ఈనాటి ముఖ్యాంశాలు | Today News Round Up 24th March Raghuram Rajan : RBI can do to soften coronavirus impact on Indian economy | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Tue, Mar 24 2020 7:50 PM | Last Updated on Tue, Mar 24 2020 8:28 PM

Today News Round Up 24th March Raghuram Rajan : RBI can do to soften coronavirus impact on Indian economy - Sakshi

దేశంలో వేగంగా కరోనా వైరస్ మహమ్మారిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నరు రఘు రామ్ రాజన్ స్పందించారు.  ఈ సంక్షోభ సమయంలో ఆర్బీఐ పోషించాల్సిన పాత్రపై కొన్ని సూచనలు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా మణిపూర్ రాష్ట్రంలో కరోనా తొలి కేసు నమోదైంది. దీంతో ఈశాన్య భారతానికి కూడా ఈ ప్రాణాంతక వైరస్ పాకినట్టైంది.  మరోవైపు విశాఖపట్నం జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఇక తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. మంగళవారం చోటు చేసుకున్న వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement