కడప ఎడ్యుకేషన్:
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తాం.. నాణ్యతతోపాటు గుణాత్మకమైన విద్య అందిస్తాం.. విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తామని ఊకపుదంపుడు ఉపన్యాసాలు చేస్తున్న పాలకులు, అధికారులు పాఠశాలలు తెరుచుకుని మూడునర్న నెలలవుతున్నా ఇప్పటికీ జిల్లావ్యాప్తంగా కేవలం 18 మండలాలకు మాత్రమే యూనిపాంను సరఫరా చేశారు. ఇక పాఠ్య పుస్తకాల విషయానికి వస్తే అధార్‌కార్డులేని విద్యార్థులతోపాటు ఈ ఏడాది అదనంగా చేరిన విద్యార్థులకు ఇంకా పాఠ్యçపుస్తకాలను అందించలేదు. దీని బట్టి చూస్తే విద్యావ్యవస్థ ఎంతమాత్రం çపటిష్టంగా ఉందో అర్థమవుతోంది.
ఇటీవల మైదుకూరులో జరిగిన న్యాయసదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లుతూ మైదుకూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను జిల్లా జడ్జి గోకవరపు శ్రీనివాస్ సందర్శించి పిల్లలను పలుకరించారు. మౌలిక వసతులపై ఆరా తీశారు. పాఠ్యపుస్తకాల గురించి కూడా విద్యార్థులతో చర్చించారు. ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందలేదని జిల్లా జడ్జీకి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన హెచ్‌ఎంను మందలించారు. పాఠశాలల తెరుచుకుని ఇన్ని రోజులైనా ఇంకా ఎందుకు పిల్లలకు పాఠ్యపుస్తకాలు అందలేదని ప్రశ్నించారు. డీఈఓ, ఎంఈఓలు ఏం చేస్తున్నారని నిలదీశారు. మళ్లీ త్వరలో పాఠశాల వస్తానని అప్పటికి కూడా సమస్యలుంటే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించి వెళ్లిపోయారు.
పాఠశాలల తెరుచుకున్న మూడున్నరð నెలలు దాటినా..
పాఠశాలలు తెరుచుకుని మూడున్నర నెలలు దాటినా నేటికీ కేవలం 18 మండలాల్లో పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే స్కూల్ యూనిఫాంలను అందించారు. రెండు మండలాలకు రెండు, మూడు రోజుల్లో పంపిణీ చేయనున్నారు. మిగతా 31 మండలాలకు ఈనెల చివరి లోపు అందిస్తామని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి రవిశంకర్ తెలిపారు.
మూడు కేంద్రాలలో యూనిఫాం తయారీ
స్కూల్ యూనిఫాంలçను కడపలోని మోస్మా ఆధ్వర్యంలో, అలాగే పోట్లదుర్తిలోని కుట్టుకేంద్రంతోపాటు ఖాజీపేటలోని నందిని ప్రాబ్రిక్స్‌లో పిల్లల యూనిఫాంలను కుడుతున్నట్లు అధికారులు తెలిపారు.
పాఠ్యపుస్తకాలకు సంబంధించి..
యూడైస్ ప్రకారం రెగ్యులర్‌గా వచ్చే అందరి పిల్లలకు పుస్తకాలను అందజేశారు. ఈ ఏడాది అదనంగా చేరిన పిల్లలకు , ఆధార్‌కార్డులు లేనివారికి మాత్రం పుస్తకాలను అందించలేదు. వీరికి కూడా అడిషినల్ కోటా కింద డీఈఓతో అనుమతి తీసుకుని అందచేస్తున్నట్లు పుస్తకాల డిపోమేనేజర్ పెంచలమ్మ తెలిపారు.
యూనిఫాం అందక అవస్థలు
Published Tue, Oct 3 2017 11:26 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement