ఐసిస్ అంతమొందించాల్సిన సంస్థ: అసదుద్దీన్ | Have always stood against IS, we need to crush its ideology: AIMIM chief Owaisi | Sakshi
Sakshi News home page

ఐసిస్ అంతమొందించాల్సిన సంస్థ: అసదుద్దీన్

Published Fri, Jul 1 2016 1:48 PM | Last Updated on Fri, Aug 17 2018 6:12 PM

ఐసిస్ అంతమొందించాల్సిన సంస్థ: అసదుద్దీన్ - Sakshi

ఐసిస్ అంతమొందించాల్సిన సంస్థ: అసదుద్దీన్

హైదరాబాద్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ విషయంలో ఎంఐఎం పార్టీ అధినేత లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. తాము ఐసిస్కు తీవ్ర వ్యతిరేకం అని స్పష్టం చేశారు. తాము ముందునుంచి ఇదే విషయాన్ని చెబుతున్నామని అన్నారు. ఐసిస్ అనేది ఒక అంతమొందించాల్సిన సంస్థ అని ఆయన అన్నారు.

ఐసిస్ అంటే వ్యతిరేక భావజాలం ఉన్న మహ్మద్ అబుల్ హుదా అనే ఓ ప్రముఖ సిరియన్ స్కాలర్ను పిలిపించే ఆలోచనలు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్లో ఇటీవల ఐసిస్ సానుభూతి పరులను అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన తొలిసారి శుక్రవారం స్పందించారు. మిలటరీ సహాయంతో ఐసిస్ ను సర్వనాశనం చేయొచ్చని అంతకంటే దాని భావజాలం మొత్తాన్ని కూడా రూపుమాపాలని అన్నారు. గతంలో ఐఎస్ నుంచి అసదుద్దీన్ బెదిరింపులు ఎదుర్కున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement