. కానీ జమీ గుమాస్తా రామకృష్ణయ్య కూతురు సుశీల మధునీ, జమీని ఒక క్లిష్ట పరిస్థితి నుంచి రక్షిస్తుంది. ఈ క్రమంలో మధు, సుశీల దగ్గర వుతారు. డిఫాటిజమ్ – అపరాధ భావం అన్నది ఓ మానసిక శాఖ. దానికి ప్రతిరూపంగా మధు పాత్రని నిర్మించారు మునిపల్లె రాజు. మంచి రచయిత కాలం కన్నా ఒక్క అడుగైనా ముందే ఉండి ఆలో చిస్తాడు. అందుకు పూజారి నవల మంచి ఉదాహరణ. నిజా నికి ఎల్లలు ఎరుగని ఆలోచన ఆయనది. వి.రాజారామ మోహనరావు (వ్యాసకర్త ప్రముఖ రచయిత 91105 32710) -
దారి వెతుక్కుంటూ ఓ నిరంతర బాటసారి
నివాళి 24 ఫిబ్రవరి 2018. యీరోజు గూడా యెప్పటిలాగే తెల్లవారింది. పదకొండు గంటల ప్రాంతంలో వాట్సాప్‌లో సాహితీ మిత్రుడొకరు మునిపల్లె రాజుగారి ఫొటో పెట్టి కింద ‘నివాళి’ అని రాశాడు. సాదాసీదాగా తెల్లవారిన యీరోజు వొక్కసారిగా సాహిత్య అస్తిత్వాన్నంతా వూపి పారేసింది. యేనాటి మునిపల్లె రాజు గారు? రెండు నెలల క్రితం ఇచ్ఛాపురం జగన్నా«థరావు గారు. యిప్పుడు మునిపల్లె రాజు గారు. తెలుగు కథ రెండో దశలో, దాన్ని అత్యున్నత శిఖరాలకెక్కించిన మహా రచయితలు క్రమంగా నిష్క్రమిస్తున్నారు. 93 సంవత్సరాల నిండైన జీవితం గడిపిన వ్యక్తి మరణించినప్పుడిలా మనస్సు కలగుండు పడిన చెరువులా అలజడి చెందుతోందెందుకు? మరణం సహజమేనని తెలిసినా, ప్రతిరోజూ రకరకాల జీవన పరిణామాలను గమనిస్తూనేవున్నా, కొందరు వ్యక్తులు మరణించినా వాళ్ళ స్ఫూర్తి వాళ్ళు చేసిన పనిలో సజీవంగానే వుండిపోతుందన్న నమ్మకం కలిగినా, యింకా యీ ఆందోళన యెందుకు తగ్గదు? ఆరడుగుల నల్లటి చేవ బారిన శరీరం, పొడవెంతో కన్పించేలా మాత్రమే పెరిగిన ఆకారం, తలపైన వయస్సును తెలిపే తెల్లటి వెంట్రుకలు, తనవి గావనిపించే పాంటూ షర్టూ, ఆ పైన అప్పుడప్పుడూ పాత మిలిటరీదేమోననిపించే స్వెట్టరూ, దేనిపైనా నిలవని చూపులు, నిద్రలోనే నడచి వస్తున్నాడేమోననిపించే వ్యక్తి, పలకరిస్తే వులిక్కిపడి తిరిగి చూడటం, అప్పుడే నిద్ర మేల్కొని చూస్తున్నట్టుగా వుండే వైనం... గుర్తించినట్టుగా నవ్వే నవ్వు... జీవితానుభవాల్ని నిరూపిస్తున్నట్టుగా మిగిలిన కొన్ని పళ్లు... ఆ వ్యక్తిని నేను 1993 లేకపోతే 94 ప్రాంతాల్లో మొదటిసారిగా చూశాను. చివరిసారిగా, రెండేళ్ల క్రితం, యేదో సాహితీసభకు వచ్చినప్పుడూ అలాగే కనిపించాడాయన. మునిపల్లె రాజు చిత్రమైన వ్యక్తి. పదిమందిలో పెద్దగా మాట్లాడరు. పరిచయం కుదిరిన వ్యక్తితో మాట్లాడటం మొదలుపెడితే ఆపరు. ఆయన మాట్లాడుతూంటే ఆ వ్యక్తే ‘వీరకుంకుమ’, ‘బిచ్చగాళ్ల జెండా’, ‘అరణ్యంలో మానవ యంత్రం’, ‘వారాల పిల్లాడు’ మొదలైన గొప్ప కథలు రాసిన వ్యక్తని గుర్తుకు తెచ్చుకుని ఆశ్చర్యపోతాం. మాట్లాడుతున్నప్పుడు ఆయన యెదుటి వ్యక్తితో మాట్లాడుతున్నట్టుండదు. అరమోడ్పు కళ్లతో ఆయన తనతో తాను మాట్లాడుకుంటున్నట్టుగా కనిపిస్తారు. రాయలసీమ కరువు గురించి రాసిన తొలి కథల్లో ముఖ్యమైనదైన ‘వీరకుంకుమ’ రాసిన మునిపల్లె రాజు గారు నిజానికి రాయలసీమ వాసి గాడు. దాదాపు వంద, వందాయాభై సంవత్సరాల క్రితం కొందరు కోస్తా ప్రాంతపు వైద్యులు (ఎంబీబీయెస్ గాదనీ, ఆర్ఎంపీల వంటి రెండో రకం డిగ్రీలుండేవారనీ తర్వాత తెలిసింది) చిత్తూరు, కడప జిల్లాలకొచ్చి స్థిరపడ్డారు (యాభై అరవై సంవత్సరాల క్రితం వాళ్ళు మళ్లీ తమ స్వంత ప్రదేశాల కెళ్ళిపోయారు). వాళ్లలో మునిపల్లె రాజు గారి అన్న పిచ్చిరాజు గారొకరు. (మునిపల్లె రాజు పూర్తి పేరు మునిపల్లె బక్కరాజు). కడపలో ఉన్న అన్న దగ్గరికొచ్చిన తమ్ముడు అప్పటి రాయలసీమ జీవనగతుల్ని గురించి రాసిన కథ అది. మునిపల్లె రాజు సైన్యంలో వుద్యోగిగా పనిచేసినవారు. హిమాలయ పర్వత సానువుల్లో చాలా కాలం గడిపి వచ్చినవారు. యెక్కడికెళ్లినా ఆయన చూపులు మాత్రం గాయపడినవాళ్ళు, అవమానించబడుతున్నవాళ్ళపైనే వుండేది. డాస్టోవిస్కీని ద్రష్ట (్కటౌpజ్ఛ్టి)గా గుర్తించిన ఇ.ఎం.ఫాస్టర్ ‘‘యిప్పుడు యెంతమంది గొప్ప రచయితలున్నా వీళ్లలో డి.హెచ్.లారెన్సు మాత్రమే ద్రష్ట’’ అంటాడు. గతాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని, వర్తమానాన్ని నిర్దుష్టంగా అవగతం చేసుకున్న రచయిత మాత్రమే రాబోయే పరిణామాల్ని ముందుగా కనిపెట్టగలడు. యిటువంటి ద్రష్టత్వం వున్న చాలా కొద్దిమంది ఆధునిక భారతీయ రచయితల్లో మునిపల్లె రాజు గారిది విశిష్టమైన స్థానం. ‘బిచ్చగాళ్ల జెండా’లోని బిచ్చగాళ్ళ తిరుగుబాటూ, ‘అరణ్యంలో మానవయంత్రం’లో ముసుగు దొంగలు అక్రమ వ్యాపారిని దోచుకోవడం – యీ రెండు కథలూ ఆ తర్వాతి కాలంలో తెలుగు రాష్ట్రంలో విజృంభించిన వామపక్ష పోరాటాల బీజాలను చాలా ముందుగా పసిగట్టాయి. తిరగబడుతున్న పీడితులతో మమేకమైన రచయిత పీడనలోంచి పోరాటం పుట్టడం అనివార్యమని హెచ్చరిస్తాడు. 1950–75 ప్రాంతాల్లో యిన్ని గొప్ప కథలు రాసిన మునిపల్లె రాజు గారు దాదాపొక రెండు దశాబ్దాల కాలం మౌనంగా వుండటమెందుకో అర్థంగాదు. బహుశా అప్పుడాయన వుద్యోగపు పనుల్లో వూర్లు తిరుగుతూ జన్మభూమికి దూరమైపోయి వుంటారు. కానీ రెండోసారి మొదలెట్టిన తర్వాత గూడా తనలో పాత వాడీ, వేడీ తగ్గలేదని నిరూపించి చూపెట్టారు. ‘సవతి కొడుకు’, ‘విశాఖ కనకమాలక్ష్మి’ వంటి గొప్ప కథల్ని నిలపకుండా మరో దశాబ్దపు కాలంలో రాశారు. ‘పుష్పాలు–ప్రేమికులు’, ‘దివోస్వప్నాలతో ముఖాముఖి’, ‘అస్తిత్వ నదం ఆవలి తీరాన’, ‘మునిపల్లె రాజు కథలు’ అనే నాలుగు కథల సంకలనాల్ని తీసుకొచ్చారు. ‘వేరొక ఆకాశం – వేరెన్నో నక్షత్రాలు’, ‘అలసిపోయిన వాడి అరణ్యకాలు’ అనే రెండు కవితా సంపుటాలనూ, ‘జర్నలిజంలో సృజన రాగాలు’ అనే వ్యాస సంకలనమూ రాశారు. తొలినాటి కథల్లో స్పష్టంగా వామపక్ష అభిమానాన్ని కలిగివుండిన మునిపల్లె రాజుగారిలో ఆ తరువాతి కాలంలో సంప్రదాయ సాహిత్యం పైనా, ఆధ్యాత్మిక ధోరణి పైనా మొగ్గు చోటుచేసుకున్నాయి. వర్తమానంతోనూ, వాస్తవికతతోనూ పోరాటం చేసి అలసిపోయినవాడిలా ఆయన ఆ తర్వాత ఆధ్యాత్మికతనూ, మాజిక్ రియలిజంనూ ఆలంబన చేసుకున్నారు. మాంత్రిక వాస్తవికత అనేది విదేశీయమైనది గాదనీ, అది భారతీయ ప్రాచీన సాహిత్యంలోనే వుందనీ గాఢంగా నమ్మారు. జీవితంలో అన్ని వూర్లు తిరిగినా, మునిపల్లె రాజుగారు తమ స్వంత వూరు ‘తెనాలి’ని తలచుకుంటూనే పులకించిపోయేవారు. యెప్పుడూ కొడవటిగంటి కుటుంబరావు గారి తప్పిపోయిన తమ్ముడు కొడవటిగంటి వెంకట సుబ్బయ్యనూ, అనిసెట్టి సుబ్బారావునూ గుర్తుకు తెచ్చుకునేవారు. శారద జ్ఞాపకాలనూ తవ్వుకునేవారు. మునిపల్లె రాజు బాగా చదువుకున్న రచయిత. యింగ్లీషులో యెప్పుడూ షెర్వుడ్ ఆండర్సన్ గురించి పేర్కొనేవారు. తెలుగులో తనకు నచ్చిన కథల్ని చెప్పమంటే అనిసెట్టి సుబ్బారావుగారి ‘ఎవరు, ఏమిటి? ఎందుకు?’, బి.వి.ఎస్. రామారావు గారి ‘ఎసరూ– అత్తెసరూ’ను యెంచుకునేవారు. హృదయమూ– మేధస్సూలతో ప్రభావితమైన కథల్లో తనకు యెక్కువగా హృదయమే పునాదిగా వుండే కథలు యిష్టమని చెప్పేవారు. పాత ఆంధ్రపత్రిక వుగాది సంచికల్లోనూ, భారతి మాసపత్రికల్లోనూ తరచుగా కనిపించే పేరు మునిపల్లె రాజు గారిది. ఆయన రాయడం మొదలుపెట్టిన రెండో దశలో వచ్చిన చాలా విశేష సంచికలకు ఆయన రచనలు అలంకారాలయ్యాయి. తెలుగులో సాహిత్య పత్రికలు అంతరించిపోవడమూ, ఆయన రాయడం మానేయడమూ దాదాపుగా వొకసారిగానే జరిగినట్టున్నాయి. యిప్పుడాయన భౌతికంగా గూడా వెళ్లిపోయారు. వుద్యోగం చేస్తున్న రోజుల్లో సికిందరాబాదులో యిండ్లుగా మారిన బ్రిటీషు సిపాయిల గుర్రపుశాలల్లో నివసించినప్పుడూ, వుద్యోగ విరమణ తర్వాత చిక్కడపల్లిలో చిన్నయిళ్లలో వుంటున్నప్పుడూ, సైనికపురిలో తన కొడుకు కట్టిన స్విమ్మింగ్‌పూల్ కూడా వుండే విశాలమైన బంగళాకు మారినప్పుడూ– యెప్పుడూ ఆయన తనదిగాని యింటిలోకి దారితప్పి వచ్చిన బాటసారిలాగే కనిపించేవారు. తనదైన అసలైన యిల్లేదో తెలుసుకున్నట్టుగా యిప్పుడాయన యథాలాపంగా యెవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. కొండచిలువకు ఆహారం కాబోయి... నలభై ఏళ్ల పాటు రక్షణరంగంలో ఉద్యోగం చేసి 1983లో రిటైరయ్యారు మునిపల్లె రాజు. ‘నేను ఆయుధం వాడాల్సిన అవసరం పెద్దగా రాలేదు. కానీ ఆయుధాల నిర్వహణ, వాటిని ఉపయోగించడం వంటివన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నాను’ అని గతంలో ‘సాక్షి’తో మాట్లాడిన సందర్భంలో పేర్కొన్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బర్మాకు దగ్గరగా ఫీల్డ్ ఏరియాలో, అస్సాం, మద్రాస్, వైజాగ్, పూనాలలో పనిచేశారు. గుడారంలో ఒక నులకమంచం, సమాచారం అందించడానికి అవసరమైన సామగ్రి అమర్చుకునేవాళ్లు. అదే వారి కార్యాలయం. అప్పుడు రాడార్లు లేవు కాబట్టి బైనాక్యులర్స్‌తో గగనతలాన్ని పరికించి చూసేవారు. ‘ఆకాశంలో ఒక నల్లటి విమానం సంచరించింది, దూరంగా బాంబింగ్ జరిగిన చప్పుడు వినిపించింది. మేమున్న ప్రదేశానికి ఫలానా దిక్కులో బహుశా కిలోమీటరు దూరంలో పడి ఉండవచ్చు...’ వంటి వివరాలను టెలిగ్రాఫ్ కోడ్ ద్వారా పంపించేవాళ్లమని చెప్పారు. కుటుంబాన్ని తీసుకెళ్లలేని ప్రదేశాలను ‘నో ఫ్యామిలీ స్టేషన్’ అంటారు. సాహిత్యాభిమాని కావడంతో అలాంటి ప్రదేశాల్లో కూడా హాయిగా ఉద్యోగం చేశారాయన. ‘వారానికోసారి పట్టణానికి వెళ్లి వారపత్రికలు తెచ్చుకుని చదువుకునే వాడిని. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేవాడిని. ఏనుగుల గుంపు జలపాతం కింద జలకాలాడటం వంటి దృశ్యాలు అద్భుతంగా ఉండేవి. ఒకరోజు కిషన్‌లాల్ అనే సహోద్యోగితో అస్సాం అడవుల్లో తిరుగుతుండగా చెట్టుకి కొండ చిలువ వేళ్లాడుతోంది. జంతువుల కోసం దాని వేట. దాని నోటికి ఆహారం కాబోయి క్షణాల్లో తప్పించుకున్నాం. ఫీల్డ్ ఏరియాలో శత్రువుల నుంచి ప్రమాదాలను ఊహిస్తాం. కానీ ఇలా ప్రకృతి సహజమైన ప్రమాదాలను కూడా ఊహించి రక్షించుకోవాల్సిందేనని అప్పుడే తెలిసింది’ అని తన అనుభవాల్ని పంచుకున్నారు. - మధురాంతకం నరేంద్ర -
మునిపల్లె రాజు కన్నుమూత
హైదరాబాద్ : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కథా రచయిత మునిపల్లె రాజు (92) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు శనివారం హైదరాబాద్ సైనిక్‌పురిలోని స్వగృహంలో మృతి చెందారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన రాజు 1925లో జన్మించారు. తెనాలిలో బాల్యం గడిపారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రాజుకు కళలు, సాహిత్య విభాగంలో 2006లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన సాహితీ రంగంలో చేసిన కృషికి జ్యేష్ఠ లిటరసీ అవార్డు, శాస్త్రి మెమోరియల్ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయ అవార్డు(రెండుసార్లు) గోపీచంద్ అవార్డు, ఆంధ్ర సారస్వత సమితి తదితర అవార్డులను అందుకున్నారు. -
అడిగింది ఒకటి..? అనుకుంది యింకోటి..!
అనంగ అనంగ ఒక రాజు వుండేటోడు. ఆయిన శాన మేదావి. యెప్పుడు యేదో ఒక దాని గురించి లోతుగ ఆలోశన జేస్తుండేటోడు. అట్ల ఆలోశన జేశి కొత్త కొత్త ముచ్చట్లు జెప్పేటోడు. అయన్ని యిన్నోల్లు రాజు మస్తు తెలివిగల్లోడని శిత్రపొయ్యేటోల్లు. రాజు కాడ పెద్ద పెద్ద సదువులు సదివిన మస్తుమంది పండితులు వుండేటోల్లు. ఆల్లంత యెప్పటికప్పుడు రాజు అడిగిన ప్రశ్నలకు, అనుమానాలకు జెవాబు జెప్తుండేటోల్లు. అప్పుడప్పుడు రాజు కొత్త కొత్త ప్రశ్నలు యేశి ఆల్లకు గూడ పరిక్ష వెట్టెటోడు. ఆటికి జెవాబు జెప్పలేక పండితులంత కిందమీద అయ్యేటోల్లు. ఒకసారి ఆయిన సబల కూసోని ఒక యేలు సూపెట్టుకుంట ‘యిది యేంటిది?’ అని అడిగిండు. శానమంది అది సూపుడు యేలని శెప్పాలనుకున్నరు. కని రాజు గంత అల్కటి ప్రశ్న యెందుకు అడుగుతడు? అండ్ల యేదో పరమార్దం వుంటది అనుకోని యెన్కకు తగ్గిర్రు. రాజు యెంతశేపు జూశినా ఒక్కలు గూడ జెవాబు యియ్యకపొయ్యేసరికి ‘మీకు మూడు దినాల టైమిస్తున్న! యీ లోపల బాగ ఆలోశించి శెప్పుర్రి! మీరు జెప్పినా సరే, యింకెవలినన్న తీస్కొచ్చి శెప్పిచ్చినా సరె! మొత్తం మీద నాకు సమదానం గావాలె!’ అన్నడు రాజు. యిగ అందరు తల్కాయ పలిగిపోయేటట్టు ఆలోశన జేశిర్రు. యెంత ఆలోశించినా ఆల్లకేం అర్దంగాలే. అందరు గల్శి గుంపుగ గూసోని గూడ మాట్లాడుకుర్రు. తెల్శినోల్లనందరిని అడిగి జూశిర్రు. యెంత జేశినా యేం లాబం లేకుంటవొయ్యింది. ఆకర్కి ఒక పండితుడు దాని గురించే కింద మీదవడుకుంట వూరి బైటికివొయ్యిండు. శెరువు కట్ట మీదున్న శెట్టు కింద గూసుండు. ‘యింత సదువు సదివి రాజుకు జెవాబు జెప్పలేకపోతున్న గదా!’ అని పరేషాన్ల వడ్డడు. ఆడ గొర్లు మేపుకుంటున్న ఒక గొర్లకాపరి పండితుని దిక్కు జూశిండు. ‘యేవైంది పంతులూ! యెందుకిట్ల దివాలుగ గూసున్నవు?’ అని అడిగిండు దెగ్గెరికొచ్చి. దానికి పండితుడు రాజు అడిగిన ప్రశ్న గురించి జెప్పిండు. అది యిన్నంక గొర్లకాపరి గట్టిగ నవ్వి ‘గీ దానికే గింత యిదైపోతవేంది పంతులూ? మీ రాజుకు నేను సమదానం జెప్త పోదాం పా!’ అన్నడు. ‘యెంతో సదువు సదివి, శాస్త్రాలు, పురానాలు ఒంట వట్టిచ్చుకున్న నాకే అర్దం గానిది గొర్లకాపరివి నీకేం అర్దమైంది?’ శిత్రంగ జూస్కుంట అడిగిండు పండితుడు. దానికి గొర్లకాపరి ‘అయన్ని యెందుకు పంతులూ! మీ రాజుకు సమదానం జెప్పాలె అంతే గద, నువ్వు నిమ్మలంగ వుండు!’ అన్నడు గట్టిగ. పండితుడు మారు మాట్లాడకుంట గొర్లకాపరిని యెంట వెట్కోని రాజు కాడికి తీస్కపొయ్యిండు. ‘రాజా రాజా! నువ్వు అడిగిన దానికి యీన జెవాబు జెప్తడట!’ అని జెప్పిండు. యెవ్వలూ జెప్పలేంది యీ గొర్లకాపరి యేం జెప్తడా అని అందరు ఆత్రంగ సూడవట్టిర్రు. అప్పుడు రాజు ఒక యేలు సూపెట్టిండు. గొర్లకాపరి యెంబడే రొండు యేల్లు సూపెట్టిండు. దానికి రాజు యేదో ఆలోశించి మూడు యేల్లు సూపెట్టిండు. అందుకు గొర్లకాపరి జెరంత కోపంతోని ‘లేదు పో!’ అన్కుంట బైటికి వొయ్యిండు. అప్పుడు రాజు యెంతో సంతోషంగ ‘నాకు జెవాబు దొర్కింది!’ అని గట్టిగ మొత్కుండు. పండితులకు యేం అర్దంగాలే. ‘రాజా! నువ్వు అడిగింది యేంది? ఆయిన జెప్పింది యేంది? జెర మాకు అర్దమైతట్టు జెప్పవా!‘ అని అడిగిర్రు నెత్తి గోక్కుంట. అప్పుడు రాజు ‘నేను దేవుడు ఒక్కడే అని ఒక యేలు సూపెట్టిన. అందుకు గొర్లకాపరి శెంకరుడు, విష్ణుమూర్తి యిద్దరు దేవుల్లు గద అని రొండు యేల్లు సూపెట్టిండు. నేనప్పుడు బ్రమ్మదేవునితోటి ముగ్గురైతరు గద అని మూడు యేల్లు సూపెట్టిన! దానికి గొర్లకాపరి ఒప్పుకోక అసలు దేవుడే లేడు పో! అన్కుంట వొయ్యిండు. అది సంగతి!’ అని జెప్పిండు. పండితులు ‘ఓ అదా సంగతి!’ అనుకున్నరు. అనుకోని వూకోకుంట యెంబడే శెరువు కాడికి వుర్కిర్రు. గొర్లకాపరిని దొర్కిచ్చుకుర్రు. ‘రాజు అడిగిన ముచ్చటల నీకేం అర్దమైందో జెప్పు?’ అని అడిగిర్రు ఆయినేం జెప్తడో యిందామని! అప్పుడాయిన ‘రాజు ఒక గొర్రెని యియ్యమని ఒక యేలు సూపెట్టిండు. అడుగుతుంది మన రాజే గద రొండు యిద్దాంలే అని, నేను రొండు యేల్లు సూపెట్టిన! రాజు మస్తు ఆశగొండోడు వున్నట్టుండు గద! రొండు గాదు మూడు గావాలె అని మూడు యేల్లు సూపెట్టిండు. నాకు తిక్కలేశి యేది లేదుపో అన్న!’ అని అసలు ముచ్చట జెప్పిండు గొర్లని అల్లిచ్చుకుంట.అది యిన్నంక పండితులందరు ‘అడిగింది ఒకటి... అనుకుంది యింకోటి!’ అని కడుపువలిగేటట్టు పక్కపక్క నవ్విర్రు. యీ సంగతి తెల్సుకోని జెనాలందరు కండ్లల్లకు నీల్లొచ్చేదాక నవ్వుకున్నరు. ఆకర్కి ముచ్చట రాజు కాడికి వొయ్యింది. యేముంటదిగ? నోరెల్లవెట్టిండు రాజు! - పెండెం జగదీశ్వర్ -
వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును కేంద్రం వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ తెలంగాణ ఎమ్మార్పీఎస్, ఏపీ ఎమ్మార్పీఎస్, మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఈటుకు రాజు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని బీజేపీ విస్మరించిందని ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు దండు వీరయ్య విమర్శించారు. ఇచ్చిన హామీమేరకు వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని నేతలు హెచ్చరించారు. -
ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య
రాయికల్ (జగిత్యాల): అనుకున్న ఉద్యోగం రాలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని కుర్మపల్లికి చెందిన షెట్టి రాజు (26) హైదరాబాద్‌లోని గ్లోబల్ కాలేజ్‌లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశాడు. అక్కడే పలు కంపెనీల్లో పనిచేశాడు. ఆగస్టు 9న ఆస్ట్రేలియాకు వెళ్లి కొంతకాలం పనిచేసి తిరిగి జనవరిలో స్వగ్రామానికి వచ్చాడు. ఇటీవల హైదరాబాద్‌లో జపాన్ దేశంలోని ఓ హోటల్‌కు సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరు కాగా.. ఒక్క మార్కుతో అందులో ఫెయిల్ అయ్యాడు. 15 రోజుల క్రితం అన్నీ సర్దుకొని ఇంటికొచ్చాడు. తిరిగి తాను ఎక్కడికీ వెళ్లనని కుటుంబసభ్యులకు తెలిపాడు. గురువారం జగిత్యాలకు వెళ్లి వస్తానని చెప్పిన రాజు మళ్లీ ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన కోసం గాలించగా పొలంలోనే చెట్టుకు ఉరివేసుకుని శవమై కనిపించాడు. చేతికందివచ్చిన కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. -
యాచకుడిగా మారిన క్రీడాకారుడు
శరవేగంగా ఆలోచించాలి. ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. ఎదుటివాడి తెలివికి చెక్ చెప్పాలి. అప్పుడే విజయం. అది జీవితమైనా, చదరంగం ఆటైనా... అయితే చదరంగంలో అవలీలగా గెలిచిన ఓ క్రీడాకారుడు జీవిత సమరంలో మాత్రం కూలబడి, ఓడిపోయాడు. పతకాలు, పురస్కారాలు అందుకున్న అదే చేయి ఇప్పుడు చిల్లర కోసం యాచిస్తోంది. సాక్షి, హైదరాబాద్ (తార్నాక): ఎం.వై రాజు. ప్రతిభ కలిగిన చదరంగ క్రీడాకారుడు.. రెండు వేల రేటింగ్ కలిగిన ప్రతిభాశాలి. జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులతో పాటు బంగారుపతకం కూడా అందుకున్న ఆటగాడు. నగరంలో ఎక్కడ చెస్ టోర్నమెంట్ జరిగినా అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. ఒకప్పుడు రైల్వేలో మంచి ఉద్యోగం.. చదరంగంలో రాణింపు.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. జీవితంలో అన్నీ కోల్పోయాడు. ఆటకూ దూరమయ్యాడు. నాఅన్నవారే లేక యాచకుడిగా మారాడు. కుటుంబ నేపథ్యం... రాజు ఒంగోలులో 1969లో పుట్టారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో తరచూ బదిలీల కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన విద్యాభ్యాసం సాగింది. నగరంలోని సిటీ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రాజుకు చిన్ననాటి నుంచే చదరంగం అంటే అమితాసక్తి. ఈ విషయాన్ని గమనించిన తండ్రి రాజును బాగా ప్రోత్సహించారు. రూ.3 లక్షలు విలువ చేసే చదరంగం పుస్తకాల్ని అప్పట్లో కొనిచ్చారు. అదే స్ఫూర్తితో ఎదిగిన రాజు జాతీయస్థాయిలో క్రీడాకారుడిగా రాణించారు. ఆ ప్రతిభతోనే 1993లో దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగం సాధించారు. గాడితప్పిన జీవితం.. చదరంగంలో జాతీయ స్థాయి క్రీడాకారుడిగా వెలిగిన రాజు జీవితం తల్లిదండ్రుల మరణంతో ఒక్కసారిగా గాడితప్పింది. అతడ్ని దురలవాట్ల వైపు మళ్లించింది. క్రీడను నిర్లక్ష్యం చేశాడు. విధులకు గైర్హాజరుకావడంతో ఉద్యోగం పోయింది. యాచకుడిగా మార్చింది. చదరంగంలో నేటికీ రాజే... మానసిక పరిస్థితి అంతబాగాలేకున్నా కూడా రాజు చదరంగంలో నేటికీ రాజే. నగరంలో ఎక్కడ పోటీలు జరిగినా అక్కడకు వెళ్లి క్రీడలో గెలిచి ప్రైజ్‌మనీని తన ఖర్చులకు వినియోగిస్తున్నట్లు రాజు ‘సాక్షి’కి తెలిపారు. క్రీడా ప్రస్థానం.. ► 1988 రాజమండ్రిలో జరిగిన జాతీయ జూనియర్ చెస్ పోటీల్లో పాల్గొని ఒక్క పాయింట్లో చాంపియన్‌షిప్‌ను కోల్పోయాడు. ► 1992 నగరంలో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ చెస్‌పోటీల్లో బంగారు పతకం. ► 1992 కోల్‌కతాలో జరిగిన నేషనల్ చెస్ పోటీల్లో జాతీయ అవార్డు. ► 2000 నగరంలో జరిగిన ఆల్ ఇండియా చెస్ పోటీల్లో గోల్డ్‌మెడల్. ప్రస్తుతం.. రాజు నాలుగేళ్లుగా తార్నాక చౌరస్తాలోని గణపతిఆలయంలో యాచకుడిగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన చెందిన కొందరు మిత్రులు రెండు నెలల క్రితం వైద్యపరీక్షలు చేయించారు. స్కీజోఫ్రోనియాతో బాధపడుతున్నట్లు వైద్యులు తేల్చారు. మెరుగైన వైద్యం చేయించేందుకు మిత్రులంతా ఓ గ్రూప్‌గా ఏర్పడి సాయంమందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి రాజుకు వైద్యసాయమందించాలని స్నేహితులు కోరుతున్నారు. -
విధినిర్వహణలో గుండెపోటుతో..
సాక్షి, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుకు గురై మృతిచెందడం స్థానికులను కలచివేసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లా మోతే పోలీస్‌స్టేషన్‌లో రాజు హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం విధి నిర్వహణలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో ఆయన కుప్పకూలిపోయారు. దీంతో తోటి పోలీసులు చికిత్స నిమిత్తం రాజును ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే హెడ్ కానిస్టేబుల్ మృతిచెందినట్లు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రత్యర్థులంతా ఏకమై మట్టుబెట్టారు..
► ఏడుగురు నిందితుల అరెస్టు కర్నూలు: బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన పేరపోగు రాజు (42) హత్య కేసు మిస్టరీ వీడింది. రాజు ప్రత్యుర్థులంతా ఏకమై అతడిని మట్టుబెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందులో ఇద్దరు హతుడికి స్వయానా సోదరులుండడం గమనార్హం. నిందితులు పేరపోగు బుజ్జన్న, పేరపోగు బాబురావు, అదే గ్రామానికి చెందిన ఆకెపోగు ఇసాక్, సందెపోగు కృష్ణ, ఆకెపోగు రవి, పేరపోగు ప్రేమ్‌కుమార్, తేనెల రాజు అలియాస్ మున్నా రాజు (నందనపల్లె)పడిదెంపాడు సమీపంలోని కేసీ కెనాల్ కట్ట వద్ద ఉండగా పోలీసులు వారిని అరెస్టు చేసి నేరానికి ఉపయోగించిన పట్టుడు కట్టెలు, పిడిబాకులను స్వాధీనం చేసుకున్నారు. తాలూకా పోలీస్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం కర్నూలు డీఎస్పీ రమణమూర్తి వివరాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. గ్రామానికి చెందిన మారెన్న, వెంకటరమణ దంపతులకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం కాగా హతుడు రాజు రెండవ కుమారుడు. తల్లి వెంకటమ్మ పేరుతో ఉన్న రెండు ఎకరాల పొలం విషయంలో తమ్ముళ్లు బాబురావు, బుజ్జన్నలతో విభేదాలు ఉన్నాయి. ఆస్తి కోసం హతుడితో గొడవ పడి సోదరులిద్దరూ ఊరు వదిలారు. ఎమ్మార్పీఎస్ మాజీ నేత పెద్ద లక్ష్మన్నకు వ్యతిరేకంగా ఉన్న వర్గంతో పేరపోగు రాజు సన్నిహితంగా ఉంటూ పెత్తనం చలాయించేవాడు. ఈ క్రమంలో ప్రత్యర్థులంతా ఏకమై గత నెల 29 రాత్రి గ్రామ శివారులోని బ్యాంక్ ఆఫీసర్స్ కాలనీకి వెళ్లే దారిలో పొలంలో మద్యం తాపించి హత్య చేశారు. ఎమ్మార్పీఎస్ మాజీ నేత పెద్ద లక్ష్మన్న ఇందులో ప్రధాన సూత్రధారి, అతడితో పాటు బాబు, మహేష్ పరారీలో ఉన్నారు. ప్రత్యేక పోలీసు బృందాలను నియమించి వారి కోసం గాలిస్తున్నారు. మద్యంలో విష ప్రయోగం చేసినట్లుగా అనుమానం ఉండడంతో నిర్ధారణ కోసం వైద్య పరీక్షలకు పంపారు. స్వల్ప వ్యవధిలోనే కేసు మిస్టరీని ఛేదించిన తాలూకా పోలీసులను డీఎస్పీ అభినందించారు. సీఐ మహేశ్వరరెడ్డి ఎస్ఐ గిరిబాబు పాల్గొన్నారు. -
అత్తారింటికెళ్తూ పరలోకాలకు..
రోడ్డు ప్రమాదంలో పత్తికొండవాసి దుర్మరణం గుత్తి (గుంతకల్లు) : అత్తారింటికి వెళుతున్న యువకుడిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. గుత్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పత్తికొండ వాసి దుర్మరణం చెందాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు... కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని చౌడేశ్వరి ఆలయం వద్ద నివాసముండే కారు డ్రైవర్ నేసే రాజు (35) సోమవారం తన అత్తగారి ఊరైన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడుకు ద్విచక్ర వాహనంలో బయలు దేరాడు. మార్గం మధ్యలోని గుత్తిలో నంబర్ వన్ హాస్టల్ వద్ద ఎదురుగా వెళుతున్న ఇన్నోవా కారు ఎదురుగా స్పీడు బ్రేకర్ ఉండటంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. కారు ఉన్నపళంగా ఆగడంతో ఆ వెనకే వేగంగా వస్తున్న రాజు అదుపు తప్పి కారును ఢీకొన్నాడు. కారు పైనుంచి రోడ్డుపైకి ఎగిసిపడినపుడు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని హెడ్ కానిస్టేబుల్ విజయుడు, కుమార్‌లు పరిశీలించారు. సీఐ ప్రభాకర్ గౌడ్ కేసు నమోదు చేసుకున్నారు. మృతినికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజు మరణ వార్త విన్న వెంటనే కుటుంబ సభ్యులందరూ గుత్తి ఆస్పత్రికి వచ్చి మృతదేహంపై పడి బోరున విలపించారు. ఇక మాకు దిక్కెవరయ్యా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. -
లోకల్ ఆటోలో...
సజీవ్, రాజు, లావాణ్యరావ్, టీనా రాథోడ్ ముఖ్య తారలుగా న్యూ టాలెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నందు జెన్న దర్శకత్వంలో శ్రీసాయి గణేశ్ నిర్మిస్తున్న చిత్రం ‘లోకల్ ఆటో’. మంగళవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలను వ్యాపారవేత్త ఆంజనేయ రాజు వైష్ణవి రికార్డింగ్ థియేటర్లో నిర్వహించారు. ప్రేమ, మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు 18 సినిమాలను నిర్మించిన నేను భవిష్యత్‌లో కూడా చిన్న చిత్రాలనే నిర్మించాలనుకుంటున్నాను. వచ్చే నెల 2న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 25 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘లోకల్ ఆటోలో ఏం జరిగిందనేది ఆసక్తిగా ఉంటుంది. రెండు యువ జంటల మధ్య ఆసక్తికరమైన సంఘటనల నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించనున్నాం’’ అన్నారు నందు జెన్న. ఈ చిత్రానికి సంగీతం: వినయ్ బాలాజీ. -
రూ.అరకోటి విలువైన తాచుపాము విషం
మైసూరు (కర్ణాటక): అక్రమంగా సేకరించిన పాము విషాన్ని విక్రయించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని మంగళవారం కర్ణాటకలోని అటవీశాఖ సిబ్బంది అరెస్ట్ చేశారు. అతని వద్దనుంచి రూ.50లక్షల విలువైన లీటర్ తాచుపాము విషం స్వాధీనం చేసుకున్నారు. సోమవారపేట తాలూకా యడియూరు గ్రామానికి చెందిన రాజు గతంలో టింబర్ యార్డులో పని చేస్తూ ప్రమాదానికి గురై కాలు పోగొట్టుకున్నాడు. దీంతో చేయడానికి పని లభించకపోవడంతో సోమవారపేట తాలూకాలోని అటవీప్రాంతంలోని గిరిజనుల సాయంతో తాచుపాముల విషాన్ని సేకరించడం ప్రారంభించాడు. అలా సేకరించిన విషాన్ని మంగళవారం మైసూరు గ్రామాంతర బస్టాండ్‌లో విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా అటవీశాఖ సిబ్బంది అరెస్ట్ చేసి లీటర్ తాచుపాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
వడదెబ్బతో ఇద్దరి మృతి
గుత్తి (గుంతకల్లు) : జిల్లాలో వడదెబ్బ సోకి శనివారం ఇద్దరు మృతి చెందారు. గుత్తిలోని బెస్తగేరికి చెందిన చెరుకు రాజు(52) వడదెబ్బ సోకి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. లారీ డ్రైవర్‌గా పని చేసే రాజు రెండ్రోజులుగా కర్నూలు-అనంతపురం మధ్య తిరిగినట్లు వివరించారు. శుక్రవారం సాయంత్రం ఇంటికొచ్చిన కాసేపటికే ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడన్నారు. ఆ వెంటనే వాంతులు, వీరేచనాలయ్యాయి. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు సెలైన్ ఎక్కించి ఇంటికి పంపారు. అయితే శనివారం తెల్లవారుజామున నిద్రలోనే మృతి చెందాడన్నారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఉరవకొండ రూరల్ మండలంలో... ఉరవకొండ రూరల్ : మండలంలోని ఆమిద్యాలలో నాగరాజు(39) అనే కూలీ వడదెబ్బ సోకి మరణించాడని గ్రామస్తులు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరుకు కూలీ పనులకు వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో తనకు నీరసంగా ఉందంటూ ఒక్కసారి సొమ్మసిల్లిపడిపోవడంతో తోటి కూలీలు హుటాహుటిన ఉరవకొండ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య తిప్పమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
జిల్లాలో సినీ, టీవీ స్టూడియో నిర్మిస్తా
–హాస్య నటుడు గౌతంరాజు రాయవరం(మండపేట): ‘గోదావరి జిల్లాలో పుట్టినందుకు ఎంతో సంతోషిస్తున్నా. జిల్లావాసిగా కళామతల్లి రుణం తీర్చుకునేందుకు తగిన కృషి చేస్తున్నా’నన్నారు ప్రముఖ హాస్యనటుడు గౌతంరాజు. ఆత్మీయత, అనుబంధానికి జిల్లా పెట్టింది పేరని, మరో జన్మంటూ ఉంటే ఈ జిల్లాలోనే పుట్టాలని ఉందని చెప్పారు. రాయవరం సాయితేజా 20వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పాఠశాల దశ నుంచే నాటకాలు రాజోలులో పుట్టిన నేను కాకినాడ కాకినాడ పీఆర్ కళాశాలలో బీఎస్సీ చదివాను. విద్యాభ్యాసం అనంతరం హైదరాబాద్‌లోని ఇంటర్మీడియేట్ బోర్డులో ఉద్యోగం చేశాను. సినిమారంగంపై ఉన్న ఆసక్తితో దీర్ఘకాలిక సెలవులో వెళ్లి, 1991లో ఉద్యోగానికి రాజీనామా చేశాను. పాఠశాల దశ నుంచి నాటకాలు వేశాను. కాకినాడలో చదువుతుండగా 42 ప్రదర్శనలు ఇచ్చాను. ‘పశ్చాత్తాపం, లాభం, ఏక్ దిన్ కా సుల్తాన్, ఆగండి ఆలోచించండి’ తదితర నాటకాల్లో నటించాను. అలా వచ్చింది అవకాశం.. సింగీతం శ్రీనివాసరావుగారి దర్శకత్వంలో వచ్చిన ‘వసంతగీతం’ సినిమాలో తొలిసారిగా నటించాను. ఇప్పటి వరకు 200కు పైగా సినిమాల్లో నటించాను. ‘ఘరానామొగుడు, కూలీ నెం1, ప్రేమకు వేళాయెరా, ఉగాది’ తదితర సినిమాలు గుర్తింపునిచ్చాయి. ‘జై శ్రీరామ్’ సినిమాలో తొలిసారి విలన్ వేషం వేశాను. ‘వెయ్యి అబద్ధాలు’ సినిమాలో తేజ మరోసారి విలన్ వేషం ఇచ్చారు.ఎందరో మహానటులు నాటక రంగం నుంచి వచ్చిన వారే. జిల్లాలో త్వరలో బీజీఆర్ ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియో నిర్మాణం చేపడుతున్నాను. ఎక్కడ నిర్మించేది త్వరలోనే వెల్లడిస్తాను. తమిళ డైరెక్టర్ సాగా దర్శకత్వంలో త్వరలో సినిమా రూపొందిస్తున్నాం. ఆ సినిమాలో జిల్లాలో ఉన్న నటీనటులకు ప్రాధాన్యం ఇస్తాను. మే నెలాఖరుకు షూటింగ్ ప్రారంభిస్తాను. నా కొడుకు కృష్ణకు గుర్తింపు వచ్చింది... నా కుమారుడు కృష్ణంరాజును కృష్ణ పేరుతో సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం చేశాను. ‘లక్ష్మీదేవి సమర్పించు..నేడే చూడండి’ ఈ నెల ఏడున విడుదలై మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. ఈ సినిమాతో కృష్ణకు నటుడిగా మంచి మార్కులు వచ్చాయి. కృష్ణ మంచి డ్యాన్సర్ కావడంతో హీరో అవకాశం వచ్చింది. -
ట్రాక్టర్ బోల్తా.. పెళ్లింట్లో విషాదం
కర్నూలు: మూడు ముళ్ల బంధం కోసం బయల్దేరిన పెళ్లి కూతురి తరఫు వారి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నరసమ్మ(55) అనే వృద్ధ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో పెళ్లింట్లో విషాదం అలముకుంది. జిల్లాలోని అస్పరి మండలం ములుగుందం గ్రామానికి చెందిన తిక్కయ్య కూతురు లక్ష్మికి పత్తికొండ మండలం అటికెలగుండు నాగేష్ కొడుకు రాజుతో వివాహం నిశ్చయమైంది. ఆదివారం పెళ్లి కొడుకు ఇంటికి తలంబ్రాలు తీసుకెళ్లాల్సివుండటంతో అమ్మాయి తరఫు వారు 40 మంది ట్రాక్టర్లో అటికెలగుండుకు బయల్దేరారు. ములుగుందం దాటిన తర్వాత కైరుప్పల పాఠశాల వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో నరసమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. పెళ్లి కూతురితో పాటు మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్ధితి విషమంగా ఉంది. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజాసమస్యల పరిష్కారంలో సర్కారు విఫలం
కేంద్ర మాజీమంత్రి పళ్లంరాజు మండపేట : ప్రజాసమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని కేంద్ర మాజీ మంత్రి మళ్లిపూడి మంగపతి పళ్లంరాజు విమర్శించారు. పీసీసీ అధికార ప్రతినిధి కామన ప్రభాకరరావు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక నాళం వారి సత్రంలో జరిగిన జన ఆక్రోష్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పళ్లంరాజు మాట్లాడుతూ నవంబరు 8వ తేదీన పెద్ద నోట్లు రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం సామాన్యులను రోడ్డున పడేసిందన్నారు. డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజి మాట్లాడుతూ ప్రజా సమస్యలను గాలికొదిలేసి సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు దోపిడి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మాజీ ఎంపీ అయితాబత్తుల బుచ్చిమహేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ ప్రజావ్యతిరేక పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. చంద్రబాబు మూడేళ్ల పాలనలో ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. కామన మాట్లాడుతూ ప్యాకేజీ పేరిట చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తొలుత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారిలో పార్టీ నేతలు పళ్లంరాజు, నానాజి, కామన తదితరులు ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. పార్టీ నాయకులు బోడా వెంకట్, ఎస్ఎన్ రాజా, జి. ఏడుకొండలు, నంద, వి. వీరాస్వామి, సురేష్‌కుమార్, దుర్గాప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
హేరాం.. ఎంతటి దైన్యం
పేదల వైద్యానికి పెద్దపీట వేసామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వానికి తెలంగాణ వైద్యప్రదాయిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు మాత్రం తెలియడం లేదు. ఇక్కడకు వైద్యం కోసం వచ్చేవారంతా నిరుపేదలే. కానీ సిబ్బంది మాత్రం ప్రతి పనికీ ‘ఖరీదు’ కడుతున్నారు. బేగంపేటకు చెందిన చెందిన రాజు (40) ప్రైవేటు ఎలక్ట్రీషియన్. కొద్దిరోజుల క్రితం విద్యుతాఘాతానికి గురై రెండు కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితికి చేరుకున్నాడు. గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగంలో చికిత్స చేయించుకున్న తర్వాత ప్రతివారం పాస్టిక్సర్జరీ ఓపీ సేవలు పొందాలని వైద్యులు సూచించారు. ఈ విభాగం మొదటి అంతస్తులో ఉంది. ఆస్పత్రిలో లిఫ్ట్ పనిచేయడం లేదు. గతంలో వచ్చినప్పుడు వీల్‌చైర్ కోసం సిబ్బందిని అడిగినా చేయి తడపందే ఇవ్వనన్నారు. దీంతో అతడు గురువారం ఉదయం ఆస్పత్రికి వచ్చేటప్పుడు ఇంట్లోని పిల్లల సైకిల్‌ను తెచ్చుకున్నాడు. భ్యార తోడుతో దానిపై వెళుతున్న పరిస్థితిని తోటి రోగులు చూసి అవాక్కయ్యారు. – గాంధీ ఆస్పత్రి -
మూడో కాన్పులోనూ అమ్మాయి పుట్టిందని..
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య బంజారాహిల్స్: మూడో కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టిందని మనస్తాపానికి లోనైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బేగంపేట పాటిగడ్డకు చెందిన రాజు(39) శ్రీలత దంపతులు నందినగర్‌లో నివాసం ఉంటున్నారు. రాజుల ఖైరతాబాద్ మింట్‌కంపౌండ్‌లోని ప్రభుత్వ ప్రింటింగ్‌ప్రెస్‌లో పని చేసేవాడు. వీరికి ప్రణవి(6), ధనవి(3) కుమార్తెలు ఉన్నారు. నెల క్రితం శ్రీలత మూడో కాన్పులో కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టినట్లు తెలుసుకున్న రాజు భార్యాపిల్లలను అక్కడే వదిలేసి వెళ్లిపోగా, శ్రీలత పసిపాపతో పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి మానసికవేదనకు లోనైన అతను తాగుడుకు బానిసై ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటివద్దే ఉన్నాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు కిటికీలోనుంచి చూడగా రాజు మృతదేహం కనిపించడంతో బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం
జగ్గంపేట : రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే 90 శాతం నిధులు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు అన్నారు. ప్రత్యేక హోదా, టీడీపీ ఎన్నికల హామీలపై శనివారం జగ్గంపేటలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి మరోతి శివగణేష్ ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. గ్రామంలో మెయిన్ రోడ్డులో పెద్దాపురం రోడ్డు శివారు నుంచి సెంటర్ వరకు పళ్లంరాజు, డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ తదితరులు ప్రజా బ్యాలెట్ ఉద్యమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అమలు కావాలా ? వద్దా ? అని, తెలుగుదేశం పార్టీ 2014ఎని్నకల మేనిఫెస్టోలో ఇచ్చిన 600లపై చిలుకు హామీలను నెరవేర్చిందా ? లేదా? అని రెండు ప్రధాన ప్రశ్నలకు తీర్పును ప్రజలను నుంచి కోరారు. అనంతరం స్థానిక సాయిబాలాజీ ఫంక్షన్ హాలులో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పార్టీ «అధికార ప్రతినిధి గుల్లా ఏడుకొండలు అధ్యక్షతన జరిగిన జన ఆవేదన సమ్మేళనం సమావేశంలో మాజీ మంత్రి పళ్లంరాజు మాట్లాడుతూ హోదా న్యాయసమ్మతం కావడంతో పవన్‌కల్యాణ్, జగన్మోహన్రెడ్డి హోదా కావాలని కోరుతున్నారన్నారు. గతంలో దురదుష్టకరమైన సంఘటన కారణంగా బలమైన నాయకుడు రాజశేఖరరెడ్డిని కోల్పోయామన్నారు. ఆయన హయాంలో రైతుల బాగుకు ఇరిగేషన్ ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయని, ఉపాధి పథకం ద్వారా ఎందరికో పనులు లభించాయన్నారు. ప్రస్తుతం కేంద్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందన్నారు. ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా నోట్ల రద్దు చేయడం దురహంకారమని, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మాయవతికి పదవి దక్కకుండా ఉండేందుకేనని నోట్ల రద్దుచేశారని ఆరోపించారు. హోదా కోసం కోటి సంతకాల ఉద్యమం విజయవంతం చేయాలన్నారు. డీసీసీ అ«ధ్యక్షుడు పంతం నానాజీ, నియోజకవర్గ ఇన్చార్జి మరోతి శివగణేష్, నాయకులు వత్సవాయి బాబు, అడబాల కుందరాజు, గుల్లా ఏడుకొండలు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, మార్టన్లూథర్, బాలేపల్లి మురళి, కాకి లక్ష్మణరావు, నక్కా సత్తిబాబు, ఏబీ సుధాకర్, ముత్యాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.