
మంచిమాట
మనిషి ఏ పనీ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండటం అసాధ్యం. ఏమీ చేయటం లేదు అన్నప్పుడు ఆ మాట పలకటం కర్మయే కదా! అప్పుడు కూడా గాలి పీల్చటం, తిన్న దానిని అరిగించుకోవటం వంటి పనులు చేస్తూనే ఉంటాము కదా! ఇవి కూడా మనని పట్టి బంధించి మరొక జన్మకి కారణం అవుతాయా? అనే సందేహం కలగటం సహజం. దీనిని గురించి భగవద్గీతలో కృష్ణుడు వివరంగానే చె΄్పాడు. ‘అకర్మ’ అని. నిజానికి జీవించి ఉండటమే ఒక కర్మ.
జీవ చైతన్యం జీవికి ధర్మం. దాని వ్యక్త స్వరూపం కదలిక. అప్పుడే పుట్టిన బిడ్డ కాళ్ళు చేతులు కదిలిస్తూ ఏడుస్తాడు. బిడ్డ ఏడవక ΄ోయినా, కదలికలు లేక΄ోయినా పెద్దలు ఏడవ వలసి ఉంటుంది. ఏదోవిధంగా ఏడిపించే ప్రయత్నం చేస్తారు. అస్తవ్యస్తంగా ఉన్న ఈ కదలికలు, ధ్వనులు క్రమేణా వయస్సుని బట్టి సంకల్పాలతో సంబంధం కలిగి ఉంటాయి. అంటే అభి్ర΄ాయానికి అనుగుణంగా కదలికలు ఉంటాయి. మొదట్లో నవ్వటం, ఏడవటం అకారణంగా ఉంటాయి. ఇది నిష్కామకర్మ. రాను రాను వయసుని బట్టి ఈ ఏడుపులు, నవ్వులు సకారణంగా మారుతాయి. తెలిసినవారిని చూసి నవ్వటం, కొత్తవారిని చూసి ఏడవటం, ఆకలి వేస్తే, చీమ కుడితే ఏడవటం సకారణమేగా. పైగా ఎవరైనా వచ్చి తన బాధ తీర్చాలనే కోరికతో చేసినదే కనుక సకామ కర్మ అవుతుంది.
చేతులు కదలి నోటి దాకా వచ్చి వ్రేళ్ళు చీకటం మొదలవుతుంది. చేతిని నోటిదాకా తీసుకు రావటానికి ఎంత తాపత్రయ పడతారో పిల్లలు గమనించ వచ్చు. ఆ పైన ఆ కదలిక వస్తువులను చూపించటం, పట్టుకోవటంలో నేర్పు చూపించటంగా మార్పు చెందుతుంది. అదే విధంగా ఏడవటం ఊ కొట్టటంగా మారి, క్రమంగా మాటలుగా పరిణామం జరుగుతుంది. తన అభి్ర΄ాయాలు, కోరికలు వ్యక్తీకరించటానికి మాటలని ఉపయోగించటం జరుగుతుంది. ఇది ఎంతో సహజంగా, అప్రయత్నంగా జరిగే పరిణామం.
మనోవాక్కాయకర్మలచే మొదలైన దివ్యకర్మ మానవకర్మగా మలచ బడింది. అకామకర్మ బంధించదు. సకామకర్మ బంధ హేతువు. అకామకర్మ సకామకర్మగా రూ΄ాంతరం చెందుతున్న క్రమంలో అది ఘనీభవించి తాను అందులో బంధించబడకుండా జాగరూకత వహించవలసి ఉంటుంది. ప్రతిదీ లాభనష్టాల లెక్కలతో బేరీజు వేయటానికి అలవాటు పడిన మనిషికి ఇది సాధ్యమా? అనిపించటం సహజం. కానీ ఆ విధంగా ఉండటమే సహజం. స్వార్థపూరితంగా ఉండటమే తెచ్చిపెట్టుకున్న లక్షణం.
ఎందుకంటే పుట్టిన కొత్తలో ప్రతి మనిషి శిశువుగా ఏ పని చేసినా ప్రయోజనాన్ని ఆశించి చేయటం ఉండదు. చిన్నపిల్లలు ఒక్క క్షణం కూడా ఒక చోట స్థిరంగా కూర్చోరు. గిరా గిరా తిరుగుతూనే ఉంటారు. ఎందుకు అని అడిగితే ‘ఊరికే’ అంటారు. పెరిగి పెద్ద అయినాక కూడా ఏదో ఒక పని చేయకుండా ఉండలేము. దానికి ఒక సంకల్పం, లేదా కోరిక జత చేయటం జరుగుతుంది. ఈ కోరిక బంధిస్తుంది. ఎలాగూ ఏమి చేయకుండా ఉండలేము కనుక ఏదైనా మనస్సుతో, వాక్కుతో, చేతులతో ఫలితాన్ని ఆశించకుండా పదిమందికి ఉపయోగ పడే పని చేస్తూ ఉంటే అది నిష్కామకర్మ అవుతుంది. దేహం ఉన్నంత వరకు కర్మాచరణ మాన రాదు.
గాలి పీల్చటం, గుండె కొట్టుకోవటం, ఊపిరితిత్తులు పని చేయటం మన ప్రయత్నం లేకుండా ఎట్లా జరుగుతున్నాయో నిత్యకృత్యాలు కూడా అదేవిధంగా యాంత్రికంగా, అప్రయత్నంగా కొనసాగిస్తూ, వాటిలో మానసికంగా లగ్నం కాకుండా ఉన్నప్పుడు సకామకర్మ అవదు. కనుక బంధించదు, మరొక జన్మకి కారణం కాదు.