భీమవరం : సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు నాసిరకం దుస్తులు అందజేశారు. నాణ్యతలేని వస్త్రంతోపాటు దుస్తులు కుట్టటంలోను లోపాలు బయటపడ్డాయి. ఏడాదికి నాలుగు జతలయూనిఫాం హాస్టల్ విద్యార్థులకు అందజేయవ వలసి ఉండగా ఇప్పటికి రెండు జతలు అందజేశారు. యూనిఫాంకు కావలసని వస్త్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆప్కో ద్వారా కొనుగోలు చేసి ఆయా జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయాలకు అందజేసింది. ఏలూరులో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రెస్ మేకింగ్ సెంటర్ (డీఎంసీ)కు ఈ వస్త్రాన్ని ఇచ్చి కుట్టిస్తున్నారు.
కుట్టుకూలి జతకు రూ.40 మాత్రమే వెచ్చిస్తున్నారు. జిల్లాలో ఉన్న 132 వసతి గృహాల్లో సుమారు 10 వేల మంది విద్యార్థినీ, విద్యార్థులుండగా వీరిలో 7వేల 885 మందికి ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున మొదటి విడతగా దుస్తులు అందజేశారు. ఇటీవల హాస్టల్స్‌లో చేరిన విద్యార్థులకు దుస్తులు అందజేయాల్సిఉంది. హాస్టల్ విద్యార్థులకు అందజేసిన దుస్తుల్లో నాణ్యత లోపించింది. విద్యార్థులకు అందజేసిన దుస్తుల వస్త్రం మరీ పల్చగా ఉండడంతో ధరించేందుకే ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వస్త్రం ఎంపికలో నాణ్య తా ప్రమాణాలు పాటించకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఈ దుస్తులు కుట్టటంలోను నాణ్యత కనిపించటంలేదు. అప్పుడే కుట్టులు ఊడిపోతున్నాయి. దీంతో హాస్టల్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల కక్కుర్తే కారణం
విద్యార్థుల యూనిఫాం కుట్టేప్పుడు నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించవలసిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు కాసుల కోసం కక్కుర్తిపడటమే దీనికి కార ణం. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయల అవినీతి జరిగింది. దీనిపై తక్షణమే విచారణ చేయించాలి. -పంపన రవికుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి
నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటాం
విద్యార్థులకు అందజేసిన యూనిఫాం కుట్టులో నాణ్యత లోపించినట్టు నా దృష్టికి రాలేదు. ఆరోపణలపై వెంటనే విచారణ చేయిస్తాం. నాణ్యత లోపించినట్టు తేలితే చర్యలు తీసుకుంటాం.
- శోభారాణి, సాంఘిక సంక్షేమశాఖ జేడీ
నాణ్యత లేని యూనిఫాం
Published Sat, Jul 18 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM
Advertisement
Advertisement