
హై పవర్ కమిటీ నివేదికకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం సమావేశమైన మంత్రిమండలి.. పలు కీలక అంశాలపై చర్చించింది. మరోవైపు భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నడ్డాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా..సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని నాగులబండలో నూతనంగా నిర్మించిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి.