బిడ్డా..ఎక్కడమ్మా..!
-
అదృశ్యమై మూడు నెలలు – ఇప్పటి వరకు దొరకని ఆనవాలు
-
ఆచూకీ కనిపెట్టాలని వేడుకుంటున్న కన్నవాళ్లు
ఖమ్మం మామిళ్లగూడెం: కన్న కూతురు కంటికి కనిపించక..ఎక్కడుంతో తెలియక..ఏమైందో ఆనవాళ్లూ కానరాక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటి నుంచి పోయిన బిడ్డ ఇగొస్తదో..అగొస్తదో అని గుమ్మంవైపు ఆశగా చూస్తున్నారు. పోలీసు కేసు పెట్టినా..ఆడఈడ వెతికినా..జాడ లేక గుండె పగులుతున్నారు. కంటికిరెప్పలా కాపాడుకున్న తల్లి ఏమైతదో..అని గుండెలవిసేలా రోదిస్తున్నారు. పోలీసులు ఆచూకీ తేల్చాలని వేడుకుంటున్నారు.
ఖమ్మం త్రీటౌన్ పరిధిలో తన కూతురు అదృశ్యమైందని, ఆచూకీ తేల్చాలని నగరానికే చెందిన ఆమె తల్లిదండ్రులు దోనకొండ వజ్రమ్మ, నాగరాజులు పోలీసులను కోరారు. శుక్రవారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ..15 సంవత్సరాల తమ కుమార్తె పల్లవి ఆచూకీ లేక మూడు నెలలు అవుతోందని, తనకేమైందోనని భయపడుతున్నామని రోదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పీఎస్‌ఆర్ రోడ్డులోని ఓ వస్త్ర దుకాణంలో ఈమె పనిచేసేదని, జూన్ 25వ తేదీన మధ్యాహ్నం దుకాణం నుంచి వచ్చిన ఆమె బోజనం చేసి షాప్‌కు వెళ్లి ఆమె తిరిగిరాలేదని వివరించారు. తాము చాలా ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యంకాక త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన వ్యక్తి, గొల్లగూడేనికి చెందిన మరో వ్యక్తి తమ కూతురిని ఎక్కడికో తీసుకెళ్లారని వారు ఆరోపించారు. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే..తమ కూతురు ఎక్కడుంతో తెలుస్తుందని తెలిపారు. మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశామని, తమ బిడ్డ ఎక్కడున్నా ఆచూకీ తెలపాలని కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులే తమకు బిడ్డభిక్ష పెట్టాలని వేడుకున్నారు.
ఫొటోరైటప్
427: ఆచూకీలేని పల్లవి
09సీకేఎం423: రోదిస్తున్న తల్లిదండ్రులు వజ్రమ్మ, నాగరాజు