ఐఎస్ కీలక కమాండర్ హతం | IS commander 'Omar the Chechen' dead, US confirms | Sakshi
Sakshi News home page

ఐఎస్ కీలక కమాండర్ హతం

Published Tue, Mar 15 2016 10:09 AM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM

ఐఎస్ కీలక కమాండర్ హతం

ఐఎస్ కీలక కమాండర్ హతం

వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక సూత్రదారుడు కమాండర్ ఒమర్(చెచెన్) మృతి చెందినట్లు అమెరికా స్పష్టం చేసింది. సిరియా, అమెరికా సేనలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో అతడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా రక్షణ స్థావరం పెంటగాన్ తెలిపింది.

ఈ నెల 4న ఐఎస్ కీలక ఉగ్రవాది ఒమర్ అల్ షిహానీని లక్ష్యంగా చేసుకొని దాడి చేశామని, అతడి కాన్వాయ్పై బాంబుల వర్షం కురిపించామని ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయాలపాలై ప్రాణాలుకోల్పోయినట్లు స్పష్టం చేసింది. ఇతడిపై కొన్ని కోట్ల రూపాయల రివార్డు కూడా అమెరికా గతంలో ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement