- ఆప్కోకు రూ.10.16 కోట్లు
- టైలర్లకు రూ.2.54 కోట్లు
- పేరుకుపోతున్న యూనిఫామ్ బకాయిలు
- సతమతమవుతున్న హెచ్‌ఎంలు
కుట్టుకూలీ మాటేమిటి సారూ!
Published Sun, Dec 25 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM
విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాల విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొంత ఆలస్యంగానైనా విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేసి సర్వశిక్షాభియా¯ŒS ఊపిరి పీల్చుకుంది. గతంలో సర్వశిక్షాభియా¯ŒS కుట్టించి ఇవ్వగా, ఈ ఏడాది క్లాత్‌ను పాఠశాలలకు సరఫరా చేశారు. ఈ క్లాత్‌ను హెచ్‌ఎంలు టైలర్లకు ఇచ్చారు. ఇప్పటికే చాలా పాఠశాలల్లో యూనిఫామ్స్‌ను టైలర్లు కుట్టి ఇవ్వగా.. విద్యార్థులకు అందజేశారు. అయితే నేటికీ పాఠశాల అక్కౌంట్లకు కుట్టుకూలీ నగదు జమకాలేదు. టైలర్లు తమకు కుట్టుకూలీ ఇవ్వాలంటూ హెచ్‌ఎంలపై ఒత్తిడి తెస్తున్నారు.
– రాయవరం
3.17 లక్షల మందికి యూనిఫాం
జిల్లాలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న మూడు లక్షల 17 వేల 714 మంది విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేశారు. ఒక్కొక్క విద్యార్థికి యూనిఫాం నిమిత్తం ప్రభుత్వం రూ.200 వెచ్చిస్తోంది. యూనిఫారం సరఫరా చేసే ఆప్కో కంపెనీకి రూ.160, కుట్టుకూలీకి రూ.40 చెల్లిస్తుంది. ఈ విధంగా జిల్లాలో ఉన్న మూడు లక్షల 17 వేల 714 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్స్‌కు రూ.10 కోట్ల 16 లక్షల 68 వేల 480లు, కుట్టుకూలీ నిమిత్తం రూ.రెండు కోట్ల 54 లక్షల 17 వేల 120లను చెల్లించాల్సి ఉంది. ఆప్కోకు చెల్లించాల్సిన సొమ్ము మాటెలా ఉన్నా.. కుట్టుకూలీకి చెల్లించాల్సిన సొమ్ము పాఠశాల అకౌంట్లకు విడుదల కాకపోవడంతో హెచ్‌ఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుట్టుకూలీ సొమ్ము కోసం టైలర్లు, డ్వాక్రా మహిళలు పాఠశాలలకు తిరుగుతున్నట్లు చెబుతున్నారు.
జతకు రూ.40 చెల్లింపు
యూనిఫామ్స్‌ను గతంలో సర్వశిక్షాభియా¯ŒS కుట్టించి ఇవ్వగా, ఈ ఏడాది క్లాత్‌ను పాఠశాలలకు సరఫరా చేశారు. ఈ క్లాత్‌ను హెచ్‌ఎంలు డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. కొన్ని చోట్ల డ్వాక్రా సంఘాల్లోని టైలర్లు యూనిఫామ్స్‌ను కుట్టారు. దారాలు, బటన్లు, తదితర సామగ్రి కొనుగోలు నిమిత్తం అడ్వాన్సుగానైనా కొంత సొమ్ము ఇవ్వాలని టైలర్లు హెచ్‌ఎంలను కోరారు. నిధులు విడుదల కాలేదని తెలపడంతో టైలర్లు ముందస్తు పెట్టుబడి పెట్టి యూనిఫామ్స్ కుట్టి పాఠశాలలకు అందజేశారు. జతకు రూ.40 వంతున రెండు జతలకు రూ.80లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు ఎస్‌ఎస్‌ఏ అధికారులు కుట్టుకూలి నగదును పాఠశాల అక్కౌంట్లకు జమ చేయలేదు.
Advertisement
Advertisement