planned
-
అనుకున్న పనులు జరగడం లేదా..?
ఒక్కోసారి ఎంత ప్రయాసపడ్డా తలపెట్టిన పనులు ఒక పట్టాన జరగవు. గ్రహాల సానుకూలత లేనప్పుడు కార్యసిద్ధి కలలో మాటలా అనిపిస్తుంది. ఉద్యోగ, వృత్తి, వ్యాపార వ్యవహారాల్లో పనులు మందగిస్తాయి. తరచు వైఫల్యాలు ఎదురవుతుంటాయి. కొన్ని తేలికపాటి పరిహారాలను పాటించడం ద్వారా ఈ దుష్ప్రభావాలను తొలగించుకోవచ్చు. 👉ఇంట్లో ఏళ్ల తరబడి వాడకుండా ఉన్న పాత వస్తువులను వదిలించుకోండి. 👉 వీలైనంత వరకు ఇంట్లో రోజూ ఒకేచోట కూర్చుని భోజనం చేయండి. మంచం మీద కూర్చుని భోంచేసే అలవాటు ఉంటే మానుకోండి. 👉 తల్లిదండ్రుల యోగక్షేమాలను పట్టించుకోండి. కొత్త పనులు తలపెట్టబోయే ముందు వారి ఆశీస్సులు తీసుకోండి. గురువులను, గురు సమానులను, సాధు సన్యాసులను ఆదరంగా చూడండి. వీలైతే వారికి భోజనం పెట్టడం, వస్త్రాలను కానుకగా ఇవ్వడం వంటివి చేసి వారి ఆశీస్సులు పోందండి. 👉బియ్యం, గోధుమలు, శనగలు, పాలతో తయారు చేసిన తీపి పదార్థాలను పిల్లలకు, యాచకులకు, వికలాంగులకు పంచిపెట్టండి. ముఖ్యంగా ఆది, గురు, శుక్రవారాల్లో ఇలా చేయడం మంచిది. 👉ఇంట్లో నిత్యపూజకు పసుపు రంగు పూలను ఉపయోగించండి. అలాగే, దేవాలయాలలో పసుపురంగు పూమాలలను సమర్పించండి.– సాంఖ్యాయన -
కన్నబిడ్డలను కాల్చి చంపిన కసాయి తండ్రి
అమెరికా: అమెరికాలో ఓ కసాయి తండ్రి ముక్కుపచ్చలారని తన ముగ్గురు కుమారులపై కనికరం లేకుండా కాల్పులు జరిపి కడతేర్చాడు. అంతకంటే ముందు అతని దురుద్దేశాన్ని గ్రహించిన ఆ పిల్లల తల్లి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమె పైన కూడా కాల్పులు జరిపాడు. అతని కుమార్తె మాత్రం ఎలాగోలా అక్కడి నుండి బయటపడిన ప్రాణాలు దక్కించుకుంది. విషయం తెలుసుకుని హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని ఆసుపత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అందరినీ ఒకేచోట.. ఓహియో ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల చాడ్ డోర్ మాన్ తన ముగ్గురు మగ పిల్లలను నిర్దాక్షిణ్యంగా తుపాకీతో కాల్చి చంపాడు. వారి వయసులు 3, 4, 7 సంవత్సరాలు. మొదట ఇద్దరిని కాల్చి చంపగా మూడో కుమారుడు భయంతో పక్కనే ఉన్న పొలాల్లోకి పరుగులు తీశాడు. అయినా కూడా ఆ తండ్రి అతడిని విడిచిపెట్టలేదు. పొలాల్లోకి వెళ్లి కుమారుడిని వెంటాడి మరీ పట్టుకుని తీసుకొచ్చి అదే ఇంట్లో కాల్చి చంపాడు. అంతకుముందే పిల్లల తల్లి వారిని చంపవద్దని వారించినందుకు ఆమె పైన కూడా కాల్పులు జరిపాడు. ఆమె అక్కడే కుప్పకూలింది. ప్లాన్ ప్రకారమే.. ఇంతటి ఘోర మారణకాండను కళ్లారా చూసిన కుమార్తె మాత్రం బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకుంది. మా నాన్న అందరినీ చంపేస్తున్నాడని చుట్టుపక్కలవారికి సమాచారం అందించింది. దీంతో స్థానికులు పోలీసులకు కబురు పెట్టగా వారు వచ్చి అక్కడే ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని, రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని ఆసుపత్రికి తరలించారు. విచారణలో డోర్ మాన్ ఎప్పటినుంచో పిల్లలను చంపాలనుకుంటున్నట్లు, ప్రణాళిక ప్రకారమే వారిని చంపినట్లు తెలిపారు పోలీసులు. ఇది కూడా చదవండి: పాఠశాలపై దాడి చేసిన ఉగ్రవాదులు.. 25 మంది మృతి -
ఇల్లు కొంటే షేర్లు ఫ్రీ!
న్యూఢిల్లీ: తమ వద్ద ఇల్లు కొనుగోలు చేసినవారికి జేపీ ఇన్‌ఫ్రాటెక్‌కు చెందిన 2000 షేర్లను ఉచితంగా ఇస్తామని జేపీ గ్రూప్ ప్రకటించింది. అనేక కారణాలతో చితికిపోయి దివాలా తీసిన జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను పునరుజ్జీవింపజేసేందుకు జేపీ గ్రూప్ పదివేల కోట్ల రూపాయల ప్రణాళికను ప్రకటించింది. ఈ ప్రణాళికలో భాగంగా షేర్లు ఇచ్చే ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. జేపీ అసోసియేట్స్‌కు అనుబంధ సంస్థైన జేపీ ఇన్ఫ్రాటెక్ 2007లో నోయిడాలో 32వేల ఫ్లాట్స్ అభివృద్ధి చేయడం ఆరంభించింది. ఇందులో 9,500 ఫ్లాట్స్‌ను డెలివరీ చేసింది. మరో 4,500 ఫ్లాట్లకు సంబంధించి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను అందించేందుకు దరఖాస్తు చేసుకుంది. 2021 నాటికి మిగిలిన ఫ్లాట్స్ డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ రుణభారం పెరగడంతో పనులు పూర్తికాలేదు. దీంతో డెలివరీ సమయానికి జరగని వారంతా కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఐడీబీఐ బ్యాంకు జేపీ ఇన్ఫ్రాటెక్ నుంచి తమ రుణాలు రాబట్టుకునే యత్నాలు ఆరంభించడంతో ఇళ్లు కొన్నవారిలో ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో ఇళ్లు కొన్నవారికి అన్యాయం జరగకుండా ఉండేందుకు షేర్లు ఇచ్చే ప్రతిపాదనను జేపీ గ్రూప్ తెచ్చింది. ఇందుకోసం 4.5 కోట్ల షేర్లు అవసరపడతాయని అంచనా. కేవలం షేర్లు ఇవ్వడమే కాకుండా ఇళ్ల కొనుగోలుదారులకు రెరా ప్రకారం జరిమానా కూడా చెల్లిస్తామని, ఫస్ట్ రిజిస్ట్రేషన్ సమయంలో 50 శాతం స్టాంప్ డ్యూటీ భరిస్తామని జేపీ గ్రూప్ పేర్కొంది. జరిమానా చెల్లించేందుకు హామీగా జేపీ అసోసియేట్స్ రూ. 750 కోట్లను సుప్రీంకోర్టు వద్ద డిపాజిట్ చేసింది. మరోవైపు జేపీ ఇన్ఫ్రాటెక్ కొనుగోలుకు సంబంధించి లక్షద్వీప్ గ్రూప్ ఆఫర్ చేసిన రూ. 7,350 కోట్ల బిడ్‌ను రుణదాతలు తిరస్కరించారు. బుధవారం జరిగిన సీఓసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మొత్తం తమకు సరిపోదని రుణదాతలు బిడ్‌ను తిరస్కరించారు. కంపెనీ కొనుగోలుకు వచ్చిన బిడ్లలో లక్షద్వీప్ బిడ్ ముందంజలో ఉన్నది. కానీ రుణదాతలు ససేమిరా అనడంతో అమ్మకం ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చే సూచనలు ఉన్నాయి. -
పథకం ప్రకారం హత్య చేశారా..?
లాడ్జిలో కుటుంబం ఆత్యహత్యాయత్నంలో కానరాని తల్లిదండ్రులు భార్యభర్తలపై హత్య కేసు నమోదు సామర్లకోట : ఇద్దరు ఆడపిల్లలు కావడం వల్లనే పథకం ప్రకారం భార్యభర్తలు పిల్లలకు డ్రింక్‌లో పురుగుల మందు ఇచ్చి హత్య చేశారని పట్టణంలో భారీగా ప్రచారం జరుగుతోంది. లాడ్జిలో ఒక కుటుంబం ఆత్యహత్యాయత్నం అనే విషయం పాఠకులకు విదితమే. పిల్లలు చనిపోవడంతో తల్లిదండ్రులు ఎంతగానో అల్లాడిపోతారు. అయితే ఆ తల్లిదండ్రులు పిల్లలు మరణించారని తెలిసి అదృశ్యం కావడంతో పాటు ఫోన్‌కు కూడా చిక్కకుండా పోయారు. దాంతో సామర్లకోట పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సికింద్రాబాద్‌లో గాలింపునకు తరలి వెళ్లారు. స్థానిక స్టేషన్ సెంటర్లో ఉన్న ఒక లాడ్జిలో పిల్లలు శిరీష (9) అనూష (7)లతో భార్యభర్తలు కొడూరి సత్యనారాయణ, గౌరమ్మలు దిగిన విషయం విదితమే. కుటుంబం అంతా కలిసి పురుగు మందు తాగినట్టు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదనే వాదనలు ఉన్నాయి. పురుగు మందు తాగిన వెంటనే తల్లిదండ్రులకు వాంతులు కావడంతో బతికి బయట పడ్డారనే వాదనలు వచ్చాయి. లాడ్జి రూములో వాంతులకు సంబంధించిన గుర్తులు కనిపించలేదు. దీనికి తోడు వారు లాడ్జి నుంచి బయటకు వెళ్లిన సమయంలో వారిలో ఎటువంటి నీరసం కనిపించలేదని లాడ్జి గుమస్తా తెలిపారు. దాంతో పిల్లలతో పురుగు మందు తాగించి భార్యభర్తలు అదృశ్యం అయ్యారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి గాలింపు చేస్తున్నారు.పాఠశాలలు తీసిన సమయంలో పుణ్య క్షేత్రాలు ఏమిటనే ఆలోచన బంధువులకు రాకపోవడమే చిన్నారుల మృతికి దారి తీసింది. పెద్దాపురంలో ఖననం పెద్దాపురం : చిన్నారుల మృతదేహాలకు పెద్దాపురం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను బంధువులకు పోలీసులకు అప్పగించారు. వారు పెద్దాపురంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్మశాన వాటికలో మృతదేహాలను ఖననం చేశారు. -
పథకం ప్రకారమే ప్రతీకార హత్య
హత్యకేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్ కదిరి టౌన్ : తమ సోదరుడ్ని హతమార్చాడనే కక్షతో పథకం ప్రకారం ప్రతీకార హత్య చేశారు.. ఆ ఇద్దరు. చివరికి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలను బుధవారం రాత్రి స్థానిక రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రవికుమార్ వెల్లడించారు. వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి సమీపంలోని టీ.వెలమవారిపల్లికి చెందిన రామచంద్రరెడ్డి 2015లో ఉగాది పండుగ సమయంలో హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్య కేసులో కీలక పాత్ర పోషించిన అదే గ్రామానికి చెందిన వెంకటసుబ్బారెడ్డిని అంతమొందించాలనుకున్నారు.. రామచంద్రసోదరులు. ఇందుకు పథకం రచించారు. వెంకటసుబ్బారెడ్డిని నమ్మించి హతమారిస్తే రూ.6లక్షల మేర నగదు ఇస్తామని దీంతో గత ఏడాది జూలై 31న అదే గ్రామానికి చెందిన ఓబుళరెడ్డి, గోవర్ధన్, అతని కుమారుడు లక్ష్మినాయుడు, ప్రభాకర్, నాగేంద్రలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతా కలిసి వెంకటసుబ్బారెడ్డిని నమ్మించి ఆటోలో తలుపుల వైపు బయలుదేరారు. మార్గమధ్యంలో తలుపుల మండలం దాంపల్లి సమీపంలోకి రాగానే ఆటో చెడిపోయినట్లు, మెకానిక్‌ను తీసుకురావాలని తోటి వారిని సూచించినట్లు నాటకమాడారు. అక్కడ పథకం ప్రకారం తమ వెంట తెచ్చుకున్న మిరపపొడిని చల్లి కట్టెలు, రాళ్లతో వెంకటసుబ్బారెడ్డిని దారుణంగా హతమార్చారు. అప్పట్లో ఈ హత్య తలుపుల మండలంలో సంచలనం రేపింది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి తమదైన శైలిలో పలు కోణాల్లో విచారణ జరిపి ఎట్టకేలకు బుధవారం నిందితుల్ని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.60వేల నగదుతో పాటు హత్యకు ఉపయోగించిన కట్టెలు, రాళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యకేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారిలో ఒక మహిళ కూడా ఉందని సీఐ వివరించారు. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. సమావేశంలో తలుపుల ఎస్ఐ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -
నన్ను హత్యచేయాలనే వచ్చారు
మహారాష్ట్ర ఆలయాల్లో మహిళల ప్రవేశం కోసం పోరాడి విజయం సాధించిన భూమాత రణరాగిణి బ్రిగేడ్ నాయకురాలు తృప్తిదేశాయ్ తనపై కొందరు శివసేన, ఇతర సంస్థల కార్యకర్తలు దాడిచేయడంపై నిరసన వ్యక్తంచేశారు. కొల్హాపురీ మహాలక్ష్మి ఊరేగింపు సందర్భంగా తనపై దాడిచేసిన వారు తనను హత్యచేయాలనే పథకంతో వచ్చారని ఆరోపించారు. ఆమె గుడిలోంచి సజీవంగా బయటకు రావడానికి వీల్లేదంటూ వీరంగం సృష్టించారని మీడియాకు తెలిపారు. మహిళల్ని జుట్టుపట్టుకొని లాగి, దుస్తులను చించి అవమానించారని తృప్తి విమర్శించారు. చివరికి పూజారులు సైతం తమను దుర్భాషలాడారని వాపోయారు. తనకు పక్షవాతం సోకే అవకాశాలున్నాయని వైద్యులు అనుమానం వ్యక్తం చేసినట్టు తెలిపారు. బుధవారం నాటి ఆందోళనలో తీవ్ర గాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తృప్తి దేశాయ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు మీడియాకు వివరించారు. ఆమె డీహైడ్రేట్ అయ్యారని, లో షుగర్, లో బీపీతో బాధపడుతున్నారని ఆమెకు చికిత్స అందిస్తున్న డా.అర్జున్ అద్నాయ్ తెలిపారు. దేవాలయాల్లో మహిళల ప్రవేశం కోసం పోరాడుతున్న తృప్తిదేశాయ్, బుధవారం కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో వస్త్రధారణ నియమాలను ఉల్లంఘించి మరో సంచలనం సృష్టించారు. ఇతర కార్యకర్తలతో కలిసి ఆలయానికి ఊరేగింపుగా వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మహిళలు సల్వార్ కమీజ్ ధరించి ఆలయంలోకి ప్రవేశించడంపై శివసేన, ఇతర హిందూ సంస్థల కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. తరాని చౌక్‌లో వారిని అడ్డుకోవడంతో దేవాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్రస్ కోడ్‌ను పాటించాలని పోలీసులు, పురోహితులు కూడా పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్తత రాజుకుంది. చీరకట్టులో మాత్రమే గర్భగుడిలోకి రావాలని పోలీసులు, ఆలయ అధికారులు పెట్టిన ఆంక్షలను ధిక్కరించి ఆమె సల్వార్ కమీజ్ లో దర్శనం చేసుకున్నారు. భక్తులు, పూజారులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆమె వారిని తోసేసి గుడిలోపలికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని వచ్చారు. ఈ క్రమంలో డిప్యూటీ ఎస్పీ భరత్ కుమార్ ఆధ్వర్యంలో తృప్తి సహా, పలువురు మహిళలను ముందు జాగ్రత్త చర్యగా నిర్బంధంలోకి తీసుకున్నారు. -
అకస్మాత్తుగా డబ్బు వస్తే.. అప్పు తీరుస్తారా... పెట్టుబడి పెడతారా?
- అప్పటికే మీకు కొంత అప్పుంది. అయితే అదే సమయంలో మీ దగ్గరకు కొంత డబ్బు వచ్చింది? మరి ఉన్న అప్పును ఇప్పుడు తీర్చేస్తే మంచిదా? లేక అప్పు కన్నా అధిక వడ్డీ వచ్చే ప్రొడక్ట్ ఏదైనా ఉంటే- అందులో ఇన్వెస్ట్ చేయడం మంచిదా...? - మీరు బ్యాంకులో కొంత డబ్బు డిపాజిట్ చేశారు. వడ్డీ 8 శాతం. ఇదే సమయంలో కారు లోను తీసుకున్నారు. 11 శాతం వడ్డీ పడుతోంది. మరి 8 శాతం వడ్డీ వస్తున్న బ్యాంక్ డిపాజిట్‌ను అలానే ఉంచి, 11 శాతం కారులోను తీసుకోవడం వల్ల ఆర్థికంగా ప్రయోజనం ఏదన్నా ఉంటుందా? ఇలాంటి సందేహాలకు సమాధానం చాలా కష్టం. అయితే ఆచితూచి తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థికంగా దీర్ఘకాలంలో అధిక ప్రయోజనాలు కలుగుతాయి. వచ్చిన డబ్బును ప్రణాళిక ప్రకారం ఖర్చుపెట్టుకోకపోతే చివరకు అది ‘అప్పు’ అనే పదం వైపు దారితీయక తప్పదు. అందుకే ఆర్థిక సమస్యల్లో చిక్కుకోకుండా ఉండాలంటే పక్కా ప్రణాళిక కావాలి. ఒకఅప్పు కొనసాగుతున్నప్పుడు మరో అప్పు తీసుకోవడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఆర్థిక చెల్లింపుల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. అప్పు తీసుకునేందుకు పరిశీలించాల్సిన అంశాలు... చెల్లింపుల వ్యూహం... రుణ చెల్లింపుల వ్యూహం కూడా వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల్లో ముఖ్యమైనదే. ఉదాహరణకు మీరు రూ.20,00,000 గృహ రుణం తీసుకున్నారనుకుందాం. వడ్డీరేటు 10.50 శాతం. కాలపరిమితి పదేళ్లు అనుకుందాం. అంటే 10 ఏళ్ల పాటు నెలవారీగా రూ.26,987 చెల్లించాలి. ఇక్కడ వడ్డీ మొత్తమే దాదాపు రూ. 12,38,440. రుణ చెల్లింపులు ప్రారంభమైన రెండేళ్ల తరువాత మీ వద్ద రూ.2,00,000 మిగులు ఉందనుకుందాం. దీనిని రుణంలో భాగంగా ముందస్తు చెల్లింపు చేస్తే... మీ వడ్డీపై కాల పరిమితి మొత్తంపై దాదాపు రూ.2,32,000 పొదుపు చేసుకోగలుగుతారు. ఈ సందర్భంలో మీరు పన్ను మినహాయింపులకు అర్హమైన సొమ్మును కొంత కోల్పోతారు. ఒకవేళ మిగులు రూ.2,00,000ను ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే- పదేళ్ల కాలంలో వార్షికంగా 10 నుంచి 12 శాతం వడ్డీచొప్పున రూ.3,20,000 సొమ్ము మీకు అందుబాటులోకి వస్తుంది. అయితే ఇక్కడ రిటర్న్స్ గ్యారెంటీ కాదు. రిస్క్ సామర్థ్యం ఉండాలి. ఈ సామర్థ్యం ఉంటే... రూ.2,00,000 గృహ రుణం కింద చెల్లించేయకుండా... ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడమే బెటర్. ఇలాంటి చెల్లింపు వ్యూహాలు ఆర్థిక ప్రయోజనాన్ని సమకూర్చుతాయి. ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ఇవన్నీ భాగాలే అన్న విషయాన్ని గుర్తించాలి. అప్పుల జాబితా తయారీ! మీకు ప్రస్తుతం అప్పులు ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎంత? వడ్డీ ఎంత? ఎప్పటికల్లా రుణం తీర్చాలి? వంటి అంశాలన్నింటినీ ఒక పేపర్ మీద రాసుకోవాలి. పన్ను మినహాయింపు ఉన్న రుణాల గురించి కూడా వివరాలు రాయాలి. ఉదాహరణకు మీకు, మీ భార్యకు లేదా పిల్లలకు విద్యా రుణం తీసుకున్నారనుకుందాం! దీనిపై చెల్లించే వడ్డీకి పన్ను మినహాయింపు లభిస్తుంది. గృహ రుణానికి సంబంధించి అసలు, వడ్డీపై కూడా పన్ను ప్రయోజనం ఉంటుంది. ఆయా అంశాలన్నింటినీ ఒక కాగితంపై ఉంచుకుని ‘అప్పు భారాన్ని’ అర్ధం చేసుకోవాలి. దీనికి అనుగుణంగా తాజా రుణం.. ఇన్వెస్ట్మెంట్ వంటి అంశాలపై అంచనాకు రావాలి. తక్షణ అవసరాలు... నెలవారీగా తద్వారా వార్షికంగా మీ జీవన అవసరాలను లెక్కలోకి తీసుకోండి. నెలవారీ ఆహార ఖర్చులు, పిల్లల చదువులు.. అద్దెలు, వినోదం, బీమా వంటి అవసరాలకు చెల్లింపుల అంశాలను పేపర్‌పై ఉంచండి. అందుబాటులో ఉన్న సొమ్ము ఎంత? ఇప్పుడు మీ దగ్గర అందుబాటులో ఉన్న సొమ్మును పరిగణనలోకి తీసుకోండి. ఇందులో అత్యవసరాలకు ఎంత మొత్తం అవసరమో నిర్ణయించుకోండి. అత్యవసర ఆరోగ్య సమస్యలు, ప్రైవేటు రంగంలో ఉద్యోగం కోల్పోయే బెడద వంటివి ఎన్నో ఉంటాయి. మీ కుటుంబ అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా నెలకు ఎంత ఖర్చవుతుందో అంతకు మూడు నుంచి ఆరు రెట్లు అధిక మొత్తం మీ దగ్గర ఉండడం శ్రేయస్కరం. నెలవారీ మిగులు విభాగం ఒకటి నిర్వహించడం మంచిది. అత్యవసర నిధికి అవసరమైతే ఈ విభాగం నుంచి డబ్బు సమకూరాలి. -
సునంద పుష్కర్ మృతికి విషమే కారణం
-
తెలంగాణ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక!
ఐదేళ్లకు సరిపడా ప్రత్యేక ప్రణాళిక అమలు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ మేధో మథనం. హైదరాబాద్: వచ్చే ఐదేళ్లలో తెలంగాణ రాష్ర్ట సమగ్రాభివృద్ధికి అమలు చేయాల్సిన ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త రాష్ట్రం.. కొత్త జీవితం.. కొత్త పంథాలో నడవడానికి వీలుగా అడుగులు వేస్తోంది. ప్రణాళికపై చర్చించడానికి ఈనెల 7వ తేదీన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో ప్రత్యేకంగా సమావేశమై ఉన్నతాధికారులతో మేధో మథనం చేశారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందించాలని, 7న సమావేశం నిర్వహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రం మొత్తం ఒకే విధానం, ఒకే పద్ధతి కాకుండా ఆయా ప్రాంతాలు, జిల్లాలు, మండలాలు, గ్రామస్థాయి వరకు అభివృద్దికి ప్రణాళికలను రూపొందించాలని సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్ దృక్పథంతో అమలవుతున్న పథకాలు, చట్టాలు, విధానాల్లో మార్పులను తీసుకువచ్చి తెలంగాణకు అనుగుణంగా మార్చాలని అధికారులకు చెప్పారు. భూ పంపిణీని సమర్థవంతంగా అమలు చేయడానికి 500 మంది అధికారులతో ప్రత్యేక బ్రిగేడ్‌ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. అవినీతిని జీరోస్థాయికి తీసుకురావాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, జాయింట్ కలెక్టర్ల సం ఖ్య పెంపు, విద్య, వైద్యం, సంక్షేమంలాంటి అంశాలపై చర్చించారు. పునర్నిర్మాణానికి ఎంసీఆర్హెచ్ఆర్డీ వేదిక కావాలి గ్రామస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు ఉండే ఉద్యోగులు, ఉన్నతాధికారులకు శిక్షణనిచ్చే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ) తెలంగాణ పునర్నిర్మాణానికి వేదిక కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. సర్పం చుల నుంచి ఐఏఎస్ అధికారుల వరకు ఇందులోనే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీని కేసీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి పరిసరాలను పరిశీలించేందుకు అధికారులు వాహనాలను సిద్ధం చేసినా, వద్దని ప్రాంగణమంతా అరగంటపాటు కాలినడకనే తిరిగారు. -
కెనడాలో ఐ ఆడియో
ఐ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాలు కెనడాలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అన్నియన్ చిత్రం తరువాత శంకర్, విక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఐ ఆస్కార్ ఫిలింస్ పతాకంపై ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహ్మాన్ సంగీత బాణీలందిస్తున్నారు. ఎమీ జాక్సన్ హీరోయిన్. విక్రమ్ రెండు డైమన్షన్స్‌లో సాగే పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం కోసం ఆయన తన బాడీ లాంగ్వేజ్‌ను పాత్ర స్వభావానికి తగ్గట్లుగా మార్చుకోవడానికి చాలా శ్రమించారు. చిత్ర షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని వైవిద్యభరితంగా నిర్వహించడానికి చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకు ముందు దశావతారం ఆడియో ఆవిష్కరణకు హాలీవుడ్ సూపర్ స్టార్ జాకీచాన్ ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ఆస్కార్ రవి చంద్రన్ తాజా చిత్రం ఐ ఆడియో ఆవిష్కరణకు మరో హాలీవుడ్ సూపర్‌స్టార్ అర్నాల్డ్‌ను ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని కెనడా దేశంలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.