happening
-
అనుకున్న పనులు జరగడం లేదా..?
ఒక్కోసారి ఎంత ప్రయాసపడ్డా తలపెట్టిన పనులు ఒక పట్టాన జరగవు. గ్రహాల సానుకూలత లేనప్పుడు కార్యసిద్ధి కలలో మాటలా అనిపిస్తుంది. ఉద్యోగ, వృత్తి, వ్యాపార వ్యవహారాల్లో పనులు మందగిస్తాయి. తరచు వైఫల్యాలు ఎదురవుతుంటాయి. కొన్ని తేలికపాటి పరిహారాలను పాటించడం ద్వారా ఈ దుష్ప్రభావాలను తొలగించుకోవచ్చు. 👉ఇంట్లో ఏళ్ల తరబడి వాడకుండా ఉన్న పాత వస్తువులను వదిలించుకోండి. 👉 వీలైనంత వరకు ఇంట్లో రోజూ ఒకేచోట కూర్చుని భోజనం చేయండి. మంచం మీద కూర్చుని భోంచేసే అలవాటు ఉంటే మానుకోండి. 👉 తల్లిదండ్రుల యోగక్షేమాలను పట్టించుకోండి. కొత్త పనులు తలపెట్టబోయే ముందు వారి ఆశీస్సులు తీసుకోండి. గురువులను, గురు సమానులను, సాధు సన్యాసులను ఆదరంగా చూడండి. వీలైతే వారికి భోజనం పెట్టడం, వస్త్రాలను కానుకగా ఇవ్వడం వంటివి చేసి వారి ఆశీస్సులు పోందండి. 👉బియ్యం, గోధుమలు, శనగలు, పాలతో తయారు చేసిన తీపి పదార్థాలను పిల్లలకు, యాచకులకు, వికలాంగులకు పంచిపెట్టండి. ముఖ్యంగా ఆది, గురు, శుక్రవారాల్లో ఇలా చేయడం మంచిది. 👉ఇంట్లో నిత్యపూజకు పసుపు రంగు పూలను ఉపయోగించండి. అలాగే, దేవాలయాలలో పసుపురంగు పూమాలలను సమర్పించండి.– సాంఖ్యాయన -
Annie Ernaux: స్వీయ అనుభవాలే సాహిత్యం
ఆనీ ఎర్నౌకు 23 ఏళ్లు ఉండగా అవాంఛిత గర్భం వచ్చింది. దాంతో చట్టవిరుద్ధంగా అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఇది జరిగింది 1963లో. 1999లో ఈ అనుభవాన్ని ఆమె నవలగా రాసింది. 130 పేజీల ఈ నవల 2000 సంవత్సరంలో ‘హ్యాపెనింగ్’ పేరుతో వెలువడి సంచలనం రేపింది. కాల్పనిక సాహిత్యం రాసే ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌ ఆ రకమైన సాహిత్యాన్ని వదిలిపెట్టి స్వీయ జీవితంలోని పరాభవాలు, ఆందోళనలు దాపరికం లేకుండా రాయడం కూడా సాహిత్యమేనని గ్రహించింది. 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్ ప్రెయిజ్ గెలుచుకున్న ఆనీ ఎర్నౌ ఇంగ్లిష్‌లో రాయకున్నా ఈ బహమతి గెలుచుకున్న అతి కొద్దిమంది మహిళల్లో ఒకరు. ఆమె గురించి... ఆమె పుస్తకాల గురించి... ‘ఇది పురుషాధిక్య ప్రపంచం. దీనిని బోనెక్కించాల్సిన సమయం వచ్చినప్పుడు బోనెక్కించాల్సిందే’ అంటుంది 82 సంవత్సరాల ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌ. తన జీవితంలో జరిగిన ఒక సంఘటన– చట్ట విరుద్ధంగా అబార్షన్ చేయించుకోవాల్సి రావడాన్ని– 1999లో ఫ్రెంచ్‌లో ‘ఇవెన్మో’ పేరుతో నవలగా రాస్తే మరుసటి సంవత్సరం అది ‘హ్యాపెనింగ్’ పేరుతో ఇంగ్లిష్‌లో అనువాదం అయ్యి వెలువడింది. ఆ సందర్భంగా ఆనీ ఎర్నౌ అన్న మాట అది. ‘నా జీవితంలో నాకు జరిగింది రాయడం ఎందరో స్త్రీలకు గొంతునివ్వడమే’ అని ఆమె అంది. ‘నాకు అవాంఛిత గర్భం వచ్చినప్పుడు అది నా వ్యక్తిగతమైన విషయంగా మిగల్లేదు. బయటపడితే నా కుటుంబం మొత్తం సామాజిక నీతిలో విఫలమైందన్న విమర్శను మోయాల్సి వచ్చేది’ అంటుందామె. కాకతాళీయమే అయినా ఇండియాలో అబార్షన్ గురించి సుప్రీంకోర్టు స్త్రీలకు సంపూర్ణ హక్కులు ఇచ్చిన సందర్భంలోనే అబార్షన్ గురించి, స్త్రీల దైహిక వేదనల గురించి, మనో సంఘర్షణల గురించి, వారికి మాత్రమే ఎదురయ్యే అనుభవాల గురించి అది కూడా శ్రామిక వర్గ కోణం నుంచి విస్తృతంగా రాసిన ఆనీ ఎర్నౌకు నోబెల్ సాహిత్య బహుమతి లభించింది. ఇప్పటి వరకు 119 మంది నోబెల్ సాహిత్య బహుమతి లభిస్తే వారిలో కేవలం 16 మందే స్త్రీలు. ఆనీ ఎర్నౌ 17వ రచయిత్రి. బాల్యం నుంచి గుణపాఠాలే ఫ్రాన్స్‌లోని ఇవెట్తో అనే ఊళ్లో చిన్న పచారీ కొట్టు నడిపేవారు ఆనీ తల్లిదండ్రులు. తండ్రికి పట్టకపోయినా జీవితాలు మారాలంటే చదువు ముఖ్యం అని ఆమె తల్లి గట్టిగా భావించింది. దాంతో తమ స్థాయికి చెందకపోయినా కాస్త మంచిబడిలో ఆనీని చేర్పించింది. ఆ బడికి కలిగిన పిల్లలు వచ్చేవారు. ‘అక్కడే నాకు తొలిపాఠం తెలిసింది. శ్రామిక వర్గానికి దక్కే మర్యాదలు కూడా తెలిశాయి. నిన్ను నువ్వు చిన్నబుచ్చుకుంటూ బతకాల్సి రావడం కంటే ఘోరమైన విషయం లేదు. మన స్థాయికి మించిన విషయాల్లో అడుగు పెట్టకూడదని నాకు గట్టిగా అందిన సందేశం అందింది’ అంటుందామె. ఆమె తన స్వీయానుభవాల ఆధారంగా ‘ఏ గర్ల్స్ స్టోరీ’ (2016) అనే నవల రాసింది. ‘18 ఏళ్ల అమ్మాయి స్టూడెంట్స్ క్యాంప్‌లో లైంగిక అనుభవం పొందితే అది సంతోషకరంగా ఉండాలి. కాని ఇది తెలిసిన వెంటనే మగ విద్యార్థులు ఆ అమ్మాయిని గేలి చేశారు. ఆమె అద్దం మీద అసభ్యకరంగా రాసి వెక్కిరించారు. ఎన్నాళ్లు గడిచినా నైతికంగా పతనమైన భావనను కలిగించారు’ అని రాసిందామె. చదువు ముగిశాక ఆమె టీచర్‌గా మారి ఆనీ ఎర్నౌ 2000 సంవత్సరంలో రిటైరయ్యి పూర్తికాలం రచయిత్రిగా రచనలు కొనసాగిస్తూ ఉంది. సూటిగా, సులభంగా ఆనీ ఎర్నౌ రచనా శైలి సూటిగా సులభంగా ఉంటుంది. నేరుగా పాఠకులకు అందేలా ఆమె వచనశైలి ఉంటుంది. నోబెల్ కమిటీ కూడా ఇదే మాట అంది. ‘ఆమె సాహిత్యం అత్యంత సాధారణ భాషలో అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది’ అని అభిప్రాయపడింది. ఆనీ ఎర్నౌ రాసిన పుస్తకాల్లో ‘క్లీన్డ్ ఔట్’ (1974), ‘షేమ్’ (1997), ‘గెటింగ్ లాస్ట్’ (2001), ‘ది ఇయర్స్’ (2008) ముఖ్యమైనవి. 1988లో పారిస్‌లో ఉద్యోగం చేస్తున్న ఒక సోవియెట్ దౌత్యవేత్తతో ఆనీ ఎర్నౌ బంధం ఏర్పరుచుకుంది. అతడు ఆమె కంటే 12 ఏళ్లు చిన్నవాడు. కొంత కాలానికి ఆ బంధం ముగిసింది. ఆ సమయంలో తన భావోద్వేగాలను ‘గెటింగ్ లాస్ట్’ పేరుతో నవల రాసిందామె. అలాగే తన గురించి, ఫ్రాన్స్ సమాజం గురించి రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి ఇటీవలి కాలం వరకూ జరిగిన ఘటనలను ‘ది ఇయర్స్’గా రాసింది. ఒక రకంగా ఇది స్వీయ చరిత్ర, ఫ్రాన్స్ చరిత్ర కూడా. స్త్రీ పక్షపాతి ఆనీ ఎర్నౌ తనను తాను ‘రచనలు చేసే మహిళ’గా చెప్పుకున్నా ఆమె స్త్రీ పక్షపాతి. స్త్రీవాద ఉద్యమానికి ప్రోత్సాహకురాలు. ‘రాజకీయాలు భ్రష్టుపట్టిన ఈ సమయంలో ఫెమినిస్టులే సరిహద్దులను ప్రశ్నిస్తూ కొత్త ఆలోచనలను చేస్తూ ఆశలు రేకెత్తిస్తున్నారు’ అంటుందామె. ఇటీవల జరిగిన మీటూ ఉద్యమం ఆమెకు చాలా సంతోషాన్నిచ్చింది. ‘తమతో ఎలాగైనా వ్యవహరించవచ్చనే స్థితిని స్త్రీలు ఇక మీద ఏ మాత్రం అంగీకరించరు’ అంటారామె. ‘నేను రాయగలను కాబట్టే నాకు వినూత్న అనుభవాలు ఎదురవుతున్నాయి’ అని చెప్పుకున్న ఆనీ రాయగలిగే మహిళలంతా తమ జీవన అనుభవాలను బెరుకు లేకుండా చెప్పడాన్ని ప్రోత్సహిస్తుంది. అప్పుడే స్త్రీలు, స్త్రీలతో ఉన్న సమాజం మరింత మెరుగ్గా అర్థమవుతాయి. స్వీయ అనుభవాలే రచనలు ఆనీ ఎర్నౌ ఏవో ఊహించి కథలు అల్లడం కన్నా తన జీవితంలో జరిగినవే రాయాలని నిర్ణయం తీసుకుంది. దాంతో ఆమె జ్ఞాపకాల రచయిత్రి అయ్యింది. మన జీవితంలో జరిగినదాన్ని రాయడం వల్ల మిగిలినవారు పోల్చుకోవడానికో, సహానుభూతి చెందడానికో అది ఉపయోగపడుతుంది అంటుందామె. మనుషులు వేరే చోట్ల ఉన్నా వారు భావోద్వేగాలు ఒకటే కదా. ఆనీ ఎర్నౌ రాసిన ‘హ్యాపనింగ్’ నవల ఒక కాలపు ఫ్రాన్స్‌లో స్త్రీల సంఘర్షణను సూటిగా నిలపడంతో ఆమెకు ప్రశంసలు వచ్చాయి. 1963లో ఆమె అబార్షన్ చేయించుకోవాల్సి వస్తే ఆ తర్వాత 12 ఏళ్లకు కాని ఫ్రాన్స్‌లో (అవివాహితులకు) అబార్షన్‌ను చట్టబద్ధం చేయలేదు. ‘అబార్షన్ హక్కు లేకపోవడం అంటే.. చట్టం, సంఘపరమైన నియమాలు వ్యక్తి స్వేచ్ఛను పూర్తిగా ధ్వంసం చేయడమే’ అంటుందామె. -
పరిణామాలు బాధిస్తున్నాయి: ఇన్ఫోసిస్ మూర్తి
బెంగళూరు: దేశంలో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌లో ప్రకంపనలపై సహ వ్యవస్థాపకుడు, ఇన్ఫోసిస్ తొలి చైర్మన్ ఎన్ ఆర్ నారాయణ మూర్తి స్పందించారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, కార్పొరేట్ పాలన(గవర్నెన్స్)లో అత్యుత్తమ ప్రమాణాలకు మారు పేరుగా ఉన్న ఇన్ఫోసిస్ సంస్థలో సంక్షోభం తలెత్తిన మాట నిజమేనని అంగీకరించారు. అయితే సమస్య సీఈవో విశాల్ సిక్కాతో కాదనీ బోర్డులోని పారదర్శకత ప్రామాణికత ప్రధాన సమస్య అని చెప్పారు. కార్పొరేట్ గవర్నెన్స్ దారుణంగా పడిపోయిందని వ్యాఖ్యానించారు. ఇటీవల రాజీనామా చేసిన డేవిడ్ కెన్నెడీ, సిఎఫ్ఒ రాజీవ్ బన్సాల్ తదితరుల సెవరెన్స్ ప్యాకేలజీపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బన్సల్ కు సాధారణంగా 12 నెలల ప్యాకేజీ కంటే అదనంగా 10 రెట్లు చెల్లించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రెమ్యునరేషన కమిటీ ఛైర్మన్ (జెఫ్రీ లేమన్) నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక ప్యాకేజీ చెల్లింపు సందర్భంలో ఆయన ప్రత్యేక సమావేశం ద్వారా ఆమోదం పొంది ఉండాల్సిందన్నారు. ఇలాంటి అసాధారణ చెల్లింపు వెనుక అసలు కారణం ఏమిటి? అని ప్రశ్నించారు. ఇది సాధారణ ఉద్యోగులకు ఎలాంటి సంకేతాలను అందిస్తుందని కంపెనీ ఏకైక పెద్ద వాటాదారు (3.44శాతం)గా ఉన్న మూర్తి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మిడిల్ లెవల్, జూనియర్ లెవల్ ఉద్యోగులు ఇప్పటికే ఈ పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారనీ, దాదాపు 1800 పైగా ఈ మెయిల్స్ కు తనకు అందాయని చెప్పారు. దీనిపై సంస్థ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నారాయణ మూర్తి ఉద్ఘాటించారు. ఇది ఉద్యోగుల నైతిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించారు. ఎంతో మందిమి దశాబ్దాలుపాటు కష్టపడి ఉత్తమ విలువలు, సంస్కృతితో కూడిన సంస్థను తీర్చిదిద్దామని, కానీ ప్రస్తుత పరిణామాలు తనను తీవ్రంగా బాధిస్తున్నాయన్నారు. అయితే కంపెనీని వీడిన మాజీ సీఎఫ్‌వో రాజీవ్ బన్సల్, జనరల్ కౌన్సిల్ డేవిడ్ కెనడీలకు బోర్డు సెవెరెన్స్ ప్యాకేజీలను ఇచ్చింది. డిసెంబర్లో బాధ్యతల నుంచి తప్పుకున్న కెనడీకి 8.68 లక్షల డాలర్లతోపాటు, ఏడాదిపాటు బీమా కవరేజీ కొనసాగింపునకు నిర్ణయించింది. ఇక 2015 అక్టోబర్‌లో కంపెనీని వీడిన రాజీవ్‌కు రూ. 17.38 కోట్లను చెల్లించింది. అయితే ఈ చెల్లింపులను కంపెనీ నిబంధనలు, ఉద్యోగ ఒప్పందం ప్రకారమే నిర్ణయించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. గత ఏడాదికాలంగా విలువలు, పారదర్శకత, కార్పొరేట్ పాలన(గవర్నెన్స్)పై ఆందోళనలు చెలరేగినప్పటికి ఫిబ్రవరి 8,9 తేదీల్లో ఇవి మరింత వెలుగులో వచ్చాయి. అయితే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, యాజమాన్యం మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయన్న వార్తలను కంపెనీ సీఈఓ విశాల్ సిక్కా ఖండించారు.. కార్పొరేట్ నైతికత, సమగ్రత, విలువల విషయంలో ఇన్ఫోసిస్‌కు ఉన్న నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఇలాంటి ఊహాగానాలను నమ్మొద్దని ఉద్యోగులను కోరారు. కంపెనీ సిబ్బందికి పంపిన అంతర్గత ఈమెయిల్లో ఆయన ఈ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే -
భువన శుభారంభం
ఐటీఎఫ్ టోర్నమెంట్ ఔరంగాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి కాల్వ భువన శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 842వ ర్యాంకర్ భువన 1-6, 7-5, 6-4తో ప్రపంచ 396వ ర్యాంకర్ నవోమి కవాడే (బ్రిటన్)పై సంచలన విజయం సాధించింది. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లోకి అడుగుపెట్టిన భువన ఈ మ్యాచ్‌లో తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు చేసింది. అయితే తన ప్రత్యర్థి సర్వీస్‌ను కీలక దశల్లో ఐదుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. డబుల్స్‌లో మాత్రం భువన జంటకు పరాజయం ఎదురైంది. తొలి రౌండ్లో భువన-రష్మీ తెల్తుంబ్డే (భారత్) ద్వయం 3-6, 0-6తో కై లిన్ జాంగ్-యుకున్ జాంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. హైదరాబాద్‌కే చెందిన నిధి చిలుముల డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో నిధి-ప్రార్థన తోంబ్రే (భారత్) జంట 5-7, 6-3, 10-6తో స్నేహదేవి రెడ్డి-ధ్రుతి వేణుగోపాల్ (భారత్) ద్వయంపై గెలిచింది.