social welfare hostels
-
ఏపీ హాస్టళ్లలో సం‘క్షేమం’ లేదు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
-
‘ఈ నీరు పిల్లలు తాగాలా?’.
సాక్షి, దేవరపల్లి(పశ్చిమగోదావరి) : ‘ఇది మంచినీరా..? ఇవి పిల్లలు తాగాలా?’ అంటూ గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు హాస్టల్ అధికారులపై మండిపడ్డారు. దేవరపల్లి మండలం గౌరీపట్నం సాంఘిక సంక్షేమశాఖ బాలుర ప్రత్యేక వసతి గృహాన్ని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 గంటల వరకు వసతి గృహాన్ని పరిశీలించి నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అపరిశుభ్రంగా ఉన్న గదులు, పురుగులు, మట్టి, నాచుతో నిండి మూతలేని మంచినీటి ట్యాంకును పరిశీలించిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగులు పట్టిన మంచినీటిని విద్యార్థులకు ఎందుకు సరఫరా చేస్తున్నారని సిబ్బందిని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు నిలదీశారు. చుట్టూ క్వారీలు ఉండడం వల్ల దుమ్ము నీటి తొట్టెలో పడుతుందని, తొట్టెకు మూత లేకపోవడం వల్ల కలుషితమవుతుందని విద్యార్థులు ఎమ్మెల్యేకు వివరించారు. పురుగులు, అన్నం మెతుకులు గల మంచినీటిని సరఫరా చేస్తున్నారని, ఈ నీటితోనే వంటలు చేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. అడిగితే సిబ్బంది బూతులు తిడుతున్నారని విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. వసతిగృహంలో పనిచేస్తున్న వెంకటేశ్వరరావు అనే వ్యక్తి దుర్భాషలాడుతూ చిత్రహింసలు పెడుతున్నట్టు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ దీపాలు సరిగా వెలగడం లేదని, మంచినీరులేక ఇబ్బంది పడుతున్నట్టు విద్యార్థులు వివరించారు. ఫ్యాన్లు లేక ఉక్కపోతలో ఉంటున్నట్టు తెలిపారు. డైనింగ్ హాల్ లేక కింద కూర్చుని భోజనం చేస్తున్నట్టు విద్యార్థులు ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు వివరించారు. ప్రతీరోజు పప్పు అన్నం తినలేకపోతున్నామని. 50 మంది విద్యార్థులకు రెండున్నర లీటర్ల పెరుగు వేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్న భోజనంతో పెరుగు వేయడం లేదన్నారు. పరిసరాలు శుభ్రంగాలేక చదవలేకపోతున్నట్టు విద్యార్థులు ఎమ్మెల్యే వెంకట్రావుకు వివరించారు. విద్యుత్ తీగలు వేలాడుతున్నా పట్టించుకోవడం లేదని, రాత్రి సమయంలో కరెంట్ సరిగా ఉండడంలేదని విద్యార్థులు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్థులకు తక్షణం మినరల్ వాటర్ సరఫరా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మినరల్ వాటర్ సరఫరా చేయకుండా పురుగులు పట్టిని మంచినీటిని సరఫరా చేస్తున్నారని సంక్షమాధికారి సత్యనారాయణను ఫోన్లో ప్రశ్నించారు. ఇంటి వద్ద మీ పిల్లలకు ఇలాంటి మంచినీరు ఇస్తారా? అని ఆయన నిలదీశారు. విద్యార్థుల సమస్యలను జిల్లా కలెక్టర్, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళతానని ఆయన తెలిపారు. వసతిగృహాల సంక్షేమాధికారులు స్థానికంగా ఉండాలన్నారు.. వసతిగృహాల సంక్షేమాధికారులు స్థానికంగా ఉండకపోవడం వల్ల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు. గౌరీపట్నం వసతిగృహం నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బడుగు, బలహీనవర్గాల పిల్లలు చదువుకుంటున్న వసతిగృహాలు ఈ విధంగా ఉండడం దారుణమని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని అన్ని వసతిగృహాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, విద్యార్థులపై సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వసతిగృహాల్లో మినరల్ వాటర్ వినియోగించాలని ఆయన అన్నారు. గౌరీపట్నం వసతి గృహం సంక్షేమాధికారి ఇన్చార్జ్గా వ్యవహరించడం వల్ల అందుబాటులో లేరు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు గుత్తికొండ అచ్యుతరావు, పార్టీ నాయకులు కొటారు వెంకటసుబ్బారావు. ఆండ్రు సత్తిరాజు, కుండా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
రూ.100 ఇస్తామన్నా.. రూ.30 చాలట!
హాస్టల్ విద్యార్థుల దుస్తులు కుట్టేందుకు గతంలో సర్కార్ జతకు రూ.40 ధరను నిర్ణయించగా ఇప్పుడు రూ.100 పెంచింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రేట్లు పెంచారు. గిట్టుబాటు కావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కుట్టుకూలి ధర పెంచితే... వద్దు.. వద్దు... పాత ధర కంటే రూ.10 తక్కువగానే కుడతామంటూ కాంట్రాక్టర్లు టెండర్‌ను దక్కించుకున్నారు. గత సంవత్సరం రూ. 40కి ఒక జత వస్త్రాలు కుట్టగా ఈసారి రూ. 40 వద్దు... రూ. 30కే జత బట్టలు కుట్టేందుకు టెండర్ వేసి దక్కించుకోవడంతో ప్రభుత్వానికే ఆదా అయినట్లు అయింది. కానీ యూనిఫామ్‌ల కుట్టు నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నల్లగొండ : జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 46 ప్రీమెట్రిక్, హాస్టళ్లు ఉన్నాయి. అందులో మొత్తం 4420 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు 3 జతల యూనిఫాం, ఒక జత నైట్ డ్రెస్‌ను ప్రభుత్వం ఇస్తుంది. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ఇది అమలు చేస్తూ వస్తున్నారు. గత సంవత్సరం కూడా నాలుగు జతల బట్టలను హాస్టల్ విద్యార్థులకు ఇచ్చింది. పెంచిన కుట్టుకూలి ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు బట్టలను కుట్టే కూలి ధరలు పెంచింది. గత సంవత్సరం ఒక్కో జతకు రూ.40 చొప్పున ధర నిర్ణయించారు. అయితే అదే ధరకు టెండర్లో ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లు మూడు డివిజన్లలో టెండర్లు దక్కించుకొని కుట్టిచ్చారు. రూ. 40కే కొన్ని సంవత్సరాలుగా కుట్టిస్తున్నారు. ఈ సంవత్సరం కుట్టు కూలి సరిపోవడం లేదని, ధరలు పెంచాలని కార్మికులంతా ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. దారం, గుండీలు, జిప్పుల ధరలు పెరిగాయని, వాటికి అనుగుణంగా ధరలు పెంచాలంటూ కోరుతూ వచ్చారు. దీంతో అధికారులు కూడా ఆలోచించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో రూ.40 ఉన్న కుట్టు కూలి ధరను ఏకంగా రూ. 100కు పెంచింది. ఈ సంవత్సరం బట్టలు కుట్టేందుకు టెండర్ ఈ సంవత్సరం సాంఘిక సంక్షేమ శాఖలో హాస్టల్ విద్యార్థులకు బట్టల కుట్టడం కోసం టెండర్ల ప్రక్రియ కొనసాగించారు. చాలా మంది టెండర్లలో పాల్గొన్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కోట్ చేస్తూ వచ్చారు. కొందరు రూ.75కు కుడతామంటూ టెండర్లో కోట్ చేయగా, మరికొందరు రూ.65, రూ. 60 కోట్ చేస్తూ వచ్చారు. మదర్ ఎడ్యుకేషన్ రూరల్ సొసైటీ మాత్రం అతి తక్కువకు కోట్ చేసింది. డివిజన్ల వారీగా టెండర్ల ప్రక్రియ కొనసాగింది. నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ డివిజన్లలో ఈ సొసైటీనే అతి తక్కువ ధరకు టెండర్లో కోట్‌చేసింది. దేవరకొండ, మిర్యాలగూడ డివిజన్లలో రూ. 35కే ఒక జత బట్టలు కుట్టేందుకు టెండర్ వేయగా, నల్లగొండ డివిజన్లో మాత్రం రూ. 30కే జత బట్టలు కుడతామంటూ కోట్ చేసింది. దీంతో ఆ సొసైటీనే నల్లగొండ జిల్లాలోని మూడు డివిజన్ల టెండర్‌ను దక్కించుకుంది. గతంతో పోలిస్తే ఒక జతలో మూడు జతలు పూర్తి ప్రభుత్వం ఒక్క జతకు రూ.100 ఇస్తామంటే, రూ.100కు మూడు జతలు కుట్టేందుకు కాంట్రాక్టర్ ముందుకురావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బట్టలు కుట్టుకూలి విషయంలో అధికారులు కూడా జాగ్రత్త వహించి సక్రమంగా కుడుతున్నారా లేదా, అవి సక్రమంగా ఇన్‌టైంలో అందే విధంగా చూడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గుండీలు కుట్టిన మూడు నాళ్లకే ఊడిపోయి ఎన్నో ఇబ్బందులు పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కుట్లు ఊడిపోవడం కూడా జరిగింది. అలా కాకుండా పకడ్బందీగా నాణ్యమైన పద్ధతిలో కుట్టించే విధంగా ఆ కాంట్రాక్టర్‌పై కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు వీరికి ఏమి మిగులుతుంది..? జత కుట్టుకూలి రూ.30కి ఇస్తే కాంట్రాక్టర్లకు ఏమి మిగులుతుందన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వమే వస్త్రం ఇస్తుంది. దీనిని కాంట్రాక్టర్ బయట కటింగ్‌కు ఇస్తారు. ఒక్కో జత కటింగ్ రూ.3 నుంచి రూ.4 తీసుకుంటారు. మిషన్‌పై బల్క్‌గా కట్ చేస్తారు కాబట్టి తక్కువకే పడుతుంది. బయట దర్జీలకు (ఇటీవల ఇంటి దగ్గర ఖాళీగా ఉండే గృహిణిలు కుడుతున్నారు). అంగికి రూ. 7.50, ప్యాంట్‌కు రూ.11 నుంచి రూ.12 ఇస్తున్నారు. ఇక ట్రాన్స్‌పోర్టు, ఇతర ఖర్చులు ఉంటాయి. వీటి ఖర్చులు పోను కాంట్రాక్టర్‌కు ఒక్కో జతకు రూ.4 నుంచి రూ.5 రూపాయలు మిగులుతున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం ఇచ్చే వస్త్రంలో మిగులుబాటు ఉంటుందని, దీంతో అధిక లాభాలు వస్తాయని తెలుస్తోంది. -
సమాన పనికి సమాన వేతనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌లో దినసరి భత్యంపై పనిచేసే వాచ్మెన్, కామాటి, వంట మనుషులకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ ఉద్యోగులతో (క్లాస్ ఫోర్) సమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు కనీస వేతన స్కేల్ ఇవ్వాలని.. దినసరి భత్యంతో పనిచేసే ఉద్యోగుల వ్యాజ్యానికి అనుకూలంగా గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. వారికి కనీస వేతన పేస్కేల్ అమలు చేయాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా దినసరి వేతన ఉద్యోగులకు జీతాలివ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తేల్చి చెప్పింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని, సింగిల్ జడ్జి వద్దే రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయ మూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 29న హైకోర్టు సింగిల్ జడ్జి వద్దకు దినసరి వేతన ఉద్యోగి ఎం.కృష్ణ సహా 20 మంది దాఖలు చేసిన వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి. నాలుగో తరగతి ఉద్యోగుల విధులతో సమానంగా పనిచేసే దినసరి వేతన కార్మికులకు కనీస వేతన స్కేల్ అమలు చేయాలని సుప్రీంకోర్టు 2016లో ఇచ్చిన తీర్పును పిటిషనర్లు సింగిల్ జడ్జి దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్లకు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని సింగిల్ జడ్జి జారీ చేసిన ఆ ఉత్తర్వుల్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. -
ఈ బాధ్యత నాకొద్దు
ఒకప్పుడు రెగ్యులర్ హాస్టల్‌తో పాటు వేరే హాస్టళ్లకు ఇన్చార్జిగా పని చేయడానికి పోటీ పడిన వార్డెన్లు.. ఇప్పుడు ఇన్చార్జి బాధ్యతలు తమకొద్దంటూ వరుసకట్టి అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. పక్క హాస్టళ్లకు ఇన్చార్జి బాధ్యతలను దక్కించుకోవడానికి పావులు కదిపిన వార్డెన్లే.. ప్రస్తుతం ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాలంటూ అధికారులను కోరుతున్నారు. ఇటీవలి సన్నబియ్యం తరలింపు వ్యవహారంతోపాటు, అదనపు బాధ్యతల భారం కారణంగా ఇన్చార్జిగా కొనసాగలేమంటున్నారు. ఇందూరు (నిజామాబాద్ అర్బన్): ఇటీవల సన్నబియ్యం తరలింపు వ్యవహారం బయటపడడంతో ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకోవడానికి కొందరు హాస్టళ్ల వార్డెన్లు ప్రయత్నాలు చేయడం ఆయా సంక్షేమశాఖల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రధానంగా పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లకు ఇన్చార్జిలుగా తాము పని చేయలేమని స్పష్టం చేస్తున్నారు. దీనికి తోడు ఒక్కో వార్డెన్‌కు రెండు నుంచి మూడు వరకు హాస్టళ్ల బాధ్యతలు ఉండటం మూలంగా ఏ హాస్టల్‌కు న్యాయం చేయలేకపోతున్నామని మరికొంత మంది వార్డెన్లు అధికారుల ముందు వాపోతున్నారు. జిల్లాలో అన్ని శాఖల్లో కలిపి మొత్తం 82 హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీ ప్రీ మెట్రిక్ హాస్టళ్లు 32 ఉండగా, 10 పోస్టుమెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. బీసీ ప్రీ మెట్రిక్ హాస్టళ్లు 19 ఉండగా, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు 13 ఉన్నాయి. అదే విధంగా ఎస్టీ ప్రీమెట్రిక్ హాస్టళ్లు 4, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లు 4 ఉన్నాయి. మొత్తం 82 హాస్టళ్లలో బీసీ –11, ఎస్సీ– 14, ఎస్టీ–2 చొప్పున మొత్తం కలిపి 27 హాస్టళ్లకు వార్డెన్లు లేక గత కొన్నేళ్లుగా ఇన్చార్జిలతో కొనసాగిస్తున్నారు. అత్యధికంగా ఎస్సీ, బీసీ హాస్టళ్లే ఇన్చార్జిలతో నడుస్తున్నాయి. అయితే రెగ్యులర్ హాస్టల్‌తో పాటు ఖాళీగా ఉన్న వేరే హాస్టళ్లకు ఇన్చార్జిలుగా పని చేయడానికి పోటీపడి.. ఒక్కొక్కరు రెండు, మూడు హాస్టళ్లకు పని చేశారు. ఇటీవల హాస్టల్ సన్నబియ్యం తరలింపు వ్యవహారం బయటపడడం.. అది కూడా వార్డెన్లు ఇన్చార్జిగా పని చేస్తున్న హాస్టళ్లే కావడం విశేషం. దీంతో మిగతా వార్డెన్లకు గుబులు పట్టుకుంది. ఇన్చార్జులుగా పని చేసి బుక్కయ్యే దానికంటే రెగ్యులర్ హాస్టల్‌కు పని చేయడమే మేలని భావించి ఇన్చార్జి బాధ్యతలను తొలగించుకోవడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. భారం కూడా కారణమే.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి 27 హాస్టళ్లకు వార్డెన్లు లేక చాలాకాలంగా ఇన్చార్జిలతో కొనసాగిస్తున్నారు. ఒక్కొక్కరికి రెండు, నుంచి మూడు హాస్టళ్ల అదనపు బాధ్యతలు ఉండటం మూలంగా కొంతమంది వార్డెన్లు ఏ హాస్టల్‌కు కూడా సరైన న్యాయం చేయలేకపోతున్నారు. ఒకే రోజు రెండు, మూడు హాస్టళ్లకు ఉదయాన్నే వెళ్లి విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించడం సాధ్యం కావడం లేదు. దీంతో హాస్టళ్ల పాలన గాడితప్పుతోంది. ఇటు ప్రభుత్వం కూడా వార్డెన్ ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో కూడా ఉన్న వార్డెన్లపైనే భారం పడుతోంది. అన్ని శాఖల్లో పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లకు రెగ్యులర్ వార్డెన్లు లేక ప్రీ మెట్రిక్ హాస్టళ్ల రెగ్యులర్ వార్డెన్లే ఇన్చార్జిలుగా పని చేస్తున్నారు. హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులు ఎస్సీ 14, బీసీ 11, ఎస్టీ 02, మొత్తం 27 -
హాస్టల్.. డల్
భద్రాచలం: జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు గూడుకట్టుకున్నాయి. స్వయం పాలిత వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో ఉన్న 10 ఎస్ఎం హాస్టళ్లలో ఒక్క కొత్తగూడెంలో మినహా మిగతా చోట్ల పక్కా భవనాలు లేవు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10 స్వయం పాలిత వసతి గృహాలు (5 బాలురు, 5 బాలికలు) ఉండగా ఇందులో 750 మంది విద్యార్థులు ఉంటున్నారు. ప్రీ మెట్రిక్ వసతి గృహాలు 23 ఉండగా, ఇందులో 1615 మంది ఉంటున్నారు. వసతి గృహాల్లో చాలా చోట్ల సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం బాలికల ‘ఏ’ హాస్టల్లోనే కళాశాలకు చెందిన ఎస్ఎం హాస్టల్‌ను నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయి విద్యార్థినులకే సరిపడా వసతులు లేక తీవ్ర ఇబ్బంది పడుతుంటే, కళాశాల విద్యార్థులను కూడా తీసుకొచ్చి ఇందులోనే పెట్టారు. దీంతో పరిస్థితి అంతా గందరగోళంగా మారింది. కింద ఆరు గదులు అందుబాటులో ఉండగా, నాలుగు గదులను విద్యార్థినుల వసతికి కేటాయించారు. ఒక గదిలో వంట చేస్తుండగా, మరో గదిని ఆ శాఖ అధికారులు స్టోర్ రూమ్‌గా ఉపయోగిస్తున్నారు. బాలికల హాస్టల్లో ఏఎస్డబ్ల్యూఓ కార్యాలయ స్టోర్‌రూమ్ ఏంటని విద్యార్థిసంఘాల వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో హెచ్‌డబ్ల్యూఓ ఉండాల్సిన గదిని కూడా విద్యార్థినుల కోసం కేటాయించారు. ఎస్ఎం హాస్టళ్లతోపాటు, జిల్లాలోని ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో పలుచోట్ల పరిశుభ్రమైన తాగునీరు అందటం లేదు. భద్రాచలం ఎస్ఎంహెచ్లో గోదావరి నీటిని నేరుగా అందిస్తున్న విషయాన్ని స్వయంగా ఆ శాఖ జిల్లా అభివృద్ధి అధికారి మహేశ్వర్ గుర్తించారు. శుభ్రమైన తాగునీరు అందకనే వ్యాధులు వస్తున్నందున వసతి గృహాల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వసతిలేని చోట బంకర్ బెడ్స్..! బాలికల వసతి గృహాలకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రస్తుతం బంకర్ బెడ్స్ మంజూరు చేశారు. భద్రాచలంతో పాటు మరికొన్ని వసతి గృహాలకు సరఫరా చేశారు. కానీ శాశ్వత భవన సదుపాయం లేక అరొకర వసతుల మధ్య ఉంటున్న ఎస్ఎం హాస్టళ్లకు బంకర్ బెడ్స్ మంజూరు చేసినా, ఉపయోగించే అవకాశం లేదు. భద్రాచలం ఎస్ఎం హాస్టల్‌కు వీటిని సరఫరా చేసినా, వసతి లేక ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రీ మెట్రిక్ హాస్టళ్లకు మరమ్మతులు.. వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రీ మెట్రిక్ హాస్టళ్ల పరిధిలోనే ఎస్ఎం హాస్టళ్లను కూడా నిర్వహిస్తున్నందున, ఇక్కడ మౌలిక వసతులు పెంపొందిస్తే, ఇరువురికి బాగుంటుందని భావించి ఇందుకనుగుణంగా చర్యలు చేపట్టారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా జిల్లాలో గల ఏడు వసతి గృహాలకు మరమ్మతుల కోసం రూ.35.50 లక్షలు మంజూరు చేశారు. వీటితో భద్రాచలం(ఏ,బీ), బూర్గంపాడు, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, కొత్తగూడెం హాస్టళ్లకు ప్రస్తుతం పనులు చేస్తున్నారు. విద్యార్థుల అభివృద్ధే లక్ష్యమనే కలెక్టర్ సూచనలతో సాంఘిక సంక్షేమ అభివృద్ధి జిల్లా అధి కారి మహేశ్వర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ఆ శాఖ అధి కారులు, వసతి గృహ ఇన్చార్జీలను అప్రమత్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది పదో తరగతిలో మెరుగైన ఫలితాల సాధించే దిశగా ఏర్పాట్లు చేశారు. పదో తరగతిలో 20 మందికి పైగా విద్యార్థులు ఉన్న చోట ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతుల నిర్వహణ కోసం సబ్జెక్టు నిపుణులను నియమించారు. పక్కా భవనాలు లేని ఎస్ఎం హాస్టళ్లు.. స్థాయి విద్యార్థులకు స్వయం పాలిత వసతి గృహాలను ఏర్పాటు చేసినప్పటికీ, వీటికి పక్కా భవనాలు లేకపోవటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లాలో æభద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం, పాల్వంచలో రెండు చొప్పున(బాలురు, బాలికలకు వేర్వేరుగా), అశ్వారావుపేట, ఇల్లెందులో బాలురకు ఎస్ఎం హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పది ఎస్ఎం హాస్టళ్లలో కొత్తగూడెంలో ఉన్న రెండు హాస్టళ్లకు మాత్రమే సొంతభవనాలు ఉన్నాయి. పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లోనే కళాశాల స్థాయి విద్యార్థులు కూడా ఉంటున్నారు. సమస్యలు పరిష్కరిస్తాం వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించాం. కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు సూచనలతో క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యార్థులకు మౌలిక వసతులు పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎస్ఎం హాస్టళ్లకు భవనాలు లేని మాట వాస్తవమే. భద్రాచలంలో భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. స్థలం సమస్య కారణంగా పనులు ప్రారంభించలేదు. ఎస్ఎం హాస్టల్లో తప్పనిసరిగా మినలర్ వాటర్‌నే అందించాలని ఆదేశించాం. – మహేశ్వర్, సాంఘిక సంక్షేమశాఖ జిల్లా అభివృద్ధి అధికారి -
‘సాక్షి’ వరుస కథనాలతో స్పందన
హాస్టల్ సమస్యలపై కదలిక యుద్ధ ప్రాతిపదికన భవనానికి మరమ్మతులు వైఎస్సార్సీపీ నేతల సందర్శన, సాక్షి కథనాలతో పరిస్థితుల్లో మార్పు 10న వైఎస్సార్సీపీ తలపెట్టిన ముట్టడి తాత్కాలిక వాయిదా గుంటూరు ఎడ్యుకేషన్ : సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. గుంటూరు జిల్లా కేంద్రంలో శిథిల భవనంలో కొనసాగుతున్న ఎస్సీ బాలుర హాస్టల్‌కు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించారు. గత నెల 28వ తేదీన గుంటూరు లాడ్జి సెంటర్లోని మహిమా గార్డెన్స్ ప్రాంగణంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ కాలేజ్ బాయ్స్ హాస్టల్‌ను సందర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అక్కడి విద్యార్థులు అనుభవిస్తున్న కష్టాలను వెలుగులోకి తెచ్చారు. దీంతోపాటు హాస్టల్ దుస్థితిపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలతో జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. భవనానికి మరమ్మతులు.. హాస్టల్లో నెలకొన్న సమస్యలు ఈనెల 10వ తేదీ లోపు పరిష్కరించకుంటే జిల్లా సంక్షేమ భవన్‌ను ముట్టడిస్తామని వైఎస్సార్సీపీ నేతలు విధించిన అల్టిమేటంతో అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. జేసీ–2 ముంగా వెంకటేశ్వరరావు హాస్టల్‌ను పరిశీలించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు హాస్టల్ నిద్ర ప్రారంభించారు. జిల్లా అధికారులు హాçస్టళ్లలో రాత్రి బస చేయాలని ఆదేశించారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్‌ను కలిసిన వైఎస్సార్ సీపీ నేతలు హాస్టళ్లలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. ఈ పరిణామాలతో ఉక్కిరి బిక్కిరైన అధికారులు హాస్టళ్లలో సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టారు. ప్రభుత్వంలో వచ్చిన కదలిక, హాస్టల్ మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఈనెల 10వ తేదీన చేపట్టిన సంక్షేమ భవన్ ముట్టడిని పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తాత్కాలికంగా వాయిదా వేశారు. -
కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా
హన్మకొండ అర్బన్ : సంక్షేమ హాస్టళ్లలో ని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలనిడిమాండ్ చేస్తూ బుధవారం ఎస్ఎఫ్ ఐ జిల్లా కమిటీ ఆద్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. జో రువానలో హన్మకొండ బాలసముంద్రంలోని ఏకశిలా పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. విద్యార్థుల మెస్ చార్జీలు రూ.1500, కాస్మోటిక్ చార్జీలు రూ.350 చెల్లించాలని విద్యార్థి నాయకులు కోరారు. పెండింగ్ ఫీజులు విడుదల చేయాలని, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అ««దl్యక్ష, కార్యదర్శులు హన్మకొండ శ్రీధర్, చిలువేరు శ్రీకాంత్, అంజలి, రవళి, ప్రవళిక, దేవేందర్, కిరణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. -
రెసిడెన్షియల్స్‌లోకి హాస్టల్స్ విద్యార్థులు: రావెల
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహల్లోని విద్యార్థులను రెసిడెన్షియల్ పాఠశాలల్లోకి మార్చండని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం లోని ఏపీ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో సోమవారం నిర్వహించిన 70వ స్వాతంత్య్రదినం వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ జెండాను ఎగుర వేసి మాట్లాడారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలల అదనపు భవనాలకు రూ. 500 కోట్లు, నూతన భవన నిర్మాణాలకు రూ. 500 కోట్లు కేటాయించామన్నారు. రూ. 21 కోట్ల నాబార్డు నిధులతో సత్తెనపల్లికి ఏపీ సాంఘీక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫైల్ ప్రాసెస్‌లో ఉందని, ఈ వారంలో క్లియర్ అవుతుందన్నారు.ఈ నిధులతో నిర్మించే భవనం ఫైవ్‌స్టార్ హోటల్ మాదిరిగా ఉంటుందన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా భవనం తీసుకొని ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. అంబేడ్కర్ ఓవర్సీస్ పథకం కింద విదేశాలలో ఉచితంగా విద్యనభ్యసించేందుకు ఈ ఏడాది రాష్ట్రం నుంచి 200 మంది విద్యార్థులను అమెరికా వంటి దేశాలకు పంపామన్నారు. -
సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
విజయవాడ : సంక్షేమ హాస్టళ్లు మూసివేతకు నిరసనగా ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి నాయకులు యత్నించారు. పీసీసీ కార్యాలయం నుంచి ఎన్ఎస్యూఐకు చెందిన విద్యార్థి నేతలు, కార్యకర్తలు ప్రదర్శనగా సీఎం క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో విద్యార్థి నేతలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలో తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
వసతిగృహాల్లో వైద్య శిబిరం
చిట్యాల : మండలంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల, బాలుర వసతి గృహాలు, బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం ఒడితల పీహెచ్సీ డాక్టర్ జడల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ నెల 23న ‘హాస్టల్లో ప్రబలుతున్న జ్వరాలు’ అనే కథనం సాక్షిలో ప్రచురితమైంది. దీనికి స్పందించిన హాస్టల్ మ్యాట్రిన్ ప్రశాంతి చిట్యాల, జూకల్లులోని బాలికల హాస్టళ్లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిం చారు. 99 మంది బాలికలకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 10 మంది జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు డాక్టర్ శ్రీనివాస్, మ్యాట్రి న్ ప్రశాంతి తెలిపారు. అలాగే మండల కేంద్రంలోని ఎస్సీ, బిసీ బాలుర హాస్టళ్లు, వెలు గు గురుకుల కళాశాలలో వైద్యశిబిరం నిర్వహించి 145 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామని డాక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జయ శ్రీ, వార్డెన్లు రాంరెడ్డి, కిషన్‌రావు, ఏపీఎంఓ బుచ్చినర్సయ్య, హెచ్ఈఓ రాజు, హెల్త్ అసిస్టెంట్లు సాంబయ్య, సుభద్ర, ఆరోగ్యమిత్ర వంగ భిక్షపతి పాల్గొన్నారు. -
విద్యార్థులతో చెలగాటం
పాఠశాలలు ప్రారంభమైన తర్వాత మూసివేతలు జిల్లాలో వరుసగా సాంఘిక సంక్షేమ హాస్టళ్ల మూత అక్కడి విద్యార్థులు గురుకుల పాఠశాలలకు తరలింపు ఇదెక్కడి విడ్డూరమంటున్న తల్లిదండ్రులు, విద్యార్థులు 32 హాస్టళ్ల మూసివేత.. తరలింపు మొదలు బీసీ సంక్షేమంలో చదువుతున్న విద్యార్థుల్లోనూ ఆందోళన విద్యార్థులు తక్కువ, ప్రైవేటు భవనాల పేరుతో కుదింపుకు నిర్ణయం మూడు మూతలు..నాలుగు కుదింపులు.. ఆరు కోతలుగా సాగుతోంది సర్కారు పాలన. చెప్పినట్లుగానే పేద, బలహీనవర్గాల విద్యార్థుల వసతిని ఎత్తివేసేందుకే పాలకులు సిద్ధమయ్యారు. జిల్లాలో ఇప్పటికే 32 ఎస్సీ హాస్టళ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులను దగ్గర్లోనే ఉన్న రెసిడెన్సియల్ స్కూళ్లకు తరలిస్తామని చెబుతున్నా.. అదంతా సులభంగా లేదు. విద్యార్థులు దాదాపు పది, పదిహేను కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తీరా స్కూళ్లు ప్రారంభమయ్యాక ఇలా ఇబ్బందిపెట్టడం దారుణమని వాపోతున్నారు. కడప : వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ప్రత్యేక స్కూళ్ల పేరుతో హాస్టళ్ల మూసివేతకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఏళ్ల తరబడి నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో కొన్నింటిని ఎత్తివేస్తూ ఒక్కసారిగా బాబు సర్కార్ తీసుకున్న నిర్ణయం విద్యార్థులతోపాటు తల్లిదండ్రుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. విద్యార్థులకు అన్ని రకాల సంక్షేమాన్ని కల్పిస్తున్నామంటూనే వారిని క్షోభకు గురిచేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో మూసివేత అనే పెద్ద నిర్ణయాన్ని ప్రభుత్వం నింపాదిగా తీసుకోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం హాస్టళ్ల వాతావరణానికి అల వాటుపడిన విద్యార్థులను మరోచోటికి మార్పు చేయడం ద్వారా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. తమ పిల్లలను చూడాలన్నా, వారు ఇళ్లకు రావాల న్నా కిలోమీటర్ల కొద్దీ వెళ్లాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో చిన్నారులకు అవస్థలు తప్పడం లేదు. కనీసం వేసవి సెలవుల్లో కార్యక్రమానికి శ్రీకా రం చుట్టి అప్పట్లోనే గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానించి ఉంటే బాగుండేదంటున్నారు. మూతపడనున్న హాస్టళ్లు జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సుమారు 132 హాస్టళ్లు నడుస్తుండగా, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పది హాస్టళ్లు, బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 60 హాస్టళ్లు కొనసాగుతున్నాయి. అయితే టీడీపీ సర్కార్ హాస్టళ్లను కుదించాలని నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 32 సాంఘిక సంక్షేమశాఖ హాస్టళ్లు మూతపడనున్నాయి. అయితే గిరిజన సంక్షేమశాఖలో 10 హాస్టళ్లు ఉండగా, పులివెందుల బాలికల హాస్టల్, రాజంపేట ఆశ్రమ పాఠశాల మినహా మిగతా వాటిని రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చివేశారు. ప్రస్తుతం సాంఘిక సంక్షేమశాఖ విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎర్రగుంట్ల మండలంలోని చిలంకూరు, లింగాల మండలంలోని వెలిదండ్ల, కడపలోని పలు హాస్టళ్లను ఇప్పటికే ఎత్తివేశారు. ఎత్తివేసే కార్యక్రమం రెండు రోజులుగా యుద్ధప్రాతిపదికన సాగుతోంది. మరో నాలుగైదు రోజుల్లో దాదాపుగా నిర్ణయించిన హాస్టళ్లన్నీ మూసివేతకు సిద్ధమయ్యాయి. విద్యార్థులు తక్కువనే సాకుతో.. ప్రస్తుతం కొనసాగుతున్న సాంఘిక సంక్షేమశాఖ హాస్టళ్లలోని కొన్నింటిలో విద్యార్థులు తక్కువ, సొంత భవనాలు లేవనే సాకుచూపి మూసివేస్తున్నారు. అందుకు సంబంధించిన గతేడాది టీడీపీ సర్కార్ విద్యార్థులు తక్కువగా ఉండి సొంత భవనాలు లేని హాస్టళ్ల వివరాలతోపాటు...ఎక్కడెక్కడ మూత వేసేందుకు ఆస్కారం ఉందో తెలుపాలని ఉన్నతాధికారులు కోరినట్లు తెలిసింది. ఆ మేరకు అధికారులు జిల్లాలో 32 హాస్టళ్లలో 31 హాస్టళ్లకు సొంత భవనాలు లేవని చెప్పారు. ఈ నేపథ్యంలో వాటి మూసివేతకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. దీంతో ప్రభుత్వం ప్రస్తుతం మూసివేతకు శ్రీకారం చుట్టింది. గురుకులాలకు విద్యార్థులు జిల్లాలో ప్రస్తుతం మూసివేస్తున్న హాస్టళ్లలోని విద్యార్థులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. లింగాల మండలంలోని వెలిదండ్లలో హాస్టల్‌ను మూసివేయడంతో అక్కడ చదువుతున్న విద్యార్థుల్లో కొందరిని గండి గురుకులానికి తరలించగా, ఎగువ క్లాసులు (9, 10 తరగతుల) విద్యార్థులను పులివెందులలోని మరో గురుకులానికి తరలించారు. ఒక్క లింగాలలో నే కాదు, అన్నిచోట్ల కూడా ఇదే పంథానే అనుసరిస్తున్నారు. హాస్టళ్లను మూసివేయడం, అక్కడి వారిని ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ రెసిడెన్షియల్ పేరుతో గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. కేవలం ప్రభుత్వం హాస్టళ్లను మూసివేసి ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఇలా వ్యవహరిస్తోందని విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. బీసీ సంక్షేమంలో ఆందోళన జిల్లాలో ఒకపక్క ఎస్సీ హాస్టళ్లను ఎత్తివేస్తుండటంతో మరోపక్క బీసీ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల్లో కూడా ఆందోళన ప్రారంభమైంది. ఎప్పుడు మూసివేస్తారో, ఏ క్షణాన వెళ్లాల్సి వస్తుందోనని విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు. బీసీ సంక్షేమశాఖకు సంబంధించి కూడా దాదాపు 27 హాస్టళ్లకు సొంత భవనాలు లేవని, ఇంతకుమునుపే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లిన నేపథ్యంలో మూసివేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారికి లేనట్లేనని బీసీ సంక్షేమశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా బీసీ సంక్షేమంలో కూడా ఆందోళన నెలకొంది. మెరుగైన వసతులు కల్పిస్తాం: డీడీ సరస్వతి జిల్లాలో ప్రస్తుతానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు 32 హాస్టళ్లకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డెరైక్టర్ సరస్వతి తెలిపారు. అందుకు సంబంధించి మూసివేసిన హాస్టళ్లలోని విద్యార్థులకు అత్యుత్తమ విద్యతోపాటు మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. జిల్లాలో హాస్టళ్లకు సంబంధించిన వివరాలు సాంఘిక సంక్షేమశాఖ బాలబాలికల హాస్టళ్ల సంఖ్య 132 అందులో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 10,600 ప్రస్తుతం మూసివేతకు సిద్దమవుతున్న హాస్టళ్లు 32 అందులో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 885 బీసీ సంక్షేమ శాఖ హాస్టళ్లు 60 చదువుతున్న విద్యార్థుల సంఖ్య 5,160 మూసివేతకు ప్రతిపాదనలు వెళ్లినవి (ప్రైవేటు భవనాల్లో ఉండేవి) 27 జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు 10 అందులో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 1,015 నేను వెళ్లను మాది చిట్వేలి మండలంలోని నాగవరం. ఇక్కడే ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాను. నన్ను కడపకు వెళ్లమన్నారని అమ్మా, నాన్నకు చెప్పగా వారు వెళ్లొద్దన్నారని తెలిపారు. నేను ఇక్కడే ఉంటాను, లేదంటే ఇంటికి వెళతాను. - ఉప్పటూరు. కళ్యాణి, 7వ తరగతి, నాగవరం మా పిల్లలు ఇంటి వద్దనే ఉండి చదువుకుంటారు ఉన్నఫలంగా హాస్టల్ మూసేస్తున్నాం, కడపలో ఉన్న హాస్టల్‌కు పంపమంటే ఎలా సాధ్యం. పిల్లలను దూరంగా ఉంచి చదివించలేం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగాలేదు. నాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు ఇంటి దగ్గరే ఉన్నారు. పెద్ద కుమార్తె శైలజ 6 వ తరగతి, రెండవ కుమార్తె మమత 4వ తరగతి అంబేద్కర్ నగర్‌లోని పాఠశాలలో చదువుకుంటూ హాస్టల్-2 లో ఉంటున్నారు. - చదర్ల.రమాదేవి, అంబేడ్కర్ నగర్, రైల్వేకోడూరు -
‘విద్యార్థులను విస్మరిస్తే ప్రభుత్వం పతనమే’
విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రభుత్వానికి పతనం తప్పదని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్.ఎఫ్.ఐ.) రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము హెచ్చరించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల మూసివేతకు నిరసనగా ఎస్.ఎఫ్.ఐ. ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట బుధవారం నిర్వహించిన ధర్నాలో విద్యార్థులతో కలిసి ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో హాస్టళ్లను మూసివేస్తున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తోందని ఆరోపించారు. గురుకులాల ఏర్పాటు పేరుతో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అసత్య ప్రచారం సాగిస్తున్నారని, హాస్టళ్ల విలీనం ద్వారా వేలాదిమంది విద్యార్థులకు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల కడుపులు మాడ్చుతూ.. ఎంపీలు, ఎమ్మెల్యేల వేతనాలను రెట్టింపు చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, రావెల కిషోర్‌బాబు కలిసి విద్యార్థుల పొట్టలు కొడుతున్నారని మండిపడ్డారు. -
జీతమో చంద్రన్న!
► సంక్షేమ హాస్టళ్ల్లల్లో జౌట్‌సోర్సింగ్ సిబ్బందికి ► ఏడాదిగా అందని వేతనాలు ► లబోదిబోమంటున్న వైనం ఉద్యోగం మీద అధారపడి జీవించే కుటుంబాలకు ఒక నెల జీతం ఆలస్యమైతే అల్లాడిపోతారు.. అలాంటి వారు పర్మనెంట్ ఉద్యోగులకు కూడా కాదు.. జౌట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. అలాంటి వాళ్లకి ఏడాదిగా వేతనాలు అందలేంటే వారి పరిస్థితి ఏంటో చెప్పనక్కరలేదు. ఇలాంటి దుస్థితికి టీడీపీ ప్రభుత్వ వైఖరే అద్దం పడుతోంది. నెల్లూరు(సెంట్రల్): జిల్లాలోని 70 పదో తరగతి సాం ఘిక సంక్షేమ వసతిగృహాలు ఉన్నాయి. వాటిలో పదో తరగతి విద్యార్థులకు ట్యూషన్ చెప్పేందుకు సబ్జెక్టులను బట్టి మొత్తం 160 మంది ఔట్సోర్సింగ్ పద్ధతిలో ట్యూటర్లు పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.1500 ఇస్తుంటారు. ఇలా 160 మందికి ఏడాదిగా మొత్తం రూ.48 లక్షల వేతనం అందాల్సి ఉంది. ఇచ్చే కొద్దిపాటి జీతం అయినా సరే వాటినే నమ్ముకుని బతుకుబండి లాడే వీరికి కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం పదవతరగతి పరీక్షలు పూర్తయ్యాయి, వసతిగృహాలు సైతం మూసి వేస్తున్నారు. ఏడాది జీతాలు ఇంకా ఇవ్వకుంటే వచ్చే ఏడాది ఇస్తారన్న నమ్మకం ఏముందన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఆరు నెలల నుంచి: జిల్లాలోని 118 వసతిగృహాల్లో కామాటి, కుక్, వాచ్మెన్లుగా దాదాపుగా 240 మంది పనిచేస్తున్నారు. వీరికి రూ.6 వేలు నెలకు ఇస్తుంటారు. వీరికి ఇప్పటి వరకు రూ.90 లక్షల వరకు జీతాలు అందాల్సి ఉంది. ప్రస్తు తం ఈనెల 23 నుంచి వసతిగృహాలు మూసివేయనున్నారు. కాని ఇప్పటి వరకు వీటి జీతాలు విషయం ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్ని సార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలి తం లేదని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ఆరు నెలల క్రితం జిల్లాకు వచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తక్షణం జీతాలు విడుదల చేస్తామని చెప్పారే కానీ ఇప్ప టి వరకు విడుదలైన దాఖలాలు లేవు. ప్రభుత్వానికి నివేదించాం: ట్యూటర్లు, ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతాల విషయం మొత్తం ఎంత పెండింగ్‌లో ఉందో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. ప్రభుత్వం నుంచి జీతాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల అయిన వెంటనే వారికి ఇచ్చేస్తాం. -మధుసూదన్‌రావు,డీడీ సాంఘికసంక్షేమ శాఖ -
వసతికి మంగళం
► వచ్చే విద్యా సంవత్సరంలో 18 హాస్టళ్ల మూత ► వాటిల్లోని విద్యార్థులను రెసిడెన్షియల్ స్కూళ్లలో విలీనం ► జిల్లా నుంచి నివేదికలు కోరిన ప్రభుత్వం ► ఆఘమేఘాల మీద సిద్ధం చేస్తున్న అధికారులు మూతపడనున్న హాస్టళ్లు ఇవే బీసీ నంబర్-1 అనంతపురం, మరూరు, పామిడి, వజ్రకరూరు, గుంతకల్లు, యాడికి, చిగిచెర్ల, ఎనుములవారిపల్లి, తగరకుంట, బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం, కల్లుమర్రి, బాలుర వసతి గృహం కదిరి, పట్నం, కొండకమర్ల, లేపాక్షి, పరిగి, డి. హీరేహాల్, రాయదుర్గం. అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో 50 మందిలోపు విద్యార్థులున్న సాంఘిక సంక్షేమ హాస్టళ్లను ఇప్పటికే మూసివేశారు. ఈ క్రమంలో జిల్లాలో గతేడాది 26 ఎస్సీ హాస్టళ్లు మూతపడ్డాయి. ఈ ఏడాది మరో 25 హాస్టళ్లు ఈజాబితాలో చేరనున్నాయి. ప్రభుత్వం ఇంతటితో ఆగకుండా బీసీ హాస్టళ్లపైనా దృష్టి సారించింది.50 మందిలోపు విద్యార్థులున్న బీసీ హాస్టళ్లనూ మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 18 బీసీ వసతి గృహాలను గుర్తించారు. ఏళ్ల కింద స్థాపించిన ఈ హాస్టళ్లలో వేలాదిమంది విద్యార్థులు చదువుకున్నారు. అలాంటి హాస్టళ్లు ఇక శాశ్వతంగా కనుమరుగవుతున్నాయి. విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కేవలం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నారనే సాకు చూపి వాటికి మంగళం పాడేందుకు కంకణం కట్టుకుంది. 50 మందిలోపు విద్యార్థులున్న హాస్టళ్లను రద్దుచేసి, అందులో చదువుతున్న విద్యార్థులను రెసిడెన్షియల్ స్కూళ్లలో విలీనం చేసేలా అడుగులేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం జిల్లా అనంతపురం హౌసింగ్‌బోర్డులోని బీసీ నంబర్-1 వసతి గృహంలో 3 నుంచి 10వ తరగతి విద్యార్థులు 34 మంది ఉన్నారు. వచ్చేవిద్యా సంవత్సరం నుంచి ఈ హాస్టల్‌ను మూసివేస్తున్నారు. వీరిని సుమారు50 కిలోమీటర్ల దూరంలో ఉన్నఉరవకొండలోని బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో విలీనం చేయాలని నిర్ణయించారు. ఇలా ఈ ఒక్క హాస్టలే కాదు జిల్లాలో 18బీసీ హాస్టళ్లు కనుమరుగుకానున్నాయి. వీటిన్నింటినీ మూసి వేసేందుకు రంగం సిద్ధమవుతోంది.అధికారులకు నివేదికలు కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారులు నివేదికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో విలీనం మూతపడనున్న హాస్టళ్లలోని విద్యార్థులను బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో విలీనం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయం ఎంతమాత్రం విజయవంతమవుతుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతమున్న హాస్టళ్లకు 50 నుంచి వంద కిలోమీటర్ల దూరం ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థులు, చేర్పించేందుకు తల్లిదండ్రులు ఎంతమాత్రం ఆసక్తి చూపుతారనే ప్రశ్న ఉదయిస్తోంది. డ్రాపౌట్స్ మారే ప్రమాదమూ లేకపోలేదు. హాస్టళ్లలో సహజంగానే చుట్టుపక్కల గ్రామాల పిల్లలే ఎక్కువగా చేరుతుంటారు. మరి అలాంటిది ఒక్కసారిగా అంతదూరం వెళ్తారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు కదిరి రూరల్ మండలంలోని పట్నం బీసీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులను 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపాక్షి రెసిడెన్షియల్ స్కూల్లో విలీనం చేసేందుకు జిల్లా అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఇలా 18 హాస్టళ్లలోని విద్యార్థులను జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. నివేదికలు అడిగారు 50 మందిలోపు విద్యార్థులున్న హాస్టళ్ల వివరాలను అడిగారు. ఆయా హాస్టళ్లలోని విద్యార్థులను విలీనం చేసేందుకు అనుకూలమైన బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ల వివరాలను అడిగారు. ఈ క్రమంలో నివేదిక సిద్ధం చేశాం. ప్రభుత్వానికి నివేదించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. -రమాభార్గవి, బీసీ సంక్షేమశాఖ డీడీ -
ఆ ‘కానుక’ తింటే తంటాయే..
సాక్షి ప్రతినిధి కాకినాడ / పిఠాపురం: చంద్రన్న పండుగ కానుకలు.. ఇప్పుడు వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరోగ్యానికి పరీక్ష పెడుతున్నాయి. వసతి గృహాల్లో విద్యార్థులకు సన్నబియ్యం అన్నం, బలవర్ధకమైన కూరలు, పప్పుదినుసులు వండి వడ్డిస్తున్నామని ప్రభుత్వం ఒకవైపు ప్రకటనలు గుప్పిస్తోంది. కానీ మాటలకు, చేతలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోందనడానికి చంద్రన్న కానుకలే తార్కాణం. గత క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు తూర్పు గోదావరి జిల్లాలో 16.43 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులకు కిలో గోధుమపిండి, అర కిలో చొప్పున బెల్లం, శనగపప్పు, కందిపప్పు, వంటనూనె, 100 గ్రాముల చొప్పున నెయ్యిలతో కూడిన కిట్లు సిద్ధం చేశారు. క్రిస్మస్కు 4.15 లక్షల మందికి సరుకులు అందాయి. మిగతా సరుకులు సంక్రాంతి పండుగ సమయానికి ముందు పంపిణీ చేయాలని అధికారులు భావించారు. సర్వరు పనిచేయకపోవడం, ఇ-పాస్ యంత్రాలు మొరాయించడం, లబ్ధిదారుల వేలిముద్రలు పడకపోవడం తదితర కారణాల వల్ల 1.30 లక్షల మందికి సరుకులు అందలేదు. ఈ లెక్కన 1.30 లక్షల కిలోల గోధుమ పిండి, 65 వేల కిలోల చొప్పున బెల్లం, శనగపప్పు, కందిపప్పు మిగిలిపోయాయి. వంట నూనె, నెయ్యి ప్యాకెట్లు కూడా ఆ మేరకు పంపిణీ కాలేదు. వాటిని చౌకడిపోల డీలర్లు వెనక్కి పంపేశారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం మిగిలిపోయిన కిట్లను ఎలాగైనా వినియోగించాలని అధికారులను ఆదేశించింది. దీంతో కానుకల కిట్లను జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాలకు ఈనెల 1న పంపిణీ చేశారు. తాకడానికే భయం.. జనవరి 7, 8 తేదీల్లో జిల్లాలోని రేషన్ దుకాణాలకు న చంద్రన్న కానుక కిట్లలోని సరుకులు నాసిరకం కావడంతో అప్పటికే పాడైపోయాయి. అందుకే ఉచితంగా ఇచ్చేవే అయినా చాలామంది లబ్ధిదారులు తీసుకోవడానికి వెనుకాడారు. పంపిణీ నాటికే బెల్లం నీరుకారిపోయి ముద్దగా మారింది. పుచ్చిపోయిన కందిపప్పు ఇస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అయినా అధికారులు మాత్రం మిగిలిపోయిన సరుకులు వసతి గృహాలకు పంపిణీ చేయడానికి వెనుకాడలేదు. అలా వచ్చిన బెల్లంతో పిఠాపురంలోని బాలికల వసతిగృహంలో ఇటీవల పరమాన్నం వండించారు. ఇది తిన్న విద్యార్థినుల్లో కొంతమందికి వాంతులు కావడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో చంద్రన్న కానుక సరుకులేవీ వాడకుండా స్టోర్‌రూమ్‌లో మూలన పడేశారు. ఇప్పుడవి దుర్వాసన వెదజల్లుతున్నాయి. వాటిని ఏంచేయాలో తెలియక హాస్టల్ వార్డెన్లు తలపట్టుకుంటున్నారు. -
జీవోలు చిత్తు కాగితాలేనా..!
వసతి గృహ విద్యార్థులకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని మే 5న జీవో నెం 27 విడుదల జిల్లాలో అమలుకాని వైనం నెల్లూరు(సెంట్రల్) : సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన బియ్యంతో భోజనం తయారుచేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. కానీ జిల్లాలోని కొందరు అధికారులు ఆ విషయాన్ని బయటకు పొక్కకుండా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పభుత్వం జీవో నంబరు 27ను మే 5న విడుదల చేసింది. ఇప్పటివరకు జీవో గురించి అధికారులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. జీవోలు చిత్తుకాగితాల కిందే జిల్లా అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు రూ.1 బియ్యం రేషన్ షాపుల నుంచి తెచ్చి పెడుతున్నారు. ఆ బియ్యం తినలేక విద్యార్థులు అల్లాడిపోతున్నారు.తెలంగాణాలో మాత్రం వసతి గృహ విద్యార్థులకు నాణ్యమైన బియ్యంతో భోజనం పెడుతున్నారు. రాష్ట్రంలోని పాలకులకు మాత్రం పేద విద్యార్థులపై కనీస శ్రద్ధలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జీవో ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన బియ్య పంపిణీ చేయాల్సింది పౌరసరఫరా శాఖ అధికారుల బాధ్యత అని పలువురు సంక్షేమ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రెండు శాఖ మధ్య సమన్వయ లోపంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అసలు జీవోలో ఏముంది.... 2014 డిసెంబరు 27న స్టేట్ కౌన్సిల్ ఫర్ డెవలప్మెంటు షెడ్యూల్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్ ట్రైబల్ అధికారులు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం.ఏపీలోని అన్ని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి నాణ్యమైన భోజనం పెట్టేందుకు రూ.22.52 కోట్లు అదనపు నిధులను మంజూరు చేస్తున్నాం. కచ్చితంగా అమలు చేస్తాం... ప్రభుత్వ జీవో ప్రకారం విద్యార్థులను నాణ్యమైన బియ్యం అమలు చేయాలనే నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తాం. పౌరసరఫరాల శాఖ అధికారులతో మాట్లాడి ఈ నెల నుంచే అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. -వెంకటేశ్వర్లు, పీవో ఐటీడీఏ నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తున్నాం.. వసతిగృహాలకు పంపణీ చేయాల్సిన బియ్యంలో గతం కన్నా ఉన్న వాటిలో నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తున్నాం. జీవో ప్రకారం ఉన్న వాటిలోనే సర్దుతాం. అంతే కానీ ప్రత్యేకంగా ఏమి లేదు. -ధర్మారెడ్డి, డీఎస్వో -
బయోమెట్రిక్‌లో ఆటుపోట్లు!
ఎస్సీ సంక్షేమ వసతిగృహాలలో బయోమెట్రిక్ విధానం ప్రారంభం నల్లగొండ : సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ప్రవేశపెట్టిన బ యోమెట్రిక్ విధానంలో హాజరు నమోదుకు అనేక ఆటుపో ట్లు ఎదురవుతున్నాయి. ఈ నెల 1 నుంచే జిల్లాలో ప్రయోగాత్మకంగా 98 హాస్టళ్లలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకు అవసరమయ్యే కంప్యూటర్లు, ఆన్లైన్ నెట్వర్క్ సదుపాయాలను హాస్టళ్లలో ఏర్పాటు చేశా రు. కానీ విద్యార్థుల హాజరు నమోదుకు వచ్చేసరికి మాత్రం అనేక సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయి. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థుల వరకు హాజరు నమోదులోఎలాంటి ఇబ్బందుల్లేవు. కానీ 3,4,5 తరగతుల విద్యార్థుల హాజరు బయోమెట్రిక్‌లో నమోదు కావడం లేదు. దీంతో 98 హాస్టళ్లలో 7,411 మంది విద్యార్థులు ప్రవేశం పొందగా 3,598 మంది విద్యార్థుల హాజరు మాత్రమే బయోమెట్రిక్‌లో నమోదవుతోంది. కొన్ని హాస్టళ్లలో కంప్యూటర్లు పనిచేయకపోవడం, ఇంటర్నెట్ సౌకర్యం నెమ్మదిం చడం వల్ల విద్యార్థుల వేలి ముద్ర లు బయోమెట్రిక్ తీసుకోవడం లేదు. ఒకవేళ హాజరు నమోదైన కొద్దిసేపటి తర్వాత నాట్ కనెక్టింగ్ అని వస్తోంది. దీంతో అనేక హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయి. అసలు సమస్య ఆధారే.. హాస్టళ్లలో ప్రవేశం పొందిన విద్యార్థుల పూర్తి వివరాలు బయోమెట్రిక్‌లో నమోదు కావాలంటే ఆధార్ కార్డులో పేర్కొన్న వివరాలే ప్రామాణికం. సాంఘిక సంక్షేమ శాఖ లాగిన్‌లో ఆధార్ డేటాను విద్యార్థుల వివరాలకు జత చేస్తారు. ఆ తర్వాత హాస్టల్లో బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకునేటప్పుడు విద్యార్థులు వేలి ముద్రలు తీసుకుంటారు. ఆధార్‌కార్డు పొందినప్పుడు ఎంటర్ చేసిన వేలిముద్రలు.. బయోమెట్రిక్ హాజరు వేలిముద్రలు ఒకేవిధంగా ఉండాలి. బయోమెట్రిక్‌లో ఆధార్ నంబరు ఎంటర్ చేసినప్పుడు విద్యార్థుల వివరాలు సరిగానే ఉంటున్నాయి కానీ ఆధార్ వేలి ముద్రలకు, బయోమెట్రిక్ వేలి ముద్రలకు జత కలవడం లేదు. దీంతో అనేక మంది విద్యార్థుల హాజరు బయోమెట్రిక్‌లో నమోదు కావడం లేదు. ఈ సమస్య 3,4,5 తరగతుల విద్యార్థుల విషయంలోనే ఎక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారు. ఆధార్ కార్డులు తీసుకుని ఏళ్లు గడుస్తుంది కాబట్టి నాటికీ.. నేటికీ విద్యార్థుల వేలి ముద్రల్లో తేడా కనిపిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. వార్డెన్లకు బయోమెట్రిక్... హాస్టల్ వార్డెన్లు, కుక్‌లు, కామాటీలు, వాచ్మన్లు, పార్ట్‌టైం వర్కర్స్కు బయోమెట్రిక్ హాజరు వర్తింప చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల్లోపు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోపు హాస్టల్ ఉద్యోగుల హాజరు తీసుకోవాలనే ప్లాన్ చేస్తున్నారు. వచ్చే వారం నుంచి అమలు చేసే అవకాశం ఉంది. -
నాణ్యత లేని యూనిఫాం
భీమవరం : సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు నాసిరకం దుస్తులు అందజేశారు. నాణ్యతలేని వస్త్రంతోపాటు దుస్తులు కుట్టటంలోను లోపాలు బయటపడ్డాయి. ఏడాదికి నాలుగు జతలయూనిఫాం హాస్టల్ విద్యార్థులకు అందజేయవ వలసి ఉండగా ఇప్పటికి రెండు జతలు అందజేశారు. యూనిఫాంకు కావలసని వస్త్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆప్కో ద్వారా కొనుగోలు చేసి ఆయా జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయాలకు అందజేసింది. ఏలూరులో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రెస్ మేకింగ్ సెంటర్ (డీఎంసీ)కు ఈ వస్త్రాన్ని ఇచ్చి కుట్టిస్తున్నారు. కుట్టుకూలి జతకు రూ.40 మాత్రమే వెచ్చిస్తున్నారు. జిల్లాలో ఉన్న 132 వసతి గృహాల్లో సుమారు 10 వేల మంది విద్యార్థినీ, విద్యార్థులుండగా వీరిలో 7వేల 885 మందికి ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున మొదటి విడతగా దుస్తులు అందజేశారు. ఇటీవల హాస్టల్స్‌లో చేరిన విద్యార్థులకు దుస్తులు అందజేయాల్సిఉంది. హాస్టల్ విద్యార్థులకు అందజేసిన దుస్తుల్లో నాణ్యత లోపించింది. విద్యార్థులకు అందజేసిన దుస్తుల వస్త్రం మరీ పల్చగా ఉండడంతో ధరించేందుకే ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వస్త్రం ఎంపికలో నాణ్య తా ప్రమాణాలు పాటించకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఈ దుస్తులు కుట్టటంలోను నాణ్యత కనిపించటంలేదు. అప్పుడే కుట్టులు ఊడిపోతున్నాయి. దీంతో హాస్టల్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల కక్కుర్తే కారణం విద్యార్థుల యూనిఫాం కుట్టేప్పుడు నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించవలసిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు కాసుల కోసం కక్కుర్తిపడటమే దీనికి కార ణం. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయల అవినీతి జరిగింది. దీనిపై తక్షణమే విచారణ చేయించాలి. -పంపన రవికుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటాం విద్యార్థులకు అందజేసిన యూనిఫాం కుట్టులో నాణ్యత లోపించినట్టు నా దృష్టికి రాలేదు. ఆరోపణలపై వెంటనే విచారణ చేయిస్తాం. నాణ్యత లోపించినట్టు తేలితే చర్యలు తీసుకుంటాం. - శోభారాణి, సాంఘిక సంక్షేమశాఖ జేడీ -
బెదిరిస్తే... పారిపోతాం!
కర్నూలు : కర్నూలు జిల్లాలో అధికార యంత్రాంగానికి కార్పొరేట్ సంస్థలకు మధ్య వివాదం మరింత ముదురుతోంది. సాంఘిక సంక్షేమ హాస్టళ్లల్లో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో తలెత్తిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించకుండా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేపట్టాలని కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రశ్నిస్తున్నాయి. అయినప్పటికీ తమపై ఒత్తిడి తెస్తే జిల్లాలో పెట్టుబడులు పెట్టకుండా వెళ్లిపోతామని స్పష్టం చేస్తున్నాయి. మొత్తం మీద సాంఘిక సంక్షేమ హాస్టళ్లల్లో సీఎస్ఆర్ కింద మౌలిక సదుపాయాల కల్పన అంశం కాస్తా... అటు అధికార యంత్రాంగానికి ఇటు కార్పొరేట్ సంస్థల మధ్య కొత్త చిచ్చును రేపుతోంది. వెళ్లిపొమ్మంటారా...! సీఎస్ఆర్ అమలు కింద జిల్లావ్యాప్తంగా 50కిపైగా కంపెనీలను కలెక్టర్ గుర్తించారు. వీటిలో కొన్ని కంపెనీలు ఇప్పటికీ జిల్లాలో కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఈ కంపెనీలు కూడా సీఎస్ఆర్ అమలు చేయమనడంతో ఇప్పుడు కొత్త సమస్యలను సృష్టిస్తోంది. ఇటువంటి కంపెనీలు కొన్ని తమ మీద ఒత్తిడి తెస్తే జిల్లాలో పెట్టుబడులు పెట్టకుండానే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతామని పేర్కొంటున్నారు. ఉదాహరణకు.. కోడుమూరు నియోజకవర్గంలో ఎంపీఎల్ మినరల్ ప్రాసెసింగ్ కంపెనీ యూనిటు ఏర్పాటు కోసం 150 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఎటువంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఇక్కడ మినరల్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని కంపెనీ అంటోంది. అయితే, ఎటువంటి పనులు ప్రారభించకుండానే తాము ఎక్కడి నుంచి నిధులు తెచ్చి సీఎస్ఆర్ కింద సంక్షేమ కార్యకలాపాలు చేపట్టాలని ఈ కంపెనీ అంటున్నట్టు సమాచారం. ఒకవేళ తమ మీద ఒత్తిడి తెస్తే యూనిట్ ఏర్పాటును విరమించుకుని జిల్లా నుంచి వెళ్లిపోతామని స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో ప్రధాన కంపెనీ నుంచి మైనింగ్ లీజు తీసుకున్న చిన్న కంపెనీలపై కూడా ఒత్తిడి తెస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రధాన కంపెనీతో పాటు తమను కూడా సీఎస్ఆర్ అమలు చేయాలంటూ తమ మీద ఎలా ఒత్తిడి తెస్తారని కంపెనీల యజమానులు వాపోతున్నారు. మొత్తం మీద సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కార్పొరేట్ల కొర్రీతో జిల్లాలో సీఎస్ఆర్ అమలు ప్రక్రియ కాస్తా నెమ్మదిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కంపెనీల పట్ల గుర్రుగా ఉన్నారు. లక్షలాది రూపాయల లాభాన్ని ఆర్జించుకుంటూ.. పేద పిల్లలకు సదుపాయాలు కల్పించకపోవడం ఏమిటని కంపెనీల ప్రతినిధులను ఆయన ప్రశ్నిస్తున్నారు. కొర్రీలు వేస్తూ సంక్షేమ కార్యక్రమాల అమలుకు ముందుకు రాకపోవడం ఏమిటని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కొద్దిరోజుల క్రితం జరిగిన సమావేశంలో కంపెనీల ప్రతినిధులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారని సమాచారం. సీఎస్ఆర్ అమలుకు ససేమిరా అంటే.. ఐటీ దాడులు చేయిస్తానని వారిపై మండిపడ్డట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మొత్తం మీద ఈ వ్యవహారం కాస్తా ఇరుపక్షాల మధ్య కొత్త వివాదాలకు కారణమవుతోంది. కంపెనీల చట్టం ఏం చెబుతోంది? వాస్తవానికి సీఎస్ఆర్ను కంపెనీలు కచ్చితంగా అమలు చేయాల్సిందే. ఏదైనా సంస్థ సీఎస్ఆర్ కింద తమకు వచ్చిన లాభాల నుంచి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాల్సిందే. ఇది కంపెనీల చట్టం స్పష్టంగా నిర్దేశిస్తోంది. ఏదైనా సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించి... వచ్చిన నికర లాభాల్లో 2 శాతం మొత్తాన్ని వివిధ సామాజిక సంక్షేమ కార్యక్రమాలను సీఎస్ఆర్ కింద చేపట్టాలి. అయితే, జిల్లాలో ఇప్పటికీ ఎటువంటి కార్యకలాపాలు చేపట్టని కంపెనీలకు కూడా సీఎస్ఆర్ కింద లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాలంటూ లక్ష్యాలు విధిస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. -
చదివేదెలా?
జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సంక్షేమం కరువైంది. అక్కడి విద్యార్థ్ధినీ, విద్యార్థులకు రక్షణ కూడా ప్రశ్నార్థకంగా మారింది. దోమల మధ్య, అశుభ్ర వాతావరణంలో చదువు కొండెక్కుతోంది. మద్దిపాడు మండలంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఎలా ఉన్నాయి... విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవడానికి శనివారం సంతనూతలపాడు శాసనసభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ ‘సాక్షి’ విలేకరిగా మారారు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో మద్దిపాడు హాస్టల్‌కు చేరుకున్న ఆయన తొలుత బాలుర హాస్టల్‌కు వెళ్లారు. ఆయన వెళ్లే సరికి పిల్లలు కొందరు స్నానాలు చేస్తుండగా, మరికొందరు స్కూల్‌కు తయారవుతున్నారు. ఇంకొందరు ఆడుకుంటున్నారు. హాస్టల్ వార్డెన్ మాత్రం ఎక్కడా కనపడలేదు. ఆదిమూలపు సురేష్ : బాత్ రూములు ఎన్ని ఉన్నాయి. విద్యార్థులు : మొత్తం వందమందికి మూడు మరుగుదొడ్లే ఉన్నాయి. మరో ఏడు పనిచేయడం లేదు. కొత్తగా ఏడు బాత్రూములు కట్టినా అవి ఇంకా ప్రారంభించలేదు. ఆదిమూలపు సురేష్ : వందమందికి మూడు టాయిలెట్లేనా? విద్యార్ధులు : అవును సార్ అక్కడి నుంచి పిల్లలు స్నానం చేసే చోటకి వచ్చారు. అక్కడ పిల్లలు సంప్‌లోకి దిగి నీటిని బక్కెట్లతో తోడుకుంటున్నారు. ఆదిమూలపు సురేష్ : ఈ నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి. విద్యార్ధి : గుండ్లకమ్మ నుంచి వస్తున్నాయి. ఉదయం పూట కరెంట్ ఉండటం లేదు. దీంతో మోటార్ పనిచేయకపోవడం వల్ల మిగిలిన పంపులు పనిచేయడం లేదు. అందుకే ఈ నీళ్లు పట్టుకుని స్నానాలు చేస్తున్నాం. ఆదిమూలపు సురేష్ : కరెంట్ లేదా? ఎప్పుడు వస్తుంది విద్యార్ధి : తెలియదు సర్ ఆదిమూలపు సురేష్ : నీ పేరేంటమ్మ? ఎన్నో తరగతి చదువుతున్నావు. మధు : నా పేరు మధు, పదో తరగతి చదువుతున్నాను. ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఆదిమూలపు సురేష్ : ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయో చెబుతావా? మధు : స్నానం చేయడానికి బక్కెట్లుండవు, కరెంట్ ఉండదు, ఆ డ్రైనేజీ వల్ల దోమలు. వీటి వల్ల జ్వరాలు వస్తున్నాయి. ఆదిమూలపు సురేష్ : మీకు డాక్టర్ ఉన్నారా? వస్తున్నారా? మందులు ఇస్తున్నారా? మధు : ఉన్నారు. నెలకోసారి వచ్చి అందరినీ పరీక్షించి మందులు ఇస్తారు. ఆదిమూలపు సురేష్ : మరుగుదొడ్లు సరిపోతున్నాయా? మధు : సరిపోవడం లేదు. మూడు ఉన్నాయి. వంద మందికి మూడు టాయిలెట్లు ఉన్నాయి. ఆదిమూలపు సురేష్ : మరి బాత్రూములున్నాయా? మధు : లేవు, బయటే స్నానం చేస్తాం. వర్షాకాలం కూడా ఇక్కడే స్నానం చేయాల్సి వస్తోంది. ఆదిమూలపు సురేష్ : మీకు యూనిఫామ్స్ వచ్చాయా, ప్రతిరోజూ అటెండెన్స్ తీసుకుంటారా? విద్యార్ధులు : యూనిఫామ్స్ వచ్చాయి. అటెండెన్స్ వేస్తున్నారు. ఆదిమూలపు సురేష్ : ఈ రోజు ఏం పెట్టారు విద్యార్ధులు : రాగి జావ ఆదిమూలపు సురేష్ : నీపేరేంటి? ఏం సమస్యలు ఉన్నాయి? గోవిందు : నాపేరు గోవిందు. గదులకు కిటికీలు లేవు. విద్యార్ధులు : దోమలు పెద్ద సమస్య. కిటికీలకు తలుపులు లేవు. డ్రైనేజి వల్ల దోమలు వస్తున్నాయి. టాప్‌లు లేవు. బాత్రూములు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. నీరు సరిగా రావడం లేదు. ఆదిమూలపు సురేష్ : సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగారు ఒక నెంబర్ ఇచ్చి సమస్యలు మీకు చెప్పమన్నారు. ఆ నెంబర్ తెలుసా? విద్యార్ధులు : తెలియదు. ఆదిమూలపు సరేష్ : తలుపులు కిటికీలు పెట్టిస్తాము. (బట్టలు ఆరేసుకోవడానికి స్థలం లేదు. చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఒకచోట కాంపౌండ్ వాల్ లేదు. దీంతో పాములు, ఇతర జంతువులు లోపలికి వస్తున్నాయి. విద్యార్థులు చెప్పిన సమస్యలు చూడడానికి హాస్ఠల్లోని గదుల్లోకి వెళ్లి తలుపులు లేని కిటికీలను పరిశీలించారు. కరెంట్ వైర్లు కూడా ఊడిపోయి ప్రమాదకరంగా మారాయి. వీటిని కూడా ఎమ్మెల్యేకు చూపించారు. కిటికీలకు మెష్ లేదు. పక్కనే డ్రైనేజీ వల్ల దోమలు విపరీతంగా వస్తున్నాయని చూపించారు. వర్షం పడితే శ్లాబు కురుస్తోంది.) ఆదిమూలపు సురేష్ : నీ పేరేంటి? ఏసు : నా పేరు ఏసు, ఒకటో నెంబర్ రూమ్ పక్కనే డ్రైనేజీ ఉంది, దీనివల్ల దోమలు వస్తున్నాయి. అంటూ ఎమ్మెల్యేని డ్రైనేజీల వద్దకు తీసుకువెళ్లారు. ఆ డైనేజీ నీటిపారుదల సక్రమంగా లేకపోవడం వల్ల అందులో పెద్ద సంఖ్యలో దోమలు పెరుగుతున్నాయి. పక్కనే చెత్త కూడా పెద్ద సంఖ్యలో పడేశారు. ఆదిమూలపు సురేష్ : డ్రైనేజీ పక్కనే పెద్ద ఎత్తున చెత్త వేశారు. పక్కనే హాస్టల్ కిటికీలున్నాయి. వీటికి కనీసం మెష్ కూడా లేదు. కిటికీ తలుపులు లేవు. దీనివల్ల ఈ గదుల్లో ఉన్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కిటీకీలకు మెష్ బిగించి, డ్రైనేజీ బాగు చేయించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ డ్రైనేజీ వల్ల ప్రమాదం పొంచి ఉంది. (అక్కడి నుంచి ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్న బాలికల హాస్టల్‌కు వెళ్లారు. దానికి వెళ్లే రోడ్డు కూడా సరిగా లేదు. పైగా దారికి ఇరువైపులా మలమూత్ర విసర్జనతో ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ భవనంలో నాలుగు గదులుండగా అందులో ఒకటి వార్డెన్ రూముగా, మరొకటి స్టోర్‌రూమ్‌గా ఉపయోగిస్తున్నారు. ఒకచిన్న గదితోపాటు హాల్ మాత్రమే విద్యార్థినుల కోసం ఉంది. ఇందులో 70 మంది ఉంటున్నారు. అక్కడ బాలికల టాయిలెట్‌కు కనీసం తలుపులు లేకపోవడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి వెంటనే డోర్ పెట్టించాలని ఆదేశించారు. గోడకు అతికించిన మెనూను పరిశీలించారు. ఎలా అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. తాగేనీరు కూడా మురికిగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ కూడా వార్డెన్ అందుబాటులో లేరు. ) ప్రజెంటర్ : దాళా రమేష్‌బాబు ఫోటోలు : కె. శ్రీనివాసులు పరిష్కారానికి పోరాడుతా... సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థినీ విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. పధానంగా పారిశుధ్యం, తాగునీటిపై శ్రద్ధ చూపించాలి. యుద్ధప్రాతిపదికన వసతి గృహ భవనాలు ఏర్పాటు చేయాలి. బాలికలకు రక్షణ లేని దుస్థితిలో భవనాలున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ వారు బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టారు. ఇక్కడ అటెండెన్స్ రిజిస్టర్‌కు, ఉన్న సంఖ్యకు సంబంధం లేదు. పిల్లలను రాత్రి ఇంటికి పంపిస్తున్నారు. ఆ సమయంలో ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత. కాంపౌండ్ వాల్స్ పూర్తిగా కట్టాలి. అరకొరగా మరుగుదొడ్లున్నాయి. పదోతరగతి విద్యార్థులకు చదువుకోవడానికి విద్యుత్ కోతల సమయంలో ఇన్వర్టర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎన్నికల సమయంలో హాస్టల్స్‌కు సోలార్ ఫెన్సింగ్, బయోమెట్రిక్ హాజరు, కంప్యూటరైజేషన్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సమస్యలన్నీ అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. విద్యార్ధులకు మంచి సదుపాయాలు కల్పించేవరకూ పోరాడతా. పర్యవేక్షించాల్సిన వార్డెన్లు హాస్టళ్లల్లో లేకపోవడం విచారకరం. ఆదిమూలపు సురేష్ : నీ పేరేంటమ్మ, ఇక్కడ ఏం చేస్తున్నావు. ఎంత మంది ఉంటారు? వంటమనిషి : నా పేరు రాణి, ఇక్కడ 70 మంది ఉంటున్నారు. ఇక్కడ పడుకోడానికి స్థలం లేకపోవడంతో 30 మంది వరకూ ఇంటికి వెళ్లి పడుకుని ఉదయాన్నే వస్తున్నాం. ఆదిమూలపు సురేష్ : పిల్లలను ఇంటికి ఎలా పంపిస్తారు? వంటమనిషి : వారి తల్లితండ్రులు వచ్చి తీసుకువెళ్తారు. లేనిపక్షంలో ఇక్కడే ఉంటారు. (రెండు హాస్టల్స్‌లో వార్డెన్లు అందుబాటులో లేరు. ఎమ్మెల్యేగారు తనిఖీలకు వచ్చారని తెలియగానే ఆగమేఘాలపై ఒంగోలు నుంచి వచ్చారు. ఆయన ఎంపీపీ కార్యాలయంలో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వచ్చి సంజాయిషీ ఇచ్చుకున్నారు.) -
ఆధార్ అనుసంధానం కొలిక్కి
సాక్షి, మంచిర్యాల : సంక్షేమ వసతిగృహాల్లో లోపాలు అరికట్టడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు కొలిక్కివస్తున్నాయి. హాస్టళ్లలో జరిగే అవినీతిని అరికట్టేందుకు, విద్యార్థులకు నాణ్యమైన భోజ నంతోపాటు సదుపాయాల కల్పనకు అవినీతే అడ్డంకిగా మారిందని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో విద్యార్థుల ఆధార్ నంబర్‌ను, హాజరును ఆన్లైన్లో అనుసంధానం చేయాలని, తద్వారా వారికి అందే సదుపాయాలు, హాజరు వంటివాటిని పరిశీలించే అవకాశం ఉంటుందని భావించారు. ఈ నేపథ్యంలో ఆధార్ వివరాల సేకరణ చేపడుతున్నారు. ఆన్లైన్ ఆధారంగా.. జిల్లాలో దళిత సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రీ మెట్రిక్‌లో 76 హాస్టళ్లు ఉండగా పోస్ట్‌మెట్రిక్ 14 వసతి గృహాలు ఉన్నాయి. బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు ప్రీ మెట్రిక్‌లో 50 ఉండగా పోస్ట్ మెట్రిక్‌లో 20 హాస్టళ్లు ఉన్నాయి. మైనార్టీ వెల్ఫేర్ విభాగంలో ప్రీ మెట్రిక్‌లో ఒకటి, పోస్ట్ మెట్రిక్‌లో మరొకటి ఉంది. ఎస్టీ హాస్టళ్లలో మొత్తం విద్యార్థులు 38,214 మంది ఉన్నప్పటికీ ఆధార్ అనుసంధానం గురించి ఇప్పటికీ ఏమీ సమాచారం రాలేదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఎస్సీ హాస్టళ్లలో దాదాపు 28వేల వరకు విద్యార్థులున్నారు. అయితే ఎస్టీ మినహా మిగతా విభాగాల్లోని హాస్టల్లలో నెలకొన్న అవినీతిని తొలగించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం విద్యార్థుల ఆధార్ నంబరును ఆన్లైన్లో అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే దాదాపు 80 శాతం అప్లోడ్ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బయోమెట్రిక్ విధానంలో విద్యార్థుల హాజరును పరిశీలించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విధానం అమలులోకి వస్తే విద్యార్థులు హాజరుకాకపోయినా హాజరు అయినట్లు రిజిస్టర్లో నమోదు చేయడం, విద్యార్థులందరికీ వంటచేసినట్లు రికార్డులు తయారు చేయడం తద్వారా నిధుల దుర్వినియోగం వంటి చర్యలకు చెక్‌పడనుంది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు హాస్టల్ వార్డెన్లచే సరుకుల కొనుగోలు చేయించిన ప్రభుత్వం త్వరలో ఈ విధానాన్ని మార్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఆయా హాస్టళ్లకు కాంట్రాక్టర్ ద్వారా పప్పులు, నూనెల, కారం, ఉప్పు, చింతపండు, ఇతరత్రా వస్తువులు అందజేసే విషయాలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. -
ఇక సం‘క్షేమ’మా..?!
ఖమ్మం హవేలి: రాష్ట్ర విభజనకు ముందు అప్పటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను చట్టబద్ధం చేసినా సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు ఒక్క పైసా విదల్చకపోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఉపప్రణాళిక నిధులు సాంఘిక సంక్షేమశాఖకు వస్తాయనే ఆశలు ప్రతి ఒక్కరిలో చిగురిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉపప్రణాళిక నిధులకు బదులు జనరల్ ఫండ్స్ మాత్రమే వస్తుండడంతో జిల్లా సాంఘిక సంక్షేమశాఖ నిర్దేశిత లక్ష్యాన్ని చేరలేకపోతోంది. సగానికిపైగా సీట్లు ఖాళీయే.. మూడు నుంచి 10 తరగతులు చదివే విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో జిల్లాలో 77 వసతిగృహాలు ఉన్నాయి. ఇందులో 52 బాలుర, 25 బాలికల కు సంబంధించినవి. వీటితోపాటు అనాథ పిల్లల కోసం ఖమ్మంలో బాలికలు, భద్రాచలంలో బాలుర వసతిగృహాలు ఉన్నాయి. సత్తుపల్లిలో ఒక ఇంటిగ్రేటెడ్ వసతిగృహం, ఖమ్మంలో ఒక చైల్డ్ బెగ్గర్ హోమ్ నిర్వహిస్తున్నారు. వీటన్నింటిలో కలిపి జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎనిమిదివేల సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. ఈ విద్యా సంవత్సరం నాటికి 3,847 సీట్లు మాత్రమే భర్తీ చేశారు. ఇంకా 4,153 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ సంక్షేమ వసతి గృహాలన్నీ సొంత భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. వేంసూరు బాలుర, మధిర బాలి కల, ఖమ్మం ‘సి’ బాలుర, భద్రాచలం బాలుర అనంద నిలయం, ఎర్రుపాలెం బాలుర, పెనుబల్లి బాలుర వసతిగృహాలు శిథిలావస్థకు చేరడంతో వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. నిర్మాణం పూర్తి అయ్యే వరకు తాత్కాలికంగా వీటిని అద్దె భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో చేరే విద్యార్థుల సంఖ్య రెండేళ్లుగా తగ్గిపోతోంది. ఉపప్రణాళిక నిధులు వస్తే సౌకర్యాలు మరింతగా మెరుగుపడి విద్యార్థుల చేరిక పెరిగే అవకాశం ఉంది. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా గత ఆర్థిక సంవత్సరం 17,800 మంది విద్యార్థులకు రూ.10,15,91,430 ఉపకార వేతనాలు, రూ.36,23,57,043 ఫీజు రీయింబర్స్మెంట్, రాజీవ్ విద్యాదీవెన ద్వారా 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.76,18,300 ప్రీమెట్రిక్ స్కాలర్షిప్స్, ఎస్సీ న్యాయవాదుల శిక్షణ కోసం రూ.3,50,000, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద రూ.1,03,10,000, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ పథకం ద్వారా రూ.5,00,000, విద్యార్థుల ప్రతిభ పురస్కారాలు రూ.1,95,000, కులాంతర వివాహాలకు రూ.7,20,000 ఖర్చు చేశారు. ఉపప్రణాళిక ద్వారా జిల్లాలో ఎస్సీ కాలనీల్లో విద్యుత్‌చార్జీలు (50 యూనిట్ల లోపు) 22,322 సర్వీసులకు రూ.2,25,57,000 వెచ్చించారు. ఈ ఒక్క విభాగంలో మాత్రమే ఉప ప్రణాళిక నుంచి నిధులు మంజూరు కావడం గమనార్హం. ఎస్టీ సంక్షేమ హాస్టళ్లకు ఎల్‌డబ్ల్యూఈఏ ద్వారా రూ.206కోట్లు జిల్లాలో గిరిజన సంక్షేమ పాఠశాలలు 365, గిరిజన ఆశ్రమ పాఠశాలలు 75, వసతిగృహాలు 45 ఉన్నాయి. ఇందులో విద్యార్థుల ప్రవేశాల లక్ష్యం నాలుగేళ్లుగా నెరవేరుతోంది. ఎస్టీ ఉపప్రణాళిక ద్వారా గత సంవత్సరం రూ.50 కోట్లు మంజూరు కాగా తీవ్రవాద ప్రభావిత ప్రాంతా ల నిధులు (ఎల్‌డబ్ల్యూఈఏ) ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.206 కోట్లు వచ్చాయి. 67 బీసీ సంక్షేమ వసతిగృహాల్లో 30 అద్దె భవనాల్లోనే.. బీసీ సంక్షేమశాఖ కింద జిల్లాలో మొత్తం 67 వసతిగృహాలు ఉన్నాయి. వీటిలో 47 హాస్టళ్లు ప్రీమెట్రిక్, 20 వసతి గృహాలు కళాశాలలకు సంబంధించినవి ఉన్నాయి. వీటిలో 30 వసతిగృహాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె భవనాల్లో కొనసాగేవాటిలో కల్లూరు, వి.వెంకటాపురం, అశ్వాపురం బాలుర, నేలకొండపల్లి బాలికల వసతిగృహాల భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. మిగిలిన 26 హాస్టళ్లకు ఇప్పటివరకు స్థలం కేటాయించ లేదు. వీటిలో మొత్తం 5,020 సీట్లు ఉండగా నాలుగేళ్లుగా పూర్తిస్థాయిలోనే భర్తీ అవుతున్నాయి. గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో జిల్లా సగటు 89.78 శాతం కాగా బీసీ వసతిగృహాల్లో ఉండి చదువుకున్న విద్యార్థుల్లో 705 మందికి 672మంది (95.2శాతం) ఉత్తీర్ణులు అయ్యారు. బీసీ సంక్షేమ శాఖకు నిధులు మంజూరు చేసి అద్దె భవనాల్లో కొనసాగుతున్నవాటికి సొంత భవనాలు నిర్మిస్తే విద్యార్థులకు మరింత మేలు కలిగే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాశిక ద్వారా ఆయా శాఖల సంక్షేమ వసతిగృహాలకు నిధులు మంజూరు చేయడంతో పాటు బీసీ సంక్షేమ వసతిగృహాలకు నిధులు మరింతగా పెంచి వాటికి సొంత భవనాలు నిర్మిస్తే విద్యార్థుల సంక్షేమం ప్రగతిపథంలో దూసుకెళ్లే అవకాశం ఉంది. -
సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను అధిగమిస్తాం
కర్నూలు(అర్బన్): జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలన్నింటిని అధిగమిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎంఎస్ శోభారాణి చెప్పారు. మంగళవారం ఆమె మాట్లాడారు. ఒక్కో వసతి గృహంలో వంద మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నామని, అయితే ఎస్సీ విద్యార్థులు ఎంతమంది వచ్చినా, ఆయా వసతి గృహాల్లోని సంఖ్యను బట్టి వారికి ప్రవేశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రధానంగా సొంత భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఆయా వసతి గృహాల్లో తీసుకుంటున్న చర్యలు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను ఆమె వివరించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంత మంది కొత్త విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు? డీడీ: ప్రతి హాస్టల్లో వంద మంది విద్యార్థులకు ప్రవేశం ఉంటుంది. అయితే ఎస్సీ విద్యార్థులు ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చినా చేర్చుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులకు బెడ్షీట్లు, పుస్తకాలు వగైరా వచ్చాయా? డీడీ: జిల్లాలోని 102 హైస్కూల్ స్థాయి వసతి గృహాల్లోని విద్యార్థుల్లో ఒక్కొక్కరికి ఒక బెడ్‌షీట్, ఒక కార్పెట్ ప్రకారం ప్రభుత్వం సరఫరా చేసింది. వీటన్నింటిని ఇప్పటికే అన్ని వసతి గృహాలకు పంపాం. ఇక నోటు పుస్తకాలు త్వరలోనే రానున్నాయి. విద్యార్థులకు ఎన్ని జతల దుస్తులు ఇస్తున్నారు? డీడీ: ప్రతి విద్యార్థికి నాలుగు జతల దుస్తులను ఇవ్వనున్నాం. ఇందుకు అవసరమైన క్లాత్ వచ్చింది. ముందస్తుగా జూలైలో ఒక్కో విద్యార్థికి రెండు జతల దుస్తులు ఇచ్చేందుకు ప్లాన్ చేశాం. అనేక వసతి గృహాల్లో ఉన్న తాగునీటి కొరతను ఎలా నివారిస్తారు? డీడీ: స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాం. అలాగే 150 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న వసతి గృహాల్లో మినీ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం. శిథిలావస్థలో ఉన్న వసతి గృహాల పరిస్థితి ఏమిటి? డీడీ: సొంత భవనాల్లో కొనసాగుతున్న 38 హాస్టళ్లలో అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు ఇప్పటికే రూ.3.68 కోట్లు మంజూరయ్యాయి. ఆయా వసతి గృహాల్లో ఇప్పటికే పనులు కూడా దాదాపు పూర్తి అయ్యాయి. అనేక వసతి గృహాల్లో బాత్రూములు, టాయ్లెట్ల సౌకర్యం వేధిస్తోంది కదా? డీడీ: బాత్రూములు, టాయ్లెట్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాం. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని 25 వసతి గృహాల్లో రూ.1 కోటితో 130 టాయ్లెట్లు, 131 బాత్రూములు నిర్మిస్తున్నాం. కళాశాల విద్యార్థుల హాస్టళ్ల నిర్మాణాలు ఎంత వరకు వచ్చాయి? డీడీ: కళాశాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థుల కోసం కర్నూలులో రెండు, నంద్యాలలో రెండు వసతి గృహాలను నిర్మిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే నందికొట్కూరులో రెండు, ఎమ్మిగనూరులో రెండు వసతి గృహాలు అదనంగా మంజూరయ్యాయి. ఒక్కో వసతి గృహాన్ని రూ.2.50 కోట్లతో నిర్మించనున్నాం. హాస్టల్ విద్యార్థుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు? డీడీ: అన్ని వసతి గృహాలకు చెందిన హెచ్‌డబ్ల్యుఓలు స్థానికంగా ఉండి విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇటీవలే ఏజేసీ ఆదేశాలు జారీ చేశారు. మెనూ ప్రకారం భోజన వసతులు కల్పించాలి. అలాగే ప్రతి నెలా విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై సమీపంలోని మెడికల్ ఆఫీసర్‌చే పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాం. -
రూ.19 కోట్లతో వసతి గృహాల అభివృద్ధి
బొండపల్లి, న్యూస్‌లైన్: జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాలను 19.50 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆ శాఖ డెరైక్టర్ కె. ఆదిత్యలక్ష్మి తెలిపారు. గురువారం బొండపల్లి గ్రామానికి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ, బొబ్బిలిలోని బాలుర వసతి గృహం, విజయనగరంలోని రెండు బాలికల వసతిగృహాలు, బాలుర వసతి గృహాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. ఏడున్నర కోట్ల రూపాయలతో ఎనిమిది కమ్యూనిటీ హాస్టల్స్‌కు భవనాలు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే గజపతినగరం మండలం లోగిశలో మూడు కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ హాస్టల్ కాంప్లెక్స్ నిర్మించినట్లు చెప్పారు. జిల్లాలోని 29 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో చదువుతున్న 448 మంది పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక మెటీరియల్ పంపిణీ చేశామన్నారు. గతేడాది 89.5 శాతం ఉత్తీర్ణత సాధించామని, ఈ ఏడాది శతశాతం ఉత్తీర్ణతకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూఓ రత్నం పాల్గొన్నారు.