that
-
పథకం ప్రకారం హత్య చేశారా..?
లాడ్జిలో కుటుంబం ఆత్యహత్యాయత్నంలో కానరాని తల్లిదండ్రులు భార్యభర్తలపై హత్య కేసు నమోదు సామర్లకోట : ఇద్దరు ఆడపిల్లలు కావడం వల్లనే పథకం ప్రకారం భార్యభర్తలు పిల్లలకు డ్రింక్‌లో పురుగుల మందు ఇచ్చి హత్య చేశారని పట్టణంలో భారీగా ప్రచారం జరుగుతోంది. లాడ్జిలో ఒక కుటుంబం ఆత్యహత్యాయత్నం అనే విషయం పాఠకులకు విదితమే. పిల్లలు చనిపోవడంతో తల్లిదండ్రులు ఎంతగానో అల్లాడిపోతారు. అయితే ఆ తల్లిదండ్రులు పిల్లలు మరణించారని తెలిసి అదృశ్యం కావడంతో పాటు ఫోన్‌కు కూడా చిక్కకుండా పోయారు. దాంతో సామర్లకోట పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సికింద్రాబాద్‌లో గాలింపునకు తరలి వెళ్లారు. స్థానిక స్టేషన్ సెంటర్లో ఉన్న ఒక లాడ్జిలో పిల్లలు శిరీష (9) అనూష (7)లతో భార్యభర్తలు కొడూరి సత్యనారాయణ, గౌరమ్మలు దిగిన విషయం విదితమే. కుటుంబం అంతా కలిసి పురుగు మందు తాగినట్టు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదనే వాదనలు ఉన్నాయి. పురుగు మందు తాగిన వెంటనే తల్లిదండ్రులకు వాంతులు కావడంతో బతికి బయట పడ్డారనే వాదనలు వచ్చాయి. లాడ్జి రూములో వాంతులకు సంబంధించిన గుర్తులు కనిపించలేదు. దీనికి తోడు వారు లాడ్జి నుంచి బయటకు వెళ్లిన సమయంలో వారిలో ఎటువంటి నీరసం కనిపించలేదని లాడ్జి గుమస్తా తెలిపారు. దాంతో పిల్లలతో పురుగు మందు తాగించి భార్యభర్తలు అదృశ్యం అయ్యారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి గాలింపు చేస్తున్నారు.పాఠశాలలు తీసిన సమయంలో పుణ్య క్షేత్రాలు ఏమిటనే ఆలోచన బంధువులకు రాకపోవడమే చిన్నారుల మృతికి దారి తీసింది. పెద్దాపురంలో ఖననం పెద్దాపురం : చిన్నారుల మృతదేహాలకు పెద్దాపురం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను బంధువులకు పోలీసులకు అప్పగించారు. వారు పెద్దాపురంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్మశాన వాటికలో మృతదేహాలను ఖననం చేశారు. -
ఆ ఆరుగురికీ స్థానచలనం
- ఎన్నాళ్ల కెన్నాళ్లకు బదిలీవేటు - కదిలిన దేవాదాయశాఖ - ‘సాక్షి’ ఎఫెక్ట్ సాక్షి ప్రతినిధి, కాకినాడ : దేవాదాయ శాఖలో ఎన్నో ఏళ్లు తరువాత కదలిక వచ్చింది. ఏళ్ల తరబడి ఒకే కార్యాలయంలో తిష్టవేసి అవినీతిని పెంచిపోషిస్తున్న ఉద్యోగులకు స్థాన చలనం కలిగింది. దశాబ్దాల కాలంగా పట్టించుకోని కాకినాడ డీసీ కార్యాయాన్ని ప్రక్షాళన చేశారు. అక్కడ పాతుకుపోయిన ఆరుగురు ఉద్యోగులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా సాగిన అవినీతికి ఆలవాలంగా మారిన ఉద్యోగుల బండారాన్ని ఈ నెల 12న ‘ఆ ఆరుగురిదే హవా’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన దేవాదాయశాఖ ఉన్నతాధికారులు డీసీ కార్యాలయంలో ఏళ్ల తరబడి తిష్టవేసిన ఉద్యోగుల వివరాలు సేకరించారు. అందులో అటెండర్‌గా ఉద్యోగంలో చేరి ఇక్కడే జూనియర్, సీనియర్ అసిస్టెంట్లుగా కూడా పదోన్నతులు పొందిన వారు కొందరు. జూనియర్ అసిస్టెంట్‌గా జాయినై సూపరింటెండెంట్‌గా పదోన్నతిపై అదే కార్యాలయంలో పనిచేస్తూ పైసలివ్వందే ఫైళ్లు కదలని పరిస్థితి తీసుకువచ్చిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. కాకినాడ డీసీ కార్యాలయంలో సుమారు 20 మంది అన్ని గ్రేడ్ల ఉద్యోగులు పని చేస్తుండగా వారిలో ఆరుగురు మాత్రం అక్కడే తిష్టవేసిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడం ఈ విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. ఆ క్రమంలోనే ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బదిలీల కౌన్సెలింగ్‌లో భాగంగా డీసీ కార్యాలయంలో ఏళ్లతరబడి తిష్ట వేసిన ఉద్యోగులను సాగనంపారు. ఆ ఆరుగురికి స్థానం చలనం... సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఎ.విజయలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ కృష్ణారెడ్డిలను రాజమహేంద్రవరం అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దీపారాణిని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి, మరో ఇద్దరు ఉద్యోగులు సురేష్‌కుమార్, రాజేశ్వరిలను కాకినాడలోని దేవాదాయశాఖ కార్యాలయంలోని డివిజనల్ ఇంజినీర్ కార్యాలయానికి బదిలీ చేశారు. మరొక సీనియర్ అసిస్టెంట్ సి.హెచ్. ఉదయకుమార్బాబు రాజమహేంద్రవరం ఇన్స్పెక్టర్గా బదిలీ చేశారు. ఈ బదిలీలపై డిప్యుటీ కమిషనర్ పరిధిలోకి వచ్చే ఆలయాలు, సత్రాల కార్యనిర్వాహణాధికారులు సంబరపడుతున్నారు. కార్యాలయానికి వెళ్లాలన్నా, ఫైళ్లు తీసుకువెళ్లాలన్నా చేయి తడపందే పనయ్యే పరిస్థితి ఉండేది కాదంటున్నారు. డీసీ కార్యాలయంలో ఏళ్లతరబడి తిష్టవేసిన ఆ ఆరుగురిపైన ఇన్నేళ్ల తరువాతైనా ఏకకాలంలో బదిలీ వేటు వేయడానికి కారణమైన సాక్షి’కి దేవాదాయశాఖ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
కొత్తగూడెం సమగ్రాభివృద్ధే లక్ష్యం
ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కొత్తగూడెం /పాల్వంచ : కొత్తగూడెం జిల్లా సమ గ్రాభివృద్ధి సాధించాలనే సంకల్పంతోనే తాను పాదయాత్ర చేపట్టినట్టు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అన్నారు. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు అందుబాటులో అధికార యంత్రాంగం ఉండాలనే లక్ష్యంతోనే కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు ‘మన ప్రగతి యాత్ర’ పేరుతో కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు మంగళవారం పాదయాత్ర చేపట్టారు. తొలుత కొత్తగూడెంలోని శ్రీవిజయ విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అక్కడి నుంచి పాద యాత్ర ప్రారంభించారు. మధ్యాహ్నం పాల్వం చలోని నవ భారత్ చేరుకుంది. అక్కడి నుంచి ఆయనకు పార్టీ శ్రేణులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. నవభారత్, పాత పాల్వంచ, దమ్మపేట సెంటర్, అంబేడ్కర్, బస్టాండ్ సెంట ర్, ఇందిరా కాలనీ తదితర ప్రాంతాల్లో నాయకులు, మహిâýæలు బతుకమ్మలతో ఎదురెళ్లి స్వాగ తం పలికారు. దమ్మపేట సెంటర్లో సభలో జల గం మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధించేందుకు సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. కొత్తగూడెం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి సాధించేందుకు, విమానాశ్రయం, టూరిజం హోటâýæ్ల ఏర్పాటుకు, పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కాగా.. తొలిరోజు యాత్ర 17 కిలోమీటర్లు కొనసాగింది. రాత్రి పాల్వంచ మండలం జగన్నాధపురం పెద్దమ్మతల్లి దేవాలయం వద్ద బస చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్, నాయకులు కిలారు నాగేశ్వరరావు, మంతపురి రాజుగౌడ్, కాల్వ భాస్కర్, పొనిశెట్టి వెంకటేశ్వర్లు, మల్లెల రవిచంద్ర, మురళి, దాసరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ధర్మ పోరాటం చేస్తున్న గిరిజనులు
భూములు ఇవ్వకపోగా ఉన్న భూములను లాక్కోవడం అన్యాయం అసంఘటిత కార్మికులకు తీరని అన్యాయం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వాగొడ్డుగూడెం(అశ్వారావుపేట రూరల్): పోడుసాగు విషయంలో గిరిజనులు, పేదలు చేస్తున్నది.. ధర్మ పోరాటమని, రాష్ట్రప్రభుత్వం చేస్తున్నది.. ఆ ధర్మమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మండలంలోని వాగొడ్డుగూడెం పోడుభూముల్లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూములు పంపిణీ చేయకపోగా, ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కోవడం అన్యాయమన్నారు. గిరిజనులకు 10 ఎకరాల వరకు పట్టాలు ఇవ్వాలని నిబంధనలున్నాయని, వాటిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. 2005 కంటే ముందుగానే సాగులో ఉన్న భూములను లాక్లోవడం మానుకోవాలన్నారు. దీనిపై గిరిజనులు చేస్తున్న ధర పోరాటానికి సీపీఎం అండగా ఉంటుందన్నారు. పట్టాలు ఉన్న ఐదు లక్షల ఎకరాలను అన్యాయంగా గుంజుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. అనంతరం పోడు కేసుల్లో జైళ్లకు వెళ్లి వచ్చిన 120 మంది గిరిజనులను పరామర్శించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, నాయకులు ఏజే రమేష్, ఐలయ్య, డివిజన్ నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య, ధర్ముల సీతారాములు, చిరంజీవి, ప్రసాదు, కుంజా మురళీలున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తా : సున్నం రాజయ్య, ఎమ్మెల్యే, భద్రాచలం పోడు భూముల సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పేర్కొన్నారు. పోలీస్, అటవీ అధికారులు వ్యవహారిస్తున్న తీరు, గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తానన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో పోడు జోలికి వెళ్లమని చెప్పిన ప్రభుత్వ తీరును ఎండగడతానన్నారు. ఐటీడీఏ పాలక మండలి సమావేశంలో ముగ్గురు మంత్రులు కూడా పోడు జోలికి వెళ్లవద్దని అధికారులకు చెప్పి.. దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.