సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత | high tension at cm camp office | Sakshi
Sakshi News home page

సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Published Fri, Jul 29 2016 12:39 PM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

high tension at cm camp office

విజయవాడ : సంక్షేమ హాస్టళ్లు మూసివేతకు నిరసనగా ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి నాయకులు యత్నించారు. పీసీసీ కార్యాలయం నుంచి ఎన్ఎస్యూఐకు చెందిన విద్యార్థి నేతలు, కార్యకర్తలు ప్రదర్శనగా సీఎం క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు.

దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో విద్యార్థి నేతలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలో తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement