uniform
-
ప్యారిస్ ఒలింపిక్స్ : మంగోలియన్ల యూనిఫాం హాట్ టాపిక్
జూలై 26 నుండి ప్రారంభం కానున్న ప్యారిస్ ఒలింపిక్స్-2024 వేడుకల కోసం టీం మంగోలియా తన స్టయిల్‌తో ప్రపంచాన్ని మెస్మరైజ్ చేసింది. సంస్కృతి, ఫ్యాషన్ కలగలిసిన యూనిఫాంతో అందర్నీ అబ్బురపర్చింది. అలాగే ఈ యూనిఫాంలోని ఇతర హైలైట్లను చూసి క్రీడా ఫ్యాన్స్, నెటిజన్లు శభాష్ మంగోలియా అంటున్నారు. ఉలాన్బాతర్కు చెందిన ఫ్యాషన్ లేబుల్ మిచెల్ అండ్ అమెజాన్కా ఈ దుస్తులను రూపొందించారు. మంగోలియాకు సొంతమైన క్లిష్టమైన ఎంబ్రాయిడరీ, తదితర మంగోలియన్ మూలాంశాలు, ఆ దేశ జెండాలోని “సోయోంబో” చిహ్నం , జాతీయ రంగులైన నీలం, ఎరుపు బంగారు రంగుల మేళవింపుతో వీటిని తయారు చేశారు. అలాగే ఈ ప్యారిస్ ఒలింపిక్ వేడుకలకు గుర్తుగా ఈఫిల్ టవర్ ఒలింపిక్ క్రీడా జ్యోతి మరింత హైలైట్‌గా నిలిచాయి.మంగోలియన్లు ధరించే సంప్రదాయ గౌనుకు డిజైనర్లు 'డీల్' అనే సొగసైన టచ్ ఇచ్చారు. ప్రారంభ వేడుకలో కాంటెంజెంట్ కవాతులో పాల్గొనే మంగోలియన్ క్రీడాకారులు ధరించే దుస్తులు, ఫ్లాగ్ జెండా బేరర్ల దుస్తులకు భిన్నంగా ఉంటాయి. ఇది స్టేడియం లోపల కాకుండా సెయిన్ నది వద్ద నిర్వహించనున్నారు. మంగోలియన్ అథ్లెట్లు గత రెండు ఒలింపిక్స్ క్రీడల సందర్భంగా మిచెల్ అండ్ అమెజాన్కా రూపొందించిన దుస్తులను ధరించడం గమనార్హం. View this post on Instagram A post shared by Michel&Amazonka (@michelamazonka)ప్రతి అథ్లెట్ బాడీ కొలతలను తీసుకుని 3 నెలలకు పైగా సమయం పట్టిందని డిజైనర్లు వెల్లడించారు. ఒక్కో సెట్ రూపొందించడానికి 6 దశల్లో సగటున 20 గంటలు పట్టిందని డిజైనర్లు చెప్పారు.కాగా 1964 గేమ్స్ నుండి, లాస్ ఏంజిల్స్ 1984 మినహా ప్రతి వేసవి ఒలింపిక్స్‌లో మంగోలియా పాల్గొంటూ వస్తోంది. ప్రస్తుతం క్రీడా సమరంలో మంగోలియన్ బృందంలో 30 మందికిపైగా అథ్లెట్లు ఉన్నారు. 2008లో బీజింగ్ గేమ్స్‌లో జూడో , బాక్సింగ్ క్రీడలో బంగారు పతకాలను గెల్చుకున్నమంగోలియన్లు ఈసారి మరిన్ని బంగారు పతకాలను గెల్చుకోవాలని ఆశిస్తున్నారు. నాలుగేళ్లకోసారి జరిగే 33వ ఎడిషన్ 2024 వేసవి ఒలింపిక్స్ జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో జరగబోతున్నాయి. 200 పైగా దేశాలు తమ అథ్లెట్లను 32 బరిలోకి దింపనున్నాయి. -
జీన్స్, టీషర్ట్స్ వేసుకు రావొద్దు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అధికారులు, వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించి విధులకు హాజరు కావొద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ సంస్థ ఎండీ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. ఇక నుంచి విధుల్లో ఆ తరహా వస్త్రధారణ కూడదంటూ ఆదేశాలు జారీ చేశారు.డ్రైవర్లు, కండక్టర్లకు ’ఖాకీ’.. మిగిలిన వాళ్లు ఇష్టమొచ్చినట్టుగా!ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ డ్రెస్‌లో కనిపిస్తారు.. బస్టాపులు, బస్టాండ్లలో ఉండే సూపర్వైజర్లు తెల్లరంగు దుస్తుల్లో ఉంటారు.. కానీ, డిపోలు, ఇతర ఆర్టీసీ కార్యాలయాల్లో ఉండే అధికారులకు యూనిఫాం అంటూ లేదు. డ్రెస్ కోడ్ కూడా లేకపోవటంతో ఇంతకాలం క్యాజువల్ వస్త్రధారణ తో విధులకు హాజరవుతున్నారు. దీన్ని పెద్దగా పట్టించుకునేవారు లేకపోవటంతో, రంగురంగుల డ్రెస్సులు, జీన్స్ ప్యాంట్లు, టీ షర్డులు ధరించి వస్తున్నారు.కొందరు ఉన్నతాధికారులు కూడా ఈ తరహా వస్త్రధారణతో విధుల్లో కనిపిస్తున్నారు. తాజాగా దీన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. ఇటీవల ఆయన తరచూ అధికారులతో గూగుల్ సమావేశాలు నిర్వహిస్తు న్నారు. కొన్ని సందర్భాల్లో డిపో స్థాయి సిబ్బందితో కూడా ఆన్లైన్ సమావేశాల్లో ముచ్చటిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఉన్నతాధికారులు మొదలు డిపో స్థాయి సిబ్బంది వరకు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టుల్లో కనిపిస్తున్నారు. ఇది ఆయనకు చికాకు తెప్పించింది.ఫార్మల్ డ్రెస్సుల్లోనే రావాలని ఆదేశాలుదేశంలోనే పేరున్న రవాణా సంస్థలో ఇలా ఇష్టం వచ్చిన వస్త్రధారణతో అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొనటాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదే విషయాన్ని ఆయన ఈడీ ‘అడ్మిన్) దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు తాజాగా ఈడీ (అడ్మిన్) లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. సంస్థకు ఉన్న పేరు, డిపో కార్యాలయాల గౌరవానికి వారి డ్రెస్సింగ్ భంగంగా ఉందంటూ ఆయన అందులో అభిప్రాయపడ్డారు. ఇక నుంచి గౌరవప్రదంగా ఉండే ఫార్మల్ డ్రెస్సుల్లోనే అధికారులు విధుల్లో కనిపించాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆయా అధికారుల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు.యూనిఫాంలో కనిపించని స్పష్టతఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ యూనిఫాంలో కనిపిస్తారు. కొన్ని బస్సుల్లో నీలి రంగు యూనిఫాం ఉంటోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించింది. ఆర్టీసీలో అతిపెద్ద సమ్మె విరమణ తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో సిబ్బంది యూనిఫాంపై ప్రస్తావించారు. మహిళా కండక్టర్లకు యాప్రాన్ అందజేస్తామని చెప్పి.. ఆ యాప్రాన్ ఏ రంగులో ఉండాలో నిర్ధారించేందుకు ఓ కమిటీ వేశారు.రెండు మూడు సమావేశాలు నిర్వహించిన తర్వాత, మెరూన్ రంగులో ఉండే యాప్రాన్‌ను సిఫారసు చేశారు. ఆ మేరకు ఓ ప్రముఖ కంపెనీకి వస్త్రం కొనుగోలు ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ యాప్రాన్ కూడా కనిపించటం లేదు. డ్రైవర్లు, కండక్టర్లకు యూనిఫాం కూడా కొన్నేళ్లపాటు సరఫరా కాలేదు. వారికి ఖాకీ బదులు మరో రంగు ఇవ్వాలన్న అంశం కూడా తెరమరుగైంది. -
బడులు తెరిచే నాటికి అందుబాటులోకి..
ఆదిలాబాద్: రానున్న విద్యా సంవత్సరంలో బడులు తెరిచే నాటికే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు యూనిఫాం అందించే దిశగా జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. యూనిఫాం కుట్టే బాధ్యతలను స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పగించింది. ఆసక్తి, వృత్తి నైపుణ్యాలు కలిగిన సభ్యులను ఇప్పటికే ఎంపిక చేసింది. ప్రస్తుతం విద్యార్థుల కొలతలను సేకరిస్తున్నారు. విద్యాశాఖ నుంచి వస్త్రం కొనుగోలు చేసి ఇచ్చిన వెంటనే దుస్తులు కుట్టే పనిని ప్రారంభించనున్నారు. అయితే కుట్టు కూలిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వక పోవడం వారిని కొంత ఆందోళనకు గురి చేస్తోంది. యునిఫామ్లంతా వేసవిలోనే కుట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే జూన్లొనే విద్యార్థులకు కొత్త దుస్తులు అందనున్నాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో మొత్తం 1,200 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 84,097 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో బాలురు 42,082 మంది, బాలికలు 42,015 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం ఏటా రెండు జతల యూనిఫాంలను ఉచితంగా అందజేస్తుంది. ఇదివరకు వీటిని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఆధ్వర్యంలో కుట్టించి విద్యార్థులకు అందించే వారు. పాఠశాల ప్రారంభమై నెలలు గడిచినా చాలా మందికి అందేవి కావు. పైగా గుత్తేదారు విద్యార్థుల కొలతలు తీసుకోకుండా కుట్టడంతో సైజ్ సరిపోక ఇబ్బందిగా మరేది. ఇలాంటి పరిస్థితిని దూరం చేయడంతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ బాధ్యతలను ఎస్ హెచ్జీలకు అప్పగించింది. ఇందుకోసం అర్హులైన ఆసక్తి గల సభ్యులను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కసరత్తు షురూ.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. కుట్టు నైపుణ్యాలతో పాటు మిషన్ కలిగి ఉన్న 1,807 మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులను ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు సంబంధించిన కొలతలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పాఠశాల, తరగతుల వారీగా కొలతలు తీసుకుంటున్నారు. వారంలోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి వాటిని ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అందించనున్నారు. అవసరమైన వస్త్రం అందిన వెంటనే వేసవి సెలవుల్లో యూనిఫాం కుట్టే ప్రక్రియను ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వస్త్రం రాగానే ఐకేపీ వారికి ఇస్తాం 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంలను కుట్టించే బాధ్యత స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఐకేపీ సిబ్బంది విద్యార్థుల కొలతలు తీసుకుంటున్నారు. ఆప్కో నుంచి వస్త్రం వచ్చిన వెంటనే వారికి అప్పగిస్తాం. వారు కుట్టించి విద్యార్థులకు అందిస్తారు. – సుజాత్‌ఖాన్, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి -
తండ్రి యూనిఫాంలోనే విధుల్లోకి లెఫ్టినెంట్ ఇనాయత్
దేశం కోసం ప్రాణాలర్పించిన తండ్రి మిలిటరీ యూనిఫాం ధరించి విధుల్లో చేరారు లెఫ్టినెంట్ ఇనాయత్ నాట్స్. సుమారు 20 ఏళ్ల క్రితం జమ్మూకశ్మీర్‌లో అసువులు బాసిన తన తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తాననే సంకేతా లందించడం విశేషంగా నిలిచింది. కేవలం మూడేళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయిన ఇనాయత్ తండ్రిపై ప్రేమను, అంతకుమించిన దేశభక్తిని చాటుకున్న క్షణాలు ఉద్వేగాన్ని నింపాయి. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందిన తర్వాత మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగంలో లెఫ్టినెంట్‌గా ఆమె నియమితులయ్యారు. ఈ సందర్భంగా జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆమె తన తండ్రి యూనిఫాం ధరించి అక్కడున్న వారందరినీ ఆశ్యర్యపరిచారు. ఆర్మీ డాటర్ లెఫ్టెనెంట్ ఇనాయత్ వాట్స్కు స్వాగతమంటూ ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది. తండ్రి యూనిఫారం ధరించిన వాట్స్ చిత్రాన్ని పోస్ట్ చేసింది. తల్లి శివాని వాట్స్ కూడా ఆమె పక్కన నిలబడి ఉండడాన్ని ఈ ఫోటోలో చూడవచ్చు. “𝐀𝐥𝐥 𝐟𝐨𝐫 𝐒𝐮𝐩𝐫𝐞𝐦𝐞 𝐒𝐚𝐜𝐫𝐢𝐟𝐢𝐜𝐞 𝐨𝐟 𝐡𝐞𝐫 𝐟𝐚𝐭𝐡𝐞𝐫”#OTAChennai #PassingOutParade Inayat was barely three years, when she lost her father Major Navneet Vats in a counter insurgency operation. More than two decades later, she gets commissioned into… pic.twitter.com/AiIBUpfc1J — Army Training Command, Indian Army (@artrac_ia) March 9, 2024 కాగా ఛండిగఢ్కు చెందిన నవ్‌నీత్ వాట్స్ 3 గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్‌లోని 4వ బెటాలియన్‌లో విధులు నిర్వర్తించే వారు. 2003, నవంబర్‌లో శ్రీనగర్‌లో ఆర్మీ చేపట్టిన ఉగ్రవాద ఏరివేత చర్యల్లో నవ్‌నీత్ అమరుడయ్యారు. ఈ సమయంలో అత్యున్నత ధైర్యసాహసాలను ప్రదర్శించిన మేజర్ నవ్‌నీత్ వాట్స్కు కేంద్రం శౌర్య పురస్కారాన్ని ప్రకటించింది. ఇనాయత్ వాట్స్ ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2023 ఏప్రిల్‌లో ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో చేరారు. -
మరో రెండేళ్ల వయోపరిమితి పెంపు
సాక్షి, హైదరాబాద్: డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా వివిధ యూనిఫామ్ సర్వీసులకు గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని యూనిఫామ్ సర్వీసులకు సంబంధించి రాబోయే రిక్రూట్మెంట్లకు ఇది వర్తించనుంది. యూనిఫామ్ సర్వీసుల పరిధిలోకి వచ్చే వివిధ సర్వీసులు, కేటగిరీల పోస్టులు.. పోలీస్, అగ్నిమాపక, జైళ్లశాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్), ఎక్సైజ్, రవాణా, అటవీశాఖ ఉద్యోగాలకు ఐదేళ్ల గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో నిరుద్యోగుల నుంచి పెద్దసంఖ్యలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందడంతో మరింత మంది నిరుద్యోగ యువతకు అర్హత కల్పించే ఉద్దేశంతో యూనిఫామ్ సర్వీసెస్‌కు కూడా గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర గెజిట్‌లో ఈనెల 8న నోటిఫికేషన్‌ను పబ్లిష్ చేశారు. 8న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా ఉత్తర్వులు జారీచేశారు. గతంలో జారీచేసిన ఉత్వర్వుల్లో యూనిఫామ్ సర్వీసులకు గరిష్ట వయోపరిమితిని పెంచకపోవడం గమనార్హం. -
కల్నల్ మన్‌ప్రీత్‌కు సైనిక దుస్తుల్లో చిన్నారుల కడసారి వీడ్కోలు..
చండీగఢ్: కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. దేశం కోసం వీరమరణం పొందిన ఆ సైనికుని ఇంటిముందు గ్రామవాసులంతా కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ మధ్య రెండు పసి హృదయాల అమాయకపు సెల్యూట్లు గుండె బరువెక్కేలా చేశాయి. అక్కడ ఏం జరుగుతుందో కూడా సరిగా తెలియని ఆ సైనికుని ఇద్దరు పిల్లలు జై హింద్ అంటూ కడసారి వీడ్కోలు పలికారు. జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్ భౌతికకాయం స్వగ్రామం పంజాబ్‌లోని మల్లాన్‌పూర్‌కు చేరింది. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులను ఆపడం ఎవరితరం కాలేదు. గుండెలు పగిలేలా ఏడుస్తున్న కుటుంబ సభ్యుల రోదనలు చూసి గ్రామస్థులంతా కన్నీరు పెట్టుకున్నారు. మన్‌ప్రీత్ ఆరేళ్ల కుమారుడు ఆర్మీ దుస్తులు ధరించి జై హింద్ నాన్న అంటూ చివరిసారి సెల్యూట్ చేశాడు. మన్‌ప్రీత్ రెండేళ్ల కూతురు కూడా అన్నను అనుకరించింది. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ భార్య, సోదరి, తల్లి, ఇతర కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. #WATCH | Son of Col. Manpreet Singh salutes before the mortal remains of his father who laid down his life in the service of the nation during an anti-terror operation in J&K's Anantnag on 13th September The last rites of Col. Manpreet Singh will take place in Mullanpur… pic.twitter.com/LpPOJCggI2 — ANI (@ANI) September 15, 2023 కల్నల్ మన్‌ప్రీత్ సింగ్(41).. 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతుండగా.. అనంతనాగ్ జిల్లాలో బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో మన్‌ప్రీత్ ప్రాణాలు కోల్పోయారు. ఈయనతో పాటు మేజర్ ఆశిష్ ధోంచక్, జమ్మూ కశ్మీర్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమయూన్ వీరమరణం పొందారు. మేజర్ ఆశిష్ ధోంచక్ మృతహానికి కూడా పానిపట్‌లోని స్వగ్రామంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న 33 ఏళ్ల హిమాయున్ ముజామిల్ భట్ అంత్యక్రియలకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పోలీసు చీఫ్ దిల్బాగ్ సింగ్ నివాళులర్పించారు. ఇదీ చదవండి: Nuh Violence: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. ఇంటర్నెట్ బంద్.. -
యూనిఫామ్ వేసుకొని పాఠాలు చెప్పే పంతులమ్మ.. ఫుల్ అటెండెన్స్
రాయ్‌పూర్‌లో ఒక టీచర్ పిల్లల్ని వినూత్నంగా ఆకట్టుకుంటోంది. వారానికి ఒకసారి వారిలాగే యూనిఫామ్ ధరించి స్కూల్‌కు వస్తోంది. ‘నేనూ మీలో ఒకదాన్నే’ అనే భావన కలిగించడమే కాదు... టీచర్ అంటే కొట్టే తిట్టే మనిషి కాదనే భరోసా ఇస్తోంది. దీంతో పిల్లలు ఫుల్లుగా స్కూల్‌కు అటెండ్ అవుతున్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి ఆమె చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం అందరి ప్రశంసలు పొదుతోంది. రాయ్‌పూర్ (చత్తిస్గఢ్)లోని గోకుల్‌రామ్ వర్మ ప్రైమరీ స్కూల్ అనే ప్రభుత్వబడిలో వారమంతా పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. శనివారం ఇంకా ఉత్సాహంగా ఉంటారు. దానికి కారణం ఆ రోజు ఆ స్కూల్ టీచర్ జాహ్నవి యదు వారిలాగే తయారయ్యి వారిలాగే యూనిఫామ్ వేసుకుని వస్తుంది. ఆ రోజు కుర్చీలో కూచోదు. వారి మధ్య కూచుని పాఠాలు, కబుర్లు చెబుతుంది. వారితో సంభాషిస్తుంది. అందుకే పిల్లలందరికీ జాహ్నవి యదు టీచర్ అంటే ఇష్టం. కొత్త ఆలోచన గోకుల్ రామ్ వర్మ ప్రైమరీ స్కూల్లో 1 నుంచి 5 వరకూ చదివే 350 మంది పిల్లలు ఉన్నారు. వారంతా ఆ చుట్టుపక్కల బస్తీవాసుల పిల్లలు. వారి తల్లిదండ్రులకు పెద్దగా చదువు లేదు. పిల్లలకు క్రమశిక్షణ అంటే తెలియదు. స్కూల్‌కు రోజూ రావడం ఇష్టం ఉండదు. యూనిఫామ్ వేసుకోరు. గత సంవత్సరం ఇదే బడిలో టీచర్‌గా చేరిన 30 ఏళ్ల జాహ్నవి యదు ఇదంతా గమనించింది. వారితో తిప్పలు పడింది. దారిలో పెట్టలేక సతమతమయ్యింది. ఈ సంవత్సరం అంటే 2023 జూన్‌లో స్కూల్ రీ ఓపెన్ అయినప్పుడు జాహ్నవి యదు కొత్త ఆలోచన చేసింది. హఠాత్తుగా ఒకరోజు వారిలాగా యూనిఫామ్ వేసుకుని వచ్చింది. పిల్లలు ఆశ్చర్యపోయారు. గుమిగూడారు. నవ్వారు. ఆనందించారు. ‘ఎందుకు టీచర్ ఇలా వేసుకొచ్చావ్’ అనంటే ‘స్కూల్‌కి మీరు ఇలాగే రావాలి. అందుకని వేసుకొచ్చా. మనందరం ఒక టీమ్. మనందరం సూపర్‌గా చదువుకోవాలి’ అని వారిని ‘మనం’ చేశాక వాళ్లు సంతోషించారు. టీచర్లా యూనిఫామ్ వేసుకురావాలని వారికీ అనిపించింది. టీచర్ కోసం రోజూ స్కూల్‌కి రావాలని కూడా. అన్నీ ప్రశంసలే జాహ్నవి యదు వారానికి ఒకరోజు అంటే ప్రతి శనివారం స్కూల్ యూనిఫామ్‌లో రావడం రాయ్‌పూర్ అంతా పెద్ద వార్త అయ్యింది. జాహ్నవి యదు చర్య వల్ల పిల్లలు బెరుకు లేకుండా తమ మనసుల్లో ఉన్నది చెప్పుకుంటున్నారని స్కూల్ అనేది టీచర్లు చావబాదే స్థలం కాదని తెలుసుకుని క్లాసులకు హాజరవుతున్నారని ఊరు మొత్తం తెలిసింది. అందరూ జాహ్నవి యదును అభినందిస్తున్నారు. ‘టీచర్లూ పిల్లలూ బడిలో సమానమే అనే భావన వ్యాప్తి చేయడమే నా ఉద్దేశం’ అని జాహ్నవి యదు చెప్పింది. అయితే ఇలాంటి బట్టల్లో రావడానికి ఆమె కొంచెం ఆలోచించింది– అత్తామామలు ఏమంటారోనని. కాని వారు అంగీకరించి దూసుకుపో కోడలు పిల్లా అని ఉత్సాహపరిచారు. దాంతో జాహ్నవి యదు పిల్లలతో ఆడిపాడుతున్నట్టుగా కనిపిస్తూ వారికి పాఠాలు చెబుతూ దారిలో పెడుతోంది. ఫేవరెట్ టీచర్ కొందరు టీచర్లు తమ కెరీర్ మొత్తం ఏ క్లాస్‌కీ ఫేవరెట్ టీచర్ కాకుండానే రిటైర్ అయిపోతారు. కొందరు టీచర్లు ప్రతి సంవత్సరం ఎంతోమంది పిల్లలకు ఫేవరెట్ టీచర్ అవుతారు. పిల్లలతో బంధం వేసుకోవడం టీచర్‌కు చాలా ముఖ్యం. అందులో ఎంతో ఆత్మతృప్తి ఉంటుంది. ఇప్పుడు స్కూల్ మొత్తానికి ఫేవరెట్ టీచర్ అయిన జాహ్నవి యదుని చూసి తాము కూడా పిల్లల కోసం ఏదైనా చేద్దామా అనుకుంటున్నారు మిగిలిన టీచర్లు. అది చాలదూ? టీచర్లూ, పిల్లలూ బడిలో సమానమే అనే భావన వ్యాప్తి చేయడమే నా ఉద్దేశం. – జాహ్నవి యదు -
సర్కారుబడులు.. కార్పొరేట్ హంగులు
పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, యూనిఫామ్‌లు జిల్లాలో 6నుంచి 10వ తరగతి విద్యార్థులకు 2.57 లక్షలు నోట్‌పుస్తకాలు కేటాయించారు. జిల్లాకు 50వేలు నోట్ పుస్తకాలు చేరడంతో బెల్లంపల్లి ప్రభుత్వ పాఠశాల, దండేపల్లి మండలం మామిడిపల్లి, కోటపల్లి మండలం పారిపల్లి పాఠశాలల్లో విద్యార్థులకు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. 4,32,243 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా ఇప్పటివరకు 2,81,160 పుస్తకాలు చేరాయి. జిల్లాలో 50,032 మంది వి ద్యార్థులకు అవసరమైన 2,32,750 మీటర్ల ముడి వస్త్రం చేరింది. ఇందులో 80శాతం మేర యూనిఫామ్‌లు పూర్తయిన వాటిని విద్యార్థులకు అందించనున్నారు. 149 ప్రాథమిక, మూడు ప్రాథమికోన్నత పాఠశాలల్లో లైబ్రరీలు ఏర్పాటు కానున్నాయి. మంచిర్యాలఅర్బన్: మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా సర్కారు బడుల్లో కార్పొరేట్ తరహాలో ఆధునిక అందుబాటులోకి వస్తున్నాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాదినో త్సవాన్ని పురస్కరించుకుని అన్ని హంగులతో తీర్చి దిద్దిన 12పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఇ ప్పటికే 35 పాఠశాలల్లో 18 మొదలయ్యాయి. రెండు జతల యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు అందించనున్నారు. తెలంగాణ సేట్ టెక్నోలా జికల్ సర్వీసెస్ సాయంతో ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్ బోధన అమలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఐఎఫ్ ఎస్(ఇంటరాక్టివ్ ఫ్లాట్ స్క్రీన్) టీవీల ద్వారా ఆన్లైన్, ఆఫ్‌లైన్ బోధనకు ఏర్పాట్లు చేశారు. విద్యాది నోత్సవం సందర్భంగా విద్యార్థుల ర్యాలీలు, తల్లి దండ్రులను ఉద్దేశించి ఉత్తరాల పంపిణీ, గ్రామాల్లో వీధి నాటకాలు, జాతీయ జెండా ఆవిష్కరణ, పదేళ్లలోపు పురోగతిపై ప్రసంగం, తెలంగాణలో పాఠశాల విద్య, విజన్ కార్యకలాపాలపై వివరిస్తారు. పాఠశాలలకు సేవలందించిన ముగ్గురు దాతలను సన్మానిస్తారు. 10మంది హెచ్ఎంలు, 15 మంది ఉపాధ్యాయులు, ఐదుగురు ఎస్ఎంసీ చైర్మన్, ఐదుగురు పేరెంట్స్, 12 మంది 10 జీపీఏ సాధించిన విద్యార్థులను సత్కరిస్తారు. జిల్లాలో ఇలా.. మన ఊరు–మనబడిలో 248 పాఠశాలలు ఎంపిక చేశారు. ఇందులో 31 బడులను అన్ని హంగులతో తీర్చిదిద్దగా మరో 12 మంగళవారం ఎమ్మెల్యేలు, అధికారులు ప్రారంభించనున్నారు. మందమర్రి(దీపక్‌నగర్), జైపూర్ మండలం దోరగాపల్లి, పవనూర్(హరిజనవాడ), కోటపల్లి మండలం మల్లంపేట్, పారిపల్లి హైస్కూల్, దండేపల్లి పీఎస్, ఉన్నత పాఠశాలలు, బెల్లంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎంపీపీఎస్ నీల్వాయి, కుశ్నపల్లి, కాసిపేట మండలం సోనాపూర్, మంచిర్యాల పట్టణంలోని న్యూగర్మిళ్ల పాఠశాలలు లాంఛనంగా ప్రారంభిస్తారు. -
జగనన్న విద్యాకానుకలో విద్యార్థికి మూడు జతల యూనిఫామ్
-
మరింత ఆకర్షణీయంగా యూనిఫామ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సర్కారు బడి పిల్లలు అన్ని అంశాల్లోను కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులతో సమానంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తోంది. ఇందులో భాగంగా.. బడికి వచ్చే పిల్లలకు నాణ్యమైన స్కూలు బ్యాగు, సాక్సులు, బూట్లు, బెల్టుతో పాటు ఆకట్టుకునే యూనిఫామ్‌ను సైతం అందిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ 2023–24 విద్యా సంవత్సరానికి మరింత మెరుగైన, ఆకర్షణీయమైన రంగుల్లో యూనిఫామ్ ఇవ్వనుంది. ఒక్కో విద్యార్థికి మూడు జతల చొప్పున 39,95,992 మంది విద్యార్థులకు యూనిఫామ్ క్లాత్‌ను జగనన్న విద్యా కానుకలో భాగంగా ప్రభుత్వం అందిస్తోంది. గతంలో ఇచ్చిన క్లాత్ సరిపోలేదని పలుచోట్ల నుంచి ఫిర్యాదులు అందడంతో ఈసారి యూనిఫామ్ కొలతలను పెంచారు. బాలికలకు ముదురు లావెండర్ రంగులో గౌను, లావెండర్ రంగులో చెక్స్‌తో టాప్.. బాలురకు ముదురు నీలంపై నల్ల రంగు చెక్స్ చొక్కా, డార్క్ మిడ్నైట్ బ్లూ రంగులో ఫ్యాంటు/నిక్కర్ ఉండనున్నాయి. అలాగే.. ♦ చొక్కా–నిక్కర్, గౌను, ప్యాంటు, చుడిదార్.. ఇలా బాలురు, బాలికలకు రెండు రంగుల్లో యూనిఫామ్ ఇస్తున్నప్పటికీ తరగతులను బట్టి డిజైన్‌ను ఎంపికచేశారు. ♦ ఒకటి నుంచి 7వ తరగతి వరకు బాలురకు హాఫ్ చేతుల చొక్కా, నిక్కర్.. 8 నుంచి 10వ తరగతి వరకు హాఫ్ చేతుల చొక్కా ఫుల్ ప్యాంట్ ధరించాలి. ♦ బాలికల విషయంలో.. ఒకటి, రెండు తరగతులకు హాఫ్ హ్యాండ్స్ చొక్కా, గౌను.. 3, 4, 5 తరగతులకు హాఫ్ హ్యాండ్స్ చొక్కా, స్కర్టు.. ఆరు నుంచి 10వ తరగతి బాలికలు చున్నీతో చుడిదార్ యూనిఫామ్‌గా నిర్ణయించారు. ♦ ఆయా తరగతులను అనుసరించి ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి 1.25 మీటర్ల నుంచి 3.30 మీటర్ల ప్యాంట్ క్లాత్.. 1.80 మీ. నుంచి 3.30 మీ. చొక్కా క్లాత్ అందిస్తున్నారు. ♦ బాలికలకు 3.60 మీ. నుంచి 3.80 మీ. గౌను/చుడిదార్ బాటమ్.. 2.10 మీ. నుంచి 4.20 మీ. చొక్కా/చుడిదార్ టాప్ క్లాత్ ఇస్తున్నారు. ♦ గత ఏడాది పంపిణీ చేసిన యూనిఫామ్ క్లాత్ సరిపోలేదని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈసారి విద్యార్థులందరికీ ఇచ్చే క్లాత్‌ను 23–60 శాతం అదనంగా అందిస్తున్నారు. యూనిఫామ్ కుట్టించి.. పరిశీలించి.. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి బాల బాలికలకు వేర్వేరు కొలతల్లో క్లాత్ ఇస్తున్నారు. ఇచ్చిన క్లాత్‌లో మూడు జతలు వస్తాయా.. రావా? అని ఒకటికి రెండుసార్లు అధికారులు పరిశీలించారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు బాలబాలికలను ఎంపిక చేసి, వారి కొలతలను తీసుకున్నారు. తరగతుల వారీగా ఇచ్చిన క్లాత్‌తో మూడు జతల యూనిఫారాలు రావడంతో సంతృప్తి చెందిన అనంతరం క్లాత్‌ను విద్యా కానుక కిట్‌లో అందిస్తున్నారు. -
ఆ ప్రాంతంలో పోలీసులకు ఎర్రని టోపీలు... కారణం ఇదే!
దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పోలీసుల యూనిఫారం విభిన్నంగా ఉండటాన్ని మనం గమనించే ఉంటాం. అయితే చాలా రాష్ట్రాల్లో పోలీసుల యూనిఫారం ఖాకీ రంగులోనే ఉంటుంది. అయితే ఆ రాష్ట్రంలోని పోలీసుల యూనిఫారం మరింత విభిన్నంగా ఉంటుంది. అక్కడి పోలీసులు తలపై ఎర్రని రంగు టోపీ ధరిస్తారు. ఇటువంటి టోపీని ఏ రాష్ట్రంలోనూ ధరించరు. ఈ టోపీ తయారీ కూడా ఇతర టోపీల కన్నా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ తరహాలోని టోపీని పెట్టుకున్న పోలీసులను ఎంత దూరం నుంచి అయినా ఇట్టే గుర్తించవచ్చు. అయితే అక్కడి పోలీసులు ఎర్రని టోపీని ఎందుకు ధరిస్తారు? ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్రప్రాంతమైన పుదుచ్చేరికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మన దేశానికి స్వాతంత్ర్యం లభించిన చాలా ఏళ్ల తరువాత పుదుచ్చేరికి స్వాతంత్య్రం లభించింది. తరువాత అది భారత్‌లో భాగమయ్యింది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించగా, పుదుచ్చేరి మాత్రం ఫ్రాన్స్ ఆధీనంలోనే ఉంది. అక్కడ ఫ్రాన్స్ న్యాయవ్యవస్థనే కొనసాగింది. అయితే 1954లో పుదుచ్చేరి భారత్‌లో విలీనమయ్యింది. అప్పటి నుంచి అక్కడ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అలాగే కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. దీని తరువాత పుదుచ్చేరిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే పోలీసులు ధరించే ఎరుపు రంగు టోపీ విషయంలో ఎటువంటి మార్పు రాలేదు. ఫ్రాన్స్ పోలీసులు ఎరుపురంగు టోపీని ధరిస్తారు. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. ఇక్కడి పోలీసులు ఎరుపురంగు టోపీ ధరించడానికి ఇదే ప్రధాన కారణం. అయితే ఎరుపు రంగు టోపీని ఇక్కడి పోలీసు విభాగంలోని ఉన్నతాధికారులు ధరించరు. కేవలం కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు మాత్రమే వీటిని ధరిస్తారు. అయితే వీరి టోపీలలో ఎంతో భిన్నత్వం కనిపిస్తుంది. కానిస్టేబుల్ ధరించే టోపీపై నలుపు రంగు గీత కనిపిస్తుంది. హెడ్‌కానిస్టేబుల్ టోపీపై పసుపు రంగు గీతలు కనిపిస్తాయి. చదవండి: వరుని మెడలో దండ వేసే సమయంలో షాకిచ్చిన వధువు -
జగనన్న విద్యాకానుక కిట్టు.. విద్యార్థులు అదిరేట్టు
రాప్తాడురూరల్: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ విద్యకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. నాడు–నేడు కార్యక్రమంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలకు లక్షలాది రూపాయలు వెచ్చించి మౌలిక వసతులు కల్పించారు. కొత్త భవనాలు, మరుగుదొడ్లు, తరగతి గదులు, పెయింటింగ్, ఫర్నీచర్ ఇలా ఒకసారి పరిశీలిస్తే కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులకు పైసా భారం పడకుండా 9 రకాల వస్తువులతో కూడిన ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను 1–10 తరగతుల విద్యార్థులకు అందజేస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, ఆక్స్ఫర్డ్, పిక్టోరియల్ డిక్షనరీలు, బ్యాగు, మూడు జతల యూనిఫాం, షూ, బెల్ట్ కిట్‌లో ఉంటాయి. ఇప్పటికే మూడేళ్లు కిట్లను ఇచ్చారు. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి నాల్గో విడత కిట్లను అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 1–10 తరగతుల విద్యార్థులు 2,22,212 మంది ఉన్నారు. వీరికోసం రూ. 36.66 కోట్లు ఖర్చు చేసి కిట్లు అందజేస్తున్నారు. కార్పొరేట్ విద్యార్థుల్లా.. ప్రభుత్వ విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులు ఎలాగైతే యూనిఫాం, షూ, బెల్ట్ ధరించి వెళతారో మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అదే తరహాలో వారికి ఏమాత్రం తీసిపోని విధంగా పాఠశాలలకు వెళ్తున్నారు. డ్రెస్ కోడ్‌తో పాటు ప్రతి విద్యార్థీ షూ వేసుకుంటున్నారు. ఈసారి యూ‘న్యూ’ఫాం విద్యార్థుల యూనిఫాం ఈసారి రంగు మారింది. గతంలో బాలికలకు పింక్, బ్లూ కాంబినేషన్, బాలురకు లైట్ స్కై, థిక్ బ్లూ కాంబినేషన్లో యూనిఫాం ఇచ్చేవారు. గతంలో ప్లెయిన్లో ఉండే యూనిఫాం ఈసారి బాలికలకు మాత్రం చెక్స్ కల్గినవి ఇస్తున్నారు. బ్యాగులు గతంలో ముందువైపు స్కై బ్లూ, వెనుక వైపు నేవీబ్లూ కలరు ఉండేది. ఈసారి యూనిఫాం, బ్యాగులు రంగులు మారాయి. కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగించే తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపాలంటే ఆర్థిక ఇబ్బందులతో గతంలో వెనుకడుగు వేసేవారు. ఒకవేళ పంపినా ఆ తర్వాత నోట్ పుస్తకాలు, ఇతర సామగ్రి కొనుగోలుకు అరకొర ఖర్చు కూడా భరించలేక చాలామంది డ్రాపౌట్స్‌గా మారేవారు. అయితే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. విద్యార్థులకు పుస్తకాలే కాదు... జగనన్న విద్యాకానుక రూపంలో రూ. 1,650 విలువైన సామగ్రి ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పటికే మూడేళ్లు కిట్లు అందజేసిన ప్రభుత్వం.. నాలుగో సారి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేదు ప్రభుత్వ పాఠశాలల పిల్లల యూనిఫాం, షూ క్వాలిటీని ఒక ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించి ఇవ్వడం అనేది దేశంలో ఎక్కడా లేదు. కార్పొరేట్ తరహా డ్రెస్‌కోడ్‌తో తమ పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారనే ఆనందం తల్లిదండ్రుల్లో ఉంది. జగనన్న విద్యా కిట్లు చాలా నాణ్యతగా ఉంటున్నాయి. ప్రభుత్వం పిల్లల చదువు విషయంలో రాజీలేకుండా ఖర్చు చేస్తోంది. - ఎం.సాయిరామ్, ఏపీఓ, సమగ్ర శిక్ష -
పెట్ బాటిళ్లతో దుస్తులు.. శ్రీకారం చుట్టిన ఐవోసీ
బెంగళూరు: చమురు రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాడి పడేసిన పెట్ బాటిళ్లను ఏటా రీసైకిల్ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ద్వారా పర్యావరణ అనుకూల వస్త్రాలను తయారు చేస్తారు. ఇందుకు ప్రతి సంవత్సరం 10 కోట్ల బాటిళ్లను రీసైకిల్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. పెట్రోల్ పంపులు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీల సిబ్బందికి ఈ వస్త్రంతో అన్బాటిల్డ్ పేరుతో యూనిఫాం తయారు చేస్తారు. సౌర శక్తితో సైతం పనిచేసే వంటింటి స్టవ్‌లను ఐవోసీ రూపొందించింది. సూర్యుడు లేని సమయంలో ఎల్పీజీ, పైప్డ్ గ్యాస్‌తో స్టవ్ పనిచేస్తుంది. అన్బాటిల్డ్ యూనిఫాం, స్టవ్‌ను ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సమీప భవిష్యత్తులో 3 కోట్ల గృహాలకు ఈ స్టవ్‌లు చేరతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్బాటిల్డ్ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్దది అని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. చమురు విక్రయ కంపెనీల్లో ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఇతర సంస్థలు, రిటైల్ విక్రయాల కోసం యూనిఫాంలు తయారు చేస్తామన్నారు. యుద్ధానికి కాకుండా ఇతర సమయాల్లో వేసుకునేలా సాయుధ దళాల కోసం దుస్తులు సైతం రూపొందిస్తారు. -
యూనిఫామ్ ఉందని మరిచారా సార్! మహిళతో ఎస్సై డ్యాన్స్ వీడియో వైరల్
న్యూఢిల్లీ: డ్యూటీలో ఉన్న సమయంలో రీల్స్, డ్యాన్సులు చేస్తూ వైరల్‌గా మారిన ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సస్పెండ్ అయిన సంఘటనలు చాలానే జరిగాయి. అయినప్పటికీ కొందరిలో ఎలాంటి మార్పు రావటం లేదు. తాము డ్యూటీలో ఉన్నామని, యూనిఫామ్‌లో ఉన్నామనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఇలాగే ఓ పోలీసు అధికారి మైమరిచిపోయి మహిళతో చిందులేశారు. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో చిక్కుల్లో పడ్డారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఆ పోలీసు అధికారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు సమాచారం. నైరుతి ఢిల్లీలోని నారాయణ పోలీస్ స్టేషన్ ఇంఛార్జిగా శ్రీనివాస్ విధులు నిర్వర్తిస్తున్నారు. బంధువుల ఇంట్లో నిశ్చితార్థం వేడుకలకు పోలీసు యూనిఫామ్‌లోనే హాజరయ్యారు. ఈ క్రమంలో తమ బంధువైన ఓ మహిళతో ‘బలామ్ థనేందర్- నా ప్రేమికుడు పోలీసు’ అనే పాటకు కాలు కదిపారు. మహిళతో పాటు మైమరిచిపోయి డ్యాన్స్ చేశారు. మరోవైపు.. కొందరు పోలీసు సిబ్బంది ఆయనపై నోట్ల వర్షం కురిపించారు. అక్కడున్న వారంతా ఈ దృశ్యాలను తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. అయితే.. పోలీసు అధికారి సెలవులో ఉన్నారని సమాచారం. వీడియో వైరల్‌గా మారిన క్రమంలో పోలీసు అధికారిపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. పోలీసు యూనిఫామ్‌లో డ్యాన్సులు చేయటమేంటని ప్రశ్నిస్తున్నారు. స్టేషన్ ఇంఛార్జి తీరుపై ఉన్నతాధికారులు సైతం అసహనంతో ఉన్నారనే సమాచారం. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Video Of Delhi Cop's Dance In Uniform Goes Viral, He May Face Action https://t.co/WonuFuamws pic.twitter.com/vji8qdvtkT — NDTV (@ndtv) December 20, 2022 ఇదీ చదవండి: ‘శునకం’ వ్యాఖ్యలపై దద్దరిల్లిన రాజ్యసభ.. క్షమాపణలకు ఖర్గే ససేమిరా -
పోలీసునంటూ నిరుద్యోగులకు టోకరా! భారీగా వసూళ్లు
గుంతకల్లు: ఖాకీ యూనిఫాం ధరిస్తాడు. బుల్లెట్ బండిపై సవారీ చేస్తాడు. శ్రీసత్యసాయి జిల్లాలో ఓ ఉన్నతాధికారి వద్ద ఏఆర్ కానిస్టేబుల్‌నంటూ అందరినీ నమ్మించాడు. ఉన్నతాధికారులతో తనకు పరిచయాలు ఉన్నాయంటూ మభ్యపెట్టాడు. పోలీస్, ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి భారీగా వసూలు చేశాడు. చివరకు మోసం బట్టబయలై పోలీసులకు దొరికిపోయాడు. ఇదీ అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని కథలవీధిలో నివాసముంటున్న పృథ్వి బాగోతం. ఇతను పృథ్వి, చింటూ, హర్షారెడ్డి తదితర పేర్లతో నిరుద్యోగ యువతతో పరిచయం పెంచుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ ఉన్నతాధికారి వద్ద కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నానంటూ బిల్డప్ ఇచ్చాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఇతని మాటలు నమ్మి గుంతకల్లు పట్టణంలో హెర్బల్ ప్రొడక్ట్స్ అమ్ముకునే ఓ మహిళ ఏకంగా రూ.17 లక్షల దాకా ఇచ్చినట్లు తెలిసింది. అలాగే ఎస్ఎల్వీ థియేటర్ సమీపంలోని ఓ కూల్ డ్రింక్ షాపు యజమాని రూ.8 లక్షలు, తిమ్మాపురం గ్రామానికి చెందిన సంగమేష్ రూ.4.5 లక్షలు, ఓ మహిళా పోలీస్ కూడా తన చెల్లెలి ఉద్యోగం కోసం రూ.లక్ష సమరి్పంచుకున్నారు. ఇంకా ఇతని గాలానికి చిక్కి ఎందరో నిరుద్యోగులు రూ.లక్షల్లో మోసపోయినట్లు సమాచారం. ఆఫీసులకు తీసుకెళ్లి..అందరినీ నమ్మించి.. నిరుద్యోగులను పృథ్వి నమ్మించి మోసగించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కావాలని అడిగారో ఏకంగా ఆ శాఖ కార్యాలయానికి నిరుద్యోగులను తీసుకెళ్లేవాడు. వారిని కార్యాలయం వద్ద కూర్చోబెట్టి ఒక్కడే లోపలికి వెళ్లేవాడు. కాసేపటికి బయటకు వచ్చి పై అధికారితో అంతా మాట్లాడానంటూ నమ్మబలికేవాడు. ఇలా ఒక నిరుద్యోగిని గుంతకల్లు సెబ్ కార్యాలయంలో ఉద్యోగం ఉందని పిలుచుకెళ్లి అక్కడే అడ్వాన్స్‌గా రూ.లక్ష తీసుకున్నాడు. వాస్తవంగా ఇతనికి ఎక్సైజ్ శాఖలో ఎవరూ తెలీదు. ప్రస్తుతం ఇతను గుంతకల్లు టూటౌన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. (చదవండి: కాల్వకు 'జేసీబీ'తో బ్రేక్.. ఈసారి టికెట్ ఆయనకేనా?) -
పోలీసులకు ఒకే యూనిఫాం
సూరజ్‌కుండ్ (హరియాణా): పోలీసులకు దేశవ్యాప్తంగా ఒకే యూనిఫాం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. ‘ఒక దేశం, ఒకే యూనిఫాం’ భావనపై ఆలోచించాలని రాష్ట్రాలకు సూచించారు. అయితే వాటిపై దీన్ని రుద్దబోవడం లేదని స్పష్టం చేశారు. ‘‘ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే. పోలీసు బలగాలకు ఇది ఉమ్మడి గుర్తింపునిస్తుందన్నదే నా ఉద్దేశం. కావాలంటే యూనిఫాంపై రాష్ట్రాలవారీగా ప్రత్యేక గుర్తింపు చిహ్నాలు ఉండవచ్చు. ఇది వీలైతే ఇప్పుడు, లేదంటే ఐదేళ్లు, పదేళ్లు, వందేళ్లకు ఎప్పటికైనా సాధ్యపడొచ్చు’’ అని సూచించారు. హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో జరుగుతున్న రాష్ట్ర హోం మంత్రుల చింతన్ శిబిర్‌ను ఉద్దేశించి మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘‘గన్నులు, పెన్నులు... ఇలా నక్సలిజం ఏ రూపంలో ఉన్నా కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాల్సిందే. యువత మనసులను విషపూరితం చేసి వారిని తీవ్రవాదంవైపు మళ్లించకుండా నిరోధించాల్సిందే. అందుకోసం ఈ తీవ్రవాద శక్తుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి’’ అంటూ పిలుపునిచ్చారు. దేశ క్షేమం దృష్ట్యా ఈ శక్తులు విజృంభించకుండా చూడాల్సిన అవసరముందన్నారు. ‘‘పాత చట్టాలను సమీక్షించుకోండి. కాలం చెల్లిన వాటిని వదిలించుకోండి. మిగతా వాటిని ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మెరుగు పరుచుకోండి’’ అని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ‘‘శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశమే అయినా సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో కూడిన ఉమ్మడి కార్యాచరణను ఏర్పాటు చేసుకోవాలి. పౌరుల పరిరక్షణే అంతిమ లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర బలగాలు అన్ని అంశాల్లోనూ పరస్పరం సహకరించుకోవాలి’’ అని సూచించారు. నేరాల స్వభావం అంతర్రాష్ట్రీయ, అంతర్జాతీయ తరహాను సంతరించుకుంటున్నందున ఇది తప్పనిసరన్నారు. సైబర్ క్రైం, ఆయుధాలు, డ్రగ్స్ సరఫరాల్లో నేరగాళ్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నందున ఈ ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు సాంకేతికంగా వారికంటే ముందే ఉండాలన్నారు. ఫేక్ న్యూస్‌కు తెర పడాలి కొంతకాలంగా ఫేక్ న్యూస్ పెద్ద బెడదగా మారిందని మోదీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి తప్పుడు సమాచార వ్యాప్తిని తక్షణం అడ్డుకోవాల్సిన అవసరముందన్నారు. ఇది దేశానికే ముప్పుగా పరిణమించగలదన్నారు. ‘‘ఏ సమాచారాన్నయినా ఫార్వర్డ్ చేసే ముందు ప్రజలు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. అందులోని నిజానిజాలను నిర్ధారించుకోవాలి. అందుకు వీలు కల్పించే వ్యవస్థలను వారికి చేరువ చేయడంలో టెక్నాలజీది కీలక పాత్ర’’ అని చెప్పారు. టెక్నాలజీపై వెచ్చించే మొత్తాన్ని మెరుగైన భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగా చూడాలని అన్నారు. పర్యాటకం ప్రధాన ఆదాయ వనరుగా మారుతున్న నేపథ్యంలో పర్యాటక పోలిసింగ్పైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్రాలను కోరారు. అవినీతిపరులను వదిలేది లేదు న్యూఢిల్లీ: అవినీతికి పాల్పడితే వ్యక్తులనైనా, సంస్థలనైనా వదిలే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు. అక్టోబర్ 31న మొదలవుతున్న విజిలెన్స్ వారోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన జాతికి సందేశమిచ్చారు. అవినీతి సామాన్యుల హక్కులను హరించడమే గాక దేశ ప్రగతిని కూడా కుంటుబరుస్తుందన్నారు. అవినీతిపై ఉమ్మడిగా పోరాడాలంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ కూడా పిలుపునిచ్చారు. మన ఉక్కు పరిశ్రమ శక్తికి ఐఎన్ఎస్ విక్రాంతే తార్కాణం సూరత్: భారత ఉక్కు పరిశ్రమ శక్తిసామర్థ్యాలకు, పనితనానికి తొలి దేశీయ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ చక్కని ఉదాహరణ అని ప్రధాని మోదీ అన్నారు. ఎనిమిదేళ్ల సమష్టి కృషి ఫలితంగా భారత ఉక్కు పరిశ్రమ ప్రపంచంలో రెండో స్థానానికి ఎగబాకిందన్నారు. గుజరాత్‌లోని సూరత్ జిల్లా హజీరాలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా విస్తరణ ప్లాంటు భూమి పూజలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఉచితాలతో ఓటర్లను ఆధారపడేలా చేయొద్దు! -
దేశవ్యాప్తంగా పోలీసులు అందరికీ ఒకే యూనిఫామ్ : ప్రధాని మోదీ
-
చదువులు సాగేదెలా?
సాక్షి, హైదరాబాద్: సర్కారు బడుల్లో పాఠ్య పుస్తకాలే కాదు... ఏకరూప దుస్తులు సైతం అందని ద్రాక్షగా తయారయ్యాయి, ఒకవైపు విద్యార్థులకు పూర్తిస్థాయి పాఠ్య పుస్తకాలు లేకుండానే చదువులు సాగుతుండగా.. యూనిఫాంల జాడ కూడా లేకుండా పోయింది. 2022– 23 విద్యా సంవత్సరం ప్రారంభమై 6 నెలలు గడిచినా 60 శాతం మించి పాఠ్యపుస్తకాలు సరఫరా కాలేదని అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధాన ప్రచురణ కేంద్రం నుంచి గోదాములకే అరకొర స్టాక్ వచ్చి చేరడంతో పాఠశాలలకు పుస్తకాల సరఫరా అంతంత మాత్రంగా ఉంది. ఇప్పటి వరకు వచి్చన వాటిలో సైతం ఏ ఒక్క తరగతికి సైతం పూర్తి స్థాయి పుస్తకాల సెట్ అందలేనట్లు తెలుస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠ్యపుస్తకాల పంపిణీ ఆలస్యం కావడంతో అప్పటిదాకా బ్రిడ్జి కోర్సులు నిర్వహించారు. అనంతరం బోధన ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయి పాఠ్య పుస్తకాల కొరత వెంటాడుతోంది. పాత పుస్తకాలతోనే.. గత విద్యా సంవత్సరం ప్రభుత్వ బడుల్లో చాలా తరగతులకు సగం పుస్తకాలే పంపిణీ చేశారు. పాత వాటిని సైతం ఈసారి సేకరించి సర్దుబాటు చేసినా విద్యార్థులందరికీ సరిపోని పరిస్థితి నెలకొంది. కొన్ని పాఠశాలల్లో అయిదుగురు విద్యార్థులను ఒక గ్రూప్‌గా చేసి వారికి ఒక్కో పాఠ్య పుస్తకాన్ని ఇచ్చి సర్దుబాటు చేశారు. దీంతో చేతిలో పుస్తకాలు లేక విద్యార్థులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. తోటి విద్యార్థుల పుస్తకాలపై ఆధారపడి చదువులు కొనసాగించడం ఇబ్బందిగా తయారైంది. తరగతి గదిలో బోధన తర్వాత ఇంటివద్ద హోంవర్కు సమస్యగా తయారైంది. పాఠ్య పుస్తకాలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శాపంగా తయారైంది. 24.73 లక్షలపైనే.. గ్రేటర్‌లోని హైదరాబాద్–రంగారెడ్డి–మేడ్చల్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ బడులకు సుమారు 24.73 లక్షల పాఠ్యపుస్తకాల అవసరం ఉంటాయని విద్యాశాఖాధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఇండెంట్ పెట్టారు. అందులో 60 శాతం మాత్రమే ప్రింటింగ్ ప్రెస్ నుంచి గోదాములకు చేరాయి. అందులో సైతం తరగతులకు సంబ ంధించిన అన్ని పాఠ్యపుస్తకాలు అందలేదు. ఈ విద్యా సంవత్సరం ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంతో ఒకే సా రి ఇంగ్లి‹Ù, తెలుగు మీడియం పుస్తకాల ప్రచురణ తలపెట్టడంతో పూర్తి స్థాయి కోటాకు ఆటంకంగా తయారైంది. ఊసే లేని యూనిఫాంలు.. సర్కారు బడుల విద్యార్థులకు ఇప్పటి వరకు యూనిఫాంల ఊసే లేకుండా పోయింది. విద్యార్థులకు రెండు జతల చొప్పున ఉచితంగా యూనిఫాంలను అందించాల్సి ఉంది. సాధారణంగా వేసవి సెలవుల్లోనే వీటికి అవసరమైన వ్రస్తాన్ని టెస్కో ద్వారా కొనుగోలు చేసి, ఆయా జిల్లాలు, మండలాల వారీగా స్కూళ్లకు అందించాలి. ఈ ఏడాది యూనిఫాంలకు అవసరమైన వస్త్రం కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యం ఏర్పడింది. దీంతో సకాలంలో దుస్తుల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. (చదవండి: ఆ సొమ్మంతా ఎవరికి వెళ్లింది?) -
డీజీపీ హెచ్చరిక.. యూనిఫాంతో డాన్సులు చేయద్దు
సాక్షి, ముంబై: పోలీసులు యూనిఫాంలో ఉండగా ఊరేగింపుల్లో, శుభకార్యాల్లో ఎలాంటి నృత్యాలు చేయకూడదని రాష్ట్ర డీజీపీ రజ్నీశ్ సాఠే ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు ధరించే యూనిఫాంకు ఒక విలువ ఉందని, పెళ్లి వేడుకలు, పండుగలు, పబ్బాలు, ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో నృత్యం చేస్తూ దాని విలువ దిగజార్చవద్దని హెచ్చరించారు. ‘అనేక సందర్భాలలో పోలీసులు వివిధ ఊరేగింపుల్లో డీజే పాటలపై నృత్యం చేస్తున్నట్లు వీడియోలలో కనిపిస్తోంది. కొందరు కావాలనే పోలీసులను బలవంతంగా డ్యాన్స్ చేయించి ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దీనివల్ల యావత్ పోలీసు డిపార్టుమెంట్‌కు అపకీర్తి వస్తుంది. కొందరు నిర్వాకం వల్ల మిగతా పోలీసులకు చెడ్డ పేరు వస్తుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ముగిసిన గణేశ్ నిమజ్జనోత్సవాల్లో ముంబైసహా పుణేలో కొందరు పోలీసులు డీజే సౌండ్లకు ఉత్తేజితులై నృత్యం చేశారు. ఉత్సవాల్లో భక్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా సినిమా పాటలకు నృత్యం చేస్తే శాంతి, భద్రతలు ఎలా అదుపులో ఉంటాయనే అంశం తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం కంటే దుర్వినియోగం ఎక్కువ చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కూడా కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీంతో పోలీసు శాఖను అన్ని రంగాలవారు లక్ష్యంగా చేసుకుని కామెంట్లు చేస్తున్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న రజ్నీశ్ సాఠే ఇక ముందు ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో యూనిఫాంలో ఉన్న పోలీసులు డ్యాన్స్‌లు చేయవద్దని హెచ్చరించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో అధికారికంగా జారీ చేయనున్నట్లు తెలిపారు. పోలీసులు కచ్చితంగా నియమాలను పాటించాలని, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని హెచ్చరించారు. ఒకవేళ సామాజిక కార్యక్రమాలకు హాజరు కావాల్సి వస్తే వ్యక్తిగతంగా యూనిఫాం లేకుండా వెళ్లాలని సూచించారు. -
హ్యారీకి అవమానం
లండన్: రాణి అస్తమయం నేపథ్యంలో విభేదాలు పక్కన పెట్టి దగ్గరవుతున్నారని భావించిన రాకుమారులు విలియం, హ్యారీ మధ్య దూరాన్ని మరింతగా పెంచే ఉదంతం తాజాగా చోటుచేసుకుంది. ఇది హ్యారీకి తీరని అవమానం కూడా మిగిల్చిందట. రాణి ఎలిజబెత్–2 మనవలు, మనవరాళ్లు శనివారం రాత్రి ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. విలియంతో పాటు హ్యారీ కూడా రాజు చార్లెస్–3 ప్రత్యేక అనుమతితో ఈ సందర్భంగా సైనిక దుస్తులు ధరించారు. కానీ వాటిపై ఉండాల్సిన రాణి అధికార చిహ్నమైన ‘ఈఆర్’ను తొలగించారు. పెద్ద కుమారుడైన యువరాజు విలియం సైనిక దుస్తులపై మాత్రం ఈఆర్ చిహ్నం అలాగే ఉంచారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక హ్యారీకి గుండె పగిలినంత పనైందట. తండ్రితోనూ సోదరునితోనూ హ్యారీకి సత్సంబంధాలు లేవన్న విషయం తెలిసిందే. రాచకుటుంబం అభ్యంతరాలను కాదని ఆయన అమెరికా నటి మెగన్ మార్కెల్‌ను పెళ్లాడినప్పటినుంచీ విభేదాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో హ్యారీ దంపతులు రాచరిక హోదా వదులుకున్నారు. దాంతో ఆయన సైనిక దుస్తులు ధరించే అర్హత కోల్పోయారు. ‘‘నాయనమ్మ అంత్యక్రియల సందర్భంగా ప్రత్యేక అనుమతితో వాటిని ధరిస్తే ఇంతటి అవమానం జరిగిందంటూ హ్యారీ కుమిలిపోయారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసిన పనేనని భావిస్తున్నారు. ఎందుకంటే సైనిక దుస్తులు ధరించే అర్హత లేని ఎలిజబెత్–2 కుమారుడు ప్రిన్స్ ఆండ్రూ సైనిక దుస్తులపై కూడా అధికార చిహ్నాన్ని యథాతథంగా కొనసాగించారు. కేవలం తన దుస్తులపై మాత్రమే తొలగించడం హ్యారీకి మరింత మనస్తాపం కలిగించింది’’ అని ఆయన మిత్రున్ని ఉటంకిస్తూ సండే టైమ్స్ కథనం పేర్కొంది. అంతేకాదు, ఆదివారం రాత్రి బకింగ్‌హాం ప్యాలెస్‌లో దేశాధినేతలకు చార్లెస్–3 అధికారిక విందు కార్యక్రమానికి కూడా హ్యారీ దంపతులను దూరంగా ఉంచారు. గురువారం హ్యారీ 38వ పుట్టిన రోజు. ఆ సందర్భంగా మెగన్తో కలిసి కార్లో వెళ్తుండగా విలియం తన ముగ్గురు పిల్లలను స్కూలు నుంచి కార్లో తీసుకొస్తూ ఎదురయ్యారు. ఇద్దరూ కార్ల అద్దాలు దించుకుని క్లుప్తంగా మాట్లాడుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారట. -
నిందితుడిని అరెస్టు చేయబోతుండగా... పోలీసులపై దాడి యూనిఫాం చింపి....
గురుగ్రామ్: ఒక వ్యక్తిని ఫ్రాడ్ కేసు విషయమై పోలీసులు అరెస్టు చేసి పోలీస్టేషన్‌కి తరలిస్తున్నారు. ఇంతలో ఆ నిందితుడు ఇద్దరు చెల్లెళ్లు, తల్లి, సోదరుడు పోలీసులపై అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ ఘటన గుర్గావ్లో చోటు చేసుకుంది. దీంతో ఆ ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సదరు నిందితుడి సోదరుడు తప్పించుకున్నాడని చెప్పారు. ఈ మేరకు సబ్ ఇన్స్పెక్టర్ కరంబీర్ తమ స్టేషన్లో ఒక ఫ్రాడ్ కేసు నమోదైందని తెలిపారు. తాము ఆ కేసు విషయమై గత కొన్ని రోజులుగా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఈ కేసుకి సంబంధించి అనుమానితుడు కరణ్ సమదర్శ అనే వ్యక్తిని విచారించినట్లు చెప్పారు. అతను ఉత్తరప్రదేశ్‌లో తండా గ్రామంలో తన కుటుంబంతో కలసి ఉంటున్నాడని పేర్కొన్నారు. ఐతే అతను పోలీసుల విచారణలో నిందితుడిగా తేలడంతో అతన్ని అరెస్టు చేస్తున్నట్లు అతని కుటుంబానికి తెలియజేసి, పోలీస్టేషన్‌కి తరలిస్తున్నారు. ఇంతలో అతడి తల్లి ఇద్దరు చెల్లెళ్లు, సోదరుడు పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి పోలీసుల పై దాడి చేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్ సతేందర్ యూనిఫాం చిరిగిపోయింది. దీంతో స్టేషన్ లోపల ఉన్న మిగతా పోలీసులు సదరు నిందితుడి తల్లి, చెల్లెళ్లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కానీ అతని సోదరుడు వరుణ్ తప్పించుకున్నాడని, తొందరలోనే అతన్ని కూడా పట్టుకుంటామని చెప్పారు. (చదవండి: భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త ) -
ఖాకీనా.. మరో రంగా?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త యూనిఫామ్ కోడ్‌ను అమలు చేయడంపై సంస్థ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం సాధారణ బస్సుల్లో డ్రైవర్, కండక్టర్లు ఖాకీ రంగు యూనిఫామ్ ధరిస్తుండగా ఏసీ బస్సుల్లో నీలిరంగు యూనిఫామ్ ధరిస్తున్నారు. అయితే ఇప్పుడు యూనిఫామ్ రంగును మార్చాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఎక్కువ మంది ఏ రంగు కోరుకుంటే దాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. యూనిఫామ్ వస్త్రాలకు వాడే బట్ట నాణ్యతపైనా దృష్టి సారించారు. తక్కువ బరువు, వేసవిలో చల్లదనాన్ని ఇచ్చేవస్త్రాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించారు. గత కొన్నేళ్లుగా డుమ్మా.. ఆర్టీసీ ఉద్యోగులకు ఏటా రెండు జతల యూనిఫామ్ అందించాల్సి ఉంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా యాజమాన్యం కొన్నేళ్లుగా ఇవ్వడంలేదు. దీంతో సిబ్బందే సొంత ఖర్చులతో యూనిఫామ్ సమకూర్చుకుంటున్నారు. కొందరు పాత వాటినే వాడుతున్నారు. ఒకవేళ ఎవరైనా యూనిఫామ్ లేకుండా విధులకు హాజరైతే డిపో మేనేజర్లు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. దీంతో సిబ్బంది తమ జేబుకు భారమైనా తప్పని పరిస్థితుల్లో యూనిఫామ్ కుట్టించుకుంటున్నారు. దీన్ని గుర్తించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇకపై ఏటా ఠంచన్‌గా రెండు జతల యూనిఫామ్‌ను సిబ్బందికి అందించాలని నిర్ణయించారు. అయితే యూనిఫామ్ రం గులు మారిస్తే ఎలా ఉంటుందన్న విషయంలో అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. 2019 సమ్మె తర్వాత ముఖ్యమంత్రితో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంలో మహిళా కండక్టర్లకు ప్రత్యేక యూనిఫామ్ విషయం చర్చకు వచ్చింది. సీఎం ఆదేశంతో ఏర్పాటైన ఆర్టీసీ కమిటీ మెరూన్ రంగు యాప్రాన్‌ను మహిళా కండక్టర్లకు ఇవ్వాలని సిఫారసు చేసిం ది. ఆ మేరకు మహిళా సిబ్బందికి వాటిని పంపిణీ చేశారు. ఇప్పుడు మొత్తం సిబ్బందికి కొత్త వస్త్రాలు ఇవ్వడంతోపాటు రంగును కూడా ఎంపిక చేయబోతున్నారు. నేషనల్ పోలీసు అకాడమీ సిఫారసులకు తగ్గట్టుగా.. పోలీసు సిబ్బందికి ప్రత్యేక వస్త్రాన్ని యూనిఫామ్ కోసం అందిస్తారు. రెండు రకాల దారాలను కలిపి ఆ వస్త్రాన్ని రూపొందిస్తారు. అది తక్కువ బరువు ఉండటంతోపాటు వేసవిలో చల్లగా, ముడతలు పడని విధంగా ఉంటుంది. ఉతికిన తర్వాత త్వరగా ఆరిపోతుంది. రంగు కూడా తొందరగా వెలిసిపోదు. దీన్ని నేషనల్ పోలీసు అకాడమీ ప్రత్యేకంగా నిపుణులతో చర్చించి సిఫారసు చేసింది. ఇప్పుడు అలాంటి వస్త్రాన్నే తమ సిబ్బందికి అందించాలని ఆర్టీసీ భావిస్తోంది. అలాంటి వస్త్రం సరఫరా కోసం రేమండ్స్ కంపెనీతో చర్చిస్తోంది. మరో 2–3 రోజుల్లో ఆ కంపెనీ ప్రతినిధులు ఆ తరహా వస్త్రానికి సంబంధించి 4–5 రంగులు అధికారులకు చూపించనున్నారు. అందులోంచి ఎక్కువ మంది సిబ్బంది ఏది కోరుకుంటే దాన్ని ఎంపిక చేసి యాజమాన్యం అందించనుంది. సిబ్బందికి ఏటా రెండు జతల యూనిఫామ్ ఇచ్చేందుకు ఆర్టీసీకి రూ. 8–10 కోట్ల వరకు ఖర్చు కానుంది. -
హిజాబ్‌పై తీర్పును రిజర్వ్ చేసిన కర్ణాటక హైకోర్టు
సాక్షి, బెంగళూరు: హిజాబ్ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టులో నమోదైన పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. విద్యాసంస్థల్లో నిర్దేశిత యూనిఫాం మాత్రమే ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో గత 11 రోజులుగా విచారణ కొనసాగుతోంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్తీ, న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఫిబ్రవరి 10న విచారణ ప్రారంభించి శుక్రవారం పూర్తి చేసింది. తుది తీర్పును వాయిదా(రిజర్వ్) వేసింది. పిటిషనర్ల తరపు న్యాయవాది రవివర్మ కుమార్ వాదనలు వినిపించారు. హిజాబ్‌ను నిరాకరించేందుకు కాలేజీ అభివృద్ధి మండలికి(సీడీసీ) ఎలాంటి అధికారం లేదని అన్నారు. ప్రభుత్వం తన అధికారాలను సీడీసీకి అప్పగించడం సబబు కాదని తెలిపారు. వందల ఏళ్లుగా హిజాబ్ ధారణ కొనసాగుతోందని ఇతర పిటిషనర్ల తరపు న్యాయవాదులు గుర్తుచేశారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను పూర్తి చేసి, తుది తీర్పును రిజర్వ్ చేసింది. ఇకపై ఏ న్యాయవాది అయినా అవసరమైతే లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని ధర్మాసనం సూచించింది. -
కర్ణాటకలో ‘హిజాబ్’పై అదే రగడ
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్(బురఖా) గొడవ మరింత ముదురుతోంది. విద్యాసంస్థల్లో నిర్దేశిత ఏకరూప దుస్తులు(యూనిఫామ్) ధరించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొందరు విద్యార్థులు ధిక్కరించారు. ఉడుపి జిల్లాలోని కుందాపూర్‌లో ఓ కాలేజీలో విద్యార్థినులు సోమవారం హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యారు. వారితో ప్రిన్సిపాల్ మాట్లాడారు. ప్రభుత్వ ఉత్తర్వు గురించి వివరించారు. హిజాబ్ తొలగించేందుకు విద్యార్థినులు నిరాకరించారు. దీంతో వారికోసం కేటాయించిన ప్రత్యేక గదిలోకి వెళ్లాలని ప్రిన్సిపాల్ సూచించారు. ఇందుకు నిరసనగా వారు కాలేజీ బయట రోడ్డుపై బైఠాయించారు. హిజాబ్ రగడపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై స్పందించారు. రాష్ట్రంలో శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యూనిఫామ్ నిబంధనలు పాటించాలని విద్యాసంస్థలను కోరారు. హిజాబ్‌పై హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి బి.సి.నగేష్ మాట్లాడుతూ.. హిజాబ్ ధరించిన వారిని ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించబోమని తేల్చిచెప్పారు. రోడ్లపై నిరసనకు దిగితే పాఠాలు కోల్పోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదన్నారు. రోడ్లపై బైఠాయించడం భారతీయ సంస్కృతి కాదన్నారు. హిజాబ్ ధరించినవారి కోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. అలాంటి వారిని సాధారణ తరగతుల్లోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ చిక్కబళ్లాపూర్, బాగల్కోట్, బెళగావి, హసన్, మండ్య తదితర ప్రాంతాల్లో కొందరు విద్యార్థులు కాషాయం కండువాలు ధరించి, కాలేజీలకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. తమకు న్యాయం కావాలంటూ బెళగావి, మండ్యాలో విద్యార్థినులు నిరసన ర్యాలీ చేపట్టారు. హిజాబ్‌కు అనుమతి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. చిక్కమగళూరులో కొందరు విద్యార్థులు నీలి రంగు కండువాలు ధరించి, కాలేజీకి చేరుకున్నారు. జైభీమ్ అంటూ నినదించారు. హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. -
ఆ స్కూల్లో బాలబాలికలకు యూనిఫామ్ ఒకటే!
సాధారణంగా పాఠశాలల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా యూనిఫామ్స్ ఉంటాయి. కానీ ఆ స్కూల్లో మాత్రం బాలురు, బాలికలకు ఒకేరకమైన యూనిఫామ్ ఉంటుంది. ఈ పాఠశాల మన దేశంలోనే ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. లింగ సమానత్వాన్ని ప్రబోధించేందుకే బాల బాలికలకు ఒకే రకమైన ఏకరూప దుస్తుల ధరించేలా చేస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికుల సహకారంతో ఈ నిశ్శబ్ద విప్లవానికి తొలి అడుగుపడింది. విద్యార్జనలో అగ్రస్థానాన ఉన్న కేరళలోనే ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఎర్నాకులం జిల్లాలో వలయన్చిరంగార ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిశ్శబ్ద విప్లవానికి అంకుర్పారణ జరిగింది. లింగ భేదం లేకుండా ఇక్కడ విద్యార్థులందరూ ఒకే రకమైన యూనిఫామ్ ధరిస్తారు. చొక్కాలు, త్రిబైఫోర్త్ షార్ట్స్ వేసుకుని చదువులమ్మ ఒడిలో ఒదిగిపోతున్నారు. బాలికలు ఎటువంటి సంకోచం లేకుండా స్వేచ్ఛగా ఆటపాటలతో చదువుకుంటున్నారు. (ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!!) వలయన్చిరంగార ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ, లోయర్ ప్రైమరీ విభాగాలు ఉన్నాయి. రెండు విభాగాల్లో మొత్తం 746 మంది విద్యార్థులు ఉన్నారు. లింగ సమానత్వ యూనిఫామ్ మొదట 2017లో ప్రీ-ప్రైమరీ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టారు. ఇది ఇప్పుడు 1 నుంచి 4 తరగతులకు విస్తరించారు. లింగ సమానత్వ యూనిఫామ్ ప్రవేశపెట్టడానికి ముందు బాలికలు ఆటలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంకోచించే వారని.. ఇప్పుడు వారిలో ఎటువంటి సంకోచం లేదని ఉపాధ్యాయురాలు సి.రాజీ తెలిపారు. తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన తర్వాత జెండర్ న్యూట్రల్ యూనిఫామ్ అమలు చేశామన్నారు. ‘బాలికలకు ఇబ్బందిగా ఉన్న డ్రెస్ కోడ్ మార్చాల్సిందేనని విద్యార్థినుల తల్లులు బలంగా విశ్వసించారు. తమ కుమార్తెలు తాము ధరించే యూనిఫామ్‌లో సురక్షితంగా ఉండాలని వారు కోరుకున్నారు. కొత్త యూనిఫామ్ అదనపు ఖర్చును భరించడానికి వారు ముందుకు వచ్చార’ని రాజీ వెల్లడించారు. ‘లింగ సమానత్వ ఏకరూప దుస్తులు ప్రవేశపెట్టడం వల్ల అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎక్కువ మంది బాలికలు క్రీడల్లో పాల్గొనేందుకు ముందుకు వస్తుండటం ఇందుకు నిదర్శనం. కొత్త డ్రెస్ కోడ్ వారికి గొప్ప స్వేచ్ఛను అందించింది. మా పాఠశాలలో 378 మంది బాలికలు ఉన్నారు. వీరిలో అత్యధికులు పేదవారే. కానీ తల్లిదండ్రులు కొత్త యూనిఫామ్ కోసం అదనంగా డబ్బులు చెల్లించడానికి అంగీకరించారు. అమ్మాయిలు చాలా హ్యాపీగా ఉన్నార’ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కేపీ సుమ అన్నారు. 2019లోనే జెండర్ న్యూట్రల్ యూనిఫామ్ ప్రవేశపెట్టాలని అనుకున్నప్పటికీ కరోనా కారణంగా కాస్త ఆలస్యమైందని తెలిపారు. కొత్త డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టడంతోనే ఆగిపోలేదు.. విద్యార్థుల కోసం జెండర్-సెన్సిటివ్ పాఠాలను కూడా సిద్ధం చేశారు ఉపాధ్యాయులు. బాలురు, బాలికలు ఇద్దరూ సమానమే అని చెప్పేవిధంగా పాఠాలు బోధిస్తున్నట్టు అకడమిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ బినోయ్ పీటర్ చెప్పారు. లింగ సమానత్వ మాడ్యూల్‌ను ప్రోత్సహించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. కాగా, వలయన్చిరంగార పాఠశాల చేపట్టిన ఈ ప్రయత్నాన్ని కేరళ విద్యా మంత్రి ఆర్ బిందు, సినీ నటి మంజు వారియర్, ఒలింపియన్ అంజు బాబీ జార్జ్ సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. -
ఇక తెలంగాణలో ‘మెరూన్’ కండక్టర్లు!
సాక్షి, హైదరాబాద్: ఇక మెరూన్ రంగు ఆప్రాన్ (చొక్కా) ధరించి ఆర్టీసీ బస్సుల్లో మహిళా కండక్టర్లు విధులు నిర్వహించనున్నారు. 2019 చివరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశం మేరకు మహిళా కండక్టర్లకు సరికొత్త యూనిఫామ్స్ ఎట్టకేలకు అందబోతున్నాయి. ఆర్టీసీలో పనిచేస్తున్న 4,800 మంది మహిళా కండక్టర్ల కోసం రేమండ్స్ కంపెనీ నుంచి 30 వేల మీటర్ల వస్త్రాన్ని తాజాగా ఆర్టీసీ కొనుగోలు చేసింది. ఒక్కో కండక్టర్‌కు రెండు ఆప్రాన్‌లకు సరిపడా వస్త్రాన్ని సరఫరా చేస్తారు. వారు తమ కొలతలకు తగ్గట్టు కుట్టించుకుని, నిత్యం ఆప్రాన్ ధరించి డ్యూటీకి రావాల్సి ఉంటుంది. 60 లక్షల కోసం ఏడాది ఎదురుచూపు.. 2019లో ఆర్టీసీలో రికార్డు స్థాయిలో సుదీర్ఘంగా సాగిన సమ్మె అనంతరం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. అందులో వివిధ అంశాలపై నేరుగా ఉద్యోగులతో మాట్లాడి తెలుసుకున్న విషయాల ఆధారంగా పలు హామీలిచ్చారు. అందులో మహిళా కండక్టర్లకు ప్రత్యేకంగా ఆప్రాన్‌ను యూనిఫాంగా ఇవ్వాలన్నది కూడా ఒకటి. ఈ ఆప్రాన్ ఏ రంగులో ఉండాలన్నది కూడా మహిళా కండక్టర్లే నిర్ణయించి చెప్పాలంటూ ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకుంది. ఎక్కువ మంది మెరూన్ రంగు వస్త్రం కావాలని కోరటంతో దాన్నే సిఫారసు చేసింది. వస్త్రం నాణ్యత కూడా మెరుగ్గా ఉండాలన్న ఉద్దేశంతో రేమండ్స్ కంపెనీ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కానీ ఆ వస్త్రాన్ని కొనేందుకు ఏడాదికిపైగా సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఆర్టీసీలో ఉన్న 4,800 మంది మహిళా కండక్టర్లకు రెండు ఆప్రాన్లు కుట్టివ్వాలంటే 30 వేల మీటర్ల వస్త్రం అవసరమవుతుందని అంచనా వేశారు. ఇందుకు రూ.60 లక్షలు ఖర్చవుతుందని నిర్ధారించారు. అయితే జీతాలకు కూడా డబ్బులు చాలని పరిస్థితిలో అంతమేర నిధులను కూడా కేటాయిం చటం ఆర్టీసీకి కష్టంగా మారింది. ఆ వెంటనే బస్సు చార్జీలు పెంచటంతో ఆర్టీసీ రోజువారీ ఆదాయం దాదాపు రూ.2 కోట్లు పెరిగింది. దీంతో వస్త్రం కొనాలనుకున్న తరుణంలో కోవిడ్ రూపంలో సమస్య ఎదురైంది. గత వారం, పది రోజులుగా ఆర్టీసీ ఆదాయం కొంత మెరుగ్గా ఉండటంతో ఎట్టకేలకు వస్త్రం కొనుగోలు చేశారు. సాధారణంగా వస్త్రంతో పాటు యూనిఫాం కుట్టు కూలీలకు కూడా ఆర్టీసీ డబ్బులు చెల్లిస్తుంటుంది. అయితే ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో వస్త్రం మాత్రమే ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. పురుషులకు ఇప్పట్లో లేనట్టే ఆర్టీసీలో ప్రతి మూడేళ్లకు ఓసారి రెండు జతల చొప్పున యూనిఫాం ఇచ్చే సంప్రదాయం ఉంది. కానీ గత ఆరేళ్లుగా యూనిఫాం జారీ నిలిచిపోయింది. సిబ్బందే సొంత ఖర్చులతో యూనిఫాం కొనుక్కుని వేసుకుంటున్నారు. కొంతమంది పాత యూనిఫాంతోనే నెట్టుకొస్తున్నారు. గతంలో ఉన్న వస్త్రం కొంత స్టోర్‌లో ఉండిపోవటంతో కొన్ని డిపోలకు మధ్యలో ఒకసారి యూనిఫాం సరఫరా అయింది. యూనిఫాం లేకుండా డ్యూటీకి హాజరైతే అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఉద్యోగులు జేబు నుంచి ఆ ఖర్చు భరిస్తున్నారు. అయితే ఈ కొత్త యూనిఫాం కూడా మహిళలకు మాత్రమే ఇవ్వనున్నారు. పురుషులకు ఇప్పట్లో లేనట్టేనని అధికారులు చెబుతున్నారు. చదవండి: మేడ్చల్ బస్ డిపోలో కండక్టర్ ఆత్మహత్యాయత్నం సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన టీఎస్ఆర్టీసీ -
ఆర్టీసీలో యూనిఫాంల కొరత
సాక్షి, హైదరాబాద్: ఎండనకా.. వాననకా.. శ్రమించే కార్మికులు వారు. రుతువులతో సంబంధం లేకుండా.. ప్రజలందరినీ గమ్యస్థానాలకు చేర్చడమే వారిపని. ప్రగతి రథ చక్రాలను 24 గంటల పాటు నడిపిస్తూ ఆర్టీసీ మనుగడకు ఊపిరిగా నిలుస్తున్నారు. అలాంటి ఆర్టీసీ కార్మికులకు ఐదేళ్లుగా సంస్థ నుంచి యూనిఫాం అందట్లేదు. దీంతో ఇన్నేళ్ల నుంచి సిబ్బంది సొంత డబ్బులతో యూనిఫాం కొనుక్కుని విధులకు హాజరవుతున్నారు. నిబంధనల ప్రకారం రెండేళ్లకు మూడు యూనిఫాంలను సిబ్బందికి సంస్థ సరఫరా చేయాలి. (1.2 మీటర్ల ప్యాంటు, 2 మీటర్ల షర్ట్ క్లాత్). దాంతోపాటు కుట్టుకూలీ కింద రూ.200 చెల్లించాలి. చివరిసారిగా 2013లో సిబ్బందికి యూనిఫాంలు అందజేశారు. ఆర్టీసీ అధికారులను ఎప్పుడు అడిగినా.. ఇదిగో ఇస్తున్నాం.. అదిగో ఇస్తున్నాం.. అంటున్నారే తప్ప ఆచరణలో విఫలమవుతున్నారు. కాగా, ఇప్పటికే పలురకాల సమస్యలతో సతమతమవుతోన్న ఆర్టీసీ కార్మికులకు యూనిఫాం అదనపు భారంగా మారింది. సంస్థ ఇవ్వకపోవడంతో గత్యంతరంలేక వారే కుట్టించుకుంటున్నారు. అయితే ఈ దుస్తుల రంగుల్లో ఏకరూపత ఉండట్లేదు. ఒకే డిపోలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు ధరించే దుస్తుల ఖాకీ రంగుల్లో పలు రకాల వ్యత్యాసాలు ఉంటున్నాయి. ఎవరు బాధ్యులు? 52 వేల మందికిపైగా ఉన్న సంస్థలో కిందిస్థాయి ఉద్యోగులకు చీఫ్ కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్ కార్యాలయం యూ నిఫారాలను ఇస్తుంది. ఇందుకు ముందుగా టెండర్లు పిలుస్తుంది. అందులో ఎంపిక చేసిన కాంట్రాక్టరు నుం చి నాణ్యమైన దుస్తులను ఎంపిక చేస్తుంది. గుర్తింపు యూనియన్ నుంచి నాణ్యత కమిటీ దుస్తుల మన్నికను పరిశీలిస్తుంది. వీరు సంతృప్తి వ్యక్తం చేశాక, ఆ వస్త్రాన్ని ఎంపిక చేస్తారు. ఈ మొత్తం టెండర్ల వ్యవహారాలు ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్) ఆధ్వర్యంలో జరుగుతుంది. రిటైరైన వారి సంగతేంటి? 2014 నుంచి 2018 ఆగస్టు వరకు ఏటా వందలాది కార్మికులు రిటైరయ్యారు. ఈ సంఖ్య 4 వేలకుపైనే ఉండొచ్చని సమాచారం. వారంతా ఈ ఐదేళ్లకాలానికి యూనిఫాంను సొంత డబ్బుతోనే కుట్టించుకున్నారు. ఇప్పుడు వీరికి యూనిఫాం అలవెన్సులు అందుతాయన్న విషయంలోనూ స్పష్టత లేదు. కాగా, ఐదేళ్ల కింద కుట్టుకూలీ కింద పురుషులకు ఒక్కోజతకు రూ.200, మహిళలకు రూ.100 చొప్పున చెల్లించాలి. ప్రస్తుతం ఈ ధరకు మార్కెట్లో ఎవరూ దుస్తులు కుట్టరని కార్మికులు చెబుతున్నారు. కనీసం ఈసారైనా మెరుగైన కుట్టుకూలీ చెల్లించాలని కోరుతున్నారు. 2013లో చివరిసారిగా కార్మికులకు (కొన్నిచోట్ల మాత్రమే) దుస్తులు అందజేశారు. అప్పటినుంచి ఐదో ఏడాది రెండో త్రైమాసికం కూడా పూర్తి కావొస్తోంది. ఇప్పటికీ దుస్తులు అందలేదు. దాదాపు రూ.20 కోట్లకుపైగా కార్మికుల దుస్తులు, కుట్టుకూలీ రూపంలో సంస్థ మిగుల్చుకుందని విమర్శలు వస్తున్నాయి. వేధింపులు సరేసరి.. ఆర్టీసీలో యూనిఫాంలు ఇవ్వట్లేదు. అయినా ఈ విషయంలో అధికారులు నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు. యూనిఫాం ధరించకుండా విధులకు హాజరైన సిబ్బందికి డ్యూటీలు వేయట్లేదు. కొందరికి తాఖీదులు జారీ చేస్తున్నారు. మరికొందరిని మానసికంగా వేధిస్తున్నారు. క్వాలిటీ కోసం అన్వేషణ తెలంగాణ ఏర్పడ్డాక విభజన సమస్యలు పరిష్కారం కాకపోవడం, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా కార్మికులకు యూనిఫాం అందజేయలేకపోయాం. మంచి క్వాలిటీ దుస్తుల కోసం అన్వేషిస్తున్నాం. రెండు, మూడు నెలల్లో అందజేస్తాం. – శివకుమార్, ఈడీఏ దుస్తుల ఎంపిక జరుగుతోంది యూనిఫాం ఇవ్వడంలో జాప్యం జరిగిన మాట వాస్తవమే. టెండర్లకు సిద్ధమవుతున్నాం. ప్రస్తుతం దుస్తుల ఎంపిక జరుగుతోంది. గుర్తింపు యూనియన్ నాయకులకు శాంపిల్స్ చూపిస్తున్నాం. త్వరలోనే అందజేస్తాం. – అజయ్‌కుమార్, చీఫ్ కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్ -
యూనిఫాం ధరించలేదని డ్రైవర్‌ను చితకబాదిన ఎస్ఐ
పుంగనూరు: యూనిఫాం ధరించలేదని డ్రైవర్‌ను ఎస్ఐ చితకబాదిన సంఘటన ఆదివారం చౌడేపల్లె పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ పరిస్థితి విషమంగా మారడంతో రహస్యంగా మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి తిరుపతి తీసుకెళ్లారు. స్థానికుల కథనం మేరకు.. చౌడేపల్లి ఎస్ఐ కృష్ణయ్య, పోలీసు సిబ్బంది ఆదివారం చౌడేపల్లె పోలీస్ స్టేషన్ సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. సోమలకు చెందిన చలపతి కుమారుడు గణేష్ (32) బొలేరో లగేజీ వాహనంలో టమాటాలను చౌడేపల్లె మీదుగా పుంగనూరుకు తరలిస్తున్నాడు. పోలీసులు అతన్ని ఆపి రికార్డులు పరిశీలించారు. ఎస్ఐ వద్దకు వెళ్లి రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయంటూ తెలిపారు. డ్రైవర్ యూ నిఫాం ధరించకపోవడాన్ని గమనించిన ఎస్ఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గణేష్‌ను చితకబాదాడు. అనంతరం రూ.135 జరిమానా విధించాడు. కొద్ది సేపటికి డ్రైవర్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పోలీసులు రహస్యంగా పుంగనూరు, మదనపల్లె లోని ప్రైవేటు వైద్యశాలలకు తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మైరుగైన వైద్యంకోసం తిరుపతి తీసుకెళ్లారు. అస్వస్థతకులోనైన గణేష్‌కు పుంగనూరు సీఐ సాయినాథ్, డీఎస్పీ చౌడేశ్వరి రహస్యంగా వైద్య సేవలందించడం గమనార్హం. ఎస్ఐ సస్పెన్షన్ డ్రైవర్‌ను చితకబాదిన ఎస్ఐ కృష్ణయ్యను సస్పెండ్‌చేస్తూ ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆదివా రం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే డీఎస్పీ ఆధ్వర్యంలో కమిటీని నియ మించి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
బడికి రెడీ
ఇక రాత్రి వేళ పొద్దుపోయేంతవరకు టీవీలకు అతుక్కుపోవడం కుదరదు. ఉదయం తొమ్మిదింటి వరకు నిద్రపోవడం అసలే జరగని పని. అమ్మమ్మలు.. నాన్నమ్మలు, తాతయ్యలతో కబుర్లు కట్టేయాల్సిందే. ఆటపాటలు, అల్లరి చేష్టలకు టాటా చెప్పాల్సిన సమయం వచ్చింది. వేసవి సెలవులకు ఇక సెలవే. గురువారంతో హాలీడేస్ ముగిశాయి. శుక్రవారం బడిగంటలు మోగనున్నాయి. ఇప్పటికే తల్లిదండ్రులు తమ పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫాం, బ్యాగులు, షూస్, లంచ్ బాక్స్‌లు తదితర సామగ్రి కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. శుక్రవారం నుంచి బడికి పంపించేందుకు సన్నద్ధం చేస్తున్నారు. కొండాపూర్(సంగారెడ్డి): వేసవి సెలవుల అనంతరం శుక్రవారం నుంచి పాఠశాలల గేట్లు తిరిగి తెరుచుకోనున్నాయి. ఉత్సాహంగా.. ఉల్లాసంగా, నిన్నామొన్నటి వరకు ఆటపాటల్లో మునిగి తేలిన విద్యార్థులు బడిబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. జూన్ 1న బడిగంట మోగనుండడంతో ఇక పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన సమయం ఆసన్నమైంది. సుమారు 50 రోజుల తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభకానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడులకను ఘనంగా నిర్వహిం చేందుకు జూన్ 1న పాఠశాలలను పునః ప్రారంభించనున్నారు. సమస్యలతో స్వాగతం.. జిల్లా వ్యాప్తంగా 1,733 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సర్కారు స్కూళ్లు 1,350 కాగా ప్రైవేటు పాఠశాలలు 383 ఉన్నాయి. సర్కారులో ప్రాథమిక పాఠశాలలు 864, ప్రాథమికోన్నత 198, ఉన్నత పాఠశాలలు 205తో పాటు తెలంగాణ గురుకుల పాఠశాలలు, మైనార్టీ గురకుల పాఠశాలలు, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. లక్షా 50 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో,మరో 1,19,677 మంది ప్రైవేటులో విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాలో చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీనికి తోడు మౌలిక సౌకర్యాలు కరువై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరుగుదొడ్లు నిర్మించినా రన్నింగ్ వాటర్ లేకపోవడంతో చాలా పాఠశాలల్లో ప్రయోజనం లేకుండా పోయింది. పాఠశాలలకు ప్రహరీలు, ఆటలు ఆడుకునేందుకు మైదానాలు కరువయ్యాయి. ఇన్చార్జీల పాలనలోనే.. విద్యా వ్యవస్థను గాడిన పెట్టాలంటే పర్యవేక్షణ తప్పనిసరి. పాఠశాలలను పర్యవేక్షించాల్సి మం డల విద్యాదికారుల పోస్ట్‌లు ఖాళీగా ఉండడంతో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో 26 మండలాలకు గాను 18 మండలాల్లో మాత్ర మే మండల విద్యాధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. 8 మండలాలల్లో విద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 మండలాల్లో కంగ్టి, జిన్నా రం మండలాల్లో మాత్రమే రెగ్యులర్ విద్యాధికారులు కాగా మిగతా 16 మంది ఇన్‌చార్జులుగానే విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు మండలాలకు గానూ జిన్నారం ఎంఈఓ జూన్ చివరి నాటికి పద వీ విరమణ చేస్తుండడంతో అక్కడ కూడా ఇన్చార్జి నే నియమించే అవకాశం ఉంది. ఇన్చార్జి ఎంఈఓలుగా విధులు నిర్వర్తిస్తున్న ప్రధానోపాధ్యాయులకు కూడా ఒకొక్కరికి రెండు మండలాలు ఉండడంతో పాఠశాలల్లో బోధన కుంటుపడుతోందన్న విమర్శలు ఉన్నాయి. అటు పాఠశాలల్లో విద్యాబోధన చేయలేక, ఇటు పాఠశాలలను పర్యవేక్షించలేక ఇన్చార్జి ఎంఈఓలు సతమతమవుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానంగా ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలో 250 పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 34 పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేరంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తగ్గని ఉష్ణోగ్రతలు రుతు పవనాల రాక ఆలస్యం కావడం, ఉష్ణోగ్రతలు నేటికీ 40 డిగ్రీల నుంచి తగ్గకపోవడంతో 4 నుంచి 8వ తేదీ వరకు ఒంటిపూట మాత్రమే బడులు నిర్వహించనున్నారు. ఆ ఒక్కపూట కూడా విద్యార్థులను పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే జూన్ రెండో వారంలో విద్యా సంవత్సరం ప్రారంభిస్తే బాగుండేదని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం : జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని ఆర్వీఎం కార్యాయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జూన్ 1న పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నాయని, అదే రోజున ప్రతి విద్యార్థికి పుస్తకాలతో పాటు రెండు జతల యూనిఫాంలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు మొత్తం 7,20,740 పుస్తకాలు అవసరం కాగా వంద శాతం వచ్చాయని, ఇప్పటికే ప్రతి మండలంలోని మానవ వనరుల కేంద్రం ద్వారా సంబంధిత పాఠశాలలకు చేరవేయడం జరిగిందన్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫాంలను అందజేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు జిల్లాకు వచ్చిన 95,315 యూనిఫాంలను పాఠశాలలకు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు రేడియో పాఠాలతో పాటు డిజిటల్ తరగతుల ద్వారా విద్యా బోధన ఉంటుందన్నారు. జూన్ 4నుంచి బడిబాట ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేదుకు గానూ జూన్ 4 నుంచి 8వ తేదీ వరకు బడిబాట చేపడుతున్నట్లు డీఈఓ వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ప్రతీ రోజు ఉదయం 7 నుంచి 11 గంటలకు వరకు మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలతో పాటు సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం తదితరాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లాలో గత సంవత్సరం ఈ కార్యక్రమం ద్వారా 15,000 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించినట్లు చెప్పారు. ఐదు కేజీబీవీల్లో ఇంటర్‌కు అవకాశం బాలికల విద్యను బోలపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జిల్లాలో 17 కేజీబీవీలకు గానూ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 5 కేజీబీవీల్లో ఇంటర్ అవకాశం కల్పిస్తున్నట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు. జహీరాబాద్, సదాశివపేట, జిన్నారం, అందోల్, నారాయణఖేడ్ కస్తూర్బాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ తరగతులను ప్రారంభించడం జరుగుతందన్నారు. కేజీబీవీల్లో సీఈసీ, ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు గానూ 80 సీట్లు మాత్రమే కేటాయించడం జరిగిందన్నారు. బడి బయట పిల్లలపై ప్రత్యేక దృష్టి జిల్లావ్యాప్తంగా మెప్మా సంస్థ వారు జనవరిలో నిర్వహించిన సర్వే ప్రకారం జిల్లాలో ఒకటి నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు 448 ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. బడి బయట ఉన్న పిల్లలను దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు విజయలక్ష్మి వివరించారు. -
ఏడాదికో వర్ణం..ఇదేమి చిత్రం
రాయవరం (మండపేట): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో.. అందరూ సమానమనే భావన కలిగించేందుకు ప్రభుత్వం ఏటా యూనిఫామ్స్ పంపిణీ చేస్తోంది. విద్యా హక్కు చట్టంలో భాగంగా ఒకటో తరగతి నుంచి ఎని మిదో తరగతి విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నారు. అయితే వీటి పంపిణీ ఏటా అపహాస్యంపాలవుతోంది. ఒక్కో ఏడాది ఒక్కో రంగులో వస్త్రాన్ని సరఫరా చేస్తుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది మాదిరిగా కాకుండా ఈ ఏడాదైనా విద్యార్థుల సైజులకు సరిపడా యూనిఫామ్ సరఫరా చేయాలని పలువురు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో యూనిఫామ్ రంగు మార్చారు. విద్యార్థులు ధరించే యూనిఫామ్‌లో ప్యాంట్/స్కర్ట్ రంగులో మార్పు లేనప్పటికీ షర్ట్ రంగు, డిజైన్ మార్చారు. గతంలో గళ్లతో కూడిన స్కైబ్లూ రంగు షర్ట్ సరఫరా చేయగా ఈసారి ప్లెయిన్ నీలి రంగు షర్ట్‌ను సరఫరా చేశారు. అంతకు రెండు సంవత్సరాల ముందు పచ్చ రంగు ప్యాంట్, షర్ట్ పంపిణీ చేశారు. గత విద్యా సంవత్సరంలో పంపిణీ చేసిన యూనిఫామ్ నాణ్యత బాగా నాసిరకంగా ఉందని, షర్ట్ వివిధ రకాల షేడ్స్‌లో పంపిణీ చేశారు. దూరం దూరంగా కుట్లు వేయడంతోపాటు ఇచ్చిన కొద్ది రోజులకే దుస్తులు విడిపోతున్నాయని తల్లిదండ్రులు తెలిపారు. మూడు నెలలు ఆలస్యంగా.. జిల్లాలో ఉన్న 3,347 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 3.24 లక్షల మంది విద్యార్థులకు గత ఏడాది యూనిఫామ్ పంపిణీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలోనూ అంతే సంఖ్యలో ఒక్కొక్కరికి రెండేసి జతల వంతున పంపిణీ చేయాల్సి ఉంది. పాఠశాలలుపునఃప్రారంభం నాటికి అందజేయాల్సి ఉండగా గత ఏడాది సెప్టెంబర్ నాటికి 2.43 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే సరఫరా చేశారు. అనంతరం కొద్ది నెలల తేడాలో 81 వేల మంది విద్యార్థులకు అందజేశారు. ఒక్కో యూనిఫామ్‌కు క్లాత్ ఖర్చుల కింద రూ.160, కుట్టు ఖర్చుల కింద రూ.40ను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఏటా ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు విద్యా హక్కు చట్టం కింద యూనిఫామ్ పంపిణీ చేస్తున్నారు. క్లాత్, కుట్టే బాధ్యతను ఆప్కో సంస్థ దక్కించుకుంది. సాధారణంగా ఏటా క్లాత్‌ను ఆప్కో సంస్థ సరఫరా చేస్తుండగా గత విద్యా సంవత్సరంలో దుస్తులు కుట్టే బాధ్యతను ఆప్కో చేజిక్కించుకుంది. నామమాత్రమవుతున్న ఎస్ఎంసీలు... యూనిఫామ్స్ క్లాత్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తే పాఠశాల ఎస్‌ఎంసీల పర్యవేక్షణలో స్థానికంగా ఉన్న మహిళా శక్తి సంఘాలకు కుట్టు బాధ్యతను అప్పగించాల్సి ఉంది. ఏటా యూనిఫామ్‌ను మహిళా శక్తి సంఘాల ద్వారా స్థానికంగా ఉన్న టైలర్లకు అప్పగించగా, గత ఏడాది మాత్రం ఆప్కో సంస్థ కుట్టు బాధ్యతలు తీసుకుంది. తరగతుల వారీగా కొలతలతో కుట్టి సరఫరా చేయడంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. క్షేత్రస్థాయిలో విద్యార్థుల శారీరక కొలతలకు, సరఫరా చేసిన యూనిఫామ్ కొలతలకు మధ్య తేడాలుండడంతో విద్యార్థులకు ఏ మాత్రం సరిపడకపోవడంతో వాటిని ధరించలేని పరిస్థితి తలెత్తింది. సరిపడని యూనిఫామ్‌ను ఆయా పాఠశాలల హెచ్ఎంలకు చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు తిరిగి ఇచ్చేశారు. ఉపాధ్యాయులు సర్దుబాటు చేయలేక, సమాధానం చెప్పలేక తలలు పట్టుకున్నారు. యూనిఫాం మారుస్తామని అధికారులు చెప్పినా, కార్యరూపం దాల్చలేదు. ఈ ఏడాదైనా క్లాత్‌ను సరఫరా చేసి, కుట్టు బాధ్యతను ఎస్‌ఎంసీల పర్యవేక్షణలో స్థానిక టైలర్లకు అప్పగిస్తేనే ప్రయోజనం ఉంటుందని పలువురు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోతే ఎస్ఎంసీలు నామమాత్రంగా మిగిలే అవకాశం ఉంటుంది. పాఠశాలలు పునఃప్రారంభానికి.. పాఠశాలల పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు పూర్తి స్థాయిలో యూనిఫామ్స్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారులు అడిగిన ఇండెంట్ పెట్టాం. వచ్చే విద్యా సంవత్సరానికి 3 లక్షల ఆరు వేల 303 మందికి యూనిఫాం సరఫరా చేయనున్నాం. యూనిఫాం క్లాత్ సరఫరా అవుతుందా? కుట్టిన యూనిఫామ్స్ సరఫరా అవుతుందా? అనే విషయం రాష్ట్రస్థాయిలో నిర్ణయమవుతుంది. – మేకా శేషగిరి, పీవో, ఎస్ఎస్ఏ, కాకినాడ -
యూనిఫాం ఇవ్వలేదని డ్రైవర్ ధర్నా
తిరువొత్తియూరు: యూనిఫాం ఇవ్వలేదని ప్రభుత్వ బస్సు ముందు కూర్చొని డ్రైవర్ ధర్నా చేసిన సంఘటన దిండుక్కల్‌లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. దిండుకల్ సమీపం వత్తలగుండు ఊర్కాలన్ ఆలయ వీధికి చెందిన సురేష్ దిండుకల్ ప్రభుత్వ రవాణా సంస్థ శాఖ డిపో–3లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం దిండుకల్ నుంచి కుములికి వెళ్లడం కోసం బస్సును తీశాడు. ఆ సమయంలో అతను యూనిఫారం ధరించలేదు. దీన్ని గమనించిన ట్రాన్స్‌పోర్టు డిపో సహాయ ఇంజినీర్ అక్కడికి చేరుకుని సురేష్‌ను అడ్డుకున్నాడు. దీంతో డ్రైవర్‌కు సహాయ ఇంజనీర్‌కు మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆగ్రహం చెందిన డ్రైవర్ సురేష్ బస్సు ముందు కూర్చొని ధర్నా చేశాడు. రవాణసంస్థ అధికారులు యూనిఫాం అందచేయకపోవడాన్ని ఖండిస్తూ నినాదాలు చేశాడు. సురేష్ మాట్లాడుతూ తాను 2009 నుంచి పర్మినెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఏడాదికి రెండు జతల యూనిఫాం ఇవ్వాల్సి ఉంది. రెండేళ్లుగా యూనిఫాం అందజేయలేదని, 2014 నుంచి యూనిఫాం కుట్టు కూలి నగదును ఇవ్వలేదని, దీనిపై మదురై డిపో జనరల్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని తెలిపాడు. అధికారులు యూనిఫాం, కుట్టు కూలి నగదు అందజేయాలని కోరాడు. -
ఇక కార్ల ధరలు మోతే..?
సాక్షి, న్యూఢిల్లీ:భారతదేశంలో డీజిల్ వాహనాలు, ఇతర ఖరీదైన కార్లు త్వరలోనే మరింత ప్రియం కానున్నాయి. కొత్త కార్లపై దేశవ్యాప్తంగా కొత్త ఏకీకృత పన్ను అమలుకు రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. అన్ని రకాల వాహనాలపై వన్ నేషన్-వన్ పర్మిట్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు మంటలు పుట్టిస్తోంటే వాహనదారులకు మరో షాక్ తగిలింది. అలాగే డీజిల్ వాహనాలపై పన్నును 2శాతం పెంచాలని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ ప్రతిపాదించి. విద్యుత్ వాహనాలపై పన్నులు తగ్గించాలని సిఫారసు చేసింది. డీజిల్ వాహనాలపై 2 శాతం వరకు పన్నులు విధించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఓ సర్క్యులర్ జారీ చేసింది. అలాగే శుక్రవారం వరుస ట్వీట్లు చేసింది. తాజా పన్ను ప్రతిపాదనలు అమల్లోకి వస్తే అటు డీజిల్ వాహనాలు, ఇటు ఎస్‌యూవీల ధరలు కొండెక్కడం ఖాయం. ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులను మరింత తగ్గించాలని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. వాహనాల కోసం ప్రత్యామ్నాయ ఇంధనాన్ని, విద్యుత్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహమిచ్చే దిశగా ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులు తగ్గించాలని కోరింది. ప్రస్తుతం వీటిపై 12శాతం పన్ను ఉంది. దీన్ని మరింత తగ్గిస్తే వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారని మంత్రిత్వ శాఖ ఆలోచన. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ ప్రతిపాదనల ప్రకారం డీజిల్ వాహనాలపై పన్ను 2శాతం పెరగనుంది. ప్రస్తుతం 4 మీటర్ల కంటే తక్కువ పొడవు, 1.5 లీటర్ల కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం గల డీజిల్ కార్లపై 31శాతం పన్ను ఉంది. తాజా ప్రతిపాదనలతో ఇది 33శాతం కానుంది. దీంతో జీఎస్టీకి ముందు డీజిల్ కార్లపై పన్నులు ఎలా ఉండావో.. మళ్లీ అలాగే ఉండనున్నాయి. కాగా తాజా ప్రతిపాదనలు ఎపుడు అమల్లోకి వచ్చేది అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. 1/4 GoM on Transport deliberates upon One Nation- One Tax and One Nation- One Permit in Guwahati today.@nitin_gadkari @transform_ind @PMOIndia pic.twitter.com/xpspqN1hz8 — MORTHINDIA (@MORTHIndia) April 20, 2018 -
మాకేదీ యూనిఫాం అలవెన్స్?
సాక్షి, హైదరాబాద్: యూనిఫాం సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తమవుతోంది. పోలీస్ శాఖకు మాత్రమే యూనిఫాం అలవెన్స్‌ను పెంచడంపై అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. పోలీస్ శాఖలోని సిబ్బందికి యూనిఫాం అలవెన్స్‌ను రూ.3,500 నుంచి రూ.7,500లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2015లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ సి బ్బంది యూనిఫాం అలవెన్స్‌ను పెంచుతామ ని ఇచ్చిన హామీ మేరకు రెండు నెలల క్రితం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో మిగతా యూనిఫాం సర్వీసులైన జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖ, అటవీ శాఖ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలోని అధికారులు, సిబ్బందిలో అసహనం మొదలైంది. తమకు కూడా పోలీస్ శాఖకు సమానంగా అలవెన్స్ ఇవ్వాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. పదో పీఆర్సీ ప్రకారం.. హోంశాఖ జారీచేసిన జీవోలో, పదో పీఆర్సీ ప్రకారం యూని ఫాం అలవెన్స్‌ను పెంచుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపిం ది. అందులో భాగంగానే సీఎం హామీతో పాటు డీజీపీ ప్రతిపాదనలమేర అలవెన్సును పెంచినట్టు ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఇచ్చిన జీవో 12లో స్పష్టం చేసింది. అయితే పదో పీఆర్సీ ప్రకారం యూనిఫాం సర్వీసుల్లో తమ అలవెన్స్‌ను కూడా రూ.7,500లకు పెంచాలని జైళ్లు, ఫైర్, ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. తమ విభాగాల అధిపతులను కలసినా పట్టించుకోవడం లేదం టూ ఆయా సర్వీసుల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూని ఫాం అలవెన్సుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని లేని పక్షంలో ఆందోళనకు సిద్ధమవుతామని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. పోలీస్ శాఖకు యూనిఫాం అలవెన్స్ కింద వెచ్చిస్తున్న నిధుల్లో తమకు 30% సరిపోతుందని, తాము పోలీస్ శాఖ సిబ్బందికిగానీ, అధికారులకుగానీ వ్యతిరేకం కాదని వారు అంటున్నారు. -
ఆర్టీసీలో ‘ఖాకీ’ కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: తలపై టోపీ.. నేవీ బ్లూ రంగు యూనిఫాం.. క్రమశిక్షణ ఉట్టిపడే రూపం. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ప్రధాన ఆకర్షణగా అట్టహాసంగా జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు సందర్భంగా ప్రతినిధులకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల సిబ్బంది వీరు. వీరిని చూస్తే ఆర్టీసీ సిబ్బంది దర్పం ఇలాగే ఉంటుందనుకుంటారు కదా! కానీ, వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. నాలుగేళ్లుగా ఆర్టీసీ కార్మికులకు యూనిఫామ్ అందటం లేదు. నిధులకు కటకట ఉండటంతో ఆర్టీసీ యాజమాన్యం 2014 నుంచి యూనిఫాం ఇవ్వటం లేదు. గతంలో ఇచ్చిన యూనిఫాంతోనే ఇప్పటివరకు కాలం నెట్టుకొచ్చిన కార్మికులు, ఇప్పుడు అవి చిరిగిపోవటంతో కొత్త సమస్య ఎదుర్కొంటున్నారు. యాజమాన్యం కొత్త యూనిఫాం ఇవ్వటం లేదు. యూనిఫాం లేకుండా విధులకు హాజరైతే స్థానిక అధికారులు ఊరుకోవటం లేదు. దీంతో కార్మికులు సొంతంగా యూనిఫాం కొని విధులకు రావాల్సిన దుస్థితి నెలకొంది. వేతన సవరణ, వసతుల కల్పన, ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం ఇంతకాలం నిరసనలు, ధర్నాలు చేపట్టిన కార్మికులు ఇప్పుడు యూనిఫాం కోసం ఆందోళనకు దిగాల్సి పరిస్థితి ఏర్పడింది. సాధారణ దుస్తులతో విధులకు వెళ్తే అధికారులు క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణిస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతన సవరణ సమయంలో ప్రభుత్వం 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. మరోవైపు యూనిఫాం పంపిణీలో అలసత్వం వహించడం విడ్డూరంగా కనిపిస్తోంది. సొంతంగా కొనక తప్పనిస్థితి డ్రైవర్, కండక్టర్, సెక్యూరిటీ, మెకానిక్ తదితరులు ఖాకీరంగు యూనిఫాం ధరిస్తారు. ఏసీ బస్సుల్లో అయితే నేవీ బ్లూ ఉంటుంది. ప్రస్తుతం ఏసీ బస్సుల సిబ్బందికి మాత్రమే యూనిఫాం ఇస్తున్నారు. గతం లో ప్రతి రెండేళ్లకు మూడు జతల యూనిఫాం దుస్తు లు ఇచ్చేవారు. ప్యాంటు కోసం 1.20 మీటర్లు, చొక్కా కోసం 1.80 మీటర్ల చొప్పున వస్త్రాన్ని అందించేవారు. 2014 ఆరంభంలో ఇచ్చిన మూడు జతల దుస్తులతోనే ఇప్పటివరకు నెట్టుకొచ్చారు. కొన్ని డిపోల్లో కార్మికులు సాధారణ దుస్తుల్లో వెళ్లటంతో అది క్రమశిక్షణ రాహిత్యమంటూ డిపో మేనేజర్లు హెచ్చరించారు. మెమోలు జారీ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీంతో కార్మికులే యూనిఫాం కొంటున్నారు. ఈసారి యూనిఫాం ఇవ్వకుంటే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో యాజమాన్యం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్టు సమాచారం. పోలీసులు, తపాలా శాఖ ఉద్యోగులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు.. ఇలా కొన్ని విభాగాల్లో యూనిఫామే గుర్తింపు. అలాంటి కీలక అంశాన్ని ఆర్టీసీ యాజమాన్యం విస్మరించటం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
యూనిఫాం అందక అవస్థలు
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తాం.. నాణ్యతతోపాటు గుణాత్మకమైన విద్య అందిస్తాం.. విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తామని ఊకపుదంపుడు ఉపన్యాసాలు చేస్తున్న పాలకులు, అధికారులు పాఠశాలలు తెరుచుకుని మూడునర్న నెలలవుతున్నా ఇప్పటికీ జిల్లావ్యాప్తంగా కేవలం 18 మండలాలకు మాత్రమే యూనిపాంను సరఫరా చేశారు. ఇక పాఠ్య పుస్తకాల విషయానికి వస్తే అధార్కార్డులేని విద్యార్థులతోపాటు ఈ ఏడాది అదనంగా చేరిన విద్యార్థులకు ఇంకా పాఠ్యçపుస్తకాలను అందించలేదు. దీని బట్టి చూస్తే విద్యావ్యవస్థ ఎంతమాత్రం çపటిష్టంగా ఉందో అర్థమవుతోంది. ఇటీవల మైదుకూరులో జరిగిన న్యాయసదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లుతూ మైదుకూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను జిల్లా జడ్జి గోకవరపు శ్రీనివాస్ సందర్శించి పిల్లలను పలుకరించారు. మౌలిక వసతులపై ఆరా తీశారు. పాఠ్యపుస్తకాల గురించి కూడా విద్యార్థులతో చర్చించారు. ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందలేదని జిల్లా జడ్జీకి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన హెచ్ఎంను మందలించారు. పాఠశాలల తెరుచుకుని ఇన్ని రోజులైనా ఇంకా ఎందుకు పిల్లలకు పాఠ్యపుస్తకాలు అందలేదని ప్రశ్నించారు. డీఈఓ, ఎంఈఓలు ఏం చేస్తున్నారని నిలదీశారు. మళ్లీ త్వరలో పాఠశాల వస్తానని అప్పటికి కూడా సమస్యలుంటే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించి వెళ్లిపోయారు. పాఠశాలల తెరుచుకున్న మూడున్నరð నెలలు దాటినా.. పాఠశాలలు తెరుచుకుని మూడున్నర నెలలు దాటినా నేటికీ కేవలం 18 మండలాల్లో పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే స్కూల్ యూనిఫాంలను అందించారు. రెండు మండలాలకు రెండు, మూడు రోజుల్లో పంపిణీ చేయనున్నారు. మిగతా 31 మండలాలకు ఈనెల చివరి లోపు అందిస్తామని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి రవిశంకర్ తెలిపారు. మూడు కేంద్రాలలో యూనిఫాం తయారీ స్కూల్ యూనిఫాంలçను కడపలోని మోస్మా ఆధ్వర్యంలో, అలాగే పోట్లదుర్తిలోని కుట్టుకేంద్రంతోపాటు ఖాజీపేటలోని నందిని ప్రాబ్రిక్స్లో పిల్లల యూనిఫాంలను కుడుతున్నట్లు అధికారులు తెలిపారు. పాఠ్యపుస్తకాలకు సంబంధించి.. యూడైస్ ప్రకారం రెగ్యులర్‌గా వచ్చే అందరి పిల్లలకు పుస్తకాలను అందజేశారు. ఈ ఏడాది అదనంగా చేరిన పిల్లలకు , ఆధార్‌కార్డులు లేనివారికి మాత్రం పుస్తకాలను అందించలేదు. వీరికి కూడా అడిషినల్ కోటా కింద డీఈఓతో అనుమతి తీసుకుని అందచేస్తున్నట్లు పుస్తకాల డిపోమేనేజర్ పెంచలమ్మ తెలిపారు. -
అ‘డ్రస్’ లేదు
– యూనిఫాం పంపిణీలో సందిగ్ధం – ఇప్పటిదాకా ఇండెంట్ కూడా తీసుకోని అధికారులు – గత తప్పిదాలు పునరావృతం ముదిగుబ్బ మండలంలో దాదాపు 80 స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో 1–8 తరగతుల విద్యార్థులు 6,900 మంది దాకా ఉన్నారు. 2016–17 విద్యా సంవత్సరంలో కేవలం ఏడు స్కూళ్ల విద్యార్థులకు మాత్రమే యూనిఫాం పంపిణీ చేశారు. తక్కిన స్కూళ్ల విద్యార్థులకు నేటికీ అందలేదు. జిల్లాలోని యూనిఫాం అందని ఇలాంటి స్కూళ్లు చాలానే ఉన్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ ఏడాది కూడా యూనిఫాం పంపిణీపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం మండలాల నుంచి ఇండెంట్కూడా తెప్పించలేదు. దీంతో యూనిఫాం పంపిణీపై ఈ ఏడాది కూడా సందిగ్ధం నెలకొంది. - అనంతపురం ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 12న పునఃప్రారంభమయ్యాయి. సర్వశిక్షా అభియాన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1–8 తరగతుల విద్యార్థులకు సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా ఏటా రెండు జతల యూనిఫాం సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 3,844 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో సుమారు 2,99,632 మంది విద్యార్థులు 1–8 తరగతుల విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు జతల ప్రకారం 5,99,264 జతల యూనిఫాం అవసరం. 1–7 తరగతుల బాలురకు చొక్కా నిక్కర్, బాలికలకు చొక్కా స్కర్టు ఇవ్వాలి. 8వ తరగతి బాలురకు షర్టు, ప్యాంటు, బాలికలకు పంజాబీ దుస్తులు ఇవ్వాలి. ఏటా పాఠశాలలు ప్రారంభమైన రెండు నెలలోపు ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈసారి ఇప్పటిదాకా కనీసం ఎంతమంది విద్యార్థులున్నారు... ఎంత వస్త్రం అవసరం అనే ఇండెంట్ కూడా మండల విద్యాశాఖ అధికారుల నుంచి తీసుకోలేదు. పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో విద్యార్థులు కొత్త యూనిఫాం ఇప్పట్లో అందే పరిస్థితి కనిపించడం లేదు. మండల విద్యాశాఖ అధికారుల ద్వారా ఇండెంట్ తీసుకుని ఆప్కో నుంచి వస్త్రం సరఫరా చేసి, కుట్టు పూర్తయి విద్యార్థులకు అందాలంటే 4–5 నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఏటా ఇదే తంతు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులు పాఠశాల ప్రారంభం రోజునుంచే యూనిఫాంతో తరగతులకు వెళ్తుండగా...సర్కారు బడుల్లోని విద్యార్థులకు మాత్రం ఈ పరిస్థితి లేదు. పాఠశాల నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకు అలసత్వం కారణంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనీఫాం పంపిణీలో ప్రతిసారీ ఆలస్యం జరుగుతోంది. ఇండెంట్ తెప్పిస్తున్నాం యూనిఫాంకు సంబంధించి అన్ని మండలాల విద్యాశాఖ అధికారుల నుంచి ఇండెంట్ తెప్పించుకుంటున్నాం. ఇప్పటిదాకా 20 మండలాల నుంచి వివరాలు అందాయి. ఈ నెల 28వ తేదీ వరకు గడువు ఇచ్చాం. ఇండెంట్ రాగానే రాష్ట్ర అధికారులకు పంపుతాం. ఇండెంట్ మేరకు వస్త్రం సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – సుబ్రమణ్యం, పీఓ, ఎస్ఎస్ఏ -
అమ్మో.. చదువుకొనలేం!
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) ఇన్నాళ్లూ స్కూలుకు వెళ్లాలంటే పిల్లలు భయపడేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు భయపడుతున్నారు. పిల్లల చదువుకు ఎంత ఫీజు కట్టమంటారో.. బస్సుకు ఎంత చెల్లించమంటారో అని.. ఇక పుస్తకాలు, టై, యూనిఫాం, బెల్టు, షూ.. అంటూ ఎంత బాదేస్తారో అంటూ గుండెల్లో గుబులు. పోనీ ఇవన్నీ బయట తీసుకుందామంటే యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. ఇలా బడులు తెరిచే రోజులు దగ్గర పడే కొలదీ తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతోంది. జిల్లాలో చిన్నా చితకా ప్రైవేట్ పాఠశాలలు, ఒక మోస్తరు సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కలిపి సుమారు 1200 ఉన్నాయి. వీటిలో సుమారు 2.20 లక్షల మంది విద్యార్థులు అభ్యాసం చేస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థికి ఫీజు కింద సుమారు రూ.6 నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫాం, టై, బెల్టు, షూ, వంటి సామగ్రి రూపంలో మరో రూ.5 నుంచి 7 వేల వరకూ బాదుడు. పుస్తకాల విషయంలో మరీ దోపిడీ. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే సుమారు 40 నుంచి 60 శాతం అధికంగా విద్యా సంస్థలు వసూలు చేస్తున్నాయని తల్లిదండ్రుల ఆరోపణ. బహిరంగ మార్కెట్లో పుస్తకాలపై 10 నుంచి 25 శాతం డిస్కౌంట్ ఇస్తుండగా విద్యా సంస్థల్లో మాత్రం ఒక్క రూపాయి కూడా తగ్గించడం లేదు. ఈ పరిస్థితి జిల్లా కేంద్రం ఏలూరుతో పాటు భీమవరం, తణుకు, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నిడదవోలు వంటి ప్రాంతాల్లో అధికంగా ఉంది. కన్నెత్తి చూడని వాణిజ్య పన్నుల శాఖ చిన్నచిన్న దుకాణాలపై కూడా పన్నులు విధిస్తూ వసూలు చేసే వాణిజ్య పన్నుల శాఖ ప్రైవేటు విద్యా సంస్థల్లో సాగుతున్న ఇటువంటి వ్యాపారంపై కన్నెత్తి చూడ్డంలేదు. జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థలు ఏటా విద్యా సంవత్సరం ఆరంభంలో సుమారు రూ.300 కోట్లపైనే వ్యాపారం చేస్తున్నాయని అంచనా. దానిపై ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం కూడా రావడం లేదు. ఇదిలా ఉండగా పెద్దనోట్ల రద్దు ప్రభావంతో అధిక మొత్తంలో నగదు అందుబాటులో లేని పరిస్థితి. కాగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో విక్రయిస్తున్న పుస్తకాలు, ఇతర సామగ్రికి చెల్లింపులు చేయడానికి వారి వద్ద స్వైపింగ్ యంత్రాలు కూడా అందుబాటులో లేకపోవడం తల్లిదండ్రులకు విషమ పరీక్ష. జీఓలు ఏం చెబుతున్నాయంటే.. జీవో నెంబర్ ఎంఎస్ 42 ప్రకారం ఫీజులను పెంచాలంటే డిస్ట్రిక్స్ రెగ్యులైజేషన్ కమిటీ అనుమతి తీసుకోవాలి. జీవో నెంబర్ ఎంఎస్ 246 ప్రకారం పాఠశాలల నిర్వాహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలి. సీబీఎస్ఈ చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో పేరెంట్ టీచర్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలి. ఈ అసోసియేషన్లలో ఇద్దరు తల్లిదండ్రులకు భాగస్వామ్యం కల్పించాలి. కమిటీ నిర్ణయించిన తరువాతనే ఫీజులను పెంచాలి. జీవో ఎంఎస్ నెంబర్ 1994 జనవరి ఒకటో తేదీ ప్రకారం పాఠశాలలు ఐదు శాతానికి తగ్గకుండా లాభాలను మాత్రమే ఆశించాలి. వసూలు చేసిన ఫీజుల్లో 50 శాతం మొత్తాన్ని ఉపాధ్యాయుల వేతనాలకు చెల్లించాలి. ఏటా వార్షిక నివేదికలు, ఆడిట్ రిపోర్టులను ప్రభుత్వానికి సమర్పించాలి. జీవో ఎంఎస్ నెంబర్ 91 ప్రకారం వన్‌టైం ఫీజుగా రూ.100, రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.500 రిఫండబుల్ కాషన్ డిపాజిట్ రూ.5 వేలకు మించకుండా తీసుకోవాలి. జీవోలోని సెక్షన్ 1(సీ) ప్రకారం పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాంలను స్కూల్ యాజమాన్యం సూచించే చోటే కొనాలన్న ఖచ్చితమైన నిబంధనలేవీ పెట్టరాదు. వీటి అమ్మకాలకు పాఠశాలల్లో కౌంటర్లు ఏర్పాటు చేయరాదు. విద్యార్ధుల తల్లిదండ్రులకు నచ్చిన షాపుల్లో కొనుగోలు చేయవచ్చు. 2013 మే 16వ తేదీన జారీ చేసిన సీఅండ్డీఎస్ఈ ఆర్సీ నెంబర్ 780 సెక్షన్ ప్రకారం పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్, ఐఐటీ, ఒలిపింయాడ్, కాన్సెప్ట్, ఈ టెక్నో వంటివి తగిలించరాదు. కేవలం పాఠశాల అని మాత్రమే పేర్కొనాలి. కానీ ఆ నిబంధనలు పాటించని పలు ప్రైవేట్ విద్యా సంస్థలు ఇప్పటికీ ఆయా పేర్లు పెట్టి తల్లిదండ్రులను ఆకర్షిస్తూ వారిని ఈ విధంగా దోచుకుంటున్నాయని ఆరోపణ. అధికారుల పర్యవేక్షణ కొరవడింది ప్రైవేటు విద్యా సంస్థల్లో జరుగుతున్న ఇటువంటి దోపిడీపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లిష్ మీడియం కూడా సమాంతరంగా ప్రవేశపెడితే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే అవకాశం ఉంది. తెల్లరేషన్ కార్డు ఉన్న వారందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలనే నిబంధన విధిస్తే పరిస్థితి మెరుగుపడుతుంది. పువ్వుల ఆంజనేయులు, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు -
కుట్టే వారేరి!
నల్లజర్ల : ప్రభుత్వ పాఠశాలలు మరో 20 రోజుల్లో తెరుచుకోనున్నాయి. జిల్లాలోని 48 మండలాల్లో 1నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 2,17,137. ఒక్కొక్కరికీ రెండు జతల చొప్పున 4,34,274 జతల ఏకరూప దుస్తుల(యూనిఫామ్)ను పంపిణీ చేయాల్సి ఉంది. వీటిలో 7 మండలాలకు సంబంధించి సుమారు 40 వేల మంది విద్యార్థుల కోసం 80 వేల జతల ఏకరూప దుస్తులకు సరిపోయే వస్త్రం మాత్రమే వచ్చింది. కత్తిరించి పంపించిన ఈ క్లాత్‌ను టైలర్ల చేత కుట్టించి విద్యార్థులకు పంపిణీ చేయాల్సి ఉంది. జతకు రూ.50 చొప్పున కుట్టు కూలీ చెల్లించనున్నారు. 48 మండలాలకు గాను 7 మండలాల విద్యార్థులకు మాత్రమే క్లాత్ వచ్చిందని.. మిగిలిన మండలాలకు ఎప్పటికి వస్తుందో తెలియదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. టైలర్లు దొరక్క అవస్థలు పడుతున్నామని ఉపాధ్యాయులు వాపోతున్నారు. బడులు తెరిచే నాటికి క్లాత్ రావటం.. యూనిఫామ్ కుట్టించడం కష్టసాధ్యమని చెబుతున్నారు. -
ఆర్టీసీలో యూనిఫామ్ లొల్లి!
♦ మూడేళ్లుగా నిలిచిపోయిన సరఫరా ♦ పాత దుస్తులు చిరిగిపోవటంతో సాధారణ వస్త్రాల్లో విధులకు సిబ్బంది ♦ అభ్యంతరం చెబుతున్న అధికారులు.. సిబ్బందికి మెమోలు.. సాక్షి, హైదరాబాద్: యూనిఫామ్ లేకుండానే ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది గందరగోళానికి, వివాదాలకు కారణమవుతోంది. యూనిఫామ్‌ను సిబ్బందికి ఆర్టీసీ యాజమాన్యమే సరఫరా చేస్తుంది. కానీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆర్టీసీ గడచిన మూడేళ్లుగా యూనిఫామ్ సరఫరా చేయటం లేదు. దీంతో పాతవాటితోనే నెట్టుకొస్తున్న సిబ్బంది.. ఇప్పుడవి చిరిగిపోవటంతో సాధారణ దుస్తుల్లో విధులకు వస్తున్నారు. అయితే యూనిఫామ్ నిబంధన అమలులో ఉండటంతో వారికి మెమోలు జారీ చేస్తుండటం.. వివాదాలకు కారణమవుతోంది. 2013 తర్వాత నిలిపివేత.. 2013 తర్వాత యూనిఫామ్ జారీ నిలిచిపోయింది. ఏడాదికి రూ.2.5 కోట్లు దీనికి ఖర్చు చేయాల్సి రావటంతో నిధులకు ఇబ్బంది ఏర్పడి యాజమాన్యం సరఫరాను తాత్కాలికంగా నిలిపేసింది. దీంతో అప్పటి నుంచి సిబ్బంది పాత యూనిఫామ్‌తోనే నెట్టుకొస్తున్నారు. మూడున్నరేళ్లు గడిచిపోవటంతో ఆ దుస్తులు చిరిగిపోయా యి. దీంతో కొన్ని రోజులుగా చాలామంది కార్మికులు సాధారణ దుస్తుల్లో విధులకు వస్తుండటంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొందరు కార్మికులు సొంత ఖర్చులతో యూనిఫామ్ కుట్టించుకున్నారు. రెండు మూడు హెచ్చరికల తర్వాత యూనిఫామ్ లేని సిబ్బందికి అధికారులు మెమోలు జారీ చేస్తున్నారు. సంస్థ యూనిఫామ్ సరఫరా చేయకపోతే తమనెందుకు శిక్షిస్తారంటూ సిబ్బంది ఎదురు ప్రశ్నిస్తుండటంతో అధికారులకు సిబ్బందికి మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల కార్మికులను తిప్పిపంపుతున్నట్లు ఫిర్యాదులొస్తుండగా.. మరికొన్ని చోట్ల మాత్రం అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తూ సాధారణ దుస్తుల్లో వచ్చినా అనుమతిస్తున్నారు. కాగా, నిధుల సమస్య పేరుతో ఆర్టీసీ యూనిఫామ్‌ను జారీ చేయకపోవటం సరికాదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ సిబ్బంది సాధారణ దుస్తుల్లో రావాల్సిన పరిస్థితి మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు.. త్వరలో కార్మికులకు కొత్త యూనిఫామ్ జారీ చేయాలన్న ఆలోచనకొచ్చినట్టు తెలిసింది. -
ఎప్పుడూ ఆలస్యమే..
ఈసారైనా సకాలంలో ఇస్తారా? విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ తీరు వచ్చే విద్యా సంవత్సరానికి 3.27లక్షల మంది అవసరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్వశిక్షా అభియాన్ ఏటా అందజేస్తోన్న యూనిఫామ్ ఎప్పుడూ ఆలస్యంగానే అందజేస్తోంది. విద్యా సంవత్సరం చివర దశలో తప్ప పూర్తి స్థాయిలో అందించలేకపోతోంది. విద్యా సంవత్సరం ప్రారంభం తరువాతే వీటి సరఫరాకు సన్నాహాలు చేస్తుండడంతో ఆలస్యమవుతోందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. ఈసారైనా విద్యా సంవత్సరం ప్రారంభం అయిన వెంటనే యూనిఫామ్ విద్యార్థులకు అందించగలుగుతారో లేదో చూడాలి. - రాయవరం ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే యూనిఫామ్స్ అందజేయాల్సి ఉండగా ఎప్పుడూ ఆలస్యంగా పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా ఇదే పరిస్థితి. ఈ ఏడాది నుంచి నూతన విధానం అమలు చేస్తున్నందున మార్చి 20తోనే ప్రస్తుత విద్యా సంవత్సరం ముగుస్తుందని అంటున్నారు. జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం నాటికైనా యూనిఫామ్స్‌ను పంపిణీ చేయాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఏటా తప్పని జాప్యం.. 2010–11 నుంచి విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫామ్స్‌ను పంపిణీ చేస్తున్నారు. విద్యా హక్కు చట్టంలో భాగంగా 1వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఏటా యూనిఫామ్స్ ఇస్తున్నారు. అయితే ప్రతీ ఏడాది జాప్యం..గందరగోళం చోటు చేసుకుంటుంది. ముందుగానే అధికారులు చర్యలు తీసుకోని పక్షంలో వచ్చే జూన్‌లో యూనిఫామ్స్‌ను విద్యార్థులకు పంపిణీ చేసేందుకు వీలు ఉండదు. ఎందుకిలా జరుగుతోంది? 2011–12లో యూనిఫామ్స్‌కు రావాల్సిన బడ్జెట్ ఆలస్యంగా రావడంతో ఆ ఏడాది చివర్లో పంపిణీ చేశారు. అప్పటినుంచి అదే పరిస్థితి కొనసాగింది. 2013–14 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూనిఫామ్స్‌ను ఆ విద్యా సంవత్సరం చివర్లో పంపిణీ చేశారు. కొత్త సంవత్సరంలో ఎంతమంది చేరతారన్న విషయం తేలనందున ఆగస్టులో ఆప్కో సంస్థకు ఆర్డర్ ఇస్తున్నారు. ఆప్కో సంస్థ యూనిఫామ్స్ క్లాత్‌ను కొంత ఆలస్యంగా పంపుతోంది. దీంతో హడావుడిగా దుస్తులు కుట్టించి పంపిణీ చేసేందుకు విద్యా సంవత్సరం చివరి దశ వచ్చేస్తోంది. 3.17 లక్షల మందికి యూనిఫామ్స్.. 2016–17 విద్యా సంవత్సరంలో 3,984 పాఠశాలలకు చెందిన విద్యార్థులు 3.17లక్షల మందికి రెండు జతల చొప్పున గత అక్టోబర్ నెలాఖరు నాటికి యూనిఫామ్ పంపిణీ చేశారు. కుట్టుకూలీకి సంబంధించిన సొమ్మును 29 మండలాలకు రూ.1.23 కోట్లు ఆయా పాఠశాలల అకౌంట్లకు బదిలీ చేశారు. ఇంకా 35 మండలాలకు రూ.1.10 కోట్లు కుట్టుకూలీ చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుంది యూనిఫామ్స్ పంపిణీలో ఏటా ప్రభుత్వ డొల్లతనం బయట పడుతోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వాల్సిన యూనిఫామ్స్‌ను ఏటా ఆలస్యంగా పంపిణీ చేస్తున్నారు. – పి.సుబ్బరాజు, అధ్యక్షుడు, ఎస్టీయూ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే.. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్‌ను అందజేయాలని ఎప్పటినుంచో కోరుతున్నాం. అయినా పరిస్థితిలో మార్పు లేదు. కుట్టుకూలి పెంచాలని కూడా విన్నవించాం. - టీవీ కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ ముందుచూపు ఉండాలి.. ప్రతి ఏడాది ఆలస్యంగా యూనిఫామ్స్‌ను పంపిణీ చేస్తున్నారు. ఈసారైనా ముందు చూపుతో వ్యవహరించాలి. వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలి. – చింతాడ ప్రదీప్‌కుమార్, ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ ప్రతిపాదనలు పంపించాం.. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి 3.27లక్షల మందికి యూనిఫామ్స్ అవసరమని రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించాం. జూన్ నాటికి యూనిఫామ్ క్లాత్ పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం. – ఇంటి వెంకట్రావు, కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి సర్వశిక్షా అభియాన్ -
దర్జీల పేరిట దగా!
‘ప్రభుత్వ’ విద్యార్థులకు ఇవ్వనున్న యూనిఫాం వస్త్రం పక్కదారి.. స్థానిక టైలర్లను కాదని దళారులకు అవకాశం ‘టెస్కో’కు బదులుగా నాసిరకం బట్టతో దుస్తులు పర్వతగిరి : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్‌కు దీటుగా ఉండాలన్న భావనతో ప్రభుత్వం ఏటా రెండు జతల చొప్పున దుస్తులు అందజేస్తోంది. ఇందులో భాగంగా గతంలో ప్రభుత్వమే దుస్తులు సిద్ధం చేయించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పంపిణీ చేసేది. ఇలా చేయడం ద్వారా సైజుల్లో తేడా వచ్చి విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఈ మేరకు ‘టెస్కో’ ద్వారా నాణ్యమైన బట్ట సరఫరా చేస్తూ స్థానిక దర్జీలకు ఉపాధి కల్పించేందుకు వారితో విద్యార్థులకు బట్టలు కుట్టించాలని నిర్ణయించారు. దీంతో దళారులు రంగప్రవేశం చేసి ఎస్ఎంసీ తీర్మానాలు లేకుండా.. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని టెస్కో ద్వారా వస్త్రం తెచ్చుకుంటున్నారు. ఆ వస్త్రం తో కూడా విద్యార్థులు దుస్తులు తయారు చేయకుండా బయట అమ్ముకుని.. నాసిరకంతో వస్త్రంలో తయారైన దుస్తులు రూపొందించి విద్యార్థులకు అందజేస్తున్నారు. రెండు జతల చొప్పున.. ప్రభుత్వ పాఠశాలల్లో శిశు నుండి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఏటా రెండు జతల చొప్పున దుస్తులను పంపిణీ చేస్తుంది. టెస్కో(ఉమ్మడి రాష్ట్రంలో ఆప్కో) ద్వారా ప్రతీ పాఠశాలకు వస్త్రం పంపిణీ చేస్తుండగా.. స్థానిక దర్జీలతో దుస్తులు సిద్ధం చేయించాలి. ఈసారి విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక ఎనిమిది నెలలకు దుస్తులు పంపిణీ చేసేదుకు రంగం సిద్ధం కాగా.. కొందరు దళారులు అక్రమాలకు తెర లేపారు. ఇందులో కొందరు ఎంఈఓలతో కుమ్మకై పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువ రాయించుకుని సరిపడా వస్త్రంతో స్థానికులను కాదని బయటి దర్జీలతో దుస్తులు సిద్ధం చేయిస్తున్నారు. మిగిలిన బట్టను మార్కెట్లో అమ్ముకుంటున్నారని సమాచారం. ఇక కొందరు టెస్కో నుంచి మొత్తం బట్టను బయట అమ్మేసి నాసిరకం బట్టతో దుస్తులు సిద్ధం చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టెస్కో నుంచి వచ్చే వస్త్రం మీటర్ రూ.120 వరకు ఉండగా.. బయట రూ.60కి దొరికే వస్త్రం ఉపయోగిస్తుండడంతో పెద్దమొత్తంలో దళారులకు లాభం చేకూరుతోంది. శ్రమ దోపిడీ... కొందరు దళారులు మొత్తం వస్త్రాలను బయట సిద్ధం చేయిస్తుండగా మరికొందరు స్థానికుల అతి తక్కువ ధర చెల్లించి కుట్టిస్తున్నారు. డ్రెస్‌కు కావాల్సిన దారం, గుండీలు తదితర సామాన్లను దర్జీలకు అందిస్తారు. ఒక్కో డ్రెస్‌కు రూ.5 చొప్పున సామగ్రి అవసరం కాగా, కుట్టినందుకు డ్రెస్‌కు రూ.10 మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే రూ.15లో డ్రెస్ సిద్ధమవుతుండగా.. ప్రభుత్వం నుంచి మాత్రం దళారులు రూ.40 చొప్పున పొందుతున్నారు. ఇలా డ్రెస్‌కు రూ.25 వరకు దళారుల జేబుల్లో చేరుతోంది. ఇంత తక్కువ ధరకు కుట్టేందుకు సిద్ధంగా లేమని దర్జీలు చెబుతుండగా.. మొత్తమే ఉపాధి కరువవుతోంది. ఇలా వెలుగులోకి.. పర్వతగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు దుస్తులు సిద్ధం చేస్తామని కొందరు దళారులు 20 రోజులుగా ఎంఈఓ, హెచ్‌ం, ఎస్ఎంసీ చైర్మన్ వెంట పడుతున్నారు. స్థానిక దర్జీలు 10 మందికే అవకాశం కల్పిస్తామని ఎస్ఎంసీ చైర్మన్ చెప్పడమే కాకుండా హెచ్ఎంకు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో ఎంఈఓ, హెచ్ఎంలు టెస్కో వద్ద వస్త్రం తెచ్చుకోవాలని దర్జీలను వరంగల్ పంపించారు. అక్కట టెస్కో గోదాంకు వెళ్లగా పర్వతగిరి విద్యార్థుల వస్త్రాన్ని హెచ్ఎం తీసుకున్నట్లు సంతకాన్ని వారు చూపించారు. దీంతో నివ్వెరపోయిన దర్జీలు ఆరా తీయగా.. స్థానిక దర్జీలు వస్తారని భావించి ముందుగానే మండలాన్ని యూనిట్‌గా దళారులు ఏజెంట్ ద్వారా బట్ట తీసుకువెళ్లినట్లు తేలింది. -
గాడితప్పిన విద్యా వ్యవస్థ
–విద్యా సంవత్సం ముగుస్తున్నా పిల్లలకు అందని యూనిఫాం – కంప్యూటర్లున్నా బోధించేవారు లేరు – పిల్లలున్న చోట టీచర్లు లేరు – టీచర్లు ఉన్న చోట పిల్లలు లేరు కదిరి : సర్కారు బడి అనగానే అక్కడ పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులు ఉంటారన్నది అక్షర సత్యం. అలాంటి పిల్లలు చదివే చోట మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే ఇందుకు విరుద్ధంగా జిల్లా విద్యా వ్యవస్థ నడుస్తోంది. విద్యాసంవత్సం ముగింపు దశకు వస్తున్నా ఇప్పటికీ విద్యార్థులకు యూనిఫాం అందజేయలేదు. 100 మంది పిల్లలున్న చోట ఇద్దరు, 20 మంది ఉన్న చోట నలుగురు ఉపాధ్యాయులున్నారు. ఈ పరిస్థితి జిల్లాలో చాలా చోట్ల ఉంది. సాంకేతిక విద్య పేరుతో అన్ని పాఠశాలలకు కంప్యూటర్లు సరఫరా చేసినా... బోధించేందుకు ఫ్యాకల్టీలు లేరు. జిల్లాలో 3,164 ప్రాథమిక, 957 ప్రాథమికోన్నత, 676 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటన్నింటిలో 14,402 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. ఏ పాఠశాలను పరిశీలించినా ఏమున్నది గర్వకారణం అన్న చందంగా సమస్యలు తిష్ట వేశాయి. విద్యార్థులకే కాదు ఉపాధ్యాయులకూ ఉత్పన్నమవుతున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. సమస్యలు ఇలా.. ూ ఈ విద్యాసంవత్సరం మార్చితో ముగియనుంది. కానీ ఇప్పటి దాకా పిల్లలకు యూనిఫాం సరఫరా చేయలేదు. దీంతో చిరిగిన దుస్తులతోనే హాజరవుతున్నారు. - జిల్లా వ్యాప్తంగా 80 శాతం పాఠశాలలకు మరుగుదొడ్లు లేవు. కొన్ని పాఠశాలల్లో ఉన్నా.. నీటి సరఫరా లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. దీంతో పిల్లలే కాకుండా మహిళా టీచర్లు సైతం ఇబ్బంది పడుతున్నారు. -చాలా పాఠశాలలకు అటెండర్లు లేరు. స్వీపర్లు అసలే లేరు. ఈ రెండు పనులూ విద్యార్థులతోనే కానిచ్చేస్తూ పాఠశాల స్థాయిలోనే బాలకార్మికులుగా మార్చేస్తున్నారు. -ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నప్పటికీ వాటిని పిల్లలకు తెలియజెప్పేందుకు బోధకులు లేరు. వాటి రక్షణకు నైట్ వాచ్మ్యాన్లు కూడా లేరు. -చాలా పాఠశాలల్లో పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉంది. ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న చోట విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో ప్రభుత్వ విద్యావ్యవస్థ కుంటుపడుతోంది. - జిల్లా వ్యాప్తంగా చాలా మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు లేరు. దీంతో ఆయా మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడే ఎంఈఓ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన రెండింటికీ న్యాయం చేయలేక పోతున్నారు. - ఉపాధ్యాయులకు విద్యాసంవత్సం మధ్యలో టీఏఆర్‌సీ, ఆర్‌ఎంఎస్‌ఏ లాంటి శిక్షణా తరగతులు నిర్వహించడం వలన సింగిల్ టీచర్ ఉన్న చోట బడులు మూతబడుతున్నాయి. దీంతో రెగ్యులర్ సిలబస్ పూర్తి చేయలేక పోతున్నారు. - ఉపాధ్యాయులకు న్యాయబద్దంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన రెండు డీఏలు, పది నెలల అరియర్స్, సర్వీస్ రూల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. హెల్త్ కార్డులున్నా వాటితో టీచర్లకు నగదు రహిత వైద్యం అందడం లేదు. -
కుట్టుకూలీ మాటేమిటి సారూ!
ఆప్కోకు రూ.10.16 కోట్లు టైలర్లకు రూ.2.54 కోట్లు పేరుకుపోతున్న యూనిఫామ్ బకాయిలు సతమతమవుతున్న హెచ్ఎంలు విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాల విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొంత ఆలస్యంగానైనా విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేసి సర్వశిక్షాభియా¯ŒS ఊపిరి పీల్చుకుంది. గతంలో సర్వశిక్షాభియా¯ŒS కుట్టించి ఇవ్వగా, ఈ ఏడాది క్లాత్‌ను పాఠశాలలకు సరఫరా చేశారు. ఈ క్లాత్‌ను హెచ్ఎంలు టైలర్లకు ఇచ్చారు. ఇప్పటికే చాలా పాఠశాలల్లో యూనిఫామ్స్‌ను టైలర్లు కుట్టి ఇవ్వగా.. విద్యార్థులకు అందజేశారు. అయితే నేటికీ పాఠశాల అక్కౌంట్లకు కుట్టుకూలీ నగదు జమకాలేదు. టైలర్లు తమకు కుట్టుకూలీ ఇవ్వాలంటూ హెచ్‌ఎంలపై ఒత్తిడి తెస్తున్నారు. – రాయవరం 3.17 లక్షల మందికి యూనిఫాం జిల్లాలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న మూడు లక్షల 17 వేల 714 మంది విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేశారు. ఒక్కొక్క విద్యార్థికి యూనిఫాం నిమిత్తం ప్రభుత్వం రూ.200 వెచ్చిస్తోంది. యూనిఫారం సరఫరా చేసే ఆప్కో కంపెనీకి రూ.160, కుట్టుకూలీకి రూ.40 చెల్లిస్తుంది. ఈ విధంగా జిల్లాలో ఉన్న మూడు లక్షల 17 వేల 714 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్స్‌కు రూ.10 కోట్ల 16 లక్షల 68 వేల 480లు, కుట్టుకూలీ నిమిత్తం రూ.రెండు కోట్ల 54 లక్షల 17 వేల 120లను చెల్లించాల్సి ఉంది. ఆప్కోకు చెల్లించాల్సిన సొమ్ము మాటెలా ఉన్నా.. కుట్టుకూలీకి చెల్లించాల్సిన సొమ్ము పాఠశాల అకౌంట్లకు విడుదల కాకపోవడంతో హెచ్ఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుట్టుకూలీ సొమ్ము కోసం టైలర్లు, డ్వాక్రా మహిళలు పాఠశాలలకు తిరుగుతున్నట్లు చెబుతున్నారు. జతకు రూ.40 చెల్లింపు యూనిఫామ్స్‌ను గతంలో సర్వశిక్షాభియా¯ŒS కుట్టించి ఇవ్వగా, ఈ ఏడాది క్లాత్‌ను పాఠశాలలకు సరఫరా చేశారు. ఈ క్లాత్‌ను హెచ్ఎంలు డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. కొన్ని చోట్ల డ్వాక్రా సంఘాల్లోని టైలర్లు యూనిఫామ్స్‌ను కుట్టారు. దారాలు, బటన్లు, తదితర సామగ్రి కొనుగోలు నిమిత్తం అడ్వాన్సుగానైనా కొంత సొమ్ము ఇవ్వాలని టైలర్లు హెచ్ఎంలను కోరారు. నిధులు విడుదల కాలేదని తెలపడంతో టైలర్లు ముందస్తు పెట్టుబడి పెట్టి యూనిఫామ్స్ కుట్టి పాఠశాలలకు అందజేశారు. జతకు రూ.40 వంతున రెండు జతలకు రూ.80లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు ఎస్ఎస్ఏ అధికారులు కుట్టుకూలి నగదును పాఠశాల అక్కౌంట్లకు జమ చేయలేదు. -
ఐదు నెలలు.. అ‘డ్రెస్‘ లేదు..!
పాత దుస్తులతోనే పాఠశాలకు.. సగం విద్యాసంవత్సరం గడిచినా దుస్తులు కరువు వస్త్రం కొనుగోలు ధర నిర్ణయించని ప్రభుత్వం పట్టించుకోని విద్యాశాఖ ఉన్నతాధికారులు వైరా : పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు దుస్తులు అందిస్తాం.. ఇది పాత మాట.. ప్రస్తుతం ఐదు నెలలు గడుస్తోంది.. సగం విద్యాసంవత్సరం గడిచిపోయింది.. దుస్తుల పంపిణీ ఏమోగానీ.. అవసరమైన వస్త్రం ఎంపిక కనీసం చేపట్టలేదు.. పాతవి.. చిరిగిన దుస్తులతోనే విద్యార్థులు నెట్టుకొస్తున్నారు.. పాఠశాలల తనిఖీలకు వచ్చిన రాష్ట్రస్థాయి అధికారులు ఉపాధ్యాయుల పనితీరు, సమస్యలను పరిశీలించారే తప్ప విద్యార్థుల దుస్తుల గురించి పట్టించుకోనట్లు తెలుస్తోంది. విద్యార్థుల మధ్య అసమానతలు తొలగిస్తూ.. అంతా సమానమనే భావన కల్పించేందుకు ప్రభుత్వం డ్రెస్ కోడ్ అమలు చేస్తోంది. జిల్లాలోని 21 మండలాల్లో 1,591 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 2,13,093 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 49,336, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 28,983, ఉన్నత పాఠశాలల్లో 1,34,774 మంది విద్యార్థులు చదువుతున్నారు. కుల మతాలు, పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదివే బాలబాలికలకు ఒకే రకం దుస్తులు ఉండా లన్న నిబంధన ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కొన్నేళ్లుగా ప్రభుత్వమే దుస్తులు ఉచితంగా పంపిణీ చేస్తోంది. మొదట కుట్టించిన దుస్తులను పంపి ణీ చేసేవారు. విద్యార్థులకు పంపిణీ చేసిన దుస్తులు చిన్నవి, పెద్దవి కావడంతో ప్రభుత్వం ఆప్కో ద్వారా వస్త్రం కొనుగోలు చేసి.. ఎస్ఎంసీ ద్వారా కుట్టించి విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేసేవారు. జతకు రూ.40 చొప్పున కుట్టుకూలీ ఇచ్చేవారు లేకపోవడంతో ఈ బాధ్యతను కొన్ని సంస్థలకు అప్పగించారు. ఒక వేళ వస్త్రం కొనుగోలు చేసినా పాఠశాలలకు చేర్చి.. విద్యార్థులకు పంపిణీ చేయడానికి చాలా సమయమే పడుతుంది. ఇప్పటికే సగం విద్యాసంవత్సరం ముగిసిపోయింది. అందరికీ ఒకే కొలత... విద్యార్థులకు దుస్తులు అందజేయటం వరకు బాగానే ఉన్నా.. అందరికీ ఒకే విధంగా కుట్టించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత ఏడాది జిల్లావ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో చదివిన విద్యార్ధులకు రెండు జతల చొప్పున దుస్తులు అందజేశారు. ఒక్క జత వస్త్రానికి రూ.160, కుట్టేందుకు రూ.40 వెచ్చించారు. దర్జీ అందరికీ ఒకే కొలత ప్రకారం కుట్టి పాఠశాలలకు పంపిణీ చేశారు. దీంతో కొందరు విద్యార్థులు పొడవుగా ఉండటం, మరి కొందరు లావుగా ఉండటంతో ఆ దుస్తులు వేసుకున్న విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈసారి అనుమానమే... ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచి ఐదు నెలలు గడుస్తున్నా దుస్తుల పంపిణీ జాడేలేదు. ఇప్పటివరకు వస్త్రం కొనుగోలు చేయకపోవడంతో దుస్తులను పంపిణీ చేస్తారనే నమ్మకం కూడా లేదు. వేసవి సెలవుల్లోనే వస్త్రం ఎంపిక చేయడం.. కుట్టడం ప్రక్రియ చేపడితే పాఠశాలలు తెరిచేలోగా పంపిణీకి సిద్ధం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు వస్త్రానికి సంబంధించిన ధరను ప్రభుత్వ ఖరారు చేయకపోవడంతో కొనుగోలు చేయలేదు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. -
యూనిఫాంపై అయోమయం !
అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాం పంపిణీపై అయోమయం నెలకొంది. క్లాత్ ఇస్తారా.. కుట్టించి ఇస్తారా అనే విషయంలో సందిగ్ధం నెలకొంది. ప్రతిసారి స్కూళ్లకు క్లాత్ పంపిణీ చేసి అక్కడి నుంచి దర్జీల ద్వారా కుట్టించేవారు. అయితే ఈసారి అప్కో వారే కుట్టు బాధ్యతను తీసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. రాష్ట్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఈ కారణంగానే క్లాత్ సరఫరా పెండింగ్ పడుతూ వస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై మూన్నెళ్లు గడిచినా ఇప్పటిదాకా అతీగతీ లేదు. విద్యార్థులకు అవసరమైన యూనిఫాం క్లాత్ కొనుగోలుకు పాఠశాలల వారీగా ఎస్ఎస్ఏ అధికారులు ఇండెంట్ తెప్పించుకుని ప్రభుత్వానికి నివేదిక పంపారు. జిల్లాలోని విద్యార్థుల క్లాత్ కొనుగోలుకు రూ.8,77,45,920 నిధులు అవసరం. ఇందులో రూ. 4,38,72,960 నేరుగా ఎస్పీడీ అధికారులే అప్కోకు అడ్వాన్స్‌గా చెల్లించారు. గతేడాది పంపిణీ చేసిన రంగు దుస్తులే ఈసారీ పంపిణీ చేయాలని ఎస్పీడీ కార్యాలయం నుంచి జిల్లాకు ఉత్తర్వులు అందాయి. రంగు వరకు స్పష్టత ఇచ్చారని అయితే క్లాత్ సరఫరా చేస్తారో, కుట్టించిన దుస్తులు సరఫరా చేస్తారా అనే విషయంలో ఎలాంటి సమాచారం లేదని అటు ఎస్ఎస్ఏ అధికారులు, ఇటు అప్కో అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై ఎస్ఎస్ఏ పీఓ దశరథరామయ్యను సాక్షి వివరణ కోరగా రాష్ట్ర కార్యాలయం నుంచి మాకు ఇప్పటి దాకా తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. క్లాత్ సరఫరా కోసం ఇండెంట్ పంపామని మూడు రోజుల క్రితం రాష్ట్ర అధికారులు కూడా ఆరా తీశారన్నారు. -
యూ'నో'ఫాం
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందించేందుకు ప్రభుత్వ పెద్దలు అపసోపాలు పడుతున్నా.. క్షేత్రస్థాయిలో బాలారిష్టాలే దాటలేదు. ముఖ్యంగా అందరికీ సకాలంలో యూనిఫాం పంపిణీ చేయడం ప్రభుత్వానికి అధికారులకు గగనంగా మారుతోంది. ఏళ్లు గడుస్తున్నా.. ఈ సమస్యనే అధిగమించలేకపోతున్నారు. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడిచినా యూనిఫాం గురించి అతీగతీ లేదు. జిల్లా విద్యాశాఖాధికారులు యూనిఫాంకు ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో ఇంకా క్లాత్ కొనాలా వద్దా అంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు. షరా మూమాలే ! • యూనిఫాం పంపిణీలో తీరుమారని వైనం • స్కూళ్లు పునఃప్రారంభమై రెండునెలలైనా అతీగతీ లేదు • పాత, చిరిగిన దుస్తులతో వస్తున్న విద్యార్థులు అనంతపురం ఎడ్యుకేషన్ : ఈ ఫొటోలో ఉన్న విద్యార్థులు అనంతపురం రూరల్ పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థులు. వీరు వేసుకున్న స్కూల్ డ్రెస్ చూస్తే కొత్తగా కనిపిస్తోంది కదూ ! అచ్చు ప్రభుత్వం ఇచ్చే సరఫరా చేసే ఉచిత దుస్తుల్లా ఉన్నా.. ఇవి ప్రభుత్వం ఇచ్చినవి కాదు.. ఆ విద్యార్థుల తల్లిదండ్రులే కొనుగోలు చేసి కుట్టించారు. ఈ విద్యార్థి పేరు సుధాకర్ అదే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. యూనీఫాం లేక పోవడంతో గతేడాది ఇచ్చిన అంగీ వేసుకున్నాడు. గతేడాది ఇచ్చిన ప్యాంటు బిగుతు కావడంతో ప్రస్తుతం రంగుది ధరించాడు. ఇదీ.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యూనిఫాం పరిస్థితి. సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1–8 తరగతుల విద్యార్థులకు ఏటా రెండు జతల యూనిఫాం సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 3,844 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో సుమారు 2,82,845 మంది 1–8 తరగతుల విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు జతల ప్రకారం 5,65,690 జతల యూనిఫాం అవసరం. 1–7 తరగతుల బాలురకు చొక్కా నిక్కరు, బాలికలకు చొక్కా స్కర్టు ఇవ్వాలి. 8వ తరగతి బాలురకు షర్టు, ప్యాంటు, బాలికలకు పంజాబీ దస్తులు ఇవ్వాలి. గతేడాది (2015–16)కి సంబంధించిన యూనిఫాం నేటికీ కొన్ని పాఠశాలలకు ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ విద్యా సంవత్సరం సంగతి దేవుడికెరక. గతేడాదికి సంబంధించి ఫిబ్రవరిలో దుస్తులు ఇచ్చారని.. ఈసారి కూడా 2017 ఫిబ్రవరి, మార్చిలో ఇస్తారని చెబితేనే ప్రైవేట్‌గా కొనుగోలు చేస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా చాలామంది విద్యార్థులు పాత, చిరిగిన యూనిఫాంతో పాఠశాలలకు వస్తున్నారు. ఇండెంట్‌తో సరి పెట్టారు : విద్యార్థులకు అవసరమైన యూనిఫాం క్లాత్ కొనుగోలుకు పాఠశాలల వారీగా ఎస్ఎస్ఏ అధికారులు ఇండెంట్ తెప్పించుకున్నారు. ప్రభుత్వానికి నివేదిక పంపారు. అక్కడి నుంచి ఇప్పటిదాకా ప్రతిస్పందన కరువైంది. క్లాత్ కొనుగోలు చేయాలా వద్దా .. ప్రభుత్వమే సరఫరా చేస్తుందా .. అనే విషయంలో నేటికీ స్పష్టత లేదు. ప్రతి ఏటా జూన్, జూలై మాసాల్లో ఈ పక్రియ పూర్తి అవుతున్నా.. ఈసారి ప్రభుత్వమే పెండింగ్ పెడుతూ వస్తోంది. పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో విద్యార్థులు యూనిఫాం ధరించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని క్లాత్ సరఫరా చేసి, కుట్టు పూర్తయి విద్యార్థులకు అందాలంటే సుమారు 4–5 నెలలు పట్టే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఏటా ఇతే తంతు అని, ప్రతిసారీ ఆలస్యం జరుగుతోందని ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. -
అంగన్వాడీ పిల్లలకు యూనిఫాం
శిశు, మహిళా సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్ చక్రవర్తి వెల్లడి గుంటూరు వెస్ట్: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లలో సుమారు 11 లక్షల 50 వేల మంది పిల్లలు ఉన్నారని, వారికి యూనిఫాం విధానాన్ని అమలు చేయబోతున్నట్టు శిశు, మహిళా సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్ చక్రవర్తి వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవర్గాల సహకారంతో పిల్లలకు యూనిఫాం అందించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడేళ్లలో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు శిశు, మహిళా సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్ కేఆర్బీహెచ్ఎన్ చక్రవర్తి తెలిపారు. శిశు, మహిళా సంక్షేమశాఖ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 30 వేల కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయన్నారు. 25 వేల కేంద్రాలకు భవనాలు నిర్మించాల్సి ఉండగా, 4 వేల భవనాలు నిర్మాణదశలో ఉన్నట్టు చెప్పారు. రూ.7.50 లక్షల వ్యయంతో ఒక్కొక్క భవనాన్ని నిర్మించనున్నట్టు చెప్పారు. ఇందులో రూ.5 లక్షలు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.50 వేలు, శాఖాపరంగా రూ.2 లక్షలు ఖర్చుచేయనున్నట్టు తెలిపారు. ఇటీవల 6,600 భవనాల నిర్మాణాలకు పరిపాలనపరమైన అనుమతులు లభించాయని, 1500 భవనాల పనులు ప్రారంభించినట్టు తెలిపారు. బోధనా పద్ధతులపై వర్కర్లకు శిక్షణ అంగన్వాడీ సెంటర్ల ద్వారా పిల్లలకు మంచివిద్యను అందించేందుకుగాను ఈనెల 8వ తేదీ నుంచి ఇంగ్లీష్‌తోపాటు బోధనా పద్ధతులపై రాష్ట్రవ్యాప్తంగా వర్కర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. అంగన్వాడీ సెంటర్లలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసి పిల్లల హాజరు నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. యూనియన్లలో చేరమని ఒత్తిడి చేస్తే చర్యలు అంగన్వాడీ కార్యకర్తలను అధికార పార్టీ యూనియన్‌లో చేరమని సూపర్వైజర్లు, సీడీపీఓలు, ఇతర సిబ్బంది ఎవరైనా ఒత్తిడిచేస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. యూనియన్లను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కార్యకర్తలకు ఉంటుందన్నారు. -
అంగన్వాడీ పిల్లలకు యూనిఫాం
శిశు, మహిళా సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్ చక్రవర్తి వెల్లడి గుంటూరు వెస్ట్: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లలో సుమారు 11 లక్షల 50 వేల మంది పిల్లలు ఉన్నారని, వారికి యూనిఫాం విధానాన్ని అమలు చేయబోతున్నట్టు శిశు, మహిళా సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్ చక్రవర్తి వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవర్గాల సహకారంతో పిల్లలకు యూనిఫాం అందించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడేళ్లలో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు శిశు, మహిళా సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్ కేఆర్బీహెచ్ఎన్ చక్రవర్తి తెలిపారు. శిశు, మహిళా సంక్షేమశాఖ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 30 వేల కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయన్నారు. 25 వేల కేంద్రాలకు భవనాలు నిర్మించాల్సి ఉండగా, 4 వేల భవనాలు నిర్మాణదశలో ఉన్నట్టు చెప్పారు. రూ.7.50 లక్షల వ్యయంతో ఒక్కొక్క భవనాన్ని నిర్మించనున్నట్టు చెప్పారు. ఇందులో రూ.5 లక్షలు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.50 వేలు, శాఖాపరంగా రూ.2 లక్షలు ఖర్చుచేయనున్నట్టు తెలిపారు. ఇటీవల 6,600 భవనాల నిర్మాణాలకు పరిపాలనపరమైన అనుమతులు లభించాయని, 1500 భవనాల పనులు ప్రారంభించినట్టు తెలిపారు. బోధనా పద్ధతులపై వర్కర్లకు శిక్షణ అంగన్వాడీ సెంటర్ల ద్వారా పిల్లలకు మంచివిద్యను అందించేందుకుగాను ఈనెల 8వ తేదీ నుంచి ఇంగ్లీష్‌తోపాటు బోధనా పద్ధతులపై రాష్ట్రవ్యాప్తంగా వర్కర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. అంగన్వాడీ సెంటర్లలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసి పిల్లల హాజరు నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. యూనియన్లలో చేరమని ఒత్తిడి చేస్తే చర్యలు అంగన్వాడీ కార్యకర్తలను అధికార పార్టీ యూనియన్‌లో చేరమని సూపర్వైజర్లు, సీడీపీఓలు, ఇతర సిబ్బంది ఎవరైనా ఒత్తిడిచేస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. యూనియన్లను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కార్యకర్తలకు ఉంటుందన్నారు. -
హాస్టళ్ల విద్యార్థులకు అందని యూనిఫాం
నయీంనగర్ : జిల్లాలోని గిరిజన సంక్షేమ హస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఇంత వరకు యూనిఫాం అందలేదు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెలన్నర దాటుతున్నా దుస్తులు ఇవ్వకపోవడంతో అటు విద్యార్థులు, ఇటు వార్డెన్లు ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా విద్యాసంవత్సరం ప్రారంభమైన వారం రోజుల్లోనే మొత్తం నాలుగు జతల దుస్తులకు రెండు జతలైనా ఇస్తారు. అయితే, ఈసారి జిల్లాలోని 39 గిరిజన హస్టళ్లు, 39 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని మొత్తం 14వేల మంది విద్యార్థినీ, విద్యార్థులకు దుస్తుల మాటేమో కానీ ఇంత వరకు కొలతలు తీసుకోకపోవడం గమనార్హం. ఇంకా జిల్లాలోని 90 సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోని పది వేల మంది, 47 బీసీ సంక్షేమ హాస్టళ్లలోని ఏడు వేల మంది, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో సుమారు 20వేల మంది విద్యార్థులకు సైతం ఇంత వరకు యూనిఫాంలు అందలేదు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు వరంగల్ సెంట్రల్ జైలు ఖైదీల ద్వారా బట్టలు కుట్టించాలని జిల్లా దళిత అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరక్టర్ అంకం శంకర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. బీసీ సంక్షేమ శాఖ అధికారులు మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు బట్ట ఇచ్చి విద్యార్థుల దుస్తులు కుట్టిస్తారు. కానీ ఈసారి బట్ట కూడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం. ఇప్పటికప్పుడు బట్ట కొనుగోలు చేసినా విద్యార్థుల కొలతలు తీసుకుని దుస్తులు కుట్టించి పంపిణీ చేసే వరకు రెండు నెలలైనా పడుతుంది. అంటే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక నాలుగు నెలల తర్వాతే విద్యార్థులకు యూనిఫాం అందే అవకాశముందని చెప్పొచ్చు. -
రంగు దుస్తులే దిక్కు
♦ ప్రభుత్వ పాఠశాలలకు అందని యూనిఫాం ♦ ఎదురుచూస్తున్న 11,500 మంది విద్యార్థులు హిందూపురం రూరల్ : పిల్లల్లో స్నేహభావం పెంపొందించి వారిలో పేద, ధనిక భేదాభిప్రాయాలు రాకుండా చూసేందుకు విద్యార్థులు యూనిఫాంలో పాఠశాలకు వెళ్తుంటారు. ప్రభుత్వం ప్రతి ఏటా విద్యాసంవత్సర ఆరంభంలోనే పాఠశాలలకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. కానీ ఈ ఏడాది మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు ఇంకా రంగు దుస్తులతోనే బడికి వెళ్తున్నారు. పాఠశాలలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇంకా దుస్తులు కొనుగోలు, కుట్టే పని ప్రారంభం కాలేదు. పాఠశాలల్లో దుస్తులు అందజేస్తారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా పిల్లలకు కొత్త దుస్తులు (యూనిఫాం) కుట్టించకపోవడంతో పేద విద్యార్థులు చిరిగిన చొక్కాల్లోనే బడికి వెళ్తున్నారు. హిందూపురం మండలంలో 88 ప్రాథమిక పాఠశాలలు, 15 ప్రాథమికోన్నత ,18 జిల్లా ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు 11,500 మంది విద్యార్థులు ఏకరూప దుస్తుల (దుస్తులు) కోసం ఎదురుచూస్తున్నారు. రెండు జతలు ఇవ్వాలి ప్రతి ఏటా 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు రెండు జతలు చొప్పున ఏకరూప దుస్తులు అందిస్తారు. విద్యాసంవత్సరం ఆరంభానికి ముందుగానే కొలతలు తీసుకుని పాఠశాలలు పునఃప్రారంభ సమయానికి పిల్లలకు దుస్తులు పంపిణీ చేసేవారు. కాగా గతేడాది కూడా విద్యాసంవత్సరం ముగిసే సమయంలో యూనిఫాం పంపిణీ చేశారు. ఈ దఫా ఇప్పటికీ అతీగతీ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. జూన్ నెల లోపు విద్యార్థుల సంఖ్య తెలిపే ఇండెంట్లు ఇవ్వాలని ఉన్నతాధికారులు కోరగా ఉపాధ్యాయులు హడావుడిగా పంపినట్లు సమాచారం. ఉపాధ్యాయులు పంపిన నివేదికల ఆధారంగా ఆయా పాఠశాలలకు దుస్తులు సరఫరా అవుతాయి. ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు : గంగప్ప, ఎంఈఓ, హిందూపురం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత యూనిఫాం అందజేయడానికి ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పాఠశాలకు కూడా ఇంకా అందజేయలేదు. ఆప్కో సంస్థ వారే క్లాత్‌ను ఎంపిక చేసి మహిళా సంఘాలకు పంపుతారు. అనంతరం పిల్లల కొలతలు తీసుకుని అందజేయడం ప్రతి ఏటా జరుగుతోంది. -
అడ్రెస్ ఎక్కడ?
♦ ఇప్పటికీ అందని క్లాత్ ♦ స్కూళ్లు తెరిచి మూడువారాలవుతున్నా ఊసేలేని యూనిఫాం క్యాలెండర్లో సంవత్సరాలు మారుతున్నాయే తప్పా ప్రభుత్వ పెద్దల తీరులో మార్పు రాలేదు. పాఠశాలలు తెరిచేనాటికి యూనిఫాం అందిస్తామన్న వారి మాటలు ఆచరణలో అమలయ్యింది లేదు. ఇంకేముంది ఇంతవరకు విద్యార్థుల యూనిఫాం అ‘డ్రస్’ లేకుండా పోయింది. నేతల మాటలు నీటి మూటలేనని మరోసారి రుజువైంది. యూనిఫాం కోసం జిల్లా విద్యార్థులకు ఎదురుచూపులు తప్పని పరిస్థితి నెలకొంది. కడప ఎడ్యుకేషన్: పాఠశాలలు తెరిచి మూడు వారాలవుతున్నా జిల్లాలో ఇప్పటివరకు యూనిఫాం అ‘డ్రస్’ లేదు. అసలు యూనిఫామ్ క్లాతే జిల్లాకు రాలేదు. క్లాత్‌కు సంబంధించి ఒక్క రూపాయి నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో జిల్లాకు క్లాత్ ఎప్పుడోస్తుంది ..వచ్చిన క్లాత్‌ను కుట్టి ఎప్పుడు పాఠశాలలకు సరఫరా చేస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నలు కురిపిస్తున్నారు. మరోవైపు సకాలంలో యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు అందక కొంతమంది విద్యార్థులు పాఠశాలలకు దూర మవుతున్నారే ఆరోపణలు ఉన్నాయి. గతేడాదీ ఇదే పరిస్థితి.. 2015-16 సంవత్సర విద్యా సంవత్సరానికి సంబంధించి ఇదే పరిస్థితి ఉంది. ఈ ఏడాది మార్చి నెల వరకు కూడా పాఠశాలలకు యూనిఫాంలు అందిస్తూనే ఉన్నారు. కొన్ని పాఠశాలల్లో సంబంధిత యూనిఫాంలు విద్యార్థులకు అందించకుండానే పాఠశాలల్లో ఉంచుకున్నట్లు తెలిసింది. మరికొన్ని చోట్ల విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన బట్టలు సరిపడక అలాగే వదిలేసినట్లు కూడా సమాచారం. ప్రస్తుతం విద్యార్థులకు యూనిఫాం అందించేందుకు ఇప్పటి వరకూ ఒక్క రూపాయి డబ్బులను విడుదల చేయలేదు. కానీ గుడ్డను కొనుగోలు చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిసింది. ఎయిడెడ్ పాఠశాలలకు మొండిచెయ్యి జిల్లాలో ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం అందించడానికి ప్రభుత్వం విముఖత చూపుతోంది. గతేడాది జిల్లాలో 131 ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించి 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఒకొక్కరికి 2 జతల చొప్పున 12,699 మందికి పంపిణీ చేశారు. ఈ ఏడాది యూనిఫాంలు కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. ఉర్దూ పాఠశాలలకు అందని పాఠ్యపుస్తకాలు జిల్లా వ్యాప్తంగా 2016-17 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం పాఠశాలలకు 15.52.000 లక్షలు పుస్తకాలను కేటాయించింది. అయితే సంబంధిత పుస్తకాలను పాఠశాలలకు చేర్చారు. కొన్ని చోట్ల సంబంధిత పుస్తకాలను విద్యార్థులకు ఇవ్వకుండా ఎమ్మార్సీల్లోనే ఉంచుకున్నట్లు తెలిసింది. దీంతోపాటు సరఫరా చేసిన పుస్తకాల్లో కొన్ని పాఠ్యపుస్తకాలు అంద నట్లు తెలిసింది. ముఖ్యంగా ఉర్దూ పాఠశాలలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 20 వేల పుస్తకాలను ఇవ్వాల్సి ఉంది. -
ఎన్నాళ్లీ చెట్టుకింద చదువులు?!
జిల్లాలో 3,155 పాఠశాలలు నేటికీ రాని యూనిఫాం ఇండెంట్ పెట్టామంటున్న అధికారులు గతేడాదీ పంపిణీ చేయని వైనం 268 పాఠశాలల్లో వంటషెడ్లు లేవు నిధుల కొరతతో నిలిచిన మరమ్మతులు ఎల్‌ఎన్‌పురంలో పశువుల పాకలా పాఠశాల ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడి తాగునీటి కుండీలు ఉంటే నీరుండదు.. మరుగుదొడ్లు ఉన్నా అలంకారప్రాయమే.. వానొచ్చిందంటే ఆవరణంతా జలమయమే.. శిథిలావస్థకు చేరిన భవనాలు.. ఇదీ మరో మూడు రోజుల్లో పునఃప్రారంభం కానున్న ప్రభుత్వ పాఠశాలల్లోని దుస్థితి. జిల్లాలో చిన్నారుల భవితకు బాటలు దిద్దే పాఠశాలలు అసౌకర్యాలకు నిలయాలుగా మారుతున్నా పట్టించుకునేవారే లేరు. మరోపక్క పలు పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధం చేస్తుండటం ఆందోళనకరంగా మారింది. మొగల్రాజపురం: స్థానిక రావిచెట్టు సెంటర్లోని తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ సుమారు 60 మంది చిన్నారులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్నారు. కొండ ప్రాంతంలో నివశించే రోజువారి కూలీల పిల్లలు చదువుకోడానికి ఈ స్కూల్ దగ్గరలో ఉంది. ఈ స్కూల్లో కనీస సౌకర్యాలు లేవు. కూర్చునేందుకు చెంచీలు లేవు, తరగతి గది లేదు. ఆరుబయట రావిచెట్టు నీడన తాత్కలికంగా నిర్మించిన ప్లాస్టిక్ రేకుల షెడ్డులోనే నేలపై కూర్చుని విద్యాభ్యాసం చేస్తున్నారు. స్కూల్ కోసం నిర్మించిన చిన్న పాటి గదులు వీరికి ఏమాత్రం సరిపోవడం లేదు. అందువల్ల పక్కనే ఉన్న ఖాళీస్థలంలో చెట్టుకింద గోడలు లేకుండా ప్లాస్టిక్ రేకులతో నిర్మించిన ఒక షెడ్డులో విద్యాభ్యాసం చేస్తున్నారు. వర్షం వస్తే చాలా ఇబ్బంది. పుస్తకాలూ తడిసిపోతుంటాయి. ఎండ కాలంలో సెలవులు ఇచ్చే వరకు వేడిని భరించాల్సిందే. వాటర్ ట్యాంకర్ రాకపోతే స్కూల్‌కు సెలవే స్కూల్లో ఉన్న మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ వాసులకు మంచి నీటిని సరఫరా చేయడానికి వచ్చే ట్యాంకర్ నుంచి ప్లాస్టిక్ డ్రమ్ములోకి నీటిని పట్టుకుని నిల్వ చేసుకుని విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు. మరుగుదొడ్డిని ఉపయోగించాలంటే విద్యార్థులు బక్కెట్‌తో నీటిని తీసుకుని వెళ్లాల్సిందే. ఏ కారణం చేతనైనా ట్యాంకర్ రాకపోతే ఆ రోజు స్కూల్‌కు సెలవే. మరుగుదొడ్లలో నీటి సౌకర్యం కోసం కార్పొరేషన్ అధికారులు వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి, విద్యుత్ మోటారు అమర్చలేదు. ట్యాంకర్ రాని రోజూ స్కూల్‌కు అనధికారికంగా సెలవు ప్రకటిస్తున్నారు.విద్యార్థులు లెట్రిన్‌కు వెళతామంటూ లైన్కట్టి అడగడంతో వారిని ఇళ్ళకు పంపేస్తున్నారు. స్కూల్ మరుగుదొడ్డిలో నీరు రాకపోతే ఇంటికి వెళ్లవచ్చు అనే విషయాన్ని తెలుసుకున్న విద్యార్థులు వరసగా లెట్రిన్ అనడంతో వారిని ఇంటికి పంపక తప్పని పరిస్థితి.ఇలా పదులు సంఖ్యలో విద్యార్థులు అడగడం తో స్కూల్‌కు అనధికారికంగా సెలవు ప్రకటిస్తున్నారు.ఈ సమస్యతో ఉపాధ్యాయులూ ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ ఆవరణలో ఉన్న కొద్ది పాటి స్థలంలో ప్రత్యేకంగా తరగతి గది నిర్మించాల్సిందిగా స్కూల్ సిబ్బంది కార్పొరేషన్ అధికారులకు విన్నవించుకోగా సుమారు రూ.4 లక్షల నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం ఉన్న స్కూల్లో (రావిచెట్టు సెంటర్) కాకుండా సమీపంలోనే ఉన్న కార్పొరేషన్ పార్కు స్థలంలో స్కూల్ నిర్మిస్తే విద్యార్థులకు విశాలమైన తరగతి గదులు వస్తాయని, అక్కడ నిర్మిచాల్సిందిగా పాఠశాల ఉపాధ్యాయులు కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులను కోరడంతో విషయం పెండింగ్‌లో పడింది. రోజులు గడుస్తున్నా ఏవిషయం తేలకపోవడంతో మంజూరైన నాలుగు లక్షల రుపాయల నిధులను ఇంజనీరింగ్ విభాగం అధికారులు వెనక్కు పంపించేశారు. ఫలితంగా విద్యార్థులకు ఈఏడాది కూడా చెట్టు కింద చదువులు తప్పడం లేదు. అరకొర వసతులతో పాఠశాలలు కృష్ణలంక: స్థానిక పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలలో మూత్రశాలలు అరకొరగా ఉన్నాయి. ఈ స్కూల్ పక్కనే ఉన్న ఎలిమెంటరీ స్కూల్‌కు ఒక్కటే మూత్రశాల ఉంది. సుమారు 400 మంది విద్యార్థులు ఉండే ఈ స్కూల్లో రెండు మూత్రశాలలు మాత్రమే ఉన్నాయి. గతంలో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లుగా మూత్రశాలలుండేవి. ఇక్కడ కళాశాల నిర్మాణ నేపథ్యం లో వాటిని తొలగించడంతో సమస్యగా ఉంది. ఎస్వీరెడ్డి స్కూల్లోమూత్రశాలలు పిల్లలకు, ఉపాధ్యాయులకు వేరుగా నిర్మించుకున్నారు. విద్యార్థుల మూత్రశాల దుర్వాసన వెదజల్లుతోంది. రాణిగారితోట తాడికొండ సుబ్బారావు స్కూల్, వంగవీటి మోహనరంగా ఎలిమెంటరీ స్కూల్లోనూ మూత్రశాలతో విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. చెత్తతో నిండిన ప్రాంగణం ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రపరిచ వారు లే రు. దీంతో చెట్ల ఆకులు రాలి ప్రాంగణమంతా అపరిశుభ్రత వాతావరణం నెలకొంది. పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలలో జూనియర్ కళాశాల నిర్మాణ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో స్కూల్ తెరిచే సమయానికి విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మధ్యాహ్నం భోజనం పథకం స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం విషయంలోనూ స్కూల్ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహించడంలేదు. వారికి ప్రత్యేకమైన షెడ్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా పలు స్కూళ్లల్లో షెడ్లు లేకపోవడంతో వేరేచోట వండి తరలిస్తున్నారు. ఈనేపథ్యంలో నిర్వాహకులు పిల్లలకు చాలీ చాలని భోజనం పెడుతున్నారు. ఇటీవల తాడికొండ సుబ్బారావు స్కూల్లో మేయర్ ఆకస్మిక తనిఖీల్లో ఇది బయటపడింది. -
నిర్లక్ష్యం
గత విద్యాసంవత్సరం చివరలో యూనిఫాం పంపిణీ కుట్టుకూలి బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం ఎంఈవో కార్యాలయం చుట్టూ డ్వాక్రా మహిళల ప్రదక్షిణలు ఫైలు సిద్ధం చేస్తున్నామంటున్న డీఈవో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీచేసే యూనిఫాం విషయంలో విద్యాశాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఇవ్వాల్సిన దుస్తులను మార్చి, ఏప్రిల్ నెలల్లో పంపిణీచేశారు. అయితే ఆ దుస్తులు కుట్టిన డ్వాక్రా మహిళలకు నేటికీ బిల్లులు చెల్లించలేదు. మచిలీపట్నం : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం విషయంలో అడుగడుగునా జాప్యం జరుగుతోంది. 2014-15 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలలు తెరిచిన వెంటనే యూనిఫాం పంపిణీచేయాలి. అయితే విద్యాసంవత్సరం చివరిలో మార్చి, ఏప్రిల్ నెలల్లో యూనిఫాం అందజేశారు. దుస్తులు కుట్టించడంలోనే తీవ్ర జాప్యం జరిగింది. ఎవరితో దుస్తులు కుట్టించాలనే అంశంపై తొలుత తర్జనభర్జన పడిన అధికారులు ఎట్టకేలకు ఆ బాధ్యతను డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. సర్వశిక్షా అభియాన్ ద్వారా 1.91,467 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాం చొప్పున కుట్టించి అందజేశారు. దుస్తులు కుట్టినందుకు ఒక్కొక్క జతకు రూ.40 చొప్పున కుట్టుకూలిగా నిర్ణయించారు. డ్వాక్రా మహిళలకు మొత్తం రూ.1.53 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో దుస్తులు కుట్టి అధికారులకు అప్పగించినా నేటి వరకూ కుట్టుకూలి రాలేదని డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. డబ్బుల కోసం నిత్యం డ్వాక్రా మహిళలు ఎంఈవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఫలితం కనిపించడంలేదు. సర్వశిక్షా అభియాన్‌లో నగదు నిల్వలు ఉన్నా ఏ కారణంతో బకాయిలు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. తొలి నుంచీ జాప్యమే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం అందజేయడంలో తొలి నుంచీ నిర్లక్ష్యం కనబడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలల పునఃప్రారంభం నాటికి యూనిఫాం అందజేయాల్సి ఉంది. అయితే పాఠశాలలు మూసివేసే నాటికి అందజేశారు. విద్యార్థుల యూనిఫామ్‌కు సంబంధించిన మెటీరియల్‌ను గత ఏడాది డిసెంబర్ నాటికి కూడా ఆప్కో ద్వారా సరఫరా చేయని పరిస్థితి నెలకొంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మెటీరియల్ అందజేస్తే మార్చి, ఏప్రిల్ నాటికి దుస్తులు కుట్టి విద్యార్థులకు పంపిణీచేశారు. కొన్ని చోట్ల డ్వాక్రా మహిళలు యూనిఫాం కుట్టారు. మరికొన్ని చోట్ల స్థానికంగా ఉన్న దర్జీలే డ్వాక్రా సంఘాల పేరుతో యూనిఫాం కుట్టారు. అధికార పార్టీకి చెందిన నాయకులు తమ వారికే ఈ కుట్టుపనిని అప్పగించాలని ఒత్తిళ్లు తెచ్చారు. పాఠశాల స్థాయి విద్యార్థులు ఎదిగే వయసులో ఉంటారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో యూనిఫాం కోసం కొలతల తీసుకుని ముగిసే నాటికి యూనిఫాంలను అందజేయడంతో కొంత మంది పిల్లలకు ఇచ్చిన దుస్తులు కొలతలు సరిపోని పరిస్థితి నెలకొంది. ఫైలు సిద్ధం చేస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1.91,467 మంది విద్యార్థులకు మార్చి, ఏప్రిల్ నెలలో యూనిఫాం అందజేశాం. డ్వాక్రా సంఘాల ద్వారానే యూనిఫాం దుస్తులు కుట్టించాం. డ్వాక్రా మహిళలకు నగదు ఇచ్చేందుకు ఫైలు సిద్ధం చేస్తున్నాం. - డీఈవో, ఎ. సుబ్బారెడ్డి -
వల్గర్ సెల్ఫీలు.. చిక్కుల్లో మహిళా పోలీస్..!
బీజింగ్: టాప్ లెస్ సెల్ఫీలు దిగడం, డ్యూటీ యూనిఫాంలో ఉండగా తమకు ఇష్టం వచ్చినట్లుగా సెల్ఫీలు దిగడం వాటిని సోషల్ మీడియాలో మహిళా పోలీసులు పోస్ట్ చేయగా, ఆ ఫొటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేయడం ఆ తర్వాత ఉద్యోగం కోల్పోవడం పరిపాటిగా మారిపోయింది. ఇటీవల అమెరికాలో జరిగిన సంఘటనకు ఉదాహరణలాగ మరోకటి చైనాలో రెండు రోజుల కిందట చోటుచేసుకుంది. ఓ మహిళా అసభ్యంగా ఫొటోలు దిగడం అవి ఇంటర్నెట్ లో హల్ చల్ చేయడంతో ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. యువకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిందంటూ కొందరు యూజర్లు కామెంట్ చేయగా, ఆమె చాలా సెక్సీగా ఉందంటూ మరికొన్ని కామెంట్లు విపరీతంగా వచ్చాయి. డ్యూటీ యూనిఫాంలో ఉండగా ఇలాంటి పనులేంటని తీవ్రంగా విమర్శించారు. బ్యాడ్జ్ నంబర్ కనిపించేలా దిగిన సెల్ఫీని పోస్ట్ చేయడం ఆమె చేసిన ఘోర తప్పిదమని తెలివైన కామెంట్లు కూడా చేశారు. డాండోంగ్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకుందని ఆమెపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని ఓ అధికారి పేర్కొన్నారు. ఆమె 1994లో జన్మించిందని చెప్పిన ఆఫీసర్స్ పేరును వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు. లియానోయింగ్ అనే ప్రాంతానికి చెందిన ఓ మహిళా పోలీస్ సరదా కోసం చేసిన చిన్న పని ఆమె ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. ఆమె పోలీసు యూనిఫాంలోనే కాస్త అసభ్యంగా ఫొటోలు దిగింది. ముద్దిస్తున్నట్లుగా, కన్ను కొడుతున్నట్లుగా కొన్ని ఫోజుల్లో దిగిన ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. ఇక అంతే, ఈ యంగ్ పోలీస్ అందానికి దాసోహమైన కుర్రకారు ఆ ఫొటోలను విపరీతంగా షేర్ చేసింది. డ్యూటీ యూనిఫాంలోనే ఉండి కూడా పూర్తిగా దుస్తులు వేసుకోకుండా, అసభ్యంగా ఫోజులతో ఫొటోలు దిగిందంటూ ఆమెపై అధికారులు మండిపడ్డారు. -
యూనిఫాం మార్పు వెనుక అవినీతి మడత
శ్రీకాకుళంలో గుర్తింపు పొందిన కళాశాల అది. అక్కడి ప్రిన్సిపాల్ సూర్యనారాయణ (పేరుమార్చాం). 1400 మందికిపైగా విద్యార్థులున్నారు. ఏటా ఆ కళాశాలలో యూనిఫాంను మార్చుతున్నారు. ప్రిన్సిపాల్ నేరుగా వస్త్ర దుకాణం యజమానితో బేరసారాలకు దిగి తనకు కొంత మొత్తం ముట్టచెబితే యూనిఫాంను మార్పించే ఏర్పాట్లు చేస్తానని ఒప్పందం చేసుకుంటున్నారు. శ్రీకాకుళంలో ఒకే షాప్‌లో ఆ యూనిఫాం లభ్యమయ్యేలా చూస్తున్నారు. ఇలాంటి కళాశాల ప్రిన్సిపాళ్లు జిల్లాలో ఎక్కువ మందే ఉన్నారు. వీరివల్ల ఏటా యూనిఫాం మారి తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని మోయూల్సి వస్తోంది. * ఏడాదికో యూనిఫాం మార్చుతున్న విద్యాసంస్థలు * వస్త్ర వ్యాపారులతో నేరుగా ఒప్పందాలు * ప్రభుత్వ కళాశాలల్లోను ప్రిన్సిపాళ్లు చేతివాటం * ఏటా తల్లిదండ్రులపై ఆర్ధిక భారం శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో 6500 వరకు వివిధ యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలలు, 700 వరకు కార్పొరేట్, చిన్నాచితకా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. 72 వివిధ యాజమాన్యాల జూనియర్ కళాశాలలు, మరో 95 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. 12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, మరో 82 ప్రైవేటు డిగ్రీ కళాశాలలున్నాయి. వీటన్నింటిలో ఏడాదికి సుమారు మూడు లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసాలు సాగిస్తున్నారు. ఇందులో కనీసం 60 శాతం మంది విద్యార్థులు ఏటా యూనిఫాం మార్చుకోవాల్సి వస్తోంది. ఆయా విద్యాసంస్థల యాజమాన్యాల నిర్ణయూలకు బాధితులవుతున్నారు. దుస్తులను రెట్టింపు ధరలకు కొంటూ ఆర్ధికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లోనూ ఇదే తీరు.. ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులు అక్కడి యాజమాన్యాల విధానాలతో నష్టపోతున్నారు. వ్యాపారులతో ముందస్తుగా కుదర్చుకున్న లోపారుుకారీ ఆర్ధిక ఒప్పందాలకు వీరంతా మూల్యం చెల్లిస్తున్నారు. ఈ తంతు ప్రైవేటు విద్యాసంస్థలకే పరిమితం కావటం లేదు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోను అక్కడి హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు మూడో వ్యక్తికి తెలియకుండా (రెండో వ్యక్తి వస్త్ర వ్యాపార యజమాని) యూనిఫాంను మార్చుతూ తమ మార్క్ మాయాజాలన్నా ప్రదర్శిస్తున్నారు. ఒకే యూనిఫాం అమలుచేయాలి.. రాష్ట్రవ్యాప్తంగా ఒకే యూనిఫాం విధానాన్ని అమలు చేయాలని జేఎల్స్ సంఘం గట్టిగా డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ కళాశాలల్లోను ఏడాదికొక యూనిఫాంను మార్చుచూ కొందరు ప్రిన్సిపాళ్లు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. - జి.వెంకటేశ్వరరావు, ప్రభుత్వ జేఎల్స్ అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి ఫిర్యాదుచేస్తే చర్యలు తీసుకుంటాం కొన్ని విద్యాసంస్థల్లో, కళాశాలల్లో ఏడాదికొక యూనిఫాం మార్చుతున్నట్లు సమాచారం అయితే ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. విద్యార్థులను ఆర్థికంగా ఇబ్బందిపాలు చేయడం సరికాదు. ఫిర్యాదుచేస్తే విచారించి చర్యలు తీసుకుంటాం. - పాత్రుని పాపారావు, ఆర్ఐవో, ఇంటర్మీడియెట్ బోర్డు -
త్రిష బికినీ పార్టీ
జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలన్నది నటి త్రిషను చూసి నేర్చుకోవాలని చాలా మందికి అనిపించకమానదు. అంతదాకా ఎందుకు సహ నటీమణులే అసూయ పడేలా ఆమె లైఫ్ స్టైల్ ఉంటుందనవచ్చు.చాలా మంది హీరోయిన్లు డబ్బు సంపాదనే ధ్యేయంగా అవిరామంగా శ్రమిస్తుంటారు. కొందరికి తెగ సంపాదించినా ఎలా జల్సా చేయాలో తెలియదు. కూడబెట్టిన దాన్ని ఖర్చు చేయడానికి మనసు రాదు మరికొందరికి. అయితే నటి త్రిష ఇలాంటి వారందరికీ భిన్నం. ఎంత సంపాదిస్తుందో అంతగా జీవితాన్ని జాలీగా గడిపేస్తుంది. ఈ చెన్నై చిన్నదానికి పార్టీలంటే ఎంత ఇష్టమో. అవి స్నేహితురాలితో జరుపుకోవడానికి తెగ ముచ్చట పడుతుంది. వారితో దేశ విదేశాలు తిరిగేస్తూ చుట్టేస్తూ తనకు నచ్చినట్లు గడిపేస్తుంది. ఆ మధ్య ప్రేమించి,పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌మణియన్‌తో ప్రత్యేక విమానంలో ఆగ్రా వెళ్లి తాజ్మహాల్తో పాటు దాని చుట్టు పక్కల సుందర ప్రాంతాలన్నీ చుట్టొచ్చింది. ఆ విహార యాత్రలోనూ తన స్నేహితురాళ్లను దూరంగా పెట్టలేదామె. వరుణ్‌మణియన్‌తో ప్రేమ,పెళ్లి అన్న కథ కంచెకు చేరినా, అందుకు ఇసుమంత కూడా చింతించని త్రిష పబ్‌లు, పార్టీలు అంటూ ఖుషీ ఖుషీగా జీవితాన్ని ఎంజాయ్ చేసేస్తోంది. ఈ చెన్నై చిన్నది తన చిన్న నాటి స్నేహితులకు తరచూ పార్టీ ఇస్తుంటుంది. అలా ఇటీవల వారితో బికినీ పార్టీ జరుపుకుంది. ఇందులో విశేషం ఏమిటంటే అందరూ ఒక యూనిఫామ్‌లో దుస్తులు ధరించి రావాలన్నట్టు విప్‌ను జారీ చేసిందట త్రిష. నాయకురాలు ఆర్డర్ జారీ జేస్తే నెచ్చెలిలు పాటించకుండా ఉంటారా. అందరు బికినీలు ధరించి పార్టీకి చేరుకున్నారు.త్రిష కూడా బికినీ ధరించి దానిపై జర్కీలాంటిది వేసుకుని స్నేహితురాళ్లతో కలిసి పార్టీలో ఎంజాయ్ చేసిందట. అందాలతో కూడిన ఫొటోలను త్రిష స్నేహితురాళ్లలో ఏ తుంటరి చిన్నదో ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు.అవి ఇప్పుడు సోషల్ మీడియాల్లో హల్చల్ చేస్తున్నాయి. -
అడ్రస్ ఏదీ?
నేటికీ అందని యూనిఫాం విద్యార్థుల ఎదురుచూపులు అధికార పార్టీ నేతల అడ్డంకులే కారణం పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు యూనిఫాం అందజేస్తాం. ఇకపై ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం... (గతేడాది వేసవి సెలవులకు ముందు విద్యార్థులకు యూనిఫాం అందజేస్తూ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటన ఇది.) ప్రస్తుత పరిస్థితి : విద్యా సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలవుతున్నా ఇంకా యూనిఫాంలు అందజేయలేదు. ఇప్పట్లో అందే పరిస్థితి కూడా కనిపించడంలేదు. విశాఖపట్నం : ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల స్వార్థం విద్యార్థులకు శాపంగా మారింది. పాఠశాల విద్యార్థులకు ఏటా ఇచ్చే యూనిఫాం పంపిణీ మొక్కుబడి తంతే అవుతోంది. పాఠశాలలు తెరచుకుని ఆరు నెలలు పూర్తయినా అవి అందకపోవడంలో వీరి పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఈ స్కూళ్లలో చదివే వారిలో పేదలే అధికంగా ఉన్నందున ఒకటి నుంచి 8వ తరగతుల వారికి సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా ఏటా ఉచితంగా రెండు యూనిఫాం ఇస్తోంది. ఈ సంవత్సరం జిల్లాలో 2,36,218 మంది పిల్లలకు రెండు జతల చొప్పున 4,72,436 యూనిఫాం ఇవ్వాల్సి ఉంది. వాస్తవానికి బడులు తెరిచిన కొద్దిరోజులకే వీటిని పంపిణీ చేయాలి. కానీ అధికార పార్టీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు, నాయకులు తమ వారికే కుట్టు పనులు దక్కించుకోవాలని పట్టుపట్టడంతో ఇన్నాళ్లూ యూనిఫాం ప్రక్రియ నిలిచిపోయింది. పనిచేయని నేతల ఎత్తులు : గత ఏడాది ఇలా కొందరు ప్రజాప్రతినిధులు బల్క్‌గా తమ అనుయాయులకు చేజిక్కించుకున్నారు. ఒక్కో జతకు కుట్టుకూలి కింద ప్రభుత్వం రూ.40 చెల్లిస్తుంది. ఇందులో జతకు రూ.5 వరకు కక్కుర్తిపడ్డారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ఈ సంవత్సరం కూడా అదే తీరులో వ్యవహారం నడపాలని చూశారు. అందుకు ఎన్నో ఎత్తుగడలు వేశారు. చివరకు నవంబర్ 28న సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ రాజకీయాలకు అతీతంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, హెడ్మాస్టర్లు అభీష్టం మేరకు టైలర్లకు ఇవ్వవచ్చని ఆదేశాలిచ్చారు. దీంతో యూనిఫాంపై కదలిక వచ్చి ఆప్కో వస్త్రాలను ఆయా స్కూళ్లకు పంపడం మొదలెట్టారు. ఇప్పటిదాకా 70 శాతం వస్త్రాల పంపిణీ జరిగింది. మిగిలింది పంపిణీకి కనీసం మరో 15 రోజులైనా పడుతుంది. యూనిఫాం అందజేయకపోవడంతో చాలామంది సివిల్ డ్రెస్‌తో రోజు స్కూలుకు వెళ్లి వస్తున్నారు. సంక్రాంతి రద్దీలో దర్జీలు సంక్రాంతి పండగ సమీపిస్తున్నందున ప్రస్తుతం దర్జీలంతా రద్దీగా ఉన్నారు. దీంతో ఈ స్కూల్ యూనిఫాం కుట్టు మొదలెట్టడానికి మరో నెలరోజులకు పైగానే పట్టనుంది. అన్నీ సవ్యంగా జరిగితే వీటి కుట్టు పూర్తి కావడానికి, పంపిణీకి రెండు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన మార్చి నాటికి గాని బడి పిల్లలకు దుస్తుల అందే పరిస్థితి కనిపించడం లేదు. గత ఏడాది కూడా వేసవి సెలవులకు ముందు వీటిని పంపిణీ చేశారు. అప్పట్లో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఓ సదస్సులో మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి స్కూళ్లు తెరిచిన వెంటనే యూనిఫాంలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. కానీ మళ్లీ అదే పరిస్థితి తలెత్తింది! సత్వరమే అందేలా చూస్తా.. బడి పిల్లలకు స్కూల్ యూనిఫాంల పంపిణీ సత్వరమే జరిగేలా చూస్తాం. అన్ని జిల్లాల్లోనూ దుస్తుల పంపిణీ ఆలస్యమవుతోంది. యూనిఫాంలకు అవసరమైన వస్త్రాలు కొన్నాళ్ల క్రితమే వచ్చాయి. చాలావరకు వాటిని ఆయా స్కూల్ మేనేజిమెంట్ కమిటీల (ఎస్‌ఎంసీల)కు పంపించేశాం. మిగిలినవి కూడా త్వరలోనే అందజేస్తాం. -టి.శివరామ్‌ప్రసాద్, పీవో, సర్వశిక్షా అభియాన్ -
యూనిఫాం పోస్టులకూ సడలింపు!
గరిష్ట వయోపరిమితి మూడు నుంచి ఐదేళ్ల వరకు సడలింపు 5 కి.మీ. పరుగు పందెం పోటీకి స్వస్తి ఉగ్రవాద, నక్సల్స్ దాడుల్లో మరణించిన వారికి రెట్టింపు ఎక్స్‌గ్రేషియా కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలు సీఎం ఆమోద ముద్ర పడగానే అమల్లోకి హైదరాబాద్: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో తీపి కబురు వినిపించనుంది! యూనిఫాం సర్వీస్ పోస్టులకు కూడా గరిష్ట వయో పరిమితిని మూడు నుంచి ఐదేళ్ల వరకు సడలించేందుకు కేబినెట్ సబ్ కమిటీ అంగీకరించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదముద్ర పడగానే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చైర్మన్‌గా ఉన్న కేబినెట్ సబ్ కమిటీ శనివారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రస్తుతం పోలీస్ రిక్రూట్మెంట్లకు నిర్వహించే 5 కి.మీ. పరుగు పందెం పోటీకి స్వస్తి పలకాలని నిర్ణయించింది. అలాగే ఉగ్రవాద, నక్సల్స్ దాడుల్లో మరణించినా లేదా తీవ్రంగా గాయపడిన వారికి ప్రస్తుతం అందజేస్తున్న దానికన్నా రెట్టింపు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాలను మరోసారి సమీక్షించి త్వరలో సీఎం కేసీఆర్‌కు నివేదిక రూపంలో అందజేయనున్నారు. కమిటీ నివేదికకు కేబినేట్ ఆమోదముద్ర వేసిన వెంటనే ప్రభుత్వం అమలు చేయనుంది. తొలి విడత ఉద్యోగ నియామకాల్లో భాగంగా ప్రభుత్వం భర్తీ చేయనున్న 15 వేల పోస్టుల్లో పోలీస్ శాఖకు చెందినవే 9 వేలకుపైగా ఉన్నాయి. సబ్ కమిటీలో ఈ అంశంపై చర్చించారు. ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కాబట్టి పోస్టుల భర్తీలో వీలైనంత ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని సబ్ కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటికే యూనిఫాం సర్వీసులకు మినహా మిగతా పోస్టులన్నింటికీ వయో పరిమితిని పదేళ్ల పాటు సడలించారు. ఈ నేపథ్యంలో యూనిఫాం సర్వీసు పోస్టులకు సడలింపు లేకపోవడం సమంజసం కాదని భావించారు. దేశంలోనే అత్యుత్తమ ఎక్స్‌గ్రేషియా.. ఉగ్రవాద, నక్సల్స్ దాడుల్లో మరణించిన లేదా తీవ్రంగా గాయపడిన వారికి ప్రభుత్వం తరఫున దేశంలోనే అత్యుత్తమ ఎక్స్‌గ్రేషియా అందజేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఎక్స్‌గ్రేషియా కింద ప్రస్తుతం కానిస్టేబుల్ నుంచి హెడ్‌కానిస్టేబుల్ వరకు రూ.25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఇస్తున్నారు. దీన్ని రెట్టింపు చేయాలని సబ్ కమిటీ నిర్ణయించింది. అలాగే ఉగ్రవాద, నక్సల్స్ దాడుల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు మరణిస్తే రూ.35 లక్షలు, ఎంపీపీ, జెడ్పీటీసీలు, డీసీసీబీ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లకు రూ.25 లక్షలు అందజేస్తున్నారు. సాధారణ ప్రజలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నారు. వీటన్నింటినీ రెట్టింపు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అలాగే దాడుల్లో మరణించే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కూడా నిర్ణయించారు. సబ్ కమిటీ భేటీలో మంత్రి కె.తారకరామారావు, ముఖ్య కార్యదర్శులు వికాస్‌రాజ్, శివ శంకర్, రాజీవ్ త్రివేది, డీజీపీ అనురాగ్‌శర్మ, అడిషనల్ డీజీపీలు సుదీప్ లక్టాకియా (శాంతిభద్రతలు) తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యత లేని యూనిఫాం
భీమవరం : సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు నాసిరకం దుస్తులు అందజేశారు. నాణ్యతలేని వస్త్రంతోపాటు దుస్తులు కుట్టటంలోను లోపాలు బయటపడ్డాయి. ఏడాదికి నాలుగు జతలయూనిఫాం హాస్టల్ విద్యార్థులకు అందజేయవ వలసి ఉండగా ఇప్పటికి రెండు జతలు అందజేశారు. యూనిఫాంకు కావలసని వస్త్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆప్కో ద్వారా కొనుగోలు చేసి ఆయా జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయాలకు అందజేసింది. ఏలూరులో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రెస్ మేకింగ్ సెంటర్ (డీఎంసీ)కు ఈ వస్త్రాన్ని ఇచ్చి కుట్టిస్తున్నారు. కుట్టుకూలి జతకు రూ.40 మాత్రమే వెచ్చిస్తున్నారు. జిల్లాలో ఉన్న 132 వసతి గృహాల్లో సుమారు 10 వేల మంది విద్యార్థినీ, విద్యార్థులుండగా వీరిలో 7వేల 885 మందికి ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున మొదటి విడతగా దుస్తులు అందజేశారు. ఇటీవల హాస్టల్స్‌లో చేరిన విద్యార్థులకు దుస్తులు అందజేయాల్సిఉంది. హాస్టల్ విద్యార్థులకు అందజేసిన దుస్తుల్లో నాణ్యత లోపించింది. విద్యార్థులకు అందజేసిన దుస్తుల వస్త్రం మరీ పల్చగా ఉండడంతో ధరించేందుకే ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వస్త్రం ఎంపికలో నాణ్య తా ప్రమాణాలు పాటించకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఈ దుస్తులు కుట్టటంలోను నాణ్యత కనిపించటంలేదు. అప్పుడే కుట్టులు ఊడిపోతున్నాయి. దీంతో హాస్టల్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల కక్కుర్తే కారణం విద్యార్థుల యూనిఫాం కుట్టేప్పుడు నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించవలసిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు కాసుల కోసం కక్కుర్తిపడటమే దీనికి కార ణం. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయల అవినీతి జరిగింది. దీనిపై తక్షణమే విచారణ చేయించాలి. -పంపన రవికుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటాం విద్యార్థులకు అందజేసిన యూనిఫాం కుట్టులో నాణ్యత లోపించినట్టు నా దృష్టికి రాలేదు. ఆరోపణలపై వెంటనే విచారణ చేయిస్తాం. నాణ్యత లోపించినట్టు తేలితే చర్యలు తీసుకుంటాం. - శోభారాణి, సాంఘిక సంక్షేమశాఖ జేడీ -
అత్యాచారాల నియంత్రణకు ‘డ్రస్కోడ్’
ప్రభుత్వానికి బళ్లారి జిల్లా జేడీఎస్ అధ్యక్షుడి సూచన బళ్లారి : రాష్ర్ట వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న బాలికల డ్రస్‌కోడ్‌ను మార్చాలని ప్రభుత్వాన్ని బళ్లారి జిల్లా జేడీఎస్ అధ్యక్షుడు కుడితిని శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ను ఆయన బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఇటీవల రాష్ర్ట వ్యాప్తంగా పాఠశాలల్లో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నూటికి 90 శాతం విద్యార్థినిలకు మోకాళ్ల పైకి ఉన్న డ్రస్‌లను యూనిఫాంగా అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి డ్రస్‌లతో బెంచీలపై కూర్చొన్నప్పుడు విద్యార్థినిలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. విద్యార్థినిలపై అత్యాచారాలు నియంత్రణకు తక్షణమే డ్రస్కోడ్ మార్చాలని అన్నారు. 1 నుంచి కాలేజీ వరకూ విద్యనభ్యసించేందుకు వెళ్లే అమ్మాయిలు విధిగా చూడీదార్, చున్నీ వేసుకుని వెళ్లేలా డ్రస్కోడ్ అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించిన వారిలో జేడీఎస్ నాయకులు తాయణ్ణ, సోమలింగనగౌడ తదితరులు ఉన్నారు. -
యూ‘నో’ఫాం
కడప ఎడ్యుకేషన్: పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాదీ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం కష్టాలు తప్పడంలేదు. ఒకటి రెండు కాదు పాఠశాలలు ప్రారంభమై ఏడు నెలలుగా గడుస్తున్నా ఇప్పటికీ యూనిఫాం అందని దుస్థితి నెలకొంది. జిల్లాలోని 51 మండలాలకుగాను ఇప్పటి వరకు 26 మండలాలలోని విద్యార్థులకే యూనిఫాం దస్తులు అందాయి. మరో మూడు నెలలు గడిస్తే పాఠశాలకు సెలవులు కూడా వస్తాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 3, 305 పాఠశాలల్లో 1 నుంచి 8 వతరగతి చదివే విద్యార్థులకు ఒకొక్కరికి రెండు జతలు చొప్పున యూనిఫాం ఇవ్వాల్సి ఉంది. సంబంధిత యూనిఫాంను సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. ఈ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా దాదాపుగా రెండు లక్షల మంది లబ్ధిపొందనున్నారు. వారు కుట్టేదెప్పుడు.. విద్యార్థులు కట్టేదెన్నడు. విద్యార్థులకు దుస్తులు కుట్టే బాధ్యతను ఎస్ఎస్ఏ అధికారులు మెప్మాకు అప్పజె ప్పారు. జిల్లా వ్యాప్తంగా 38 మండలాలను వారికి కేటాయించారు. మిగతా 13 మండలాలను సంబంధించిన యూనిఫాంను కుట్టే బాధ్యతను బయటి వ్యక్తులకు అప్పగించారు. వారు మాత్రం ఇప్పటికీ 12 మండలాలకు సంబంధించిన దుస్తులను కుట్టి అప్పగించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇంకా ఒక మండలానికి సంబంధించిన యూనిఫాం సిద్ధమవుతోందని తెలిపారు. మరోవైపు మెప్మా వారు ఇప్పటికి 16 మండలాలలోని పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన యూనిఫాంను కుట్టి అందజేశారు. మిగతా 4 మండలాలకు సంబంధించిన దుస్తులను కుట్టి సిద్ధం చేయగా వాటికి ఇంకా కాజాలు, గుండీలను ఏర్పాటు చేసి అందజేయాల్సి ఉందని తెలిపారు. యూనిఫాంలకు సంబంధించిన విషయంలో ప్రతి సారీ ఇదే వరుస కనిపిస్తోంది. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా విద్యార్థుల దుస్తుల విషయంలో మాత్రం పురోగతి కనిపించటం లేదు. ఫిబ్రవరి 15లోపు.. అన్ని పాఠశాలలకు యూనిఫాంలను అందజేస్తాం. ఈ సారి బట్టరావటం కొంత ఆలస్యం అయింది. దీంతోపాటు మరికొన్ని కారణాల వల్ల తీవ్రజాప్యం జరిగింది. ఫిబ్రవరి 15 కంతా అన్ని పాఠశాలలకు అందజేస్తాం. - గంగాధర్‌నాయక్, సీఎంఓ, సర్వశిక్ష అభియాన్. -
యూనోఫాం
అనంతపురం రూరల్: పరిధిలోని పాపంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6-8 తరగతుల విద్యార్థులు 181 మంది ఉన్నారు. వీరికి యూనిఫాం కోసం సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) క్లాత్ సరఫరా చేసింది. స్టిచ్చింగ్ మాత్రం కాలేదు. కుట్టు కూలి కూడా జమ చేయలేదు. తమకే కుట్టు బాధ్యత ఇవ్వాలని కొందరు పాఠశాల యాజమాన్యంపై ఒత్తిడి చేస్తున్నారు. దీనివల్లే పెండింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క పాఠశాలలోనే కాదు... జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇదే పరిస్థితి ఉంది. 2014-15 విద్యా సంవత్సరం సగం పూర్తయినా విద్యార్థులకు యూనిఫాం అందలేదు. అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలో 3,844 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 1-8 తరగతుల విద్యార్థులు 2,98,632 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు జతల ప్రకారం 5,97,264 జతల యూనిఫాం అవసరం. ప్రతియేటా ఎస్ఎస్ఏ ద్వారా యూనిఫాం పంపిణీ జరుగుతోంది. 1-7 తరగతుల బాలురకు చొక్కా,నిక్కరు, బాలికలకు చొక్కా, స్కర్టు, 8వ తరగతి బాలురకు చొక్కా, ప్యాంటు, బాలికలకు పంజాబీ దుస్తులు ఇస్తున్నారు. ప్రతియేటా పాఠశాలల ప్రారంభం నాటికి విద్యార్థులందరికీ యూనిఫాం పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ నిబంధన. ఏ ఒక్క ఏడాదీ ఈ నిబంధన అమలు కాలేదు. ఈ విద్యా సంవత్సరంలో ఆర్నెళ్లు గడిచినా.. క్లాత్ అందని పాఠశాలలే చాలా ఉన్నాయి. క్లాత్ ఎప్పుడొస్తుందో, స్టిచ్చింగ్ ఎప్పుడు పూర్తవుతుందో, విద్యార్థులకు ఎప్పుడిస్తారో అర్థం కావడం లేదు. క్లాత్ కొనుగోలు, కుట్టు నిధులు జమ చేశామని అధికారులు చెబుతున్నా..క్షేత్రస్థాయిలో మాత్రం నిధులు రాలేదని హెచ్ఎంలు అంటున్నారు. ఈసారి యూనిఫాం ఇవ్వని కారణంగా గతేడాది ఇచ్చిన వాటినే (చిరిగిపోయినవి, పాతవి) విద్యార్థులు వేసుకుని స్కూళ్లకు వెళుతున్నారు. కమీషన్ల కోసం కక్కుర్తి కుట్టుపై కొందరి గుత్తేదారుల కన్నుపడింది. నిబంధనలను తుంగలో తొక్కి కమీషన్లకు కక్కుర్తిపడున్నారు. కుట్టు కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అటు ప్రజాప్రతినిధులకు, ఇటు అధికారులకు కమీషన్ల ఆశచూపుతున్నారు. ప్రజాప్రతినిధులు కూడా ఒత్తిళ్లు చేస్తుండడంతో కొందరు ఎంఈఓలు ఆయా స్కూళ్ల హెచ్ఎంలను బలవంతంగా ఒప్పించి కుట్టు బాధ్యతలు అనుకున్నవారికే అప్పగిస్తున్నారు. దాదాపు అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి. నాణ్యత కరువు ఒక జత కుట్టేందుకు ప్రభుత్వం రూ.40 చెల్లిస్తోంది. ఇందులోనే దారం, గుండీల ఖర్చు, కుట్టుకూలితో పాటు సంబంధిత అధికారులకు కమీషన్ కూడా చెల్లించాల్సి వస్తోంది. ఇస్తోందే తక్కువ ధర. ఈ మొత్తంలోనే కమీషన్లు ఆశిస్తుండడంతో యూనిఫాం ఏమాత్రం నాణ్యతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బిగుతుగా, నాసిరకంగా కుడుతున్నారు. ఎవరైనా పిల్లలు ప్రశ్నిస్తే వారి నోళ్లు మూయిస్తున్నారు. డమ్మీలైన ఎస్ఎంసీలు పాఠశాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు (ఎస్ఎంసీలు) చాలాచోట్ల డమ్మీగా మారాయి. వీటిని బలోపేతం చేస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం మినహా క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి లేదు. సంబంధిత పాఠశాల హెచ్ఎం ఇంటికి ప్రతిపాదనల ప్రతులు పంపితే వాటిలో గుడ్డిగా సంతకాలు చేయడంతోనే ఎస్ఎంసీ సభ్యులు సరిపెట్టుకుంటున్నారు. -
ఇంకెప్పుడో..!
ఒక్క పాఠశాలకూ అందని యూనిఫాం జిల్లాకు రూ. 6 కోట్లు కేటాయింపు మూడు కోట్లు ఆప్కోకు విడుదల 20 మండలాలకు సిద్ధం చేస్తున్న మెప్మా మహిళలు మరో 30 మండలాల విద్యార్థులకు ఎప్పుడో సాక్షి, కడప : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరో మూడు నెలల వరకూ యూనిఫాం అందే అవకాశం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం మాత్రం అందలేదు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. మొత్తం యూనిఫాం పూర్తికావాలంటే మరొక మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,684 పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతులు చదివే విద్యార్థులకు యూనిఫాంను సర్వశిక్షా అభియాన్ పథకం(ఎస్ఎస్ఏ) ద్వారా ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. ఈ పథకం ద్వారా జిల్లాలోని దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫాం అందజేయాలి. ఈ దుస్తులకు సంబంధించి వస్త్రాలను పంపిణీ చేసే బాధ్యతను ఆప్కో సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. దీని కోసం ఆ సంస్థకు ఇప్పటి వరకు రూ. 3 కోట్లు అందజేసినట్లు తెలుస్తోంది. దుస్తుల కోసం రెండు నెలల క్రితం ఎస్ఎస్ఏకు దాదాపు రూ. 6కోట్లు మంజూరు కాగా ఇందులో 50 శాతం నిధులను విడుదల చేసినట్లు తెలిసింది. కుట్టేదెప్పుడు... కట్టేదెప్పుడు విద్యార్థులకు దుస్తులు కుట్టే బాధ్యతను ఎస్ఎస్ఏ అధికారులు స్కూలు మేనేజ్మెంట్ కమిటీలకు అప్పగించారు. వీటిని కేవలం మెప్మా వారి ద్వారానే కుట్టించుకోవాలని మెలిక పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా కుట్టే కార్యక్రమం కొనసాగుతోంది. దాదాపు 4 లక్షల దుస్తులు ఎప్పుడు కుడతారో.. పాఠశాలలకు ఎప్పుడు అందజేస్తారో తెలియని పరిస్థితి. ఒక్క వైఎస్సార్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ‘సారీ’ ఇదే వరుస... విద్యార్థుల యూనిఫాం విషయంలో ప్రభుత్వాలు ప్రతిసారీ ఇదే విధానం అమలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు, పాలకులు మారినా విధానాల్లో మార్పులు రావడం లేదు. ఏటా పాఠశాలల పునఃప్రారంభ సమయంలో విద్యార్థుల సంక్షేమం పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టే ప్రభుత్వాలకు యూనిఫాం గుర్తుకు రాకపోవడం దురదృష్టకరం. యూనిఫాం జనవరి నాటికి ఇచ్చినా మరో నాలుగు నెలలు మాత్రమే విద్యార్థులు వాడుకునే అవకాశం ఉంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్మాసంలోనే అందజేస్తే ప్రయోజనం ఉంటుందని పరిశీలకు అంటున్నారు. స్కూల్ కమిటీలకు అందజేశాం జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు ఇంతవరకు యూనిఫాం అందని విషయాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, ఆర్వీఎం ఇన్‌ఛార్జి పీఓ ప్రతిభా భారతిని ‘సాక్షి’ వివరణ కోరగా ఆప్కో ద్వారా వస్త్రాలను అన్ని స్కూలు కమిటీలకు అందజేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని మండలాలకు మెప్మా మహిళలతో యూనిఫాం కుట్టించే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. మిగతా మండలాల వారికి కూడా ఒకట్రెండు రోజుల్లో యూనిఫాంను కుట్టించే కార్యక్రమాన్ని ప్రారంభించి త్వరలోనే విద్యార్థులకు అందజేస్తామన్నారు. -
‘కస్తూరిబా’
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : మధ్యలో చదువు మానేసిన పిల్లల కోసం ఏర్పాటు చేసిన కస్తూరిబా పాఠశాలలు ఆచరణలో చతికిలపడుతున్నాయి. పాఠశాలల్లో ప్రహరీలు లేకపోవడంతో విద్యార్థినుల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కొందరు ప్రత్యేకాధికారులు మెనూ పాటించకుండా డబ్బులు నొక్కేసి నాసిరకం భోజనం పెడుతున్న దాఖలాలున్నాయి. చాలాచోట్ల విద్యార్థులకు ఈ ఏడాదికి సంబంధించిన నోట్ బుక్‌లు, ట్రంకు పెట్టెలతోపాటు యూనిఫాంలు కూడా ఇవ్వలేదంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దుప్పట్లు లేకపోవడంతో రాత్రి వేళ దోమలతో ఇబ్బందులు పడడమేకాదు చలికి వణికిపోతున్నారు. ఈ ఇక్కట్లపై ‘సాక్షి’ విజిట్ చేయగా పాఠశాలల డొల్లతనం బట్టబయలైంది. చినగంజాంలో ఏర్పాటు చేసిన కస్తూర్బా పాఠశాలలో మొత్తం 200 మంది బాలికలున్నారు. పాఠశాల చుట్టూ గోడ లేకపోవడంతో వారికి రక్షణ కరువైంది. మర్రిపూడి మండలం రావిళ్లవారిపాలెం శివారులోని పాఠశాలల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడంతో ఎవరికీ చెప్పుకోలేక బాలికలు మథనపడుతున్నారు. పాఠశాల ప్రత్యేకాధికారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేస్తవారిపేట పాఠశాల పక్కనే శ్మశానవాటిక ఉండటంతో విద్యార్థినులు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. శవాలను తీసుకెళ్లేటప్పుడు పాఠశాల ముందు భాగంలో శవాన్ని దింపే కార్యక్రమం నిర్వహిస్తుండటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. చుట్టూ ప్రహరీ నిర్మించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పొన్నలూరు మండలం కె.అగ్రహారంలోని కస్తూరిబా పాఠశాలలో పరిస్థితులు మరీ అధ్వానంగా ఉన్నాయి. పాఠశాలను పెద్ద గోడౌన్లో నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థినులు సామాన్లు పెట్టుకోవడంతోపాటు పాఠాలు కూడా అక్కడే వినాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం 104 మంది ఉండగా మరుగుదొడ్లు రెండు మాత్రమే ఉన్నాయి. పీసీపల్లి కస్తూరిబా పాఠశాలకు ప్రహరీ లేక బాలికలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెలిగండ్ల పాఠశాలలో లైట్లు వెలగక, ఫ్యాన్లు తిరగక రాత్రి పూట అనేక ఇక్కట్లు పడుతున్నారు. చాలాచోట్ల బాలికలకు బోరింగ్ నీరే దిక్కు. బోర్లలోని ఫ్లోరైడ్ నీరు తాగలేక నానా అవస్థలు పడుతున్నారు. హనుమంతునిపాడు కస్తూరిబాలో బోరింగ్ నీరు తాగుతుండటంతో ఇటీవల కొందరు దురద, ఇతర చర్మవ్యాధులతో ఇబ్బందులు పడ్డారు. మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలోని ఆట స్థలం కొండలు, గుట్టలతో నిండిపోయింది. తరగతి గదుల్లోనే రాత్రి సమయంలో నిద్రిస్తున్నారు. = తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు విద్యార్థినులకు ఫ్లోరైడ్ నీరే దిక్కు. పాఠశాల చుట్టూ ముళ్లపొదలు, చెత్తచెదారం ఉండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని బాలికలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఊరికి దూరంగా బీడు భూముల్లో పాఠశాల ఉండటం, ప్రహరీ మధ్యలో ఆగిపోవడంతో రాత్రి పూట బాలికలు నానా అవస్థలు పడుతున్నారు. కొనకనమిట్ల మండలం గొట్లగట్టు కస్తూరిబా పాఠశాలలో ఉడికీ ఉడకని అన్నంతో బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. తాళ్లూరు, కురిచేడు, దొనకొండ పాఠశాలల్లో ప్రహరీలు లేకపోవడంతో తరచూ విష సర్పాలు లోపలికి వస్తున్నాయి. తాళ్లూరు పాఠశాలలో సరిపడినన్ని బెంచీలు లేకపోవడంతో బాలికలు నేలపై కూర్చొంటున్నారు. డార్మేటరీ పూర్తి కాకపోవడంతో డైనింగ్ హాల్, పెట్టెల మధ్యనే నిద్రిస్తున్నారు. కురిచేడు విద్యాలయానికి కంప్యూటర్లు అందజేసిన అధికారులు ఇన్స్ట్ట్రక్టర్ను నియమించకపోవడంతో కంప్యూటర్లు నిరుపయోగంగావున్నాయి. రాచర్లలో అసంపూర్తిగా నిలిచిన భవనంలో విద్యార్థినులు ఆరు బయట నిద్రించాల్సి వస్తోంది. మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడంతో ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కస్తూర్బా పాఠశాలల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
చదివేదెలా?
మార్కాపురం: సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తున్నా..నేటికీ వారికి అవసరమైన నోట్‌పుస్తకాలు, యూనిఫాంలు, ట్రంకుపెట్టెలు పంపిణీ చేయలేదు. జిల్లాలోని మార్కాపురం, కందుకూరు, ఒంగోలు డివిజన్లలో 77 బీసీ హాస్టళ్లు, 117 ఎస్సీ హాస్టళ్లు ఉన్నాయి. మొత్తం మీద 16 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎస్సీ, బీసీ హాస్టల్ విద్యార్థులందరికీ ఇంత వరకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయలేదు. దీంతో బయట పుస్తకాలు కొనుగోలు చేసి విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీసీ హాస్టల్ విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు కూడా ఆగిపోయాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ నోట్ పుస్తకాలను జిల్లాకు పంపలేదు. మూడు నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు మూడు పెద్ద నోట్ పుస్తకాలు, మూడు చిన్న నోట్ పుస్తకాలు, 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 12 నోట్ పుస్తకాలు అందిస్తారు. ఈ ఏడాది పాఠ్య పుస్తకాల సిలబస్ మారడంతో నోట్సు రాసుకోవడం విద్యార్థులకు తప్పనిసరైంది. సైన్స్, మ్యాథ్స్, సోషల్, తెలుగు ఉపాధ్యాయులు ప్రతి పాఠ్యాంశానికి నోట్సు ఇస్తుంటారు. ప్రభుత్వం నుంచి నోట్ పుస్తకాలు అందక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులకు యూనిఫాంలు, ఇంటి నుంచి తెచ్చుకున్న సామగ్రిని పెట్టుకునే ట్రంకుపెట్టెలు సైతం హాస్టల్ విద్యార్థులకు అందించలేదు. వారం రోజుల్లో రావచ్చు బి.నరసింహారావు,బీసీ సహాయ సంక్షేమ అధికారి, మార్కాపురం రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇంత వరకు జిల్లాలోని విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన నోట్ పుస్తకాలు, యూనిఫాం రాలేదు. వారం రోజుల్లో విద్యార్థులకు ఇవ్వాల్సిన సామగ్రి వచ్చే అవకాశం ఉంది. రాగానే పంపిణీ చేస్తాం. -
ఎలా ‘నోట్’ చేసుకోవాలి
మోర్తాడ్ : విద్యాహక్కు చట్టం అభాసుపాలవుతోంది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సామగ్రి (పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, బ్యాగులు, చెప్పులు, యూనిఫాం)ని ప్రభుత్వమే సరఫరా చేయాలి. కేవలం యూని ఫాంలు, పాఠ్య పుస్తకాలతోనే సరిపెడుతున్నారు. జిల్లాలో 1,573 ప్రాథమిక, 265 ప్రాథమికోన్నత, 461 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 41 ఎయిడెడ్ , 30 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 2.40 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలలు పాఠశాలలు ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు విద్యా సామగ్రిని ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవ్వాల్సి ఉంది. కానీ యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలను మాత్రమే సరఫరా చేసింది. ముందుగా టెండర్లను నిర్వహించి సామగ్రిని ప్రభుత్వం సేకరించకపోవడంతో నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, బ్యాగులు, చెప్పులు విద్యార్థులకు సరఫరా కాలేదు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వమే తనకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో విద్యార్థులకు న్యాయం జరగడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో ఎక్కువ మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే ఉంటారు. వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో విద్యా సామగ్రి కొనుగోలు వారికి తలకు మించిన భారంగా మారిం ది. విద్యా సామగ్రి ధరలు మార్కెట్లో భారీ గానే పెరిగాయి. పెరిగిన ధరలకు అనుగుణం గా విద్యార్థుల కుటుంబాల ఆదాయం పెరగలేదు. దీంతో ప్రభుత్వంపై వారు ఆధారపడి ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని కొనుగోలు చేసి ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలి విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం విద్యా సామగ్రిని కొనుగోలు చేసి ఇవ్వాలి. ప్రభుత్వం చట్టాన్ని పాటించక పోతే ఎలా. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని విద్యాహక్కు చట్టంలో విద్యా సామగ్రిని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం చట్టం ప్రకారం పని చేయాలి.- సత్యానంద్, బీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
చదివింపులే!
మొదలైన బడి ‘మోత’ .. ఏటా పెరుగుతున్న డొనేషన్ల భారం అదే బాటలో యూనిఫాం, పుస్తకాలు నేటి నుంచి ప్రారంభం కానున్న ప్రభుత్వ పాఠశాలలు వారం, పది రోజుల క్రితమే ప్రారంభమైన ‘ప్రైవేటు’ స్కూల్స్ సాక్షి, బెంగళూరు : రానురాను చదువు భారమవుతోంది. దీంతో కుటుంబ బడ్జెట్లో ఎక్కువ భాగం పిల్లల చదువు కోసం ఖర్చుపెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ర్టంలో ప్రభుత్వ పాఠశాలలు శుక్రవారం నుంచి ప్రారంభం కానుండగా.. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మాత్రమే అప్పుడే ప్రారంభమయ్యాయి. వేలకు వేలు డొనేషన్లను కట్టడంతో ఈ విద్యా సంవత్సరాన్ని తల్లిదండ్రుల ప్రారంభిస్తారు. స్కూలు బ్యాగు, యూనిఫాం, కొత్త పుస్తకాలు తదితర అదనపు ఖర్చులు సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం వీటి ధరలు పెరగడమే తప్ప తగ్గే పరిస్థితులు కన్పించడం లేదు. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో మధ్యతరగతి కుటుంబాల వారు తమ సంపాదనలో సుమారు 30 నుంచి 40 శాతం పిల్లల చదువులకే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. పెన్సిల్ కొనమనో... పెన్ను పోయిందనో... పుస్తకాలు చిరిగిపోయాయనో... బ్యాగ్ పాడైందనో పిల్లల నుంచి నిత్యం అందే ఫిర్యాదులతో తల్లిదండ్రుల జేబుకు పడే చిల్లు దీనికి అదనం. ఇంగ్లీష్ మీడియం పాఠశాలలపై తల్లిదండ్రులు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఈ మక్కువను సొమ్ము చేసుకోవడానికి ఈ పాఠశాలల యాజమాన్యాలు ప్రతి సంవత్సరం ఫీజులను భారీగా పెంచేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అందిన కాడికి దోచేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. రూ.500 కోట్లు జేబుకు చిల్లు బృహత్ బెంగళూరు మహానగర పాలికే పరిధిలో 620 ప్రైవేటు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. డొనేషన్ కాక ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం తదితర అవసరాల కోసం ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఒక్కొక్కరికి ప్రారంభంలో కనీసం రూ.25 వేలు ఖర్చవుతోంది. ఈ విధంగా చూస్తే విద్యార్థుల తల్లిదండ్రులు రాబోయే జూన్‌లో దాదాపు రూ.500 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, కాన్సెప్ట్, టెక్నో వంటి హై ఎండ్ పాఠశాలల్లో వివిధ సదుపాయాల పేరుతో రెట్టింపు ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో ఒక్కొక్క విద్యార్థికి రూ.25 వేలకు అదనంగా మరో రూ.15 వేలు వరకూ చెల్లించాల్సిందే. పెరిగిన పుస్తకాల ధరలు.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నోట్ పుస్తకాల ధర 15 శాతం పెరిగినట్టు వ్యాపార వర్గాలు తెలిపాయి. గత ఏడాది 195 పేజీలు ఉండే నోట్ పుస్తకం రూ.45 ఉండగా... ప్రస్తుతం ఆ ధర రూ.57కి చేరుకుంది. ఇదిలా ఉండగా గత ఏడాది మార్కెట్లో కొంతమంది వ్యాపారులు పాఠ్యపుస్తకాలకు కృత్రిమ కొరత సృష్టించి అందిన కాడికి దోచుకున్న సంఘటనలు వెలుగు చూశాయి. ఈసారైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. -
విద్యాశాఖాధికారులు సిద్ధ్దం కండి
అందరికీ పాఠ్య పుస్తకాలందించాలి కొత్తయూనిఫాంలు పంపిణీ చేయాలి మౌలిక సౌకర్యాలు తప్పనిసరి అధికారులతో కలెక్టర్ విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : పాఠశాలలు పునః ప్రారంభం నాటికే ప్రతి విద్యార్థికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలతో పాటు పాఠశాలలు, వసతిగృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ, విద్య, రాజీవ్ విద్యామిషన్, అనుబంధ శాఖల అధికారులతో బుధవారం కలెక్టర్ విజయవాడలో తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 12వ తేదీన జిల్లాలో అన్ని పాఠశాలలు పునః ప్రారంభం కానున్న దృష్ట్యా విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు తప్పనిసరిగా అందించాలన్నారు. అదే రోజు ప్రతి విద్యార్థి కొత్త యూనిఫాం, పాఠ్యపుస్తకాలతో తరగతులకు హాజరయ్యేలా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. అన్ని సబ్జక్టుల పాఠ్యపుస్తకాలు అందరికీ అందాలన్నారు. ప్రతీ విద్యార్థికి రెండు జతల యూనిఫాంలు అందించాలన్నారు. మధ్యాహ్న భోజనం అందించేందుకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని చెప్పారు. విద్యార్థుల డ్రాప్అవుట్లు లేకుండా చూడాలని, నూరు శాతం విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను విద్యాభివృద్ధికి ఖర్చుచేస్తున్నందున, అధికారులు చిత్తశుద్ధితో విధులను నిర్వర్తించాలని తెలిపారు. మండల విద్యాశాఖాధికారులు వ్యక్తిగతంగా ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు అందినదీ లేనిదీ తెలుసుకోవాలని చెప్పారు. సంక్షేమ వసతి గృహాలను పాఠశాలల పునః ప్రారంభానికి అన్ని సౌకర్యాలతో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అధికారులు వసతి గృహాలను పరిశీలించి తాగు నీరు, విద్యుత్,మరుగుదొడ్ల సదుపాయాల వంటి మౌలిక వసతులను పరిశీలించాలన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు డీ. మదుసూదనరావు, జిల్లా విద్యాశాఖాధికారి టీ. దేవానందరెడ్డి, రాజీవ్ విద్యామిషన్ పీడీ పద్మావతి, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి చినబాబు, తదితరులు పాల్గొన్నారు. అమృత హస్తమందించండి... ఇందిరమ్మ అమృత హస్తం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు అన్ని అంగన్ వాడీ కేంద్రాల్లో గ్యాస్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా సమగ్ర శిశు అభివృద్ధి సంస్థ అమలు తీరుపై బుధవారం కలెక్టర్ నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు పౌష్టికాహారాన్ని అందించే అమృత హస్తం పథకాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా అధికారులు చూడాలన్నారు. అంగన్వాడీ వర్కర్లు, సూపర్ వైజర్లు, సీడీపీవోలకు ర్యాంకింగ్ విధానం ద్వారా వారి ప్రతిభను నమోదు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసేవారికి ప్రతీ నెలా జీతాలందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. ఐ.సీ.డీ.ఎస్. ప్రాజెక్ట్ డైరక్టర్ కె. కృష్ణకుమారి, సీడీపీవోలు లలిత కుమారి, అంకమాంబ, జయలక్ష్మి, సంధ్య, స్వరూపరాణి, సూపర్ వైజర్లు పాల్గొన్నారు. -
యూనిఫాం ఎక్కడ ?
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం పంపిణీ ప్రతియేటా ప్రహసనంగా మారుతోంది. పాఠశాలలు తెరిచిన రోజునే పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందజేస్తామని పదే పదే ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వాధినేతల మాటలు నీటి మూటలవుతున్నాయి. ఏటా రెండు జతల యూనిఫాం ఉచితంగా ఇస్తామని విద్యా పక్షోత్సవాల్లో ఇచ్చిన హామీలను పాలకులు విస్మరిస్తున్నారు. ఫలితంగా గత ఏడాది తొడిగిన దుస్తులనే విద్యార్థులు మళ్లీ వేసుకుని పాఠశాలలకు వెళుతున్నారు. గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న 2,72,264 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాం పంపిణీ చేసేందుకు రాజీవ్ విద్యామిషన్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఒక్కో విద్యార్థికి క్లాత్ కొనుగోలుకు జతకు రూ.160, కుట్టుకూలికి రూ.40 కలిపి రెండు జతలకు రూ.400 చొప్పున జిల్లాకు కేటాయించిన రూ.10.89 కోట్ల నిధులను పాఠశాల యాజమాన్య కమిటీల (ఎస్ఎంసీ) బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం నెల రోజుల కిందట జమ చేసింది. పాఠశాలలు తెరిచిన ఆరు నెలల తరువాత తీరిగ్గా మేల్కొన్న ప్రభుత్వం నిధులు విడుదల చేసి చేతులు దులుపుకుంది. కాగా 2.72 లక్షల మంది విద్యార్థులకు అవసరమయ్యే క్లాత్ సరఫరా బాధ్యతను ప్రభుత్వం ఆప్కోకు అప్పగించింది. దీంతో సగం నిధులను ఎస్ఎంసీలు ఆప్కోకు చెల్లించాయి. 10 మండలాలకే క్లాత్ సరఫరా విద్యార్థులకు యూనిఫాం ఆర్డర్ పొందిన ఆప్కో ఇప్పటికి 10 మండలాలకే క్లాత్ సరఫరా చేసింది. క్లాత్ అందుకున్న ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు యూనిఫాం కుట్టించి ఇచ్చేందుకు టైలర్ల వద్దకు పంపారు. మిగిలిన 47 మండలాలకు క్లాత్ పూర్తి స్థాయిలో చేరేందుకు మరో నెలరోజులకు పైగా సమయం పట్టే అవకాశముంది. దీంతో విద్యాసంవత్సరం చివర్లో గానీ విద్యార్థులకు కొత్త యూనిఫాం అందే పరిస్థితి కనిపించడం లేదు. ఏ విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులకు అదే విద్యా సంవత్సరంలో యూనిఫాం అందించేందుకు ముందస్తు ప్రణాళిక వేసుకున్న ప్రభుత్వం దానిని అమలు పర్చడంలో విఫలమైంది. ఫలితంగా ఆలస్యంగా విడుదల చేసిన నిధులు లక్ష్యాన్ని చేరలేకపోతున్నాయి. నెల రోజుల్లోగా పూర్తిస్థాయిలో సరఫరా విద్యార్థులకు యూనిఫాం కుట్టించి ఇచ్చేందుకు ప్రభుత్వం ఎస్‌ఎంసీల ఖాతాల్లోకే నేరుగా నిధులు జమ చేసింది. ఆయా నిధులతో క్లాత్ కొనుగోలుకు ఆప్కోకు ఆర్డర్ ఇచ్చి, వచ్చిన క్లాత్‌ను 10 మండలాలకు చేరవేశాం. మరో నెల రోజుల వ్యవధిలో మిగిలిన మండలాలకు పూర్తిస్థాయిలో క్లాత్ అందుతుంది. గతంలో కంటే ప్రస్తుత విద్యాసంవత్సరంలోనే యూనిఫాం కొనుగోలుపై వేగంగా నిర్ణయం తీసుకున్నాం. - బి. రాజకుమారి, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి, రాజీవ్ విద్యామిషన్ -
‘ఎయిడెడ్’ విద్యార్థులపై వివక్ష?
పార్వతీపురం, న్యూస్‌లైన్: ఐటీడీఏ పరిధిలోని ఎయిడెడ్(ద్రవ్యసహాయక) పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఐటీడీఏ పరిధిలోని అన్ని పాఠశాలలు, వసతిగృహ విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ఎయిడెడ్ విద్యార్థులకు ఎందుకు పంపిణీ చేయడంలేదో అర్థం కావడంలేదు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తరగతి గదుల్లో యూనిఫాం వేసుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిబంధన పెట్టింది. ఈ మేరకు ప్రభుత్వమే ఐటీడీఏ పరిధిలోగల అన్ని పాఠశాలలకు యూనిఫాంలు సరఫరా చేసింది. ఎయిడెడ్ పాఠశాలలకు మాత్రం సరఫరా చేయలేదు. ఐటీడీఏ పరిధిలోని గుమ్మలక్ష్మీ పురం మండలంలో 11, కురుపాం మండలంలో 10, కొమరాడ మండలంలో 3 ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో చదువుతున్నవారంతా గిరిజన విద్యార్థులే. అయితే వీరికి మాత్రం యూనిఫాంలు పంపిణీ చేయకపోవడంతో..ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకోవడమే తమ పిల్లల నేరమా? అంటూ ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పథకాలైన ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నభోజన పథకం వంటివి ఈ పాఠశాలల్లో అమలవుతున్నాయి కానీ యూనిఫాం లను పంపిణీ చేయకపోవడానికి కారణమేమిటో పాఠశాలల యాజమాన్యాలకు అర్థం కావడం లేదు. ఈ విషయంపై పలు గిరిజన సంఘాలు స్థానిక శాసనసభ్యులకు, ఐటీడీఏ పీఓకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం కనిపించ లేదు. వందలాది మంది గిరిజన విద్యార్థులకు ఇలా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండబోమని పలు గిరిజన ఉపాధ్యాయసంఘాలు, గిరిజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి. -
యూనిఫాంల డబ్బులు చెల్లించేందుకు వార్డెన్ల కొర్రీలు
సాక్షి, నల్లగొండ: బీసీ సంక్షేమశాఖ వార్డెన్లు మహిళా సంఘాల సభ్యులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. బిల్లులు ఇచ్చేందుకు కాళ్లరిగేలా తిప్పించుకుంటున్నారు. విద్యార్థులకు సంబంధించిన యూనిఫాంల బిల్లులపై సంతకాలు చేయడానికి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కమీషన్లు ఇస్తేనే సంతకాల పని పూర్తవుతుందని మొహమాటం లేకుండా చెబుతున్నారు. జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 20 బాలికల, 48 బాలుర వసతి గృహాలున్నాయి. ఈ 68 హాస్టళ్లలో మొత్తం మూడు నుంచి పదోతరగతి చదివే విద్యార్థులు 7,025మంది వసతి పొందుతున్నారు. ఒక్కో విద్యార్థికి ఏడాదికి నాలుగు జతల యూనిఫాంలు అందించాల్సి ఉంది. అయితే అందుకు సంబంధించిన వస్త్రం పూర్తిగా సకాలంలో జిల్లాకు రాకపోవడంతో ముందుగా మూడు జతలు అందజేశారు. వీటిని కుట్టే బాధ్యత మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆధ్వర్యంలోని మహిళా సంఘాల సభ్యులకు అప్పజెప్పారు. స్వయం ఉపాధి కల్పించేందుకు సంఘం సభ్యులకు గతంలో ఉచితం గా కుట్టుశిక్షణ ఇచ్చి యూనిఫాంలు కుట్టేపని అప్పగించారు. జతకు బీసీ సంక్షేమశాఖ నుంచి *40, మెప్మా నుంచి *4 ఇవ్వాల్సి ఉంది. కష్టాలకోర్చి.... హాస్టళ్ల వద్దే పిల్లల కొలతలు తీసుకుని, అక్కడే యూనిఫాంలు కుట్టాలని నిబంధన పెట్టారు. కొంచెం కష్టమైనా సంఘాల సభ్యులు దీనికి అంగీకరించారు. ఇంటి నుంచి పని ప్రదేశానికి నిత్యం రాకపోకలు సాగించేందుకు రవాణా చార్జీలు కూడా స్వతహాగా భరించారు. ఇవన్నీ ఖర్చులు పోయినా కొద్దోగొప్పో డబ్బులు మిగిలితే కుటుంబానికి కొంత ఆసరా అవుతుందని భావించారు. వీటన్నింటినీ భరించి నిబంధన ప్రకారమే యూనిఫాంలు కుట్టి సంబంధిత వార్డెన్లకు అప్పగించారు. ఇదంతా జరిగి దాదాపు మూడు నెలలు పూర్తవుతున్నాయి. ఇంతవరకు వీరికి ఒక్కపైసా అందజేయలేదు. తిరకాసు... బిల్లులపై సంతకాలు చేయడానికి వార్డెన్లు అవస్థల పాలు చేస్తున్నారు. వచ్చే కొద్ది మొత్తంలోనే వార్డెన్లు కమీషన్లు అడుగుతున్నారని సంఘాల సభ్యులు ఆవేదన చెందుతున్నారు. చిన్నపాటి కారణాలు చూపి రోజుల తరబడి హాస్టళ్ల చుట్టూ తిప్పించుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వచ్చే డబ్బుల మాటేమోగానీ, వారికోసం తిరిగేందుకు ఆటో చార్జీలు చెల్లించి పర్సు గుల్ల చేసుకుంటున్నారు. వార్డెన్లు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మెప్మా అధికారులు నోరు మెదపకపోవడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. పర్సెంటేజీలకు కక్కుర్తి పడి మహిళలని కూడా చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఎదురుచూపులు
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా ఉంది జిల్లాలోని పేద విద్యార్థుల దుస్థితి. విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు పంపిణీ చేసేందుకు ఏడాదిన్నర క్రితం నిధులు మంజూరైనా నేటికీ ఆ నిధులు పాఠశాలల ఖాతాలకు జమ కాలేదు. రాజీవ్ విద్యామిషన్ నిర్వాకంతో జిల్లాలో 2012-13 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూనిఫాంల పంపిణీ వ్యవహారం నేటికీ ఒక కొలిక్కిరాలేదు. ఇప్పటికీ ఇంకా జిల్లాలో 444 పాఠశాలలకు అసలు యూనిఫాం వస్త్రం కొనుగోలుకు సంబంధించిన నిధులు రాజీవ్ విద్యామిషన్ నుంచి విడుదల కాలేదు. అంటే సుమారు 39 వేల మంది విద్యార్థులకు రూ 1,23,33,675 నేటికీ చేరలేదు. అదేవిధంగా 13 మండల్లాలోని 315 పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాంలు కుట్టుకూలి చార్జీలు రూ 22,44,000 ఇప్పటికీ పాఠశాల జీతాల ఖాతాలకు జమ కాలేదు. తాజా అంచనా ప్రకారం జిల్లాలో ఇప్పటికీ ఇంకా సుమారు 39 వేల మందికి యూనిఫాంలు అందలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తేటతెల్లమవుతోంది. ప్రభుత్వ రంగ పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రభుత్వం 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు రెండు జతల యూనిఫాంలు ఉచితంగా పంపిణీ చేయాలని సంకల్పించి ఆ మేరకు నిధులు విడుదల చేస్తోంది. ఒక్కో యూనిఫాంరూ 200 చొప్పున ప్రతి విద్యార్థికి రెండు జతల కోసం రూ 400 విడుదల చేస్తోంది. ఈ మొత్తంలో వస్త్రం కొనుగోలుకు రూ 160, యూనిఫాం కుట్టినందుకు రూ 40 కుట్టుకూలి కింద విడుదల చేస్తున్నారు. అయితే ఏ ముహూర్తాన యూనిఫాంలు ఉచితంగా పంపిణీ చేయడానికి నిర్ణయించారో గానీ విద్యార్థులకు ఏనాడూ విద్యా సంవత్సరం ఆరంభంలో పంపిణీ చేసిన దాఖలాలేదు. అధికారుల కాసుల కక్కుర్తి విద్యార్థులకు శాపంగా మారింది. విద్యార్థులకు క్షేత్రస్థాయిలో పాఠశాలల యాజమాన్య కమిటీలు వస్త్రం కొనుగోలు చేసి యూనిఫాంలు కుట్టించాల్సి ఉండగా వారు పట్టించుకోకపోవడంతో రాష్ట్రస్థాయిలోనే లాలూచి వ్యవహారాలు మొదలయ్యాయి. ప్రభుత్వ పెద్దలే వివిధ సంస్థలతో లాలూచి పడి ఆ సంస్థల నుంచే యూనిఫాంలు కొనుగోలు చేయాలని తీర్మానాలు జారీ చేస్తుండడంతో విద్యార్థులకు నాణ్యతలేని యూనిఫాంలే దిక్కవుతున్నాయి. గత ఏడాది జరిగిందిదీ.. జిల్లాలో 2012-13 విద్యా సంవత్సరంలో 2,56,151 మందికి 10.24 కోట్ల రూపాయలతో రెండు జతల యూనిఫాంలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ యూనిఫాంలు ఇస్తారు. ఎస్సీ బాలురు 42,564 మంది, ఎస్టీ బాలురు 8,654, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బాలురు 6,976 మందికి యూనిఫాంలు అందించాలని నిర్ణయించారు. ఆ మేరకు కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం లభించింది. అయితే అన్ని పాఠశాలలకు యూనిఫాంల నిధులు విడుదల కాలేదు. గత సంవత్సరం పాఠశాలలకు నిధుల విడుదల బాధ్యత జిల్లా ప్రాజెక్టు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ కార్యాలయం స్వీకరించింది. జిల్లాలోని అన్ని మండలాల పరిధిలోని పాఠశాలల యాజమాన్య కమిటీల బ్యాంకు ఖాతాల వివరాలను రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ కార్యాలయానికి పంపించారు. హైదరాబాద్‌లోని రాజీవ్ విద్యామిషన్ ఎస్పీడీ కార్యాలయం నిధుల విడుదలలో జరిగిన జాప్యంతో 444 పాఠశాలల విద్యార్థులకు నేటికీ యూనిఫాంలు అందలేదు. ఈ పాఠశాలల్లో మొత్తం సుమారు 39 వేల మందికి రూ 1,23,33,635 నేటికీ విడుదల కాలేదు. యూనిఫాంల కోసం ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు నిరాశే మిగిలింది. కుట్టుకూలి చార్జీలు కూడా.. జిల్లాలోని 444 పాఠశాలలకు యూనిఫాం వస్త్రం కొనుగోలుకు నిధులు విడుదల చేయకుండా తమ చేతకానితనాన్ని బయట పెట్టుకున్న అధికారులు 315 పాఠశాలల్లోని 28,046 మంది విద్యార్థులకు కుట్టుకూలి చార్జీలు కూడా విడుదల చేయలేదు. దొనకొండ మండలంలోని 69 పాఠశాలలకు రూ 4.27 లక్షలు, సంతమాగులూరు మండలంలోని 52 స్కూళ్లకు రూ 4.60 లక్షలు, చినగంజాం మండలంలోని 18 పాఠశాలలకు రూ 1.51 లక్షలు, వేటపాలెంలోని 48 పాఠశాలలకు రూ 3.99 లక్షలు, త్రిపురాంతకంలోని 11 పాఠశాలలకు రూ 1.22 లక్షలు, యర్రగొండపాలెంలోని 25 పాఠశాలలకు రూ 33,440, పెద్దారవీడు మండలంలోని 4 పాఠశాలలకు రూ 58,640, హనుమంతునిపాడు, కనిగిరి, మద్దిపాడు, మార్కాపురం తదితర మండలాలకు ఒక్కోదానికి 10 వేల రూపాయలలోపు విడుదల చేయాల్సి ఉంది. అధికారులు ఇప్పటికైనా పాఠశాలలకు యూనిఫాం నిధులు విడుదల చేసి పేద పిల్లలకు యూనిఫాంలు అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
మో‘డల్’ స్కూల్
ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: అదో మోడల్ స్కూల్.. ‘మేలి పండూ చూడు మేలిమై ఉండు.. పొట్టవిప్పీ చూడు పురుగులుండు’ అన్న చందాన పైకి అందంగా కనిపించే ఆ భవనం లోనికి వెళ్లి చూస్తేనే గాని అసలు సంగతి తెలియదు. కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన ఈ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫారాలు లేవు. చదువు చెప్పేందుకు పూర్తిస్థాయి బోధనా సిబ్బంది లేరు. పాఠ్యపుస్తకాలు అంతకన్నా లేవు. పిల్లల్ని పాఠశాలకు చేర్చేందుకు సరైన రవాణా సౌకర్యం లేదు. అసంపూర్తిగా మిగిలిన తరగతి గదులు, చెత్తాచెదారంతో కూడిన పాఠశాల ప్లేగ్రౌండ్, నేలబారు చదువులే దర్శనమిస్తాయి. అదే బొంగ్లూర్‌లోని మో‘డల్’ స్కూల్. ఆర్భాటంగా ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో జిల్లా విద్యా,సంక్షేమ మౌలిక సదుపాయాల కల్పనా అభివృద్ధి సంస్థ దాదాపు రూ.3కోట్ల వ్యయంతో బొంగ్లూర్ సమీపంలో ఆదర్శ పాఠశాలను నిర్మించింది. ఈ ఏడాది జూన్ 26న రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ చేతులమీదుగా అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. రిజర్వేషన్ల ప్రకారం లాటరీ విధానంతో 6, 7, 8 తరగతులతోపాటు ఇంటర్ ప్రథమ సంవత్సరానికి ప్రవేశాలు నిర్వహించారు. ఒక్కో తరగతిలో 80మంది చొప్పున మొత్తం 320మందిని చేర్చుకునేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. నత్తనడకన తరగతి గదుల నిర్మాణం.. మోడల్‌స్కూల్ ప్రారంభమై రెండునెలలు కావస్తున్నా ఇప్పటికీ తరగతి గదుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఫర్నిచర్ లేకపోవడంతో విద్యార్థులను ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చోబెడుతున్నారు. తరగతి గదుల్లోకి సరైన వెలుతురు కూడా రాకపోవడంతో ఆరుబయటే తరగతులు కొనసాగిస్తున్నారు. సరైన మైదానం కూడా లేకపోవడంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. బోధన సిబ్బంది కొరత.. సరిపడా బోధనా సిబ్బంది లేకపోవడంతో ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రిన్సిపాల్‌తో సహా ప్రస్తుతం తొమ్మిది మంది పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ) ఉన్నారు. ప్రతీ తరగతిని రెండు సెక్షన్లుగా విభజించి ప్రాథమికోన్నత విద్యార్థులకు ట్రైన్డ్ గ్యాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ), ఉన్నత స్థాయి విద్యార్థులకు పీజీటీ సిబ్బంది బోధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం టీజీటీ సిబ్బంది లేక విద్యార్థులను సెక్షన్లుగా విభజించకుండా ఒక్కటే తరగతిలో చేర్చి పీజీటీలే పాఠాలు బోధిస్తున్నారు. మరోవైపు ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సైతం అందలేదు. బస్సు తుస్సు.. నీటికి పోటీ.. స్కూల్‌కి వెళ్లాల్సిన విద్యార్థులు ప్రయాణ సదుపాయాల్లేక నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలుత ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు ఆటోల్లో వెళ్తున్న విద్యార్థుల అవస్థల్ని పలువురు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఉదయం సాయంత్రం వేళల్లో బస్సు సౌకర్యాన్ని కల్పించారు. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో బస్సులు సరిగా రావడం లేదని.. వచ్చినా కిలోమీటరు దూరంలోనే వదిలేసి వెళ్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల తాగునీటికి కటకట ఏర్పడింది. ప్రతిరోజూ మధ్యాహ్న భోజన సమయానికి ఐదు క్యాన్ల నీటిని కొనుగోలు చేస్తున్నారు. నీటికోసం విద్యార్థులు పోటీ పడాల్సి వస్తోంది. సెక్యూరిటీ కరువు.. వందల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్న పాఠశాలలో పరిసరాలను, తరగతి గదులను శుభ్రపరచడానికి ఓ స్వీపర్ కూడా లేడు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయాలు, తాగునీటి ఏర్పాట్లను సమకూర్చేందుకు ఆయాను నియమించలేదు. స్కూల్‌కి సెక్యూరిటీ సౌకర్యం కూడా కల్పించలేదు. ఉన్నంతలో న్యాయం చేస్తున్నాం.. మౌలిక సదుపాయాల ఏర్పాట్లలో ఆలస్యం జరుగుతున్నప్పటికీ బోధనా విషయంలో విద్యార్థులకు సంపూర్ణ న్యాయం చేస్తున్నాం. సంవత్సరాంతం రాబోయే ఫలితాలతో అది నిరూపిస్తాం. సమస్యలపై అధికారులతో కూడా చర్చించాం. త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. - పి.యాదయ్య, ఇన్చార్జి ప్రిన్సిపాల్ సౌకర్యాల కల్పనకు కృషి.. సమస్యలను రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. నెలలోపు బోధనా సిబ్బంది, మౌలిక సదుపాయాల కల్పన పూర్తవుతుందని చెప్పా రు. స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి బస్సు ట్రిప్పులను పెంచాం. సౌకర్యాల కల్పనకు కృషి చేస్తాం. - బి.శ్రీనివాస్‌గౌడ్, మండల విద్యాధికారి, ఇబ్రహీంపట్నం