పాములు పగబడతాయన్న మాట అప్పుడప్పుడూ వింటుంటాం. పాత సినిమాల్లో అయితే పగబట్టి వెంటాడే పాముల సీన్లూ చూసి ఉంటాం. మరి అవి అలా నిజంగా పోగబడతాయా? ఏమో చెప్పలేం. కానీ కాకులు మాత్రం పగబడతాయట. అదీ నెలో, ఏడాదో కాదు.. ఏకంగా 17 ఏళ్ల పాటు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మరీ పగ తీర్చుకునేందుకు ప్రయతి్నస్తాయట. వాషింగ్టన్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఆ వివరాలేంటో చూద్దామా..
కొన్ని కాకులను బంధించి..
పక్షుల్లో కాకులను బాగా తెలివైనవిగా భావిస్తారు. తమకు ఆహారం వేసే మనుషులను గుర్తించగలవని కూడా ఇంతకుముందే తేల్చారు. అదే సమయంలో తమకు కీడు చేయడానికి ప్రయతి్నంచిన, భయపెట్టినవారిపై పగబడతాయని తాజాగా తేల్చారు. దీనిపై వాషింగ్టన్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జాన్ మార్జలఫ్ నేతృత్వంలోని పరిశోధకులు సుదీర్ఘ ప్రయోగం చేశారు. 2006లో దెయ్యం లాంటి ఓ మాస్కు పెట్టుకుని.. యూనివర్సిటీ క్యాంపస్‌లో కొన్ని కాకులను పట్టి బంధించారు. వాటిని కాసేపు భయపెట్టినట్టుగా చేశారు. తర్వాత వాటి కాళ్లకు ఐడెంటిఫికేషన్ రింగులను వేసి వదిలేశారు.
మాస్క్ తో వెళితే వెంటాడుతూ..
శాస్త్రవేత్తలు ఆ తర్వాతి నుంచి క్యాంపస్‌లో ఆ దెయ్యం మాస్కు వేసుకుని కొన్నిసార్లు, వేసుకోకుండా మరికొన్నిసార్లు, వేరే ఇతర మాస్క్ లు పెట్టుకుని ఇంకొన్నిసార్లు తిరుగుతూ కాకులకు ఆహారం పెట్టడం మొదలుపెట్టారు. ఈ సమయంలో వాటి స్పందనను రికార్డు చేస్తూ వచ్చారు. శాస్త్రవేత్తలు దెయ్యం మాస్కు వేసుకుని వెళ్లినప్పుడు కాకులు.. తీవ్రంగా అరుస్తూ, వెంటాడుతూ రావడాన్ని.. మాస్క్ లేనప్పుడు, వేరే మాసు్కలు వేసుకున్నప్పుడు అవి మామూలుగానే ఉండటాన్ని రికార్డు చేశారు. అయితే క్రమంగా ఇలా వెంటాడటం తగ్గిందని, సుమారు 17 ఏళ్ల తర్వాత అవి వెంటాడటం ఆగిపోయిందని ప్రొఫెసర్ జాన్ మార్జలఫ్ చెప్తున్నారు.
పక్కాగా గుర్తించి మరీ వెంటాడాయి..
‘‘కొందరు వలంటీర్లకు వేర్వేరు మోడళ్లలోని మాస్కులు ఇచ్చి, యూనివర్సిటీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరగాలని చెప్పాం. అందులో మేం కాకులను పట్టుకుని, భయపెట్టినప్పటి మాస్క్ లు వేసుకున్నవారిని మాత్రమే కాకులు టార్గెట్ చేశాయి. గట్టిగా అరవడం, వేగంగా వచ్చి కాళ్లతో తన్నడం వంటివి చేశాయి. మేం బంధించిన కాకులు మాత్రమేకాకుండా వేరే కాకులు కూడా ఇలా చేశాయి. అవి ప్రమాదకరమని భావించిన వాటిపై సమాచారం ఇచి్చపుచ్చుకోవడమే దీనికి కారణం’’ అని ప్రొఫెసర్ వెల్లడించడం గమనార్హం. ..: సాక్షి సెంట్రల్ డెస్క్ :..
Comments
Please login to add a commentAdd a comment