ఆగని భద్రతా దళాల భీకర పోరు
కైరో: ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో భద్రతా బలగాలు ఇస్తామిక్ తీవ్రవాదులతో భీకర పోరు సాగిస్తున్నాయి. ఉత్తర సినాయ్‌లోని రఫా పట్టణంలో సైన్యం జరిపిన దాడుల్లో 40 మంది వరకు తీవ్రవాదులు చనిపోయారు. ప్రతిగా తీవ్రవాదులు కారుబాంబులతో విరుచుకుపడ్డారు. బాంబు పేలుళ్లతో దాదాపు 26 మంది సైనికులు గాయాలై చనిపోయి ఉంటారని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. మృతుల సంఖ్యపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.
హూస్ని ముబారక్‌ను అధికార పీఠం నుంచి దించేందుకు చేపట్టిన 2011 తిరుగుబాటు నుంచి ఇక్కడ అశాంతి పెచ్చరిల్లింది.2013లో మహ్మద్ మోర్సని పదవీచ్యుతుడిని చేసినప్పటి నుంచి ఈ ప్రాంతంలో సైన్యం, పోలీసులే లక్ష్యంగా తీవ్రవాదుల దాడులు ఎక్కువయ్యాయి. దీంతో ఇక్కడ పెద్ద సంఖ్యలో సైన్యాన్ని దించారు. సైన్యం సోదాలు, దిగ్భంధాలతో తీవ్రవాదులు ఎదురు దాడులకు దిగుతున్నారు.