fierce fighting
-
Russia-Ukraine War: కీవ్ పరిసరాల్లో భీకర పోరు
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ పరిసరాల్లో గురువారం భీకర పోరు కొనసాగింది. దీంతో సైనిక కార్యకలాపాల తగ్గింపు ప్రతిపాదన ముసుగులో రష్యా తన సేనలను పునరేకీకరిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా డోన్బాస్ ప్రాంతంలో భారీగా మోహరింపులు చేస్తోందని, వీటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ ప్రకటించారు. మరోవైపు మారియుపోల్ నుంచి ప్రజలను తరలించేందుకు పలు బస్సులను ఆ నగరానికి పంపారు. నగరం నుంచి పౌర తరలింపు కోసం పరిమిత కాల్పుల విరమణకు రష్యా అంగీకరించింది. శుక్రవారం ఇరుపక్షాల మధ్య మరోదఫా ఆన్లైన్ చర్చలు జరగనున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పటికే నగరం నుంచి పలువురు వలస పోవడంతో నగర జనాభా 4.3 లక్షల నుంచి లక్షకు దిగివచ్చింది. వీరిని కూడా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 45 బస్సులను ఇక్కడికి పంపామని ఉక్రెయిన్ ఉప ప్రధాని చెప్పారు. చెర్నోబిల్ నుంచి రష్యా బలగాలు వెనుదిరిగాయని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. రష్యా వెనక్కు తగ్గలేదు ముందుగా అంగీకరించినట్లు రష్యా వెనక్కు తగ్గడం లేదని నాటో జనరల్ స్టోల్టెన్‌బర్గ్ సైతం ఆరోపించారు. బలగాల ఉపసంహరణ ముసుగులో రష్యా తన బలగాలకు సరఫరాలందించడం, కావాల్సిన ప్రాంతాల్లో మోహరించడం చేస్తోందన్నారు. ఒకపక్క డోన్బాస్‌పై దాడికి దిగుతూనే మరోపక్క కీవ్ తదితర నగరాలపై రష్యా ఒత్తిడి పెంచుతోందని నాటో ఆరోపించింది. రష్యా చాలా పరిమితంగా బలగాల తరలింపు చేపట్టిందని బ్రిటన్ కూడా ఆరోపించింది. ఉక్రెయిన్‌పై దాడికి దిగి రష్యా తప్పు చేసిందన్న యూఎస్ వ్యాఖ్యలను రష్యా తోసిపుచ్చింది. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా 1, 34, 500 మందిని సైన్యంలో చేర్చుకునే ఆదేశాలపై అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. వ్యూహాత్మక తప్పిదం ఉక్రెయిన్‌పై దాడికి దిగాలనుకోవడం పుతిన్ చేసిన వ్యూహాత్మక తప్పిదమని, దీని వల్ల రష్యా బలహీనపడిందని, ప్రపంచదేశాల మధ్య ఏకాకిగా మారిందని వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. రష్యా మిలటరీ పుతిన్‌ను తప్పుదోవ పట్టించి యుద్ధానికి దించిందని, దీనివల్ల ప్రస్తుతం పుతిన్‌కు మిలటరీ అగ్రనాయకులకు మధ్య పొరపచ్చాలు వచ్చాయని వైట్‌హౌస్ ప్రతినిధి కేట్బీడింగ్ఫీల్డ్ చెప్పారు. రష్యాపై ఆంక్షలను, ఉక్రెయిన్‌కు సాయాన్ని అమెరికా కొనసాగిస్తుందన్నారు. రష్యాలో నాయకత్వ మార్పును బైడెన్ కోరుకోలేదని చెప్పారు. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ భారత్ పర్యటనకు వచ్చారు. శుక్రవారం ఆయన ప్రధాని మోదీతో, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమవుతారు. ఎస్400 మిసైల్ వ్యవస్థలోని భాగాలతో పాటు పలు మిలటరీ హార్డ్‌వేర్‌ను సకాలంలో అందించాలని లావ్రోవ్ను భారత్ కోరనుందని సమాచారం. తొలినుంచి ఉక్రెయిన్ సంక్షోభ విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోంది. చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలకు సూచిస్తోంది. -
Israel- Palestine: మధ్య ప్రాచ్యం.. మరింత ఉద్రిక్తం
గాజా సిటీ: దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్– పాలస్తీనా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. పాలస్తీనా ఉగ్రసంస్థ హమాస్, ఇతర ఉగ్ర సంస్థల అధీనంలోని గాజా సిటీ నుంచి పాలస్తీనా మీదకు, పాలస్తీనా నుంచి గాజా సిటీ వైపునకు లెక్కకు మించిన రాకెట్లు దూసుకొస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజా స్ట్రిప్‌లోని రెండు అపార్ట్మెంట్లు కుప్పకూలాయి. సెంట్రల్ గాజాలోని అత్యంత ఎత్తయిన భవంతుల్లో చాలా వాటిని ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు బాంబులతో నేలమట్టం చేశాయి. దీంతో గాజాలో సోమవారం నుంచి ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 48కి పెరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో 14 మంది చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. గాజాలో ఓ కారుపై క్షిపణి పడటంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. మొత్తంగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 86 మంది చిన్నారులు, 39 మంది మహిళలు సహా దాదాపు 300 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా రాకెట్ల వర్షం కురిస్తామని హమాస్ కమాండర్లు ప్రకటించిన వీడియో దృశ్యాలను ఇజ్రాయెల్ టీవీ చానళ్లు ప్రత్యక్షప్రసారంచేశాయి. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ మెట్రో ప్రాంతంపై ఉగ్రవాదులు రాకెట్లతో దాడి చేశారు. హమాస్ ఉగ్రవాదులు యుద్ధ ట్యాంక్ విధ్వంసక క్షిపణిని సరిహద్దులో ప్రయోగించగా ఒక ఇజ్రాయెల్ దేశస్తుడు మరణించాడు. ఇద్దరు మహిళలు గాయపడ్డారు. మరణించిన వారు పౌరులా? సైనికులా? అనేది తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులు జరిపిన వేర్వేరు దాడుల్లో ఆరుగురు ఇజ్రాయెల్ దేశస్తులు, ఒక సైనికుడు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి మరణించారు. ఉద్రిక్తతలు మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా ఉగ్రవాదులు మా దేశం మీదకు ఏకంగా 1,050 రాకెట్లతో దాడులు చేశారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. వీటిలో 200 రాకెట్లు గురితప్పి వాళ్ల అధీనంలోని గాజా సిటీలోనే పడిపోయాయని సైన్యం పేర్కొంది. గాజా నుంచి తమ వైపు దూసుకొచ్చిన డ్రోన్‌ను నేలకూల్చామని సైన్యం తెలిపింది. సరిహద్దున ఉన్న ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్ సమీప ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయని సైన్యం పేర్కొంది. భద్రత అనేదే లేదిక్కడ ‘ మేం చూస్తుండగానే మా అపార్ట్మెంట్ పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ప్రాణం పోయినంత పనైంది. ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రాణాలు అరచేతలో పెట్టుకుని వెంటనే అపార్ట్మెంట్ మెట్లు దిగి అపార్ట్మెంట్ వాసులమంతా బయటికొచ్చాం. ఏడుపులు, భయాందోళనలతో పరిస్థితి దారుణంగా ఉంది. గాజాలో ఎక్కడా భద్రత అనేదే లేదు’ అని సమాహ్ హబౌ అనే మహిళ ఏడుస్తూ చెప్పారు. ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు సమావేశాలు నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్ణయించింది. ఉగ్రసంస్థ గాజా సిటీ కమాండర్ హతం ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్‌కు చెందిన గాజా సిటీ కమాండర్ బసీమ్ ఇసా సహా ఇంకొందరు ఉగ్రవాదులు మరణించారు. గాజాలో గత ఏడేళ్లలో సిటీ కమాండర్ స్థాయి ఉగ్రవాది మరణించడం ఇదే తొలిసారి. కాగా, పరస్పర రాకెట్ల దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడారు. ‘ మా వైపు తీవ్రమైన నష్టం జరిగితే ఊహించని స్థాయిలో దీటైన సమాధామిస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. I watched this video 6 times with tears flooded in my eyes. They’re destroying the main towers in the most vital area in #Gaza city. Now a lot of people left without homes, offices, even without the good memories they had there. pic.twitter.com/WBIZn19Q5H — Abier-Almasri (@abier_i) May 12, 2021 -
ఆగని భద్రతా దళాల భీకర పోరు
కైరో: ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో భద్రతా బలగాలు ఇస్తామిక్ తీవ్రవాదులతో భీకర పోరు సాగిస్తున్నాయి. ఉత్తర సినాయ్‌లోని రఫా పట్టణంలో సైన్యం జరిపిన దాడుల్లో 40 మంది వరకు తీవ్రవాదులు చనిపోయారు. ప్రతిగా తీవ్రవాదులు కారుబాంబులతో విరుచుకుపడ్డారు. బాంబు పేలుళ్లతో దాదాపు 26 మంది సైనికులు గాయాలై చనిపోయి ఉంటారని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. మృతుల సంఖ్యపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. హూస్ని ముబారక్‌ను అధికార పీఠం నుంచి దించేందుకు చేపట్టిన 2011 తిరుగుబాటు నుంచి ఇక్కడ అశాంతి పెచ్చరిల్లింది.2013లో మహ్మద్ మోర్సని పదవీచ్యుతుడిని చేసినప్పటి నుంచి ఈ ప్రాంతంలో సైన్యం, పోలీసులే లక్ష్యంగా తీవ్రవాదుల దాడులు ఎక్కువయ్యాయి. దీంతో ఇక్కడ పెద్ద సంఖ్యలో సైన్యాన్ని దించారు. సైన్యం సోదాలు, దిగ్భంధాలతో తీవ్రవాదులు ఎదురు దాడులకు దిగుతున్నారు. -
సిరియాలో 7,219 మంది మృత్యువాత
కైరో: అంతర్యుద్ధంతో అట్టుకుతున్న సిరియాలో నరమేధం కొనసాగుతోంది. ఒక్క ఆగస్టు నెలలోనే సిరియాలో 7,219 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 2,015 మంది పౌరులు, 281 మంది పిల్లలు, 138 మంది మహిళలు ఉన్నారని మానవ హక్కుల సంస్థ ఒకటి వెల్లడించింది. ఫ్రీ సిరియన్ ఆర్మీ(ఎఫ్ఎస్ఏ), తిరుగుబాటుదారులు, ప్రభుత్వ వ్యతిరేకదళాలను చెందిన 1,448 మంది మృతి చెందారని పేర్కొంది. షుయ్టాట్ గిరిజన తెగకు చెందిన 700 మంది కూడా మృతుల్లో ఉన్నారు. గత మూడేళ్ల నుంచి ఈ దేశంలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.