ఇస్తాంబుల్: తీవ్రవాద కార్యకలాపాలను నిరోధించడంలో భాగంగా ఇస్తాంబుల్ నగర వ్యాప్తంగా టర్కీ పోలీసులు తనిఖీలు చేశారు. దాదాపుగా 34 మంది అనుమానితులను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వారు గతంలో ఉగ్రవాద సంస్థలో పనిచేసినవారు, ఉగ్రకుట్రలకు పథకం రచించిన వారిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
వారి నుంచి భారీగా డాక్యుమెంట్లు, డిజిటల్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 82 మంది విదేశీయులను నిర్భంధంలోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 283 మంది ఐఎస్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. 66 పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 2015 నుంచి టర్కీలో జరిగిన బాంబు పేలుళ్ల కారణంగా సుమారు 300 మంది పౌరులు చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment