remember
-
కాకి పగ పదిహేడేళ్లు..
పాములు పగబడతాయన్న మాట అప్పుడప్పుడూ వింటుంటాం. పాత సినిమాల్లో అయితే పగబట్టి వెంటాడే పాముల సీన్లూ చూసి ఉంటాం. మరి అవి అలా నిజంగా పోగబడతాయా? ఏమో చెప్పలేం. కానీ కాకులు మాత్రం పగబడతాయట. అదీ నెలో, ఏడాదో కాదు.. ఏకంగా 17 ఏళ్ల పాటు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మరీ పగ తీర్చుకునేందుకు ప్రయతి్నస్తాయట. వాషింగ్టన్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఆ వివరాలేంటో చూద్దామా..కొన్ని కాకులను బంధించి.. పక్షుల్లో కాకులను బాగా తెలివైనవిగా భావిస్తారు. తమకు ఆహారం వేసే మనుషులను గుర్తించగలవని కూడా ఇంతకుముందే తేల్చారు. అదే సమయంలో తమకు కీడు చేయడానికి ప్రయతి్నంచిన, భయపెట్టినవారిపై పగబడతాయని తాజాగా తేల్చారు. దీనిపై వాషింగ్టన్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జాన్ మార్జలఫ్ నేతృత్వంలోని పరిశోధకులు సుదీర్ఘ ప్రయోగం చేశారు. 2006లో దెయ్యం లాంటి ఓ మాస్కు పెట్టుకుని.. యూనివర్సిటీ క్యాంపస్‌లో కొన్ని కాకులను పట్టి బంధించారు. వాటిని కాసేపు భయపెట్టినట్టుగా చేశారు. తర్వాత వాటి కాళ్లకు ఐడెంటిఫికేషన్ రింగులను వేసి వదిలేశారు.మాస్క్ తో వెళితే వెంటాడుతూ.. శాస్త్రవేత్తలు ఆ తర్వాతి నుంచి క్యాంపస్‌లో ఆ దెయ్యం మాస్కు వేసుకుని కొన్నిసార్లు, వేసుకోకుండా మరికొన్నిసార్లు, వేరే ఇతర మాస్క్ లు పెట్టుకుని ఇంకొన్నిసార్లు తిరుగుతూ కాకులకు ఆహారం పెట్టడం మొదలుపెట్టారు. ఈ సమయంలో వాటి స్పందనను రికార్డు చేస్తూ వచ్చారు. శాస్త్రవేత్తలు దెయ్యం మాస్కు వేసుకుని వెళ్లినప్పుడు కాకులు.. తీవ్రంగా అరుస్తూ, వెంటాడుతూ రావడాన్ని.. మాస్క్ లేనప్పుడు, వేరే మాసు్కలు వేసుకున్నప్పుడు అవి మామూలుగానే ఉండటాన్ని రికార్డు చేశారు. అయితే క్రమంగా ఇలా వెంటాడటం తగ్గిందని, సుమారు 17 ఏళ్ల తర్వాత అవి వెంటాడటం ఆగిపోయిందని ప్రొఫెసర్ జాన్ మార్జలఫ్ చెప్తున్నారు.పక్కాగా గుర్తించి మరీ వెంటాడాయి..‘‘కొందరు వలంటీర్లకు వేర్వేరు మోడళ్లలోని మాస్కులు ఇచ్చి, యూనివర్సిటీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరగాలని చెప్పాం. అందులో మేం కాకులను పట్టుకుని, భయపెట్టినప్పటి మాస్క్ లు వేసుకున్నవారిని మాత్రమే కాకులు టార్గెట్ చేశాయి. గట్టిగా అరవడం, వేగంగా వచ్చి కాళ్లతో తన్నడం వంటివి చేశాయి. మేం బంధించిన కాకులు మాత్రమేకాకుండా వేరే కాకులు కూడా ఇలా చేశాయి. అవి ప్రమాదకరమని భావించిన వాటిపై సమాచారం ఇచి్చపుచ్చుకోవడమే దీనికి కారణం’’ అని ప్రొఫెసర్ వెల్లడించడం గమనార్హం. ..: సాక్షి సెంట్రల్ డెస్క్ :.. -
నీ గొంతు ఇప్పుడూ అవసరమే
‘నేను నా చుట్టూ ఉన్న వాళ్లనే కాదు...ఎప్పుడూ ఎరగని వాళ్లను కూడా సంతోషంగా ఉంచదలుచుకున్నాను’ అని రాసుకుంది అనీ ఫ్రాంక్. యూదుల మీద హిట్లర్ దమనకాండ సాగిస్తున్నప్పుడు 14 ఏళ్ల యూదు బాలిక అనీ ఫ్రాంక్ రాసిన జగద్విఖ్యాత డైరీనే ‘అనీ ఫ్రాంక్ డైరీ’.ఇవాళ ΄పాలస్తీనా మీద ఇజ్రాయిల్ దాడి ఉక్రెయిన్ మీద రష్యా దాడి ఇవన్నీ పిల్లల్ని ΄ పౌరుల్ని దారుణంగా చంపుతున్నప్పుడు‘మానవత్వం కోసం అనీ చేసిన ప్రార్థన’ గుర్తు చేసుకోక తప్పదు.అనీ ఫ్రాంక్ పుట్టింది జూన్ 12, 1929లో. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వలస వచ్చి ఆమ్‌స్టర్‌డామ్‌లో స్థిరపడ్డ యూదు కుటుంబం వారిది. చిన్నప్పటి నుంచి ఎంతో చురుకైన పిల్ల అనీ ఫ్రాంక్. ఆమె పదమూడవ జన్మ దినాన– అంటే జూన్ 12, 1942న తండ్రి ఆమెకు ఒక డైరీని కానుకగా ఇచ్చాడు. పుట్టిన రోజుకు ముందు ఆమ్‌స్టర్‌డామ్‌లో తండ్రితో షాపింగ్‌కి వెళ్లిన అనీకి బౌండ్ చేసిన నోట్‌బుక్ కనిపించింది. ‘అది నాకు అది కావాలి నాన్నా’ అని తండ్రిని అడిగితే బర్త్ డే గిఫ్ట్‌గా కొనిచ్చాడు. ఆ నోట్‌బుక్‌ని ఎంతో ఇష్టపడ్డ అనీ దానినే డైరీగా భావించి రోజూ రాయడం మొదలుపెట్టింది.రహస్య జీవితంరెండో ప్రపంచ యుద్ధం మొదలైన మూడేళ్లకు హిట్లర్ సేన నెదర్లాండ్స్‌ను హస్తగతం చేసుకుంది. ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్న యూదులను అరెస్ట్ చేస్తున్నారు. అది తెలిసిన వెంటనే– జూలై 5, 1942 రాత్రి అనీ తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని అదే ఆమ్స్టర్డామ్లోని ఒక దినుసుల కర్మాగారంలో రహస్య గదుల్లోకి చేరారు. దాని యజమాని యూదుల సానుభూతి పరుడు. కొంతమంది మిత్రులు రహస్యంగా అందించే ఆహారాన్ని వాడుకుంటూ అనీ ఫ్రాంక్ కుటుంబం నాజీ ΄ోలీసులకు పట్టుబడే వరకు అంటే ఆగస్టు 4, 1944 వరకు– రెండేళ్ల 35 రోజులు రహస్య గదుల్లోనే గడిపింది. ఆ మొత్తం రోజులూ అనీ ఫ్రాంక్ డైరీ రాసింది. పట్టుబడ్డాక అనీ ఫ్రాంక్ను నవంబర్ 1, 1944న కాన్సన్ట్రేషన్ క్యాంపుకు తరలించారు. తీవ్రమైన ఆకలితో, చలికి వణుకుతూ కాన్సన్ట్రేషన్ క్యాంపులో 1945 ఫిబ్రవరి– మార్చిల మధ్యన విష జ్వరంతో మరణించింది అనీ ఫ్రాంక్.ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్అనీ రాసిన డైరీ తొలిసారి 1946లో మార్కెట్లో విడుదలై సంచనలం రేపింది. డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’ పేరుతో ప్రతి దేశంలో ప్రతి భాషలో అనువాదం అయ్యింది. తాను డైరీ రాస్తున్న కాలంలో నాజీలు యూదులను దారుణంగా హతమారుస్తున్నా, రహస్య స్థలంలో తాము తిండికీ బట్టకూ అల్లాడుతున్నా అనీ ఎవరినీ ద్వేషించలేదు. అడుగడుగునా మనిషి మీద నమ్మకం ఉంచింది. ‘ఇంత చేస్తున్నా మనిషి మంచివాడనే నేను నమ్ముతాను’ అని రాసుకుంది. ‘నేను బాగా చదువుకోవాలి. జర్నలిస్టును కావడం నా లక్ష్యం. ఒకవేళ నాకు వార్తాపత్రికలకు రాసే ప్రావీణ్యం లేకున్నా నా కోసం నేను రాసుకుంటాను. చాలామంది ఆడవాళ్లలా శ్రమకు ఏమాత్రం గుర్తింపు లేని ఇంటి పని చేయలేను. భర్తకు, పిల్లలకు జీవితాన్ని అంకితం చేయడం కన్నా ఇంకా ఎక్కువగా నాకు నా జీవితం కావాలి. సమాజానికి నేనేదైనా చేయాలి. మనుషుల సంతోషానికి నేనొక కారణం కావాలి. చనిపోయాక కూడా నేను జీవించే ఉండాలి’ అని రాసుకుంది అనీ.ద్వేషం వద్దనేదే ఆనా సందేశంమనిషికి సాటి మనిషి మీద ద్వేషం ఎంతదూరమైనా తీసుకెళుతుందని రెండో ప్రపంచ యుద్ధం నిరూపించింది. హిట్లర్ విద్వేష ప్రభావానికి లోనైన నాజీలు 1941–1945 మధ్య 60 లక్షల మంది యూదులను నిర్మూలించారు. గ్యాస్ చాంబర్స్‌లో వేసి చంపారు. ఏ యూదులైతే నాజీల వల్ల కష్టాలు పడ్డారో అదే యూదులు నేడు పాలస్తీనా బాలల శోకానికి కారణం కావడం విషాదం. అక్కడ వేలాది మంది చిన్నారులు మరణించారు, తల్లిదండ్రులను కోల్పోయారు. ఆ పిల్లలు ఎందరు అనీ ఫ్రాంక్లా భవిష్యత్తులో తమ డైరీలను ప్రపంచానికి చాటుతారో!ఈ ప్రపంచాన్ని పిల్లలకు యోగ్యమైనదిగా పెద్దలు అనుక్షణం తీర్చిదిద్దుతూ ఉండాలి. పిల్లలు ఇష్టపడేది ప్రేమనే. అంటే ప్రపంచాన్ని ప్రేమతో నిం΄ాలి. ఇక్కడ ద్వేషానికి చోటు లేదని నిరూపించాలి. అది జరిగేంత వరకూ మబ్బుల చాటున దాగి ఆనా తన సందేశం వినిపిస్తూనే ఉంటుంది. -
చివరి శ్వాస వరకు సినిమాల్లో ఉంటా.. కానీ నన్ను గుర్తుంచుకోరు: మమ్ముట్టి
మలయాళ స్టార్, మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు మమ్ముట్టి. తెలుగులోనూ స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల యాక్షన్-థ్రిల్లర్ 'టర్బో'చిత్రంలో కనిపించారు. ఈ చిత్రంలో రాజ్ బి శెట్టి, సునీల్, అంజనా జయప్రకాష్, కబీర్ దుహన్ సింగ్, సిద్ధిక్, శబరీష్ వర్మ, దిలీష్ పోతన్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూకు హాజరైన మమ్ముట్టి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన చివరి శ్వాస వరకు సినిమాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు.మమ్ముట్టి మాట్లాడుతూ..'నా చివరి శ్వాస వరకు నటనను విడిచిపెట్టే ఆలోచనే లేదు. నా మరణం తర్వాత ప్రజలు నన్ను గుర్తుంచుకుంటారని ఆశించడం లేదు. ఎందుకంటే కాలక్రమేణా గొప్ప వ్యక్తులను కూడా ఎవరైనా మరచిపోతారనే విషయాన్ని గట్టిగా నమ్ముతా. అయినా ప్రజలు నన్ను ఎంతకాలం గుర్తుంచుకుంటారు? ఒక సంవత్సరం? పదేళ్లు? అంతకంటే చాలా తక్కువ. చాలా కొద్ది మంది మాత్రమే గుర్తుంచుకుంటారు. ఎందుకంటే వేలమంది నటీనటుల్లో నేను ఒక్కడిని." అని అన్నారు.వారు నన్ను ఏడాది కంటే ఎక్కువ కాలం ఎలా గుర్తుంచుకోగలరు? మనం ఈ ప్రపంచంలో లేనప్పుడు మన గురించి ఎలా తెలుస్తుంది? ప్రపంచం అంతం అయ్యే వరకు అందరూ గుర్తుంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎప్పటికీ జరగదు' అని అన్నారు. కాగా.. తన నటనతో ఇప్పటివరకు మూడు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. 1971లో ఇండస్ట్రీలో ప్రవేశించిన మమ్ముట్టి 400కు పైగా చిత్రాలలో నటించారు. 1973లో వచ్చిన ‘కాలచక్రం’లో సినిమాతో గుర్తింపు పొందారు. -
Uday Kiran Unseen Photos: తనదైన నటనతో మనల్ని అలరించిన ఉదయ్ కిరణ్ ఫోటోలు
-
ఆర్మీలో చేరాలనుకున్నా.. కానీ!: రాజ్‌నాథ్ సింగ్ భావోద్వేగం
ఇంఫాల్: రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తుతం రెండు రోజుల పర్యటన నిమిత్తం మణిపూర్‌లో ఉన్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా ఆయనతోపాటు ఉన్నారు. ఆర్మీ అధికారులు, సైనికులను శుక్రవారం రాజ్‌నాథ్ సింగ్ కలిశారు. వారితో కలిసి అల్ఫాహారం చేశారు. ఇంఫాల్‌లో అస్సాం రైఫిల్స్ ఇండియన్ ఆర్మీలోని 57వ మౌంటైన్ డివిజన్ సైనికులను ఉద్ధేశించి మాట్లాడారు. ఈ మేరకు జవాన్ల ధైర్యసాహసాలను రాజ్‌నాథ్ కొనియాడారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి తన జీవితంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఇండియన్ ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని కలలు కన్నట్లు తెలిపారు. పరీక్ష కూడా రాసినట్లు పేర్కొన్నారు. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా చేరలేకపోయానని వెల్లడించారు. చదవండి: Video: ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం ‘నా జీవితంలో జరిగిన ఓ సంఘటనను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా చిన్నప్పుడు నేను కూడా భారత సైన్యంలో చేరాలని అనుకున్నాను. అందుకు తగిన విధంగా ప్రిపేర్ అయ్యాను. ఒకసారి షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్ష కూడా రాశాను. కానీ కుటుంబంలో ఎదురైన అనుకోని పరిస్థితులు, మా తండ్రి మరణంతో సైన్యంలో చేరలేకపోయాను.’ అంటూ ఎమోషనల్ అయ్యారు. సైనిక దుస్తులను చిన్నపిల్లవాడికి ఇచ్చినా అతడి వ్యక్తిత్వంలో దేశభక్తితో కూడిన మార్పు కనిపిస్తుందన్నారు. అలా ఆర్మీ యూనిఫామ్‌కు ఒక ప్రత్యేకత ఉంటుంది’ అని అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా అక్కడి సైనికులను కలుస్తానని తెలిపారు. ఆర్మీ అధికారులను కలవడం తనకు ఎంతో గర్వంగా ఉంటుందన్నారు. ‘మణిపూర్ పర్యటనను ప్లాన్ చేసినప్పుడు కూడా అస్సాం రైఫిల్స్, 57వ మౌంటైన్ డివిజన్ అధికారులను కలవాలనుకుంటున్నానని (ఆర్మీ చీఫ్) పాండేకు చెప్పాను. డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఓ విధంగా దేశానికి సేవ చేస్తున్నారు. కానీ మీరు నిర్వర్తించే బాధ్యతలు ఓ వృత్తి, సేవ కంటే గొప్పదని నేను నమ్ముతున్నాను. చాలా మందిని ఆర్మీలోకి తీసుకురావడంలో అస్సాం రైఫిల్స్ ముఖ్యపాత్ర పోషిస్తుంది’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. చదవండి: నిజంగా విడ్డూరమే! మనుషులకే కాదు.. చేపలు, పీతలకూ కరోనా పరీక్షలు, వైరల్ వీడియో -
బాలయ్యా... గుర్తున్నామా!
సాక్షి, పుట్టపర్తి: హిందూపురం నియోజకవర్గం...టీడీపీకి అండగా ఉన్న ప్రాంతం. నందమూరి తారక రామారావుతో పాటు ఆయన తనయులు హరికృష్ణ, బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నందమూరి బాలకృష్ణ హిందూపురంలో రెండోసారి విజయం సాధించి ప్రస్తుత అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే తమను ఇంతలా ఆదరిస్తున్న హిందూపురం వాసుల గురించి మాత్రం బాలయ్య పట్టించుకోవడం లేదు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూ నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారు. గత 8 నెలల కాలంలో బాలకృష్ణ ఒకట్రెండు సార్లు మాత్రమే హిందూపురంలో కనిపించారు. అది కూడా గృహ ప్రవేశాలు, వివాహాల్లో హాజరయ్యేందుకు వచ్చారు. అంతేకానీ ప్రజలు ఎలా ఉన్నారు.. నమ్మి ఓట్లేసిన ప్రజల యోగ క్షేమాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో రెండు రోజుల పర్యటన కోసం బాలకృష్ణ బుధవారం హిందూపురం వస్తుండగా...జనం ఇన్నాళ్లకు గుర్తొచ్చామా? అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై అప్పటి సీఎం చంద్రబాబు వివక్ష చూపించారు. నిధులు విడుదల చేయకుండా ఇబ్బందులు పెట్టారు. అయితే ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ప్రాంతాలు, కులాలు, మతాలు, పారీ్టలు చూడకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా జనరంజక పాలన సాగిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల అభివృద్ధికీ నిధులు కేటాయిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ క్రమంలో హిందూపురం నుంచి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్నా.. ప్రభుత్వం ఈ ప్రాంతంపై ఎలాంటి వివక్ష చూపలేదు. అన్ని రకాల సంక్షేమ పథకాలు, అన్ని వర్గాల వారికి అందజేస్తున్నారు. దీనికి తోడు ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా.. పార్టీ చూడకుండా.. ఎమ్మెల్సీ ఇక్బాల్ సాయం చేస్తున్నారు. దీంతో బాలకృష్ణతో జనానికి పనిలేకుండా పోయింది. గత ఆరు నెలల్లో బాలకృష్ణ ఇలా.... జనవరిలో ఓసారి కూడా హిందూపురం రాలేదు. ఫిబ్రవరి 3,4 తేదీల్లో హిందూపురం జిల్లా సాధన పేరుతో ధర్నా చేసేందుకు వచ్చారు. మార్చి 27వ తేదీన హిందూపురంలో ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏప్రిల్‌లో ఒక్కసారి కూడా హిందూపురం సందర్శించలేదు. మే 27వ తేదీన హిందూపురం విచ్చేసి ఓ వివాహానికి హాజరయ్యారు. జూన్ 2వ తేదీన హిందూపురంలో ఓ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూలైలో హిందూపురంలో పర్యటించలేదు. తాజాగా 17, 18 తేదీల్లో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. బాలకృష్ణ స్థానిక వ్యవహారాలన్నీ పీఏ (వ్యక్తిగత కార్యదర్శి)కి అప్పగించారు. వారు ఎలా చెబితే అలా డైలాగులు చెప్పేసి వెళ్లిపోతారు. కనీసం పార్టీ కార్యకర్తలెవరో కూడా తెలియని పరిస్థితి. ఎవరైనా అభిమానంతో దగ్గరకు పోయినా లాగి లెంపకాయ కొట్టడం అలవాటు చేసుకున్నారు. దీంతో ఆయన దగ్గరకు వెళ్లే సాహసం ఎవరూ చేయడం లేదు. పోనీ ఆయన పీఏలనైనా నమ్ముకుందామంటే... గత టీడీపీ హయాంలో అప్పటి పీఏ శేఖర్ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పీఏగా వ్యవహరిస్తున్న బాలాజీ హైటెక్ పద్ధతిలో జూదం ఆడుతూ పోలీసులకు గత మార్చి 21వ తేదీన పట్టుబడ్డాడు. ఇలా బాలకృష్ణ అందుబాటులో లేక, ఆయన పీఏలు పట్టించుకోకపోవడంతో జనం ఎమ్మెల్యే గురించే మరచిపోయారు. ఈ చిత్రంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ పరామర్శిస్తున్న వ్యక్తి పేరు తిమ్మారెడ్డి. ఎన్టీఆర్ వీరాభిమాని. మొదటి నుంచీ టీడీపీలో క్రియాశీలక కార్యకర్త. గత ఏడాది తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. ఏళ్లుగా పారీ్టకి సేవ చేసినా టీడీపీ నేతలు గానీ, స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణగానీ తిమ్మారెడ్డి గురించి పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ 2021 మే 5వ తేదీన తిమ్మారెడ్డి ఇంటికే వెళ్లి పరామర్శించారు. వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేశారు. అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.2,70,000 మంజూరు చేయించారు. ప్రస్తుతం తిమ్మారెడ్డి ఆరోగ్యంగా ఉన్నారు. లేపాక్షికి చెందిన ఓ టీడీపీ కార్యకర్తకు ఇటీవల ఓ పెద్ద కష్టం వచ్చింది. సాయం కోసం బాలకృష్ణను సంప్రదించాలని చూడగా ఆయన అందుబాటులో లేరు. ఎమ్మెల్యే పీఏను కలిస్తే చీదరించుకున్నారు. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే తన పరిస్థితి ఇలా అయ్యిందని సదరు కార్యకర్త మనస్తాపం చెందారు. చివరకు విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఇక్బాల్ అతన్ని పిలిపించుకుని విషయం ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి సదరు కార్యకర్తకు అండగా నిలిచారు. ...ఇలా టీడీపీ నాయకులు, కార్యకర్తలే కాదు. హిందూపురం వాసులంతా బాలయ్య అందుబాటులో లేక ఇబ్బంది పడ్డారు. అయితే అధికార వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పారీ్టలకు అతీతంగా పథకాలు అమలు చేయడంతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల అభివృద్ధికీ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుండటంతో జనంతో పాటు టీడీపీ నేతలూ ఇప్పుడు ఆ పార్టీ వెంట నడుస్తున్నారు. అందువల్లే హిందూపురం వాసులు కూడా బాలయ్యతో తమకేం పెద్దగా పనిలేదంటున్నారు. (చదవండి: వారంతా చంద్రబాబుతో చేతులు కలిపారు: ఎంపీ గోరంట్ల మాధవ్) -
Satyajit Ray: నవ్యచిత్ర వైతాళికుడు
‘‘ఏమున్నది సార్ గీ సిన్మాల అంతా మా వూరు లెక్కనే వున్నది... మా బతుకులే వున్నయి...’’ సత్యజిత్ రే ‘పథేర్ పాంచాలి’ సినిమా చూసిన తర్వాత కరీంనగర్ జిల్లా ‘పోరండ్ల’ గ్రామ రైతు స్పందన ఇది. ఒక నిజాయతీ కలిగిన వాస్తవిక సినిమాకు ప్రపంచంలో ఎక్కడయినా ఇలాంటి స్పందనే వస్తుందన్నది నిజం. భారతీయ సినిమాకు కళాత్మకతనూ, మానవీయ స్పందనలనూ అందించిన దర్శకుడు రే. తన ముప్పై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన ‘పథేర్ పాంచాలి’ నుంచి ‘ఆగంతుక్’ వరకు ముప్పై పూర్తి నిడివి సినిమాలు, అనేక డాక్యుమెంటరీ సినిమాలు తీశారు. ఈ రోజుల్లో లాగా ఎలాంటి ఆధునిక ప్రసార మాధ్యమాలూ, సామాజిక మాధ్య మాలూ లేని ఆ కాలంలో రే కు ప్రపంచ ఖ్యాతి లభించింది. 1921లో మే 2న జన్మించిన సత్యజిత్ రే తన జీవితంలోని అత్యధిక సమయం సినీ రంగంలోనే గడిపినప్పటికీ ఆయన... రచయితగా, చిత్రకారుడిగా, టైపోగ్రాఫర్గా, బాల సాహిత్య సృష్టి కర్తగా, సైన్స్ ఫిక్షన్ రచయితగా తనదైన ముద్రతో సృజన రంగంలో పని చేశారు. సినిమా రంగంలో కూడా దర్శకత్వంతో పాటు సంగీతం, సినిమా టోగ్రఫీ, స్క్రిప్ట్, మాటల రచన తానే నిర్వహించారు. మొదట రవిశంకర్ లాంటి వాళ్ళతో సంగీతం చేయించుకున్నా తర్వాత తానే తన సినిమాలన్నింటికీ సంగీతం సమకూర్చుకున్నారు. ఇంకా సన్నివేశాలకు సంబంధించి సంపూర్ణ స్కెచెస్ వేసుకొని, చిత్రీకరణ జరిపేవారు. సాహిత్యానికీ సినిమాకూ వారధిలా నిలిచి భారతీయ సినిమాను పరిపుష్టం చేశారు. టాగూర్, బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ్, తారాశంకర్ బంధోపాధ్యాయ్, ప్రేమ్ చంద్, నరేంద్రనాథ్ లాంటి మహా రచయితల రచనల్ని తెరపైకి ఎక్కించారు రే. అంతేకాదు, పలు సినిమాలకు తన స్వీయ రచనల్ని కూడా ఉపయోగించుకున్నారు. (చదవండి: ఆదర్శ కమ్యూనిస్టుకు జోహార్లు!) 1956లో ‘పథేర్ పాంచాలి’ కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘బెస్ట్ హ్యూమన్ డాక్యుమెంట్’ అవా ర్డును గెలుచుకొని భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చింది. తర్వాత ‘దేవి’, ‘కాంచన్ జంగా’, ‘చారులత’, ‘తీన్ కన్య’ ‘ఘరె బైరె’, ‘ఆగంతుక్’ లాంటి అనేక విశ్వ విఖ్యాత సిని మాల్ని రూపొందించారు. బహుశా ఆయన సినిమాల్ని ప్రదర్శించని అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ప్రపంచంలో లేవు. ఆయన అందుకోని అవార్డులూ లేవు. కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’, దాదా సాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. ఫ్రాన్స్ దేశానికి చెందిన ‘లెజియన్ ఆఫ్ ఆనర్’, అలాగే ‘ఆస్కార్ జీవిత సాఫల్య పురస్కారం’ లాంటి లెక్కలేనన్ని అంతర్జాతీయ పురస్కారాలూ అందుకున్నారు. భారతీయ సినిమాకు నవ్యచిత్ర వైతాళికుడిగా నిలిచిన సత్యజిత్ రే 1992 ఏప్రిల్ 23న కలకత్తాలోని బెల్లెవీ నర్సింగ్ హోమ్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన చరిత్ర చిత్రసీమకు మణిహారం. (చదవండి: ‘జై హింద్’ నినాదకర్త మనోడే!) – వారాల ఆనంద్ (మే 2న సత్యజిత్ రే జయంతి) -
పిల్లులూ పేర్లు గుర్తిస్తాయ్
టోక్యో: పేరులో ఏముంది లెమ్మని అనుకోలేం. ఎందుకంటే పిల్లులు కూడా పేర్లను బాగా గుర్తు పడతాయని తాజా అధ్యయనంలో తేలింది. తమతో కలిసిమెలిసి ఉండే ఇతర పిల్లులు, యజమానుల పేర్లను పిల్లులు పసిగట్టేస్తాయని జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. పిల్లుల జ్ఞాపకశక్తిపై వారు రెండు వేర్వేరు అధ్యయనాలు చేశారు. ఒకదాంట్లో వాటితో కలిసిమెలిసి తిరిగే ఇతర పిల్లి ఫోటోను వాటి దగ్గరుంచారు. కొన్నిసార్లు ఫోటోలోని పిల్లి పేరును, మరికొన్ని సార్లు వేరే పేరును పిలిచారు. ఫోటోలోని పిల్లి పేరు పిలవగానే అవి ఫొటోవైపే కన్నారప్పకుండా చూశాయి. వేరే పేరుతో పిలిస్తే పట్టించుకోలేదు. అలాగే యజమానుల ఫోటోలను వాటి దగ్గరుంచి పేరు పెట్టి పిలిచినా గుర్తించగలిగాయని శాస్త్రవేత్తలు వివరించారు. 40 పిల్లులపై ఈ అధ్యయనం చేసినట్టు వాళ్లు చెప్పారు. -
మానవ గమనంలో ఒక మజిలీ
తుపాకి గుండు చేసిన కన్నాల ఆధారంగా నేరం ఎలా జరిగిందో ఊహించి, అన్వేషించి నిర్ధారణ చేయడం వంటిది – సైంటిఫిక్ మెథడ్! తొలిసారి సైన్స్ మెథడ్‌ను ప్రతిపాదించింది ఫ్రాన్సిస్ బేకన్! వైజ్ఞానిక పరిశోధనకు, అప రాధ పరిశోధనకూ సామ్యముంది. శాస్త్రవేత్త ఇన్వెస్టిగేటివ్ ఇన్స్పెక్టర్ లాంటి వాడే కానీ, అపరాధ పరిశోధక కథారచయిత వంటివాడు కాదు. కథా రచయిత ముందుగానే తన కథా పరిణామాన్ని మనస్సులో ఉంచుకుని, తదనుకూలంగా ఆధారాలనూ, సన్నివేశాలనూ సృష్టించుకుంటాడు. విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలో ‘ఫ్రాన్సిస్ బేకన్’ పూర్వపు విజ్ఞానవేత్తలందరూ ఈ తరగతికి చెందినవారు. ఒక భావాన్ని ముందుగానే సిద్ధాంతీకరించుకుని తన దృక్పథంలోకి వచ్చిన అంశాలను తదనుగుణంగా సమర్థించుకోవడం వారి పద్ధతి. ఆ విధంగా పొందు కుదరనివి అసహజమనీ, అసంబద్ధాలనీ తోసిపుచ్చడం వారి ఆచారం– ఇదీ 1955లో ‘సైన్స్ ఇన్ అవర్ లైవ్స్’ అనే పుస్తకంలో సైన్స్ రచయిత రిచ్చీ కాల్డర్ అభిప్రాయం! కనుకనే మానవ గమనంలోనే ఫ్రాన్సిస్ సైన్స్ పద్ధతి ఒక మజిలీగా మలుపు తిప్పింది. ప్రకృతిని, ప్రపంచాన్ని పరిశీలించే దృష్టి మారిపోయింది ఆయన కారణంగానే. ఆధునిక విజ్ఞాన పద్ధతికి ఆద్యుడుగా ఫ్రాన్సిస్‌ను పరిగణి స్తారు. బేకన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. లాయర్ చదువు తర్వాత రాజకీయాలలో రాటుదేలి జీవిత చరమాంకంలో ‘నేచురల్ ఫిలాసఫీ’ మీద దృష్టి పెట్టి చిరస్మరణీయమైన కృషి చేశారు. (చదవండి: అణచివేతను ధిక్కరించిన అరుణపతాక) 1561 జనవరి 22న లండన్‌లో జన్మించిన ఫ్రాన్సిస్ బేకన్ మతం, న్యాయం, రాజకీయాలలోనే కాకుండా సైన్స్ విషయాలలో కూడా నిష్ణాతులు. తండ్రి పొందిన ఛాన్స్లర్ పదవి సాధించినవాడు ఫ్రాన్సిస్. ఆయన తల్లి గ్రీకు, లాటిన్, ఇటలీ, ఫ్రెంచి భాషలలో నిష్ణాతులు. 1581లో హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడై, తర్వాత హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో కూడా సభ్యుడై మొత్తంమీద 37 ఏళ్లు పార్లమెంటు మెంబ ర్గా కొనసాగారు. రాజకీయంగా ఎత్తు పల్లాలు బాగా ఎరి గిన ఫ్రాన్సిస్ బేకన్ ఆర్థికంగా కూడా సమస్యలు ఎదు ర్కొన్నారు. అటార్నీ జనరల్ (1613–17)గా, లార్డ్ ఛాన్సలర్ (1617–21)గానూ ఆయన వ్యవహరించారు. ఆలోచనా ధోరణిలో, పరిశీలనా పద్ధతిలో అంతకు ముందున్న ప్లేటో, అరిస్టాటిల్ వంటి వారిని బేకన్ విభేదించి తన మార్గంలో ముందుకు పోయారు. చాలా రకాలుగా కృషి చేసిన ఫ్రాన్సిస్ బేకన్ ప్రతిపాదించిన ‘కో ఆపరేటివ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూషన్’ భావన తర్వాత కాలంలో రాయల్ సంస్థ ఏర్పడటానికి దోహదపడింది. చివరి దశలో ప్రయోగాలు చేస్తూ న్యూమోనియా సోకి 1626 ఏప్రిల్ 9న కన్ను మూశాడు. వారు ప్రతిపాదించిన సైన్స్ పద్ధతి తర్వాతి కాలంలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. (చదవండి: సైన్సును మతం నుంచి వేరుచేసిన శాస్త్రవేత్త) - డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి పూర్వ సంచాలకులు -
ఆన్లైన్ షాపింగ్: ఈ జాగ్రత్తలు తీసుకోండి
ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ వినియోగం విపరీతంగా పెరిగింది. వాటి వ్యాపార వ్యవధి 2016తో పోల్చితే 81 శాతం అభివృద్ధి చెందింది. అందరూ ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండానే వేల సంఖ్యలో ఉత్పత్తులు, రకరకాల డిజైలు అందుబాటులోకి తీసుకురాడంతో ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా డిస్కౌంట్ ఆఫర్స్, రిటర్న్ పాలసీలు అంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇకపోతే ఇంకొరెండు మూడు రోజుల్లో ఈ కామర్స్ సైట్స్ భారీ ఆఫర్స్‌తో బిగ్‌బిలియన్ డేస్ ఇలా ప్రత్యేకమైన ఆఫర్లను అందించనున్నాయి. అయితే షాపింగ్ చేసే వారు ఈ జాగ్రత్తలు పాటించండి. ఎల్లప్పుడూ ప్రొడక్ట్ వివరాలు పూర్తిగా పరిశీలించండి: మనలో చాలా మంది ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు కేవలం అక్కడ చూపించిన ఇమేజ్ ఆధారంగా దానిని కొనాలని నిర్ణయించుకుంటారు. అంతేకానీ వారికి ప్రొడక్ట్ గురించి కింద తెలిపిన వివరాలను చదివే ఓపిక ఉండదు. అలా కాకుండా షాపింగ్ చేసేటప్పుడు ఆ ఉత్పత్తి పూర్తి వివరాలు చదవాలి. అంతేకాకుండా ఆ ప్రొడక్ట్‌ను అంతకముందే కొన్ని వారి రివ్యూలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆ ఉత్పత్తి రేటింగ్ ఇలా అన్ని పరిశీలించిన తరువాతే దానిని ఆర్డర్ పెట్టుకోవాలి. షిప్పింగ్ కాస్ట్ చూడండి: చాలా కంపెనీలు షిప్పింగ్ కాస్ట్ వివరాలను ప్రొడక్ట్ దగ్గరే వివరిస్తాయి. ఎప్పుడు ఆర్డర్ మన వద్దకు చేరుతుంది అనే డిటైల్స్ అన్ని ఉంటాయి. అయితే రూల్స్ ప్రకారం ఆర్డర్ చేసిన 30 రోజుల్లోపు ఉత్పత్తిని వినియోగదారుడికి అందించాలి. కొన్ని ప్రొడక్ట్‌లపై ఫ్రీ డెలివరీ ఆఫర్లు ఉంటాయి. ఇంకొన్ని కంపెనీలు బల్క్‌లో కొంటేనే ఫ్రీ షిప్పింగ్‌ను అందిస్తాయి. కాబట్టి షాపింగ్ చేసేటప్పుడు ఆ వివరాలు అన్నింటిని పరిగణలోకి తీసుకోవాలి. మీరు కొనే ఉత్పత్తుల ధరలను వేరే చోట కూడా పరిశీలించుకోండి: డిస్కౌంట్ లభిస్తోంది అనగానే కేవలం ఆ సైట్లో మాత్రమే కాకుండా వేరే ఆన్లైన్ స్టోర్‌లో కూడా వాటి ధరలు, ప్రొడక్ట్ డిటైల్స్‌ను సరిపోల్చకోండి. ప్రస్తుతం ఆన్లైన్ రిటైల్స్టోర్లు అనేకం అందుబాటులోకి వచ్చాయి కాబట్టి మీరు తేలికగానే వాటి ధరలను, నాణ్యతను చెక్ చేసుకోవచ్చు. డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే నాణ్యత లేని వస్తువులను అందించడం కాదు మన్నికైన వస్తువులనే వినియోగదారుడికి తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడం. మీ విలువైన డబ్బుతో నాణ్యత లేని వస్తువులను కొనుగోలు చేయకండి. [ చదవండి : మీ లవర్ మీ మొబైల్ వాట్సాప్ చెక్ చేస్తున్నారా? ఈ ట్రిక్ తో సేఫ్ గా ఉండండి ] రివ్యూలను చదవండి: మీరు కొనాలనుకున్న ప్రొడక్ట్ అంతకముందే కొన్నవారు దాని గురించి వారి అభిప్రాయాలను రివ్యూలలో తెలియజేస్తారు. వాటిలో కొన్ని రివ్యూలు నిజాయితీగా ఉండి మీరు ఆ వస్తువును కొనాలో వద్దో నిర్ణయించుకోవడానికి దోహదపడతాయి. కాబట్టి ఇక నుంచి ఏదైనా వస్తువును ఆన్లైన్లో కొనాలనుకున్నప్పుడు వాటి రివ్యూలను తప్పకుండా చదివిన తరువాతే మీ ఆర్డర్‌ను ప్లేస్ చేయండి. మీ హక్కులను తెలుసుకోండి: ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు చాలా ఉత్పత్తులపై రిటర్న్ పాలసీ ఉంటుంది. అయితే కొన్ని వస్తువులకు మాత్రమే ప్యాక్ ఓపెన్ చేస్తే రిటర్న్ ఉండదు అని ఉంటుంది. కాబట్టి వినియోగదారుడు వస్తువుకొనేటప్పుడే రిటర్న్ వివరాలను పరిశీలించి కొనండి. స్కామ్, ఫ్రాడ్ల నుంచి అప్రమత్తంగా ఉండండి: ప్రస్తుత కాలంలో సైబర్‌నేరాలకు అంతులేకుండా పోతుంది. నేరగాళ్లు వివిధ మార్గాలలో ఫ్రాడ్లకు పాల్పడుతున్నారు. అందుకే ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు అది జెన్యూన్సైట్ అవునో కాదో ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలి. ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు కదా అని ఆ సైట్ నమ్మదగినదో లేదో తెలుసుకోకుండా ఆర్డర్ పెట్టి మీ డబ్బును పోగొట్టుకోకండి. -
చచ్చిపోయినా ఫర్వాలేదనుకున్నా!
మెల్బోర్న్: క్రికెట్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన సర్ వివియన్ రిచర్డ్స్ తన సుదీర్ఘ కెరీర్లో ఏనాడూ హెల్మెట్ పెట్టుకోలేదు. ఎలాంటి భయం లేకుండానే బరిలోకి దిగిన అతను ఆ సమయంలో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బౌలర్లను చితక్కొట్టాడు. ఆటపై ఉన్న పిచ్చి ప్రేమే తనలో ధైర్యాన్ని నింపిందని రిచర్డ్స్ గుర్తు చేసుకున్నాడు. ‘క్రికెట్‌ను నేను విపరీతంగా ప్రేమించాను. ఎంతగా అంటే ఆడుతూనే చనిపోయి నా ఫర్వాలేదనుకునేవాడిని. క్రికెట్‌ను నేను ఎంచుకున్నాను కాబట్టి మైదానంలోనే కుప్పకూలినా అంతకంటే అదృష్టం లేదని భావించేవాడిని’ అని ఈ విధ్వంసక బ్యాట్స్‌మన్ వ్యాఖ్యానించాడు. ఆసీస్ ఆల్‌రౌండర్ షేన్వాట్సన్తో వీడియో సంభాషణ సందర్భంగా రిచర్డ్స్ ఈ మాటలు అన్నాడు. ‘ఇతర ఆటగాళ్లను చూసి నేను ఎప్పుడూ స్ఫూర్తి పొందేవాడిని. అత్యుత్తమ స్థాయిలో రాణించే మహిళలను కూడా అలాగే గౌరవించేవాడిని. ఫార్ములా వన్ రేసింగ్ కార్‌ను డ్రైవ్ చేసేవారిని చూస్తే అంతకంటే ప్రమాదకరం ఇంకేం ఉంటుందని అనిపించేది’ అంటూ వివ్ అన్నాడు. -
పేదరికమే ఓ భస్మాసుర హస్తం
తల తాకట్టు పెట్టుకోవడమంటే ఇదేనేమో! ఆ తలకే విలువ లేకపోతే? ఆ తల పేదరికంలో మునిగి ఉంటే? ఆ తల మీద పేదరికమే భస్మాసుర హస్తమైతే? సంతలో మనిషికి విలువ లేనప్పుడు ఏం అమ్ముకోవాలి? తనను నమ్మిన ప్రేమనే తాకట్టు పెట్టుకోవాలి.పేదరికాన్ని మించిన భస్మాసుర హస్తం ఉంటుందా! రాజస్తాన్‌లోని మారుమూల పల్లెటూరు. మట్టి గోడలు.. ఎర్రమన్ను నేల.. రెల్లు గడ్డి పైకప్పు.. పేదరికం ఆక్రమించుకున్న ఆ గుడిసెలో ఓ మూల సర్దుకొని ఉంటుంటాడు ధాను. తన ఇద్దరు పిల్లలు, వితంతు చెల్లెలితో కలిసి. ధానుకి భార్య ఉండదు. చనిపోతుంది. కొడుకు టీపు. పదేళ్లుంటాయి. ఏడేళ్ల కూతురు గున్ని. ఆ పిల్లల మంచీ చెడూ బాధ్యత వితంతు చెల్లెలిది. వీళ్లతో పాటు ఇంకో కుటుంబ సభ్యుడూ ఉంటాడు. భస్మాసుర్. వాడంటే ధానూ కొడుక్కి ప్రాణం. తండ్రి దగ్గర లేని చనువు భస్మాసుర్ దగ్గర ఉంటుంది. తన కష్టం, సుఖం, స్నేహితులు.. అల్లరి అంతా భస్మాసుర్తో చెప్పుకుంటుంటాడు టీపు. దొర.. దొంగ ఇంటి అవసరాల కోసం ధాను భూస్వామి దగ్గర అప్పు తీసుకుంటాడు. చెప్పిన టైమ్‌కి అప్పు తీర్చడు. భూస్వామి కంట పడకుండా తప్పించుకు తిరుగుతుంటాడు. ఊరు నిద్రపోయాక ఇంటికొస్తాడు. ఊరు నిద్రలేవక ముందే బయటకు వెళ్లిపోతుంటాడు. బలాదూర్‌గా తిరుగుతుంటాడు కాబట్టి.. ఊళ్లో ఏది పోయినా.. అది ధాను పనే అంటూ అతనిని దొంగగా చిత్రీకరిస్తారు. ఇంకా అప్పు చెల్లించలేదని ధాను మీద దొంగతనం మోపి పోలీసులకు పట్టిస్తాడు భూస్వామి. పూచీకత్తు మీద ఆ తెల్లవారి ఇంటికి వస్తాడు ధాను. చేతిలో పైసా ఉండదు. అప్పు తీర్చాలి. చెల్లెలితో గోడు వెళ్లబోసుకుంటాడు. అన్నకు సలహా ఇవ్వడానిక్కూడా ఆమెకు దారీతెన్నూ కనిపించదు. ఇంట్లో విలువైన వస్తువులున్నా తాకట్టు పెట్టొచ్చు. తన ఒంటిమీద వీసం బంగారం ఉన్నా.. అమ్మి ఎంతోకొంత సహాయ పడొచ్చు. భర్త ఆత్మహత్య చేసుకుంటే వచ్చి అన్న ఇంట్లో ఉంటోంది. తనదే ఒకరి మీద ఆధారపడ్డ బతుకు. అండగా ఎలా నిలబడగలదు? కుమిలిపోతుంటుంది. అటు ధానుకీ ఏమీ తోచదు. దిక్కులు చూస్తున్న అతనికి ఇంటి ముందున్న భస్మాసుర్ కనిపిస్తాడు. ‘‘భస్మాసుర్‌ను అమ్మేద్దాం’’ అంటాడు. విస్తుపోతుంది అతని చెల్లెలు. ‘‘టీపు ఒప్పుకుంటాడా?’’ ఆమె సందేహం. ‘‘తప్పదు.. ఒప్పించాలి’’ అవసరం అతనిది. భస్మాసుర్.. టీపు మాటే వింటాడు కాబట్టి తెల్లవారి టీపుని వెంట బెట్టుకుని మరీ పట్నానికి వెళ్లాలనుకుంటాడు ధాను. ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ధాను కూతురు గున్నీ అక్కడే ఉంటుంది. ఫ్రెండ్స్‌తో ఆడుకుని దీపాలు పెట్టాక ఇల్లు చేరిన కొడుకుతో చెప్తాడు ధాను.. ‘‘ఉదయాన్నే పట్నం బయలుదేరుతున్నాం. త్వరగా పడుకో’’ అని. అనుబంధం పెంచిన దారి ఇంకా సూర్యుడు రాకముందే పట్నానికి బయలుదేరుతారు ధాను, టీపు.. భస్మాసుర్‌ను తీసుకొని. మేనత్త చపాతీలు చేసి మూట కట్టిస్తుంది. తల్లి కట్టుకున్న చీరల చిరుగు ముక్కలతో తయారుచేసుకున్న జెండా కర్రను వెంట పెట్టుకుంటాడు టీపు. అమ్మ జ్ఞాపకంగా. ఎప్పుడో తన ఫ్రెండ్ ఇచ్చిన నల్ల కళ్లద్దాలను కూడా. టాటా చెప్పడానికి అత్తతో పాటు బయటకు వచ్చిన చెల్లి.. టీపుకి సైగ చేస్తుంది.. ‘‘భస్మాసుర్ని అమ్మేస్తున్నాడు నాన్న’’ అంటూ. ఒక్కసారిగా దిగులు టీపూలో. అన్న బాధ గున్నీకి అర్థమవుతుంది. మౌనంగా తండ్రిని అనుసరిస్తాడు టీపు. మొహంలో భావాలేవీ బయటపడనివ్వకుండా. కాలి నడకన ప్రయాణం. అసలు కథంతా ఇక్కడే. మధ్యాహ్నం వేళ.. తెచ్చుకున్న తిండి తింటారు. భస్మాసుర్కి కొసరి కొసరి తినిపిస్తుంటాడు టీపు. వాడలా భస్మాసుర్‌ను ముద్దు చేయడం.. గోముగా హత్తుకోవడం.. అన్నీ చూస్తుంటాడు ధాను. భోజనం అయ్యాక మళ్లీ నడక మొదలుపెడ్తారు. మధ్య మధ్యలో కొడుకు కర్రకున్న చీరల చిరుగులను ఆప్యాయంగా తడుముకోవడమూ గమనిస్తుంటాడు తండ్రి. అంతా కొత్తగా అనిపిస్తుంటుంది ధానూకి. అసలు కొడుకును ఎప్పుడూ అంత దగ్గరగా.. అంత పరిశీలనగా చూడలేదు అతను. వాడితో అదే మొదటి పరిచయంగా తోస్తుంది. చీకటి పడ్తుంది. ఓ చోట సేద తీరుతారు. తెల్లవారుతుంది. మళ్లీ నడక. అలసట.. ధానులో ఓపికను చంపేస్తుంది. కోపాన్ని పుట్టిస్తుంది. కొడుకును కొడ్తాడు. వాడు భస్మాసుర్‌ను పట్టుకొని ఏడుస్తాడు. భస్మాసుర్ కళ్లతోనే వాడిని ఓదారుస్తాడు. కోపం తగ్గాక పశ్చాత్తాప్పడ్తాడు ధాను. కొడుకును దగ్గరకు తీసుకుంటాడు. భయంగా.. బెరుకుగానే ఉంటాడు టీపు. ఆకలివేళ అవుతుంది. కిందటి రోజు తెచ్చుకున్న భోజనం ఎండవేడికి పాడైపోతుంది. ఖాళీ కడుపుతోనే నడకసాగిస్తారు. దాహంతో నోరు పిడచకట్టుకు పోతుంటుంది. గొంతు తడుపుకోవడానికి చుక్క నీరుండదు. ఉసూరుమంటూ ఓ నీడకు చేరుతారు. ప్రేమగా కొడుకు తలను నిమురుతాడు ధాను. శ్రమ తెలియనివ్వకుండా తన చిన్నప్పటి సంగతులను కొడుకుతో పంచుకుంటాడు. తన అల్లరి.. తండ్రి చీవాట్లు.. చేసిన బోధ.. అన్నీ కొడుకుతో చెప్తాడు. వాడు ఆసక్తిగా వింటాడు. ఈసారి కొడుక్కి తండ్రి కొత్తగా కనపడటం మొదలుపెడ్తాడు. అప్పటిదాకా వాడి మెదడులో కోపిష్టి.. దొంగ.. సోమరిపోతుగా ఉన్న తండ్రి ఇమేజ్ మెల్లగా కరగడం మొదలౌతుంది. ఆశ కూడా మొలకెత్తుతుంది.. తండ్రి మనసు మారి భస్మాసుర్‌ను అమ్మబోడేమోనని. మొత్తానికి తండ్రీ కొడుకులు అపార్థాలు తొలగించుకుంటూ.. అసలైన అనుబంధాన్ని ఆస్వాదిస్తూ.. కొత్త ఊహలకు రెక్కలు తొడుగుతూ పట్నానికి చేరుకుంటారు. పట్నంలో ప్రతి మలుపునూ.. ప్రతి దారినీ వింతగా చూస్తున్న కొడుకు సంబరం.. తండ్రికి ముచ్చటగా ఉంటుంది. బజారుకు తీసుకెళ్తాడు. దుకాణాలు.. మిఠాయీలు.. రంగుల రాట్నం.. ఒంటెల బండీ.. పిల్లల ఆటలు.. అన్నీ టీపుకు ఉత్సాహాన్నిస్తుంటాయి. కుతూహలాన్ని కలుగజేస్తుంటాయి. కొడుకు కోసం తినడానికి ఏదైనా తేవాలనుకుంటాడు ధాను. టీపుని ఓ అరుగు మీద కూర్చోబెట్టి ఓ దుకాణానికి వెళ్తాడు. అక్కడున్న చాక్లెట్ డబ్బా చూపిస్తూ నాలుగు చాక్లెట్లు ఇవ్వమంటాడు. డబ్బులివ్వమంటాడు దుకాణదారు. ‘‘పల్లె నుంచి వచ్చాం.. డబ్బుల్లేవు. నా పిల్లాడు ఆకలిగా ఉన్నాడు.. దయచేసి ఇవ్వండి’’ అని బతిమాలుతాడు ధాను. చీదరించుకుంటాడు యజమాని. అటూ ఇటూ చూసి.. డబ్బాలోని చాక్లెట్లు తీసుకొని పరిగెడ్తాడు ధాను. అతని వెంట పడ్తాడు యజమాని. ధానూని పట్టుకోబోతుంటే అతని చేతిలో ఉన్నవి కిందపడ్తాయి.. చాక్లేట్లు కావు చాక్లేట్ రాపర్స్ అవి. వెనక్కి తిరిగి వెళ్లిపోతాడు దుకాణదారు. వీడ్కోలు భస్మాసుర్‌ను అమ్మేస్తాడు ధాను. వచ్చిన డబ్బులోంచి కొంత తీసి కొడుక్కి షూ కొంటాడు. లాడ్జ్‌కి తీసుకెళ్తాడు. ‘‘స్నానం చేసి రెడీ అయ్యి.. షూ వేసుకో.. బయటకు వెళ్దాం’’అని షూ ఇస్తాడు. వాటిని చూసి వాడి కళ్లలో మెరుపు. ఆత్రంగా వేసుకుంటాడు. మంచి హోటల్‌కి తీసుకెళ్లి వాడికి ఇష్టమైనవి తినిపిస్తాడు తండ్రి. కొడుకును దగ్గర కూర్చోబెట్టుకుని భస్మాసుర్‌ను గుర్తు చేసుకుంటూ ‘‘మన కుటుంబపు పెద్దలా ఆదుకున్నాడు. మనల్ని తండ్రిలా చూసుకున్నాడు కదా..’’ అంటాడు కొడుకుతో. కళ్లనిండా బాధతో అవునన్నట్టుగా తలూపుతాడు టీపు. ‘‘నిన్నూ వాళ్లు బాగా చూసుకుంటారు. నీకే లోటూ రానివ్వరు’’ చెప్తాడు ధాను! అంటే.. భస్మాసుర్‌ను అమ్మేసినట్టుగా తననూ ఎవరింట్లోనో పెడ్తున్నాడన్నమాట. తండ్రి పరిస్థితి అర్థమవుతుంది టీపుకి. దీనంగానే వీడ్కోలు పలికి ట్రాలీలో తన కొత్త చిరునామాకు బయలుదేరుతాడు టీపు. కొడుకు వదిలేసిన చీర చెరుగుల కర్ర ఊతంతో ఊరి దారి పడ్తాడు ధాను. పేదరికాన్ని జయించే శక్తి ఈ సినిమాలో భస్మాసుర్.. పెంపుడు గాడిద. పేదరికంలో మనుషులు దరి చేరరు. జంతువులే మచ్చికవుతాయి. ఆ చెలిమే పేదరికాన్ని జయించే శక్తినిస్తుంది. మనుషుల్లో ఆ స్థయిర్యం నింపడం కోసం త్యాగానికీ సిద్ధపడ్తాయి. ఇదే భస్మాసుర్ కథ. దానివల్లే ఆ కుటుంబం నిలబడుతుంది. తండ్రి కొడుక్కి, కొడుకు తండ్రికీ అర్థమవుతాడు. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై పలువురి ప్రశంసలూ అందుకుంది భస్మాసుర్. – సరస్వతి రమ -
నిదురించే తోటలోకి...
ఇష్టంలేని పనిచేయడం చాలా కష్టం. నా మనసు ఏమాత్రం అంగీకరించట్లేదు. తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. చిన్నప్పటి నుంచి అంతే. అందుకే అమ్మ తరచు ‘అంత మొండితనం పనికిరాదు’ అని కోప్పడుతుండేది. ‘టికెట్ ఎక్కడికి సార్!’కండక్టర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను.‘వేములపల్లికి ఒకటివ్వండి’టికెట్ తీసుకుని కిటికీ పక్కకి జరిగాను. బస్సంతా కోలాహలంగా ఉంది. కూలీలు బస్సుపైకి మూటలు వేస్తున్నారు. బస్సు కదలడానికి సిద్ధంగా ఉంది. నా ఆలోచనలు స్థిమితంగా లేవు. ఆ ఊరెళ్లడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు. కానీ అమ్మ కోరికను కాదనలేకపోయాను. ఎందుకంటే అది ‘చివరిది’ కాబట్టి.అమ్మ జ్ఞాపకం వచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి. చిన్నప్పుడు ఎంత అవమానం ఎదుర్కొన్నాం ఆ ఇంట్లో! చెయ్యని నేరం అమ్మపై మోపారు. ఊరు విడిచి వచ్చేసేలా చేశారు. నాన్న చనిపోయే నాటికి నాకు ఆరేళ్లుంటాయి. రాజారాం మావయ్య మమ్మల్ని చేరదీశాడు. ఆయన బాగా ఆస్తిపరుడు. వందల ఎకరాల ఆసామి. పాలేర్లు, పనివాళ్లు, వచ్చిపోయేవాళ్లతో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు ఉండేవి. పాడి గేదెలకు, ఆవులకు కొట్టం ఉండేది. పొట్టేళ్లను, పందెంకోళ్లను ప్రత్యేకంగా పెంచేవారు. వెన్నునొప్పి సమస్యతో అత్తయ్య మంచానికే పరిమితమై ఉండేది. వాళ్ల నలుగురు పిల్లల బాగోగులు అమ్మే చూసుకునేది.మావయ్య మా పట్ల ఎంత అభిమానం చూపినా, పిల్లలు మాత్రం అమ్మతో అప్పుడప్పుడు దురుసుగా మాట్లాడేవాళ్లు. మావయ్య పెద్దకొడుకు కాశీ అందరి మీద పెత్తనం చేసేవాడు. కాశీ తర్వాత వసుంధర, శరత్, సుమన... నేనూ, సుమన వీధిగుమ్మం పక్కనే ఉండే ఏనుగు బొమ్మపై కూర్చుని ఆడుకునేవాళ్లం. ‘‘బస్సు పది నిమిషాలు ఆగుద్ది. టీ తాగేవాళ్లు తాగొచ్చు’’ప్రయాణికుల మొహం చూడకుండా బాగా అలవాటైన ఒక ప్రకటన చేసి డ్రైవర్, కండక్టర్ కిందకు దిగారు. నాకెందుకో దిగాలనిపించలేదు. ఇష్టంలేని ప్రయాణంలో ప్రతిదీ అసౌకర్యంగా అసహనంగా అనిపిస్తాయేమో!‘‘బాబూ! నువ్వు సీతమ్మ కొడుకువా?’’ వెనుక సీటు నుంచి తొంగిచూస్తూ అడిగాడు ఒక పెద్దాయన. అరవై ఏళ్లుంటాయి అటూ ఇటుగా...నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వేములపల్లిని వదిలి ఇరవయ్యేళ్లయింది. ఆ ఊరితో అనుబంధం దాదాపుగా తెగిపోయింది. ఆయన నన్నెలా గుర్తుపట్టాడో అర్థం కాలేదు.‘అవునండీ... మీరు..?’‘‘నీ పేరు ఆనందు కదూ! నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ ఇంటి పక్కనే ఉండే టైలర్ వెంకటేశ్వర్రావుని. నువ్వచ్చం మీ నాన్నలానే ఉన్నావు. వాడూ నేనూ కలిసి చదువుకున్నాంగా... ఎప్పుడూ నా కళ్లలోనే మెదుల్తాడు’’ అన్నాడాయన.‘‘సారీ అండీ... గుర్తుపట్టలేకపోయాను. రండి టీ తాగొద్దాం’’ అని సీటులోంచి లేచాను. ఆయన సంతోషంగా నన్ను అనుసరించాడు.టీ తాగేటప్పుడు అమ్మ ప్రస్తావన తెచ్చాడు. అమ్మ చనిపోయిందని చెబితే ఎంతో బాధపడ్డాడు. ఆయన కూడా రెండేళ్ల కిందట వేములపల్లి నుంచి వచ్చేసి నందిగామలో కూతురు దగ్గర ఉంటున్నానని చెప్పాడు.బస్సెక్కాం. నా పక్క సీటులోని వ్యక్తిని రిక్వెస్ట్ చేసి వెనక్కి పంపి, పెద్దాయన్ని నా పక్కన కూర్చోబెట్టుకున్నాను.‘‘మీ అమ్మ అట్టాంటి పని చేసిందంటే మేమెవరం నమ్మలేదయ్యా! నలుగురికి పెట్టే గుణమే తప్ప ఎవరి దగ్గరా ఏమీ ఆశించే మనిషి కాదు. నగలు దొంగతనం చేసే ఖర్మ సీతమ్మకి పట్టలేదని ఊరందరికీ తెలుసు.’’నేను మౌనంగా వింటున్నాను.‘మీరు ఊరొదిలి వెళ్లిపోయాక రాజారాంగారికీ కాశీకి పెద్ద గొడవ అయ్యిందటయ్యా! తండ్రీ కొడుకుల మధ్య ఈనాటికీ మాటలు లేవు. అంతకు మించి విషయాలేవీ బయటకు రాలేదు. ఏదైనా గుట్టుగల కుటుంబం’’ఆయన నిట్టూర్పు నాకు అర్థం అయ్యింది. మా అమ్మ పట్ల సానుభూతి, అభిమానం ఉండి కూడా మాకోసం ఏమీ చేయలేకపోయామనే అశక్తత ఉంది. ‘‘వచ్చే స్టేజీయే నందిగామ. రిటన్లో దిగిరాయ్యా! శ్రీనివాసరావుగారి బట్టల కొట్టంటే ఎవరైనా చెబ్తారు’’ అంటూ లేచారాయన.‘‘సరే బాబాయ్! జాగ్రత్తగా వెళ్లండి.ఆరోగ్యం జాగ్రత్త!’’ అన్నాను.వరుస కలిపి పిలిచినందుకు ఆయన మొహం సంతోషంతో వెలగడం నాకు కనిపించింది.ఆయన దిగాక మళ్లీ ఒంటరినయ్యాననిపించింది. ‘వేములపల్లి దిగండీ..’కండక్టర్ అదిలింపులాంటి ఆజ్ఞతో లేచాను. అప్పటికే సాయంత్రం అయింది.శివాలయం వీధిలో మూడో ఇల్లే మావయ్యది. నడుస్తున్నాను. ఊరు పెద్దగా మారలేదు. పెంకుటిళ్ల స్థానంలో డాబాలు వెలిశాయి. మట్టిరోడ్ల స్థానంలో సిమెంటు రోడ్లు వచ్చి చేరాయి. భద్రయ్యతాత కిళ్లీకొట్టు లేదు. అక్కడ సెల్‌ఫోన్ రీచార్జి చేసే షాపు ఉంది. నాకెందుకో ఉద్వేగంగా ఉంది. ఇల్లొచ్చింది. నాకో పెద్ద అనుమానం వచ్చింది. ఆ ఇల్లేనా అని. కళాకాంతులు లేని, పెచ్చులూడిన ప్రహరీగోడను చూడగానే మనసు చివుక్కుమంది. గేటు తీసుకుని లోపలికి వెళ్లాను.ఒక పదహారేళ్లుంటాయి కుర్రాడికి. కాశీబావ కొడుకై ఉంటాడు. నన్ను తేరిపార చూసి లోపలికి రండి అన్నాడు. కాళ్లు కడుక్కోమని పంపువైపు చూపించాడు. లోపలికి వెళ్లి ఒకావిడ్ని వెంటబెట్టుకొచ్చాడు.ఆవిడ చేతులు చెంగుకి తుడుచుకుంటూ హడావుడిగా నవ్వుతూ ఎదురొచ్చింది. ‘మావయ్యగారు బయటికెళ్లారు బాబూ! వచ్చేస్తారు’ అంటూ వరండాలోకి తీసుకెళ్లింది. ఒకప్పుడు నిత్యం పదిమంది మనుషులతో కళకళలాడిన ఆ లోగిలి బోసిపోయి ఉంది. గోడల రంగులు వెలిసిపోయాయి. బయట పశువుల పాకలో ఒక పాడిగేదె కట్టేసి ఉంది. ‘ఎప్పుడు బయలుదేరారు బాబూ! స్నానం చేసి రండి. మావయ్య వచ్చేస్తారు... నానీ! మావయ్యని రూమ్‌లోకి తీసుకెళ్లు’ అంటూ కొడుకుని పురమాయించి వంటగదిలోకి వెళ్లిందామె.వాళ్లిద్దరూ కనీసం మీరెవరు? అని అడగకపోవడానికి గల కారణం నాకు అర్థమైంది. ఎదురుగా గోడకు అత్తయ్య ఫొటో పక్కన అమ్మానాన్నల ఫొటో. అమ్మ తనవెంట తెచ్చుకోవడం మరిచిపోయిన ఫొటో. చిన్నప్పటి నుంచి నేను చూడలేకపోయిన నాన్న రూపం అచ్చు నాలానే ఉంది.రాత్రి ఎనిమిది గంటలకు మావయ్య వచ్చాడు. మనిషి వంగిపోయాడు. వస్తూనే నన్ను చూసి ‘బాగున్నావా..! మీ అమ్మ..’ అంటూ ఆగిపోయాడు.పక్కనున్న కుర్చీలో కూర్చుండిపోయాడు.నేను లేచి నిలబడి ‘బాగానే ఉన్నాను మావయ్యా! అమ్మ మిమ్మల్ని చూసి రమ్మని చివరికోరికగా చెప్పింది. అందుకే వచ్చాను. బయలుదేరతా’ అన్నాను నెమ్మదిగా.ఆయన నావైపు సూటిగా చూసి ‘‘రేపు పంపిస్తాను ఆనంద్ నిన్ను’’ అని కోడలివైపు తిరిగి ‘‘భోజనం ఏర్పాట్లు చూడమ్మా!’’ అంటూ తన గదిలోకి వెళ్లిపోయాడు. భోజనం చేస్తున్నాను మౌనంగా. ‘‘మా పెళ్లయిన మరుసటి ఏడాదే అత్తయ్యగారు పోయారు. ఈ ఇంటికి కాపురానికి వచ్చిన పదిహేడేళ్ల నుంచి ఎప్పుడూ తండ్రీ కొడుకులు ఎదురెదురు కూర్చుని మాట్లాడుకోవడం చూడలేదు నేను. తప్పనిసరైతే ఒకటి రెండు మాటలు. అంతే. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వ్యవసాయం తరిగిపోయింది. మా మరిది శరత్ బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. వసుంధర వాళ్లు హైదరాబాద్‌లో ఉంటున్నారు.’’ చెప్పుకుపోతోంది ఆ ఇంటి కోడలు.‘‘సుమన ఎక్కడుంటుందక్కా!’’ అని అడిగాను మధ్యలో.‘‘ఈ ఊరే ఇచ్చాం. రైత్వారీ సంబంధం. పాపం! దాని దాకా వచ్చేసరికి ఆస్తులు కరిగిపోయాయి. రాజీపడక తప్పలేదు.కానీ! దాని కాపురమే బాగుందనిపిస్తుందయ్యా నాకు..’’ అందామె నిట్టూరుస్తూ.‘‘మీకేం తక్కువ?’’ అడిగాను కొంచెం చనువు తీసుకుని.కొద్దిపాటి నిశ్శబ్దం తర్వాత... ‘‘అన్నీ ఉన్నాయి కానీ ఆనందం లేదు.ఇంటిల్లిపాదీ కూర్చుని తిని ఎరుగం... ఏదైనా నీ చేతుల్లోనే ఉంది తమ్ముడూ’’ అందామె చివరి మాటను ఎంతో ఆశగా... ప్రేమగా...నేను తలెత్తి చూశాను. ఆమె కళ్లలో సన్నటి కన్నీటిపొర. నాకు మాట రాలేదు.రాత్రి పదయింది. నేను వరండాలో కూర్చుని టీవీ చూస్తున్నా. కాశీ వచ్చాడు. నేను గుర్తుపట్టలేకపోయాను.‘‘ఆనందా..!? ఏరా బాగున్నావా? ఎప్పుడొచ్చావ్?’’ అన్నాడు దగ్గరకొచ్చి. నన్ను చూసి చాలా ఆనందపడ్డాడు. కాశీబావ నన్ను అంత బాగా పలకరిస్తాడనుకోలేదు. ‘‘బాగున్నాను బావా! సాయంత్రం వచ్చా’’ అన్నాను.‘‘సరే! రెస్టు తీసుకో. మాట్లాడదాం’’ అంటూ గదిలోకి వెళ్లగా అతని భార్య అనుసరించింది. పడుకున్నా... నిద్రపట్టలేదు. ఇరవయ్యేళ్ల క్రితం ఆ ఇంట్లో జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి.అర్ధరాత్రి కొంతమంది అమ్మను నిలదీస్తున్నారు. అమ్మ, మావయ్య తప్ప అందరూ ఏవేవో మాట్లాడుతున్నారు. వసుంధర, అత్తయ్య దగ్గర కూర్చుని ఏడుస్తోంది. కాశీబావ నోట పోలీసులు అనే మాట వినబడి నాకు భయం వేసింది.తెల్లవారు జామున అమ్మ నన్ను వెంటబెట్టుకుని బయలుదేరింది. బస్సెక్కాక ‘‘మనం ఎక్కడికి వెళ్తున్నాం? మళ్లీ ఎప్పుడొస్తాం?’’ అని నేను అడగడం గుర్తొచ్చాయి.తర్వాత రాజమండ్రి మహిళా సేవాసదన్‌లో అమ్మ ఆయాగా పనిచేసింది. వాళ్ల స్కూల్లోనే నన్ను చదివించింది.అందరూ ఏ కష్టమొచ్చినా అమ్మతోనే చెప్పుకొనేవాళ్లు. ఓపికగా వినేది. సాయం చేసేది. మావయ్య వాళ్ల గురించి ప్రస్తావన తెస్తే చిరునవ్వు నవ్వి ఊరుకొనేది. తర్వాత నేను అడగడం మానేశాను.‘ఆనందూ!’ఉలిక్కిపడి లేచాను. అర్ధరాత్రి గుమ్మం దగ్గర మావయ్య.‘రండి మావయ్యా!’ అంటూ లేచాను.మావయ్య మంచం ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. బెడ్‌లైట్ వెలుగుతోంది. లైట్ వెయ్యబోతే మావయ్య వద్దని వారించాడు.‘‘నీతో చాలా విషయాలు మాట్లాడాలిరా!... మా మీద నీకు చాలా కోపం ఉందని నాకు తెలుసు’’నేను మౌనంగా వింటున్నాను. ‘‘చెయ్యని తప్పు మీదేసుకుని నా చెల్లెలు గొప్ప త్యాగం చేసింది. ఇప్పుడు శాశ్వతంగా దూరమై నాకు జీవితకాలానికి సరిపడా శిక్ష వేసింది.’’ మావయ్య గొంతు జీరబోయింది.‘‘అసలు విషయమేమిటో నాతో కూడా ఎప్పుడూ చెప్పలేదు మావయ్యా! గుచ్చి గుచ్చి అడిగి అమ్మను బాధపెట్టడం ఇష్టంలేక నేనూ ప్రస్తావన తెచ్చేవాణ్ణి కాదు’’‘‘మరి అమ్మ ఏ తప్పూ చేయలేదంటున్నారు. ఆ రోజు అంత జరుగుతుంటే మీరెందుకు మౌనంగా ఉన్నారు?’’ మర్యాదగానే సూటిగా అడిగాను. ‘‘దొంగతనం చేసింది మీ అమ్మ కాదురా! నా పెద్ద కూతురు.’’ మావయ్య గొంతులో ఉద్విగ్నత. ‘‘ఎవరినో ప్రేమించి అర్ధరాత్రి పారిపోతూ మీ అమ్మ కంటబడింది. సర్దుకున్న నగల బ్యాగ్ అక్కడే పడేసి భయంతో ఇంట్లోకి వచ్చేసింది. ఆ అలికిడికి ముందు నేనే లేచాను. నా కూతురు నాకు ఎదురుపడి భయంతో వణికింది. మీ అమ్మ ‘ఆడపిల్ల, దానిని ఏమీ అనొద్దు అన్నయ్యా! పెళ్లి కావాల్సిన పిల్ల. దాని జీవితం నాశనమైపోతుంది. ఏం జరిగినా ఏమీ మాట్లాడొద్దు’ అని నా చేత ఒట్టు వేయించుకుంది. ఈలోగా అందరూ పోగయ్యారు. తలో మాటా అన్నారు. నా చెల్లెలు... నా సీతమ్మ... నన్ను విడిచి ఊరు వదిలి వెళ్లిపోయింది.తర్వాత తప్పు చేసింది నా చెల్లెలు కాదు, తన చెల్లెలని కాశీకి తెలిసింది. మీ అమ్మను అన్ని మాటలన్నందుకు వాడు ఎంతో కుమిలిపోయాడు. నిజం దాచినందుకు ఆరోజు నుంచి నాతో మాట్లాడ్డం మానేశాడు.’’మావయ్య తలెత్తకుండా చెప్పుకుపోతున్నాడు.నాకు నోట మాట రాలేదు.ఇరవయ్యేళ్ల పాటు చెయ్యని తప్పుకు నింద మోసి దూరంగా బతికిన మా అమ్మ, కూతురు చేసిన తప్పుని చెల్లెలు మీదేసుకుని దూరమైపోతే నిస్సహాయంగా, నిస్సారంగా బతికేస్తున్న మావయ్య... తల్లిలా సాకిన మేనత్తను అకారణంగా నిందించి గెంటేశాననే అపరాధభావంతో కాశీ...మావయ్య లేచాడు. నేనూ లేచి నిలబడ్డాను.. ‘‘మీ అమ్మ నాకు ఉత్తరాలు రాసేది. మీ బాగోగుల గురించి తెలియజేసేది. సాయం చేస్తానంటే వద్దంది. అసలు రావద్దంది. తనను వచ్చేయమన్నాను. తను వస్తే దొంగలా బతకాలి, లేదంటే నా కూతురు చేసిన పనిని పదిమందికీ చెప్పాలి. అందుకే రానంది. తన అనారోగ్యం గురించి తెలుసుకుని విలవిలలాడాను. చివరి చూపు కూడా..’’నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘‘ఏదో ఒకరోజు నిన్ను పంపుతానని చివరిసారిగా రాసిన ఉత్తరంలో మాటిచ్చిందిరా!... మళ్లీ ఉత్తరం రాలేదు. నువ్వొచ్చావు. అన్నింటికీ నేనే బాధ్యుణ్ణిరా ఆనంద్’’మావయ్య గొంతు వణికింది. నేను మౌనంగా వింటున్నాను. ‘‘సరే! పడుకో. మనసులో బరువు దించుకోవడానికి ఈ ముసలోడికి ఒక అవకాశం ఇచ్చావు. సంతోషం. అడగడం మర్చిపోయాను. నీ భార్య, పిల్లలు...’’‘‘ఒక అబ్బాయి మావయ్యా! అందరూ బాగున్నారు.’’ అన్నాను.మావయ్య బయటికి నడిచాడు. వెనుక నాలుగు అడుగులు వేశాను. మెట్లెక్కుతున్న మావయ్యను చూస్తూ నిలుచున్నాను. వరండాలో ఒక మూల కాశీబావ.గుండె ఝల్లుమంది నాకు.ఈ తండ్రీ కొడుకులు మనసులో ఇంత భారం పెట్టుకొని ఇన్నేళ్లు ఎలా గడిపారో నాకు అర్థం కాలేదు. లక్ష్మక్క అన్నట్లు అంతా నా చేతుల్లోనే ఉందా? నెమ్మదిగా కాశీ దగ్గరకు వెళ్లాను.‘‘ఏంటి బావా! పడుకోలేదా?’’ అని అడిగాను.‘‘మాకు అన్నీ ఉన్నాయిరా... మనశ్శాంతి తప్ప. ఇలాంటి నిద్రలేని రాత్రులు చాలా గడిపాం’’ అన్నాడు గంభీరంగా.నేనేం మాట్లాడలేకపోయాను.‘క్షమించమని అడగడానికి అత్తయ్య లేదు’ అని నా చేతులు పట్టుకున్నాడు. ‘‘బావా! ఒక్క మాట చెప్పవా..?’’ అని అడిగాను.ఏంటన్నట్టు చూశాడు.‘‘మావయ్య చేసిన తప్పేముంది? చెల్లెలు దూరమై, భార్య చనిపోయి... కొడుకు మాట్లాడక ఆయన చిత్రవధ అనుభవిస్తున్నాడు. నువ్వు మారాలి బావా!’’ అన్నాను.‘‘నాలుగు రోజులుంటావా?’’ అడిగాడు ప్రేమగా.‘‘ఆఫీసులో పని ఉంది బావా! రేపు ఉదయం వెళ్లాలి’’ అన్నాను.ఉదయాన్నే బయలుదేరాను.మావయ్య, కాశీ నాకు చెరోవైపు నడుస్తున్నారు. ఇరవయ్యేళ్ల తర్వాత తండ్రీ కొడుకులు కలిసి వీధిలోకి రావడాన్ని అంతా ఆశ్చర్యంగా, ఆనందంగా చూశారు.ఎదురైన వారందరికీ ‘‘మా సీతమ్మ కొడుకు... నా మేనల్లుడు’’ అంటూ పరిచయం చేస్తున్నాడు మావయ్య.బస్సెక్కాను. ఆ ఊరికి రావడానికి తీవ్రంగా ప్రతిఘటించిన నా మనసు ఇప్పుడు తిరిగి వెళ్లడానికి బాధపడుతోంది. అమ్మ ఆఖరి కోరిక తీర్చాను. చాలా తృప్తిగా ఉంది. అమ్మ ఆత్మ కూడా తృప్తిపడి ఉంటుంది. గజ్జెల దుర్గారావు -
విఠూ తాళంచెవి పోయింది
బండోడ్కర్ అన్నగారు గోవా ముఖ్యమంత్రి అయ్యారు చూడు, అప్పుడు విఠూ అన్నాడు, ‘ఇది మాత్రం మంచికి అవలేదు కదా!’. విఠూ తన తాళాల గురించి అన్నాడు. ముఖ్యమంత్రి సంగతి కాదు. అదే సమయంలో అతని తాళం చెవి పోయింది. విఠూ దగ్గర ముందు తలుపుది, బయట గదిది, లోపలి గదులవి, కబోర్డు సొరుగువి, మేజాబల్ల సొరుగువి, పెట్టెది, అల్మారాది, ట్రంకు పెట్టెలవి, భోషాణంది.. ఇలా అన్నీ కలిపి పద్నాలుగు తాళాలు ఉండేవి. వాటిలో అల్మారా తాళం తరచూ పోతుండేది. బయట గదిది, మేజాబల్ల సొరుగువి, ట్రంకుపెట్టెలవి వారం, పక్షం రోజులకొకసారి, కబోర్డు సొరుగు తాళాలు మూడు నెలలకి రెండుసార్లు (కనీసం) పోతూ ఉండేవి. ఎప్పుడూ పోనిది భోషాణంది. ఈసారి అదే పోయింది.నిజానికి విఠూని వెర్రిబాగుల వాడంటారు. కొద్దిగా మందమతి, చాదస్తం కూడా ఉంది. ఏ వస్తువైనా ఎక్కడ పెట్టాడో ఎప్పుడూ జ్ఞాపకం ఉండదు. అందులో ఈ తాళంచెవి ఎంతదని? చిటికిన వేలంత. అదిపోతే ఎలా దొరుకుతుంది? తాళంచెవి పోయిందని తెలిశాక విఠూ ఇల్లంతా వెతికాడు. ముందు బయట గదిలో వెతికాడు. గదిలో మేజాబల్ల, మేజా సొరుగు వెతికాడు. కుర్చీల మీద వెతికాడు. గోడమీద మేకులు, గోడమూలల్లో ఉన్న చిన్న షెల్ఫ్‌లు వెతికాడు. వసారా వెతికాడు. మూలమూలల్లోని అల్మారాల సొరుగులు వెతికాడు. అల్మరాలో బట్టలు వెతికాడు. ప్యాంటు, లాగు చొక్కాల జేబులు వెతికాడు. వంటగది వెతికాడు. గిన్నెలు, తపేలాలు, ఇత్తడి సామాను, కంచాలు, చెంచాలు, గరిటలూ, గంగాళాలూ అన్నీ క్షుణ్ణంగా వెతికాడు. వంటగదిలోని షెల్ఫ్ కూడా వెతికాడు. మేడమెట్లు వెతికాడు. పడకగది వెతికాడు. గదిలో దిండ్లు, దిండు కవర్లూ, గలీబులూ, దుప్పట్లు అన్నీ వెతికాడు. అన్నీ వెతికిన తర్వాత భార్యకు చెప్పాడు, తాళంచెవి పోయిందని. భార్యకు బాధగా అనిపించింది. విఠూ వెతికిన ప్రతిచోటా తను మళ్లీ వెతికింది. విఠూ ఆ తర్వాత తల్లితో చెప్పాడు, తాళంచెవి పోయిందని. ఆవిడ కూడా విఠూ, విఠూ భార్య వెతికిన ప్రతిచోటులోనూ మళ్లీ వెతికింది. విఠూకి తల్లి మీద జాలేసింది. తల్లికి విఠూ మీద జాలేసింది. విఠూ భార్యకి విఠూ మీద, విఠూ తల్లి మీద జాలేసింది. విఠూకి ఇద్దరు పిల్లలు. పాటూ, తీటూ. తాళంచెవి పోయిన సమయంలో పాటూ పాటలు పాడుతున్నాడు. తీటూ గెంతులేస్తున్నాడు. విఠూ పాటూతో అన్నాడు, ‘‘ఏం దరిద్రపు జాతిరా మీది’’. పాటూ అడిగాడు – ‘‘ఏం జరిగింది?’’‘‘తాళం చెవి పోయింది.’’‘‘నేనేం చేయను?’’‘‘ఏడువ్.’’‘‘ఏడిస్తే దొరుకుతుందా?’’‘‘అవును.’’ఇది తీటూ విన్నాడు. ఇద్దరూ ఏడుస్తూ కూర్చున్నారు. విఠూ హఠాత్తుగా లేచాడు. ‘‘అరే! పాట పాడుతున్నార్రా’’ అని అడిగాడు. పాటూ, తీటూ ఏడుస్తుంటే పాట పాడుతున్నారా అనిపిస్తుంది. విఠూ కోపంతో లేవడంతో వాళ్లు పాపం నోరు మూసుకున్నారు. తాళంచెవి పోయిన విషయం విఠూగాడి భార్య పక్కింటావిడకి చెప్పింది. ఆవిడ మరొకరికి చెప్పింది. ఆవిడ మూడో మనిషికి చెప్పింది. ఆవిడ నాల్గవ మనిషికి, ఆవిడ ఐదవ వ్యక్తికి చెప్పింది. పాటూ, తీటూ ఈ కబురు తబ్లు, గిబ్లూలకి చెప్పారు. ఆ తర్వాత వీళ్లు వాళ్లకి, వాళ్లు వీళ్లకి, వాళ్లు మరొకరికి, మరొకరు మరొకరికి చెప్పారు. క్రమేణా ఈ కబురు అందరికీ తెలిసింది.కొందరు విఠూని విచారించడానికి వచ్చారు. విఠూగాడి భార్యను పరామర్శించడానికి కూడా చాలామంది వచ్చారు. ఆమె ఈ మధ్యనే నెల తప్పింది. గర్భవతి. ఎవరు తాళంచెవి విషయం కూపీ తీయడానికి వచ్చారో వాళ్లు తాళంచెవి ఎలా పోయిందిరా అని విఠూని అడిగారు. అప్పుడు విఠూ అది ఈ విధంగా పోయిందని వాళ్లకి చిలవలు పలవలుగా కథలల్లి చెప్పాడు. అందరికీ చెప్పేవాడు. ‘‘నిన్న నేను పొద్దున్న లేచాను సరే, టీ తాగాను సరే, భోజనం చేశాను సరే, స్నాన పానాలు పూర్తి చేశాను సరే, బయటికి వెళ్లాను సరే, ఇంటికి తిరిగొచ్చాను సరే, భోంచేసి నిద్రపోయాను సరే, ఈవేళ పగలు నిద్రలేచాను సరే, టీ తాగాను సరే, స్నానం చేశాను సరే, రేడియోలో బండోడ్కర్ ముఖ్యమంత్రి అయినట్లు విన్నాను సరేనా... అప్పుడు అకస్మాత్తుగా చూసినప్పుడు...’’విఠూగాడి బావ తన భార్యతో... అంటే విఠూ చెల్లెలితో విఠూ ఇంటికి వచ్చాడు చూడు, అప్పుడు విఠూ భార్య ఏడుస్తోంది, కడుపులో మండుతోందని. విఠూ తల్లి చెబుతోంది – ‘‘నేను విఠూకి చెప్పాను. దాని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని. కానీ ఈ పాపిష్టివాడు నా మాట వినలేదు. ఊరికే పనికిరాని హడావుడి చేయడం వీడికి అలవాటు’’.‘‘కానీ ఈవిడకి ఇలా బాధ కలగడం ఎప్పట్నుంచి ప్రారంభమైంది?’’ విఠూగాడి చెల్లెలు తల్లిని అడిగింది.‘‘అయ్యో! ఏమని చెప్పను నీకు. ఈవేళ పగలు లేచాం సరేనా, రేడియో వేశాం సరేనా, బండోడ్కర్ ముఖ్యమంత్రి అయ్యాడనే వార్త విన్నాం సరేనా, అప్పుడే విఠూ బయటికి వచ్చి నాతో అన్నాడు, ‘అమ్మా ఘోరం జరిగింది’ అని. నా గుండెల్లో రాయి పడింది. దీనికి ఇప్పుడిప్పుడే నెల తప్పింది కదూ? అరే పాపాత్ముడా ఏం జరిగిందిరా? అనడిగా. విఠూ చెప్పాడు తాళంచెవి పోయిందని. సరిగ్గా అప్పుడే దీని ఈ....’’బావగారూ, ఆయన భార్య ఈ విషయం అలాగే వదిలేసి తిరిగెళ్లిపోయారు. రోజంతా జనం వస్తున్నారు. మొగాళ్లు వచ్చినప్పుడు అదే విషయం, అదే పద్ధతిలో విఠూ వాళ్లకి చెప్పాడు. ఆడవాళ్లు వచ్చినప్పుడు అదే విషయం, అలాగే అతని తల్లి చెప్పింది. వచ్చిన వాళ్లందరికీ విఠూ భార్య తన కడుపునొప్పి గురించి చెప్పి ఏడుస్తూ కూర్చునేది. మూడురోజులు గడిచాయి. విఠూ దేవుడి గుడికి వెళ్లాడు. అక్కడ కీర్తన జరుగుతోంది. హరిదాసు వచ్చీరాని మరాఠీ భాషలో చెబుతున్నాడు – ‘‘ఏం చెప్పను దేవుడా! ఈ ప్రపంచమంతా పెద్ద పద్మవ్యూహం. క్లిష్ట సమస్య. ఏ రోజు ఎవరికి ఏం జరుగుతుందో చెప్పలేం. ఈ రోజు ఎవరిదో తాళంచెవి పోతుంది. రేపు వాడి పెళ్లాం పోతుంది. ఎల్లుండి వాడి పిల్ల పోతుంది. ఆ తర్వాత వాడే పోతాడు... అందుకనే ‘నేనెక్కడికి వెడితే అక్కడికి నువ్వు నీడలా వస్తావు’ అని భక్తతుకారాం అన్నాడు’’. విఠూకి బెంగ పట్టుకుంది. ఈవేళ కేవలం తాళంచెవి పోయింది. రేపు నేనే పోతే? నా భార్య పోతే? విఠూ లేచి దేవుడికి నమస్కారం చేశాడు. పూజారి తన సమస్య ఏమిటని అడిగాడు. ఆ తర్వాత పూజారి దేవుణ్ణి ఉద్దేశించి అన్నాడు, ‘‘భగవంతుడా! ఈవేళ ఈ విఠూ ప్రత్యేకంగా నీ దర్శనానికి నీ శరణుకోరుతూ వచ్చాడు. వాడికి ఆ పోయిన తాళంచెవి త్వరగా దొరికేలా చూడు. ఆ తర్వాత అతను నీకు పంచదారతో తులాభారం చేస్తాడు’’. విఠూ మనఃపూర్వకంగా మొక్కుబడి ఇస్తానని ప్రార్థించాడు. పూజారవిఠూకి చెప్పాడు, ‘‘దేవుడు నీ పని చేస్తాడు. దేవుడు చేయకపోతే ఆ పని నా సోదరుడు చేస్తాడు’’.పూజారి తమ్ముడు జ్యోతిష్యుడు. విఠూ అతడితో చెప్పాడు. అన్నీ విన్నాక అతడు విఠూని అడిగాడు ‘‘నక్షత్రం ఏమిటో తెచ్చావా?’’‘‘ఎవరిది?’’‘‘తాళం చెవిది’’‘‘లేదు. దాని నక్షత్రం నేను చేయించలేదు.’’‘‘అయితే అది ఎక్కడికి చేరిందో ఎలా చెప్పను?’’విఠూ నోరెత్తలేదు.‘‘తాళం ఎప్పుడు చేయించావు?’’‘‘అయిదేళ్లు గడిచాయి’’‘‘నెల?’’‘‘మార్గశిర మాసంలో!’’‘‘తిథి?’’‘‘ఏకాదశి’’‘‘రోజు?’’‘‘సోమవారం’’‘‘సమయం?’’‘‘తాళాలు చేసేవాడు ఆ తాళం నాకు పగలు పది గంటలకి ఇచ్చాడు.’’తాళం సమగ్ర ఆకారం, రంగు రూపాలూ వగైరా వివరాలు విఠూ దగ్గర వివరంగా అతను అడిగాడు. ఆ తర్వాత ఆ తాళంచెవి నక్షత్రం ప్రకారం లెక్కలు వేశాడు. కళ్లు చిన్నవి చేసి, తదేక దృష్టితో సూక్ష్మంగాఆలోచించాడు. వేళ్లతో ఏవో లెక్కలు వేశాడు. ఆ తర్వాత అంతరాళంలోకి దృష్టి కేంద్రీకరించాడు, ఆకాశంలో నక్షత్రాలు చూస్తున్నట్టు. అప్పుడన్నాడు, ‘‘నీ తాళం చెవి దక్షిణ దిక్కుగా పోతోంది’’.‘‘కానీ దానికి కాళ్లు లేవు. అది ఎలా నడుస్తుంది?’’ విఠూ ఆత్రుతగా అతణ్ని అడిగాడు.‘‘చొప్పదంటు ప్రశ్నలు అడగవద్దు’’‘‘అడగనులే. కానీ నాకొక సంగతి చెప్పు. నా ఈ తాళం చెవి దొడ్డిదారిలోని తోటలో ఉందా? ఊరి ఏటి ఒడ్డున ఉందా? కణ్కోణాలోని మూడుదార్ల కూడలి దగ్గర ఉందా? లేక కన్యాకుమారిలో వివేకానందుకి స్మారక స్థలంలో ఉందా?’’‘‘నాకు నీ ప్రశ్నలకి అర్థం తెలియడంలేదు’’‘‘నువ్వు నా తాళం చెవి దక్షిణ దిక్కులో పోతోందన్నావు. ఆ దక్షిణం ఎక్కడిది? ఇంటిదా? ఊరుదా? గోవాదా? లేక భారతదేశందా?’’‘‘ఈ వివరాలన్నీ నేను నీకు చెబితే నా జ్యోతిష్యంలో మిగిలేదేముంది?’’అప్పుడే గుడిలోంచి పూజారి అక్కడికి వచ్చాడు. అతను విఠూతో అన్నాడు, ‘‘మా తమ్ముడు పది రూపాయలకి ఇంతకంటే ఎక్కువ జ్యోతిష్యం చెప్పడు’’.విఠూ తిట్టుకుంటూ అతనికి పదిరూపాయలిచ్చి ఇంటికి తిరిగి వచ్చేశాడు. భోజనానికి కూర్చుంటుండగా, బయట తలుపు చప్పుడయింది. ఒక పోలీసువాడు లోపలికి ప్రవేశించాడు. ‘‘నీ తాళం చెవి పోయిందంటగా?’’ విఠూని అతనడిగాడు.‘‘అవును, నీకెవరు చెప్పారు?’’‘‘నీ పక్కింటి వాళ్లు’’‘‘అందుకని నువ్వు ఇక్కడికి వచ్చావా?’’‘‘ఈ పని మేం చేయకపోతే, మరెవ్వరు చేస్తారు? పోలీసులంటే లోకులసేవ చేసేవాళ్లు..’’విఠూ రెండు నిమిషాలు ఆ పోలీసుని చూస్తూ నిలబడ్డాడు. అలనాటి రామరాజ్యంలోని భటుడు పోలీసు రూపంలో పొరబాటున ఇక్కడికి వచ్చాడా అనుకున్నాడు. ‘‘సరే ఆ తాళంచెవి ఇప్పుడు నాకెలా లభిస్తుంది?’’ విఠూ అడిగాడు.‘‘కంప్లెయింట్ రాసివ్వు.’’‘‘ఏమని?’’‘‘తాళంచెవి ఎవరో దొంగిలించారని. నీకెవ్వరి మీదైనా అనుమానం ఉంటే వాళ్ల పేరు రాయి.’’‘‘కానీ నా తాళం పోయింది. దాన్ని ఎవరో దొంగిలించారని నాకు అనిపించడంలేదు.’’‘‘ఆ తాళం ఎక్కడోపోతే దాన్ని వెతకడం మా పనికాదు. ఎవరైనా దొంగిలిస్తే పట్టుకోవడం మా విధి.’’‘‘సరే, ఫిర్యాదు రాసిస్తే అది దొరుకుతుందా?’’‘‘ప్రయత్నించడం మా కర్తవ్యం. దొరుకుతుందో, లేదో మేమెలా చెప్పగలం? రేపు ఎవరైనా వచ్చి మంత్రిగారిని ఎత్తుకుపోయినా, ఆయన మాకు తప్పక దొరుకుతాడని చెప్పలేం’’ ఆ పోలీసువాడు నిక్కచ్చిగా చెప్పాడు. విఠూ అతను చెప్పిన ప్రకారం ఫిర్యాదు రాసిచ్చాడు. మళ్లీ అతణ్ని అడిగాడు – ‘‘నీకెవరు చెప్పారు? నా తాళం చెవి పోయిందని?’’‘‘ఆ విషయం అంత ముఖ్యం కాదు. పోయిన తాళం వెతకడం ముఖ్యమైన విషయం.’’ అంటూ వాడు బయటికి వెళ్లిపోయాడు. ఇదంతా జరిగిన తర్వాత విఠూ విసిగెత్తిపోయాడు. వెళ్లి పక్కమీద విశ్రాంతి తీసుకున్నాడు.ప్రపంచమంతా నరకం. కానీ, నాకేం పట్టిందని గాఢ నిద్రలో మునిగిపోయాడు. పొద్దున్న లేచి బయట వసారాలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చున్నాడు. అప్పుడతనికి రోడ్డుమీద ఎవరో కనిపించారు. అతను శుక్రనక్షత్రంలాగా కనబడ్డాడు. బ్రహ్మదేవుడిలా మాట్లాడుతున్నాడు. అతను విఠూని చూసిన వెంటనే అడిగాడు, ‘‘నీ తాళం చెవి పోయింది కదూ?’’‘‘అవును.’’‘‘అది దొరుకుతుంది.’’‘ఎలా దొరుకుతుంది?’’‘‘సరిగ్గా వెతికితే దొరుకుతుంది.’’‘ఎలా?’’‘‘తాళం చెవి పోవడం అన్నది ఒక క్రియ. అంటే ఒక సంఘటన. ఏదైనా సంఘటనకి, అది జరగడానికి ముందు ఒక కారణం ఉంటుంది. ఆ కారణం లేకుండా ఆ సంఘటన జరగదు. ఒక సంఘటనకి ఒకే కారణం ఉంటుందని చెప్పలేం. ఎన్నో కారణాలు ఉండొచ్చు.’’‘‘అంటే అర్థం?’’‘‘ఈ కారణాలు వెదకాలి’’‘‘ఆ తర్వాత తాళం చెవి దొరుకుతుందా?’’‘‘ఎలా పోయిందో తెలుస్తుంది.’’‘‘తెలిసి ఉపయోగం ఏమిటి?’’‘‘తెలియడంతో వెతకడం సులువవుతుంది.’’‘‘కానీ ఈ రెట్టింపు పని ఎందుకు? కారణాలు వెతికే బదులు నేను తాళం చెవినే వెతుకుతాను.’’‘‘దొరకదు.’’‘‘ఎందుకు దొరకదు?’’‘‘దొరికితే నువ్వు నన్ను ఇబ్బందిలో పెడ్తావు.’’‘‘ఎలా?’’‘‘కారణాలు వెతక్కుండానే నీకు తాళం చెవి లభ్యమైతే, అదెలా జరిగిందా అని నేను కారణాలు వెతకాల్సి వస్తుంది.’’‘‘సరే. కారణాలు ఎలా వెతకాలో మీరే నాకు కాస్త చెప్పి చూడండి బాబూ.’’‘‘తాళం చెవి పోయింది అంటే ఏమయింది అన్నమాట ముందు నాకు చెప్పు చూద్దాం.’’‘‘నాకు తెలియదు. మీరే చెప్పండి’’‘‘తాళం పోయింది అంటే ఉన్న తాళం అదృశ్యం అయిపోయింది. అది దొరక్కపోవడానికి ఎన్నైనా కారణాలు ఉండొచ్చు. ఊదాహరణకి: నువ్వు తాళం ఎక్కడ పెట్టావో నీకు జ్ఞాపకం లేదు గనుక అది నీకు దొరకలేదు. నువ్వు తాళం ఎక్కడ పెట్టానని అనుకుంటున్నావో అక్కడ నిజానికి పెట్టలేదు. అందుకని అది నీకు దొరకలేదు.నువ్వు తాళం పెట్టినచోటు నీకు జ్ఙాపకం ఉంది. కానీ అది అక్కడలేదు అందువల్ల దొరకలేదు.నువ్వు తాళం ఎక్కడ పెట్టావో, అక్కడే ఉంది. అయితే ఆ చోటు నీకు జ్ఞాపకం రావడంలేదు. అందువల్ల అది దొరకడంలేదు....’’విఠూకి అనిపించింది, మంత్రిగారు తన ప్రసంగంలో ప్రతి విషయాన్నిఎలా తిమ్మిని బమ్మిని చేసి విశ్లేషించి జనపనారలా అల్లుతాడో అలా వీడెవడో జ్ఞాని.విఠూ అతనితో నిష్టూరంగా అన్నాడు, ‘‘మిగిలిన కారణాలు నేను వెతికి తీస్తాను. మీరిక్కడ మరికొంతసేపు ఉంటే నాకు తలనొప్పి వస్తుంది. ఆ తర్వాత ఆ తలనొప్పి ఎందుకొచ్చిందా అని కారణాలు వెతకాల్సి వస్తుంది.’’అతను వెళ్లిపోయిన తర్వాత విఠూ స్నానం చేశాడు. ఆ తర్వాత పది, పదిన్నర ప్రాంతాలకి గోవా సచివాలయానికి వెళ్లాడు. ముఖ్యమంత్రి పీఏని కలిసి విషయం పూర్తిగా చెప్పి, తను ముఖ్యమంత్రిగారిని కలవాలని కోరాడు. మరో నెలన్నర వరకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదని, అన్ని అపాయింట్మెంట్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారని తెలియగానే పూర్తయ్యాయని చెప్పాడు పీఏ.‘‘ఇప్పుడు నేనేం చెయ్యను?’’ విఠూ అతణ్ని అడిగాడు.‘‘అన్నగారింటికి వెళ్లు’’ అతనన్నాడు.మర్నాడు పొద్దున్న విఠూ, బండోడ్కర్ అన్నగారింటికి వెళ్లాడు. అక్కడ ఎంతోమంది జనం ఉన్నారు. అయినా విఠూని అంతమందిలోనూ గుర్తుపట్టి అన్నగారు అందరికంటే ముందు ఇంట్లోకి పిలిచి ఏంపనిమీదవచ్చాడో విచారించారు. విఠూ ఆయనకి పోయిన తాళం చెవి గురించి చెప్పాడు. తాళం చెవి పోయినట్లు పోలీసులకి ఫిర్యాదు చేసినట్లు, వాళ్లు ఈ విషయం లక్ష్యపెట్టనట్టు కూడా చెప్పాడు.‘‘అంటే నీ పోయిన తాళం చెవి వెతకమని పోలీసులకి నేను చెప్పనా? వాళ్లకి వేరే పనేం లేదా?’’ బండోడ్కర్ అన్నగారు మండిపడ్డాడు.‘‘అలా కాదు.. నా ఆ.. తాళం... చాలా...’’ విఠూ భయంతో తడబడుతూ ఏదో అంటున్నాడు.‘‘సరేగానీ దాని వెల ఎంత ఉంటుంది?’’‘‘నాకు తెలియదు.’’అన్నగారు లేచి లోపలికి వెళ్లారు. ‘ఆయనకి కోపం రాలేదు కదా!’ అనుకున్నాడు విఠూ. కొంతసేపటికి ఆయన బయటకొచ్చి, ‘‘ఇదిగో తీసుకో డబ్బు’’ అంటూవిఠూ చేతిలో కరెన్సీ నోట్లదొంతర్లు ఉంచి, ‘‘కొత్త తాళం చెవి చేయించుకో’’ అంటూ సాగనంపాడు.విఠూ ఇంటికి వచ్చి అన్నగారిచ్చిన నోట్లు లెక్కపెడుతూ కూర్చున్నాడు.చూస్తే, అన్నగారిచ్చిన ఆ డబ్బు ఎంత ఉందంటే దానితో బంగారపు తాళం చెవి కూడా చేయించుకోవచ్చు. కొంకణీ మూలం : ఆనా మహాంబ్రె అనువాదం: శిష్టా జగన్నాథరావు -
మరిచిపోయిన ముద్దు
ఒక పదిహేను నిమిషాల తర్వాత, ఇంటిముందు కారు ఆగిన చప్పుడు. పాప తలుపు దగ్గరికి వెళ్లింది. తండ్రి దిగాడు. కూతురి ముఖంలో ఆశ్చర్యం. ‘మీటింగ్‌కు ఆలస్యమవుతోంది’ అంటూ హడావుడిగా చొక్కా టక్ చేసుకుని, బ్రీఫ్‌కేస్ పట్టుకుని బయటికి వెళ్తున్నాడు తండ్రి. డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేస్తున్న పాప, తండ్రి అలికిడి విని పరుగెత్తుకొచ్చింది. అప్పటికే ఆయన కారు ఎక్కేశాడు. పాప తన ఎంగిలి చేయి వైపు చూసుకుంటూ మళ్లీ పళ్లెం వైపు నడిచింది. అంతకుముందు బాగుందనిపించిన తిండి ఇప్పుడు సహించలేదు. చేయి కడుక్కుని తండ్రికి ఫోన్ చేసింది. ‘నువ్వు వెళ్లేటప్పుడు నాకు ముద్దు పెట్టడం మరిచిపోయావు’ అన్నది. ఆ స్వరంలో కొంత నింద ఉంది. తండ్రి అది గుర్తించాడు. ‘అయ్యో నాన్నా... సారీరా... అప్పటికే లేటయిందిరా... ఇంపార్టెంట్ మీటింగ్’ వివరణలాగా పదాలను పేర్చాడు. ‘సరేలే నాన్నా’ అని పెద్దరికం తెచ్చుకుని బదులిచ్చింది పాప. ఒక పదిహేను నిమిషాల తర్వాత, ఇంటిముందు కారు ఆగిన చప్పుడు. పాప తలుపు దగ్గరికి వెళ్లింది. తండ్రి దిగాడు. కూతురి ముఖంలో ఆశ్చర్యం. దగ్గరికి వచ్చి, తను ఆ రోజుకు బాకీ పడిన ముద్దు పెట్టి, మళ్లీ కారెక్కి వెళ్లిపోయాడాయన. ఆయనకు ఆరోజు మీటింగ్ ఎంతో ప్రాధాన్యమున్నదే కావొచ్చు; కానీ రెండ్రోజులాగితే దాని గురించే ఆయన మరిచిపోవచ్చు. కానీ అదే పాప, తన తండ్రి మరిచిపోయిన ముద్దు పెట్టడానికి వెనక్కి వచ్చాడని జీవితాంతం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. జ్ఞాపకం పరంగా ఏది మరింత ప్రాధాన్యత కలిగినదో గుర్తుంచుకుని, ఆ పని మనం చేసుకుంటూ వెళ్తే చాలు. -
నా సోదరిని చంపినందుకు గర్వంగా ఉంది
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మోడల్, ఇంటర్నెట్ సెన్సేషన్ ఖందిల్ బులోచ్ ను హత్య చేసినందుకు గర్వంగా భావిస్తున్నానని, అందుకు భావితరాలు నన్ను గుర్తుంచుకుంటాయని ఆమె సోదరుడు మహ్మద్ వసిమ్ అన్నాడు. తమ కుటుంబానికి తలవంపులు తెస్తున్నందుకే హత్య చేశానన్నాడు. శనివారం వసీమ్ ను అరెస్టు పోలీసులు సోమవారం మీడియా ముందు ప్రవేశ పెట్టారు. తాను మాదక ద్రవ్యాలకు బానిసయినా, స్పృహలో ఉండే ఈ హత్య చేశానని వసీమ్ చెప్పాడు. ఖందిల్ ఇంటర్నెట్ లో అశ్లీల చిత్రాలను పోస్టు చేస్తూ తమ కుటుంబం పరువు తీస్తున్నందుకే హత్య చేశానన్నాడు. అమ్మాయిలు జన్మించేది ఇంట్లో ఉండేందుకని, వారు సంప్రదాయాలు పాటించాలని, అయితే తన సోదరి ఎప్పుడూ ఇలా ఉండలేదని చెప్పాడు. -
ఏనాటి బంధమో!
జ్ఞాపకం మా ఇల్లు రైల్వేస్టేష్టన్కి దగ్గరగా ఉండేది. రైలు శబ్దం వినకపోతే ఏదో లోటుగా అనిపించేది. రైల్వే క్యాంటీన్లో కూర్చుని వచ్చి పోయే రైళ్లను, అందులో నుంచి దిగే ప్రయాణికులను చూడడం అలవాటుగా ఉండేది. బహుశా ఈ అలవాటే నేను ఒకరిని రక్షించడానికి కారణమైంది.ఒకరోజు మా ఫ్రెండ్స్ ఎవరూ ఊళ్లో లేరు. ఏమీ తోచక ఫ్లాట్‌ఫామ్ మీద నడుస్తూ ఉన్నాను. ఒక ట్రైన్ వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక వ్యక్తి ఏడుస్తూ దిగాడు. అతడిని మా ఊళ్లోగానీ, చుట్టుపక్కల ఊళ్లల్లోగానీ ఎప్పుడూ చూసినట్లు అనిపించలేదు. ట్రైన్ దిగిన వాళ్లంతా ఎటు పోవాల్సిన వాళ్లు అటు వెళ్లిపోయారు. ఆ వ్యక్తి మాత్రం ఎటూ వెళ్లకుండా ఒక చోట కూలబడ్డాడు. కంటికి ధారగా ఏడుస్తున్నాడు. అతడినలా చూస్తే జాలేసింది. వెళ్లి ‘‘ఎందుకలా ఏడుస్తున్నారు?’’ అని అడగాలనుకున్నాను. కానీ ఎందుకో వెనకడుగు వేశాను. అయితే ఆయన కొద్దిసేపటి తరువాత పట్టాల వెంట వేగంగా నడవడం మొదలుపెట్టాడు. నాకెందుకో అనుమానం వచ్చి ఆయన వెంటే వెళ్లాను. ఆయన ఒక చోట పట్టాలపై అడ్డంగా పడుకున్నాడు. నా గుండె ఆగిపోయింది. ఇంతలో ఒక ట్రైన్ వేగంగా వస్తోంది. కాస్త అటు ఇటయితే ఆయన ప్రాణం పోయేది. కానీ నేను పరుగున వెళ్లి ఆయన్ని అక్కడి నుంచి లాగాను. ఆ మధ్యనే ఆయన భార్యాపిల్లలు ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయారట. అది తట్టుకోలే, వాళ్లు లేకుండా బతకలేక ఈ నిర్ణయం తీసు కున్నాడట. మనసు అదోలా అయిపోయింది. ఓదార్చి మా ఇంటికి తీసుకెళ్లాను. అమ్మానాన్నా కూడా ఆయనకెంతో ధైర్యం చెప్పడంతో ఒక వారం రోజుల్లో మూమూలు మనిషయ్యాడు. మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అయ్యాడు. ఇప్పటికీ మా బంధం కొనసాగుతూనే ఉంది! - ఆర్.రాజ్‌కుమార్, చింతల్‌పల్లి -
రిక్షాలో దర్జాగా తిరిగేవాళ్లం..
జ్ఞాపకం గొల్లపూడి మారుతీరావు.. పరిచయం అక్కరలేని ప్రముఖ రచయిత, గొప్ప నటుడు. కాలమిస్టు. భాగ్యనగరంతో ఆయనది 64 ఏళ్ల బంధం. ఇక్కడ జరిగిన ప్రతి మార్పును దగ్గర నుంచి చూసిన వ్యక్తి. ఆ జ్ఞాపకాల దొంతరలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. - సాక్షి, సిటీబ్యూరో ‘విసిరేసినట్లు జనం..! విపరీత చలి.. సాయంత్రమైతే నక్కల అరుపులు.. దాదాపు 40 ఏళ్ల క్రితం వరకు హైదరాబాద్ ఓ పల్లె వాతావరణాన్ని తలపించేది. ఇప్పుడు మహానగరంగా మారిపోయింది. 1952లో నాకు 12 ఏళ్ల వయసులో తొలిసారి హైదరాబాద్ వచ్చాను. పంజగుట్టలో నా బాల్య స్నేహితుల ఇళ్లు ఉండేది. అక్కడకు వచ్చేవాడిని. అప్పుడు బిక్కు బిక్కు మనేలాంటి పరిస్థితి. అక్కడక్కడ విసిరేసినట్టుగా జనం కన్పించేవారు. మడతలో కూర్చొని ప్రయాణించే రిక్షాలు రవాణా సాధనాలు. అప్పుడు లక్డీకాపూల్ చిన్న సెంటర్లా ఉండేది. తర్వాత ఖైరతాబాద్ ఉన్నట్టు లేనట్టు కన్పించేది. ఖైరతాబాద్‌కు ఎడమవైపు పెద్ద పెద్ద గుట్టలు దర్శనమిచ్చేవి. పంజగుట్ట ఎత్తు భాగంలోని ప్రస్తుత శ్రీనగర్ కాలనీ రోడ్డులో మా మిత్రుని ఇల్లు చివరగా ఉండేది. ఆ తర్వాత ఎటు చూసినా ఖాళీ ప్రదేశమే. అమీర్‌పేట, మైత్రీవనం, భరత్ నగర్ ఇవేమీ అప్పటికి లేవు. అక్కడక్కడ చిన్నచిన్న పల్లెలు మాత్రమే ఉండేవి. సాయంత్రం 4 దాటిందంటే నక్కల అరుపులు విపరీతంగా వినిపించేవి. కొత్తవాళ్లు జడుసుకునే వారు. ఇప్పటి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు లేవు. ఆ ప్రాంతమంతా కొండలే. పక్షుల కిలకిల రావాలు వినసొంపుగా వినిపించేవి. పిచ్చుకలు, గువ్వల సవ్వడులు ప్రతిధ్వనించేవి. 40 ఏళ్ల తర్వాత.. సుమారు 40 ఏళ్ల క్రితం మద్రాసు నుంచి అక్కినేని నాగేశ్వరరావు వచ్చి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో నిర్మించారు. అప్పటికి బంజారాహిల్స్‌కు కొంత రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఉదయం, సాయంత్రం విపరీతమైన చలి ఉండేది. పంజగుట్ట నుంచి ఇప్పటి బంజారాహిల్స్, అమీర్‌పేట, హుస్సేన్‌సాగర్ వైపు చూస్తే పచ్చని పొలాలతో చూడచక్కని నిర్మానుష్య ప్రాంతం. కార్లు ఎక్కడా కనిపించేవి కావు. దూరప్రాంతాలకు రిక్షాలే దిక్కు. వాటిలో దర్జాగా కాలుమీద కాలు వేసుకొని కూర్చొని ప్రయాణించే అమరిక ఉండేది. రిక్షాలు చాలా పొడవుగా ఉండేవి. పబ్లిక్‌గార్డెన్ ఒక ఆకు పచ్చని మహావనం. ఇప్పటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాలను తలపించే వాతావరణం హైదరాబాద్ సొంతం. చల్లటి, సుందర, ప్రశాంత నగరం మన హైదరాబాద్. ఎంత మధురంగా ఉండేదో వర్ణించలేను. ఆ వాతావరణాన్ని మళ్లీమళ్లీ ఆస్వాదిద్దామా! అన్నట్టు మనసు పులకించేది. ఆ చల్లటి వాతావరణం గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా మనసు పులకిస్తుంది. ఇప్పుడు ఆ పచ్చదనం పోయి జనం మహావృక్షంలా పెరిగిపోయారు. నగరం మెట్రో స్థాయికి చేరింది’. -
గుర్తుంచుకోండి
పార్టీల గుర్తులను ప్రకటించిన ఎన్నికల సంఘం సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తులను ప్రకటించిం ది. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలకు తమ గుర్తులు వర్తిస్తాయి. అభ్యర్థులను గుర్తిస్తూ సంబంధిత నాయకులు బి ఫారం అందజేయాల్సి ఉంటుంది. నామినేషన్ల గడువు ముగిసేలోగా గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు వాటిని అందజేయాల్సి ఉంటుంది. అన్ని ప్రాంతాలకు చెం దిన పార్టీలూ ఎన్నికల సంఘం వద్ద పేర్లు నమోదు చేసుకున్నాయి. వాటిలో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీ మ ప్రాంతాలకు చెందిన పార్టీలు కూడా ఉన్నాయి. ఇతరులకు (ఇండిపెండెంట్లకు) కేటాయించేందుకు ప్రకటించిన గుర్తుల్లో కాలిక్యులేటర్ నుంచి ఎయిర్ కండిషనర్ల వరకు... క్యారెట్ నుంచి క్యారమ్ బోర్డు దాకా ఉన్నాయి. మంచం, నెయిల్ కట్టర్ వంటివి సైతం ఉన్నాయి. ఇండిపెండెంట్ల కోసం బీరువా, ఎయిర్ కండిషనర్, గాలిబుడగ (బెలూన్) పండ్ల బుట్ట, బ్యాట్ వంటి 81 గుర్తులను ఇండిపెండెంట్లకు ఎన్నికల సంఘం కేటాయించింది. గుర్తు రిజర్వు కాకుండా రిజిస్టరైన పార్టీలు కొన్ని పార్టీలు రిజిస్టరైనప్పటికీ వాటికి గుర్తులు రిజర్వు కాలేదు. ఆలిండియా స్రీశక్తి పార్టీ, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ వంటి 71 పార్టీలు ఈ జాబితాలో ఉన్నాయి. -
నా మనసు విరిచేసింది!
జ్ఞాపకం మా అన్నయ్య అంటే నాకు మొదట్నుంచీ గౌరవంతో కూడిన భయం. దాంతో తనకు కాస్త దూరంగానే ఉండేవాడిని. కానీ మా చెల్లి విషయంలో అలా కాదు. ఇద్దరం మంచి స్నేహితులం. తనంటే నాకెంత ప్రేమంటే, నా పాకెట్ మనీ కూడా దాచి తనకిచ్చేసేవాడిని. దాంతో చుట్టుపక్కల వాళ్లు... ‘‘మీ పిల్లల్ని చూస్తే ముచ్చటేస్తుందండీ. మా అమ్మాయి, అబ్బాయి ఎప్పుడు చూసినా తగాదా పడుతుంటారు’’ అని అమ్మానాన్నలతో అంటుండేవారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! మనుషులెప్పుడూ ఒకేలా ఉండరు. అందుకేనేమో, నా చెల్లి కూడా మారింది. ఓ అబ్బాయిని ప్రేమించి మాకు మాట మాత్రమైనా చెప్పకుండా పెళ్లి చేసేసుకుంది. తన జీవితంలోకి కొత్తగా వచ్చిన వ్యక్తి కోసం అందరినీ, చివరికి నన్ను కూడా వదిలి వెళ్లిపోయింది. మనసు రాయి చేసుకున్నాను. తన ఇష్ట ప్రకారమే ఉండనీలే అనుకున్నాను. కానీ చెల్లి పెళ్లి చేసుకున్న వ్యక్తి పరమ నీఛుడు. చెడు అలవాట్లకు బానిస. నా చెల్లెల్ని చిత్ర హింసలు పెడుతున్నాడని తెలిసి తట్టుకోలేకపోయాను. ఫోన్ చేసి చెడా మడా తిట్టాను. నా చెల్లి కంట నీరు వస్తే ఊరుకోనని హెచ్చరించాను. ఇంకే సమస్యా ఉండదనుకున్నాను. కానీ ఒక గంట తరువాత నా చెల్లెలు ఫోన్ చేసింది. ‘‘నీ పనేదో నువ్వు చూసుకో. మా కాపురంలో నీ జోక్యం ఏమిటి? ఎంతలో ఉండాలో అంతలో ఉండు’’ అంటూ ఏవేవో అనేసింది. నా తల గిర్రున తిరిగింది. అనుబంధాలు, ఆత్మీయత అంతా బూటకం అని ఓ కవి అన్న మాట గుర్తొచ్చింది. వెంటనే ఫోన్ పెట్టేశాను. ఇప్పటికీ అది గుర్తొస్తే గుండెల్లో కలుక్కుమంటుంది. తను విరిచేసిన మనసు అతుక్కోనంటోంది. - కేఎన్, ఆదిలాబాద్ -
ఆ చూపు మర్చిపోలేను!
జ్ఞాపకం అమ్మాయిల గురించి కామెంట్ చేయడం అంటే నాకు భలే సరదా! అమ్మాయి కనిపిస్తే చాలు... వాళ్లు నొచ్చుకునేలా ఏదో ఒక కామెంట్ చేసేవాడిని. ఇది మంచి పద్ధతి కాదని ఒక్కరిద్దరు చెప్పినా ‘కొందరు యువకులు పుట్టుకతో వృద్ధులు’ అని పాడుతూ వారిని చాదస్తపుగాళ్లు, ఎంజాయ్ చేయడం రానివాళ్లంటూ వెక్కిరించేవాణ్ని. ఒకరోజు ఒక అమ్మాయి మా కాలేజీలో చేరడానికి వచ్చింది. నేను ఆమెను టీజ్ చేస్తుంటే... నా పక్కన ఉన్నవాళ్లు నవ్వడం ప్రారంభించారు. అవమానంతో ఆ అమ్మాయి ముఖం ఎర్రబారింది. కళ్లనిండా నీళ్లతో అక్కడి నుంచి విసవిసా వెళ్లిపోయింది. పది నిమిషాల తరువాత వాళ్ల అన్నయ్యను తీసుకొచ్చి ‘వీడే నన్ను కామెంట్ చేసింది’ అని చూపించింది. వాళ్ల అన్నయ్య చాలా సన్నగా ఉన్నాడు. దీంతో నేను మరింత రెచ్చిపోయాను. ‘మైక్ టైసన్ మీ అన్నయ్య అని ఒకమాట చెబితే నేను అలా చేసేవాడినా? మీ అన్నయ్య సిక్స్‌ప్యాక్ బాడీ చూస్తే చెమటలు పడుతున్నాయి’ అంటూ ఓవర్ యాక్షన్ చేయడం ప్రారంభించాను. ‘అలా మాట్లాడడం తప్పు తమ్ముడూ’ అన్నాడా అన్నయ్య శాంతంగా. ‘పోవోయ్’ అన్నాను నేను. నా తీరు అర్థమై పాపం ఆ అన్నాచెల్లెళ్లిద్దరూ మౌనంగా నిష్ర్కమించారు. ఇది జరిగిన రెండు నెలల తరువాత ఓరోజు... మా వదినకు ఒంట్లో బాలేకపోతే, తనని తీసుకుని బైక్ మీద హాస్పిటల్‌కి బయలుదేరాను. ఒకచోట వర్షపు నీళ్లు, గుంతలు ఉండడంతో బైక్ స్లో చేశాను. అక్కడే కొందరు కుర్రాళ్లు ఉన్నారు. వాళ్లు మా వదిన్ని కామెంట్ చేయడం మొదలెట్టారు. పాపం మా వదిన సిగ్గుతో తల దించు కుంది. అది చూసి నా రక్తం మరిగి పోయింది. వెళ్లి అడగా లనుకున్నాను. కానీ వాళ్లు ఏడెనిమిది మంది ఉన్నారు. అందరూ కలిసి చావబాదుతారేమోనని భయమేసి వాళ్ల కామెంట్స్ విననట్టే నటించాను. ఇదా నువ్వు చేసేది అన్నట్టుగా అప్పుడు మా వదిన నా వైపు చూసిన చూపు నేనిప్పటికీ మర్చిపోలేను. ఆరోజు కాలేజీలో ఆ అన్నయ్య బలం నా బలం ముందు దిగదుడుపు అనే గర్వంతో విర్రవీగాను. ఇప్పుడా బలం ఏమైంది? అంతకంటే పెద్ద బలం ముందు తోక ముడిచింది! ఆ దెబ్బకి నా పొగరు అణిగి పోయింది. ఆ తర్వాత మళ్లీ ఏ అమ్మాయినీ కామెంట్ చేయలేదు నేను. - వీఆర్సీ, చిత్తూరు -
జీవితాన్ని మార్చిన పాఠం!
జ్ఞాపకం ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనే మాటను నా చిన్నప్పటి నుంచీ వింటున్నాను. అయితే ఆ వాక్యాన్ని నేను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. బాల్యంలో ‘తెలియని తనం’ వల్ల కావచ్చు, యవ్వనంలో ‘పురుషాహంకారం’ వల్ల కావచ్చు. కారణం ఏదైతేనేం... మగవాడినన్న అహం నాలో ఒక పాలు ఎక్కువగానే ఉండేది. ఆ అహం ఎంత చెడ్డదో తర్వాత నాకు అర్థమైంది. అయిదు సంవత్సరాల క్రితం... నాకు పెళ్లయింది... సునందతో. బాగా చదువుకున్న అమ్మాయి. చక్కని ఉద్యోగం చేస్తోంది. అందంగా ఉంటుంది. అన్ని రకాలుగానూ నాకు తగిన జోడీ. అందుకే చూడగానే ఓకే అన్నాను. ఆనందంగా తన మెడలో తాళి కట్టాను. ఓ నెలరోజుల పాటు తనే నా లోకం. మా ఇంట్లో కొన్ని రోజులు, వాళ్లింట్లో కొన్ని రోజులు, హనీ మూన్‌లో కొన్ని రోజులు... అంతా ఆనందంగా గడిచిపోయింది. అంతలో లీవు అయిపోయింది. ఉద్యోగంలో చేరే రోజు వచ్చింది. ఆ రోజు నేను ఆఫీసుకు బయలు దేరుతుంటే సునంద అంది... ‘‘నేనూ ఇవాళ్టి నుంచి ఆఫీసుకు వెళ్లిపోతానండీ.’’ ఆ మాట సూటిగా నా అహం మీద దెబ్బకొట్టింది. మనసులో చిన్న అలజడి. ‘‘ఇంకా ఉద్యోగం ఎందుకు? మానెయ్’’ అన్నాను. ‘‘ఉద్యోగం చేస్తే తప్పేమిటి?’’ అందామె అమాయకంగా. ‘‘తప్పు కాదు... తప్పున్నర. నువ్వు ఉద్యోగం చేస్తున్నావని తెలిస్తే నా ఫ్రెండ్స సర్కిల్లో నా పరువు పోతుంది. అయినా ఉద్యోగం చేయాల్సిన ఖర్మ నీకేమిటి? మనకేం తక్కువని?’’... అలుపు లేకుండా గడగడా అనేశాను. ఆమె ముఖం చిన్నబోయింది. ‘‘తక్కువయ్యి కాదుగా ఉద్యోగం చేసేది’’ అంది తడబడుతూ. నా అహం మరోసారి అరిచి గోల చేసింది. ‘‘మా ఇళ్లల్లో ఆడవాళ్లెవరూ ఉద్యోగం చేయరు. అందుకే నువ్వూ చేయకూడదు. ఇక ఆ విషయం వదిలెయ్’’ అనేసి మరో మాటకి చాన్స ఇవ్వకుండా వెళ్లిపోయాను. బహుశా ఆ రోజు తన కళ్లలో నీళ్లు చిప్పిల్లి ఉండవచ్చు. కానీ అది తెలుసు కోవడానికి నేను వెనక్కి తిరిగి తనవైపు చూడలేదు. ఆరోజే కాదు... ఏ రోజూ నేను తనని నాతో సమానంగా చూడ లేదు. నా రెక్కల వెనుక ఉండి జీవించ డమే నీకున్న ఏకైక హక్కు అన్నట్టుగా ప్రవర్తించాను. కానీ నా అహం విరిగి ముక్కలై, నా కళ్లు నేల మీదికి వచ్చే రోజు రానే వచ్చింది. ఓరోజు మేడ మెట్లు దిగుతూ కాలు జారి పడ్డాను. వెన్నుపూస విరిగింది. చక్రాల కుర్చీకే జీవితం అంకితమైంది. చేతకాని వాడిలా, చేవలేని వాడిలా మిగిలిపోయాను. అమ్మానాన్నలు వయసుడిగినవాళ్లు. ఏమీ చేయలేరు. నా వైద్యం కోసం అందినకాడల్లా అప్పుడు చేశారు. అది కాస్తా తడిసి మోపెడయ్యింది. నేను వాటిని తీర్చడం కాదు కదా, వాళ్లకి, నా భార్యకి పట్టెడు మెతుకులు కూడా పెట్టలేని పరిస్థితి. నాలో నేనే కుమిలి పోయాను. ఆ సమయం లోనే నా భార్య నా దగ్గరకు వచ్చింది. ‘‘ఏమండీ... మీకు అభ్యంతరం లేకపోతే నేను ఉద్యోగం చేస్తాను’’ అంది. ఏం సమాధానం చెప్పను! తన చేతులు పట్టుకుని ఏడ్చేశాను. నా అహం కరిగి కన్నీటితో పాటు జారిపోయింది. ‘ఇందులో మీరు తక్కువగా ఫీలవ్వాల్సిందేం లేదండీ. మీరు బాగున్నప్పుడు నన్ను చూసుకున్నారు. నేను బాగున్నప్పుడు మిమ్మల్ని చూసుకుంటాను. నేను మీలో సగమే కదా’ అంది తను. అవును. తను నాలో సగమే. కానీ అలా నేను ఎప్పుడూ ఆలోచించలేదే. నేను ఎక్కువ, తను తక్కువ... నాతోడిదే తన బతుకు అనుకున్నాను. కానీ ఆ రోజు తన తోడు లేకుండా నాకు బతుకే లేదని తెలుసుకున్నాను. అహాన్ని వీడి నేడు ఆమె నీడలో హాయిగా జీవిస్తున్నాను. - ఆర్.వి.సాగర్, విజయనగరం -
ప్రేమ ఓడింది... నేను గెలిచాను!
జ్ఞాపకం ప్రేమే జీవితమనుకుంది. ఆ ప్రేమలోనే ఓడిపోయింది. తర్వాత ఏం జరిగింది? ప్రేమ గుడ్డిది అంటారు అందరూ. అది నిజమో కాదో నాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు. ప్రేమ గెలిపించగలదు. ఓడించగలదు. వెనక్కి లాగగలదు. ముందుకు నడిపించనూ గలదు.మా నాన్న ఒకప్పుడు పెద్ద కాంట్రాక్టరు. బోలెడంత సంపాదన. కానీ కాసింతయినా తీరిక ఉండేది కాదు. దానివల్ల ఆయనకు మనుషులను, వారి మనస్తత్వాలను అంచనా వేసే అవకాశం చిక్కేది కాదు. ఉరుకులు పరుగుల్లో పడి క్షణాల్లో నిర్ణయాలు తీసేసుకునేవారు. అందరినీ నమ్మేస్తుండేవారు. దాంతో నమ్మకస్తులు అనుకున్న దగ్గరవాళ్లే దారుణంగా మోసం చేశారు. సర్వ సంపదలూ పోగొట్టుకుని మా కుటుంబం వీధిన పడేలా చేశారు.నమ్మకద్రోహం కలిగించినంత వేదన మరేదీ కలిగించదు. జరిగిన మోసాన్ని, తన వల్ల తన కుటుంబానికి పట్టిన దుస్థితిని తలచు కుని నాన్న కుమిలి పోయారు. దాంతో ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. మనోవ్యాధి ఆయన్ని మంచం పట్టించింది. చివరికి ఆ వేదన ఆయన్ని ఈ లోకం నుంచే తీసుకెళ్లిపోయింది. ఒక్కసారిగా ఇన్ని కుదుపుల్ని మేం భరించలేకపోయాం. ఉన్నదంతా పోయింది. కొండంత అండ నాన్న కూడా కనుమరుగైపోయారు. ఇక మా పరిస్థితి ఏమిటి? నలుగురం ఆడపిల్లలం. నేనే పెద్దదాన్ని. అందరికీ ధైర్యం చెప్పాల్సిన బాధ్యత నామీదే ఉంది. కానీ నేనా పని చేయలేకపోయాను. ఎందుకంటే నన్ను మరో దెబ్బ బలంగా తాకింది. నాన్న ఆర్థికంగా బాగున్నప్పుడు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఒక స్నేహితుడు మా ఇంటికొచ్చారు. ‘నీ కూతురును నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తావా’ అని అడిగారు. నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని నమ్మబలికారు. నేనే తన ఇంటి కోడలిని అని నాన్న దగ్గర మాట తీసుకుని మరీ వెళ్లారు. ఆయన కొడుకు కూడా నన్ను చాలా ఇష్టపడ్డాడు. తరచుగా నాతో మాట్లాడేవాడు. మెల్లగా ఇద్దరి మనసులూ కలిశాయి. మనువుకు సిద్ధమయ్యాయి. కానీ అనుకున్నట్టుగా మా పెళ్లి జరగలేదు. మా పరిస్థితి తారుమారవ్వగానే చాలామంది మాకు దూరమైపోయారు. సంపద ఉన్నప్పుడు చుట్టూ చేరినవాళ్లు, సంపద పోయాక చుట్టుపక్కల కనిపించ డమే మానేశారు. వాళ్లలో నాన్న స్నేహి తుడూ ఉన్నాడు. దురదృష్టం ఏమిటంటే... ఆయన కొడుకు కూడా ఉన్నాడు. ‘నువ్వు లేకపోతే నేను లేను, నీతోనే నా జీవితం’ అంటూ అంతవరకూ మాటల మత్తు చల్లినవాడు... తన తండ్రి బోధకు తలొగ్గి మాట మార్చేశాడు. ‘నీ కోసం ఏమైనా చేస్తాను’ అన్నవాడు... ‘మా నాన్న ఒప్పు కోవడం లేదు, ఏం చేయమంటావ్’ అంటూ అమాయకంగా ముఖం పెట్టాడు. మెల్లగా మాటలు తగ్గించాడు. చివరికి తండ్రి చూపించిన లక్షాధికారి కూతురి మెడలో సంతోషంగా తాళి కట్టేశాడు. అతడు చేసిన మోసం నన్ను నిలువునా కుదిపేసింది. తను ఎవరికో తాళికట్టాడన్న బాధతో నా మెడలో ఉరి తాడు వేసుకోవాలనుకున్నాను. కానీ చివరి క్షణంలో అమ్మ వచ్చి నన్ను ఆపింది. అలా చేసినందుకు తను నన్ను కోప్పడలేదు. నా ఆవేదన చూసి కంటతడి పెట్టలేదు. ఒక్కటే మాట అంది. ‘‘అతను కాదన్నాడని చచ్చిపోవాలనుకున్నావా? నువ్వు ఆత్మహత్య చేసుకునేంత గొప్ప ప్రేమికుడా తను?’’ చెంప మీద కొట్టినట్లయ్యింది. దెబ్బకు దెయ్యం దిగినట్టనిపించింది. నిజమే. అతనో స్వార్థపరుడు. వాడి కోసం నా నిండు జీవితాన్ని బలి చేసుకోవాలా? నన్ను కాదని వెళ్లిపోయినవాడి కోసం... నేను కావాలనుకునే నా కుటుంబాన్ని వదిలేసి పోవాలా? చాలా ఆలోచించాను. కళ్లు తెరిచాను. జీవితంలో ప్రేమ, పెళ్లి ఒక భాగం తప్ప అవే జీవితం కాదన్న వాస్త వాన్ని గ్రహించాను. జీవితంలో స్థిర పడ్డాను. మా అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. చెల్లెళ్లను చదివిస్తు న్నాను. ప్రేమలో ఓడిపోయినా... జీవితంలో గెలిచాను. నాలా తొందరపడి ప్రాణాలు తీసుకోవాలనుకునేవారి కోసం ఈ రోజు నా జీవితాన్నిలా పరిచాను. - స్నేహ, డోర్నకల్, వరంగల్ జిల్లా -
చింపాంజీలూ సీన్లు గుర్తుపెట్టుకుంటాయి!
చింపాంజీలు మానవులతో దగ్గరి పోలికలు కలిగి ఉండటమే కాదు మనుషుల్లాగే సామర్థ్యం కలిగి ఉంటాయని అనేక పరిశోధనల్లో ఇప్పటికే రుజువైంది. తాజాగా వాటి సామర్థ్యంపై మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. చింపాంజీలు, బొనొబోలు మనుషుల్లాగే ప్రతి సీన్ ను సీక్వెన్స్ లో గుర్తుంచుకోలేకపోయినా... సినిమాల్లోని వివిధ సన్నివేశాలను బాగా గుర్తు పెట్టుకోగలుగుతాయని జపాన్ పరిశోధకులు చెప్తున్నారు. ఐ ట్రాకింగ్ టెక్నాలజీని వినియోగించి చింపాంజీలు ఏ విధంగా వీడియోలను వీక్షిస్తున్నాయో రికార్డ్ చేశారట. ఓ వీడియో క్లిప్పును 24 గంటల తర్వాత మరోసారి చూపించినప్పుడు... అవి రాబోయే సన్నివేశం ఏమిటో తెలిసినట్లుగా ప్రవర్తించడం గమనించామని జపాన్ లోని క్యోటో యూనివర్శిటీ వైల్డ్ లైఫ్ రీసెర్స్ విభాగం రచయిత ఫ్యుమిహిరో కానో చెప్పారు. అధ్యయనకారుల బృందం 'కింగ్ కాంగ్ అటాక్'', ''రివేంజ్ టు కింగ్ కాంగ్'' అనే రెండు షార్ట్ ఫిల్మ్ లను చింపాంజీలకు చూపించగా.. అంతకు ముందు చూడని సన్నివేశాలకంటే... సినిమాలో ఒకే రకమైన వాతావరణాన్నిపోలిఉన్న సన్నివేశాలు వచ్చినపుడు అవి గుర్తించాయట! ఒక సినిమాలోని కింగ్ కాంగ్ అటాక్ చేసిన సన్నివేశం చూపించి... ఇరవై గంటల తర్వాత మరోసారి ఆ సినిమా చూపించినప్పుడు మునుపటి సన్నివేశంలో కాంగ్ వచ్చేవైపు అవి ఆత్రుతగా దృష్టిని సారించడాన్ని అధ్యయనకారులు గమనించారు. ఒక్కసారి ఒక సన్నివేశాన్ని చూశాయంటే చాలు అవి ఇక మర్చిపోవని క్యోటో వర్శిటీ పరిశోధక బృందం సభ్యురాలు సంతోషి హిరాటా అంటున్నారు. ఈ సామర్థ్యం చింపాంజీలకు రాబోయే ప్రమాదం నివారించడానికి పలు పర్యావరణాల్లో నివసించడానికి ఉపయోగపడుతుందని అధ్యయనకారిణి హరిత అంటున్నారు. -
అమ్మ మనసు
జ్ఞాపకం పదవ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై, తిరుపతి శ్రీ వేంకటేశ్వరా జూనియర్ కాలేజీలో ఇంటర్లో చేరాను. ఒకరోజు అమ్మతో, ‘‘అమ్మా! ప్రతిరోజూ మనవూరి నుండి పదిమైళ్ల దూరం నడచి తిరుపతికి పోయి చదువుకొని రావాలంటే చాలా కష్టంగా ఉంది. నాతో చదివే పిల్లలంతా అక్కడే హాస్టల్లో చేరి చదువుకొంటు న్నారు. నన్ను కూడా హాస్టల్లో చేర్పించం డమ్మా! మనకు బియ్యం కార్డు కూడా ఉంది కాబట్టి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉచితంగా సీటు ఇస్తారు’ అని చెప్పాను. అమ్మ, నాన్న ఎలాగో కష్టపడి నాకు హాస్టల్లో సీటు సంపాదించారు. నేను హాస్టల్లో ఉంటూ వారానికి ఒకసారి మా వూరికి వెళ్లి వస్తూండేవాణ్ని. మా పల్లెలో ఓ టూరింగు టాకీస్ ఉండేది. ఆదివారం ఊరెళ్లగానే స్నేహితులతో కలసి సినిమాకి వెళ్లేవాడిని. సోమవారం ఉదయం కాలేజీకి వెళ్లిపోయేవాణ్ని. నాన్నకది నచ్చేది కాదు. ‘‘వారానికి ఒక్కసారి వస్తావు. ఓ నిముషం కూడా ఇంట్లో ఉండకుండా, స్నేహితులతో సినిమాలకెళ్తావు. ఇక్కడే ఇలా ఉంటే, తిరుపతిలో ఎలా ఉంటున్నావో’’ అన్నాడు ఓరోజు. దాంతో నేను అలిగి ‘‘ఇక నేను వారం వారం రాను, నెలకో సారి వస్తాను’’ అని చెప్పి వెళ్లిపోయాను. మరుసటి ఆదివారం నేను ఇంటికి రాకపోయేసరికి సోమవారం ఉదయాన్నే అమ్మ నన్ను కలవడానికి తిరుపతికి బయలుదేరింది. ఎలాగో కాలేజీ కను క్కుని, కాలేజీ గేటు దగ్గరకు చేరి వచ్చే పోయే పిల్లలందర్నీ నా గురించి అడు గుతూ ప్రాధేయపడుతోంది. మీ పిల్లోడు ఏం చదువుతున్నాడని అడిగితే చెప్పలే కుంది. ‘నా బిడ్డను చూడాలయ్యా’ అని ఏడుస్తోంది. ఉదయం పది గంటల్నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే అన్నం, నీళ్లు లేకుండా ఆక్రోశిస్తూ ఉంది. ఇంతలో మావూరి విద్యార్థి, నా మిత్రుడైన చంద్ర అమ్మను గుర్తుపట్టాడు. తనని తీసుకుని హాస్టల్కొచ్చాడు. నన్ను చూడగానే అమ్మ కళ్లు జలపాతాల య్యాయి. ‘‘నిను చూడకుండా ఈ అమ్మ ఎలా బతకాలిరా, నువ్వు నాతో రాకుంటే నేను వెళ్లను’’ అని భీష్మించి కూర్చుంది. నా తోటి విద్యార్థులంతా అమ్మ పడే వేదన చూసి చలించిపోయారు. నాకైతే కన్నీళ్లు ఆగలేదు. ఇక జన్మలో అమ్మా నాన్నల్ని బాధ పెట్టకూడదని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను! - ఆనంద్, మదనపల్లి