6 Things to Keep in Mind While Doing Online Shopping, Amaozn, Flipkart, 2020, in Telugu - Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ షాపింగ్‌: ఈ జాగ్రత్తలు తీసుకోండి

Published Wed, Oct 14 2020 10:14 AM | Last Updated on Thu, Oct 15 2020 12:27 PM

Things to Remember During Online Shopping - Sakshi

ప్రస్తుతం ఆన్‌లైన్‌ షాపింగ్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. వాటి వ్యాపార వ్యవధి 2016తో పోల్చితే 81 శాతం అభివృద్ధి చెందింది. అందరూ ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండానే వేల సంఖ్యలో ఉత్పత్తులు, రకరకాల డిజైలు అందుబాటులోకి తీసుకురాడంతో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా డిస్కౌంట్‌ ఆఫర్స్‌, రిటర్న్‌ పాలసీలు అంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇకపోతే ఇంకొరెండు మూడు రోజుల్లో ఈ కామర్స్‌ సైట్స్‌ భారీ ఆఫర్స్‌తో బిగ్‌బిలియన్‌ డేస్‌ ఇలా ప్రత్యేకమైన ఆఫర్లను అందించనున్నాయి. అయితే షాపింగ్‌ చేసే వారు ఈ జాగ్రత్తలు పాటించండి.

ఎల్లప్పుడూ ప్రొడక్ట్‌ వివరాలు పూర్తిగా పరిశీలించండి:
మనలో చాలా మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేటప్పుడు కేవలం అక్కడ చూపించిన ఇమేజ్‌ ఆధారంగా దానిని కొనాలని నిర్ణయించుకుంటారు. అంతేకానీ వారికి ప్రొడక్ట్‌ గురించి కింద తెలిపిన వివరాలను చదివే ఓపిక ఉండదు. అలా కాకుండా షాపింగ్‌ చేసేటప్పుడు  ఆ ఉత్పత్తి పూర్తి వివరాలు చదవాలి. అంతేకాకుండా ఆ ప్రొడక్ట్‌ను అంతకముందే కొన్ని వారి రివ్యూలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆ ఉత్పత్తి రేటింగ్‌ ఇలా అన్ని పరిశీలించిన తరువాతే దానిని ఆర్డర్‌ పెట్టుకోవాలి. 

షిప్పింగ్‌ కాస్ట్‌ చూడండి: 
చాలా కంపెనీలు షిప్పింగ్‌ కాస్ట్‌ వివరాలను ప్రొడక్ట్‌ దగ్గరే వివరిస్తాయి. ఎప్పుడు ఆర్డర్‌ మన వద్దకు చేరుతుంది అనే డిటైల్స్‌ అన్ని ఉంటాయి. అయితే రూల్స్‌ ప్రకారం ఆర్డర్‌ చేసిన 30 రోజుల్లోపు ఉత్పత్తిని వినియోగదారుడికి అందించాలి. కొన్ని ప్రొడక్ట్‌లపై ఫ్రీ డెలివరీ ఆఫర్లు ఉంటాయి. ఇంకొన్ని  కంపెనీలు బల్క్‌లో కొంటేనే ఫ్రీ షిప్పింగ్‌ను అందిస్తాయి. కాబట్టి షాపింగ్‌ చేసేటప్పుడు ఆ వివరాలు అన్నింటిని పరిగణలోకి తీసుకోవాలి. 
   
మీరు కొనే ఉత్పత్తుల ధరలను వేరే చోట కూడా పరిశీలించుకోండి: 
డిస్కౌంట్‌ లభిస్తోంది అనగానే కేవలం ఆ సైట్‌లో మాత్రమే కాకుండా వేరే ఆన్‌లైన్‌ స్టోర్‌లో కూడా వాటి ధరలు, ప్రొడక్ట్‌ డిటైల్స్‌ను సరిపోల్చకోండి. ప్రస్తుతం ఆన్‌లైన్‌ రిటైల్‌స్టోర్‌లు అనేకం అందుబాటులోకి వచ్చాయి కాబట్టి మీరు తేలికగానే వాటి ధరలను, నాణ్యతను చెక్‌ చేసుకోవచ్చు. డిస్కౌంట్‌ ఇస్తున్నారు అంటే నాణ్యత లేని వస్తువులను అందించడం కాదు మన్నికైన వస్తువులనే వినియోగదారుడికి తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడం. మీ విలువైన డబ్బుతో నాణ్యత లేని వస్తువులను కొనుగోలు చేయకండి. [ చదవండి : మీ లవర్ మీ మొబైల్ వాట్సాప్ చెక్ చేస్తున్నారా? ఈ ట్రిక్ తో సేఫ్ గా ఉండండి ]

రివ్యూలను చదవండి: 
మీరు కొనాలనుకున్న ప్రొడక్ట్ అంతకముందే కొన్నవారు దాని గురించి వారి అభిప్రాయాలను రివ్యూలలో తెలియజేస్తారు. వాటిలో కొన్ని రివ్యూలు నిజాయితీగా ఉండి మీరు ఆ వస్తువును కొనాలో వద్దో నిర్ణయించుకోవడానికి దోహదపడతాయి. కాబట్టి ఇక నుంచి ఏదైనా  వస్తువును ఆన్‌లైన్‌లో కొనాలనుకున్నప్పుడు వాటి రివ్యూలను తప్పకుండా చదివిన తరువాతే మీ ఆర్డర్‌ను ప్లేస్‌ చేయండి. 

మీ హక్కులను తెలుసుకోండి: 
ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేటప్పుడు చాలా ఉత్పత్తులపై రిటర్న్‌ పాలసీ ఉంటుంది. అయితే కొన్ని వస్తువులకు మాత్రమే ప్యాక్‌ ఓపెన్‌ చేస్తే రిటర్న్‌ ఉండదు అని ఉంటుంది. కాబట్టి వినియోగదారుడు వస్తువుకొనేటప్పుడే రిటర్న్‌ వివరాలను పరిశీలించి కొనండి. 

స్కామ్‌, ఫ్రాడ్‌ల నుంచి అప్రమత్తంగా ఉండండి:     
ప్రస్తుత కాలంలో సైబర్‌నేరాలకు అంతులేకుండా పోతుంది. నేరగాళ్లు వివిధ మార్గాలలో ఫ్రాడ్‌లకు పాల్పడుతున్నారు. అందుకే ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేటప్పుడు అది జెన్యూన్‌సైట్‌ అవునో కాదో ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలి. ఎక్కువ డిస్కౌంట్‌ ఇస్తున్నారు కదా అని ఆ సైట్‌ నమ్మదగినదో లేదో తెలుసుకోకుండా ఆర్డర్‌ పెట్టి మీ డబ్బును పోగొట్టుకోకండి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement