
ఐఎస్ ట్వీటర్ అకౌంట్లు 46 వేలు
వాషింగ్టన్: కనీసం 46 వేల ట్వీటర్ అకౌంట్లు 2014 చివరి అంకంలో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్)తో ముడిపడి ఉన్నాయని ఓ పరిశోధనలో తేలింది. బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూషన్ శుక్రవారం దీనిపై ఓ నివేదికను విడుదల చేసింది. నిరుడు సెప్టెంబర్- డిసెంబర్ మధ్య కాలంలో కనీసం 46 వేల ట్వీటర్ అకౌంట్లను ఐఎస్ మద్దతుదారులు ఉపయోగించారని ఇందులో పేర్కొన్నారు. ఐఎస్ మద్దతుదారులు అత్యధికంగా సౌదీ అరేబియాలో, ఆ తర్వాత సిరియా, ఇరాక్, యూఎస్‌లలో ఉన్నారని పరిశోధనలో తేలింది. ఐఎస్ మద్దతుదారుల్లో మూడు వంతుల మంది అరబిక్‌లో, ప్రతీ ఐదుగురిలో ఒకరు ఇంగ్లిష్‌లో ట్వీట్ చేస్తారని వారు పేర్కొన్నారు.