jammu kashimir
-
కశ్మీర్లో పేలిన మందుపాతర..ఆరుగురు జవాన్లకు గాయాలు
జమ్ము:జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు(ఎల్ఓసీ) వద్ద మంగళవారం(జనవరి14) ఉదయం భారీ పేలుడు సంభవించింది. మందుపాతర పేలిన ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. రాజౌరిలోని ఖంబా ఫోర్టు ప్రాంతంలో గోర్ఖా రైఫిల్స్‌కు చెందిన జవాన్లు రోజువారి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వారి వాహనం వద్ద మందుపాతర పేలింది.పేలుడులో గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. జవాన్లకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని, వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగానే ఉందని అధికారులు తెలిపారు. -
జమ్ముకశ్మీర్‌లో సున్నా డిగ్రీల దిగువకు ఉష్ణోగ్రతలు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరుకున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సున్నాకు దిగువగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి మరింతగా పెరవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.శ్రీనగర్‌లో గురువారం కనిష్ట ఉష్ణోగ్రత -0.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. నవంబర్ 23 వరకు కశ్మీర్లో వాతావరణం సాధారణంగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 24న వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని, లోయలోని ఎత్తయిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా తేలికపాటి మంచు కురిసే అవకాశం ఉంది. కాశ్మీర్‌లోని ఖాజిగుండ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత -2.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, పహల్గామ్లో -3.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. షోపియాన్‌లో-3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.గుల్మార్గ్లో ఉష్ణోగ్రత 0.0 డిగ్రీల సెల్సియస్, కుప్వారాలో -0.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. కోకర్నాగ్లో కనిష్ట ఉష్ణోగ్రత 0.7 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. బందిపొరలో -2.4 డిగ్రీల సెల్సియస్, బారాముల్లా -0.4 డిగ్రీల సెల్సియస్, బుద్గామ్ -2.1 డిగ్రీల సెల్సియస్, కుల్గామ్ -2.6 డిగ్రీల సెల్సియస్, లార్నులో -3.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఇది కూడా చదవండి: దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ప్రతికూలమా? -
మంచు కురిసే వేళలో.. మూడింతలైన కశ్మీర్ అందాలు
జమ్ము: జమ్ముకశ్మీర్‌లోని పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న హిమపాతం మైదాన ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీంతో మైదాన ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. కాశ్మీర్‌లోని పర్వతప్రాంతాల్లో మంచు కురిసిన అనంతరం జమ్ముకశ్మీర్‌లో విపరీతమైన చలి వాతావరణం ఏర్పడింది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. సోన్మార్గ్లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 5.3 డిగ్రీలుగా నమోదైంది.కుప్వారాలోని మచిల్ సెక్టార్లో మంచు కురవడంతో ఆ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తోంది. భారీగా పేరుకున్న హిమపాతం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. గురేజ్, తులైల్, కంజల్వాన్ సరిహద్దు ప్రాంతాలతో సహా బందిపోరా ఎగువ ప్రాంతాలలో కూడా తెల్లటి మంచు దుప్పటి అందంగా పరుచుకుంది.మైదాన ప్రాంతాల్లో కురుస్తున్న పొగమంచు ప్రభావం సిమ్లా వరకు వ్యాపించింది. పొగమంచు కారణంగా మైదాన ప్రాంతాల నుంచి రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీంతో కల్కా నుంచి సిమ్లా వెళ్లే నాలుగు రైళ్లు నాలుగు గంటలు ఆలస్యంగా నడిచాయి. దీంతో వారాంతాల్లో సిమ్లా వచ్చే పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే మూడు రోజుల పాటు మైదాన ప్రాంతాల్లో మంచుకురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీంతో రైళ్ల రాకపోకలపైనా ప్రభావం పడనుంది.హిమాచల్ ప్రదేశ్‌లో చలి తీవ్రత అధికమయ్యింది. ఆదివారం నాడు 13,050 అడుగుల ఎత్తయిన రోహ్తంగ్ పాస్‌తో సహా పలు పర్వత శిఖరాలపై భారీగా మంచు కురిసింది. లాహౌల్-స్పితి, కులులో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీంతో నదులు, వాగులు, జలపాతాలు గడ్డకడుతున్నాయి.ఇది కూడా చదవండి: కార్తీక వనసమారాధనలో గలాటా -
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌గా అబ్దుల్ రహీమ్ రాథర్
శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ తొలి సమావేశాలు నేటి(సోమవారం) నుంచి ప్రారంభమయ్యాయి. సీనియర్ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత, చరార్-ఎ-షరీఫ్ స్థానం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన అబ్దుల్ రహీమ్ రాథర్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజున ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ప్రొటెం స్పీకర్ ముబారక్ గుల్ కొత్త అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్‌కు నూతన బాధ్యతలను అప్పగిస్తూ, అభినందనలు తెలియజేశారు. 80 ఏళ్ల అబ్దుల్ రహీమ్ రాథర్ గతంలో కూడా జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో స్పీకర్ పదవిని నిర్వహించారు. 2002 నుంచి 2008 వరకు పీడీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.సోమవారం జరిగే అసెంబ్లీ తొలి సమావేశంలో స్పీకర్‌ను ఎన్నుకుంటారని అసెంబ్లీ సచివాలయం ఇంతకుముందు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా నరేంద్ర సింగ్ రైనాను బీజేపీ ఎన్నుకుంది. అదే సమయంలో ప్రతిపక్ష నేత బాధ్యతలను సునీల్ శర్మకు అప్పగించారు. అబ్దుల్ రహీమ్ రాథర్ ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇది కూడా చదవండి: అది ఫేక్ సర్వే: తాజా పోల్‌పై మండిపడ్డ ట్రంప్ -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ముష్కరులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. అనంత్‌నాగ్‌లో శనివారం(నవంబర్ 2) భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి.ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం అక్కడ గాలింపు కొనసాగుతోంది. కాగా, శ్రీనగర్ బుడ్గమ్లో శుక్రవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వలస కార్మికులు మరణించిన విషయం తెలిసిందే. ఈ వారంలో ఐదు ఉగ్రవాద సంబంధిత ఘటనలు జరగడం గమనార్హం.ఇదీ చదవండి: రూ.15 కోసం ముక్కును తెగనరికి -
పాక్ తగిన మూల్యం చెల్లించుకుంటుంది: జైశంకర్
న్యూయార్క్: జమ్ము కశ్మీర్‌పై పాకిస్తాన్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈక్రమంలో భారత్.. పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తగిన ఫలితం తప్పకుండా అనుభవిస్తుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. సరిహద్దు ఉగ్రవాదమే పాకిస్తాన్ విధానం అంటూ ఎద్దేవా చేశారు.ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ..‘కశ్మీర్ అంశంపై పాక్ ప్రధాని షరీఫ్ విచిత్రమైన వాదనలు చేశారు. పాక్ తీరుపై భారత్ వైఖరిని నేను స్పష్టం చేస్తున్నా. సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. పాక్ విధానం ఎప్పటికీ సఫలం కాదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఆ దేశం తగిన ఫలితం అనుభవించక తప్పదు. అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాన్ని పాకిస్తాన్ ఖాళీ చేయడం ఒక్కటే రెండు దేశాల మధ్య ఉన్న ఈ సమస్యకు పరిష్కారం. పాకిస్తాన్ దేశ ఆవిర్భావం నుంచి అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇందుకు ఉగ్రవాదాన్ని ఎంచుకోవడం కూడా ఒక కారణం. రాజకీయాలతో మతోన్మాదాన్ని ప్రేరిపిస్తున్న ఆ దేశంలో తీవ్రవాదం, దాని ఎగుమతుల పరంగానే జీడీపీ కొలవాలి అని స్పష్టం చేశారు.ఇక, అంతకుముందు.. ఐరాస జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగిస్తూ.. కశ్మీర్ అంశంలో అక్కసు వెళ్లగక్కారు. కశ్మీర్లో పరిస్థితిని పాలస్తీనాతో పోల్చారు. ఆర్టికల్ 370 గురించి ప్రస్తావించారు. ఆర్టికల్ రద్దు తర్వాత కశ్మీర్ ప్రజలు సైతం స్వేచ్ఛ, నిర్ణయాధికారం పోరాటం చేస్తున్నారు. భారత్ చట్ట విరుద్ధంగా చేపట్టిన చర్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఆయన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ హెచ్చరిక.. ఇరాన్ కీలక నిర్ణయం -
పుల్వామా ఉగ్రదాడి నిందితుడు గుండెపోటుతో మృతి
జమ్మూ: 2019 పుల్వామా ఉగ్రదాడి నిందితుడు జమ్ముకశ్మీర్‌లోని జమ్మూ ఆసుపత్రిలో గుండెపోటుతో మృతిచెందాడు. ఇతని వయస్సు 32 ఏళ్లు. ఈ సమాచారాన్ని ఓ అధికారి మీడియాకు తెలిపారు. 32-year-old accused in 2019 Pulwama terror attack dies of heart attack in Jammu hospital: Officials— Press Trust of India (@PTI_News) September 24, 2024 2019లో జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శ్రీనగర్-జమ్ము హైవేపై లెత్పోరా సమీపంలో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఐఈడీతో పేలుడుకు పాల్పడ్డారు. ఈ దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందగా, పలువురు గాయపడ్డారు. వీరంతా సీఆర్పీఎఫ్లోని 54 బెటాలియన్‌కు చెందినవారు. పేలుడు ధాటికి బస్సు ధ్వంసమైంది. ఈ ఆర్మీ కాన్వాయ్ జమ్ము నుంచి శ్రీనగర్‌కు వెళుతుండగా ఆ ఘటన చోటుచేసుకుంది.ఇది కూడా చదవండి: శ్రీనగర్ లాల్‌చౌక్ కోసం మామ- మేనల్లుడు పోటీ -
అసెంబ్లీ ఎన్నికలో ఉత్సాహంగా ఓటేస్తున్న కశ్మీరీలు
-
రైతులు, మహిళలకు సంక్షేమ పథకాలు
శ్రీనగర్: త్వరలో జరిగే జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సోమవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వస్తే రైతులు, మ హిళలు, యువత కోసం పలు సంక్షేమ పథకాల ను అమలు చేస్తామని ప్రకటించింది. ప్రకృతి వైపరీ త్యాలతో నష్టపోయే అన్ని రకాల పంటలకు బీమా సౌకర్యం, యాపిల్‌కు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ ) కిలోకు రూ.72 అమలు చేస్తామంది. శ్రీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్ర మంలో ఏఐసీసీ ప్రతినిధి పవన్ ఖేరా, పీసీసీ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా మేనిఫెస్టోను విడుదల చేశారు. కౌలు రైతులకు సాయంభూమిలేని, కౌలుదార్లకు ఏటా అదనంగా రూ.4 వేల ఆర్థిక సాయం. రైతులకు సాగు భూములను 99 ఏళ్లకు లీజుకివ్వడం. సాగు భూములను 100 శాతం సాగులోకి తెచ్చేందుకు జిల్లా స్థాయి సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.2,500 కోట్లతో నిధి ఏర్పాటు.నిరుద్యోగ యువతకు..జమ్మూకశ్మీర్‌లోని అర్హులైన నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,500 చొప్పున ఏడాదిపాటు అలయెన్స్. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో జాబ్ క్యాలెండర్ విడుదల. ఖాళీగా ఉన్న లక్ష ప్రభుత్వ పోస్టుల భర్తీ. పోలీసు, ఫైర్, ఫారెస్ట్ పోస్టుల భర్తీకి ప్రత్యేక రిక్రూట్మెంట్ కార్యక్రమం. నిర్మాణ రంగ పనుల్లో నిరుద్యోగ ఇంజినీర్లకు 30 శాతం ఇచ్చే పథకం పునరుద్ధరణ. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సమయంలో, పాస్‌పోర్టులు, ఇతర అవసరాల కోసం ధ్రువీకరణ పత్రాల పరిశీలన సులభతరం చేయడం.మహిళలకు నెలకు రూ.3 వేలుభారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ, ఇతర నేతలు ఇచ్చిన హామీల మేరకు మహిళా సమ్మాన్ కార్యక్రమం అమలు. ఇందులో భాగంగా కుటుంబ యజమాని అయిన మహిళకు నెలకు రూ.3 వేలు చొప్పున సాయం అందజేత. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మైనారిటీ కమిషన్ ఏర్పాటు. కశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పిస్తామంటూ గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీ అమలు. -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా పరిధిలోని ఓ మారుమూల గ్రామంలో ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం అందుతోంది. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.ఆ తర్వాత సైనికులు ప్రతీ దాడి జరిపారు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల మేరకు మెంధార్‌లోని పఠాన్ తీర్ ప్రాంతంలో పోలీసులు, సైన్యం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు భద్రతా అధికారి తెలిపారు. దాక్కున్న ఉగ్రవాదులు సెర్చ్ పార్టీపై కాల్పులు జరిపారని, దీంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని ఆయన చెప్పారు.రెండు వైపుల నుంచి అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయని, అదనపు బలగాలను ఆ ప్రాంతానికి పంపామని అధికారి తెలిపారు. బారాముల్లాలో 12 గంటలకు పైగా జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. దాదాపు 12 గంటలకు పైగా జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఇది కూడా చదవండి: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి -
అలా నిరూపిస్తే రాజీనామా చేస్తా: జమ్ము ఎల్జీ
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో గత ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానంటున్నారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కశ్మీర్ పర్యటనలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మనోజ్ ఇలా స్పందించారు.‘జమ్ము కశ్మీర్లో ప్రజల వద్ద రాహుల్ గాంధీ అభిప్రాయాలను సేకరించాలి. అప్పుడే రాహుల్‌కు మరింత అవగాహన వస్తుంది. కావాలంటే రహస్య బాలెట్ విధానంలో ప్రజాభిప్రాయాన్ని చేపట్టండి. ఇక్కడి 75 శాతం మంది ప్రజలు అభివృద్ధి జరగలేదని చెబితే నా పదవికి రాజీనామా చేస్తా’ అని అన్నారు. అలాగే.. జమ్ము కశ్మీర్లో ఎవరి ప్రభుత్వం కొలువుదీరినా వారికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతాలకు ఉండే లెఫ్టినెంట్ గవర్నర్‌కు కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎల్జీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ జమ్ము కశ్మీర్లో ఒక రాజు ఉన్నారు. ఆయనే లెఫ్టినెంట్ గవర్నర్. ఆయన జమ్ము కశ్మీర్ ప్రజల సంపదను బయటి వ్యక్తులకు తరలిస్తున్నారు’ అని అన్నారు. ఇక.. జమ్ము కశ్మీర్లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.చదవండి: ‘రాహుల్ గాంధీ.. మీకూ మీ నాన్నమ్మ గతే పడుతుంది’ -
సైన్యం కాల్పుల్లో ఉగ్రవాదులు మృతి
జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్లో దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని సోమవారం (సెప్టెంబర్ 9) సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఎన్కౌంటర్లో చనిపోయిన ఉగ్రవాదుల వద్ద నుంచి ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. నౌషేరా ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఇదే ప్రాంతంలో చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపి తప్పించుకున్నారు. ఈ ఘటన తర్వాత అప్రమత్తమైన సైన్యం ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఇదీ చదవండి.. ఘనంగా రెండో ప్రపంచ యుద్ధ వీరుడి బర్త్‌డే వేడుకలు -
‘ఆజాద్‌కు అంత సీన్ లేదు.. కశ్మీర్లో విజయం మాదే’
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల్లో గెలుపు మాది అంటే.. లేదు మాదే అంటున్నారు. ఇక, తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా ఆసక్తికర కామెంట్స్ చేశారు. జమ్ముకశ్మీర్‌లో గులాం నబీ ఆజాద్ ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్బంగా..‘గులాం నబీ ఆజాద్ ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. అలాగే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ -ఎన్సీ కలిసి మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.ఇదే సమయంలో.. ఈ ఎన్నికలు ప్రభుత్వ ఏర్పాటు గురించి మాత్రమే కాదన్న ఆయన.. రాష్ట్రహోదా, అసెంబ్లీ అధికారాల పునరుద్ధరణ కోసమేనని తెలిపారు. అలాగే, సీఎం పదవి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకే దక్కుతుందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఎన్నికల వేళ ఇలాంటి ఊహాగానాలు సరికాదన్నారు. అయితే, కశ్మీర్లో త్వరలో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
జమ్ము కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు.. ఈసీ షెడ్యూల్ విడుదల
సాక్షి, ఢిల్లీ: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. హర్యానా, జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఆ వివరాలను మీడియాకు తెలియజేశారు. ఆర్టికల్-370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్ము కశ్మీర్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 110 అసెంబ్లీ స్థానాలకు మూడు విడుతల్లో పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ ఒకటో తేదీన మూడు విడతల్లో జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు.👉ఒకటో విడత సెప్టెంబర్ 18(24 స్థానాలు)👉రెండో విడత సెప్టెంబర్ 25(26 స్థానాలు)👉మూడో విడత అక్టోబర్ 1(40స్థానాలు)అక్టోబర్ నాలుగో తేదీన జమ్ము కశ్మీర్ ఎన్నికల కౌంటింగ్.ఇక హర్యానాలో ఒకే విడతలతో ఎన్నికలు జరగనున్నట్లు సీఈసీ ప్రకటించారు. హర్యానాలో 90 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు. అక్టోబర్ ఒకటో తేదీన ఎన్నికలు, నాలుగో తేదీన ఎన్నికల కౌంటింగ్ Assembly poll in J&K will be held in three phases, with voting on Sep 18, Sep 25, and Oct 1Counting of votes on October 4 pic.twitter.com/XXvtq4ReEU— ANI (@ANI) August 16, 2024 #WATCH | Assembly Elections in Haryana: Chief Election Commissioner Rajiv Kumar says, "Assembly Elections will be held in one phase; voting on October 1. Counting of votes will take place on October 4" pic.twitter.com/U22qhG3uoR— ANI (@ANI) August 16, 2024 -
రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు
సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్నికల కమిషన్(ఈసీ) శుక్రవారం(ఆగస్టు 16) మళ్లీ ఎన్నికల నగారా మోగించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్(ఈసీ) మీడియా సమావేశంలో ప్రకటించనుంది. హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించనుంది. కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత జమ్ముకు అసెంబ్లీకి తొలిసారి జరిగే ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. -
ఎల్ఓసీలోకి చొరబాటుదారులు.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
గత కొంతకాలంగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జమ్ములోని పాలన్‌వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన భద్రతా దళాలు కాల్పులు జరిపాయి.భద్రతా దళాలకు నలుగురు చొరబాటుదారుల కదలిక కనిపించింది. దీంతో బలగాలు రాత్రిపూట లైట్లతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. డ్రోన్ల ద్వారా నిఘాను కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో అడవులు, కొండలు ఉండడంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించేందుకు భద్రతా సిబ్బంది ఇబ్బందులను ఎదుర్కొంటోంది.ఆర్టికల్ 370 రద్దుకు అయిదవ వార్షికోత్సవం దృష్ట్యా, ఖౌడ్, జ్యోడియన్ ప్రాంతాల్లో సైన్యం, పోలీసులు ఇప్పటికే నిఘాను కట్టుదిట్టం చేశారు. ఈ ప్రాంతంలోని చెక్‌పోస్టుల వద్ద భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచారు ఆ ప్రాంతానికి వచ్చిపోయే ప్రతి వ్యక్తిని తనిఖీ చేస్తున్నారు.మరోవైపు సరిహద్దు భద్రతా దళం తాజాగా ఒక పాక్ చొరబాటుదారుడి మృతదేహాన్ని పాక్ రేంజర్స్‌కు అప్పగించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడిని పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ముహమ్మద్ అఫియల్‌గా గుర్తించారు. అతని మృతదేహాన్ని సుచేత్‌గఢ్ సెక్టార్‌లోని ఆక్ట్రాయ్ పోస్ట్‌లో పాకిస్తాన్ రేంజర్స్‌కు అప్పగించారు. -
‘బీజేపీతో పొత్తుపై పునరాలోచించండి’.. సీఎం నితీష్‌కు పార్టీ నేత విజ్ఞప్తి
శ్రీనగర్: బీజేపీకి సొంతంగా మెజార్టీ దక్కకపోవటంతో మిత్రపక్షం సహకారంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఎన్డీయే కూటమిలో బిహార్ సీఎం నితీష్‌కుమార్ జేడీయూ పార్టీ కీలకంగా వ్యవహారించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జమ్ము కశ్మీర్ రాష్ట్ర జేడీ(యూ) జనరల్ సెక్రటరీ వివేక్ బాలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కూటమిలో భాగస్వామిగా జేడీ(యూ) పార్టీ ఉండటంపై పునరాలోచించాలని ఆ పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు.‘‘జమ్ము కశ్మీర్ బీజేపీ నేతలు చేస్తున్నట్లు చర్యలు కారణంగా మా పార్టీ చీఫ్ నితీష్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉండటంపై పునరాలోచించాలని కోరుతున్నాం. మేము ఇస్లామిక్ స్కాలర్లను తిరిగి సమాజంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. వారు దేశ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తారు. అందుకే వారిని మేము వదిలిపెట్టాలని అనుకోవటం లేదు. అయితే మా ప్రయత్నాలను మాత్రం బీజేపీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది’’ అని వివేక్ బాలి తెలిపారు. ఇక.. లోక్ సభఎన్నికల్లో బిహార్‌లో సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీ (యూ) 12 స్థానాల్లో విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ దాటని బీజేపీ.. మిత్రపక్షాల సాయంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఎన్డీయే కూటమిలో సీఎం నితీష్ కుమార్ కీలకంగా మారారు. -
కశ్మీర్లో ఉగ్ర ఘాతుకం: ప్రధాని మోదీ సహా ఖండించిన నేతలు.. 10కి చేరిన మృతుల సంఖ్య
శ్రీనగర్: జమ్ము-కశ్మీర్ రియాసి జిల్లాలో ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం పోలీసులు, భద్రతా బలగాలు ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నాయి. ఈ ఉగ్రదాడి వెనక ఇద్దరు పాకిస్తానీయులు ఉన్నట్లు భద్రతా దళాలు సోమవారం గుర్తించాయి. నిందితుల కోసం పోలీసులు, ఇండియన్ ఆర్మీ , సీఆర్పీఎఫ్ జాయింట్ ఆపరేషన్ ఏర్పాటు చేశారు. రాజౌరి, పూంచ్, రియాసిలోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొండ ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్లతో ఉగ్రవాదులను గాలిస్తున్నారు. జమ్ము-కశ్మీర్ రియాసి జిల్లాలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. జమ్ములోని రాయసి జిల్లాలో ఉన్న శివఖోడి గుహను సందర్శించుకొని తిగిగి వస్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు ఒక్కసారిగా విచక్షణా రహితంగా కాల్పులు తెగపడ్డారు. ఆదివారం సాయంత్రం 6.10 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనలో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. 53 మంది యాత్రికులు ఉన్న బస్సు శివ్ ఖోరి నుంచి కాట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయం వైళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో డ్రైవర్ గాయపడటంతో బస్సు పదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.#WATCH | Security heightened in Jammu & Kashmir's Reasi.Morning visuals from the area where a bus carrying pilgrims was attacked by terrorists led to the loss of 10 lives. pic.twitter.com/9i93KKbhzc— ANI (@ANI) June 10, 2024 రాజౌరి, పూంచ్, రియాసి ప్రాంతాల్లో దాగి ఉన్న ఉగ్రవాదులపై వేట కోసం పోలీసులు, ఇండియన్ ఆర్మీ , సీఆర్పీఎఫ్ జాయింట్ ఆపరేషన్ ఏర్పాటు చేశారు. యాత్రికులపై ఉగ్రవాదుల దాడిన జమ్మూకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ‘ఎక్స్’ వేదికగా తీవ్రంగా ఖండిచారు.‘ప్రధాని మోదీ దాడి ఘటపై స్పందించారు. ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షించాలన్నారు. బాధితులు, వారి కుటుంబాలకు సాయం అందిచాలని మోదీ ఆదేశించారు. ఈ దాడికి పాల్పడినవారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం. గాయపడినవారికి మెడికల్ సాయం అందించాలని ప్రధాని మోదీ ఆదేశించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. మృతి చెందిన వారికి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా’ అని అన్నారు.దాడిపై స్పందించిన రాష్ట్రపతి‘జమ్ము కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటన నన్ను కలచివేసింది. ఈ ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు, బాధితులకు నా సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్‌లో స్పందించారు.I am anguished by the terrorist attack on a bus carrying pilgrims in Reasi district of Jammu and Kashmir. This dastardly act is a crime against humanity, and must be condemned in the strongest words. The nation stands with the families of the victims. I pray for the speedy…— President of India (@rashtrapatibhvn) June 9, 2024 కేంద్రమంత్రి అమిత్ షా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ‘జమ్ము కశ్మీర్ ఎల్జీ, డీజీపీ ద్వారా ఉగ్రదాడి పరిస్థితిని తెలుసుకున్నా. ఈ దాడికి పాల్పడినవారిని వదిపెట్టము. వారిపై కచ్చింతంగా చర్యలు తీసుకుంటాం. మృతిచెందినవారి కుటుంబాలుకు సానుభూతి తెలుపుతున్నా’అని అమిత్ షా ‘ఎక్స్’లో పేర్కొన్నారు.ఉగ్రవాద దాడి పరికిపంద చర్య అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండిచారు. ‘చాలా విషాదకరమైన ఘటన. ఈ దాడితో జమ్ము కశ్మీర్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయే తెలస్తోంది’అని ఎక్స్‌లో స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్రంగా ఖండిచారు.जम्मू-कश्मीर के रियासी ज़िले में, शिवखोड़ी मंदिर से तीर्थयात्रियों को ले जा रही बस पर हुआ कायरतापूर्ण आतंकी हमला अत्यंत दुखद है।यह शर्मनाक घटना जम्मू-कश्मीर के चिंताजनक सुरक्षा हालातों की असली तस्वीर है।मैं सभी शोक संतप्त परिजनों को अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं और…— Rahul Gandhi (@RahulGandhi) June 9, 2024యాత్రికుల బస్సుపై ఉగ్రవాదలు దాడి చేయటం ఇది రెండోసారి. 2017లో అమర్నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 7 మంది మృతి చెందగా.. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
జమ్మూ కాశ్మీర్‌పై ప్రధాని కీలక ప్రకటన
ఉదంపూర్: జమ్మూకాశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా వస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయం దూరంలో లేదన్నారు. జమ్మూకాశ్మీర్ ఉదంపూర్‌లో శుక్రవారం(ఏప్రిల్12) లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని పాల్గొన్నారు. ‘మోదీ చాలా దూరం ఆలోచిస్తాడు. ఈ పదేళ్లలో జరిగింది ట్రైలర్ మాత్రమే. జమ్మూకాశ్మీర్‌లో అద్భుతమైన సినిమా ముందు ముందు చూపించే పనిలో నేను బిజీ అవ్వాల్సి ఉంది. మీ కలలు మీరు త్వరలో మీ ఎమ్మెల్యేలతో, మంత్రులతో చెప్పుకుని నెరవేర్చుకునే రోజు దగ్గర్లోనే ఉంది’అని ప్రధాని అన్నారు. ఇదీ చదవండి.. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన.. మంత్రి సంచలన కామెంట్స్ -
తండ్రి యూనిఫాంలోనే విధుల్లోకి లెఫ్టినెంట్ ఇనాయత్
దేశం కోసం ప్రాణాలర్పించిన తండ్రి మిలిటరీ యూనిఫాం ధరించి విధుల్లో చేరారు లెఫ్టినెంట్ ఇనాయత్ నాట్స్. సుమారు 20 ఏళ్ల క్రితం జమ్మూకశ్మీర్‌లో అసువులు బాసిన తన తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తాననే సంకేతా లందించడం విశేషంగా నిలిచింది. కేవలం మూడేళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయిన ఇనాయత్ తండ్రిపై ప్రేమను, అంతకుమించిన దేశభక్తిని చాటుకున్న క్షణాలు ఉద్వేగాన్ని నింపాయి. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందిన తర్వాత మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగంలో లెఫ్టినెంట్‌గా ఆమె నియమితులయ్యారు. ఈ సందర్భంగా జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆమె తన తండ్రి యూనిఫాం ధరించి అక్కడున్న వారందరినీ ఆశ్యర్యపరిచారు. ఆర్మీ డాటర్ లెఫ్టెనెంట్ ఇనాయత్ వాట్స్కు స్వాగతమంటూ ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది. తండ్రి యూనిఫారం ధరించిన వాట్స్ చిత్రాన్ని పోస్ట్ చేసింది. తల్లి శివాని వాట్స్ కూడా ఆమె పక్కన నిలబడి ఉండడాన్ని ఈ ఫోటోలో చూడవచ్చు. “𝐀𝐥𝐥 𝐟𝐨𝐫 𝐒𝐮𝐩𝐫𝐞𝐦𝐞 𝐒𝐚𝐜𝐫𝐢𝐟𝐢𝐜𝐞 𝐨𝐟 𝐡𝐞𝐫 𝐟𝐚𝐭𝐡𝐞𝐫”#OTAChennai #PassingOutParade Inayat was barely three years, when she lost her father Major Navneet Vats in a counter insurgency operation. More than two decades later, she gets commissioned into… pic.twitter.com/AiIBUpfc1J — Army Training Command, Indian Army (@artrac_ia) March 9, 2024 కాగా ఛండిగఢ్కు చెందిన నవ్‌నీత్ వాట్స్ 3 గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్‌లోని 4వ బెటాలియన్‌లో విధులు నిర్వర్తించే వారు. 2003, నవంబర్‌లో శ్రీనగర్‌లో ఆర్మీ చేపట్టిన ఉగ్రవాద ఏరివేత చర్యల్లో నవ్‌నీత్ అమరుడయ్యారు. ఈ సమయంలో అత్యున్నత ధైర్యసాహసాలను ప్రదర్శించిన మేజర్ నవ్‌నీత్ వాట్స్కు కేంద్రం శౌర్య పురస్కారాన్ని ప్రకటించింది. ఇనాయత్ వాట్స్ ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2023 ఏప్రిల్‌లో ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో చేరారు. -
నా నెక్ట్స్ మిషన్ ‘వెడ్డింగ్ ఇన్ ఇండియా’: ప్రధాని మోదీ
శ్రీనగర్: ఆర్టికల్ 370ను రద్దు చేసిన తర్వాత.. శ్రీనగర్‌లో ఇవాళ తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. బక్షి స్టేడియం వేదికగా ‘వికసిత్ భారత్ వికసిత్ జమ్మూకశ్మీర్’ కార్యక్రమంలో రూ.6,400 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. అద్భుతమైన శ్రీనర్ ప్రజల తాను ఒకడిగా ఉన్నందుకు సంతోషంగా ఉందని, వారి మనసులు గెలుచుకునేందుకు తాను శ్రీనగర్ వచ్చినట్లు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి పెరిగిందని తెలిపారు. 2023లో కశ్మీర్లో 2 కోట్ల మంది పర్యటించారని పేర్కొన్నారు. తన నెక్ట్స్ మిషన్ ‘వెడ్డింగ్ ఇన్ ఇండియా’ అని.. వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్‌గా జమ్మూకశ్మీర్‌ను తయారు చేయబోతున్నామన్నారు. #WATCH | Srinagar, J&K: Prime Minister Narendra Modi says "J&K has been a huge victim of 'Parivarvad' and corruption. The previous governments here had left no stone unturned to destroy our J&K Bank, by filling the bank with their relatives and nephews, these 'Parivarvadis' have… pic.twitter.com/6PJVAlcI3Y — ANI (@ANI) March 7, 2024 ప్రపంచ నలుమూలల నుంచి సెలబ్రిటీలు జమ్మూకశ్మీర్‌కు తరలివస్తున్నారన్నారు ప్రధాని మోదీ. జమ్మూకశ్మీర్ విజయగాథ ప్రపంచాన్ని ఆకర్షిస్తోందని చెప్పారు. కశ్మీర్ సరస్సుల్లో ఎక్కడ చూసిన కమలం పూలు కన్పిస్తాయని..50 ఏళ్ల క్రితం ఏర్పడిన జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లోగో కూడా కమలమేనని తెలిపారు. బీజేపీ సింబల్ కూడా కమలమేనని అన్నారు. #WATCH | Srinagar, J&K: Prime Minister Narendra Modi says "This freedom from restrictions has come after the removal of Article 370. For decades, for political gains, Congress and its allies misled the people of Jammu and Kashmir in the name of 370 and misled the country. Did J&K… pic.twitter.com/SKMmjHxgvT — ANI (@ANI) March 7, 2024 ఆర్టికల్ 370పై కాంగ్రెస్, దాని భాగస్వామ్య పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించాయని మండిపడ్డారు మోదీ. ఆర్టికల్ 370తో జమ్మూక్మర్ ఏం లాంభం జరిగిందని ప్రశ్నించారు. కేవలం రాజకీయ కుటుంబాలే 370తో లబ్ది పొందాయని విమర్శించారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ యువత కొత్త అవకాశాలు అందుకుంటున్నారని, అందరికీ సమాన అవకాశాలు, హక్కులు లభిస్తున్నాయని తెలిపారు. #WATCH | Prime Minister Narendra Modi launches and dedicates to the nation 53 projects worth Rs 6,400 crores at Srinagar's Bakshi Stadium. pic.twitter.com/5Mfe2kRdGw — ANI (@ANI) March 7, 2024 -
‘బీజేపీకి ఒమర్ అబ్దుల్లా సవాల్.. ఎన్నికలు నిర్వహించండి’
ముంబై: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ జమ్ము కశ్మీర్లో అభివృద్ధి, శాంతి స్థాపనకు కృషి చేశామని చెప్పుకోవటాన్ని తప్పుపట్టారు. ముంబైలో 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' సమ్మిట్‌లో ఒమర్ అబ్దుల్లా పాల్గొని మట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘంతో కాకుండా సుప్రీం కోర్టుతో జమ్ము కశ్మీర్ ఎన్నికల నిర్వహిస్తామని చెప్పించటం బీజేపీకి సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. తమ పార్టీ జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘2019 తర్వాత ఐదేళ్లు గడుస్తోంది. ఇప్పటికీ జమ్ము కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించకపోవటం సిగ్గుచేటు. 2024లో జమ్ము కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలి. మేము బీజేపీతో పోరాడుతాం. జమ్ము కశ్మీర్ ప్రజలు హక్కులు, భూములు, 2019లో దెబ్బతిన్న కశ్మీర్‌ను మరల యథాస్థానానికి తీసుకురావటానికి పోరాడుతాం’ అని అన్నారు. ‘ఈ ప్రభుత్వం సామాన్య ప్రజలకు చేరువలో లేదు. మేము 2014 నుంచి ఎన్నికలు చూడలేదు. 2019 తర్వాత కశ్మీర్ ప్రజల్లో శాంతి స్థాపన జరిగే మరి ఎందుకు ఎన్నికలు నిర్వహించరు?. 2024లో ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేస్తున్నా’ అని ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. ఇక.. ఇప్పటికే ఇండియా కూటమిలో పొత్తులేకుండా తమ జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ లోక్‌సభ ఎన్నికలో ఒంటరిగా పోటీ చేస్తుందని ఫరూక్ అబ్దుల్లా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ సీట్ల కేటాయింపుల విషయంలో 3-3 ఫార్ములతో నేషనల్ కాన్ఫరెన్స్‌తో ఒప్పించేందుకు కసరత్తు చేస్తోంది. -
కశ్మీర్లో సీట్ల సర్దుబాటు: ఒమర్ అబ్దుల్లాతో చర్చించనున్న కాంగ్రెస్
లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమితో పొత్తు లేకుండా తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఇటీవల జమ్మూకశ్మీర్‌కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ.. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి మూడు స్థానాల్లో పోటీకి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ 3-3 సీట్ల పంపకం ఫార్మూలాను ప్రతిపాదించింది. అయితే ఈ విషయంపై ఈరోజు (శుక్రవారం) నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రతిపాదనకు నేషనల్ కాన్ఫరెన్స్ అంగీకరిస్తే.. మెహబూబా ముఫ్తికి చెందిన పీడీపీ పార్టీకి పొత్తులో చోటు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. పీడీపీ కూడా ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షం కావటం గమనార్హం. అయితే ఫిబ్రవరి 15న ఫరూక్ అబ్దుల్లా తాము లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రకటన అనంతరం.. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మాత్రం తమ పార్టీ ఇండియా కూటమితో పొత్తుకు కట్టుబడి ఉందని తెలిపారు. జమ్మూలో రెండు, లడఖ్‌లో ఒక స్థానంలో తమ పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పారు. ఇక మరోవైపు పీడీపీ ఇండియా కూటమి నుంచి వైదొలిగి తన పార్టీ కూడా ఒంటరిగా బరిలోకి దిగుతుందని వార్తలు వచ్చాయి. వాటిపై ఆమె స్పందిస్తూ.. తాను ఇండియా కూటమితోనే ఉంటానని స్పష్టం చేశారు. -
జేకేలోనూ ‘ఇండియా’ కూటమికి ఎదురు దెబ్బ!
జమ్ముకశ్మీర్‌లో ‘ఇండియా’ కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) తర్వాత ఇప్పుడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) కూడా లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించింది. పార్టీ పార్లమెంటరీ కమిటీ త్వరలో అభ్యర్థుల పేర్లను ప్రకటించనుందని సమాచారం. గతంలోనే ఎన్సీ తాము లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి చర్చించేందుకు సెంట్రల్ కశ్మీర్లో జరిగిన పీడీపీ సమావేశంలో పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమైందని, త్వరలో రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నామన్నారు. మహ్మద్ సర్తాజ్ మదానీ నేతృత్వంలోని పార్టీ పార్లమెంటరీ బోర్డు త్వరలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మెహబూబ్ బేగ్, గులాం నబీ లోన్ హంజురా తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఎన్సీకి ప్రస్తుతమున్న సీట్లు మినహా మిగిలిన స్థానాల్లో పొత్తును గురించి పరిశీలిస్తామని ప్రకటించారు. అయితే ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. -
తెహ్రీక్-ఎ-హురియత్‌పై కేంద్రం నిషేధం
జమ్మూ కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో ముస్లిం సంస్థ తెహ్రీక్-ఎ-హురియత్‌పై కేంద్రం నిషేధం విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం(ఊపా) కింద చట్టవిరుద్ధమైన సంస్థగా తెహ్రీక్-ఎ-హురియత్ని కేంద్రం ప్రకటించింది. కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ గతంలో ఈ సంస్థకు నేతృత్వం వహించారు. జమ్మూ కశ్మీర్‌ను భారత్ నుంచి విడదీసి ఇస్లామిక్ పాలనను నెలకొల్పేందుకు ఈ సంస్థ నిషేధిత కార్యకలాపాలకు పాల్పడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాదానికి ఆజ్యం పోసేందుకు భారత వ్యతిరేక విధానాన్ని ప్రచారం చేస్తూ ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తుందని గుర్తించినట్లు అమిత్ షా స్పష్టం చేశారు. "ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పీఎం నరేంద్ర మోదీ ప్రభుత్వం జీరో టాలరెన్స్ పాలసీని పాటిస్తోంది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఏ వ్యక్తి లేదా సంస్థనైనా అడ్డుకుంటాం " అని అమిత్ షా ఎక్స్‌లో పోస్టు చేశారు. దేశవ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలలో పాల్గొన్నందుకు జమ్మూ కశ్మీర్లో ముస్లిం లీగ్‌ను కేంద్రం ఇప్పటికే నిషేధించింది. కశ్మీర్లో ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి ప్రజలను ప్రేరేపిస్తోందని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిణామాల తర్వాత తెహ్రీక్-ఎ-హురియత్ సంస్థపై నిషేధం పడింది. ఇదీ చదవండి: కొత్త ఏడాది తొలిరోజే ఇస్రో కీలక ప్రయోగం.. వాటిపైనే అధ్యయనం