రాయపర్తి (వరంగల్): వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. వివరాలు.. కిస్టాపురం క్రాస్‌రోడ్డు వద్ద బైక్, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొనగా బైక్‌పై ఉన్న రాజు (26), వెంకన్న (28) అక్కడికక్కడే చనిపోయారు. మృతులిద్దరూ మండలంలోని మొరిపిరాల గ్రామానికి చెందిన వారు.