
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముష్కరులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. అనంత్‌నాగ్‌లో శనివారం(నవంబర్ 2) భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి.
ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం అక్కడ గాలింపు కొనసాగుతోంది.
కాగా, శ్రీనగర్ బుడ్గమ్‌లో శుక్రవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వలస కార్మికులు మరణించిన విషయం తెలిసిందే. ఈ వారంలో ఐదు ఉగ్రవాద సంబంధిత ఘటనలు జరగడం గమనార్హం.

ఇదీ చదవండి: రూ.15 కోసం ముక్కును తెగనరికి
Comments
Please login to add a commentAdd a comment