Sakshi Telugu News
-
‘సాక్షి’ కలిపింది ఈ ఇద్దరినీ...
రామచంద్రాపురం(పటాన్చెరు): తన చిన్న నాటి స్నేహితుడిని చూడాలని ఉందంటూ ఓ పోలీస్ అధికారి వెల్లడించిన మనోగతాన్ని గతేడాది ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రచురించింది. ఆ కథనమే వివిధ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయి మిత్రుడి ఆచూకీ తెలిసేలా చేసింది. ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆ ఇద్దరు మిత్రులు ప్రత్యక్షంగా కలుసుకుని చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీగా విధులను నిర్వహిస్తున్న నూకల వేణుగోపాల్‌రెడ్డి ఆగస్టు నెలలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’దిన పత్రికతో 39ఏళ్లుగా తన బాల్యమిత్రుడి కోసం చేస్తున్న అన్వేషణ గురించి వివరించారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదువుకున్న సమయంలో తన బాల్యమిత్రుడైన ఎం.ఆనంద్ గురించి తెలిపారు. అతడిని ఎలాగైనా కలవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు. ఆ కథనం ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైంది. ఆ కథనాన్ని స్నేహితులకు, ఇతర వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. దానిని చూసిన ఆయన స్వగ్రామానికి చెందిన స్నేహితులు సైతం అన్వేషణ మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఎం.ఆనంద్ హైదరాబాద్‌లోనే ఉన్నట్లు గుర్తించి అతడిని చిరునామా తెలుసుకున్నారు. దీంతో వేణుగోపాల్‌రెడ్డి సంక్రాంతి పండుగ రోజున తన బాల్యమిత్రుడు ఆనంద్ ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... ‘సాక్షి’లో వచ్చిన కథనం తన బాల్యమిత్రుడిని కలిసేలా చేసిందని, పత్రికతో పాటు అందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నేళ్ల తర్వాత తన బాల్యమిత్రుడిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.చదవండి: వెళ్ళొస్తా సుజాతా.. సంక్రాంతి సిత్రాలు -
Sakshi Whatsapp Channel: ఫాలో సాక్షి @ వాట్సాప్
వాట్సాప్ వాడుతున్నారు కదా.. ఓ అడుగు ముందుకేయండి. ఇప్పుడు వాట్సాప్ ఛానల్స్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అంటే మీకు నచ్చిన కంటెంట్‌ను, మీకు అనుకూలమైన సమయంలో, మీకు నచ్చినట్టుగా చూడొచ్చన్నమాట. దీనికోసం మీరు లోతుగా సెర్చ్ చేయాల్సిన పనే లేదు. మీ ఛాయిస్ .. వాట్సాప్ ఛానల్ వాట్సాప్ అంటే మెసెజ్‌లు, ఫోటోలు, వీడియోలే కాదు. గ్రూప్‌లు వచ్చినా.. చాలా లిమిటేషన్స్. కొత్తగా వచ్చిన ఫీచరే వాట్సాప్ ఛానెల్. దీని ద్వారా మీకు నచ్చిన మీడియాను ఎంచుకుని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాలో ఎలాగైతే ఎంపిక చేసుకుంటున్నామో.. అలాగే ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ కనిపించవు. సాక్షి వాట్సాప్ ఛానల్ ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారం, సమకాలీన రాజకీయాలు, విశ్లేషణలు, పిక్టోగ్రాఫ్స్ వివరణలు, లేటేస్ట్ అప్డేట్స్ ఒకటేంటీ.. కావాల్సిన ముఖ్యమైన సమాచారన్నంతా.. వేగంగా మీ ముందుంచుతోంది సాక్షి. తెలుగు ప్రజలు కోరుకునే న్యూస్‌ను అత్యుత్తమ స్థాయిలో ఎంపిక చేసి సాక్షి వాట్సాప్ ఛానల్ మీకందిస్తోంది. ఫాలో అవ్వండిలా.. వాట్సప్‌లో మీకు పైన మూడు ఆప్షన్లు కనిపిస్తాయి... Chats, Updates, Calls. వీటిలో Updates క్లిక్ చేయండి. స్టేటస్లు దాని దిగువన ఛానెల్స్ కనిపిస్తాయి. మీకు Find Channel ఫైండ్ ఛానెల్ ఆప్షన్ కనిపిస్తుంది. సెర్చ్ చేస్తే Sakshi Telugu News మీకు కనిపిస్తుంది. దీని పక్కనే ఉన్న ప్లస్ (+) సింబల్ క్లిక్ చేయడం ద్వారా ఈ ఛానెల్‌ను ఫాలో కావొచ్చు. లేదా కింద కనిపిస్తోన్న QR కోడ్ స్కాన్ చేస్తే నేరుగా చేరొచ్చు. ప్రయోజనాలేంటీ? ఒక సారి ఫాలో అయితే అప్డేట్స్ వాటంతటే అవి కనిపిస్తాయి నోటిఫికేషన్స్ తరహాలో మిమ్మల్ని ఎక్కడా చికాకు పెట్టవు మీకు నచ్చిన సమయంలోనే లింకు క్లిక్ చేసి చూడొచ్చు లేటేస్ట్ అప్డేట్స్ క్షణాల్లో అందుకోవచ్చు వార్తలపై ఎమోజీ ద్వారా ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు మీ వ్యక్తిగత సమాచారం ఎవరికీ కనిపించదు మీ ఫోటో, నెంబర్ కూడా కనిపించవు -
టాప్ 25 న్యూస్@4PM
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
కరోనా వైరస్ విపత్తు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని సిద్ధం చేసింది. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నిర్వహించి మీడియా సమీక్షలో పలు కీలక చర్యల్ని ప్రకటించారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రశంసించారు. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ నిర్ణయాన్ని ఆమె అభినందించారు. మరోవైపు నిబంధనలకు విరుద్దంగా ఏపీ సరిహద్దు వద్దకు వస్తున్నవారిని రాష్ట్రంలోకి అనుమతించేది లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. గురువారం చోటు చేసుకున్న మరిన్ని ఘటనలు తెలుసుకోవడం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
దేశంలో వేగంగా కరోనా వైరస్ మహమ్మారిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నరు రఘు రామ్ రాజన్ స్పందించారు. ఈ సంక్షోభ సమయంలో ఆర్బీఐ పోషించాల్సిన పాత్రపై కొన్ని సూచనలు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా మణిపూర్ రాష్ట్రంలో కరోనా తొలి కేసు నమోదైంది. దీంతో ఈశాన్య భారతానికి కూడా ఈ ప్రాణాంతక వైరస్ పాకినట్టైంది. మరోవైపు విశాఖపట్నం జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఇక తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. మంగళవారం చోటు చేసుకున్న వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇక, విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్లో ఉన్న వాళ్లు 14 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. మరోవైపు, కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రజలు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పిలుపునిచ్చారు. కరోనాపై చేస్తున్న యుద్ధంలో మీడియా ప్రతినిధులు, కెమెరా పర్సన్స్, సాంకేతిక నిపుణులు దేశానికి గొప్ప సేవ చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. ఇదిలా ఉండగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఇకపోతే, కరోనా దెబ్బకు నేడు స్టాక్‌మార్కెట్లు మరో బ్లాక్ మండేను చూడాల్సి వచ్చింది. సోమవారం చోటు చేసుకున్న మరిన్నివార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
కరోనా వైరస్ కట్టడి చేసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. జనతా కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం 5 గంటలకు కరోనా నియంత్రణకు పనిచేస్తున్న వైద్యులు, అధికార యంత్రాంగానికి యావత్ భారతావని చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలిపింది. కరోనా వైరస్ పాజిటివ్ కోసుల సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31వరకు అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణాలో కరోనావైరస్ బాధితుల సంఖ్య 22కు చేరింది. ఇదిలా ఉండగా ఏపీ, తెలంగాణలో మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించారు.ఆదివారం చోటు చేసుకున్న మరిన్నివార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు అందరూ సహకారం అందించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కోరారు. ఇక, కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నామని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని శనివారం తెలిపారు. మరోవైపు, దేశవ్యాప్తంగా ఆదివారం ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు రైళ్లు నిలిచిపోనున్నాయి. ఇదిలాఉండగా, భారత్‌లో కరోనా వైరస్ (కోవిడ్-19) చాపకింద నీరులా వ్యాప్తిచెందుతోంది. శుక్రవారం నాటికి 230గా ఉన్న కరోనా పాజిటివ్ కేసులు.. శనివారం మధ్యాహ్నం ఆ సంఖ్య 271కి చేరింది. శనివారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు శుక్రవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక ప్రాణాంతక కరోనా వైరస్‌పై ప్రాథమిక సమాచారం అందించకుండా చైనా గోప్యత పాటించడం వల్లే ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకుంటోందని అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ డ్రాగన్‌పై విరుచుకుపడ్డారు. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా, వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
కరోనావైరస్ (కోవిడ్-19)నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. చైనాలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కరీంనగర్‌ను వణికిస్తోంది. ఇటీవల ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన పది మంది బృందంలో కరోనా లక్షణాలున్నట్లు గుర్తించి, వైద్యపరీక్షల కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కరోనాను నివారించే చర్యల్లో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ గురువారం కీలక ఆదేశాలను జారీ చేశారు. ఢిల్లీలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గూమికూడవద్దని, ఉల్లంఘిస్తే చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. గురువారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
కరోనా వైరస్ ప్రభావం దేశంలో క్రమంగా పెరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు తెలంగాణలో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇక, ప్రపంచం మొత్తం కరోనా కోరలకు చిక్కి విలవిల్లాడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తమ ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఇదిలా ఉండగా, శాసనమండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. ఇకపోతే, చెన్నై నగరంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మరోసారి నిరసనలు వ్యక్తమయ్యాయి. బుధవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్టును రూ. 10 నుంచి రూ. 50కి పెంచుతూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక, తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మరోవైపు ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) నివారణకై కీలక ముందడుగు పడింది. ఇదిలా ఉండగా, ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి సస్పెన్షన్‌కు గురైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్‌లో చుక్కెదురైంది. మంగళవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ తీసుకున్న ఉద్దేశపూర్వక నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఇక, పౌరసత్వ సవరణ చట్టంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించేలా కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బీజేపీ సోమవారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. ఇదిలా ఉండగా, యెస్బ్యాంక్ సంక్షోభంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం చోటుచేసుకకున్న మరిన్ని వార్తలకోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. కరోనా వైరస్‌ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. యితే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణాలు లేకుండా ఏకపక్షంగా ఈ ఎన్నికలను వాయిదా వేయడమంటే అభివృద్ధిని అడ్డుకోవడమేనని ఆయన ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు. ఇదిలా ఉండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక మేరకు కరోనా వైరస్ 135 దేశాల్లో విస్తరించింది. ఆదివారం ఉదయం నాటికి లక్షా యాభై రెండు వేలకుపైగా కరోనా బారిన పడ్డారు. కరోనా వ్యాప్తి చెందకుండా అనేక దేశాలు అత్యవసర పరిస్థితులను ప్రకటించి చర్యలు చేపట్టాయి. ఆదివారం చోటు చేసుకున్నమరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
కరోనా వైరస్‌ను కేంద్ర ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. రాష్ట్ర విపత్తు సహాయనిధి కింద సహాయం అందించేందుకు వీలుగా కోవిడ్-19ను విపత్తుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక, దేశంలో చాపకిందనీరులా కోవిడ్-19 విస్తరిస్తున్న వేళ దాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. ఇదిలా ఉండగా, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. శనివారం చోటుచేసుకున్న మరిన్ని విశేషాల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి.