Karma
-
మనిషికి మనిషిని జతకలిపే దర్జీలు
వారధి నిర్మాణ పనుల్లో ‘నేనెంత’ అనుకోలేదు ఉడుత. ‘నేను కూడా కొంత’ అనుకొని పనుల్లోకి దిగింది. వయనాడ్ సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులకు అండగా నిలవడానికి, తమ వంతు సహాయం అందించడానికి స్థాయి భేదాలు లేకుండా ఎంతోమంది మహిళలు వస్తున్నారు. శిబిరంలోని మహిళలకు బట్టలు కుట్టి ఇవ్వడం నుంచి పరిసరాల శుభ్రత వరకు దీక్షతో పనిచేస్తున్నారు...శృతికి చారమాలలో చాలా మంది బంధువులు ఉన్నారు. కొండచరియలు విరిగిపడిన సంఘటనలో కొందరు చనిపోయారు. మరికొందరు మెప్పడిలోని సహాయ శిబిరంలో ఉన్నారు. కొంతమంది మహిళలు స్నానం చేయడానికి శృతి ఇంటికి వచ్చినప్పుడు తమకు ఇచ్చిన దుస్తులకు సంబంధించిన సమస్యల గురించి చెప్పుకున్నారు. ఆల్ట్రేషన్కు అవకాశం లేకపోవడంతో తమకు సరిపోయే ఒకే జత దుస్తులనే వాడాల్సి వస్తోంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని స్నేహితురాలి దగ్గర కుట్టుమిషన్ తీసుకొని నిర్వాసిత కుటుంబాల సహాయ శిబిరానికి బయలుదేరింది శృతి.ప్రతి గదికి వెళ్లి ‘నేను రెండు రోజులు ఇక్కడే ఉంటాను. దుస్తుల సైజ్ సర్దుబాటు సమస్యలు ఉంటే నాకు చెప్పండి’ అని అడిగింది. ఇక ఆరోజు నుంచి చిరిగిపోయిన దుస్తులు, సైజు సరిగా లేని దుస్తులను సరి చేసే పని మొదలైంది.టైలరింగ్ వల్ల జరిగిన మరో మేలు ఏమిటంటే మనసును దారి మళ్లించడం. ఈ శిబిరంలో కొద్దిమంది టైలరింగ్ పని తెలిసిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో రమ్య మనోజ్ ఒకరు.‘భయపెట్టే జ్ఞాపకాల నుంచి బయటపడడానికి టైలరింగ్ అనేది చికిత్సామార్గంలా ఉపయోగపడింది. చాలా రోజులుగా మేము శిబిరంలో ఖాళీగా ఉన్నాం. ప్రతిరోజూ విషాద జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉండేవి. మెషిన్‌పై ఆల్ట్రేషన్ పనులు మొదలు పెట్టిన తరువాత నాకు ఎంతో ఉపశమనం లభించింది’ అంటుంది రమ్య మనోజ్.శృతి, రమ్య... మొదలైన వారిని దృష్టిలో పెట్టుకొని సహాయ శిబిరానికి కుట్టుమిషన్లను ఒక స్వచ్ఛంద సంస్థ విరాళంగా ఇవ్వనుంది.‘మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు రెండు రోజులు ఉండాలనుకున్నాను. ఇప్పుడు మాత్రం శిబిరం ఉన్నంతవరకు రోజూ వచ్చి పోవాలనుకుంటున్నాను’ అంటుంది శృతి.సహాయ శిబిరానికి శృతి రోజూ రావాలనుకోవడానికి కారణం కేవలం టైలరింగ్ పనులు కాదు. ఇప్పుడు అక్కడ ఆమె ఎంతోమంది బాధితులకు ఓదార్పునిస్తోంది. బాధితులు విషాద జ్ఞాపకాల నుంచి బయటపడడానికి సినిమాల నుంచి ఆటల వరకు ఎన్నో విషయాలు మాట్లాడుతుంటుంది.‘శిబిరానికి శృతి రావడానికి ముందు మా మాటల్లో బాధలు, కష్టాలు, చేదు జ్ఞాపకాలు మాత్రమే ఉండేవి. అయితే శృతి మమ్మల్ని అటువైపు వెళ్లనివ్వకుండా రకరకాల విషయాలు మాట్లాడుతుంటుంది. ధైర్యం చెబుతుంటుంది’ అంటుంది సహాయ శిబిరంలో తలదాచుకుంటున్న ఆశ.హరిత కర్మ సేన ఆల్ ఉమెన్ గ్రూప్పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిలో కొందరు జ్వరం, దగ్గులాంటి సమస్యలతో బాధ పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పునరావాస శిబిరం పరిసరప్రాంతాల్లో అపరిశుభ్రత ఆనవాలు లేకుండా చేస్తున్నారు. పునరావాస శిబిరాలుగా మారిన పాఠశాలలు శుభ్రంగా కనిపించడానికి కారణం హరిత కర్మ సేన–ఆల్ ఉమెన్ గ్రూప్. భోజనాల తరువాత టేబుళ్లు, నేలను శానిటైజ్ చేస్తున్నారు. క్రిములు పెరగకుండా, వ్యాధులు వ్యాప్తి చెందకుండా, సహాయ శిబిరం చుట్టుపక్కల ప్లాస్టిక్, ఆహార వ్యర్థాలు కనిపించకుండా చూస్తున్నారు.కేరళలో మొత్తం 1018 హరిత కర్మ సేన యూనిట్లు పని చేస్తున్నాయి. పట్టణప్రాంతాల్లో 4,678, గ్రామీణప్రాంతాల్లో 26, 546 మంది మహిళలు పనిచేస్తున్నారు. ‘వేస్ట్ ఫ్రీ కేరళ’ నినాదాన్ని భుజాల కెత్తుకున్న హరిత కర్మ సేన కలెక్టింగ్, ట్రాన్స్‌పోర్టింగ్, ప్రాసెసింగ్, రీసైకిలింగ్, వేస్ట్ మెటీరియల్స్ డిస్పోజల్ అండ్ మేనేజ్మెంట్కు సంబంధించి వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ‘సమాజానికి ఉపయోగపడే మంచి పని చేస్తున్నాను అనే భావన మనసులో ఉండడం వల్ల కావచ్చు ఎంత పని చేసినా శ్రమగా అనిపించదు’ అంటుంది హరిత కర్మ సేన సభ్యురాలు ఉద్విత. -
సకామ కర్మ – అకామ కర్మ
మనిషి ఏ పనీ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండటం అసాధ్యం. ఏమీ చేయటం లేదు అన్నప్పుడు ఆ మాట పలకటం కర్మయే కదా! అప్పుడు కూడా గాలి పీల్చటం, తిన్న దానిని అరిగించుకోవటం వంటి పనులు చేస్తూనే ఉంటాము కదా! ఇవి కూడా మనని పట్టి బంధించి మరొక జన్మకి కారణం అవుతాయా? అనే సందేహం కలగటం సహజం. దీనిని గురించి భగవద్గీతలో కృష్ణుడు వివరంగానే చె΄్పాడు. ‘అకర్మ’ అని. నిజానికి జీవించి ఉండటమే ఒక కర్మ. జీవ చైతన్యం జీవికి ధర్మం. దాని వ్యక్త స్వరూపం కదలిక. అప్పుడే పుట్టిన బిడ్డ కాళ్ళు చేతులు కదిలిస్తూ ఏడుస్తాడు. బిడ్డ ఏడవక ΄ోయినా, కదలికలు లేక΄ోయినా పెద్దలు ఏడవ వలసి ఉంటుంది. ఏదోవిధంగా ఏడిపించే ప్రయత్నం చేస్తారు. అస్తవ్యస్తంగా ఉన్న ఈ కదలికలు, ధ్వనులు క్రమేణా వయస్సుని బట్టి సంకల్పాలతో సంబంధం కలిగి ఉంటాయి. అంటే అభి్ర΄ాయానికి అనుగుణంగా కదలికలు ఉంటాయి. మొదట్లో నవ్వటం, ఏడవటం అకారణంగా ఉంటాయి. ఇది నిష్కామకర్మ. రాను రాను వయసుని బట్టి ఈ ఏడుపులు, నవ్వులు సకారణంగా మారుతాయి. తెలిసినవారిని చూసి నవ్వటం, కొత్తవారిని చూసి ఏడవటం, ఆకలి వేస్తే, చీమ కుడితే ఏడవటం సకారణమేగా. పైగా ఎవరైనా వచ్చి తన బాధ తీర్చాలనే కోరికతో చేసినదే కనుక సకామ కర్మ అవుతుంది. చేతులు కదలి నోటి దాకా వచ్చి వ్రేళ్ళు చీకటం మొదలవుతుంది. చేతిని నోటిదాకా తీసుకు రావటానికి ఎంత తాపత్రయ పడతారో పిల్లలు గమనించ వచ్చు. ఆ పైన ఆ కదలిక వస్తువులను చూపించటం, పట్టుకోవటంలో నేర్పు చూపించటంగా మార్పు చెందుతుంది. అదే విధంగా ఏడవటం ఊ కొట్టటంగా మారి, క్రమంగా మాటలుగా పరిణామం జరుగుతుంది. తన అభి్ర΄ాయాలు, కోరికలు వ్యక్తీకరించటానికి మాటలని ఉపయోగించటం జరుగుతుంది. ఇది ఎంతో సహజంగా, అప్రయత్నంగా జరిగే పరిణామం. మనోవాక్కాయకర్మలచే మొదలైన దివ్యకర్మ మానవకర్మగా మలచ బడింది. అకామకర్మ బంధించదు. సకామకర్మ బంధ హేతువు. అకామకర్మ సకామకర్మగా రూ΄ాంతరం చెందుతున్న క్రమంలో అది ఘనీభవించి తాను అందులో బంధించబడకుండా జాగరూకత వహించవలసి ఉంటుంది. ప్రతిదీ లాభనష్టాల లెక్కలతో బేరీజు వేయటానికి అలవాటు పడిన మనిషికి ఇది సాధ్యమా? అనిపించటం సహజం. కానీ ఆ విధంగా ఉండటమే సహజం. స్వార్థపూరితంగా ఉండటమే తెచ్చిపెట్టుకున్న లక్షణం. ఎందుకంటే పుట్టిన కొత్తలో ప్రతి మనిషి శిశువుగా ఏ పని చేసినా ప్రయోజనాన్ని ఆశించి చేయటం ఉండదు. చిన్నపిల్లలు ఒక్క క్షణం కూడా ఒక చోట స్థిరంగా కూర్చోరు. గిరా గిరా తిరుగుతూనే ఉంటారు. ఎందుకు అని అడిగితే ‘ఊరికే’ అంటారు. పెరిగి పెద్ద అయినాక కూడా ఏదో ఒక పని చేయకుండా ఉండలేము. దానికి ఒక సంకల్పం, లేదా కోరిక జత చేయటం జరుగుతుంది. ఈ కోరిక బంధిస్తుంది. ఎలాగూ ఏమి చేయకుండా ఉండలేము కనుక ఏదైనా మనస్సుతో, వాక్కుతో, చేతులతో ఫలితాన్ని ఆశించకుండా పదిమందికి ఉపయోగ పడే పని చేస్తూ ఉంటే అది నిష్కామకర్మ అవుతుంది. దేహం ఉన్నంత వరకు కర్మాచరణ మాన రాదు.గాలి పీల్చటం, గుండె కొట్టుకోవటం, ఊపిరితిత్తులు పని చేయటం మన ప్రయత్నం లేకుండా ఎట్లా జరుగుతున్నాయో నిత్యకృత్యాలు కూడా అదేవిధంగా యాంత్రికంగా, అప్రయత్నంగా కొనసాగిస్తూ, వాటిలో మానసికంగా లగ్నం కాకుండా ఉన్నప్పుడు సకామకర్మ అవదు. కనుక బంధించదు, మరొక జన్మకి కారణం కాదు. -
ఖర్మ ఎవరినీ విడిచిపెట్టదు: శృతిహాసన్
ఆత్మవిశ్వాసం కలిగిన నటీమణుల్లో శృతిహాసన్ ఒకరు అని చెప్పవచ్చు. చర్యలు చాలా బోల్డ్‌గా ఉంటాయి అయితే వాటిని సమర్థించుకోవడానికి గట్స్ కావాలి. అలాంటి గట్స్ మెండుగా ఉన్న నటి శృతిహాసన్. ఈ బ్యూటీ లోకనాయకుడు కమల్ హాసన్ నటి సారికల వారసురాలు అన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఒక్క ప్లస్ పాయింట్ తోనే శృతిహాసన్ నటిగా నిలదొక్కుకోలేదు. అందుకు తన టాలెంట్‌ను ఉపయోగించుకొని కథానాయకిగా రాణిస్తున్నారు. హిందీ, తమిళం భాషల కంటే తెలుగులోనే మంచి విజయాలను, పేరును తెచ్చుకున్న నటి శృతిహాసన్. నిజానికి తమిళంలో నటించాలనే ఆశ ఈమెకు చాలానే ఉంది. ఎందుకనో ఇక్కడ దర్శక నిర్మాతలు శృతిహాసన్‌ను పట్టించుకోవడం లేదు. సరైన సక్సెస్‌లు లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఈమె తమిళంలో నటించిన చివరి చిత్రం లాభం. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన పాన్ ఇడియా చిత్రం సలార్‌లో నటిస్తున్నారు. దీంతోపాటు హాయ్ నాన్న అనే చిత్రంలోని శృతిహాసన్ నటిస్తున్నారు. అదేవిధంగా ది ఐ అనే హాలీవుడ్ చిత్రం కూడా చేస్తున్నారు. కాగా హేతువాది కమలహాసన్ కూతురు అయిన శృతిహాసన్‌కు మాత్రం కర్మ సిద్ధాంతాలపై నమ్మకం ఎక్కువ. ఈమె ఇన్ స్ట్రాగామ్‌లో తరచూ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. కాగా శృతిహాసన్ ప్రేమ వ్యవహారం గురించి రకరకాల వదంతులు దొర్లుతుంటాయి. అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోని ఈమె ఇటీవల ఖర్మ సిద్ధాంతం గురించి మాట్లాడారు. ఆమె ఇన్‌స్ట్రాగామ్‌లో ‘కొందరు తమ గోతులను తవ్వి దాటడానికి తయారవుతున్నారు. దాన్ని తాను ప్రశాంతంగా గమనిస్తున్నాను. మనం మన పనిని చేసుకుంటూ పోవాలి ఏదేమైనా ఖర్మ కచ్చితంగా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ ఆటను మాత్రం చూడండి’ అని పేర్కొన్నారు. -
శ్రమో నమః
వందల కోట్ల చేతులు ప్రపంచమనే ఈ మహాయంత్రాన్ని పని చేయిస్తున్నాయి. పని అంటే కర్మ. కాలగతిలో కర్మ శబ్దం ఆ ప్రాథమికార్థపు నేల విడిచి విధిలిఖితమనే తాత్వికార్థపు గగనసీమను తాకింది. మనుగడకు అవసరమైన సాధారణ కర్మల స్థాయిని దాటి మతపరమైన తంతులతో సహా ఇతరేతర అర్థాలకు విస్తరించింది. కర్మలో శ్రమ ఉంటుంది, శ్రమలో కర్మ ఉంటుంది. రెండూ అన్యోన్యాశ్రితాలు. మళ్ళీ ప్రపంచాన్నే ఒక యాంత్రిక మహాశకటమనుకుంటే, దానిని ముందుకు నడిపించేది కోట్లాది జనాల శ్రమ ఇంధనమే. పుట్టిన ప్రతిజీవీ అంతో ఇంతో కర్మయోగే. అందరికీ వందనం. వేదం కర్మవాదమే. అందులో కర్మ గురించిన ఉగ్గడింపే ఆద్యంతం వ్యాపించి ఉంటుంది. వేదకాలపు కర్మభావనలో హెచ్చుతగ్గుల వింగడింపు లేదు; దేవతలు, మనుషులన్న తారతమ్యం లేదు. సూర్యచంద్రులు, ఉషస్సు, అగ్ని సహా అందరూ క్రమం తప్పకుండా తమ విధ్యుక్త కర్మలను నిర్వహించవలసిందే. ఇంద్రుడు కర్మ చేతనే గొప్పవాడయ్యాడంటుంది వేదం. అతని చేతి వేళ్ళు అనేక వేల కర్మలను చేస్తూ ఉంటాయి. ఆహార పచనం, దేవతలకు హవ్యాన్ని అందించడంతో సహా అగ్ని బహువిధ కర్మదక్షుడు. అగ్నిని అనేక విధాలుగా వినియోగంలోకి తెచ్చిన కార్మిక నిపుణులు అంగిరసులు. సర్వకర్మకుశలురైన పుత్రపౌత్రులు కావాలని వేదజనం కోరుకుంటారు. కర్మనిరతిని ప్రకృతితో ముడిపెట్టి వేదం అందంగా చెబుతుంది. ‘‘మనుషుల్లారా! నిద్రలేవండి, చీకట్లు తొలిగాయి, మన దేహాలకు ప్రాణం వచ్చింది, ఉష ఉదయించి సూర్యుని రాకను ప్రకటించింది, అన్నం సమృద్ధిగా దొరికే చోటుకి వెడదాం పదండి’’ అని ఒక ఋక్కు చెబుతుంది. ఉష ఉదయించి మీ మీ వృత్తి వ్యాపారాల వైపు మిమ్మల్ని జాగృతం చేస్తోందని మరో ఋక్కు అంటుంది. ‘‘జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్ర వృత్తుల సమస్త చిహ్నా’’ల స్మరణ ఆధునిక మహాకావ్యంలోనే కాదు; కవిత్వానికే ఆదిమమైన వేదంలోనూ కనిపిస్తుంది. త్వష్ట నిపుణుడైన లోహకార్మికుడు... స్వర్ణమయమై, వేయి అంచులు కలిగిన వజ్రాయుధాన్ని నిర్మించి ఇంద్రునికి ఇచ్చాడు. దేవతలతో సమానమైన గౌరవాన్ని పొందాడు. ఋభులనే అన్నదమ్ములు మానవులైనా లోహవిద్యలో త్వష్టను మించిన ప్రావీణ్యం చూపి దేవతలయ్యారు. మరుత్తులనే దేవతలు ప్రవాహానికి అడ్డుపడిన ఓ పర్వతాన్ని బద్దలుకొట్టి నీటికి దారి చేశారు. అశ్వినులు మనువుకి విత్తనాలిచ్చి వ్యవసాయం చేయించారు; వైద్యం చేసి ఎంతోమందికి ఆరోగ్యాన్ని, ఆయుష్షును ఇచ్చారు. క్షురకుడు కేశఖండన చేసినట్లుగా ఉష చీకట్లను ఉత్తరిస్తోందని ఒక ఋక్కు అంటుంది. శ్రమ ఉచ్చమా, న్యూనమా అని చూడకుండా; శ్రామికుల మధ్య హెచ్చుతగ్గుల తేడా తేకుండా శ్రమను మాత్రమే గౌరవించిన దశ అది. ఇంద్రాదులు సమాజానికి ఏదో ఒక మేలు చేసే సేవకులు కనుకనే దేవతలయ్యారు. వేదకాలంలో అలాంటి సేవకులను పన్నెండుగురిని గుర్తించి పన్నిద్దరు ఆయగార్లు అన్నారు. శారీరక శ్రమను తక్కువ చేసి మేధోశ్రమను ఆకాశానికి ఎత్తడం ఆనాటికి లేదు. తిథివారనక్షత్రాలు చూసే వ్యక్తి కన్నా మృతపశువుల చర్మాన్ని ఒలిచే చర్మకారునికి ఎక్కువ ప్రతిఫలం ముట్టిన కాలం అది. కర్మ, కర్మఫలం రెండూ ఆనాడు సాముదాయికమే. చెరువుల వంటి నిర్మాణాలలో రాజు, రాజుగారి భార్యా కూడా మట్టితట్టలు మోసిన ఉదాహరణలు పురాచరిత్రలో కనిపిస్తాయి. అది పోయి చాకిరొకరిది, సౌఖ్యమొకరిదైన తర్వాతే పరిస్థితి తలకిందులైందని పండితులంటారు. అందరూ అన్నిరకాల పనులూ చేయడం పోయి వృత్తి విభజన రావడంతోనే వృత్తుల మధ్య, వ్యక్తుల మధ్య చిన్నా పెద్దా తారతమ్యాలూ పొటమరించాయి. ఇష్టపూర్వక కర్మ నిర్బంధకర్మగా మారి దుఃఖదాయిని అయింది. అప్పుడు కూడా వృత్తి నైపుణ్యంలో ఆనందాన్ని, తృప్తిని అనుభవించే అవకాశం ఎంతోకొంత ఉండేది. వృత్తిదారులు పారిశ్రామిక యంత్రంలోని పరికరాలుగా మారిపోవడంతోనే అదీ పోయింది. ఈ మార్పును కొడవటిగంటి కుటుంబరావు ఒక కథలో అద్భుతంగా చిత్రీకరిస్తారు. ప్రకృతి సమవర్తి. శ్రుతిమించిన అసమానతలను ఆట్టే కాలం సహించదు, ఎప్పటికైనా కత్తెర వేసి సమతుల్యతను తెస్తుంది. అడుగంటిన శ్రమ విలువను, గౌరవాన్ని, తగిన ప్రతిఫలాన్ని ఉద్ధరించే ప్రయత్నం ఆధునిక కాలంలోనే మళ్ళీ ఊపందుకుంది. ‘శ్రమ నిష్ఫలమై, జన నిష్ఠురమై నూతిని గోతిని వెదికే కార్మిక వీరుల కన్నుల నిండా కణకణమండే విలాపాగ్నులకు, గలగల తొణికే విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబులు’ ఉద్భవించారు. ఏ ఒకడి ఆస్తిహక్కైనా శ్రమపునాది మీదే ఆధారపడుతుందని జాన్ లాక్ అనే ఆర్థికవేత్త నొక్కిచెప్పి శ్రమకు తిరిగి పట్టం కట్టాడు. ఆడమ్ స్మిత్ అనే మరో ఆర్థికవేత్త విలువకు మూలం శ్రమేనన్నాడు. దాని ఆధారంగా డేవిడ్ రికార్డో అనే మరో ఆర్థికవేత్త శ్రమవిలువ సిద్ధాంతాన్ని ముందుకుతెచ్చాడు. కార్ల్ మార్క్స్ తాత్వికతకు అదే సారవంతమైన వనరు అయింది. శ్రమ విలువను తిరిగి గుర్తించడమే జరిగింది కానీ శ్రామికుని బతుకు బండి ఇంకా పూర్తిగా పట్టాలకెక్కలేదు. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అన్న కవి ఆకాంక్ష నెరవేరే రోజు ముందుకు జరుగుతూనే ఉంది. అయినా మనిషి నిత్య ఆశాజీవి కదా! -
Viral Video: తిక్క కుదిరింది.. మొబైల్ కొట్టేద్దామనుకున్నాడు.. పాపం చివరికి!
కర్మ సిద్దాంతాన్ని చాలా మంది నమ్ముతుంటారు. చేసిన ప్రతి పనులకు తప్పక ఫలితం అనుభవించాల్సి ఉంటుందని దీని అర్థం. ఎదుటి వారికి మంచి చేస్తే మంచి.. చెడు చేస్తే అదే చెడు మనకి రివర్స్‌లో తగులుతుందని భావిస్తుంటారు. అందరి విషయంలో ఏమో కానీ ఓ యువకుడి విషయంలో జరిగింది తెలుసుకుంటే మాత్రం ‘కర్మ ఫలం’ నిజమేననిపిస్తుంది. అసలేం జరిగిందంటే.. రోడ్డు పక్కన ఓ యువతి ఒంటరిగా నిల్చొని మొబైల్ చూస్తూ ఉంటుంంది. అదే దారిలో ఓ యువకుడు సైకిల్‌పై వచ్చాడు. యువతి దగ్గరకు చేరుకోగానే ఆమె చేతిలో నుంచి మొబైల్ తీసుకొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. సరిగ్గా అదే సమయానికి రోడ్డు మీద వస్తున్న కారు అతనికి ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. కారు తగిలి కిందపడ్డ దొంగ మళ్లీ లేచి పరుగులు తీశాడు. పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు రోడ్డు మీద ఉన్న చాలా మంది అతన్ని వెంబడించారు. అయినా ఎవరికి దొరకకుండా పరుగులు తీశాడు. ఈ క్రమంలో దొంగ కొన్నిచోట్ల కిందపడిపోతూ దెబ్బలు తగిలించుకున్నాడు. గాయాలైన కూడా మళ్లీ లేచి పరుగెత్తాడు. కానీ చివరికి దొంగ దొరికిపోయాడు. కొంతమంది యువకులు అతన్ని పట్టుకొని కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. తక్షణ (ఇన్స్టంట్) కర్మ అంటే ఇదేనంటూ.. దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన యువకుడిని ఉద్ధేశించి కామెంట్ చేస్తున్నారు. అంతేగాక యువతికి సాయం చేసేందుకు ప్రయత్నించిన వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: హోటల్లో షాకిచ్చిన వెయిటర్.. కస్టమర్ కూల్‌గా ఏం చేశాడంటే! Karma is Real pic.twitter.com/klE9IpsCYS — Karma Videos (@thedarwinawerds) March 21, 2023 -
నందమూరి తారకరత్న చిన్న కర్మ (ఫొటోలు)
-
వీడియో: కర్మ అంటే ఇదేనేమో.. దెబ్బకు తిక్క కుదిరింది!
పెద్దలు ఊరికే అనలేదు.. చెడపకురా చెడేవు అని. పక్కవారికి హాని తలపెట్టాలని చూస్తే అది మనకే రివర్స్‌లో తగులుతుంది. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ యువతి తాను చేసిన పనికి.. కర్మ ఫలం వెంటనే అనుభవించింది. ఓ యువకుడు, యువతి రోడ్డుపై బైక్ మీద వెళ్తున్నారు. ఈ క్రమంలో వారి పక్కన మరో బైక్‌పై ఓ వ్యక్తి వెళ్తున్నాడు. ఈ సందర్భంగా ఒక్కసారిగా ఆమెకు ఏం అనిపించిందో ఏమో.. పక్కన బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని తన కాలితో తన్నే ప్రయత్నం చేసింది. దీంతో, బ్యాలెన్స్ తప్పి రన్నింగ్‌లో ఉన్న బైక్ మీద నుండి కిందపడిపోయింది. కాగా, పక్కన వెళ్తున బైకర్.. తనను ఆమె తన్నడాన్ని గమనించకపోవడం విశేషం. ఆమె కిందపోడిపోవడంతో స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఇక, ఆమె కిందపడిపోవడం గమనించిన రైడర్.. బైక్‌ను పక్కనే ఆపి మళ్లీ ఆమెకు మళ్లీ బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియా చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. బహుషా కర్మ అంటే ఇదేనేమో అంటూ కామెంట్స్ చేశారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు. ఇది కూడా చదవండి: ‘అమ్మో ఎలుగుబంటి.. దారుణంగా దాడి చేసింది’ -
మంచి మాట: మన ఆలోచనలే మన జ్ఞానం
పుట్టుక, మరణాల మధ్య జీవితం చైతన్యవంతంగా కొనసాగుతుంది. ఈ జీవితంలో మనస్సు ద్వారా అనేక అనేక ఆలోచనలతో జీవితానికి సంబంధించి కీలకమైన సమాచారం వస్తుంది. ఈ ఆలోచనలన్నీ మనిషి శారీరక మానసిక కర్మలను బట్టి వస్తుంటాయి. శరీరంలో శక్తి తక్కువగా ఉంటే భౌతికపరమైన ఆలోచనలు, శక్తిస్థాయులు పెరిగే కొద్దీ మార్పు చెంది ఆధ్యాత్మికత గురించి, ఆత్మను గురించీ ఆలోచనలు వస్తుంటాయి. మనిషికి తమోగుణంతో శరీరానికి సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి. యవ్వనంలో ఇంద్రియాలు ఉద్రేకం ఎక్కువగా ఉండి రజోగుణంకు సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి. వయసు మళ్లి వానప్రస్థంలో ప్రవేశించగానే ప్రేమ, దయ, జాలికి సంబంధించిన సత్వగుణ ఆలోచనలు వస్తుంటాయి. జ్ఞానపరంగా ఎదిగిన వారికి అత్యుత్తమమైన ఆలోచనలు వస్తాయి. మనుషులని తన మనసే నడిపిస్తుంది అసలు ఈ మనసు ఎక్కడ ఉంది, దానిని గుర్తించడం ఎలా అంటే గత జన్మల కర్మల అనుభవాల ప్రతిరూపమే మనసు. దీని యొక్క ప్రభావం సూక్ష్మ శరీరం పై పడుతుంది. మనసులో వచ్చే ఆలోచనలు ప్రతిరూపమే మానవ జీవితం. మనిషి కుటుంబం, సంఘం, సమాజంలో వివిధ రకాల వ్యక్తుల మధ్య జీవిస్తున్నప్పుడు, కొందరు పాతవారు దూరమవుతారు. వారి ఆలోచనల ప్రభావం కొంత ఉంటుంది. కొందరు కొత్తవారు దగ్గరవుతారు వీరు వీరి ఆలోచనలని జోప్పించడానికి సిద్ధంగా ఉంటారు. వీరి ద్వారా గాయాలు, ఘర్షణలు, సంఘర్షణలు, వ్యతిరేకతలు, అనుకూలతలు, మానసిక ఒత్తిడుల రూపంలో మనసులోకి ప్రవేశిస్తాయి. అప్పుడు ప్రతి వ్యక్తి ఆలోచనలు మాటలు ద్వంద్వంతో కూడి ఉంటాయి. ద్వంద్వం అంటే రెండుగా ఉన్నది. ఒకటి బయటికి వ్యక్తమౌతుంది. మరొకటి లోపల దాగి ఉంటుంది. బయటపడ్డ దాని గురించి ఆలోచిస్తే లోపల దాగి ఉన్న దాన్ని గుర్తించలేము. ఎప్పుడైతే బయటపడ్డ దాని గురించి ఆలోచిస్తామో అప్పుడు పక్షపాతంగా, ఏకపక్షంగా, పరిమితంగా ఆలోచిస్తున్నట్లే, ఎప్పుడైతే మానవుడు లోపల దాగి ఉన్న దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడో... పరిమితంగా ఆలోచించడం నుండి అపరిమితంగా ఆలోచించడం మొదలవుతుందో అదే అప్పుడే అజ్ఞానం నుంచి బయట పడి జ్ఞానం పొందుతాడు. అనవసర విషయాలపై అతిగా ఆలోచిస్తే శారీరక శ్రమ చేసిన దానికంటే రెట్టింపు శక్తిని కోల్పోతున్నాడు. కొందరు ఎలాంటి శారీరక శ్రమ లేని పనులు చేస్తున్న సాయంకాలానికి అలసిపోతారు. కారులోనో, బస్సులోనో, ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలాంటి శారీరక శ్రమలేకున్నా అలసి పోతున్నారు అనవసరంగా అతిగా మనసు ఆలోచించటమే అందుకు కారణం.. మనస్సు ఆలోచించకుండా ఉన్నప్పుడు శూన్య స్థితికి చేరుతుంది. బాహ్య ప్రపంచంలో ఏది జరిగినా ఎలా జరిగినా అనుకూలతలకు, ప్రతికూలతలకు మనస్సు స్పందించకూడదు. ఇదే ఆధ్యాత్మిక మార్గం. అజ్ఞాని అంతరంగాన్ని విస్మరించి ప్రాపంచిక విషయాలపై ఆరాటపడుతూ ప్రపంచం నుంచి నాకేంటి అనే భావనను అతిగా పెంచుకొని ప్రపంచాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలనే భావనతో అసంతృప్తి చెంది ప్రాపంచిక విషయాల మోజులో సంబంధాలు ఏర్పరుచుకున్నాడో అప్పుడు పరిమితంగా ఆలోచిస్తాడు. జ్ఞానికి విశ్వం గురించి దైవం గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి, దైవం వైపు మళ్ళి బంధాలను విడనాడి ఏకత్వం వైపు మళ్లాలి. ఏ వ్యక్తి ఏకత్వం వైపు మళ్ళి తన మనసును సరి చేసుకుని సంపూర్ణతను పొందుతూ దైవం వైపుగా ప్రయాణం చేస్తాడో అతను జ్ఞానిగా మరి ముక్తి లేదా మోక్షం పొందే అవకాశం ఉంది. – భువనగిరి కిషన్ యోగి -
Viral Video: దున్నపోతుతో యవ్వారం.. దెబ్బకు గాల్లో ఎగిరి పడ్డారు..
చాలా మంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంటారు. మనం ఏం చేసినా అది మనకు తప్పక తిరిగి వస్తుందని భావిస్తుంటారు. ఎవరికైనా మంచి చేసినా లేదా హాని తలపెట్టినా దాని ఫలితం తప్పక అనుభవిస్తామని గట్టిగా నమ్ముతారు. అచ్చం ఇలాగే కొంత మంది తాము చేసిన ఘనకార్యానికి తక్షణ కర్మను ఎదుర్కొన్న ఘటన తాజాగా చోటుచేసుకుంది. భారత అటవీశాఖ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విటర్లో మార్చి 28న షేర్ చేసిన ఓ వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో అయిదుగురు వ్యక్తులు దున్నపోతు మీద కూర్చొని రోడ్డు మీద సవారీ చేస్తున్నారు. వీళ్లు రోడ్డుపై బైక్‌పై, గుర్రం మీద వెళుతున్న మరికొంతమందితో పోటీపడి రైడ్ చేస్తున్నారు. పక్కన వెళుతున్న వారు హారన్లు కొడుతూ ముందుకు దూసుకు వెళ్తుండటంతో.. దున్నపోతు కూడా వేగంగా వెళ్లాలని దాని మీద ఉన్న వ్యక్తులు దున్నపోతును రెండు దెబ్బలు వేశారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. చదవండి: భయానక వీడియో.. మహిళ చెవిలోకి దూరిన పీత.. ఎలా బయటకు తీశారంటే.. దెబ్బలు తిన్న దున్నపోతు ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కుడివైపుకు తిరిగింది. బండి చక్రాలలో ఒకటి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బండి మీదున్న అయిదుగురు వ్యక్తులు అమాంతం గాల్లో ఎగిరి రోడ్డుపై ఎగిరిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జంతువులను చిత్ర హింసలు పెడితే తగిన శిక్ష అనుభవిస్తారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది ‘ఈ వీడియో మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ముగింపు ఇది. కర్మ తిరిగి పొందారు’ అని కామెంట్లు చేశారు. Karma 🙏 (Watch till the end) pic.twitter.com/4ixpQ7Z5xO — Susanta Nanda IFS (@susantananda3) March 28, 2022 -
మంచి మాట: మీ చిత్తం ఎలాంటిది?
కొంతమంది ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది, కాని కొందరు ఏది అనుకొంటే అదే జరుగుతుంది. దీనికి మూలకారణం ఆలోచనలే. అవే సానుకూల ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు. ఈ రెండింటికి మూలం చిత్తం. జ్ఞానాన్ని భద్రపరిచే స్థానాన్నే చిత్తం అంటారు. చిత్తంలో ఉన్న చెడు ఆలోచనలు మంచి ఆలోచనలుగా మారాలి. అప్పుడే మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. కర్మ చే యించేది మనస్సు, మనస్సుని నియంత్రించేది బుద్ధి. అహంకారం అంటే ప్రకృతి సిద్ధమైన... తన చుట్టూ వున్న పరిస్థితులను తనకు అనుకూలంగా సృష్టించుకోవాలనుకోవటమే. దీనినే మన పెద్దలు ఏమైంది ఇతనికి నిన్నటివరకు బాగానే ఉన్నాడు కదా, ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారాడు అనీ లేదా ఇంతలోనే ఇతనిలో ఇంత మంచి మార్పు ఎలా వచ్చింది అనే వారు. దీనికి కారణం చిత్తం నుండి కర్మ ఆ సమయానికి ఆలా పనిచేయడమే. జీవికి వచ్చిపోయే జబ్బులు కూడా కొన్ని చిత్తానికి సంబంధించినవే, మనసు అనియంత్రిత అవయవాలను నియంత్రిస్తుంది. ఇది కలుషితమైతే దీనికి సంబంధించిన గుండె, మూత్రపిండాలు, కాలేయం, పేగులు మొదలైన అవయవాల పై ప్రభావం ఉంటుంది. నియంత్రించే వ్యవస్థ మొత్తం మెదడులో ఉంటుంది. మెదడులో ఏ అవయవానికి సంబంధించిన వ్యవస్థ చెడితే ఆ అవయవం పనిచేయదు. మెదడులో వున్న ఈ వ్యవస్థ సరికావాలంటే మనస్సులో ప్రక్షాళన జరగాలి. అందుకే ఈ మధ్యన వైద్యులు ప్రతి జబ్బుకు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి లేదా ధ్యానం చెయ్యండి అని విరివిగా చెబుతున్నారు. మరి అవయవాలకు వచ్చే జబ్బుకు మనస్సుకు సంబంధించిన ధ్యానాలు ఎందుకు అంటే అన్నిటికి మూలం మనసే కనుక. మనసనేది ఆలోచనల ప్రవాహం. కోరికలు, వాంఛలూ ఆలోచనలతో సంక్రమించేవే. అంత వరకూ అనుభవంలోకి రాని దాన్ని అనుభవించాలనుకోవడం కోరిక. అదే అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలనుకోవడం వాంఛ. మనసు అల్లకల్లోలమైనప్పుడు మనం ఊపిరి వేగంగా తీసుకుంటాం. శ్వాసప్రక్రియలోక్రమబద్ధత ఉండదు. మనసును శాంత పరచడానికి శ్వాసను క్రమబద్ధం చేయడం ఒక పద్ధతి. నిండుగా గాలిని పీల్చి వదలడాన్ని క్రమం తప్పకుండా అభ్యసిస్తే నిశ్చలమైన మానసిక స్థితిని పొందవచ్చు. ప్రాణశక్తి మీద పట్టు సాధించడం కోసం ఊపిరిని నియంత్రించడమే ప్రాణాయామం. కోరికలు, వాంఛల నుంచి మనసును అధిగమించి స్వతంత్రంగా, వ్యక్తిగా ఉండగలిగే వారే యోగి. మనసును అధిగమించడమంటే దాన్ని నొక్కిపెట్టి ఉంచడం, నియంత్రించడం కాదు. మన ప్రవర్తనలో మార్పు చేసుకోవాలి. ఎదుటి వారి విజయానికి అసూయ చెందకుండా, అపజయాన్ని హేళన చేయకుండా ఉండాలి. విజయం, అపజయం, ఒకటి ఒకరు పొందితే. ఇంకొకరు కోల్పోతున్నారు, ఇంకొకరు కోల్పోతే, అది ఇంకెవరికో దక్కుతుంది. సుఖం, దుఃఖం. డబ్బు, ఆస్తి, అంతస్తులు అన్నీ నేడు నాది నాది అనుకున్నవి నిన్న వేరొకరివి, రేపు ఇంకెవరివో. అంటే ఏది ఎవరికి శాశ్వతం కాదు. నాది, నాకు అనే సుడిగుండాలలో ఇరుక్కొని మనసు పాడుచేసుకోవడమే సకల జబ్బులకు మూలం. ఈ సూత్రం అర్థం చేసుకొంటేనే ప్రశాంతత. ఏ ఇద్దరి మనస్సు, జీవన విధానం ఒకలాగే ఉండదు. కాని అందుకు విరుద్ధంగా తనకు అనుకూలంగా ఉండాలనుకోవడమే అహంకారం. ఈ అహంకారాన్ని మార్చుకొంటే చిత్తంలో వున్న చెడు కర్మలు అన్నీ మంచి కర్మలుగా మారి మనిషి జీవన విధానం మొత్తం మారిపోతుంది. అందుకే వెయ్యిమందిని వెయ్యిసార్లు యుద్ధంలో ఓడించిన వాడికన్నా తన మనసును జయించిన వాడే పరాక్రమవంతుడు’ అంటాడు గౌతమ బుద్ధుడు. మనస్సు అంటే సంకల్ప, వికల్పాల కలయిక నీరు నిర్మలంగా ఉన్నప్పుడు అందులో మన ప్రతిబింబం కనిపిస్తుంది. అందులో వేరే ఏమి కలిపినా నీరు కలుషితం అవుతుంది. ప్రతిబింబం అగోచరమౌతుంది. అలానే మనస్సులో మొదట చెడు ఆలోచనలు తరిమేయడానికి మంచి ఆలోచనలు చేయాలి. క్రమంగా మంచి ఆలోచనలూ తగ్గించాలి. అలా తగ్గించగా మనసు నిర్మలం అవుతుంది. –భువనగిరి కిషన్ యోగి -
కర్మ... ఫలితం
తెల్లవారి లేచినప్పటినుంచి మనం ఏదో ఒక సందర్భంలో కర్మ అనే మాటను వింటూనే ఉంటాం. ఇంతకీ కర్మ అంటే ఏమిటి? అది ఎన్ని రకాలు? వాటి ఫలితం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. కారణం లేకుండా కార్యం జరగదు అన్నది కర్మ సిద్ధాంతానికి పునాది కాబట్టి బిల్‌గేట్స్ లేదా వారెన్ బఫెట్ ఉత్తినే ప్రపంచ కుబేరులు కాలేదు. గతజన్మల్లో ఈ ఫలితం వచ్చే పుణ్యకార్యాలు వారు చేసి ఉండబట్టే ఈ జన్మలో వారు కుబేరులయ్యారు. ఏ ప్రకారం వ్యాపార నడక సాగిస్తే, వారు ఆ స్థితికి చేరుకోగలరో ఆ నడకని వారికి స్ఫురింప చేసేది వారి గత జన్మకర్మలే. దీనినే అమెరికన్లు‘సరైన మనిషి, సరైన ప్రదేశం లో, సరైన సమయంలో’ అని చెబుతారు. హిందూమతం దీనినే కర్మసిద్ధాంతరూపంలో వివరిస్తుంది. దీన్ని లౌకికులు అదృష్టం లేదా దురదృష్టంగా పిలుస్తుంటారు. కర్మకోణం నుంచి చూస్తే– కారణం లేకుండా కార్యం జరగడం అన్నది లేనే లేదు. కాబట్టి ఓ మనిషికి జరిగే మంచి కాని, చెడుకానీ లేదా వీటి మిశ్రమకర్మలు కాని గత లేదా ప్రస్తుత జన్మల్లో చేసిన కర్మల ఫలితంగానే ప్రాప్తిస్తాయి. మనం చేసే కర్మ చెడుదా లేదా మంచిదా అన్నది నిశ్చయించేది అది చేయడానికి వెన క గల భావనే అని మన సనాతన ధర్మం స్పష్టం చేస్తోంది. చూడడానికి బయటికి చెడుకర్మగా కనిపించినా, ఒక్కోసారి అది భావనని బట్టి సుకర్మ కావచ్చు. మనిషికి కర్మ చేయడానికి వెనక గల భావనని బట్టే అతనికి ఆ కర్మ తాలూకు ఫలితం లభిస్తుంది. మన భావనలన్నింటిని గ్రహించే దేవుడికి అందుకే భావగ్రాహి అనే పేరు రుషులు పెట్టారు. ఇందుకే సద్భావాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తారు. కర్మ కీలకం తెలిసిన రుషులు మా కళ్లు ఎప్పుడూ మంచినే చూచుగాక, మా చెవులు ఎప్పుడూ మంచినే వినుగాక, మా నాలుక ఎప్పుడూ మంచినే రుచి చూడుగాక అని ప్రార్థిస్తారు. మన మనసుని సద్భావాలతో నింపుకుంటే– సత్కర్మలని, దుష్టభావాలతో నింపుకుంటే దుష్కర్మలని చేస్తాం. ఆశాపరుడు అత్యంత దుష్టుడు. ఎందుకంటే ఆశపడేవాడి మనసు నిండా చెడుభావాలే ఉంటాయి. వారు చేసిన దుష్కర్మలే సరైన సమయంలో వారికి తగిన ఫలితాలనిస్తాయి. ఒకవేళ పూర్వజన్మలో వారు చేసిన సుకర్మలు ఈ జన్మలో అనుభవించాల్సిన అవసరం ఉంటే, అప్పుడు ఈ దుష్కర్మల ఫలితానుభవానికి పాత శుభకర్మల ఫలితానుభవం అడ్డుపడడంతో, అవి పై జన్మలకి వాయిదాపడి వచ్చే జన్మల్లో వారు దుర్భర కష్టాలు పడవచ్చు. కర్మ పని చేసే తీరు విషయంలో అజ్ఞానం గల సామాన్య ప్రజ ‘దుష్టులకే సుఖాలెందుకు? మంచివాళ్లకి కష్టాలెందుకు?’ అని ఆవేశంగా ఆలోచిస్తారు. దేవుడి మీద, కర్మ మీద నమ్మకాన్ని కోల్పోతారు. మనంచేసే ప్రతికర్మకి మనం జవాబుదారీ అన్న విశ్వాసం కలిగి ఉంటే చెడు చేయడానికి భయపడతారు. సమాజాన్ని దోపిడీ చేసేవారు కర్మ విషయంలో పూర్తిగా అజ్ఞానులు కాబట్టే, నిర్భయంగా చెడు పనులు చేస్తూ భవిష్యత్ జన్మలని అంధకార బంధురం చేసుకుని తమకి తాము అన్యాయం చేసుకుంటున్నారు. నిష్కామ కర్మ ప్రతివారు చేయదగ్గ గొప్ప కర్మనివారిణి. నిష్కామకర్మలో ఐదు భాగాలున్నాయి. 1.పని చేయి 2. దాన్ని నీకోసం చేయకు 3.పరులకోసం చేయి 4.పని తాలూకు ఫలితాన్ని ఆశించకు 5. ఒకవేళ ఫలితం వస్తుందనుకుంటే దాన్ని దైవానికి సమర్పించు. మన కర్మలకు మనమే కర్తలం. కర్మలలో నిష్కామ కర్మ చాలా గొప్పది. అంటే ఇతరులనుంచి ఏమీ ఆశించకుండా చేసేది. నిష్కామ కర్మ ప్రతివారు చేయదగ్గ గొప్ప కర్మనివారిణి. మనం చేసే దానధర్మాలు, పరోపకారం నిష్కామకర్మలు అవుతాయి. ఇవి ఎంత ఎక్కువ చేస్తే, మన పాపం అంతగా తొలగుతుంది. ముల్లుని ముల్లుతోనే తీసినట్లు మనం చేసిన దుష్కర్మని ఫలితాన్నివ్వకుండా నాశనం చేయడానికి నిష్కామకర్మ ఉపయోగిస్తుంది. చాలామంది దైవానికి మొక్కుకుంటారు. దానికన్నా మంచి పద్ధతి ఫలానా నిష్కామకర్మ చేస్తామని మొక్కుకోవడం. ‘మా అమ్మాయి పెళ్లయితే తిరుమల నడచి వస్తాము’ అనే మొక్కు కంటే ‘ఓ బీద కన్య వివాహానికి సహాయం చేస్తా’ అనుకుని చేయడం ఎక్కువ ఫలితాన్నిస్తుంది. మనకి ఉన్న అడ్డంకి తొలగడానికి పుణ్యక్షేత్ర సందర్శనతోబాటు దానధర్మాలని చేస్తారు. క్రైస్తవంలో సేవాతత్పరతకి పెద్దపీట వేశారు. హిందూమతంలో భక్తికి పెద్దపీట. కాబట్టి గుళ్లూ గోపురాలకి వెళ్లడంతోనే సరిపెట్టుకుంటున్నారు తప్ప బీదవాళ్లకి సేవకోసం ఖర్చు చేయడం పెద్దగా అలవాటు లేదు. నిష్కామకర్మ వల్ల స్వార్థం కరిగి, మనిషి ఉన్నతుడవుతాడు. మనం చేసిన కర్మఫలితాన్ని అనుభవించడానికి కారణం దాని విశిష్టతను మన అంతరాత్మ గ్రహించడానికే అని పెద్దలు చెబుతారు. ఒకరిని బాధిస్తే తిరిగి మనకి బాధ కలిగి వారెంత బాధ అనుభవించాల్సి ఉంటారో తెలుసుకోవడం ద్వారా మన అంతరాత్మ తిరిగి అలాంటి దుష్కర్మ చేయకూడదని నేర్చుకోవడం కోసం కర్మఫలితాన్ని మనం అనుభవిస్తాం. ఇలా ప్రతి జన్మలో గతంలో చేసిన వివిధ కర్మల ఫలితాలని అనుభవిస్తూ, వాటినుంచి పాఠాలు నేర్చుకుంటూ ఓ ఉపాధి(జన్మ) నుంచి మరో ఉపాధికి జీవాత్మ ఎదుగుతూ, అంచెలంచెలుగా ఆధ్యాత్మికంగా ఎదిగి చివరికి పరిశుద్ధ ఆత్మ అవడమే ముక్తి అని, ఇందులో కర్మలు, కర్మఫలితానుభవాలు సోపానాలు అని కర్మ సిద్ధాంతం తెలియజేస్తోంది. నిజానికి పాపం చేస్తున్నానన్న స్పృహ లేకుండా చాలా విషయాలలో పాపాన్ని మూటగట్టుకుంటారు. ఉదాహరణకు పక్కింటివారి చెట్టు నుంచి కరివేపాకు లేదా గోరింటాకు కోయడం, వృద్ధులు లేదా గర్భవతులు నిలబడి ఉంటే లేచి వారికి తను కూర్చునే ఆసనం ఇవ్వకపోవడం, నిజం తెలియకుండా నిందారోపణలు చేయడం, తను పని చేసే సంస్థకి సంబంధించిన గృహోపకరణాలను, వాహనాలని, సిబ్బందిని స్వప్రయోజనాలకు వాడుకోవడం, ఇతరులకి హాని కలిగేలా వాహనాన్ని మితిమీరిన వేగంతో నడపటం, ఎవరైనా పొరపాటున ఎక్కువ చిల్లర ఇస్తే తిరిగి ఇవ్వకపోవడం, రోడ్డుమీద చెత్త వెయ్యడం మొదలైన దుష్కర్మలు చే యకుండా స్వయం నియంత్రణను అలవరచుకోవాలి. లేకపోతే జీవితకాలంలో ఈ దుష్కర్మల భారం బాగా పెరుగుతుంది. మనకి ఏ కష్టం వచ్చినా దానికి బాధ్యులుగా మనుషులు లేదా పరిస్థితులు కనిపించినా అది నిజం కాదని, వారు కేవలం మనం పూర్వం చేసిన దుష్కర్మల ఫలితాలని అనుభవించడానికి కారణాలు మాత్రమేనని గ్రహించి ఆ ఫలితాన్ని నిశ్శబ్దంగా స్వీకరించడం మంచిది. ఇతరులకి ఏది చేస్తే తను బాధపడతాడో అది ఏ మనిషీ చేయకూడదు. చేస్తే పాపంలో చిక్కుకుని దానికి సరిపడే కష్టాలని అనుభవించాకే ఆ పాపాన్ని అతను నిర్మూలించుకోవాల్సి వస్తుంది. కాబట్టి చెడు చేసి కష్టాలు అనుభవించి పాఠం నేర్చుకునేకంటే తెలివైన జీవి ముందుగానే పాఠం నేర్చుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగ గలుగుతుంది. ఇదే సుకర్మల ప్రయోజనం. – మల్లాది వెంకటకృష్ణమూర్తి -
చేసిన పాపం ఎక్కడికిపోతుంది: రాజ్‌కుంద్రాపై నిర్మాత ఫైర్
సాక్షి, ముంబై: నీలిచిత్రాల కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటి, శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రాకు మరో భారీ షాక్ తగిలింది. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాపై న్యాయ పోరాటంలో నటుడు, నిర్మాత సచిన్ జోషి విజయం సాధించారు. ఎస్జీపీఎల్ సత్యయుగ్ గోల్డ్ స్కీమ్ వివాదంలో జోషికి సంబంధించిన బంగారాన్ని ఆయనకు అప్పగించాలని, అలాగే చట్టపరమైన చర్యలకు గాను మరో 3 లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి, సత్యగ్ గోల్డ్ బంగారు పథకంలో తనను మోసం చేశారని ఆరోపించిన సచిన్ జోషి ఈ ఏడాది జనవరిలో వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాజాగా కోర్టు జోషికి అనుకూలంగా తీర్పునిచ్చింది. జోషికి కిలో బంగారాన్ని అప్పగించడంతోపాటు, కోర్టు ఖర్చుల కింద మూడు లక్షలు రూపాయలు చెల్లించాలని బొంబాయి హైకోర్టు ఆదేశించింది. శిల్పా, రాజ్, ‘సత్యయుగ్ గోల్డ్’ కంపెనీలో అప్పటికి డైరెక్టర్లుగా ఉన్నారు. తక్కువ రేటుకే బంగారం స్కీం పేరుతో పలువురి వద్ద డబ్బులు సేకరించారు. ఇది తమకు చెల్లించలేదని ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే జోషి కేసులో తాజా తీర్పు వెలువడింది. ఈ తీర్పుపై స్పందించిన సచిన్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరేళ్లు తను కష్టపడి దాచుకున్న డబ్బును అక్రమంగా కాజేయాలని చూశారు. 18లక్షలు విలువ చేసే బంగారం తిరిగి ఇవ్వటానికి కుంద్రా సంస్థ 25 లక్షలు డిమాండ్ చేసిందని మండిపడ్డారు. తనబంగారాన్ని తనకివ్వమని అడిగితే, రివర్స్‌లో తనపైనే బురద చల్లారంటూ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చివరికి న్యాయమే గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. చేసిన పాపాలు ఎక్కడిపోతాయి...కర్మ అనుభవించక తప్పదంటూ వ్యాఖ్యానించారు. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా బాధితులు ఇంకా చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. అంతకుముందు పోర్న్ వీడియో స్కాంలో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన వెంటనే సచిన్ జోషి భార్య, నటి ఊర్వశి శర్మ తన ఇన్‌స్టా స్టోరీలో..‘చేసిన పాపంవెంటాడుతుంది’ అంటూ ఒక పోస్ట్ పెట్టడం విశేషం. మరోవైపు సోమవారం అర్థరాత్రి అరెస్ట్ చేసినరాజ్‌కుంద్రా రిమాండ్‌ను మరో మూడు రోజుల పాటు పొడిగించారు. రాజ్ అరెస్ట్ అక్రమమని బెయిల్ మంజూరుచేయాలన్న పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. అనంతరం జూలై 27వరకు పోలీసు కస్టడీ విధించింది. -
‘కర్మకు సరైన నిర్వచనం ఇదే’
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడయాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఫన్నీ మీమ్స్, తన వర్క్‌కు సంబంధించిన కోట్స్ షేర్ చేస్తుంటారు. గత కొద్ది రోజులుగా జీవిత సత్యాలకు సంబంధించి ఆసక్తికరమైన కోట్స్‌ను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తున్నారు స్మృతి ఇరానీ. తాజాగా కర్మకు సంబంధించి ఆమె షేర్ చేసిన ఓ కోట్ ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. కర్మ అద్దలాంటిది అంటున్నారు ఇరానీ. అద్దం ముందు నిల్చుని మనం ఏం చేస్తే... అదే కనిస్తుందని తెలిపారు. ‘ఇతరులకు నీవు చేసే కీడు నీకు ఎప్పుడు అర్థం అవుతుంది అంటే.. అదే నష్టం నీకు జరిగినప్పుడు.. అందుకే నేను ఇక్కడ ఉన్నాను-కర్మ’ అంటూ ఇరానీ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ కోట్‌ను ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు. అందుకనుగుణంగానే పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే దీనికి 20 వేల లైక్‌లు వచ్చాయి. చాలా మంది నెటిజనులు ‘బాగా చెప్పారు మేడం.. నిజం’ అంటూ కామెంట్ చేస్తున్నారు. (చదవండి: ‘ఒంటరిగా పోరాడితే.. బలవంతులవుతారు’) View this post on Instagram Karma is not a ***** , it’s a mirror ... #duniyagolhai 🙏 A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Aug 31, 2020 at 11:11pm PDT కొద్ది రోజుల క్రితం స్మృతి ఇరానీ ఓ సందేశాత్మక కోట్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘మీలోని భయాలు తొలగపోవడానికి కొంత సమయం పడుతుంది. గాయపడిన మీ హృదయం కోలుకోవడానికి కొంత సమయంల పడుతుంది. విధితో తలపడే బలాన్ని కనుగొనడానికి కొంత సమయం పడుతుంది. ఇవన్ని జరగడానికి సమయం పట్టవచ్చు.. కానీ కోరుకున్నది తప్పక జరిగి తీరుతుంది’ అంటూ పోస్ట్ చేశారు స్మృతి ఇరానీ. -
మనోసాధన
మనిషి చేసే కర్మలన్నింటికీ కారకం, ప్రేరకం మనస్సే. అయితే, అది అతి చంచలం. దాన్ని అదుపు చేయడానికి, పొదుపుగా వాడుకోవడానికి, మంచిగా తీర్చిదిద్దుకోవడానికి చాలా సాధన కావాలి. ఆ సాధనే బౌద్ధంలోని అష్టాంగమార్గం. మనస్సుకు ఎలా సాధన ఇవ్వాలి? అని బుద్ధుని అడిగాడు కేశి అనే వ్యక్తి. కేశి మంచి గుర్రపు రౌతు. అప్పుడు బుద్ధుడు ‘‘కేశీ! నీవు మంచి గుర్రపు రౌతువు కదా! నీవు నీ గుర్రాన్ని ఎలా మచ్చిక చేస్తావు?’’ అని అడిగాడు. ‘‘భగవాన్! నేను ముందు చాలా మృదువుగా శిక్షణ ఇస్తాను’’ అన్నాడు కేశి. ‘‘మరి ఎన్నిసార్లు మృదువుగా చెప్పినప్పటికీ వినకపోతే ఏం చేస్తావు?’’ ‘‘భగవాన్! అప్పుడు కఠినంగానే శిక్షణ ఇస్తాను. మళ్లీ మళ్లీ చేయిస్తాను’’ ‘‘నీవు ఎంత శిక్షణ ఇచ్చినా అది నీ దారికి రాకపోతే ఏం చేస్తావు?’’ ‘‘భగవాన్! చంపి వంటశాలకు పంపుతాను’’ ‘‘కేశీ! నేను కూడా అంతే! మనిషినిలోని మనస్సుకు శిక్షణ ఇస్తాను. నా దగ్గరకు వచ్చిన వారి మనసుల్ని అకుశలాల నుండి కుశలంవైపు మళ్లేలా చేస్తాను. నా శిక్షణ ఎప్పుడూ ఎప్పుడూ మృదువుగానే ఉంటుంది. కొందరి మనస్సు కరడు గట్టి ఉంటుంది. అలాంటి మనస్సుకు కాస్త కఠినంగానే శిక్షణ ఇస్తాను. ఇక ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా వినని వారిని నీవు గుర్రాన్ని చంపినట్లు మాత్రం చంపను. నా ధర్మంలో, నా మార్గంలో హింసకు తావులేదు. పదే పదే ప్రయత్నిస్తాను’’ ‘‘కేశీ! మనం మనస్సును రౌతు గుర్రాన్ని అదుపులో ఉంచేట్టు అదుపులోనే ఉంచుకోవాలి. నీవు గుర్రాన్ని దారిలోకి తెచ్చుకోడానికి ఎలా శిక్షణ ఇచ్చావో, సాధన చేశావో, నీ మనస్సు విషయంలో కూడా అలాగే సాధన చేయి’’ అని చెప్పాడు. కేశి ఆ మార్గాన్ని పాటించి, అతి తక్కువ సమయంలో మనోసాధనలో మేటిగా నిలిచాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
వైరల్.. లిఫ్ట్‌లో బాలుడి బిత్తిరి చర్య
బీజింగ్ : చైనాలో ఓ బాలుడు చేసిన బిత్తిరి చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండరు. ‘బాగైందంటూ.. భుజాలు ఎగురేస్తారు’. ఎవడు తీసుకున్న గొయ్యిలో వాడే పడ్డట్లుంది ఆ బాలుడి చేసిన పని. లిఫ్ట్‌లో ఒంటరిగా వెళ్తున్న ఆ బాలుడికి ఓ తీట పని చేయాలని తోచింది. లిఫ్ట్ బటన్స్‌ను ఇతరులు కూడా ఉపయోగిస్తారనే ఉద్దేశంతో వాటిపై టాయిలెట్ పోసాడు. తీరా ఆ బటన్స్‌ను తానే ఉపయోగించాల్సి వచ్చింది. తాను దిగాల్సిన ఫ్లోర్ వచ్చే సరికి బటన్స్ వాటంతటవే పని చేయడంతో లిఫ్ట్ ఒక్కసారిగా స్ట్రక్ అయింది. దీంతో లిఫ్ట్ డోర్ తెర్చుకోవడం.. మూసుకోవడంతో ఆ కుర్రాడు భయంతో అరవడం మొదలెట్టాడు. చివరకు తానే ఆ బటన్లను ప్రెస్ చేసి బయటకి వచ్చాడు. ఇతరులకు కీడు చేయాలనుకుంటే తనకే కీడు జరుగుతుందనే కర్మ సిద్దాంతం రుజువైంది. ఈ తతంగం అంతా అందులోని సీసీ టీవీలో రికార్డు అయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్ అయింది. -
విషాదాన్ని అలా పోగొట్టుకున్నాడు
రాయబారాలన్నీ విఫలమై, తీరా యుద్ధం ప్రారంభమయ్యే తరుణంలో అర్జునుణ్ని విషాదం చుట్టుముట్టింది: ‘నా శరీరంలోని ఇంద్రియాల్లాంటి ఈ నా చుట్టాల్నీ, సొంతవాళ్లనీ చంపి ఏం బావుకోవాలి?’ అనే జాలి పుట్టుకొచ్చింది. శ్రీకృష్ణుణ్ని ‘నాకిప్పుడేమీ పాలుపోవడం లేదు. నాకు గురువువై మార్గాన్ని చూపించు’ అని వేడుకొన్నాడు. శ్రీకృష్ణుడప్పుడు కర్తవ్యాన్ని బోధించాడు: ‘ఇక్కడ ఈ లోకంలో లోపలా బయటా అన్నీ సంఘర్షణలే. వాటి నుంచి ఎవడూ పారిపోలేడు. ఈ కర్మలనన్నిటినీ నిమిత్త మాత్రంగా చెయ్యాలి తప్ప, వాటి ఫలితాల ఆస్తి మీద మనకెవ్వరికీ హక్కు లేదు. పరమేశ్వరుణ్నే శరణు కోరుకొని, ఫలితాలన్నీ అతనివేనన్న వివేకంతో, అతని చేతిలో ఒక సాధనంగా మాత్రమే పనిచెయ్యాలి. ఇక్కడ ఎవ్వరూ ఎవ్వర్నీ చంపడం లేదు, చావడం లేదు కూడాను. మార్పులకు గురి అయ్యే శరీరాలు మార్పుల్ని పొందితే మనం ఏడవవలసిన పనిలేదు. అంతటా వ్యాపించి ఉన్న మనలో ఎవరికీ చావులేదు. భగవంతుణ్నే గుండెలో పెట్టుకొని తొణుకూ బెణుకూ లేకుండా ఈ జగన్నాటకాన్ని వినోదంగా చూస్తూ ఉండాలి. అతనూ నేనూ ఒకటేనన్న భావాన్ని రూఢి చేసుకొని, జీవితంలో సంఘర్షణలన్నీ నవ్వుతూనే ఎదుర్కోవాలి. అప్పుడే నీ మోహం పోతుంది’. ఈ ఉద్బోధను విని, విషాదాన్ని పోగొట్టుకుని గురువు చెప్పినట్టుగానే చేస్తూ అర్జునుడు యుద్ధంలో విజృంభించాడు. మొత్తంమీద భారతమంతటా అర్జునుడి సాధకరూపం ఉట్టిపడుతూ వచ్చింది. -
‘కర్మ’ వ్యాఖ్యలకు బాబా రాందేవ్ సమర్ధన
గౌహతి: గత జన్మలో చేసిన పాపాల ఫలితంగానే క్యాన్సర్ లేదా ప్రమాదాల్లో మృత్యువాత పడతారని, ఇదంతా కర్మ ఫలితమేనన్న అస్సాం మంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలను యోగా గురు బాబా రాందేవ్ సమర్ధించారు. కర్మ ఫలితాన్ని ఎవరైనా అనుభవించాల్సిందేనని అస్సాం పర్యటనకు వచ్చిన బాబా రాందేవ్ శుక్రవారం వ్యాఖ్యానించారు. అస్సాం మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే హిమంత శర్మ చెప్పింది విస్తృత కోణంలో చూస్తే సరైనదేనని, ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారని రాందేవ్ అన్నారు. ఏ వ్యక్తి పొందే మంచి లేదా చెడు అనేది కర్మ ఫలంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. వ్యాధులకు పలు కారణాలుంటాయని, వాటిలో జన్యుపరమైన అంశాలు ఒకటని..ఇవి కూడా కర్మ ఫలితంతో పాటు అలవాట్లు, పరిసరాల ప్రభావంతో ముడిపడి ఉంటాయని చెప్పుకొచ్చారు. మనిషి చావు, పుట్టుక అన్నీ కర్మ ఫలమేనన్నారు. -
సత్కర్మలు... సత్ఫలాలు
ఆత్మీయం మనిషి జీవితంలో మూడువిధాలైన కర్మల్ని ఎదుర్కొంటాడని వేదాంతశాస్త్రం చెబుతోంది. మనిషి చేసే కర్మలు మూడు రకాలు. అంటే గతకాలంలో చేసినవీ, ప్రస్తుతకాలంలో చేస్తున్నవీ, రాబోయే కాలాల కోసం చేసేవీ అన్నీ అనుభవంలోకి వస్తాయన్నమాట. మనిషి గతంలో చేసిన పుణ్యపాపాలను ’సంచిత’ కర్మలుగా పిలుస్తారు. సంచిలో సరకులను వేసి దాచినట్లు ఇవి దాగి ఉంటాయి కనుక ఇవి సంచితాలు. చేసిన పాపాలుగానీ, పుణ్యాలుగానీ పక్వమై మనిషి అనుభవించడానికి సిద్ధంగా ఉంటే అవి ’ప్రారబ్ధ’ కర్మలు. పుణ్యం చేయడం, పాపం చేయడం అనేవి మనిషి విచక్షణకు సంబంధించిన అంశాలు. మనిషి చెడు నడతలకు లోనైతే పాపాలు చేస్తాడు. మంచి నడవడిక కలిగి ఉంటే పుణ్యాలు చేస్తాడు. ఒక్కొక్కసారి మనిషి చెడుపనులను చేసి, ఆ తరవాత జ్ఞానోదయమై ’ఇలా ఎందుకు చేశాను?’ అని అనుకొంటాడు. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఆరాటపడతాడు. కానీ చేసిన పాపం వూరకే పోదు. చేసిన తప్పువల్ల ఫలాన్ని అనుభవించవలసిందే. ఇదే ప్రారబ్ధం అంటే. రాబోయే కాలంలో ఉత్తమ స్థితిని కలిగి ఉండటం కోసం మనిషి చేసే సత్కర్మలు ’ఆగామి’ కర్మలు. ఇతరులకు చేసే దానధర్మాలు, ఉపకారాలు, త్యాగాలు మనిషికి ఆగామికాలంలో ఉపయోగపడతాయి. ఇలాగే పుణ్య, పాపకర్మల విషయంలోనూ మనిషి ఆలోచించాలి అనేదే ఈ కర్మల పరమార్థం. అందుకే మనిషి మంచినే భావించాలి. మంచినే భాషించాలి. మంచినే ఆచరించాలి. మంచినే అనుసరించాలి. -
దుష్కర్మలను నివారించే సుకర్మలు
ఆత్మీయం మన కర్మలకు మనమే కర్తలం. కర్మలలో నిష్కామ కర్మ చాలా గొప్పది. అంటే ఇతరులనుంచి ఏమీ ఆశించకుండా చేసేది. నిష్కామ కర్మ ప్రతివారు చేయదగ్గ గొప్ప కర్మనివారిణి. మనం చేసే దానధర్మాలు, పరోపకారం నిష్కామకర్మలు అవుతాయి. ఇవి ఎంత ఎక్కువ చేస్తే, మన పాపం అంతగా తొలగుతుంది. ముల్లుని ముల్లుతోనే తీసినట్లు మనం చేసిన దుష్కర్మని ఫలితాన్నివ్వకుండా నాశనం చేయడానికి నిష్కామకర్మ ఉపయోగిస్తుంది. చాలామంది దైవానికి మొక్కుకుంటారు. దానికన్నా మంచి పద్ధతి ఫలానా నిష్కామకర్మ చేస్తామని మొక్కుకోవడం. ‘మా అమ్మాయి పెళ్లయితే తిరుమల నడచి వస్తాం’ అనే మొక్కు కంటే ‘ఓ బీద కన్య వివాహానికి సహాయం చేస్తా’ అని మొక్కి అలా చేయడం ఎక్కువ ఫలితాన్నిస్తుంది. మనకి ఉన్న అడ్డంకి తొలగడానికి పుణ్యక్షేత్ర సందర్శనతోబాటు దానధర్మాలని చేస్తారు. కుక్కకి పాలు పోస్తే ఉద్యోగం వస్తుందని ఓ జోస్యుడు చెబుతాడు. కోతులకి ఆహారం ఇస్తే ఆరోగ్యం కుదుటపడుతుందని మరో జోస్యంలో చెబుతారు. కారణం వారి చెడుకర్మ ఫలితాన్ని ఆ సుకర్మ నివారించడానికి, ఆ ప్రాణులకు ఈ రూపంలో ఆహారం అందడానికే. -
కర్మ విచ్ఛేదనం ఎలా?
కర్మ అంటే పని లేదా చర్య అని అర్థం. పుట్టిన క్షణం నుంచీ, ఈ క్షణం వరకూ, మీ కుటుంబ స్థితిగతులు,మీ ఇంటి వాతావరణం, మీ స్నేహితుల మనస్తత్వాలు, మీరు చేసిన- చెయ్యని పనులు, ఇవన్నీ మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రతీ ఆలోచన, ప్రతీ ఉద్వేగం, ప్రతిచర్యా, మీలో గతంలో ముద్రింపబడి ఉన్న భావనల నుండే జనిస్తుంది. అవన్నీ ఇప్పుడు మీరు ఎవరూ అనేది నిర్ణయిస్తాయి. మీరు ఆలోచించే విధానం, అనుభూతి చెందే విధానం, అసలు జీవితాన్ని అర్థం చేసుకొనే విధానమే మీరు ఇంతకు ముందు స్వీకరించిన వాటిని ఎలా మీలో ఇముడ్చుకున్నారనే దానిని బట్టి ఉంటుంది. దీనినే మనం కర్మ అంటాం. ఆధునిక భాషలో చెప్పాలంటే, అది మీలోని సాఫ్ట్వేర్. ప్రస్తుతం ఏ సాఫ్ట్వేర్ ఆధారంగా అయితే మీరు పని చేస్తున్నారో అదే కర్మ. మీ శారీరక వ్యవస్థ అంతా, అంటే మీ దేహం, బుద్ధి, శక్తి, భావోద్వేగాలు, అన్నీ ముందుగానే, మీరు స్వీకరించిన వాటి ఫలితంగా ప్రోగ్రామై ఉన్నాయి. వాటన్నిటి సంక్లిష్ట సమ్మేళనమే మీ కర్మ. మీలోని సార్ ఏవిధంగా ఉంటే, అదేవిధంగా మీ శరీరం, బుద్ధి, భావాలు పనిచేస్తాయి. మీలోని అంతర్గత శక్తి కూడా అదే దిశగా ప్రవహిస్తుంది. మీకెలాటి కర్మ ఉన్నా, అది ఒక పరిమితమైన సంభావ్యతే (అవకాశమే). మిమ్మల్ని ఒక వ్యక్తిగా పరిమితున్ని చేసేది అదే. మీ వ్యక్తిత్వం మీ కర్మల నుండి జనించే పరిమళం. మీ కర్మలో కుళ్ళిపోయిన చేప ఉంటే, మీరు ఆ దుర్వాసననే కలిగి ఉంటారు. మీ కర్మలో పువ్వుల సుగంధం ఉంటే, మీరు ఆ పరిమళాన్నే కలిగి ఉంటారు. మీలో ఎలాంటి భావనలు కోపం- ద్వేషం, ప్రేమ-ఆనందం- ఇలా ఎలాంటి భావనలైతే ముద్రింపబడి ఉన్నాయో, వాటికి అనుగుణంగానే మీ వ్యక్తిత్వం ఉంటుంది. సామాన్యంగా ప్రతీ మనిషి, వీటన్నిటి సమ్మేళనమే! మీరు మీ వంక చూసుకున్నా, మీ చుట్టూ ఉన్న మనుషులను చూసినా, ఒక్కో సందర్భంలో వారు ఎంతో అద్భుతంగా అనిపిస్తారు, వారే మరొక సందర్భంలో చాలా అసహ్యకరంగా అనిపిస్తారు. ఎందుకంటే ప్రతి క్షణం, మీ కర్మలోని ఒక భాగం వ్యక్తీకరించబడుతుంది. ఈ కర్మ నిర్మాణాన్ని మీరు అలాగే జరగనిస్తే, ఒక నిర్ణీత స్థితి తరువాత, మీకు స్వేచ్చ అనేదే లేకుండాపోతుంది. మీరు చేసేదంతా, జరిగిపోయిన విషయాలచే శాసించబడినదవుతుంది! కాబట్టి, మీరు మోక్షం దిశగా ప్రయాణించాలి అంటే, మొదట చెయ్యవలసింది, కర్మ బంధనాన్ని వదులు చేసి, ఆ సంకెళ్ళను తెంచుకోవడమే! లేకపోతే, ఏ పురోగతీ ఉండదు. ఇందుకు మొదటి సులభోపాయం, శారీరకంగా కర్మను విచ్ఛేదనం చెయ్యడం. ఉదయాన్నే ఎనిమిది గంటలకు లేవడం మీ కర్మ అయినట్లయితే, మీరు ఐదు గంటలకే అలారం పెట్టుకుని లేవండి. మీ శారీరక కర్మ అందుకు అంగీకరించదు. అయినా, మీరు నేను నిద్ర లేవాల్సిందే అని తీర్మానించుకోండి. అలా మీరు నిద్ర లేచినా మీ శరీరం ముందుగా కాఫీ అడుగుతుంది. కాని, మీరు దానికి చన్నీళ్ళ స్నానం ఇవ్వండి. ఇలా జాగృత స్థితిలో ఉంటూ, మీరు చెయ్యడం వల్ల, మీరు పూర్వపు కర్మలను తెంచగలుగుతారు. ఏది చెయ్యాలనిపిస్తుందో, అది కర్మ నుంచే జనిస్తుంది. మీకు ఇష్టం లేనివి సహజంగా మీరు నిరాకరిస్తారు కనుక, కొంతకాలం మీకు ఇష్టం లేనివి చేసి చూడండి. ఇంకా సూక్ష్మమయిన, ప్రభావవంతమయిన పద్ధతులు ఉన్నాయి. నేను మీకు చెబుతున్నది అత్యంత మొరటు విధానం. మీ మనసు, దేహం కోరుకునేవి అన్నీ తెంచుకోండి. మీకు ఇష్టం లేనివి ఎరుకతోనే చేయగలరు. మీకు ఇష్టం ఉన్నవి మీరు పరాకుగా అయినా చెయ్యగలరు కదా? ఒకవేళ మీరు మీ శత్రువుతో మాట్లాడాలి అనుకోండి. అప్పుడు మీరు ప్రతీ మాట ఆచి-తూచి , ప్రతీ అడుగూ ఆలోచించి వేస్తారు. కాని, స్నేహితులతో మాట్లాడేటప్పుడు నోటికి వచ్చిందల్లా ఆలోచించకుండానే మాట్లాడేస్తారు. మీ శత్రువును మీరు సహించలేరు. అతన్ని చూడగానే, మీలో ఎన్నో మార్పులు కలుగుతాయి. అయినా, మీరు వెళ్లి అతనితో మాట్లాడండి. ఇది కర్మను విచ్చేదనం చేసే మార్గం. ఇలా జాగృతస్థితిలో ఉంటూ, మీకు ఇష్టం లేని పనులను చెయ్యడం వల్ల, మీరు గత కర్మ బంధనాలను క్రమంగా తెంచుకోగలుగుతారు. ప్రేమాశీస్సులతో, సద్గురు జగ్గీ వాసుదేవ్ -
కర్మలను నాశనం చేసుకుంటేనే బంధవిముక్తి
అతి ప్రాచీనమైనదిగా, ఉత్తమోత్తమమైన మతంగా గుర్తింపు పొందినది జైనమతం. ఈ మతం ఎప్పుడు నెలకొల్పబడిందో ఇతమిత్థంగా తెలియనప్పటికీ, ఋగ్వేద మంత్రాలలో సైతం జైనమత వ్యవస్థాపకుడైన ఋషభుని గురించిన ప్రస్తావన ఉన్నదంటేనే ఆ మతం ఎంత ప్రాచీనమైనదో అర్థం చేసుకోవచ్చు. జైనమతానికి మొత్తం 24 తీర్థంకరులున్నారు. తీర్థంకరులు అంటే జీవన స్రవంతిని దాటడానికి వారథిని నిర్మించినవారు అని అర్థం. వర్థమాన మహావీరుడు జ్ఞాత్రికా తెగకు చెందినవాడు. వైశాలి దగ్గరగల కుందగ్రామంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడాయన. యశోదతో ఈయన వివాహం జరిగింది. వారికి ప్రియదర్శన అనే కుమార్తె కలిగింది. ముప్పైసంవత్సరాల వయసులో వర్థమాన మహావీరుడికి జీవితంపై విరక్తి కలిగి, ఇల్లు వదిలి సన్యాసం స్వీకరించాడు. శరీరాన్ని కృశింపజేసే కఠోరమైన జైనమత ఆచార నియమాలు పాటిస్తూ సుమారు పుష్కరకాలంపాటు దేశ సంచారం చేశాడు. వర్థమానుడు దాదాపు సంవత్సరకాలంపాటు ఒక వస్త్రాన్ని ధరిచి, ఆ తర్వాత ఆ వస్త్రాన్ని కూడా విసర్జించి దిగంబరంగా జీవించాడు. పన్నెండేళ్లపాటు రుజుపాలిక నదీతీరంలోగల జృంభిక గ్రామసమీపంలో ఒక సాలవృక్షం కింద కఠోర తపస్సు చేసి జ్ఞానోదయం పొందాడు. కర్మకాండను, కులాధిక్యభావనను తిరస్కరించి పవిత్రమైన జీవితం గడపాలని బోధించాడు. ఈ ప్రపంచమంతా చేతన, అచేతన జీవులతో నిండి ఉందని,అంతేగాని, జాతి, కుల, మత, వర్ణ, లింగ వివక్షత పాటించడం అవివేకమన్నాడు. కర్మ ఆత్మను అంటిపెట్టుకుని ఉంటుందని, కామ, క్రోధ, లోభ మోహాదులు కర్మకు కారణాలని, కర్మల ఫలితాలను అనుభవించడం కోసమే ఆత్మ జన్మ, పునర్జన్మలను అనుభవించవలసి వస్తోంది. దీర్ఘ తపస్సు చేత, పూర్వార్జిత కర్మలను నాశనం చేసుకున్నప్పుడు జీవుడు బంధవిముక్తుడవుతాడని, కాబట్టి జనన మరణాల నుండి విముక్తి పొందడమే జీవిత లక్ష్యంగా భావించాలని బోధించాడు. సల్లేఖన వ్రతం: జైనమత కఠోర నియమం సల్లేఖన వ్రతం. జైన సన్యాసులుగా దీక్ష స్వీకరించేవారు కఠిన నియమాలను పాటించవ లసి ఉంటుంది. ఏవిధమైన సాధనాలూ ఉపయోగించకుండా తలవెంట్రుకలను తనంతట తానుగా తొలగించుకోవడం, పరిమితమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ తీక్షణమైన ఎండ వానలను లెక్కచేయకుండా కఠోర తపస్సులో నిమగ్నం కావడం జైనమత నియమాలు. అన్నింటికంటే చాలా కష్టతరమైనది సల్లేఖన వ్రతం. ఆహారం కాని, నీరు కానీ తీసుకోకుండా శరీరాన్ని శుష్కింపజేసుకోవడం సల్లేఖన వ్రతంలోని ప్రధానాంశం. సల్లేఖన వ్రతం ద్వారానే మోక్షానికి చేరువ కావచ్చునన్నది జైనమత విశ్వాసం. జైనమతానికి 24వ తీర్థంకరుడైన వర్థమాన మహావీరుడు ఆశ్వయుజమాసంలో అమావాస్యనాడు తన భౌతిక కాయాన్ని వదిలి నిర్యాణం చెందాడు. ఆయన నిర్యాణ సమయంలో దేవతలందరూ వచ్చి ఆయన చుట్టూ నిలిచారని, వారి శరీరాలనుండి వెలువడిన వెలుగు రేఖలతో అమావాస్య చీకట్లు తొలగి కాంతికిరణాలు వెలువడ్డాయని, అందుకు గుర్తుగానే జైనమతానుయాయులు దీపావళినాడు దీపాలు వెలిగిస్తారు.