govt schools
-
బడిని బతికించిన బాపు!
వైరా రూరల్: కారణాలు ఏమైనా ఇప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపేందుకే మొగ్గు చూపుతుండడంతో ప్రభుత్వ పాఠశాలలు వైభవం కోల్పోతున్నాయి. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని నారపునేనిపల్లి యూపీఎస్‌కు కూడా అదే గతి పట్టింది. ఈ ఏడాది స్కూల్ మొత్తంలో నాలుగో తరగతి చదివే ఒకే విద్యార్థి మిగిలింది. దీంతో అధికారులు స్కూల్‌ను మూసివేసేందుకు యత్నించారు. కానీ ఆ విద్యార్థి ని తండ్రి పట్టుదల కారణంగా స్కూల్ ఇంకా మూతపడకుండా నడుస్తోంది. 24 మంది నుంచి ఒకరికి.. నారపునేనిపల్లిలో పాఠశాల స్థాయి విద్యార్థులు 35 మంది ఉంటారు. గ్రామ యూపీఎస్‌లో 2018లో 24 మంది విద్యార్థులతో పాటు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. 2022–23లో ఎనిమిదికి, 2023–24లో నలుగురికి ఆ సంఖ్య పడిపోయింది. దీంతో ఉమాపార్వతి అనే టీచర్ మినహా ఉపాధ్యాయులందరినీ డిప్యూటేషన్‌పై వేరే స్కూళ్లకు పంపారు. ఈ విద్యాసంవత్సరం నాలుగో తరగతి చదివే కీర్తన మాత్రమే మిగిలింది. ఈ స్కూల్ నుంచి విద్యార్థులు వెళ్లిపోవటానికి కోతుల బెడద కూడా కారణమైంది.విద్యార్థులు లేని కారణంగా స్కూల్ మూసివేతకు అధికారులు సిద్ధపడడంతో ఆమె తండ్రి అనిల్‌శర్మ అడ్డుకున్నాడు. పాఠశాల మూస్తే తన కుమార్తె చదువు మాన్పిస్తానని.. అదే జరిగితే అధికారులే బాధ్యత వహించాలని స్పష్టంచేయటంతో వెనక్కి తగ్గారు. స్కూల్లో ప్రవేశాల పెంపునకు అధికారులు గ్రామంలో ఇంటింటా ప్రచారం చేయటంతో ఇంకో టీచర్‌ను కేటాయిస్తే పిల్లల్ని పంపిస్తామని గ్రామస్తులు చెప్పారు. దీంతో డిప్యూటేషన్‌పై ఖానాపురం హిందీ పండిట్ మాచర్ల రాంబాబును కేటాయించారు. స్కూల్ మూత పడొద్దనే... ఒకసారి స్కూ ల్ మూసేస్తే మళ్లీ తెరవడం సాధ్యం కాదు. ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్థోమత ఉన్నా పాఠశాల మూసివేయొద్దనే ఉద్దేశంతో మా పాపను ఇక్కడ చదివిస్తున్నా. ప్రభుత్వ బడుల్లో ఉన్న సదుపాయాలపై ప్రచారం చేసి ప్రవేశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. – నందిగామ అనిల్‌శర్మ, కీర్తన తండ్రిఅన్ని వసతులు కల్పిస్తాం.. యూపీఎస్‌లో వి ద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తాం. కోతుల ని వారణకు పాఠశాల ప్రహరీపై సో లార్ ఫెన్సింగ్ ఏర్పాటుచేయడమే కాక డిజిటల్ బోధ న చేయనున్నాం. తల్లిదండ్రులు రూ. లక్షలు వెచ్చించి ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా పిల్లలను సర్కారు బడులకు పంపించి ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి సహకరించాలి. – కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఎంఈఓ, వైరా. -
సుద్ద పూస.. పరమ పవిత్రుడు.. ఇంగితం ఉందా బాబు ?
-
ఇంగ్లిష్ మాకే..! పేదవాళ్లు పేదవాళ్లలా ఉండండి
-
సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ.. ఆ వార్తల్లో నిజం లేదు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు (Sankranti holidays) ఉంటాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. 2024–25 విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు స్థానికంగా సెలవులు ఇచ్చినందున ఈసారి 11–15 లేదా 12–16 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సోషల్ మీడియాలో (Social Media) జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ జారీ 2025–26 విద్యా సంవత్సరానికిగాను ఆలిండియా సైనిక్ స్కూల్ (Sanik School) ప్రవేశ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ జారీచేసింది. ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షకు జనవరి 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరో తరగతిలో ప్రవేశానికి మార్చి 31 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతి పాస్ అయి, 11 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న వారు 9వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు https://exams.nta.ac.in/AISSEE/చూడొచ్చు.స్టీల్‌ప్లాంట్‌లో అప్రెంటీస్‌కు దరఖాస్తుల ఆహ్వానంవిశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో (Vizag Steelplant) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ (గాట్), టెక్నీషియన్ అప్రెంటీస్ ట్రైనీ (టాట్)కు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. గాట్‌కు రూ.9 వేలు, టాట్కు రూ.8 వేలు స్టైఫండ్ చెల్లించనున్నారు. 2022 తర్వాత గ్రాడ్యుయేషన్, డిప్లమో పూర్తి చేసిన అభ్యర్థులు నాట్స్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. గూగుల్ ఫారం నింపేందుకు జనవరి 9 వరకు గడువు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.చదవండి: ఇంటర్ ఫీజు చెల్లింపునకు తత్కాల్ అవకాశంచైల్డ్ కేర్ లీవ్ షరతులతో ఇబ్బందులున్యాయం చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి డిమాండ్సాక్షి, అమరావతి: మహిళా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన చైల్డ్ కేర్ లీవ్‌లను 10 విడతల్లోనే వినియోగించుకోవాలన్న షరతుతో వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ షరతును రద్దు చేసి ఉద్యోగినులకు న్యాయం చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ డిమాండ్ చేశారు. షరతులతో సెలవు లక్ష్యం దుర్వినియోగమవుతోందన్నారు. అవసరం మేరకు మాత్రమే సెలవు ఉపయోగించుకునేలా, అపరిమిత విడతలతో చైల్డ్ కేర్ లీవ్ పొందేలా 199,36 జీవోలను సవరించాలని వారు విజ్ఞప్తి చేశారు. -
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న కూటమి ప్రభుత్వం
-
సమీకృత గురుకు భవనాలకు నేడు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్/కొందుర్గు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల భవన నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో ఈ భవనాలకు ప్రభుత్వం శంకుస్థాపన చేయనుంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొందుర్గులో సమీకృత గురుకుల పాఠశాల భవన భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు.అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. శంకుస్థాపన ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం సచివాలయం నుంచి ఆయా జిల్లా కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొందుర్గులో నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మధిర నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొంటారని సీఎస్ చెప్పారు. ఈ కార్యక్రమాలకు ఆయా జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులందరినీ ఆహ్వానించాలని సూచించారు.ఇప్పటికే సంబంధిత అధికారులు శంకుస్థాపన జరిగే ప్రాంతాన్ని పరిశీలించినట్లు కలెక్టర్లు సీఎస్‌కు వివరించారు. ప్రస్తుతం భూమి లభ్యత ఉన్న 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపన నిర్వహిస్తున్నామని, రెండో దశలో ఇతర ప్రాంతాల్లో భూమిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని సీఎస్ చెప్పారు.మొదటి విడత కింద ఎంపిక చేసినవి..కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, అందోల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్ ఘన్పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్, పరకాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట నియోజకవర్గాలున్నాయి.కొందుర్గులో సీఎం సభరంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో రూ.125 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడ నున్నారు. ఇందుకోసం కొందుర్గు శివారులోని 109 సర్వే నంబర్లో 20 ఎకరాలను కేటాయించారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శశాంక, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పనులను పర్యవేక్షించారు. -
సర్కార్ బడుల్లో అంతర్జాతీయ ప్రమాణాల విద్యకి ఎసరు
-
విద్యార్థుల కష్టాలు.. అన్నం తినలేకపోతున్నాం..
-
విద్యార్థుల కష్టాలు.. అన్నం తినలేకపోతున్నాం..
-
విద్యార్థుల కష్టాలు.. అన్నం తినలేకపోతున్నాం..
-
టీడీపీ కోట్లు స్కీం.. చంద్రన్న పాచి ముద్ద..
-
పేద విద్యార్థులకు సారీ.. ఉచిత వైద్యం హరీ
-
టీచర్లకు పాలాభిషేకం
-
తండ్రి లాంటి గురువు కోసం తల్లడిల్లిన పిల్లలు
-
10 రోజులుగా పేదపిల్లల కడుపు కాలుస్తున్నారు.. ఇలాగే దేవాన్ష్ కడుపు కాల్చి చూడండి
-
పాఠశాలల పునఃప్రారంభం ఒకరోజు వాయిదా
సాక్షి, అమరావతి: ఈ ఏడాది పాఠశాలలు ఒకరోజు ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. అదే తేదీన నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్టు తెలిసింది. దీంతో గురువారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి.కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు గత ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన మొదటిరోజే పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫామ్‌తో కూడిన విద్యా కానుక కిట్లు అందజేసింది. ఇలా వరుసగా నాలుగేళ్లు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందించింది. అయితే, ఈ విద్యా సంవత్సరం పాఠ్య పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్ల పంపిణీ కూడా ఆలస్యం కానుంది. పుస్తకాలు మండల కేంద్రాలకు చేరినా నూతన విద్యాశాఖ మంత్రి వచ్చాకే వీటి పంపిణీపై నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ 36 లక్షల విద్యా కానుక కిట్లను సిద్ధం చేయగా, ఇప్పటి వరకు సగం మాత్రమే సరఫరా చేసినట్టు తెలుస్తోంది. ఈ కిట్‌లో అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు, టోఫెల్ వర్క్‌బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ పుస్తకంతో పాటు 3 జతల యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్ఫర్డ్ నిఘంటువు.. 1–5 తరగతుల విద్యార్థులకు వర్క్‌బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ, 6–10 తరగతులకు నోట్‌బుక్స్ ఉన్నాయి. మొదటి సెమిస్టర్‌కు 3.12 కోట్ల పుస్తకాలు ఈ విద్యా సంవత్సరంలో 1–10 తరగతుల విద్యార్థులకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం. కాగా, మొదటి సెమిస్టర్‌కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలు దాదాపు మండల స్టాక్ పాయింట్లకు చేరాయి. గతంలో ఇచ్చినట్టుగానే ఇప్పుడూ ద్విభాషా పుస్తకాలనే ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారడంతో అందుకు తగ్గట్టుగా పుస్తకాల ముద్రణ చేపట్టింది. అలాగే, 3–10 తరగతులకు వరకు పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మార్చారు. రాష్ట్రంలో 1,000 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్ఈలోకి మారిన సంగతి తెలిసిందే. ఈ విధానంలోనే స్టేట్ సిలబస్ పుస్తకాలను అందించనున్నారు.పదో తరగతి సాంఘికశా్రస్తాన్ని సీబీఎస్ఈ బోధనా విధానంలో.. జాగ్రఫీ, ఎకనామిక్స్, చరిత్ర, డెమోక్రటిక్ పాలిటిక్స్ సబ్జెక్టులుగా ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ముద్రించింది. ఫిజికల్ సైన్స్ పుస్తకాలను ఆర్ట్ పేపర్‌పై ముద్రించారు. ఈ తరహా ముద్రణ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ కోర్సును అందుబాటులోకి తెచి్చంది. ఈ బోధనకు అనుగుణంగా మొత్తం 4.30 లక్షల పుస్తకాలు సైతం ముద్రించి పంపిణీకి సిద్ధం చేశారు. అయితే, కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మేరకు ఈ ఏడాది విద్యావిధానంలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విద్యా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఇంగ్లీష్ పదిలం..ఏపీలో ఇంగ్లీష్ మీడియంకు పెరిగిన విద్యార్థులు
-
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలపై ఐబీ సంస్థ ప్రతినిధుల ప్రశంసలు
-
మా బడి బ్రహ్మాండం
-
టోఫెల్ శిక్షణతో సత్ఫలితాలు..ఎల్లో మీడియా వక్రరాతలు
-
కార్పొరేట్ స్కూలుకు ధీటుగా విశాఖ మధురానగర్ ప్రభుత్వ పాఠశాల
-
పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం వైఎస్ జగన్
-
విద్యా విప్లవం: బైజూస్ కంటెంట్ ఎంతో బాగుందంటున్న విద్యార్థులు
-
విజయవాడలో ఫ్యూచర్ స్కిల్స్ పై అవగాహన కార్యక్రమం
-
గతంలో స్కూల్స్ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థిని
-
ఏపీ విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, మార్పులు
-
పేదింట చదువుల వెలుగులపై ఎల్లో బ్యాచ్ అక్కసు
-
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు
-
విశాఖ జిల్లాలో 132 ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ట్యాబ్ ల పంపిణీ
-
నేటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ
-
విద్యార్థులకు గుడ్ న్యూస్...విద్య శాఖపై సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం
-
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు టోఫెల్ శిక్షణ
-
విద్యార్థులకు టోఫెల్ శిక్షణ
-
విద్యారంగంలో ప్రభుత్వం సమూల మార్పులు తెచ్చింది: అంబటి రాయుడు
-
కార్పొరేట్ స్కూళ్ల కంటే ఏపీ ప్రభుత్వ బడులు అద్భుతం: అంబటి రాయుడు
సాక్షి, తెనాలి : కార్పొరేట్ స్కూళ్ల కంటే ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కొనియాడారు. తెనాలి నియోజకవర్గం సంగం జాగర్లమూడిలోని రైతు భరోసా కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ పాఠశాలను రాయుడు పరిశీలించారు. విద్యార్థులు కూడా తమ భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఉన్నారని తెలిపారు. ‘ఏపీలో స్కూళ్లలో ఉన్న సదుపాయాలు దేశంలో ఎక్కడా లేవు. మధ్యాహ్న భోజన పథకంలో ఇచ్చే ఆహారం రుచికరంగా ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. వైద్య ఆరోగ్య రంగంలో ఏ రాష్ట్రం మన రాష్ట్రంతో సరితూగలేదు. రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులు ఆనందంగా ఉన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు సంక్షేమ పథకాలతో ప్రజలంతా ఆనందంగా ఉన్నారు’ అని రాయుడు అన్నారు. ఇదీచదవండి... ఎమ్మెల్యే డోల శ్రీబాలవీరాంజనేయస్వామికి ఝలక్ -
పేద పిల్లల విద్యకు మహర్దశ
-
ప్రభుత్వ బడుల్లో క్రీడలకు ప్రాధాన్యం
-
నిర్మాణంలో ఉన్న బడులను ఫోటోలు తీసి తప్పుడు వార్తలతో దొరికిపోయిన ఈనాడు
-
కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాలలు
-
తూర్పుగోదావరి జిల్లాలోని పాఠశాలల్లో నాడు నేడు
-
ఏపీలో చకచకా డిజిటలైజేషన్
-
విద్యా సంస్కరణలు భేష్
-
విద్యార్థులకు రోజుకు గంట పాటు టోఫెల్ శిక్షణ
-
ఏపీ విద్యావ్యవస్థకు అరుదైన గుర్తింపు
-
ఏపీలో పెరిగిన విద్యా సామర్థ్యాలు, నైపుణ్యాలు
-
సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం..88,342 మంది విద్యార్థులు తిరిగి బడికి
-
సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్..మెనూ ఇదే..
-
అమెరికా వైట్ హౌస్ లో ఏపీ విద్యార్థుల సందడి
-
ఖండాంతరాలు దాటిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు (ఫొటోలు)
-
హ్యాట్సాఫ్ చిల్డ్రన్, వి ఆర్ ప్రౌడ్ యూ.. మీరు మరిన్ని అంతర్జాతీయ విజయాలను సాధించాలని ఆశిస్తున్నాం.!
-
ఏపీ సంక్షేమ పథకాలపై ‘ఐరాస’లో చర్చ
సాక్షి, అమరావతి: అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తాజాగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 78వ సదస్సులో పాల్గొన్నారు. 27 దేశాలకు చెందిన గ్లోబల్ పార్టనర్లు, ప్రపంచ దేశాల నాయకులు, దౌత్యవేత్తలు, పౌర సమాజ సభ్యులను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు న్యూయార్క్‌లో నిర్వహించిన హైబ్రిడ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాన్ఫరెన్స్–2023లో ఏపీ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ప్రసంగించారు. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అటు ప్రజలకు, ఇటు విద్యార్థుల ప్రగతికి ఏవిధంగా ఉపయోగపడుతున్నాయో వివరించారు. మహిళల భద్రత కోసం సీఎం జగన్ తీసుకువచ్చిన దిశ చట్టం గురించి తెలియజేశారు. కాగా, ప్రపంచ శాంతి, మానవ హక్కులు, స్థిరమైన అభివృద్ధిపై జరిగిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా 150 మంది ఉన్నత స్థాయి స్పీకర్లను ఒక్కచోటకు చేర్చి ఇంటర్ డిసిప్లినరీ గ్రూపులను ఏర్పాటు చేశారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సదస్సులో జర్నలిస్ట్స్ అండ్ రైటర్స్ ఫౌండేషన్ సభ్యులతో పాటు వివిధ దేశాల ప్రతినిధులు, ఐక్యరాజ్యసమితి స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యారంగంలో మరో విప్లవాత్మక అడుగు
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బక్‌లారియేట్ సిలబస్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర.... ఇంకా ఇతర అప్డేట్స్
-
అమెరికా వెళ్లిన ఏపీ విద్యార్థులు
-
విద్యా శాఖపై సమీక్షించిన సీఎం వైఎస్ జగన్
-
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఏకంగా ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే అవకాశం
-
99శాతం బాగున్నాయి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎనిమిదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో అందించిన ట్యాబ్‌ల్లో 99 శాతం బాగున్నాయని అధికారులు గుర్తించారు. కేవలంఒక్క శాతం ట్యాబ్‌ల్లో మాత్రమే రిపేర్లున్నాయని చెబుతున్నారు. పది రోజులుగా జిల్లాల్లో పర్యటిస్తున్న పాఠశాల విద్యాశాఖ ఐటీ విభాగం, జిల్లా నోడల్ అధికారులు ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో ట్యాబ్‌లను పరిశీలించి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఇస్తున్నారు. స్క్రీన్లు పగిలిపోయినవి అత్యధికంగా ఉండగా, కొన్ని టాబ్స్‌లో ఎస్డీ కార్డులు తొలగించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. మొత్తం ట్యాబ్‌ల్లో ఇలాంటివి 4,800 వరకు ఉన్నట్టు తేలింది. స్క్రీన్లు పగిలిపోయిన వాటికి ప్రభుత్వమే కొత్తవి అమర్చి విద్యార్థులకు ఇవ్వనుంది. తల్లిదండ్రులపై భారం పడకుండా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు గత డిసెంబర్లో 5,18,740 ట్యాబ్స్‌ను బైజూస్ కంటెంట్‌తో ప్రభుత్వం పంపిణీ చేసింది. భౌతిక నష్టం (ఫిజికల్ డ్యామేజీ) మినహా ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తితే ఎలాంటి ఖర్చు లేకుండా సరిచేసి ఇచ్చేలా మూడేళ్ల వారంటీతో వీటిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. స్క్రీన్లు పగిలిపోయిన 3వేల పైచిలుకు ట్యాబ్‌లకు కొత్తవి అమర్చాలంటే కనీసం రూ.5 వేల వరకు ఖర్చవుతుంది. ఇంత భారం విద్యార్థుల తల్లిదండ్రులపై పడకూడదనే ఉద్దేశంతో ఆ ఖర్చును ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. ఎస్డీ కార్డు మార్చినవి కొన్నే.. కొందరు విద్యార్థులు తెలిసీ తెలియక ట్యాబ్స్‌లోని ఎస్డీ కార్డును తొలగించడంతో అవి పనిచేయడం లేదు. ఇలాంటివి సుమారు 1,500 నుంచి 1,800 వరకు ఉన్నట్టు గుర్తించారు. ట్యాబ్స్ కొనుగోలు చేసినప్పుడే ప్రతి విద్యార్థికి ఎస్డీ కార్డు తొలగించవద్దని సూచించినా కొందరు దీన్ని పాటించకపోవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వాటిని సైతం సరిచేసి అందిస్తున్నారు. ఇకపై విద్యార్థులు ఎస్డీ కార్డు తొలగిస్తే వెంటనే గుర్తించేలా ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని ట్యాబ్స్‌లో అందుబాటులోకి తెస్తున్నారు. ట్యాబ్‌లో ఇచ్చిన కంటెంట్ మినహా ఇంటర్నెట్ కంటెంట్ అప్లోడ్, డౌన్లోడ్ చేసేందుకు అవకాశం లేకుండా కొత్త సాఫ్ట్వేర్ రూపొందించారు. దీంతోపాటు గూగుల్ అథెంటికేటర్‌ను కూడా ఇన్స్టాల్ చేసి ట్యాబ్స్‌కు పటిష్ట రక్షణ కల్పించారు. ఇకపై ట్యాబ్‌ను ట్యాంపరింగ్ చేస్తే వెంటనే సంబంధిత జిల్లా నోడల్ అధికారులకు ఓటీపీ మెస్సేజ్ వెళ్లడంతో పాటు ఆయా ట్యాబ్ సేవలు నిలిచిపోతాయి. ట్యాంపర్ చేశారా..? లేక ఎస్డీ కార్డు మార్చారా? అనేది కూడా అధికారులకు తెలిసిపోతుంది. ఏ విద్యార్థి ట్యాబ్‌లో మార్పులు చేసేందుకు యత్నించారో జిల్లా నోడల్ అధికారుల నుంచి సంబంధిత స్కూలు హెచ్ఎంకు మెస్సేజ్ వెళుతుంది. అధికారులకు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తేనే తిరిగి ట్యాబ్ పనిచేస్తుంది. సక్రమంగా వినియోగించాలి.. విద్యార్థులు విజ్ఞానవంతులుగా ఎదగాలని, వారికి ఉత్తమ భవిష్యత్ అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ట్యాబ్స్‌ను అందించింది. వాటిని సక్రమంగా వాడుకోవాలి. ప్రస్తుతం స్క్రీన్ పాడైన వాటికి ఉచితంగానే కొత్తవి అమర్చాలని ఆదేశించాం. సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించే యంత్రాంగం కూడా ఉంది. సాఫ్ట్వేర్ ఇబ్బందులుంటే స్థానిక సచివాలయం డిజిటల్ అసిస్టెంట్‌కు అందజేసి సమస్యను వివరిస్తే ఫోన్ నంబర్, ట్యాబ్ ఈఎంఐఈ నంబర్ ఆధారంగా ఆన్లైన్లో నమోదు చేస్తారు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా వారికోసం మాన్యువల్‌గా రశీదు కూడా ఇస్తారు. ట్యాబ్స్ సర్విస్ కోసం రాష్ట్రంలో 145 శామ్సంగ్ సరీ్వస్ సెంటర్లున్నాయి. గరిష్టంగా 3 రోజుల్లో రిపేరు చేసి తిరిగి విద్యార్థికి అందిస్తారు. – కాటమనేని భాస్కర్, పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కమిషనర్ -
ఒడిశా ప్రాంత విద్యార్థులకు ఆంధ్ర స్కూల్స్ ఒక గొప్ప వరం
-
ఏపీ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
-
ట్యాబ్ లపై 'ఈనాడు' ఏడుపు
-
విజయవంతంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్
-
పాఠశాల విద్యలో ఏఐ టెక్నాలజీతో పక్కాగా వివరాలు
-
ప్రభుత్వ బడుల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్
-
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లోనూ పేరెంట్స్ మీటింగ్
-
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తున్న జగనన్న
-
44 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద పక్కాగా అమలు
-
పేద పిల్లల విద్యపై ఈనాడు ఏడుపు..
-
జగనన్న పాలనలో మా పాఠశాల ప్రైవేట్ స్కూలును మించి ఉంది
-
60 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టీవ్ ప్యానల్స్ ఏర్పాటు: మంత్రి బొత్స
సాక్షి, కృష్ణా: "ఎండల కారణంగా వారం పాటు ఒంటిపూట బడులు పొడిగించాం. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లతో బోధన ఉంటుంది, 6వ తరగతి నుంచి పైస్థాయి వరకు ఇంటరాక్టీవ్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నాం, విద్యా బోధనపై టీచర్లకు ఆన్లైన్, ఆఫ్ లైన్లో శిక్షణ ఇస్తాం", అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎండల కారణంగా సీఎం ఆదేశానుసారం వారం పాటు ఒంటిపూట బడులు పొడిగించామని తెలిపారు. అంతేకాకుండా పూర్తి పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు పూర్తి చేశామన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైయ్యామని వారి సహకారంతో విద్యా వ్యవస్థని మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. 1.75 లక్షల మంది ఉపాద్యాయులలో 82 వేల మంది బదిలీకి ధరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో 52 వేల మందికి పైగా ఉపాధ్యాయులు బదిలీ అయ్యారని తెలిపారు. సీనియర్ హెడ్ మాస్టర్లని సెకండ్ ఎంఈఓలగా నియమించామని.. కొత్తగా 679 మంది సెకండ్ ఎంఈఓ పోస్టులని భర్తీ చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 355 ఎంఈఓ వన్ పోస్టులు ఖాళీగా ఉండగా వాటిని కూడా సీనియర్ హెడ్ మాస్టర్లతో భర్తీ చేయిస్తామని పేర్కొన్నారు. నాడు–నేడు పనులు జరుగుతున్న స్కూళ్లకు వాచ్మెన్ పోస్టులు ఇచ్చామని చెప్పారు. కంప్యూటర్ పోస్టుల ఫైల్ కూడా మూవ్ అవుతోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లతో బోధన 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లతో బోధన విధానాన్ని నూటికి నూరు శాతం అమలు చేస్తామని మంత్రి చెప్పారు. ప్రతి సబ్జెట్‌కు టీచర్ ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. అంతేకాకుండా ఇంటరాక్ట్ ఫ్యానల్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్ కాలేజీలను కూడా ఎంపిక చేశామన్నారు. ఇద్దరు, ముగ్గురు ప్రొఫెసర్లను మాస్టర్ ట్రైనింగ్ కూడా ఇప్పించామన్నారు. వారి ద్వారా టీచర్లకు ఆఫ్ లైన్, ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తామన్నారు. డిసెంబర్ 21వ తేదీ నాటికి ఆరో తరగతి పైనున్న అన్ని క్లాస్‌లకు ఇంటరాక్ట్ ఫ్యానల్స్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. 60 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టీవ్ ప్యానల్స్ ఏర్పాటు సుమారు 60 వేల క్లాస్ రూమ్స్‌లో ఇంటరాక్టీవ్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న స్కూళ్లకు ఒక్కో స్కూల్‌కు ఒక్కో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 10 టీవీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. మిగతా స్కూళ్లలో కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయులతో సమావేశమై ఈ ఏడాది కూడా మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. చదవండి: స్కూల్ నిర్మించడం కోసం ఆ రైతు ఏం చేశాడంటే.. -
AP: ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పదో తరగతి ఫలితాల్లో 591 మార్కులు సాధించాను
-
వస్తున్నారు టాపర్లు! మారిన సర్కారు బడి.. మురిసిన చదువుల తల్లి
వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి దాకా 2019–23 మధ్య విద్యా రంగంలో పలు ప్రగతిశీల మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలను తలదన్నేలా సకల సదుపాయాలతో రూపు దిద్దుకున్నాయి. ‘మనబడి నాడు–నేడు’ పథకంతో ప్రభుత్వ విద్యా సంస్థలు సమూల మార్పులతో సమున్నతంగా మారాయి. ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లు అంటే చులకనగా చూసే పరిస్థితి నుంచి ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి పరీక్షలు రాసి.. టాప్ మార్కులు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ సంస్కరణలకు అద్దంపట్టారు. విద్యా రంగ సంస్కరణల కోసమే గత నాలుగేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.59,173.72 కోట్లు వెచ్చించింది. ఇందులో భాగంగా జగనన్న అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, పాఠశాల నిర్వహణ నిధి వంటి పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగు పరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలు అమలు చేశారు. స్కూళ్లలో చేపట్టిన నాడు–నేడు పనులు పూర్తయి విద్యార్థులకు అందుబాటులోకి రాగా, ప్రస్తుతం రెండో దశ పనులు జరుగుతున్నాయి. – సాక్షి, అమరావతి నాలుగేళ్లలోఎంత తేడా! నాడు విరిగిన బెంచీలు.. బీటలు వారిన గోడలు.. పెచ్చులూడే పైకప్పులు.. వర్షం వస్తే సెలవులే.. సగం విద్యా సంవత్సరం పూర్తయ్యే దాకా అందని పాఠ్య పుస్తకాలు, అసలు పిల్లలు బడికి వస్తున్నారో లేదో పట్టించుకోని పరిస్థితి. ఇదీ నాలుగేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. నేడు ప్రస్తుతం అందమైన భవనాలు.. పిల్లల కోసం డబుల్ డెస్క్ బెంచీలు.. డిజిటల్ తరగతి గదులు.. ద్విభాషా పాఠ్య పుస్తకాలు.. ఇంగ్లిష్ ల్యాబ్‌లు, ఆర్వో నీరు.. పరిశుభ్రంగా ఉండే మరుగుదొడ్లు.. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు జతల యూనిఫారం, బూట్లు, బెల్టు, పుస్తకాలు పెట్టి స్కూలు బ్యాగు అందజేత.. అన్నింటికీ మించి పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాలో ఏటా రూ.15 వేల కానుక. విద్యపై చేసే ఖర్చు భవిష్యత్‌కు పెట్టుబడి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇబ్బందులను చూశారు. కనీస సదుపాయాలు లేక ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోయి విద్యార్థుల భవిష్యత్ ఏంటో తెలియని పరిస్థితి. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వీలుగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే బృహత్తర సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నాడు–నేడు ద్వారా రూ.వేల కోట్ల ని«ధులతో పనులు చేపట్టారు. రాష్ట్రంలోని 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూడు విడతల్లో అభివృద్ధి పరిచేలా కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చారు. 2019–20లో తొలి విడతగా 15,715 స్కూళ్లలో రూ.3,669 కోట్లతో కనీసం 9 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. నీటి వసతితో మరుగు దొడ్లు, తాగునీటి సదుపాయం, మేజర్, మైనర్ మరమ్మతులు, విద్యుత్ సదుపాయం, విద్యార్థులు, టీచర్లకు డ్యూయెల్ డెస్కులు, బెంచీలు, కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు వంటి ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డులు, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్ నిర్మాణం వంటి వసతులు కల్పించారు. ఆ తర్వాత కిచెన్షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులు దీనికి జోడించారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, జిల్లా విద్యా బోధనా శిక్షణ కళాశాలల(డైట్స్)తో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెస్తున్న శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లనూ నాడు–నేడులోకి చేర్చింది. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు, కేజీబీవీలు.. మొత్తంగా తొలివిడతలో 61,661 విద్యా సంస్థల్లో రూ.16,450.69 కోట్లతో పది రకాల సదుపాయాలు కలి్పంచారు. నాడు–నేడు రెండో దశలో రూ.8,000 కోట్లతో 22,344 స్కూళ్లలో పనులు చేపట్టారు. అమ్మ ఒడి.. గోరుముద్ద.. విద్యా కానుక పిల్లల చదువుకు తల్లిదండ్రుల పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మ ఒడి పథకంతో అర్హురాలైన ప్రతి పేద తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఇప్పటి దాకా రూ.19,674.34 కోట్లు తల్లులకు అందించింది. జగనన్న గోరుముద్ద పథకంతో నాణ్యమైన, రుచికరమైన పోషకాహారాన్ని మధ్యాహ్న భోజనంగా పిల్లలకు అందించేందుకు రోజుకో రకం మెనూ ప్రకటించింది. వారంలో ఐదు రోజులు గుడ్డు, మూడు రోజులు చిక్కి (వేరుశనగ, బెల్లంతో తయారీ) పిల్లలకు అందిస్తున్నారు. ఏటా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.1,800 కోట్లు వెచ్చిస్తోంది. పాఠశాలల్లో పిల్లల ఆత్వవిశ్వాసాన్ని పెంచేందుకు ప్రభుత్వం బోధన–అభ్యాస సామగ్రిని సరఫరా చేస్తోంది. అందుకోసం జగనన్న విద్యా కానుకగా ప్రతి కిట్‌లో ఒక బ్యాగ్, స్టిచింగ్ చార్జీతో సహా 3 జతల యూనిఫారాలు, ఒక బెల్ట్, జత షూ, రెండు జతల సాక్స్‌లు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, వర్క్‌బుక్‌లు ఇంగ్లిష్–తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అందిస్తోంది. ప్రభుత్వం జగనన్న విద్యా కానుక కింద 47 లక్షల మంది విద్యార్థుల కోసం మూడేళ్లలో రూ.2,368.33 కోట్లు ఖర్చు చేసింది. బోధన, పాఠ్య ప్రణాళికలో సంస్కరణలు వైఎస్సార్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి, పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ప్రమాణాలను తీసుకొచ్చింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని దశల వారీగా అమలు చేస్తోంది. ఇప్పటికే 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ అమలు చేస్తోంది. పునాది స్థాయి నుంచే విద్యా రంగాన్ని పటిష్టం చేసేలా కరిక్యులమ్ సంస్కరణలు చేపట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను అందిస్తోంది. ఉన్నత పాఠశాలలో పదో తరగతి పాసైన బాలికలందరూ చదువుకు దూరం కాకూడదని ప్రతి మండలంలో ఒక జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైసూ్కల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేసింది. మొత్తం 352 కేజీబీవీలలో ప్లస్ 2 ప్రవేశపెట్టింది. మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం కనీసం ఒక జూనియర్ కళాశాల ఉంది. కోవిడ్ అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అన్ని స్థాయిల్లో పాఠ్య పుస్తకాలను డిజిటల్ పీడీఎఫ్ రూపంలో ఆన్లైన్లో ఉంచడంతో పాటు 2022–23లో 8వ తరగతి విద్యార్థులకు రూ.686 కోట్లతో బైజూస్ కంటెంట్‌తో కూడిన 5.18 లక్షల ట్యాబులను ఉచితంగా అందించింది. వీటితో పాటు నాడు–నేడు మొదటి దశలో అభివృద్ధి చేసిన 15,715 పాఠశాలల్లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, 10,038 స్మార్ట్ టీవీలను సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 1,858 మందికి రూ.132.41 కోట్ల లబ్ధి చేకూరింది. -
ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో నైట్ వాచ్ మన్లు..
-
చంద్రబాబు హయాంలో 5 వేల స్కూళ్లు మూసేశారు : బొత్స
-
చతికిల‘బడి’.. కూలిపోయే పైకప్పులు.. వేలాడే విద్యుత్ తీగలు!
సాక్షి, హైదరాబాద్: కూలిపోయేలా ఉన్న పై కప్పులు.. రాలిపోతున్న గోడల పైపెచ్చులు.. వేలాడుతున్న కరెంట్ తీగలు.. విరిగిపోతున్న బల్లలు, కుర్చీలు.. కొత్త గదుల నిర్మాణం దేవుడెరుగు, ఉన్న భవనాలు దాదాపుగా శిథిలావస్థకు చేరాయి. వంటగదుల సంగంతి చెప్పనక్కర్లేదు. వానొస్తే బురద.. గాలొస్తే తంటా. పేద, మధ్యతరగతి పిల్లలు ఎక్కువగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో కన్పిస్తున్న దృశ్యాలు. ఈ దుస్థితిని మార్చేస్తామని, కార్పొరేట్‌కు ధీటుగా సర్కార్ బడిని తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెప్పింది. 12 రకాల పనులతో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమంది. ఈ కార్యక్రమానికి ‘మన ఊరు–మనబడి’ అనే పేరు పెట్టింది. దశలవారీగా అమలు చేసే ఈ కార్యక్రమంలో తొలిదశను ఈ ఏడాది విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికే పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు. కొన్నిచోట్ల పనులు అసలు ప్రారంభమే కాలేదు. పనులు మొదలైన చోట్లా సవాలక్ష అవాంతరాలు చోటు చేసుకుంటున్నాయి. మోకాలెత్తు పునాదులు.. మొండి గోడలే దర్శనమిస్తున్నాయి. నిధుల ప్రకటనలతోనే సరి.. మన ఊరు– మనబడి కార్యక్రమాన్ని 2021 మార్చి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్ళల్లో రూ.4 వేల కోట్లు వ్యయం చేస్తున్నట్టు తెలిపింది. కానీ 2021–22లో నిధులు కేటాయించలేదు. 2022 మార్చి బడ్జెట్లో రూ.7,289 కోట్లు మూడు విడతలుగా పాఠశాలల్లో మౌలిక వసతులకు కేటాయిస్తామని ప్రకటించింది. అదే నెలలో సీఎం కేసీఆర్ వనపర్తిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్కూళ్ళు తెరిచే నాటికే పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. కానీ స్కూళ్ళకు మళ్ళీ సెలవులొస్తున్నా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. తొలిదశ స్కూళ్లకే.. రాష్ట్రవ్యాప్తంగా 26,065 ప్రభుత్వ స్కూళ్ళల్లో తొలివిడతగా ఈ సంవత్సరం 9,123 స్కూళ్ళను ఈ పథకం కింద ఎంపిక చేశారు. తొలి దశలో చేపట్టే పనులను రూ.3,497 కోట్లతో పూర్తి చేయాలని భావించారు. నీటి సౌకర్యంతో కూడిన మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, తాగునీరు, ఫర్నిచర్ ఏర్పాటు, రంగులు వేయడం, పెద్ద, చిన్న మరమ్మతులు, గ్రీన్ బోర్డులు, ప్రహరీ గోడలు కట్టడం, వంటగది ఏర్పాటు, మరమ్మతులు, శిధిల భవనాల స్థానంలో కొత్త గదుల నిర్మాణం, డిజిటల్ సౌకర్యాల వంటి 12 రకాల పనులు ఈ నిధులతో చేపట్టాలని ప్రభుత్వం భావించింది. కానీ పూర్తిస్థాయిలో ఆచరణకు మాత్రం నోచుకోలేదు. ఇప్పటివరకు 8,833 బడులకు పరిపాలన అనుమతులు రాగా 7,211 బడుల్లో పనులు మొదలయ్యాయి. ఇప్పటివరకు 1,200 చోట్ల మాత్రమే పనులు పూర్తయ్యాయి. ముందుకురాని కాంట్రాక్టర్లు ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కొన్ని స్కూళ్లకైనా మరమ్మతులు చేసి, మెరుగ్గా చూపించాలని ప్రభుత్వం ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో భావించింది. ఈ దిశగా వివిధ శాఖల అధికారులతో విద్యాశాఖ మంత్రి సమీక్ష జరిపారు. కానీ ప్రతిచోట ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. రూ.30 లక్షల లోపు పనులన్నీ స్థానిక విద్యా కమిటీ నేతృత్వంలో చేయించే అవకాశం ఉంది. అంతకు మించితే టెండర్లు పిలవాలి. ఇలాంటి పనులు 2 వేల వరకు ఉన్నాయి. విద్యా కమిటీ నేతృత్వంలో ఎక్కువగా చిన్నా చితక పనులే చేపడుతున్నారు. కరెంట్ వైర్లు సరి చేయడం, గోడలకు రంగులేయడం, పెచ్చులూడితే ప్లాస్టింగ్ చేయడం వంటివే ఉంటున్నాయి. నిర్మాణాలు, శౌచాలయాల (మరుగుదొడ్లు) ఏర్పాటు వంటి పనులు ఎక్కడా మొదలవ్వలేదు. కొన్ని చోట్ల నిర్మాణాలు మొదలైనా నిధులు అందక ఆగిపోతున్నాయి. దీంతో చాలాచోట్ల టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. కొన్నిచోట్ల నాలుగు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపించ లేదు. సకాలంలో బిల్లులు మంజూరయ్యే పరిస్థితి లేదంటూ వాళ్ళు వెనక్కు తగ్గుతున్నారు. ఎక్కడైనా ఇదే పరిస్థితి... ►ఆదిలాబాద్ జిల్లా మావల–1 మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. కొత్త భవనం నిర్మాణానికి మన ఊరు–మన బడి పథకం కింద టెండర్లు పిలిచారు. కానీ ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. మావల–2 మండల కేంద్రంలోని మరో ప్రైమరీ స్కూల్ నిర్మాణం పనులు మొదలైనా బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ మధ్యలోనే పని ఆపేశాడు. బజార్ హత్నూర్ మండలం కోల్హారిలో రూ.12 లక్షలతో ప్రతిపాదించిన స్కూల్ నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తవ్వలేదు. ►హనుమకొండ సుబేదారిలోని హైస్కూల్లో తరగతి గదుల పరిస్థితి దయనీయంగా మారింది. విద్యుత్ పనుల మాత్రమే మొదలు పెట్టారు. పగిలిపోయిన ఫ్లోరింగ్ గురించి పట్టించుకున్న దాఖలాల్లేవు. ప్రమాదకరంగా మారిందని మన ఊరు–మనబడి సమీక్షల్లో చెప్పినా స్పందన కరువైందని స్థానికులు తెలిపారు. సుబేదారి ప్రైమరీ స్కూల్లో శౌచాలయాల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ►మంచిర్యాల జిల్లా జన్నారంలో పనులు నత్త నడకను తలపిస్తున్నాయి. పొన్నెకల్ ప్రాథమిక స్కూల్ భవన నిర్మాణం పిల్లర్ల దశలో ఉంది. ధర్మారంలోని స్కూల్ బిల్డింగ్ ఇంకా రూఫ్ లెవల్లోనే ఉంది. కలమడుగు గ్రామంలోని స్కూల్లో శౌచాలయాల నిర్మాణం పునాదుల దశలోనే పురిటినొప్పులు పడుతోంది. ►నిర్మల్ జిల్లా కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతుల విద్యార్థులు ఒకే గదిలో కూర్చోవాల్సిన పరిస్థితి. అదే గదిలో విద్యార్థులకు వంట చేయడం జరుగుతోంది. పాడుబడ్డ మరుగుదొడ్ల కారణంగా ఆరుబయలే దిక్కవుతోంది. ►జనగామ జిల్లా కేంద్రంలో ఉన్నత పాఠశాల గదులన్నీ శిథిలావస్థకు చేరాయి. గదుల నిర్మాణం కోసం ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. -
21 న పిల్లలకు సీఎం జగన్ బర్త్ డే గిఫ్ట్
-
ఏపీ సర్కారీ స్కూళ్లలోనూ సీబీఎస్ఈ.. 1000 పాఠశాలలు ఇవే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రవేశానికి అడుగులు ముందుకు పడ్డాయి. మొదటి దశలో 1,000 ప్రభుత్వ స్కూళ్లకు సీబీఎస్ఈ బోర్డు అనుమతులిచ్చింది. దీంతో ఈ స్కూళ్లన్నిటిలో రాష్ట్ర ప్రభుత్వం 8వ తరగతి నుంచి సీబీఎస్ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే 8వ తరగతి విద్యార్థులంతా సీబీఎస్ఈ విధానంలో చదువుతారు. అత్యున్నత మూల్యాంకన, బోధనా విధానాలున్న సీబీఎస్ఈ విధానాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లన్నిటిలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అత్యధిక శాతం బడుగు, బలహీనవర్గాల పిల్లలే. వీరంతా ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పాఠశాల విద్యలో అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. అన్ని రాష్ట్రాలకన్నా ముందుగా ఫౌండేషనల్ విద్యావిధానానికి బాటలు వేసింది. మరోవైపు సీబీఎస్ఈ విధానాన్ని ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేస్తే విద్యార్థులు అత్యున్నత ప్రమాణాలు అందుకోగలుగుతారని కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న పాఠశాలలను ముందుగా గుర్తించింది. మొదటి దశలో మొత్తం 1,308 ప్రభుత్వ స్కూళ్లకు అనుమతుల కోసం సీబీఎస్ఈ బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. ఈ స్కూళ్లలో 8వ తరగతి నుంచి సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. వీటిలో జిల్లా పరిషత్ స్కూళ్లు 417, మునిసిపల్ స్కూళ్లు 71, ఏపీ గురుకుల విద్యా సంస్థలు 39, ఏపీ మోడల్ స్కూళ్లు 164, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు 352, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు 179, బీసీ గురుకుల సంక్షేమ విద్యా సంస్థలు 26, గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు 45, ఆశ్రమ్ స్కూళ్లు 15 ఉన్నాయి. వీటికి సీబీఎస్ఈ అనుమతుల కోసం రూ.5.88 కోట్లను విద్యా శాఖ సీబీఎస్ఈ బోర్డుకు చెల్లించింది. గుర్తింపునకు అవసరమైన పత్రాలను కూడా ఆన్లైన్లో సమర్పించింది. ఈ స్కూళ్లలో 1,229 స్కూళ్లకు అఫ్లియేషన్ నంబర్ వచ్చినా చివరకు 1,000 ప్రభుత్వ స్కూళ్లకు సీబీఎస్ఈ బోర్డు అనుమతులు ఇచ్చింది. దీంతో ఈ స్కూళ్లల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎనిమిదో తరగతి నుంచి సీబీఎస్ఈ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్‌కు అనుగుణంగా పాఠ్యపుస్తకాలను కూడా పంపిణీ చేసింది. వీటిని తెలుగు, ఆంగ్లం రెండు భాషల్లో ఉండేలా మిర్రర్ ఇమేజ్‌లు రూపొందించి అందించింది. మిగతా స్కూళ్లకు చర్యలు వేగవంతం.. కాగా రాష్ట్రంలో మిగతా ప్రభుత్వ స్కూళ్లలోనూ సీబీఎస్ఈ విధానాన్ని దశలవారీగా అమల్లోకి తెచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, పాఠశాల విద్య కమిషనర్ సురేష్‌కుమార్ తదితరులు చర్యలు వేగవంతం చేశారు. శుక్రవారం సీబీఎస్ఈ బోర్డు అధికారులతో వెబ్ఎక్స్ సమావేశంలో వీటిపై చర్చించారు. సీబీఎస్ఈ విధానానికి అనుగుణంగా సిద్ధం చేసేందుకు ఇప్పటికే రాష్ట్రంలో 83,466 మంది టీచర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. సీబీఎస్ఈ విధానంతో విద్యార్థులకు ప్రయోజనాలు ఇవే.. సీబీఎస్ఈ విధానం అమలుతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుందని విద్యావేత్తలు, నిపుణులు చెబుతున్నారు. – సీబీఎస్ఈ.. కేంద్ర ప్రభుత్వ సంస్థ. అత్యున్నత విద్యా విధానాలు అమలు చేస్తున్న సీబీఎస్ఈకి అంతర్జాతీయ స్థాయిలో పేరుంది. – ఈ విద్యా విధానంలో చదివిన విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మంచి గుర్తింపు లభిస్తోంది. – దేశంలో ప్రముఖ విద్యా సంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీలు, ఎయిమ్స్, జిప్మర్, సీఎంసీ వంటి సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ, నీట్ వంటివి సీబీఎస్ఈ సిలబస్‌తోనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల దశ నుంచే సీబీఎస్ఈ విధానంలో చదివినవారు జాతీయ స్థాయి ప్రవేశపరీక్షల్లో మంచి ర్యాంకులు కొల్లగొడుతున్నారు. – సీబీఎస్ఈ విధానం విద్యార్థుల్లో బలమైన పునాదులు వేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ విధానంలో విద్యార్థి తన ఆసక్తిని అనుసరించి చదువులు కొనసాగించే స్వేచ్ఛ ఉంటుందని పేర్కొంటున్నారు. దీనివల్ల విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఉండదని వివరిస్తున్నారు. – దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ విధానం ఉండటం వల్ల విద్యార్థులు ఏ రాష్ట్రానికి వెళ్లినా ఇబ్బంది లేకుండా చదువులు కొనసాగించవచ్చు. – సీబీఎస్ఈ విద్యావిషయక అంశాల్లోనే కాకుండా విద్యార్థి సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా సమస్యను తనంతట తాను పరిష్కరించుకోగలిగే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందిస్తుందని స్పష్టం చేస్తున్నారు. అలాగే విద్యార్థులు తమంతట తాముగా చదువుకోగలిగే నైపుణ్యాలను కూడా అందిస్తుందని పేర్కొంటున్నారు. జిల్లా సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల సంఖ్య శ్రీకాకుళం 64 విజయనగరం 64 పార్వతీపురం మన్యం 40 విశాఖపట్నం 19 అనకాపల్లి 41 అల్లూరి సీతారామరాజు 35 కాకినాడ 33 కోనసీమ 12 తూర్పు గోదావరి 15 పశ్చిమ గోదావరి 16 ఏలూరు 34 కృష్ణా 9 ఎన్టీఆర్ 27 గుంటూరు 11 బాపట్ల 21 పల్నాడు 66 ప్రకాశం 63 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 40 చిత్తూరు 22 తిరుపతి 30 వైఎస్సార్ 30 అన్నమయ్య 49 కర్నూలు 90 నంద్యాల 69 అనంతపురం 51 శ్రీసత్యసాయి 49. -
బీజేపీ నిరక్షరాస్యుల పార్టీ.. మనీశ్ సిసోడియా ఫైర్
సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ నిరక్షరాస్యుల పార్టీ అని మండిపడ్డారు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు కొన్ని ప్రైవేటు స్కూళ్ల కంటే చాలా మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. బీజేపీ దేశంలో నిరక్షరాస్యతనే కోరుకుంటోందని ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మూతపడ్డాయని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి సంబంధించి ఓ నివేదికపై చర్యలు తీసుకునేందుకు రెండేళ్లకుపైగా ఆలస్యం ఎందుకు చేశారని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా.. చీఫ్ సెక్రెటరీని వివరణ కోరినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి సిసోడియా. తనపై తప్పుడు అభియోగాలు మోపిన ఎక్సైజ్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదని తెలిశాక ప్రభుత్వ పాఠశాల వ్యవహారాన్ని బీజేపీ తెరపైకి తెస్తోందని మండిపడ్డారు. 'వాళ్లు నాలుగేళ్ల క్రితం ఢిల్లీ సీఎం కార్యాలయం, నా కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. 40 మంది ఆప్ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారు. కానీ ఏమీ దొరకలేదు. తప్పుడు ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐని నా ఇంటికి పంపారు. కానీ ఏమీ కనిపెట్టలేకపోయారు. దీంతో ఈసారి కొత్తగా ప్రయతిస్తున్నారు. మేం నిర్మించిన స్కూళ్లపై పడ్డారు.' అని సిసోడియా బీజేపీపై ధ్వజమెత్తారు. చదవండి: రాహుల్ పాన్ ఇండియా స్టార్.. అంత ఆదరణ కాంగ్రెస్‌లో ఎవరికీ లేదు -
AP: ప్రభుత్వ పాఠశాలల్లో ‘స్పోకెన్ ఇంగ్లిష్’ క్లాసులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడేలా విద్యాశాఖ మరో ముందడుగు వేసింది. 26 జిల్లాల్లో తొలి దశలో భాగంగా జిల్లాకు 5 హైస్కూళ్లను ఎంపిక చేసి ప్రత్యేక ‘స్పోకెన్ ఇంగ్లిష్’ తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. దశల వారీగా అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయనుంది. సాధారణ తరగతులతో పాటే ఆసక్తి కలిగిన విద్యార్థులకు ‘స్పోకెన్ ఇంగ్లిష్’ నేర్పిస్తారు. బెండపూడి.. నిడమానూరులో సక్సెస్ తూర్పుగోదావరి జిల్లాలోని బెండపూడి, గన్నవరం సమీపంలోని నిడమానూరు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇచ్చిన స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణతో అద్భుత ఫలితాలొచ్చాయి. దీనిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో తొలుత ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి.. ఆ తర్వాత విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు బోధించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. (క్లిక్: బాలయ్య ఏందయ్యా ఇది.. పాపం పిల్లలు మాడిపోయారు?) -
ఏది నిజం?: తడబాటు కాదు... అధికారపు ఎడబాటు
ఒక వ్యవస్థను చక్కదిద్దాలంటే ఒక్క రోజులో సాధ్యమా? పునాదుల నుంచే చెదలు పట్టేసి... నారాయణలు, చైతన్యలు ఆక్రమించేసి... ప్రభుత్వ స్కూళ్లంటేనే భయపడుతూ... చచ్చో చెడో నిరుపేదలు సైతం ప్రయివేటు స్కూళ్లకే పిల్లలను పంపిస్తున్న వ్యవస్థ ఇది. అలాంటి వ్యవస్థను మార్చడానికి నిబద్ధతతో అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ అడుగుల్ని సైతం సరిగా పడనీయకుండా సవాలక్ష అడ్డంకులు. రాష్ట్రంలో సర్కారీ విద్యను సర్వనాశనం చేసేసిన చంద్రబాబు నాయుడు... ఆ బాబుతోనే తమ మనుగడ అని భావించే ముగ్గురు మీడియాధిపతులు!!. రాష్ట్రం సర్వనాశనమైపోయినా సరే... తామే ఏలాలనుకునే ఈ చతుష్టయం ఇప్పుడు సర్వశక్తులూ ఒడ్డుతోంది. రాష్ట్రంలో విద్యారంగంలో జరుగుతున్న మేలుకు ప్రజలంతా ఆకర్షితులవుతున్నా... వీళ్లు మాత్రం లేనిపోని రాతలతో విషం కక్కడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ‘తడబడిన విలీనం’ అంటూ సోమవారం ‘ఈనాడు’ పతాక శీర్షికల్లో అచ్చేసిన కథనం ఇలాంటిదే. అసలిందులో నిజం ఏ కోశానైనా ఉందా? అంగన్వాడీల నుంచి మొదలుపెడితే చంద్రబాబు హయాంలో విద్యా వ్యవస్థను చూసినంత హీనంగా ఏ వ్యవస్థనూ చూడలేదనే అనుకోవాలి. ఎందుకంటే ఆయన దృష్టంతా కార్పొరేట్ స్కూళ్లపైనే. ఏకంగా కార్పొరేట్ డాన్ నారాయణను తెచ్చి కేబినెట్లోనే పెట్టుకున్న చరిత్ర బాబుది. అంగన్వాడీల్లో ప్రత్యేక కిచెన్ గానీ, ప్లేగ్రౌండ్ గానీ ఉండేవి కాదు. సిబ్బందే సరిగా లేని దుస్థితి. ఇక 1 నుంచి 5 వరకు నడిచే స్కూళ్లకు ఒకరిద్దరు ఎస్జీటీలే దిక్కు. విద్యార్థులకు సదుపాయాలు దేవుడెరుగు. తరగతి గదులూ కొరతే. 18 సబ్జెక్టుల్ని ఆ ఒకరిద్దరు టీచర్లే బోధించేవారు. అప్పర్ ప్రయిమరీ స్కూళ్లు, హైస్కూళ్లదీ అదే గతి. అనేక యాజమాన్యాల పరిధిలో ఉండటంతో హై స్కూళ్ల నడుమ సంబంధాలూ ఉండేవి కాదు. ఈ చదువుల దెబ్బకు పిల్లలు తమ తరగతి పుస్తకాల సంగతి అటుంచి... కింది తరగతుల పుస్తకాలనూ చదవలేని దుస్థితికి జారిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసే నేషనల్ అకడమిక్ సర్వే (న్యాస్), ప్రథమ్ సంస్థ చేసిన ‘అసర్’ సర్వే... అన్నీ తేల్చింది ఇదే. విచిత్రమేంటంటే పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా... మేకప్ వేసి, తమ కార్పొరేట్ స్కూళ్ల కడుపు నింపడానికే ప్రయత్నించారు చంద్రబాబు. కార్పొరేట్ కాలేజీల్లోకి విద్యార్దుల చేరికలను పెంచడానికి టార్గెట్లు పెట్టి... కాపీయింగ్‌ను ప్రోత్సహించి మరీ టెన్త్‌లో కృత్రిమ ఉత్తీర్ణత సాధించారు. కార్పొరేట్ కాలేజీల్లో చేరి... ఆ తరవాత సరైన నైపుణ్యాలు లేక... జీవితాలనే కోల్పోయిన ఎంతో మంది ... బాబు బ్రెయిన్ చైల్డ్లే!. కాకపోతే ఇంతటి ఘోరమైన పరిస్థితుల్ని ‘ఈనాడు’ ఏనాడూ ప్రశ్నించలేదు. రామోజీ ఒక్క అక్షరమూ రాయలేదు. ఇపుడు మాత్రం పునాదుల నుంచి జరుగుతున్న మార్పును తట్టుకోలేకపోతుండటమే అన్నిటికన్నా దారుణం. మొత్తం వ్యవస్థకే చికిత్స...! ఇదేదో ఒక రోడ్డో, ఒక వంతెన సమస్యో కాదు. విద్యా వ్యవస్థ. పునాదుల నుంచీ కుళ్లిపోయింది. అందుకే వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కాయకల్ప చికిత్స మొదలెట్టారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చూపించనంత శ్రద్ధతో నెలకు రెండు సార్లు సమీక్షిస్తూ... ఫౌండేషన్ విద్య నుంచే శ్రీకారం చుట్టారు. దాదాపు 56వేల స్కూళ్లను ‘నాడు–నేడు’ పథకంతో సమూలంగా మార్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలిదశలో 15,715 స్కూళ్లను సమగ్ర మౌలిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేశారు. మిగిలిన స్కూళ్లలోనూ 2వ, 3వ విడతల్లో ఈ సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ మూడేళ్లలో 70కి పైగా సమీక్షలు విద్యారంగంపైనే నిర్వహించారంటే సీఎం చిత్తశుద్ధి చెప్పకనే తెలుస్తుంది. మంచిని ఏమాత్రం గుర్తించని చతుష్టయం... నిజానికి పాఠశాల విద్యలో కనీవినీ ఎరుగని సంస్కరణలు మొదలయ్యాయి. దీనికి పొరుగు రాష్ట్రాలే కాదు... కేంద్ర సంస్థలూ ప్రశంసలు కురిపిస్తున్నాయి. కానీ చంద్రబాబుతో కూడిన చతుష్టయం... తమ రాతల్లో ఏనాడూ ఒక్క మంచి పనిని ప్రస్తావిస్తే ఒట్టు. దేనిపైనయినా బురద చల్లటమే. నాడు–నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చటంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని జగనన్న గోరుముద్దగా అందిస్తూ... పిల్లల్ని స్కూళ్లకు పంపించే తల్లులకు బాసటగా ‘అమ్మ ఒడి’ పేరిట నగదు జమచేస్తున్న ప్రభుత్వం... జగనన్న విద్యాకానుకగా పుస్తకాలు, యూనిఫామ్, షూస్, డిక్షనరీ తదితర వస్తువుల్ని స్కూళ్లు మొదలుకాకముందే ఉచితంగా అందిస్తోంది. గతంలో స్కూళ్లు ఆరంభమై 6 నెలలు గడిచినా పుస్తకాలే చూడని విద్యార్థులకు ఆరంభం కాకముందే అన్నీ ఉచితంగా అందించటమనేది ఈ దుష్ట చతుష్టయానికి ఏమాత్రం మింగుడుపడటం లేదు. తమ పిల్లలు మాత్రమే ఇంగ్లీషు మీడియం చదవాలన్న ఉద్దేశంతో చివరికి కోర్టులకు కూడా వెళ్లి ఆంగ్ల విద్యను రకరకాల మార్గాల్లో వ్యతిరేకించిన తీరు వీళ్లది.. రెండు భాషల్లో ప్రచురించిన పుస్తకాలు... ఏకంగా ఎన్సీఈఆర్టీ ప్రశంసలు కూడా అందుకున్నాయి. ఇక పెద్దపెద్ద కార్పొరేట్ స్కూళ్లకే సాధ్యమైన ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ ఆన్లైన్ పాఠాలను రాష్ట్ర సర్కారీ స్కూళ్ల 8వ తరగతి విద్యార్థుల ట్యాబ్లెట్లలోకి తెచ్చిన ఘనత కూడా సీఎం జగన్‌దే. దశల వారీగా అన్ని ప్రభుత్వ స్కూళ్లనూ సీబీఎస్ఈకి (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) అనుసంధానిస్తున్నారు. విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధతో... విద్యార్థులకిస్తున్న జగనన్న విద్యా కానుక కిట్లను స్వయంగా చూస్తున్నారు సీఎం. గోరుముద్దను ఆయనే రుచిచూస్తున్నారు. పిల్లల పొట్టలు నిండితేనే అక్షరాలు బుర్రకెక్కుతాయని గట్టిగా విశ్వసిస్తూ రుచికరమైన మెనూను తనే రూపొందిస్తున్నారు. ఇదిగో... వీటన్నిటి ఫలితమే... పొరుగు రాష్ట్రాలకు పూర్తి భిన్నంగా రాష్ట్రంలో ప్రయివేటు పాఠశాలల్లో పిల్లలు తగ్గి... ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగాయి. సాక్షాత్తూ కేంద్రమే పార్లమెంటు సాక్షిగా ఈ విషయాన్ని వెల్లడించింది. వీటిక్కూడా పచ్చ రంగు పులుముతూ... ప్రజల ఆర్థిక స్థితిగతులు దెబ్బతిన్నాయి కనక ప్రయివేటు స్కూళ్లు వదిలి ప్రభుత్వ స్కూళ్లకు వస్తున్నారని వక్రభాష్యాలు చెబుతున్న చరిత్ర రామోజీరావుది. ఏం! పక్క రాష్ట్రాల్లో కరోనా రాలేదా? అక్కడ జనం ఆర్థిక పరిస్థితులు దెబ్బతినలేదా? వాళ్లెందుకు ప్రభుత్వ స్కూళ్లలోకి మారలేదు? ప్రయివేటు స్కూళ్లలో అడ్మిషన్లెందుకు పెరుగుతున్నాయి? ఇక్కడ సర్కారీ స్కూళ్లు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నందుకే కదా... జనం వాటికి మారుతున్నారు? ఆ మాత్రం తెలుసుకోలేరా రామోజీరావు గారూ..? అసలు 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లను తేవాలన్న ఆలోచన మీకు గానీ, మీ బాబుకు గానీ ఏనాడైనా వచ్చిందా? ఇలాంటి ప్రయత్నాల్ని అభినందించటం మీకిష్టం లేకపోతే కనీసం వ్యతిరేకించకుండా అయినా ఉండాలి కదా? మీరొక పత్రికాధిపతి అని, మీ పత్రికను చదివేది తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే కాదని ఇంకెప్పుడు తెలుసుకుంటారు? మీ పాఠకులను గౌరవించటం ఎప్పుడు నేర్చుకుంటారు? ఇదీ... స్కూళ్ల మ్యాపింగ్ తీరు ► వీలున్న చోట అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలకు అనుసంధానించి వారికి స్కూలు వాతావరణాన్ని అలవాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ► 8 ఏళ్లలోపు పిల్లల్లోనే బ్రెయిన్ అభివృద్ధి ఎక్కువ కనక... ప్రాథమిక పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాల్ని అనుసంధానించి ఫౌండేషన్ స్కూళ్లుగా మారుస్తున్నారు. ► తరగతులను ఇతర స్కూళ్లకు అనుసంధానం చేసేటప్పుడు విద్యార్ధులకు ఇబ్బందిలేకుండా ఉండేలా 250 మీటర్ల నుంచి 1 కి.మీ. పరిధిలో ఉండే వాటిని మాత్రమే విలీనం చేసేలా విద్యాశాఖ స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది. నెలల తరబడి కసరత్తు.. క్షేత్రస్థాయి పరిశీలన చేశాకే చర్యలు చేపట్టారు. – దశల వారీగా శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంలో.. 820 వరకు స్కూళ్లకు సంబంధించి సమస్యలు ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి రాగా... వాటిపై జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి... వాటికి పరిష్కార బాధ్యతలు అప్పగించారు. కాకపోతే ఇవేవీ రామోజీరావుకు పట్టవు. విలీనంపై గాలి వార్తలు రాయటం ద్వారా తల్లిదండ్రుల్లో లేనిపోని అనుమానాలు సృష్టించి... ఏదో ఒకరకంగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలన్నది ఆయన దింపుడుకళ్లం ఆశ. మిగిలిన స్కూళ్లు సైతం... శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, ప్రీహైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూళ్లు ప్లస్‌గా వర్గీకరించి... అన్నిటా విద్యార్ధులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అవసరమైన చోట నాడునేడు రెండో విడతలో ప్రత్యేకంగా అదనపు తరగతి గదుల నిర్మాణాన్నీ చేపట్టారు. కాకపోతే ఈ నిర్మాణాలన్నీ ఒక్కరాత్రిలో పూర్తయ్యేవి కావు. వేల కోట్ల నిధులతో పాటు పక్కా ప్రణాళిక, పర్యవేక్షణ అవసరం. వేగంగా అడుగులేస్తూ ఒక్కొక్కటీ పూర్తి చేసుకుంటూ వెళుతున్న జగన్ ప్రభుత్వానికి... అసలు ఈ దిశగా జీవితంలో ఎన్నడూ ఆలోచించని చతుష్టయం నుంచి వ్యతిరేకత రావటమే ఘోరాతిఘోరం. ► ఇక మ్యాపింగ్ పూర్తయిన స్కూళ్లలోని విద్యార్ధులకు సబ్జెక్టు టీచర్ల ద్వారా బోధనకు వీలుగా అదనపు స్కూల్ అసిస్టెంటు టీచర్లను విద్యాశాఖ ఏర్పాటు చేయిస్తోంది. ఇందుకోసం 8,233 మంది ఎస్జీటీ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించడానికి ఏర్పాట్లు చేసింది. కొన్ని చోట్ల పలు పోస్టులను స్కూల్ అసిస్టెంటు స్థాయికి అప్‌గ్రేడ్ చేపట్టింది. ఆ ఫోటోల వెనక ఎన్నో అర్థసత్యాలు... సోమవారంనాడు ప్రచురించిన ఫోటోల్లో ‘ఈనాడు’ చెప్పని నిజాలివీ... ► శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పంచాయతీ పెద్దపేట స్కూల్‌కు వెళ్లాలంటే 35 ఎకరాల చెరువు దాటి వెళ్లాల్సి వస్తోందనేది ‘ఈనాడు’ కథనం సారాంశం. స్కూలు వెనుక భాగాన చెరువు ఉంది. దాన్ని దాటే పనిలేదు. ఆ స్కూలుకు రెండు వైపులా రోడ్లున్నాయి. కేవలం అరకిలోమీటర్ పరిధిలోని స్కూలులోని పిల్లలను ఈ స్కూలుకు మ్యాపింగ్ చేయడంతో తల్లిదండ్రులు కూడా దీన్ని ఆహ్వానించారు. ► ఏలూరు జిల్లా ఉంగుటూరులోని మ్యాపింగ్ అయిన స్కూల్లో విద్యార్దులకు సరిపడే ఫర్నీచరు వేసి విద్యార్థులు ఉపాధ్యాయులు కూర్చోబెట్టారు. లక్షలాది రూపాయలు వెచ్చించి నాడు– నేడు పనులు చేస్తున్న కారణంగా రెండు రోజులుగా గదులు సర్దుబాటు చేసున్నారు. తాత్కాలికంగా కూర్చోబెట్టిన ఫోటోను తీసి... శాశ్వతంగా వసతులు లేవన్నట్లు రాయటమే ‘ఈనాడు’ పైత్యానికి పరాకాష్ట. ► రాచూరు హైస్కూల్లో 3,4,5 తరగతుల విధ్యార్దులను కలిపి కూర్చొబెట్టినట్లు వచ్చిన వార్త పూర్తిగా అబద్ధమే. నాడు నేడు పనులు జరుగుతున్న కారణంగా తాత్కాలికంగా ఇలా సర్దుబాటు చేశారు తప్ప గదులుపూర్తవ్వగానే ఆయా గదుల్లోకి తరగతులను మారుస్తారు. ఇక్కడ ఒక్కోగదికి 12 లక్షలు చొప్పన రెండు అదనపు గదులను ప్రభుత్వం నిర్మిస్తోంది. -
Ongole: ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లకు ఫుల్ డిమాండ్!
సాక్షి, ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మార్చివేసిన నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అమాంతం పెరిగింది. నాడు–నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్కూళ్లకు మించి సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు జగనన్న విద్యా కానుక కిట్లు, మధ్యాహ్న భోజనం, తదితర కార్యక్రమాల అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లకు డిమాండ్ ఏర్పడింది. గతంలో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసినా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేవారు కాదు. ప్రస్తుతం అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులే ప్రభుత్వ పాఠశాలల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెల మొదటి వారంలో పాఠశాలలు తెరవగా, రెండు వారాలు గడవకముందే ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ప్రస్తుతం పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాలలకు వెళ్లి అడ్మిషన్లు క్లోజవడంతో వెనుదిరుగుతున్నారు. క్లిక్: మారనున్న కనిగిరి పట్టణ రూపు రేఖలు -
బైజూస్ సేవలు ఉపయోగకరం
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 150 మిలియన్ విద్యార్థులకు విద్యాసేవలు అందిస్తున్న బైజూస్ సంస్థ విద్యాసేవలు త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ అందుబాటులోకి రానుండటం ముదావహం. నిత్యం పేద విద్యార్థుల అభ్యున్నతిని కాంక్షించే ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ 2022 మే నెలలో దావోస్‌లో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య సమ్మేళనంలో పాల్గొని పెద్ద ఎత్తున పెట్టుబడులు తేవడం తెలిసిందే. అదే సమయంలో నాణ్యమైన విద్యాసేవలు అందిస్తున్న బైజూస్ సీఈఓ రవీంద్రన్తో కూడా చర్చలు జరిపారు. ఒక ముఖ్యమంత్రి తన రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువు గూర్చి తీసుకుంటున్న శ్రద్ధకు ఆశ్చర్యచకితులైన రవీంద్రన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ తమ సేవలు ఉంటా యని ప్రకటించారు. ఫలితంగా జూన్ 16న ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ, బైజూస్ల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం... ప్రతి ఏటా ఒక్కొక్కరికి 20 వేల నుంచి 24 వేల రూపాయలు చెల్లిస్తే కానీ లభించని బైజూస్ విద్యా సేవలను ఆంధ్రప్రదేశ్‌లోని పేద పిల్లలకు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. అంతేగాదు దాదాపు 4.7 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ. 12 వేల విలువ చేసే ట్యాబ్‌లు కూడా ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 500 కోట్ల ఖర్చు చేస్తోంది. బైజూస్ యాప్‌తో పాటు అదనంగా ఇంగ్లీషు లెర్నింగ్ యాప్‌ను కూడా ఉచితంగా అందుబాటులోనికి ఏపీ ప్రభుత్వం తెస్తోంది. గణితం, సైన్సు, సోషల్ సబ్జెక్టులన్నీ ఇటు ఇంగ్లీషు, అటు తెలుగు మాధ్యమాల్లో అందుబాటులో ఉండేటట్లు వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వం ఇంత చేస్తున్నా చంద్రబాబు ఆంగ్ల భాషా మాధ్యమాన్ని వ్యతిరేకించినట్లు... బైజూస్ విద్యాకార్యక్రమాలను కూడా వ్యతిరేకించడం శోచనీయం. దీనికి చంద్రబాబు మూల్యం చెల్లింపక తప్పదు. (క్లిక్: మరో ముందడుగు.. విద్యలో గేమ్ ఛేంజర్!) – ఆచార్య గాజులపల్లి రామచంద్రారెడ్డి, విజయవాడ -
Andhra Pradesh: పాఠాలకు పక్కా క్యాలెండర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి విద్యార్థినీ ప్రపంచ పౌరుడిగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లతో ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేస్తోంది. అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక వంటి పథకాలతో విద్యార్ధుల చదువుకు ప్రోత్సాహకాల కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. ఇప్పుడు అన్ని యాజమాన్యాల్లోని స్కూళ్లలో అభ్యసన కార్యక్రమాల నిర్వహణకూ పక్కా ప్రణాళిక రూపొందించింది. 2022–23 విద్యా సంవత్సరానికి సమగ్ర విద్యా క్యాలెండర్‌ను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ రూపొందించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం నిర్దేశించిన పనిదినాలతో క్యాలెండర్‌ను రూపొందించారు. ఫౌండేషన్ పాఠశాలల నుంచి హైస్కూల్ వరకు చేపట్టాల్సిన విద్యా కార్యక్రమాలను సవివరంగా పొందుపరిచారు. అకడమిక్ క్యాలెండర్‌లోని లెసన్ ప్లాన్ ప్రకారం అన్ని యాజమాన్యాల్లోని స్కూళ్లూ విద్యాభ్యసన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి చెప్పారు. నెలవారీ కార్యక్రమాలు, లక్ష్యాలు, వాటి సాధన వంటి అంశాలను ఎస్సీఈఆర్టీ క్యాలెండర్లో సవివరంగా పొందుపరిచింది. జూలై 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు జూలై 5 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి జులైలో 22 రోజులు, ఆగస్టులో 22, సెప్టెంబర్‌లో 20/25, అక్టోబర్‌లో 19, నవంబర్‌లో 25, డిసెంబర్లో 26/18, జనవరిలో 26/23, ఫిబ్రవరిలో 22, మార్చిలో 23, ఏప్రిల్‌లో 21 రోజుల పాటు పాఠశాలలు పనిచేస్తాయి. మొత్తం మీద పాఠశాలలు 220 రోజులు పనిచేస్తాయి. దసరా, సంక్రాంతి, క్రిస్మస్, వేసవి సెలవులు మొత్తం 80 రోజులు సెలవు దినాలు ఉంటాయి. మిగతా రోజులు పండుగలు, ఆదివారాలు, ఇతర సెలవులు ఉంటాయి. దసరా సెలవులు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6వరకు, క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి జనవరి 16 వరకు ఉంటాయి. స్క్లూళ్ల సమయాలివీ.. ఫౌండేషన్ స్కూళ్లు (1, 2 తరగతులు, 1 నుంచి 5 తరగతుల స్కూళ్లు) ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పనిచేస్తాయి. గేమ్స్, రెమిడియల్ తరగతులకోసం ఆప్షనల్ పీరియడ్‌ను 3.30 నుంచి 4.30 వరకు ఇవ్వాలి. హాఫ్‌డే స్కూళ్ల సమయంలో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగించాలి. హైస్కూళ్లు (3 నుంచి 7, 8 తరగతుల వరకు, 3 నుంచి 10వ తరగతి వరకు, 3 నుంచి 11, 12 తరగతులు, 6 నుంచి 10వ తరగతి) స్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.00 వరకు పనిచేస్తాయి. ఆప్షనల్ పీరియడ్ సాయంత్రం 4.00 నుంచి 5.00 గంటల వరకు ఉంటుంది. హాఫ్‌డే స్కూళ్ల సమయంలో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు జరుగుతాయి. అన్ని స్కూళ్లలో తరగతుల మధ్యలో ఉదయం, మధ్యాహ్నం తప్పనిసరిగా వాటర్ బెల్ ఉంటుంది. సబ్జెక్టుల వెయిటేజి ప్రకారం పీరియడ్లు వివిధ సబ్జెక్టుల వెయిటేజి ప్రకారం పీరియడ్లు ఉంటాయి. 1 నుంచి 5 తరగతులకు వారానికి 240 పీరియడ్లు ఉంటాయి. 1 నుంచి అన్ని తరగతులకు సబ్జెక్టు వెయిటేజీని క్యాలెండర్లో పొందుపరిచింది. హైస్కూళ్లలో అన్ని సబ్జెక్టులకు వెయిటేజీని ప్రకటిస్తూ వారానికి 384 పీరియడ్లను కేటాయించింది. ప్రధాన సబ్జెక్టులతో పాటు వుయ్ లవ్ రీడింగ్, ఆనంద వేదిక, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, కెరీర్ గైడెన్సు, మాస్ డ్రిల్, ఫిజికల్ ఎడ్యుకేషన్, వేల్యూ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, వర్క్ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్, స్కూల్ సేఫ్టీ వంటి అంశాలను ప్రణాళికలో చేర్చారు. (క్లిక్: ఈ అమ్మఒడి భవితకు పెట్టుబడి) -
బడి భూమిలో పాగా!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని సైతం వదలడం లేదు అక్రమార్కులు. దర్జాగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నా.. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరించడం విస్మయానికి గురిచేస్తోంది. ఏకంగా పాఠశాల ప్రాంగణం వరుసగా రెండుసార్లు ఆక్రమణకు గురై నిర్మాణాలు వెలుస్తున్నా... తాత్కాలిక అడ్డగింపు తప్ప శాశ్వత పరిష్కారానికి చొరవ కనిపించడం లేదు. నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల భూములు మాయమవుతున్నా ఇటు విద్యా శాఖ అధికారులు అటు రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లుగా ఉంటున్నారు. చెరలో శంకేశ్వర పాఠశాల ప్రాంగణం.. హైదరాబాద్ జిల్లాలో సుమారు 690 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 25 శాతం మినహా మిగిలిన పాఠశాలకు సొంత స్థలాల్లో భవనాలు ఉన్నాయి. వాటికి ప్రాంగణాలు కూడా ఉన్నాయి. పాఠశాలలకు ఆనుకొని ఉన్న స్థల యజమానులు ప్రాంగణాలను ఆక్రమించుకోవడం, అడ్డుకుంటే కోర్టుకు వెళ్లడం వంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయి. ఇదే పరిస్థితిని తలపిస్తోంది సైదాబాద్‌లోని శంకేశ్వర బజార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలకు కేటాయించిన స్థలంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు వేర్వేరుగా కొనసాగుతున్నాయి. సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థులు చదువుతుండటంతో ఆటలకు అనువుగా ఉండేందుకు సుమారు 250 చదరపు గజాల స్థలాన్ని పాఠశాల ప్రాంగణంగా వదిలి మిగతా స్థలంలోని భవన సముదాయంలో పాఠశాల తరగతుల నిర్వహణ కొనసాగుతోంది. పదేళ్ల క్రితం పాఠశాలకు ఆనుకొని ఉన్న స్థలం యజమాని ప్రాంగణంలోని వంద గజాల స్థలాన్ని అక్రమించి తన ఇంటికి మార్గాన్ని సుగమం చేసుకున్నారు. అప్పట్లో విద్యా, రెవెన్యూ అధికారుల దృష్టికి కొందరు స్థానికులు ఈ విషయాన్ని తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనతోనే మిన్నకుండిపోయారు. దీంతో మిగిలిన 150 చదరపు గజాల స్ధలం రక్షించుకునేందుకు అప్పటి సైదాబాద్ కార్పొరేటర్ ప్రత్యేక చొరవ చూపించి పాఠశాల ప్రాంగణం రోడ్డు మార్గాన్ని మూసివేసి స్కూల్ ముందు మార్గంలో గేటు పెట్టించారు. మిగిలిన ప్రాంగణం కూడా మూడేళ్ల క్రితం పాఠశాల ప్రాంగణానికి చెందిన మిగిలిన 150 చదరపు గజాల స్థలంపై కొందరి కన్ను పడింది. ఏకంగా ప్రాంగంణంలోని రెండు భారీ వృక్షాలను తొలగించి సామాజిక భవన్ పేరుతో నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో పాఠశాల ప్రాంగణం పూర్తిగా కనుమరుగైంది. క్షేత్రస్థాయి సందర్శనకే పరిమితం మూడేళ్లుగా పాఠశాల ప్రాంగణం ఆక్రమణ వ్యవహారంపై సంబంధిత అధికారుల క్షేత్ర స్థాయి సందర్శనకే పరిమితమైంది. శాశ్వత పరిష్కారం కోసం ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. జిల్లా విద్యాశాఖ అధికారులు, రెవెన్యూ డివిజన్ అధికారి, తహసీల్దార్ తదితరులు పాఠశాలను సందర్శించడం, ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించడం తిరిగి వెళ్లిపోవడం సర్వసాధారణంగా మారింది. తాజాగా కొందరు అధికారులు ఆక్రమణదారులతో కుమ్మక్కై కింద పాఠశాల కోసం సెల్లార్, పైన సామాజిక వర్గం భవనం కొనసాగేలా సంధిమార్గం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా మన బస్తీ– మన బడి కార్యక్రమం కింద పాఠశాల ప్రాంగణం మార్గానికి ప్రహరీ పనులు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై పాఠశాల ప్రాంగణం ఆక్రమణ వ్యవహారంపై హైదరాబాద్ డీఈఓను ఫోన్లో వివరణ కోరేందుకు సంప్రదించగా ఆమె నుంచి స్పందన రాలేదు. (చదవండి: పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు అందుకుంటున్న పిల్లి...ఎందుకో తెలుసా!) -
38 విద్యాలయాలు భేష్..!
విజయనగరం: పరిశుభ్రత, పారిశుద్ధ్యం నిర్వహణలో శ్రేష్టతను గుర్తించి, ప్రేరేపించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ పథకానికి జిల్లా నుంచి 38 పాఠశాలలు ఎంపికయ్యాయి. పారిశుద్ధ్యం, తాగునీరు, సబ్బుతో చేతులు కడుక్కోవడం, ప్రవర్తన మార్పు, సామర్థ్య పెంపు, కోవిడ్ సంసిద్ధత కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాలలను గుర్తించి అవార్డులు అందజేశారు. పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించగా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, ఇందుకూరు రఘు రాజు, పాకలపాటి రఘువర్మ ముఖ్య అతిథులుగా హాజరై అవార్డులను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలకు అందజేశారు. అవార్డులతో మరితం ప్రేరణ ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇలాంటి అవార్డులు ఉపాధ్యాయుల్లో మరింత ప్రేరణ కలిగించి మరిన్ని ఉత్తమ ఫలితాల సాధన దిశగా స్ఫూర్తిని నింపుతాయని అభిప్రాయ పడ్డారు. ప్రతి ఒక్కరూ శ్రమించి స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలను అందుకున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, నాడు–నేడు తో పాఠశాలల రూపురేఖలే మారిపోయాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల మధ్య ఈ రోజు పోటీ వాతావరణం నెలకొందని, విద్యారంగంలో సంభవిస్తున్న మంచి పరిణామానికి ఇది నిదర్శనమన్నారు. సమాజ అవసరాలకు తగ్గట్టుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి దూరదృష్టి వల్లే విద్యారంగంలో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయన్నారు. విద్యావ్యవస్థలో మంచి సంస్కరణలు నాడు–నేడు ద్వారా జరిగిన పనుల వల్ల పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొందని, తద్వారా విద్యార్థులు మంచిగా చదువుకుంటున్నారని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ అన్నారు. ముఖ్యమంత్రి మంచి విజన్‌తో ముందుకెళ్తూ విద్యా వ్యవస్థలో మంచి సంస్కరణలు తీసుకువచ్చారని ప్రశంసించారు. ఆయన స్ఫూర్తితో ఎస్.కోట నియోజవర్గ పరిధిలో ఒక పాఠశాలను దత్తత తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ప్రకటించారు. అనంతరం పురస్కారాలకు ఎంపికైన పాఠశాలల పరిధిలో ఎలాంటి విధానాలు అమలు చేశారు. అవార్డులకు ఎంపిక కావడానికి తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనుల గురించి అవార్డు గ్రహీతలైన ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు వారి అభిప్రాయాలను వివరించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, డైట్ ప్రిన్సిపాల్ ఎన్.టి. నాయుడు, సమగ్ర శిక్షా సీఎంవో శ్రీనివాసరావు, వివిధ మండలాల ఎంఈవోలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (చదవండి: అమ్మవారి హుండీల్లో ఫారిన్ కరెన్సీ) -
కథలు.. విజ్ఞాన సోపానాలు
కడప ఎడ్యుకేషన్: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టింది. నాడు– నేడు ద్వారా వాటి రూపురేఖలు మార్చారు. విద్యార్థుల అభ్యున్నతికి అనుక్షణం కృషి చేస్తున్నారు. విద్యతోపాటు విజ్ఞానం, మానవీయత, సృజనాత్మకతను వెలికి తీసేందుకు తాజాగా విద్యార్థులకు కథల పుస్తకాలను కూడా అందిçస్తున్నారు.అందులోని కథలు మానవీయ విలువలు తెలియజేసేవిధంగా ఉన్నాయని విద్యావేత్తలు తెలిపారు. సృజనాత్మకతను పెంచేందుకు దోహదం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విజ్ఞానం, నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. కథల పుస్తకాల కాన్సెప్ట్‌ను అమలులోకి తెచ్చింది. జగనన్న విద్యాకానుక ద్వారా ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం అదనంగా ఈ కథల పుస్తకాలను అందజేశారు. కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లోని భారతీయభాషల కేంద్రీయ సంస్థ(సీఐఐఎల్)తో ఒప్పందం కుదుర్చుకుని కథలతో కూడిన పుస్తకాలను రూపొందించారు. ఆకర్షణీయమైన రంగులు, నాణ్యమైన మెటీరియల్‌తో ముద్రించిన 10 రకాల కథల పుస్తకాలను ఉమ్మడి వైఎస్సార్ జిల్లావ్యాప్తంగా 2,762 పాఠశాలలకు పంపిణీ చేసేందుకు సమగ్రశిక్ష అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. 2,493 ప్రాథమిక, 269 ప్రాథమికోన్నత పాఠశాలల పరిధిలో ఒక్కో పాఠశాలకు 10 కథల పుస్తకాలతో కూడిన సెట్‌ను అందించనున్నారు. చదవడం మాకిష్టం కార్యక్రమంలో భాగంగా వేసవి సెలవుల్లో పాఠశాలకు వచ్చే విద్యార్థులకు వీటిని అందచేసి చదివించేందుకు ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలి. తెలుగు, ఆంగ్లభాషలో ఒక్కో పుస్తకంలో ఒక్కో కథను ముద్రించారు. విద్యార్థులు తాము చదివిన కథలో ముఖ్యమైన అంశాలను పుస్తకంలోని చివరి పేజీలో ఇచ్చిన ఖాళీల్లో పూరించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఒక్కో పుస్తకం ధర రూ. 50 ఉండగా ప్రతి పాఠశాలకు రూ. 5 వందల విలువైన 10 రకాల పుస్తకాలను వైఎస్సార్ జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయం ద్వారా పంపిణీ చేస్తున్నారు. నీతి నిజాయితీ, విలువలు, క్రమశిక్షణ, సక్రమమైన జీవనం వంటి అంశాలతో కూడిన కథలు ఉన్నాయి. వీటిని చదవడం ద్వారా విద్యార్థుల్లో సత్ప్రవర్తన, నైతిక విలువలు పెంపొందుతాయని విద్యావేత్తల అభిప్రాయం. ఆసక్తి రేకెత్తించే కథలు... 10 రకాల పుస్తకాలతో కూడిన సెట్లో ఉన్న కథల్ని పరిశీలిస్తే పావురం వివేకం, తెలివైన చేప, తొందరపాటు పనికిరాదు, ఊసరవెల్లి అతి తెలివి, యుక్తితో పనులు సాధించవచ్చు. పిల్లిమెడలో గంట, చీమ– పావురం, తెలివైన జింక, పెద్దలమాట చద్దిమూట, మంచి స్నేహితులు వంటి కథలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 58 గ్రంథాలయాలకు కథల పుస్తకాలను అందజేశారు. ఈ వేసవి సెలవుల్లో లైబ్రరీల్లో నిర్వహించిన వేసవి శిబిరాల్లో పిల్లల చేత చదివించారు. ఇప్పటి వరకు జిల్లాలోని 100 పాఠశాలలకు పుస్తకాలను పంపిణీ చేశారు. మిగతా వాటికి కూడా పంపిణీ చేరవస్తున్నారు. విద్యార్థులతో చదివించాలి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే విధంగా విభిన్న అంశాలతో కూడిన కథలను పుస్తకాల్లో చేర్చాం. ప్రతి పాఠశాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న వీటిని విద్యార్థులతో ప్రతిరోజు చదివించాలి.అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి.జిల్లా కేంద్రం నుంచి నేరుగా పాఠశాలలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం పంపిణీ ప్రారంభించాం. – డాక్టర్ అంబవరం ప్రభాకర్‌రెడ్డి, జిల్లా సమగ్రశిక్ష పథక అధికారి, వైఎస్సార్‌జిల్లా -
ఇంగ్లిష్ మీడియం చదువు.. అందరి చూపు సర్కారీ స్కూళ్ల వైపు!
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నందున విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు దృష్టి సారించారు. ‘ఉన్న ఊళ్లోనే ఇంగ్లిష్ చదువు దొరుకుతుంటే, ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తూ పట్టణాల్లో ఉండటమేమిటీ?’అనే ఆలోచన చాలామందిలో కన్పిస్తోంది. దీంతో సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇంగ్లిష్ మీడియం గురించి పెద్దసంఖ్యలో ప్రభుత్వబడులను సంప్రదిస్తున్నారని విద్యాశాఖ చెబుతోంది. ‘ఇంగ్లిష్ అత్యవసర భాషగా ఇప్పటికే అన్నివర్గాలూ గుర్తించాయి. బోధనలో వెనక్కి తగ్గే అవకాశమే లేదు’అని వరంగల్‌కు చెందిన శాంతికుమార్ అనే ఉపాధ్యాయుడు అంటున్నారు. శిక్షణలో చిత్తశుద్ధి ఎంత? రాష్ట్రంలో 26,072 ప్రభుత్వ స్కూళ్లున్నాయి. ఇందులో 1–10 తరగతులు చదివేవారు 20 లక్షలమంది ఉంటారు. ప్రజల్లో స్పందన చూస్తుంటే ఈసారి కనీసం 2 లక్షలమంది కొత్తగా సర్కారు స్కూళ్లల్లో చేరే వీలుందని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ప్రస్తుతం 1.06 లక్షల మంది టీచర్లు ఉండగా, ఇంకా 21,500 ఖాళీలున్నాయి. ప్రేమ్‌జీ వర్సిటీ శిక్షణ కన్నా ముందు 60,604 మంది మాత్రమే ఇంగ్లిష్ మీడియం చెప్పగలిగే టీచర్లున్నారని గుర్తించారు. ప్రస్తుతం 80 వేల మందికి ప్రేమ్‌జీ వర్సిటీ ద్వారా ఆంగ్ల బోధనపై నెల రోజులపాటు శిక్షణ ఇప్పించారు. అయితే తెలుగు నేపథ్యం నుంచి వచ్చిన టీచర్లకు నెలరోజుల శిక్షణ సరిపోదనే భావన వ్యక్తమవుతోంది. ‘శిక్షణకాలంలో ఇంగ్లిష్ భాష ద్వారా భావాన్ని వ్యక్తం చేసే తరహాలో వీడియోలు ప్రదర్శించారు, దీంతోపాటే సంభాషణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే బాగుండేది’అని ఆదిలాబాద్‌కు చెందిన కుమార్ వర్థన్ వ్యాఖ్యానించారు. ఆంగ్లం అంత కష్టమేమీ కాదు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంగ్లిష్‌పై విద్యార్థులు పట్టు సాధించడం ఈ తరంలో పెద్ద సమస్యేమీ కాదు. స్మార్ట్ ఫోన్ వాడని, ప్రతి దానికీ గూగుల్ సెర్చ్ చేయని పిల్లలున్నారా? ఫస్ట్ క్లాస్ నుంచే ఈ అలవాటు ఉంది. నిజానికి మనకు తెలియకుండానే 40 శాతం ఇంగ్లిష్ వాడకం అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లిష్ భాష నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అనుమానాలు లేకుండా ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపడితే, క్రమంగా సమస్యలు సర్దుకుంటాయి. –స్వామి శితికంఠానంద, డైరెక్టర్, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ బోధించే స్కిల్స్ ఉన్నాయి ఉపాధ్యాయుల్లో బోధించే నైపుణ్యం ఉంది. తెలుగు మీడియం నుంచి వచ్చినా, మారిన ప్రపంచంలో ఎంతోకొంత ఇంగ్లిష్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకపోతే బోధించేటప్పుడు భయం బ్రేకులు వేస్తోంది. మొదటిదశ శిక్షణలో ఇది కొంత దూరమైంది. మరో దఫా 5 వారాలు శిక్షణ ఉంటుంది. కాబట్టి, టీచర్లందరూ క్రమంగా ఆంగ్లంలో బోధించగలరు. –చెరుకు ప్రద్యుమ్న కుమార్, ప్రభుత్వ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ కేంద్రం కో ఆర్డినేటర్ -
హైదరాబాద్‌లోని సర్కారు బడులకు మహర్దశ
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సర్కారు బడులకు మహర్దశ పట్టనుంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, మౌలిక సదుపాయాల కల్పనకు రంగం సిద్ధమైంది. మన బస్తీ–మన బడి కార్యక్రమం కింద మొదటి విడతగా ఎంపిక చేసిన పాఠశాలల్లో అభివృద్ధి పనులను సోమవారం శ్రీకారం చుట్టనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు వీటిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. 845 పాఠశాలల్లో.. గ్రేటర్ పరిధిలో మన బస్తీ– మన బడి, కార్యక్రమం కింద మొదటి విడతలో కింద సుమారు 845 పాఠశాలల్లో అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ జిల్లాలోని పరిధిలో 690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 239 పాఠశాలల్లో, రంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో కలిపి 1300పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 464 పాఠశాలల్లో, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలో 505 పాఠశాలలు ఉండగా అందులో 142 పాఠశాలల్లో పనులు చేపట్టనున్నారు. విద్యార్థుల సంఖ్య అనుగుణంగా.. మొదటి విడతలో అత్యధిక విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యమిచ్చి ఎంపిక చేశారు. 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టారు. పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన గదులను తొలగించి వాటి స్థానంలో కొత్త గదులను నిర్మించడం, ప్రహరీ గోడలు, కిచెన్ షెడ్లు, డైనింగ్ నిర్మాణాలు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణాలు, మరమ్మతులు, భవనాలకు రంగులు వేయడం, ఫర్నిచర్ ఏర్పాటు, గ్రీన్ చాక్‌బోర్డులు, డైనింగ్ హాల్, డిజిటల్ పరికరాలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టారు. మూడేళ్ల ప్రాజెక్టులో భాగంగా మొదటి విడుతగా గుర్తించిన పాఠశాలల్లో పనులు చేపట్టినంతరం రెండో విడత కింద మరికొన్ని పాఠశాలలను ఎంపిక చేయనున్నారు. చదవండి: ‘కర్ణాటక డీజిల్’ కథ ఆదిలోనే కంచికి.. -
ఆంగ్లమూ అనర్గళంగా..ప్రభుత్వ స్కూళ్ల టీచర్లకు ఆంగ్ల శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యా బోధనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విద్యార్థులకు సరిగా బోధన అందించేలా ఉపాధ్యాయులను తీర్చిదిద్దాలని.. అందుకోసం వారికి ఆంగ్లభాషలో పట్టుపెంచుకునేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నతస్థాయి సమీక్షలు జరుగుతున్నాయి. మరోవైపు టీచర్లు కూడా.. ప్రపంచ భాష అయిన ఇంగ్లిష్‌కు మంచి భవిష్యత్ ఉంటుందని గుర్తించారు. ఆంగ్ల భాషలో బోధనకు అవసరమైన సామర్థ్యం పెంచుకునేందుకు సంసిద్ధమయ్యారు. విద్యాశాఖ అంతర్గత సర్వే ప్రకారం రాష్ట్రంలో 1.02 లక్షల మంది టీచర్లు ఉండగా.. అందులో 10 శాతమే ఆంగ్ల మీడియంలో చదువుకున్న వారున్నారు. మరో 15% సొంతంగా ఆ భాషను నేర్చుకున్నట్టు గుర్తించారు. మిగతా 75 % మందికి ఆంగ్ల భాషపై పట్టు పెంచాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదట స్పోకెన్ ఇంగ్లిష్తో.. విద్యార్థికి ఇంగ్లిష్ మీడియంలో బోధించే స్థాయిలో ఉపాధ్యాయుడికి ఏ తరహా శిక్షణ కావాలనే దానిపై కొందరు టీచర్లు తమ అనుభవాలను వెలిబుచ్చారు. ఇంగ్లిష్‌లో బోధించే సామర్థ్యమున్నా.. దానికి మెరుగులు దిద్దే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. చిత్తశుద్ధితో శిక్షణ అందిస్తే.. అంతే నిబద్ధతతో నేర్చుకుంటామని అంటున్నారు. ఇంగ్లిష్ మీడియం బోధనతో సక్సెస్ స్కూళ్లను పెట్టినప్పుడు కేవలం 13 రోజులే శిక్షణ ఇవ్వడాన్ని గుర్తు చేస్తున్నారు. నిజానికి చాలా మంది తెలుగు మీడియంలో చదువుకున్నా.. తర్వాత అవసరాల రీత్యా ఇంగ్లిష్ భాషపై పట్టుపెంచుకున్నారు. కానీ ఇంగ్లిష్‌లో మాట్లాడే సామర్థ్యం మాత్రం తక్కువ. ఈ నేపథ్యంలో స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పాలని, భయాన్ని పోగొట్టేలా శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. మొక్కుబడిగా కాకుండా.. ప్రాక్టికల్ క్లాసులు ఉండాలంటున్నారు. సాధారణంగా క్లాస్‌రూమ్‌లో విద్యార్థులు, టీచర్లు పరస్పరం ప్రశ్నలు వేసుకోవడం, సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ఈ సంభాషణ పూర్తిగా ఇంగ్లిష్‌లోనే సాగేలా ఉండాలని టీచర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ స్థాయికి ఉపాధ్యాయులను సిద్ధం చేయడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని అంటున్నారు. స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ తర్వాత కూడా భాషపై పట్టు పెంచుకునేందుకు పాఠశాలల్లో ఇంగ్లిష్ రిఫరెన్స్ బుక్స్, లాంగ్వేజ్ లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆసక్తి ఉన్నవారితో శిక్షణ శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ కొంతమంది సుశిక్షితులను ఎంపిక చేస్తుంది. కానీ గతంలో ఈ విషయంగా పొరపాట్లు జరిగాయని ఉపాధ్యాయులు అంటున్నారు. శిక్షణ ఇచ్చే రిసోర్స్ పర్సన్లను వారి సమ్మతి లేకుండా ఎంపిక చేశారని.. వారు టీచర్లను సన్నద్ధం చేయడం కన్నా, ఏవో కొన్ని క్లాసులు చెప్పి వెళ్లారనే విమర్శలున్నాయి. ఇప్పుడైనా శిక్షణ ఇవ్వడంలో ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేయాలని టీచర్లు కోరుతున్నారు. పదాలపై పట్టు ముఖ్యం ఇంగ్లిష్‌లో బోధించేప్పుడు సమాంతర పదాలు చాలా తెలియాలి. ఉదాహరణకు వెన్నెముక ప్రాణులు– వెన్నెముక లేని ప్రాణులను ఇంగ్లిష్‌లో ‘వర్టిబ్రే.. ఇన్ వర్టిబ్రే’అంటారు. కేవలం స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకుంటే ఇలాంటి వాటిపై అవగాహన ఉండదు. అందువల్ల పదాలపై పట్టు సాధించాలి. నిరంతర అధ్యయనం వల్లే ఉపాధ్యాయుడికి సాధ్యం. మహాసముద్రాలు అనే పదాన్ని ఇప్పటికీ ఓషన్స్ అని చెప్పకుండా లార్జ్ బాడీస్ ఆఫ్ వాటర్ అని చెప్తున్నారు. కాబట్టి టీచర్లకు పదాలపై పట్టు పెంచే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. – చెరుకు ప్రద్యుమ్నకుమార్, ప్రభుత్వ ఇంగ్లి్లష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్, కరీంనగర్ టీచర్లలో భయం తొలగించాలి నేను ఎస్జీటీగా ఉన్నప్పుడు రిసోర్స్ పర్సన్‌గా పనిచేశాను. టీచర్లకు శిక్షణ ఇచ్చేప్పుడు తాము ఇంగ్లిష్ నేర్చుకున్నా.. బోధించగలమా? అనే భయం కనిపించేది. ఇది శిక్షణ ఇవ్వడంతోనే తొలగిపోదు. ప్రాక్టికల్ క్లాసుల ద్వారా ఈ భయాన్ని పోగొట్టాలి. శిక్షణ ఇచ్చేప్పుడు పరస్పర సంభాషణ తరగతులు ఎక్కువగా ఉండాలి. మోడల్ క్లాసులు నిర్వహిస్తే ఏ టీచర్ అయినా బోధించే మెళకువలు తెలుసుకోవడం కష్టమేమీ కాదు. మొదట 15 రోజులు.. కొన్నాళ్ళ విరామం తర్వాత మరో 15 రోజులు.. కలిపి కనీసం నెల రోజుల శిక్షణ ఉండాలి. – కలకుంట్ల రాజేశ్వర్‌రావు, బయో సైన్స్ టీచర్, మాజీ రిసోర్స్ పర్సన్, జిల్లెల్ల, రాజన్న సిరిసిల్ల మెళకువలను నిద్రలేపితే చాలు పూర్తిగా తెలుగు మీడియంలో చదువుకున్నా డిగ్రీ వరకూ ఇంగ్లిష్ సబ్జెక్టు ఉండేది. ప్రతీ టీచర్ పిల్లల కోసమో, సమాజంలో గౌరవం కోసమో ఇంగ్లిష్‌పై అవగాహన పెంచుకున్నారు. కాకపోతే స్కూళ్లలో తెలుగు మీడియమే ఉండటం వల్ల ఇంగ్లిష్‌లో మాట్లాడలేకపోతున్నాం. స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పిస్తే.. ఏడాదిలోనే మాకు మేం గ్రామర్ కూడా నేర్చుకుంటాం. కొంతకాలం బోధనకు ముందే టీచర్ ఇంటి దగ్గర పాఠం ప్రిపేరవ్వాల్సి వస్తుంది. – పణితి రామనాథం, స్కూల్ అసిస్టెంట్, మోరంపల్లి బంజర్, బూర్గంపహాడ్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం -
ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన
-
తెలంగాణలో సర్కారీ స్కూళ్లు సరికొత్తగా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ.7,289 కోట్ల ఖర్చుతో రెండేళ్ళ కాలపరిమితితో స్కూళ్ళలో మరమ్మతులు చేపట్టాలని, కనీస వసతులు కల్పించా లని ఇటీవల కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే సర్కార్ ‘మన ఊరు– మన బడి’పథకానికి ప్రాణం పోసింది. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలలకు సరైన భవనాలు లేవు. కనీస సదుపాయాలు అంతకన్నా లేవు. శిథిలావస్థలో ఉన్న భవనాలు.. తరగతి గదుల కొరత.. దీంతో చెట్ల కిందే చదువులు. హెచ్ఎంతో మాట్లాడేందుకు వెళ్లే టీచర్ నిలబడే మాట్లాడాలి. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు అవసరమైన ఫర్నిచరే లేదు. కానీ ఇప్పుడా పరిస్థితి మారనుంది. పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే ఎంపిక చేసి పనులు కొనసాగిస్తున్న హైదరాబాద్ పరిసరాల్లోని నాలుగు స్కూళ్ళతో పాటు రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలూ ప్రైవేటుకు దీటుగా తయారు కానున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన చేరికలు ► కరోనా తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెరిగాయి. 2021లో ఏకంగా 2.50 లక్షల మంది కొత్తగా చేరారు. ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేకపోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. తరగతులు జరగక పోయినా ఆయా స్కూళ్లు ఫీజులు వసూలు చేయడం, మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలో విద్యాప్రమాణాలు పెరిగిన నేపథ్యంలో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపారు. అయితే ఇప్పటికే పాత భవనాలు, చాలీచాలని వసతులతో సర్కారీ స్కూళ్లలో ఇబ్బందులెదురవుతున్నాయి. తాజాగా లక్షల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్యతో ఇక్కట్లు మరీ తీవ్రమయ్యాయి. ఈ పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం గమనించింది. దాదాపు 9,123 ప్రభుత్వ స్కూళ్ళల్లో తీవ్రమైన సమస్యలున్నట్టు గుర్తించింది. ► పాఠశాల విద్యాశాఖ పరిధిలో 26,285 స్కూళ్లున్నాయి. 2018–19 లెక్కల ప్రకారం 10,230 పాఠశాలల్లో సరిపడా తరగతి గదుల్లేవు. చాలా క్లాసులకు ఉపాధ్యాయులు చెట్ల కిందే పాఠాలు చెప్పాల్సి వస్తోంది. కొన్ని స్కూళ్ళల్లో వరండాల్లో చదువులు చెబుతున్నారు. ► శిథిలావస్థకు చేరిన స్కూళ్ళ సంఖ్య 4 వేలకు పైగానే ఉందని అధికారులు చెబుతున్నారు. మరో 5 వేల స్కూళ్ళకు తాత్కాలిక మరమ్మతులు అవసరం. ఏ చిన్న వానొచ్చినా గదుల్లోకి నీళ్ళొస్తున్నాయి. కొన్ని స్కూళ్ళలో ఎప్పటికప్పుడు ఎక్కడ పై కప్పు పెళ్లలు మీద పడతాయోననే ఆందోళనతోనే గడుపుతున్నారు. ► 2018 లెక్కల ప్రకారమే 8,725 పాఠశాలలకు ప్ర హరీ గోడల్లేవు. ఇప్పుడీ సంఖ్య మరో 4 వేలకు పెరిగిందని ఓ అధికారి తెలిపారు. ప్రహరీలు లే క పశువులు స్కూళ్లలోనే మకాం పెడుతున్నాయి. ► ఇప్పటికీ 9 వేలకు పైగా స్కూళ్ళల్లో మరుగుదొడ్లు లేవు. స్కూలు పరిసరాల్లో చిన్నాచితకా దు కాణాలు, జన సముదాయం ఉండటంతో శౌచా లయ కార్యకలాపాల కోసం విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. బాలికలకు ఇంటికెళ్ళ డం మినహా ప్రత్యామ్నాయం కన్పించడం లేదు. నిధుల కొరతే అడ్డంకి.. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరతే ప్రధాన అడ్డంకిగా మారింది. రాష్ట్రావతరణ తర్వాత తొలి బడ్జెట్లో విద్యా రంగానికి 10.89 శాతం కేటాయిస్తే... ఇప్పుడది 6.79 శాతానికి తగ్గింది. బడుల్లో మౌలిక వసతుల కోసం ఏటా రూ. 2 వేల కోట్ల చొప్పున రెండేళ్ళ పాటు ఖర్చు చేస్తామని గత బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రటించింది. అయితే ఇది ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. రాష్ట్రంలో 3,634 పాఠశాలలకు రూ.109 కోట్లతో మెరుగులు దిద్దేందుకు సమగ్ర శిక్షా అభియాన్ కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదననలు సిద్ధం చేసింది. ఈ ఖర్చులో 60 శాతం సమకూరుస్తానని చెప్పిన కేంద్రం ఒక్కపైసా ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా ‘మన ఊరు–మనబడి’పేరుతో నిధులు మంజూరు చేసి పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకోవడంపై అన్నివర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. చెట్ల కింద పాఠాలు.. ప్రహరీ గోడలకు బ్లాక్ బోర్డులు నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని పోతునూరు ప్రాథమికోన్నత పాఠశాలలో చాలా తరగతులు చెట్ల కిందే సాగుతున్నాయి. గతంలో ఐదవ తరగతి వరకే ఉన్న ఈ పాఠశాలను కొన్నేళ్ల క్రితం 8వ తరగతి వరకు పెంచారు. దీంతో విద్యార్థుల సంఖ్య 120 నుంచి 152 అయింది. పాఠశాల శిథిలావస్థకు చేరటంతో 2016లో కొన్ని గదులు కూల్చివేశారు. కానీ ఇప్పటివరకు కొత్తగా పాఠశాలను నిర్మించలేదు. కొత్త గదులూ ఏర్పాటు చేయలేదు. దీంతో టీచర్లు, విద్యార్థులు వేసవి, వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రహరీ గోడలకే బ్లాక్ బోర్డులు ఏర్పాటు చేసి పాఠ్యాంశాలు నేర్పిస్తున్నారు. ఇక పాఠశాలలో తాగునీరు, మూత్రశాలల వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన మూత్రశాలలనే బాలికలు వాడుకుంటున్నారు. బాలురు బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ‘ఆలియా’కు కొత్త అందాలు హైదరాబాద్ నగరం నడిబొడ్డున గన్‌ఫౌండ్రీలో శిథిలావస్థలో ఉన్న ఏళ్లనాటి ఆలియా ప్రభుత్వ మోడల్ పాఠశాల భవనం ఆధునిక హంగులు అద్దుకుం టోంది. ఇక్కడి ప్రాథమిక పాఠశాలలో 148 మంది, ఉన్నత పాఠశాలలో 200 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.‘మన ఊరు–మన బడి’ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక కావడంతో 2 నెలలుగా మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. నిజాం కాలంలో నిర్మించిన ఈ భవనాల్లో ఒక భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. మరో భవనంలోని తరగతి గదులన్నీ పెచ్చులూడిపోయాయి. వర్షాకాలంలో గదుల్లోకి తేమ వస్తోంది. కాగా పైలట్ ప్రాజెక్టు కింద రెండో భవనం మరమ్మతు పనులు చేపట్టారు. మౌలిక సదుపాయాల కింద ఆధునీకరించిన మరుగుదొడ్లు, ఆహ్లాదం కలిగించే ప్రాంగణాలు, స్వచ్ఛమైన తాగునీటి వసతులు కల్పించనున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌కు దీటుగా ఫర్నిచర్, గ్రీన్ చాక్‌బోర్డులు, తరగతి గదిలో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, విజ్ఞానం పెంపొందించే చిత్రాలు ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ తరగతులు, ఇంగ్లిష్ క్లబ్‌లు సిద్ధంకానున్నాయి. -
బడిని బాగుచేసుకుందాం
సాక్షి ప్రతినిధి, వరంగల్: చిన్నప్పుడు మీరు అఆలు దిద్దిన బడిని చక్కగా తీర్చిదిద్ది రుణం తీర్చుకోవాలని భావిస్తున్నారా.. మీ ఆర్థికసాయాన్ని బడిఒడికి ఎలా చేర్చాలోనని యోచిస్తున్నారా.. ఎక్కడో దూరంగా ఉండటం వల్ల మీకు వీలు చిక్కడంలేదా.. ‘విద్యాంజలి’ ఉండగా.. చింత ఎందుకు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో భాగస్వాములుకండి. మీ కలల సాకారానికి ఇది చక్కని వేదిక. సర్కారు బడుల్లోని సమస్యల పరిష్కారంలో దాతలను భాగస్వాములను చేయడమే ఈ పథకం ఉద్దేశం. ఆయా పరిశ్రమలవారు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ పథకం ద్వారా స్కూళ్లకు ఆర్థిక తోడ్పాటును ఇవ్వవచ్చు. విద్యాంజలిలో నమోదు చేసుకున్న పాఠశాలల్లో సమస్యల పరిష్కారం కోసం దాతలు ముందుకొస్తే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారితో ఎంవోయూ కుదుర్చుకొని పనులు మొదలుపెడతారు. వెబ్సైట్లో పేరు నమోదు ఇలా..: రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల వివరాలు, సమస్యలు, అవసరాల గురించి ప్రధానోపాధ్యాయులు విద్యాంజలి వెబ్సైట్లో నమోదు చేస్తారు. సంబంధిత పాఠశాలకు సాయం చేయాలనుకునేవారు అదే వెబ్సైట్లో ఉన్న దాతల ఆప్షన్‌ను క్లిక్ చేసి తమ పేర్లు నమోదు చేసుకొని సేవలను అందించవచ్చు. తొలిస్థానం రాజన్న సిరిసిల్లదే..: ఈ ప్రక్రియలో రాష్ట్రంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, కేజీబీవీ, ఎంఎస్యూఆర్ఎస్, ఎయిడెడ్ తదితర అన్ని రకాల పాఠశాలలు 28,888 ఉండగా.. 21,585 పాఠశాలలు(74.72 శాతం) నమోదు చేసుకున్నాయి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముందంజలో ఉంది. మొత్తం 514 పాఠశాలలకుగాను 506 (98.44 శాతం) పాఠశాలల పేర్లు నమోదు చేసి ప్రథమ స్థానంలో ఉండగా.. ఖమ్మం జిల్లా 1,273 పాఠశాలలకు 558 పాఠశాలల (43.83 శాతం) నమోదుతో చివరి స్థానంలో ఉంది. నమోదైన సమస్యలివే...: పాఠశాలలను నమో దు చేసిన హెచ్ఎంలు తమ పాఠశాలల్లోని సమస్యలను కూడా అందులో పొందుపర్చారు. అత్యధికం గా నిర్మాణ పనులు, విద్యుత్ ఉపకరణాలు, బోర్డు లు, బల్లలు, కుర్చీలు, పుస్తకాలు, సైన్స్, గణితం కిట్లు, కంప్యూటర్, ఎల్ఈడీ ప్రొజెక్టర్, ఇంటరాక్టివ్ వైట్‌బోర్డు, టీవీ, ల్యాప్‌టాప్, క్రీడలు, విద్యేతర(కో కర్క్యులర్) కార్యకలాపాలకు అవసరమైన వస్తు సామగ్రి, ఫస్ట్ ఎయిడ్ కిట్, వాటర్ ప్యూరిఫైడ్, థర్మామీటర్, చేతుల శుభ్రత (హ్యాండ్‌వాష్) సౌకర్యాలు, వీల్‌చైర్, హియరింగ్ హెడ్స్, టూల్‌కిట్స్, బోధన–అభ్యసన సామగ్రి, నిర్వహణ–మరమ్మతులు, కార్యాలయ అవసరాల కోసం సాయం చేయాల్సిందిగా దాతలను కోరారు. దాతలు ముందుకొస్తేనే.. విద్యాంజలి పథకంతో పాఠశాలలను అభివృద్ధి చేసుకోవచ్చు. సమాజ భాగస్వామ్యంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. జిల్లా పరిషత్ హసన్‌పర్తి బాలుర పాఠశాల పేరును ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్నాం. ఇందుకోసం దాతలు సహకరించాలి. -
మధ్యాహ్న భోజన పథకానికి కొత్త పేరు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత మధ్యాహ్న భోజన పథకం పేరును ‘నేషనల్ స్కీమ్ ఫర్ పీఎం పోషణ్ ఇన్ స్కూల్స్’గా మారుస్తూ మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలన్న ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2021–22 నుంచి 2025–26 వరకూ ఐదేళ్లపాటు పథకాన్ని కొనసాగిస్తారు. ఇందుకు కేంద్రం రూ.54,061.73 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.31,733.17 కోట్ల మేరకు వ్యయాన్ని భరించనున్నాయి. అలాగే ఆహార ధాన్యాల కోసం కేంద్రం రూ.45 వేల కోట్లు అదనంగా వెచ్చించనుంది. మొత్తంగా ఐదేళ్లలో పీఎం పోషణ్ పథకం అమలుకు రూ.1,30,794.90 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడ్ పాఠశాలల్లో వండి, నిత్యం ఒకపూట వేడిగా భోజనం అందించే ఈ పథకంతో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. గతంలో ఈ పథకం పేరు ‘నేషనల్ స్కీమ్ ఫర్ మిడ్డే మీల్ ఇన్ స్కూల్స్’గా ఉండగా ఇప్పుడు ‘నేషనల్ స్కీమ్ ఫర్ పీఎం పోషణ్ ఇన్ స్కూల్స్’గా మార్చినట్టు కేంద్రం వెల్లడించింది. 2007 వరకు ఈ పథకం పేరు ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్’ అని ఉండగా, 2007లో ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మిడ్ డే మీల్ ఇన్ స్కూల్స్’గా మార్చారు. దేశవ్యాప్తంగా 11.20 లక్షల పాఠశాలల్లో చదువుతున్న 11.80 కోట్ల మంది విద్యార్థులకు పీఎం పోషణ్ స్కీమ్ వర్తిస్తుందని కేంద్రం వెల్లడించింది. స్కూళ్లలో మధ్యాహ్న భోజనం కోసం 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.24,400 కోట్లు వెచ్చించినట్టు తెలిపింది. పిల్లలకు ‘తిథి భోజనం’ ► పీఎం పోషణ్ పథకాన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ ప్రీ–ప్రైమరీ లేదా బాల వాటికలకు కూడా వర్తింపజేయాలని కేంద్రం యోచిస్తోంది. 11.80 కోట్ల విద్యార్థులకు ఇది అదనం. ► తిథి భోజనం కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ► ప్రత్యేక సందర్భాలు, పండుగల సమయాల్లో ప్రత్యేకమైన ఆహారాన్ని పిల్లలకు అందించేందుకు ఉద్దేశించిన సామాజిక భాగస్వామ్య కార్యక్రమం ఈ తిథి భోజనం. ► పాఠశాలల్లో న్యూట్రిషన్ గార్డెన్స్ అభివృద్ధి చేయడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. తోటల పెంపకాన్ని విద్యార్థులకు పరిచయం చేయడమే దీని ఉద్దేశం. ఇప్పటికే 3 లక్షల పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. ► అన్ని జిల్లాల్లో సామాజిక తనిఖీలు తప్పనిసరిగా అమలు చేయాలి. పిల్లల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అనుబంధ పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తారు. -
టీచర్లు కావాలని విద్యార్థుల నిరసన
-
ఫైవ్‌స్టార్ చాక్లెట్స్‌తో పాఠశాలకు ఆహ్వానం
కరీంనగర్ మండలం నగునూరు పాఠశాలలో హెచ్ఎం కట్ట వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు ఫైవ్‌స్టార్ చాక్లెట్లతో స్వాగతం పలికారు. కరీంనగర్‌లోని మంకమ్మతోటలో గల ధన్గర్‌వాడీ పాఠశాలలో ప్రార్థన సమయంలో విద్యార్థిని సాయి స్పృహతప్పి పడిపోగా, ఉపాధ్యాయుడు ప్రథమ చికిత్స చేశాడు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘పొద్దున లేవాలి.. స్నానం చేయాలి.. బడికెళ్లాలి.. ప్రార్థన చేయాలి, పాఠాలు వినాలి.. మైదానంలో ఆడాలి.. సాయంత్రానికి మాసిన బట్టలతో ఇంటికి చేరుకోవాలి.. ఇదే ప్రపంచంలో ఎక్కడైనా విద్యార్థి దినచర్య. కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు ఏడాదిన్నరగా విద్యార్థుల దినచర్య పూర్తిగా స్తంభించిపోయింది. నిత్యం స్మార్ట్ఫోన్లలో పాఠాలు విన్న విద్యార్థులకు బుధవారం నుంచి ప్రత్యక్ష బోధన మొదలైంది. ఏడాదిన్నర అనంతరం పాఠశాలకు వెళ్తున్నామనే హుషారు విద్యార్థుల్లో కనబడింది. కరోనా వల్ల పాఠశాలలకు దూరమైన విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు బడిబాట పట్టారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు మాస్కులు ధరించి పాఠశాల, కళాశాలలకు హాజరవ్వడం కనిపించింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రత్యక్ష తరగతులు నిర్వహించాయి.’ చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్‌కు దరఖాస్తులు ఆహ్వానం 18 నెలల అనంతరం..! గతేడాది మార్చి 23 నుంచి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్లో భాగంగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. 2019–20 విద్యాసంవత్సరానికి గాను పదో తరగతి, ఇంటర్, కొన్ని ఉన్నత విద్యలకు సంబంధించి ప్రభుత్వం నేరుగా పాస్ చేశారు. 2020–21 విద్యా సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. సెకండ్ వేవ్ ముగియడం, ప్రత్యక్ష బోధన కొరవడటంతో విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పడిపోతాయన్న ఆందోళనతో ప్రభుత్వం కూడా ప్రత్యక్ష బోధన వైపు మొగ్గుచూపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు దాదాపు 18 నెలల అనంతరం విద్యార్థులు బడిబాటపట్టడం గమనార్హం. పాఠశాలల్లో 21.11 శాతం, కళాశాలల్లో 22.65 శాతం.. పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభమైన తొలిరోజు హాజరు శాతం అతి తక్కువ నమోదు కావడం గమనార్హం. విద్యార్థులను బలవంతం చేయొద్దని, ఆన్లైన్, ఆఫ్‌లైన్ విద్యార్థుల కోరిక మేరకు విద్యాసంస్థల యజమానులు వ్యవహరించాలని వచ్చిన వార్తలతో తొలిరోజు విద్యార్థులు, తల్లిదండ్రులు గందరగోళానికి గురికావడంతోనే హాజరు శాతం తగ్గిందని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలను శుభ్రం చేసి విద్యార్థులు ప్రత్యక్ష «తరగతులకు హాజరయ్యేలా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 662 ప్రభుత్వ పాఠశాలల్లో 42,698 మంది విద్యార్థులకు గాను 9,014 మంది (21.11 శాతం).. ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 13,059 మంది విద్యార్థులకు గాను 2,958 మంది (22.65 శాతం) హాజరయ్యారు. -
నాడు-నేడు: మా తరగతి గది భలే బాగుంది..!
సాక్షి, అమరావతి / సాక్షి నెట్వర్క్: బంగ్లామెట్ట మున్సిపల్ స్కూలు భీమిలి నియోజకవర్గం తగరపువలసలో ఉంది. చాలాకాలం ఒకటే తరగతి గది. పిల్లలూ తక్కువే. ప్రైవేటు ఫీజులు కట్టలేనివారు, దూరంగా వెళ్లలేని స్థానికులు మాత్రం దీన్ని ఆశ్రయించేవారు. అలాంటిదిపుడు ఈ స్కూల్లో క్లాస్‌రూమ్‌కు డిజిటల్ సొబగులూ వచ్చిచేరాయి. బంగ్లామెట్టకు చెందిన శీల పోలిపల్లి ఈ స్కూలును చూస్తూ... ‘‘‘నేను ఇదే మున్సిపల్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశా. ఇప్పుడు నా పిల్లలు భరత్, జ్యోత్స్న ఇక్కడే చదువుతున్నారు. నేను చదువుకునేటప్పుడు ఇరవై మంది కూడా ఉండేవారు కాదు. అందరికీ ఒక్కటే తరగతి గది. నేల చదువులు. వర్షం పడితే బడికి సెలవిచ్చేసేవారు. మా పిల్లలను మంచి స్కూల్లో చదివించాలనుకున్నా. కానీ ఆర్థిక స్థోమత సరిపోక ప్రైవేటు స్కూళ్లకు పంపలేకపోయాం. ఇప్పుడు ఈ పాఠశాల ప్రైవేట్ స్కూళ్లను తలదన్నేలా తయారయింది. రూ.19.64 లక్షలతో ఎన్నో సౌకర్యాలు కల్పించారు. తరగతి గదులు పూర్తిగా మారిపోయాయి. ఫ్యాన్లు, గ్రానైట్ ఫ్లోర్, డిజిటల్ పరికరాలు, అందమైన డ్యుయెల్ డెస్క్‌లు, గ్రీన్ చాక్‌బోర్డులు, 53 అంగుళాల టీవీ.. ఇవన్నీ చూస్తుంటే ఇది నేను చదువుకున్న స్కూలేనా అనిపిస్తోంది’’ అంటూ ఒకింత ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కాశినాయన మండలం రెడ్డికొట్టాల ప్రాథమిక పాఠశాలలో తరగతి గది ఇక వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలం రెడ్డికొట్టాల ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న కొండా దీక్షితది కూడా ఇలాంటి సంతోషమే. ‘‘మా స్కూల్లో ఇప్పుడు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బల్లలు భలేగున్నాయి. తరగతి గదులు పూర్తిగా మారిపోయాయి. గదుల్లో దేశ నాయకుల చిత్రాలు వేయించారు. సూక్తులు రాయించారు’’ అంటూ సంబరంగా చెబుతోంది. ఎప్పుడెప్పుడు స్కూలు తెరుస్తారా.. అని ఎదురు చూస్తున్నానని చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశ నాడు–నేడు కార్యక్రమం పూర్తయిన ప్రతి స్కూల్లోనూ విద్యార్థుల సంబరం ఇలానే ఉంది మరి. ఫ్యాన్లు, లైట్లు, మురిపించే చిత్రాలు.. స్కూళ్లలో బయటకు కనిపించే భవనం... చుట్టూ ఉండే ప్రహరీకి ఎంత ప్రాధాన్యముందో... చదువుతో పాటు ఎన్నెన్నో విషయాలు నేర్చుకునే తరగతి గదికి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యముంది. ఎందుకంటే స్కూల్లో ఉన్న సమయంలో విద్యార్థులు ఎక్కువ సమయం గడిపేది క్లాస్ రూమ్‌లోనే. మరి ఆ క్లాస్ రూమ్ వర్షానికి కారిపోతూనో... పగిలిపోయిన గచ్చుతోనో... విరిగిపోయిన బోర్డుతోనో దర్శనమిస్తే!!. అక్కడ ఎంత మంచి టీచరున్నా అంతగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మంచి టీచరుతో పాటు మంచి వాతావరణమూ ముఖ్యమే. ప్రైవేటు స్కూళ్లు కాస్త స్కోరింగ్ చేసేది ఈ పాయింట్ దగ్గరే. ఎందుకంటే అక్కడ మంచి టీచర్లు లేకున్నా బల్లలు, బోర్డులు బాగుంటాయి. పిల్లల్ని, తల్లిదండ్రుల్ని ఇట్టే ఆకర్షిస్తాయి. ఇప్పటి నుంచి మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఆ అవకాశాలు తక్కువే. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్లలోని తరగతి గదులు ‘నాడు–నేడు’ కార్యక్రమంతో కొత్త హంగులు దిద్దుకున్నాయి. మొత్తం 45 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో తొలి విడతగా రూపుదిద్దుకున్న 15,715 స్కూళ్లలో తరగతి గదులను తీర్చిదిద్దే పనులు దాదాపు పూర్తయ్యాయి. విద్యార్థి క్లాసులోని వాతావరణం చూసి పూర్తి స్థాయిలో చదువుపై దృష్టి పెట్టేలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. గతంలో బోధన కోసం బ్లాక్ బోర్డులుండేవి. అవి విద్యార్థుల కంటిపై ప్రతికూల ప్రభావం చూపించే విధంగా ఉంటాయని అధ్యయనాలు ఉండడంతో వాటి స్థానంలో గ్రీన్ చాక్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఆ పక్కనే జాతీయ నేతలు, స్వాతంత్య్ర ఉద్యమ కారులు, శాస్త్రవేత్తలు, ఇతర రంగాల నిపుణుల ఫొటోలను, వివిధ ప్రయోగశాలల్లో జరిగే కార్యక్రమాలను చిత్రించారు. ఇందుకు నిపుణులైన ఆర్కిటెక్టులు, చిత్రకారులు, ఇతరుల సహకారాన్ని తీసుకున్నారు. ప్రతి స్కూల్లో విద్యుత్ సౌకర్యం కల్పించారు. ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు, టీచర్లకు సరిపడా బెంచీలు, అల్మారాలు ఇతర ఫర్నిచర్‌ను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకే... ఈ నెల 16వ తేదీన ప్రభుత్వ స్కూళ్లను పునః ప్రారంభిస్తున్న నేపథ్యంలో బడికి వెళ్లటానికి మారాం చేసిన పిల్లలు సైతం ఎప్పుడు స్కూలు తెరుస్తారా అని ఎదురు చూస్తున్న పరిస్థితులున్నాయనటం అతిశయోక్తేమీ కాదు. పిల్లలు స్కూలు ఆవరణలోకి రాగానే వారికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా రాజ మార్గాలు ఏర్పాటు చేశారు. దూరం నుంచి చూడగానే ప్రతి వారికి కనిపించేలా ఆ స్కూలు పేరుతో కూడిన పెద్దపెద్ద బోర్డులను ప్రవేశ ద్వారం ముందు ఏర్పాటు చేయించారు. తరగతి గదుల్లోనే కాకుండా స్కూలు బయట ఆవరణలో కూడా పిల్లలకు ఉపయోగపడేలా వారి పాఠాలను వారి కళ్ల ముందుంచేలా పలు బొమ్మలను, చిత్రాలను గోడలపై వేయించారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురం మండలపరిషత్ ప్రాథమిక పాఠశాల గ్రామంలో చదువులపై నాకంత నమ్మకం ఉండేది కాదు. ఆర్థికంగా భారమైనప్పటికీ బిడ్డల చదువు కోసం నగరాన్ని ఎంచుకున్నా. విజయవాడలో పనులు చేసుకుంటూ అద్దె ఇంట్లో ఉండేవాడిని. నా కొడుకు అశిత్ జైకర్ను అక్కడ ఓ ప్రైవేట్ స్కూలులో చేర్చాను. కొద్దిరోజుల క్రితం సొంతూరు వచ్చినపుడు ఇక్కడి ఎంపీపీఎస్ స్కూలు చూసి నమ్మలేకపోయాను. ప్రహరీ పడిపోయి, వర్షాలకు నీరు నిలుస్తూ, వెలిసిపోయిన గోడలతో కనిపించే స్కూలు స్థానంలో అందమైన భవనం దర్శనమిచ్చింది. లోపలకు వెళ్లి చూస్తే టైల్స్, చక్కటి తరగతి గదులు, వాల్ పెయింటింగ్స్, నీతివాక్యాలు, చాలా బాగుంది. వెంటనే నగరం నుంచి వెనక్కు వచ్చేసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించా. -అశోక్, విద్యార్థి తండ్రి, వల్లభాపురం, కొల్లిపర మండలం ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్ నగరపాలక బాలికోన్నత పాఠశాల 96 సంవత్సరాల చరిత్ర ఉన్న పీవీఆర్ బాలికోన్నత పాఠశాలకు నాడు–నేడుతో మహర్దశ పట్టింది. ఇక అడ్మిషన్లు లేవు అని బోర్డు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో చిన్న వర్షం కురిసినా పాఠశాల ప్రాంగణంలోకి వర్షపునీరు వచ్చేది. గేటు ఎప్పుడు ఊడిపైన పడుతుందో అనే భయం ఉండేది. ఉపాధ్యాయులకు సైతం అరకొర కుర్చీలే గతి. ఇప్పుడు రూ.61 లక్షలతో కార్పొరేట్ పాఠశాలలను సైతం తలదన్నేలా మారింది. ఫ్యాన్లు, ట్యూబులైట్లు, గ్రీన్‌చాక్‌బోర్డులు, డ్యూయెల్ డెస్స్‌లు వెలిశాయి. వరండాలో సైతం ఫ్యాన్లు బిగించారు. -బంకా ప్రసన్న లక్ష్మి, హెచ్ఎం, పీవీఆర్ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడిగా నా సర్వీసులోనే కాదు విద్యాశాఖ సర్వీసులోనే పాఠశాలలకు ఇన్ని నిధులు సమకూర్చి అభివృద్ది చేసిన ధాఖలాలు ఎప్పుడూ లేవు. పట్టణంలో బీవీఆర్‌ఎం పాఠశాల అంటే ఎంతో పేరుంది. ఇన్నాళ్లూ అసౌకర్యాల మధ్య చదువు కొనసాగింది. ఇప్పుడా పరిస్థితి లేదు. నాడు–నేడులో భాగంగా మా పాఠశాలకు రూ.61.43 లక్షలు ఇచ్చారు. ప్రతి గదికి ఐదు ప్యాన్లు, నాలుగు ట్యూబ్‌లైట్లు, బెంచీలు, సందేశాత్మక చిత్రాలు, సూక్తులు, ఆకర్షణీయమైన ముఖద్వారం.. ఇలా ఎంతగానో తీర్చిదిద్దారు. 350 మంది విద్యార్థినులు ఉన్న ఈ పాఠశాలలో ఆ సంఖ్య ప్రస్తుతం 670 మందికి చేరింది. హౌస్‌ఫుల్ బోర్డు పెట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. – వై.ప్రభాకరశాస్త్రి, హెచ్ఎం, బీవీఆర్‌ఎం బాలికల హైస్కూల్ -
Nadu- Nedu: మా స్కూల్ మారింది చూద్దాం రండి!
ఇది ఎల్.కోట ఎంపీపీ స్కూలు విజయనగరం జిల్లా లక్కవరపు కోటలోనిది.. అదీ ఊరికి మధ్యలో ఉంది. ప్రహరీ లేకపోవటంతో పందులు, కుక్కలు, పశువులు ఆవరణలోకి వచ్చేసేవి. రాత్రిళ్లు తాగుబోతులు, తిరుగుబోతులకది అడ్డా!. ఇక్కడి హెచ్ఎం సింహాద్రి సత్యవతి మాటల్లో చెప్పాలంటే... ‘‘ఉదయం రాగానే మేం చేసే మొదటిపని చెత్త, మద్యం సీసాలు ఎత్తేయించడం, పందులు, కుక్కలు పాడుచేస్తే కడిగించటం. దానికే సగం సమయం పోయేది. కానీ ‘నాడు–నేడు పుణ్యమాని రూ.17 లక్షల నిధులతో బడి రూపురేఖలు మార్చారు. రంగుల తోరణంలాంటి ప్రహరీ వచ్చింది. సౌకర్యాలూ వచ్చాయి. ఉన్న 72 మంది పిల్లలకు తోడు మరింత మంది చేరుతున్నారు. పిల్లలు బాగుపడే రోజులొచ్చాయి.’’ స్కూళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతి స్కూలూ.. ప్రతి విద్యార్థీ.. టీచర్లూ ఇదే విధంగా తమ బడి వైభవాన్ని కళ్లకు కడుతున్నారు. వాటిని క్షేత్రస్థాయి నుంచి మీకు వివరిస్తోంది సాక్షి.. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని వెంకటేశ్వరపురం ప్రైమరీ స్కూలుదీ ఇలాంటి కథే. ఆవరణ మొత్తం రాళ్లు రప్పలతో నిండి, చదువుకునే వాతావరణమే కనిపించేది కాదు. ఈ స్కూలు బాగోలేదని రెండేళ్ల కిందట చాలా మంది పిల్లలు చుట్టుపక్కలున్న ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోయారు. అలాగని ఆ ప్రైవేటు స్కూళ్లేమీ అద్భుతంగా ఉన్నాయనుకోవద్దు. కానీ గత్యంతరం లేక చేరారంతే. ‘‘నాడు–నేడుతో మా పాఠశాల రూపమే మారిపోయింది. ప్రైవేటు స్కూళ్ల నుంచి ఎంతో మంది వచ్చి, ఇక్కడ చేరారు’’ అంటూ సంతోషం వ్యక్తంచేశారు ఇక్కడిఉపాధ్యాయురాలు కవితాబాయి. ఇవే కాదు. తొలివిడత నాడు–నేడు అభివృద్ధిని చూసిన ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఇపుడిదే సందడి. చదువు విలువ తెలియనిదెవ్వరికి? విలువ తెలుసు కనకే.. మంచి చదువు, నాలుగింగ్లీషు ముక్కల కోసం నిరుపేదలూ వీధి చివరి కాన్వెంట్లకు వెళ్లారు. తలకు మించిన అప్పులూ చేశారు. ‘విలువ’ తెలుసు కనకే..శ్రీమంతులు దీన్ని వ్యాపారం చేశారు. సామ్రాజ్యాలు నిర్మించారు. ‘విలువ’ తెలుసు కనకే గత ప్రభుత్వాలు వీరికి సాగిలపడ్డాయి. ఫలితం... అక్కడక్కడా అప్పుడప్పుడు మెరిసిన నక్షత్రాలు తప్పితే...అందరికీ నాణ్యమైన చదువనేది ఇప్పటికీ అందనిదే!!. చెట్లకింద క్లాసులు... బల్లలు కాదు కదా! బోర్డులూ లేని తరగతులు... ఎండకు, వర్షానికి పనికిరాని భవనాలు... ఆనవాళ్లు లేని ప్రహరీలు... బాత్రూమ్కైనా, మంచినీళ్లకైనా ఇంటికి పరుగెత్తే పిల్లలు.. సంఖ్యకు తగ్గట్టుగా లేని టీచర్లు... కాన్వెంట్లో తప్ప ఇంగ్లిష్ దొరకని సిలబస్!!. చెప్పాలంటే ప్రభుత్వ స్కూళ్లు ఎదుర్కొన్న సమస్యల్లో ఇవి కొన్నే. వీటిని పరిష్కరించే చిత్తశుద్ధి మాత్రం గత ప్రభుత్వాలు చేస్తే ఒట్టు!!. ‘చదువు విలువ తెలిసిన వాడిగా చెబుతున్నా’ అనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారం చేపడుతూనే స్కూళ్లపై దృష్టిపెట్టారు. ‘నాడు–నేడు’ పేరిట ప్రతి స్కూలునూ మార్చే బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఇంగ్లిష్ మీడియాన్ని అందుబాటులోకి తేవటమే కాదు... ‘అమ్మ ఒడి’ పేరిట చదువుకునే పిల్లలున్న తల్లులకూ ఆర్థిక ఆసరా కల్పించారు. బళ్లు మొదలైనరోజే పుస్తకాలు, యూనిఫారాలతో సహా మొత్తం కిట్లను ‘జగనన్న విద్యాకానుక’గా అందజేస్తున్నారు. నిజానికి వేరొక ప్రభుత్వంలో అయితే... ఇలాంటివన్నీ వాగ్దానాలు, భవిష్యత్తులో చేస్తారన్న ఆశలుగానే ఉండేవి. అలాగే మిగిలిపోయేవి కూడా!!. కానీ సీఎం జగన్ మాటలకన్నా... చేతలనే నమ్ముతారు. కాబట్టే చేసి చూపించారు. అందుకే తొలివిడతగా రాష్ట్రంలో ఇపుడు 15,715 స్కూళ్లు తమ రూపాన్ని మార్చుకున్నాయి. ఏకంగా రూ.3,900 కోట్లతో... సమగ్ర మౌలిక సదుపాయాలతో, అందంగా ముస్తాబయ్యాయి. పిల్లల్ని రారమ్మంటున్నాయి. ఈ నెల 16న తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇపుడు ప్రతి స్కూలూ... ప్రతి విద్యార్థీ... తల్లిదండ్రులూ... టీచర్లూ ఓ కథ చెబుతున్నారు. తమ బడి వర్తమాన వైభవాన్ని కళ్లకు కడుతున్నారు. ఆ కథలను క్షేత్ర స్థాయి నుంచి మీకు వివరిస్తోంది ‘సాక్షి’. - సాక్షి, అమరావతి / సాక్షి నెట్వర్క్ మంచి చదువులకు మార్గం సుగమం వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యతగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి పరిచే బాధ్యత తీసుకుంది. గతంలో స్కూళ్లల్లోని పరిస్థితిని ఫొటోలు తీయించి అవే స్కూళ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అలా విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించేందుకు వీలుగా... రాష్ట్రంలో 45 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లను ‘మనబడి నాడు–నేడు’ జాబితాలో చేర్చింది. దాదాపు రూ.16 వేల కోట్లు ఖర్చయ్యే ఈ కార్యక్రమంలో తొలివిడతగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఎంపిక చేసింది. ఎల్.కోట ఎంపీపీ స్కూలు- లక్కవరపు కోట, విజయనగరం జిల్లా. వాటిలో తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి రూ.3,900 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టి దాదాపు పూర్తి చేయించింది. ఈనెల 16న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ స్కూళ్లను రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తూ విద్యార్థులకు అందుబాటులోకి తేనున్నారు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన దాఖలాలు వేరెక్కడా లేవన్నది విద్యా రంగ ప్రముఖుల మాట. విద్యా వ్యవస్థను బలోపేతం చేసి, పేదలకు అత్యుత్తమ చదువులను అందుబాటులోకి తేవాలన్న సీఎం జగన్ సంకల్ప యజ్ఞంలో తొలి ఘట్టం దిగ్విజయంగా పూర్తయింది. ప్రతి స్కూలుకూ ప్రహరీ ►ఒకప్పుడు స్కూలుకు ప్రహరీ అనేది ఉండేది కాదు. ఇప్పుడు ప్రతీ స్కూలుకు ప్రహరీ నిర్మించడమే కాకుండా ఆవరణలో అందమైన మొక్కల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా శ్రద్ధ తీసుకున్నారు. ►విద్యార్థి స్కూలులో అడుగు పెట్టగానే అక్కడి వాతావరణం చూసి పూర్తి స్థాయిలో చదువుపై దృష్టి పెట్టేలా అద్భుతమైన వసతులు కల్పించింది. గతంలో స్కూల్ భవనాలు ఎప్పుడు పడిపోతాయో అన్నట్లుగా శిథిలావస్థలో ఉండేవి. ఇప్పుడు వాటిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించింది. ►చిన్న చిన్న పనులతోపాటు పెద్ద పనులు కూడా పూర్తి చేయించి పాఠశాల రూపురేఖలను పూర్తి స్థాయిలో మార్చి వేసింది. పిల్లల సంఖ్యకు అనుగుణంగా ప్రతి స్కూల్లోనూ అదనపు తరగతి గదులను నిర్మించింది. ►ముఖ్యంగా పిల్లలను ఆకర్షించే రీతిలో పాఠశాలలకు ఆహ్లాదకరమైన రంగులను వేయించింది. ఈ రంగుల కోసం దాదాపు రూ.412 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటికే 14,500 స్కూళ్లలో రంగుల కార్యక్రమం పూర్తయింది. కృష్ణా జిల్లా కోట కలిదిండి ఉర్దూ పాఠశాల మా ఇద్దరు పిల్లలను కోట కలిదిండి ఉర్దూ పాఠశాలలో చదివిస్తున్నాను. గతంలో ఈ పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో పశువులు, మేకలు తిరిగేవి. ఉదయం స్కూల్‌కు వెళ్లగానే వాసన వచ్చేది. వాటిని తప్పించుకుంటూ లోపలికి వెళ్లాల్సిన దుస్థితి. నాడు–నేడు పథకం కింద ఇప్పుడు ఈ పాఠశాలను పూర్తిగా మార్చేశారు. రూ.18.18 లక్షలతో కొత్తగా ప్రహరీ, ఇతర వసతులు కల్పించారు. ఎంతో కష్టపడి ఇన్నాళ్లు పేద తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో వేసేవారు. ఇప్పుడా బాధలు తప్పాయి. ప్రభుత్వ స్కూళ్లు అన్ని వసతులతో చక్కగా ఉన్నాయి. పిల్లల చదువు గురించి ఇక దిగుల్లేదు. -ఎండీ. జరీనా, విద్యార్థుల తల్లి, కోట కలిదిండి, కృష్ణా జిల్లా ప్రకాశం జిల్లా వీకే నగర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నేను ఇప్పుడు 4వ తరగతిలోకి వెళ్తున్నా. ఇదివరకు మూడేళ్లు బడికి వెళ్లి మట్టిలోనే ఆడుకునేదాన్ని. కాంపౌండ్ లేకపోవడంతో పరిసరాల్లో వెళ్తున్న వారిని చూస్తూండటంతోనే సమయం గడిచిపోయేది. బాత్రూం కోసం, నీళ్లు తాగడం కోసం తరచూ ఇంటికి పోయేదాన్ని. తిరిగి ఒక్కోసారి బడికి రాబుద్దయ్యేది కాదు. బట్టల నిండా మట్టి అంటుకోవడం వలన అమ్మ చీవాట్లు పెట్టేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మా బడి ఇప్పుడు భలేగా తయారైంది. బడి ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తున్నా. మంచి మంచి బొమ్మలతో కాంపౌండ్ వాల్, లోపల మంచి బండలు వేయించారు. అంతా బాగుంది. -ఎం.నివంతి, వీకే నగర్ ఎంపీపీ పాఠశాల, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం తాళ్లూరు ప్రాథమికోన్నత పాఠశాల రోజూ భయపడేవాళ్లం మాపాప చందన శ్రీని చేర్పించేటప్పుడు ఈ పాఠశాల పరిస్థితి అస్సలు బాగోలేదు. భయపడుతూనే చేర్పించా. ప్రహరీ లేకపోవడం, వెనుకవైపునే చెరువు, బావి ఉండటంతో బిక్కుబిక్కుమంటూ పాపను బడికి పంపాల్సి వచ్చేది. ఇలాగైతే పిల్లలు ప్రమాదాల బారిన పడతారని నిత్యం తల్లిదండ్రులం అనుకుంటుండేవాళ్లం. ప్రస్తుతం నాడు–నేడు కింద ప్రహరీ కట్టడంతో పాటు స్కూల్లో వసతులన్నీ కల్పించారు. గవర్నమెంట్ బడికి కూడా ఇలాంటి రోజులు వస్తాయని అస్సలు అనుకోలేదు. – కె.లక్ష్మీప్రసన్న, విద్యార్థిని తల్లి, తాళ్లూరు, బిట్రగుంట మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా -
సర్కారీ స్కూళ్లు.. సరికొత్తగా!
మంత్రివర్గ ఉప సంఘం సూచనలివీ.. స్కూళ్లకు పక్కా భవనాలు, అవసరమైన చోట అదనపు తరగతి గదులను నిర్మించాలి. వివిధ పద్ధతుల ద్వారా నిధులను సమీకరించాలి. సమగ్ర శిక్షా అభియాన్ పథకం కింద కేంద్రం నుంచి కొంత మేరకు నిధులు వస్తాయి. సర్కారీ స్కూళ్లను అభివృద్ధి చేస్తే ప్రైవేటు పాఠశాలలకు కొంతైనా పోటీ ఇవ్వొచ్చు. రానున్న రోజుల్లో అదనంగా 10 లక్షల మంది విద్యార్థులు చేరొచ్చని అంచనా. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లను విడతల వారీగా అభివృద్ధి చేయాలని విద్యాశాఖపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సు చేసింది. మూడేళ్లలో అన్ని స్కూళ్లను అభివృద్ధి చేయాలని పేర్కొంది. మొత్తం 27 వేల స్కూళ్లలో, తొలుత ఈ ఏడాది 9 వేల స్కూళ్లను అభివృద్ధి చేయాలని, అందులో కొన్నింటికి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించింది. అందుకోసం ఈ ఏడాది రూ.2వేల కోట్ల మేరకు ఖర్చు చేయా లని సిఫార్సు చేసింది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సర్కారుకు నివేదిక సమర్పించింది. మొత్తం అన్ని స్కూళ్ల అభివృ ద్ధికి రూ.6 వేల నుంచి రూ.7 వేల కోట్లు అవస రమవుతాయని అంచనా వేసింది. మూడేళ్లలో ఈ నిధులు ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో మాదిరిగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. నిపుణులు, విద్యాశాఖ అధికారులతో పలుమార్లు చర్చించిన అనంతరం ఈ నివేదికను తయారు చేసింది. అలాగే అధికారుల బృందం ఏపీలోని నాడు నేడు పథకం స్కూళ్లతో పాటు ఢిల్లీలోని స్కూళ్లనూ పరిశీలించింది. రాష్ట్రంలో అనేక స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలు లేవని మంత్రివర్గ ఉపసంఘం నిర్ధారణకు వచ్చింది. గదులు లేకపోవడం, పాత భవనాలు కావడంతో పెచ్చులూడి పోవడం, ప్రహారీ గోడలు లేకపోవ డంతో పశువులు, ఇతర జంతువులు సంచరించడం, విద్యుత్ కనెక్షన్లు లేకపోవడం, కొన్నిచోట్ల ఫ్యాన్లు లేక విద్యార్థులు యాతనలు పడుతున్నారు. గోడలకు పెయింటింగ్ వేయకపోవడంతో అనేక స్కూళ్లు బూజు పట్టి దర్శనమిస్తున్నాయి. బల్లలు, కుర్చీలు లేక విద్యా ర్థులు, టీచర్లు కూర్చోవడానికి వీలు లేకుండా పోతుంది. మరుగుదొడ్లు, తాగునీటి కనెక్షన్లు లేక పోవడాన్ని కూడా మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పాఠశాలల అభివృద్ధికి మంత్రివర్గ ఉప సంఘం పలు సూచనలు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు నిధులు సమకూర్చి ఈ ఏడాది నుంచే పనులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. నివేదిక అనంతరం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని విద్యాశాఖ వర్గాలు వేచి చూస్తున్నాయి. తొలి ఏడాది అత్యధిక విద్యార్థు లున్న స్కూళ్లను ఎంపికచేస్తారని, ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా దీన్నే ప్రామాణికంగా తీసుకుంటామని ఒక ఉన్నతాధి కారి తెలిపారు. రెండో ఏడాది కూడా ఇదే పద్ధతి ప్రకారం ఎంపిక చేస్తారన్నారు. -
స్కూళ్లకు విద్యుత్ మీటర్ల షాక్..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ మీటర్ల షాక్ తగిలింది. గతేడాది నుంచి బిగిస్తున్న ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లకు అయ్యే ఖర్చు చెల్లించాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక ప్రధానో పాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. అసలు పాఠశాలల విద్యుత్ చార్జీలు చెల్లించేందుకే పాఠశాల విద్యా శాఖ సరిగ్గా డబ్బులు ఇవ్వట్లేదని ఆందోళన చెందు తుంటే.. ఇప్పుడేమో విద్యుత్ మీటర్ల చార్జీలు చెల్లించాలంటే ఆదేశిస్తే.. ఏం చేయాలంటూ డీఈవోలకు ప్రధానో పాధ్యాయులు మొర పెట్టుకుంటున్నారు. సింగిల్ ఫేజ్ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ ఒక్కో దానికి రూ.8,687 చెల్లించాలని ఆదేశిం చింది. రాష్ట్రంలోని 30,601 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ మీటర్ల ఖర్చు కిందే రూ.26.50 కోట్లకు పైగా వెచ్చించాల్సి వస్తోంది. దీంతో ఏం చేయాలన్న విషయంలో విద్యా శాఖ ఉన్నతాధికారులు కూడా తలలు పట్టుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో ప్రీపెయిడ్ మీట ర్లను బిగిస్తున్నామని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. అందులో భాగంగానే కొన్ని పాఠశాలల్లో మీటర్లు బిగించించామని, మిగతా పాఠశాలల్లోనూ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు బిగిస్తున్నామని స్పష్టం చేసింది. వాటికయ్యే ఖర్చును ప్రధానోపాధ్యా యులు/ సంబంధిత అధికారులు చెల్లించాలని పాఠశాలలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న నెల రోజుల్లోగా ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆయా నోటీసుల్లో స్పష్టం చేసింది. లేదంటే ఆ తర్వాత మూడు నెలల విద్యుత్ బిల్లులో ఆ మొత్తాన్ని వేసి వసూలు చేస్తామని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం పాత మీటర్లతో వినియోగించిన విద్యుత్ చార్జీలనే మంజూరు చేయడంలో విద్యా శాఖ జాప్యం చేస్తోందని, ఇప్పుడు కొత్త మీటర్లకు డబ్బులు ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి, ఆ మొత్తాన్ని మంజూరు చేయాలని ప్రధానో పాధ్యాయులు కోరుతున్నారు. 8,687 ఒక్కో సింగిల్ ఫేజ్ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు (రూ.లలో) 26.50రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు (రూ. కోట్లలో) -
చదివింది ఎనిమిదే.. కానీ ప్రభుత్వ పాఠశాలలో టీచర్!
భోపాల్: ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివి ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడో వ్యక్తి. అంతే కాదు నెలకు అక్షరాలా రూ. 4 వేల జీతం కూడా పొందుతున్నాడు. కానీ ఆ వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాదు. మరి ఎలా టీచర్ ఉద్యోగం చేస్తున్నాడనుకుంటున్నారా..! వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్ ఖర్గోనే జిల్లాలోని దేవ్లీ ఏరియాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో రామేశ్వర్ రావత్, జబ్బర్ సింగ్ అనే ఇద్దరు ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. (కలెక్టర్‌ని జుట్టుపట్టి లాగాడు.. చెంప పగలగొట్టింది) వీరు గత కొద్ది రోజులగా విధులకు హాజరు కావడం లేదు. దీంతో పాఠశాలలో ఉన్న 23 మంది పిల్లలకు పాఠాలు చెప్పేందుకు 8వ తరగతి వరకు చదువుకుని ఖాళీగా ఉన్న దయాల్ సింగ్ అనే వ్యక్తిని టీచర్‌గా నియమించుకున్నారు. నెలకు రూ. 4 వేలు జీతం కూడా ఇస్తున్నారు. పదిహేను రోజులకో సారి వచ్చి ఆ ఇద్దరు టీచర్లు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసి పోతున్నారు. అయితే ఆకస్మాత్తుగా ఆ పాఠశాలను జిల్లా డిప్యూటీ కలెక్టర్ రాహుల్ చౌహన్ గురువారం సందర్శించారు. సమయానికి ఆ ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడంతో అసలు విషయం వెలుగు చూసింది. దయాల్ సింగ్‌పై డిప్యూటీ కలెక్టర్ ప్రశ్నల వర్షం కురిపించగా అతడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. దీంతో పరిస్థితి అర్థం చేసుకున్న డిప్యూటీ కలెక్టర్ రామేశ్వర్ రావత్, జబ్బర్ సింగ్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక ఆ ఇద్దరి ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. (పాఠశాల పిల్లగాడా.. పశులుగాసే పోరగాడా..) -
పాఠశాలల్లో ‘పబ్లిక్ సేఫ్టీ క్లబ్బులు’
సాక్షి, హైదరాబాద్: నేటి బాలలే రేపటి పౌరులు.. వారికి నేడు కల్పించే అవగాహన జీవితాంతం గుర్తుండిపోతుంది. అందుకే, అన్ని రకాల భద్రతపై వారికి అవగాహన వచ్చేలా వినూత్న కార్యక్రమానికి తెలంగాణ పోలీసులు శ్రీకారం చుట్టారు. అందుకే, పాఠశాల విద్యార్థులకు ‘భద్రత’పై అవగాహన కల్పించడం, ప్రతీ పాఠశాలలో విద్యార్థులతో కొన్ని క్లబ్బులు నిర్వహించడం, భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారిచేతే వివరింపజేయడం, వారి నుంచి వచ్చే వినూత్న సలహాలు, సూచనలు తీసుకోవడం.. ఇదీ తెలంగాణ పోలీసుల సరికొత్త కార్యాచరణ. చికిత్స కంటే నివారణ మేలు అన్న నినాదంతో తెలంగాణ పోలీసులు ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. రోజుకోరకం కొత్త కేసులు వెలుగు చూస్తోన్న నేపథ్యంలో నేరాలు, భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న ప్రధాన లక్ష్యంతో ఈ విధానం అమలుకు సంకల్పించారు. తమిళనాడు స్ఫూర్తిగా.. వాస్తవానికి ఇలాంటి విధానం అమలు ఇదే తొలిసారి కాదు. తమిళనాడు పోలీసులు దీన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ‘నేరాలు– భద్రత’పై వారు చేపట్టిన ప్రతీ అవగాహన కార్యక్రమం అక్కడ సత్ఫలితాలు ఇచ్చాయి. దీంతో తెలంగాణ పోలీసులు గతేడాదే దీనిపై అధ్యయనం చేశారు. అందులో పలు అంశాలకు డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. అనంతరం కొత్త సంవత్సరం నుంచి మన రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులతో కూడిన గ్రూపులను ఏర్పాటు చేస్తారు. వీరికి రోడ్డుభద్రత (డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్ వినియోగం, సీటుబెల్టు), మహిళా భద్రత, మానవ అక్రమరవాణా, చిన్నారుల భద్రత, వేధింపులు, డయల్ 100, షీటీమ్స్, హాక్ ఐ అంశాలలో వీరికి తొలుత శిక్షణ ఇస్తారు. తరువాత వీరు తోటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆయా అంశాలపై అవగాహన కల్పిస్తారు. వీరి నుంచి వచ్చే సృజనాత్మక ఆలోచనలనూ పోలీసులు స్వీకరించి ఇతరప్రాంతాల్లోనూ అమలుచేస్తారు. ఆపద ఎదురైతే.. ఎలా వ్యవహరించాలి? ఎవరిని సంప్రదించాలి? పోలీసులకు ఎలా సమాచారం ఇవ్వాలి? అన్నది ఈ ప్రచారం ప్రధాన లక్ష్యం. ప్రతీ ఠాణాలోనూ విధుల విభజన.. ఈ అవగాహన కార్యాక్రమాలను విజయవంతంగా అమలు చేసేందుకు ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి దాకా విధుల విభజన జరిగింది. రోడ్డుభద్రత, మహిళా భద్రత, మానవ అక్రమరవాణా, చిన్నారుల భద్రత, డయల్ 100, షీటీమ్స్, హాక్–ఐ అంశాలలో అవగాహన కార్యక్రమాలు ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరుగుతాయి. ప్రతీ పోలీస్స్టేషన్లోనూ సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ దాకా అందరికీ ఒక్కోఅంశాన్ని అప్పగించారు. వారు తమకు అప్పగించిన ప్రచార, అవగాహన కార్యక్రమాలను అమలు చేయాలి. వీటితోపాటు కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ‘ఈచ్‌వన్ –టీచ్‌వన్’కార్యక్రమం కూడా పోలీసులు స్వీకరించారు. వీరు స్థానిక యువత, స్వచ్ఛంద సంస్థ, మహిళాసంఘాల సాయంతో భద్రత, ఈచ్‌వన్–టీచ్‌వన్‌పై ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వీటి పురోగతిని ఠాణా పరిధిలో ఎప్పటికపుడు పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. -
ఫోన్లో పాఠాలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): చదువులో వెనకబడిన విద్యార్థులకు త్వరలోనే ఫోన్ ద్వారా ప్రత్యేక బోధన అందించనున్నారు. ఇప్పటివరకు ప్రత్యేక శిక్షకుల ఆధ్వర్యంలో మాత్రమే ట్యూషన్లు చెప్పేవారు. కానీ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా టెలీ టీచర్స్ ఆధ్వర్యంలో ఫోన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక బోధన అందించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పేద, మధ్య తరగతి, గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యనభ్యసిస్తుంటారు. దీంతో వారు తరగతి గదుల్లో మాత్రమే విద్య నేర్చుకున్నారు. వసతి గృహాల్లో ట్యూటర్ ఉండటంతో అక్కడి విద్యార్థుల సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోగలుగుతారు. కానీ అనేక మంది విద్యార్థులు బిడియం, మొహమాటం కారణంగా తరగతి గదుల్లో తమ సందేహాలను ఉపాధ్యాయులు, ట్యూటర్లను అడగలేకపోతున్నారు. సందేహాలు అడిగితే ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఏమనుకుంటారోనన్న ఆలోచనతో అనేకమంది విద్యార్థులు తమ సందేహాలను అడగకుండా చదువులో వెనుకబడి పోతున్నారు. అయితే టెలీ టీచర్స్ ద్వారా తమకు వచ్చిన సందేహాలను ఫోన్ ద్వారా అడగొచ్చు కాబట్టి విద్యార్థులకు భయం ఉండదనే ఆలోచనతో రాష్ట్ర విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. రిటైర్డ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు ఖాళీ సమయాల్లో బోధించే ఆసక్తి ఉన్నవారి ద్వారా ఈ టెలీ ట్యూషన్లు నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. టెలీ టీచర్స్ పద్ధతి ప్రస్తుతం మహరాçష్ట్రలో అమల్లో ఉంది. ప్రత్యేక సమయం.. ఈ టెలీ ట్యూషన్‌కు సాయంత్రం ప్రత్యేకంగా సమయం కేటాయించడం ద్వారా అటు ట్యూటర్ (టెలీటీచర్స్)కు, ఇటు విద్యార్థులకు లాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. దీంతో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పాఠశాల విద్యార్థులకు సబ్జెక్ట్‌లకు సంబంధించిన టెలీ ట్యూటర్ ఫోన్ నంబర్‌ను ఇవ్వడం ద్వారా విద్యార్థులు వారికి కేటాయించిన సమయంలో ఫోన్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకునే వీలు కలుగుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. టెలీటీచర్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు అధికంగా లబ్ధి చేకూరుతుంది. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు దోహదం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు త్వరలోనే టెలీ ట్యూషన్ అందుబాటులోకి తెస్తాం. ఇందుకోసం కసరత్తు చేస్తున్నాం. భయపడే, మొహమాటపడే విద్యార్థులు పరోక్షంగా తమ పాఠ్యాంశంలోని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వెనుకబడిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంది. – విద్యా శాఖ పిన్సిపల్ సెక్రటరీ జనార్దన్‌రెడ్డి -
ఇంగ్లిష్ మీడియంపై ఎవరూ మాట్లాడొద్దు..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇంగ్లిష్ మీడియంపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో తాజా పరిణామాలపై చర్చించారు. ఇంగ్లిష్ మీడియం విషయంలో టీడీపీ వైఖరిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, దాన్ని అడ్డుకుంటున్నామనే భావన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఏర్పడిందని.. కాబట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంగ్లిష్ మీడియం బోధనకు టీడీపీ వ్యతిరేకం కాదని, దానిని ప్రవేశపెట్టింది టీడీపీయేనని ప్రచారం చేయాలని సూచించారు. -
‘ఇంగ్లిష్’తో బాలలకు బంగారు భవిత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలన్న నిర్ణయంతో సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధన దిశగా ప్రభుత్వం పెద్ద ముందడుగు వేసిందని పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ రెడ్డి కాంతారావు పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి వర్గాల బాలల బంగారు భవితకు ప్రభుత్వం బాటలు వేసిందన్నారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థలు విద్యా వ్యవస్థను హైజాక్ చేశాయని కుండబద్దలు కొట్టారు. ఈ పరిస్థితిని మార్చి విద్యా వ్యవస్థను పరిరక్షించడానికి ప్రభుత్వ చర్య దోహదపడుతుందన్నారు. ఇంగ్లిష్ మీడియంతో తెలుగు భాష ఉనికికి, ప్రాభవానికి ఎలాంటి ముప్పూ లేదని తేల్చిచెప్పారు. తెలుగు ఒక తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుందన్నారు. విద్యార్థులు ఇతర సబ్జెక్టులను మాత్రమే ఇంగ్లిష్‌లో నేర్చుకుంటారన్నారు. వివిధ అంశాల గురించి ఇంకా ఆయన ఏమన్నారంటే.. పోటీ ప్రపంచంలో మెరుగైన అవకాశాలు.. ఇంగ్లిష్ మీడియం కోసమే మధ్యతరగతి వర్గాలు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాల్లో చేరుస్తూ తలకు మించిన ఆర్థికభారాన్ని భరిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు నైపుణ్యాల సాధనలో వెనుకంజలో ఉంటున్నారు. ఇంగ్లిష్ మీడియం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరితే వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గిపోతుంది. అంతేకాకుండా పోటీ ప్రపంచంలో పేద, మధ్యతరగతి విద్యార్థులు కూడా బాగా> రాణించి మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. దాంతో రాష్ట్రంలో సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుంది. విద్యావేత్తలు, నిపుణులతో చర్చించే నిర్ణయం ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని విద్యావేత్తలు, నిపుణులు, సామాజికవేత్తలతో చర్చించాకే తీసుకుంది. వాస్తవానికి.. ఇంజనీరింగ్, మెడికల్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల విద్యాభ్యాసం అంతా ఇంగ్లిష్‌లోనే ఉంటోంది. పాఠశాల విద్యాభ్యాసం తెలుగులో చేసినా ఉన్నత విద్య ఇంగ్లిష్‌లో చదవాల్సి రావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే పాఠశాల విద్య నుంచే ఇంగ్లిష్ మీడియంలో చదివితే సమస్యలు ఉండవు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ నిర్ణయాన్ని సంపూర్ణంగా సమర్థిస్తున్నారు. అంతిమంగా తల్లిదండ్రుల అభిప్రాయాన్నే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం సాధ్యమా అని సందేహించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు పూర్తి అర్హత, తగిన శిక్షణ ఉంది. ఇంగ్లిష్ మీడియంలో బోధన కోసం అదనపు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్రైవేటు పాఠశాలల్లో నైపుణ్యం ఉన్న అధ్యాపకులు ఎక్కడున్నారు? ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గిపోతుండటంతో పాఠశాలలు మూసేయాల్సి వస్తోంది. ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరుగుతాయి. తద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమవుతుంది. -
ఆంగ్ల మీడియానికి జనామోదం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయం అతి పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని సామాన్య ప్రజానీకం, విద్యార్థుల తల్లిదండ్రులు, మెజార్టీ విద్యావేత్తలు, సామాజికవేత్తలు సంపూర్ణంగా సమర్థిస్తున్నారు. ఒక్క చోట కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకపోవడం ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజామోదానికి నిదర్శనం. పేద, మధ్య తరగతి విద్యార్థుల భవితకు బంగారు బాట వేసే ఈ నిర్ణయాన్ని కూడా ప్రతిపక్ష టీడీపీ, జనసేన ఆనవాయితీగా విమర్శించడం విస్మయపరిచింది. నాలుగేళ్లలో అన్ని తరగతుల్లో బోధన.. వర్తమాన పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు కమ్యూనికేషన్ స్కిల్స్, నైపుణ్యాలు పెంపొందించుకోవడం ఏకైక మార్గమన్నది నిర్వివాదాంశం. తెలుగు మీడియం విద్యార్థులు ఈ అంశంలో వెనుకబడుతుండటం వల్ల నష్టపోవాల్సి వస్తోంది. ఆధునిక విజ్ఞానం అంతా ఇంగ్లిష్‌లోనే అందుబాటులో ఉంది. ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన అమలు చేస్తారు. నాలుగేళ్లలో అన్ని తరగతులు పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో బోధించేలా చర్యలు చేపడతారు. ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ మీడియంలో బోధనపై తగిన శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే తెలుగు లేదా ఉర్దూ తప్పనిసరి సబ్జెక్టుగా కొనసాగుతాయని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. తెలుగు భాష అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించింది. -
అక్షరం వస్తే ఒట్టు!
సాక్షి, మహబూబ్‌నగర్: సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాల గురించి ఇటీవలే చేదు నిజాలు బయటపడ్డాయి. కనీసం చదవడం, రాయడం, ఎక్కాలు కూడా రాని స్థితిలో ఉన్నారని తేలింది. ఈ విషయం తెలిసి ఉన్నతాధికారులు ఆశ్చర్యపోతుండగా చదవు చెప్పిన ఉపాధ్యాయులు ఏం చేద్దామని ఆందోళనలో పడ్డారు. సర్వేలోని నిజాలివే.. విద్యార్థుల కనీస సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వం జూలై నుంచి ఏబీసీ పేర వివరాల సేకరణ చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కనీస సామర్థ్యాలు చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియలు చేయడం వంటి అంశాలు ఎంతమేర వస్తాయన్న విషయాన్ని తెలుసుకోవాలని ప్రభుత్వం గత నెల రెండో వారంలో ఈ ప్రక్రియను ప్రారంభించింది. 3వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రీ టెస్ట్ నిర్వహించగా అందుకు సంబంధించిన ఫలితాలను కూడా విడుదల చేసింది. అయితే విద్యార్థులకు మాతృభాష అయిన తెలుగు కూడా చదవడం, రాయడం రాదని, రెండో ల్యాంగేజ్ అయిన ఇంగ్లీష్ కూడా రావడంలేదని బయటపడింది. ఈ పరీక్ష ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధిస్తున్న నాణ్యతను ప్రశ్నించే విధంగా ఉంది. సంవత్సరం పొడవునా పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు తెలుగు చదవడం రాదంటే, పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది. ఈ క్రమంలో జూలై 19 నుంచి ప్రారంభమైన ఏబీసీ కార్యక్రమం 60 రోజుల పాటు నిర్వహించి, ఈనెల చివరికల్ల ముగిసే విధంగా అధికారులు ప్రణాళికలు రచించారు. అనంతరం మళ్లి పోస్టు పరీక్ష కూడా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండు పరీక్షలు అనంతరం కూడా అధికారులు అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకం. ఏబీసీ కార్యక్రమం.. ఏబీసీ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన ప్రీటెస్టులో 80 శాతం మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వారిని గ్రూప్ ఏ విద్యార్థిగా, చదవడం, రాయడం అంతంత మాత్రంగా వచ్చిన వారిని గ్రూప్ బీ వారిగా, రాయడం, చదవడం రాని విద్యార్థులను గ్రూప్ సీగా విభజిస్తారు. ఇందులో ఏ గ్రూప్‌లో ఉన్న విద్యార్థులకు సాధారణ తరగతుల్లో సబ్జెక్టులు మాత్రమే బోదిస్తారు. మిగతా రెండు గ్రూప్‌లకు చెందిన విద్యార్థులకు సాధారణ తరగతులతో పాటు, కనీస సామర్థ్యాలు పెంచే విధంగా ఉపాద్యాయులు ప్రత్యేక బోదన చేయాల్సి ఉంది. ఇందులో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా సీ నుంచి బీకి, బీ నుండి సీకి వచ్చే విధంగా శిక్షణ కొనసాగుతుంది. ఇలా 60 రోజుల కార్యక్రమంలో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మొత్తం ఏ గ్రూప్‌లోకి రావాల్సి ఉంది. పరీక్షలో ఫలితాల సరళి పరీక్షను జూలై నెల 17, 18వ తేదిలో నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 1,439 మంది పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్య 1,63,420 మందిగా ఉంది. కానీ పరీక్షకు హాజరైన విద్యార్థులు 75,439 మందిగా ఉంది. ఈ పరీక్ష కేవలం 3వ తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్షను ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో ముఖ్యంగా(మొదటి ల్యాంగ్వేజ్) ఉర్డూ, తెలుగు రాయడానికి, చదవడానికి రాని విద్యార్థుల సంఖ్య 14,339 మందిగా ఉంది. ఇందులో బాలికలు 7,394 మంది కాగా, బాలురు 6,945 మంది. అంతేకాకుండా ఇంగ్లీష్ చదవడానికి, రాయడానికి రాని విద్యార్థులు 28,543 మంది ఉన్నారు. ఇందులో బాలికలు 14,902 మంది కాగా, బాలురు 13,641 మంది ఉన్నారు. వీటితో పాటు చదుర్విద గణిత ప్రక్రియలు రాని విద్యార్థులు 27,733 మంది ఉన్నారు. అసలు గణితం చదవడం, రాయడం, ప్రక్రియలు రాని విద్యార్థులు 30,149 మంది ఉన్నారు. ఇందులో బాలికలు 15,583 మంది కాగా, బాలురు 14,566 మంది ఉన్నారు. పనితీరుకు నిదర్శనం ప్రీటెస్టు ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సంవత్సరంలో 9నెలలు పాఠశాలకు వెళ్లిన ఓ విద్యార్థికి కనీసం మాతృభాషలో కూడా చదవడానికి రాలేని పరిస్థితి నెలకొంది. వీటితో పాటు ఇంగ్లీష్, సైన్స్, గణితం వంటి వాటిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యానికి తూట్లు పడుతున్నట్లు ఆరోపణలు వినిస్తున్నారు. పరిస్థితి మారాలి, విద్యార్థులకు కనీస సమర్థ్యాలు పెంచేందుకు కృషి చేయాలి, బోధనలో నిర్లక్ష్యం వహించవద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా పెద్దగా ఫలితం కనిపిండం లేదు. వీటితో పాటు పదో తరగతి ఫలితాల్లో కూడా ఇలాంటి పరిస్థితే పునరావతం అయ్యింది. జిల్లాలోను రాష్ట్రంలో 30వ స్థానంలో నిలబెట్టారు. ఈ సారి ప్రీటెస్టులో అయిన మంచి ఫలితాలు వస్తాయని, జిల్లా విద్యాశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సామర్థ్యాలు పెంపొందిస్తాం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యాసామర్థ్యాలు తెలుసుకునేందుకు జూలైలో ప్రీ టెస్టు నిర్వహించాం. ఇం దులో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ద్వారా బోధస్తున్నాం. అందుకోసమే ఏబీసీ కార్యక్రమం ని ర్వహించాం. ఈనెల చివరి నాటికి పూర్తి స్థాయిలో విద్యార్థుల విద్యాసామర్థ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – నాంపల్లి రాజేష్, డీఈఓ, మహబూబ్‌నగర్ -
సర్కారు జీతం.. ‘ప్రైవేట్’లో పాఠం!
సాక్షి, నిర్మల్: సర్కారు బడిలో హాజరు శాతం పెంచేందుకు ప్రభుత్వం ఓ వైపు మాసోత్సవానికి సిద్ధమవుతుంటే.. పాఠాలు చెప్పాల్సిన సార్లూ బడిబాట పట్టడం లేదు. విద్యాశాఖలోని లొసుగులను, జిల్లా అధికారుల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని తాము ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా చేస్తున్నారు. బాధ్యతల పేరు చెప్పి.. నిబంధనలకు విరుద్ధంగా బడికి వెళ్లకుండా జిల్లాకేంద్రంలోనే మకాం వేస్తున్నారు. ప్రాథమిక విధిగా పేర్కొనే విద్యాబోధననే మరిచిపోతున్నారు. కనీసం తాము తీసుకుంటున్న వేతనానికి న్యాయం చేయడం లేదు. తమను నమ్మి బడికి వస్తున్న విద్యార్థుల జీవితాలకూ భరోసానివ్వడం లేదు. జిల్లాలోని పలువురు ఉపాధ్యాయుల తీరుపై సంబంధిత పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక వీటిని పట్టించుకుని.. సదరు సార్లను గాడిన పెట్టాల్సిన జిల్లా ఉన్నతాధికారులు సైతం ఆ ఉపాధ్యాయులకే వంత పాడుతుండటం గమనార్హం. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ పనులు చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. తమ విధి నిర్వహణను సకాలంలో.. సక్రమంగా నిర్వర్తిస్తే సరిపోతుంది. కానీ.. కొంతమంది సార్లు మాత్రం తమకు నెలనెలా వేలకు వేలు వేతనా న్ని ఇస్తున్న జీతానికి న్యాయం చేయడం లేదు. ప్రైవేట్ పనులకు, తమ భాగస్వామ్యంలో నడుస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలకే ప్రాధాన్యతనిస్తున్నారు. జిల్లాకేంద్రంలో ఓ జిల్లాస్థాయి బాధ్యతలో ఉన్న ఓ ప్రధానోపాధ్యాయుడు విధులకు ఎగనామం పెడుతూ తమ ప్రైవేట్ విద్యాసంస్థల్లో తరగతులు బోధిస్తున్నారు. బడిలో ఉండాల్సిన సమయంలో తన భాగస్వామ్య విద్యాసంస్థలో గడుపుతున్నారు. ఏకంగా కళాశాల విద్యార్థుల చేరిక కోసం నిర్వహించే ప్రచారంలో నేరుగా పాల్గొంటున్నారు. నిబంధనల ప్రకారం తను చేపట్టాల్సింది కేవలం అదనపు బాధ్యత. యథావిధిగా విద్యాబోధన చేస్తూ ఆ బాధ్యతను నిర్వహించాల్సి ఉంటుంది. కానీ తన పోస్టును సాకుగా పెట్టుకుని సదరు పెద్దసారు బడికి వెళ్లడం లేదు. జిల్లాకేంద్రంలోనే మరికొందరు ఉపాధ్యాయులు సైతం పాఠశాలలో ఉండాల్సిన సమయాల్లో తమ సొంత వ్యాపారాలు, విద్యాసంస్థల్లో గడుపుతున్నారు. సరిహద్దు మండలాల్లో.. జిల్లాకేంద్రానికి దూరంగా ఉన్న సరిహద్దు మండలాల్లోనే ఉపాధ్యాయుల ఆన్‌డ్యూటీ గైర్హాజర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా కుభీర్ మండలంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు నామ్ కే వాస్తేగా.. బడికి వెళ్తున్నారు. ఈ మండలంలోని ఓ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నెలల తర బడి గైర్హాజరవుతున్నారు. ఇదే మండలంలోని మరికొన్ని గ్రామాల్లోనూ ఉపాధ్యాయులు విద్యావలంటీర్లను నియమించుకుని విధులకు ఎగనామం పెడుతున్నారు. ఇక చాలామంది ఉపాధ్యాయులు పాఠశాల వేళలను కూడా పాటించడం లేదు. కొంతమంది ఉపాధ్యాయుల తీరుతో మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోందని సర్కారు సార్లే చెబుతున్నారు. ఫిర్యాదులు చేసినా.. ‘తమ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పేందుకు వచ్చారని అనుకున్నాం.. కానీ ఆ పెద్దసారు బడికే రారు. నెలలో ఒకట్రెండు సార్లు వచ్చి చుట్టపుచూపు లెక్క వచ్చిపోతున్నరు. ఇక మా పిల్లలకు సదువులు ఎట్లా...’ అంటూ కుభీర్ మండలంలోని ఓ గ్రామస్తులు కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇది చేసి ఏడాది గడుస్తోంది. ఓ విద్యాసంవత్సరం కూడా పూర్తయ్యింది. ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. ఆ సారూ... ఇప్పటికీ అదే తీరు కొనసాగిస్తున్నారు. వారాల తరబడి స్కూల్‌కు రాకుండా జిల్లాకేంద్రంలోనే ఉంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బాధ్యతల పేరిట పాఠాలు చెప్పాల్సిన బడిని మోసం చేస్తున్నారు. ఇదంతా జిల్లా ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారు లకు తెలిసినా.. కనీసం పట్టించుకున్న దాఖలా లు లేవు. చివరకు ఆ గ్రామస్తులే విసిగి వేసారి.. తమ పిల్లలను సర్కారు బడి మార్పించి, పక్క ఊరిలోని ప్రైవేట్ స్కూల్‌కు పంపుతున్నారు. వ్యవస్థపైనే మచ్చగా.. ‘ప్రభుత్వ బడి పిల్లలు–ప్రతిభ గల పిడుగులు’.. అన్నట్లుగా తమను నమ్మి వచ్చిన పేద పిల్లలకు చక్కటి చదువులను అందిస్తున్న సర్కారు బడిసార్లు ఎందరో ఉన్నారు. జిల్లాలోని చాలా పాఠశాలల్లో అంకితభావంతో పనిచేస్తూ.. భావి సమాజాన్ని తీర్చిదిద్దుతున్న గురువులున్నారు. కానీ.. కొంతమంది దారి తప్పుతున్న ఉపాధ్యాయుల తీరుతో మొత్తం వ్యవస్థకే మచ్చ వస్తోంది. ‘ఆ సార్.. సైన్స్ బాగా చెబుతారట. పాఠం చెబితే చక్కగా అర్థమవుతుందట. కానీ ఏం లాభం.. ఆ సారు బడికి రానేరారు. ఎప్పుడో ఓసారి వచ్చిపోతారు..’ అని నిట్టూరుస్తున్న విద్యార్థుల ముఖాల ను చూసైనా ఈ మాస్టర్లు మారాల్సిన అవస రం ఉంది. మరోవైపు జిల్లా ఉన్నతాధికారులూ తమ పర్యవేక్షణ లోపాలను సవరించుకోవాల్సి న బాధ్యత కూడా ఉందని తల్లిదండ్రులు పే ర్కొంటున్నారు. బడిలో విద్యార్థులకు హాజరు మాసోత్సవాన్ని నిర్వహించినట్లే..సదరు సార్లూ బడికి వచ్చేలా చూడాలని కోరుతున్నారు. -
హలో..వద్దు మాస్టారు
సాక్షి, గుంటూరు(త్తెనపల్లి) : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెల్ఫోన్లను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాఠశాలల్లో సెల్ఫోన్ల వినియోగానికి ఎట్టకేలకు తాళం పడింది. ఉపాధ్యాయులు విధి నిర్వహణ ఉన్న సమయంలో వీటిని వాడకూడదన్న నిబంధన ఎప్పటి నుంచో ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా తరగతి గదుల్లో వీటి వినియోగాన్ని నిషేధిస్తూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల్లో సెల్‌ఫోన్ వినియోగాన్ని నిషేధిస్తూ గతంలోనే విద్యా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, అవి ఎక్కడా అమలు కాలేదు. దీనిపై ఎప్పటికప్పుడు విద్యాశాఖ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా ఫలితం ఉండట్లేదు. ప్రభుత్వ విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న కారణంగా సెల్‌ఫోన్ వాడకాన్ని నిషేధించాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. ప్రధానోపాధ్యాయులదే బాధ్యత జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఇప్పుడు సెల్ఫోన్ల నిషేధం పక్కాగా అమలు చేయాల్సి ఉంది. పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులకు వీటి విషయంలో బాధ్యత పెరిగింది. ఉపాధ్యాయులు సెల్ఫోన్లు తీసుకుని స్టాఫ్ రూములో భద్రపరుచుకోవాల్సి ఉంటుంది. బడి సమయం ముగిసిన తర్వాత వాటిని తిరిగి తీసుకోవాలి. ప్రధానోపాధ్యాయులు సైతం వీటిని వినియోగించడానికి వీలు లేదు. తరగతి గదిలో ఫోన్ వాడితే ఉపాధ్యాయులతోపాటు ఆ పాఠశాల హెచ్ఎంలను కూడా బాధ్యులను చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ ఉన్నతాధికారుల నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇకపై సెల్ఫోన్లను పాఠశాలలకు తీసుకెళ్లకూడదని కొందరు ఉపాధ్యాయులు భావిస్తున్నారు. ఈ నిబంధనలు తప్పనిసరి.. తరగతి గదిలో ఉన్నంత సేపు సెల్‌ఫోన్ మాట్లాడరాదని, వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను తరగతి గదుల్లో ఉపయోగించరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు. వాటిని వినియోగిండం వలన ఉపాధ్యాయుల ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా విద్యార్థుల దృష్టి మరలే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటువంటి అలవాట్లు ఉపాధ్యాయుల నుంచి విద్యార్థులకు సంక్రమిస్తాయని భావిస్తున్నారు. ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లిన వెంటనే సెల్ఫోన్లు సైలెంట్ మోడ్‌లో పెట్టి స్టాఫ్ రూములో భద్రపరుచుకోవాలి, లేకంటే ప్రధానోపాధ్యాయుడి నియంత్రణలో ఉంచాల్సి ఉంటుంది. భోజన విరామ సమయంలో మాత్రమే ఉపాధ్యాయులు సెల్ఫోన్లు వాడుకోవాల్సి ఉంది. డ్రెస్ కోడ్.. వీటితో పాటు పాఠశాలల్లో గురువులు డ్రెస్ కోడ్ నిబంధనలు పాటించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రధానంగా ఉపాధ్యాయులు, ప్రధానో పాధ్యాయులు విధిగా డ్రెస్ కోడ్ పాటించాల్సి ఉంది. 8/4 జేబులతో కూడిన ఫ్యాంట్లు కానీ, టీషర్టులు కానీ వేసుకోకూడదు. ఉపాధ్యాయినులు విధిగా చీరలు ధరించాలి. వ్యాయామ ఉపాధ్యాయులకు మాత్రం వీటిలో మినహాయింపు ఇచ్చారు. ఈ నిబంధనలను ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాటించాలని, వీటిని అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో సెల్‌ఫోన్ వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే నిబంధనలు అమలు చేస్తున్నా.. ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకుంది. పాఠాలు పక్కనబెట్టి కొందరు టీచర్లు తరగతి గదుల్లోనే సెల్‌ఫోన్ కబుర్లతో కాలం వెళ్ల్లదీస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లు కావడంతో ఇంటర్నెట్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
సమాజ శ్రేయస్సుకు విద్యే పునాది
అన్ని దానాల కంటే గొప్పదానం అన్నదానం కాదు విద్యాదానం అనే చెప్పాలి. మొత్తం సమాజ శ్రేయస్సు, అభివృద్ధి ఒక్క విద్య, విద్యావిధానంపైనే ఆధారపడి ఉంటుంది. సమాజం గురించి తెలియకుండా, ప్రజల కష్టసుఖాలను, మానవ సంబంధాలను గురించి అవగాహన కలుగని రీతిలో విద్యార్థులను పెంచితే స్వార్థమే పరమార్థమనే భావాలు కలవారు కావచ్చు. అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలకు కూడా ఉన్నతస్థాయి విద్యను అందించే విధంగా ప్రణాళికలు వేయాలి. మంచి మార్పు రావాలంటే విద్యపై ఖర్చుకు వెనకాడకూడదు. ప్రభుత్వం విద్య మీద శ్రద్ధ తీసుకుని ప్రజలకు భరోసా కల్పిస్తే ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. అనేక మంది ఆడపిల్లలు 7, 8 తరగతులలో స్కూలు మానేయడానికి ప్రధాన కారణం టాయ్లెట్లు లేకపోవడమే అంటే మన దేశంలో ఈనాటికీ బాలికా విద్యకు ఎన్ని ఆటంకాలున్నాయో అర్థమవుతుంది. సమాజ శ్రేయస్సు విద్యా విధానం మీదనే ఆధారపడి ఉంటుంది. అన్నిటి కంటే గొప్పదానం విద్యాదానం. విద్య విద్యార్థి మనసును వికసింపచేయాలి. సత్యాన్ని శోధించేటట్లు, తెలుసుకునేటట్లు చేయాలి. విద్యార్థుల ఆలోచనలను సరైన దిశలో పెంపొందేటట్లు చేయాలి. విద్య, విద్యార్థులను మానసికంగా, శారీరకంగా దృఢమైన వారిగా తయారు చేయాలి. సమాజం గురించి తెలియకుండా, ప్రజల కష్టసుఖాలు, మానవ సంబంధాలు లేకుండా విద్యార్థులను పెంచితే స్వార్థమే పరమార్థమనే భావాలు కలవారు కావచ్చు. ప్రభుత్వం సమాజ అవసరాలను అంచనా వేయాలి. ప్రస్తుతానికి, కనీసం ఇంకా 5 ఏళ్ళ వరకు ఎంత మంది డాక్టర్లు కావాలి? ఎంత మంది నర్సులు కావాలి, ఎంత మంది వ్యవసాయ అధికారులు, ఎలక్ట్రీషియన్స్ కావాలి, ఇలా ఒక స్పష్టమైన ముందు చూపు ఉంటే, సమాజ అవసరాలను పూర్తి చేయడానికి ఇప్పుడున్న పాఠశాలలు, సాంకేతిక కళాశాలలు సరిపోతాయా, ఇంకా అదనంగా పాఠశాలలు, కళాశాలలు, సాంకేతిక కళాశాలలను నెలకొల్పాలా?అనే వివరాలు తెలుస్తాయి. నేటి బాలబాలికలే మన రేపటి భవిష్యత్తు. అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలకు కూడా ఉన్నతస్థాయి విద్యను అందించే విధంగా ప్రణాళికలు వేయాలి. మంచి మార్పు రావాలంటే విద్యపై ఖర్చుకు వెనకాడకూడదు. అవసరమైతే ముఖ్యమైన పట్టణాల్లోని ప్రభుత్వ భూముల్ని అమ్మి అవసరమైన డబ్బు సేకరించాలి. ఆర్థిక నిపుణులతో చర్చించి ప్రజలకు లాభం కలిగేటట్లు, ఏ చర్యల వల్ల ఆదాయం సమకూరుతుందో నిర్ణయించి కచ్చితమైన చర్యలు తీసుకొని ఆదాయాన్ని పెంచుకోవాలి. ఇలా వచ్చిన ఆదాయంలో అత్యధిక శాతం పేద విద్యార్థులకు విద్య కోసం, హాస్టల్ సౌకర్యాల కోసం వినియోగించాలి. పేదవారైనప్పటికీ తమ పిల్లలను చదివిం చాలని అనేకమంది తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. వారి ఆదాయంలో ఎంతో భాగం పిల్లల విద్యకోసం ఖర్చు చేస్తున్నారు. ఉన్నత విద్యను అందించడానికి విదేశాలకు పంపడానికి ఆస్తులు అమ్ముకున్నవారు ఉన్నారు. అందుకనే ప్రభుత్వాలు చేయాల్సిన తక్షణ కర్తవ్యాలను సూచిస్తున్నాను. పాఠశాలలు లేని గ్రామాలను, తండాలను గుర్తించి ఆ గ్రామాలలో, తండాలలో ప్రాథమిక పాఠశాలలను నెలకొల్పాలి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, ఉన్నత పాఠశాలల్లో కాలేజీల్లో కనీస వసతులు కల్పించడం, టాయ్‌లెట్ సౌకర్యాలను కల్పించడం, టాయ్లైట్ల నిర్వహణ ఖర్చు లేకుండా ఆధునిక పద్ధతిలో లేదా నిరంతరం శుభ్రపరిచే విధంగా టాయ్లెట్లను ఏర్పరచాలి. (అనేక మంది ఆడపిల్లలు 7, 8 తరగతులలో స్కూలు మానేయడానికి ప్రధాన కారణం టాయ్లెట్లు లేకపోవడమే). ప్రభుత్వ పాఠశాలలో, హైస్కూళ్లలో, కాలేజీల్లో అవసరమైన మరమ్మత్తులు చేయించాలి. అవసరమైన చోట అదనపు గదులు నిర్మించాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలి. ఆవరణలో మొక్కలు నాటేటట్లు చేయాలి. ప్రతి స్కూలుకు, హైస్కూళ్లకు, కాలేజీలకు ఆట స్థలాలు ఉండాలి. వీలైనంత త్వరలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను, లెక్చరర్ల, ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలి. ప్రతీ స్కూళ్లో/ కాలేజీల్లో ఉదయం టిఫిన్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. (ఎందుకంటే అనేక మంది పేద పిల్లలు ఉదయం పూట ఏమీ తినకుండానే స్కూలుకు వస్తారు. మధ్యాహ్న భోజనం కోసమే వచ్చేవారు కూడా ఉన్నారు.) వీలైతే సాయంత్రం పూట తినడానికి ఏదో ఒకటి ఇవ్వాలి. పిల్లల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనత, ఎత్తూ బరువు తక్కువ. ఇవి సాధారణంగా పేద పిల్లల్లో కనబడతాయి. విచారణ జరిపి శాంపిల్ లెక్కలు తీసుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. ఇంగ్లిష్ మీడియంకు లేదా ఇంగ్లిష్ భాషకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే పిల్లలు ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడగలగాలి. కంప్యూటర్ విద్య, అధునాతన టెక్నాలజీ విద్యార్థులకు అందేటట్లు చూడాలి. ఒకసారి ప్రభుత్వం విద్య మీద శ్రద్ధ తీసుకుని ప్రజలకు భరోసా కల్పిస్తే ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల మధ్యతరగతి వారు కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో చదివించాలన్న వాతావరణం ఏర్పడాలి. బాగా పనిచేసే ఉపాధ్యాయులకు ప్రోత్సాహం కలిగించే విధంగా సర్టిఫికెట్లు, బహుమతులు, ఆర్థిక రివార్డులు ఇవ్వాలి. 3 సం‘‘ల వరకు ప్రతీ సంవత్సరం వరుసగా మంచి రికార్డు సాధించిన ఉపాధ్యాయులకు ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలి. వీలైనన్ని చోట్ల ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లు నిర్వహించాలి. అత్యంత పేద కుటుంబాల నుండి వచ్చిన వారు కష్టపడి ఎలా ఉన్నతస్థాయికి వెళ్ళారో ఉదాహరణలతో వివరించాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లిష్ భాషపై పట్టు త్వరగా రాదు. వారికి ప్రత్యేక కోచింగ్‌లు ఏర్పాటు చేయాలి. వీలైనన్ని ఎక్కువ ప్రభుత్వ హాస్టళ్ళను ఏర్పాటు చేసి ఏ పేద విద్యార్థి, పేదరికం కారణంగా, తిండికి లేక, కనీస అవసరాలు తీరక విద్యను మధ్యలో ఆపేసే పరిస్థితి ఉండని విధంగా చూడాలి. అటువంటి పేద కుటుంబాల వారికి వారి పిల్లలను మధ్యలో బడి మాన్పించి ఏదో పనిలో పెట్టకుండా కొంత ఆర్థిక ప్రోద్బలం ఇవ్వగలిగితే ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులకు, ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. విద్యార్థుల్లోని అంతర్గత శక్తులను గుర్తించి, వారిలోని ప్రావీణ్యాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలి. ఒక విద్యార్థి పాడగలిగే వాడైతే అతనికి సంగీత విద్యను అందించే ఏర్పాటు ఉండాలి. వ్యాసరచన, ఉపన్యాస మొ‘‘ పోటీలను నిర్వహించాలి. కథలు, కవితలు వ్రాసేవారిని ప్రోత్సహించాలి. ఇవన్నీ ఇప్పుడే చేయడం సాధ్యంకాక పోవచ్చు. కానీ గొప్ప లక్ష్యాలను నిర్ణయించుకొని ఆ లక్ష్య సాధనకు మార్గాలను రూపొందించుకొని పట్టుదలగా ముందుకు సాగితే అనుకోని సహాయం అందుతుంది. ఆదా యం తక్కువగా ఉన్నదనే కారణంతో ప్రజలకు అందించాల్సిన విద్యా వైద్య సహకార విషయాల్లో వెనుకడుగు వేయగూడదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించి ఆదాయం పెంచుకోగలిగితే అన్ని రకాలుగా ప్రయత్నించి ఆదాయాన్ని పెంచుకోవాలి. భయం, పిరికితనమే అన్ని అనర్థాలకు కారణం. భగవంతుని సహాయం మనకు అందుతుందనే ధైర్యంతో ముందుకు సాగాలి. జస్టిస్ బి. చంద్రకుమార్ వ్యాసకర్త విశ్రాంత న్యాయమూర్తి మొబైల్ : 89783 85151 -
కొత్త సార్లొస్తున్నారు..
ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులు రానున్నారు. పెండింగ్‌లో ఉన్న టీఆర్టీ(టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) పోస్టులను భర్తీ చేసేందుకు రెండు రోజుల క్రితం జీఓ రాగా, అనంతరం షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటివరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వలంటీర్లతో నెట్టుకురాగా.. ఆయా పోస్టుల్లో కొత్త టీచర్లు భర్తీ అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో 130 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో టీఆర్టీ ప్రకటన చేసింది. 2018 ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించింది. అదే ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి.. విడతలవారీగా సెప్టెంబర్ 2018, ఏప్రిల్ 2019లో జాబితా విడుదల చేసింది. అయితే టీఆర్టీ నియామకాలపై మార్గదర్శకాలు జారీ చేసి.. అభ్యర్థుల ఎంపిక చేపట్టకపోవడంతో దాదాపు 20 నెలలపాటు అభ్యర్థులు నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం నియామక పత్రాలపై జీఓను విడుదల చేయడంతో త్వరలోనే అభ్యర్థులు టీచర్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు.. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి జిల్లాకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్.. కార్యదర్శిగా డీఈఓ మదన్మోహన్ వ్యవహరించనున్నారు. పలువురు జిల్లాస్థాయి అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. పాఠశాల విద్యాశాఖ టీఆర్టీ జాబితాను ఇప్పటికే జిల్లా కమిటీకి సమర్పించింది. రోస్టర్, మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో జిల్లా కమిటీలు తమ పరిధిలోని సబ్జెక్టులవారీగా ఖాళీలను గుర్తించి.. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. షెడ్యూల్ ఇలా.. టీఆర్టీ నియామకాలకు సంబంధించి షెడ్యూల్ ఇలా ఉంది. ఎంపికైన అభ్యర్థుల లిస్టును కేటగిరీ, మీడియంవారీగా ఈనెల 10న ప్రదర్శించనున్నారు. 11న జిల్లాస్థాయి కమిటీ సమావేశమై ఖాళీల పరిస్థితిని తెలుసుకొని కేటగిరీ, మీడియంలవారీగా ఖాళీలను వెల్లడిస్తారు. 13, 14వ తేదీన అభ్యర్థులకు కేటగిరీ, మీడియంవారీగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పోస్టింగ్ పొందిన కొత్త టీచర్లు ఈనెల 15న పాఠశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 17న జాయిన్ కానీ, రిపోర్టు చేయని అభ్యర్థుల వివరాలను గుర్తిస్తారు. 19న ఎంపికైన టీచర్లు జాయినింగ్ రిపోర్టును ఎంఈఓలు, హెచ్ఎంలకు అందజేయాలి. వేగవంతం చేస్తున్నాం.. టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పూర్వ ఖమ్మం జిల్లా నుంచి ఖాళీల వివరాలు సేకరిస్తున్నాం. కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ఆదేశాల మేరకు త్వరలోనే నియామకాలు చేపట్టనున్నాం. మొత్తం 130 పోస్టులను భర్తీ చేయనున్నాం. – పి.మదన్మోహన్, జిల్లా విద్యాశాఖాధికారి -
‘ప్లేస్టోర్’లో పుస్తకం!
సాక్షి, చీరాల (ప్రకాశం): విద్యావిధానంలో కొత్త మార్పులు వస్తున్నాయి. బట్టీ విధానానికి స్వస్తి పలికేందుకు వస్తున్న మార్పులు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉచిత పాఠ్యపుస్తకాలపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. క్యూఆర్ కోడ్ వలన సమగ్ర సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చు. దీని వరిశోధానాత్మక బోధన, పూర్తిస్థాయిలో అభ్యసనకు అవకాశం కలుగుతుంది. పాఠ్యాంశాలను విద్యార్థుల వీక్షించేందుకు దీక్షా యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. గత ఏడాది గణితం, భౌతికశాస్త్రం, సాంఘికశాస్త్రం పుస్తకాలపై ముద్రించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి తెలుగు, హిందీ, ఆంగ్ల సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలపై కూడా క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. ఈ విధానం వలన విద్యార్థులు తమ పాఠ్యాంశాలను ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా చూసుకోవచ్చని ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థులు పాఠ్యాంశాలపై త్వరితగతిన అర్థం చేసుకోవచ్చు. ఎలా? గూగుల్ ప్లేస్టోర్ నుంచి దీక్షాయాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్‌లో విద్యార్థి లేదా ఉపాధ్యాయుడు అనేది ఎంపిక చేసుకున్న అనంతరం భాషను ఎంపిక చేసుకోవాలి. తర్వాత పాఠ్యాంశం పైన ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సమగ్రసమాచారం ఫోన్లో ప్రత్యక్షమవుతుంది. ఇలా చేయడం వలన ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు నల్లబజారుకు తరలివెళ్లకుండా ఉంటుంది. క్యూఆర్ కోడ్‌ను పుస్తకం మొదటి, చివరి పేజీల్లో ముద్రించేవారు. ప్రస్తుతం ముఖ్యమైన పాఠ్యాంశాలపై కూడా ముద్రించడంతో విద్యార్థులకు మరింత సులభతరం అయింది. మెరుగైన ఫలితాలు వస్తాయి... ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. డిజిటల్ తరగతులు, క్యూఆర్ కోడ్ వలన విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి. పాఠ్యాంశాలను బోధన ద్వారా వినడం కంటే దృశ్యరూపంలో తిలకించడం వలన మార్చిపోయే అవకాశం ఉండదు. - నాగేశ్వరరావు, ఎంఈఓ -
ప్రభుత్వ బడిలో ఉపాధ్యాయుల పిల్లలు
సాక్షి, దత్తిరాజేరు(విజయనగరం) : పేద, బడుగు, బలహీనవర్గాల వారే తమ పిల్లలను అప్పోసప్పో చేసి ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులైతే... మరింత పేరున్న ప్రైవేట్ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఉపాధ్యాయుల్లో చాలామంది తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లోనే చదివిస్తుండడం గమనార్హం. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ‘అమ్మఒడి’ పథకం ప్రవేశపెట్టిన సందర్భంలో ఉపాధ్యాయులే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం లేదన్న అంశం తెరపైకి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో పలువురు ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపి తాము ఆదర్శ ఉపాధ్యాయులమని నిరూపించుకున్నారు. వింధ్యవాసి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వై. జగదీశ్వరరావు తమ కుమార్తె రిషితను గోభ్యాం ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో జాయిన్ చేశారు. విజయనగరంలో ఉన్న తమ నివాసాన్ని తన సొం త ఊరైన గొభ్యాంనకు మార్చి మరీ తమ బిడ్డను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అలాగే పోరలి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ముగండి రామారావు తన కుమార్తె ప్రియాంకను గోభ్యాం ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. బొండపల్లి మండలంలో పోస్టుమ్యాన్‌గా పనిచేస్తున్న ఒకరు తన కుమార్తె వైకుంఠం షర్మిలను కూడా గోభ్యాం ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ఇలాగే మిగతా ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే ప్రభుత్వ విద్యారంగం బలోపేతమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదర్శంగా నిలవాలనే.. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల వారందరికీ నాణ్యమైన బోధన అందించాలని కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ‘అమ్మఒడి’ అమలు చేస్తున్నారు. నేను నా కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించా.. మిగలిన వారికి ఆదర్శంగా నిలిస్తే వారు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేరుస్తారు. – వైకుంఠం జగదీశ్వరరావు,ప్రభుత్వ ఉపాధ్యాయుడు -
అందరికీ అమ్మఒడి
-
పేద తల్లులు... పిల్లల్ని ఏ బడికి పంపినా అమ్మ ఒడి
సాక్షి, అమరావతి: ప్రతి పేద తల్లి పిల్లల్ని ఏ బడికి పంపినా అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. అమ్మ ఒడి పథకానికి సంబంధించి కొద్ది రోజులుగా భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటన్నింటికీ తెరదించుతూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఈ ప్రకటన చేసింది. ‘అమ్మ ఒడి’ విషయంలో ఎలాంటి సందేహాలు, అపోహలకు తావులేదని పేర్కొంది. ఈ పథకం అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టంగా, ఎలాంటి సందేహాలకు ఆస్కారం లేకుండా వివరించారని తెలిపింది. బడిబాట, అక్షరాభ్యాసం కార్యక్రమాల సందర్భంగా, ఎడ్యుకేషన్ రివ్యూ మీటింగ్‌లోనూ స్పష్టీకరించారని వివరించింది. పేద తల్లులు తమ పిల్లల్ని ఏ బడికి పంపినా అందరికీ అమ్మ ఒడి వర్తిస్తుందని వైఎస్ జగన్ తన 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో తెలిపారని, ఈ దృష్ట్యా పేద పిల్లలు చదివేది ప్రభుత్వ లేదా ప్రవేట్ పాఠశాల అయినా అమ్మ ఒడి వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. పేదల పిల్లలందరూ చదువుకోవాలి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటి స్థితిగతుల్ని, రూపురేఖల్ని మారుస్తామని ముఖ్యమంత్రి ఇంతకు ముందే ప్రకటించారని, ప్రభుత్వ బడుల్ని మెరుగుపరిచే దిశగా అన్ని చర్యలూ త్వరలో ప్రారంభం కాబోతున్నాయని సీఎం కార్యాలయం వివరించింది. ‘దేశంలో నిరక్షరాస్యుల సగటు 26 శాతం ఉంటే ఏపీలో 33 శాతం ఉంది. అంటే మన రాష్ట్రంలో ప్రతి 100 మందిలో 33 మంది చదువుకోని వారే. అక్షరాస్యత విషయంలో మన రాష్ట్రం దేశంలో అట్టడుగున ఉంది. ఈ పరిస్థితిని మార్చి, పేదల పిల్లల్లో ప్రతి ఒక్కరూ బడికి వెళ్లి చదువుకోవాలన్న ఉద్దేశంతో అమ్మఒడి పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం విషయంలో ఎలాంటి సందేహాలు, అపోహలకు తావు లేదు’ అని స్పష్టం చేసింది. ఎన్నికల హామీల మేరకు మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో సంవత్సరానికి రూ.15 వేలు అందిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరో ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలో విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. -
అమ్మో.. మధ్యాహ్న భోజనం..
సాక్షి, దేవరపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులను అర్థాకలితో ఉంచుతుంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేయాలంటే విద్యార్థులు భయపడిపోతున్నారు. సుమారు ఆరు నెలలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పలువురు విద్యార్థులు ఇంటి వద్ద నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. ఇంటి వద్ద భోజనం అందుబాటులో లేని విద్యార్థులు పాఠశాలలో పెడుతున్న భోజనం తిని అర్థాకలితో ఉంటున్నారు. ముతక రకం బియ్యం, రుచికరంగా లేని కూరలను విద్యార్థులకు సరఫరా చేయడం వల్ల తినడానికి విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. విద్యార్థులు తినకపోవడంతో చాలా పాఠశాలల్లో భోజనం నేలపాలవుతుంది. బుధవారం మెనూ ప్రకారం విద్యార్థులకు పప్పు, ఆకుకూర, కోడిగుడ్డు ఇవ్వవలసి ఉంది. అయితే విద్యార్థులకు పెట్టిన భోజనం చిమిడి ముద్దగా ఉండంతో పాటు సాంబరులాంటి పప్పు అందజేశారు. కోడిగుడ్డు పాడైపోయి దుర్వాసన రావడంతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. లక్ష్మీపురం పాఠశాలకు సరఫరా చేసిన భోజనం అధ్వానంగా ఉందని విద్యార్థులు తెలిపారు. చిమిడి ముద్దగా ఉన్న అన్నం, పలచని పప్పు, పాడైపోయిన కోడిగుడ్లు సరఫరా చేసినట్టు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం ముద్దగా ఉండి గట్టిగా ఉంటుందని, రుచికరంగా లేని కూరలతో అన్నం తినలేకపోతున్నామని విద్యార్థులు వాపోయారు. 2018 డిసెంబర్ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో డ్వాక్రా మహిళలు వంటలు చేసి విద్యార్థులకు అందజేసేవారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి వంట ఏజన్సీ మహిళలను తొలగించి ఢిల్లీకి చెందిన ఏక్తా శక్తి ఫౌండేషన్‌కు మధ్యాహ్న భోజనం సరఫరాను అప్పగించారు. గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల, గోపాలపురం, దేవరపల్లి మండలాలకు సంస్థ ద్వారా పాఠశాలలకు భోజనం సరఫరా చేస్తున్నారు. యర్నగూడెంలో భోజనాలు తయారుచేసి పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. అప్పటినుంచి మధ్యాహ్న భోజన పథకం గాడి తప్పింది. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితంలేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడిందని విద్యార్థులు విమర్శిస్తున్నారు. బడిలో భోజనం చేస్తుంటే కడుపులో నొప్పి వస్తుందని విద్యార్థులు అంటున్నారు. బుధవారం పల్లంట్ల పాఠశాలకు వెళ్లిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు విద్యార్థులు మధ్యాహ్న భోజనం గురించి మొరపెట్టుకున్నారు. అన్నం తినలేకపోతున్నామని, సన్న బియ్యం అన్నం, రుచికరమైన కూరలు సరఫరా చేయాలని విద్యార్థులు ఎమ్మెల్యేను కోరారు. దీనిపై ఎమ్మెల్యే వెంకట్రావు ఫోన్లో జిల్లా విద్యాశాఖ అధికారితో మాట్లాడారు. భోజనం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సహించనని, వెంటనే భోజనం సరఫరా చేస్తున్న ఏజన్సీతో మాట్లాడి నాణ్యతగల భోజనం సరఫరా చేయాలని సూచించారు. సమస్యను విద్యాశాఖా మంత్రి దృష్టికి తీసుకువెళతానని ఆయన అన్నారు. విద్యార్థులకు పెట్టే భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
మీకు షూస్ ఇవ్వాలా?
సాక్షి, ఒంగోలు టౌన్: ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ షూస్ ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినా జిల్లాలోని కొన్ని మండలాలకు చెందిన మండల విద్యాశాఖాధికారులు వాటిని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. జిల్లాలోని కనిగిరి, కంభం, పెద్దారవీడు, అర్ధవీడు, బల్లికురవ, అద్దంకి, మార్టూరు మండలాల్లోని ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు షూస్ ఇవ్వకుండా అక్కడి మండల విద్యాశాఖాధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎయిడెడ్ ఉపాధ్యాయులు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్‌తో పాటు షూస్ ఇవ్వాలని సాక్షాత్తు విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించినా క్షేత్రస్థాయిలో కొంతమంది విద్యాశాఖాధికారులు మోకాలడ్డుతుండటంపై ఎయిడెడ్ ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఎక్కువ శాతం ఎయిడెడ్ పాఠశాలలకు షూస్ పంపిణీ చేసినా ఆ ఏడు మండలాల పరిధిలోని మండల విద్యాశాఖాధికారుల నుంచి వింత సమాధానం రావడంపై ఎయిడెడ్ ఉపాధ్యాయులు నిరసన తెలుపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు ఒకే కాంపౌండ్‌లో ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు షూస్ ఇచ్చి, తమ విద్యార్థులకు ఇవ్వకపోవడంతో వారు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. అసలే విద్యార్థుల శాతం తక్కువగా ఉందని కలత చెందుతున్న తరుణంలో షూస్ అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. వెంటనే ఏ ఏడు మండలాల పరిధిలోని ఎయిడెడ్ పాఠశాలలకు షూస్ అందించేలా సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వరరావు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు. -
చదవడం.. రాయడం!
నల్లగొండ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో సామర్థ్యం పెంపునకు విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో నెల రోజులపాటు విద్యార్థులకు చదవడం, రాయడం నేర్పించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఆ తర్వాతే ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి తరగతులు చేపట్టాలని నిర్ణయించారు. తద్వారా విద్యార్థుల్లో సామర్థ్యం పెరిగి విద్యాభివృద్ధిలో ముందుకు సాగుతారని విద్యాశాఖ అధికారుల ఉద్దేశం. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 1,483 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థులకు చదవడం, రాయడం సక్రమంగా రావడం లేదనేది విద్యాశాఖ ఉన్నతాధికారుల పరిశీలనలో వెల్లడైంది. గత సంవత్సరం ఎస్ఈఆర్టీ అధికారులు జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పర్యటించి 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల సామర్థ్యాలపై పరీక్షలు నిర్వహించారు. 1 నుంచి 5వ తరగతి పిల్లలకు చదవడం, రాయడం సక్రమంగా రావడం లేదు. 6 నుంచి10వ తరగతి విద్యార్థులకు కొందరికి చదవడం, రాయడం రాకపోగా మరికొంతమందికి సైన్స్‌లో సామర్థ్యం లేదని గుర్తించారు. ఇంకొందరికి గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయని వెల్లడైంది. చాలామందికి ఆయా సబ్జెక్టుల్లో సున్నా మార్కులు వచ్చాయి. ఎస్ఈఆర్టీవారు రాష్ట్ర వ్యాప్తంగా సామర్థ్యాలపై పరీక్షలు నిర్వహించగా అందులో నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే వెనుకబడినట్లు తేలింది. దీంతో ఆ నివేదికలు జిల్లాకు పంపించారు. సామర్థ్యం పెంపునకు డీఈఓ ప్రత్యేక కార్యక్రమం నివేదికలను పరిశీలించిన డీఈఓ సరోజినీ దేవి ఆయా విద్యార్థుల్లో సామర్థ్యం పెంపు కోసం నెల రోజులపాటు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాఠశాల ప్రారంభం అయిన నాటినుంచి బడిబాట మినహా రోజూ ప్రతి తరగతిలోని విద్యార్థులకు ప్రత్యేకంగా చదవడం, రాయడం కార్యక్రమాలే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల తర్వాత పీఈటీలు లేని పాఠశాలల్లో రోజూ ఆ పీరియడ్‌లో చదవడం, రాయడం కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలని నిర్ణయించారు. అదే విధంగా మిగతా పాఠశాలల్లో కూడా ఒక పిరియడ్‌ను తప్పనిసరి చదివించడం, రాయించే కార్యక్రమం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సామర్థ్యాల పెంపు తప్పనిసరి చదవడం, రాయడం కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో సామర్థ్యం పెంపొందేందుకు అవకాశం ఉంటుంది. ఈనెల ఈ చదవడం, రాయడం చేపట్టి ఆతర్వాత కూడా ఓ పిరియడ్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. రోజూ పాఠ్యాంశాలను చదివించడం వల్ల విద్యార్థుల్లో భయాలు తొలగి ధైరంగా చదువుకునే అవకాశం ఉంది. పది సార్లు చదివినా ఒకసారి రాసినా ఒకటే. రాయడం వల్ల పాఠ్యాంశం మనస్సులో ఉండిపోయే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. – డీఈఓ సరోజినీదేవి, నల్లగొండ -
విద్యార్థులకు త్వరలో ఆన్లైన్ టీసీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ల(టీసీ) విధానం అమల్లోకి తెచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. అది కూడా ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. తద్వారా ఒక్కసారి ఎన్రోల్ అయిన విద్యార్థి ఎక్కడికి పోతున్నారు? బడి మానేస్తున్నారా? రాష్ట్రంలో మరెక్కడైనా చేరుతున్నారా? అన్న సమగ్ర వివరాలను క్రోడీకరించవచ్చన్న ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతోంది. ఒకవేళ విద్యార్థి బడి మానేస్తే గుర్తించేందుకు ఇప్పటికే చైల్డ్ ట్రాకింగ్ సిస్టం ఉంది. అయితే దానిని మరింత పకడ్బందీగా అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. చైల్డ్ ట్రాకింగ్‌లో భాగంగానే డిజిటల్ టీసీల విధానాన్ని తీసుకురావడం ద్వారా విద్యార్థుల ఎన్రోల్మెంట్లో తేడాలు లేకుండా చూడవచ్చని, విద్యార్థులు లేకపోయినా ఎక్కువమంది ఉన్నట్లు చూపించే తప్పిదాలకు చెక్ పెట్టవచ్చన్న ఆలోచనలతో ఈ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 42,834 ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల, మైనార్టీ, మదర్సా విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిల్లో 65,29,072 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 52 సెంట్రల్ స్కూళ్లు ఉండగా, వాటిల్లో 36,594 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇబ్బందులు తొలగించేందుకే.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని స్కూళ్లు అన్ని యూడైస్‌తో అనుసంధానమై ఉన్నాయి. దీంతో వీటి పరిధిలో విద్యార్థుల ట్రాన్స్ఫర్ ఒక స్కూల్ నుంచి మరో స్కూల్‌కు, ఒక మేనేజ్మెంట్ నుంచి మరో మేనేజ్మెంట్కు బదిలీ చేసే క్రమంలో ఆ విద్యార్థి టీసీతోపాటు ఇతర సర్టిఫికెట్లను ఆ విద్యార్థి స్కూల్‌కు పంపిస్తారు. మరోవైపు సెంట్రల్ స్కూళ్లు కూడా యూడైస్‌తో అనుసంధానం అయి ఉన్నప్పటికీ వాటిల్లో చేరాలనుకునే విద్యార్థులకు మాత్రం డిజిటల్ సంతకంతో కూడిన సర్టిఫికెట్లను అందజేస్తారు. తాజా విధానంతో సెంట్రల్ స్కూళ్లలో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడవచ్చని భావిస్తోంది. మరోవైపు పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు కూడా డిజిటల్ టీసీ, ఇతర సర్టిఫికెట్లను ఇవ్వడం ద్వారా ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్న నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు అన్నింటిలో కంప్యూటర్లు వినియోగంలో ఉన్నాయి. వాటిల్లో ఈ వి«ధానం అమలుకు ఎలాంటి ఇబ్బంది లేదని పాఠశాల విద్యా కమిషనర్ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఎలా అమలు చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నామని, వాటిల్లో అమలుకు కంప్యూటర్లు కొనుగోలు చేయాలా? ఎలా ముందుకు సాగాలన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వివరించారు. -
బడికి వెళ్లాలంటే..అడవికి వెళ్లాలా?
సాక్షి, అశ్వారావుపేటరూరల్: వారంతా రేపటి పౌరులు.. ఈ భావి భారత పౌరులు బడిబాట పట్టాలంటే ముందుగా అడవి బాట పట్టాల్సిందే. అన్ని సౌకర్యాలు ఉన్న గ్రామాల్లోనే ప్రభుత్వ బడులు చాలా వరకు విద్యార్థులలేమితో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో దాదాపు ముపైమందికిపైగా విద్యార్థులున్న ఆ గిరిజన గ్రామంలో మాత్రం సర్కారు బడి లేకుండా పోయింది. దాంతో ఆ గిరిజన బిడ్డలు ఉన్నత విద్య కోసం మూడు మైళ్ల దూరం అడవిబాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో మారుమూల అటవీ ప్రాంతంలో కొండతోగు అనే గిరిజన గ్రామం ఉంది. ఈ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం మాత్రమే ఉండగా, ప్రాథమిక పాఠశాల లేదు. దాంతో ప్రతి ఏటా బడులు తెరిస్తే చాలు.. ఈ అడవి బిడ్డలు విద్య కోసం మూడూ కిలోమీటర్ల దూరంలో ఉన్న పండువారిగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఆ గ్రామంలో ఉన్న బడికి వెళ్లాలంటే కొండతోగు నుంచి అడవి మార్గంలో కాలినడకన వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్లాల్సిందే. వర్షకాలం సీజన్లో ఐతే అడవి మార్గంలో ఉన్న కొండతోగు వాగు పారుతుంది. వర్షం తగ్గిన తర్వాత మెకాళ్లలోతులో ఉండే నీళ్లు దాటుకొని ఈ చిన్నారులు సాహసంతో బడికి వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు గత ఐదేళ్లుగా నెలకొని ఉన్నప్పటికీ అధికారులు, పాలకులకు కనీసం పట్టడం లేదు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘బడిబాట’కార్యక్రమాన్ని విద్యాశాఖ అమలు చేస్తున్న క్రమంలో ఈ ‘అడవి బాట’పట్టుతున్న గిరిజన బిడ్డల అవస్థలను సైతం దృష్టిలో పెట్టుకొని, ఆ గ్రామంలో సర్కారు పాఠశాలను ఏర్పాటు చేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందేమో కాస్తా ఆలోచించాలి. -
బడిబాట షురూ
పాపన్నపేట (మెదక్): బడీడు పిల్లలు బడిలో ఉండేలా ప్రభుత్వం రూపొందించిన ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం శుక్రవారం జిల్లాలో ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించారు. ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి చదువుకుంటే వచ్చే ఫలితాలను వివరించారు. ప్రభుత్వ బడుల్లో చదువుకుని ప్రభుత్వం నుంచి అమలయ్యే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బడిబయట ఉన్న పిల్లలందరినీ బడిలో చేర్పించాలని కోరారు. పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యాశాఖ జిల్లా నోడల్ అధికారి మధుమోహన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించి ఉన్నత విద్యా ప్రమాణాలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ బడుల గొప్పతనాన్ని ప్రజలకు చేరవేసి విద్యా లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
తప్పని భారం!
కొత్తకోట: జూన్ మాసం వచ్చిందంటే తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేసి వెళ్తుంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నెల కావడంతో మామూలు రోజులకంటే సామాన్యులకు ఖర్చులు రెట్టింపవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 14 మండలాల పరిధిలో మొత్తం 852 పాఠశాలలు ఉండగా ఇందులో ఉన్నత పాఠశాలలు 101 , ప్రాథమికోన్నత పాఠశాలలు 58 , ప్రాథమిక పాఠశాలలు 61, కేజీబీవీలు 15, మోడల్ స్కూళ్లు 3, రెసిడెన్సియల్ స్కూళ్లు 13, మూడు ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 55,644 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తమ పాఠశాలల్లో అడ్మిషన్లు పరిమితంగా ఉన్నాయంటూ విస్తృత ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను మభ్య పెడుతున్నారు. టెక్నో, ఈ–టెక్నో, మోడల్, డీజీ స్కూల్ అనే వివిధ రకాల తోక పేర్లతో తల్లిదండ్రులను ఆకర్షితులను చేస్తున్నారు. పాఠశాలల్లో సాధించే ర్యాంకులు, ఉత్తమ మార్కులను వివిధ మాద్యమాల్లో ప్రచారం చేస్తూ అడ్మిషన్లు పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ తల్లిదండ్రులను నిలువునా దోచుకుంటున్నారు. ఏ పాఠశాలలో చేర్పించాలి? ఈనెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చేస్తున్న ప్రచారం చూసి తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పిస్తే బాగుంటుందో తేల్చుకోలేక తల్లిదండ్రులు తికమక పడుతున్నారు. కొన్ని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు తాము నియమించుకున్న పీఆర్ఓల ద్వారా అడ్మిషన్లు పెంచుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. వారి మాయమాటలు నమ్మి డొనేషన్లు ఇచ్చిన తల్లిదండ్రులను అయోమయానికి గురవుతున్నారు. అడ్మిషన్లు పెంచుకునేందుకు ఇతర పాఠశాలలపై కుట్రలు చేసేందుకు సైతం వెనకాడడం లేదు. ఇప్పటికే తల్లిదండ్రుల సెల్ నంబర్లను సేకరించిన యజమాన్యాలు అడ్మిషన్ల కోసం తరచూ ఫోన్లకు మేసేజ్‌లు చేయడంతోపాటు తరచూ ఫోన్లు చేస్తూ విసుగెత్తిస్తున్నారు. ఏటేటా పెరిగిపోతున్న భారం ఏటేటా ఫీజుల భారం భారీగా పెరుగుతూనే ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజులను మరింతగా పెంచేసి తల్లిదండ్రులు ఆలోచించే సమయం కూడా లేకుండా ప్రవేశాలు ఇచ్చేస్తున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకే రూ. 10 వేల నుంచి రూ.20 వేల వరకు ఫీజలు లాగుతున్నారు. దాంతోపాటు అడ్మిషన్ ఫీజు, బస్సు ఫీజులు, స్పెషల్ ఫీజులను ఇష్టారాజ్యాంగా పెంచేస్తున్నారు. దీనికితోడు పాఠశాలల్లోనే ఏర్పాటు చేసిన దుకాణాల్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలను కొనుగోలు చేయాలని నిబంధనలు పెడుతున్నారు. అలాగే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం రేట్లు పెరిగిపోయాయి. అధికారుల కళ్లముందే ఈ తతంగమంతా జరుగుతున్నా విద్యా హక్కు చట్టం నిబంధనలు పాటించకపోయినా పట్టించుకోకపోగా ఫీజుల నియంత్రణపై అధికారులు దృష్టి సారించకపోవడంతో తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రతీ పాఠశాలలో పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణను చేపట్టాల్సి ఉండగా ఏ పాఠశాలలో అలాంటి చర్యలు కనిపించడం లేదు. నామ్కేవాస్తెగా బడిబాట ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్యను పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం యేటా బడిబాట కార్యక్రమాన్ని చేపడుతోంది. అయినా ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదు. ఎన్నో కోట్ల రూపాయాలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్న విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడం లేదు. విద్యాశాఖా«ధికారులు ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ నివేదికలు జిల్లాలో డ్రాపౌట్ల సంఖ్య పెరిగిపోతుందుని స్పష్టం చేసిన అధికారులకు కనువిప్పు కలగడంలేదు. -
నేటి నుంచే బడిబాట
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఈ నెల 19 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేశారు. ఐదు రోజుల పాటు రోజుకో కార్యక్రమాన్ని చేపట్టి సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా బడిబయటి పిల్లల్ని బడిలో చేర్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం, పాఠశాలలను శుభ్రపర్చుకోవడం, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు జిల్లాలోని ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులను కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నారు. డ్రాపౌట్ తగ్గించడమే లక్ష్యం.. బడియట ఉన్న పిల్లల్ని బడిలో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 709 మంది పిల్లలు బడిబయట ఉన్నారు. వీరిలో 453 మంది బాలురు, 256 మంది బాలికలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. అయితే ఈ కార్యక్రమం జూన్ 4 నుంచి 12 వరకు నిర్వహించాల్సి ఉండగా, జిల్లాలో ఎండ తీవ్రత కారణంగా పాఠశాలలకు 11 వరకు సెలవులు పొడిగించిన విషయం విధితమే. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 14 నుంచి 19 వరకు చేపట్టనున్నారు. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో ఐదేళ్లు నిండిన పిల్లల్ని పాఠశాలల్లో చేర్చడం, 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులను ప్రాథమికోన్నత పాఠశాలలు, 7వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో చేర్పించడం, ఎన్రోల్మెంట్ తక్కువ ఉన్న పాఠశాలలను గుర్తించి విద్యార్థుల తల్లిదండ్రులకు సర్కారు బడుల గురించి వివరించి విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా బాలికల విద్య ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి అనాథ పిల్లల్ని కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమాలను చేపట్టనున్నారు. సర్కారు బడులను కాపాడుకునేందుకు.. ఆదిలాబాద్ జిల్లాలో 1,287 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 970 ప్రాథమిక పాఠశాలలు, 122 ప్రాథమికోన్నత పాఠశాలలు, 195 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 94,737 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే జిల్లాలో దాదాపు 50 పాఠశాలల్లో పది కంటే విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నారు. జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు దాదాపు 10 వరకు ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోనే ఐదు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఆ పాఠశాలలు మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ప్రభుత్వ పాఠశాలలను రక్షించేందుకు బడిబాట కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యతోపాటు పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్తున్నారు. రోజువారీగా కార్యక్రమాలు.. మొదటి రోజు(14న): మన ఊరు–మన బడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆవాసా ప్రాంతంలో బడిబాట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ర్యాలీలు, కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహిస్తారు. పాఠశాల విద్యాకమిటీ, ఉపాధ్యాయులతో కలిసి వార్షిక ప్రణాళిక తయారు చేస్తారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు తీర్మానాలు చేస్తారు. రెండో రోజు(15న): బాలికల విద్య, ఆరోగ్య పరిరక్షణ కోసం పంపిణీ చేయబడుతున్న ఆరోగ్య కిట్ల గురించి విద్యార్థినులకు అవగాహన కల్పిస్తారు. కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో విద్యార్థినుల తల్లిదండ్రులను పిలిచి సౌకర్యాల గురించి తెలియజేస్తారు. పాఠశాలల్లో బాలికల విద్యపై తీసుకోనున్న మార్షల్ ఆర్ట్, జీవన నైపుణ్యాలు, ప్రత్యేక అవసరాలు గల బాలికలకు స్టైఫండ్, తదితర వాటి గురించి వివరిస్తారు. మహిళ అధికారులను పిలిచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు(17న): చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తారు. పాఠశాలల్లో పండగ వాతావరణం కల్పించడం, ఉన్నత పాఠశాలల్లో నూతనంగా చేరిన పిల్లల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహిస్తారు. బడిబాట ప్రాధాన్యత, చదువు విశిష్టత తెలియజేసే సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారు. నాలుగో రోజు(18న): పాఠశాలల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను ఉపాధ్యాయులు, విద్యార్థులకు అప్పజెప్పడం. పాఠశాల ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం, వాటర్ ట్యాంక్ శుభ్రపర్చుకోవడం, తరగతి గదిలో వృథా సామగ్రిని తొలగించడం, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఐదవ రోజు(19న): బడిబయట ఉన్న పిల్లల్ని బడిలో చేర్పించడం. టాస్క్‌ఫోర్స్ కమిటీ ద్వారా బాల కార్మికులను విముక్తి చేయడం, పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులను పాఠశాలకు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి వారి సేవలను స్వచ్ఛందంగా పాఠశాలకు వినియోగించుకోవడం. విద్యార్థుల తల్లిదండ్రులు, యాజమాన్య కమిటీల సమావేశం నిర్వహించడం. ఇంటింటికి తిరుగుతూ పిల్లల్ని బడిలో చేర్పించడం. పదో తరగతిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులను, విద్యార్థులను సన్మానించే కార్యక్రమాలు చేపట్టనున్నారు. బడిబాటను పకడ్బందీగా నిర్వహిస్తాం బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. ఈ నెల 14 నుంచి 19 వరకు రోజుకో కార్యక్రమాన్ని చేపడుతాం. శుక్రవారం బోథ్ మండలంలోని మర్లపల్లిలో బోథ్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 15న ఆదిలాబాద్ మండలంలోని పిప్పల్ధరిలో బడిబాట కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొంటారు. ఏ ఒక్క చిన్నారి కూడా బడిబయట ఉండకుండా ఉపాధ్యాయులు కృషి చేయాలి. – ఎ.రవీందర్‌రెడ్డి, డీఈఓ -
అవస్థల బడి
నాలుగు చినుకులు పడగానే కురిసే పై ఫొటోలోని ఈ పాఠశాల నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో ఉంది. ఈ ప్రాథమిక పాఠశాలలో 81 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు.. ఒక హెచ్ఎం ఉన్నారు. వర్షాకాలం ప్రారంభం కానున్న తరుణంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల బాధలు వర్ణనాతీతం. కాళోజీసెంటర్: అందరికీ విద్య అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాని కి అవాంతరాలు తప్పడం లేదు. ఉపాధ్యాయులకు కొరతకు తోడు పలు చోట్ల మౌలిక వసతులు వేధిస్తుండడంతో సర్కారు బడులు సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం కాకుండానే ఈ విద్యా సంవత్సరం సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 460 ఉండగా 15,972 మంది విద్యార్థులు, ఉన్నత పాఠశాలలు 83 లో 4,422 మంది విద్యార్థులు, హైస్కూల్ పాఠశాలలు 153లో 21,727 మంది, కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలు 12, మోడల్ స్కూల్స్6, ఇవ్వే కాకుండా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 8, ఎస్టీ గురుకులాలు 2, మొత్తం 724 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో45,275 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 2,988 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పినపటికీ క్షేత్రస్థాయిలో అమలు కాక ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, మరుగుదొడ్లు మద్యాహ్న భోజనం కోసం వంట గదులు లేని పాఠశాలలు ఉన్నాయి. ప్రతి ఏటా ఎమ్మార్సీ సమావేశంలో సమస్యలను గుర్తించి నివేదికలు అడుగుతున్నారే తప్ప సమస్యలను పరిష్కరించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నా యి. అతేకాకుండా కొన్ని పాఠశాలల భవనాలు శిధిలావస్థల్లో ఉన్నాయి. వీటి నిర్మాణం కోసం చర్యలు తీసుకోన్నప్పటికీ నత్తనడకన పనులు సాగుతున్నాయి. 36 పాఠశాలలు మూత రూరల్ జిల్లా పరిధిలో 460 ప్రాథమిక పాఠశాలలు ఉండగా విద్యార్థులు లేక గత ఏడాదే 36 పాఠశాలలు మూతపడ్డాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల తల్లీదండ్రుల ఆలోచన మారుతున్నది. తమబిడ్డల చదువులో ఉత్తమశ్రేణిలో మార్కులు సాధించాలని, ఇంగ్లిష్‌లో మాట్లాడాలని కళలు కంటున్నారు. అదే స్థాయిలో గ్రామీ ణ పాంతాల్లో కార్పొరేట్ స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడి యం లేక ఉత్తమ ఫలితాలు రాక ప్రైవేట్ బడుల వైపు మొగ్గు చూపడంతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయనే విమర్శలు వçస్తున్నాయి. ఉద్యోగ బాధ్యతలు మరిచి.. ఉద్యోగం చేసే చోటనే ఉండాలనే నిబంధనలకు విరుద్ధంగా పట్టణాల నుంచి బస్సుల్లో ప్రయాణం చేయడం మూలంగా పాఠశాలకు సమయానికి హాజరు కావడం లేదని స్థానిక ప్రజల నుంచి విమర్శలు లేకపోలేదు. అంతే కాకుండా సాయంత్రం సమయం కంటే ముందే తిరుగు ప్రయాణం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొంత మంది టీచర్లు ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకే ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉద్యోగ బాధ్యతలను విస్మరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోవడం మూలంగానే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా తయారై బడులు మూతపడుతున్నాయని పలు గ్రామాల ప్రజలు తెలుపుతున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం.. సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి కృషిచేస్తున్నాం. 60 పాఠశాలలు టెన్త్ క్లాస్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. గత సంవత్సరం 88.75 శాతం ఉత్తీర్ణత సాధిస్తే ఈ సంవత్సరం 95.87 శాతం సాధించాం. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తాం. – పెగడ రాజీవ్, ఇన్చార్జి డీఈఓ -
తర'గతి' మారుతోంది
సాక్షి, సీతంపేట (శ్రీకాకుళం): వీధి బడి రాత మారనుంది. సర్కారు స్కూళ్ల తర‘గతులు’ కొత్త దారి పట్టనున్నాయి. గత ప్రభుత్వపు పాలనలో కార్పొరేట్ విద్యాసంస్థలకు జరిగిన సాయం, ప్రభుత్వ బడులకు జరిగిన అన్యాయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ బడుల్లో కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగంపై ప్రజల్లో నమ్మకం కల్పించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి, తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ విధానాలు ఈ విద్యాసంవత్సరం నుంచే అమలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుం డడంపై హర్షం వ్యక్తమవుతోంది. అనేక సదుపాయాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంను ఉచితంగా అందిస్తున్నారు. తెలుగు మీడియంతోపాటు ఆంగ్ల మీడియంలోనూ బోధన జరుగుతోంది. ప్రభుత్వ బడుల్లో అర్హులైన ఎందరో ఉపాధ్యాయులు ఉన్నారు. ఒత్తిడి లేని నాణ్యమైన విద్యనందిస్తున్నారు. విశాలమైన తరగతి గదులున్నాయి. అయినా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. ధనవంతులే కాకుండా సాధారణ, మధ్య తరగతి ప్రజలు సైతం ప్రైవేటుకు మొగ్గు చూపుతున్నారు. గత ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాయడంతో ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యమైంది. మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమైంది. తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పోయింది. కొత్త ప్రభుత్వం ప్రక్షాళన దిశగా ముందుకు సాగుతోంది. ప్రభుత్వ బడులకు పూర్వవైభవం తీసుకువచ్చి తల్లిదండ్రుల్లో నమ్మకం కల్పించేందుకు సిద్ధమవుతోంది. కొత్త ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యాశాఖ క్యాలెండర్ పక్కాగా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆటపాటలతో చదువులు.. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో నూతన అధ్యయనానికి శ్రీకారం చుడుతోంది. విద్యార్థులపై ఒత్తిడి లేని విధంగా ఆటపాటలతో చదువులు సాగేలా సరికొత్త విద్యా విదానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. బండెడు పుస్తకాలతో బ్యాగులు మోస్తున్న విద్యార్థులకు భారాన్ని తగ్గించేలా శనివారం ఒక్క రోజు నో బ్యాగ్‌డేను అమలు చేయనున్నారు. వారంలో ఒక రోజు స్కూల్‌కు బ్యాగు లేకుండానే వచ్చి విద్యార్థులు రోజంతా ఆడుతూ, పాడుతూ చదివేలా సరికొత్తగా విద్యా క్యాలెండర్ రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీని కోసం విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయ సంఘాల సలహాలు సూచనలు తీసుకుని ఈ విద్యాసంవత్సరం నుంచే అమలయ్యేల కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. ప్రక్షాళన దిశగా కేంద్ర ప్రభుత్వం.. విద్యా విధానంలో పెను మార్పులు తీసుకువచ్చేలా కేంద్రం సైతం ప్రక్షాళన దిశగా అడు గు లేస్తూ నూతన విద్యా విధానానికి శ్రీకా రం చుడుతోంది. ఇందులో భాగంగానే ఇది వరకు పాఠశాల విద్యలో దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న 10+2 స్థానంలో 5+3+3+4 దశలుగా ప్రవేశపెట్టనుంది. 50 ఏళ్లుగా 1 నుంచి ఐదు తరగతి వరకు ప్రాథమిక, 6 నుంచి 8 వరకు ప్రాథమికోన్నత, 9.10 తరగతులు సెకండరీ, 11, 12 తరగతులు హ య్యర్ సెకండరీ, ఇంటర్మీడియెట్, ప్రీ యూనివర్సిటీ తదితర పేర్లతో నడుస్తోంది. కొత్తగా తీసుకువచ్చే విధానంలో పిల్లల్లో పుట్టినప్పటి నుంచి చోటు చేసుకునే శారీరక, మానసిక మార్పులకు అనుగుణంగా కేంద్రం పాఠశాల విద్యను 5+3+3+4 నాలుగు దశలుగా విభజించింది. దీని ప్రకారం ఫౌండేషనల్ స్టేజీ: 3 ఏళ్లు ప్రీ ప్రైమరీ స్కూల్ 1, 2 తరగతులు లేటర్ ప్రైమరీ/ప్రీపరేటరీ: 3, 4, 5మిడిల్/అప్పర్‌ప్రైమరీ: 6, 7, 8 తరగతులు శుభ పరిణామం రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం రానుంది. తద్వారా ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతుది. ఒత్తిడి లేని విద్యావిధానం, నోబ్యాగ్‌డే వంటి సీఎం ఆలోచనలకు అనుగుణంగా విద్యావిధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. – నెల్లి సత్యంనాయుడు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు, పెద్దూరు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ బడులపై నమ్మకం పెరుగుతుంది ప్రభుత్వ బడులకు జీవం పోస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయాలతో తల్లిదండ్రుల్లో ప్రభుత్వ బడులపై నమ్మకం పెరుగుతుంది. విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం, దానికి అనుగుణంగా విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించడం శుభపరిణామం. అలాగే ఉపాధ్యాయ సంఘాలను భాగస్వామ్యం చేయడంతో ప్రభుత్వ విద్యారంగానికి మరింత మేలు చేకూరుతుంది. – ఆరిక భాస్కరరావు, యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు -
పుస్తకాల దొంగలు
నిజామాబాద్‌నాగారం: ప్రభుత్వ పుస్తకాలను ప్రైవేట్‌గా అమ్మకానికి పెడుతున్నారు కొందరు అక్రమార్కులు. విద్యార్థులకు పంపిణీ చేయగా మిగిలిన పుస్తకాలను రాష్ట్ర కార్యాలయానికి తరలించాల్సి ఉంటుంది. అయితే, అలా వెనక్కి పంపించకుండా ఆటో నిండా పుస్తకాలను అక్రమంగా అమ్ముకున్న వైనమిది. జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకులానికి గతేడాది వచ్చిన పుస్తకాల్లో చాలా వరకూ మిగిలి పోయాయి. నిబంధనలకు విరుద్ధంగా వీటిని విక్రయించి సొమ్ము చేసుకునేందుకు అధికారులు ప్రింటింగ్ప్రెస్కు తరలించారు. గురుకుల పాఠశాల అధికారులు గుట్టుచప్పుడు కాకుండా నడిపించిన ఈ తతంగం ‘సాక్షి’ కంట పడడంతో ప్రింటింగ్‌ప్రెస్ నుంచి మరో స్థలానికి మార్చారు. సుమారు రూ.3.50 లక్షలకు పైగా విలువ చేసే వెయ్యి పుస్తకాలను ఆటోలో తరలించి, అమ్మకానికి పెట్టడం గమనార్హం. ఈ విషయమైన సంబధిత అధికారులను వివరణ కోరగా తమకేమీ తెలియదని బుకాయించడం విశేషం. నిబంధనలకు విరుద్ధంగా.. పేద విద్యార్థులు చదుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలను సరఫరా చేస్తోంది. ఐదో తరగతికి సంబంధించిన పుస్తకాల సెట్ ధర రూ.280 కాగా, ఆరో తరగతి రూ.363, ఏడో తరగతికి రూ.407, ఎనిమిదో తరగతికి రూ.520, తొమ్మిదో తరగతి పుస్తకాలకు రూ.584 చొప్పున ధర ఉంటుంది. అయితే, ప్రభుత్వం వీటిని ఉచితంగా సరఫరా చేస్తుంది. ఆయా పుస్తకాలపై ఫ్రీ అని కూడా ముద్రించి ఉంటుంది. ఆయా పుస్తకాలను పాఠశాలకు సరఫరా చేయగా, వాటిని విద్యార్థులకు పంపిణీ చేయాలి. ఏమైనా పుస్తకాలు మిగిలితే వాటిని నిబంధనల ప్రకారం రాష్ట్ర కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడి అధికారులు మాత్రం మిగిలిన పుస్తకాలను వెనక్కి పంపించకుండా బహిరంగ మార్కెట్లో అమ్మేందుకు ప్రయత్నించారు. వాస్తవానికి పుస్తకాలను బయట ఎట్టి పరిస్థితులో విక్రయించరాదు. కానీ, పాఠశాలకు సంబంధించిన పుస్తకాలు బహిరంగ మార్కెట్లోకి వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. రూ.లక్షల్లో సొమ్ము చేసుకున్నారు.. రెండు, మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటైన ఎస్సీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. ఈ సంవత్సరం 10వ తరగతి ప్రారంభం కానుంది. ప్రతి గురుకుల పాఠశాలలో ఒక్కో తరగతిలో రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్లో 40 మంది చొప్పున మొత్తం 80 మంది విద్యార్థులు ఉంటారు. కానీ కొన్ని స్కూళ్లలో 80 మంది విద్యార్థులు లేరు. ఈ క్రమంలో ప్రతి గురుకుల పాఠశాలకు సరఫరా చేసినట్లే ఆయా స్కూళ్లకు కూడా పుస్తకాలను సరఫరా చేశారు. ఇలా మిగిలి పోయిన పుస్తకాలను నిబంధనల ప్రకారం హైదరాబాద్‌లోని హెడ్‌ఆఫీస్‌కు తరలించాలి. చాలా చోట్ల పుస్తకాలను వెనక్కి పంపించారు. అయితే, జిల్లా కేంద్రంలో ఓ గురుకుల పాఠశాలకు సంబంధించిన పుస్తకాలను మాత్రం వెనక్కి పంపించలేదు. ఈ పుస్తకాలను విక్రయించేందుకు ఇటీవల ఆటోలో ఓ ప్రింటింగ్ ప్రెస్‌కు తరలించారు. వాస్తవానికి ఉచిత పుస్తకాలను అమ్మడం, కొనడం నేరం. కానీ, వాటిని విక్రయించి సొమ్ము చేసుకోవాలని కొందరు యత్నించడం విశేషం. గత రెండేళ్లకు సంబంధించి మిగిలి పోయిన పుస్తకాలను విక్రయించేందుకు తరలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. విచారణ చేయిస్తా.. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పుస్తకాలను విక్రయించరాదు. మిగిలి పోయిన పుస్తకాలను హైదరాబాద్‌కు పంపించాలి. మా గురుకులాలకు సంబంధించిన పుస్తకాలు ఎవరైనా బయటకు విక్రయించినట్లు తెలిస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. క్లీన్ అండ్ గ్రీన్ కింద ఫర్నిచర్, ఇతర పనికి రాని వస్తువులను మాత్రమే ప్రత్యేక కమిటీ ద్వారా విక్రయించి, వచ్చిన డబ్బులు స్కూల్ ఖాతాలో జమా చేయాలి. పుస్తకాలు మాత్రం అమ్మరాదు. – సింధూ, రీజినల్ కో–ఆర్డినేటర్ -
స్కూలు అమ్మలకు ఆసరా
సాక్షి కడప/ ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల కిందట ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. అవ్వతాతల కోసం వైఎస్సార్ పింఛన్ పథకాన్ని తీసుకొచ్చిన సీఎం వైఎస్ జగన్...కిడ్నీ బాధితులకు పింఛన్ కింద రూ. 10 వేలు, దివ్యాంగులకు రూ. 3 వేలు అందించేలా తొలి సంతకాన్ని చేసి దివంగత సీఎం వైఎస్సార్‌ను తలపించారు. ఆరోజు నుంచి ఈరోజు వరకు ఎడతెరిపి లేకుండా శాఖలపై సమీక్ష చేస్తూ ప్రతి పథకాన్ని పేదలకు అందేలా రూపకల్పన చేస్తున్నారు. మొదటగా పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని తయారు చేసి అందించే మహిళా కార్మికుల కష్టాలను అధ్యయనం చేసిన సీఎం వారి గౌరవ వేతనం పెంపునకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు రూ.1000 మాత్రమే...అందునా అది కూడా టీడీపీ సర్కార్ హయాంలో నెలనెల ఇవ్వని పరిస్థితి ఇప్పటికీ కూడా మూడు, నాలుగు నెలల గౌరవ వేతనం కూడా పెండింగ్‌లో పెట్టి ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా కార్మికులు పడుతున్న ఇబ్బందులను గమనించిన సీఎం వైఎస్ జగన్ రూ. 1000 నుంచి రూ. 3000లకు గౌరవ వేతనాన్ని పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో 5745 మందికి లబ్ది జిల్లాలో 3654 పాఠశాలల్లో సుమారు 2,17,536 మందికి పైగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు. వంట ఏజెన్సీల ద్వారా 5745 మంది మహిళలు పనిచేస్తున్నారు. వీరందరికీ కూడా సీఎం తీసుకున్న నిర్ణయంతో గౌరవ వేతనం నెలకు రూ.3 వేలు చొప్పున అందనుంది. మధ్యాహ్న భోజన కార్మికులు వంట వండే సమయంలో అనేక అవస్థలకు గురవుతున్నా వారిని ఎవరూ పట్టించుకోలేదు. ఒకపక్క సమస్యలు...మరోవైపు సక్రమంగా రాని గౌరవ వేతనం.....అదికూడా అంతంత మాత్రంగా ఇస్తుండడంతో అవస్థలు పడుతున్న వారి కష్టానికి సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్ని ఇవ్వనుంది.జిల్లాలో 5745 మంది మధ్యాహ్న భోజన కార్మికులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుండడంతో మహిళా కార్మికుల మోముల్లో చిరునవ్వులు విరజిల్లుతున్నాయి. వైఎస్సార్ అక్షయపాత్రగా నామకరణం ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. మొదటగా మధ్యాహ్న భోజన పథకానికి వైఎస్సార్ అక్షయపాత్రగా నామకరణం చేశారు. అంతేకాకుండా ఉన్నతాధికారులతో సమీక్షించి ప్రతి పాఠశాలలో నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. పథకానికి నామకరణం చేసిన ఆయన పిల్లల కడుపుకు అందించే ఆహార విషయంలోనూ ప్రతి ఒక్కరూ బాద్యతగా వ్యవహారించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మహిళా కార్మికుల్లో సంబరాలు మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. తక్కువ గౌరవ వేతనమే కాకుండా వారికి నెలనెల కూడా సక్రమంగా ఇవ్వలేదు. గౌరవ వేతనం పెంచుతామని హామి ఇచ్చినా దాన్ని అమలు చేయలేదు. వరత్నాలతోపాటు మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనాన్ని మేనిఫెస్టోలో లేకపోయినా....ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి వస్తూనే సీఎం వైఎస్ జగన్ వారికి న్యాయం చేశారు. దీంతో మధ్యాహ్న భోజన కార్మికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మహిళా కార్మికులు సంబరాలు చేసుకుంటూ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. -
గౌరవం పెరిగింది
అనంతపురం ఎడ్యుకేషన్: పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనదైన ముద్రను కనపరుస్తున్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్యాహ్న భోజన పథకం కార్మికుల గౌరవ వేతనం రెండింతలు చేశారు. రూ.1000 స్థానంలో రూ.3వేలకు పెంచిన గౌరవ వేతనం పట్ల కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2009లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గౌరవ వేతనం రూ.1000లు అమలు చేశారు. అప్పటి నుంచి అంతే మొత్తం అందుతోంది. గౌరవ వేతనం పెంచాలంటూ ఏళ్ల తరబడి పోరాటాలు చేసినా ఫలితం లేకపోయింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే గౌరవ వేతనం రెండింతలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గతంలో ఏ నెలలోనూ సక్రమంగా గౌరవ వేతనం ఇచ్చిన సందర్భం లేదని, కొత్త ప్రభుత్వంలో అలాంటి సమస్య ఉత్పన్నం కాదనే ఆశాభావం కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 7561 మంది ఎండీఎం కార్మికులు పని చేస్తున్నారు. ఒక్కొక్కరికి రూ. వెయ్యి ప్రకారం నెలకు రూ.75,61,000 గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయంతో గౌరవ వేతనం రెండింతలు కాగా.. ఇక నుంచి ప్రతి నెలా ప్రభుత్వంపై రూ.1,51,22,000 అదనపు భారం పడనుంది. ఇదిలాఉంటే ఇక నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని ‘వైఎస్సార్ అక్షయపాత్ర’గా పేరు మార్పు చేశారు. పథకం అమలు, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని.. పరిశుభ్రత పాటించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. రానున్న రోజుల్లో కార్మికులకు భోజనం తయారు చేసే పనిని తగ్గించి కేవలం వడ్డనకే పరిమితం చేస్తామన్నారు. వంట తయారీకి ఆధునిక వంటశాలలు నిర్మించాలని సీఎం ఆదేశించడం పట్ల కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అడ్రస్ లేని కోడిగుడ్లు మొన్నటిదాకా అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం పథకం అమలు అధ్వానంగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడి అమలులో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వారానికి ఐదు రోజులు కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉండగా.. ఫిబ్రవరి నుంచి కోడిగుడ్లు ఇవ్వడమే మానేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి సంబంధిత ఏజెన్సీకి పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఫలితం లేకపోయింది. సదరు ఏజెన్సీకి కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టడంతో కోడిగుడ్లు సరఫరా చేసేందుకు వెనుకడుగు వేశారు. పిల్లలకు పౌష్టికారాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అప్పటి సీఎం చంద్రబాబు పదేపదే ప్రకటనలు చేసినా.. కోడిగుడ్ల సరఫరా ఆగిపోయినా పట్టించుకోకపోవడం గమనార్హం. మా కష్టాలను గుర్తించారు కొత్త ముఖ్యమంత్రి మా కష్టాలను గుర్తించారు. వెయ్యి రూపాయల గౌరవవేతనం ఏ మూలకు సరిపోయేది కాదు. రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. – లక్ష్మిదేవి, బుళ్లసముద్రం, మడకశిర మండలం చంద్రబాబు మోసం చేశారు గౌరవ వేతనం పెంచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తూ జీఓ ఇచ్చినా బడ్జెట్ కేటాయించలేదు. ఎన్నికల ముందు ప్రకటన చేసి చేతులు దులుపుకొన్నారు. పెంచిన గౌరవ వేతనానికి సంబంధించి ఫిబ్రవరి నుంచి అరియర్స్ ఇచ్చేలా చూడాలి. – నాగమణి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి -
బడి తెరుసుడు.. పుస్తకాలిచ్చుడు..
ఖమ్మంసహకారనగర్: విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పుస్తకాల కోసం ఇబ్బందిపడకుండా.. పాత పుస్తకాలతోనే సరిపెట్టుకోకుండా.. కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం ఆ మేరకు పాఠశాలలు తెరిచే రోజు విద్యార్థుల చేతిలో పుస్తకాలు ఉంచేందుకు ముందుగానే ముద్రణ ప్రారంభించి.. వాటిని జిల్లాకు చేరవేసే చర్యలు చేపట్టింది. 2019–20 విద్యా సంవత్సరం ప్రారంభం లోగానే విద్యాశాఖాధికారులు పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. జూన్ ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న దృష్ట్యా పాఠ్య పుస్తకాల పంపిణీకి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రతి ఏడాది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సకాలంలో అందకపోవడంతో విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారు. దీంతో చదువు అభ్యసించడం కష్టంగా మారుతోంది. కొందరు నిరుపేద విద్యార్థులు ప్రైవేట్‌గా పాఠ్య పుస్తకాలు కొనుగోలు చేసి చదువుకోవాల్సి వస్తోంది. పాఠ్య పుస్తకాలు అందే సరికి సగం విద్యా సంవత్సరం ముగుస్తుండడం, అవసరమైన వాటిలో సగం పుస్తకాలు మాత్రమే అందుతుండడం వంటి చర్యలతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు కూడా అనేక పోరాటాలు చేసిన సందర్భాలున్నాయి. అయితే ప్రభుత్వం విద్యార్థులు పాఠ్యపుస్తకాల కోసం ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా పుస్తకాలు విద్యార్థులకు చేరాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. జిల్లాకు చేరిన పుస్తకాలు.. 2019–20 విద్యా సంవత్సరం జూన్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నది. అప్పట్లోగానే పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు చేరనున్నాయి. ఎన్ని పాఠ్య పుస్తకాలు అవసరం అవుతాయనే దానిపై జిల్లా విద్యాశాఖాధికారులు పాఠశాలలవారీగా వివరాలను రాష్ట్ర విద్యాశాఖకు పంపించారు. దీని ఆధారంగా పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 5,64,620 పాఠ్య పుస్తకాలు అవసరం అవుతాయని గుర్తించారు. ఇప్పటివరకు 4,51,302 పుస్తకాలు జిల్లాకు చేరాయి. ఇంకా 1,13,318 పుస్తకాలు జిల్లాకు చేరాల్సి ఉంది. ఇవి కూడా త్వరలోనే జిల్లాకు చేరనున్నాయి. క్రమసంఖ్య.. లోగో.. విద్యార్థులకు అందజేసే పుస్తకాలు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టింది. విద్యార్థులకు అందజేసిన పుస్తకాలను వారు అమ్ముకోకుండా.. వాటిపై క్రమసంఖ్యతోపాటు ప్రభుత్వ పుస్తకాలు ఉచితంగా అందజేసినట్లు సూచించే లోగోను కూడా ముద్రించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పుస్తకాలు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అందించారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఈ పాఠ్య పుస్తకాలు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల వద్ద మాత్రమే ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి చర్యలు చేపట్టారు. జూన్ ఒకటిలోగా పుస్తకాలు.. జిల్లా కేంద్రానికి చేరుకున్న పాఠ్య పుస్తకాలను త్వరలోనే మండలాలవారీగా పంపించనున్నాం. అక్కడి నుంచి ఆయా పాఠశాలలకు అందిస్తారు. ఈ పుస్తకాలన్నింటినీ జూన్ 1వ తేదీన పంపిణీ చేస్తారు. ప్రభుత్వం అందిస్తున్న పాఠ్య పుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – పి.మదన్మోహన్, డీఈఓ, ఖమ్మం -
వేధిస్తే వేటాడుతారు..!
కరీంనగర్‌క్రైం: మహిళలు, యువతులు, విద్యార్థినులను వేధించే పోకిరీలను షీటీమ్స్ కట్టడి చేస్తున్నాయి. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగి పక్కా ఆధారాలు సేకరించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నాయి. కరీంనగర్ కమిషనరేట్‌గా మారిన తర్వాత మహిళలపై వేధింపులకు చెక్ పెట్టేందుకు 2016 నవంబర్ 3న పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి షీటీమ్స్ ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లోని షీటీంలు ఈవ్‌టీజింగ్‌లను వీడియో రికార్డ్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ పద్ధతిని కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోనూ అమలు చేస్తున్నారు. ఈవ్‌టీజింగ్‌ను అడ్డుకుని వారిని పట్టుకునేందుకు షీటీం సభ్యులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. మొదట ఈవ్‌టీజింగ్ జరుగుతున్న ప్రాంతాలను గుర్తిస్తారు. అనంతరం షీటీం సభ్యులను రంగంలోకి దింపుతారు. ఈవ్‌టీజింగ్‌లకు పాల్పడుతున్న వారిని వీడియో కెమెరాలో రికార్డ్ చేసిన తర్వాత రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. పోలీస్స్టేషన్లకు తరలించి వారి కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. వెంటపడి వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై మహిళల ఫిర్యాదుల ద్వారా వలపన్ని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతీ కేసును కూడా ఒక కేసు స్టడీగా ఎక్కడా ఆరోపణలకు తావులేకుండా ఆకతాయిలను అగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో దాదాపు ప్రతీ కాలేజీ, బస్టాప్, ఆర్టీసీ బస్టాండ్ల వద్ద షీ బృందాలు పని చేస్తున్నాయి. వీటికి కరీంనగర్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ పర్యవేక్షణలో మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ సంతోష్‌కుమార్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ వారం కేసులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. వాట్సాప్‌కు పోలీస్ స్పందన.. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో వేములవాడకు వెళ్తున్న మహిళల పట్ల ముగ్గురు ఆటో డ్రైవర్లు వెంటపడి వేధింపులకు పాల్పడడమే కాకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ వేధించారు. దీంతో సదరు మహిళ వెంటనే ఆటోను ఫొటో తీసి సీపీ కమలాసన్‌రెడ్డి, షీటీం ఇన్చార్జి సంతోష్‌కుమార్‌లకు పంపించింది. రంగంలోకి దిగిన షీటీం ఇన్చార్జి బృందం ఆటోడ్రైవర్లను పట్టుకుని కటకటాల్లోకి పంపారు. వేధింపులు, ఈవ్‌టీజింగ్‌లపై మహిళలు నేరుగా ఫిర్యాదు చేయడానికి ఇబ్బందులు పడుతుంటే వాట్సాప్, హక్‌ఐ, ఫేస్బుక్ ద్వారా ఫిర్యాదు చేసినా షీటీంలు స్పందిస్తున్నాయి. షీటీం వాట్సప్ నంబర్ 9440795182. అందుబాటులో ఉన్నాయి. కాలేజీల్లో విద్యార్థినులు, ఉద్యోగినులు, మహిళలు వేధింపులకు గురైతే ఆయా నంబర్లకు కాల్ చేసి చేప్పడం లేదా మెయిల్ చేసినా షీటీం స్పందించి చర్యలు తీసుకుంటుంది. ఫిర్యాదుదారుల వివరాలు బయటకు తెలియకుండా జాగ్రత్తలు తీసకుంటున్నారు. అమాయకులు బలి కాకుండా పగడ్బందీగా వీడియో రికార్డ్ చేసి పక్కాగా ఈవ్టీజర్లనే పట్టుకుంటున్నారు. మొదటిసారి పట్టుబడితే కౌన్సెలింగ్, రెండోసారి పట్టుబడితే బైండోవర్, మూడో సారి పట్టుబడితే జైలుకు పంపిస్తున్నారు. అవగాహన సదస్సులు.. షీటీంలు ఏర్పాటు చేయడమే కాకుండా వాటి పనితీరుపై షీటీం ఇన్చార్జి ఇన్స్పెక్టర్ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో కాలేజీల్లో, యువతులు, ఉద్యోగుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ కాలేజీల్లో 89 అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రతీ వారం ఏదో కాలేజీ, కార్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. షీటీంలు ఎలా పని చేస్తాయి, వేధింపుల సమయంలో ఎలా స్పందించాలో వివరిస్తున్నారు. పోకిరీల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కాలేజీ యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తున్నారు. పట్టుబడిన వారిలో.. షీటీంలు ఏర్పాటు చేసిన తర్వాత పట్టుబడిన వారిలో మైనర్లు, 50 ఏళ్ల దాటిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంటున్నారు. మైనర్లకు కొందరు తల్లిదండ్రులు వేగవంతమైన బైకులు కొనివ్వడంతో వారు చదువులు మాని విద్యార్థినుల వెంటపడి వేధింపులకు దిగుతున్నారు. ఇంట్లో మృధుస్వభావిగా ఉంటూ బయటకు రాగానే విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. దీంతో షీటీం బృందాలు వారి ఆగడాలను వీడియో రికార్డ్ చేసి మరీ పట్టుకుంటున్నారు. – 2016 నవంబర్ 3న ప్రారంభించిన షీటీంలు ఇప్పటి వరకు 1,607 మందిని పట్టుకున్నాయి. వారిలో మైనర్లు 139 మంది, 19 నుంచి 24 ఏళ్లలోపు వారు 530 మంది, 25 నుంచి 35 ఏళ్ల లోపు వారు 377 మంది, 36 నుంచి 50 ఏళ్లలోపు వారు 470 మంది, 50 ఏళ్లు అపైన 91 మందిని పట్టుకున్నారు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు పోకిరీలపై 18 కేసులు నమోదు చేశారు. వీరిలో మొదటి తప్పుగా బావించి 1469 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. 120 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. సుమారు 50 వేల పైగా విద్యార్థినులు, మహిళలకు హక్‌ఐ ఆప్లికేషన్ డౌన్లోడు చేయించారు. విద్యార్థినులకు ఎంతో భరోసా షీటీం ఏర్పాటు చేయడమనేది విద్యార్థినులకు ఎంతో భద్రత కలిగిస్తోంది. పోకిరీల వేధింపుల నుంచి రక్షణ పొందవచ్చు. విద్యార్థినులు వీటిపై మరింత అవగాహన పెంచుకోవాలి. వేధింపుల వల్ల నష్టపొతున్న విషయం కూడా ఈవ్‌టీజర్లకు తెలియాలి. స్వీయరక్షణ పద్ధతుల్లో కూడా విద్యార్థినులు, యువతులు శిక్షణ పొందాలి.– గాజుల దీప్తి, విద్యార్థిని అవగాహన కలిగి ఉండాలి.. షీటీం పని విధానంపై అవగాహన కలిగి ఉండాలి. మహిళలకు ముఖ్యంగా విద్యార్థినుల భద్రత కోసం షీటీంలను ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల వివరాలు బయటకు చెప్పకుండా ఈవ్‌టీజర్లపై చర్య తీసుకోవడం మంచి పరిణామం. గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులకు నిత్యం వేధింపులు తప్పడం లేదు. ఈవ్‌టీజింగ్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.– డి మాలతి, బీటెక్ విద్యార్థిని మరింత బలోపేతం చేస్తాం.. సీపీ ఆదేశాల మేరకు షీటీంలను మరింత బలోపేతం చేస్తాం. ప్రస్తుతం 20 టీంలు పని చేస్తున్నాయి. త్వరలో మరిన్ని పెంచడంతోపాటు ఆధునిక గాడ్జెట్ అందిస్తాం. ఈవ్‌టీజర్లపై షీటీం సభ్యులకు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం. ఎలాంటి అనుమానాలు, అపోహాలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తూ ఈవ్‌టీజర్లను పట్టుకుంటున్నారు. విద్యార్థినులు, మహిళలు అవగాహన కలిగి ఉండాలి. ఈవ్‌టీజింగ్ చేసినా, వేధించినా వెంటనే 9440795182కు సమాచారం అందించండి.– సంతోష్‌కుమార్, ఇన్స్పెక్టర్, మహిళా పోలీస్‌స్టేషన్, షీటీం ఇన్చార్జి -
వేతన వెతలు..
నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను విద్యావలంటీర్లతో భర్తీ చేస్తోంది. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందడం వల్ల ఏర్పడిన ఖాళీలతో పాటు.. ఎప్పటి నుంచో ఉన్న పోస్టులను విద్యావలంటీర్లతో నింపుతోంది. వీరు ప్రభుత్వ ఉపాధ్యాయుతో సమానంగా బోధిస్తూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నారు. కానీ విద్యా వలంటీర్లకు వేతనాల చెల్లింపులో మాత్రం ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. వీరికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలు ముగిసి సుమారు 20 రోజులు కావడంతో.. వేతనాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. 596 మంది విద్యా వలంటీర్లు.. జిల్లాలో 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 596 ఉపాధ్యాయ పోస్టుల్లో విద్యావలంటీర్లను భర్తీ చేసింది. వీరికి నెలకు రూ.12,000 వేతనం ఇస్తోంది. వీరితో ఉపాధ్యాయులతో సమానంగా పని చేయిస్తున్నారు. కానీ నెలనెలా ఇవ్వాల్సిన వేతనాలు మాత్రం మూడు, నాలు గు నెలలకోసారి చెల్లిస్తూ.. ఇబ్బందులు పెడుతున్నారు. మూ డు నెలలకోసారి వేతనాలు ఇస్తుండడం వల్ల ఆ సమయాల్లో పండుగలు వచ్చినా వేతనాలు అందక పస్తులుండాల్సిన పరిస్థితి దాపురిస్తోంది.వాస్తవంగా పాఠశాలలు ముగిసేలోపే వారికి వేతనాలు అందించాలి. కానీ నేటికీ వేతనాలు అందకపోవడంతో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూ.1.50 కోట్ల బకాయిలు.. విద్యా వలంటీర్లకు ఇచ్చే అరకొర వేతనం మూడు నెలలుగా అందించకపోవడం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 596 మంది విద్యా వలంటీర్లకు దాదాపు రూ.1.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటి కోసం ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు లేఖలు రాశారు. కానీ ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు విడుదల కాలేదు. ఈ విషయమై విద్యాశాఖ అధికారులను సంప్రదిస్తే ఈ వారంలో వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. జూన్ 1 నుంచే పాఠశాలలు పునఃప్రారంభం ఈ విద్యాసంవత్సరంలో జూన్ 1వ తేదీనే పాఠశాలలు పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయిచింది. గతంలో జూన్ 12 నుంచి పాఠశాల పునః ప్రారంభించేవారు. గత సంవత్సరం కూడా జూన్ 1 నుండే పాఠశాలలను పునః ప్రారంభించాలని విద్యా క్యాలెండర్ నిర్ణయించినా ఎండల తీవ్రతతో దాన్నిజూన్ 12కు వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ ఉండడంతో అప్పటికి పాఠశాలలు ప్రారంభం కాకపోవడం వల్ల తెలంగాణ సంబరాలు అంత ఉత్సాహంగా జరగడంలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం విద్యా క్యాలెండర్‌నే మార్పుచేసి జూన్ 1 నుంచే పాఠశాలలను పునః ప్రారంభిచాలని నిర్ణయించింది. పాఠశాలలు ప్రారంభం కావడానికి ఇంకా 25 రోజులు గడువు ఉంది. ఈలోపైనా వేతనాలు అందుతాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. -
జూన్ నెలాఖరుకి కొత్త టీచర్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త టీచర్లను నియమించేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. జూన్ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8,792 పోస్టుల భర్తీకి గతేడాది టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టగా, పలు న్యాయ వివాదాల అనంతరం 7,414 పోస్టులకు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది. మరో 1,378 పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంది. అయితే వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలంటే ముందుగా టీచర్ల బదిలీలు చేపట్టాల్సి ఉండటంతో విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. సీనియర్ టీచర్లకు కేటగిరీ–1 ప్రాంతాలైన పట్టణాలు, పరిసరాల్లోకి బదిలీలు చేసి, కొత్త టీచర్లకు కేటగిరీ–4 ప్రాంతాల్లో (గ్రామీణ ప్రాంతాల్లో) పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉండటం, ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరు తర్వాత పోస్టింగ్‌లకు సంబంధించిన వ్యవహారాలను ప్రారంభించాలన్న ఆలోచనల్లో ఉంది. దీనిపై ఉన్నత స్థాయిలో చర్చించి జూన్ మొదటి వారంలో రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ), బదిలీల ప్రక్రియను చేపట్టి జూన్ నెలాఖరుకు కొత్త టీచర్లను నియమించే అవకాశం ఉంది. అయితే హేతుబద్ధీకరణ చేయాలా? వద్దా? కేవలం బదిలీలు చేసి పోస్టింగ్‌లు త్వరగా ఇచ్చే డిమాండ్లు వచ్చినప్పటికీ రేషనలైజేషన్ చేయకుండా బదిలీలు, పోస్టింగ్ చేపడితే అవసరం లేని చోట టీచర్లు ఉండి.. అవసరం ఉన్న చోట టీచర్లు లేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో హేతుబద్ధీకరణతోపాటు బదిలీలు చేశాకే కొత్త నియామకాలు చేపట్టాలన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఈలోగా కొత్త టీచర్ల నియామక మార్గదర్శకాలను రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. -
వేసవిలోనే ‘వీవీల’ నియామకం!
ఆదిలాబాద్‌టౌన్: సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉపాధ్యాయుల కొరతతో అవస్థలు పడుతున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరంలో విద్యావలంటీర్ల (వీవీ) నియామకాలను చేపట్టేందుకు చర్యలు చేపడుతోంది. అయితే, ప్రతీ సంవత్సరం జూన్, జూలై మాసంలో వీవీల నియామకాలు చేపట్టగా, ఈసారి మాత్రం ఈ వేసవిలోనే నియామకాలు జరగనున్నట్లు ప్రభుత్వం నుంచి సంకేతాలు అందుతున్నాయి. బడులు తెరిచిన మొదటి రోజే ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో వీవీల ద్వారా విద్యాబోధన చేయించడానికి విద్యాశాఖ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందగా, నోటిఫికేషన్ విడుదల కాగానే నియామకాలు చేపట్టేందుకు వారు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు, పదవి విరమణ పొందే ఉపాధ్యాయుల వివరాలను సేకరించి ఆ ఖాళీలకు అవసరమయ్యే వీవీల సంఖ్యను ఇప్పటికే ప్రభుత్వానికి పంపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వేసవి సెలవుల్లోనే విద్యావలంటీర్ల నియామకాలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకోగా, ఈ నిర్ణయం విద్యార్థులకు బోధనాపరంగా ఎంతో మేలు చేయనుంది. జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలో 455 ప్రాథమిక పాఠశాలలు, 100 ప్రాథమికోన్నత పాఠశాలలు, 102 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఉపాధ్యాయ పోస్టులు చాలానే ఖాళీగా ఉండడంతో కొన్నేళ్లుగా వీవీలతోనే కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం టీఆర్టీ నిర్వహించినప్పటికీ నియామకాలు చేపట్టకపోవడంతో విద్యావలంటీర్లతోనే బోధన చేయించాల్సి వస్తోంది. అయితే, ప్రతియేటా పాఠశాల ప్రారంభమైన తర్వాత ఒకట్రెండు నెలల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసి వీవీలను భర్తీ చేసేవారు. అప్పటి వరకు విద్యార్థులకు బోధించే వారు లేకపోవడంతో పాఠాలు ముందుకు సాగేవి కావు. తాజాగా ప్రభుత్వం ఈ పద్ధతికి స్వస్తి పలికి వేసవి సెలవుల్లోనే వీవీల నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే వీవీల నియామకానికి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని విద్యా శాఖాధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, రెగ్యులర్ ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే ఆరోపణలూ లేకపోలేదు. పాత వారిని కూడా కొనసాగిస్తారా..? ఆదిలాబాద్ జిల్లాలో 2018–19 విద్యా సంవత్సరంలో 417 మంది విద్యావలంటీర్లు ఆయా పాఠశాలలో విధులు నిర్వర్తించారు. వీరిలో 154 మంది లాంగ్వేజ్ పండితులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత విద్యా సంవత్సరంలో పని చేసిన వారిని కొనసాగిస్తూనే అదనంగా కొత్తవారిని నియమిస్తారా.. లేక మొత్తం కొత్త వారినే నియమిస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని జిల్లా అధికారులు తెలిపారు. ప్రతిసారీ బడులు ముగియగానే విద్యావలంటీర్లను బాధ్యతలను తొలగించి, మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసి కొత్తవారిని నియమిస్తున్నారు. ఇది వరకు పనిచేసిన వారు కూడా మరోసారి దరఖాస్తు చేసుకొని నిబంధనల ప్రకారం పోస్టును దక్కించుకోవాల్సి వస్తోంది. దీంతో తాత్కాలికంగా పని చేస్తున్న బోధకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల పాత వారిని అలాగే కొనసాగించాలని హైకోర్టు సూచించడంతో పాత వీవీలకు ఊరట లభించింది. అయితే, దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పాత వారితోపాటు అదనంగా 121 వీవీ పోస్టుల భర్తీ చేయాల్సిన అవసరముందని విద్యాశాఖాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇదిలా ఉంటే, ప్రభుత్వం ఇటీవల టీఆర్టీ ఫలితాలు విడుదల చేసినా, ఇంకా నియామకాలు చేపట్టలేదు. అదేగానీ జరిగితే పాఠశాలల్లో బోధనపరమైన సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించినట్లు అవుతుంది. ప్రతిపాదనలు పంపించాం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల వివరాలను పంపించాం. గతేడాది జిల్లాలో 417 మంది విద్యావలంటీర్లు పని చేయగా, ఈ ఏడాది అదనంగా 121 మంది అవసరమున్నట్లు నివేదికలో ప్రభుత్వానికి వివరించాం. ఈసారి కూడా మొత్తం కొత్త విద్యావలంటీర్లనే నియమించాలా.. లేక పాతవారిని కూడా కొనసాగించాలనే విషయంపై మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీవీల నియామక చర్యలు చేపడతాం. – రవీందర్‌రెడ్డి, డీఈవో -
బైబై పాఠశాలలకు వేసవి సెలవులు
పాపన్నపేట(మెదక్): ఇన్ని రోజులు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఇక ఆటపాటల్లో మునిగి తేలేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ శనివారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. పదోతరగతి పరీక్షలు ఈనెల 3న ముగియగా, ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల పరీక్షలు ఈనెల 9వ తేదీతో పూర్తయ్యాయి. 10,11 తేదీల్లో లోక్‌సభ ఎన్నికల సెలవులు ఉండగా, 12న (శుక్రవారం) ఎన్నికల విధుల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు మధ్యాహ్నం వరకు పాఠశాలలు కొనసాగించి, ఫలితాలు వెల్లడించి సెలవులు ప్రకటించారు. జిల్లాలో వారం రోజుల నుంచి ఎండలు మండుతున్న నేపథ్యంలో చిన్నారులు పాఠశాలలకు రావాలంటే విలవిల్లాడిపోయారు. శుక్రవారం జిల్లాలో 40 çడిగ్రీల సెంటీగ్రేడ్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే 31 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 1న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు.. సెలవులను కచ్చి తంగా పాటించాలని, ఎవరైనా బడులు నడిపితే చర్యలు తప్పవని ఇన్చార్జి డీఈఓ రవికాంత్‌రావు హెచ్చరించారు. కేజీబీవీ పాఠశాలల్లో చదువుకుంటున్న తల్లిదండ్రులు లేని పిల్లలకు సిద్దిపేట జిల్లా చేర్యాలలో సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నారు. బిజీబిజీగా ఉపాధ్యాయులు.. జిల్లాలో 632 ప్రాథమిక, 131 ప్రాథమికోన్నత, 143 ఉన్నత పాఠశాలలుండగా ఇందులో సుమారు 1.27 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. 2017–18 ఎన్నికల సంవత్సరంగానే గడిచింది. 2018 జూలైలో టీచర్ల బదిలీలు జరిగాయి. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు, జనవరిలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఈనెల 11న జరిగిన లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మార్చిలో శిక్షణ, పదో తరగతి పరీక్షలతో బిజీబిజీగా గడిచిపోయంది. పక్కా ప్రణాళికతో పది పరీక్షలు విద్యా సంవత్సరంలో కొన్ని అవాంతరాలు ఏర్పడినప్పటికీ పదో తరగతి పరీక్షలకు పక్కా ప్రణాళికతో విద్యార్థులను సన్నద్ధం చేశారు. కలెక్టర్ ధర్మారెడ్డి, ఇన్చార్జి డీఈఓ రవికాంత్‌రావు ఆధ్వర్యంలో ఆగస్టు నుంచే ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ‘లిటిల్ టీచర్–లిటిల్ లీడర్’ ప్రోగ్రాంతో విద్యార్థుల్లో పది పరీక్షలపై ఆత్మ విశ్వాసం పెంపొందించారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నడిపించారు. సాయంత్రం ప్రత్యేక తరగతుల వేళ స్నాక్స్ అందించారు. మొత్తం మీద పది పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామన్న ధీమాను విద్యాశాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కేజీబీవీ విద్యార్థినులకు వేసవి శిబిరం తల్లిదండ్రులు లేని కేజీబీవీ విద్యార్థినులకు చేర్యాలలో సమ్మర్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ నెల 13 నుంచి మే 25 వరకు ఈ క్యాంపు కొనసాగుతుంది. మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని కేజీబీవీ పాఠశాలల్లో చదువుతూ తల్లిగాని, తండ్రి గాని, ఇద్దరూ లేని విద్యార్థులను శిబిరానికి పంపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, నైపుణ్యాలు పెంపొందించేలా అక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. వీటితో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. -
‘మరుగు’న‘బడి’!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మరుగుదొడ్ల నిర్మాణంలో అడుగడుగునా అలసత్వం కనిపిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు మల, మూత్ర విసర్జన కోసం ఇబ్బందిపడొద్దనే ఉద్దేశంతో ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టింది. ముఖ్యంగా విద్యార్థినుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రతి పాఠశాలలో చేపట్టారు. అయితే నిర్మాణాలు సకాలంలో పూర్తికాకపోవడంతో విద్యార్థినులు, ఉపాధ్యాయినులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాల్సిన ఆవశ్యకతను అధికారులు గుర్తించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 251 పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గుర్తించిన పనులపై నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందించారు. దీంతో పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు అనుమతులు మంజూరయ్యాయి. ఒక్కో మరుగుదొడ్డికి రూ.1.20లక్షల నుంచి రూ.1.50లక్షల వరకు మంజూరు చేసింది. ఇందులో విద్యాశాఖ 60శాతం, ఉపాధిహామీలో 40శాతం నిధులను వినియోగించాల్సి ఉంటుంది. తొమ్మిది శాతమే పూర్తి.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ఏళ్లు గడుస్తున్నా.. అనుకున్న మేరకు పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయలేకపోతున్నారు. అనేక పాఠశాలల్లో నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 251 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినా.. కట్టడాలు మాత్రం పూర్తి కాలేదు. ఇప్పటివరకు కేవలం 94 పాఠశాలల్లో మాత్రమే మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభమైంది. ఇందులో 70 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉండగా.. 24 నిర్మాణాలు పూర్తయ్యాయి. అంటే మొత్తం మరుగుదొడ్ల లక్ష్యంలో 9.56 శాతం నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి ఎప్పటికి పూర్తవుతాయో కూడా తెలియని పరిస్థితి. నిర్మాణాలకు నిధులు విడుదలవుతాయో? లేదో? అనే సందేహంతో కాంట్రాక్టర్లు నిర్మాణాలపై దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. వీటి నిర్మాణం విషయంలో అధికారులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు శ్రద్ధ తీసుకుంటేనే నిర్మాణాలు ముందుకు సాగే అవకాశం ఉంది. మరుగుదొడ్లు లేకపోవడంతో.. పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో అక్కడ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. మూత్ర విసర్జన చేయాలంటే సుదూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాల్సి ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం విశేషం. ఎస్ఎంసీలతోపాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించేలా బాధ్యత తీసుకోవాల్సి ఉంది. పలుచోట్ల గతంలో సర్పంచ్‌లు కూడా కాంట్రాక్టర్లుగా వ్యవహరించగా.. వీరి పరిధిలోని నిర్మాణాలు ముందుకు సాగలేదు. పలు పాఠశాలల్లో నత్తనడకన.. జిల్లాలోని పలు పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. తిరుమలాయపాలెం మండలంలోని పాఠశాలల్లో 12 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. అయితే ఇక్కడ ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. ఖమ్మం రూరల్ మండలంలో 10 మరుగుదొడ్లు మంజూరు కాగా.. ఒక్కటి మాత్రమే ప్రారంభమైంది. కారేపల్లి మండలంలో 12 మరుగుదొడ్లు మంజూరు కాగా.. ఒక్కటి మాత్రమే ప్రారంభమైంది. నేలకొండపల్లిలో 10 మంజూరు కాగా.. రెండు మాత్రమే ప్రారంభమయ్యాయి. కామేపల్లిలో 16 మంజూరు కాగా.. ఒకటి మాత్రమే ప్రారంభమైంది. ఖమ్మం అర్బన్‌లో 17 మంజూరు కాగా.. ఒక్కటి మాత్రమే ప్రారంభమైంది. త్వరితగతిన పూర్తి చేయిస్తాం.. మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఉపాధిహామీ సిబ్బంది మరుగుదొడ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణాలు ప్రారంభం కాని వాటిపై దృష్టి కేంద్రీకరించి త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. – మదన్మోహన్, జిల్లా విద్యాశాఖాధికారి -
అభాసుపాలవుతున్న బడికొస్తా పథకం
సాక్షి, చీరాల : ప్రకాశం జిల్లా చీరాల మండలంలో బడికొస్తా పథకం అభాసు పాలవుతోంది. విద్యాసంవత్సరం నెలరోజుల్లో ముగియనుండడంతో ఇప్పుడు సైకిళ్ల కేటాయింపులు చేయడం చూస్తే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమాత్రం ఉందో అర్థం అవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల హాజరుశాతం పెంచేందుకు ప్రభుత్వం బడికొస్తా పథకం ప్రవేశపెట్టింది. 8,9 తరగతులు చదివే విద్యార్థినులకు బడికి చేరుకునేందుకు వీలుగా సైకిళ్ళు పంపిణీ చేస్తారు. అయితే ఈ పథకం ప్రారంభంలో బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం సత్ఫలితాలను ఇవ్వడంలేదు. ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్, మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో 8,9 తరగతులు చదివే విద్యార్ధినులకు ఉచితంగా సైకిళ్ళు అందించేందుకు నిర్ణయించినా పాలకులు, అధికారులు స్పందించడంలేదు. ఇప్పుడు గుర్తొచ్చిందా.. విద్యాసంవత్సరం ప్రారంభంలో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ జరగలేదు. అయితే విద్యాసంవత్సరం కొద్దిరోజుల్లో ముగియనుండడంతో ప్రభుత్వం వీటిని ఆర్భాటంగా అందించేందుకు రంగం సిద్ధం చేయడం చేస్తే విద్యాశాఖ పనితీరు అర్థమవుతుంది. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు సైకిళ్లు పంపిణీ చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బాలికలు సైకిళ్లు తొక్కుతూ వెళుతుంటే వాటిపై వేసిన స్టిక్కర్లను చూసి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందని అందరికి తెలిసేందుకే చేశారనే విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ కావడంతో ఎన్నికల మైలేజ్‌గానూ ఈ బడికొస్తా పధకాన్ని వాడుతున్నారనేది మరో విమర్శ వినిపిస్తోంది. నియోజకవర్గానికి 1433 సైకిళ్లు... నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాలున్నాయి. వీటిలో చీరాల మండలంలో 2016–17 విద్యాసంవత్సరానికి గాను 148 మంది విద్యార్థినులకు అందించారు. ఈ తర్వాత 2017–18 విద్యాసంవత్సరానికి ఇవ్వలేదు. అలానే వేటపాలెం మండలంలో 2017–18 గాను 178 సైకిళ్లు అందించారు. 2018–19 విద్యాసంవత్సరానికి సైకిళ్ళును అందించలేదు. హైస్కూళ్ళ వారీగా విద్యార్థినుల సంఖ్య ఆధారంగా ప్రధానోపాధ్యాయులు వివరాలను ఉన్నతాధికారులకు పంపించారు. చీరాల మండలానికి 1029, వేటపాలెం మండలానికి 414 మందికి అందించేందుకు ప్రతిపాదనలు పంపించారు. అయితే సకాలంలో పంపిణీ చేయకపోవడంతో విద్యార్థినులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పాఠశాలలకు చేరుకుంటున్నారు. చీరాల పరిసర ప్రాంతాల్లోని గ్రామాల నుంచి విద్యార్థినులు ఆటోలు ద్వారా వస్తున్నారు. సైకిళ్ళు పంపిణీ చేయకపోవడంతో ఆటోలు, ఇతర మార్గాల ద్వారా వస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం కూడా ఇదే తీరుగా ఉంది. కోడిగుడ్లు కూడా సక్రమంగా లేవు. చిన్న సైజు గుడ్లు పంపిణీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. -
పరిగడుపు.. చదువులు!
నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులు పరిగడుపుతోనే ప్రత్యేక క్లాస్‌లకు హాజరవుతున్నారు. విద్యార్థులను పరీక్షలకు సమాయత్తం చేసేందుకు ప్రతి ఏటా 100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా పాఠశాల ప్రారంభానికి ముందు, ముగిసిన తర్వాత ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఈ సందర్భాల్లో విద్యార్థులకు ఆకలివేయకుండా ఉండేందుకు స్నాక్స్ ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఈసారి దాతలు కొరవడడంతో పరిగడుపుతోనే విద్యార్థులు ప్రత్యేక క్లాసులకు హాజరవుతున్నారు. 2018–19 విద్యాసంవత్సరానికి సంబంధించి అక్టోబర్ మాసం నాటికే సిలబస్ పూర్తయ్యింది. దీంతో రివిజన్ కార్యక్రమాలు చేపడుతూ ఎప్పటికప్పుడు స్లిప్ టెస్టులను నిర్వహిస్తూ పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 230 ప్రభుత్వ పాఠశాలల పరిధిలో 13,989 మంది విద్యార్థులుపదవ తరగతి చదువుతున్నారు. అందులో బాలురు 6,528 మంది, బాలికలు 7,461 మంది ఉన్నారు. పాఠశాలల్లో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధిం చాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ ప్రత్యేక తరగతులను నిర్వహిస్తోంది. ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఉదయం తరగతులకు హాజరయ్యే సందర్భం లోనే టిఫిన్, ఇతర స్నాక్స్ పెడుతుండడంతో బాక్స్ తెచ్చుకొని పాఠశాలలో తింటున్నారు. కానీ గ్రామాలనుంచి వచ్చే వారు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8.30 గంటలకే తరగతులు ప్రారంభమవుతుండడంతో ఇంటివద్ద నుంచి 6గంటలకే బయలుదేరుతున్నారు. అప్పటికి ఇంట్లో వంట అయితే సరి. లేదంటే తినకుండానే తరగతులకు హాజరవుతున్నారు. ఆకలి మంటతో తరగతులు వింటుండడంతో చదువు వంట పట్టని పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం భోజనం పెట్టే వరకు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రేయర్‌లోనే కిందపడిపోతున్న వైనం రోజూ ఉదయం ప్రేయర్ సందర్భంలో బాలురు, బాలికలు కింద పడి పోతున్నారు. ప్రేయర్ దాదాపు 20 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఆ సందర్భంలో కొందరు కింద పడిపోతున్నా రు. ఆ విషయం ఉపాధ్యాయులు ఆరా దీసిన సందర్భంలో అన్నం తినిరాలేదు అంటూ చెప్పిన సందర్భాలు ఉన్నాయంటూ ఓ విద్యాశాఖ అధికారి పేర్కొంటున్నారు. గతేడాది స్నాక్స్ ఏర్పాటు గత ఏడాది పదో తరగతి పరీక్షలు రాసే వారి కోసం స్నాక్స్ ఏర్పాటు చేశారు. కానీ ఈ సారి దాతలు ముందుకు రాకపోవడంతో ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. గత సంవత్సరం కూడా స్నాక్స్ విషయంలో 60 శాతం మా త్రమే బిల్లుల చెల్లింపులు జరిగాయి. కొన్ని పాఠశాలలో హెడ్మాస్టర్లు జేబు ల్లోనుంచి ఖర్చు చేశారు. వారికి ఇంత వరకూ బిల్లులు అందని పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో 20, 30 మందే ఉంటారు. కానీ పెద్ద పాఠశాలల్లో 100మందికి పైనే ఉన్నారు. అలాంటి సమయంలో స్నాక్స్ విషయంలో అధికంగానే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కలెక్టర్ చొరవ చూపాలి గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రత్యేక క్లాసులకు హాజరయ్యే వారి విషయంలో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని పలువురు కోరుకుంటున్నారు. దాతల నుంచి స్నాక్స్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. తినకుండానే వస్తున్నా... ఉదయమే ప్రత్యేక తరగతులు ఉంటున్నాయి. చందనపల్లి నుంచి బస్సుకు రావాలంటే నేను ఉదయం ఆరు ఆరున్నరకే బయలుదేరాలి. ఆ సమయానికి ఇంట్లో వంట కావడం లేదు. తినకుండానే స్కూల్‌కు వస్తున్నా. చాలా ఇబ్బంది అవుతుంది. మధ్యాహ్నం భోజనం పెట్టే వరకు ఆకలి బాగా అవుతుంది. సాయంత్రం 6గంటల వరకు క్లాసులు జరుగుతున్నాయి. ఇంటికి వెళే వరకే 7 గంటలు అవుతుంది. ఆకలి వేస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి. – దివ్య, చందనపల్లి తినొస్తే లేటవుతుంది.. తిప్పర్తి మండలం సర్వాయిగూడెం మాది. రోజూ తిని స్కూల్‌కు రావాలంటే ఆలస్యం అవుతుంది. తినకుండా వస్తే మధ్యాహ్నం వరకు ఆకలి బాగా అవుతుంది. నా ఒక్కడి కోసం ఇంట్లో వండాలంటే ఇబ్బంది అవుతుంది. ఆకలిని ఓర్చుకోక తప్పడంలేదు. చదువుకోవాలి కాబట్టి ఇబ్బందైతే తప్పడంలేదు. – మహేశ్, సర్వాయిగూడెం -
నాణ్యమైన భోజనం ఇవ్వాలి
మెదక్ అర్బన్: ప్రతి పాఠశాలలో నాణ్యమైన ఆహారం అందించేలా ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షించాలని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యంతో పాటు మౌలిక వసతుల కల్పనపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విలువలతో కూడిన పోషకాలను అందించేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమం కేవలం విద్యార్థులను ఉద్దేశించి ఏర్పాటు చేసిందేనని అన్నారు. ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అన్నంతో పాటు విధిగా కూరగాయలు, పప్పులు, ఆకుకూరలతో పాటు గుడ్లను సైతం అందించిప్పుడే విద్యార్థి ఎదుగుదలకు సరిపడా పోషకాలు అందుతాయన్నారు. అమలులో నిర్లక్ష్యం వహించే నిర్వాహకులకు నోటీసులు అందించాలన్నారు. అయినా పరిస్థితుల్లో మార్పు లేనట్లయితే విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలకు వచ్చే బియ్యం దిగుమతి చేసుకోవాలన్నారు. పాఠశాలలకు వచ్చే బియ్యం తూకంలో తక్కువ వస్తే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి ప్రతి పాఠశాలలో కిచెన్‌షెడ్ల నిర్మాణానికి పాఠశాల యాజమాన్య కమిటీలో చర్చించాలని అన్నారు. పాపన్నపేట మండలంలోని కస్తూర్బా పాఠశాల, ఉన్నత పాఠశాలకు భగీరథ కనెక్షన్లు అందించాలని ఆదేశించి మూడు నెలలు దాటినా ఇప్పటికీ నీరందించకపోవడంపై ఈఈ కమలాకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పది ఇళ్లు ఉన్న ఆవాసాలకు సైతం మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా నీటి కనెక్షన్లు అందిస్తున్నామని... అలాంటిది 350 మంది విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలకు నీటి కనెక్షన్లు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మూడు నెలల కిందట నీటి కనెక్షన్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని ఇప్పటికీ ఆ పాఠశాలలో నీటి సరఫరా కావడం లేదన్నారు. రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కావాలని కలెక్టర్ ధర్మారెడ్డి హెచ్చరించారు. అలాగే ప్రతి పాఠశాలకు నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి పాఠశాలను ప్రధానోపాధ్యాయులు తమ సొంత ఆస్తిలా భావించాలని, ప్రభుత్వం లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే భవనాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ రవికాంతరావు, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు, నోడల్ అధికారి మధుమోహన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, డీటీడబ్ల్యూఓ వసంతరావు, జ్యోతిపద్మ, డీపీఆర్వో శైలేశ్వర్‌రెడ్డి, ఏడీలు భాస్కర్, భాస్కర్‌రావు, సెక్టోరియల్ అధికారులు నాగేశ్వర్, సుభాష్‌తో పాటుఆయా మండలాల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
తీపి కబురు
జిల్లాలోని పదోతరగతి విద్యార్థులకు తీపి కబురు అందింది. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కలెక్టర్ ధర్మారెడ్డి వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు సాయంత్రం వేళల్లో స్నాక్స్ అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మార్చి 14 వరకు కొనసాగనుంది. సాయంత్రం వేళల్లో అల్పాహారంతో వారి ఆకలి తీరడంతో చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే వీలుంది. దీంతో పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంది. పాపన్నపేట (మెదక్): జిల్లాలో 175 ప్రభుత్వ పాఠశాలలు, 67 ప్రైవేట్ పాఠశాలల్లో 11,361 మంది విద్యార్థులు ఈ యేడు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. గత ఏడాది పరీక్షల్లో 90 శాతం ఫలితాలతో జిల్లా 9వ స్థానంలో నిలిచింది. కాగా ఈ విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు కలెక్టర్ ధర్మారెడ్డి, డీఈఓ రవికాంతరావు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జులై నెల నుంచి అన్ని పాఠశాలల్లో ‘లిటిల్ టీచర్ – లిటిల్ లీడర్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి తరగతిలో పది మంది విద్యార్థులకు ఒక గ్రూపును తయారు చేసి అందులో నుంచి ఒక లిటిల్ టీచర్, ఒక లిటిల్ లీడర్‌ను ఏర్పాటు చేస్తారు. ఆరోజు జరిగిన పాఠ్యాంశానికి సంబంధించి ప్రశ్నలు తయారు చేసి సమాధానాలు రాస్తారు. అలాగే తెలియని విషయాలపై చర్చ కొనసాగిస్తారు. గ్రూపులోని విద్యార్థులంతా ప్రతిరోజూ ప్రత్యేక తరగతులకు వచ్చేలా లిటిల్ లీడర్ చర్యలు తీసుకుంటారు. సాధారణంగా తమకు వచ్చిన సందేహాలను ఉపాధ్యాయుడిని అడిగేందుకు కొంత మంది విద్యార్థులు వెనుకడుగు వేస్తుంటారు. ఈ పద్ధతిలో లిటిల్ లీడర్ ఆధ్వర్యంలో జరిగే చర్చ ద్వారా విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కలుగుతుంది. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.45 గంటల నుంచి 5.45 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వీటికి తోడు జిల్లా విద్యాశాఖ ప్రవేశపెట్టిన స్పెషల్ యాక్షన్ ప్లాన్ ఎలాగు అమలు చేస్తున్నారు. ఆకలి తీర్చేందుకు.. స్నాక్స్... ఉదయం ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులు సాయంత్రం 5.45 గంటల వరకు పాఠశాలల్లోనే ఉండాల్సి వస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం చేసే విద్యార్థులకు సాయంత్రం అయ్యే సరికి ఆకలి వేస్తుంది. ముఖ్యంగా పొరుగు గ్రామాల నుంచి వచ్చే విద్యార్థినీవిద్యార్థులు తిరిగి ఇంటికి వెళ్లే సరికి రాత్రి 7 గంటలు అవుతుంది. దీంతో వారు ఆకలికి తాళలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందిని తీర్చడానికి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్నాక్స్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనం వండే వంట ఏజెన్సీల ద్వారా విద్యార్థులకు బిస్కెట్లు, బెబ్బర్లు, పెసర్లు, ఉప్మా, పల్లీలు, అటుకులు, పండ్లు లాంటి అల్పాహారాన్ని అందించాలని తెలిపారు. ఇందుకు గాను ప్రతి విద్యార్థికి రూ.5 చొప్పున బడ్జెట్ మంజూరు చేయనున్నారు. మార్చి 14వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ పథకం ద్వారా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 3,928 మంది బాలురు, 3,579 మంది బాలికలు ప్రయోజనం పొందనున్నారు. రెండేళ్ల క్రితం ఇలా పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేశారు. అలాగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేందుకు రూ.74.02 లక్షల వ్యయంతో 2 వేల డెస్క్‌లను 57 పరీక్ష కేంద్రాలకు పంపిణీ చేశారు. చాలా ఆనందంగా ఉంది.. నేను పాపన్నపేట ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాను. ప్రతిరోజు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని చిత్రియాల నుంచి పాపన్నపేటకు సైకిల్‌పై వస్తున్నాను. ఉదయం 8.30 గంటలకే తరగతికి రావాల్సి ఉండటంతో తినకుండానే వస్తున్నాను. తిరిగి ఇంటికి వెళ్లే సరికి రాత్రి 6.30 గంటలవుతోంది. దీంతో సాయంత్రం 5 గంటల నుంచే ఆకలి వేస్తోంది. కలెక్టర్ స్నాక్స్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. –తహమీద్, పదో తరగతి విద్యార్థి, చిత్రియాల -
నిర్వహణ నిధులేవి..?
సంగెం: విద్యాలయాలు దేవాలయాలతో సమానం. దేశ భవిష్యత్ తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది. రేపటి పౌరులైన విద్యార్థుల జీవితం తరగతి గదితో ముడిపడి ఉంది. తరగతి గది వాతావారణం బాగుంటేనే విద్యార్థులకు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు ఒంటబడుతాయి అనేవి పెద్దల మాట. కాని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. నిర్వహణకు నిధులు రాకపోవడంతో పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు ఆరు నెలలు గడిచినా పాఠశాల నిర్వహణకు నిధులు విడుదల కాలేదంటే ప్రభుత్వ విద్యావిధానంపై అధికారులకు ఎంతటి పట్టింపు ఉందో అర్థమవుతోంది. విద్యాబోధనకు అవసరమైన డస్టర్లు, చాక్‌పీస్‌లు, పేపర్లు వంటి సామగ్రి, తాగునీరు, విద్యుత్ బిల్లులు, ఇతర మరమ్మతులకు నిధులు లేక ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానోపాధ్యాయులు తమ జేబులోంచి ఖర్చు చేయాల్సిన దుస్థితి దాపురించింది. పెట్టిన నిధులు వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 460 ఉన్నాయి. ఇందులో 15,972 మంది విద్యార్థులు, ప్రాథమికోన్నత పాఠశాలలు 83 ఇందులో 4,482 మంది విద్యార్థులు, ఉన్నత పాఠశాలలు 153 ఇందులో 22,028 మంది విద్యార్థులు మొత్తం 696 పాఠశాలల్లో 42,422 మంది విద్యార్థులు ఉన్నారు. ఆయా పాఠశాలల్లో మరమ్మతులు, ఇతర అవసరాలకు ప్రభుత్వం ప్రతిఏడాది గ్రాంట్స్ నిర్వహణ నిధులు విడుదల చేస్తుంది. విద్యార్థులు తరగతి గదుల సంఖ్య ఆధారంగా సర్వశిక్షాభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ద్వారా పాఠశాల యాజమాన్యాల ఖాతాల్లో జమచేస్తారు. గత ఏడాది సర్వశిక్షా అభియాన్‌ను విలీనం చేసి సమగ్ర శిక్ష అభియాన్‌గా మార్చారు. పాఠశాలలకు ఇచ్చే నిధులను కూడా కలిపి ఇస్తామని అధికారులు ప్రకటించారు. కానీ పాఠశాలలు ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా నేటికి నిధుల జాడ లేదు. వేడుకలకు నిధులు నిల్.. విద్యాసంవత్సరం క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా పాఠశాలల్లో వివిధ రకాల కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ, బాలల, జాతీయ నాయకుల దినోత్సవాలు, మండలస్థాయి క్రీడలు, పాఠశాలల స్థాయి క్రీడలు, సైన్స్‌ఫెయిర్ కోసం పరికరాల తయారీ, క్రీడా సామగ్రి, విద్యుత్ బిల్లులు, పేపర్ల కొనుగోలు వంటి వాటికి ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అందించే గ్రాంట్ ఎలా సరిపోతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాత పద్ధతిలో ఇచ్చే నిధులు సరిపోకపోవడంతో ఆయా పాఠశాలల్లో కార్యక్రమాలను నామమాత్రంగా నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ బిల్లులు.. పాఠశాలల్లో నిధుల కొరత వెంటాడుతుండగా విద్యుత్ బిల్లులు మరింత వేధిస్తున్నాయి. పాఠశాలల్లో వినియోగం ఉన్నా లేకున్నా విద్యుత్ బిల్లులు మాత్రం ప్రతి నెలా చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు. పలు పాఠశాలల్లో కంప్యూటర్లను మూలన పడేశారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యుత్ వినియోగించడం లేదు. అయినా బిల్లులు చెల్లించక తప్పడం లేదని ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల్లో పాఠశాలలు.. పాఠశాలల నిర్వహణకు అవసరమైన నిధులు రాకపోవడంతో జిల్లాలో పాఠశాలల నిర్వహణ కష్టసాధ్యమవుతున్నదని పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 40 లోపు విద్యార్థులు, 3 తరగతులు, అంతకంటే తక్కువ గదులు ఉంటే రూ.5 వేలు నిర్వహణ నిధులు, మరో రూ. 5 వేలు స్కూల్ గ్రాంట్ కింద విడుదల చేసేవారు. 5 గదులకంటే ఎక్కువగా ఉంటే రూ.5 వేల నిర్వహణ నిధులు, రూ 10వేలు స్కూల్ గ్రాంట్ కింద జమ చేసేవారు. ఉన్నత పాఠశాలల్లో ఆర్‌ఎంఎస్‌ఏ నుంచి ప్రత్యేక నిధులు రూ. 5 వేలు, స్కూల్ గ్రాంట్ కింద రూ 7 వేలు, నిర్వహణ నిధులు రూ 10 వేలు ఇచ్చేవారు. పెరిగిన జీవన ప్రమాణాలకనుగుణంగా పాఠశాలల నిర్వహణ ఖర్చులు, గ్రాంట్స్‌ను పెంచాల్సిన అవసరం ఉంటుందని నిపుణుల సూచన. ఎప్పుడో పాతికేళ్ల క్రితం నిర్ణయించిన పాఠశాల గ్రాంట్లే ఇప్పటికీ ఇస్తుండడంపై ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం సరిపోవడం లేదనే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాఠశాల ఖర్చులకనుగుణంగా నిధులు పెంచి అందించాలని పలువురు కోరుతున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు.. సర్వశిక్షా అభియాన్, రాష్ట్ర మాధ్యమిక శిక్ష అభియాన్ల వినియోగం తర్వాత సమగ్ర శిక్షా అభియాన్ తర్వాత ఎంత మొత్తంలో నిధులు ఇస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నాలుగు విధాలుగా రూ.1000 నుంచి రూ 25 వేలు, రూ 40 వేలు, రూ 60 వేల చొప్పున ఇచ్చేందుకు విద్యాశాఖ యోచిస్తున్నట్లు సమాచారం. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగానే గ్రాంట్స్ విడుదల చేయడానికి వీలుంటుందని తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదని ఉపాధ్యాయ వర్గాలు తెలిపాయి. నిధులు విడుదల చేయాలి.. పాఠశాలలకు అవరమైన నిధులు ఈ విద్యా సంవత్సరం నుంచి నేటి వరకు విడుదల కాలేదు. విద్యాబోధన, ఇతర అవసరాల ఖర్చులకు నిధుల్లేక ప్రధానోపాధ్యాయులు అనేక అవస్థలు పడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే గ్రాంట్స్ విడుదల చేస్తే విద్యాబోధనకు అవసరమైన సామగ్రిని తీసుకోవచ్చు. పాఠశాలలకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్వహణ నిధులను పెంచి విడుదల చేయాలి. –ఎస్.రవీందర్, ప్రధానోపాధ్యాయుడు, సంగెం -
లెక్క సరిచేస్తారా ?!
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : విద్యార్థులకు కొన్ని సబ్జెక్టులపై ఉన్న భయమే ఫలితాలపై ప్రభావం చూపుతోంది.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానంగా గణితం, సైన్స్, ఆంగ్లం సబ్జెక్టుల విషయంలో విద్యార్థులు ఒక రకమైన ఆందోళనకు గురవుతున్నారు. ఆయా సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు సాధించేలా, ఫెయిల్ కాకుండా చదువుకునే విషయమై అవగాహన లేకపోవడం ఓ కారణమైతే.. బోధనలోని లోపాలను మరో కారణంగా చెప్పొచ్చు. ఇక ప్రత్యేక సబ్జెక్టు ఉపాధ్యాయులు లేక పలు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఏటా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చదవమని ఒత్తిడి తెచ్చేవారే తప్ప.. ఎలా చదవాలో నేర్పించే వారు లేకపోవడం ఈ సమస్యకు కారణమవుతోంది. ఫలితంగా అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం గణితం, సైన్స్, ఆంగ్లం విషయానికొచ్చే సరికి వెనుకబడిపోతున్నారు. గతంలో తప్పిన గణాంకాలు.. గత విద్యాసంవత్సరం పదో తరగతిలో గణితంలో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. మిగతా వాటి కంటే గణితం, సైన్స్, ఇంగ్లిష్‌లో నే ఎక్కువ మంది వెను కబడినట్లు ఫలితాలు చెబుతున్నాయి. తెలుగు సబ్జెక్టులో 297 మంది, హిందీలో 85 మంది, ఇంగ్లిష్‌లో 455 మంది, గణితంలో అత్యధికంగా 3,833 మంది, సైన్స్‌లో 3,019 మంది ఫెయిల్ కాగా.. సోషల్‌లో 417 మంది విద్యార్థులు ఫెయిల్ అ య్యారు. గతంలో చాలా మంది విద్యార్థులు గణితంలోనే ఫెయిల్ కావడంతో విద్యాసంవత్సరం ప్రారంభం నుండి సమావేశాలు, ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినా ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు. గత విద్యాసంవత్సరం కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వందేమాతరం ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలు సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. కేజీబీవీలు, గురుకులాల్లో వేదిక్ మ్యాథ్స్, తో పాటు ప్రత్యేక విద్యాసామగ్రి, ప్రాక్టీస్ పేపర్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం ఆశించినంత మేరకు ఫలితాలు రాకపోవడంతో అందరూ నిరుత్సాహానికి గురయ్యారు. ఇక గత ఏడాది అన్ని యాజమాన్యాల పరిధిలో మొత్తం 20,092 మంది ఎస్సెస్సీ పరీక్షలకు హాజరైతే, 14,392 మంది పాస్ అయ్యారు. తద్వారా 71.77శాతం ఉత్తీర్ణతతో మహబూబ్‌నగర్ జిల్లా రాష్ట్రంలో 28వ స్థానంలో నిలించింది. కాగా, ఈ సారి జిల్లాలో మొత్తం 24,453 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఉపాధ్యాయుల కొరత.. బోధనలో లోపాలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదవుతున్న విద్యార్థులను తీర్చిదిద్దడం ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయులకు కత్తి మీద సాములా మారింది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతలు కొద్దిమేరకు మెరుగుపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. అయినా ఫలితాల్లో ఇంకా ముందడుగు పడడం లేదు. పలు పాఠశాలల్లో ప్రధాన సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు లేకపోవడం, ప్రభుత్వం ఉన్న ఉపాధ్యాయులతోనే బోధన చేయించడం, వారు అందుబాటులో లేనిచోట్ల విద్యావలంటీర్లకు బాధ్యతలు అప్పగించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. సబ్జెక్టు నిపుణులు లేని కారణంగానే ఎక్కువ మంది విద్యార్థులు గణితం, ఆంగ్లం, సైన్స్ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. ఇకనైనా కఠినమైన సబ్జెక్టుల విషయంలో విద్యాశాఖ అ«ధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ సబ్జెక్టుల్లో నిపుణులైన ఉపాధ్యాయులను నియమించడంతో పాటు సబ్జెక్టుల వారీగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిలో విషయ పరిజ్ఞానం పెంచేందుకు చర్యలు తీసుకుంటే ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశముంది. వీడని భయం విద్యార్థులు ఎక్కువగా ఫెయిల్ అవుతున్న సబ్జెక్టులను గుర్తించి ఆయా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. గత ఏడాది ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని 11 పాఠశాలల్లో 45 శాతం కంటే తక్కువ ఫలితాలు నమోదయ్యాయి. ఈ కారణంగా మండల, గ్రామీణ స్థాయి విద్యార్థులు సైతం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణతపై ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుండి డీఎస్సీ ప్రకటించకపోవడంతో పాటు చాలా పోస్టులు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ లేకపోవడం ఎస్సెసీవిద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రభావం చూపేప్రమాదముంది. జిల్లా వ్యాప్తంగా వివిధ సబ్జెక్టుల్లో కలి దాదాపు 1,994 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. ప్రారంభమైన బిస్కెట్ల పంపిణీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ తరగతులు గత ఆగస్టు నుండి ప్రారంభం కాగా.. గత మంగళవారం నుండి పూర్తి స్థాయిలో విద్యార్థులకు బిస్కెట్లు అందజేసేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందుకు అనుగుణంగా జిల్లాలోని 212 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మల్టీగ్రేయిన్ బిస్కెట్లు అందజేస్తున్నారు. తద్వారా విద్యార్థులు అలిసిపోకుండా శ్రద్ధగా చదువుకుంటారనేది ప్రభుత్వ భావన 40 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నాం.. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో మంచి ఫలితాలు వచ్చే విధంగా 40 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నాం. చదువులో వెనుకబడి ఉన్న వారిని గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంన్నాం. ముఖ్యమైన ప్రశ్నాంశాలతో మెటీరియల్ రూపొందిస్తున్నాం, ఫలితాలు మెరుగుపడేలా అన్ని చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి ఇప్పటికే హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు అన్ని ఆదేశాలు జారీ చేశాం. ప్రస్తుతం ఎస్సెస్సీ విద్యార్థులకు బిస్కెట్ల కూడా పంపిణీ ప్రారంభమైంది. ఏ సబ్జెక్టులోనైతే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అవుతారో, ఎక్కువ మందికి తక్కువ మార్కులు వస్తాయో ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. విద్యార్థులకు పూర్తి స్థాయిలో పరీక్షలకు సిద్ధం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. – సోమిరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి -
కొట్టకండి సారూ...!
అబ్బాయిల్ని గదిలో బంధించి బాదుతారు మా సారు. ఎంతసేపు కొట్టాలనిపిస్తే అంతసేపు కొడతారు. అరుపులు బయటికి విన్పించకుండా ఫోన్లో పాటలు పెడతారు హెడ్మాస్టర్ సారు పిడికిలి బిగించి మొహం మీద గట్టిగా కొడతారు. నెత్తురు చిందేలా కొడతారు. అటు ఇటు తిరుగుతూ, ఆడుతూ,ఒకరితో మరొకరు కలబడుతూ ఉండే పిల్లలను ఆయన అలాగే భయపెడతారు. ఇవీ ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సాగిస్తున్న అమానుషానికి ఉదాహరణలు. నాలుగు, ఆరో తరగతి చదువుతున్న పిల్లలు ఇచ్చిన వివరాలివీ.. సర్కారీ పాఠశాలల్లో కొనసాగుతున్న హింసపై గురుగ్రామ్‌లోని ‘అగ్రసర్’అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనం జరిపింది. వారి అనుభవాలతో ‘ఊపిరాడని బాల్యం’శీర్షికన నివేదిక రూపొందించింది. పాఠశాలల ఉపాధ్యాయుల చేతుల్లో పేద పిల్లలు నిత్యం వేధింపులకు, కఠిన శిక్షలకు గురవుతున్న స్థితిని కళ్లకుగట్టింది. పేద పిల్లలే బాధితులు - బాధిత విద్యార్థుల సంఖ్య పరంగా వివిధ స్కూళ్ల మధ్య వ్యత్యాసముంది. నివేదిక ప్రకారం ఎక్కువ మంది టీచర్లు పిల్లల్ని కొడుతున్నారు. సగటున 43% మంది వారానికి 3 సార్లయినా వారి చేతిలో దెబ్బలు తింటున్నారు. - కొన్ని పాఠశాలల్లో 80 నుంచి 100 శాతం పేద పిల్లలు శిక్షల బారినపడుతున్నారు. ప్రతి బడిలో ఒకరిద్దరు క్రూరంగా హింసించే టీచర్లున్నారు. కొన్ని పీరియడ్లలో వారు సామూహిక శిక్షలు విధిస్తారు. - తీవ్ర శిక్షలకు గురవుతున్న పిల్లలంతా పేద కుటుంబాలవారు.. ‘వలస’నేపథ్యమున్న పిల్లలు. తమ కుటుంబాల్లో బడిమెట్లు ఎక్కిన మొదటితరం బిడ్డలు. - 91 శాతం మంది తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టడాన్ని ఆమోదిస్తున్నారు. పైగా ఇంట్లో కూడా కొడుతున్నామని 74 శాతం మంది చెబుతున్నారు. స్కూల్లో కొట్టారని చెబితే 70 శాతం పెద్దలు కోపంతో మరింత బాదేస్తున్నారు. - ప్రతి రోజూ భౌతిక హింసతో పాటు మానసిక హింసకు గురవుతున్నారు అత్యధికులు. 53 శాతం విద్యార్థులు తమను అసలు కొట్టొద్దని అభ్యర్థిస్తున్నారు. దెబ్బలు తింటున్నందుకు అవమానపడిపోతూ.. బడి అంటే భయపడిపోతూ.. బడి, చదువు పట్ల వ్యతిరేక భావనలకు లోనవుతున్నారు. - ఆడపిల్లలను.. వయసు, బరువు, రూపురేఖలు, పెళ్లి వంటి అంశాలను అడ్డంపెట్టుకుని మాటలతో అవమానిస్తున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో అమ్మాయిలకంటే అబ్బాయిలు ఎక్కువ దెబ్బలు తింటున్నారు. చట్టాల అమలేదీ? విద్యాహక్కు చట్టం– 2009, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శకాలు, ఐరాస బాలల హక్కుల ఒప్పందం సహా మొత్తం 15 పాలసీలు/ ప్రణాళికలు పిల్లలపై హింసను నిషేధించాయి. సంస్కరణ పేరిట విద్యలో‘శిక్ష’ను భాగం చేయకూడదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 65 శాతం మంది పిల్లలు టీచర్ల చేతిలో హింసకు గురవుతున్నారు. బడిలో కొనసాగుతున్న మానసిక హింసను కూడా పరిగణనలోకి తీసుకుని లెక్కగట్టిన బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్.. 99.9 శాతం పిల్లలు బడిలో హింస బారినపడుతున్నారని తేల్చింది. హింస వెనుక.. - ‘వలస’కుటుంబాల పిల్లలు కావడంతో వివక్షకు గురవుతున్నారు. వీరి తల్లిదండ్రులు అసంఘటిత రంగ శ్రామికులు. పిల్లలతో హోంవర్క్ చేయించలేని నిరక్షరాస్యులు. పిల్లలు బడిలో దెబ్బలు తినేందుకు ఇదే మొదటి కారణమవుతోంది. వృత్తిపరమైన శిక్షణ లేని టీచర్లకు.. నేర్చుకోవడంలో పిల్లలకు ఎలా సాయపడాలో తెలియదు. ప్రత్యామ్నాయ క్రమశిక్షణ పద్ధతుల గురించి అవగాహనే లేదు. దీనికితోడు.. మౌలిక సదుపాయాలలేమి, పని పరిస్థితులు విసిరే సవాళ్లు వారు విసిగిపోయేందుకు కారణమవుతున్నాయి. తమ చికాకునంతా పిల్లలపై చూపిస్తున్నారు. - పిల్లలను లక్ష్యపెట్టని, వారిని మనుషులుగా చూడలేని, వారి హక్కులను గుర్తించలేని సామాజిక వాతావరణం ఈ హింసకు ఒక కారణమవుతోంది. దీనిలో మార్పు తీసుకురావాల్సిన, చట్టాలను అమలు చేయాల్సిన అవసరముందని నివేదిక చెప్పింది. - హింస తాలూకు గాయాలు పిల్లలను జీవితాంతమూ వెన్నాడుతాయన్నారు ఈ నివేదికకు ముందుమాట రాసిన బాలలహక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ మాజీ చైర్పర్సన్ శాంతాసిన్హా. అవమానంతో ఆత్మహత్య ఢిల్లీలో 12 ఏళ్ల బాలిక పాఠశాలలో ఎదురైన అవమానం భరించలేక ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. స్కూలు టీచర్ కొట్టడం వల్లే తన కూతురు అఘాయిత్యానికి పాల్పడిందని ఆమె తల్లి ఆరోపిస్తోంది. డిసెంబర్ 1న బడికి వెళ్లేందుకు నిరాకరించిన ఆ బాలిక.. తన ఆత్మహత్య విషయాన్ని స్కూలుకు తెలపాలంటూ చేతులపై సూసైడ్ నోట్ రాసింది. వేరే బడిలో చేర్పించాల్సిందిగా అంతకు ముందురోజు రాత్రి తల్లిని కోరింది. -
బాల్యంపై ‘బళ్లెం’
సాక్షి, కడప : బాలల భవితవ్యం అగమ్యగోచరంగా మారుతోంది. పుట్టిన క్షణంలో అన్నీ బాగున్నా...తర్వాత కాలంలో వారిలో మార్పు కనిపిస్తోంది. చిన్న వయస్సులోనే పెద్ద భారం..చెప్పుకోలేని బాధ వారికి గుదిబండగా మారుతోంది. కం ప్యూటర్ యుగం అభివృద్ధి్ద చెందుతున్నా బాలలను మాత్రం అంగవైకల్యం వెంటా డుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం వెరసి చిన్నారుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతోంది. తల్లి గర్భిణిగా ఉన్నప్పుడే సరైన రీతిలో వారికి పౌష్టికాహారం సక్రమంగా అందించకపోవడంతో కడుపులో ఉన్న బిడ్డ ఏదో ఒక సమస్యతో పుడుతున్నారని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. చిన్నారులను చూస్తే అయ్యోపాపం అనక మానరు. ఎందుకంటే కళ్లు న్నా చిన్న వయస్సులోనే కనిపించక కొందరు...చేతులున్నా వంకర్లతో మరికొందరు....నడవడానికి కాళ్లు సహకరించక ఇంకొందరు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రత్యేక చర్యలతో వీరికి కొంతైనా ఉపశమనం ఉండదా?యంత్రాంగం నడుం బిగిస్తే ఎంతోకొంత సాధించడం కష్టమేమి కాదేమో? అయితే బాల్యంపై వికలత్వం బళ్లెంలా మారడంతో వారి బతుకు అగమ్య గోచరంగా మారింది. జిల్లాలో మానసిక రుగ్మతలతో బాధపడుతున్న చిన్నారులు అధిక సంఖ్యలో ఉన్నారు. జిల్లా విద్యాశాఖ రికార్డుల్లో కొంతమేర రికార్డు చేసినా అనధికారికంగా అంతకు రెట్టింపు ఉంటారు. చిన్నారుల పరిస్థితి విషయంలో ప్రత్యేకంగా ప్రభుత్వం భవితకేంద్రాల ద్వారా వారిలో మార్పు తీసుకు వచ్చేందుకు ఫిజియోథెరఫి డాక్టర్లతోపాటు ఇతర టీచర్లను పెట్టి నడిపిస్తున్నారు. కంటికి సంబంధించి కూడా ప్రతి సంవత్సరం వైద్య కార్యక్రమాలు చేస్తున్నా ఏడాదికేడాదికి ఆ సంఖ్య తగ్గాల్సి ఉంటుది. అయితే మానసిక వ్యాధుల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. వీరికి అనేక ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తున్నా మార్పు రాకపోవడంతో ప్రతిక్షణం వారిని తలుచుకుని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చిన్నారులను వేధిస్తున్న అనేక రకాల సమస్యలు చిన్నారులను అనేక రకాల సమస్యలు వేధిస్తున్నా యి. మానసిక వికలాంగులుగా నరకయాతన అనుభవించే వారు సుమారు 1397మంది ఉండగా ...కంటిచూపు సమస్య ఉన్న వారు 1208 ...మూగవారు 510...వినికిడి లోపం సమస్యతో బాధపడేవారు 599..కాళ్లు చేతులు వంకర ఉన్న వారు 323..మానసిక రుగ్మతలతో బాధపడుతూ చదువులో వెనుకబడిన వారు 726 మంది కనిపిస్తున్నారు. విద్యాశాఖ రికార్డుల్లో అంతమేర కనిపిస్తు ్డన్నా.. ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలుస్తోంది. నలిగిపోతున్న బాల్యం చిన్న వయస్సులోనే పాఠశాలకు వెళ్లాలంటే మారాం చేసే చిన్నారులకు ఆటపాటలు ఉన్నాయని....అందమైన ప్రపంచం ఉందని వారికి మంచి మాటలు చెప్పి చదువుల తల్లి ఒడికి చేరేలా చూస్తాం. కానీ అక్కడ చేరిన తర్వాత తరగతులు మారుతూ.. పెద్దవారు అయ్యేకొద్ది తల్లిదండ్రుల్లో ఆనందం కనిపిస్తోంది. కానీ ఆటపాటలు లేక నలిగిపోతూ మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఒత్తిడికి గురై తామేం చేస్తున్నామో మరిచిపోయి ప్రాణాలను తీసుకోవడానికి కూడా తెగిస్తున్నారు. కానీ బాల్యం మాత్రం భయపడుతూనే కాలం సాగిస్తోంది. చిన్నారులకు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటే మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
నెత్తిపై మృత్యు దేవత
పెంకులు పడిపోతుంటాయి. నెత్తిన బొప్పి కడుతుంటాయి. పైకప్పులోంచి చువ్వలు కనిపిస్తుంటాయి. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయం.. ఎప్పుడే ప్రాణం పోతుందోనని కలవరం. శిధిలమవుతున్న ప్రభుత్వ భవనాలు మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. కూలిపోయే స్థితిలో ఉన్న గదుల్లో పాఠశాలలు సాగుతున్నాయి. పాచిపెంటలో ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్డి గోడ కూలి ఓ విద్యార్థి నిండు ప్రాణం రాలిపోయింది. నెత్తిపైనే మృత్యుదేవత తాండవిస్తోంది. సాక్షి,విజయనగరం: సీతానగరం పీహెచ్సీ సిబ్బంది నివాసాలు శిధిలమయ్యాయి. పెదంకలాం పీహెచ్సీ భవనం శిధిలమై పాములకు నివాసంగా మారింది. గుమ్మిడివరంలో ఎంపీఈ స్కూల్ అదనపు భవనం కూడా కూలిపోయే స్థితికి చేరుకుంది. – సీతానగరం (పార్వతీపురం) మండలంలోని భోజరాజపురంలో పాఠశాల భవనం పూర్తిగా పాడైనా అందులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. గోపాలరాయుడిపేట ఎంపీపీ పాఠశాల భవనంలో తరగతి గది పైకప్పు పెచ్చులూడిపోయింది. – బొబ్బిలి రూరల్ నెల్లిమర్ల మండల పరిషత్ భవనం శిథిలమై ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. ఈ భవనాన్ని 1998లో మిమ్స్ ఆస్పత్రి సేవలకు అప్పగించగా 2002లో ఖాళీ చేసినా తొలగించలేదు. – నెల్లిమర్ల చీపురుపల్లి ఆర్ అండ్ బి సహాయ ఇంజనీర్ అధికారి కార్యాలయం శిధిలం కావడంతో సిబ్బంది ఖాళీ చేశారు. కొన్నాళ్లకు భవనం కొంత కూలిపోయినా ఇంతవరకు తొలగించలేదు. జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి అంతస్తులోని పలు భవనాలు కూడా శిధిలావస్థకు చేరుకున్నాయి. – చీపురుపల్లి మెరకముడిదాంలో రెండేళ్ల క్రితం ఎస్సీ బాలుర వసతిగృహాన్ని ఎత్తివేశారు. అప్పటి నుంచి భవనం వృధాగా పడి ఉండటంతో శిధిలావస్థకు చేరింది. – మెరకముడిదాం (చీపురుపల్లి) వేపాడ మండలంలో శిధిలమైన భవనాల్లోనే చదువులు సాగుతున్నాయి. ఆకులసీతంపేట, సోంపురం, గుడివాడ, కుమ్మపల్లి, జగ్గయ్యపేట, ఎస్.కోట సీతారాంపురం, వేపాడ తదితర ప్రాథమిక పాఠశాలలు ఏ క్షణాన్నయినా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. – వేపాడ (శృంగవరపుకోట) -
సక్కని సర్కారు బడి..
విద్య వికాసాన్ని నింపే ఆయుధం. విద్యార్థులు రేపటి దేశ ఆశా కిరణాలు.. విద్యాసంస్థలు రేపటి పౌరులను.. ఇంజనీర్లను.. డాక్టర్లను.. అన్నింటినీ కలిపి రేపటి దేశ సంపదను తయారు చేసే కర్మాగారాలు.. ప్రైవేటు పాఠశాల హోరుకు తట్టుకోలేక.. కనీస సదుపాయాలు లేక మూత బడిన పాఠశాలలెన్నో.. ఇదిలా ఉంటే సిద్దిపేటలోని ఇందిరానగర్ జెడ్పీహెచ్ఎస్ లాంటి విద్యాలయాలు ఫలితాలు, సదుపాయాలతో విద్యార్థులను క్యూ కట్టిస్తున్నాయమరో వైపు అందుబాటులో కళాశాల విద్య లేక అనేక ప్రాంతాల్లో విద్యార్థులు బస్సుల్లో గంటల తరబడి ప్రయాణించలేక పాట్లు పడుతున్నారు. నేడు అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా ఆదర్శంగా నిలుస్తున్న విద్యాలయాలు.. విద్యార్థుల సమస్యలు.. రాబోవు ప్రభుత్వంపై వారి ఆకాంక్షలపై ప్రత్యేక కథనం.. సిద్దిపేట ఎడ్యుకేషన్: ఆ పాఠశాలలో చదువుకునేందుకు అడ్మిషన్ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు క్యూ కడతారు. కాస్త ఆలస్యం అయిందా అంతే సంగతి.. ఇక సీటు గూర్చి మర్చిపోవాల్సిందే. ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీఐపీలు సిఫార్సు చేసిన సీటు దొరకడం గగనమే. అంత క్రేజ్ ఉంది ఆ పాఠశాలకు. ఇదేదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లేదా హైదరాబాద్‌లోని హెచ్‌పీఎస్ కాదు.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఈ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులు పొంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హెచ్ఎంగా రామస్వామి రాకతో మారిన రూపు.. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జడ్పీహెచ్ఎస్ 2015 ముందు అన్ని పాఠశాల మాదిరిగానే సుమారు 400ల పైచిలుకు విద్యార్థులతో నడుస్తుండేది. 2015 జూలైలో ఈ పాఠశాలకు హెచ్ఎంగా రామస్వామి విధులు చేపట్టినప్పటి నుంచి ఉపాధ్యాయుల అందరి సహకారంతో క్రమంగా మంచి గుర్తింపును తీసుకువచ్చారు. ఇందుకోసం ఉపాధ్యాయులంతా ఐక్యంగా ఉంటూ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఇంటింటికి తిరిగి విద్యార్థులను తప్పకుండా పాఠశాలకు హాజరు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. అన్ని తరగతుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థుల పూర్తి వివరాలను కంప్యూటరైజ్డ్ చేశారు. దీంతో ఉపాధ్యాయులకు రాత పనిని పూర్తిగా తగ్గించి వారి సమయం మొత్తాన్ని విద్యార్థులపై కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేశారు. మల్టీఫేస్డ్ విధానాన్ని అవలంబించడంతో మంచి ఫలితాలు వచ్చాయి. ఈ విధానం గూర్చి గతంలో బెంగుళూర్లో జరిగిన ప్రాంతీయ సమావేశంలో హెచ్ఎం రామస్వామి వివరించి కేంద్రమంత్రితో ప్రశంసలు అందుకున్నాడు. ప్రతీ విద్యార్థిపై ప్రత్యేకంగా దృష్టి సారించి వారి తల్లిదండ్రులను కలవడం, అవసరమైన తల్లిదండ్రులకు నిపుణులచే కౌన్సిలింగ్‌లు నిర్వహించడం. విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు అయితే వారి తల్లిదండ్రులకు మెసేజ్ పంపించేందుకు ప్రత్యేకంగా ఒక అప్లికేషన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం 828 మంది విద్యార్థులతో ప్రతి తరగతికి నాలుగు సెక్షన్లు ఏర్పాటు చేసి విద్యను బోధిస్తున్నారు. ప్రతి తరగతికి ఒక సీనియర్ ఉపాధ్యాయుడు ఇన్చార్జిగా విధులను నిర్వహిస్తూ ఆ తరగతికి సంబంధించిన పూర్తి అంశాలను చూస్తుంటాడు. ప్రతీ రోజు సాయంత్రం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నిర్వహణ, ప్రతిభావంతులన విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తుంటారు. ప్రతి వారాంతంలో విద్యార్థులచే ఒక్కో సబ్జెక్ట్ ప్రాజెక్ట్‌పై ప్రజెంటేషన్ నిర్వహణ ఉంటుంది. సౌకర్యాలు.. నాట్కో ఫార్మ ఇండస్ట్రీ సహాయంతో ఒక కంప్యూటర్ ల్యాబ్, ఎటీఎల్ ల్యాబ్, అధునాతన మరుగుదొడ్లు, 6 అదనపు తరగతి గదులు నిర్మించారు. వీటితో పాటు కిచెన్‌కు, వాటర్ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా ఒక గదిని నిర్మించారు. ప్రతీ తరగతి గదిలో అధునాతన బోర్డులు, డిజిటల్ క్లాస్‌రూం, స్పోర్ట్స్ మెటీరియల్ తదితర సౌకర్యాలను కల్పించారు. వీటికి తోడు అధునాతన సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు వారంలోగా అందుబాటులోకి రానున్నాయి. ప్రకృతి ఒడి.. ఈ బడి తొగుట(దుబ్బాక): చుట్టూ కొండలు.. దట్టమైన అటవీ ప్రాంతం... పచ్చని పంటలు, పాడిగేదెలతో కళకళాడుతున్న గ్రామం తోగుట మండలంలోని పెద్దమాసాన్‌పల్లి పరిధిలోని ఇందిరానగర్. ఆ గ్రామంలో ప్రాథమిక పాఠశాల పచ్చదనానికి కేరాఫ్‌గా నిలుస్తోంది. పాఠశాల ఉపాధ్యాయుడిగా 2009లో బాధ్యతలు స్వీకరించారు వైవి.సురేష్‌కుమార్. ఆయన రాకతో పాఠశాల రూపు రేఖలు మారిపోయాయి. విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బ్యాగ్‌లు, ష్యూస్ ఉచితంగా అందించారు. దాతల సహకారంతో విద్యార్థులకు ఏటా నోట్ పుస్తకాలు పంపిణీ చేపట్టారు. పాఠశాలలో కేవలం 30 గుంటల భూమే ఉంది. ప్రహరీ సైతం లేకపోయినా సుమారు 300 మొక్కలు పెంచారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం పథకాన్ని స్పూర్తిగా తీసుకుని మొక్కలు పెంపకాన్ని చేపట్టారు. మామిడి, చింత, జామ, అల్లనేరేడు, పొప్పెడ, నిమ్మ, దానిమ్మ, పనస వంటి పండ్ల మొక్కలతో పాటు మునగ, ఎర్రచందనం, బాదాం, వేప, కొబ్బెర వంటి మూడు వందల రకాల మొక్కలు నాటారు. వేసవిలో మొక్కలను కాపాడేందుకకు అటవిశాఖ అధికారుల సహకారంతో ట్యాంకర్ల ద్వారా నీరందించారు. తర్వాత విద్యార్థుల కోసం ప్రభుత్వం పాఠశాల ఆవరణలో బోరు వేయించింది. దీంతో మొక్కలను నీరు అందుతోంది. ఇంకా పాఠశాలలో పండించిన ఆకు కూరలు, కూరగాయలతోనే మధ్యాహ్న భోజనం వండేవారు. ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయుడు సురేశ్‌ను ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తించి అవార్డు అందించి సత్కరించింది. చిన్నారులకు నీళ్ల గోస రాయికోడ్(అందోల్): మండలంలోని అనేక పాఠశాలలను తాగు నీటి సమస్య వెక్కిరిస్తోంది. మండలంలో మొత్తం 47 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 25 ప్రాథమిక, 17 ప్రాథమికోన్నత, 5 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో సుమారు 30 పాఠశాలల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గత దశాబ్దకాలంగా పాఠశాలల్లో తాగునీటి ఇబ్బందుల నడుమే విద్యార్థులు చదువు సాగిస్తున్నారు. మండల కేంద్రం రాయికోడ్లోనూ పాఠశాలల విద్యార్థులు నీటి సమస్యతో తీవ్ర తిప్పలు పడుతుండడం గమనార్హం. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రతి సంవత్సరం పాఠశాలలో నెలకొన్న తాగునీటి సమస్యను ఉన్నతాధికారులకు నివేధిస్తున్నామని చెబుతున్నా విద్యాశాఖ నుంచి మాత్రం పరిష్కారం లభించడం లేదు. నిత్యం విద్యార్థులు ఇంటి నుంచి తాగునీటి తెచ్చుకుని మధ్యాహ్న భోజనం సమయంలో వినియోగించుకుంటున్నారు. ప్రచారానికి వచ్చే నాయకులు తమ పిల్లల ఇబ్బందులు చూసి పరిష్కారానికి హామీ ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. రోడ్డు పక్కన.. ఉన్న పాఠశాల దుస్థితి రేగోడ్(మెదక్): మండలంలోని వెంకటాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల రోడ్డు పక్కనే ఉంది. దీనికి ప్రహరీ గోడ కూడా లేదు. విద్యార్థులు బడి నుంచి బయటకు రావడంతోనే రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని తమ పిల్లలను బడికి పంపిస్తున్నారు. పాఠశాలకు కనీసం ప్రహరీని నిర్మించాలని పదేపదే కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదర్శ బడికి అవస్థల ప్రయాణం మద్దూరు(హుస్నాబాద్): మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు మండలంలోని 23గ్రామాల నుండి విద్యార్థులు వస్తారు. మండలం లోని సగం గ్రామాలకు బస్సు సౌకర్యం లేక వారంతో ఆటోల్లోనే ప్రమాదకరంగా ప్రయాణం చేయాల్సిన దుస్థితి. అధికారులు, ప్ర భుత్వ పెద్దలు స్పందించి కనీసం పాఠశాల సమయాల్లోనైనా బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. నిత్యం బస్సు బాధే నారాయణఖేడ్: చదువు కోసం ఖేడ్‌కు నిత్యం వచ్చే విద్యార్థులు బస్సుల కోసం పడుతున్న ఇబ్బందులు కోకొల్లలు. ఎన్నిమార్లు డీఎం, ఆర్ఎం, రాజకీయ నాయకులకు మొరపెట్టుకున్నా, ధర్నాలు, రాస్తారోకోలు చేసినా ఫలితం ఉండడంలేదు. ఆందోళన చేసిన సందర్భంలో ఒకటి, రెండు రోజులు బస్సుసర్వీసు నడపడం, అనంతరం పరిస్థితి మొదటికే రావడం ఇక్కడ మామూలుగానే మారింది. విద్యార్థులకు బస్‌పాసులు ఉండడంతో తమకు ఆదాయం సమకూరదన్న భావనతో బస్సులను స్టేజీల వద్ద నిలపకపోవడం, పాఠశాలల సమయాలకు అధికారులు బస్సులు నడపడం లేదు. నారాయణఖేడ్ నుంచి రాయిపల్లి, అంత్వార్, రుద్రార్, పుల్కుర్తి, మనూరు, బెల్లాపూర్, కారాముంగి, కరస్‌గుత్తి, నాగల్గిద్ద, మోర్గి, తుర్కాపల్లి, ర్యాకల్, గంగాపూర్, సిర్గాపూర్, నల్లవాగు, బీబీపేట్, కల్హేర్, మాసాన్‌పల్లి, బాచేపల్లి, నిజాంపేట్, సంజీవన్‌రావుపేట్, హన్మంత్‌రావుపేట్, లింగాపూర్ తదితర రూట్లనుండి వచ్చే విద్యార్థులు నిత్యం పాట్లు పడక తప్పడంలేదు. -
అందని ‘మధ్యాహ్న’ బిల్లులు
సాక్షి, గుర్రంపోడు : మధ్యాహ్న భోజన ఏజెన్సీ మహిళలకు బిల్లులు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాలుగు నెలలుగా బిల్లులు అందక పోవడంతో అప్పులు చేసి వంట సామగ్రి తేవాల్సి వస్తుందని ఏజెన్సీ మహిళలు వాపోతున్నారు. మండలంలో 58 పాఠశాలలకుగాను 58 భోజన ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఒకటవ తరగతి నుంచి ఐదవతరగతి వరకు వంట వండినందుకుగాను ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.4.13, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.6.18 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. వంట చెరుకుతో పాటు కూరగాయలు, నూనె, పప్పు, ఉప్పు ఇతర వంట సామగ్రిని ఏజెన్సీలు సమకూర్చుకోవాలి. బియ్యం మాత్రం ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రోజుకు వంద గ్రాములు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రోజుకు 150 గ్రాముల చొప్పున ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఈ పరిమాణం కూడా సరిపోక తాము నింద మోయాల్సి వస్తుందని వంట ఏజెన్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం సోమవారం గుడ్డు, అన్నం, కూరగాయల కర్రీ, మంగళవారం అన్నం, ఆకుకూరల పప్పు, బుధవారం గుడ్డు, అన్నం, కూరగాయల కర్రీ, గురువారం అన్నం, సాంబారు, కూరగాయల కర్రీ, శుక్రవారం గుడ్డు, అన్నం, పప్పు కూర, శనివారం బఠానీ, ఆలు, క్యారెట్లతో వెజ్ బిర్యాణీ లేదా బగార అన్నం వండాల్సి ఉంది. ఏజెన్సీలు తప్పనిసరిగా ఈ మెనూ ప్రకారమే వండాల్సి ఉంటుంది. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ తదితర అధికారులు తరుచూ ఆకస్మిక తనిఖీలతో మధ్యాహ్న భోజన మెనూను పరిశీలిస్తారు. వారానికి మూడు గుడ్ల చొప్పున తప్పనిసరిగా అందించాల్సి ఉంది. గుడ్డుకు నాలుగు రూపాయలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుండగా ఒక్కోసారి ఐదు రూపాయల వరకు గుడ్డు ధర ఉండి నష్టపోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. వంట సామగ్రితోపాటు గుడ్లకు బిల్లులు అందక గ్రామాల్లో వ్యాపారులు తమకు ఉద్దెరగా సామాను ఇవ్వడం లేదని అంటున్నారు. బిల్లులు అందక వంట చేయలేక, మధ్యలో మానుకోలేక అవస్థలు పడాల్సి వస్తుందని మహిళలు వాపోతున్నారు. ఎప్పుడు బిల్లు అడిగినా ఎస్టీఓకు వెళ్లిందని, బ్యాంకు వెళ్లిందని చెబుతున్నారని వారు వాపోతున్నారు. కొన్ని చోట్ల వంట గదులు లేవు మండలంలో 31 పాఠశాలలకు మాత్రమే వంట గదులు ఉన్నాయి. ఇంకా 20 పాఠశాలలకు వంట గదుల అవసరం ఉంది. వంట గదులకు గతంతో మండల పరిషత్ నిధుల నుంచి, ప్రస్తుతం ఉపాధిహామీ నిధుల నుంచి మంజూరు చేస్తున్నా అసంపూర్తి నిర్మాణాలతోనే ఉన్నాయి. కొన్ని బేస్మెంట్ స్థాయిలో, మరికొన్ని స్లాబ్ లెవెల్లో ఉన్నాయి. గతంతో నిర్మించిన వంట గదులు ఇరుకుగా ఉండి ఆరుబయటే వండాల్సి వస్తుందని, ఉన్నత పాఠశాలల్లో వంట గది నిర్మాణం విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా విశాలంగా లేవు. కొన్ని చోట్ల ఇంటివద్దనే వండుకుని తీసుకుని వస్తున్నారు. ఏజెన్సీలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. వర్షాకాలంలో వంట చెరుకు తడిసి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ విషయమై ఎంఈఓ నోముల యాదగిరిని ప్రశ్నించగా జూలై, ఆగస్టు బిల్లు ఎస్టీఓ నుంచి బ్యాంకుకు వెళ్లిందని, ఒకటి, రెండు రోజుల్లో ఏజెన్సీల ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. బిల్లులు ప్రతినెలా అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బిల్లులు అందక తిప్పలు మధ్యాహ్న భోజన బిల్లులు ప్రతినెలా అందించాలి. నాలుగు నెలలుగా బిల్లులు అందక ఇప్పటికే ఎన్నో అప్పులు చేశాం. బిల్లు అందక సకాలంలో డబ్బులు ఇవ్వక అప్పు కూడా పుట్టడం లేదు. బిల్లు రానిదానికి వారానికి మూడు గుడ్లు పెట్టాలంటే ఇబ్బందిగా ఉంది. – పెరిగ జంగమ్మ, పిట్టలగూడెం -
ఫైట్ ‘అనిమియా’
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: రక్తహీనత సమస్యను అధిగమించడానికి వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. ఫైట్ అనిమియా పేరుతో పిల్లల్లో, గర్భిణుల్లో రక్తహీనతను తగ్గించేందుకు కార్యక్రమ రూపకల్పన చేస్తోంది. జిల్లాలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడంతో అనిమియాకు గురై మత్యువాత పడుతున్న సంఘటనలు అనేకం. చిన్నారులు పౌష్టికాహార లోపం కారణంగా వచ్చే అనిమియాతో ఆస్పత్రుల పాలవుతున్నారు. పౌష్టికాహార కేంద్రాలు ఏర్పాటు చేసినా పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అనిమియాను తరమికొట్టేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు.. జిల్లాలోని 300 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, వసతిగృహాల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే వైద్య పరీక్షలు చేసి రక్తహీనత విషయాన్ని నిర్ధారిస్తారు. జిల్లా వ్యాప్తంగా 110 యూపీఎస్, 190 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఎయిడెడ్ పాఠశాల 1, బీసీ వసతి గృహాలు 2, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 22, కేజీబీవీలు 17, లోకల్‌బాడి పాఠశాలలు 187, సోషల్ వెల్ఫేర్ 3, మోడల్ స్కూళ్లు 6, ట్రైబల్ వెల్ఫేర్ 53, యూఆర్ఎస్ 1, రెసిడెన్షియల్ పాఠశాలలు 6 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో కలిపి 43,991 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరికి వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈనెల 12 నుంచి మొదలు.. ఈనెల 12వ తేదీ నుంచి పాఠశాలల్లో అనిమియా వైద్య పరీక్షలు చేయనున్నారు. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖ 8 బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ముగ్గురు ఏఎన్ఎంలు, ఒక వైద్యాధికారి, ఒక ఫార్మాసిస్ట్ ఉంటారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత హెమోగ్లోబిన్ శాతం 8 గ్రాములు ఉంటే రోజుకు రెండు ఐరన్ మాత్రలు, 8 నుంచి 11 శాతం ఉంటే రోజు ఒక మాత్ర చొప్పున మూడు నెలల పాటు అందిస్తారు. పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు రక్తహీనతతో బాధపడుతున్నారో లెక్కించి వారికి చికిత్స కోసం చర్యలు తీసుకుంటారు. ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం అనంతరం ఈ మాత్రలు వారికి ఇవ్వనున్నారు. పౌష్టికాహారం లోపమే సమస్య.. పౌష్టికాహార లోపమే అనిమియా రావడానికి ప్రధాన కారణం. ప్రొటీన్లు, విటమిన్లు, ఆకుకూరలు, కూరగాయల భోజనం చేయకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. అనిమియాతో విద్యార్థుల్లో అలసట రావడం, తల తిరగడం, ఛాతినొప్పి రావడం, పెరుగుదల లేకపోవడం, ఆకలి ఉండకపోవడం, తదితర వాటితో బాధపడుతుంటారు. దీంతో విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాలను ఎంపిక చేయగా, అందులో ఆదిలాబాద్ జిల్లా ఉంది. జిల్లాలో దాదాపు 30 శాతం మంది వరకూ విద్యార్థులు రక్తహీనతతో బాధపడుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు ఫైట్ అనిమియా పేరుతో రక్తహీనతతో బాధపడుతున్న 6 నుంచి 10వ తరగతి విద్యార్థులను గుర్తించి వారికి వైద్య పరీక్షలు చేయిస్తాం. రక్తహీనతతో బాధపడుతున్న వారికి మాత్రలు అందిస్తాం. జిల్లా వ్యాప్తంగా 43,991 మంది విద్యార్థులు ఉండగా వారందరికి పరీక్షలు చేస్తాం. అనిమియాతో బాధపడుతున్న వారికి మూడు నెలల పాటు మాత్రలు అందిస్తాం. – రాజీవ్‌రాజ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ఆదిలాబాద్ -
అందరికీ యూనిఫాం
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇకపై స్కూల్ యూనిఫాం 9, 10వ తరగతి విద్యార్థులకు సైతం అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకూ 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే యూనిఫాం అందేది. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో మిగతా రెండు తరగతుల విద్యార్థులకు సైతం యూనిఫాం అందించనున్నారు. ఈ మేరకు ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫాం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకుగానూ అయ్యే కుట్టుకూలిని సైతం విడుదల చేసింది. సర్కారు బడుల్లో చదువుతున్న పేద విద్యార్థులందరికీ ఒకేరకమైన యూనిఫాం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏకరూప దుస్తులు అందజేస్తోంది. గత కొన్నాళ్లుగా 1వ తరగతి నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు మాత్రమే వీటిని అందించేవారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా సరఫరా చేస్తున్న వీటిని ఈ విద్యా సంవత్సరం నుంచే 9, 10వ తరగతులు చదివే విద్యార్థులకు కూడా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులందరికీ మేలు జరగనుంది. జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలో 450 ప్రాథమిక పాఠశాలలు, 100 ప్రాథమికోన్నత పాఠశాలలు, 102 ఉన్నత పాఠశాలలు(డీఈవో పరిధిలో) ఉన్నా యి. వీటితో పాటు 17 కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, ఆరు ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో చదువుతున్న వారంతా పేద విద్యార్థులే. ఈ పాఠశాలల్లో చదువుకుంటున్న 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే యూనిఫాం పంపిణీ చేసేవారు. అయితే కేజీబీవీల్లో చదువుతున్న అన్ని తరగతుల విద్యార్థినిలకు మాత్రమే ఏకరూప దుస్తులు అందిస్తున్నారు. 13 కేజీబీవీల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు 527 మంది, 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు 534 మంది ఉన్నారు. ప్రభుత్వ, జెడ్పీహెచ్ఎస్లలో 9, 10వ తరగతులు చదివే బాలికలు 4910, బాలురు 5182 మంది, మొత్తం 10092 మంది ఉన్నారు. అలాగే ఆరు ఆదర్శ పాఠశాలల్లో 277 బాలురు, 467 మంది బాలికలు ఉన్నారు. వీరికి త్వరలోనే బట్ట రాగానే ఎమ్మార్సీల తీర్మానం అనంతరం యూనిఫాం కుట్టి అందజేయనున్నారు. కుట్టుకూలి విడుదల..ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న అన్ని తరగతుల విద్యార్థులకు యూనిఫాం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యాశాఖ ఏర్పాట్లకు సిద్ధమైంది. కుట్టుకూలీకి సంబంధించి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ప్రతీ విద్యార్థికి రెండు జతల చొప్పున దుస్తులు అందజేయనున్నారు. అయితే ఒక జతకు రూ.100 చొప్పున దర్జీకి చెల్లించనున్నారు. 1061 మంది కేజీబీవీ విద్యార్థినిలకు సంబంధించి రూ.53,050, మోడల్ స్కూల్ విద్యార్థులు 694 మందికి గానూ రూ.69,400, ప్రభుత్వ, జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు 10,092 మందికి గానూ రూ.1,09,200ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులను ఎస్ఎంసీ ఖాతాలో జమ చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం మంచిదే 9, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం మంచిదే. ఇప్పటి వరకు మా తల్లిదండ్రులు యూనిఫాం కుట్టిస్తుండడంతో వారికి ఆర్థికంగా కొంత భారమయ్యేది. ప్రస్తుతం ప్రభుత్వమే రెండు జతల యూనిఫాం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. – దానిష్, 10వ తరగతి విద్యార్థి ఆనందంగా ఉంది.. మాకు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాత్రమే యూనిఫాం ఉచితంగా అందించారు. 9వ తరగతిలో ఇవ్వలేదు. ఈఏడాది నుంచి ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు యూనిఫాం ఇస్తున్న విషయం తెలిసింది. చాలా ఆనందంగా ఉంది.– నిఖిత, 10వ తరగతి విద్యార్థిని -
మొరాయిస్తున్న బయోమెట్రిక్
నల్లబెల్లి (వరంగల్): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరులో పారదర్శకత పెంచడంతోపాటు విద్యార్థులకు నేరుగా పథకాలు అందించేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్‌ను ప్రారంభించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పాఠశాలలకు బయోమెట్రిక్ యంత్రాలను పంపిణీ చేశారు. కానీ, ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం, అధికారులు అప్డేట్ కాకపోవడం, నెట్వర్క్ సమస్య తలెత్తడంతో బయోమెట్రిక్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. బయోమెట్రిక్ విధానం పక్కాగా అమలైతే తప్పనిసరిగా ప్రతిరోజు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు తెలుస్తుంది. దీంతో ప్రభుత్వ బడుల్లో కొంతైనా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. విద్యార్థులకు ఆంగ్ల బోధనతోపాటు మధ్యాహ్న భోజనం, యూనిఫాం, పుస్తకాలు, హెల్త్ కిట్లను ఉచితంగా అందిస్తోంది. అయితే ఇవ్వన్ని విద్యార్థులకు చేరుతున్నాయా లేక దుర్వినియోగం అవుతున్నాయా అనే వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా గత నెలలో జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు యంత్రాల నిర్వహణపై రిసోర్స్ పర్సన్ల ద్వారా శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక బయోమెట్రిక్ యంత్రం చొప్పున పాఠశాలలకు అందించారు. ఈ నెల 1వ తేదీ నుంచి అమలు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా క్షేత్రస్థాయిలో నిర్వహణలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. నెట్వర్క్ సరిగా ఉండకపోవడం, యంత్రాలు వినియోగించడంలో అవగాహన లోపం వంటి కారణాలతోపాటు ఇటీవల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుల వివరాలు తొలగిస్తూ కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుల వివరాలు నమోదు చేయకపోవడం తదితర సమస్యలతో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరకుండా పోతోందని తెలుస్తోంది. ఒకే పాఠశాలలో కొందరు ఉపాధ్యాయులు వేలిముద్ర వేస్తే, మరికొందరు ఉపాధ్యాయులు వేయలేని పరిస్థితి ఏర్పడింది. మండల కేంద్రాలకు దూరంగా ఉన్న పాఠశాలల్లో నెట్వర్క్ సమస్యతో ఇబ్బందులు తలెత్తడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వేయలేని పరిస్థితి ఉందని పలువురు ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఇటీవల మండలానికి ఒకరు చొప్పున 15 మంది టెక్నీషియన్లను నియమించారు. కానీ, వారు విధుల్లో చేరకపోవడంతో బయోమెట్రిక్ యంత్రాలను మరమ్మతు చేసేవారు కరువయ్యారు. సమస్యను అధిగమించేందుకు చర్యలు.. బయోమెట్రిక్ యంత్రంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల సరైన వివరాలు నమోదు చేయాలి. యంత్రాల్లో తలెత్తే సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు నిపుణుల సాయం అందేలా చూడాలి. తద్వారా ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ జవాబుదారీతనంగా వ్యవహరిస్తారు. మధ్యాహ్న భోజన నిర్వహణలో సత్ఫలితాలు సాధించవచ్చు. జవాబుదారీతనం పెరుగుతుంది.. బయోమెట్రిక్ యంత్రాలు ఉపయోగించడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యబోధన మెరుగుపడుతుంది. ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. మా పాఠశాలకు అధికారులు మూడు యంత్రలు ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు, విద్యార్థుల ఐడీలు ఇవ్వలేదు. త్వరలోనే ఇస్తామని అధికారులు చెప్పారు. ఇచ్చిన వెంటనే బయోమెట్రిక్ యంత్రాలను ఉపయోగిస్తాం. – రామస్వామి, హెచ్ఎం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నల్లబెల్లి సిగ్నల్ సమస్యను అధిగమించేందుకు చర్యలు జిల్లాలోని 699 ప్రభుత్వ పాఠశాలలకు 756 బయోమెట్రిక్ యంత్రాలను పంపిణీ చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బయోమెట్రిక్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. ఉపాధ్యాయులు పనిచేసే సమయంపై పారదర్శకతతో పాటు మధ్యాహ్న భోజన నిర్వహణలో సత్ఫలితాలు పొందేందుకు ప్రభుత్వ పాఠశాలకు వీటిని పంపిణీ చేశాం. బయోమెట్రిక్ యంత్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే సరిచేసేందుకు ప్రభుత్వం విజన్‌టెక్ కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. నెట్వర్క్ లేని పాఠశాలలను గుర్తించి సమస్యను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. – కె.నారాయణరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి, వరంగల్ రూరల్ -
ఇంటింటికి ఇంటర్నెట్
మహేశ్వరంర (రంగారెడ్డి): ప్రభుత్వం తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు పనులు చేపట్టింది. ఈ ఫైబర్ గ్రిడ్ సేవలను ఈ ఏడాది ఫిబ్రవరి 19న హైదరాబాద్‌లో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రభుత్వం రూ.5వేల కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకా న్ని అమలు చేయాలని భావిస్తోంది. ఇంటింటికి ఇంటర్నెట్ నినాదం టీ ఫైబర్ గ్రిడ్ పథకం ముఖ్య ఉద్దేశం. పైలెట్ ప్రాజెక్టుగా మన జిల్లాలో మహేశ్వరం మండలంలోని నాలుగు గ్రామాలను ఎంపిక చేసింది. మహేశ్వరం, మన్సాన్పల్లి, తుమ్మలూ రు, సిరిగిరిపురం గ్రామాల్లో టీ ఫైబర్ గ్రిడ్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇంటర్నెట్ కనెక్షన్ కోసం లైన్లు వేశారు. ఒక్కో గ్రామంలో సుమారు రూ.50 లక్షలతో పనులు చేపట్టి పూర్తిచేశారు. టెలిఫోన్, వైఫై, ఈ–హెల్త్ ఈ– ఎడ్యుకేషన్, ఈ– పంచాయతీ, పౌర సేవలు, మినీ థియేటర్స్, వీడియో కాన్ఫరెన్స్‌లు, మీసేవ కేంద్రాల ద్వారా అందే సేవలు, ట్రిపుల్ సర్వీస్‌లు (ఇంటర్నెట్, కేబుల్ నెట్వర్క్, ల్యాండ్ లైన్ ఫోన్ సర్వీసులు), గ్రామంలో వీధి దీపాలను ఆటోమెటిక్ పద్ధతిలో వేయడం, ఆర్పడం వంటి సేవలను అందించనున్నారు. ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన గ్రామాల్లో తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాల, గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ ఆస్పత్రులు, మీ సేవా కేంద్రాలతో పాటు గ్రామంలో పది కనెక్షన్లు ఇచ్చారు.ఈ –హెల్త్ ద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నారు. వైద్య సిబ్బంది వ్యక్తుల ఆరోగ్య వివరాలు ఆన్లైన్లో పొందుపర్చి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సేవలు అందిస్తారు. అదేవిధంగా జనన, మరణ, ధ్రువీకరణ పత్రాలు సహా ఇతర ధ్రువీకరణ పత్రాలు 24 గంటల్లో ఇచ్చేలా మన్సాన్పల్లి గ్రామంలో సేవలను విస్తరించారు. రోగులు ఆస్పత్రి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. వైద్యులు వీడియో కాన్ఫరెన్స్‌లో బీపీ, షుగర్ పరీక్షల వివరాలు సేకరిస్తారు. రోగులకు అవసరమయ్యే మందులను లైవ్‌లో చెబుతారు. ప్రజలను సమస్యలను అధికారులకు చెప్పుకునేందుకు సులభతరం చేశారు. బటన్ నొక్కితే అధికారులు, ప్రజా ప్రతినిధులకు మెయిల్ వెళ్తుంది. వారు మెయిల్ చూసుకుని సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తారు. ఈ– ఎడ్యుకేషన్ ద్వారా విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడం కోసం మినీ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. పాఠశాలలకు డిజిటలైజేషన్ చేసి నాణ్యమైన విద్యను స్మార్ట్ క్లాస్‌ల ద్వారా విద్యార్థులకు అందిస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులకు అనుభవం కలిగిన ఉపాధ్యాయుల చేత పాఠాలు చెప్పిస్తారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం, సలహాలు, సూచనలు, పంటల సాగు, తెగుళ్ల నివారణకు మందుల, ఎరువుల వాడకం వివరాలు, నిత్యం రైతు బజార్లో కూరగాయాల ధరల వివరాలు అందించనుంది. వీధి దీపాలను ఇంటర్నెట్తో అనుసంధానం చేసి పంచాయతీ కార్యాలయం నుంచి విధులు నిర్వర్తించడానికి ఏర్పాటు చేశారు. స్మార్ట్ వాయిస్, వీడియో కాన్ఫరెన్స్‌లు, వాతవరణం, ఉష్ణోగ్రతల వివరాలు, తాజా వార్తల అప్డెట్స్, అసెంబ్లీ సమావేశాలు, జీఓలు పలు అంశాలను తెలుసుకోవచ్చు. ఈ నాలుగు గ్రామాల్లో వచ్చే ఫలితాల ఆధారంగా టీ ఫైబర్ గ్రిడ్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. -
‘ఏకరూపం’ అందేదెప్పుడు?
ఆదిలాబాద్‌రూరల్: సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. కానీ ప్రభుత్వ ప్రకటనలు కాగితాలకు మాత్రమే పరిమితమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. పాఠశాల ప్రారంభంలోనే విద్యార్థులకు నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందిస్తామన్న ప్రభుత్వ హామీ.. హామీగానే మిగిలిపోయింది. పాఠశాల ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ విద్యార్థులకు నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందించిన దాఖాలాలు కనిపించడం లేదు. వేలాది మంది విద్యార్థులు పాత దుస్తులతోనే నెట్టుకొస్తున్నారు. ఫలితంగా జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో చదువుకుంటున్న 17,893 మంది విద్యార్థులు కొత్త దుస్తుల కోసం ఎదురు చూస్తున్నారు. ఆలస్యంగా పంపిణీ.. బీసీ సంక్షేమ వసతి గృహంలో చదువుకునే విద్యార్థుల దుస్తులు ఇటీవలనే కుట్టు పూర్తయింది. గత రెండు రోజుల కిందట కొంత మంది హెచ్‌డబ్ల్యూవోలు దుస్తువులు తీసుకెళ్లగా మరికొంత మంది తీసుకెళ్లాల్సి ఉందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థుల అందించే దుస్తులు ప్రస్తుతం దర్జీల వద్ద కుట్టు దశలో ఉన్నాయి. దర్జీలకు కుట్టుకు సంబంధించిన చార్జీ కుదరకపోవడంతో ఆలస్యం జరిగిందని తెలుస్తోంది. హాస్టళ్ల వారీగా విద్యార్థులు.. జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఐటీడీఏ ఆధ్వర్యంలో 54 వసతి గృహాలు ఉండగా ఇందులో బాలికల వసతి గృహాలు 16 ఉండగా ఇందులో 8,272 మంది బాలికలు ఉన్నారు. 38 బాలుర వసతి గృహాల్లో 9,621 మంది బాలురు ఉన్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాలు 9 ఉండగా ఒకటి బాలికల వసతి గృహం ఉంది. ఇందులో 42 మంది ఉన్నారు. బాలుర వసతి గృహాలు 8 ఉండగా ఇందులో 540 మంది విద్యార్థులు ఉన్నారు. దళిత సంక్షేమ శాఖ పరిధిలో 20 వసతి గృహాలు ఉండగా ఇందులో 3 బాలికల వసతి గృహాలు ఉండగా 510 మంది బాలికలు ఉన్నారు. 17 బాలుర వసతి గృహాలు ఉండగా 970 మంది విద్యార్థులు ఉన్నారు. మరో నెల రోజులు పట్టే అవకాశం.. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఐటీడీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వసతి గృహాల విద్యార్థులకు దుస్తుల పంపిణీకి మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రతి విద్యార్థికి రెండు జతల దుస్తులను గిరిజన సంక్షేమ శాఖ కమిషనరేట్ నుంచి రెడీమేడ్ అందించనుందని, మిగితా రెండు జతల దుస్తువులను జిల్లాలోని 30 మంది దర్జీలకు కుట్టు కోసం అందించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. జత కుట్టు కూలీకి రూ. 45 చొప్పున అందించనున్నారు. కొంత మంది హెచ్‌డబ్ల్యూవోలు తీసుకెళ్లారు.. ఎస్సీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులందరికీ దుస్తులను అందజేశాం. బీసీ విద్యార్థులకు సంబంధించిన దుస్తులు కుట్టు పూర్తి అయి ఇటీవలనే తమ శాఖకు చేరుకున్నాయి. సగం మంది బీసీ వసతి గృహాల హెచ్‌డబ్ల్యూవోలు వాటిని తీసుకెళ్లారు. మరికొంత మంది తీసుకెళ్లాల్సి ఉంది. వాటిని సైతం విద్యార్థులకు అందేలా చూస్తాం. – ఆశన్న, బీసీ, ఎస్సీ, అభివృద్ధి శాఖల అధికారి, ఆదిలాబాద్ కుట్టు కోసం అందించాం రెండు జతల దుస్తులను కమిషనరేట్ నుంచి రేడిమేడ్ అందించనున్నారు. మిగితా రెండు జతలకు సంబంధించిన క్లాత్ 15 రోజుల కిందటనే సరఫరా అయింది. దుస్తువులు కుట్టుడు అయిన వెంటనే ఆయా వసతి గృహాలకు పంపిణీ చేస్తాం. మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంది. – చందన, డీడీ గిరిజన సంక్షేమ శాఖ, ఉట్నూర్, ఆదిలాబాద్