కుట్టే వారేరి!
కుట్టే వారేరి!
Published Wed, May 24 2017 2:00 AM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM
నల్లజర్ల : ప్రభుత్వ పాఠశాలలు మరో 20 రోజుల్లో తెరుచుకోనున్నాయి. జిల్లాలోని 48 మండలాల్లో 1నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 2,17,137. ఒక్కొక్కరికీ రెండు జతల చొప్పున 4,34,274 జతల ఏకరూప దుస్తుల(యూనిఫామ్)ను పంపిణీ చేయాల్సి ఉంది. వీటిలో 7 మండలాలకు సంబంధించి సుమారు 40 వేల మంది విద్యార్థుల కోసం 80 వేల జతల ఏకరూప దుస్తులకు సరిపోయే వస్త్రం మాత్రమే వచ్చింది. కత్తిరించి పంపించిన ఈ క్లాత్‌ను టైలర్ల చేత కుట్టించి విద్యార్థులకు పంపిణీ చేయాల్సి ఉంది. జతకు రూ.50 చొప్పున కుట్టు కూలీ చెల్లించనున్నారు. 48 మండలాలకు గాను 7 మండలాల విద్యార్థులకు మాత్రమే క్లాత్ వచ్చిందని.. మిగిలిన మండలాలకు ఎప్పటికి వస్తుందో తెలియదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. టైలర్లు దొరక్క అవస్థలు పడుతున్నామని ఉపాధ్యాయులు వాపోతున్నారు. బడులు తెరిచే నాటికి క్లాత్ రావటం.. యూనిఫామ్ కుట్టించడం కష్టసాధ్యమని చెబుతున్నారు.
Advertisement
Advertisement