2003లో మేజర్ నవ్‌నీత్ వాట్స్ శ్రీనగర్‌లో కన్నుమూత
ఆర్మీలో లెఫ్టినెంట్‌గా చేరిన నవ్‌నీత్ కుమార్తె ఇనాయత్
దేశం కోసం ప్రాణాలర్పించిన తండ్రి మిలిటరీ యూనిఫాం ధరించి విధుల్లో చేరారు లెఫ్టినెంట్ ఇనాయత్ నాట్స్. సుమారు 20 ఏళ్ల క్రితం జమ్మూకశ్మీర్‌లో అసువులు బాసిన తన తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తాననే సంకేతా లందించడం విశేషంగా నిలిచింది. కేవలం మూడేళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయిన ఇనాయత్ తండ్రిపై ప్రేమను, అంతకుమించిన దేశభక్తిని చాటుకున్న క్షణాలు ఉద్వేగాన్ని నింపాయి.
చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందిన తర్వాత మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగంలో లెఫ్టినెంట్‌గా ఆమె నియమితులయ్యారు. ఈ సందర్భంగా జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆమె తన తండ్రి యూనిఫాం ధరించి అక్కడున్న వారందరినీ ఆశ్యర్యపరిచారు. ఆర్మీ డాటర్ లెఫ్టెనెంట్ ఇనాయత్ వాట్స్‌కు స్వాగతమంటూ ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది. తండ్రి యూనిఫారం ధరించిన వాట్స్ చిత్రాన్ని పోస్ట్ చేసింది. తల్లి శివాని వాట్స్ కూడా ఆమె పక్కన నిలబడి ఉండడాన్ని ఈ ఫోటోలో చూడవచ్చు.
“𝐀𝐥𝐥 𝐟𝐨𝐫 𝐒𝐮𝐩𝐫𝐞𝐦𝐞 𝐒𝐚𝐜𝐫𝐢𝐟𝐢𝐜𝐞 𝐨𝐟 𝐡𝐞𝐫 𝐟𝐚𝐭𝐡𝐞𝐫”#OTAChennai #PassingOutParade
— Army Training Command, Indian Army (@artrac_ia) March 9, 2024
Inayat was barely three years, when she lost her father Major Navneet Vats in a counter insurgency operation.
More than two decades later, she gets commissioned into… pic.twitter.com/AiIBUpfc1J
కాగా ఛండిగఢ్‌కు చెందిన నవ్‌నీత్ వాట్స్ 3 గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్‌లోని 4వ బెటాలియన్‌లో విధులు నిర్వర్తించే వారు. 2003, నవంబర్‌లో శ్రీనగర్‌లో ఆర్మీ చేపట్టిన ఉగ్రవాద ఏరివేత చర్యల్లో నవ్‌నీత్ అమరుడయ్యారు. ఈ సమయంలో అత్యున్నత ధైర్యసాహసాలను ప్రదర్శించిన మేజర్ నవ్‌నీత్ వాట్స్‌కు కేంద్రం శౌర్య పురస్కారాన్ని ప్రకటించింది. ఇనాయత్ వాట్స్ ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2023 ఏప్రిల్‌లో ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment