జిల్లాలోని హసన్‌పర్తిలో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు మంగళవారం దంపతుల గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో మృతిచెందిన భార్యాభర్తలను దామోదర్, పద్మగా గుర్తించారు. దోపీడి దొంగలే ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దోపిడీయత్నాన్ని దంపతులు అడ్డుకోవడంతో వారిని దారుణంగా హతమార్చారని భావిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తును ప్రారంభించారు. క్లూస్ టీమ్‌లు, డాగ్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దింపి ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు.