వాళ్లను ఊరికే వదిలిపెట్టం: ఒబామా
వాషింగ్టన్: బ్రిటీషు సహాయ కార్యకర్త డేవిడ్ హెయిన్స్(44)ను ఇస్లామిక్ ఉగ్రవాదులు హత్య చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా ఖండించారు. హెయిన్స్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బ్రిటన్, అంతర్జాతీయ సమాజంతో కలిసి తీవ్రవాద తండాలను తుదముట్టిస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తమ సన్నిహిత దేశానికి చేటు చేసిన వారిని వదలబొమని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఈ కిరాతకానికి పాల్పడిన హంతకులను చట్టం ముందు నిలబెడతామని అన్నారు. సిరియాలో ఏడాది క్రితం కిడ్నాపైన బ్రిటీషు సహాయ కార్యకర్త డేవిడ్ హెయిన్స్ తల నరికి.. ఆ వీడియోను ఇంటర్నెట్లో పెట్టారు ఇస్లామిక్ ఉగ్రవాదులు. అంతకుముందు ఇద్దరు అమెరికా జర్నలిస్టులను ఇలాగే హతమార్చారు