సాక్షి, తెనాలి : కార్పొరేట్ స్కూళ్ల కంటే ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కొనియాడారు. తెనాలి నియోజకవర్గం సంగం జాగర్లమూడిలోని రైతు భరోసా కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ పాఠశాలను రాయుడు పరిశీలించారు. విద్యార్థులు కూడా తమ భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఉన్నారని తెలిపారు.
‘ఏపీలో స్కూళ్లలో ఉన్న సదుపాయాలు దేశంలో ఎక్కడా లేవు. మధ్యాహ్న భోజన పథకంలో ఇచ్చే ఆహారం రుచికరంగా ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. వైద్య ఆరోగ్య రంగంలో ఏ రాష్ట్రం మన రాష్ట్రంతో సరితూగలేదు.
రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులు ఆనందంగా ఉన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు సంక్షేమ పథకాలతో ప్రజలంతా ఆనందంగా ఉన్నారు’ అని రాయుడు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment