Run away
-
ముమ్మరంగా ఆపరేషన్ ‘జానీ’
హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన సస్పెండెడ్ నేత జానీ మాస్టర్(షేక్ జానీ బాషా) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఒకవైపు పోక్సో యాక్ట్ కేసుతో పాటు ఆయన లైంగిక వేధింపుల వ్యవహారంపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు.. జానీ పరారీలో ఉన్నట్లు ప్రకటించిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు.జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశాం. ప్రస్తుతం పరారీలో లో ఉన్నాడు. అతన్ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.::రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసింది తెలిసిందే. మరోవైపు జానీ బాధితురాలు నిన్న స్టేట్ విమెన్ కమిషన్‌ను ఆశ్రయించింది. మహిళా సంఘాలతో కలిసి మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదను కలిసిన బాధితురాలు.. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో ఫిర్యాదును విచారణ స్వీకరించిన మహిళా కమిషన్.. జానీ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే టైంలో బాధితురాలికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.ఇక.. లైంగిక దాడి కేసు తర్వాత జానీ ఆచూకీ తెలియరాలేదు. రాజకీయ, సినీ ప్రముఖుల అండతో జానీ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ విమర్శలకు తలొగ్గి ఆయన్ని అరెస్ట్ చేస్తారని అంతా భావించారు. అయితే ఇప్పుడు ఆచూకీ లేకుండా పోయాడంటూ ప్రకటనలు ఇస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు కొందరు.ఈ అభియోగాల తర్వాత జానీ ఏ మీడియాతో మాట్లాడలేదు. మూడు రోజుల కిందటే అజ్ఞాతంలోకి వెళ్లిపోయి తన ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు. కొండపూర్లోని నివాసానికి తాళం వేసి ఉంది. తొలుత నెల్లూరులో ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన నార్సింగి పోలీసులు.. ఆ తర్వాత లడ్ఢాఖ్‌లో ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లి స్థానిక పోలీసులను సంప్రదించారు. ఆయన భార్య ఆచూకీ కూడా తెలియరావడం లేదు. మొత్తంగా నాలుగు టీంలతో ఆపరేషన్ జానీని ముమ్మరం చేశారు. కేసులో రెండ్రోజులకే ట్విస్ట్జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘2017లో జానీ మాస్టర్ పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులుగా వెళ్లాం. అక్కడ హోటల్లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు. .. దీన్ని అవకాశంగా తీసుకుని.. హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు. వేధింపులు భరించలేక జానీ మాస్టర్ బృందం నుంచి బయటకొచ్చేశాను. అయినా సొంతంగా పని చేసుకోనివ్వకుండా, ఇతర ప్రాజెక్టులు రానీయకుండా ఇబ్బంది పెట్టాడు’’ అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు.ఈమేరకు బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును నార్సింగికి బదిలీ చేశారు. అయితే.. మైనర్‌గా ఉన్న సమయంలోనే ముంబయి హోటల్లో ఆయన తనపై అత్యాచారం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. దీంతో పోక్సో యాక్ట్‌ను పోలీసులు ఎఫ్ఐఆర్లో యాడ్ చేశారు. ఇదీ చదవండి: జానీ వ్యవహారంపై పవన్ మౌనం -
డ్రైవర్ లేకుండానే... 70 కి.మీ. వెళ్లిన గూడ్స్
జమ్మూ/చండీగఢ్: గూడ్స్ రైలొకటి డ్రైవర్ లేకుండానే 70 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. అధికారులు చివరికి అప్రమత్తమై ఇసుక బస్తాలను పట్టాలపై అడ్డుగా ఉంచి రైలును నిలపగలిగారు. ఘటన జమ్మూ–జలంధర్ సెక్షన్లో ఆదివారం ఉదయం 7.25 నుంచి 9 గంటల మధ్యలో చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్ నుంచి కంకర లోడున్న 53 బోగీల డీజిల్ లోకోమోటివ్ గూడ్స్ రైలు పంజాబ్ వైపు బయలుదేరింది. డ్రైవర్ మార్పిడి కోసం కథువా స్టేషన్ వద్ద రైలును ఆపారు. తర్వాత ఏం జరిగిందో ఏమో..రైలు నెమ్మదిగా జమ్మూ–జలంధర్ సెక్షన్ దిశగా ముందుకు సాగింది. కొంత సేపటికి విషయం తెలిసిన అధికారులు ఆ మార్గంలోని స్టేషన్లతోపాటు, రైల్–రోడ్ క్రాసింగ్‌ల వద్ద అధికారులను అప్రమత్తం చేశారు. దాదాపు 70 కిలోమీటర్ల దూరం వెళ్లాక ఊంచి బస్సీ వద్ద పట్టాలపై ఇసుక బస్తాలను అడ్డుగా ఉంచి రైలును ఆపు చేయగలిగారు. ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. -
B Tech Ravi: అజ్ఞాతంలోకి బీటెక్ రవి
సాక్షి, వైఎస్సార్: తెలుగు దేశం పార్టీ నేత మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పులివెందుల పరిధిలోని చక్రాయపేటలో రవి తన అనుచరులతో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. మారణాయుధాలతో ఓ వెంచర్‌పై దౌర్జన్యకాండకు తెగబడ్డాడు. ఈ దాడిపై పోలీస్ కేసు కూడా నమోదు కావడంతో.. రవి ముందస్తుగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆదివారం వంద మందికి పైగా అనుచరులతో, మారణాయుధాలతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన రవి.. ఆపై అక్కడి ఫెన్సింగ్‌ను అన్యాయంగా తొలగించాడు కూడా. ఈ ఘటనపై ఆ వెంచర్ ఓనర్ పోలీసులను ఆశ్రయించాడు. తన దగ్గర వెంచర్‌కు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని, రవి దగ్గర అలాంటి ఆధారాలు ఎవైనా ఉంటే చూపించాలని రవికి సూచించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు.. చక్రాయపేట దాడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బీటెక్ రవి ఆచూకీ మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదు. సంబంధిత వార్త: యెల్లో బ్యాచ్ దౌర్జన్యకాండ.. చక్రాయపేటలో ఏం జరిగిందంటే.. -
Viral Video: తిక్క కుదిరింది.. మొబైల్ కొట్టేద్దామనుకున్నాడు.. పాపం చివరికి!
కర్మ సిద్దాంతాన్ని చాలా మంది నమ్ముతుంటారు. చేసిన ప్రతి పనులకు తప్పక ఫలితం అనుభవించాల్సి ఉంటుందని దీని అర్థం. ఎదుటి వారికి మంచి చేస్తే మంచి.. చెడు చేస్తే అదే చెడు మనకి రివర్స్‌లో తగులుతుందని భావిస్తుంటారు. అందరి విషయంలో ఏమో కానీ ఓ యువకుడి విషయంలో జరిగింది తెలుసుకుంటే మాత్రం ‘కర్మ ఫలం’ నిజమేననిపిస్తుంది. అసలేం జరిగిందంటే.. రోడ్డు పక్కన ఓ యువతి ఒంటరిగా నిల్చొని మొబైల్ చూస్తూ ఉంటుంంది. అదే దారిలో ఓ యువకుడు సైకిల్‌పై వచ్చాడు. యువతి దగ్గరకు చేరుకోగానే ఆమె చేతిలో నుంచి మొబైల్ తీసుకొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. సరిగ్గా అదే సమయానికి రోడ్డు మీద వస్తున్న కారు అతనికి ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. కారు తగిలి కిందపడ్డ దొంగ మళ్లీ లేచి పరుగులు తీశాడు. పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు రోడ్డు మీద ఉన్న చాలా మంది అతన్ని వెంబడించారు. అయినా ఎవరికి దొరకకుండా పరుగులు తీశాడు. ఈ క్రమంలో దొంగ కొన్నిచోట్ల కిందపడిపోతూ దెబ్బలు తగిలించుకున్నాడు. గాయాలైన కూడా మళ్లీ లేచి పరుగెత్తాడు. కానీ చివరికి దొంగ దొరికిపోయాడు. కొంతమంది యువకులు అతన్ని పట్టుకొని కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. తక్షణ (ఇన్స్టంట్) కర్మ అంటే ఇదేనంటూ.. దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన యువకుడిని ఉద్ధేశించి కామెంట్ చేస్తున్నారు. అంతేగాక యువతికి సాయం చేసేందుకు ప్రయత్నించిన వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: హోటల్లో షాకిచ్చిన వెయిటర్.. కస్టమర్ కూల్‌గా ఏం చేశాడంటే! Karma is Real pic.twitter.com/klE9IpsCYS — Karma Videos (@thedarwinawerds) March 21, 2023 -
వైఎస్సార్సీపీ నేత హత్య కేసు: రిమాండ్ ఖైదీ పరార్
సాక్షి, ఏలూరు: వైఎస్సార్సీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో నిందితుడు ఒకడు పరారయ్యాడు. కేసులో 8వ నిందితుడిగా ఉన్న కోడూరి రవితేజ.. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పారిపోయాడు. గురువారం అర్దరాత్రి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రవితేజ తప్పించుకున్నాడు. ఏలూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కోడూరి రవితేజ.. నడుంనొప్పితో ఈ నెల 14వ తేదీన ఆస్పత్రిలో చేరాడు. అయితే.. అర్ధరాత్రి పోలీసుల కళ్లుగప్పి ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. తినే టైంలో.. బేడీలు తొలగించడంతోనే పరారైనట్లు సెంట్రీ సిబ్బంది వెల్లడించారు. ప్రస్తుతం రవితేజ కోసం గాలింపు చేపట్టారు. -
మూడు వారాల కింద పెళ్లి.. పాలల్లో మత్తు మందు కలిపి
లక్నో: పెళ్లి జరిగిన మూడు వారాలకు కట్టుకున్న భర్తకు, అత్తింటివారికి మత్తు మందు ఇచ్చిన కొత్త కోడలు పట్టుచీరలు, నగలతో పరారైంది. ఉత్తరప్రదేశ్‌లోని బాహ్ సిటీలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. బాహ్ సిటీకి చెందిన ఉపేంద్ర (22)కు ఈ నెల 7న శాలిని (20)తో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన మూడు వారాల పాటు శాలిని తన భర్త, అత్తింటి వారితో బాగానే కలిసిపోయినట్లు నటించింది. కాగా సోమవారం రాత్రి భర్తకు, అత్తమామలకు పాలల్లో మత్తు మందు కలిపి ఇచ్చింది. వాళ్లు ఆ పాలు తాగి మత్తులోకి జారుకోగానే ఇంట్లో విలువైన నగలు, బట్టలు తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయింది. కాగా ఉదయం నిద్ర లేచి చూసేసరికి శాలిని ఇంట్లో కనిపించలేదు.దీంతో ఉపేంద్ర, అతని తల్లిదండ్రులు ఇళ్లుతో పాటు చట్టుపక్కల వెతికినా ఆమె జాడ తెలియలేదు. అనుమానం వచ్చి ఇంట్లోని బీరువా తీసి చూడగా అందులోని విలువైన నగలు, చీరలు మాయమయ్యాయి. దాంతో కొత్త కోడలే ఈ పని చేసిందని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు. ఉపేంద్ర ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: భర్త ఫోన్‌పై భార్య నిఘా.. నష్టపరిహారం చెల్లించమన్న కోర్టు -
వధువు జంప్..చెల్లిని పెళ్లాడిన వరుడు..ఇక్కడే ట్విస్ట్
భువనేశ్వర్ : మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా, వధువు ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. దీంతో ముహూర్తం సమయానికి పెళ్లి జరగాల్సిందేనని, వధువు చెల్లెలిని అయినా తనకు కట్టబెట్టాలని వరుడు కోరగా వేరే గత్యంతరం లేక అమ్మాయి కుటుంబసభ్యులు కూడా ఇందుకు ఒప్పుకుంటారు. అనుకున్న సమయానికి పెళ్లికొడుకు..వధువు చెల్లిలో మెడలో తాళి కట్టి అత్తారింటికి తీసుకెళ్లాడు. అయితే ఇక్కడే అతనికి అసలు సిసలు ట్విస్ట్ ఎదురైంది. ఈ పెళ్లి చెల్లదని అధికారులు తేల్చి చెప్పడంతో వరుడు బిత్తెరపోయాడు. ఈ ఘటన ఒడిశాలోని కలహండీ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..మాల్పాడా గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి, అదే గ్రామానికి చెందిన 26 ఏళ్ల వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. మరికొద్ది సేపట్లో పెళ్లి తంతు జరగాల్సి ఉండగా..వధువు తాను ప్రేమించిన వ్యక్తితో పారిపోయింది. దీంతో తమ పరువు పోతుందని, వధువు చెల్లితో అయినా సరే పెళ్లి జరిపించాలని వరుడు తరుపు వాళ్లు పట్టుబట్టారు. దీంతో వేరే దారి లేక అమ్మాయి తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించారు. అయితే తంతు ముగిసి అమ్మాయిని అత్తారింటికి తీసుకెళ్లాకా అధికారులు అక్కడికి చేరుకున్నారు. అమ్మాయి వయస్సు 15 ఏళ్లే కావడంతో ఇది బాల్య వివాహం కిందకు వస్తుందని,చట్టారీత్యా ఇది నేరమని పేర్కొన్నారు. 18 ఏళ్లు వచ్చేదాకా అమ్మాయిని అత్తారింటికి పంపొద్దని చెప్పడంతో వారు కూడా అంగీకరించారని జిల్లా పిల్లల రక్షణ అధికారి సుకాంతి బెహెరా తెలిపారు. మైనర్ బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించిన అనంతరం ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. చదవండి : (వైరల్: అమ్మాయిని ముద్దు లంచంగా అడిగిన పోలీస్) (నగ్నంగా ఏనుగెక్కిన మోడల్!) -
పోలీస్‌స్టేషన్‌లో దౌర్జన్యం
సాక్షి, కడప: కడప టూటౌన్ పోలీస్ స్టేషన్లోకి ఆదివారం నిందితుని బంధువులు జొరబడి, ఎస్ఐ విచారిస్తుండగానే అతన్ని లాక్కొని వెళ్లారు. వారిని వారించేందుకు వచ్చిన స్టేషన్‌రైటర్, కానిస్టేబుళ్లను సైతం పక్కకు తోసేశారు.విశ్వసనీయ వర్గాల సమాచారం, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హబీబుల్లా వీధికి చెందిన షేక్ షాబుద్దీన్ అనే వ్యక్తిపై అతనిభార్య సల్మాత్ సోదరులు గౌహర్‌ఆలీ, షేక్ ఖాలిద్ దాడి చేశారు. ఈ సంఘటనపై జూన్ 2వ తేదీన కేసు నమోదైంది. నిందితులను అరెస్ట్ చేసి తీసుకొచ్చేందుకు ఎస్ఐ మంజునాథ్ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం స్టేషన్ రైటర్, హెడ్ కానిస్టేబుల్ చాంద్‌బాషా ఆధ్వర్యంలో పోలీసు బృందం వెళ్లింది. నిందితుల్లో ఒకరైన గౌసర్‌ఆలీని స్టేషన్‌కు తీసుకొచ్చి ఎస్ఐ ముందు హాజరుపరిచారు. ఎస్ఐ అతన్ని విచారిస్తున్న సమయంలో నిందితుని బంధువులు షేక్ రేష్మా, గుల్జార్‌బేగం, సల్మా, జావేద్‌ఆలీ, ముబారక్, ఆయేషా నేరుగా పోలీస్ స్టేషన్ ఆవరణకు చేరుకున్నారు. లోపలికి చొరబడి, తమ వెంట గౌసర్‌ఆలీని లాక్కొని వెళుతుండగా, రైటర్ చాంద్‌బాషా, కానిస్టేబుళ్లు రాఘవులు, పంచలింగాలు, రాజశేఖర్, చంద్రనారాయణ రెడ్డి వారిని నివారించే ప్రయత్నం చేశారు. కానీ దౌర్జన్యంగా తోసేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో రైటర్ చాంద్‌బాషా చేతి మధ్యవేలికి గాయమైంది. ఈ సంఘటన కడప నగరంలో దుమారం చెలరేగింది. సంఘటన స్థలానికి కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసు స్టేషన్లో పట్టపగలు ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంపై పోలీసు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ ఆవరణంలోనే చిన్న సంఘటన జరిగిందని, బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. రైటర్ చాంద్‌బాషా ఫిర్యాదు మేరకు పై ఆరుగురితో పాటు, పై కేసులో నిందితుడైన గౌసర్ ఆలీపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. -
పెళ్లి చేసిన పూజారితోనే వధువు జంప్
భోపాల్ (సిరోంజ్) : వధు, వరులను వేద మంత్రాలతో ఒక్కటి చేసిన పూజారే వంకర బుద్ధి చూపించాడు. నవవధువుతో పూజారి పారిపోయాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని విధిష జిల్లా సిరోంజ్‌లోని బాగ్‌రడ్‌లో చోటుచేసుకుంది. వినోద్ మహరాజ్ అనే పూజారి మే 7న ఓ నూతన జంటకు వివాహం జరిపించాడు. వివాహ కార్యక్రమాలు పూర్తవ్వగానే వధువు సంప్రదాయం ప్రకారం అత్తింటి నుంచి అమ్మగారిఇంటికి వచ్చింది. అనంతరం ఇంట్లోని 1.5 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు, 30,000 రూపాయల నగదు తీసుకుని వధువు వెళ్లిపోయింది. దీంతో యువతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు మే23న మరో వివాహం చేపించాల్సి ఉండగా, పురోహితుడు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. రెండు ఫిర్యాదులపై పోలీసులు విచారణ జరపగా, పురోహితుడు వినోద్ మహరాజ్ ముగ్గురు పిల్లలకు తండ్రి అని తేలింది. పురోహితుడు, సదరు యువతికి రెండు సంవత్సరాలుగా పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. పురోహితుడి కుటుంబ సభ్యులు కూడా కనిపించకుండాపోయారు. ఇప్పుడు వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఒకరితో నిశ్చితార్ధం.. మరొకరితో పెళ్లి..!
సాక్షి, అన్నానగర్: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయని మన పెద్దలు చెబుతుంటారు. అలంగుడిలో జరిగిన ఓ ఘటన అక్షరాల ఇది నిజమని చెబుతుంది. ఓ యువతి నిశ్చితార్ధం అయిన తర్వాత అదృశ్యం కావడంతో.. మరో యువతి పెళ్లి కూతురైంది. ఆ అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవడంతో శుభం కార్డు పడింది. వివరాలివి.. పుదుకోట జిల్లా ఆలంగుడికి చెందిన ఓ యువతికి కరమ్పక్కుడి తాలుకా గిత్తానిపట్టి షణ్ముగనాథన్ కుమారుడు నదీష్ కి ఏప్రిల్ 4న పెళ్లి నిశ్చయమైంది. ఏప్రిల్ 3వ తేదీన పెళ్లి కూతురు హఠాత్తుగా అదృశ్యమైంది. దీంతో వరుడి బంధువులు ఎలాగైనా పెళ్లి జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ యువతి తండ్రి కార్తీక్ వివాహనికి ఒప్పుకోవడంతో ఏప్రిల్ 3వ తేదీ రాత్రే నిశ్చితార్ధం చేశారు. అదే మూహూర్తంలో కుమారమలై మురుగన్ సన్నిధిలో నదీష్కి, దేవదర్శినికి పెద్దలు వివాహం జరిపారు. పెళ్లికి ఒప్పుకున్న దేవదర్శినిని బంధువులు, స్నేహితులు ఆశీర్వదించారు. -
మరి కాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్
హసన్‌పర్తి (వరంగల్) : మరి కొద్దిసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు.. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని పారిపోయిన సంఘటన వరంగల్ జిల్లా హసన్‌పర్తిలో ఆదివారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన యువతికి, హన్మకొండకు చెందిన కోల రఘుతో పెద్దల సమక్షంలో వివాహం నిశ్చయమైంది. కాగా ఆదివారం మరి కాసేపట్లో తాళి కట్టాల్సి ఉందనగా.. వరుడు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో పెళ్లి కూతురి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుడు రఘు ఎల్ఐసీ కార్యాలయంలో జోనల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. పెళ్లి కొడుకు పెళ్లిని నిరాకరించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.