things
-
సౌండ్ దెబ్బకు గాల్లోకి లేవాల్సిందే
తెలుగు సినిమాల్లో హీరో కొడితే విలన్ గాల్లోకి అంతెత్తున ఎగిరిపడతాడు. వాస్తప ప్రపంచంలో అలాంటివి అసాధ్యం. అయినాసరే కొందరు అభిమానులు ఆ సీన్లను కళ్లప్పగించి చూస్తారు. మనిషిని గాల్లోకి ఎగరేసేంత అపార శక్తి మరో మనిషికి లేదుగానీ వస్తువులను గాల్లోనే నిలిపే శక్తి అతిధ్వని తరంగాలకు ఉందని తాజాగా ధ్వనిశాస్త్రవేత్తలు నిరూపించి చూపారు. తొలి దశలో చిన్నపాటి వస్తువులను, నీటి బిందువులను గాల్లో అలాగే ఒక స్థానంలో నిలబెట్టగలమని ప్రయోగపూర్వకంగా ప్రదర్శించి చూపారు. భవిష్యత్తులో ఇంకాస్త బరువైన వస్తువులనూ గాల్లో యథాస్థానంలో ఉంచడమేకాదు కావాల్సిన దిశలో కదిలించగలమని చెబుతున్నారు. గాల్లో ఎలా సాధ్యం? శబ్ద పీడనంతో వస్తువులను గాల్లో కదిలించవచ్చని శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారుగానీ ప్రయోగపూర్వకంగా నిరూపించలేకపోయారు. ధ్వని తరంగాలు గాల్లో ప్రయాణించేటప్పుడు గాలి పీడనంలో మార్పులు తీసుకురాగలవు. ఈ కారణంగా ఆ ప్రాంతంలోని వస్తువుల అణువులను దగ్గరకు జరపడం, లేదంటే దూరం దూరంగా విడగొట్టడం సాధ్యం. ఏదైనా వస్తువు మీదుగా అతిధ్వని తరంగాలను ప్రయాణింపజేసినప్పుడు, లేదంటే వస్తువు వైపుగా అతిధ్వని తరంగాలను ప్రయోగించినప్పుడు భూమి గురుత్వాకర్షణ శక్తికి అభిముఖంగా దానిని యథాస్థానంలో అక్కడే గాల్లో నిలపవచ్చని తాజాగా నిరూపితమైంది. ఈ సందర్భంలో ఆ వస్తువు చూడ్డానికి గాల్లో ఈదుతున్నట్లుగా ఉంటుంది. గాల్లోనే ఉంటే మనకేం ఉపయోగం? ద్రవాల్లోని కలుషితాలను వేరేచేయాలన్నా, అసలు ఆ ద్రవం కలుషితం అయ్యిందో లేదో తెలియాలన్న పెద్దపెద్ద ల్యాబ్ పరీక్షలు చేయకుండా సులభంగా ఆ ద్రవం ప్రవహించే మార్గంలో అతిధ్వని తరంగాలను ప్రసరింపజేసి కలుషితకారక పదార్థ అణువులను పక్కకు జరిపి పూర్తి ద్రవాన్ని శుద్ధిచేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అతిసూక్షస్థాయి వస్తువుల్లో పాడైన, నకిలీ వస్తువులను వేరు చేసేందుకు అతిధ్వని తరంగాలు ఉపయోగపడతాయని ధ్వని శాస్త్రవేత్తలు చెప్పారు. త్వరలోనే పూర్తిస్తాయి పరీక్షలను పూర్తిచేసుకుని వాణిజ్యపర వినియోగం స్థాయికి తీసుకురావొచ్చని అకౌస్టోఫ్యాబ్ సంస్థ సహవ్యవస్థాపకులు శ్రీరామ్ సుబ్రమణియమ్, శుభీ భన్సాల్ చెప్పారు – సాక్షి, నేషనల్ డెస్క్ -
అనుకున్న పనులు జరగడం లేదా..?
ఒక్కోసారి ఎంత ప్రయాసపడ్డా తలపెట్టిన పనులు ఒక పట్టాన జరగవు. గ్రహాల సానుకూలత లేనప్పుడు కార్యసిద్ధి కలలో మాటలా అనిపిస్తుంది. ఉద్యోగ, వృత్తి, వ్యాపార వ్యవహారాల్లో పనులు మందగిస్తాయి. తరచు వైఫల్యాలు ఎదురవుతుంటాయి. కొన్ని తేలికపాటి పరిహారాలను పాటించడం ద్వారా ఈ దుష్ప్రభావాలను తొలగించుకోవచ్చు. 👉ఇంట్లో ఏళ్ల తరబడి వాడకుండా ఉన్న పాత వస్తువులను వదిలించుకోండి. 👉 వీలైనంత వరకు ఇంట్లో రోజూ ఒకేచోట కూర్చుని భోజనం చేయండి. మంచం మీద కూర్చుని భోంచేసే అలవాటు ఉంటే మానుకోండి. 👉 తల్లిదండ్రుల యోగక్షేమాలను పట్టించుకోండి. కొత్త పనులు తలపెట్టబోయే ముందు వారి ఆశీస్సులు తీసుకోండి. గురువులను, గురు సమానులను, సాధు సన్యాసులను ఆదరంగా చూడండి. వీలైతే వారికి భోజనం పెట్టడం, వస్త్రాలను కానుకగా ఇవ్వడం వంటివి చేసి వారి ఆశీస్సులు పోందండి. 👉బియ్యం, గోధుమలు, శనగలు, పాలతో తయారు చేసిన తీపి పదార్థాలను పిల్లలకు, యాచకులకు, వికలాంగులకు పంచిపెట్టండి. ముఖ్యంగా ఆది, గురు, శుక్రవారాల్లో ఇలా చేయడం మంచిది. 👉ఇంట్లో నిత్యపూజకు పసుపు రంగు పూలను ఉపయోగించండి. అలాగే, దేవాలయాలలో పసుపురంగు పూమాలలను సమర్పించండి.– సాంఖ్యాయన -
స్థానం మారిన పుస్తకం
‘ఎ మిస్ ప్లేస్డ్ బుక్ ఈజ్ ఎ లాస్ట్ బుక్‘ అన్నది ఆంగ్ల నానుడి. అలాగే ‘దయచేసి ఎక్కడ నుంచి తీసిన పుస్తకాలు అక్కడే పెట్టండి’ అన్న మాట కూడా గ్రంథాల యాలలో చూస్తుంటాం. అంటే ఏదైనా ఒక వస్తువు కానీ, పుస్తకం కానీ స్థానభ్రంశం చెందితే దానిని తిరిగి పట్టుకోవడం కష్టం అవుతుంది. పుస్తకాల విషయంలో అది మరీ కష్టం. అందుకే ఎక్కడ తీసిన పుస్తకాన్ని అక్కడ పెట్టడం అవసరమే కాదు, అనివార్యం కూడా.గ్రంథాలయాల్లో పుస్తకాల్ని ఒక క్రమంలో సర్దుతారు. ఫలానా పుస్తకం కావాలి అంటే ఫలానా అలమరలోని ఫలానా అరలో ఉంది అ నిర్వాహకులు ఉన్న చోటు నుండి కదలకుండా చెప్పగలరు. కానీ, ఆ పుస్తకాన్ని ఉన్న చోటు నుండి తీసి తిరిగి అక్కడ పెట్టక ΄ోతే చెప్పటం సాధ్యం కాదు. బద్ధకించి, మళ్ళీ అక్కడిదాకా వెళ్ళటం ఎందుకు అని తాము ఉన్న చోటనే ఎక్కడి నుండో తెచ్చిన పుస్తకం పెట్టేసేవాళ్ళు ఉన్నారు. మరి కొంత మంది తాము చదవటం పూర్తి కాలేదు, దానిని దాని స్థానంలో పెడితే ఎవరైనా తీసుకువెడితే వాళ్ళు తిరిగి ఇచ్చేదాకా ఎదురు చూడాలి, కనుక దాని చోటు మారిస్తే తానే తీసుకోవచ్చు అని జాగ్రత్తగా... గుర్తుగా పెట్టుకుంటారు. మళ్ళీ వచ్చే సమయానికి పెట్టిన చోటు మర్చి΄ోతారు. ఇంకొకరు ఎవరో ఇది ఇక్కడిది కాదు అని తీసి పక్కన పెడతారు. అంతే సంగతులు. మళ్ళీ ఎప్పుడో అన్నీ సద్దుతున్నప్పుడు మాత్రమే బయట పడుతుంది. ఇది ఒక్క పుస్తకాల విషయానికే కాదు, అన్ని విషయాలకీ వర్తిస్తుంది. ఇంట్లో ఏదైనా వస్తువుని అది ఉండే చోట కాక మరొకచోట పెడితే, ఎదురుగా ఉన్నా త్వరగా కనపడదు. ఇంకేదో వెతుకుతున్నప్పుడు కనపడుతుంది. అప్పుడు అది పనికి రావచ్చు, రాక ΄ోవచ్చు. అందుకే ఎక్కడ నుండి తీసిన వస్తువుని అక్కడ పెడితే వెతుక్కునే పని ఉండదు. కళ్ళు మూసుకుని అయినా దానిని తీయవచ్చు. దీనికి కారణం మనిషి ఒక వస్తువుని పరిసరాలు మొదలైన వాటిని కూడా జత చేసి గుర్తు పెట్టుకునేట్టు చేయటం మనసు లక్షణం. మనుషులనైనా మొదటి సారి ఎక్కడ చూశామో అక్కడ కనపడితే వెంటనే గుర్తిస్తాం. వాతావరణం, పరిసరాలు మారితే గుర్తు పట్టటం కష్టమే. ఇక్కడ ఉంటారు అని అనుకోలేదు అంటూ సర్ది చెప్పే ప్రయత్నాలు దీనికి చిహ్నం. ఇల్లు అందంగా, వెసులుబాటుగా ఉండటానికి ఒక సూత్రం ΄ాటించాలని ΄ాశ్చాత్యులు గట్టిగానే చె΄్పారు. ‘‘ప్రతి వస్తువు దాని చోట ఉండటం, ప్రతి వస్తువుకి ఒక చోటు ఉండటం.’’ వేలం వెఱి<గా వస్తువులని సేకరించితే ఎక్కడ పెట్టాలో తెలియక చిందరవందరగా పడేస్తూ ఉంటారు. వస్తువుది, ఇంటిది కూడా అందం, విలువ తగ్గి΄ోతాయి. పెట్టటానికి తగిన చోటు లేనప్పుడు తెచ్చి వాటి విలువని తగ్గించ కూడదు. ఎక్కడి వస్తువులను అక్కడ పెట్టటం గొప్ప సౌలభ్యమే కాదు వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. దీనికి గొప్ప ఉదాహరణ హనుమ. సంజీవని పర్వతాన్ని తెచ్చి, దానితో పని పూర్తి అయిన పిమ్మట ఎక్కడి నుండి తీసుకువచ్చాడో తిరిగి అక్కడ భద్రంగా పెట్టి వచ్చాడు. అందువల్ల రెండవమారు తేవటానికి వెళ్ళినప్పుడు అది ఉండే ప్రదేశం తెలుసు కనుక వెంటనే తేగలిగాడు. మొదటిసారి పని అయింది కదా అని ఎక్కడో అక్కడ పెట్టి ఉంటే వెతకటానికి ఎంతో సమయం వెచ్చించవలసి వచ్చేది. వ్యక్తిత్వ వికాసానికి ఇది కూడా పెం΄÷ందించుకోవాల్సిన ఒక లక్షణం. వస్తువుల విషయం మాత్రమే కాదు. ప్రేమాభిమానాలు, నమ్మకం, విశ్వసనీయత మొదలైన మనోభావాలని కూడా అస్థాన పతితం చేయకూడదు. కఠిన మైన మనస్సు కలవారి మీద ప్రేమాభిమానాలు పెంచుకుంటే, తరువాతి కాలంలో ఎవరినైనా ప్రేమగా చూడగలగటం కష్టమే. ప్రేమరాహిత్యంలో బతికే వారి విషయంలో ఇటువంటిదే జరిగి ఉండవచ్చు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
మీడియాటెక్‌తో జియోథింగ్స్ జట్టు
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల సంస్థ మీడియాటెక్, జియో ప్లాట్‌ఫామ్స్ అనుబంధ సంస్థ జియోథింగ్స్ జట్టు కట్టాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించాయి. ఇది టూవీలర్ల మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్మార్ట్ డిజిటల్ క్లస్టర్, స్మార్ట్ మాడ్యూల్స్‌ను అందిస్తుంది.ఈ విభాగంలో తమ కార్యకలాపాలను బలోపేతం చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి.రియల్ టైమ్ డేటా అనలిటిక్స్, స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ మొదలైన వాటికి స్మార్ట్ డిజిటల్ క్లస్టర్ ఉపయోగపడుగుతుంది. జియో వాయిస్ అసిస్టెంట్, జియోసావన్ మొదలైన సర్వీసులు ఉండే జియో ఆటోమోటివ్ యాప్ సూట్‌కి ఈ ప్లాట్‌ఫాం ద్వారా యాక్సెస్ లభిస్తుంది. -
రైల్లో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలో తెలుసా?
సాధారణంగా రైలు ప్రయాణాల్లో ఒక్కొసారి విలువైన వస్తువులు పొరపాటున మర్చిపోతుంటాం. చాలామంది వాటిని తిరిగి పొందేందుకు(క్లైయిమ్ చేసుకునేందుకు) ప్రయత్నించారు. ఆ ఇంకెక్కడుంటుంది. ఈపాటికి ఎవరో ఒకళ్లు పట్టుకుపోయి ఉంటారులే అనుకుంటారు. ఓ మూడు, నాలుగురోజులు అబ్బా..! అలా ఎలా వదిలేశాను? అని తెగ బాధపపడిపోతూ.. మర్చిపోయే యత్నం చేస్తారు. చాలామటుకు అందరూ ఇలానే చేస్తారు. అలా బాధపడనక్కర్లేకుండా ఆ వస్తువులను ఎలా తిరిగి సంపాదించుకోవాలి? వాటిని రైల్వే అధికారులు, సిబ్బంది ఏం చేస్తారు తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!. రైలులో ఎవ్వరైనా ఏదైన విలువైన వస్తువు మర్చిపోతే బాధపడుతూ కూర్చొనవసరం లేదు. పైగా ఇక దొరకదనుకుని డిసైడ్ అయ్యే పోనక్కర్లేదు. ఏం చేయాలంటే?..మనం వస్తువుని రైల్లో మరచిన వెంటనే చేయాల్సింది.. మన టిక్కెట్‌ని జాగ్రత్త చేయాలి. ఇప్పుడూ మొబైల్ ఫోన్‌కి టికెట్ వచ్చినట్లు మెసేజ్ వస్తుంది కాబట్టి దాన్ని డిలీట్ చేయకూడదు. ఆ తర్వాత మనకు సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్‌కి వెళ్లి అక్కడ అధికారులకు తెలియజేయాలి. వారు విచారించి మీరు ప్రయోణించిన ట్రైయిన్ తాలుకా లిస్ట్ తీసి.. ఆ రైలు లాస్ట్ స్టేషన్ వద్ద సిబ్బంది కలెక్ట్ చేసిని వస్తువుల సమాచారం లిస్ట్‌ని తీయడం జరుగుతుంది. ఆయా వ్యక్తులు పలానా ట్రెయిన్లో తాము ఈ వస్తువు మర్చిపోయామని పూర్తి వివరాలను తెలియజేస్తే..ఆ జాబితాలో ఉందా లేదా అనేది నిర్థారిస్తారు అధికారులు. ఆ తర్వాత సదరు వ్యక్తి కోల్పోయిన వస్తువు వివరాలు, ప్రయాణించిన ట్రైయిన టిక్కెట్ ఆధారంతో అతడి వస్తువని నిర్థారించుకుంటారు. ఆ తర్వాత రైల్వే అధికారులు అతడు పొగొట్టుకున్న వస్తువులను అందచేయడం జరుగుతుంది. అలాగే ఇలా రైలులో యాత్రికులు మర్చిపోయిన వస్తువులను రైల్వే సిబ్బంది కలెక్ట్ చేసి రైల్వే మాస్టర్‌కి అందజేస్తారు. ఆ తర్వాత ప్రయాణికులెవరైనా.. వచ్చి కలెక్ట్ చేసుకోవాడానికి వస్తారేమో!.. అని కొన్ని రోజులు వేచి చూస్తారు. రానీ పక్షంలో వాటిని వేలం ద్వారా విక్రయించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే రైల్వే అధికారిక మార్గదర్శకాలను తెలుసుకుంటే సరిపోతుంది. అది ఐఆర్సీటీసీ సైట్లో లేదా రైల్వేస్టేషన్ అడిగి సవివరంగా తెలుసుకోవచ్చు. ఇక నుంచి రైలులో వస్తువు పోతే దొరకదని వదిలేయకండి. కనీసం రైల్వే హెల్ప్ సెంటర్‌కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకునే యత్నం చేయండి. (చదవండి: బొటాక్స్ ఇంజెక్షన్లు ఇంత డేంజరా? మైగ్రేన్ కోసం వాడితే..!) -
ఈ విషయాలు మీకు తెలుసా?
-
జెంటిల్మెన్లా ఉండాలనుకుంటే..అవి అస్సలు చేయకూడదు!
పరస్తుతి, పరనింద, ఆత్మస్తుతి, ఆత్మనింద – ఈ నాలుగూ సజ్జనులు చేసే పనులు కావు అని మహాభారతంలో ఒక నీతి ఉంది. ‘అన్య కీర్తనంబు, అన్య నిందయు, తన్ను/ పరగ పొగడికోలు, ప్రబ్బికోలు,/ ఆపగా తనూజ! ఆర్యవృత్తములు కా/వనిరి వీని ఆద్యులైన మునులు...’ ఇక్కడ ‘ఆపగా తనూజుడు’ (నదీ పుత్రుడు) అంటే గాంగేయుడైన భీష్ముడు. ఆ ధర్మవేత్తకు ఈ నీతి బోధిస్తున్నది ఛేదిరాజు శిశుపాలుడు. ‘నువ్వు అదే పనిగా శ్రీకృష్ణుడినే పొగుడు తున్నావు. ఇది పెద్దలు చేయదగిన పనికాదు’ అని శిశుపాలుడి అభ్యంతరం. ఉటంకించింది శిశుపాలుడయినా, ఇది ‘ఆద్యులైన మునుల’ మాట కదా! పెద్దలిలా ఎందుకు చెప్పారో ఇంచుక చింతన చేసుకొంటే తప్పులేదు. పరులను వాళ్ళ ఎదుటే ‘ముఖస్తుతి’ చేసే వాడు... పలచనైపోయి, ఆశ్రితుల స్థాయికి జారిపోతాడు. గౌరవం కోల్పోతాడు. పరులను వాళ్ళ పరోక్షంలో పొగిడినా, అలా పదేపదే చేస్తుంటే... దానివల్ల తనవాళ్ళకు నిరుత్సాహం కలగడమే కాక, వాళ్ళు దాన్ని పరి పరి విధాలుగా అపార్థం చేసుకొనే ప్రమాదం ఉంది. అలాగే పరనింద కూడా ప్రయోజన శూన్యం. అహంకారాన్ని ప్రకటించుకోవడమూ, శత్రుత్వాన్ని పెంచుకోవడమూ తప్ప నింద వల్ల సాధించేదేముంది? నిందను సకారాత్మకంగా స్వీకరించి, తమ ‘తప్పు’ గ్రహించి మారిపోయే ‘పరులు’ ఎక్కడయినా ఉంటారా? చేతలే చెప్తాయి.. ఆత్మస్తుతి సరేసరి. అది సాధారణంగా అల్పత్వాన్నీ, ఆత్మ న్యూనతా భావాన్నీ సూచిస్తుంది. ధీరులూ, సమర్థులూ వాళ్ళ ఘనత వాళ్ళు చెప్పుకోరు. ఘనతను చేతలే చెప్తాయి. చేతలులోపించి నప్పుడే మాటలు. ‘నేను ఘనుడిని’ అని ఎంత చెప్పుకొన్నా దానికి విలువా, విశ్వసనీయతా ఉండవు. నమ్మేదెవరు? ఆత్మనింద కూడా ప్రమాదకరమే. ఆత్మవిమర్శతో తన తప్పులు గ్రహించుకొని, తొలగించుకొంటే మంచిదే కానీ ఊరకే తనను తాను నిందించుకొంటూ కూర్చొంటే, అది ఉన్న ఆత్మవిశ్వాసాన్నీ, ధైర్యాన్నీ కూడా దెబ్బ తీసి, క్రమంగా మరింత పిరికితనానికీ, అసమర్థతకూ, కుంగుబాటుకూ దారి తీస్తుంది. అయితే ఒకటి! మహాభారతమయితే ఇలా చెప్పింది కానీ ఈ రోజులలో, ఆత్మస్తుతీ, పరనిందా, దాంతోపాటు అవసరార్థం ‘తమంత వారు లేరు సుమా!’ అంటూ పరస్తుతీ, లోకం చేత ఓహో అనిపించుకొనేందుకు అప్పుడప్పుడూ ఆత్మనిందా మానేస్తే, సమా జంలో ఎక్కువగా మౌనమే రాజ్యం చేయాల్సివస్తుందేమో! – ఎం. మారుతి శాస్త్రి (చదవండి: గురువు సందేశం తర్వాత..ఇంత నిశబ్దమా! ఇదేలా సాధ్యం?) -
Thursday Myths: గురువారం ఆ రంగు శుభసూచికం, అదృష్టం వరిస్తుందట!
హిందూ సాంప్రదాయంలో అనేక ఆచారాలను పాటిస్తారన్న సంగతి తెలిసిందే. ప్రతిరోజుకు ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. గురువారం శ్రీమహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజని చెబుతుంటారు. అందుకే గురువారం దేవ గురువు బృహస్పతి, విష్ణుదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆయన అనుగ్రహం పొందాలంటే ఎంతో నిష్టగా పూజాక్రతువులను ఆచరించాల్సి ఉంటుంది. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం నాడు కొన్ని పనులు చేయడాన్ని నిషిద్దంగా భావిస్తారు. మరి గురువారం నాడు చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం. గురువారం ఆ రంగు శుభసూచికం గురువారం శ్రీ మహావిష్ణువును పూజించడం, ఉపవాసం చేయడం వల్ల శుభ ఫలితాలు సిద్ధిస్తాయట. పెళ్లి ఆలస్యం అవుతున్నా, వివాహంలో సమస్యలున్నా గురువారం రోజున ఉపవాసం చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఇలా 11 వారాలు ఉపవాసాలు చేస్తే చాలా మంచిదట. గురువారం నాడు అరటిపండ్లను దానం చేసినా, పసుపు రంగు బట్టలు వేసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయట. గురువారం అరటి చెట్లకు పూజించడం వల్ల సత్ఫలితాలు సిద్ధిస్తాయట. గురువారం నాడు చేయకూడని పనులు ♦ గురువారం బృహస్పతికి అత్యంత ప్రీతికరమైన రోజు. బృహస్పతి ఆధిపత్యం వహించే గురువారం నాడు మహిళలు తలస్నానం చేయకూడదట. మహిళల జాతకంలో బృహస్పతి భర్త కారకం. అవుతుందట. అందుకే తలంటు పోసుకోవడం వల్ల కుజుడు బలహీనంగా మారుతాడని అంటారు. ఈ నెగిటివ్ ఎనర్జీ ముఖ్యంగా భర్త, పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని అంటారు. ఫలితంగా ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొంటారని విశ్వాసం. ♦ గురువారం శ్రీ మహా విష్ణువుకు ఇష్టమైన రోజు. ఆరోజు జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం వంటివి చేస్తే ఆయనకు కోపానికి కారణమవుతారని పండితులు విశ్వసిస్తారు. ఫలితంగా డబ్బుకు కొరత ఏర్పడుతుందని అంటారు. ♦ గురువారం నాడు బట్టలు ఉతకడం, ఇంట్లో బూజు దులపడం వంటివి చేస్తే విష్ణుమూర్తికి కోపం వస్తుందట. ♦ గురువారం నాడు అద్దాలు, కత్తెరలు వంటి పదునైన వస్తువులకు కొనుగోలు చేస్తే అరిష్టమని పండితులు చెబుతారు. ♦ గురువారం నాడు డబ్బు ఇవ్వడం లేదా రుణం తీసుకోవడం లాంటివి చేయకూడదట ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనై సంపద కొలువ ఉండదని చెబుతారు. గమనిక: పైన పేర్కొన్న అంశాలు విశ్వాసాలకు, ఆచారాలకు సంబంధించినవి. వీటికి సైంటిఫిక్ ఎవిడెన్స్, కశ్చితమైన ఆధారాలు లేవు. -
మంగళవారం మంచిదికాదా? ఎందుకు ఆ రోజు ఆ పనులు చేయరు!
మనలో చాలా మంది ఏ పని ప్రారంభించాలన్నా వారం, వర్జ్యం అనేవి చూసుకుంటారు. అలాగే చాలా మంది మంగళవారం గోర్లు, వెంట్రుకలు కత్తిరించుకోవడం అశుభంగా భావిస్తారు. దీని వెనుక కారణమేంటో తెలుసా? వారంలో అన్ని రోజులు తెరిచి ఉండే సెలూన్ షాప్‌లు మంగళవారం మాత్రం మూసి ఉంటాయి. ఆరోజున క్షౌరశాలలు నిర్వహించే నాయి బ్రాహ్మణులు అందరూ సెలవు దినంగా పాటిస్తారు. పైగా ఆ రోజు ఏ మంచి పని మొదలుపెట్టరు. ఎక్కడికీ వెళ్ళరు మరీ అర్జెంటు.. తప్పనిసరి ఐతే తప్ప. మంగళవారం మంచిదికాదన్న సంగతి ఎలా వచ్చింది..? ఎవరు చెప్పారు..? ఎంతవరకు నిజం..? చూద్దామా!. తమ సంస్కృతి, సంప్రదాయాలకు కట్టుబడి ఉండే హిందువులు ఎవరూ కూడా మంగళవారం రోజున కటింగ్, షేవింగ్ లాంటివి చేసుకోరు. శరీరంపై అంగారక గ్రహ ప్రభావం మంగళవారాన్ని అంగారక గ్రహం రోజుగా (Mars Day) భావిస్తుంటారు. అంగారక గ్రహం అనేది ఎరుపు వర్ణానికి చిహ్నం. ఎక్కువ వేడిని కలిగి ఉంటుంది. గ్రహ ప్రభావం వల్ల మంగళవారం రోజున ఆ వేడి మానవ శరీరంపై ప్రభావం చూపుతుందంటారు. ఆ రోజు శరీరానికి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువ. శరీరంపై గాట్లు పడే అవకాశం ఉంటుందని విశ్వసిస్తారు. కాబట్టి ఆ రోజున కటింగ్, షేవింగ్ లాంటివి చేసుకోవద్దని పెద్దలు చెప్పారు. జుట్టు కత్తిరించుకోడాన్ని ఆయుష్కర్మ అంటారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా పని చేయరాదు. ముందుగా గడ్డం, ఆపైన మీసం, ఆ తరువాత తలమీద ఉన్న జుట్టూ తీయించుకోవాలి. ఆపైన చేతిగోళ్లు, చివరగా కాలిగోళ్ళు తీయించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వరుసను అతిక్రమించరాదు. కొన్ని రోజులలో ఈ ఆయుష్కర్మ నిషిద్ధం. ఏకాదశి, చతుర్దశి, అమావాస్య పౌర్ణమి తిధులు నిషిద్ధాలు. ప్రతినెలా వచ్చే సంక్రాంతి కూడా నిషిద్ధమే. వ్యతీపాత, విష్టి యోగ కరణాలలో, శ్రాద్ధ దినాలలో నిషిద్ధం. వ్రతదినాలైతే కూడా క్షవరము చేయించుకోరాదు. ఆయుష్కర్మ చేయించుకునే వారాన్ని బట్టి ఆయుష్షు పెరగడం కానీ తరగడం కానీ ఉంటుంది. శుక్ర వారమైతే పదకొండు నెలలు, బుధవారం అయితే ఐదు నెలలు, సోమవార అయితే ఎనిమిది నెలలు ఆయుష్షు పెరుగుతుంది. గురువారమైతే ఆయుష్షు పది నెలలు పెరుగుతుంది. ఆదివారం క్షవరము చేయించుకుంటే ఆయుష్షు నెల రోజులు తగ్గుతుంది. శనివారం అయితే ఏడు నెలలు తగ్గుతుంది. మంగళవారం అయితే ఎనిమిది నెలలు తగ్గుతుంది. పూర్వం షాపులు లేని రోజుల్లో ఇంటికి వచ్చే మంగలి పని చేసేవారు. (ఈ పదం వృత్తిరీత్యా వాడబడింది కానీ కులాన్ని సూచించేది కాదు.) ప్రతిరోజూ ఉద్యోగానికి వెడుతూ, గడ్డం, మీసం కావలసినంతగా కత్తిరించుకుని వెళ్లే అవసరం కూడా ఆ రోజుల్లో లేదు. మంగలి అతను వచ్చి క్షవరకర్మ చేసి వెళ్ళాక అతని భార్య వచ్చి ఇంట్లో వారిచ్చిన అన్నము, పదార్థాలు తీసుకుని వెళ్ళేది. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పంచాంగం చూసి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం చూసి క్షవరకర్మ చేయించుకునే పరిస్థితి లేదు. క్షవర కర్మ వృత్తిలో ఉన్నవారు కూడా షాపు తెరిచి అక్కడకు వచ్చిన వారికే ఆయుష్కర్మ చేస్తున్నారు. కొన్ని రోజులు మాత్రమే తెరిచి ఉంచితే వారికి కిట్టదు. ఈ సూత్రాలలో చెప్పినవన్నీ పూర్తిగా వదిలివేయడానికి భారతీయులు ఇష్టపడరు అందుకే క్షవరం చేయించుకుంటే ఆయుష్షు ఎక్కువగా తరిగిపోయే మంగళవారాన్ని మాత్రమే సెలవు దినంగా స్వీకరించడం జరిగింది. తగాదలయ్యే అవకాశం ఎక్కువ.. అంగారక గ్రహ ప్రభావం కారణంగా మంగళవారం రోజున తగాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ఇబ్బందుల్లో పడతారు. మంచి శకునాలు ఉండవు కాబట్టి ఆ రోజున ఏ కార్యం తలపెట్టినా అశుభంగా భావిస్తారు. దేవతలకు ఆ రోజు ప్రత్యేకం పూజలు, వ్రతాలకు ప్రత్యేకం ఇదే కాకుండా, మంగళవారం రోజున గోర్లు, జుట్టు కత్తిరించుకోకపోవడానికి మరో నమ్మకం కూడా ప్రాచుర్యంలో ఉంది. దుర్గాదేవి, మహాలక్ష్మి అమ్మవార్లకు ఎక్కువగా మంగళవారాల్లోనే ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. ఆ రోజున దేవతలను పూజించడం వల్ల మంచి ఐశ్వర్యం, ధన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. అమ్మవార్లకు సంబంధించి మంగళవారం ప్రత్యేక దినంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవడం లాంటివి చేయరు. -
Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా?
అక్షయ తృతీయ హిందువులకు పవిత్రమైన రోజు. దీన్ని అఖ తీజ్ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్ల పక్ష తృతీయ నాడు అక్షయ తృతీయగా జరుపుకొంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వచ్చింది. అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. అందుకే ఈ రోజున బంగారం కొంటే అంతులేని సిరి సంపదలు కలుగుతాయని భావిస్తారు. అయితే ఏప్రిల్ 1 నుంచి బంగారు వస్తువులు, ఆభరణాల కొనుగోలుకు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు మోసపోకుండా గమనించాల్సిన విషయాలు తెలుసుకోవడం అవసరం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (HUID) లేకుండా బంగారు ఆభరణాలు విక్రయించడాన్ని నిషేధించింది. బంగారం స్వచ్ఛతను పరిశీలించడం ఎలా? HUID హాల్‌మార్క్ 3 మార్కులను కలిగి ఉంటుంది. BIS లోగో, బంగారం స్వచ్ఛత, ఆరు-అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID ఉంటాయి. ఒక్కో బంగారు వస్తువు లేదా ఆభరణానికి ఒక్కో విశిష్టమైన ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఉంటుంది. BIS లోగో BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ప్రతి బంగారు వస్తువు, ఆభరణంపైనా BIS లోగో ఉంటుంది. ఇది ఉంటే ఆ ఆభరణం BIS అధీకృత ల్యాబ్‌లో పరీక్షించి ధ్రువీకరించినట్లు అర్థం. కొనుగోలుదారులు బంగారు ఆభరణంపైనా ఈ లోగో ఉందో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి. భారతదేశంలోని బంగారు వస్తువులు, ఆభరణాల స్వచ్ఛతను ధ్రువీకరించే ఏకైక సంస్థ BIS. స్వచ్ఛత గ్రేడ్ ఆభరణాలలో స్వచ్ఛమైన బంగారాన్ని ధ్రువీకరించే మరో గుర్తు ఫైన్నెస్ నంబర్, క్యారెట్ (KT లేదా Kగా పేర్కొంటారు). వెండి, జింక్ వంటి ఇతర లోహాలతో కూడిన బంగారు మిశ్రమాలలో నాణ్యతను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే 24 క్యారెట్ల బంగారం చాలా మృదువైనది కావడంతో ఆభరణాల కోసం ఇతర లోహాలను దీనికి కలుపుతారు. 916 అనేది ఫైన్నెస్ నంబర్. 22 క్యారెట్ల బంగారానికి మరో పదం. ఉదాహరణకు 22 క్యారెట్ల బంగారం 100 గ్రాముల బరువు ఉంటే అందులో 91.6 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 6 అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ (HUID) బంగారు ఆభరణాలను అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్లో మాన్యువల్‌గా ప్రత్యేక నంబర్‌తో స్టాంప్ చేస్తారు. ప్రతి ఆభరణానికి ప్రత్యేకమైన HUID ఉంటుంది. ఇది విశ్వసనీయతకు కీలకం. పాత బంగారు ఆభరణాలు? ఇది వరకే ఉన్న నిబంధనల ప్రకారం.. వినియోగదారుల వద్ద ఉన్న పాత హాల్‌మార్క్ ఆభరణాలు కూడా చెల్లుబాటులో ఉంటాయి. BIS రూల్స్ 2018 సెక్షన్ 49 ప్రకారం.. ఆభరణాలపై పేర్కొన్న దానికంటే తక్కువ స్వచ్ఛతతో ఉన్నట్లు గుర్తించినట్లయితే కొనుగోలుదారులు నష్టపరిహారం పొందవచ్చు. -
‘మార్చి 31’ గాభరావద్దు? ఈ విషయాలు తెలుసుకుంటే చాలు!
‘మార్చి’.. ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి నెల. మీ ఆదాయాన్ని లెక్క వేసుకుని.. అవసరం అయితే వీలున్నంత వరకు ప్లానింగ్ చేసుకుని, ఆదాయాన్ని బట్టి పన్ను భారం లెక్కించుకోవాలి. ఆదాయం లెక్కింపునకు (అంచనా), పొదుపు .. పెట్టుబడులకు, చెల్లింపులకు, ఇతరత్రా ప్లానింగ్‌కు ఈ నెల 31 చివరి తేదీ. ఈ నేపథ్యంలో మీరు గుర్తుంచుకోవల్సిన విషయాలు ఏమిటంటే.. ♦ ఉద్యోగస్తులు కేవలం జీతాలు కాకుండా ప్రతి నెలా వచ్చే ఆదాయాలు.. ఉదాహరణకు.. ఇంటద్దె, వడ్డీ, ఇతరాలు ఉంటే లెక్కలు వేసుకోవాలి. ఇటువంటి వారు తమ అవసరాన్ని బట్టి పీఎఫ్, ఎన్ఎస్సీ, బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్, పిల్లల స్కూల్ ఫీజు, ఇంటి రుణం మీద వడ్డీ చెల్లింపు, అసలుకు కట్టాడం లాంటివి ఏమైనా చేసి ఆదాయాన్ని తగ్గించి చూపించుకుని, పన్ను భారం తగ్గించుకోవాలా? లేదా చేతిలో నగదును ’బ్లాక్’ చేసుకోవాలా? బదులుగా కేవలం పన్ను భారం చెల్లించి బైటపడి, ఊపరి పీల్చుకోవాలా? ఇదంతా ఆలోచించుకుని తగు నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో మనం ఎన్నో ఉదాహరణలు ఇచ్చాం. గుర్తుంచుకోండి. అలాగే ఒకరితో ఒకరు పోల్చుకోవద్దండి. ఎవరి వీలు వారిది. ఎవరి వెసులుబాటు వారిదే. ♦ ప్లానింగ్‌లో భాగంగా ఉద్యోగానికి సంబంధించిన జీతభత్యాలు, మిగతా ఆదాయాలను వచ్చే ఆర్థిక సంవత్సరానికి పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉండే ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 7,00,000 వరకు పన్ను భారం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆదాయాన్ని ఏప్రిల్‌కు వాయిదా వేసుకోండి. ప్రైవేట్ సంస్థల్లో యజమానిని, జీతం/బోనస్ ఎక్స్‌గ్రేషియా వచ్చే సంవత్సరం ఇవ్వమనండి. మీకు వచ్చే ఇంటద్దెను వచ్చే సంవత్సరం నుంచి పెంచండి. ♦ అలాగే క్యాపిటల్ గెయిన్స్ విషయానికొస్తే.. మీకు ముందుగానే తెలిసిపోతుంది. మీరు అంచనా వేసుకోవచ్చు. ఆ అంచనాల మేరకు స్థిరాస్తుల క్రయవిక్రయాలు వాయిదా వేసుకోండి. ఒప్పందాలు అవసరమైతే మార్చుకోండి. అయితే, ఒక జాగ్రత్త తీసుకోండి. కేవలం పన్ను భారం తగ్గించుకోవడం కోసం వాయిదా వేసుకోకండి. మిగతా విషయాలు .. అంటే అగ్రిమెంటును గౌరవించడం, మీరు అనుకున్న ప్రతిఫలం రావడం, మీ కుటుంబ అవసరాలు, బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకోండి. ♦ చివరగా.. ’మార్చి’ వచ్చిందని ’మార్చ్’ చేయనక్కర్లేదు (ముందుకు పరుగెత్తనక్కర్లేదు). గాభరా పడక్కర్లేదు. వడ్డీకి అప్పు తెచ్చి మరీ ఇన్వెస్ట్ చేయనక్కర్లేదు. తలకు మించి భారం పెట్టుకోకండి. అవసరం లేకపోతే పన్ను చెల్లించండి. పన్ను భారం కూడా చెల్లించలేని పరిస్థితి ఉంటే వీలును బట్టి చెల్లించండి. ప్రభుత్వం ఒక శాతం ఒక నెలకు చొప్పున అదనంగా కట్టవచ్చని వెసులుబాటు ఇచ్చింది. ఆలోచించి, అడుగు వేస్తూ ఆనందంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టండి. కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
భూగర్భంలో వింత శబ్దాలు... భయాందోళనలో గ్రామం
ముంబై: మహారాష్ట్రాలోని లాతూర్ జిల్లాలో ఓ గ్రామంలోని భూగర్భంలో వింతవింత శబ్ధాలు గ్రామం అంతటా వస్తున్నాయి. దీంతో ఆ గ్రామంలోని నివాసితులు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. హసోరి గ్రామంలో ఈ భూగర్భ శబ్ధాలు వస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. ఈ వింత శబ్ధాలకు గల కారణాల గురించి అధ్యయనం చేయమంటూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం నుంచి నిపుణలను అభ్యర్థించినట్లు చెప్పారు. హసోరి గ్రామం కిల్లారి నుంచి 28 కి.మీటర్ల దూరంలో ఉంది. వాస్తవానికి ఈ ప్రాంతంలో 1993లో ఘోరమైన భూకంపం సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలో దాదాపు 9700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఎటువంటి భూకంపాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఆ గ్రామంలో ఈ వింత శబ్దాలు సెప్టెంబర్ 6నుంచి భగర్భం నుంచి బిగ్గరగా వినిపిస్తున్నాయని, గ్రామస్తులంతా భయాందోళనలకు గురవుతున్నారని అధికారులు చెప్పారు. లాతూర్ జిల్లా కలెక్టర్ పృథ్వీరాజ్ఈ గ్రామాన్ని సందర్శించి ప్రజలకు భయందోళనలకు గురవ్వద్దని విజ్ఞప్తి చేశారు. అంతేగాదు మహారాష్ట్రాలోని నాందేడ్‌లోని స్వామి రామానంద్ తీర్థ మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణుల బృందం ఆ గ్రామాన్ని సందర్శించనుందని అధికారులు తెలిపారు. (చదవండి: సెల్ఫీ ఆనందంలో సెల్‌నే విసిరి ఆ తర్వాత...) -
ఎంటర్‌ప్రెన్యూర్‌లా కాదు.. పొలిప్రెన్యూర్‌గా
సాక్షి, హైదరాబాద్: బూమ్ ఉందంటే చాలు ఇన్వెస్టర్లే కాదు డాక్టర్లు, యాక్టర్లు, లాయర్లు, బ్యూరోక్రాట్స్, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ పెట్టుబడులు పెట్టి మార్కెట్లో డిమాండ్‌ను సృష్టిస్తుంటారు. ప్రతి ఏటా 15–20 శాతం ధరలు పెరగడం ఆరోగ్యకరమైన వృద్ధి. అలాకాకుండా అబ్నార్మల్గా పెరిగితే మాత్రం అది బూమ్. ఇది ప్రభుత్వ అభివృద్ధి ప్రకటనలు, భవిష్యత్తు ప్రాజెక్ట్‌లను, ప్రాంతాలను బట్టి పెరుగుతుంటుంది. రియల్టీ బూమ్ ఇన్వెస్టర్లు ఉన్నంత కాలమే ఉంటుంది. ఒక్కసారి ఇన్వెస్టర్లు పక్కకు తప్పుకోగానే బద్దలైపోతుంది. ఇదేమీ కొత్తకాదు. 2008లో వచ్చిన రియల్టీ బూమ్ ఇలాంటిదే. 2015-16 వరకు కోలుకోలేదు. ఇలాంటి సంక్షోభ సమయంలోనూ హైదరాబాద్ డెవలపర్లు ధైర్యంగా, బలంగా నిలబడటానికి కారణం నిజమైన కొనుగోలుదారులు తోడుగా నిలవటమే. ప్రతి సంవత్సరం నగరంలో 25 వేల గృహాలు విక్రయం అవుతుంటాయి. ఇదే స్థాయిలో లాంచింగ్స్ కూడా ఉంటాయి. కొనేవాళ్లు ఏ స్థాయిలో ఉన్నారో.. గృహాల సప్లయి కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఒకవైపు రోజువారీ నిత్యావసర ఖర్చులు మోస్తూనే.. మరోవైపు జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, ఆదాయ పన్నులను భరించి ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకోవటం కొనుగోలుదారులకు కష్టమే. ఆకాశాన్నంటిన భూముల ధరలు, నిర్మాణ అనుమతులు, బ్యాంక్ వడ్డీలు, ఆఫీస్ నిర్వహణ ఖర్చులు, రోజురోజుకూ పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు, స్థానిక నాయకుల ఒత్తిళ్లు.. వీటన్నింటినీ దాటుకొని ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం డెవలపర్‌కు సవాలే... ఇలా నిజమైన కొనుగోలుదారులు, డెవలపర్లకు మధ్యలో రాత్రికి రాత్రే ప్రాజెక్ట్‌లను ప్రారంభించేసి.. అడ్డదారిలో విక్రయాలు చేస్తూ రియల్టీ మార్కెట్లో కృత్రిమ డిమాండ్‌ను సృష్టిస్తున్నారు కొందరు తాత్కాలిక బిల్డర్లు. ♦ ఒకవైపు రోజువారీ నిత్యావసర ఖర్చులు మోస్తూనే.. మరోవైపు జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, ఆదాయ పన్నులను భరించి ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకోవటం కొనుగోలుదారులకు కష్టమే. ♦ ఆకాశాన్నంటిన భూముల ధరలు, నిర్మాణ అనుమతులు, బ్యాంక్ వడ్డీలు, ఆఫీస్ నిర్వహణ ఖర్చులు, రోజురోజుకూ పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు, స్థానిక నాయకుల ఒత్తిళ్లు.. వీటన్నింటినీ దాటుకొని ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం డెవలపర్‌కు సవాలే. ♦ ఇలా నిజమైన కొనుగోలుదారులు, డెవలపర్లకు మధ్యలో రాత్రికి రాత్రే ప్రాజెక్ట్‌లను ప్రారంభించేసి.. అడ్డదారిలో విక్రయాలు చేస్తూ రియల్టీ మార్కెట్లో కృత్రిమ డిమాండ్‌ను సృష్టిస్తున్నారు కొందరు తాత్కాలిక బిల్డర్లు. పొలిప్రెన్యూర్ అయితేనే.. పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నలాజికల్, ఎన్విరాన్మెంటల్, లీగల్... ఈ వ్యాపారం చేయాలన్నా ఉండాల్సిన ప్రధాన అంశాలివే. ఆయా అంశాలలో తెలంగాణ బలంగా ఉండటం వల్లే కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌లా కాకుండా పొలిప్రెన్యూర్‌గా ఉంటేనే రాణించగలమని కిస్మత్‌పూర్‌కు చెందిన ఓ డెవలపర్ తెలిపారు. పొలిటికల్ కనెక్షన్స్ బాగా ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌ను పొలిప్రెన్యూర్స్ అంటారు. సాధారణ డెవలపర్లు చెప్పులు అరిగేలా తిరిగినా పరిష్కారంకాని సమస్యలన్నీ పొలిప్రెన్యూర్స్కు మాత్రం కూర్చున్న చోటే పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. భూమి అగ్రిమెంట్ చేసుకున్న రోజు నుంచి ప్రాజెక్ట్‌ను మార్కెట్లోకి తెచ్చే వరకు సుమారు మూడేళ్ల సమయం పడుతుంది. ఈ కాలంలో వడ్డీ భారం డెవలపర్లదే. తీరా లాంచింగ్ చేశాక మార్కెట్ ప్రతికూలంలో ఉంటే మరింత భారమే. డెవలపర్లలో పోటీ భయం నెలకొంది.. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో ఇప్పుడు కొనకపోతే ముందుముందు కొనలేమనే భయం ఎలాగైతే కొనుగోలుదారుల్లో ఉందో.. అలాగే కొత్త డెవలపర్లే పెద్ద ప్రాజెక్ట్‌లు చేసి మార్కెట్‌ను క్యాష్ చేసుకుంటుంటే మనం వదలుకుంటున్నామనే భయం సీనియర్ డెవలపర్లలో నెలకొంది. ప్రీలాంచ్లో విక్రయాలు, యూడీఎస్ బుకింగ్స్ చేస్తూ అడ్డదారులలో కొందరు డెవలపర్లు మార్కెట్‌ను పాడు చేస్తుంటే.. న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తూ, కొనుగోలుదారులు సొంతిల్లు కలను నిజం చేస్తున్న డెవలపర్లకు సమస్యలు వస్తున్నాయి. దీంతో డెవలపర్లు మానసికంగా నలిగిపోతున్నారని గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండీ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. కొనేముందు ఇవి చూడాలి.. ఎంపిక చేసిన ప్రాజెక్ట్ గురించి న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. ఎన్ని బ్యాంక్‌ల నుంచి ప్రాజెక్ట్లోన్ తీసుకున్నారు వివరాలు తెలుసుకోవాలి. హెచ్ఎండీఏ, లోకల్ బాడీ, ఫైర్, ఎన్విరాన్మెంటల్, ఎయిర్పోర్ట్ వంటి ప్రభుత్వ విభాగాల అనుమతులున్నాయా? లేవా? రెరాలో నమోదు చేశారా లేదా చూసుకోవాలి. ప్రాజెక్ట్‌ను కట్టే ఆర్థిక స్తోమత నిర్మాణ సంస్థకు ఉందా? లేదా? బిల్డర్‌కు నిర్మాణ రంగంలో సాంకేతిక అనుభవం ఉందా లేదా చూసుకోవాలి. నిర్మాణ సంస్థ విలువలు, డెవలపర్ గత చరిత్ర గురించి ఆరా తీయాలి. ప్రాజెక్ట్ నాణ్యత, గడువులోగా పూర్తవుతుందా లేదా పరిశీలించాలి. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? సోషల్ ఇన్ఫ్రా ఎలా ఉందో గమనించాలి. -
ఆన్లైన్ షాపింగ్: ఈ జాగ్రత్తలు తీసుకోండి
ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ వినియోగం విపరీతంగా పెరిగింది. వాటి వ్యాపార వ్యవధి 2016తో పోల్చితే 81 శాతం అభివృద్ధి చెందింది. అందరూ ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండానే వేల సంఖ్యలో ఉత్పత్తులు, రకరకాల డిజైలు అందుబాటులోకి తీసుకురాడంతో ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా డిస్కౌంట్ ఆఫర్స్, రిటర్న్ పాలసీలు అంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇకపోతే ఇంకొరెండు మూడు రోజుల్లో ఈ కామర్స్ సైట్స్ భారీ ఆఫర్స్‌తో బిగ్‌బిలియన్ డేస్ ఇలా ప్రత్యేకమైన ఆఫర్లను అందించనున్నాయి. అయితే షాపింగ్ చేసే వారు ఈ జాగ్రత్తలు పాటించండి. ఎల్లప్పుడూ ప్రొడక్ట్ వివరాలు పూర్తిగా పరిశీలించండి: మనలో చాలా మంది ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు కేవలం అక్కడ చూపించిన ఇమేజ్ ఆధారంగా దానిని కొనాలని నిర్ణయించుకుంటారు. అంతేకానీ వారికి ప్రొడక్ట్ గురించి కింద తెలిపిన వివరాలను చదివే ఓపిక ఉండదు. అలా కాకుండా షాపింగ్ చేసేటప్పుడు ఆ ఉత్పత్తి పూర్తి వివరాలు చదవాలి. అంతేకాకుండా ఆ ప్రొడక్ట్‌ను అంతకముందే కొన్ని వారి రివ్యూలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆ ఉత్పత్తి రేటింగ్ ఇలా అన్ని పరిశీలించిన తరువాతే దానిని ఆర్డర్ పెట్టుకోవాలి. షిప్పింగ్ కాస్ట్ చూడండి: చాలా కంపెనీలు షిప్పింగ్ కాస్ట్ వివరాలను ప్రొడక్ట్ దగ్గరే వివరిస్తాయి. ఎప్పుడు ఆర్డర్ మన వద్దకు చేరుతుంది అనే డిటైల్స్ అన్ని ఉంటాయి. అయితే రూల్స్ ప్రకారం ఆర్డర్ చేసిన 30 రోజుల్లోపు ఉత్పత్తిని వినియోగదారుడికి అందించాలి. కొన్ని ప్రొడక్ట్‌లపై ఫ్రీ డెలివరీ ఆఫర్లు ఉంటాయి. ఇంకొన్ని కంపెనీలు బల్క్‌లో కొంటేనే ఫ్రీ షిప్పింగ్‌ను అందిస్తాయి. కాబట్టి షాపింగ్ చేసేటప్పుడు ఆ వివరాలు అన్నింటిని పరిగణలోకి తీసుకోవాలి. మీరు కొనే ఉత్పత్తుల ధరలను వేరే చోట కూడా పరిశీలించుకోండి: డిస్కౌంట్ లభిస్తోంది అనగానే కేవలం ఆ సైట్లో మాత్రమే కాకుండా వేరే ఆన్లైన్ స్టోర్‌లో కూడా వాటి ధరలు, ప్రొడక్ట్ డిటైల్స్‌ను సరిపోల్చకోండి. ప్రస్తుతం ఆన్లైన్ రిటైల్స్టోర్లు అనేకం అందుబాటులోకి వచ్చాయి కాబట్టి మీరు తేలికగానే వాటి ధరలను, నాణ్యతను చెక్ చేసుకోవచ్చు. డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే నాణ్యత లేని వస్తువులను అందించడం కాదు మన్నికైన వస్తువులనే వినియోగదారుడికి తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడం. మీ విలువైన డబ్బుతో నాణ్యత లేని వస్తువులను కొనుగోలు చేయకండి. [ చదవండి : మీ లవర్ మీ మొబైల్ వాట్సాప్ చెక్ చేస్తున్నారా? ఈ ట్రిక్ తో సేఫ్ గా ఉండండి ] రివ్యూలను చదవండి: మీరు కొనాలనుకున్న ప్రొడక్ట్ అంతకముందే కొన్నవారు దాని గురించి వారి అభిప్రాయాలను రివ్యూలలో తెలియజేస్తారు. వాటిలో కొన్ని రివ్యూలు నిజాయితీగా ఉండి మీరు ఆ వస్తువును కొనాలో వద్దో నిర్ణయించుకోవడానికి దోహదపడతాయి. కాబట్టి ఇక నుంచి ఏదైనా వస్తువును ఆన్లైన్లో కొనాలనుకున్నప్పుడు వాటి రివ్యూలను తప్పకుండా చదివిన తరువాతే మీ ఆర్డర్‌ను ప్లేస్ చేయండి. మీ హక్కులను తెలుసుకోండి: ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు చాలా ఉత్పత్తులపై రిటర్న్ పాలసీ ఉంటుంది. అయితే కొన్ని వస్తువులకు మాత్రమే ప్యాక్ ఓపెన్ చేస్తే రిటర్న్ ఉండదు అని ఉంటుంది. కాబట్టి వినియోగదారుడు వస్తువుకొనేటప్పుడే రిటర్న్ వివరాలను పరిశీలించి కొనండి. స్కామ్, ఫ్రాడ్ల నుంచి అప్రమత్తంగా ఉండండి: ప్రస్తుత కాలంలో సైబర్‌నేరాలకు అంతులేకుండా పోతుంది. నేరగాళ్లు వివిధ మార్గాలలో ఫ్రాడ్లకు పాల్పడుతున్నారు. అందుకే ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు అది జెన్యూన్సైట్ అవునో కాదో ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలి. ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు కదా అని ఆ సైట్ నమ్మదగినదో లేదో తెలుసుకోకుండా ఆర్డర్ పెట్టి మీ డబ్బును పోగొట్టుకోకండి. -
ఉబర్‌లో వెళుతున్నారా? ఇది మీకోసమే..
న్యూఢిల్లీ : ప్రయాణ హడావుడిలో సాధారణంగా ప్రయణికులు అపుడపుడూ తమ వస్తువులను మరిచిపోవడం.. ఆనక గాభరా పడడం మనకు తెలిసిందే. అయితే క్యాబ్ అగ్రిగేటర్ ఉబర్ సంస్థ కొన్ని ఆసక్తికర విషయాలను తాజాగా ప్రచురించింది. తమ క్యాబ్‌ల్లో ప్రయాణించేవారిలో ఎక్కువగా వస్తువులు మర్చిపోతున్న దేశాల్లో భారత్ ముందంజలో ఉందని వెల్లడించింది. ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా, ఫిలిపీన్స్ దేశాలు ఉన్నాయని ఉబర్ సంస్థ తెలిపింది. శుక్రవారం ఉబర్ యాప్ వెలువరించిన వార్షిక నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ప్రయాణికులు మర్చిపోతున్న వాటిలో మొబైల్ ఫోన్స్, బ్యాగ్స్ టాప్ ప్లేస్‌లో ఉన్నాయట. అలాగే పెళ్లి కానుకలు, బంగారు నగలు ఈ వరుసలో తరువాతి స్థానంలో నిలిచాయని ఉబర్ వెల్లడించింది. అంతేకాదు ఉబర్ రిపోర్టులో బెంగళూరు నగరం ఎక్కువగా మర్చిపోతున్న నగరంగా ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రయాణికులు ఎక్కువగా మర్చిపోతున్న పది వస్తువులలో ఫోన్స్, బ్యాగ్స్, ఐడి కార్డులు, కళ్లద్దాలు, గొడుగులు ఉన్నాయి. చిన్న చిన్న వస్తువులే కాకుండా ఏకంగా ఎల్ఈడి టీవీలు, పిల్లల కోసం వాడే టెంట్ హౌస్‌లు లాంటి పెద్ద వస్తువులను మరిచిపోతున్నారట. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో ఎక్కువగా వస్తువులను మర్చిపోతున్నారని తెలిపింది. అదీ తరచుగా శని, ఆదివారాల్లో వస్తువులను మర్చిపోతుండటం గమనార్హం. ఉబర్ మార్కెటింగ్ అధికారి మాట్లాడుతూ.. ఉబర్ ప్రయాణాలలో వస్తువులను పోగొట్టుకున్నపుడు యాప్ ద్వారా ఎలాంటి సహాయం పొందగలరో ప్రయాణికులకు అవగాహన కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా తరచుగా వస్తువులు పోగొట్టుకునే ప్రయాణికులను గుర్తించి వారి వస్తువులను తర్వాతి ప్రయాణంలో అప్పగిస్తున్నామన్నారు. అలాగే రైడ్ ముగిసిన తరువాత తమ వస్తువులను మరోసారి సరిచూసుకోవాల్సిందిగా గుర్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
పిల్లితో భారీ వ్యాపారం!
జపాన్ః వ్యాపారాభి వృద్ధికోసం ఒక్కొక్కరు ఒక్కో టెక్నిక్ ఉపయోగిస్తారు. ముఖ్యంగా జనాన్ని ఆకట్టుకోడానికి రకరకాల ఎత్తులు వేస్తుంటారు. కొందరు మాటలతోనే కొనుగోలుదారులను ఆకట్టుకోడానికి చూస్తే.. మరికొందరు డెకరేషన్లు,లైటింగ్ లు వంటి అనేక రకాల ఆకర్షణలను ఎర వేస్తుటారు. అయితే జపాన్ లో మాత్రం ఓ పిల్లి..తనదైన శైలిలో చిన్నారులను ఆకట్టుకుంటూ.. తన వ్యాపారాన్ని చలాకీగా సాగించేస్తోంది. పిల్లి వ్యాపారం చేయడమేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? అమెరికాలో అందరూ ఇష్టపడే హాట్ డాగ్స్..., సింగపూర్ లో వేడినుంచీ ఉపశమనాన్నిచ్చే ఐస్ క్రీమ్స్ లాగానే... జపాన్ లో జనం యాకీ ఇమో (రోస్టెడ్ స్వీట్ పొటాటో) ను అమితంగా ఇష్టపడతారు. ముఖ్యంగా చలికాలంలో ఈ యాకీ ఇమో అమ్మకాలు భారీగా జరిపేందుకు టొట్టోరి ప్రిఫిక్చర్, కురాయోషి నగరంలో ఓ లెజెండరీ క్యాట్ రంగంలోకి దిగింది. జనం ఎంతో ఇష్టంగా తినే ఐటెమ్ అయినా వ్యాపారానికి మాత్రం పోటీ తప్పదు కదా. అందుకే ఇక్కడ యాకీ ఇమో వ్యాపారి తనదైన శైలిలో పిల్లలను ఆకట్టుకునేందుకు ఓ అందమైన పిల్లిని ఆయుధంగా చేసుకున్నాడు. పిల్లిలాటి కోటును ధరించి పిల్లలను ఆకట్టుకుంటూ చలాకీగా అమ్మకాలు జరిపేయడమే కాదు... వారితో కలసి సెల్ఫీలు, ఫోటోలు తీయించుకుంటూ హుషారుగా వ్యాపారం చేసేస్తున్నాడు. బొమ్మలంటే చిన్నారులు ఎంతో ఇష్టపడతారన్న ఉద్దేశ్యంతో తన వ్యాపారాభివృద్ధికి 'మికెనెకో యమాడా'.. ఈ కొత్త ప్రయోగాన్ని ప్రవేశ పెట్టాడు. దీంతో పిల్లలంతా యమాడా రోస్టింగ్ స్టాండ్ దగ్గరకు పరుగులు తీస్తున్నారు. యాకీ ఇమోలను తినడంకన్నా పిల్లి బొమ్మను ఇష్టంగా చూస్తూ షేక్ హ్యాండ్ లు, హాయ్.. బాయ్.. లు చెప్తున్నారు. ఇలా వినూత్న తరహాలో అమ్మకాలను పెంచుకుంటున్న మికెనెకో ఆధునిక పరిజ్ఞానాన్ని సైతం వినియోగించుకొని తాను ఏరోజు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో ముందుగానే ట్వీట్ చేస్తున్నాడు. వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే జపాన్ వీధులు యాకీ ఇమోల వ్యాపారులతో కళకళ్ళాడుతాయి. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్న సమయంలో ఇండియాలో మిర్చి బజ్జీలు, నిప్పుల్లో కాల్చిన జొన్న కండెలు తిన్నట్లుగా అక్కడి జనం.. గులకరాళ్ళపై రోస్ట్ చేసే స్వీట్ పొటాటోలను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే కొందరు ఈ యాకీ ఇమోలను రాలిన ఆకుల మంటతోనూ, బొగ్గులపైనా కూడా రోస్ట్ చేస్తుంటారు. వేగంగా పని అయిపోవాలనుకునే మరి కొందరు రోస్ట్ చేసేందుకు మైక్రోవేవ్ ను కూడా వినియోగిస్తారు. కానీ అన్నింటికంటే గులకరాళ్ళపై రోస్ట్ చేసే వాటినే జపాన్ జనం ఎక్కువగా ఇష్టపడతారు. మరి కొనుగోలుదారులను ఆకట్టుకొనేందుకు ఇతర దేశాలవారూ ఇలాంటి ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చేమో చూడండి..! -
బికినీకి 70 ఏళ్ళు!
ప్రపంచ అతిచిన్న బాతింగ్ సూట్ గా ప్రకటనల్లో ప్రసిద్ధి చెంది, ఫిలిప్పీన్స్, బాలి, హవాలి, గోవా వంటి ఎన్నో దేశాల్లో రంగు రంగులతో ఆకట్టుకున్న బికినీల వెనుక.. పెద్ద చరిత్రే ఉంది. బికినీలు రూపొందిన తర్వాత మొదట్టో ఎన్నో అభ్యంతరాలు వెల్లువెత్తినా... అనంతరం ఈతకోసం స్త్రీలు ధరించే ప్రత్యేక దుస్తులుగా గుర్తింపు పొంది, ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకట్టుకున్నాయి. అతి కురుచ దుస్తులైన బికినీల వెనుక అభ్యంతరాలు కోకొల్లలైనా... ప్రాచుర్యంలోకి వచ్చి 70 ఏళ్ళు పూర్తి చేసుకున్నాయి. భారతదేశంలో సాధారణ ప్రజలు బికినీలను ధరించడం అరుదుగా కనిపించినా.. బాలీవుడ్ సినిమాల్లో తారలు తమ అందాలను ఆరబోసేందుకు బికినీలను ధరించడం దశాబ్దాల క్రితమే కనిపిస్తుంది. సముద్ర తీరాల్లోనూ, స్విమ్మింగ్ పూల్స్ లోనూ ఈతకోసం స్త్రీలు ధరించే ఈ ప్రత్యేక దుస్తులైన బికినీలు శరీరభాగాలను బహిర్గతం చేస్తున్నాయన్న కారణంతో చాలా దేశాల్లో ఈ దుస్తులపై నిషేధం కూడా విధించారు. టూ పీస్ డ్రెస్ అంటూ మొట్టమొదటిసారి ఈ దుస్తులను ఫ్రాన్స్ దేశస్థుడు లూయిజ్ రియర్డ్ రూపొందించగా..బెర్నార్గీ అనే ఫ్రెంచ్ మోడల్ ధరించి జూలై 5, 1946 లో జరిగిన ప్యారిస్ ఫ్యాషన్ షోలో ప్రదర్శించి ప్రపంచ ప్రజలను ఆకట్టుకుంది. సంప్రదాయాలకు పెద్ద పీట వేసే భారతదేశంలో సాధారణ ప్రజలు బికినీలకు వ్యతిరేకమైనా.. తారల అందచందాలను ఒలకబోసేందుకు సినీరంగం ఈ దుస్తులను బాగానే ఆదరించింది. బాలీవుడ్ తార మీనాక్షీ శిరోద్కర్ ఓ మరాఠీ సినిమాలో సింగిల్ స్విమ్ సూట్ లో కనిపించి, చరిత్రను తిరగరాసింది. అనంతరం యాన్ ఈవెనింగ్ ఇన్ ప్యారిస్ సినిమాలో షర్మిలా ఠాగూర్, బాబీ సినిమాలో డింపుల్ కపాడియా.. స్విమ్ సూట్ (బికినీ) లో కనిపించగా... తర్వాత ఎందరో నటీమణులు ఆ సంప్రదాయాన్ని ధైర్యంగా కొనసాగించారు. అలాగే తెలుగు సినిమాల్లోనూ నాటితరం నుంచి నేటివరకూ బికినీ భామలు హొయలొలికిస్తూనే ఉన్నారు. రోమన్ చిత్ర పటాల్లోని బికినీలను పోలిన దుస్తులను చూస్తే ఎన్నో వేల ఏళ్ళ క్రితమే స్త్రీలు బికినీలు ధరించినట్లు తెలుస్తుంది. 1700 సంవత్పరాల క్రితం ఛాంబర్ ఆఫ్ టెన్ మెయిడెన్స్ అనే రోమన్ మొజాయిక్ చరిత్రను చూస్తే.. క్రీడాకారిణులు బికినీలు ధరించినట్లు కనిపిస్తుంది. అనంతరం అనేక రకాల ఆధునిక బికినీలు ప్రపంచానికి పరిచయమయ్యాయి. బీచ్ లాంజెర్ లో రిలాక్స్ అయ్యేందుకు మొట్టమొదటి సౌరశక్తి బికినీ 'ఐకిని' ని డిజైనర్ ఆండ్రూ స్కూనైడర్ రూపొందించారు. 1951 లో జరిగిన ప్రిమియర్ మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన స్వీడన్ కు చెందిన కికి హాకన్ సన్ బికినీని ధరించి టైటిల్ గెలుచుకొంది. అయితే అనంతరం బ్యూటీ పేజెంట్లలో ప్రపంచవ్యాప్తంగా బికినీలపై నిషేధం విధించడంతో.. బికినీ ధరించి మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న మొట్టమొదటి, చివరి మహిళగా ఆమె మిగిలిపోయింది. అలాగే 30 మిలియన్ డాలర్ల అతి ఖరీదైన బికినీని డైమండ్స్ తో సుసాన్ రోజెన్ రూపొందించారు. స్టార్ వార్స్ 6వ ఎపిసోడ్ లో ప్రిన్సెస్ లీయా డోన్డ్ సైతం మెటాలిక్ బికినీ ధరించి కనిపిస్తుంది. 90వ శకంలో ఇంటర్నేషనల్ వాలీబాల్ ఫెడరేషన్ బీచ్ వాలీబాల్ పోటీలకు 'శాండ్ రిలీజ్ సిస్టమ్' కలిగిన బికినీని మహిళల యూనిఫాంగా అనుమతించింది. జంతు హింసను నిరోధించి జనం శాకాహారులుగా మారాలంటూ చేసిన ప్రచారానికి సైతం మహిళలు.. ముఖ్యంగా ఆకులు అలములతో రూపొందించిన బికినీలు ధరించినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. -
కదులుతున్న ‘నకిలీ’ల డొంక
వెలుగుచూస్తున్న మరిన్ని విషయాలు యూనివర్సిటీ సర్టిఫికెట్లు సైతం తయారీ పెరుగుతున్న నిందితుల సంఖ్య ఒక్క దివిసీమలోనే 600 ఆటోలకు నకిలీ బీమా ! గుడివాడ అర్బన్/ చల్లపల్లి : నకిలీ సర్టిఫికెట్ల కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. రెండు రోజులుగా టూటౌన్ పోలీసుల అదుపులో ఉన్న 9మంది నిందితులు వెల్లడిస్తున్న వాస్తవాలు తీవ్ర సంచలనానికి దారి తీస్తున్నాయి. దీంతో మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్సూరెన్స్, ఆధార్, రేషన్, ఓటరు కార్డులే కాకుండా యూనివర్సిటీస్థాయి ఇంటర్మీడియేట్, డిగ్రీ, పీజీ పట్టాలను సైతం నకిలీవి సృష్టించి ఇస్తున్నట్లు విచారణలో గణేష్ అనే నిందితుడు బయటపెట్టాడు. దీంతో పోలీసులు ఈ తరహా సర్టిఫికెట్లను తయారు చేసే వారిని, వీరి వద్ద నుంచి సర్టి ఫికెట్లు పొంది ఉద్యోగాలు చేస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుంటే మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశాలున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో నకిలీ సర్టిఫికెట్లు పొంది ఉన్నతోద్యోగాల్లో ఉన్న వారందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వెలుగు చూసిందిలా.... ఇటీవల గుడివాడ సివిల్ కోర్టుకు చెందిన ఓ ఉన్నతాధికారి భర్త ద్విచక్ర వాహనం బీమా రెన్యూవల్ చేయించమని కారు డ్రైవర్‌కు ఇచ్చారు. కారు డ్రైవర్ నకిలీ పత్రాలు సృష్టించే గణేష్‌ను ఆశ్రయించాడు. అతను ఇన్సూరెన్స్ పత్రాన్ని అందించాడు. ఇన్సూరెన్స్ పత్రం తీసుకున్న తరువాత కూడా కంపెనీ నుంచి యజమానికి ఫోన్ రావడంతో నెట్లో ఇన్సూరెన్స్‌ను చెక్ చేశాడు. ఇన్సూరెన్స్ రె న్యూవల్ చేయించలేదని తేలడంతో కారు డ్రైవర్ని నిలదీశాడు. గణేష్ అనే యువకుడు రెన్యూవల్ చేసి ఇచ్చాడని చెప్పాడు. దీంతో విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు వలపన్ని శనివారం రాత్రి గణేష్‌ను పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసుల అదుపులో ఉన్నవారిని ప్రశ్నించడంతో 17ప్రైవేటు కంపెనీలకు చెందిన ఇన్సూరెన్స్ ఏజెంట్ల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఏ సర్టిఫికెట్‌నైనా సృష్టిస్తాడు.. ఏ సర్టిఫికెట్లనైనా సునాయాసంగా సృష్టించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి గణేష్ అని పోలీసుల విచారణలో బయటపడింది. ఇన్సూరెన్స్, ఆధార్, రేషన్, ఓటరుకార్డులతో పాటు ఆచార్య నాగార్జున, అంబేద్కర్, ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి అమ్ముతున్నాడు. రూ.2000నుంచి రూ.3000 తీసుకుని సర్టిఫికెట్లు ఇచ్చినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు సమాచారం. అదుపులో 15మంది నిందితులు.. ఆదివారం అదుపులోకి తీసుకున్న 9మంది నుంచి మరింత సమాచారాన్ని సేకరించారు. ఈ తరహా సర్టిఫికెట్లను ఏ నెట్ సెంటర్ నిర్వాహకులు తయారుచేస్తారని అడగడంతో మరో ఆరుగురు పేర్లను చెప్పారు. దీంతో ఆ ఆరుగురిని పోలీసులు ఆదివారం రాత్రి స్టేషన్‌కు తీసుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఈ కేసులో మరో 20మందిని అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి. గుడివాడలో 35శాతం అక్రమ ఆధార్‌లే.. గుడివాడలో నివసిస్తున్న వారిలో ఆధార్ కార్డులు పొందినవారిలో 35శాతం వరకూ అక్రమ కార్డులు పొందినవారేనని సమాచారం. ఒక్క గుడివాడ పట్టణంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఈ విధమైన కేసులు చాలా ఉన్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. బెంబేలెత్తుతున్న ఆటో డ్రైవర్లు.... దివిసీమలో వెలుగుచూసిన నకిలీబీమా పత్రాలు ఆటో డ్త్రెవర్లను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ నకిలీ పత్రాల వల్ల ప్రమాద సమయంలో ప్రయాణికులకు ఎలాంటి బీమా సౌకర్యం వచ్చే పరిస్థితి లేకపోవడంతో వారికి భద్రత లేకుండా పోయింది. దివిసీమ కేంద్రంగా ఏడాదిన్నర నుంచి సంబంధిత శాఖాధికారులకు తెలిసి ఈ బాగోతం సాగుతున్నా ముడుపులు తీసుకుని పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. రూ.3,893 బీమా రూ.1,500లకే! ఆటోకు సంబంధించి పెంచిన ధరల ప్రకారం ఏడాదికి రూ.11,500 వరకూ బీమా చెల్లించాల్సి ఉంది. ప్రమాదం జరిగినపుడు ఆటోకు, వాహనం నడిపే డ్త్రెవర్, అందులోని ముగ్గురు ప్రయాణికులకు ప్రమాద తీవ్రతను బట్టి బీమా సొమ్ము చెల్లిస్తారు. అలాకాకుండా చాలా మంది డ్రెవర్లు థర్డ్‌పార్టీకి మాత్రమే బీమా చేయిస్తుంటారు. ఇందుకోసం ఏడాదికి రూ.3,893 చెల్లించాల్సి ఉండగా, ఇదికూడా భారంగా భావిస్తున్న డ్త్రెవ ర్ల కోసం అక్రమార్కులు ప్రత్యేక స్కీం పెట్టారు. కొంతమంది ఆటోడ్త్రెవర్లకు ఈ విషయాన్ని చెప్పి రూ.3,893 విలువగల బీమా పత్రాలను రూ.1,500కే అందజేస్తున్నారు. తనిఖీల సమయంలో బీమా రెన్యూవల్ అయిందా లేదా అని మాత్రమే సంబంధిత అధికారులు పరిశీలిస్తుండటంతో నకిలీ బీమా పత్రాలు చెల్లుబాటవుతున్నాయి. గత ఏడాదిన్నర నుంచి దివిసీమలో ఇలాంటి పత్రాలు 600ఆటోలకు అందజేసినట్లు తెలిసింది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. -
కారు డ్రైవర్ చెప్పిన పాఠాలు
ప్రేరణ ఆయన వయస్సు ఇప్పుడు 61 ఏళ్లు. జుట్టు నెరిసిపోయింది. చూపు మందగించింది. ఆ వ్యక్తి దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలో 25 ఏళ్లపాటు పనిచేశారు. ఆయన నుంచి నేను ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. అలాగనీ ఆయన భారీ వేతనం వచ్చే చాలా గొప్ప ఉద్యోగం చేసినవారు కాదు. పేరు కూడా మీరు ఇప్పటిదాకా విని ఉండరు. ఆయన నా కారు డ్రైవర్. పేరు కరుణన్.. జీవితంలో కొన్నిసార్లు విలువైన పాఠాలను సాధారణ వ్యక్తుల నుంచి కూడా నేర్చుకుంటాం. ఓ రోజు ఉదయం కరుణన్ నాతో చాలాసేపు మాట్లాడారు. తన జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పారు. కరుణన్గొప్ప కాలేజీల్లో ప్రముఖుల సమక్షంలో అతిథి ప్రసంగాలు చేయకపోయినా ఆయన నాతో చెప్పినవి నేటి యువతరానికి తప్పకుండా ఉపయోగడతాయి. ఏం చెప్పారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. లెసైన్స్ వస్తే డ్రైవింగ్ వచ్చినట్టేనా? డ్రైవింగ్ లెసైన్స్ వచ్చినప్పుడు నా వయస్సు 18 ఏళ్లు. అంతకు కొన్ని నెలల ముందుగానే కారు నడపడం నేర్చుకున్నా. లెసైన్స్ వచ్చేయగానే డ్రైవర్ అయినట్లు కాదు. అది వాహనం నడపడానికి ఒక అనుమతి పత్రం మాత్రమే. అథారిటీ స్టాంప్ లాంటిది కాదు. కారును పూర్తిగా నడపడం వచ్చినవారే డ్రైవర్ తప్ప లెసైన్స్ సంపాదించుకున్నవారు డ్రైవర్ కాలేరు. ఎంబీఏ డిగ్రీ ఒక వ్యక్తిని మేనేజర్‌గా మార్చలేదు. కొన్నేళ్లు పని నేర్చుకొని, తగిన అనుభవం సంపాదిస్తేనే మేనేజర్ అనే హోదాను పొందుతారు. నేటితరం విద్యార్థులు డిగ్రీ చేతికి రాగానే అన్ని నేర్చుకున్నట్లేనని భ్రమపడుతున్నారు. కానీ, అది ముగింపు కాదు, ప్రారంభం మాత్రమే. ఒక డిగ్రీ, డిప్లొమా, లెసైన్స్... వాస్తవ జీవిత అనుభవాల నుంచి నేర్చుకొనేందుకు ఒక వ్యక్తికి తగిన అర్హత కల్పిస్తాయి. అంతేతప్ప పరిపూర్ణుడిగా మార్చలేవు. బాహ్య ప్రపంచం ఎంతో భిన్నం: నేను కారు నడపడం నేర్చుకున్నా. కానీ, నా తొలి ఉద్యోగం చిన్న టెంపో వాహనం నడపడం. కారుతో పోలిస్తే దీని స్టీరింగ్ చక్రం, గేర్లు చాలా భిన్నంగా ఉన్నాయి. నేను దీన్ని తేలికగా డ్రైవ్ చేస్తానని అనుకున్నా.. కానీ, కనీసం స్టార్ట్ కూడా చేయలేకపోయా. తరగతి గది బయట ఉండే ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది. ఇంజనీర్లు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు, అకౌంటెంట్లు, ఇతరులు ఈ విషయం గుర్తుంచుకోవాలి. బయటి ప్రపంచాన్ని యథాతథంగా స్వీకరించడానికి సంసిద్ధులు కావాలి. కొన్ని మెట్లు కిందికి దిగండి: నేను రాత్రిపూట క్లీనర్‌గా కూడా పనిచేశా. వాహనాల లోపల ఉండే విడిభాగాలను పరిశీలించి, వాటి పనితీరును అర్థం చేసుకొనేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడింది. దానివల్ల నేను ఒక మంచి డ్రైవర్‌గా మారగలిగాను. దేశంలో నేడు పేరుప్రఖ్యాతులు సంపాదించిన మార్కెటింగ్ నిపుణులంతా ఒకప్పుడు చిన్నచిన్న పట్టణాల్లో సబ్బులు, కోలాలు, ఇతర వస్తువులు అమ్మినవారే. ఆ అనుభవం నుంచే వారు పాఠాలు నేర్చుకొని ఉన్నతస్థానాలకు ఎదిగారు. మీరు జీవితంలో విజయం సాధించాలని నిజంగా కోరుకుంటే.. మీ స్థాయి నుంచి కొన్నిమెట్లు కిందికి దిగండి. చేతులకు మరకలు అంటినా ఫర్వాలేదు బాగా కష్టపడండి. మంచి యజమాని.. విలువైన జీతం: నా మొదటి ఉద్యోగంలో వేతనం చాలాచాలా తక్కువ. కానీ, యజమాని చాలా మంచివాడు. పనిలో తప్పులు చేసినా సరిదిద్దుకోవడానికి ఆయన నాకు అవకాశాలిచ్చారు. యజమాని నుంచి నేర్చుకున్న మంచి విషయాలు మనసులో ముద్రించుకుపోయాయి. మీ తొలి ఉద్యోగంలో.. జీతభత్యాల గురించి, సంస్థ పరిమాణం గురించి ఎక్కువగా ఆలోచించకండి. మంచి యజమాని దొరికితే.. అంతకంటే విలువైన వేతనం ఉండదు. చేస్తున్న పనే ముఖ్యం: బాగా ఖరీదైన, విలాసవంతమైన కార్లనే నడపాలనే కోరిక నాలో ఉండేది. ప్రారంభంలో టెంపో, స్కూల్ వ్యాన్, సిటీ బస్సు నడపాల్సి వచ్చింది. వాహనం ఏదైనప్పటికీ డ్రైవింగ్‌పైనే దృష్టి పెట్టాను. తర్వాత గొప్ప కార్లను నడిపే అవకాశాలు వచ్చాయి. కంపెనీ ముఖ్యం కాదు, చేస్తున్న పనే ముఖ్యం. తర్వాత రాబోయే ఉద్యోగం, పదోన్నతులు, వేతనాల గురించి ఆలోచించకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా.. అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తిచేసేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తే విజయం, ఆనందం వాటంతట అవే అనివార్యంగా వస్తాయి. -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో -
మహిళల్లో మూత్రసంబంధిత వ్యాధులు...తెలుసుకోవలసిన విషయాలు
మహిళల్లో మూత్రాశయానికి సంబంధించిన సమస్యలు చాలా తరచుగా వస్తుంటాయి. ఇందులో ముఖ్యంగా మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్ రావడం, తమ ప్రమేయం లేకుండా మూత్రం కారిపోవడం (యూరినరీ ఇన్‌కాంటినెన్స్) అనే సమస్యలను చాలా ఎక్కువగా చూస్తుంటాం. మూత్రంలో ఇన్ఫెక్షన్ అనే సమస్యతో బాధపడేవారు మూత్రవిసర్జన సమయంలో మంట, తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సిరావడం, చలిజ్వరం వంటి లక్షణాలతో వస్తుంటారు. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మూత్రంలో రక్తం వచ్చే అవకాశం ఉంది. మూత్రంలో ఇన్ఫెక్షన్ ఎన్నో కారణాల వల్ల రావచ్చు. చిన్నపిల్లల్లో ముఖ్యంగా అమ్మాయిల్లో కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. పిల్లల్లో ఈ సమస్య వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీబయాటిక్స్ వాడి ఊరుకోకుండా ఈ సమస్యకు కారణాలేమిటో పరిశీలించాలి. ఎందుకంటే చిన్నపిల్లల అవయవాలలో పుట్టుకతోనే వచ్చే మార్పుల (కంజెనిటల్ అనామలీస్) వల్ల మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అసలు కారణం తెలుసుకోకుండా ఎన్నిసార్లు చికిత్స చేసినా ఉపయోగం ఉండదు. సరికదా... మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. యువతుల్లో, కొత్తగా పెళ్లయిన మహిళల్లో మూత్రంలో ఇన్ఫెక్షన్స్ చాలా సాధారణంగా వస్తుంటాయి. కొత్తగా పెళ్లయిన వాళ్లలో వచ్చే హనీమూన్ సిస్టైటిస్ వల్ల ఈ సమస్య వస్తుంది. మహిళల్లో మూత్రనాళం చిన్నగా ఉండటం, జననేంద్రియాలకు దగ్గరగా ఉండటం వల్ల పురుషుల కంటే తరచుగా స్త్రీలలో ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. వయసుమళ్లిన స్త్రీలలో (పోస్ట్ మెనోపాజల్ ఉమన్‌లో) కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్స్ చాలా సాధారణంగా వచ్చే సమస్యే. దీనికి కారణం నెలసరి ఆగిపోయిన తర్వాత వచ్చే హార్మోన్ల లోపమే. ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ లోపం వల్ల మూత్రనాళం సన్నబడే అవకాశం ఉంది. దీనివల్ల మూత్రాశయంలో మూత్రం నిల్వ ఉండి మాటిమాటికీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ హార్మోన్ల లోపం వల్ల మూత్రాశయంలోని కణాలకు రోగకారక క్రిముల (బ్యాక్టీరియా)ను ఎదుర్కొనే శక్తి తగ్గిపోతుంది. మూత్రంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ రకరకాలుగా రావచ్చు. మూత్రనాళంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ను యురెథ్రైటిస్ అని అంటారు. మూత్రాశయంలోని ఇన్ఫెక్షన్స్ను సిస్టయిటిస్ అంటారు. మూత్రపిండాల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. అలాగే మొదటిసారి మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడాన్ని ప్రైమరీ ఇన్ఫెక్షన్ అనీ, మళ్లీ మళ్లీ రావడాన్ని పర్సిస్టెంట్ బ్యాక్టీరియోరియా అనీ లేదా రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అని అంటారు. మొదటిసారి వచ్చే ఇన్ఫెక్షన్స్ కోసం ప్రత్యేకమైన పరీక్షలేమీ అవసరం లేదు. కానీ మళ్లీ మళ్లీ వస్తుంటే మాత్రం అది ఏ కారణం వల్ల అన్నది తెలుసుకోవాలి. ఆ తర్వాతే నిర్దిష్టంగా చికిత్స జరగాల్సి ఉంటుంది. పుట్టుకతో వచ్చే లోపాలకూ, మూత్రపిండాల్లో రాళ్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్కు అవసరమైతే ఆపరేషన్ చేసి, ఆ లోపాన్ని సరిచేయాల్సి రావచ్చు. ఒక్కోసారి మూత్రావయవాలలో టీబీ వల్ల కూడా మాటిమాటికీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది మామూలుగా చేసే కల్చర్ పరీక్షలో బయటపడదు. టీబీ క్రిముల కోసం ప్రత్యేకమైన మూత్రపరీక్షలు చేయాల్సి ఉంటుంది. మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చేవారికి సాధారణంగా చేసే పరీక్షలే కాకుండా మూత్రావయవాలలో ఏమైనా మార్పులు వచ్చేయేమో తెలుసుకోడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్, కొన్ని ప్రత్యేకమైన ఎక్స్-రే (ఐవీయూ, ఎంసీయూజీ లాంటివి) పరీక్షలు చేయాల్సి ఉంటుంది. గర్భవతుల్లో వచ్చే మూత్ర సంబంధిత సమస్యలు... గర్భవతుల్లో కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే గర్భసంచి పెరుగుతున్నకొద్దీ అది మూత్రనాళాలపై ఒత్తిడి కలగజేయడం వల్ల మూత్రపిండాలు వాచిపోతాయి. దాంతో మూత్రాశయంలో ఉండే ఇన్ఫెక్షన్ కాస్తా... మూత్రపిండాలకూ చేరే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల అబార్షన్ అయ్యే ప్రమాదమూ ఉంది లేదా నెలలు నిండకముందే ప్రసవం కూడా కావచ్చు. అందువల్ల గర్భవతులు మూత్రపరీక్ష చేయించుకుని, ఇన్ఫెక్షన్ ఉంటే తప్పక మందులు వాడాల్సి ఉంటుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్కి చికిత్స... సాధారణంగా వచ్చే సిస్టైటిస్‌కి మూడురోజుల పాటు యాంటీబయాటిక్స్ కోర్సు సరిపోతుంది. మూత్రపిండాలలో ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే పదినుంచి పదిహేను రోజుల వరకు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కొందరిలో తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తున్నట్లయితే దీర్ఘకాలం పాటు చికిత్స (లాంగ్ టర్మ్ సప్రెసెంట్ థెరపీ) అవసరమవుతుంది. ఇందులో చాలా తక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. ఇక అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... మహిళల్లో మూత్రంలో ఇన్ఫెక్షన్స్ రావడం చాలా సాధారణమే అయినా, మాటిమాటికీ వస్తుంటే మాత్రం దానికి అసలు కారణం కనుక్కోవాలి. దీనిని అందరూ గుర్తుంచుకోవాలి. లేకపోతే దీర్ఘకాలంలో మూత్రపిండాలపై దుష్ర్పభావం పడవచ్చు. నిర్దిష్టమైన కారణాన్ని తెలుసుకుంటే కచ్చితమైన చికిత్సను అందించడానికి అవకాశం ఉంటుంది. నిర్వహణ: యాసీన్ డాక్టర్ కె. లలిత, సీనియర్ యూరాలజిస్ట్ - యూరో గైనకాలజిస్ట్, యశోదా హాస్పిటల్స్, సోమాజీగూడ, హైదరాబాద్.