Hasanparthy
-
అయ్యో పాపం అనుకుంటే.. పోలీసులకే షాకిచ్చాడు!
హన్మకొండ, సాక్షి: చనిపోయాడనుకున్న వ్యక్తి ఒక్కసారిగా లేచి మాట్లాడితే.. ఆ షాక్ ఎలా ఉంటుందో ఉహించుకోండి. అలాంటి ఘటనే వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. కుంటలో ఓ మృతదేహం తేలియాడుతున్నదన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన పోలీసులు.. ఆ వ్యక్తిని బయటికి లాగుతుండగా సదరు వ్యక్తి లేచి మాట్లాడడం చూసి షాక్‌కు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లా కావలికి చెందిన శ్రీనివాస్ కాజీపేటలోని ఓ గ్రానైట్ క్వారీలో పనిచేస్తున్నాడు. అతనితో పాటు మరో ఇద్దరు సోమవారం చిత్తుగా మద్యం సేవించి నగరంలోని రెడ్డిపురంలోని కోవెలెకుంటకు వెళ్లారు. అక్కడ కొంతసేపు కుంటలోకి దిగారు. మద్యం మత్తులో శ్రీనివాస్ కొంత ఒడ్డు మేరలో నిద్ర పోయాడు. శ్రీనివాస్ మృతి చెందినట్లుగా భావించిన వారు అక్కడినుంచి జారుకున్నారు. ఆ తర్వాత స్థానికులు ఓ వ్యక్తి మృతదేహం నీటిలో తేలియాడుతున్నట్లు గమనించి 108 అంబులెన్స్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అంబులెన్స్‌తోపాటు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుంట లోతుగా ఉన్నట్లు భావించిన పోలీసులు ఒకరిచేయి మరొకరు పట్టుకుని తేలియాడుతున్న ఆ వ్యక్తిని బయటికి లాగేందుకుప్రయత్నిస్తున్న క్రమంలో అతనే నేరుగా లేచి నిల్చున్నారు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్‌కు గురయ్యారు. బయటికి తీసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుంటలో చల్లదనానికి నిద్ర వచ్చనట్లు సదరు వ్యక్తి పోలీసులకు చెప్పాడు. తనకు రూ.50 ఇస్తే కాజీపేటకు వెళ్తానని చెప్పడంతో పోలీసులు అతనికి డబ్బులు ఇచ్చి పంపించి వేశారు. తాగి నీటిలో పడుకున్న వ్యక్తి.. చనిపోయాడనుకొని పోలీసులకు ఫోన్ చేసిన స్థానికులు.. తీరా వచ్చి చూస్తే షాక్ హనుమకొండ - రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు.. అది గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు మరియు 108 సిబ్బందికి సమాచారం… pic.twitter.com/zzR7SGbFwP— Telugu Scribe (@TeluguScribe) June 10, 2024 VIDEO CREDITS: Telugu Scribe -
సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
సాక్షి, హసన్‌పర్తి: తెలంగాణలో పోలీసుల వేధింపులే కారణమంటూ సూసైడ్ లేఖ రాసి పెట్టి ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన హన్మకొండ జిల్లాలో కలకలం సృష్టించింది.వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా హసన్పర్తికి చెందిన ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి సూసైడ్ లేఖ రాసి పెట్టి అదృశ్యమయ్యాడు. ఈ సందర్భంగా ప్రశాంత్ సూసైడ్ లేఖలో.. తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమని తెలిపాడు. సీఐ తన సెల్‌ఫోన్, వాచీ లాక్కుకొని తనను తీవ్రంగా కొట్టారని ప్రశాంత్ ఆరోపించారు. పోలీసులు సమస్యను పరిష్కరించకపోగా తీవ్రంగా కొట్టడంతో దెబ్బలు భరించలేక సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. అలాగే, తన దగ్గర అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వమంటే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమంటూ.. సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైన వ్యక్తిహన్మకొండ - పోలీసుల దెబ్బలు భరించలేక సూసైడ్ నోట్ రాసి, తన చావుకు హసన్ పర్తి సీఐ, ఎస్ఐ కారణమని అదృశ్యమైన వ్యక్తి.తన దగ్గర అప్పు తీసుకున్నవారు వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయిస్తే.. వారు తనను కొట్టారని ఆరోపణ. తన… pic.twitter.com/WFHGs1Qkea— Telugu Scribe (@TeluguScribe) May 1, 2024 Video Credit: Telugu Scribeఈ నేపథ్యంలో తన భర్తను కాపాడాలని హసన్‌పర్తి పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య శ్యామల హన్మకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసుల కారణంగా అవమాన భారంతో తన భర్త ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని ఆమె తెలిపారు. ఇక, ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
హన్మకొండ జిల్లా హసన్‌పర్తి SR యూనివర్సిటీలో సూసైడ్ కలకలం
-
80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: కొప్పుల
హసన్‌పర్తి: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 80 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఆదివారం హనుమకొండ జిల్లా కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల రోస్టర్ విధానంలో మార్పు చేసి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో లూయిస్ బ్రెయిలీ విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, రాష్ట్ర దివ్యాంగుల సంస్థల చైర్మన్ కేతిరి వాసుదేవరెడ్డి, కుడా చైర్మన్ సుందర్రాజ్, జెడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో ముగ్గురు రైతుల ఆత్మహత్య
మోత్కూరు, గన్నేరువరం, హసన్‌పర్తి: రుణ బాధలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. గురువారం ఒక్కరోజే వివిధ జిల్లాల్లో ముగ్గురు అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డారు. యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండాపురం గ్రామానికి చెందిన రైతు బీసు నాగరాజు (29) తనకున్న ఎకరంతో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశారు. పత్తి పంటలో దిగుబడి రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక బుధవారం రాత్రి ఇంట్లో పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలో మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా మైలారం గ్రామానికి చెందిన రైతు బండి సంపత్ (38) 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పెట్టిన పెట్టుబడి రాలేదు. దీంతో గురువారం తెల్లవారుజామున పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన పోరెడ్డి రాఘవరెడ్డి(42) పంట దిగుబడి రాక వడ్డీలు పెరిగిపోయాయి. దీంతో ఆందోళనకు గురై గురువారం పురుగుల మందుతాగాడు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
సర్పంచ్ అయితే మాకేంటి ?. పెద్దసార్ చెబితేనే వదిలేస్తాం..
సాక్షి, హసన్‌పర్తి : నువ్వు సర్పంచ్ అయితే నాకేంటి! లాక్డౌన్ ఉందని తెలియదా... ఏమైనా ఉంటే పెద్ద సార్‌కు చెప్పుకో... అంటూ ఓ ట్రెయినీ ఎస్సై వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. హసన్‌పర్తి మండలం సీతంపేట సర్పంచ్ జనగాని శరత్ దంపతులు ఇటీవల కరోనా బారిన పడ్డారు. పదిహేను రోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు మళ్లీ పరీక్ష చేయించుకునేందుకు శుక్రవారం ఉదయం హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు లేకపోవడంతో తిరుగుపయనమయ్యారు. అయితే, వారు హసన్‌పర్తి బస్టాండ్ వద్దకు చేరుకునే సరికి సమయం 10.20 గంటల అవుతుండడంతో పోలీసులు తనిఖీలు మొదలయ్యాయి. దీంతో శరత్ దంపతుల వాహనాన్ని ట్రెయినీ ఎస్సై ఆపారు. దీంతో ఆయన “సార్ నేను సీతంపేట సర్పంచ్‌ను. నాతో పాటు నా భార్యకు పక్షం రోజుల క్రితం కరోనా వచ్చింది. ఆస్పత్రికి వెళ్లివస్తున్నాం’ అని చెప్పినా వినకుండా బైక్ పక్కన పెట్టి మాట్లాడాలంటూ ఎస్సై నుంచి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత నచ్చచెప్పినా వినకపోగా రోడ్డు ఆవతలి వైపున ఉన్న పెద్ద సార్‌కు చెప్పుకుని, ఆయన అనుమతి ఇస్తేనే వదిలి పెడతానని స్పష్టం చేశాడు. దీంతో కాసేపు వేచి ఉన్న సర్పంచ్ శరత్ తనకు తెలిసిన ఎస్సైకు ఫోన్ చేయగా, ఆయన జోక్యం చేసుకోవడంతో సర్పంచ్‌ను పంపించారు. లాక్డౌన్ అమలుకు పోలీసులు నిరంతరం శ్రమిస్తుండగా, ఒకరిద్దరు వ్యవహరిస్తున్న తీరుతో శాఖకు అప్రతిష్ట వస్తోంది. ఇకనైనా ఉన్నతాధికారులు నిబంధనల అమలు విషయంలో సిబ్బందికి తగిన సూచనలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. చదవండి: అంబులెన్స్ ధరలు.. మోటారుసైకిల్‌పై మృతదేహం తరలింపు ధోవతి ఫంక్షన్ తెచ్చిన తంటా..∙ 10 మందికి సోకిన కరోనా -
భార్యతో గొడవపడి బయటకు.. శవమై ఇంటికి
హసన్‌పర్తి/వరంగల్: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివా రం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ఆరెపల్లికి చెందిన సుంకరి సదానందం చిన్న కుమారుడు కమల్(34) అక్షయపాత్రలో విధుల నిర్వహించేవాడు. కమల్ ఇటీవల కుమార్‌పల్లిలో కొత్త ఇళ్లునిర్మాణం చేపట్టాడు. అందుకు రూ.12లక్షల వరకు అప్పు చేశాడు. కాగా, ఈనెల 14న భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లి పోయాడు. వివిధ ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. ఈక్రమంలో ఆదివారం ఆరెపల్లిలోని అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో ఓ యువకుడు కాలిన గాయాలతో మృతి చెందినట్లు సమాచారం అందడంతో వెళ్లి పరిశీలించి కమల్ మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని వరంగల్ ఎంజీ ఎం మూర్చురీకి తరలించారు. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని మృతుడి తండ్రి సదానందం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు తెలిపారు. చదవండి: కాపురాన్ని సరిదిద్దుకుని సంతోషంగా వెళ్తుంటే.. -
బావ గొంతుకోసిన బావమరిది: అందుకే చంపేశానంటూ
హసన్‌పర్తి : వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు శివారులోని సుభాష్‌నగర్ సమీపంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. సొంత బావమరిదే మద్యం బాటిల్‌తో గొంతుపై పొడవడంతో బలమైన గాయాలతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. హసన్పర్తికి చెందిన మోతె చందు(26), పస్తం అయి కుమార్ సొంత బావ బావమరుదులు. స్థానికంగా బియ్యం వ్యాపారం చేసే చందు వద్ద అయికుమార్ సహాయకుడిగా ఉంటున్నాడు. ఈక్రమంలో ఇద్దరు కలిసి కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని చింతగట్టుకు గురువారం వచ్చి మద్యం తాగారు. ఈ క్రమంలో ఇరువురి నడుమ ఘర్షణ జరగగా, అక్కడ బెల్ట్ షాపు వద్ద ఉన్న మద్యం బాటిల్ పగులగొట్టి చందుపై అయికుమార్ దాడి చేయగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి, ఎస్సై చంద్రమోహన్ చేరుకుని వివరాలు ఆరా తీశారు. హత్య చేశాక అక్కడే.. చందును హత్య చేశాక నిందితుడు కుమార్ అక్కడే ఉన్నాడు. కుటుంబ సమస్యల కారణంగా మాటమాట పెరిగిందని చెప్పుకొచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఓ వివాహితతో సంబంధం కొనసాగిస్తున్నట్లు కుమార్‌పై చందు ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో గొడవ జరగగా, మద్యం మత్తుతో పాటు గంజాయి సేవించిన ఆయన హత్య చేసినట్లు తెలుస్తోంది. మృతుడికి భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇక చందును హత్య చేసేందుకు తమతో పడని వారే కుమార్‌కు డబ్బు ఇచ్చి ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపించడం గమనార్హం. చదవండి: వివాహేతర సంబంధం: మత్తుకు బానిసై కన్నతండ్రే.. -
గుడిలో గుట్టుగా బాల్యవివాహం
హసన్‌పర్తి: హసన్‌పర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి జరిపిస్తున్న బాల్య వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లికి చెందిన ప్రవీణ్‌కు అదే గ్రామానికి చెందిన బాలికతో వివాహం నిశ్చయమైంది. అమ్మాయి మైనర్ కావడంతో గుట్టుగా పెళ్లి చేయాలని భావించిన పెద్దలు, హసన్‌పర్తి మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి 10.30 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. వివాహ సమయానికి వధువు, వరుడు, బంధువులు ఆలయానికి చేరుకున్నారు. అయితే, ఆలయంలో బాల్యవివాహం జరుగుతోందన్న విషయం తెలుసుకున్న పోలీసులు, అక్కడికి చేరుకుని వధువు, వరుడి కుటుంబసభ్యులతో మాట్లాడారు. వధువు మైనర్ కావడంతో పెళ్లి ఆపేయాలని సూచించారు. అనంతరం బాలికను చైల్డ్‌లైన్ కమిటీకి అప్పగించారు. వధువు, వరుడితో పాటు వారి తల్లిదండ్రులు, పురోహితుడు, ఫొటోగ్రాఫర్, బ్యాండ్ కార్మికులకు చైల్డ్ లైన్ కమిటీ సభ్యులు శనివారం ఉదయం కౌన్సెలింగ్ నిర్వహించారు. బాలికకు పెళ్లి ఎలా చేస్తారంటూ పురోహితుడిని హెచ్చరించి, తొలి తప్పుగా భావించి వదిలిపెట్టారు. జల్సాలకు డబ్బివ్వలేదని నాన్ననే చంపేశాడు బిజినేపల్లి (నాగర్‌కర్నూల్): జల్సాలకు డబ్బు ఇవ్వలేదనే ఆగ్రహంతో కన్నకొడుకే బండరాయితో మోది తండ్రిని హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం..నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్‌పల్లికి చెందిన చెవిటి శ్రీనివాస్ (48) కు ఇద్దరు కుమారులు. వ్యవసాయ పనులు చేస్తూ వారిద్దర్నీ చదివించాడు. అయితే పెద్ద కుమారుడు గణేశ్ జల్సాలకు అలవాటు పడి జులాయిగా తిరుగుతున్నాడు. ఏదైనా పని చేసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం గ్రామ శివారులో పనిచేస్తున్న తండ్రి వద్దకు వెళ్లి డబ్బులు కావాలని అడగ్గా ఇచ్చేది లేదన్నాడు. దీంతో గణేశ్ పక్కనే ఉన్న బండరాయితో తండ్రి తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలైన శ్రీనివాస్‌ను చుట్టుపక్కల వారు గమనించి వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు సాయంత్రం మృతి చెందాడు. ఈ ఘటనపై శనివారం మృతుడి తమ్ముడు మణ్యం ఫిర్యాదు మేరకు సీఐ గాంధీనాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయ్యో.. పాపం చిలుకూరు: పంట పొలాల్లో ఓ ఆడశిశువు మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండాపురంలో శనివారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామ శివారులోని పొలాల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువును పడేసి వెళ్లారు. ఉదయం పొలాలకు వెళుతున్న కూలీలు.. శిశువును గమనించి పరిశీలించగా అప్పటికే చనిపోయి ఉంది. శిశువు నోట్లో పాలపీక పెట్టి ఉంచారు. ఏడవకుండా ఇలా చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ వైద్యశాల కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు. ఆడపిల్ల పుట్టిందనే వివక్షతో తల్లిదండ్రులు ఇలాంటి దారుణానికి పాల్పడ్డారా..? లేదా శిశువు మృతి చెందడంతో పడేసి వెళ్లారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోచోట.. వాగులో పడేశారు.. వర్ని: నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం కారేగాం శివారులోని వాగులో «రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని శనివారం స్థానికులు గుర్తించారు. తిమ్మాపూర్– లక్ష్మాపూర్ వెళ్లే దారిలో వంతెన పైనుంచి చిన్నారి మృతదేహాన్ని పడేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు. -
వాటే క్రియేటివిటీ: సీసాలో ఎడ్లబండి
హసన్‌పర్తి: వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు గ్రామానికి చెందిన విద్యార్థి సోమోజు కిరణ్‌కుమార్ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఓ సీసాలో వ్యవసాయానికి ప్రధాన అవసరమైన ఎడ్ల బండిని రూపొందించాడు. బాటిల్ ఎక్కడా పగలకుండా ఎంతో జాగ్రత్తతో ఈ కళారూపం తీర్చిదిద్దాడు. దీన్ని తయారుచేయడానికి నెల సమయం పట్టిందని కిరణ్‌కుమార్ తెలిపాడు. ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేసిన కిరణ్ ప్రస్తుతం స్వగ్రామంలో వ్యవసాయం చేస్తున్నాడు. బియ్యం గింజపై రైతు.. జగిత్యాల టౌన్: జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ గతంలో ఎ న్నో సూక్ష్మ కళాకృతులు తయారుచేశారు. తా జాగా బియ్యపు గింజ మధ్యలో నాగలి పట్టుకుని నడుస్తున్న రైతు ఆకృతిని బంగారంతో తయారుచేసి పొందుపర్చాడు. పొడవు 0.95 మిల్లీమీటర్లు, వెడల్పు 0.43 మిల్లీమీటర్లు, 0.01మిల్లీ బంగారంతో రైతన్న విగ్రహం తయారీ చేసినట్లు, దీనికి సుమారు 6 గంట ల సమయం పట్టిందని దయాకర్ మీడియా కు తెలిపాడు. ఈ విధంగా జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా బియ్యపు గింజలో రైతన్న రూపాన్ని ఆవిష్కరించి రైతన్నపై సమాజానికి ఉన్న గౌ రవాన్ని చాటాడు. దయాకర్ గతంలో గాంధీ జయం తిన గుండు పిన్నుపై గాంధీ విగ్రహాన్ని చెక్కాడు. గురుపూజోత్సవం సందర్భంగా గురుశిషు్యల అనుబంధా న్ని గుండుపిన్నుపై ఆవిష్కరించాడు. -
అంజలికి మంత్రి కేటీఆర్ చేయూత
సాక్షి, వరంగల్: జిల్లాలోని హసన్పర్తికి చెందిన మేకల అంజలికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు సోమవారం ఆర్థిక సాయం అందించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఐఐటీలో చదువుతున్న అంజలి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలోకి ప్రవేశించింది. దీంతో ఆమెకు ఫీజులు, లాప్టాప్ ఖరీదు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.1,50,000 రూపాయలను అందించారు. కాగా అంజలి గతేడాది హసన్‌పర్తిలోని గురుకులంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకొని ఐఐటీలో మంచి ర్యాంకు సాధించింది. అయితే తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమేనని, పై చదువుల నిమిత్తం తనకు సహాయం అందించాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. (మాకు సాయం అందించండి) అప్పుడు దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్ గత సంవత్సరం సైతం ఫీజుల నిమిత్తం అవసరమైన ఆర్థిక సాయం అందించారు. అంజలి తండ్రి రమేష్ ఆటో డ్రైవర్ కావడంతో ఐఐటీ విద్య పూర్తయ్యే వరకు అవసరమైన నిధులను వ్యక్తిగతంగా అందజేస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు అంజలి రెండో సంవత్సరానికి సంబంధించిన ఖర్చులను నేడు ప్రగతి భవన్లో అంజలికి అందజేశారు. కేటీఆర్ చేసిన సాయానికి అంజలి కుటుంబం ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. (‘ఆస్క్ కేటీఆర్’పేరిట ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో కేటీఆర్ సంభాషణ) -
కరోనా : మొన్న కూతురు.. నేడు తల్లి!
సాక్షి, వరంగల్ : జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఏప్రిల్ 21 తర్వాత కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో పరిస్థితి అదుపులోకి వస్తోందని భావిస్తున్న తరుణంలో సోమవారం మరో కేసు బయట పడింది. హన్మకొండ పూరిగుట్ట తండాకు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లుగా డీఎంహెచ్ఓ లలితాదేవి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. హసన్‌పర్తి పూరిగుట్ట తండా వాసి, ఢిల్లీలో కానిస్టేబుల్‌గా పనిచేసే వ్యక్తి పదేళ్ల కుమార్తెకు గతంలో పాజిటివ్ వచ్చిన విషయం విదితమే. ఇప్పుడు బాలిక తల్లికి సైతం వైరస్ సోకిందని డీఎంహెచ్ఓ తెలిపారు. ఏప్రిల్ 21న బాలికకు పాజిటివ్ రాగా.. ఆ చిన్నారి తల్లి కూడా గాంధీ ఆస్పత్రిలో కుమార్తెతో పాటే ఉంటోంది. ఈక్రమంలో అనుమానంతో ఆమె శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో గాంధీ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. (కరోనా : హైదరాబాద్ పాతబస్తీకి ఊరట) 28కి చేరిన కేసులు సోమవారం నమోదైన పాజిటివ్ కేసుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 37కు చేరింది. ఇక ఇప్పటికే రెడ్‌జోన్‌లో ఉన్న వరంగల్ అర్బన్ జిల్లాలో కేసుల సంఖ్య 28కి చేరినట్లయింది. అర్బన్ జిల్లాలో 15 కంటైన్మెంట్ క్లస్టర్లు ఉండగా.. నాలుగింటిలో సడలింపు ఇచ్చారు. మిగిలిన 11 క్లస్టర్లు కూడా ఎత్తివేయాలని అధికా రులు ప్రభుత్వానికి నివేదిక పంపించగా.. సోమవారం మరో కేసు రావడంతో క్లస్టర్ల ఎత్తివేత కష్టమేనన్న చర్చ జరుగుతోంది. ఇక పూరిగుట్ట తండా ఇప్పటికే కంటైన్మెంట్ క్లస్టర్‌గా కొనసాగుతోంది. తాజాగా మ రో కేసు రావడంతో బయటి వారెవరూ లోపలకు రాకుండా... లోపల ఉన్న వారు బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. (తెలంగాణలో మద్యానికి ఓకే!) ‘పాజిటివ్’ కేసులపై అధికారుల సమీక్ష పూరిగుట్ట తండాకు చెందిన పదేళ్ల చిన్నారి తల్లికి సైతం కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కంటైన్మెంట్ క్లస్టర్లలో నిఘా ముమ్మరం చేయడంతో పాటు ప్రత్యేక సర్వే నిర్వహించేందుకు బృందాలను కేటాయించారు. ఈ మేరకు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, పోలీసు కమిషనర్ డాక్టర్ వి.రవీందర్, గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి, డీఎంహెచ్ఓ లలితా తదితరులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోన వైరస్ కట్టడికి మరింత కఠినంగా వ్యవహరించాలని, రెడ్‌జోన్‌లో ఉన్నందున జనసంచారం విషయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వొద్దని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. వాహనాల తనిఖీలు యథాతథంగా కొనసాగించాలని సూచించారు. కాగా, జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారిలో 25 మంది డిశార్జి కాగా, ముగ్గురు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
వాట్సాప్ వీడియోకాల్‌లో కడసారి చూపు
సాక్షి, హసన్‌పర్తి: ఓ రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతని అంత్యక్రియలకు భార్య, కుమారుడు హాజరుకాలేకపోయారు. అమెరికాలో ఉండడం వల్ల కడసారి చూపును వాట్సాప్ వీడియోలో చూస్తూ రోధించసాగారు. కూతురే కుండ పట్టి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ సంఘటన హసన్‌పర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు.. హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన కందుకూరి సూర్య నారాయణ(65) కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ పొందాడు. ఆయనకు భార్య శాంతమ్మ, కుమారుడు కిరణ్, కూతురు కృష్ణవేణి ఉన్నారు. కిరణ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కూతురు, అల్లుడు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్నారు. రెండు నెలల క్రితం శాంతమ్మ అమెరికాలోని కుమారుడి వద్దకు వెళ్లగా ఇంట్లో సూర్యనారాయణ ఒక్కడే ఉన్నారు. ఈ నెల 8న మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన సూర్యనారాయణ మృతదేహాన్ని మరుసటిరోజు పోలీసులు రాయపర్తిలో కెనాల్ నుంచి బయటకు తీశారు. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావించారు. ఇదిలా ఉండగా.. సూర్యనారాయణ ఇంటికి తాళం వేసి ఉండటంతో బంధువులు ఆయన కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే రాయపర్తిలో ఈనెల 9న గుర్తు తెలియని వ్యక్త మృతదేహం లభ్యమైనట్లు హసన్‌పర్తి పోలీసులు తెలపగా.. రాయపర్తి పోలీసులు పంపిన ఫొటోలను బంధువులకు చూపించారు. దీంతో మృతుడు సూర్యనారాయణగా గుర్తించారు. భార్యకు సమాచారం సూర్యనారాయణ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని బంధువులు ఫోన్ ద్వారా అటు అమెరికాలో ఉంటున్న భార్య శాంత, కుమారుడు కిరణ్, ఇటు హైదరాబాద్‌లో ఉంటున్న కూతురు కృష్ణవేణికి అందించారు. అయితే అమెరికాలో ఉంటున్న వారు ఇక్కడికి రావడం సాధ్యం కాదని, దీంతో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కడసారి చూపులు చూశారు. ఇదిలా ఉండగా, ఆదివారం హైదరాబాద్ నుంచి కూతురు వచ్చి అంత్యక్రియలు నిర్వహించింది. -
తెలంగాణ జానపద కళాకారిణి మృతి
హసన్‌పర్తి : జానపదం మూగబోయింది. 30 ఏళ్ల పాటు తన గళంతో ప్రజలను మంత్ర ముగ్ధులను చేసిన తెలంగాణ జానపద కళాకారిణి సంధ్య (50)ఇక లేరు. అనారోగ్య కారణంతో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో తుది శ్యాస విడిచారు. జానపద కళాకారుడు దివంగత శంకర్ భార్య సంధ్య. ప్రస్తుతం చింతగట్టు క్యాంపులోని పే అండ్ అకౌంట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఎస్సార్‌ఎస్సీ క్యాంప్ క్వార్టర్‌లోనే ఉంటున్నారు. కుమార్తె రఘమయ్ బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, కుమారుడు మింటు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. 2017లో సంధ్యకు ఉత్తమ జనపద కళాకారిణి అవార్డుతో సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా అవార్డుతో పాటు రూ.లక్ష పురస్కారం అందుకున్నారు. సంధ్య మృతదేహాన్ని జానపద కళాకారులు, పే అండ్ అకౌంట్ అధికారులు, ఎస్సారెస్పీ, దేవాదుల, టీఎన్జీవోస్ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌కుమార్, పే అండ్ అకౌంట్ అధికారిణి పద్మజ, టీఎన్జీవోస్ యూనిట్ అధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్, దేవరకొండ యాదగిరి, రాజమౌళితో పాటు నాగరి రికార్డింగ్ సెంటర్ నిర్వాహకుడు సీతా రాఘవేందర్, జడల శివ, దార దేవేందర్‌లు పాల్గొన్నారు. -
డబ్బుల కోసమే దంపతుల హత్య
వరంగల్ క్రైం: హసన్‌పర్తి మండల కేంద్రంలో గడ్డం దామోదర్, పద్మ దంపతులను హత్య చేసిన నిందితుడిని పోలీసులు 24 గంటలు గడవక ముందే అరెస్టు చేశారు. దంపతుల దారుణ హత్య వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో సంచలనం కలిగించింది. హత్యను ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడిని పక్కా.. ఆధారాలతో అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ మాట్లాడారు. హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన కామారపు ప్రశాంత్ (32) కిరాణం షాపు నిర్వహించి నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని ఎలాగైన పూడ్చాలనే ఉద్దేశ్యంతో పక్కనే కిరాణం షాపు నిర్వహించుకుంటున్న మృతులు గడ్డం దామోదర్(60), గడ్డం పద్మ(54)లను గత కొన్ని రోజులుగా మచ్చిగా చేసుకోని తరచుగా వస్తూపోతూ ఉండేవారని తెలిపారు. నిం దితుడికి డబ్బులు అవసరం రావడంతో సోమవారం రాత్రి రహస్యంగా ఇంటిలోకి చొరబడి మృ తురాలైన పద్మను బాత్రూం వద్ద కత్తితో బెది రించడంతో పద్మ ప్రతిఘటించింది. దీంతో ప్ర శాంత్ సిమెంట్ ఇటుకతో ముఖంపై బలంగా కొట్టి కత్తితో గొంతుకోసి హత్య చేసినట్లు సీపీ తెలిపారు. దీంతో పాటు ఇంట్లో మంచంపై పడుకొని ఉన్న దామోదర్(వికలాంగుడు)పై కూడా సిమెంట్ ఇటుకతో విచక్షణ రహితంగా కొట్టి కత్తితో గొంతుకోసి హత్య చేసినట్లు సీపీ రవీందర్ వివరించారు. గడ్డం పున్నం చందర్ ఫిర్యాదు మేరకు కామారపు ప్రశాంత్‌పై ఐపీసీ సెక్షన్లు 449, 380, 302 కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం దంపతులను హత్య చేసి దోచుకున్న బంగారం, వెండి ఆభరణాలను నిందితుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 4,75,863 విలువ గల 132.280 గ్రాముల బంగారం, 356.240 గ్రాముల వెండి, రూ.6,500 నగదు, ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫలితం ఇచ్చిన టీం వర్క్.. హత్య జరిగిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్ ఎవరిని నిందించకుండా అధికారులందరిని సమావేశ పరిచి ఇది మనందరికి ఛాలెంజ్ 24 గంటల్లో నిందితుడిని అరెస్టు చూపితేనే జనంలో మనపై నమ్మకం ఉంటుంది. అంటూ ప్రోత్సాహం నిం పారు. దీంతో సవాల్‌గా తీసుకున్న పోలీసులు అ న్ని కోణాల్లో చేసిన టీం వర్క్‌కు ఫలితం దక్కింది. స్వయంగా పోలీసు కమిషనర్ ప్రెస్ మీట్లో ప్రతిభ చూపిన ప్రతి ఒక్కరిని అభినందించారు. నివ్వెర పరిచిన నిందితుడు వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని హసన్‌పర్తి మండల కేంద్రంలో జరిగిన దంపతుల దారుణ హత్య కేసు చేదనలో పోలీసులు చూపిన ప్రతిభ ప్రశంసలు అందాయి. హత్య వెలుగు చూసిన గంటలోపే నిందితుడిని పసిగట్టడంతో పోలీసులు సక్సెస్ అయ్యారు. కానీ నిందితుడి భౌతిక ఆకారం, హావ భావలను చూసి నిందితుడు ఖచ్చితంగా హత్య చేసి ఉంటాడు అనే విషయం పూర్తి స్థాయిలో విచరణ చేసే వరకు నిర్థిరించుకోలేక పోయారు. నిందితుడు పోలీసుల విచారణలో అర్థరాత్రి తర్వాత నోరు విప్పడంతో విచారణలో పాల్గొన్న అధికారులంతా ఒక్కసారిగా నిర్ఘంతపోయారు. సీనియర్ పోలీసు అధికారులకు సహితం అంతుచిక్కకుండా నిందితుడి ప్రవర్తన ఉండటం గమనార్హం. గడ్డం దామోదర్, గడ్డం పద్య హత్య సంఘటనలో స్థానిక ప్రజలతో పాటు నిందితుడు అక్కడె తిరగడం, ఎవ్వరికీ అనుమానం రాకుండా ప్రవర్తించడం, ఎలాంటి భయం లేకుండా చాలా సమయం సంఘటన స్థలంలో ఉండటం పోలీసులకు సహితం అంతు చిక్కలేదు. స్థానిక పోలీసులు హత్య జరిగిన తీరును పరిశీలించిన తర్వాత, స్థానికులను విచారించిన తర్వాత హత్య నిందితుడు కామారపు ప్రశాంత్ అని ప్రాథమికంగా అనుమానంతోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అ నంతరం నిందితుడి ఫోన్ నంబర్ ఆధారంగా, పో లీసు డాగ్ చూపెట్టిన క్లూ ఆధారంగా విచారణ ప్రా రంభించారు. హసన్‌పర్తి పోలీసు స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తుల్లో ఒకడైన నిందితుడు ప్రశాంత్ నోరు తెరిచే వరకు కూడా పోలీసులు నిర్థారించలేకపోయారు. కాజీపేట ఏసీపీ సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్‌లు ఇద్దరి దగ్గర ఉన్న సమాచారం నిందితుడు ప్రశాంత్ చుట్టే ఆధారాలు తిరగడంతో నిందితుడి ఈ ఇద్దరు అధికారులు ఎంతో ఓపికతో ప్రశ్నించి కూపీ లాగారు. దీంతో నిందితుడు హత్య చేసిన విధానాన్ని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. నిందితుడిని ఉరి తీయాలి.. హసన్‌పర్తి: మండల కేంద్రానికి చెందిన గడ్డం దామోదర్, పద్మ హత్యకు కారకుడైన కామారపు ప్రశాంత్‌ను ఉరి తీయాలని బంధువులు, మిత్రులు, పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మృతదేహాలతో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. అధికారులకు అభినందనలు... దంపతుల హత్యను 24 గంటల్లో చేధించడంలో ప్రతిభ కనపరిచిన పోలీసులను వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్ అభినందించారు. దర్యాప్తు బృందం కాజీపేట ఏసీపీ సత్యనారాయణ, హసన్‌పర్తి ఇన్స్పెక్టర్ పుల్యాల కిష న్, ఎస్సైలు టీవీఆర్ సూరి, సాంబమూర్తి, వీరభద్రారావు, విజయ్, రాçహుల్, సుధాకర్, నాగబా బు, కానిస్టేబుల్ మధుకర్, టాస్క్‌ఫోర్స్, తదిత ర విభాగాల అధికారులను అభినందించారు. -
జంట హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు
సాక్షి, హసన్‌పర్తి : పట్టణంలో కలకలం రేపిన వృద్ద దంపతుల హత్య మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. హత్యకు పాల్పడిన నిందితుడి బుధవారం హసన్‌పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తికి చెందిన గడ్డం దామోదర్(58), పద్మ(49) దంపతులు సోమవారం రాత్రి గుర్తు దారుణ హత్య గురయ్యారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు హసన్పర్తికి చెందిన కిరాణ దుకాణం యజమాని కామారపు ప్రశాంత్(32)గా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.4,75,863 విలువ చేసే బంగారాన్ని, 356.240 గ్రాములు వెండి అభరణాలు, ఒక కత్తి, సెల్‌ఫోన్‌తో పాటు 6,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దామోదర్ పొరుగింట్లోనే ఉంటున్న ప్రశాంత్ ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం. -
హసన్‌పర్తిలో జంట హత్యలు
-
హసన్‌పర్తిలో దారుణం..
సాక్షి, వరంగల్ (అర్బన్) : జిల్లాలోని హసన్‌పర్తిలో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు మంగళవారం దంపతుల గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో మృతిచెందిన భార్యాభర్తలను దామోదర్, పద్మగా గుర్తించారు. దోడిపీ దొంగలే ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దోపిడీయత్నాన్ని దంపతులు అడ్డుకోవడంతో వారిని దారుణంగా హతమార్చారని భావిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తును ప్రారంభించారు. క్లూస్ టీమ్‌లు, డాగ్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దింపి ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. ఈ జంట హత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనపై దర్యాప్తు, నిందితుల గాలింపు కోసం పోలీసులు 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశాయి. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
హసన్‌పర్తి: చేసిన అప్పులు తీర్చలేనని ఆందోళనకు గురైన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ రూరల్ జిల్లా హసన్‌పర్తి మండలం బైరాన్‌పల్లిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బైరి గణేష్‌రెడ్డి(40) కుటుంబ పోషణతోపాటు వ్యాపారం నిమిత్తం వివిధ వర్గాల నుంచి అప్పులు చేశాడు. అయితే సుమారు రూ.10 లక్షలు అప్పులు చేయగా వాటిని తీర్చలేనని మనోవేదనకు గురైన గణేష్ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య రేణుక, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. -
రూ.50 లక్షలకు టోకరా ?
పరారీలో నిందితుడు ఆందోళనలో బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుకు సిద్ధం హసన్‌పర్తి: హసన్పర్తికి చెందిన ఓ వ్యాపారి రూ.50 లక్షలతో ఉడాయించాడని సమాచారం. వ్యాపార నిమిత్తం వివిధ వర్గాల నుంచి అప్పుగా తీసుకున్న డబ్బులు చెల్లించలేనని భావించి ఊరు వదిలి వెళ్లిపోయాడు. వివరాలిలా ఉన్నాయి... హసన్పర్తికి చెందిన ఓ వ్యాపారి నగరంలోని 46వ డివిజన్ గోపాలపురం విజయానగర్ కాలనీలో ఓ షాప్ నిర్వహణకు వివిధ వర్గాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాడు. దీంతో పాటు రోజూవారీ చీటీల రూపంలో కూడా అప్పు చేశాడు. అయితే వ్యాపారంలో పెద్ద మొత్తంలో నష్టం రావడంతో అప్పు చెల్లించలేననే భయంతో పరారయ్యాడు. అయితే పరారీ కావడానికి నాలుగు రోజుల ముందు కూడా రూ. 2 లక్షలు అప్పు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. రూ.10 వడ్డీ చొప్పున... వ్యాపారి తనకు అవసర నిమిత్తం రూ.10 చొప్పున వడ్డీకి డబ్బులు తీసుకున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నా రు. ప్రతి రోజు రూ.3వేల చొప్పున వడ్డీ కట్టే వాడని సమాచారం. షాప్ ద్వారా వచ్చే లాభంతో పాటు అదనంగా డబ్బులు వడ్డీ రూపంలో అప్పుల వారికి చెల్లించేవాడని తె లిసింది. దీంతో ఇటు అప్పులు పెరగడం, అటూ షాప్‌లో నష్టాలు రావడంతో ఉడాయించాడు. చిట్టీలు నడిపించే వారు రెండు రోజులుగా అతని కోసం ప్రయత్నించినా అ డ్రస్ లభించలేదు. అతడి ఇంటికి వెళ్లినప్పటికీ కుటుంబ సభ్యుల నుంచి సరైన సమాధానం రావడం లేదని బాధితులు పేర్కొన్నారు. దీంతో అప్పులు ఇచ్చిన వారు పోలీ స్‌స్టేన్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. -
కుటుంబ కలహాలతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
హసన్‌పర్తి : కుటుంబ కలహాలతో ఆటో డ్రైవర్ మృతిచెందిన సంఘటన హసన్‌పర్తిలో ఆదివారం జరిగింది. ఎస్సై రవికుమార్ కథనం ప్రకారం.. హసన్పర్తికి చెందిన నల్ల రాజు(33)కు భార్య శ్రీలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. దంపతుల మధ్య గత కొంతకాలంగా కలహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం శ్రీలత భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన రాజు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కే సు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆగని బియ్యం దందా
పీడీఎస్ బియ్యం సేకరణపై అనుమానాలు నెలకోసారి పట్టివేత డీలర్లే ప్రధాన సూత్రధారులు హసన్‌పర్తి : పేదలకు చెందాల్సిన బియ్యం పక్కాదారి పడుతున్నాయి. అక్రమార్కులపై కేసులు నమోదు చేసినా బియ్యం దందా ఆగడం లేదు. నాలుగు నెలలుగా బియ్యం వ్యాపారులపై నాలుగు కేసులు నమోదైనా మళ్లీ అదే మార్గం పట్టారు. 40 రోజుల క్రితం ఇదే ముఠా హుస్నాబాద్‌లో లారీలతో పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 15 రోజుల్లో మళ్లీ వారు సుమారు 80 క్వింటాళ్ల బియ్యం సేకరించి అధికారులకు చిక్కారు. ఆ తర్వాత నెల తిరగకముందే శనివారం మళ్లీ 80 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని స్వయంగా లబ్ధిదారుల నుంచే కొనుగోలు చేసి.. రెండుమూడు రూపాయలకు ఎక్కువగా అమ్ముకుంటున్నామని నిందితులు చెబుతున్న మాటల్లో స్పష్టత లేదు. బియ్యం సేకరణపై అనుమానాలు.. రేషన్ బియ్యం దందా చేసే వారు పేర్కొంటున్న విధంగా బియ్యం సేకరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కూలీలకు వెళ్లేవారు. ఈ బియ్యాన్ని వినియోగించుకుంటున్నారు. అయితే కార్డులు కలిగిన మధ్యతరగతి వర్గాలు మాత్రం రేషన్‌షాపుల నుంచి తీసుకొచ్చిన బియ్యాన్ని రూ.8 నుంచి రూ.10 వరకు విక్రయిస్తున్నారు. కొందరైతే నెలవారీగా బియ్యం తీసుకెళ్లడం లేదు. ఈ బియ్యాన్ని సదరు డీలర్లు బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రేషన్‌షాపుకు వచ్చే క్రమంలోనే లారీని మధ్యలోనే నిలిపివేసి.. బియ్యాన్ని కొంతమంది డీలర్లు అమ్ముతున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా నిందితుల మాత్రం అధికారులకు మరోలా వాంగ్మూలం ఇస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఉల్లిగడ్డలు విక్రయించి.. అందుకు బదులుగా బియ్యం తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. హసన్‌పర్తిలో మరో రెండు ప్రాంతాల్లో పెద్దమొత్తంలో రేషన్ బియ్యం దందా నడుస్తున్నా అధికారులు ఎందుకు దాడులు చేయడం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
విధినిర్వహణలో ఉండగా కానిస్టేబుల్ మృతి
హసన్‌పర్తి (వరంగల్ జిల్లా) : హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ (పీసీ నెంబర్ 1054) మంగళవారం మధ్యాహ్నం గుండెనొప్పితో మరణించాడు. విధినిర్వహణలో ఉన్న శ్రీనివాస్ ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన తోటి పోలీసులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. శ్రీనివాస్ 1993 బ్యాచ్‌కు చెందినవాడు. -
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
వరంగల్ : హసన్‌పర్తిలోని కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ బాయ్స్ హాస్టల్లో డి.సందీప్ గౌడ్(19) అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. సందీప్ ప్రస్తుతం బీటెక్(సివిల్) రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మరి కాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్
హసన్‌పర్తి (వరంగల్) : మరి కొద్దిసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు.. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని పారిపోయిన సంఘటన వరంగల్ జిల్లా హసన్‌పర్తిలో ఆదివారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన యువతికి, హన్మకొండకు చెందిన కోల రఘుతో పెద్దల సమక్షంలో వివాహం నిశ్చయమైంది. కాగా ఆదివారం మరి కాసేపట్లో తాళి కట్టాల్సి ఉందనగా.. వరుడు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో పెళ్లి కూతురి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుడు రఘు ఎల్ఐసీ కార్యాలయంలో జోనల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. పెళ్లి కొడుకు పెళ్లిని నిరాకరించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.