పథకం ప్రకారం హత్య చేశారా..?
పథకం ప్రకారం హత్య చేశారా..?
Published Sat, Jun 24 2017 11:51 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
లాడ్జిలో కుటుంబం ఆత్యహత్యాయత్నంలో కానరాని తల్లిదండ్రులు
భార్యభర్తలపై హత్య కేసు నమోదు
సామర్లకోట : ఇద్దరు ఆడపిల్లలు కావడం వల్లనే పథకం ప్రకారం భార్యభర్తలు పిల్లలకు డ్రింక్‌లో పురుగుల మందు ఇచ్చి హత్య చేశారని పట్టణంలో భారీగా ప్రచారం జరుగుతోంది. లాడ్జిలో ఒక కుటుంబం ఆత్యహత్యాయత్నం అనే విషయం పాఠకులకు విదితమే. పిల్లలు చనిపోవడంతో తల్లిదండ్రులు ఎంతగానో అల్లాడిపోతారు. అయితే ఆ తల్లిదండ్రులు పిల్లలు మరణించారని తెలిసి అదృశ్యం కావడంతో పాటు ఫోన్‌కు కూడా చిక్కకుండా పోయారు. దాంతో సామర్లకోట పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సికింద్రాబాద్‌లో గాలింపునకు తరలి వెళ్లారు. స్థానిక స్టేషన్ సెంటర్‌లో ఉన్న ఒక లాడ్జిలో పిల్లలు శిరీష (9) అనూష (7)లతో భార్యభర్తలు కొడూరి సత్యనారాయణ, గౌరమ్మలు దిగిన విషయం విదితమే. కుటుంబం అంతా కలిసి పురుగు మందు తాగినట్టు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదనే వాదనలు ఉన్నాయి. పురుగు మందు తాగిన వెంటనే తల్లిదండ్రులకు వాంతులు కావడంతో బతికి బయట పడ్డారనే వాదనలు వచ్చాయి. లాడ్జి రూములో వాంతులకు సంబంధించిన గుర్తులు కనిపించలేదు. దీనికి తోడు వారు లాడ్జి నుంచి బయటకు వెళ్లిన సమయంలో వారిలో ఎటువంటి నీరసం కనిపించలేదని లాడ్జి గుమస్తా తెలిపారు. దాంతో పిల్లలతో పురుగు మందు తాగించి భార్యభర్తలు అదృశ్యం అయ్యారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి గాలింపు చేస్తున్నారు.పాఠశాలలు తీసిన సమయంలో పుణ్య క్షేత్రాలు ఏమిటనే ఆలోచన బంధువులకు రాకపోవడమే చిన్నారుల మృతికి దారి తీసింది.
పెద్దాపురంలో ఖననం
పెద్దాపురం : చిన్నారుల మృతదేహాలకు పెద్దాపురం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను బంధువులకు పోలీసులకు అప్పగించారు. వారు పెద్దాపురంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్మశాన వాటికలో మృతదేహాలను ఖననం చేశారు.
Advertisement