ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది.. | unmaritual relation causes to husbands death | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది..

Published Sun, Feb 22 2015 1:51 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది.. - Sakshi

ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది..

తాండూరు:  వివాహేతర సంబంధం మానుకోవాలని హెచ్చరించినందుకు ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం కోనాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజు(28) అనే యువకుడు  గత కొంతకాలం నుంచి భార్యతో కలిసి కోనాపూర్ లో నివాసం  ఉంటున్నాడు.

 

కాగా రాజు భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం  రాజు దృష్టికి రాగా అతడు.. భార్యను ప్రవర్తన మార్చుకోవాలంటూ పదే పదే హెచ్చరించేవాడు. దీంతో తమ సంబంధానికి  అడ్డుపడుతున్నాడని భావించిన భార్య,  ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించేందుకు పథకం పన్నింది.  ప్రియుడితో కలిసి గతరాత్రి భర్తను హత్య చేసింది. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించింది.  ప్రియుడితో కలిసి భార్యనే రాజును చంపేసిందని గ్రామస్తులు, మృతుడు రాజు బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులిద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement