కాబుల్: అఫ్గానిస్తాన్ వరుసగా రెండోరోజు రక్తమోడింది. జలాలాబాద్‌లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 19 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారు. తాలిబన్ ఉగ్రవాదులు, భద్రతా దళాలు, పౌరులు లక్ష్యంగా రెండు రోజుల్లో రెండు దాడులు చోటుచేసుకున్నాయి. శనివారం నాటి దాడిలో కనీసం 36 మంది మృతిచెందారు.
తాజా ఆత్మాహుతి దాడి కూడా ఐఎస్ పనే అని భావిస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందంలో లేని ఐఎస్ గతంలో తాలిబన్లతో ఘర్షణ పడిన ఉదంతాలున్నాయి. ఐఎస్‌కు అనుబంధంగా పనిచేస్తున్న స్థానిక సంస్థకు జలాలాబాద్‌లో అధిక ప్రాబల్యం ఉంది. మరోవైపు, కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 9 రోజులు పొడిగిస్తున్నట్లు అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ చేసిన ప్రకటనను తాలిబన్ తోసిపుచ్చింది. ఆ ఒప్పందం ముగిసిందని, దాన్ని కొనసాగించే ఉద్దేశం తమకు లేదని తేల్చిచెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment