Turkey Police
-
పోలీసుల అదుపులో ఐఎస్ అనుమానితులు
ఇస్తాంబుల్: తీవ్రవాద కార్యకలాపాలను నిరోధించడంలో భాగంగా ఇస్తాంబుల్ నగర వ్యాప్తంగా టర్కీ పోలీసులు తనిఖీలు చేశారు. దాదాపుగా 34 మంది అనుమానితులను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వారు గతంలో ఉగ్రవాద సంస్థలో పనిచేసినవారు, ఉగ్రకుట్రలకు పథకం రచించిన వారిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వారి నుంచి భారీగా డాక్యుమెంట్లు, డిజిటల్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 82 మంది విదేశీయులను నిర్భంధంలోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 283 మంది ఐఎస్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. 66 పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 2015 నుంచి టర్కీలో జరిగిన బాంబు పేలుళ్ల కారణంగా సుమారు 300 మంది పౌరులు చనిపోయారు. -
9000 మంది పోలీసుల తొలగింపు
అంకారా (టర్కీ): ఏకంగా తొమ్మిది వేల మంది పోలీసులను టర్కీ ప్రభుత్వం తొలగించింది. గతేడాది జూన్లో టర్కీలో జరిగిన సైనిక తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే. ఈఘటనలో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈదుర్ఘటనకు ప్రధానకారకుడు వ్యాపార వేత్త గులెన్ అని టర్కీ ప్రభుత్వం నిర్ధారించింది. దీంతో గులెన్పై చర్యలు తీసుకోవలని టర్కీ ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఇందులో భాగంగా గులెన్తో సంబంధాలు ఉన్న 9000 మంది పోలీసులను గుర్తించి వారిని విధులనుంచి తొలగించింది. బుధవారం వెయ్యి మందిపైగా గులెన్ సానుభూతి పరులని గుర్తించి అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకటించింది. పోలీసు శాఖలో అవినీతి నిర్మూలనలో భాగంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు జింహువా అనే స్థానిక వార్తా సంస్థ తెలిపింది. జులై 16 సైనిక తిరుగుబాటుకు గులెన్ ప్రధానకారకుడు. కొన్ని దశాబ్దాలుగా పలు దేశాల్లో వ్యాపార, మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. 2013 నుంచి అమెరికాలో అజ్ఞాతంలో గడుపుతున్నాడు. గులెన్ను అప్పగించాలని టర్కీ అమెరికాను ఇప్పటికే పలు సార్లు కోరింది. -
టర్కీ పోలీసుల అదుపులో ఖమ్మం యువకుడు
ఖమ్మం : ఖమ్మం పట్టణానికి చెందిన ఓ యువకుడికి ఉగ్రవాద సంస్థ అయిన ఐఎస్ఐఎస్తో సంబంధం ఉందనే కారణంతో టర్కీ పోలీసులు అదుపులో తీసుకోవటం నగరంలో కలకలం రేకెత్తించింది. ఈ విషయాన్ని బెంగళూరు పోలీసులు ఖమ్మం పోలీసులకు సమాచారం అందించటంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఖమ్మంలోని అతని ఇంట్లోవారిని విచారించినట్లు తెలిసింది. ఖమ్మంలోని పంపింగ్వెల్రోడ్కు చెందిన ఓ యువకుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. గత నెల 27న అతడు టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో దిగడంతో అక్కడి పోలీసులకు అనుమానం వచ్చి విచారించారు. అతనితో పాటు మరో ముగ్గురు సిరియాలో ఐఎస్ఐఎస్ శిక్షణకు వెళ్తున్నట్లు తేలింది. దీంతో అక్కడి పోలీసులు వీరి గురించి కర్ణాటక పోలీసులకు తెలిపారు. ఈ సమాచారంతో హైదరాబాద్ పోలీసులు అతనింట్లో తనిఖీలు చేశారు.