కర్మ సిద్దాంతాన్ని చాలా మంది నమ్ముతుంటారు. చేసిన ప్రతి పనులకు తప్పక ఫలితం అనుభవించాల్సి ఉంటుందని దీని అర్థం. ఎదుటి వారికి మంచి చేస్తే మంచి.. చెడు చేస్తే అదే చెడు మనకి రివర్స్‌లో తగులుతుందని భావిస్తుంటారు. అందరి విషయంలో ఏమో కానీ ఓ యువకుడి విషయంలో జరిగింది తెలుసుకుంటే మాత్రం ‘కర్మ ఫలం’ నిజమేననిపిస్తుంది. అసలేం జరిగిందంటే..
రోడ్డు పక్కన ఓ యువతి ఒంటరిగా నిల్చొని మొబైల్ చూస్తూ ఉంటుంంది. అదే దారిలో ఓ యువకుడు సైకిల్‌పై వచ్చాడు. యువతి దగ్గరకు చేరుకోగానే ఆమె చేతిలో నుంచి మొబైల్ తీసుకొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. సరిగ్గా అదే సమయానికి రోడ్డు మీద వస్తున్న కారు అతనికి ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. కారు తగిలి కిందపడ్డ దొంగ మళ్లీ లేచి పరుగులు తీశాడు. పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు రోడ్డు మీద ఉన్న చాలా మంది అతన్ని వెంబడించారు. అయినా ఎవరికి దొరకకుండా పరుగులు తీశాడు.
ఈ క్రమంలో దొంగ కొన్నిచోట్ల కిందపడిపోతూ దెబ్బలు తగిలించుకున్నాడు. గాయాలైన కూడా మళ్లీ లేచి పరుగెత్తాడు. కానీ చివరికి దొంగ దొరికిపోయాడు. కొంతమంది యువకులు అతన్ని పట్టుకొని కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. తక్షణ (ఇన్‌స్టంట్) కర్మ అంటే ఇదేనంటూ.. దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన యువకుడిని ఉద్ధేశించి కామెంట్ చేస్తున్నారు. అంతేగాక యువతికి సాయం చేసేందుకు ప్రయత్నించిన వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
చదవండి: హోటల్‌లో షాకిచ్చిన వెయిటర్.. కస్టమర్ కూల్‌గా ఏం చేశాడంటే!
Karma is Real pic.twitter.com/klE9IpsCYS
— Karma Videos (@thedarwinawerds) March 21, 2023
Comments
Please login to add a commentAdd a comment