IS
-
ఐఎస్ నెక్ట్స్ టార్గెట్ మనమేనా!?
న్యూఢిల్లీ : సిరియాలో బలహీనపడిన నేపథ్యంలో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) భారత్, శ్రీలంకపై దృష్టి సారించిందని ఇంటలెజిన్స్ వర్గాలు వెల్లడించాయి. ఇరాక్, సిరియాల్లో తమ ప్రాబల్యం తగ్గిన కారణంగా హిందూ మహాసముద్ర ప్రాంతంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని పేర్కొన్నాయి. ఇందులో భాగంగానే సిరియాలో ఉన్న జీహాదీలను స్వదేశాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపాయి. ఈ క్రమంలో శ్రీలంక, భారత్‌లే ఐఎస్ ప్రధాన టార్గెట్లుగా మారాయి..కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా భారత్‌లోని కేరళ, తమిళనాడు, కశ్మీర్లో వారు పాగా వేసే అవకాశం ఉందని కేరళ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. తమకు సంబంధించిన సమాచారం లీకవుతుందని పసిగట్టిన ఉగ్రమూక ప్రస్తుతం.. చాట్సెక్యూర్, సిగ్నల్ అండ్ సైలెంట్ టెక్ట్స్ తదితర యాప్‌లు వాడుతూ అప్రమత్తమైందని వెల్లడించాయి. ఈ మేరకు ఎన్డీటీవీ కథనం ప్రచురించింది. కాగా ఈ విషయం గురించి ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. కేరళ నుంచి గత కొన్నేళ్లుగా వందలాది మంది ఐఎస్‌లో చేరారని తెలిపారు. వీరిలో 3 వేల మందిని డీరాడికలైజ్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే తాజా హెచ్చరికల నేపథ్యంలో వారిని కూడా గమనించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
‘ప్రపంచాన్ని వణికించే ఉగ్రవాది అతడు’
ముంబై : ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను పొగుడుతూ బ్రిడ్జ్ పిల్లర్‌పై గుర్తు తెలియని దుండగులు రాతలు రాయడం కలకలం రేపింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ విచారణ చేపట్టింది. వివరాలు.. ముంబై అర్బన్‌లోని బ్రిడ్జి పిల్లర్లపై ఐఎస్ హెడ్ అబూ బాకర్ అల్ బాగ్దాదీ, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను పొగుడుతూ రాతలు వెలిశాయి. ప్రపంచాన్ని వణికించే ఉగ్రవాది బాగ్దాది అంటూ ఐఎస్‌ను చీఫ్‌ను పొగడటంతో పాటు.. పోర్టు, ఎయిర్‌పోర్టు, పైప్‌లైన్, ట్రెయిన్ వంటి వివిధ చిత్రాలను గీసిన దుండగులు వాటిని మార్క్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన కోప్తా గ్రామ ప్రజలు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలో బ్రిడ్జి వద్దకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం ఏటీఎస్‌కు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో అర్బన్ ఏరియా, పోర్టు సమీపంలో భద్రత పటిష్టం చేశారు. బుధవారం రంజాన్ నేపథ్యంలో అల్లర్లు ప్రేరేపించేందుకే దుండగులు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే బ్రిడ్జికి సమీపంలో మద్యం సీసాలు లభించిన కారణంగా పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే ఆకతాయిలు ఈ పని చేశారా అన్న దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. 7.5 కోట్ల నకిలీ కరెన్సీ; నలుగురి అరెస్టు
ఖాట్మండు : దావూద్ ఇబ్రహీం అనుచరుడు యూనస్ అన్సారీని నేపాల్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి దగ్గర నుంచి దాదాపు ఏడున్నర కోట్ల రూపాయల భారత నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అన్సారీతో పాటు ముగ్గురు పాకిస్తాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఇస్లామిక్ స్టేట్ కోసం పనిచేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే అక్రమ దందాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. భారత ఇంటలెజిన్స్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అతడిని ఖాట్మండూ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా నేపాల్ మాజీ మంత్రి సలీం అన్సారీ, ఆయన కుమారుడైన యూనస్ అన్సారీకి అండర్‌వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఐఎస్ ఉగ్రవాదులతో కూడా యూనస్‌కు పరిచయం ఏర్పడింది. వారితో చేతులు కలిపిన యూనస్ ఐఎస్ ఫండింగ్ కోసం భారత నకిలీ కరెన్సీని మారుస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శనివారం నకిలీ కరెన్సీని తీసుకువస్తున్న ముగ్గురు పాకిస్తానీయులను రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లగా.. పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం గురించి లోతుగా విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. -
ఆరెస్సెస్‌పై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
చెన్నై : తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కేఎస్ అళగిరి ఆరెస్సెస్‌ను ఉగ్రవాద సంస్థ ఐఎస్‌తో పోల్చారు. ఉగ్ర సంస్థ ఐఎస్ తరహాలో ఆరెస్సెస్ కూడా తమ భావజాలాన్ని వ్యతిరేకించే వారిని ద్వేషిస్తుందని ఆరోపించారు. మహాత్మ గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను ప్రస్తావిస్తూ దేశంలో తొలి ఉగ్రవాది హిందువేనని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను అళగిరి సమర్ధించడం గమనార్హం. కమల్ హాసన్ ప్రకటనతో తాను నూరు శాతం కాదు..వేయి శాతం ఏకీభవిస్తానని చెప్పుకొచ్చారు. తమ సిద్ధాంతంతో విభేదించేవారిని తుదముట్టించాలని అరబ్ దేశాల్లో ఐఎస్ తలపోసినట్టే భారత్‌లో ఆరెస్సెస్, జనసంఘ్, హిందూ మహాసభలు భావిస్తాయని అన్నారు. అరబ్ దేశాల్లో తమ భావజాలంతో ఏకీభవించని వారు ముస్లింలే అయినా వారిని తుదముట్టించాలని అక్కడి అతివాదులు భావిస్తారని వ్యాఖ్యానించారు. కాగా అంతకుముందు తమిళనాడులోని అరవక్కురుచ్చిలో జరిగిన ఓ ప్రచార ర్యాలీలో పాల్గొన్న కమల్ హాసన్ స్వతంత్ర భారత్‌లో తొలి ఉగ్రవాది హిందువేనని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. -
‘ఆ పేలుళ్ల సూత్రధారే నాకు స్ఫూర్తి’
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో ఆత్మాహుతి దాడికి కుట్రపన్ని సోమవారం ఎన్ఐఏ చేతికి చిక్కిన 29 ఏళ్ల ఐఎస్ ఉగ్రవాది రియాజ్ విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. తాను ఏడాదిగా శ్రీలంకకు చెందిన జహ్రన్ హషీం, జకీర్ నాయక్‌ల ప్రసంగాలు, వీడియోలను ఫాలో అవుతున్నానని, కేరళలో ఆత్మాహుతి దాడిని చేపట్టాలని భావించానని విచారణలో రియాజ్ వెల్లడించినట్టు ఎన్ఐఏ పేర్కొంది. శ్రీలంక బాంబు పేలుళ్ల సూత్రధారి హషీం ప్రసంగాలతో తాను స్ఫూర్తి పొందానని రియాజ్ చెప్పాడు. మరోవైపు ఐఎస్ ఆపరేటివ్ అబ్దుల్ రషీద్ అబ్దుల్లాతో కూడా తాను సంప్రదింపులు జరిపానని కేరళలోని పలక్కాడ్ జిల్లాకు చెందిన రియాజ్ వెల్లడించాడు. సిరియాకు చెందిన మరో ఐఎస్ అనుమానిత ఉగ్రవాది అబు ఖలీద్‌తో తాను ఆన్లైన్ చాట్ చేసినట్టు నిందితుడు తెలిపాడు. కాగా రియాజ్‌ను మంగళవారం కొచిన్‌లోని ఎన్ఐఏ కోర్టు ఎదట హాజరుపరచనున్నారు. -
వారం రోజుల్లో అధికారిక ప్రకటన : ట్రంప్
వాషింగ్టన్ : సిరియాలో కల్లోలం సృష్టిస్తున్న ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను మరో వారం రోజుల్లో అంతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తద్వారా ఉగ్రవాదులను అంతమొందించాలనే తమ ఆశయం నెరవేరుతుందని పేర్కొన్నారు. వాషింగ్టన్లో బుధవారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో ట్రంప్ ప్రసంగించారు. సుమారు 70 దేశాల ప్రతినిధులో ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా... ‘ అమెరికా, దాని మిత్ర దేశాలతో పాటు సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ కృషి కారణంగా.. ఐఎస్ పాలనలో ఉన్న సిరియా, ఇరాక్‌లోని చాలా ప్రాంతాలు విముక్తి పొందాయి. చాలా కష్టంతో కూడుకున్న ఈ పనిని పూర్తి చేసేందుకు ఆర్థిక, సైనిక సహకారాలు అందించి సిరియాకు అండగా నిలిచారు. ఇది సమిష్టి కృషి. ఐఎస్ ఉనికిని సమూలంగా రూపుమాపుతాం. ఇందుకు సంబంధించి వారం రోజుల్లోగా అధికారిక ప్రకటన చేస్తాను’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా సిరియా నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు గతేడాది డిసెంబరులో ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఐఎస్‌ను పూర్తిగా ఓడించిన కారణంగా సైనిక దళాలను వెనక్కి రావాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు..‘‘సిరియాలో ఐఎస్‌ను ఓడించాం. నా అధ్యక్ష కాలంలో పూర్తిచేయాలనుకున్న లక్ష్యం అది’ ’ అని ఆయన ట్వీట్ చేశారు. -
అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి: 19 మంది మృతి
కాబుల్: అఫ్గానిస్తాన్ వరుసగా రెండోరోజు రక్తమోడింది. జలాలాబాద్‌లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 19 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారు. తాలిబన్ ఉగ్రవాదులు, భద్రతా దళాలు, పౌరులు లక్ష్యంగా రెండు రోజుల్లో రెండు దాడులు చోటుచేసుకున్నాయి. శనివారం నాటి దాడిలో కనీసం 36 మంది మృతిచెందారు. తాజా ఆత్మాహుతి దాడి కూడా ఐఎస్ పనే అని భావిస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందంలో లేని ఐఎస్ గతంలో తాలిబన్లతో ఘర్షణ పడిన ఉదంతాలున్నాయి. ఐఎస్‌కు అనుబంధంగా పనిచేస్తున్న స్థానిక సంస్థకు జలాలాబాద్‌లో అధిక ప్రాబల్యం ఉంది. మరోవైపు, కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 9 రోజులు పొడిగిస్తున్నట్లు అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ చేసిన ప్రకటనను తాలిబన్ తోసిపుచ్చింది. ఆ ఒప్పందం ముగిసిందని, దాన్ని కొనసాగించే ఉద్దేశం తమకు లేదని తేల్చిచెప్పింది. -
పోలీసుల అదుపులో ఐఎస్ అనుమానితులు
ఇస్తాంబుల్: తీవ్రవాద కార్యకలాపాలను నిరోధించడంలో భాగంగా ఇస్తాంబుల్ నగర వ్యాప్తంగా టర్కీ పోలీసులు తనిఖీలు చేశారు. దాదాపుగా 34 మంది అనుమానితులను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వారు గతంలో ఉగ్రవాద సంస్థలో పనిచేసినవారు, ఉగ్రకుట్రలకు పథకం రచించిన వారిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వారి నుంచి భారీగా డాక్యుమెంట్లు, డిజిటల్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 82 మంది విదేశీయులను నిర్భంధంలోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 283 మంది ఐఎస్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. 66 పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 2015 నుంచి టర్కీలో జరిగిన బాంబు పేలుళ్ల కారణంగా సుమారు 300 మంది పౌరులు చనిపోయారు. -
పథకం ప్రకారం హత్య చేశారా..?
లాడ్జిలో కుటుంబం ఆత్యహత్యాయత్నంలో కానరాని తల్లిదండ్రులు భార్యభర్తలపై హత్య కేసు నమోదు సామర్లకోట : ఇద్దరు ఆడపిల్లలు కావడం వల్లనే పథకం ప్రకారం భార్యభర్తలు పిల్లలకు డ్రింక్‌లో పురుగుల మందు ఇచ్చి హత్య చేశారని పట్టణంలో భారీగా ప్రచారం జరుగుతోంది. లాడ్జిలో ఒక కుటుంబం ఆత్యహత్యాయత్నం అనే విషయం పాఠకులకు విదితమే. పిల్లలు చనిపోవడంతో తల్లిదండ్రులు ఎంతగానో అల్లాడిపోతారు. అయితే ఆ తల్లిదండ్రులు పిల్లలు మరణించారని తెలిసి అదృశ్యం కావడంతో పాటు ఫోన్‌కు కూడా చిక్కకుండా పోయారు. దాంతో సామర్లకోట పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సికింద్రాబాద్‌లో గాలింపునకు తరలి వెళ్లారు. స్థానిక స్టేషన్ సెంటర్లో ఉన్న ఒక లాడ్జిలో పిల్లలు శిరీష (9) అనూష (7)లతో భార్యభర్తలు కొడూరి సత్యనారాయణ, గౌరమ్మలు దిగిన విషయం విదితమే. కుటుంబం అంతా కలిసి పురుగు మందు తాగినట్టు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదనే వాదనలు ఉన్నాయి. పురుగు మందు తాగిన వెంటనే తల్లిదండ్రులకు వాంతులు కావడంతో బతికి బయట పడ్డారనే వాదనలు వచ్చాయి. లాడ్జి రూములో వాంతులకు సంబంధించిన గుర్తులు కనిపించలేదు. దీనికి తోడు వారు లాడ్జి నుంచి బయటకు వెళ్లిన సమయంలో వారిలో ఎటువంటి నీరసం కనిపించలేదని లాడ్జి గుమస్తా తెలిపారు. దాంతో పిల్లలతో పురుగు మందు తాగించి భార్యభర్తలు అదృశ్యం అయ్యారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి గాలింపు చేస్తున్నారు.పాఠశాలలు తీసిన సమయంలో పుణ్య క్షేత్రాలు ఏమిటనే ఆలోచన బంధువులకు రాకపోవడమే చిన్నారుల మృతికి దారి తీసింది. పెద్దాపురంలో ఖననం పెద్దాపురం : చిన్నారుల మృతదేహాలకు పెద్దాపురం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను బంధువులకు పోలీసులకు అప్పగించారు. వారు పెద్దాపురంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్మశాన వాటికలో మృతదేహాలను ఖననం చేశారు. -
ట్రంప్ ఇడియట్ అంటూ తిట్ల దండకం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ (ఐసిఎస్) తిట్ల దండకం లంకించుకుంది. ‘ఇడియట్’ అంటూ ట్రంప్‌ను తీవ్ర పదజాలంతో దూషించింది. ఇస్లాం గురించి ట్రంప్‌కు ఏం తెలియదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఐఎస్ అధికార ప్రతినిధి అబు హసన్ అల్ ముహజిర్ పేరిట అరబిక్ భాషలో దాదాపు 36 నిమిషాల నిడివి గల వీడియోను మంగళవారం విడుదల చేసింది. ఆ వీడియోలో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పాలనాపగ్గాలు చేపట్టటం అమెరికన్ల దివాళాకోరుతనంగా అభివర్ణించింది. కాగా ట్రంప్ జనవరిలో అధికారంలోకి వచ్చాక ఐసిఎస్ నుంచి వచ్చిన తొలి వీడియో ఇది. అందులో ఇస్లాంను గురించి ఏమాత్రం అవగాహన లేని ఇడియట్గా ట్రంప్‌ను పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ అంటే ఏమిటో కూడా తెలియని మూర్ఖుడని వ్యాఖ్యలు చేసింది. అమెరికా అధ్యక్ష గద్దె నుంచి ట్రంప్‌ను తొలగించటం ఖాయమని, ఆయన ఉద్వాసనకు మార్గం మరింత సుగమమైందని పేర్కొంది. అమెరికా సర్కార్ త్వరలోనే దివాళా తీయడం ఖాయమని, ఇప్పటివరకు అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా ఇమేజ్ త్వరలోనే తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరికలు చేసింది. సిరియా, ఇరాక్లలో తాము పట్టు కోల్పోలేదని, సిరియాలో మరింత బలపడేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించింది. ఇరాక్ బలగాలతో తాము ఎదుర్కొంటున్న పరిస్థితి జిహాదీ చరిత్రలోనే గొప్పదిగా అభివర్ణించింది. కాగా అమెరికా ఎన్నికల ప్రచారంలోనూ, అధ్యక్షుడయ్యాక ట్రంప్ పలు సందర్భాల్లో ఐఎస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయటంతోపాటు అమెరికా బలగాలను ఐఎస్‌ను యుద్ధం తప్పదని ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే. అలాగే ఇరాక్‌తోపాటు సిరియాలోని కొంతభాగంలో ఇస్లామిక్‌స్టేట్ పేరుతో అధికారం నడుపుతున్న ఈ సంస్థను తుదముట్టించేందుకు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణదళాలు పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటువంటి వీడియోను ఐఎస్ వ్యూహకర్తలు రూపొందించారని భావిస్తున్నారు. -
ఐఎస్ ను కాపాడుతున్నది అమెరికానే!
మాస్కో: అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు సిరియా ఆర్మీ లక్ష్యంగా దాడులు చేసి.. 62మంది సైనికులను పొట్టనబెట్టుకోవడంపై రష్యా భగ్గుమంది. అమెరికా విచక్షణారహితంగా సిరియాలో వైమానిక దాడులకు పాల్పడుతున్నదని, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థకు కొమ్ముకాసేలా వ్యవహరిస్తున్నదని మండిపడింది. ఈ వ్యవహారంపై వెంటనే ఐరాస భద్రతా మండలి సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేసింది. 'గతంలో అల్ నస్రా దళాన్ని (అల్ కాయిదా అనుబంధ ఉగ్రవాద దళం) అమెరికా రక్షిస్తున్నదేమో అన్న అనుమానం ఉండేది. కానీ ఈ రోజు జరిగిన వైమానిక దాడులతో ఆ అనుమానం పటాపంచలైంది. అమెరికా ఏకంగా ఐఎస్ ను కాపాడుతున్నది' అని రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా మీడియాతో చెప్పారు. తాజా వైమానిక దాడులపై భద్రతా మండలిలో అమెరికా సమగ్ర వివరణ ఇవ్వాల్సిందేనని తాము డిమాండ్ చేస్తున్నట్టు ఆమె స్పష్టం చేశారు. సిరియాలోని డీర్ అల్ జర్ లో అమెరికా సంకీర్ణ సేనలు జరిపిన వైమానిక దాడుల్లో 62మంది సిరియా సైనికులు మరణించారు. 100మందికిపైగా గాయాలయ్యాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద మూకలను ఏరిపారేస్తున్న సిరియా సేనలు లక్ష్యంగా అమెరికా దాడులు జరుపుతున్నదని, తద్వారా పరోక్షంగా ఐఎస్ కు అమెరికా అండగా నిలబడుతున్నదని రష్యా మండిపడింది. -
గారడీ చేస్తున్న కేసీఆర్
పీఓడబ్ల్యూ జాతీయ కౌన్సిలర్ సంధ్య తిరుమలాయపాలెం: ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హమీలను విస్మరించి మాయమాటలు చెప్పి కాలం గడుపుతున్నారని పీఓడబ్ల్యూ జాతీయ కౌన్సిలర్ సంధ్య అన్నారు. పార్టీ నాయకులు అన్నం శ్రీనివాసరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆదివారం స్థూపాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో అధికారం కోసం అనేక హమీలు ఇచ్చి నేడు తుంగలో తొక్కారన్నారు. దళితులకు మూడు ఎకరాలు భూమి ఏమైందని ప్రశించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల ఊసే ఎత్తటం లేదన్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ ప్రజా సమస్యల వైఫల్యాలపై క్షేత్ర స్థాయిలో ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం ప్రజల కోసం నిరంతరం పని చేసిన అన్నం శ్రీనివాసరెడ్డి ఆశయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమెక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోవర్ధన్, ఎం.శ్రీనివాస్, కోలేటి నాగేశ్వరరావు, నిర్మలా, తిమ్మడి సైదయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమించాం..ఫలితాలు పొందుతున్నాం
‘టీవీఎస్’ జిల్లా ప్రథమ మహాసభలో దేశపతి శ్రీనివాస్ కొత్తగూడెం అర్బన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అంతా ఉద్యమించామని, ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలితాలను పొందుతున్నామని తెలంగాణ వికాస సమితి (టీవీఎస్) రాష్ట్ర అధ్యక్షులు దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్థానిక ఐఎంఏ హాల్లో సంఘం జిల్లా ప్రథమ మహాసభలో ప్రసంగించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన తొలి జిల్లా ఖమ్మంఅని, అందులో కొత్తగూడెం చైతన్యవంతమైన ప్రాంతమని గుర్తు చేశారు. ఆంధ్ర పాలకుల కాలంలో మాదిరి కాకుండా..ఇప్పుడు ప్రజలు నేరుగా తమ ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకునే రోజులొచ్చినయన్నారు. ప్రభుత్వం కూడా అన్ని వర్గాలవారి సంక్షేమం కోసం భూ పంపిణీ, కల్యాణలక్ష్మి తదితర పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో సమితి రాష్ట్ర కార్యదర్శులు విజయభాస్కర్‌రెడ్డి, వెంకన్న, గిరిజన విభాగం నాయకులు మాలోత్ బిక్షపతినాయక్, రాష్ట్ర ప్రధన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, సోషల్ ఫౌండేషన్ నర్సింహరెడ్డి, రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ అయితా శ్రీధర్, జిల్లా అధ్యక్షులు సురేష్, ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరావు తదితరులు పాల్గొన్నారు. పుస్తకాలతో విజ్ఞానం.. పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని పొందొచ్చని ప్రముఖ కవి, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్లో కథా, కవితా రచన శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. చిన్నారులకు ఉత్సాహాన్ని నింపే ఉత్సవం బాలోత్సవ్ మాత్రమేనని అన్నారు. విద్యార్థులు జాలి, కరుణ, దయ పంచే వారుగా తయారు కావాలన్నారు. ఎక్కడైతే కళలు గొప్పగా ఉంటాయో అక్కడ సమాజం బాగుంటుందని చెప్పారు. బాలోత్సవ్ కన్వీనర్ వాసిరెడ్డి రమేష్‌బాబు మాట్లాడుతూ..విద్యార్థులు కవితలు, కథలు రాయడం, చదవడాన్ని అలవాటుగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కవులు, కథకులు పెద్దింటి అశోక్, కుప్పిలి పద్మ, వాసిరెడ్డి నవీన్, పద్మారావు, మాధవరావు, బాల్లా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఉద్యమించాం..ఫలితాలు పొందుతున్నాం
‘టీవీఎస్’ జిల్లా ప్రథమ మహాసభలో దేశపతి శ్రీనివాస్ కొత్తగూడెం అర్బన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అంతా ఉద్యమించామని, ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలితాలను పొందుతున్నామని తెలంగాణ వికాస సమితి (టీవీఎస్) రాష్ట్ర అధ్యక్షులు దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్థానిక ఐఎంఏ హాల్లో సంఘం జిల్లా ప్రథమ మహాసభలో ప్రసంగించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన తొలి జిల్లా ఖమ్మంఅని, అందులో కొత్తగూడెం చైతన్యవంతమైన ప్రాంతమని గుర్తు చేశారు. ఆంధ్ర పాలకుల కాలంలో మాదిరి కాకుండా..ఇప్పుడు ప్రజలు నేరుగా తమ ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకునే రోజులొచ్చినయన్నారు. ప్రభుత్వం కూడా అన్ని వర్గాలవారి సంక్షేమం కోసం భూ పంపిణీ, కల్యాణలక్ష్మి తదితర పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో సమితి రాష్ట్ర కార్యదర్శులు విజయభాస్కర్‌రెడ్డి, వెంకన్న, గిరిజన విభాగం నాయకులు మాలోత్ బిక్షపతినాయక్, రాష్ట్ర ప్రధన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, సోషల్ ఫౌండేషన్ నర్సింహరెడ్డి, రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ అయితా శ్రీధర్, జిల్లా అధ్యక్షులు సురేష్, ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరావు తదితరులు పాల్గొన్నారు. పుస్తకాలతో విజ్ఞానం.. పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని పొందొచ్చని ప్రముఖ కవి, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్లో కథా, కవితా రచన శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. చిన్నారులకు ఉత్సాహాన్ని నింపే ఉత్సవం బాలోత్సవ్ మాత్రమేనని అన్నారు. విద్యార్థులు జాలి, కరుణ, దయ పంచే వారుగా తయారు కావాలన్నారు. ఎక్కడైతే కళలు గొప్పగా ఉంటాయో అక్కడ సమాజం బాగుంటుందని చెప్పారు. బాలోత్సవ్ కన్వీనర్ వాసిరెడ్డి రమేష్‌బాబు మాట్లాడుతూ..విద్యార్థులు కవితలు, కథలు రాయడం, చదవడాన్ని అలవాటుగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కవులు, కథకులు పెద్దింటి అశోక్, కుప్పిలి పద్మ, వాసిరెడ్డి నవీన్, పద్మారావు, మాధవరావు, బాల్లా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
బిడ్డా..ఎక్కడమ్మా..!
అదృశ్యమై మూడు నెలలు – ఇప్పటి వరకు దొరకని ఆనవాలు ఆచూకీ కనిపెట్టాలని వేడుకుంటున్న కన్నవాళ్లు ఖమ్మం మామిళ్లగూడెం: కన్న కూతురు కంటికి కనిపించక..ఎక్కడుంతో తెలియక..ఏమైందో ఆనవాళ్లూ కానరాక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటి నుంచి పోయిన బిడ్డ ఇగొస్తదో..అగొస్తదో అని గుమ్మంవైపు ఆశగా చూస్తున్నారు. పోలీసు కేసు పెట్టినా..ఆడఈడ వెతికినా..జాడ లేక గుండె పగులుతున్నారు. కంటికిరెప్పలా కాపాడుకున్న తల్లి ఏమైతదో..అని గుండెలవిసేలా రోదిస్తున్నారు. పోలీసులు ఆచూకీ తేల్చాలని వేడుకుంటున్నారు. ఖమ్మం త్రీటౌన్ పరిధిలో తన కూతురు అదృశ్యమైందని, ఆచూకీ తేల్చాలని నగరానికే చెందిన ఆమె తల్లిదండ్రులు దోనకొండ వజ్రమ్మ, నాగరాజులు పోలీసులను కోరారు. శుక్రవారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ..15 సంవత్సరాల తమ కుమార్తె పల్లవి ఆచూకీ లేక మూడు నెలలు అవుతోందని, తనకేమైందోనని భయపడుతున్నామని రోదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పీఎస్ఆర్ రోడ్డులోని ఓ వస్త్ర దుకాణంలో ఈమె పనిచేసేదని, జూన్ 25వ తేదీన మధ్యాహ్నం దుకాణం నుంచి వచ్చిన ఆమె బోజనం చేసి షాప్‌కు వెళ్లి ఆమె తిరిగిరాలేదని వివరించారు. తాము చాలా ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యంకాక త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన వ్యక్తి, గొల్లగూడేనికి చెందిన మరో వ్యక్తి తమ కూతురిని ఎక్కడికో తీసుకెళ్లారని వారు ఆరోపించారు. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే..తమ కూతురు ఎక్కడుంతో తెలుస్తుందని తెలిపారు. మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశామని, తమ బిడ్డ ఎక్కడున్నా ఆచూకీ తెలపాలని కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులే తమకు బిడ్డభిక్ష పెట్టాలని వేడుకున్నారు. ఫొటోరైటప్ 427: ఆచూకీలేని పల్లవి 09సీకేఎం423: రోదిస్తున్న తల్లిదండ్రులు వజ్రమ్మ, నాగరాజు -
సాహస వీరులు.. మత్స్యకారులు
13 మంది ప్రాణాలను కాపాడిన తీరు.. నేలకొండపల్లి/ తిరుమలాయపాలెం: ఇంకాసేపట్లో తెల్లవారుతుంది. అప్పుడే మత్స్యకారులు వలలు పట్టుకొని చేపలవేటకు బయల్దేరారు. చిమ్మచీకట్లు అలుముకొని ఉన్నాయి. నాయకన్‌గూడెం వంతెనపై రెండు బస్సులు ప్రమాదానికి గురై కనిపించాయి. మత్స్యకారులు అక్కడికి వెళ్లారు. ఎవరికీ హాని జరగలేదని నిర్దారించుకొని చేపల వేట కోసం వెనుదిరిగారు. అంతలోనే హైదరాబాద్ మియాపూర్ నుంచి కాకినాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా వచ్చి కాల్వలో పడిపోవడంతో పెద్దశబ్దం వచ్చింది. వెంటనే మత్స్యకారులు వెనుదిరిగి వచ్చారు. క్షతగాత్రులను కాపాడేందుకు నీళ్లలోకి దిగారు. చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసి టార్చిలైట్ల వెలుగులో కాల్వలో వెతకడం ప్రారంభించారు. తీవ్రగాయాల పాలైన 13 మందిని బయటకు తీసి వైద్యం కోసం తరలించి ప్రాణాలు కాపాడారు. క్షతగాత్రులను బయటకు తీసేందుకు బస్సు అద్దాలను పగులగొట్టే ప్రయత్నంలో మత్స్యకారులకూ గాయాలయ్యాయి. మత్స్యకారులు లేకపోతే మృతుల సంఖ్య మరింత పెరిగేదని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన వారిని కూడా బయటకు తీసేందుకు మత్స్యకారులు తీవ్రంగా శ్రమించారు. మత్స్యకారులను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప అభినందించారు. మత్స్యకారులు కాపాడటం వల్లనే తమ ప్రాణాలు దక్కాయని పలువురు క్షతగాత్రులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. -
అన్నింటికీ ఆధారే కీలకం : డీఎస్ఓ
అంబాజీపేట : రాబోయే రోజుల్లో ప్రతి అవసరానికీ ఆధార్ కార్డే కీలకం కానుందని డీఎస్ఓ జి.ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన అంబాజీపేటలో ఓ రేషన్ దుకాణాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరుతో మాట్లాడుతూ ఆధార్ చట్టబద్ధమైందని, ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలతో పాటు, ఇతర అవసరాలకు ఆధార్ కార్డునే పరిగణలోకి తీసుకుంటారని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబంలో సభ్యులంతా వేలిముద్రలను ఆధార్ సెంటర్ వద్ద తీయించుకోవాలన్నారు. జిల్లాలోని ఆరు మండలాల్లో రేషన్ షాపులను తనిఖీ చేశామన్నారు. ప్రతి నెలా రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీలో ఈ పోస్ విధానాన్ని మరింత వేగవంతం చేసేందుకు సాంకేతిక లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఆయన వెంట ఏఎస్ఓ పి.నిత్యానందం, ఎంఎస్ఓలు ఉన్నారు. -
ఐసిస్ అంతమొందించాల్సిన సంస్థ: అసదుద్దీన్
హైదరాబాద్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ విషయంలో ఎంఐఎం పార్టీ అధినేత లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. తాము ఐసిస్‌కు తీవ్ర వ్యతిరేకం అని స్పష్టం చేశారు. తాము ముందునుంచి ఇదే విషయాన్ని చెబుతున్నామని అన్నారు. ఐసిస్ అనేది ఒక అంతమొందించాల్సిన సంస్థ అని ఆయన అన్నారు. ఐసిస్ అంటే వ్యతిరేక భావజాలం ఉన్న మహ్మద్ అబుల్ హుదా అనే ఓ ప్రముఖ సిరియన్ స్కాలర్‌ను పిలిపించే ఆలోచనలు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఇటీవల ఐసిస్ సానుభూతి పరులను అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన తొలిసారి శుక్రవారం స్పందించారు. మిలటరీ సహాయంతో ఐసిస్ ను సర్వనాశనం చేయొచ్చని అంతకంటే దాని భావజాలం మొత్తాన్ని కూడా రూపుమాపాలని అన్నారు. గతంలో ఐఎస్ నుంచి అసదుద్దీన్ బెదిరింపులు ఎదుర్కున్న విషయం తెలిసిందే. -
ఆ జువైనల్ కు ఐఎస్ తో అనుబంధం?
నిర్భయ కేసులో దోషిగా ఉన్న బాల నేరస్థుడుపై మరిన్ని అభియోగాలు వెలుగు చూస్తున్నాయి. అతడు సంక్షేమ గృహంలో ఉన్నపుడు కాశ్మీర్ జిహాదీల్లో చేరే ఆలోచనలో ఉన్నట్లుగా అనుమానించిన నిఘా వర్గాలు... తాజాగా అతడికి ఐసిస్ తో అనుబంధాలు ఉన్నట్లు చెప్తున్నాయి. ఢిల్లీలో మెడికల్ విద్యార్థినిపై బస్సులో అతి క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డ బాల నేరస్థుడికి జిహాదీలతో సంబంధాలు ఉన్నట్లుగా ఇంటిలిజెన్స్ వర్గాలు మరోమారు అనుమానిస్తున్నాయి. కేసులో మూడు సంవత్సరాల నిర్బంధ శిక్ష అనంతరం అతని విడుదల విషయంలో అనేక అభ్యంతరాలు వెల్లడైన విషయం తెలిసిందే. అతడు తిరిగి సమాజానికి ఎటువంటి హాని తలపెట్టడని హామీ ఇవ్వాలంటూ విడుదలకు ముందు కోర్టుకు అభ్యర్థనలూ వెల్లువెత్తాయి. అదే నేపథ్యంలో స్పందించిన కేద్రం ఢిల్లీ హైకోర్టుకు ఇంటిలిజెన్స్ రిపోర్టును సమర్పించింది. జువైనల్.. సంక్షేమ గృహంలో ఉన్నపుడు జిహాదీల్లో చేరేందుకు యోచించినట్లు హోం వ్యవహారాల శాఖ కూడ నివేదిక ఇచ్చింది. చివరికి 2015 డిసెంబర్ లో జువైనల్ సంక్షేమ గృహంనుంచీ అతడు విడుదలయ్యాడు. కాగా ప్రస్తుతం ఆ నేరస్థుడు కొన్ని ప్రత్యేక నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించి, అధికారులను అప్రమత్తం చేశాయి. అతడిపై ప్రత్యేక దృష్టి సారించాలని హెచ్చరించాయి. కానీ అతడిగురించిన ఏ ఇతర వివరాలనూ వెల్లడించలేదు. ఉత్తర ప్రదేశ్ లోని నిఘా వర్గాల ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిర్భయ గ్యాంగ్ రేప్ నేరస్థుడి కదలికలను నిఘానేత్రంతో గమనిస్తున్నారు. కాశ్మీరీ యువత.. సదరు జువైనల్ ను జిహాదీల్లో చేరాలని ప్రేరేపిస్తున్నట్లుగా తెలుసుకున్నారు. రాష్ట్రంలోని బదౌన్ జిల్లాకు చెందిన 21 ఏళ్ళ ఆ నేరస్థుడిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఆర్నెల్లక్రితం రిఫార్మ్ హోమ్ లో మూడేళ్ళ శిక్షను పూర్తి చేసుకొని బయటపడ్డ అతడు మరో ఐదుగురితో కలసి అతి క్రూరంగా గ్యాంగ్ రేప్ జరిపిన (నిర్భయ) కేసు... 2012 లో దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలను రేపింది. అంతేకాదు ఇండియాలో మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసపై ప్రపంచం దృష్టి పడేలా చేసింది. -
హైదరాబాద్ శివార్లలో ఐసిస్ సభ్యుల షూటింగ్ ప్రాక్టీసు
రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో పేలుళ్లకు ఐసిస్ ఉగ్రవాదులు పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) భగ్నం చేసింది. పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేసిన ఎన్ఐఏ అధికారులు.. 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో ఐసిస్ సానుభూతిపరులు షూటింగ్ ప్రాక్టీసు చేసినట్లు తెలిసింది. మీర్ చౌక్, మొగల్ పురా, భవానీ నగర్, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాలలో ఎన్ఐఏ తనిఖీలు సాగాయి. పోలీసుల అదుపులో మహ్మద్ ఇలియాస్ యజ్దానీ, మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ,అబ్దుల్లా బిన్ మహ్మద్ అల్మోడీ, అబిన్ మహ్మద్, మహ్మద్ ఇర్ఫాన్, ముజఫర్ హుస్సేన్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణపై వారిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. వీళ్ల వద్ద రెండు 9 ఎంఎం పిస్టళ్లతో పాటు పేలుడు పదార్థాలు, ఆయుధాలు, విదేశీ కరెన్సీ, ఎలక్ట్రికల్ వస్తులు, అమోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. రూ. 15 లక్షల నగదును కూడా ఎన్ఐఏ, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ సందర్భంలో ఇబ్రహీం కుటుంబ సభ్యులు మీడియాపై దాడి చేశారు. ఎన్ఐఏ అధికారులు ఆ ఇంటికి వెళ్లిన సమయంలో కూడా.. ఐదు నిమిషాల్లో అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇబ్రహీం కుటుంబ సభ్యులు బెదిరించినట్లు సమాచారం. -
ఐఎస్ కీలక కమాండర్ హతం
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక సూత్రదారుడు కమాండర్ ఒమర్(చెచెన్) మృతి చెందినట్లు అమెరికా స్పష్టం చేసింది. సిరియా, అమెరికా సేనలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో అతడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా రక్షణ స్థావరం పెంటగాన్ తెలిపింది. ఈ నెల 4న ఐఎస్ కీలక ఉగ్రవాది ఒమర్ అల్ షిహానీని లక్ష్యంగా చేసుకొని దాడి చేశామని, అతడి కాన్వాయ్‌పై బాంబుల వర్షం కురిపించామని ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయాలపాలై ప్రాణాలుకోల్పోయినట్లు స్పష్టం చేసింది. ఇతడిపై కొన్ని కోట్ల రూపాయల రివార్డు కూడా అమెరికా గతంలో ప్రకటించింది. -
నెట్ వేసి ఉచ్చులోకి!
సోషల్‌మీడియా కేంద్రంగా ఐఎస్ రిక్రూట్మెంట్ సిరియా నుంచి కథ నడుపుతున్న షఫీ ఆర్మర్ ‘ఓపెన్’తో ప్రారంభించి, ‘యాప్స్’ వరకు హ్యాకర్ల ద్వారా సైబర్ వార్‌కు కుట్రపన్నిన వైనం అగ్రరాజ్యంగా భావించే అమెరికాను సైతం గడగడలాడిస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) సోషల్‌మీడియా కేంద్రంగా రిక్రూట్మెంట్స్ చేసుకుంటోంది. ఉద్రేక భావాలున్న యువతకు వల వేసి... ఉచ్చులోకి లాగుతోంది. గత ఏడాది వరకు దేశంతో పాటు నగరంలో ఉన్న యువతను ఆకర్షిస్తూ సిరియా దారి పట్టించింది. గత నెలలో దేశ వ్యాప్తంగా గుట్టురట్టైన ‘జునూద్ అల్ ఖలీఫా ఎ హింద్’ మాడ్యుల్‌తో ‘స్థానికంగా’ ఉన్న నగరాలతో పాటు ప్రముఖులు, విదేశీయుల్నీ టార్గెట్ చేసినట్లు స్పష్టమైంది. ఈ ఆపరేషన్ల కోసమే ‘జునూద్’ను ఏర్పాటు చేసుకుని విస్తరిస్తున్నట్లూ స్పష్టమైంది. దేశంలోని 12 నగరాల్లో అరెస్ట్ అయిన 16 మంది ఉగ్రవాదుల్లో హైదరాబాద్‌కు చెందిన నలుగురు ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘ఐఎస్’ రిక్రూట్మెంట్ మొదలు ఇం‘టై’నెట్ వరకు కార్యకలాపాలపై ‘సాక్షి’ ఫోకస్... సిటీబ్యూరో: కర్ణాకటలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షఫీ ఆర్మర్ భారత్‌లో ఐఎస్ కార్యకలాపాలకు ఇన్చార్జ్గా ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం తన అన్న సుల్తాన్ ఆర్మర్‌తో కలిసి దేశం దాటేశాడు. ఐఎస్‌కు అనుబంధంగా ‘అన్సార్ ఉల్ తౌహిద్’ పేరుతో ఐఎస్‌కు అనుబంధంగా ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. సిరియాలో అమెరికా సేనలు చేసిన దాడుల్లో సుల్తాన్ చనిపోగా... షఫీ మాత్రం భారత్ టార్గెట్‌గా ఐఎస్‌ను విస్తరించే పనిలో పడ్డాడు. దీనికోసమే స్థానికంగా ఉన్న వారిని ఆకర్షిస్తూ విధ్వంసాలు సృష్టించడానికి ‘జునూద్’ సంస్థను ఏర్పాటు చేయించాడు. ఐఎస్ నుంచి వచ్చిన నిధులతో పాటు వివిధ మార్గాల్లో నగదు సమీకరిస్తూ భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి హవాలా తదితర మార్గాల్లో ఇక్కడ ఎంపిక చేసుకున్న వాళ్లకు పంపిస్తున్నాడు. వివిధ రకాలైన పేర్లతో ఇంటర్నెట్ కేంద్రంగా యువతను ఆకర్షిస్తున్న షఫీ వయస్సు ప్రస్తుతం 27 ఏళ్లే అని నిఘా వర్గాలు చెప్తున్నాయి. కొంతకాలం ఆఫ్ఘనిస్థాన్ కేంద్రంగా అల్ కాయిదాతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న షఫీ... 2014 జూన్ నుంచి సిరియాలో మకాం పెట్టి కార్యకలాపాలను సాగిస్తున్నాడని స్పష్టం చేస్తున్నాయి. ఫోరమ్... పేజ్... యాప్స్... షఫీ ఆర్మర్ తనకు ‘అనువైన వారిని’ గుర్తించడానికి పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అనేక పేర్లతో వందల సంఖ్యలో అకౌంట్లు నిర్వహిస్తున్న షఫీ ప్రాథమికంగా ఫేస్బుక్, ట్విటర్ వంటి మాధ్యమాల్లోని ‘ఓపెన్ ఫోరమ్స్’లో ఓ వర్గానికి అనుకూలంగా, మరో వర్గానికి/దేశాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యల్ని పోస్ట్ చేస్తాడు. వీటికి ఆకర్షితులైన అనేక మంది స్పందిస్తుంటారు. ఈ స్పందనల్ని క్షుణ్ణంగా పరిశీలించే షఫీ... ఉద్రేకపూరిత, విపరీతమైన వ్యాఖ్యలు చేసిన వారిని ఎంపిక చేసుకుంటాడు. వారిని వ్యక్తిగతమైన ‘పేజ్’ల్లోకి ఆహ్వానిస్తూ భావజాల వ్యాప్తిని కొనసాగిస్తాడు. పూర్తిగా వలలో పడిన వారిని ఎంపిక చేసుకుని... వివిధ రకాలైన ‘వాట్సాప్’, ‘హైక్’, ‘సిగ్నల్’, ‘ట్రిలియన్’, ‘స్కైప్’ సహా వివిధ రకాలైన యాప్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతూ పూర్తిగా ఉచ్చులోకి లాగేస్తాడు. ఇలా ఆకర్షించడం ద్వారా దేశం దాటి సిరియా వచ్చేలా చేయడమో, దేశంలోనే విధ్వంసాలు సృష్టించేలా ప్రేరేపించడమో చేస్తుంటాడు. పక్కాగా టాలెంట్ స్కౌటింగ్ టీమ్... సోషల్ మీడియా ద్వారా ఆకర్షణ, రిక్రూట్మెంట్, సంప్రదింపులు జరపడానికి షఫీ ఆర్మర్ సిరియా కేంద్రంగా ‘టాలెంట్ స్కౌంటింగ్ టీమ్’ పేరుతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. దీనికోసం సాంకేతిక పరిజ్ఞానంలో పట్టున్న వారిని ఎంపిక చేసుకోవడంతో పాటు కొంత శిక్షణ సైతం ఇప్పించాడని నిందితులు వెల్లడించారు. సోషల్ మీడియాల్లో ఐఎస్‌కు సంబంధించిన వాటితో పాటు పలు రకాలైన ఉద్రేకపూరితమైన పోస్టులు పెట్టడం నుంచి ‘లైక్స్’, ‘కామెంట్స్’ను విశ్లేషించడం, ‘అనువైన వారిని’ గుర్తించడం వరకు ఈ బృందాలే పని చేస్తాయని చెప్తున్నారు. ఆ తర్వాత మాత్రమే నేరుగా రంగంలోకి దిగే ఆర్మర్... మారు పేర్లతో ‘యాప్స్’ ద్వారా సంప్రదింపులు జరుపుతాడని నిఘా వర్గాలు గుర్తించాయి. ఇంటర్నెట్ అనేది సెల్ఫోన్లలోకి అందుబాటులోకి వచ్చాక ‘ఆన్లైన్ టై’ పెరిగిందని నిఘా వర్గాలు చెప్తున్నాయి. దీనికితోడు రిక్రూట్మెంట్స్ కోసం షఫీ ఆర్మర్ కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. గత ఏడాది దుబాయ్ నుంచి డిపోర్టేషన్‌పై తీసుకువచ్చిన నగర యువతి ఆఫ్తా జబీన్ అలియాస్ నిక్కీ జోసఫ్ సిటీకే చెందిన సల్మాన్ మెయినుద్దీన్‌ను ఫేస్బుక్ ద్వారా ఆకర్షించి సిరియా వెళ్లేలా ప్రేరేపించింది. ఇతడిని 2014లో శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఈ కేసులోనే నిక్కీని డిపోర్టేషన్‌పై తీసుకువచ్చారు. ఈమె నిఘా వర్గాల విచారణలో ఓ వ్యక్తిని ఐఎస్‌కు రిక్రూట్ చేస్తే తనకు ‘హ్యాండ్లర్’ నుంచి రూ.50 వేల వరకు అందేవని వెల్లడించింది. హ్యాకర్లకు భారీగా ఎర.. విధ్వంసాలకు కుట్ర చేయడం ద్వారా ప్రత్యక్ష ‘యుద్ధాన్ని’ ప్రకటించిన షఫీ ఆర్మర్... మరోపక్క సైబర్ వార్‌కూ పథకం వేశాడు. దేశంలోని వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన, రక్షణ శాఖ వెబ్సైట్లకు హ్యాకింగ్ చేయించాలని ఆర్మర్ కుట్రపన్నిట్లు పట్టుబడిన నిందితులు వెల్లడించాడు. దీనికోసం సోషల్‌మీడియా ద్వారానే కొందరు హ్యాకర్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేసినట్లూ బయటపెట్టారు. ఈ హ్యాకర్లకు నెలకు పదివేల డాలర్లు చెల్లించడానికీ షఫీ సిద్ధమైనట్లు నిందితుడు స్పష్టం చేశారు. అయితే ఈ కుట్ర అమలులోకి రాకముందే ‘జునూద్’ మాడ్యుల్ అరెస్టు కావడంతో బ్రేక్ పడిందని, అయితే దీన్ని కేవలం తాత్కాలిక విరామంగానే పరిగణించాలని నిఘా వర్గాలు చెప్తున్నాయి. షఫీ ప్రభుత్వ విభాగాలకు చెందిన వెబ్సైట్లపై కన్నేశాడంటే... వాటిలోకి సున్నిత సమాచారం తస్కరించడంతో పాటు బ్లాక్ చేయడానికి హ్యాకర్ల ద్వారా ప్రయత్నించే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నాయి. భావజాల ‘ప్రచారానికి’ పెద్దపీట... షఫీ ఆర్మర్ తన భావజాల వ్యాప్తి కోసం ప్రచారానికీ పెద్ద పీట వేస్తున్నాడని నిఘా వర్గాలు చెప్తున్నాయి. దీనికోసం ఇంటర్నెట్, సోషల్ మీడియాలతో పాటు ‘దాబిఖ్’ను విస్తృతంగా వాడుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో ఏర్పాటైన అల్ కాయిదా సంస్థ ‘ఇన్స్పైర్’ పేరుతో ఓ పత్రికను నిర్వహించేది. దీన్నే స్ఫూర్తిగా తీసుకున్న ఐఎస్ సైతం ‘దాబిఖ్’ పేరుతో ఈ-మ్యాగ్జిన్‌ను నిర్వహిస్తోంది. ఇటీవలే 13వ ఎడిషన్ విడుదలైంది. దీన్ని సైతం షఫీ ఆర్మర్ దేశంలోని అనుచరగణానికి పంపుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. పట్టుబడిన నిందితుల ఈ-మెయిల్స్ తదితరాలను తనిఖీ చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చిందని వివరిస్తున్నారు. పేర్లు మార్చి... ఏమార్చి... భారత్‌ను టార్గెట్‌గా చేసుకుని సుదీర్ఘకాలంగా కార్యకలాపాలు సాగిస్తున్న షఫీ ఆర్మర్... ఏ సందర్భంలోనూ తన ‘నిజ స్వరూపాన్ని’ బయపెట్టాలేదు. ఒక్కో మాడ్యుల్‌ను సంప్రదించేప్పుడు ఒక్కో పేరు వాడినట్లు అధికారులు చెప్తున్నారు. దేశ వ్యాప్తంగా జరిగిన విధ్వంసాలకు సంబంధించి ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో షఫీ ఆర్మర్ పేరు ఉంది. ఇతడిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు సైతం జారీ చేసింది.2013లో రాజస్థాన్‌కు చెందిన వ్యక్తుల్ని ఐఎస్ వైపు నడిపించడానికి మహ్మద్ అట్టా పేరుతో సంప్రదింపులు జరిపాడు. 2014లో హైదరాబాద్‌కు చెందిన బాసిత్, మాజ్ హుస్సేన్‌లతో పాటు మరో ఇద్దరినీ ఐఎస్ వైపు ఆకర్షించడానికి సమీర్ ఖాన్‌గా మారాడు. 2015లో మధ్యప్రదేశ్‌లోని రత్లంలో ఏర్పాటు చేసుకున్న మాడ్యుల్‌కు యూసుఫ్‌గా పరిచయమయ్యాడు.ఈసారి ‘జునూద్’ మాడ్యుల్లోని సభ్యులతో యూసుఫ్ అల్ హింద్‌గా కథ నడిపాడు. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కరు చీఫ్... ఒకే సమయంలో దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటున్న షఫీ ఆర్మర్ ‘తన దారి’లోకి వచ్చిన వారిలో ‘ఉత్తముల్ని’ ఎంపిక చేసుకుంటున్నాడు. నగరాలు, ప్రాంతాల వారిగా ఇలా అమీర్లను ఏర్పాటు చేసి... ఆ ప్రాంతంలో ఉన్న ఇతర అనుచరుల్ని సోషల్‌మీడియా ద్వారానే అతడికి పరిచయం చేస్తాడు. వీరికి నేతృత్వం వహించే బాధ్యతల్ని అప్పగించడంతో పాటు అవసరమైన ‘వనరులు’, ‘ఇతర సహకారాలు’ సైతం కల్పిస్తాడు. ‘జునూద్’ మాడ్యుల్‌కు ముంబైకి చెందిన ముదబ్బీర్ను చీఫ్‌గా చేసిన షఫీ... హైదరాబాద్‌కు చెందిన నఫీస్ఖాన్ను ఫైనాన్స్ చీఫ్‌గా చేయడంతో పాటు మిగిలిన ముగ్గురైన ఒబేదుల్లా ఖాన్, షరీఫ్ మెయినుద్దీన్, అబు అన్స్లకు నేతృత్వం వహించే బాధ్యతల్ని అప్పగించాడు. ‘చీఫ్’లుగా ఉన్న అందరితోనూ నిత్యం సోషల్‌మీడియా ద్వారా సంప్రదింపులు జరుగుతూ రెక్కీలు, టార్గెట్ల ఎంపిక, విధ్వంసాలకు అవసరమైన పేలుడు పదార్థాల సమీకరణ, ఐఈడీ బాంబుల తయారీ తదితర అంశాలను నేరుగా పర్యవేక్షించే వాడు. 1. సల్మాన్ మొహియుద్దీన్ (బజార్‌ఘాట్) నిక్కీ జోసెఫ్ అనుచరుడు 2. సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేనీ (చాంద్రాయణగుట్ట) 3. మాజ్ హసన్ ఫారూఖ్ (హుమాయున్‌నగర్) 4. అబ్దుల్లా బాసిత్ (చాంద్రాయణగుట్ట) ఈ ముగ్గురూ కాశ్మీర్ వెళ్లే ప్రయత్నాల్లో నాగ్‌పూర్‌లో చిక్కారు. 7. మహ్మద్ నఫీజ్ ఖాన్ (అమీన్కాలనీ, షేక్‌పేట్) 8. మహ్మద్ షరీఫ్ మెయినుద్దీన్ ఖాన్ (రాఘవకాలనీ, టోలిచౌకి) 9. అబు అన్స్ (మాదాపూర్‌లో స్థిరపడిన రాజస్థాన్ వాసి) 10. మహ్మద్ ఒబేదుల్లా ఖాన్ (మొతిదర్వాజ, గోల్కొండ) హైదరాబాద్‌లో చిక్కిన ‘జునూద్’ మాడ్యుల్ సభ్యులు 11. ముదబ్బీర్ ముస్తాఖ్ ( ముంబైలో అరెస్టు అయిన ‘జునూద్’ సంస్థ చీఫ్) -
ఐఎస్ వలలో బెంగాల్ విద్యార్థులు..
కోలకతా : ఉగ్రవాద భూతం కోరలు చాస్తూనే ఉంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదం భారత్ లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఐసిస్ కదలికలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఐసీస్ భావజాలం పట్ల ఆకర్షితులవడం, ఐసిస్‌లో చేరేందుకు వెళుతున్న పలువురు విద్యార్థులు నిఘా వర్గాలకు చిక్కిన విషయం తెలిసిందే. తాజాగా కోల్ కతాలో మరో ఘటన వెలుగు చూసింది. వెస్ట్ బెంగాల్ బర్ద్వాన్ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు ఇస్టామిక్ స్టేట్ (IS) తో సంబంధాలు కొనసాగుతున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) విచారణలో కనుగొంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లోని విద్యార్థులు ఐఎస్ వలలో చిక్కుతున్నట్లు అనుమానం వచ్చిన అధికారులు విచారణ చేపట్టారు. విద్యార్థులు ఇస్టామిక్ స్టేట్ ఏజెంట్లు పెడుతున్న ప్రలోభాలకు పడిపోతున్నారని, చివరికి బందీలుగా మారుతున్నారని అధికారులు అంటున్నారు. జిల్లాలో అనుమానితులపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ బృందం.. ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఎన్ఐఏ బృదం భావిస్తోంది. -
ఐఎస్‌కు ఇండియా నుంచి ఏడు సంస్థల సాయం
లండన్: ప్రపంచాన్ని వేధిస్తున్న ఉగ్రభూతం ఇస్లామిక్ స్టేట్ కు సహాయం అందించే సంస్థల్లో ఇండియా నుంచి కూడా కొన్ని సంస్థలు ఉన్నట్లు యూరోపియన్ యూనియన్ కు చెందిన కాన్ఫ్లిక్ట్ అర్మనెంట్ రిసెర్చ్(కార్) అనే అధ్యయన సంస్థ తెలిపింది. మొత్తం 20 దేశాల్లోని సంస్థలు ఇస్లామిక్ స్టేట్‌ను పెంచి పోషిస్తుండగా భారత్‌కు చెందిన ఏడు సంస్థల అండదండలు దీనికి ఉన్నట్లు వెల్లడించాయి. ఐఎస్ తయారు చేసే బాంబులకు కావాల్సిన రసాయన పదార్థాలు ఇతర వస్తువులు భారత్‌నుంచి వెళుతున్నట్లు, వాటిని పట్టుకునేందుకు చాలా జాగ్రత్తగా వ్యూహం పన్నాల్సిన అవసరం ఉందని కూడా సూచించింది. 20 దేశాల్లోని 51 కంపెనీలు ఈ సంస్థకు సహాయపడుతున్నట్లు పేర్కొంది. అమెరికా, బ్రెజిల్, టర్కీ, రోమానియా, రష్యా, నెదర్లాండ్, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, భారత్ వంటి దేశాల నుంచి మొత్తం 700 రకాల సామాగ్రి ఐఎస్‌కు పంపిణీ అవుతుండగా వీటిలో ఎక్కువగా టర్కీ నుంచే 13 సంస్థలు ఐఎస్ కు బాంబు తయారీ సామాగ్రిని పంపిణీ చేస్తున్నట్లు వివరించింది. వీటిని తీవ్ర ప్రభావాన్ని చూపగల ఐఈడీ బాంబులకు ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా, ఈ సంస్థ బాంబులను పేల్చివేసేందుకు ఎక్కువగా నోకియా 105 మోడల్ ఫోన్లను ఉపయోగిస్తున్నట్లు కూడా తెలిపింది. -
ఈ ఏడాది ఉగ్రవాదుల టార్గెట్ అమెరికాపైనే..
వాషింగ్టన్: ఇప్పటి వరకు సిరియా, ఇరాక్, ఫ్రాన్స్, భారత్‌వంటి తదితర దేశాలను తమ దాడులతో వణికించిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇప్పుడిక తన దృష్టిని అమెరికాపై మరల్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మొత్తంలో ఐసిస్ అమెరికాలోని పలు చోట్ల దాడులు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు ఆ దేశ పాలక వర్గాలను హెచ్చరించాయి. అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ జేమ్స్ క్లాపర్ ఇతర అధికారులు ఈ అంశంపై తాజాగా వివరాలు తెలియజేస్తూ ఇస్లామిక్ స్టేట్ అనేది ఒక కొత్త ఉగ్రవాద సమస్య అని అభివర్ణించారు. అది స్వయంగానైనా, వేరొకరిని ప్రోత్సహించడం ద్వారానైనా దాడులు నిర్వహించగలదని చెప్పారు. అది దాడులకు పాల్పడే ప్రాంతం పరిమితమైగానీ, విస్తృతమైగానీ ఉంటుందని చెప్పారు. ఏదేమైనా ఇసారి ఆ ఉగ్రభూతం అమెరికాపై కన్నేసిందని, ఈ సమయంలో తాము అప్రమత్తంగా ఉండకపోతే భారీ ఆస్తి, ప్రాణనష్టాన్ని పరోక్షంగా వారే దాడులు చేయడం ద్వారానైనా, వారి ద్వారా ప్రేరేపితులైన వారి ద్వారానైనా చవి చూడాల్సి వస్తుందని చెప్పారు.