security forces
-
ఛత్తీస్‌గఢ్ అడవులను చుట్టుముట్టిన భద్రతా బలగాలు
-
మణిపూర్‌లో మళ్లీ హింస, ఒకరు మృతి.. రంగంలోకి అమిత్ షా
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి రగులుతోంది. భద్రతా బలగాల పహారాలో కొంతకాలం దాడులు ఆగినా.. తాజాగా మళ్లీ హింస చెలరేగింది. కుకీలు, మైతీ తెగల మధ్య వైరంతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మణిపూర్‌లోని లోయ ప్రాంతాల్లో ఆదివారం జరిగిన నిరసనలు,. హింసాత్మక ఘటనల్లో ఒకరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ఆందోళన కారులను చెదరగొట్టే క్రమంలో జిరిబామ్ జిల్లాలో భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 20యేళ్ల అతౌబా మృతిచెందాడు. బాబుపరా వద్ద రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బాబుపరా ప్రాంతంలో పలు పార్టీలకు చెందిన కార్యాలయాలపై ఆందోళనకారులు దాడులు చేశారు. జిరిబామ్ పోలీస్ స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల్లోకి చొరబడిన ఆందోళనకారులు.. ఫర్నీచర్‌ను ఎత్తుకెళ్లి, ఆఫీసులను తగలబెట్టారు. దీంతో శాంతి భద్రతలకోసం భద్రతా దళాలు మోహరించడంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది.చదవండి: బీజేపీలో చేరనున్న ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గహ్లోత్మరోవైపు మణిపూర్‌లో పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు(సోమవారం) అధికారులతో సమావేశం కానున్నారు. హోం మంత్రిత్వ శాఖలోని ఈశాన్య విభాగానికి చెందిన సీనియర్ అధికారులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.ఇదిలా ఉండగా కుకీ మిలిటెంట్లు ఇటీవల జిరిబామ్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో 11 మంది కుకీలు మృత్యువాతపడ్డారు. అనంతరం ఆరుగురు మైతీ వర్గానికి చెందిన వారిని మిలిటంట్లు బందీలుగా చేసి తీసుకెళ్లారు. వారి మృతదేహాలు లభ్యం కావడంతో జిరిబామ్ జిల్లాలో హింస చెలరేగింది. దీంతో దాదాపు 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి కర్ఫ్యూ విధించారు అధికారులు. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ముష్కరులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. అనంత్‌నాగ్‌లో శనివారం(నవంబర్ 2) భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి.ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం అక్కడ గాలింపు కొనసాగుతోంది. కాగా, శ్రీనగర్ బుడ్గమ్లో శుక్రవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వలస కార్మికులు మరణించిన విషయం తెలిసిందే. ఈ వారంలో ఐదు ఉగ్రవాద సంబంధిత ఘటనలు జరగడం గమనార్హం.ఇదీ చదవండి: రూ.15 కోసం ముక్కును తెగనరికి -
లద్ధాఖ్‌లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ పూర్తి!
న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్లోని దెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. గతవారం భారత్-చైనా దేశాల మధ్య జరిగిన కీల ఒప్పందంలో భాగంగా.. కీలక ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైనికులు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామగ్రిని వెనక్కి తీసుకున్నట్లు తాజాగా ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. భారత్, చైనా సైన్యాలు ఒకరి స్థావరాలను మరొకరు పరస్పరం తనిఖీ చేసుకుంటున్నాయని పేర్కొంది.కాగా తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట పెట్రోలింగ్, దళాలుప సంహరణకు ఇటీవల భారత్, చైనా మధ్య ఇటీవల గస్తీ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. దీని ప్రకారం 2020 నాటి యథాస్థితి ఎల్ఏసీ వెంబడి ఇక కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు. ఈ క్రమంలో మూడురోజుల కిందట ఎల్ఏసీ వెంట బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలయ్యింది. అక్టోబర్ 29 లోగా బలగాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి.2020 జూన్ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాలు ఎల్ఏసీ వెంబడి భారీ స్థాయిలో బలగాలను మోహరించాయి. అప్పటినుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ –బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ జిల్లా లోహాగావ్, పురంగేల్ అడవుల్లో ఆండ్రి గ్రామం వద్ద 40 మంది వరకు మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో సీఆర్పీఎఫ్, డీఆర్జీ దళాల జవాన్లు ఉదయం 6 గంటల నుంచి కూంబింగ్ చేపట్టారు.ఆక్రమంలో 10.30 గంటల సమయంలో ఇరువర్గాల మధ్య మొదలైన ఎదురుకాల్పులు దాదాపు మూడు గంటలపాటు సాగాయి. అనంతరం బలగాలు ఘటనా స్థలిలో పరిశీలించగా ఆరుగురు మహిళలు సహా 9 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తేలింది. వీరిని దక్షిణ బస్తర్, పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ–2కు చెందిన వారిగా భావిస్తున్నారు. ఘటనాస్థలిలో ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, 12 బోర్ రైఫిల్, 315 బోర్‌గన్లతోపాటు బారెల్ గన్ లాంఛర్లు ఒక్కొక్కటి చొప్పున దొరికాయి. -
కశ్మీర్లో ఉగ్రకాల్పులు... నలుగురు సైనికుల వీరమరణం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలపై ముష్కర మూకల దాడులు పెరిగిపోతున్నాయి. సోమవారం రాత్రి దోడా జిల్లాలో బలగాలపై భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. వారిని కెప్టెన్ బ్రిజేశ్ థాపా, నాయక్ డొక్కరి రాజేశ్, సిపాయిలు బిజేంద్రసింగ్, అజయ్‌కుమార్ సింగ్ నరుకాగా గుర్తించారు. గాయపడ్డ మరో సైనికున్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.కథువా జిల్లా మారుమూల మఛేడీ అటవీప్రాంతంలో సైన్యంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగి ఐదుగురు జవాన్లను పొట్టన పెట్టుకున్న వారం రోజులకే తాజా ఘటన చోటుచేసుకుంది. దోడాలో బలగాలు, ఉగ్రవాదుల మధ్య గత మూడు వారాల్లో ఇది మూడో ఎన్కౌంటర్. ఇది తమ పనేనని పాక్ దన్నుతో చెలరేగిపోతున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ‘కశ్మీర్ టైగర్స్’ ప్రకటించుకుంది.ఉగ్రవాదులు నక్కారన్న నిఘా సమాచారంతో రాష్టీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దేసా అటవీ ప్రాంత పరిధిలోని ధారీ గోటే ఉరర్‌బాగీ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 20 నిమిషాల ఎదురుకాల్పుల అనంతరం ఉగ్రవాదులు వెన్నుచూపారు. ప్రతికూల అటవీ ప్రాంతంలోనూ కెపె్టన్ సారథ్యంలో బలగాలు వారిని వెంటాడాయి. దాంతో సోమవారం రాత్రి 9 గంటల అనంతరం మరోసారి చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కెపె్టన్‌తో పాటు మరో ముగ్గురు అసువులు బాశారని అధికారులు తెలిపారు. ఈ ముష్కరులు అక్రమంగా సరిహద్దు దాటి చొచ్చుకొచ్చి రెండు నెలలుగా అటవీ ప్రాంతంలో నక్కినట్టు భావిస్తున్నారు. వారికోసం అదనపు బలగాలతో సైన్యం, పోలీసులు భారీగా గాలిస్తున్నారు. ఎలైట్ పారా కమెండోలను కూడా రంగంలోకి దించారు. బాధగా ఉంది: రాజ్‌నాథ్ ముష్కరులను ఏరేసే క్రమంలో నలుగురు వీర జవాన్లు అమరులు కావడం చాలా బాధగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఆయనతో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, సైనిక ఉన్నతాధికారులు వారికి ఘనంగా నివాళులరి్పంచారు. కుటుంబాలకు సానుభూతి తెలిపారు.నా కొడుకు త్యాగానికి గర్విస్తున్నా..దేశ రక్షణలో అమరుడైన కొడుకును చూస్తే గర్వంగా ఉందని కెప్టెన్ బ్రిజేశ్ థాపా తల్లిదండ్రులు కల్నల్ (రిటైర్డ్) భువనేశ్ కె.థాపా, నీలిమ అన్నారు. ‘‘నా కుమారుడు చిన్నతనం నుంచీ నన్నే స్ఫూర్తిగా తీసుకున్నాడు. సైన్యంలో చేరాలని ఉవి్వళ్లూరేవాడు. 27 ఏళ్ల వయసులో కల నెరవేర్చుకున్నాడు. రెండు రోజుల క్రితమే నాతో ఫోన్లో మాట్లాడాడు. నిత్యం ప్రాణాపాయం పొంచి ఉండే ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో నా కుమారుడు అమరుడైనందుకు గర్విస్తున్నా’’ అని భువనేశ్ చెప్పారు. ఆర్మీ డే రోజు పుట్టాడు కెపె్టన్ థాపా ఆర్మీ డే అయిన జనవరి 15న జని్మంచారని తల్లి తెలిపారు. తనకింకా పెళ్లి కూడా కాలేదని సుళ్లు తిరుగుతున్న బాధను అణచుకుంటూ చెప్పారామె. కుటుంబంలో ఆయన వరుసగా మూడో తరం సైనికుడు! థాపా తండ్రితో పాటు తాత కూడా సైన్యంలో సేవ చేశారు. ఆయన ఇంజనీరింగ్ చేసి కూడా పట్టుబట్టి ఆరీ్మలోనే చేరారు. 145, ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్‌కు చెందిన థాపా రాష్రీ్టయ రైఫిల్స్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లారు.బీజేపీ తప్పుడు విధానాల వల్లే... జవాన్ల మృతిపై రాహుల్ నిప్పులుసాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో 78 రోజుల్లో 11 ఉగ్రదాడులు జరిగినా కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. బీజేపీ తప్పుడు విధానాల ఫలితాన్ని వీర సైనికులు, వారి కుటుంబాలు అనుభవించాల్సి వస్తోందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ మేరకు మోదీ ప్రభుత్వానికి లేఖ రాశారు. 11 ఉగ్రదాడుల్లో 13 మంది ఆర్మీ, పోలీసు సిబ్బంది అమరులయ్యారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఈ దాడులను, సైనికుల బలిదానాలను ఆపడానికి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆరి్టకల్ 370 రద్దుతో ఉగ్రవాదాన్ని నాశనం చేశామనే బూటకపు వాదనకు సైనికులు తమ ప్రాణాలతో మూల్యం చెల్లించుకుంటున్నారన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై సమష్టిగా పోరాడాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.ఆ అమర సైనికునిది ఏపీసంతబోమ్మాళి: దోడాలో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన డొక్కరి రాజేశ్ (25)ది ఆంధ్రప్రదేశ్. ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సంతబోమ్మాళి మండలం చెట్లతాండ్ర. రాజేశ్ ఐదేళ్ల కింద ఆర్మీలో చేరారు. వారిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు చిట్టివాడు, పార్వతి కేవలం ఎకరం పొలం సాగు చేస్తూ రాజేశ్‌ను, ఆయన సోదరున్ని చదివించారు. సోదరుడు మధుసూదనరావు డిగ్రీ పూర్తి చేశాడు. రాజేశ్ మృతితో తల్లిదండ్రులు కంటికో ధారగా విలపిస్తున్నారు. గ్రామంలో కూడా విషాద ఛాయలు అలముకున్నాయి.ఈ ఏడాదే 12 మంది సైనికుల మృతి2024లో జమ్మూలో ఉగ్ర దాడులు... ఏప్రిల్ 22: రాజౌరీ జిల్లాలో ప్రభుత్వోద్యోగిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఏప్రిల్ 28: ఉధంపూర్ జిల్లాలో ఉగ్రవాదులతోఎదురు కాల్పుల్లో విలేజీ రక్షక దళ సభ్యుని మృతి. మే 4: పూంచ్ జిల్లాలో ఉగ్ర దాడిలో ఐఏఎఫ్ సిబ్బంది మరణించగా ఐదుగురు గాయపడ్డారు. జూన్ 9: రీసీ జిల్లాలో ఉగ్ర దాడిలో 9 మంది భక్తులు మరణించగా 42 మంది గాయపడ్డారు. జూన్ 11, 12: కథువా జిల్లాలో ఎన్కౌంటర్లో ఇద్దరు విదేశీ ముష్కరులు హతమవగా ఒక సీఆరీ్పఎఫ్ జవాను అమరుడయ్యాడు. జూన్ 12: దోడా జిల్లాలో ఉగ్ర దాడిలో ఓ పోలీసుకు గాయాలు. జూన్ 26: దోడా జిల్లాలో ముగ్గురు విదేశీ ముష్కరుల కాలి్చవేత. జూలై 7: రాజౌరీ జిల్లాలో ఉగ్ర దాడిలో సైనిక సిబ్బంది గాయపడ్డారు. జూలై 8: కథువా జిల్లాలో ఉగ్రవాదుల ఉచ్చులో చిక్కి ఐదుగురు సైనికులు బలయ్యారు. జూలై 15: దోడా ఎన్కౌంటర్లో కెప్టెన్‌తో పాటు మరో ముగ్గురు సైనికుల వీరమరణం. -
Somalia: ఖైదీలు-పోలీసుల మధ్య కాల్పులు..ఐదుగురు మృతి
ఆఫ్రికా తూర్పు తీరంలోని సోమాలియా రాజధాని మొగదిషులో జైలు నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఖైదీలకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు ఖైదీలు, ముగ్గురు జవాన్లు మరణించగా, మరో 18 మంది ఖైదీలు గాయపడినట్లు సమాచారం.జిన్హువా వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆపరేషన్‌లో ముగ్గురు సైనికులు కూడా గాయపడ్డారని కస్టోడియల్ కార్ప్స్ కమాండ్ ప్రతినిధి అబ్దికాని మహ్మద్ ఖలాఫ్ తెలిపారు. సెంట్రల్ జైలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న సాయుధ ఖైదీలు అల్-షబాబ్ ఉగ్రవాద సంస్థకు చెందినవారు. వారు గ్రెనేడ్లు ఎలా పొందారనే దానిపై విచారణ జరుపుతున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఐదుగురు ఖైదీలను భద్రతా బలగాలు హతమార్చాయి. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. -
జార్ఖండ్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి
చైబాసా: జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింహ్భూమ్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. గువా పోలీస్‌స్టేషన్ పరిధిలోని లిపుంగా ప్రాంతంలో సోమవారం ఉదయం 5 గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు ఐజీ అమోల్ వి హోంకార్ చెప్పారు. మావోయిస్టు పార్టీ ఏరియా కమాండర్ టైగర్ అలియాస్ పాండు హన్స్దా, బట్రి దేవ్‌గమ్‌లను అదుపులోకి తీసుకోవడంతోపాటు ఒక ఇన్సాస్ రైఫిల్, రెండు ఎస్ఎల్ఆర్లు, మూడు రైఫిళ్లు, ఒక పిస్టల్‌ను స్వాదీనం చేసుకున్నామన్నారు. మృతులను జోనల్ కమాండర్ కండె హొన్హాగా, సబ్ జోనల్ కమాండర్ సింగ్రాయ్ అలియాస్ మనోజ్, ఏరియా కమాండర్ సూర్య అలియాస్ ముండా దేవ్‌గమ్, మహిళా నక్సల్ జుంగా పుర్టి అలియాస్ మర్లా, సప్ని హన్స్‌డాగా గుర్తించామన్నారు. -
ఇక... జమ్మూ వంతు!
జమ్మూలో వరుస తీవ్రవాద దాడులు కలవరం సృష్టించగా, ఎట్టకేలకు సర్కార్ రంగంలోకి దిగింది. కేంద్ర హోమ్ మంత్రి సారథ్యంలో ఆదివారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అందులో తొలి అడుగు. పాక్ నుంచి తీవ్రవాదుల చొరబాటు యత్నాలను నిర్వీర్యం చేసేందుకు భద్రతా దళాల సంఖ్యను పెంచడం సరైన దిశలో సరైన చర్యగా చెప్పుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాజౌరీ, పూంచ్ , రియాసీ, కఠువా, ఉధమ్‌పూర్, దోడా జిల్లాలు ఆరింటిలో ఆరు ప్రధాన తీవ్రవాద దాడులు జరిగాయి. సైనిక వర్గాల కథనం ప్రకారం విదేశీ తీవ్రవాదులు నలుగురైదుగురు చొప్పున బృందాలుగా ఏర్పడుతున్నారట. అలాంటి బృందాలు కనీసం అయిదు పీర్ పంజల్, చీనాబ్ ప్రాంతాల్లో పని చేస్తున్నాయి. జమ్మూలోని ఈ కొత్త తరహా తీవ్రవాద ధోరణి కశ్మీర్‌కూ వ్యాపించే ప్రమాదం పొంచివుంది. అందుకే, జమ్మూ కశ్మీర్‌పై స్వయంగా ప్రధాని గత వారం సమీక్షా సమావేశం నిర్వహిస్తే, తర్వాత మూడు రోజులకే హోమ్ మంత్రి సైతం సమీక్ష చేశారు. పరిస్థితి తీవ్రతకు ఇది దర్పణం. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న సమయంలోనే తాజా దాడులు యాదృచ్ఛికం అనుకోలేం. జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు సజావుగా లేవనీ, 370వ అధికరణం రద్దు తర్వాత శాంతి నెలకొనలేదనీ వీలైనప్పుడల్లా ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు పని చేస్తూనే ఉన్నారు. తాజా తీవ్రవాద దాడులు అందులో భాగమే. ఇటీవల కొన్నేళ్ళుగా కశ్మీరీ తీవ్రవాదులు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నారు. 2022లో నిర్దేశిత వ్యక్తులే లక్ష్యంగా హత్యలు చేసే పద్ధతిని అనుసరిస్తే, గత ఏడాది నుంచి సాంప్రదాయిక విన్యాసాలు సాగిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల పైచిలుకుగా ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో అలజడులు సృష్టించసాగారు. గతంలో కశ్మీర్ ప్రాంతంపై పంజా విసిరిన ముష్కర మూకలు ఇప్పుడు ప్రశాంతమైన జమ్ము ప్రాంతంపై గురి పెట్టాయి. దాంతో, భద్రతా దళాలు తమ వ్యూహాలను మార్చుకోక తప్పని పరిస్థితి. గతాన్ని సింహావలోకనం చేసుకుంటే, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370వ అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత దృష్టి అంతా కశ్మీర్‌పై నిలిచింది. అప్పటికి పదిహేనేళ్ళుగా జమ్మూలోని అధిక భాగంలో నిస్సైనికీకరణ సాగింది. ప్రశాంతత నెలకొంది. ఫలితంగా, విదేశీ తీవ్రవాదులు ఈసారి జమ్మూని తమకు వాటంగా చేసుకున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రధానంగా అడవులు ఈ విదేశీ చొరబాటుదారులకు కలిసొచ్చాయి. రాజౌరీ, పూంచ్∙జిల్లాల్లోని దట్టమైన అడవులు, సంక్లిష్టమైన కొండలు తీవ్రవాదుల కొత్త కేంద్రాలయ్యాయి. అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని, గుహల్లో దాక్కొని వారు తమ ఉనికి, బలం పెంచుకున్నారు. తాజాగా నాలుగు రోజుల్లో నాలుగు చోట్ల దాడులు జరగడం, అందులోనూ రియాసీ జిల్లాలో జూన్ 9న యాత్రికుల బస్సుపై అమానుష దాడితో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడింది. ప్రభుత్వం హడావిడిగా క్షేత్రస్థాయి పరిస్థితులపై మళ్ళీ దృష్టి పెట్టింది. 2021 జనవరి నుంచే వాస్తవాధీన రేఖ వెంట జమ్మూలోకి చొరబడడానికి విదేశీ తీవ్రవాద బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పట్లో జమ్మూలోని అఖ్నూర్లో మన సైన్యం ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టి, ముగ్గురిని హతమార్చింది. అదే ఏడాది జూన్‌లో భారత వైమానిక దళ స్థావరంపై డ్రోన్ దాడి ఘటనల నుంచి జమ్మూ ప్రాంత సరిహద్దు జిల్లాల్లో తీవ్రవాద కార్యకలపాలు పెరిగాయి. 2021 నుంచి ఇప్పటి వరకు ఒక్క జమ్మూ ప్రాంతంలోనే 29 తీవ్రవాద హింసాత్మక ఘటనలు జరిగాయి. జమ్మూ కశ్మీర్లో దాదాపు 100 మందికి పైగా తీవ్రవాదులు క్రియాశీలంగా ఉన్నారట. వారిలో తీవ్రవాద బాట పట్టిన స్థానికుల కన్నా విదేశీ తీవ్రవాదులే ఎక్కువ. ఇది తీవ్రమైన అంశం. ఒకప్పటి భారీ వ్యవస్థీకృత హింసాకాండ నుంచి ఇప్పుడు పొరుగునున్న శత్రువుల అండతో పరోక్ష యుద్ధంగా మారిన ఈ బెడదపై సత్వరమే కార్యాచరణ జరగాలి.నిజం చెప్పాలంటే, జమ్మూ కశ్మీర్, మణిపుర్లు రెండూ ఇప్పటికీ అట్టుడుకుతూనే ఉన్నాయి. మోదీ 3.0 సర్కార్ ముందున్న ప్రధానమైన సవాళ్ళు ఇవి. ప్రభుత్వ పెద్దలు వీటిని అశ్రద్ధ చేయడానికి వీలు లేదు. అందులోనూ ఈ జూన్ 29 నుంచి అమరనాథ్ యాత్ర మొదలు కానున్న వేళ జమ్మూలో భద్రత కీలకం. గతంలో సాంప్రదాయికంగా తీవ్రవాదులకు పెట్టనికోట అయిన కశ్మీర్ లోయలో ఆ పరిస్థితిని మార్చడంలో భద్రతాదళాలు విజయం సాధించాయి. నిరుడు ఏకంగా 2.11 కోట్ల మంది సందర్శకులతో కశ్మీర్లో పర్యాటకం తిరిగి పుంజుకొంది. మొన్న లోక్‌సభ ఎన్నికల్లోనూ జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. గత 35 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలో 58.46 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. తీవ్రవాదం పీచమణిచి సాధించిన అలాంటి విజయాలు జమ్మూలోనూ పునరావృతం కావాలని హోమ్ మంత్రి ఆదేశిస్తున్నది అందుకే. తీవ్రవాదులు ప్రధానంగా అంతర్జాల ఆధారిత వ్యవస్థల ఆధారంగా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. విదేశీ సిమ్ కార్డులతో, పాకిస్తానీ సర్వీస్ ప్రొవైడర్లతో సాగుతున్న ఈ వ్యవహారానికి సాంకేతికంగా అడ్డుకట్ట వేయాలి. ప్రజలు, పోలీసులు, స్థానిక రక్షణ దళ సభ్యులతో సహా అందరినీ కలుపుకొనిపోతూ దేశంలో చేరిన ఈ కలుపు మొక్కల్ని ఏరిపారేయాలి. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించాలని చూస్తున్న ఈ దుష్టశక్తుల పాచిక పారనివ్వరాదు. ప్రభుత్వం వెనక్కి తగ్గక సెప్టెంబర్‌లో జరగాల్సిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను నిరాటంకంగా జరిపించాలి. పాక్ పాలకులు పైకి మెత్తగా మాట్లాడుతున్నా, అక్కడి సైన్యాధ్యక్షుడు, సైనిక గూఢచారి వ్యవస్థ ఐఎస్ఐ చేసే కుటిల యత్నాలకు సర్వదా కాచుకొనే ఉండాలి. అప్రమత్తత, సత్వర సన్నద్ధతే దేశానికి శ్రీరామరక్ష. -
జమ్ము కశ్మీర్: భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మరోసారి కాల్పులు జరిగాయి. ఆదివారం రాత్రి ఉత్తర కశ్మీర్ బండిపోరా జిల్లాలోని ఆరాగం ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆరాగం ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కొని ఉన్నట్లు సమాచారం అందటంతో భద్రత బలగాలు అక్కడికి చేరుకొని కాల్పులు జరిపాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మరణించినట్లు తెలుస్తోంది. మృతి చెందిన ఉగ్రవాది మృతదేహాన్ని డ్రోన్ సాయంతో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.మరోవైపు.. జమ్ము కశ్మీర్‌లోని పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో సమావేశం జరిగిన రోజే ఈ ఘటన చేటుచేసుకుంది. అమిత్ షా.. కశ్మీర్లో చెలరేగుతున్న ఉగ్రవాదం ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని మీటింగ్‌లోని అధికారులను ఆదేశించారు. ఇటీవల జమ్ము కశ్మీర్లో చోటు చేసుకుంటున్న ఉగ్రవాద దాడుల పరిస్థితులను పరిశీలించడానికి ఇవాళ(సోమవారం) చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్ పర్యటించనున్నారు. -
Haiti crisis: నేర ముఠాల గుప్పిట్లో హైతీ!
ఒక నేర ముఠా ఒక ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకుని అరాచకం సృష్టిస్తే భద్రతాబలగాలు రంగంలోకి దిగి ఉక్కుపాదంతో అణచేయడం చాలా దేశాల్లో చూశాం. కానీ ఒక దేశం మొత్తమే నేర ముఠాల గుప్పెట్లోకి జారిపోతే ఎలా? హైతీ దేశ దుస్థితి చూస్తూంటే యావత్ ప్రపంచమే అయ్యో పాపం అంటోంది. పోర్ట్ ఎ ప్రిన్స్ రాజధానిసహా దేశాన్నే గడగడలాడిస్తున్న గ్యాంగ్‌లకు అసలేం కావాలి?. కెన్యా సాయం కోసం వెళ్లి రాజధాని ఎయిర్పోర్ట్ నేరముఠాలవశం కావడంతో స్వదేశం తిరిగిరాలేక అమెరికాలో చిక్కుకుపోయిన దేశ ప్రధాని ఏరియల్ హెన్రీ చివరకు పదవికి రాజీనామా చేశారు. దీంతో దేశ ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఇళ్ల నుంచి బయటకురావడానికే జనం భయపడుతున్నారు. హైతీలో ప్రధాన గ్యాంగ్‌లు ఎన్ని? హైతీలో దాదాపు 200 వరకు నేరముఠాలు ఉన్నాయి. అయితే మాజీ పోలీస్ అధికారి జిమ్మీ ‘బార్బెక్యూ’ చెరీజియర్ నేతృత్వంలోని జీ9 ఫ్యామిలీ అండ్ అలీస్ అలయన్స్, గేబ్రియల్ జీన్ పెర్రీ నేతృత్వంలోని జీపెప్ నేరముఠాలు ప్రధానమైనవి. ఇవి ప్రజలను హింసిస్తూ దేశాన్ని నరకానికి నకళ్లుగా మార్చేశాయి. రాజధాని సమీప ప్రాంతాలపై పట్టుకోసం చాన్నాళ్లుగా ఈ రెండు వైరి వర్గముఠాలు ప్రయత్నిస్తున్నాయి. ఎంతో మందిని సజీవ దహనం చేశాడని జిమ్మీని స్థానికంగా బార్బెక్యూ అని పిలుస్తుంటారు. నరమేధం, దోపిడీ, ఆస్తుల ధ్వంసం, లైంగిక హింసకు జీ9, జీపెప్ నేరముఠాలు పాల్పడ్డాయి. దీంతో ఈ ముఠా లీడర్ల లావాదేవీలు, కార్యకలాపాలపై ఐరాస, అమెరికా ఆంక్షలు విధించాయి. దీంతో రెండు గ్యాంగ్‌లు ఉమ్మడిగా ఒక ఒప్పందం చేసుకున్నాయి. కలిసి పనిచేసి ప్రధానిని గద్దెదింపేందుకు కుట్ర పన్నాయి. అసలు ఇవి ఎలా పుట్టుకొచ్చాయి? మురికివాడల్లో దారుణాలు చేశాడన్న ఆరోపణలపై జిమ్మీని పోలీస్ ఉద్యోగం నుంచి తీసేశాక నేరసామ్రాజ్యంలో అడుగు పెట్టాడు. దేశంలోని రాజకీయ పార్టీలు, నేతలు, పారిశ్రామికవేత్తలు తమ అనైతిక పనులకు అండగా ఉంటారని ఇలాంటి చిన్న చిన్న నేరగాళ్లను అక్కున చేర్చుకుని పెద్ద ముఠా స్థాయికి ఎదిగేలా చేశారు. 2021 జులైలో హత్యకు గురైన హైతీ మాజీ అధ్యక్షుడు జొవెనెల్ మొయిసెకు చెందిన పార్టీ హైతియన్ టెట్ కాలే(పీహెచ్‌టీకే)తో జిమ్మీకి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఒకానొక దశలో జిమ్మీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని మొయిసె భావించారు. జీపెప్ ముఠా సైతం విపక్ష పార్టీలతో అంటకాగింది. దీంతో ఆర్థికంగా, ఆయుధపరంగా రెండు ముఠాలు బలీయమయ్యాయి. హింస ఎప్పుడు మొదలైంది? హైతీ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ ‘పాపా డాక్’ డ్యువేలియర్, అతని కుమారుడు జీన్‌క్లాడ్ డ్యువేలియర్‌ల 29 ఏళ్ల నియంతృత్వ పాలనాకాలంలోనే ఈ గ్యాంగ్‌లు పురుడుపో సుకున్నాయి. డ్యువేరియర్లు ఒక సమాంతర మిలటరీ(టోంటోన్స్ మకౌటీస్)ని ఏర్పాటు చేసి వైరి పార్టీల నేతలు, వేలాది మంది సామాన్య ప్రజానీకాన్ని అంతమొందించారు. ‘హైతీలో నేరముఠాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. కానీ ఇప్పుడున్న నేరముఠాల వైఖరి గతంతో పోలిస్తే దారుణం’ అని వర్జీనియా విశ్వవిద్యాలయ అధ్యాపకుడు, హైతీ వ్యవహారాల నిపుణుడు రాబర్ట్ ఫాటన్ విశ్లేషించారు. నేతలనూ శాసిస్తారు బెదిరింపులు, కిడ్నాప్‌లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా లతో నేరముఠాలు ఆర్థికంగా బలపడ్డాయి. ఆయుధాలను సమకూర్చుకున్నారు. గత వారం రాజధానిలోని రెండు జైళ్లపై అధునాతన డ్రోన్లతో దాడికి తెగబడ్డాయి. శిక్ష అనుభవిస్తున్న వేలాది మంది కరడుగట్టిన నేరగాళ్లను విడిపించుకు పోయారు. సాయుధముఠాలు ఇప్పుడు ఏకంగా రాజకీయపార్టీలు, నేతలనే శాసిస్తున్నాయి. పరిపాలన వాంఛ అక్రమ మార్గాల్లో సంపదను మూటగట్టుకున్న నేర ముఠాలు ఇప్పుడు రాజ్యాధికారంపై కన్నేశాయి. 2021లో దేశాధ్యక్షుడు మొయిసె హత్యానంతరం వీటి రాజకీయ డిమాండ్లు ఎక్కువయ్యాయి. ముఠాలు ప్రధాని హెన్రీని గద్దె దింపాయి. దేశాన్ని పాలిస్తానని బార్బెక్యూ జిమ్మీ పరోక్షంగా చెప్పాడు. అంతర్జాతీయంగా తన పేరు మార్మోగాలని విదేశీ మీడియాకు ఇంటర్వ్యూలిచ్చాడు. విదేశీ జోక్యం వద్దని, విదేశీ బలగాలు రావద్దని హుకుం జారీచేశాడు. ప్రస్తుత సంక్షోభాన్ని ఒంటిచేత్తో పరిష్కరిస్తానని ప్రకటించాడు. రాజకీయ శక్తులుగా ఎదిగితేనే తమ మనుగడ సాధ్యమని ముఠాలు భావిస్తున్నాయి. సంకీర్ణ బలగాలు వస్తున్నాయా? కెన్యా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలను హైతీకి పంపించి సంక్షోభానికి ఫుల్స్టాప్ పెట్టాలని అమెరికాసహా పలుదేశాలు నిర్ణయించాయి. ఐరాస ఇందుకు అంగీకారం తెలిపింది. అయితే కెన్యా కోర్టుల జోక్యంతో ప్రస్తుతానికి ఆ బలగాల ఆగమనం ఆగింది. హైతీ ప్రధాని రాజీనామా నేపథ్యంలో నూతన ప్రభుత్వ కొలువు కోసం కౌన్సిల్ ఏర్పాటు, అన్ని భాగస్వామ్యపక్షాల సంప్రతింపుల ప్రక్రియ ముగిసేదాకా వేచిచూసే ధోరణిని అవలంబిస్తామని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో చెప్పారు. మరి కొద్దిరోజుల్లోనే ఎన్నికల కోసం కౌన్సిల్ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. మన వాళ్లను వెనక్కి రప్పిస్తాం: భారత విదేశాంగ శాఖ హైతీలో దాదాపు 90 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. వీరిలో డాక్టర్లు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు ఉన్నారు. 60 మంది ఇప్పటికే హైతీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. హైతీలో భారతీయ రాయబార కార్యాలయం, కాన్సులేట్ లేవు. దీంతో సమీపాన ఉన్న డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమినిగోలోని ఇండియన్ మిషన్ ద్వారా హైతీలోని భారతీయులతో మోదీ సర్కార్ సంప్రతింపులు జరుపుతోంది. వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ శుక్రవారం ఢిల్లీలో చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బస్తర్‌లో భయం భయం!
తాండ్ర కృష్ణ గోవింద్, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, తలపై రూ.కోటి రివార్డు ఉన్న కీలక నేత హిడ్మా స్వగ్రామం పువ్వర్తిలో కేంద్ర భద్రతా దళాలు క్యాంప్ నెలకొల్పాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు– భద్రతా దళాల మధ్య సాగుతున్న పోరును తెలుసుకునేందుకు ‘సాక్షి’ బస్తర్ అడవుల బాటపట్టింది. అన్నలు విధించిన ఆంక్షలు, పారామిలటరీ చెక్ పాయింట్లను దాటుకుంటూ వెళ్లి వివరాలు సేకరించింది. జవాన్లు, అధికారులతోపాటు మావోయిస్టుల ప్రత్యేక పాలన (జనతన సర్కార్)లో నివసిస్తున్న ప్రజలతో ‘సాక్షి’ ప్రతినిధి మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనపై ప్రత్యేక కథనం.. ముందు, వెనక ప్రమాదం మధ్య.. బస్తర్ దండకారణ్యం పరిధిలోకి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుకుమా, దంతెవాడ,బస్తర్ జిల్లాలు వస్తాయి. ఇక్కడి ప్రజలు రెండు రకాల పాలనలో ఉన్నారు. వారి జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు ‘సాక్షి’ మీడియా బృందం ప్రయత్నించింది. ముందుగా భద్రాద్రి జిల్లా చర్ల మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడుకు.. అక్కడి నుంచి సుక్మా జిల్లా పువ్వర్తికి వెళ్లింది. ఈ మార్గంలో ఎవరితో మాట్లాడినా.. వారి కళ్లలో సందేహాలు, భయాందోళన కనిపించాయి. కొండపల్లి వద్ద కొందరు గ్రామస్తులు మీడియా బృందాన్ని అడ్డుకున్నారు. ఎవరి అనుమతితో వచ్చారంటూ గుర్తింపు కార్డులు అడిగి తీసుకున్నారు. సాయంత్రందాకా పలుచోట్లకు తీసుకెళ్లారు. తర్వాత ఓ వ్యక్తి వచ్చి ‘‘మీరంతా మీడియా వ్యక్తులే అని తేలింది. వెళ్లొచ్చు. ప్రభుత్వం తరఫునే కాకుండా ఇక్కడి ప్రజల కష్టాలను కూడా లోకానికి తెలియజేయండి’’ అని కోరాడు. అంతేగాకుండా ‘‘ఈ ప్రాంతంలోకి వచ్చేముందు అనుమతి తీసుకోవాల్సింది. అటవీ మార్గంలో అనేకచోట్ల బూబీ ట్రాప్స్, ప్రెజర్ బాంబులు ఉంటాయి. కొంచెం అటుఇటైనా ప్రాణాలకే ప్రమాదం’’ అని హెచ్చరించాడు. దీంతో మీడియా బృందం రాత్రికి అక్కడే ఉండి, మరునాడు తెల్లవారుజామున పువ్వర్తికి చేరుకుంది. అక్కడ భద్రతా దళాల క్యాంపు, హిడ్మా ఇల్లును పరిశీలించింది. అయితే భద్రతాపరమైన కారణాలు అంటూ.. ఫొటోలు తీసేందుకు, వివరాలు వెల్లడించేందుకు పారామిలటరీ సిబ్బంది అంగీకరించలేదు. ఆ పక్క గ్రామంలో హిడ్మా తల్లి ఉందని తెలిసిన మీడియా బృందం వెళ్లి ఆమెను కలిసి మాట్లాడింది. తిరిగి వస్తుండగా నలుగురు సాయుధ కమాండర్లు అడ్డగించారు. బైక్‌లపై తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్లను చూసిన ఓ తెలుగు జవాన్ కల్పించుకుని.. ‘‘మీరు కొంచెం ముందుకొచ్చి ఉంటే.. మా వాళ్లు కాల్చేసేవారు’’ అని హెచ్చరించాడు. అదే దారిలో నేలకూలిన ఓ పెద్ద చెట్టును కవర్‌గా చేసుకుని బంకర్ నిర్మించారని, అందులో సాయుధ జవాన్లు ఉన్నారని, జాగ్రత్తగా వెళ్లాలని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య మీడియా బృందం సాధ్యమైనన్ని వివరాలు సేకరించి తిరిగి చర్లకు చేరుకుంది. జనతన్ సర్కార్ ఆధీనంలో.. బీజాపూర్ జిల్లా పామేడు నుంచి చింతవాగు, ధర్మారం, జీడిపల్లి, కవరుగట్ట, కొండపల్లి, బట్టిగూడెం మీదుగా పువ్వర్తి వరకు 60 కిలోమీటర్ల ప్రయాణం సాగింది. పామేడు, ధర్మారం గ్రామాల వరకే ఛత్తీస్‌గఢ్‌తోపాటు ప్రభుత్వ పాలన కనిపిస్తుంది. అక్కడివరకే పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రి, అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల వంటివి ఉన్నాయి. తర్వాత చింతవాగు దాటి కొద్దిదూరం అడవిలోకి వెళ్లగానే జనతన సర్కార్‌కు స్వాగతం పలుకుతున్నట్టుగా మావోయిస్టులు హిందీలో చెక్కలపై రాసి చెట్లకు తగిలించిన బోర్డులు వరుసగా కనిపించాయి. జనతన సర్కార్ ఆ«దీనంలోని ఈ ప్రాంతాల్లో ఎక్కడా బీటీ రోడ్డు లేదు. ఎటు వెళ్లాలన్నా కాలిబాట, ఎడ్లబండ్ల దారులే ఆధారం. పోడు భూములు.. స్తూపాలు జనతన సర్కార్ ఆ«దీనంలోని గ్రామాల్లో మావోయిస్టులు తవ్వించిన చెరువులు, పోడు వ్యవసాయ భూములు, రేకుల షెడ్లలోని స్కూళ్లు కనిపించాయి. కానీ ఎక్కడా తరగతులు నడుస్తున్న ఆనవాళ్లు లేవు. అక్కడక్కడా కొందరు టీచర్లు కనిపించినా మాట్లాడేందుకు నిరాకరించారు. అక్కడక్కడా సంతల్లో హెల్త్ వర్కర్లు మాత్రం కనిపించారు. పరిమితంగా దొరికే ఆహారం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్త్రీలు, పిల్లల్లో పోషకాహర లోపం కనిపించింది. అయితే గతంలో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని వారు చెప్పారు. ఏ గ్రామంలోనూ గుడి, చర్చి, మసీదు వంటివి లేవు. జనతన సర్కార్‌లో మతానికి స్థానం లేదని స్థానికులు చెప్పారు. కొన్నిచోట్ల చనిపోయినవారికి గుర్తుగా నిలువుగా పాతిన బండరాళ్లు, మావోయిస్టుల అమరవీరుల స్తూపాలు మాత్రమే కనిపించాయి. బస్తర్ అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో ఇప్పసారా, లంద, చిగురు వంటి దేశీ మద్యం దొరుకుతుంది. కానీ జనతన సర్కార్ ఆ«దీనంలోని ప్రాంతాల్లో ఎక్కడా మద్యం ఆనవాళ్లు కనిపించలేదు. చాలా మందికి ఆధార్ కార్డుల్లేవు జనతన సర్కార్ పరిధిలోని గ్రామాల్లో సగం మందికిపైగా తమకు ఆధార్‌కార్డు, ఓటర్ గుర్తింపుకార్డులు లేవని చెప్పారు. వారికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అంతంతగానే దక్కుతున్నాయి. పువ్వర్తి సమీపంలోని మిర్చిపారా గ్రామానికి చెందిన మడకం సంజయ్ మాట్లాడుతూ.. ‘‘రేషన్ బియ్యం తీసుకుంటున్నాం. అది కూడా మా గ్రామాలకు పది– ఇరవై కిలోమీటర్ల దూరంలో జనతన సర్కార్‌కు ఆవల ఉండే మరో గ్రామానికి వెళ్లి రెండు, మూడు నెలలకు ఓసారి తెచ్చుకుంటాం..’’ అని చెప్పాడు. ఇక ఎన్నికల ప్రక్రియపై పటేల్‌పారా గ్రామానికి చెందిన నందా మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ చాలా గ్రామాలకు నామ్ కే వాస్తే అన్నట్టుగా సర్పంచ్‌లు ఉన్నారు. ఎక్కువ మంది ఎన్నికలను బహిష్కరిస్తారు. అయినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుండటంతో.. సమీప పట్టణాల్లో నివాసం ఉండేవారు నామినేషన్ దాఖలు చేస్తారు. వారిలో ఒకరు సర్పంచ్ అవుతారు. కానీ చాలా గ్రామాల్లో వారి పెత్తనమేమీ ఉండదు. పరిపాలనలో గ్రామ కమిటీలదే ఆధిపత్యం..’’ అని వివరించాడు. సమష్టి వ్యవసాయం చాలా ఊర్లలో ట్రాక్టర్లు కనిపించాయి. వాటికి రిజిస్ట్రేషన్ నంబర్లు లేవు. ఆ ట్రాక్టర్లను ఊరంతా ఉపయోగించుకుంటారని తెలిసింది. ఇక్కడి ప్రజలకు ఎలాంటి విద్యుత్ సౌకర్యం లేదు. అంతా దట్టమైన అడవి అయినా ఎక్కడా అటవీ సిబ్బంది ఛాయల్లేవు. ఇటీవలికాలంలో చేతిపంపులు, సోలార్ లైట్లు వంటివి కనిపిస్తున్నాయి. వినోదం విషయానికొస్తే.. సంప్రదాయ ఆటపాటలతో పాటు కోడిపందేలను ఆదివాసీలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నాం ఇక్కడి ప్రజలకు రక్షణ కల్పించేందుకు, ప్రభుత్వం తరఫున సేవలు అందించేందుకు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని పువ్వర్తి వద్ద విధులు నిర్వర్తిస్తున్న సుక్మా జిల్లా ఏఎస్పీ గౌరవ్ మొండల్ చెప్పారు. ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో సర్వే చేపట్టి తాగునీరు, విద్యుత్, స్కూల్, ఆస్పత్రి వంటి సౌకర్యాలు, ఇతర ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. అయితే క్యాంపుల ఏర్పాటులో ఉన్న వేగం ప్రభుత్వ పథకాల అమల్లో కనిపించడం లేదేమని ప్రశి్నస్తే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులే అందుకు కారణమన్నారు. ఇక క్యాంపుల ఏర్పాటు సమయంలో ఆదివాసీలు భయాందోళన చెందినా, తర్వాత శత్రుభావం వీడుతున్నారని మరో అధికారి తెలిపారు. ఈక్రమంలోనే జనతన సర్కారులోకి చొచ్చుకుపోగలుతున్నామన్నారు. ఇప్పటికీ మావోయిస్టులదే పైచేయి.. ప్రభుత్వ బలగాలు ఎంతగా మోహరిస్తున్నా ఇప్పటికీ అడవుల్లో మావోయిస్టులదే ఆధిపత్యం. దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడి ప్రజలకు ఆటపాటలే ప్రధాన వినోద సాధనాలు. మావోయిస్టులు చేతన నాట్యమండలి వంటివాటి ద్వారా ఇక్కడి ప్రజల్లో విప్లవ భావాలను రేకెత్తిస్తారు. పిల్లలకు ఏడేళ్లు దాటగానే గ్రామ కమిటీల్లో చోటు కల్పించి, భావజాలాన్ని నేర్పుతారు. మావోయిస్టుల పట్ల ఎవరైనా వ్యతిరేకత చూపితే ప్రమాదం తప్పదనే భయాన్ని నెలకొల్పారు’’ అని ఆరోపించారు. హిడ్మా అడ్డాలో క్యాంపు వేసి.. పువ్వర్తి జనాభా 400కు అటుఇటుగా ఉంటుంది. అందులో దాదాపు వంద మంది మావోయిస్టు దళాల్లో ఉన్నారు. వీరిలో హిడ్మా కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకోగా.. ఆయన సోదరుడు దేవా బెటాలియన్ కమాండర్‌గా ఉన్నారు. పువ్వర్తిలో హిడ్మా కోసం ప్రత్యేక సమావేశ మందిరం, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేవి. అక్కడికి కొన్ని అడుగుల దూరంలోనే హిడ్మా సొంతిల్లు ఉంది. ప్రస్తుతం ఇవన్నీ భద్రతా దళాల ఆధీనంలో ఉన్నాయి. ఆధునిక పరికరాల సాయంతో వందల మంది కార్మికులు క్యాంపు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. ఇటీవలి వరకు రోడ్డుకూడా లేని ఈ గ్రామంలోకి ఇప్పుడు పదుల సంఖ్యలో లారీల్లో వస్తుసామగ్రి, రేషన్ తరలించారు. బుల్డోజర్లు, పొక్లెయినర్లు నిర్విరామంగా తిరుగుతున్నాయి. సీఆర్పీఎఫ్, స్పెషల్ టాస్‌్కఫోర్స్, డి్రస్టిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్ ఇలా వివిధ దళాలకు చెందిన సుమారు ఐదు వేల మంది సిబ్బంది మోహరించారు. గ్రామం నలువైపులా గుడారాలు, బంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యలో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు.. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్యాంపులు తమకు ఇబ్బందిగా మారుతున్నాయని చాలా మంది ఆదివాసీలు అంటున్నారు. కొండపల్లికి చెందిన మడావి మాట్లాడుతూ.. ‘‘క్యాంపులు ఏర్పాటైన తర్వాత మా గ్రామాల్లోకి వచ్చే భద్రతాదళాలు విచారణ పేరుతో జబర్దస్తీ చేస్తున్నాయి. రాత్రీపగలు తేడా లేకుండా కాల్పుల శబ్దాలు వినవస్తున్నాయి. విచారణ పేరిట ఎవరైనా గ్రామస్తుడిని తీసుకెళ్తే.. తిరిగి వచ్చే వరకు ప్రాణాలపై ఆశలేనట్టే. అందుకే భద్రతా దళాలు వస్తున్నట్టు తెలియగానే పెద్దవాళ్లందరం అడవుల్లోకి పారిపోతున్నాం’’ అని చెప్పాడు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో గ్రామస్తుడు మాట్లాడుతూ.. ‘‘స్థానికులమైన మాకు భద్రతాదళాల నుంచి కనీస మర్యాద లేదు. అభివృద్ధి పేరిట అడవుల్లోకి వస్తున్నవారు గ్రామపెద్దల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు..’’ అని పేర్కొన్నాడు. -
Manipur: భద్రతా బలగాలపైకి మిలిటెంట్ల దాడులు
ఇంఫాల్: జాతుల వైరంతో ఘర్షణలమయమైన మణిపూర్‌లో ఈసారి భద్రతా బలగాలు, కుకీ మిలిటెంట్లకు మధ్య పరస్పర కాల్పుల పర్వం కొనసాగుతోంది. తొలుత మయన్మార్ సరిహద్దులోని మోరె పట్టణంలో భద్రతా బలగాల పోస్ట్‌పై మిలిటెంట్లు దాడి చేయడంతో ఈ ఎదురుకాల్పులు మొదలయ్యాయి. గత ఏడాది అక్టోబర్‌లో మోరె సబ్‌డివిజనల్ పోలీస్ ఆఫీసర్ చంగ్థమ్ ఆనంద్‌ను కుకీ మిలిటెంట్లు హత్య చేసిన ఘటనలో మంగళవారం మోరె పట్టణంలో పోలీసులు ఇద్దరు అనుమానితులను అరెస్ట్‌చేశారు. ఈ అరెస్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొందరు మహిళల బృందం పోలీస్‌స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మోరె పట్టణంలోని భద్రతాబలగాల పోస్ట్‌పై కాల్పులు జరిపారు. రాకెట్ ఆధారిత గ్రనేడ్లు విసిరారు. బలగాల పోస్ట్ వద్ద వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. వెంటనే తేరుకున్న బలగాలు మిలిటెంట్లపై కాల్పులు జరిపాయి. మోరె పట్టణం సహా ఛికిమ్ గ్రామంలో, వార్డ్ నంబర్ ఏడులోనూ ఇలా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. ఒక ఆలయం సమీపంలో మిలిటెంట్లు జరిపిన మెరుపుదాడిలో స్టేట్ పోలీస్ కమాండో వాంగ్కెమ్ సోమర్జిత్ మరణించారు. మరో చోట జరిపిన కాల్పుల్లో మరో పోలీస్ తఖెల్లబమ్ శైలేశ్వర్ ప్రాణాలు కోల్పోయారు. ఉద్రిక్తతల నేపథ్యంలో తెంగ్నౌపాల్ జిల్లాలో మణిపూర్ సర్కార్ కర్ఫ్యూను విధించింది. ఇద్దరు నిందితులను జ్యుడీషియల్ మేజి్రస్టేట్ తొమ్మిది రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు. హెలికాప్టర్లు ఇప్పించండి రోడ్డు మార్గంలో బలగాల తరలింపు సమయంలో మిలిటెంట్ల మెరుపుదాడుల నేపథ్యంలో బలగాల తరలింపు, మొహరింపు, క్షతగాత్రుల తరలింపు, వైద్య సేవల కోసం హెలికాప్టర్లను ఇవ్వాలని కేంద్ర హోం శాఖను మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అభ్యరి్థంచింది. రాష్ట్రంలో మళ్లీ మొదలైన ఘర్షణలు, ఉద్రిక్తతలపై ముఖ్యమంత్రి బీరెన్æ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తాజా ఉద్రిక్తతల్లో మయన్మార్ శక్తుల ప్రమేయం ఉండొచ్చని సీఎం అనుమానం వ్యక్తంచేశారు. -
22న అయోధ్యలో హైసెక్యూరిటీ.. భద్రతా బలగాలివే..
మరికొద్ది రోజుల్లో అయోధ్యలో జరగనున్న రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 16 నుంచి ప్రారంభమయ్యే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో భద్రతా సిబ్బందిని అయోధ్యలోని వివిధ ప్రాంతాల్లో మోహరించనున్నారు. పోలీసు అధికారి డీజీపీ ప్రశాంత్ కుమార్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం జనవరి 22న ఆలయ విధుల్లో పాల్గొనే పోలీసులెవరూ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించకూడదు. అలాగే ఈ వేడుక ముగిసిన నాలుగు రోజుల తర్వాత జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భద్రతా సిబ్బంది స్మార్ట్ మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడని డీజీపీ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. రామమందిర సముదాయానికి సంబంధించిన సమగ్ర భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఈ ప్రాంతాన్నంతటినీ రెడ్, ఎల్లో జోన్లుగా విభజించారు. రామజన్మభూమి కాంప్లెక్స్‌ను రెడ్ జోన్లో ఉంచారు. 6 కంపెనీల సీఆర్పీఎఫ్, 3 కంపెనీల పీఏసీ, 9 కంపెనీల ఎస్ఎస్ఎఫ్, 300 మంది పోలీసు సిబ్బంది, 47 మంది అగ్నిమాపక సిబ్బంది, 38 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, 40 మంది రేడియో పోలీసు సిబ్బందికి రామాలయం, దాని ప్రాంగణం భద్రత బాధ్యతలు అప్పగించారు. అయోధ్య భద్రతకు రూ.90 కోట్ల బడ్జెట్ కేటాయించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద అయోధ్యలో ఏఐ ఆధారిత వ్యవస్థను కూడా అమలు చేయనున్నారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌కు చెందిన రెండు బృందాలు, రెండు విధ్వంసక నిరోధక దళాలు, పీఎసీకి చెందిన ఒక కమాండో యూనిట్, ఎటీఎస్, ఎస్టీఎఫ్లకు చెందిన ఒక్కో యూనిట్, ఎన్ఎస్జీతో సహా సెంట్రల్ ఏజెన్సీలను కూడా ఆలయ భద్రత విధుల్లో మోహరించనున్నారు. ఎల్లో జోన్‌లోని కనక్‌భవన్, హనుమాన్‌గఢి ప్రాంతాల్లో కూడా పటిష్ట భద్రత ఉంటుంది. ఎల్లో జోన్లో 34 మంది సబ్ఇన్స్పెక్టర్లు, 71 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 312 మంది కానిస్టేబుళ్లు భద్రతను పర్యవేక్షించనున్నారు. -
చత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
సుక్మా: చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గోగుండా ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, దంతెవాడ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ 2వ బెటాలియన్, సీఆర్పీఎఫ్ 111 బెటాలియన్లు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. ఈ కూంబింగ్‌లో భద్రతా బలగాలకు, మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఎదురు కాల్పుల్లో నలుగు మావోయిస్టుల మృతి చెందినట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు. ఘటనా స్థలంలో గాయపడిన మరికొంత మంది మావోయిస్టులును చుట్టుముట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సీఆర్పీఎఫ్ డీఐజీ అరవింద్ రాయ్ తెలిపారు. చదవండి: Temple Vandalised: భారత్ స్ట్రాంగ్ రియాక్షన్ -
BSF: కశ్మీర్‌కు చొరబాట్ల ముప్పు
శ్రీనగర్: పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దుల గుండా జమ్మూ కశ్మీర్లోకి చొరబడేందుకు కనీసం 250 నుంచి 300 మంది దాకా ఉగ్ర ముష్కరులు నక్కి ఉన్నట్టు బీఎస్ఎఫ్ శనివారం తెలిపింది. ఈ మేరకు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచరముందని బీఎస్ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. అయితే భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, వారి ఎత్తులను తిప్పికొడతాయని పేర్కొన్నారు. ఈ విషయంలో సైన్యంతో కలిసి సమన్వయంతో సాగుతున్నామని విలేకరులకు వివరించారు. కొన్నేళ్లుగా జమ్మూ కశ్మీర్ వాసులతో భద్రతా దళాలకు అనుబంధం, సమన్వయం పెరుగుతోందని ఆయన తెలిపారు. వారి సహకారంతో స్థానికంగా అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా ముందుకు తీసుకెళ్తామన్నారు. -
కశ్మీర్లో ముగిసిన ఎన్కౌంటర్..
రాజౌరీ/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో గురువారం రెండో రోజు కూడా ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. బుధవారం ఎన్కౌంటర్ గాయపడిన ఇద్దరు జవాన్లలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని అధికారులు తెలిపారు. దీంతో, ఈ ఎన్కౌంటర్ అసువులు బాసిన జవాన్ల సంఖ్య అయిదుగురుకు చేరుకుంది. బుధవారం చనిపోయిన వారిని కెప్టెన్ ఎంవీ ప్రాంజల్(కర్ణాటక), కెప్టెన్ శుభమ్ గుప్తా(యూపీ), పారా ట్రూపర్ సచిన్ లౌర్(యూపీ), హవల్దార్ అబ్దుల్ మాజిద్(జమ్మూకశ్మీర్)గా గుర్తించారు. గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ధర్మసాల్లోని బాజిమాల్ ప్రాంతంలో బుధవారం ఎన్కౌంటర్ సందర్భంగా ఇద్దరు కెప్టెన్లు సహా నలుగురు జవాన్లు నేలకొరిగారు. మరో ఇద్దరు గాయాలపాలైన విషయం తెలిసిందే. రాత్రి వేళ కాల్పులను నిలిపివేసిన బలగాలు ఉగ్రవాదులు తప్పించుకునే అవకాశం లేకుండా, అక్కడి దట్టమైన అటవీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో దిగ్బంధించాయి. గురువారం ఉదయం తిరిగి రెండు వర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో, ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ ముగిసినట్లయిందని తెలిపారు. మృతుల్లో ఒకరిని పాకిస్తాన్‌కు చెందిన పేరుమోసిన ఉగ్రవాది క్వారీగా గుర్తించారు. మందుపాతరలను అమర్చడం, స్నైపర్ కాల్పుల్లోనూ ఇతడు నిపుణుడు. గుహల్లో ఉంటూ ఉగ్ర చర్యలకు పాల్పడుతుంటాడు. పాక్, అఫ్గానిస్తాన్‌లలో ఉగ్ర శిక్షణ పొందిన క్వారీ లష్కరే తోయిబాలో టాప్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. హతమైన మరో ముష్కరుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
Manipur: అర్ధరాత్రి సీఎం ఇంటివైపు శవయాత్ర.. తీవ్ర ఉద్రిక్తత
ఇంఫాల్: కల్లోల మణిపూర్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. గురువారం అర్ధరాత్రి దాటాక రాజధాని ఇంఫాల్‌లో ఆందోళనకారులు ఓ మృతదేహాంతో ఉరేగింపుగా ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఇంటివైపు వెళ్లే యత్నం చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా.. వాళ్లను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాయి భద్రతా బలగాలు. కాంగ్పోక్పీ జిల్లాలో గురువారం ఉదయం ఆందోళనకారుల్లోని ఓ వర్గం జరిపిన కాల్పుల్లో.. ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మర్చంట్ నేవీ ఆఫీసర్ కావడంతో ఆగ్రహావేశాలు తారాస్థాయికి చేరాయి. అతని మృతదేహాన్ని ఓ శవపేటికలో ఉంచి.. రాత్రిపూట ఇంఫాల్ నడిబొడ్డున ఖ్వైరాంబంద్ బజార్ సెంటర్‌కు తీసుకొచ్చారు. పూలతో నివాళులు ఘటించేందుకు భారీగా జనం చేరుకున్నారు. అయితే ఆ మృతదేహంతో సీఎం బీరెన్ సింగ్ ఇంటి వైపు శవయాత్రకు మహిళలు సిద్ధపడగా.. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. రోడ్డు మధ్యలో టైర్లను కాల్చి నిరసనలు వ్యక్తం చేశారు వాళ్లు. పరిస్థితి చేజారేలా కనిపించడంతో పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారుల్ని చెదరగొట్టాయి. ఆపై మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాసుప్రతి మార్చురీకి తరలించాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని బలగాలు ప్రకటించుకున్నాయి. కాంగ్పోక్పి జిల్లా హరోథెల్ గ్రామంలో.. సాయుధ మూక కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి మరణించాడని, అనేక మంది గాయపడ్డారని సైన్యం అధికారికంగా ప్రకటించింది. పరిస్థితి అదుపు చేసేందుకు తాము రంగంలోకి దిగినట్లు తెలిపింది ఆర్మీ. కుకీ పనే! కుకి మిలిటెంట్ల కాల్పుల్లో మర్చంట్ నేవీ ఆఫీసర్ వైఖోం నీలకమల్ మృతి చెందానంటూ ఆరోపిస్తోంది అవతలి వర్గం. అదే సమయంలో లీమాఖోంగ్-హరోథెల్లో గురువారం ఉదయం జరిగిన కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందగా.. మరికొందరు గాయపడినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా కల్లోల ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి భద్రతా బలగాలు. ఇదీ చదవండి: మణిపూర్‌లో రాహుల్ గాంధీకి చేదు అనుభవం -
మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు..
ఇంఫాల్: మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘర్షణలు మొదలయ్యాయి. సాయుధ కుకి మిలిటెంట్లు ప్రత్యర్థి మైతి వర్గానికి చెందిన ఎనిమిది కొండ ప్రాంత గ్రామాలపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరు చనిపోగా, 10 మంది వరకు గాయపడినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. కక్చింగ్ జిల్లాలో మిలిటెంట్లు శనివారం అర్ధరాత్రి మైతీ వర్గానికి చెందిన వారి 80 ఇళ్లకు నిప్పుపెట్టారు. దీంతో, గ్రామస్తులు భయంతో ఇళ్లు వదిలి తలోదిక్కుకు పారిపోయారు. సుగ్నులో పోలీసులు, మిలిటెంట్ల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక పోలీసు చనిపోయారు. సుగ్ను, సెరౌ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో ఒకరు చనిపోగా పది మంది గాయపడ్డారు. బిష్ణుపూర్ జిల్లాలో కుకి మిలిటెంట్లు మైతీ వర్గం ప్రజలకు చెందిన 30 ఇళ్లకు నిప్పుపెట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అధికారులు నిషేధాజ్ఞల సడలింపు సమయాన్ని 11 గంటల నుంచి 6 గంటలకు కుదించారు. కుకీలు దాడులు చేస్తున్నా భద్రతా బలగాలు పట్టించుకోవడం లేదంటూ ఇంఫాల్ వెస్ట్ జిల్లా ఫయెంగ్ గ్రామానికి చెందిన మహిళలు నిరసనకు దిగారు. 40 మంది తీవ్రవాదులు హతం రాష్ట్రంలో పౌరులపై కాల్పులకు దిగుతూ, ఇళ్లకు నిప్పుపెడుతున్న 40 మంది తీవ్రవాదులను ఇప్పటి వరకు బలగాలు చంపినట్లు ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ తెలిపారు. ‘రాష్ట్రంలో జరుగుతున్నది జాతుల మధ్య వైరం కాదు. కుకి మిలటెంట్లు, భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న పోరు’గా ఆయన అభివర్ణించారు. షెడ్యూల్ తెగ(ఎస్టీ) హోదా విషయమై రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీ నుంచి కుకి, మైతి వర్గాల మధ్య మొదలైన ఘర్షణల్లో 75 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
మణిపూర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
ఇంఫాల్: మణిపూర్‌లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా మైతీలు, గిరిజనులకు మధ్య నెలకొన్న ఘర్షణలతో అట్టుడికిపోయిన ఇంఫాల్‌లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. దీంతో ప్రభుత్వం ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను రంగంలోకి దింపింది. కొన్ని జిల్లాల్లో నిరసనకారులకి, భద్రతా దళాలకు మధ్య కాల్పులు ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాల్లో నిరసనకారుల్ని అదుపు చేయడానికి కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చిందని పోలీసులు తెలిపారు. శుక్రవారం కేంద్రం మరో 20 కంపెనీల సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ దళాల్ని పంపింది. మరోవైపు రైల్వే శాఖ ముందు జాగ్రత్త చర్యగా ఈశాన్య రాష్ట్రాల్లో తిరిగే పలు రైళ్లను రద్దు చేసింది. -
ఇళ్లల్లోకి చొరబడి ఉగ్రవాదుల కాల్పులు.. ముగ్గురు పౌరులు మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీ జిల్లాలోని డాంగ్రి గ్రామంలో మైనారిటీ వర్గం లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆయుధాలతో గ్రామంలోకి చొరబడిన దుండగులు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో మరో 10 మంది స్థానికులు గాయపడ్డారు. తూటాలు తగిలిన క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఉగ్రమూకల కోసం భద్రతా దాళం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇద్దరు దుండగులు గ్రామంలోకి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ‘మూడు ఇళ్లల్లో కాల్పులు జరిగాయి. ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దుండగుల కోసం గాల్పింపు చర్యలు కొనసాగుతున్నాయి. ’అని తెలిపారు అదనపు డీజీపీ ముకేశ్ సింగ్. మరోవైపు.. కాల్పుల్లో ముగ్గురు చనిపోయారని, మరో ఎనిమిది మంది గాయపడినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనతో రాజౌరీ వైద్య కళాశాల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గడిచిన రెండు వారాళ్లో పౌరులే లక్ష్యంగా కాల్పులు జరగటం ఇదే రెండో సంఘటన. డిసెంబర్ 16న ఆర్మీ క్యాంప్ సమీపంలో ఇద్దరు పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇదీ చదవండి: చంద్రబాబు సభలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి -
జమ్మూ కశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని సిధ్రాలో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భారత జవాన్లు మట్టుబెట్టారు. సంజ్తీర్థి- సిధ్రా రహదారిపై వెళ్తున్న ట్రక్కులో ఉగ్రవాదులు దాక్కున్నారని జమ్మూకశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు భద్రతా బలగాలను రంగంలోకి దింపాయి. ట్రక్కను అడ్డుకొని తనిఖీలు చేస్తుండగా డ్రైవర్ పారిపోగా.. అందులో దాక్కున్న ఉగ్రవాదులు సిబ్బందిపై కాల్పులు జరిపారు. J&K | Encounter underway in Sidhra area of Jammu, firing going on, two terrorists likely on the spot: Jammu and Kashmir police pic.twitter.com/R4JCATGM65 — ANI (@ANI) December 28, 2022 వెంటనే సైనిక బలగాలు టెర్రరిస్టులపై ఎదురుకాల్పులు జరిపాయి. ఉదయం 7.30 గంటలకు కాల్పులు జరిగాయని, ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. ఎన్ కౌంటర్ స్థలంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన ఒక కోడెడ్ షీట్, ఒక లెటర్ ప్యాడ్ పేజీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా జమ్మూ కాశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో 15 కిలోల ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌ను(ఐఈడీ)బలగాలు పసిగట్టి నిర్వీర్యం చేసిన తర్వాత ఎన్కౌంటర్ జరిగింది. చదవండి: చేదు మిగిల్చిన షుగర్ వ్యాధి.. వేదన చూడలేక కుటుంబమంతా.. -
రష్యా బలగాలకు ఆకస్మిక ఆదేశాలు.. భయాందోళనలో ఉక్రెయిన్
రష్యాలో భాగంగా ప్రకటించిన ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ప్రాంతాల్లో గట్టి భద్రత తోపాటు నిఘాను పెంచాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సడెన్‌గా దళాలకు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా ఉందని మరింత భద్రత ఏర్పాటు చేయాలని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్‌కు ఆదేశాలు ఇచ్చారు. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్‌పై నిరవధిక దాడి జరిపి సెప్టెంబర్ 30న ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజ్జియా, ఖేర్సన్ తదితర ప్రాంతాలను తమ భూభాగంలోని భాగంగా ఏకపక్షంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం పుతిన్ బెలారస్ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే రష్యా ఈ శీతకాలంలో ఉక్రెయిన్‌లోని విద్యుత్ కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసి ఎముకలు కొరికే చలితో అల్లాడిపోయేలా చేసింది. అదీగాక ప్రస్తుతం పుతిన్ బెలారస్ పర్యటన ఉక్రెయిన్‌ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. యుద్దాన్ని మరింత తీవ్రతరం చేసే ఎత్తుగడలో భాగంగానే పుతిన్ అకస్మాత్తుగా బెలారస్లో పర్యటిస్తున్నట్లు ఆరోపించింది. అంతేకాదు రష్యా తన మిత్రదేశమైన బెలారస్‌ని ఉక్రెయిన్‌పై దాడి చేయమని ఒత్తిడి చేసే అవకాశం ఉందంటూ ఉక్రెయిన్ తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేసింది. వాస్తవానికి ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యా సిద్దమయ్యేలా చేసింది కూడా బెలారస్నే కావడం గమనార్హం. ఉక్రెయిన్‌పై చేస్తున్న దాడి నేపథ్యంలోనే విదేశాల నుంచి వచ్చే బెదిరింపులు, స్వదేశంలోని దేశద్రోహులు తదితరాల దృష్ట్యా పుతిన్ గట్టి నిఘా ఉంచాలని దళాలను ఆదేశించారు కూడా. పుతిన్ బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో ఇరు దేశాలకు ఒకే రక్షణ స్థలం ఏర్పాటు గురించి చర్చించనున్నట్లు సమాచారం. కానీ పుతిన్ పొరుగు దేశాన్ని మింగేయడానికి ఇదోక ఎత్తుగడని పలు దేశాలు విమర్శలు గుప్పించాయి. ఐతే రష్యా మాత్రం ఎలాంటి విలీనానికి మాస్కోకి ఆసక్తి లేదని తేల్చి చెప్పింది. అలాగే ఉక్రెయిన్‌లోకి తమ దేశ సైన్యాన్ని పంపే ఉద్దేశం కూడా తనకు లేదని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ కూడా పదేపదే చెబుతున్నాడు. కానీ పలువురు విశ్లేషకులు ఉక్రెయిన్‌పై దాడుల కోసం రష్యా బెలారసియన్ సైనికులు మద్దతును కోరుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం ఈ యుద్ధాన్ని మరింత వేగవంతంగా ముగించేలా పశ్చిమ దేశాలు తమకు ఆయుధ సంపత్తి తోపాటు కొత్త రక్షణ సామర్థ్యాలను అందిస్తాయని చెప్పారు. (చదవండి: ఉక్రెయిన్‌పై క్షిపణుల వర్షం.. రష్యా మాస్టర్ ప్లాన్‌తో తీవ్ర ఇబ్బందులు) -
సాయం చేసి.. ప్రాణం పోసి
దుమ్ముగూడెం: నిత్యం దండకారణ్యంలో మావోయిస్టుల గాలింపు చర్యల్లో తలమునకలయ్యే భద్రత బలగాలు సకాలంలో స్పందించడంతో ఒక గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. కిష్టారం పీఎస్ పరిధిలోని పొటుకపల్లి గ్రామానికి చెందిన వెట్టి మాయ అనే మహిళకు శనివారం తెల్లవారుజామున పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమె భర్త, బంధువులు తక్షణమే వైద్య సేవలందించేలా చూడాలని బేస్‌క్యాంప్‌కు వెళ్లి విజ్ఞప్తి చేశారు. బేస్‌క్యాంపు కోబ్రా 208, కోబ్రా సీఆర్పీఎఫ్ 212 బెటాలియన్, ఎస్టీఎఫ్ బలగాల ఆధ్వర్యంలో 208 కోబ్రా వైద్యాధికారి రాజేష్ పుట్టా, డిప్యూటీ కమాండెంట్ రాజేంద్ర సింగ్, డిప్యూటీ కమాండెంట్‌తో కూడిన వైద్య బృందం పొటుకపల్లి గ్రామానికి వెళ్లి మాయకు వైద్య సహాయం అందించింది. ప్రసవం కోసం ఆమెను మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యాధికారి రాజేష్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అక్కడి నుంచి కుంట డీఐజీ ఎస్కే రాయ్‌కు సమాచారం ఇవ్వడంతో.. ఆయన ఆదేశాల మేరకు గర్భిణిని మరో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వాహన సదుపాయం లేకపోవడంతో భద్రత బలగాలు జెట్టీ కట్టి ప్రధాన రహదారి వరకు మోసుకుంటూ వచ్చాయి. అక్కడి నుంచి మరో వాహనంలో వైద్యశాలకు తరలించి సకాలంలో చికిత్స అందించడంతో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం ఆదివారం వెలుగులోకి రాగా, స్థానికులు భద్రత సిబ్బందిని అభినందించారు. -
మెట్రోస్టేషన్లో కాల్పుల కలకలం.. వీడియో వైరల్
టెహ్రాన్: ఇరాన్లో మహ్సా అమినీ లాకప్ డెత్ కారణంగా హిజాబ్ వ్యతిరేక అందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అదీగాక మరోవైపు ఇదే నవంబర్‌లో 2019లో పెట్రోల్ ధరల పెంపు విషయమై బ్లడీ అబాన్ (బ్లడీ నవంబర్) పేరిట పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఆ నిరసనల అణచి వేత వార్షికోత్సవం సందర్భంగా అప్పటి నిరసనలో చనిపోయిన సుమారు వంద మందిని స్మరించుకుంటూ నిరసనకారులు ఇరాన్ వీధుల్లో మూడు రోజుల పాటు నిరసనలకు పిలుపునిచ్చారు. ఇప్పుడూ ఈ నిరసనలు హిజాబ్ వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకు తోడవ్వడంతో వాటిని అణిచివేసే భాగంలో ఇరాన్ భద్రతా బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. అందులో భాగంగానే టెహ్రాన్‌లోని ఓ మెట్రోస్టేషన్‌లోని ప్రయాణికులపై భద్రతా బలగాలు కాల్పలు జరిపాయి. కాల్పులతో బెదిరిపోయిన ప్రయాణికులు.. అక్కడి నుంచి పారిపోయేయత్నం చేయడం, కింద పడిపోవడం చూడొచ్చు. ఇక మరో వీడియోలో అండర్ గ్రౌండ్ రైలులో.. హిజాబ్ ధరించని మహిళలను సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు చెదరగొట్టే దృశ్యాలు కనిపిస్తున్నాయి. మా పోరాటం కొనసాగుతుంది. ఇరాన్‌కు మళ్లీ మంచిరోజులు వస్తాయి అంటూ నినాదాలు చేయడం వీడియోలో గమనించొచ్చు. Security officials cause a stampede in a Tehran metro station when they open fire on protestors. pic.twitter.com/e55HAfKcpS — Mike (@Doranimated) November 15, 2022 హిజాబ్ ధరించనందుకే మహ్‌సాను అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసుల కస్టడీలోనే సెప్టెంబర్ 16వ తేదీన మృతి చెందింది. దీంతో ఇరాన్ అంతటా పెద్ద ఎత్తున హిజాబ్ వ్యతిరేక నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అదీగాక అమిన్ మరణ తదనంతరం గత మూడు నెలలుగా జరుగుతున్న నిరసనల్లో ఒక పోలీసు, సెక్యూరిటీ అధికారి, ట్రాఫిక్ పోలీసుని నిరసకారులు హతమార్చడంతో కోర్టు వారికి మరణశిక్షలు విధించమని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సాయుధ బలగాలు బహిరంగంగా కాల్పులకు తెగబడ్డాయి. అతేగాక పశ్చిమ నగరంలోని సనందాజ్‌లోని కుర్దిస్తాన్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులపై కూడా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ మేరకు ఇరాన్ మానవ హక్కుల సంఘం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు అమినో మరణంతో చెలరేగిన హింసాకాండలో భద్రతా దళాలు 43 మంది పిల్లలు, 26 మంది మహిళలతో సహా సుమారు 342 మందిని చంపినట్లు పేర్కొంది. అంతేగాక కనీసం 1500 మంది నిరసకారులను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఐతే ఇరాన్ అధికారులు ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్ మానవ హక్కుల డైరెక్టర్ మహమూద్ అమిరీ మొగద్దమ్ ఇరాన్ ఈ మరణశిక్షలను ఖండించడమే గాక వారిని నేరాలను అంగీకరించేలా చేసేందుకు ఈ హింసకు పాల్పడిందని అన్నారు. ఇరాన్ చెరలో ఉన్నవారందరికీ సాముహిక మరణ శిక్షలు విధించే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం టెహ్రాన్ మెట్రోస్టేషన్లో ప్రయాణికులపై బలగాలు జరిపిన కాల్పులకు సంబంధించిన వీడియో నెట్లింట వైరల్ అవుతోంది. Security officials cause a stampede in a Tehran metro station when they open fire on protestors. pic.twitter.com/e55HAfKcpS — Mike (@Doranimated) November 15, 2022 (చదవండి: చెట్లకు సెలైన్‌లో విషం పెట్టి.. లక్షకు కిలో లెక్కన అమ్మి.. ) -
వీర శునకం... ఉగ్రదాడిలో రెండు బుల్లెట్లు దిగినా లెక్కచేయక....
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ జిల్లాలోని టాంగ్పావా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు సెర్చ్ చేసే ఆపరేషన్ని ప్రారంభించాయి. ఈ మేరకు జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం ఉగ్రవాదులు, భధ్రతా బలగాల మధ్య జరిగిన ఎన్కౌంటర్ దాడిలో ఆర్మీ కుక్క తీవ్రంగా గాయపడింది. తొలుత ఉగ్రవాదులు ఉంటున్న ఇంటికి 'జూమ్' అనే ఆర్మీ కుక్కను పంపినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు దాగి ఉన్న ఇంటిపై దాడి చేసి, చేజ్ చేసే పనిలో భాగంగా జూమ్ ఉగ్రవాదులను గుర్తించి దాడి చేసింది. ఆ సమయంలోనే కుక్క శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి. అయినప్పటికీ లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడింది. దీని ఫలితంగా ఇద్దరు ఉగ్రవాదులు లొంగిపోయారు. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరణించగా, పలువురు జవాన్లు గాయపడ్డారు. ఆ తర్వాత అధికారులు జూమ్‌ని హుటాహుటిన ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కుక్క ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ జూమ్ అనే కుక్క అత్యంత శిక్షణ పొందిన క్రూరమైన, నిబద్ధత కలిగిన కుక్క అని చెప్పారు. అంతేగాదు ఉగ్రవాదులను గుర్తించి దాడి చేసి పట్టుకోవడంలో అత్యంత తర్ఫీదు పొందిందని కూడా తెలిపారు. #WATCH | In an operation in Kokernag, Anantnag, Army's dog 'Zoom' attacked terrorists & received 2 gunshot injuries. In spite of that, he continued his task which resulted in neutralisation of 2 terrorists. The canine is under treatment in Srinagar, J&K. (Source: Chinar Corps) pic.twitter.com/D6RTiWqEnb — ANI (@ANI) October 10, 2022 (చదవండి: సింహం పిల్లలే కదా అనుకుంటే ఇట్లుంటది.. ఒక్క గాండ్రింపుతో హడల్) -
AP: భద్రతా వలయంలో రైల్వేస్టేషన్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాటిచెట్టపాలెం(విశాఖ ఉత్తర)/కొత్తవలస రూరల్/ఆముదాలవలస: ‘అగ్నిపథ్’ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రతా బలగాలు శనివారం పెద్దఎత్తున మోహరించాయి. రైల్వేస్టేషన్లతో పాటు పరిసర ప్రాంతాలను, రైలు పట్టాలను ఆక్టోపస్, ఆర్ఫీఎఫ్, జీఆర్పీ, సివిల్ పోలీసులు క్షుణ్నంగా తనిఖీ చేశారు. విశాఖపట్నంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచే రైల్వేస్టేషన్‌కు చేరుకునే మార్గాలను మూసివేశారు. శనివారం మధ్యాహ్నం వరకు రైల్వేస్టేషన్‌లోకి ఎవ్వరినీ అనుమతించలేదు. మధ్యాహ్నం నుంచి మాత్రం పలు రైళ్లు రాకపోకలు సాగించేందుకు రైల్వే వర్గాలు అనుమతించాయి. చదవండి: ప్రైవేటు అకాడమీల ‘డేంజర్ గేమ్’! కీలక అంశాలు వెలుగులోకి దీంతో హౌరా–యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, తిరుమల ఎక్స్‌ప్రెస్, గోదావరి తదితర రైళ్లు విశాఖ నుంచి బయల్దేరాయి. చెన్నై మెయిల్, హౌరా మెయిల్, బొకారో, వాస్కోడగామా, టాటా–యశ్వంత్‌పూర్, గుంటూరు–రాయగడ, తిరుచ్చి–హౌరా తదితర రైళ్లు మాత్రం విశాఖకు రాకుండా దువ్వాడ మీదుగా రాకపోకలు సాగించాయి. అంతకుముందు విజయవాడ మీదుగా విశాఖ రావాల్సిన పలు రైళ్లను అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో నిలిపివేశారు. గుంటూరు రైల్వేస్టేషన్ ముట్టడికి యత్నించిన ఆర్మీ అభ్యర్థులను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న దృశ్యం అలాగే హౌరా వైపు నుంచి విశాఖ రావాల్సిన మరికొన్ని రైళ్లను పెందుర్తి, కొత్తవలస స్టేషన్లలో నిలిపివేశారు. మరోవైపు 19వ తేదీన షాలిమార్‌లో బయల్దేరాల్సిన షాలిమార్–హైదరాబాద్(18045), గుంటూరు–విశాఖ(17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్, రాయగడ–విశాఖ(18527) ఎక్స్‌ప్రెస్‌లను రైల్వే అధికారులు రద్దు చేశారు. శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేసేందుకు ప్రయతి్నంచగా.. డీఎస్పీ వాసుదేవరావు ఆధ్వర్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు ‘గుంటూరు రైల్వేస్టేషన్ ముట్టడి’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. గుంటూరులోని నెహ్రూనగర్ రైలు పట్టాల మీదుగా 20 మంది ఆర్మీ రిక్రూట్మెంట్ అభ్యర్థులు నడుచుకుంటూ రావడాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే గుంటూరు రైల్వేస్టేషన్‌కు వచ్చిన ఇద్దరు యువకులను తనిఖీ చేయగా.. వారి వద్ద ఉన్న ఫోన్లో ‘జస్టిస్ టూ ఆర్మీ’ అనే వాట్సాప్ గ్రూప్‌లో ఆందోళనలకు సంబంధించిన సమాచారం చేరవేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కడప, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వారిద్దరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గుంటూరులోని వివిధ ప్రాంతాల్లో మరో 40 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ బందోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఆగిన ఊపిరి.. అగ్నిపథ్ ఆందోళనల వల్ల సమయానికి వైద్యమందక ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి మరణించారు. ఒడిశాలోని కలహండి జిల్లా నౌహుపాడకు చెందిన జోగేష్ బెహరా(70)కు గుండె సంబంధిత సమస్యలున్నాయి. విశాఖలో వైద్యం చేయించుకునేందుకు కోర్బా–విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరాడు. మరికొన్ని నిమిషాల్లో విశాఖ చేరుకుంటాడనగా.. అగ్నిపథ్ ఆందోళనల వల్ల రైలును శనివారం ఉదయం 10.45 గంటలకు విజయనగరం జిల్లా కొత్తవలసలో నిలిపివేశారు. ఆ తర్వాత కొంతసేపటికి జోగేష్ అస్వస్థతకు గురవ్వడంతో.. ఆయన్ని వెంటనే కొత్తవలస ఎస్ఐ హేమంత్ తన వాహనంలోనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
భద్రతాదళాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు
జమ్మూ కశ్మీర్: భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య షోపియాన్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. షోపియాన్ జిల్లాలోని హరిపోరా ప్రాంతంలో భద్రతా దళాలకు ఉగ్రవాదులు తారస పడటంతో ఒక్కసారిగా వారి మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన ఏ సమయంలో చోటు చేసుకుంది అనేది స్పష్టంగా తెలియలేదు. -
కశ్మీర్ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా మిలిటెంట్లు హతమయ్యారు. మరో సాధారణ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా పోలీసులు వెల్లడించారు అమిషిపొరా గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న కచ్చితమైన సమాచారం మేరకు జరిగిన ఆపరేషన్‌లో ఉగ్రవాదుల్ని నిర్బంధించడానికి ప్రయత్నించగా వారు జరిపిన కాల్పుల్లో షకీల్ అహ్మద్ అనే పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడని, ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడని పోలీసులు తెలిపారు. గురువారం రాత్రంతా జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టుగా వివరించారు. -
అలా చేసేందుకు ప్రయత్నించారు.. గొంతు విప్పిన ఓటింగ్ గ్రామస్తులు
కోహిమా: నాగాలాండ్ ఫైరింగ్ ఘటనలో భద్రతాదళాలు 13 మంది యువకులను చంపి, మిలిటెంట్లుగా చిత్రీకరించ చూశాయని మోన్ జిల్లా ఓటింగ్ గ్రామస్తులు తెలిపారు. మృతదేహాలను దాచి, బట్టలు మార్చి, పక్కన ఆయుధాలను పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత గ్రామస్తులు గొంతు విప్పారు. ఓటింగ్ సిటిజెన్స్ ఆఫీస్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘డిసెంబర్ 4న 3:30గంటల సమయంలో బొగ్గుగనుల్లో పనిచేసే ఎనిమిది మంది యువకులతో పికప్ ట్రక్ గని నుంచి తిరిగి గ్రామానికి వస్తోంది. తెల్లారితే ఆదివారం సెలవురోజు. సాయంత్రం నాలుగున్నరకు అందులో ఉన్న ప్రయాణికుల గురించి ఏ వివరాలు తెలుసుకోకుండానే ట్రక్ మీద భద్రతాదళాలు దాడి చేశాయి. చదవండి: Nagaland Tragedy: నాగాలాండ్ నరమేథం తరువాత రోడ్డును బ్లాక్ చేసి... ట్రాఫిక్‌ను పాత పయనీర్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించాయి. ఎంతవరకూ పికప్ ట్రక్ గ్రామానికి రాకపోవడంతో ఆందోళనతో ఎదురుచూస్తున్నాం. తరువాత కాల్పులు జరిగాయని తెలిసింది. 8గంటలకు మేం వెళ్లేసరికి పికప్ ట్రక్ ఖాళీగా ఉంది. డ్రైవర్ సీటు ఎదురుగా అద్దానికి బుల్లెట్ దూసుకుపోయిన గుర్తులు కనిపించాయి. అంటే ట్రక్‌ను ఆపేందుకు వాళ్లు ముందుగా డ్రైవర్‌ను పాయింట్ బ్లాంక్‌లో కాల్చారు. తరువాత మోటార్‌బైక్‌లపై వెళ్లి భద్రతా బలగాల వాహనాలను పట్టుకునే ప్రయత్నం చేశాం. భద్రతా సిబ్బందిని అడిగితే తమకేమీ తెలియదన్నారు. అక్కడే ఓ టార్పాలిన్ కనిపించింది. దాన్ని తొలగించి చూస్తే... ఆరుగురు యువకుల మృతదేహాలు కనిపించాయి. వాళ్ల షర్ట్స్ తొలగించి ఉన్నాయి. మిలిటెంట్ల బట్టలు, బూట్లు వేసి ఆయుధాలను పెట్టే ప్రయత్నం చేశారు. ఇదే విషయమై ప్రశ్నిస్తే... మాపైనా దాడికి దిగారు. కాల్పులు ప్రారంభించి మరికొందరిని చంపేశారు. ఇంకొందరిని గాయపరిచారు. జనాభాలోనూ, ప్రాంతంలోనూ మేం తక్కువ కావొచ్చు. కానీ... పోరాటంలో మా ప్రాణాలు ఇవ్వడానికైనా, శత్రువుల తలలు తీయడానికైనా సిద్ధంగా ఉంటాం’’ అని గ్రామస్తులు ఉద్ఘాటించారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న నాగాలాండ్ పోలీసులు ఎస్పీఎఫ్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఇండియన్ ఆర్మీ ఈ ఘటనపై మేజర్ జనరల్ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించింది. -
ఆకాశంలో యుద్ధం మొదలైందా?
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ‘ఆపరేషన్ ప్రహార్’లో భాగంగా తమపై భద్రతా బలగాలు డ్రోన్ దాడులు చేశాయని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు బుధవారం వికల్ప్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ఈనెల 19వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో తమపై డ్రోన్ల సాయంతో బాంబు వేశారని ఆరోపించారు. ఏప్రిల్ 19వ తేదీని చీకటి దినంగా లేఖలో అభివర్ణించారు. బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొత్తలంక, పాలగూడెం గ్రామాల సరిహద్దులో డ్రోన్ల సాయంతో 12 బాంబులు జారవిడిచారని పేర్కొన్నారు. మావోయిస్టులపై ఆకాశమార్గం ద్వారా జరిగిన ఈ దాడిని అన్ని వర్గాలవారు తీవ్రంగా ఖండించాలని కోరారు. ఈ మేరకు దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు మీడియాకు విడుదల చేశారు. ఈ దాడిలో పశుపక్షాదులు, వృక్షాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఏప్రిల్ 3న బీజాపూర్‌లో భద్రతా బలగాలపై తాము జరిపిన దాడికి ఇది ప్రతీకార చర్య అని ఆరోపించారు. ఆ దాడితో నీరుగారిపోయిన స్థానిక పోలీసులు, ఇక్కడ మైనింగ్ చేపట్టాలనుకుంటున్న కార్పొరేట్ శక్తుల్లో తిరిగి మనోధైర్యం కూడగట్టేందుకే ఈ వాయుదాడి జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ చర్యలు వదిలి మావోల ఏరివేతపై దృష్టి సారించడమేంటని విస్మయం వ్యక్తం చేశారు. ఆకాశ యుద్ధం మొదలైందా? ఈ పరిణామాలు చూస్తుంటే మావో–భద్రతా బలగాల మధ్య ఆకాశయుద్ధం మొదలైందా అన్న చర్చ మొదలైంది. డ్రోన్ దాడి జరిగిందని మావోలు, తాము చేయలేదని పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ దాడి జరిగి ఉంటే దేశ చరిత్రలో మావోలు, భద్రతా బలగాల పోరులో జరిగిన తొలి వాయుదాడి ఇదే అవుతుంది. మావోల నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం ‘ఆపరేషన్ ప్రహార్’మొదలుపెట్టిందని మావోలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే వాయు దాడులు జరిగాయంటున్నారు. అయితే స్థానిక ఎస్పీ కశ్యప్ ఈ విషయంపై స్పందించలేదు. మరోవైపు బస్తర్ ఐజీ సుందర్రాజ్ మాత్రం మావోల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, మావోల కేడర్‌లో ఉన్న ఆధిపత్య పోరులో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు. తాము స్థానిక ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. వారు అమర్చిన ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్)లతో మహిళలు, చిన్నారులు సహా వేలాది మంది మరణాలకు మావోలే కారణమని ఆరోపించారు. బుధవారం కూడా ఐఈడీ కారణంగా ఓ ఐటీబీపీ జవాను గాయపడగా, ఓ ఆవు మరణించిందని వెల్లడించారు. మరోవైపు ఈ దాడిపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. స్థానికంగా పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు వాడే డ్రోన్ల సామర్థ్యం చాలా తక్కువని, అవి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మాత్రమే ఎగురుతాయని, 10 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణిస్తాయని చెబుతున్నారు. అందులోనూ అవి నిఘా సంబంధిత సమాచారం మాత్రమే సేకరిస్తాయని, వీటికి బాంబులు మోసుకెళ్లే శక్తి లేదని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ డ్రోన్ దాడి జరిగి ఉంటే అవి బీజాపూర్‌కు సమీపంలో ఉన్న బిలాయ్ (389 కి.మీ.), జగదల్పూర్ (189 కి.మీ.), హైదరాబాద్ (301 కి.మీ.) నుంచి వచ్చి ఉండాలని స్థానికంగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ నగరాల్లో మాత్రమే దాడి చేసే డ్రోన్లను నియంత్రించగలిగే సాంకేతికత అందుబాటులో ఉందన్న ప్రచారం స్థానికంగా జరుగుతోంది. ఎందుకీ ఘర్షణ.. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోని బస్తర్ డివిజన్లో ‘జనతన సర్కార్’ పేరిట సమాంతర ప్రభుత్వం నడుపుతున్న మావోయిస్టు పార్టీకి, పోలీసు బలగాలకు మధ్య నిరంతరం పోరు నడుస్తోంది. సాధారణ పౌరులకు హాని కలగకుండా, ఆస్తులకు నష్టం జరగకుండా బలగాలు పోరు చేస్తుండగా.. ఆదివాసీల మద్దతు తీసుకుంటూ మావోయిస్టులు యుద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, దంతెవాడ, బస్తర్, కాంకేర్, నారాయణపూర్ జిల్లాల్లో బలగాలు, మావోల మధ్య పోరుతో దండకారణ్యం రక్తసిక్తం అవుతోంది. ఈ పోరులో వేలాది మంది మావోయిస్టులు, బలగాలు, సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నెల 3న బీజాపూర్ జిల్లా తెర్రెం–జొన్నగూడ అటవీ ప్రాంతంలో మావోల వ్యూహాత్మక దాడిలో 23 మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడిలో వియత్నాం తరహా గెరిల్లా యుద్ధతంత్రాన్ని మావోయిస్టు పార్టీ అనుబంధ పీఎల్జీఏ దండకారణ్య ఆర్మీ కమాండర్ మడవి హిడ్మా ఆధ్వర్యంలో అమలు చేశారు. హిడ్మా ఫిలిప్పీన్స్‌లో ఈ తరహా శిక్షణ పొంది వచ్చాడు. -
వాషింగ్టన్లో హై అలర్ట్
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్, డీసీ మిలటరీ కేంద్రాన్ని తలపిస్తోంది. దేశ నూతన అధ్యక్షుడిగా జనవరి 20న జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా వాషింగ్టన్లో, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో అల్లర్లు చెలరేగే అవకాశముందన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రత వర్గాలు అప్రమత్తమయ్యాయి. అత్యంత పటిష్ట భద్రతాచర్యలతో వాషింగ్టన్‌ను అష్టదిగ్బంధనం చేశాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే కేంద్రానికి దారితీసే రహదారులను మూసేశారు. వేలాది స్థానిక పోలీసులతో పాటు, సుమారు 25 వేల మంది నేషనల్ గార్డ్స్‌ను రంగంలోకి దింపారు. క్యాపిటల్ భవనం, వైట్‌హౌజ్‌లతో పాటు నగరంలోని ప్రధాన భవనాల్లో భద్రత ఏర్పాట్లు చేశారు. క్యాపిటల్ భవనం, వైట్‌హౌజ్‌ల్లోకి ఇతరుల ప్రవేశాన్ని నిషేధించారు. ఆయా భవనాల బయట 8 అడుగుల ఎత్తైన ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. సాధారణంగా నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అభిమానులతో కిక్కిరిసే నేషనల్ మాల్‌ను మూసేశారు. వాషింగ్టన్‌తో పాటు 50 రాష్ట్రాల రాజధానుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రమాణ స్వీకారం రోజు హింసాత్మక ఘటనలకు పాల్పడతామంటూ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ అనుకూల బృందాలతో పాటు వివిధ గ్రూపుల నుంచి హెచ్చరికలు వస్తున్నాయని, దాంతో, ఆయా బృందాలపై, ట్రంప్ అనుకూల వర్గాలపై, జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడిలో పాల్గొన్న వారిపై సునిశిత దృష్టి పెట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ‘కోవిడ్ నిబంధనల కారణంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అసాధారణంగా జరగబోతోంది. ఎంపిక చేసిన కొద్దిమంది అతి«థులు పాల్గొంటారు. అయితే, జనవరి 6 నాటి ఘటన నేపథ్యంలో భద్రతను మరింత పెంచాల్సిన పరిస్థితి నెలకొంది’ అని వాషింగ్టన్ డీసీ మేయర్ మురియెల్ బౌసర్ పేర్కొన్నారు. ‘దేశ పౌరులే క్యాపిటల్ భవనంపై దాడి చేసి, పోలీసు అధికారులను చంపేస్తారని ఊహించలేదు. కానీ, అది జరిగింది. అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందే’ అన్నారు. వాషింగ్టన్లోనే కాకుండా, ప్రధాన నగరాల్లో హింస చెలరేగే అవకాశముందని ఎఫ్‌బీఐ నివేదికల్లో హెచ్చరించింది. ‘ప్రమాణ స్వీకారం పూర్తయ్యేవరకు భద్రత బలగాలు దూకుడుగానే వ్యవహరిస్తాయి’ అని ఎఫ్‌బీఐ చీఫ్ క్రిస్టఫర్ స్పష్టం చేశారు. సొంత బలగాల నుంచే ముప్పు? బైడెన్‌కు భద్రత కల్పించే దళాల్లోని వ్యక్తుల నుంచే ముప్పు పొంచి ఉందన్న అనుమానాలు అమెరికా రక్షణ అధికారులను ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. దాంతో, ప్రమాణ స్వీకార కార్యక్రమ భద్రతలో, నగర రక్షణలో పాలు పంచుకుంటున్న మొత్తం 25 వేల మంది నేషనల్ గార్డ్స్‌ను నిశితంగా పరీక్షిస్తున్నారు. ఈ అంతర్గత దాడి ముప్పు గురించే తాము ఎక్కువగా ఆందోళన చెందుతున్నామని ఆర్మీ సెక్రటరీ రయాన్ మెక్ కెర్తి పేర్కొన్నారు. బైడెన్‌పై, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులపై దాడికి పాల్పడే అవకాశమున్న వారిని గుర్తించేందుకు పలు విధాలుగా గార్డ్స్‌ను పరీక్షిస్తున్నామన్నారు. దాడి చేసేందుకు వారికి లభించే అన్ని అవకాశాలను పరిగణనలోకి తీసుకుని.. దాడులను అడ్డుకునే దిశగా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. విప్లవ కాలం నాటి దుస్తులు ధరించి, రైఫిల్‌తో కొలంబస్‌లోని ఒహాయో స్టేట్‌హౌస్ ముందు కనిపించిన ఓ వ్యక్తి -
గ్రేటర్ వార్: పోలీసులు సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు హైదరాబాద్ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. నేటి సాయంత్రం ఆరు గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. 150 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ 84, సైబరాబాద్ 38, రాచకొండ పరిధిలో 28, హైదరాబాద్ సిటీలో 4,979 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 50 వేల మందితో భారీ పోలీస్ భద్రతతో పాటు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. (చదవండి: ఎన్నికల ప్రచారం.. తిరక్కుండానే టైమౌట్) గ్రేటర్ వ్యాప్తంగా 50 చెక్‌పోస్ట్‌లు.. 1,704 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 1,085 అత్యoత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. గ్రేటర్ వ్యాప్తంగా 50 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 1500 మంది రౌడీషీటర్ల బైండోవర్ చేశారు. ఎన్నికల సందర్భంగా 3,744 వెపన్స్ డిపాజిట్ చేశారు. జోన్ల వారిగా ఐపీఎస్ అధికారులను, డివిజన్ల వారిగా ఇంచార్జ్ ఏసీపీ, సీఐలను నియమించారు. ఎన్నికల నిబంధన ఉల్లంఘించిన నేతలపై 55 కేసులు నమోదయ్యాయి. పోలీసుల తనిఖీల్లో భారీగా పలుచోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనరేట్స్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించారు.సీసీ టీవీ మానటరింగ్ టీమ్స్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. (చదవండి: కేసీఆర్‌ను కొట్టడానికి రాలేదు: అమిత్ షా) -
భారీ ఉగ్ర ముప్పు తప్పింది!
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో గురువారం జరిగిన ఎన్కౌంటర్ దేశంలో తలపెట్టిన భారీ ఉగ్రవాద విధ్వంసాన్ని అడ్డుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. భద్రతా బలగాల అప్రమత్తత వల్ల పెద్ద ఉపద్రవం తప్పిందన్నారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర ఉన్నతాధికారులతో కీలక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి, సీనియర్ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను హతమార్చడంలో భద్రతా బలగాలు గొప్ప శౌర్యసాహసాలను ప్రదర్శించాయి. వారి వద్ద భారీ ఎత్తున లభించిన ఆయుధాలు, ఇతర పేలుడు పదార్థాలు వారు భారీ ఉగ్రదాడికి పన్నాగం పన్నారన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భద్రతా బలగాల అప్రమత్తతతో పెద్ద విధ్వంసం తప్పింది’ అని ఆ సమావేశం తరువాత ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘భద్రతా బలగాల అప్రమత్తతకు అభినందనలు. వారు జమ్మూకశ్మీర్‌లో క్షేత్రస్థాయిలో జరగనున్న ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునే క్రూరమైన కుట్రను విజయవంతంగా అడ్డుకున్నారు’ అని మరో ట్వీట్లో ప్రశంసించారు. ముంబై దాడులు జరిగిన నవంబర్ 26న, అదే తరహాలో భారీ ఉగ్ర దాడి చేయాలని టెర్రరిస్టులు కుట్రపన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జమ్మూకశ్మీర్ హైవేపై నగ్రోటా వద్ద గురువారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. వారు ప్రయాణిస్తున్న ట్రక్‌లో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభించాయి. భారత్‌లో భారీ ఉగ్రదాడి లక్ష్యంతో వారు ఈ మధ్యనే పాక్ సరిహద్దులు దాటి భారత్‌లోకి వచ్చినట్లు భద్రతావర్గాలు భావిస్తున్నాయి. -
కశ్మీర్లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం
జమ్మూ/శ్రీనగర్: కశ్మీర్లో భారీస్థాయి దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. జమ్మూ శివారులో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు హతం కాగా, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందిన వారనీ, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అవరోధం కలిగించడమే వీరి లక్ష్యంగా భావిస్తున్నట్లు జమ్మూ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీపీ) ముకేశ్ చెప్పారు. జమ్మూ హైవేపై నగ్రోటా ప్రాంతంలోని బాన్ టోల్‌ప్లాజా వద్ద అనుమానాస్పదంగా కనిపించిన బియ్యం ట్రక్కును తనిఖీ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ట్రక్కు డ్రైవర్ వెంటనే దిగి పారిపోగా, ట్రక్కులో బియ్యం బస్తాల మాటున దాక్కున్న ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసరుతూ, కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు ఆ ట్రక్కును చుట్టుముట్టి, దీటుగా స్పందించారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం కాగా, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ట్రక్కు నుంచి 11 ఏకే రైఫిళ్లు, 24 మేగజీన్లు, 3 పిస్టళ్లు, 35 గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు భారీగా మందులు, పేలుడు సామగ్రి, వైర్ల బండిళ్లు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు లభ్యమయ్యాయి. కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈనెల 28వ తేదీన, డిసెంబర్ 22న జిల్లా అభివృద్ధి మండళ్లకు జరగనున్న ఎన్నికల ప్రక్రియకు అవరోధం కలిగించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ ప్రయత్నాలను భగ్నం చేసేందుకు తాము అత్యంత అప్రమత్తతతో పనిచేస్తున్నామన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అభ్యర్థులు, పార్టీల నేతలకు వేర్వేరుగా భద్రత కల్పించడం కష్టసాధ్యమైనందున, వారు వెళ్లే ప్రాంతాల్లో భద్రతా చర్యలను పెంచామన్నారు. -
‘అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు’
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రికులపై దాడి చేయడానికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం అందినట్లు జమ్మూ కశ్మీర్ భద్రతా అధికారులు తెలిపారు. కుల్గాంలోని నాగర్-చిమ్మర్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎదురు కాల్పుల్లో జైషే మహమ్మద్ టాప్ కమాండర్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో నాలుగు రోజుల్లో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉగ్రవాదుల దాడులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. (24 గంటల్లో ఆరుగురు టెర్రరిస్టుల హతం) ‘అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నం చేస్తున్నారు. వారి దాడులను అడ్డుకోవడానికి తగిన సైనిక వ్యవస్థ, వనరులు ఉన్నాయి. యాత్రను శాంతియుతంగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నాము’ అని బ్రిగేడియర్ వివేక్ సింగ్ ఠాకుర్ తెలిపారు. అమర్నాథ్ యాత్రకు ఎటువంటి ఆటంకాలు లేకుండా శాంతియుతంగా సాగడానికి భద్రతపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. జాతీయ రహదారి 44ను అమర్నాథ్ యాత్రికులు ఉపయోగించుకుంటారని తెలిపారు. -
సరిహద్దుల్లో తొలగని ప్రతిష్టంభన
న్యూఢిల్లీ: తూర్పు లదాఖ్ ప్రాంతంలో భారత్, చైనాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. వివాదాస్పద ప్రాంతానికి చేరువలో ఉన్న తమ తమ స్థావరాలకు రెండు దేశాలు భారీ సామగ్రి, ఆయుధ సంపత్తిని తరలిస్తున్నాయి. తూర్పు లదాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలోని బేస్‌ల వద్దకు చైనా శతఘ్నులను, పదాతిదళ పోరాట వాహనాలు, భారీ సైనిక సామగ్రిని చేరుస్తోంది. భారత్ సైతం శతఘ్నులు, బలగాలను అక్కడికి పంపిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. పాంగోంగ్ త్సో, గాల్వాన్ లోయ తదితర ప్రాంతాల్లో మునుపటి స్థితిని నెలకొల్పే వరకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. వైమానిక దళాలు వివాదాస్పద ప్రాంతంలో కదలికలపై కన్నేసి ఉంచాయి. మే మొదటి వారంలో చైనా 2,500 బలగాలను ఈ ప్రాంతంలోకి తరలించడం, అక్కడ కొన్ని నిర్మాణాలు చేపట్టడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రతిష్టంభన మొదలైంది. తరచూ రెండు దేశాల సైన్యాల మధ్య ఘర్షణలు జరిగే డెమ్చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతాల్లోనూ చైనా తన బలగాల సంఖ్యను పెంచింది. కాగా, తూర్పు లదాఖ్‌లోని సరిహద్దుల్లో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో భారత్ సైనికులకు గాయాలయ్యాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై సైన్యం స్పందించింది. ‘ఆ వీడియోకు ఎలాంటి ప్రామాణికత లేదు. అక్కడ ఎలాంటి హింస జరగలేదు’అని సైన్యం ప్రకటించింది. -
కశ్మీర్లో హై అలర్ట్
శ్రీనగర్: ఉగ్రవాదులు దాడులకు పాల్పడతారనే సమాచారంతో కశ్మీర్లో భద్రతా బలగాలు సోమవారం హై అలర్ట్ ప్రకటించాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి. ‘భద్రతాబలగాలే లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు భారీ దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఉప్పందించాయి. హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ రియాజ్ నైకూను చంపినందుకు ప్రతీకారంగా కారు బాంబు, లేక ఆత్మాహుతి దాడి జరిపేందుకు కుట్ర పన్నినట్లు మాకు తెలిసింది’ అని ఓ అధికారి తెలిపారు. రంజాన్ మాసంలో ఎంతో ప్రాముఖ్యమున్న 17వ రోజున గతంలో ఇక్కడ ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన సందర్భాలున్నాయని ఆయన అన్నారు. -
హిజ్బుల్ టాప్ కమాండర్ దిగ్బంధం
కశ్మీర్ : జమ్మూకశ్మీర్‌లోని భద్రతా దళాలు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది రియాజ్ నైకూను దిగ్బంధం చేశాయి. పుల్వామా జిల్లాలోని అవంతిపురాలో రాత్రి నుంచి భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. అయితే బేగ్‌పుర గ్రామంలో ఉగ్రవాది రియాజ్ ఉన్నట్లు గుర్తించారు. హిజ్బుల్ ముజాయిద్దీన్ కమాండర్ అయిన రియాజ్ తలపై 12 లక్షల రివార్డు ఉంది. కాగా ఈ ప్రాంతంలో ఉన్న టెర్రరిస్టు గ్రూపులకు రియాజ్ పెద్ద దిక్కుగా ఉన్నాడని భద్రతా దళాలు పేర్కొన్నాయి. ఒకవేళ రియాజ్‌ను అరెస్టు చేసినా లేక హతమార్చినా.. ఇది స్థానికంగా ఉన్న ఉగ్రమూకలకు పెద్ద దెబ్బగా చెప్పచ్చు. జమ్మూకశ్మీర్ పోలీసులు ఈ ఆపరేషన్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశారు. ఉగ్రవాదులను మట్టుబెట్టుడానికి కాల్పులు జరుగుతున్నట్లు చెప్పారు. మంగళవారం రాత్రి నుంచి సీనియర్ అధికారులు అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ట్విటర్లో పేర్కొన్నారు. రియాజ్ సొంత ఊరైన బేగ్‌పురాకు హిజ్బుల్ కమాండర్ వచ్చినట్లు సమాచారం రావడంతో.. ఆ ప్రాంతాన్ని రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, స్పెషనల్ ఆపరేషన్స్ గ్రూప్ దళాలు చుట్టుముట్టాయి. ఆ గ్రామానికి చెందిన అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను మూసివేసి తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు అధికారులు వెల్లడించారు. Contact established in the third operation at #Beighpors #Awantipur. Top terrorist commander is trapped. Exchange of fire on. Details shall follow.. https://t.co/umZv0JgVbs — J&K Police (@JmuKmrPolice) May 6, 2020 -
ఎన్కౌంటర్లో నలుగురు తీవ్రవాదుల హతం
అనంత్‌నాగ్ : జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని ఆదివారం భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు తీవ్రవాదులను హతమయ్యారని పోలీసులు వెల్లడించారు. జిల్లాలోని డయాల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న నిర్థిష్ట సమాచారంతోనే ఆదివారం ఉదయం భద్రతా బలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. తర్వాత ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు తమ ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎదురుచూస్తున్నామని అధికారి తెలిపారు. -
గ్రనేడ్ దాడిలో ఇద్దరు జవాన్ల మృతి
-
గ్రనేడ్ దాడిలో ఇద్దరు జవాన్ల మృతి
సాక్షి, న్యూఢిల్లీ : శ్రీనగర్‌లో భద్రతా దళాలపై ఆదివారం ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించగా, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. లాల్‌చౌక్‌లోని ప్రతాప్ పార్క్ వద్ద విధులు నిర్వహిస్తున్న భద్రతా దళాలపై టెర్రరిస్టులు గ్రనేడ్లు విసిరారు. ఉగ్ర దాడితో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్ర ఘటనపై విచారణను చేపట్టాయి. గ్రనేడ్ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రాథమిక దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. చదవండి : జైషే మహ్మద్ కుట్ర భగ్నం -
అఫ్గానిస్తాన్‌లో కూలిన విమానం
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సాంకేతిక కారణాల రీత్యా మంటలు చెలరేగి ఘజ్ని ప్రావిన్స్‌లో కూలినట్లు అధికారులు నిర్ధారించారు. సోమవారం మధ్యాహ్నం 1:10 గంటలకు అఫ్గాన్ రాజధాని కాబూల్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కూలిన విమానం ఏ సంస్థకు చెందినదో, అందులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారో అధికారులు స్పష్టం చేయలేదు. విమానం కూలిన దేహ్ యాక్ ప్రాంతం తాలిబన్ల అధీనంలో ఉన్నందున అధికారులు అక్కడికి చేరుకోవడం కష్టమవుతోందని అధికారులు తెలిపారు. కూలిన విమానం ఏరియానా అఫ్గాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందినదంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఘజ్నిలో జరిగిన విమాన ప్రమాదంపై విచారించనున్నట్లు అమెరికా ఆర్మీ సోమవారం తెలిపింది. -
మిషన్ రాంబన్ సక్సెస్ : ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. బటోట్లోని ఓ ఇంట్లో నక్కిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారి వద్ద బందీలుగా ఉన్న ఆరుగురిని క్షేమంగా వెలుపలికి తీసుకువచ్చాయి. మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది ఒసామాను భద్రతా దళాలు హతమార్చాయి. ఈ క్రమంలో ఓ జవాన్ అమరుడవగా, ఇద్దరు సైనికులకు గాయాలయ్యాయి. ఘటనాస్ధలంలో భారీ ఎత్తున ఆయుధ సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. -
భారీ ఉగ్ర కుట్ర భగ్నం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లో భారీ ఉగ్రదాడి కుట్రను భద్రతా దళాలు సోమవారం భగ్నం చేశాయి. కథువా ప్రాంతంలోని దెవాల్ గ్రామంలో 40 కిలోల భారీ పేలుడు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు భద్రతా దళాలు వెల్లడించాయి. దీనిపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఆర్మీ ఇంటెలిజెన్స్ దళాలు, కశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా అనుమానిత ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా దేశీయంగా తయారుచేసిన పేలుడు పదార్ధాలు లభించాయి. మరోవైపు బాలాకోట్‌లో ఉగ్ర శిబిరాలు తిరిగి చురుకుగా మారాయని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పేర్కొన్నారు. సరిహద్దు ద్వారా 500 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్‌లో ఉగ్ర దాడులను ప్రేరేపించేందుకు పాకిస్తాన్ పలు ప్రయత్నాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోకి ఉగ్రవాదులను చొప్పించడంతో పాటు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాక్ తెగబడుతోంది. -
సరిహద్దుల్లో రబ్బర్ బోట్ల కలకలం..
శ్రీనగర్ : వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి టెర్రర్ లాంచ్ ప్యాడ్ల వద్ద రబ్బర్ బోట్లు కనిపించడంతో సరిహద్దుల్లో భద్రతా దళాలు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశాయి. రబ్బర్ పడవలను నిఘా వర్గాలు గుర్తించడంతో సరిహద్దు వెంబడి చిన్న నీటివనరులు, తీరప్రాంతాల్లో భద్రతా దళాలు గస్తీని తీవ్రతరం చేశాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అఖ్నూర్, సాంబ, కథువ, జమ్మూ డివిజన్లలో నిఘా సంస్థలు 13 చిన్ననీటి వనరులను గుర్తించి ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించాయి. తీరప్రాంతంలో నౌకలు, పడవల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రవేశించి దాడులకు తెగబడతారని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఉగ్రవాదులు కృష్ణ గటి నది ద్వారా దేశంలోకి చొరబాట్లను ప్రేరేపించవచ్చని భద్రతా దళాలను నిఘా వర్గాలు హెచ్చరించాయి. గుజరాత్ తీరం గుండా ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించి దాడులకు తెగబడవచ్చని, అండర్ వాటర్ దాడులకు పాల్పడవచ్చని నిఘా సంస్థలు చేసిన హెచ్చరికలతో భద్రతా దళాలు, నేవీ కోస్ట్‌గార్డ్స్ అప్రమత్తమయ్యాయి. -
కశ్మీర్ : ఆర్మీ వాహనం అనుకుని రాళ్లు రువ్వడంతో..
శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మూకశ్మీర్‌లో మొదలైన సాయుధ బలగాల నిఘా ఇప్పటికీ కొనసాగుతోంది. ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేందుకే కశ్మీర్లో వేల సంఖ్యలో సైనికుల్ని మోహరించామని కేంద్ర హోంశాఖ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే కశ్మీర్లో ఆంక్షలు సడలిస్తున్నామని, అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని కేంద్రం వెల్లడించింది. అయితే, కేంద్రం చెప్తున్న మాటలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జమ్మూకశ్మీర్‌లో పర్యటించాలనుకున్న విపక్ష సభ్యుల బృందాన్ని శ్రీనగర్‌లోనే అడ్డుకోవడం.. ఆదివారం జరిగిన ఓ సంఘటన ఈ సందేహాలకు బలం చేకూరుస్తోంది. నిరసన కారులు రాళ్లు రువ్వడంతో ఓ పౌరుడు మృతి చెందాడు. ఈ ఘటన దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. (చదవండి : ‘ఫోన్ల కంటే ప్రాణాలే ముఖ్యం’) వివరాలు.. జాదిపొర ఉరంహాల్‌కు చెందిన ఓ వ్యక్తి తన ట్రక్‌లో ఇంటికి వెళ్తున్నాడు. అయితే, అది ఆర్మీ వాహనాన్ని పోలి ఉండటంతో భ్రమపడ్డ కొందరు నిరసనకారులు దానిపై రాళ్లు రువ్వారు. ఒక్కసారిగా పెద్దఎత్తున రాళ్లదాడి జరగడంతో అతని తలకు బలమైన గాయం అయింది. దాంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడు మహమ్మద్ ఖలీల్‌దార్‌గా గుర్తించారు. ఈ ఘటనలో ప్రమేయమున్న వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. ఇక ఇదే నెలలో నిరసనకారుల రాళ్ల దాడిలో ఓ 11 ఏళ్ల బాలిక ప్రాణాలు విడిచింది. విచక్షణ మరిచిన నిరసనకారులు ఉన్మాదులుగా మారుతున్నారని విమర్శలొస్తున్నాయి. -
కశ్మీర్లో పాఠాలు షురూ
శ్రీనగర్/న్యూఢిల్లీ/ఇస్లామాబాద్/వాషింగ్టన్: కశ్మీర్లో సోమవారం పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే చాలా పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. శ్రీనగర్‌లో 190 ప్రాథమిక పాఠశాలలు తెరుచుకున్నప్పటికీ శాంతిభద్రతల భయంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపలేదు. అయితే బెమినాలోని పోలీస్ పబ్లిక్ స్కూల్, ఇతర కేంద్రీయ విద్యాలయాల్లో మాత్రం చెప్పుకోదగ్గ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. కశ్మీర్లో ఆంక్షలు సడలించినప్పటికీ బలగాల మోహరింపు మాత్రం తగ్గలేదు. ఈ సందర్భంగా బారాముల్లా జిల్లాకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘పట్టన్, పల్హలాన్, సింఘ్‌పొరా, బారాముల్లా, సోపోర్ పట్టణాల్లో ఆంక్షలు యథాతథంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం పాఠశాలలు తెరుచుకున్నాయి’ అని చెప్పారు. శ్రీనగర్‌లో గత 3 రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నందున పాఠశాలలు తెరుచుకోలేదని వ్యాఖ్యానించారు. అయితే నగరంలో ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో బారికేడ్లను తొలగించి ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా అధికారులు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని ఈ నెల 5న రద్దుచేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా జమ్మూకశ్మీర్‌లో భారీగా బలగాలను మోహరించారు. భారత రాయబారికి పాక్ సమన్లు భారత డిప్యూటీ హైకమిషనర్‌గా గౌరవ్ అహ్లూవాలియాకు పాక్ ప్రభుత్వం సోమవారం సమన్లు జారీచేసింది. అహ్లూవాలియాను ఇస్లామాబాద్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకున్న సార్క్ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ ఫైజల్.. భారత్ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. భారత బలగాల తీరుపై తీవ్ర నిరసన తెలియజేశారు. ఆదివారం ఛిక్రీకోట్, హాట్‌స్ప్రింగ్ సెక్టార్లపై భారత ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఇద్దరు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2017 నుంచి ఇప్పటివరకూ భారత్ 1,970 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని విమర్శించారు. ట్రంప్ పాక్‌వైపు మొగ్గు చూపొద్దు భారత్–పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా పొరపాటున కూడా పాక్‌వైపు మొగ్గుచూపరాదని అగ్రరాజ్యానికి చెందిన కౌన్సిల్ ఫర్ ఫారిన్ రిలేషన్స్(సీఎఫ్ఆర్) సంస్థ అధ్యక్షుడు రిచర్డ్ ఎన్ హాస్ సూచించారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాక్‌వైపు ఏమాత్రం మొగ్గుచూపినా భారత్ దూరమైపోతుందని హెచ్చరించారు. ఈ విషయమై రిచర్డ్ స్పందిస్తూ..‘భారత్‌ను ఎదుర్కోవడానికి కాబూల్(అఫ్గానిస్తాన్)లో తన మిత్రులు అధికారంలో ఉండాలని పాక్ కోరుకుంటోంది. కాబట్టి పాక్‌ను శాసించే సైనిక, నిఘా వ్యవస్థలు తాలిబన్లను నియంత్రిస్తాయనీ, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తాయని నమ్మేందుకు చాలాతక్కువ అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో భారత్‌కు అమెరికా దూరం జరగడం అంత తెలివైన నిర్ణయంకాదు. ప్రజాస్వామ్య భారత్ జనాభా త్వరలోనే చైనాను దాటేస్తుంది. అంతేకాకుండా భారత్ ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించబోతోంది. కాబట్టి అమెరికా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే ఇండియావైపు మొగ్గడమే శ్రేయస్కరం. ఆసియాలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు భారత్ అమెరికాకు సహకరిస్తుంది’ అని తెలిపారు. మరోవైపు కశ్మీర్ సమస్య కారణంగా తాలిబన్–అమెరికాల మధ్య శాంతిచర్చలకు విఘాతం కలుగుతుందన్న పాక్ వ్యాఖ్యలపై అఫ్గానిస్తాన్ ప్రభుత్వం మండిపడింది. జమ్మూకశ్మీర్ భారత్–పాక్‌ల ద్వైపాక్షిక సమస్యనీ, దాన్ని అఫ్గాన్‌తో ముడిపెట్టడం పూర్తిగా బాధ్యతారాహిత్యమేనని స్పష్టం చేసింది. అమిత్ షాతో దోవల్ భేటీ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయలో దాదాపు 10 రోజులపాటు పర్యటించిన దోవల్.. అక్కడి పరిస్థితిని షాకు వివరించారు. ఈ సందర్భం గా జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలపై చర్చించారు. హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌబాతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. -
కశ్మీరంలో సడలుతున్న ఆంక్షలు
జమ్మూ/శ్రీనగర్: కశ్మీర్లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. జమ్మూ, కశ్మీర్‌లోయలో ప్రజల రాకపోకలపై విధించిన ఆంక్షలను కేంద్రం శనివారం పాక్షికంగా సడలించింది. దీంతో పలువురు కశ్మీరీలు పక్క గ్రామాల్లోని తమ బంధువులు, కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఆంక్షలను సడలించినా భద్రతాబలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. కశ్మీర్‌లోని 35 పోలీస్స్టేషన్ల పరిధిలో ఆంక్షలను అధికారులు సడలించారు. కశ్మీర్ బయట ఉండే కుటుంబ సభ్యులతో ప్రజలు మాట్లాడేందుకు వీలుగా 17 టెలిఫోన్ ఎక్సే్ఛంజీల్లో సేవలను పునరుద్ధరించారు. ఈ విషయమై జమ్మూకశ్మీర్ ప్రభుత్వ అధికార ప్రతినిధి రోహిత్ కన్సాల్ మాట్లాడుతూ..‘కశ్మీర్ లోయలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాథమిక పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి’ అని తెలిపారు. కాగా, ప్రభుత్వం ఆంక్షలు సవరించినా పలు పెట్రోల్ బంకులు, ఇతర మార్కెట్లు శనివారం కూడా మూతపడ్డాయి. ఇంటర్నెట్, టెలిఫోన్ సేవల పునరుద్ధరణ జమ్మూలో శనివారం 5జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. ఈ విషయమై రాష్ట్ర డీజీపీ మాట్లాడుతూ..‘2జీ ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించాం. ఈ సందర్భంగా ఇంటర్నెట్ సేవలను ఎవరైనా దుర్వినియోగం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. ప్రస్తుతానికి త్రీజీ, 4జీ సేవలపై ఆంక్షలను సడలించడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఉగ్రవాదులు త్వరలోనే దాడిచేసే అవకాశముందని నిఘావర్గాల నుంచి తమకు సమాచారం అందిందని జమ్మూకశ్మీర్ సీఎస్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. పాక్ కాల్పుల్లో జవాన్ మృతి కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో సరిహద్దులోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట ఉన్న గ్రామాలు, భారత ఆర్మీ పోస్టులు లక్ష్యంగా పాక్ బుల్లెట్ల వర్షం కురిపించింది. ఈ దుర్ఘటనలో డెహ్రాడూన్‌కు చెందిన జవాన్ లాన్స్‌నాయక్ సందీప్ థాపా(35) తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన భారత ఆర్మీ పాక్ దుశ్చర్యను దీటుగా తిప్పికొట్టిందని ఆర్మీ అధికార ప్రతినిధి శనివారం మీడియాకు చెప్పారు. -
జమ్మూకశ్మీర్‌లో ఈద్ ప్రశాంతం
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో సోమవారం బక్రీద్ వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. జమ్మూతో పాటు కశ్మీర్‌లోని పలుచోట్ల ముస్లింలు భారీ సంఖ్యలో ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకోగా, ఆందోళనకారుల్ని భద్రతాబలగాలు చెదరగొట్టాయి. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయంప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం ఇటీవల రద్దుచేసిన సంగతి తెలిసిందే. పండుగ సందర్భంగా మద్దతుదారులతో సందడిగా ఉండే నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీల ఇళ్లు ఈసారి మూగబోయాయి. ఫరూక్‌ను గుప్కార్‌రోడ్డులోని ఆయన ఇంట్లోనే హౌస్అరెస్ట్ చేసిన బలగాలు.. ఆయన కుమారుడు ఒమర్‌ను హరినివాస్ ప్యాలెస్‌లో నిర్బంధించాయి. ఇక ముఫ్తీని చష్మా సాహి అనే నివాసంలో ఉంచారు. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిని సమీక్షించారు. శ్రీనగర్‌తో పాటు దక్షిణ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆర్మీ, పోలీస్ ఉన్నతాధికారులూ ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. టెలిఫోన్, మొబైల్, ఇంటర్నెట్ సేవలు మూగబోయిన నేపథ్యంలో కశ్మీరీలు ఇతర రాష్ట్రాల్లోని తమ వారితో మాట్లాడేందుకు పోలీసులు 300 ప్రత్యేక టెలిఫోన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
సైన్యం.. అప్రమత్తం
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాకిస్తాన్ దాడులు నిర్వహించే అవకాశం ఉందని భావించిన కేంద్రం, పీఓకేలో భారీగా సైన్యాన్ని మోహరించింది. పాక్ నుంచి వచ్చే ఏ ప్రతిచర్యనైనా తిప్పికొట్టడానికి సైన్యం సిద్ధంగా ఉందని సైనికవర్గాలు తెలిపాయి. ఆర్మీ ప్రధానాధికారులంతా జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. కశ్మీర్ లోయలో పాక్ హింసకు, ఐఈడీ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఏ సమయంలోనూ పరిస్థితిని చేజారనివ్వమని ఓ సీనియర్ మిలిటరీ అధికారి తెలిపారు. 2016లో హిజ్బుల్ ముజాహిద్దీన్ నాయకుడు బుర్హాన్ వానిని హతం చేసినపుడు కశ్మీర్‌లోయలో దాదాపు నాలుగు నెలలకుపైనే అస్థిరత నెలకొంది. అలాంటి పరిస్థితులు మళ్లీ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. వైమానిక దళం కూడా అక్కడే ఉంటూ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. వారిని అదుపు చేయాలి: కేంద్రం జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భద్రతా దళాలను మరింత అప్రమత్తతో ఉంచాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘జాతీయ ప్రయోజనాలు, దేశ భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర కేబినెట్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించేలా సాంఘిక వ్యతిరేక శక్తులు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. వాటిని అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మత పరమైన సున్నిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి.’ అని పేర్కొంది. -
కశ్మీర్‌కు పదివేల బలగాలు
న్యూఢిల్లీ/కశ్మీర్: కశ్మీర్ లోయకు పదివేల మంది భద్రతా బలగాలను తక్షణం తరలించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు, శాంతి భద్రతల విధి నిర్వహణకు వీరిని పంపుతున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 100 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాల (సీఏపీఎఫ్)ను తక్షణం తరలించాలని కేంద్ర హోం శాఖ ఈనెల 25వ తేదీన ఉత్తర్వులు వెలువరించిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి మరికొన్ని బలగాలను కూడా తరలించే యోచనలో కేంద్రం ఉందని కూడా వెల్లడించారు. ఒక సీఏపీఎఫ్ కంపెనీలో 100 మంది సిబ్బంది ఉంటారు. కశ్మీర్ లోయకు పంపే వారిలో సీఆర్పీఎఫ్కు చెందిన 50 కంపెనీలు, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) నుంచి 30, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ నుంచి పదేసి కంపెనీల చొప్పున బలగాలు ఉంటాయన్నారు. వీరందరినీ రైళ్లు, విమానాల్లో విధులు చేపట్టే ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఉగ్ర నిరోధక చర్యలతోపాటు అమర్నాథ్ యాత్రకు బందోబస్తు కల్పిస్తున్న 80 బెటాలియన్ల బలగాలకు వీరు అదనమన్నారు. ఒక్కో బెటాలియన్‌లో వెయ్యి మంది సిబ్బంది ఉంటారు. రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరపాలని యోచిస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ బలగాలను మోహరిస్తోందని భావి స్తున్నారు. బలగాలను తరలించాలన్న కేం ద్రం నిర్ణయాన్ని పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తప్పుపట్టారు. జైషే టాప్ కమాండర్ హతం శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్ అగ్రశ్రేణి జైషే మహమ్మద్ (జేఎం)కు చెందిన కమాండర్ మున్నా లాహోరిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. శుక్రవారం రాత్రి సోపియాన్‌లోని బోన్బజార్ ప్రాంతం బండే మొహల్లాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గత నెలలో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన కారు పేలు డుకు లాహోరి కారణమని పోలీసులు తెలి పారు. పాక్ జాతీయుడైన మున్నా లాహోరి కశ్మీర్లో వరుస పౌర హత్యలకు పాల్పడ్డా డని తెలిపారు. కశ్మీర్లో ఉగ్రవాదుల నియా మకం కోసం లాహోరిని జైషే నియమిం చిందని, అతడు పేలుడు పరికరాల తయా రీలో సిద్ధహస్తుడని పోలీసులు తెలిపారు. -
ఏజెన్సీలో మావోల అలజడి
సాక్షి, భూపాలపల్లి : పట్టుకోసం మావోయిస్టులు పలు చర్యలతో ప్రయత్నిస్తుండగా.. భద్రతాబలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతుండడంతో ఏజెన్సీలో మళ్లీ అలజడి పెరుగుతోంది. తాజాగా జరిగిన చర్ల సంఘటనతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఇటీవల మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టు ముఖ్యనేతలు సంచరించారనే వార్తలు వచ్చిన నేపథ్యంలోనే.. చర్లలోని టీఆర్ఎస్ ఎంపీటీసీ కిడ్నాప్ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈనెల 28 నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు ఉన్నాయి. దీంతో భద్రతా దళాలు సైతం అప్రమత్తమయ్యాయి. ఉమ్మడి భూపాలపల్లి జిల్లాపై పట్టు పెంచుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. రెండు జిల్లాల పరిధి పలు మండలాల్లో కరపత్రాలు లభించడం, గత నెల తాడ్వాయి మండలంలో వాచ్మెన్పై దాడి ఘటన ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. తాజాగా వాజేడు– వెంకటాపురం కమిటీని ఏర్పాటు చేయడం కూడా విస్తరణలోనే భాగమే అని తెలుస్తోంది. ఇటీవల కాలంలో జిల్లాలో అక్కడక్కడా మావోల ఉనికి కనిపిస్తుండడంతో భద్రతా బలగాలు పటిష్టమైన చర్యలు చేపట్టాయి. ఇటీవల సరిహద్దు మండలం చర్లలో టీఆర్ఎస్ నాయకుడి అపహరణ, హత్యనేపథ్యంలో కూంబింగ్‌ను మరింత విస్తృతం చేశారు. సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు ఎప్పటికప్పుడు అటవీ గ్రామాలతో పాటు, అడవులను జల్లెడ పడుతున్నారు. మరోవైపు మావోయిస్టు వారోత్సవాలు దగ్గర పడుతుండటంతో సరిహద్దు మండలాల్లో నిఘా మరింత పెంచారు. ఛత్తీస్‌గఢ్, భద్రాచలం, ములుగు జిల్లాల సరిహద్దులో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను అనుకుని ఉన్న ప్రాంతాల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఏటూరునాగారం ముల్లకట్ట వంతెన సమీపంలో, వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగరం, కన్నాయిగూడెం, పలిమెల, మహాముత్తారం మండలాల్లో వాహన తనిఖీలు విస్తృతగా చేపడుతున్నారు. ఇంటలిజెన్స్ వర్గాలు సైతం గ్రామాల్లో తిరుగుతూ.. ఎవరు వస్తున్నారు.. ఎక్కడి వారు.. ఎవరిని కలుస్తున్నారనే విషయాలపై సమాచారం సేకరిస్తున్నారు. -
దంతేవాడలో ఎదురుకాల్పులు.. ఇద్దరి మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లా గుమియపాల్ వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో గుమియపాల్ అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అదే సమయంలో మావోయిస్టులు వారికి తరసా పడటంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులను సిబ్బంది మట్టుబెట్టారు. ఒకరిని అరెస్ట్ చేసి.. వారి వద్ద ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తాజా ఘటనతో దంతేవాడ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ను మరింత కట్టుదిట్టం చేశారు. -
మూడేళ్లలో 733 మందిని మట్టుబెట్టాం
న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో గత మూడేళ్లలో 733 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం లోక్‌సభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. 2018లో 257 మంది, 2017లో 213 మంది, 2016లో 150 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు అంతమొందిచినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 16 వరకు 113 ఉగ్రవాదులు హతమైనట్టు తెలిపారు. అంతేకాకుండా ఈ మడేళ్లలో జమ్మూ కశ్మీర్‌లోని 112 మంది పౌరులు కూడా తమ ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. అలాగే ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడానికి భద్రతా బలాలు నిరంతరం సమర్ధవంతగా పనిచేస్తున్నాయని తెలిపారు. -
నాలుగు నెలల్లో 61 మంది మృతి
సాక్షి, న్యూఢిల్లీ: గత నాలుగు నెలల్లో జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద ఘటనల్లో మొత్తం 61 మంది భద్రతా సిబ్బంది మృతి చెందినట్లు భారత హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారితో పాటు 11 మంది సాధారణ పౌరులు మృతి చెందినట్లు తెలిపింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన రోహిత్ చౌదరీ అనే సామాజిక కార్యకర్త ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా జనరల్ ఆఫీసర్ కమాండర్ ఇన్ చీఫ్ సులేఖ ఈ వివరాలను బహిర్గతం చేశారు. గత నాలుగు నెలల్లో జరిగన అనేక దాడుల్లో 142 మంది గాయపడగా.. వీరిలో 73 మంది భద్రతా సిబ్బంది, 63 మంది పౌరులు ఉన్నారని తెలిపారు. అలాగే ఈ సంవత్సరం ఆరంభం నుంచి 177 ఉగ్రవాద ఘటనలు జరిగాయని ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 86 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్ తెలిపారు. అందులో 20 మందిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. పాక్ సరిహద్దుల్లో 16 ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్లు తెలుస్తోందని.. వాటి కార్యక్రమాలను అడ్డుకుంటున్నామని వెల్లడించారు. -
కశ్మీర్లో ఉగ్రవాది హతం
శ్రీనగర్: ఉగ్రసంస్థ అల్‌కాయితో సంబంధాలున్న గజ్వత్ ఉల్ హింద్ గ్రూప్ చీఫ్ జకీర్ ముసాను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దక్షిణ కశ్మీర్ పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ‘చనిపోయిన ఉగ్రవాదిని జకీర్ ముసాగా గుర్తించాం. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నాం’అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి రాజేశ్ కాలియా వెల్లడించారు. తొలుత దాద్‌సారా గ్రామంలో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయని, అదే సమయంలో అతడు పారిపోయేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపినట్లు వివరించారు. అతడిని పట్టుకునేందుకు ఎంతగా ప్రయత్నించినా వినలేదని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. కాగా, షోపియాన్, పుల్వామా, అవంతీపురా, శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో జకీర్‌కు మద్దతుగా ప్రజలు ఆందోళనలు చేపట్టారని, నినాదాలు చేస్తూ రోడ్లపైకి రావడంతో అధికారులు లోయలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం.. ముసా 2013 నుంచి ఉగ్రకార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నట్లు తెలిసింది. తొలుత హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థతో సంబంధాలు ఏర్పరచుకున్నాడని, ఆ తర్వాత అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. 2017లో హురియత్ కాన్ఫరెన్స్ నేతలను బెదిరించినట్లు కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. -
గడ్చిరోలి పేలుడు వెనుక నంబాల
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 16 మంది పోలీసుల్ని పొట్టన బెట్టుకున్న బాంబు పేలుడుకు కీలక సూత్రధారిని మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. భారీ దాడులకు ప్రణాళికలు రూపొందించడంలో దిట్టగా పేరొందిన సీపీఐ (మావోయిస్ట్) గ్రూప్ చీఫ్ నంబాల కేశవరావు (నంబాల) ఈ దాడికి నేతృత్వం వహించినట్లు పోలీసులు నిర్ధారించారు. గడ్చిరోలి మందుపాతర పేలుడు వెనుక తెలంగాణ మావోల హస్తం ఉందన్న విషయాన్ని ‘సాక్షి’ముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. (చదవండి : పోలీసులపై మావోల పంజా) నంబాల కేశవరావు అలియాస్ గుర్రె బసవరాజుగా కూడా ప్రసిద్ధుడే. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సీపీఐ (మావో యిస్టు) కేంద్ర మిలటరీ కమాండర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆయన వారసుడి గా నంబాల బాధ్యతలు చేపట్టాడు. నంబాల స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని జియ్యన్నపేట. తెలంగాణలోని వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థి. శ్రీకాకుళంలో ఇంటర్మీడియట్ చదివిన అనంతరం కేశవరావుకు వరంగల్ ఆర్ఈసీలో సీటు లభించింది. అక్కడే ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ సమయంలోనే నాటి పీపుల్స్ వార్ కార్యక్రమాల వైపు ఆకర్షితుడయ్యాడు. అంతకుముందు– ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌లో క్రియాశీలకంగా పని చేసిన సమయంలో నక్సల్ ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు. 1984లో పార్టీలో చేరిన కేశవరావు ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి దిశానిర్దేశకుడిగా వ్యవహరిస్తున్నాడు. నంబాల కేశవరావు (ఫైల్ ఫొటో) వ్యూహాలు రూపొందించడంలో దిట్ట.. భారీ దాడులు, హత్యలకు ప్రణాళికలు రూపొందించడంలో నంబాల కేశవరావు దిట్ట. మావో కీలక నేత గణపతి సారథ్యంలోనూ పార్టీలో కీలక ఆపరేషన్లు ఇతనికే అప్పగించేవారు. గణపతి నుంచి బాధ్యతలు స్వీకరించాక, తెలంగాణలో దాడులకు పాల్పడకున్నా.. ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో భీకరదాడులతో పార్టీలో తిరిగి ఉత్తేజం నింపే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇందులో భాగంగానే గతేడాది విశాఖపట్నం జిల్లా అరకు తెలుగుదేశం ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమ హత్యకు నంబాల పథకం రూపొందించాడని సమాచారం. గత ఏప్రిల్ 9వ తేదీన తొలిదశ పోలింగ్ ముగిశాక ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో బీజేపీ ఎమ్మెల్యే కాన్వాయ్‌ను పేల్చేయడంలో కూడా నంబాల కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నంబాల తలపై రూ.19 లక్షల రివార్డు ఉంది. ఇతని కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర పోలీసులతోపాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కూడా వెదుకుతోంది. కలసి వచ్చిన పోలీసుల నిర్లక్ష్యం..! గడ్చిరోలి దాడిలో పోలీసుల నిర్లక్ష్యంవల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని విమర్శలు వస్తున్నాయి. పోలీసులను ఉచ్చులోకి లాగి మావోయిస్టులు లక్ష్యాన్ని ఛేదించారు. కుర్ ఖేడా అటవీ ప్రాంతంలో ముందుగా రోడ్డు నిర్మాణ పనులు చేస్తోన్న యంత్రాలు, వాహనాలకు మావోయిస్టులు నిప్పుపెట్టి పోలీసులను ఉచ్చులోకి లాగారు. వాస్తవానికి ఏదైనా ఘటన జరిగితే సమాచారం అందుకున్న వెంటనే తమపై దాడి జరిగే ప్రమాదముందని వెంటనే వెళ్లరు. కానీ, బుధవారం మాత్రం పోలీసులు ఘటనా స్థలానికి సివిలియన్ వెహికల్లో వెళ్లారు. పైగా రోడ్డుకు అడ్డంగా పెట్టిన చెట్లను పక్కకు తీసే ప్రయత్నం చేసి భారీ తప్పిదం చేశారు. అదే సమయంలో అదనుచూసి అత్యంత శక్తిమంతమైన ఐఈడీ అమర్చిన మందుపాతరను పేల్చేయడం ద్వారా 16 మందిని మావోయిస్టులు పొట్టన బెట్టుకున్నారు. -
మావోయిస్టుల దాడిలో 15 మంది జవాన్ల మృతి..!
-
గడ్చిరొలి: భద్రతబలగాలు లక్ష్యంగా బాంబు పేలుడు
-
మావోయిస్టుల దాడిలో 15 మంది జవాన్ల మృతి..!
ముంబై : మావోయిస్టులు మరోసారి పేట్రేగిపో్యారు. భద్రతా సిబ్బందిపై పంజా విసిరిరారు. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ మందుపాతర పెట్టి పేల్చేశారు. ఈ ఘటన మహారాష్ట్రాలోని గడ్చిరోలిలో బుధవారం చోటుచేసుకుంది. భారీ విస్పోటనం కారణంగా వాహనం తునాతునకలైంది. ఈ ప్రమాదంలో 15 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. జాంబిర్‌కేడ అటవీ ప్రాంతం గుండా వెళ్తున్న క్రమంలో ఈ దారుణం జరిగింది. అంతకు ముందు ఇదే జిల్లా కుర్ఖేడా తాలూకా దాదాపూర్ వద్ద మావోయిస్టులు బుధవారం రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన 36 వాహనాలకు నిప్పుపెట్టారు. (చదవండి : గడ్చిరోలిలో మావోయిస్టుల విధ్వంసకాండ) -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా బిజ్‌బహరాలోని బగేంద్ర మొహల్లాలో భద్రతాబలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపట్టాయి. ఉగ్ర కదలికలున్నాయన్న సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఎదురు కాల్పులు జరిపిన దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మృతిచెందిన ఉగ్రవాదులను సఫ్ద్ అమీన్ భట్, బుర్హాన్ అహ్మద్‌లుగా గుర్తించారు. ఘటనాస్థలిలో ఏకే , ఎస్ఎల్ఆర్ రైఫిల్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. -
ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూలోని షోపియాన్ జిల్లాలోని ఇమామ్ సాహిబ్ ఏరియాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా పుల్వామా ఉగ్రదాడి, బాలకోట్లో జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడుల నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ సైన్యం పదే పదే కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించడం, ఉగ్రవాదులు కూడా కాల్పులకు తెగబడుతుండటంతో భారత సైన్యం వారికి ధీటుగా బదులిస్తూ కుట్రలను తిప్పికొడుతోంది. -
కెల్లార్‌లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: షోపియాన్ జిల్లాలోని కెల్లార్ ప్రాంతంలో గురువారం ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. సీఆర్పీఎఫ్, ఆర్మీ బలగాలు సంయుక్తంగా కెల్లార్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులకు ధీటుగా బదులిచ్చారు. ఘటన స్థలం నుంచి భద్రతా బలగాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఉగ్ర కదలికలపై ఆర్మీ బలగాలు ఇంకా సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. -
‘పుల్వామా’ సూత్రధారి హతం
శ్రీనగర్: పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న పుల్వామా దాడికి సూత్రధారిగా భావిస్తున్న ఉగ్రవాది ముదాసిర్ అహ్మద్ ఖాన్‌ను భద్రతా బలగాలు ఎన్కౌంటర్లో సోమవారం మట్టుపెట్టాయి. ఈ ఘటనలో మరణించిన మరో ఉగ్రవాదిని పుల్వామా దాడిలో వాడిన మినీ వ్యానును కొనుగోలు చేసిన సజ్జద్ భట్ అని భావిస్తున్నారు. పుల్వామా జిల్లా పింగ్లిష్‌లో ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఎన్కౌంటర్ సోమవారం వేకువజాము వరకు సాగింది. ఉగ్రవాదులు దాక్కున్న ఇంట్లో లభ్యమైన సామగ్రి, ఆధారాల్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అందజేస్తామని కశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సుదీర్ఘ ఎన్కౌంటర్.. పింగ్లిష్‌లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం అందడంతో ఆదివారం సాయంత్రం నుంచే భద్రతా బలగాలు అక్కడ సోదాలు ముమ్మరం చేశాయి. తొలుత ముష్కరులు కాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సుదీర్ఘంగా కొనసాగిన ఎన్కౌంటర్ ముగిసిన తరువాత సంఘటనా స్థలంలో ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించారు. అందులో ఒకరు పుల్వామా మాస్టర్‌మైండ్ ముదాసిర్ అహ్మద్ ఖాన్ కాగా, రెండో వ్యక్తి వివరాలు స్పష్టంగా తెలియరాలేదు. అతడిని పుల్వామా దాడికి 10 రోజుల ముందే, ఆ వాహనాన్ని కొనుగోలు చేసిన సజ్జద్ భట్‌గా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండో ఉగ్రవాదిగా భావిస్తున్న సజ్జద్ భట్ వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదని, అతడు పాకిస్తానీయుడు అని భావిస్తున్నట్లు కశ్మీర్ రేంజ్ ఐజీ స్వయం ప్రకాశ్ పాణి చెప్పారు. ఎలక్ట్రీ్టషియన్ నుంచి ఉగ్రవాదిగా పుల్వామా నివాసి అయిన 23 ఏళ్ల ముదాసిర్ అహ్మద్ ఖాన్ డిగ్రీ పూర్తిచేసి ఎలక్ట్రీషియన్‌గా పనిచేశాడు. 2017లో జైషేలో సాధారణ కార్యకర్తగా చేరి తరువాత నూర్ మహ్మద్ తంత్రాయ్ ప్రేరణతో ఉగ్రవాదిగా మారాడు. అదే ఏడాది డిసెంబర్లో తంత్రాయ్ హతమయ్యాక 2018 జనవరిలో ఇంటి నుంచి పరారై క్రియాశీలకంగా మారాడు. 2018, ఫిబ్రవరిలో ఆరుగురు భద్రతా సిబ్బందిని బలితీసుకున్న సుంజవాన్ ఆర్మీపై దాడిలో అతని పాత్ర ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనకు నెల రోజుల ముందు ఐదుగురు సీఆర్పీఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన లీత్‌పురా దాడిలోనూ అతని ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. -
పుల్వామాలో ఎన్కౌంటర్
శ్రీనగర్ : భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సమసిపోయినా ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘనతో పాక్ దళాలు కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మంగళవారం ఉదయం ఉగ్రవాదులు తలదాచుకున్న ఇంటిపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. గంటకు పైగా కాల్పులు జరిగాయని, ఉగ్రవాది తలదాచుకున్న గృహాన్ని భద్రతాదళాలు పేల్చివేశాయని అధికారులు వెల్లడించారు. పుల్వామా జిల్లాలోని త్రాల్లో ఓ ఇంటిలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నారని అందిన సమాచారంతో భద్రతా దళాలు మంగళవారం తెల్లవారుజామున ఇంటిని చుట్టుముట్టాయి. భద్రతా దళాల దాడిలో ఓ ఉగ్రవాది మరణించగా మరో టెర్రరిస్ట్ కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం కాల్పులు నిలిచిపోయాయని, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారని అధికారులు తెలిపారు. -
కశ్మీర్లో 56 గంటల ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం ప్రారంభమైన భీకర ఎన్కౌంటర్ 56 గంటల తర్వాత ముగిసింది. ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా బాగా జనసమ్మర్దమున్న ప్రాంతంలో నక్కడంతో భద్రతాసిబ్బందికి ఉగ్రమూకల ఏరివేత సవాలుగా మారింది. ఈ కాల్పుల్లో ఐదుగురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు ఉగ్రవాదుల్ని బలగాలు హతమార్చాయి. ఈ ఘటనలో ఓ పౌరుడు సైతం బుల్లెట్ గాయాలతో చనిపోయాడు. ఈ విషయమై జమ్మూకశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు మట్టుబెట్టాయని తెలిపారు. వీరిలో ఒకరు పాకిస్తానీ కాగా, మరొకరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం ప్రారంభమైన ఎన్కౌంటర్లో ఓ సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్, జవాన్, ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ఉగ్రమూకల కాల్పుల్లో గాయపడిన జవాన్ శ్యామ్ నారాయణ్‌సింగ్ యాదవ్ ఆదివారం కన్నుమూశారన్నారు. ఎన్కౌంటర్ సందర్భంగా వసీం అహ్మద్ మీర్ అనే పౌరుడు చనిపోయాడన్నారు. కుప్వారాలోని బాబాగుంద్ ప్రాంతంలో లష్కరే ఉగ్రవాదులు దాక్కోవడంతో ఆపరేషన్ చేపట్టడం బలగాలకు సవాలుగా మారింది. రద్దీగా, చుట్టూ జనావాసాలు ఉండటంతో అధికారులు తొలుత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. -
‘చచ్చిన ఉగ్రవాది’ కాల్చాడు!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం భీకర ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కుప్వారా జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు దొంగదెబ్బ తీయడంతో ఓ సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ సహా ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. కుప్వారా జిల్లాలోని బాబాగుంద్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు పోలీసులకు నిఘావర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసుల సంయుక్త బృందం ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపును ప్రారంభించింది. అంతలోనే బలగాల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పు లు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య కాల్పులు చాలాసేపు సాగా యి. ఉగ్రవాదుల నుంచి కాల్పులు ఆగిపోవడం తో భద్రతాబలగాలు వారు నక్కిన ఇంటిలోకి వెళ్లాయి. దీంతో అప్పటివరకూ చనిపోయినట్లు నటించిన ఓ ఉగ్రవాది ఒక్కసారిగా లేచి తుపాకీతో బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ కాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్, జవాన్‌తో పాటు ఇద్దరు ఆర్మీ సిబ్బంది, ఓ పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాది కాల్పుల్లో గాయపడ్డ మరో నలుగురికి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనలో వసీమ్ అహ్మద్ అనే స్థానికుడొకరు బుల్లెట్ గాయాలతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయమై జమ్మూకశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఎన్కౌంటర్ అనంతరం భద్రతాబలగాలపై స్థానిక యువకులు రాళ్లు రువ్వారని తెలిపారు. ఈ సందర్భంగా నలుగురు యువకులు గాయపడ్డారని వెల్లడించారు. ఇంకా ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉండొచ్చన్న సమాచారం నేపథ్యంలో కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. -
షోపియాన్‌లో ఎన్కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదరుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రత దళాలు మట్టుపెట్టాయి. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడులు జరిపి కొన్ని గంటలైన గడవకముందే.. మరోసారి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. షోపియాన్ జిల్లాలో మెమందర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రత బలగాలు బుధవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ చేపట్టాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు భద్రత బలగాలపై కాల్పులు దిగినట్టు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పులను తిప్పికొట్టడానికి భద్రత బలగాలు ఎదురు కాల్పులు జరుపుతున్నట్టు వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ఎవరు గాయపడలేదని సమాచారం. సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడ్డ పాక్.. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. మంగళవారం సాయంత్రం నుంచి సరిహద్దు వెంబడి దాదాపు 15 చోట్ల ఇష్టా రాజ్యంగా పాక్ కాల్పులు జరిపింది. పాకిస్తాన్ బలగాలు జరిపిన కాల్పులో ఐదుగురు భారత జవాన్లు గాయపడ్డారు. సరిహద్దులోని పలు చోట్ల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పాక్ ఆర్మీకి ధీటుగా బదులిచ్చిన భారత దళాలు పాకిస్తాన్‌కు చెందిన ఐదు పోస్టులను ధ్వంసం చేశాయి. (సర్జికల్ స్ట్రయిక్స్ 2 సక్సెస్) -
కుల్గామ్‌లో భీకర ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఆదివారం భీకర ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కుల్గామ్ జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతం కాగా, ఓ పోలీస్ డీఎస్పీ, మరో జవాన్ ప్రాణాలు కోల్పోయారు. కుల్గామ్ జిల్లాలోని తురిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు పోలీసులకు నిఘావర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో డీఎస్పీ అమన్ ఠాకూర్ నేతృత్వంలోని పోలీస్, ఆర్మీ సంయుక్త బృందం ఘటనాస్థలికి బయలుదేరింది. అయితే తురిగామ్‌ను ఈ బృందం సమీపించగానే ఉగ్రవాదులు వీరిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో డీఎస్పీ అమన్ ఠాకూర్ మెడ భాగంలో బుల్లెట్ దూసుకుపోయింది. వెంటనే భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..అమన్ ఠాకూర్‌తో పాటు హవల్దార్ సోంబీర్‌కు తీవ్రగాయాలు కాగా హుటాహుటిన వాయుమార్గం ద్వారా ఆర్మీ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అయితే, చికిత్స పొందుతూ వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారన్నారు. తురిగామ్‌లో నక్కిన ముగ్గురు జైషే ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ ఆర్మీ మేజర్, ముగ్గురు సైనికులు గాయపడ్డారనీ, వీరి ఆరో గ్యం స్థిరంగా ఉందని పేర్కొన్నారు. అమన్ మృతిపై గవర్నర్ సత్యపాల్ మాలిక్, డీజీపీ దిల్బాగ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రెండు ప్రభుత్వ ఉద్యోగాలను కాదని.. జువాలజీలో మాస్టర్స్ చేసిన అమన్ ఠాకూర్‌కు పోలీస్ శాఖలో పనిచేయాలన్నది చిరకాల స్వప్నం. అందుకే రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ పోలీస్‌శాఖలో చేరారు. దొడా జిల్లాకు చెందిన అమన్‌కు తొలుత జమ్మూకశ్మీర్ సాంఘిక సంక్షేమ శాఖలో అధికారిగా ఉద్యోగం వచ్చింది. అనంతరం స్థానిక ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్‌గానూ ఉద్యోగం దక్కింది. అయితే పోలీస్ ఉద్యోగంపై ఉన్న మక్కువతో అమన్ తన ప్రయత్నాలు కొనసాగించారు. చివరికి జమ్మూకశ్మీర్ పోలీస్ సర్వీస్‌కు 2011లో ఎంపికయ్యారు. ఏడాదిన్నర క్రితం కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల విభాగానికి చీఫ్‌గా అమన్ నియమితులయ్యారు. అప్పట్నుంచి అమన్ బృందం చాలామంది కరుడుగట్టిన ఉగ్రవాదులను మట్టుబెట్టింది. కాగా, విధినిర్వహణలో చూపిన ధైర్య సాహసాలకు గానూ అమన్ డీజీపీ ప్రశంసా మెడల్–సర్టిఫికెట్, షేర్–ఏ–కశ్మీర్ మెడల్‌ను అందుకున్నారు. అమన్‌కు తల్లిదండ్రులతో పాటు భార్య సరళా దేవి, కుమారుడు ఆర్య(6) ఉన్నారు. -
ఎన్కౌంటర్లో ముగ్గురు తీవ్రవాదుల హతం
శ్రీనగర్ : భద్రతాబలగాల కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బిన్నర్‌లో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భధ్రతాబలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గరు తీవ్రవాదులు మృతి చెందారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సంఘటన స్థలంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అఫ్గానిస్తాన్‌లో లైబ్రరీ ఎందుకు?
వాషింగ్టన్: అంతర్యుద్ధంతో అతలాకుతలమైన అఫ్గానిస్తాన్‌లో భద్రతను పట్టించుకోకుండా భారత ప్రధాని మోదీ అక్కడ లైబ్రరీ స్థాపనకు సాయం చేశారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హేళన చేశారు. అఫ్గాన్ భద్రతకు భారత్ సహా ఇతర దేశాలు చేయాల్సినంతగా చేయలేదని విమర్శించారు. అఫ్గానిస్తాన్‌కు బలగాలు పంపాలని అమెరికా తరచూ ఒత్తిడి చేస్తున్నా భారత్ తిరస్కరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అఫ్గానిస్తాన్‌లో భారత్ చేపట్టిన అభివృద్ధి పనుల్ని అమెరికా అధ్యక్షుడు పరిహసిస్తూ వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ట్రంప్ ఏ లైబ్రరీ ప్రాజెక్టును ఉద్దేశించి పై వ్యాఖ్యలు చేశారో తెలియరాలేదు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో అఫ్గానిస్తాన్ భద్రతకు చేస్తున్న ఖర్చుపై మాట్లాడుతూ ట్రంప్..భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించారు. ‘ మోదీని కలిసినప్పుడు అఫ్గానిస్తాన్‌లో లైబ్రరీ నిర్మిస్తున్నానని పదేపదే చెప్పారు. మోదీ లాంటి నాయకులు అఫ్గానిస్తాన్ అభివృద్ధికి ఎంతో ఖర్చు చేశామని చెబుతున్న మొత్తం మనం చేస్తున్న వ్యయం కన్నా చాలా తక్కువ. ఆ లైబ్రరీని ఆ దేశంలో ఎవరైనా వినియోగిస్తున్నారా? నాకైతే తెలీదు. అయినా లైబ్రరీ ఏర్పాటుచేసినందుకు మనం భారత్‌కు ధన్యవాదాలు చెప్పాల్సి వచ్చింది. మనం అక్కడ ఐదు గంటలకు చేసే ఖర్చుతో ఆ లైబ్రరీ సమానం’ అని ట్రంప్ వెటకారంగా అన్నారు. ట్రంప్ వ్యాఖ్యల్ని భారత విదేశాంగ శాఖ కొట్టివేసింది. భారత్ చేస్తున్న సాయం ఆ దేశ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపింది. అఫ్గాన్ ప్రజల అవసరాల మేరకు పలు మౌలిక ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల్ని అమలుచేస్తున్నామంది. లాటరీకి ముగింపు పలకాలి ప్రతిభ, నైపుణ్యం ఉన్నవారికే అమెరికా తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఆ ట్రంప్ స్పష్టం చేశారు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో కొన్ని లొసుగులు ఉన్నాయని వాటిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. లాటరీ విధానంలో వీసాలు ఇవ్వడం సరికాదని.. దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. 6గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. శనివారం ఉదయం కశ్మీర్ పుల్వామా జిల్లా ట్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా సిబ్బంది ఆరుగురు ఉగ్రవాదులను అంతమొందించారు. చనిపోయిన వారంతా మాజీ హిజ్బుల్ చీఫ్ జాకీర్ ముసా అన్సార్‌కు చెందిన ‘ఘజ్వత్ ఉల్ హింద్’ ముఠాకు చెందిన వారని తెలిసింది. మరణించిన వారిలో జాకీర్ ముసా ముఖ్య అనుచరుడు సోలిహా మహ్మద్ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. వివరాల ప్రకారం దద్సారా ప్రాంతంలోని ఆరమ్‌పోరా కుగ్రామంలో ఉగ్రవాదుల ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. దాంతో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అధికారులు తనిఖీలు చేస్తుండగా.. ఓ ఇంట్లో దాగి ఉన్న ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పుల జరిపిన భద్రతా సిబ్బంది ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలిసింది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి అధికారులు ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. -
అఫ్గాన్ నుంచి సగం బలగాలు వెనక్కి
కాబూల్: ఆఫ్గానిస్తాన్‌లో తమ బలగాలను సగానికి తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. ప్రస్తుతం 14వేల మంది సైనికులు ఆఫ్గాన్‌లో ఉండగా 7వేల మందిని వెనక్కి రప్పిస్తామన్నారు. అమెరికా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదని పాకిస్తాన్‌లోని అజ్ఞాత ప్రదేశం నుంచి ఓ తాలిబన్ ప్రతినిధి ప్రకటించారు. అమెరికా భద్రతా బలగాలను ఉపసంహరించుకున్నా.. దేశ భద్రతపై ఎలాంటి ప్రభావం ఉండబోదని అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని అధికార ప్రతినిధి హరూన్ చఖన్సురి వెల్లడించారు. అమెరికా దౌత్యవేత్త ఖలిలాజ్ బుధవారం దుబాయ్‌లో తాలిబన్ ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాలిబన్లు ఆఫ్గానిస్తాన్ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపాలనే లక్ష్యంతో ఆయన తాలిబన్లను కలిశారు. ఇందులో భాగంగా విదేశీ బలగాలను పంపించడంతోపాటు జైల్లో ఉన్న తాలిబన్లందర్నీ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. 2001లో 9/11 దాడులకు పాల్పడ్డ అల్‌ఖైదా∙అధినేత ఒసామా బిన్ లాడెన్‌కు తాలిబన్ల ఆధీనంలో ఉన్న ఆఫ్గానిస్తాన్ ఆశ్రయమిచ్చింది. నాటి నుంచి సాగుతున్న ఈ సుదీర్ఘ యుద్ధంలో 2,200 మంది అమెరికా సైనికులు మరణించారు. -
దారి తప్పిన ఎన్కౌంటర్
శ్రీనగర్: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య శనివారం భీకరమైన కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు హతమార్చగా, ఉగ్రమూకల కాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్ అమరుడయ్యారు. మరోవైపు ఉగ్రవాదులకు మద్దతుగా భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న స్థానికులు భద్రతాబలగాలపై దాడికి దిగారు. దీంతో ఆత్మరక్షణ కోసం బలగాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎన్కౌంటర్లో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో రాజకీయ పార్టీలన్నీ గవర్నర్ సత్యపాల్మాలిక్పై దుమ్మెత్తిపోశాయి. దీంతో గవర్నర్ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘పుల్వామాలోని సిర్ణూ గ్రామంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘావర్గాల నుంచి మాకు పక్కా సమాచారం అందింది. దీంతో భద్రతాబలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు ప్రారంభించాయి. అయితే బలగాల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోగా, ఓ జవాన్ అమరుడయ్యారు. మృతుల్లో గతేడాది జూలైలో ఆర్మీ నుంచి పారిపోయి ఉగ్రవాదుల్లో చేరిన సిర్ణూవాసి జహూర్ అహ్మద్ ఉన్నాడు. జహూర్ అహ్మద్‌ను బలగాలు చుట్టుముట్టినట్లు తెలుసుకున్న సిర్ణూ గ్రామస్తులు భారీ సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. బలగాలపై రాళ్లదాడికి దిగారు. ఆర్మీ వాహనాలను ధ్వంసం చేశారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు గాల్లో కాల్పులు జరిపినా ఫలితం లేకపోయింది. దీంతో భద్రతాబలగాలు ఆత్మరక్షణ కోసం రాళ్లమూకపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపారు. అది ఊచకోతే: విపక్షాలు పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. కశ్మీర్లో భద్రతాబలగాలు పౌరుల ఊచకోతకు పాల్పడ్డాయని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. సొంత ప్రజలను చంపుకోవడం ద్వారా ఏ దేశం కూడా యుద్ధంలో విజయం సాధించలేదని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు. -
నక్సల్స్ దిష్టిబొమ్మల వ్యూహం!
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో గత కొన్ని నెలల్లో తీవ్ర ఎదురుదెబ్బలు తిన్న నక్సలైట్లు, భద్రతా దళాలతో పోరాడేందుకు కొత్త వ్యూహాలు పన్నారు. భద్రతా దళ సిబ్బందిని తప్పుదారి పట్టించేందుకు మనుషుల దిష్టిబొమ్మలు, నకిలీ తుపాకులను వారు ఉపయోగిస్తున్నారు. జవాన్లను ఉచ్చులోకి దింపేందుకు వ్యూహాత్మకంగా ఈ దిష్టిబొమ్మలను అడవుల్లో అక్కడక్కడా పెట్టారు. గత ఎనిమిది రోజుల్లోనే సుక్మా జిల్లాలో ఇలాంటి 13 దిష్టిబొమ్మలను స్వాధీనం చేసుకున్నామని ఆ జిల్లా ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. గత కొన్ని నెలల్లో భద్రతా దళాల ఎన్కౌంటర్లలో భారీ సంఖ్యలో నక్సలైట్లు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఇందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు, తమ ఉనికిని నిలుపుకునేందుకు నక్సల్స్ ఈ కొత్త వ్యూహాన్ని ఎంచుకుని ఉండొచ్చని ఎస్పీ చెప్పారు. వియత్నాం యుద్ధంలో ఇలాంటి పద్ధతిని నాటి సైనికులు వినియోగించారనీ, అయితే నక్సల్స్ ఈ వ్యూహాన్ని అమలు చేయడం మాత్రం ఇదే తొలిసారని మీనా వెల్లడించారు. చింతగుహ అడవుల్లో దొరికిన ఓ దిష్టిబొమ్మ వద్ద అత్యాధునిక పేలుడు పదార్థాన్ని కూడా అమర్చారనీ, సైనికులపై దొంగదాడి చేసేందుకు లేదా వారిని పేలుడు పదార్థాలతో చంపేందుకు నక్సల్స్ ఈ కొత్త వ్యూహానికి తెరతీసి ఉండొచ్చన్నారు. పలు హాలీవుడ్ సినిమాలు, డాక్యుమెంటరీలు చూసి నక్సల్స్ ఈ తరహా కొత్త వ్యూహాలు పన్ని ఉండొచ్చని భద్రతా నిపుణుడొకరు చెప్పారు. పూర్తి వ్యూహం తయారుచేసే ముందు దిష్టిబొమ్మలకు భద్రతా దళ సిబ్బంది ఎలా స్పందిస్తారో తెలుసుకునేందుకే వారు ఇలా చేసి ఉంటారని ఆయన తెలిపారు. -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్
రాయ్‌పూర్/చింతూరు (రంపచోడవరం)/చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో నక్సలైట్లు, భద్రతా దళాలకు మధ్య సోమవారం జరిగిన రెండు ఎన్కౌంటర్లలో 9 మంది నక్సల్స్‌తోపాటు ఇద్దరు పోలీసులు మరణించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులోని సుక్మా జిల్లా దక్షిణ ప్రాంతమైన కిస్తారం, చింతగుహ అడవుల్లో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ‘ఆపరేషన్ ప్రహార్ – ఐV’ పేరిట 1,200 మంది సిబ్బంది మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తుండగా అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక డీజీపీ (నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు) డీఎం అవస్థీ చెప్పారు. తెలంగాణ పోలీసులతో కలసి ఛత్తీస్‌గఢ్ ఎస్టీఎఫ్, డీఆర్జీ దళాలు, సీఆర్పీఎఫ్ అనుబంధ కోబ్రా బృందాలు ఆదివారం రాత్రి తొండమర్క, సలెతోంగ్ గ్రామాలు, సక్లేర్ అడవుల్లో కూంబింగ్ ప్రారంభించారని తెలిపారు. కిస్తారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సక్లేర్ గ్రామాన్ని డీఆర్జీ భద్రతా దళాలు సోమవారం ఉదయం 9.40 గంటలకు చుట్టుముట్టాయనీ, అక్కడ ఉన్న నక్సల్స్ కాల్పులకు దిగారన్నారు. అనంతరం డీఆర్జీ దళాలు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించగా ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది నక్సల్స్‌తోపాటు దిర్డో రామ, మడివి జోగా అనే ఇద్దరు జవాన్లు కూడా మృతి చెందారు. మృతదేహాలను వాయుసేనకు చెందిన హెలికాప్టర్లో రాయ్‌పూర్‌కు తరలించారు. చనిపోయిన నక్సల్స్‌లో ఇద్దరిని గుర్తించారు. వారిద్దరూ తాటి భీమ, పొడియం రాజే అనీ, వారిద్దరి తలలపై 8 లక్షల బహుమానం ఉందని అధికారులు తెలిపారు. చింతగుహ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్మగుండ గ్రామ సమీపంలో జరిగిన మరో ఎన్కౌంటర్లో కోబ్రా దళాలు ఓ నక్సల్‌ను అంతం చేశాయి. రెండు ఎన్కౌంటర్ ప్రదేశాల నుంచి పదికి పైగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వా«ధీనం చేసుకున్నామని అవస్థీ చెప్పారు. ఆపరేషన్ ప్రహార్ మొదటి మూడు దశలు రెండేళ్ల క్రితమే పూర్తయ్యాయి. పక్కా సమాచారంతోనే దాడి... త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం, తూర్పు గోదావరి జిల్లాల కార్యదర్శి కొయెడ సాంబయ్య అలియాస్ ఆజాద్ నేతృత్వంలో సమావేశం జరుగుతోందన్న సమాచారంతో ఛత్తీస్ పోలీసులు దాడి నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈనెల 12న ఛత్తీస్‌లోని మావోప్రాబల్య ప్రాంతంలో ఎన్నికలు ముగియగా తెలంగాణలోని మావోయిస్టు ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో డిసెంబర్ 7న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి కేడర్‌కు దిశానిర్దేశం చేసేందుకు ఆజాద్ సరిహద్దుల్లో ఓ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులకు పక్కా సమాచారం అందినట్లు తెలిసింది. ఈ సమయానికి ఆజాద్ సమావేశానికి హాజరు కాలేదని, ఈలోపుగానే బలగాలు ఆ సమావేశంపై దాడి నిర్వహించడంతో 8 మంది మావోలు మృతి చెందినట్లు సమాచారం. -
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. షోపియాన్ జిల్లాలోని బాటాగుంద్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాబలగాలు ఆరుగురు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ కాల్పుల్లో ఓ పోలీస్ అధికారితో పాటు పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై కశ్మీర్ రేంజ్ ఐజీ స్వయం ప్రకాశ్ పానీ మాట్లాడుతూ.. ‘షోపియాన్‌లో ఉగ్రవాదులు తిష్టవేశారన్న పక్కా సమాచారంతో భద్రతాబలగాలు శనివారం రాత్రి అనుమానిత ఇంటిని చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో బలగాల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఆదివారం ఉదయం వరకూ కొనసాగిన ఈ ఆపరేషన్‌లో ముస్తాక్ అహ్మద్ మీర్, మొహమ్మద్ అబ్బాస్ భట్, ఖలీద్ ఫరూక్ మాలిక్, ఉమర్ మజీద్, మొహమ్మద్ హమీద్‌తో పాటు పాక్‌కు చెందిన ఉగ్రవాది కఫీల్ హతమయ్యారు. పలువురు పోలీస్ అధికారులు, పౌరుల హత్యలతో పాటు భద్రతా సంస్థల కార్యాలయాలపై దాడిచేసిన ఘటనల్లో వీరంతా నిందితులుగా ఉన్నారు. ఈ ఎన్కౌంటర్లో 34 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన నజీర్ అహ్మద్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అలాగే అవంతిపోరాలో ఆదివారం జరిగిన మరో ఎన్కౌంటర్లో జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన వసీమ్‌ను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి’ అని తెలిపారు. షోపియాన్ ఎన్‌కౌం టర్లో పౌరుడు చనిపోవడంతో స్థానికులు భద్రతాబలగాలపై రాళ్లవర్షం కురిపించారు. -
కశ్మీర్లో ‘స్నైపర్’ కలకలం
శ్రీనగర్: కశ్మీర్ వ్యాలీలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు స్నైపర్ (దొంగచాటుగా) దాడులకు దిగడం భద్రతా దళాలను కలవరపరుస్తోంది. గత నెల నుంచి ఇప్పటివరకు ముగ్గురు భద్రతా సిబ్బంది స్నైపర్ దాడుల్లో మృతిచెందారు. దీంతో ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన వ్యూహాన్ని అవ లంబించాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. నిఘా అధికారుల సమాచారం మేరకు జైషే ఉగ్రవాదులు రెండు వేర్వేరు గ్రూపులను నిర్వహిస్తున్నారని నిర్ధారణకు వచ్చారు. ఈ రెండు గ్రూపుల్లో ఒక్కో దాంట్లో ఇద్దరు చొప్పున స్నైపర్లు కశ్మీర్ లోయలో సెప్టెంబర్ మొదటివారంలో ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం స్థానికుల సహాయంతో పుల్వామాలో ఆశ్రయం పొందినట్లు భావిస్తున్నారు. లోయలో స్నైపర్ దాడులు చేసేందుకు వీరంతా పాకిస్తాన్ ఐఎస్ఐ ద్వారా శిక్షణ పొం దారని, వీరి వద్ద అఫ్గానిస్తాన్‌లో యూఎస్ భద్రతా దళాలు ఉపయోగించే ఎమ్–4 కార్బైన్ ఆయుధాలున్నట్లు చెబుతున్నారు. -
బలగాలపై మావోల పంజా
చర్ల / రాయ్‌పూర్: ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో తనిఖీలకు వెళ్లివస్తున్న భద్రతా బలగాల మైన్‌ప్రూఫ్ వాహనాన్ని శక్తిమంతమైన మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ వాహనం తునాతునకలైంది. ఈ విషయమై బీజాపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ) మోహిత్ గార్గ్ మాట్లాడుతూ.. ఇక్కడి మర్దొండ క్యాంప్‌లో ఉన్న సీఆర్పీఎఫ్ 168వ బెటాలియన్‌కు చెందిన జవాన్లు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు రోడ్లు, బ్రిడ్జీల తనిఖీలకు బయలుదేరినట్లు తెలిపారు. సాయంత్రం 4 గంటల సమయంలో తిరిగివస్తుండగా బేస్క్యాంపుకు కేవలం కిలోమీటరు దూరంలో జవాన్లు ప్రయాణిస్తున్న మైన్ ప్రూఫ్ వాహనాన్ని మావోలు శక్తిమంతమైన మందుపాతరతో పేల్చేశారని వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రమాద ఘటన అనంతరం అదనపు బలగాలను రంగంలోకి దించామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ సుక్మా జిల్లాలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రోజే మావోలు రెచ్చిపోవడం గమనార్హం. 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి వచ్చే నెల 12న, 20వ తేదీన రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.