కుటుంబ కలహాలతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
Published Mon, Aug 8 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
హసన్‌పర్తి : కుటుంబ కలహాలతో ఆటో డ్రైవర్ మృతిచెందిన సంఘటన హసన్‌పర్తిలో ఆదివారం జరిగింది. ఎస్సై రవికుమార్ కథనం ప్రకారం.. హసన్‌పర్తికి చెందిన నల్ల రాజు(33)కు భార్య శ్రీలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. దంపతుల మధ్య గత కొంతకాలంగా కలహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం శ్రీలత భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన రాజు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కే సు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Advertisement
Advertisement