మరి కాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్ | Bride groom runs away from his marriage | Sakshi
Sakshi News home page

మరి కాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్

Published Sun, Dec 27 2015 4:06 PM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM

మరి కాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్

మరి కాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్

హసన్‌పర్తి (వరంగల్) : మరి కొద్దిసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు.. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని పారిపోయిన సంఘటన వరంగల్ జిల్లా హసన్‌పర్తిలో ఆదివారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన యువతికి,  హన్మకొండకు చెందిన కోల రఘుతో పెద్దల సమక్షంలో వివాహం నిశ్చయమైంది.

కాగా ఆదివారం మరి కాసేపట్లో తాళి కట్టాల్సి ఉందనగా.. వరుడు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో పెళ్లి కూతురి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుడు రఘు ఎల్‌ఐసీ కార్యాలయంలో జోనల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. పెళ్లి కొడుకు పెళ్లిని నిరాకరించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement