ఒక్కోసారి ఎంత ప్రయాసపడ్డా తలపెట్టిన పనులు ఒక పట్టాన జరగవు. గ్రహాల సానుకూలత లేనప్పుడు కార్యసిద్ధి కలలో మాటలా అనిపిస్తుంది. ఉద్యోగ, వృత్తి, వ్యాపార వ్యవహారాల్లో పనులు మందగిస్తాయి. తరచు వైఫల్యాలు ఎదురవుతుంటాయి. కొన్ని తేలికపాటి పరిహారాలను పాటించడం ద్వారా ఈ దుష్ప్రభావాలను తొలగించుకోవచ్చు.
👉ఇంట్లో ఏళ్ల తరబడి వాడకుండా ఉన్న పాత వస్తువులను వదిలించుకోండి.
👉 వీలైనంత వరకు ఇంట్లో రోజూ ఒకేచోట కూర్చుని భోజనం చేయండి. మంచం మీద కూర్చుని భోంచేసే అలవాటు ఉంటే మానుకోండి. 👉 తల్లిదండ్రుల యోగక్షేమాలను పట్టించుకోండి. కొత్త పనులు తలపెట్టబోయే ముందు వారి ఆశీస్సులు తీసుకోండి. గురువులను, గురు సమానులను, సాధు సన్యాసులను ఆదరంగా చూడండి. వీలైతే వారికి భోజనం పెట్టడం, వస్త్రాలను కానుకగా ఇవ్వడం వంటివి చేసి వారి ఆశీస్సులు పోందండి.
👉బియ్యం, గోధుమలు, శనగలు, పాలతో తయారు చేసిన తీపి పదార్థాలను పిల్లలకు, యాచకులకు, వికలాంగులకు పంచిపెట్టండి. ముఖ్యంగా ఆది, గురు, శుక్రవారాల్లో ఇలా చేయడం మంచిది.
👉ఇంట్లో నిత్యపూజకు పసుపు రంగు పూలను ఉపయోగించండి. అలాగే, దేవాలయాలలో పసుపురంగు పూమాలలను సమర్పించండి.
– సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment